37 మంది మావోయిస్టుల లొంగుబాటు

మవోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీశివధర్ రెడ్డి సమక్షంలో 27 మంది మావోయిస్టులు శనివారం (నవంబర్ 22) లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురు రాష్ట్రకమిటీ, ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, తొమ్మండుగురు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు.  వీరు కాకుండా మరో 22 మంది దళ సభ్యులు కూడా లొంగిపోయారు.  

కాగా లొంగిపోయిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, మావోయిస్టు సాంకేతిక విభాగం ఇన్ చార్జి అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్ వంటి కీలక నేతలు ఉన్నారు. ఈ పరిణామం తెలంగాణలో శాంతి స్థాపనకు మరో ముందడుగుగా డీజీపీ అభివర్ణించారు.  లొంగిపోయిన 37 మందిలో ఆజాద్ గత 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉంటూ  ఏవోబీ ( ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన ముచ్చకి సోమడా అలియాస్ ఎర్ర కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు.  

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మావోయిస్టులను లొంగిపోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మావోయిస్టులపై ప్రభావం చూపిందనీ, అందుకే నక్సలైట్లు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నారనీ ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు.  లొంగుపోయిన నక్సలైట్లను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందనీ, సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.  లొంగిపోయిన మావోయిస్టులకు సంపూర్ణ రక్షణతో పాటు పునరావాసం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu