పెన్షన్ల కోసమే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశాం : సీఎం చంద్రబాబు
posted on Dec 1, 2025 3:42PM
.webp)
కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో పెన్షన్ల కోసమే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ ఏలూరు జిల్లా ఉంగుటూరు మండల పరిధిలోని గోపీనాథపట్నంలో గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గుడ్ల నాగలక్ష్మికి పెన్షన్ అందించారు. అనంతరం ఉంగుటూరులో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్‌ను సందర్శించి, ప్రజా వేదిక సభలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతు విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామని తెలిపారు. గ్రామసభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదని ఒక మార్పు రావాలని అన్నారు. అభివృద్ధి పనుల వివరాలన్నీ సచివాలయంలో అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కంటే ధనిక రాష్ట్రాలు కూడా పెన్షన్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం లేదని ముఖ్యమంత్రి అన్నారు.
రాబోయే ఐదేళ్లలో రూ.1.65 లక్షల కోట్ల పెన్షన్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ప్రతి వంద మందిలో 13 మందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. ప్రతి వంద మందిలో 13 మందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. ప్రజల ఆహారపు అలవాట్ల అనుగుణంగా రైతులు డిమాండ్ ఆధారిత పంటలు పండించాలన్నారు. ఏపీ అభివృద్ధి జరిగితేనే భూముల ధరలు పెరుగుతాయని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అయింది కాబట్టే అక్కడి భూముల ధరలు పెరిగాయని వెల్లడించారు.
ఒకప్పుడు కోకాపేటలో రూ.10 వేలకు ఎకరం భూమి వచ్చేదని, ఇప్పుడు ఎకరం రూ.170 కోట్లకు పైనే పలుకుతోందని అన్నారు. ఏపీకి భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయని చంద్రబాబు అన్నారు. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తుమని.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుమని తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రజలు కూటమి అభ్యర్థులను 164 సీట్లలో గెలిపించి తమకు అపూర్వ మద్దతును అందించారని ఇన్ని సీట్లు ఇవ్వడం ద్వారా ప్రజలు తమ బాధ్యతను మరింత పెంచారని సీఎం తెలిపారు. 16,347 మందికి డీఎస్సీ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.14 వేలు జమ చేశామని ఆయన అన్నారు. పంచసూత్రాల ఆధారంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.