వైసీపీ అధికార ప్రతినిథి కారుమూరి అరెస్టు
posted on Nov 18, 2025 11:51AM
.webp)
వైసీపీ అధికార ప్రతినిథి కారుమూరి వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. అసత్య ఆరోపణలు, అభాండాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ కుకట్ పల్లిలో అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కారుమూరి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై తాడిపత్రి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. తాడిపత్రి తెలుగుదేశం నాయకుడు చేసిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు జరిగిందంటున్నారు.
కర్నూలు బస్సు ప్రమాదంపైనా, తిరుమల పరకామణి కేసు ఫిర్యాదుదారు అనుమానాస్పద మృతి ఘటనపైనా కారుమూరి చేసిన వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు జరిగిందని అంటున్నారు. కాగా కూకట్ పల్లిలో అరెస్టు చేసిన కారుమూరును ఏపీకి తరలిస్తున్నారు. ఈ కేసులే కాకుండా కారుమూరుపై ఏపీలో పలు కేసులు నమోదైనట్లు చెబుతున్నారు.