నిన్న మొంథా.. రేపు సెన్యార్.. ఏపీకి వరుస తుపానులు
posted on Nov 25, 2025 2:12PM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుస తుపానులు వణికిస్తున్నాయి. మొన్నటికి మొన్న మొంథా తుపాను విలయానికి రాష్ట్రం అతలాకుతలమైంది. భారీగా ఆస్తి, పంట నష్టం సంభవించింది. దాని నుంచి తేరుకోకముందే మరో తుపాను రాష్ట్రంపై పంజా విసరడానికి రెడీ అయ్యింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రానున్న 48 గంటలలో తుపానుగా రూపాంతరం చెందనుంది. అది తుపానుగా మారితే దానికి సెన్యార్ అని నామకరణం చేయనున్నారు. ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో ఈ నెల 29 నుంచి 30 వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ తుపాను ప్రభావం తమిళనాడు కేరళ, లక్షద్వీప్‌లపై ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం నిషిద్ధమని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్పమత్తమైంది. రైతాంగాన్ని అప్రమత్తం చేసింది.