సీఎం చంద్రబాబును అభినందిస్తూ ప్రధాని మోదీ ఫోన్

 

ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబుకు శనివారం ఫోన్ చేశారు. సీఎంగా 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. దూరదృష్టి, నిబద్ధత, విలువల వల్లే చంద్రబాబు రాజకీయ జీవితం విజయవంతమైందని మోదీ అన్నారు. ఇరువురు  సీఎంలుగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కలిసి పని చేశామని నాటి సంగతులను మోదీ గుర్తు చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి చంద్రబాబు చేస్తున్న కృషి కొనసాగాలని... ప్రజా సంక్షేమ బాటలో సీఎం చంద్రబాబు అంకితభావంతో చేస్తున్న కృషి మరింత ఫలప్రదం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. దీనికి స్పందించిన సీఎం చంద్రబాబు... ప్రధాని మోదీ సహకారంతో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. ప్రధాని నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తామని సీఎం చంద్రబాబు మోదీతో అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానిగా మోదీ 25 ఏళ్లుగా దేశానికి సేవలందిస్తున్నారని చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్ చేయగా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu