నటి రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ హ్యాక్

సైబర్ నేరగాళ్లు ఇప్పుడు సరికొత్త దందాకు తెరలేపారు.  సెలబ్రె టీలను మాత్రమే టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఫోను హ్యాక్ చేయడమే కాకుండా ఏకంగా డబ్బులు   వసూలు చేస్తున్నారు.   ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఆమె పేరుతో అనుచిత మెసేజ్‌లు పంపడమే కాకుండా తెలియని వ్యక్తులకు ఫోన్లు చేసి అర్జంటుగా డబ్బులు కావాలంటూ డిమాండ్ చేస్తూ.... వసూళ్లు చేస్తున్నారు.

ఈ విషయాన్ని రకుల్ స్వయంగా సోషల్ మీడియాలో బయటపెట్టారు. తన మొబైల్ ఫోన్ హ్యాక్ అయ్యిందని, ఆమె నెంబర్‌ తో వచ్చే కాల్స్‌ లేదా మెసేజ్‌లకు ఎవరూ   స్పందించవద్దని, అలాంటి విన్నపాలు వస్తే వెంటనే అప్రమత్తంగా ఉండాలని అభిమానులకు సూచించారు. అనంతరం రకుల్ ప్రీతిసింగ్ తన ఫోన్ హ్యాక్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రకుల్ పేరును దుర్వినియోగం చేస్తూ జరుగుతున్న ఈ మోసంపై పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ ఘటనతో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు చేస్తున్న కొత్త రకాల ఉచ్చులు మరోసారి బయటపడ్డాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu