రాజమౌళిపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?
posted on Nov 18, 2025 11:41AM

ప్రముఖ దర్శకుడు రాజమౌళిపై హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు సరూర్ నగర్ పోలీసులు దర్శక ధీరుడు రాజమౌళిపై కేసు నమోదు చేశారు.
విషయమేంటంటే.. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తీస్తున్న సినిమా వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్లో ప్రసంగించిన రాజమౌళి హనుమంతుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రీయ వానర సేన అనే సంస్థ సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాజమౌళిపై చర్యలు తీసుకోవాలనీ, సమగ్ర విచారణ జరిపించాలనీ ఆ ఫిర్యాదులో కోరింది. సినీ పరిశ్రమలో భవిష్యత్తులో ఎవరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.