పాలమూరును పదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారు : సీఎం రేవంత్‌

 

నారాయణపేట జిల్లా మక్తల్‌లో ప్రజాపాలన విజయోత్సవాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు.‘‘ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుంది. రెండేళ్ల విజయోత్సవ సభను మక్తల్‌లో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. పాలమూరు బిడ్డను ప్రజలు గెలిపించి అధికారం కట్టబెట్టార అని తెలిపారు. 

మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలను అందించి నిండు మనసుతో ఆశీర్వదించారని.. మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఇవాళ మీ ముందు నిలబడ్డాలని రేవంత్ అన్నారు. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది.. మోసం చేస్తే పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించారు. ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను  ఈ గడ్డ ఆదరించిందని కానీ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి సంగం బండను పగలగొట్టేందుకు రూ. 12 కోట్లు కూడా ఇవ్వలేదని సీఎం అన్నారు. 

పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయలేదు..  పదేళ్లలో నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ఆలోచన చేయలేదని రేవంత్ అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు మొదలు పెట్టాలని ప్రయత్నిస్తే కోర్టులో కేసులు వేసి ఏడాదిన్నర పనులు జరగకుండా ఆపారని తెలిపారు. పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని.. జిల్లాలో ఐఐటీ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 

2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఏకానమీగా తీర్చి దిద్దుతామని సీఎం అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి… కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను కాదు.. అభివృద్ధిని కోరుకునేవారిని ఎన్నుకోండని రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశానికి పాలమూరు జిల్లా ఆదర్శంగా ఉండాలనేదే మా ఆకాంక్ష అని అన్నారు.  మీరు చేతికి ఓటు వేసి గెలిపిస్తే అభయహస్తమై మీ జీవితాల్లో వెలుగులు నింపుతోందని రేవంత్ అన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu