‘అనంత’కు స్వచ్ఛ జిల్లా పురస్కారం
posted on Oct 4, 2025 10:08AM

ఆంధ్రప్రదేశ్ లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత నిర్వహణలో ఉత్తమంగా నిలిచిన పట్టణాలు, జిల్లాలకు ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర పురస్కారాలను ప్రకటించింది. ఈ పురస్కారాలను సోమవారం (అక్టోబర్ 2) విజయవాడలో ప్రదానం చేస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారా ప్రదానోత్సవం జరుగుతుంది. ఇక స్వచ్ఛ జిల్లా అవార్డును అనంతపురం దక్కించుకుంది.
ఈ అవార్డుల వివరాలను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అనీల్‌కుమార్‌రెడ్డి శనివారం( అక్టోబర్ 4) ప్రకటించారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏటా ఇచ్చే ఈ అవార్డులలో మూడు లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు తాడిపత్రి, బొబ్బిలి మున్సిపాలిటీలు అగ్రస్థానాల్లో నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,326 మంది ఈ పురస్కారాలకు ఎంపిక చేయగా, వారిలో రాష్ట్రస్థాయిలో 69 మంది, జిల్లా స్థాయిలో 1,257 మంది ఉన్నారు.