నిరాడంబరంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహ నిశ్చితార్థం
posted on Oct 4, 2025 9:58AM

టాలీవుడ్ లో మరో ప్రేమజంట పెళ్లి పీటలు ఎక్కనుంది. గత కొంత కాలంగా విజయ్ దేవర కొండ, రష్మిలకు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వారిరువురి ప్రేమాయణం నిజమేనని తేలిపోయింది. ఇరువురి వివాహ నిశ్చితార్థం శనివారం (అక్టోబర్ 4) ఉదయం విజయ్ దేవరకొండ నివాసంలో జరిగింది. గోప్యంగా జరిగిన ఈ వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహిత బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.
ఇరువురూ కలిసి తొలి సారిగా గీత గోవిందం అనే సినిమాలో నటించారు. ఆ సినీమా మంచి సక్సెస్ సాధించింది. ఆ సినీమా షూటింగ్ సమయంలోనే ఇరువురి మధ్యా ప్రేమ చిగురించిందని చెబుతారు. ఆ తరువాత డియర్ కామ్రేడ్ అనే సినీమాలో కూడా విజయ్ దేవరకొండ, రష్మికలు జంటగా నటించారు. అప్పటి నుంచీ వీరి బంధం మరింత బలపడిందని సీనీ వర్గాల టాక్. కలిసి విహార యాత్రలకు వెళ్లడం నుంచి పలు సందర్భాలలో వీరిరువురి ప్రేమగురించిన వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి.
అయితే తమ మధ్య ఉన్న ప్రేమ గురించి విజయ్ దేవరకొండ కానీ, రష్మిక కానీ ఇప్పటి వరకూ స్పందించలేదు. ఇప్పుడు వివాహ నిశ్చితార్థంతో తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటారని చెప్పాలి. ఇరు కుటుంబాల అంగీకారంతో నిరాడంబరంగా ఇరువురి వివాహ నిశ్చితార్థం జరిగిందని చెబుతున్నారు. వీరి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుందని అంటున్నారు.