బనకచర్ల టెండర్‌ను రద్దు చేయాలని సీడబ్ల్యూసీకి లేఖ
posted on Oct 14, 2025 6:20PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆపాలని తెలంగాణ ప్రభుత్వం సీడబ్లుసీకి లేఖ రాసింది. ఈ లేఖలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్లు, సర్వేను తక్షణమే ఆపాలని కోరింది. ఆ ప్రాజెక్టును ఆమోదించవద్దని, పోలవరం డీపీఆర్‌కు విరుద్దంగా ఉందని లేఖలో వెల్లడించింది. పోలవరం డీపీఆర్‌కు విరుద్దంగా ఉందని తెలంగాణ ఆరోపించింది.
గతంలో మంత్రి ఉత్తమ్ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని, సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ‘బనకచర్లపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి తెలంగాణ అభ్యంతరాలు తెలిపామని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ మేం ఆలమట్టి ఎత్తు పెంపును వ్యతిరేకిస్తున్నాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై మేం ట్రైబ్యునల్ ఎదుట సమర్థంగా వాదనలు వినిపించాం. ఈ విషయంలో ఎటువంటి రాజీపడమని ఉత్తమ్ తెలిపారు