దేశవ్యాప్తంగా సెన్సేషన్ ఆపరేషన్ చేస్తున్న తెలంగాణ సీఐడీ
posted on Sep 24, 2025 9:12PM

తెలంగాణ సీఐడి పోలీసులు ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.. బెట్టింగ్ యాప్ లలో పెట్టుబడి పెట్టి మోసపోయిన వ్యవహారాన్ని సీరియస్‌గా తీసు కున్న తెలంగాణ సిఐడి విచారణ చేస్తున్నారు.. మూడు రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసి ఎనిమిది మంది కీలక సూత్రధారు లను అరెస్టు చేశారు .
ఆరు యాప్ ల ద్వారా పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తెలంగాణ సిఐడి విచారణ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ లకు పాల్పడి లక్షల్లో డబ్బులు కోల్పోయి... చివరకు ఆత్మ హత్య లకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కొరడా ఝళిపించా లని నిర్ణయించు కున్నారు.అందుకే దేశంలో తొలిసారి ప్రత్యేక ఆపరేషన్ లో భాగంగా తెలంగాణ సీఐడీ బృందాలు రాజ స్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రా ల్లోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిం చారు.
6 ప్రత్యేక బృందాలను పంపి 8 మంది నిందిత ఆపరేటర్ల ను అరెస్ట్ చేశారు.ఈ 6 బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తూ, ప్రజలకు భారీగా నష్టాలు కలిగించి నట్లుగా సిఐడి పోలీసులు గుర్తించారు.సిఐడి చేసిన ఈ దాడుల్లో అనేక హార్డ్వేర్ పరికరాలు, వాటిలోని విస్తృతమైన డేటాను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారులు విదేశాల్లో ఉండే అవకాశమున్నందున, వారి గుర్తింపుపై దర్యాప్తు కొనసాగుతోంది.