అంబులెన్సులో మంటలు.. నలుగురు సజీవ దహనం

అంబులెన్స్ లో హఠాత్తుగా మంటలు వ్యాపించి నలుగురు సజీవదహనమైన దుర్ఘటన గుజరాత్ లో  మంగళవారం (నవంబర్ 18) ఉదయం జరిగింది. ఈ ఘటనలో అంబులెన్స్ లో ఉన్న నవజాత శిశువు, ఆ శిశువు తండ్రి, ఒ వైద్యుడు, నర్సు సజీవదహనమయ్యారు. గుజరాత్ లోని మొదాస పట్టణం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.

జన్మించిన అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురైన నవజాత శిశువును మొదాసలోని ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి అంబులెన్సులో తరలిస్తుండగా అంబులెన్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.  ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అంత హఠాత్తుగా అంబులెన్స్ లో మంటలు ఎలా వ్యాపించాయి అన్నదానిపై విచారణ జరుపుతున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu