బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు

ప్రముఖ  బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర ఈ రోజు తుదిశ్వాస విడిచారు.  అమీర్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖ నటులు ఆయన భౌతిక కాయానికినివాళులర్పించారు. ఆయన భౌతికకాయానికి   షోలోలే ధర్మేంద్ర సహ నటుడు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, అభిషేక్ బచ్చన్ సహా పలువురు ప్రముఖ  నివాళులర్పించారు.  

షోలే సహా 300కు పైగా చిత్రాల్లో  నటించిన ధర్మేంద్ర ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం,  పద్మభూషణ్ సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు.  హీ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ గా పేరుపొందిన ధర్మేంద్ర మృతిలో సినీ ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోయింది. కొద్ది రోజుల కిందటే బ్రీచ్ కాండీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన ధర్మేంద్ర ఈ ఉదయం మరణించడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ధర్మేంద్ర డిసెంబర్ 8, 1935లో పంజాబ్ లో జన్మించాడు. 1960లో వచ్చిన దిల్ భీ తేరా హమ్ భీ తేరే మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 65 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్లో 300కుపైగా సినిమాల్లో నటించాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ధర్మేంద్రకు 2012లో పద్మభూషణ్ అవార్డ్ వచ్చింది. అలాగే 1997 సంవత్సరంలో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. ధర్మేంద్ర భార్య, అలనాటి డ్రీమ్ గర్ల హేమమాలిని రాజ్యసభ మాజీ సభ్యురాలు. ధర్మేంద్ర కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ లు కూడా సినీ నటులే. అలాగే ధర్మేంద్ర కుమార్తెలు ఇషా కూడా సినీ రంగంలోనే ఉన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu