వాయు కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
posted on Nov 25, 2025 2:20PM
.webp)
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ల వద్ద నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాలుష్య నియంత్రణకే కాకుండా ఆరోగ్య రక్షణకు కూడా ఇది అవసరమని పేర్కొంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 పైగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందికి ఢిల్లీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ కార్యాలయాలలో ప్రతి రోజూ 50 శాతం మంది సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు వచ్చిపని చేయాలనీ, మిగిలిన 50 శాతం మందీ వర్క్ ఫ్రం హోం పని చేయాలని ఆదేశించింది. అలాగే ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని ప్రైవేటు కార్యాలయాలు కూడా సిబ్బంది హాజరును తగ్గించాలని ఆదేశించింది. అత్యవసర సిబ్బంది మినహా మిగిలిన వారందరికీ వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఆదేశించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్న సంగతి తెలిసిందే.