చందు గౌడ ఇంట్లో సంబరాలు!

బుల్లి తెర నటుడు చందూ గౌడ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతను 'త్రినయని' సీరియల్ ద్వారా మంచి ఫేమస్ ఐన యాక్టర్. యాక్ట్యువల్ గా చందు గౌడ కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటుడు. అక్కడ 'లక్ష్మి బారామ్మా' అనే సీరియల్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. 2020 లోనే ఇతను షాలిని  అనే మోడల్‌ను పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. చందూ పుట్టుకతోనే శ్రీమంతుడు. అతని తండ్రి బైరప్ప బెంగళూర్‌లో బిగ్ బిజినెస్ మాగ్నెట్స్ లో ఒకరు. ఇక ఇప్పుడు చందు గౌడ తాను తండ్రినయ్యానంటూ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ సందర్భంగా చందూగౌడ, ఆయన భార్య షాలిని ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది.  మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఈ జంటకు ఆడపిల్ల పుట్టింది. చందు, షాలిని వాళ్ళ  చిన్ని పాపను చాలా సంతోషంతో స్వాగతించారు.  తనకు ఒక ఆడపిల్ల పుట్టిందని ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నాడు చందూ. తనకు అన్నీ ఉన్నా.. ప్రత్యేకమైన గుర్తింపులేదనే బాధే త‌న‌ని నటుడ్ని చేసిందంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు, ఇప్పుడు మూవీస్ లో నటించడానికి సిద్దమౌతున్నట్టు తెలుస్తోంది చందు గౌడ. ఇక కూతురు పుట్టిందన్న విషయం తెలుసుకున్న చందు గౌడ ఫ్రెండ్స్ ఫామిలీ మెంబెర్స్ , నెటిజన్స్ అంతా అతన్ని అభినందిస్తూ విషెస్ చెప్తున్నారు.

కృష్ణవంశీ మాట మీద నిలబడే వ్యక్తి

బ్రహ్మాజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఐతే బ్రహ్మాజీ కృష్ణవంశీ కి మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఆ అనుబంధం గురించి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే తో జరిగిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చెన్నైలో ఒక ఇంటరెస్టింగ్ బిల్డింగ్‌ ఉండేదట . పొంగా కల్యాణమండపం అంటారట దాన్ని. అందులో 100  గదులు బాత్రూం సైజు అంత ఉండేవట.  ఐఏఎస్‌, ఐపీఎస్‌ శిక్షణ కోసం కోర్సులు చదివేవాళ్లతో పాటు సినిమాల్లో ఛాన్సెస్ కోసం ట్రై చేసేవాళ్లంతా ఆ బిల్డింగ్ లో అద్దెకు ఉంటారని చెప్పారు. అంత చిన్న గదుల్లో  ఎల్‌ షేప్‌లో బెడ్లు ఉంటాయట.ఒక్కో గదిలో ఇద్దరం ఉండేవాళ్లం. ఒక్కొక్కరు 125 రూపాయలు కట్టాలి. అలా ఆ బిల్డింగ్ లో 500 మంది  ఉండేవారట. ఇకపోతే.. పాండీబజార్‌లో ఓ అడ్డాకు కృష్ణవంశీ వచ్చేవాడట. అక్కడే ఆయనతో పరిచయం అయ్యిందని చెప్పుకొచ్చారు.  సాయంత్రంపూట కబుర్లు చెప్పుకునేవాళ్లం. అదే టైంలో  వంశీ వాళ్లది కూడా తాడేపల్లిగూడెం అని తెలిసింది దాంతో మేం ఇంకా దగ్గరయ్యాం.  అన్నపూర్ణ సంస్థ వాళ్లు అప్పుడే  ‘శివ’ చిత్రం కోసం కొత్త వారికి అవకాశం ఇస్తున్నారని తెలిసి ఆడిషన్ ఇచ్చిరమ్మని  కృష్ణవంశీ బ్రహ్మాజీకి చెప్పారట.  ఆ టైంలో బ్రహ్మాజీ దగ్గర ఒక బైక్ ఉండేది. దాని మీద  కృష్ణవంశీని ఎక్కించుకుని అన్నపూర్ణ స్టూడియోకి తీసుకెళ్లాడట.  అక్కడికి అదే టైంకి కళ్ళజోడు పెట్టుకున్న ఒక వ్యక్తి  శివనాగేశ్వరరావు గారితో టీ తాగి లోపలికి వెళ్తున్నాడు. శివనాగేశ్వరావును అప్పుడు వంశి పిలిచి  మన స్నేహితుడే అని పరిచయం చేశారట. శివనాగేశ్వరావు ఫోటోలు అడిగేసరికి బ్రహ్మాజీవి ఇచ్చారట. వాటిని రాము చూసి ‘ఫొటోలతో పనేముందు అతనుంటే ఆడిషన్‌ చేయించండి’ అన్నారట. అంతా అయ్యాక రెండో రోజు రమ్మన్నారని వెళ్లేసరికి అక్కడ డైరెక్టర్ తేజ ఉన్నారట. ఆ తర్వాత ఆ మూవీకి అసిస్టెంట్‌ డైరక్టర్‌గా వంశీ చేరడం ఒక చిన్న క్యారెక్టర్ కి తాను వెళ్లడం ఒకేసారి జరిగిందని చెప్పారు. డైరెక్టర్ ఐతే కచ్చితంగా ఒక రోల్ ఇస్తానని చెప్పిన వంశి తాను తీసిన గులాబీ మూవీలో మంచి రోల్ ఇచ్చారని చెప్పారు బ్రహ్మాజీ. ఆ తర్వాత తన లైఫ్ లో వెనక్కి చూసుకోవాల్సిన పని లేకుండా ఎన్నో మూవీస్ చేసానని చెప్పారు.

పండగలా భలే మంచి రోజు!

ఈటీవీ అంటే చాలు ఎన్నో స్పెషల్ షోస్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ఒక బెస్ట్ ఛానల్ అని చెప్పొచ్చు. ప్రతీ పండగని నిజమైన పండగలా చూపిస్తుంది. కలర్ ఫుల్ షోస్ తో బోర్ కొట్టించకుండా రకరకాలుగా ఎంటర్టైన్ చేస్తూ  ఆడియన్స్ ముందుకు వస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు భలే మంచి రోజు టైటిల్ తో ఒక సూపర్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసింది. ఇప్పుడా  ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈటీవీ మొదలై 27 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసింది ఈటీవీ.  ఈ ప్రోగ్రాం హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు ఉన్నాడు. ఇక అతని కామెడీ గురించి, హోస్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోలో ఎంతోమంది ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసారు. ఆలీ, ఎస్పీ చరణ్, అన్నపూర్ణమ్మ, ఇంద్రజ, యాట నవీన, హరిత, జాకీ, బాలాజీ, కౌశిక్, యమున, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, అనసూయ, ఆది, రాంప్రసాద్, పోసాని కృష్ణమురళి, గీతామాధురి, రవికృష్ణ, నవ్యస్వామి, ఇలా బుల్లితెర మీద మనం రెగ్యులర్ గా చూసే ప్రతీ స్టార్ట్ ని ఈ ఒక్క ఎపిసోడ్ లో చూపించారు. ఇక ఈ ఎపిసోడ్ ఆగష్టు 28 రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.  

ప్రదీప్ జీవితంలో ఆ రోజు మర్చిపోలేనిది!

ఢీ-14  డ్యాన్సింగ్ ఐకాన్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో ఎన్నో అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారు కంటెస్టెంట్స్. ఈ షోలో ఎన్నో లవ్ స్టోరీస్ ని చెప్పారు. ఇక ప్రదీప్ ఆ రోజు నాకు చాలా చాలా మెమరబుల్ నాకు , ది మోస్ట్ బ్యూటిఫుల్ డే  హాజ్ కమ్..నాకెప్పటికీ గుర్తుండిపోయే రోజు అంటూ చెప్పేసరికి అందరూ ఎవరు వారు ? అది ఏ  రోజు ? అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసరికి ప్రదీప్ కాస్త సిగ్గుపడినట్టు కనిపించింది. తర్వాత అఖిల్ వచ్చి తన లవ్ స్టోరీ చెప్తాడు. తాను 10th చదివేటప్పుడు ఆ అమ్మాయి 6th చదువుతోందట. తర్వాత  ఆది వచ్చి తన క్యూట్ లవ్ స్టోరీ చెప్తాడు. 8th క్లాస్ వరకు తన ఊళ్ళోనే గవర్నమెంట్ బళ్ళో చదువుకున్నాడట. 9th క్లాస్ కి ప్రైవేట్ స్కూల్ కి మారాడట.  అప్పుడొచ్చిందయ్యా ఆ స్కూల్ కి ఒక అమ్మాయి..తన  క్లాస్ ఐపోయి కింద వచ్చేసరికి ఆ అమ్మాయి అలా నడుచుకుంటూ వస్తోందట. రెండేళ్ల తర్వాత ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూసినప్పుడు బాబోయ్ ఆ ఫీలింగ్ నేను చెప్పలేను అంటూ ఆది తెగ సిగ్గుపడిపోయాడు . ప్రదీప్ వచ్చి హార్ట్ బెలూన్ ఇస్తాడు ఆదికి. తర్వాత నయనిపావని లవ్ స్టోరీ చెప్తుంది ఇక ఆది నయనిని సర్ప్రైజ్ చేయడానికి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని పిలిచానని చెప్తాడు. అలా వాళ్ళ వాళ్ళ క్యూట్ లవ్ స్టోరీస్ తో ఈ రాబోయే వారం షో అలరించబోతోంది.  

వీళ్ళే డాన్స్ ఐకాన్ కి మెయిన్ మెంటార్స్

తాను స్టార్ట్ చేయబోయే "డాన్స్ ఐకాన్ "షో గురించి చెప్తూ ప్రమోట్ చేసుకోవడానికి ఏ సందర్భాన్ని వదలడం లేదు ఓంకార్. ఇక ఈ షోకి ఫేమస్ టీవీ యాంకర్లు, శ్రీముఖి, డాన్స్ మాస్టర్ యష్, యాక్టర్ మోనాల్ గుజ్జర్ ఈ షోకి మెయిన్ మెంటార్స్ కి ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ కొరియోగ్రాఫర్, జడ్జి శేఖర్ మాస్టర్ త్వరలో రాబోయే ఈ  డ్యాన్స్ షోకి ప్రధాన న్యాయనిర్ణేతలలో ఒకరుగా ఉండబోతున్నారంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఓంకార్ ఇంతకుముందు చేసిన  డ్యాన్స్ షో 'డాన్స్ +'లో యష్, మోనాల్ జడ్జెస్ గా ఉండగా, ఇప్పుడు తాజాగా వాళ్ళతో శ్రీముఖి చేరింది. ఈ షోలో 5 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న వారు పాల్గొంటారని గతంలోనే చెప్పాడు  ఓంకార్. 'డ్యాన్స్ ఐకాన్' ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే  అవకాశం ఉంది. టీవీ, OTT ప్లాట్ఫారం పై  ఒకేసారి ప్రసారమయ్యే మొదటి తెలుగు డ్యాన్స్ రియాలిటీ షోలలో ఇది ఒకటి. అయితే, ఈ అంశాలకు సంబంధించి ఎలాంటి ఆఫీషియల్ న్యూస్ ఇంకా బయటకు రాలేదు. తనకు ఈ అవకాశం వచ్చినందుకు తాను ఎంతో హ్యాపీగా ఫీలయ్యానని ఈ సందర్భంగా షో హోస్ట్, ప్రొడ్యూసర్ ఓంకార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాను  ఇంతకుముందు చేసిన డ్యాన్స్ షోల కంటే కూడా ఈ షో చాలా స్పెషల్ గా ఉంటుందని చెప్పారు. అన్ని షోస్ లోకి ఈ షోని ఒక ఐకాన్ లా మార్చడం కోసం 'డ్యాన్స్ ఐకాన్' అనే  టైటిల్ పెట్టినట్లు చెప్పారు. ఈ షోకి సంబంధించి కొరియోగ్రాఫర్స్, పార్టిసిపెంట్స్ జీవితాలను మలుపు తిప్పేలా డిజైన్ చేశామన్నారు. అంతేకాదు ఈ షోలో విన్ ఐన కొరియోగ్రాఫర్  టాలీవుడ్ టాప్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేస్తారని చెప్పుకొచ్చారు. 

పటాస్ ప్రవీణ్ ఇంట్లో తీవ్ర విషాదం

జబర్ధస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ప్రవీణ్ తండ్రి మరణించడంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కొంత కాలంగా ప్రవీణ్ తండ్రి బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. ఆయన్ని బతికించేందుకు  వైద్యులు ఎన్నో  ప్రయత్నాలు  చేసినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. చిన్న వయస్సులోనే తల్లిని పోగొట్టుకున్న ప్రవీణ్ కు ఇప్పుడు  ఇప్పుడు తండ్రి కూడా దూరమయ్యేసరికి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. తన తండ్రి మాత్రం ఇంకో పెళ్లి చేసుకోకుండా ఇద్దరు కొడుకులను పెంచి పెద్ద చేసి ఉన్నంతలో చదివించారంటూ.. మాకు అమ్మైనా, నాన్నైనా అన్నీ నాన్నే. మాకు ఎవ్వరూ లేరు. మా నాన్నే మాకు ఆస్తిపాస్తి’ అని గతంలో ప్రవీణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఈ  విషయం తెలిసిందే. పటాస్ కామెడి షోలో పంచ్‌లు, ప్రాసలతో కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు ప్రవీణ్.  ఐతే  కరోనా లాక్‌డౌన్ వలన  'పటాస్' షో ఆగిపోయేసరికి  ప్రవీణ్ జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు.   రాకింగ్ రాకేష్ టీమ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ  అదిరిపోయే పంచులు, ప్రాసలతో హైలైట్ అవుతున్నాడు.  

’అందం ఐసుగడ్డయితే‘ అంటూ పేరడీ పాడుతున్న ఆది

బుల్లితెర మీద హైపర్ ఆది చేసే కామెడీ వేరే లెవెల్ లో ఉంటుంది. కొన్ని పంచులు పేలతాయి కొన్ని మాత్రం ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఐనాసరే తాను నమ్మిన కామెడీనే ఫాలో ఐపొతూ ఉంటాడు. హైపర్ ఆది ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ 14 షోస్ లో  పాల్గొంటున్నాడు.  తాజాగా ఢీ 14 షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఆగష్టు 24న ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకుంటున్నారు. శ్రద్దాదాస్, పూర్ణ, జానీ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించారు.   ఇంకా ఈ లేటెస్ట్ ప్రోమోలో  శ్రద్దా, హైపర్ ఆదికి సంబంధించిన  రొమాంటిక్ ట్రాక్ సూపర్ హైలైట్ గా నిలిచింది. శ్రద్దా, ఆది మధ్య చాలా కాలంగా  రొమాంటిక్ డ్రామా నడుస్తోంది. శ్రద్దా అందాలకు ఫిదా ఐపోతుంటాడు ఆది. ముద్దు ముద్దు అంటూ వెంట పడుతూ ఆమెని అదే పనిగా పొగిడేస్తూ ఉంటాడు. శ్రద్ధా కూడా తానేమీ తక్కువ కాదన్నట్టు ఆ  పొగడ్తలకు ఫిదా ఐపొతూ ఉంటుంది ఈ  లేటెస్ట్ ప్రోమోలో శ్రద్దా ఆదికి ముద్దు ఆఫర్ ఒకటి ఇస్తుంది. మంచు గడ్డపై కాసేపు నిలబడితే ముద్దిస్తానని చెప్తుంది. దీంతో  ఆది గాల్లో తేలిపోతాడు. పైకి వెళ్లేముందు ఒక హాఫ్ కిస్ ఇస్తే మంచి ఎనర్జీ వస్తుంది అని రిక్వెస్ట్ చేసేసరికి ప్రదీప్ అదేం కుదరదు అన్నట్టుగా చెయ్యి ఊపి నో చెప్పేస్తాడు. ఇక తప్పదన్నట్టు ఐస్ గడ్డ మీద ఆది నిలబడి "అందం ఐసుగడ్డయితే" అంటూ " నీ కాళ్ళను పట్టుకు " అనే పాటలు పాడి మరీ మెప్పిస్తాడు. ఇక హైపర్ ఆది ఆ ఐస్ గడ్డపై ఎంత సేపు నిల్చున్నాడు, శ్రద్ధా తాను ప్రామిస్ చేసినట్టే ముద్దిచ్చిందా అనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

షబీనా పెళ్లికూతురాయెనే!

'జబర్దస్త్'లో ఈ మధ్య లేడీ కమెడియన్స్ సందడి అంతా ఇంతా కాదు. అలాంటి కమెడియన్స్ లో షబీనా ఒకరు. ఒక వైపు సీరియల్స్ లో, మరో వైపు 'జబర్దస్త్'లో నటిస్తూ పేరు తెచ్చుకుంది. కెవ్వు కార్తీక్ టీంలో మెంబ‌ర్‌గా ష‌బీనా కిట్స్‌ చేస్తుంటుంది. ఇప్పుడు షబీనా ఒక ఇంటిది కాబోతోంది. ఈ నేపథ్యంలో తను ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్‌ చేసి అందరికి ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ప్రస్తుతం షబీనా ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆమె మున్నా అనే వ్యక్తిని పెళ్లి  చేసుకోబోతోంది.  తన ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను షేర్‌ చేయడమే కాదు తనకు కాబోయే భర్తను కూడా ష‌బీనా ట్యాగ్‌ చేసింది. కొన్ని సీరియ‌ల్స్‌లో కూడా ఆమె మంచి పాత్ర‌లు పోషించింది. 'కస్తూరి' సీరియల్‌లో గ్లామర్ పాత్రలో కనిపించింది. తరువాత 'గృహలక్ష్మీ' సీరియల్‌లోనూ కొన్ని రోజులు స్పెషల్ కారెక్టర్ వేసింది. అలా బుల్లితెరపై షబీనాకు మంచి ఇమేజ్ వచ్చింది. సోష‌ల్ మీడియాలో కూడా ఈ అమ్మ‌డు చాలా యాక్టివ్‌గా ఉంటూ నెటిజ‌న్స్ కి మంచి వినోదం పంచుతూ ఉంటుంది.

సూపర్ సండే విత్ 'జీ తెలుగు'

దేశవ్యాప్తంగా వివిధ భాషలలో పేరుగాంచిన డాన్స్ ఇండియా డాన్స్ గత కొంతకాలంగా తెలుగు ప్రేక్షలను ఊరిస్తూవస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్త రియాలిటీ షోస్ తో మెప్పిస్తున్న 'జీ తెలుగు', ఇప్పుడు డాన్స్ ఇండియా డాన్స్ - తెలుగు తో వివిధ సాంసృతిక నేపథ్యం మరియు లైఫ్స్టయిల్స్ కలిగిన 10 జంటలతో ఇరు రాష్ట్రాల ప్రజలను అలరించడానికి సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన ప్రోమో షో పై అంచనాలు అమాంతం పెంచంగా, ఈ నెల 21 నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు మీ ముందుకువస్తూ అందరితో చిందులు వేయించడానికి సిద్ధమైంది.   ఇక వివరాల్లోకి వెళితే, ఈ షోకి నటి సంగీత, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, మరియు ఆనంది జడ్జెస్ గా వ్యవహరించబోతుండగా, అకుల్ బాలాజీ మరియు రోహిణి తమ చురుకైన యాంకరింగ్ తో అదరగొట్టనున్నారు. బ్లాక్ బస్టర్ లాంచ్ ఎపిసోడ్ లో భాగంగా, జడ్జెస్ మరియు అకుల్ బాలాజీ పవర్ఫుల్ డాన్స్ పెర్ఫార్మన్స్ తో స్టేజి పైకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుండగా, రోహిణి ఖడ్గం చిత్రంలోని సంగీత పాత్రకి సంబందించిన కాస్ట్యూమ్ లో అలరిస్తూ నవ్వులు పూయించనుంది.  జోడిల యొక్క పెర్ఫార్మన్స్ అనంతరం మెంటర్స్ వారిని తమ టీంలోకి తీసుకోవడానికి పోటీపడటం, 'తీస్ మార్ ఖాన్' చిత్ర యూనిట్ నుండి హీరో ఆది సాయి కుమార్, దర్శకుడు కళ్యాన్జీ గోగణ, సంగీత దర్శకుడు సాయి కార్తీక్ స్పెషల్ ఎంట్రీ, బాబా భాస్కర్ మరియు రోహిణి యొక్క చంద్రముఖి డాన్స్ ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేయనున్నాయి. ఐతే, ఈ ఆదివారం కేజీఎఫ్ - చాప్టర్ 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కూడా ఉండడంతో, 'జీ తెలుగు' మీ వారాంతానికి బ్లాక్బస్టర్ ముగింపు పలకనుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది మనస్సులు గెలుచుకున్న ఈ చిత్రం, సాయంత్రం 5:30కు ప్రసారం కానుంది.

వాళ్ళ ట్రోలింగ్ మాములుగా ఉండదు మరి!

కార్తీకదీపం షోలోకి దీప తిరిగి రావడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురౌతున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత ఈ షోలోకి దీప కోమా స్టేజి నుంచి కోలుకుంటున్నట్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు దీప కార్తీక్ కోసం ఆరా తీస్తూ, మార్చురీలో ఉన్నట్లు చూపించారు. "మార్చురీలో మిగిలిన జ్ఞాపకంతో కుమిలిపోతున్న దీప అనే టాగ్ లైన్ తో దీప బాధను స్టార్ మా తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది. చాలా ఏళ్ల తర్వాత దీప కోమాలోంచి బయటికి వస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళైపోయినప్పటికీ దీప మాత్రం చాలా యంగ్ గా కనిపించింది. ఇక ఈ వీడియోను నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మృతదేహాన్ని ఇన్నాళ్లుగా మార్చురీలో ఉంచడం ఏంటని పలువురు నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. దీప, కార్తీక్ సజీవంగా ఉన్నారని మేకర్స్ గత ఎపిసోడ్ లో చెప్పారు.  ఆటో డ్రైవర్ వారణాసి కనిపించి దీప, కార్తీక్ చనిపోలేదని సౌందర్య వాళ్ళ ఫామిలీకి చెప్తాడు. తర్వాత కొన్నాళ్ళకు దీప హాస్పిటల్ నుంచి లేచినట్టు కనిపిస్తుంది. లీడ్ రోల్స్ ఐన కార్తీక్,  దీప కూర్గ్ ట్రిప్‌ కి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్‌కు గురైనట్లు చూపించారు. తర్వాత  షోలో కార్తీక్ , దీప చనిపోయారని విషయం పిల్లలతో చెప్పించారు. అలాగే డాక్టర్ బాబు ని పెళ్లి చేసుకోవాలని కుట్రలు పన్నిన  మోనిత తన పిల్లాడిని  విడిచిపెట్టి, మతిమరుపు స్టేజి లోకి వెళ్ళిపోతుంది.  హిమ తమ తల్లిదండ్రులను చంపిందని తోబుట్టువు హిమపై ద్వేషంతో సౌర్య ఇంటి నుంచి పారిపోతుంది. నిరుపమ్‌ను ఆమె నుంచి  లాక్కున్నందుకు సౌర్య హిమను మరింత ద్వేషిస్తూ ఉంటుంది. దీప కోమా స్టేజి నుంచి బయటికి రావడంపై నెటిజన్స్ గమ్మత్తైన కామెంట్స్ చేస్తున్నారు.  

విష్ణుప్రియకి రెండు పెళ్లిళ్ళా!?

విష్ణుప్రియ యాంకర్ గానే కాదు ఇప్పుడు యాక్టర్ గా కూడా నిరూపించుకోబోతోంది. మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ వస్తుంటే వాటిని కూడా చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పుడు ఆమె నటించిన 'వాంటెడ్ పండుగాడ్' మూవీ రాబోతోంది. ఈ మూవీలో అనసూయ, సుడిగాలి సుధీర్, విష్ణుప్రియ, దీపికా పిల్లి, సునీల్ పాత్రలు నవ్వు తెప్పిస్తాయి. ఆగష్టు 19న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా క్యాష్ షోకి వచ్చారు నిత్యాశెట్టి, యశ్వంత్ మాస్టర్, విష్ణుప్రియ, అనసూయ, రాఘవేంద్ర రావు. ఈ షోకి సంబంధించిన లేటెస్ట్‌ ప్రోమో రిలీజ్ అయ్యింది.  ఈ షోలో రాఘవేంద్రరావు, విష్ణుప్రియ మాములుగా రచ్చ చేయలేదు. రెండు ఆపిల్స్ తో ఆడుతూ "శ్రావణ మాసంలో నాకు రెండు పళ్ళు ఇచ్చారు" అంటూ గెంతింది విష్ణుప్రియ‌. సుమ వచ్చి "ఒక పండు నువ్వు, మరో పండు మీ ఆయన, ఇదిగో ఇంకో పండు ఇది నీకు పుట్టబోయే బాబో, పాపో.." అనేసరికి విష్ణు గట్టిగా నవ్వుతూ "నాకు క్యాష్ వద్దు ఇంక" అని చెప్తుంది. దాంతో సుమ "నీ చేతిలో పళ్ళ కంటే నీ నోట్లో పళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి" అని కౌంటర్ వేసింది.  తర్వాత గ్లామరస్ యాంకర్‌ అనసూయతో కలిసి ఈ షోకి ఎంట్రీ ఇచ్చారు కె. రాఘవేంద్రరావు. ఆయనకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది సుమ. వెంటనే  సుమ రాఘవేంద్రరావుకి ఫ్లవర్‌ బొకే ఇస్తుంది. అది తీసుకున్న ఆయన బొకేని విష్ణుప్రియ వైపు విసిరేస్తారు. దీంతో ఆ బొకేని పట్టుకుని "హమ్మయ్య పెళ్లైంది నాకు" అంటూ ఎగిరి గంతేస్తుంది.   ఇది విని ఆశ్చర్యపోయిన సుమ "ఇలా విసిరేస్తే పెళ్లవుతుందా?" అని అనసూయకి ఇచ్చిన ఫ్లవర్ బొకే ని రిటర్న్ తీసేసుకుని విష్ణు మీదకు విసిరేస్తుంది. అది కూడా క్యాచ్‌ పట్టుకుని రెండు పెళ్లిళ్లయ్యాయని గోల చేసేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ ఐపోతారు. ఇక రాఘవేంద్రరావు చేసిన సందడి నెక్స్ట్ లెవెల్. 

ముద్దులాట.. ముద్దులాట.. హ్యాపీతో కిస్సులాట!

ఇటీవల సోషల్ మీడియా మొత్తం కూడా యాంకర్స్ పెట్స్ తో చేస్తున్న ముద్దులాటలు, సరదాగా ఆట పట్టించే వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. కొంతకాలం క్రితం సుమ కుక్కకి ట్రైనింగ్ ఇస్తూ కనిపిస్తే, నిన్న అష్షు కుక్కకి గోల్డ్ తొడిగి ముద్దులు పెడుతూ కనిపించింది. ఇక ఇప్పుడు అనసూయ వంతు వచ్చింది. తాను పెంచుకునే చిలకతో ముద్దులాడుతూ కనిపించింది. ఈ వీడియో తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసేసరికి ఇప్పుడది వైరల్ అవుతోంది. "షూటింగ్ లేని టైములో ఇలా రిలాక్స్ అవుతాను" అంటూ అనసూయ గతంలో ఒక వీడియోలో చెప్పింది. ఇప్పుడు అనసూయ తాను పెంచుకునే పెట్స్ తో ఫుల్ రిలాక్స్ అవుతూ ఉంటుంది అనసూయ. ఆమె తన పిల్లలు, పెట్స్ తో కలిసి ఒక పార్క్ లో సందడి చేసింది. అనసూయ తాను పెట్స్ కి మంచి పేర్లు పెట్టి పిలుస్తుంది, అవి కూడా పలుకుతాయి. ఇక తన దగ్గర ఉన్న మాట్లాడే చిలక పేరు హ్యాపీ అన్నమాట. ఇక హ్యాపీ కి హాయ్ చెప్పి 'ఐ లవ్ యు' చెప్పింది ఆ చిలక కూడా అనసూయతో తిరిగి "ఐ లవ్ యూ" చెప్పేసింది. ఆ మాటకు చిలకకు ముద్దులు ఇచ్చేసింది అనసూయ. చిలక కూడా అలాగే ముద్దులు పెట్టింది. అనసూయ హ్యాపీకి, హ్యాపీ అనసూయకి ఇచ్చుకున్న ముద్దులు, చెప్పుకున్న "ఐ లవ్‌ యూ" వీడియో అందరినీ ఆకర్షిస్తోంది.  

'నాకు నువ్వే కావాలి'.. సుమ‌తో రాఘ‌వేంద్ర‌రావు!

'వాంటెడ్ పండుగాడ్' మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అనసూయ కూడా ఈ ప్రమోషన్స్ లో ఫుల్ ఆక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తోంది. ఇప్పుడు ఈ మూవీ టీం క్యాష్ షోలో సందడి చేసింది. ఎపిసోడ్ మొత్తం కూడా నవ్వులతో నిండిపోయింది. గ్లామరస్ యాంకర్ అనసూయ, దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు, యాంకర్ సుమ మధ్య జరిగిన కామెడీ బిట్ మాత్రం ఫుల్ నవ్వు తెప్పించేస్తుంది. ఇక ఈ షోలో అనసూయ చేతిలో చెయ్యేసుకుని మరీ స్టేజి మీదకు వచ్చి సుమకి సెల్యూట్ చేశారు రాఘ‌వేంద్ర‌రావు. సుమ కూడా సెల్యూట్ చేసింది.  ఈ సంద‌ర్భంలో సుమ‌ని రాఘవేంద్రరావు ఒక ప్రశ్న అడిగారు.. "మేమిద్దరం ఇలా చేతిలో చెయ్యేసుకుని ఎందుకు వచ్చి ఉంటాం?" అని అడిగారు. "అక్కడ మెట్లు ఉన్నాయి.. అనసూయ ఎక్కలేదు కాబట్టి జాగ్రత్తగా మీరు తీసుకొచ్చారు" అంది సుమ‌. "కాదు.. నేను కాలేజీ చదువుకునేటప్పుడు అనసూయ అనే అమ్మాయి ఉండేది. మళ్ళీ ఇప్పుడు ఈ అనసూయ దొరికింది. ఇలా నడుస్తూ వచ్చి అలా ఫ్లాష్ బ్యాక్ కి వెళదామని వచ్చా" అని చెప్పారు. అనసూయ, సుమ ఆ మాటకు షాక్ ఐపోయారు.  "లక్కీగా సుమ అనే అమ్మాయి మీ లైఫ్ లో రాలేదు" అనేసరికి, "సుమ లేని లైఫ్ ఉందా అసలు. నా వల్లే కదా నీకు పెళ్లయింది" అంటారు దర్శకేంద్రుడు. "ఆ పాపం మీదే సర్" అంది సుమ‌. "ఇప్పుడు ఈ షో నుంచి  కనీసం పది కోట్లైనా గెలుచుకుని తీసుకెళ్లాల"ని చెప్పేసరికి "పది కోట్లకైతే అనసూయని, వంద కోట్లకైతే నన్ను తీసుకెళ్లండి" అని  చెబుతుంది. "అలా అయితే నాకు నువ్వే కావాలి" అని రాఘవేంద్రరావు చెప్పేసరికి  సుమ షాక్ ఐపోయి అలా నిలబడిపోయింది. తర్వాత "నవమన్మథుడా.. అతి సుందరుడా.." అంటూ అనసూయ, సుమ కలిసి ఓ డ్యూయెట్‌ పాడుకుని డాన్స్ చేశారు. సుమ అమ్మాయిగా, అనసూయ అబ్బాయిగా చేశారు. ఇది చూసిన రాఘవేంద్రరావు "ఎవరే అతగాడు అనే లైన్ వచ్చినప్పుడు నన్ను చూపించండే" అంటూ పంచ్‌ వేయడంతో స్టేజి మొత్తం అదిరిపోయింది నవ్వులతో.

సుధీర్ వస్తే ఆ మాత్రం ఉంటుందమ్మా !

సుడిగాలి సుధీర్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ సినిమాల్లో కూడా నటిస్తూ తన మార్క్ ని క్రియేట్ చేసుకుని వెలుగులోకి వచ్చిన వ్యక్తి. మెజీషియన్ నుంచి  కమెడియన్ గా తర్వాత టీం లీడర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రోగ్రాం హోస్ట్ గా ఎన్నో పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వాంటెడ్ పండుగాడ్ మూవీలో మెయిన్ లీడ్ గా చేశాడు. కె.రాఘవేంద్రరావు సమర్పణలో, శ్రీధర్‌ సీపాన తీసిన మూవీ ఇది. ఈ మూవీలో సుడిగాలి సుధీర్‌, సునీల్‌, అనసూయ, దీపికా పిల్లి వంటి వాళ్ళు  ప్రధాన పాత్రలు పోషించారు.  తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేశారు. ఇక ఈ ప్రోగ్రాంలో సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ ఎంతో అందరికి తెలిసొచ్చింది.  ఈ మూవీ గురించి కే.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడిన తర్వాత సుడిగాలి సుధీర్‌కి మైక్‌ ఇచ్చేసరికి ఆడియన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. అరుపులతో, వీలలతో స్టేజిని  మోత మోగించేసరికి  ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది.  సుడిగాలి సుధీర్‌కి ఈ రేంజ్‌ ఫాలోయింగ్‌ ని చూసి రాఘవేంద్రావు, అనసూయ మాత్రమే కాదు, మిగిలిన వారంతా షాక్‌ అయ్యారు. రాఘవేంద్రరావు సినిమాలు చూస్తూ పెరిగిన తాను.. ఇప్పుడు ఆయన మూవీలోని  నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పాడు సుధీర్‌.    

ఆ గొర్రెల మంద నన్ను కూడా టార్గెట్ చేసింది!

'జబర్దస్త్'కి అనసూయ ఎంత గ్లామర్ ని పంచిందో అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఇటీవల ఆమె ఈ షో నుంచి పక్కకు తప్పుకుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ కూడా వచ్చాయి. ఐతే ఒక ఇంటర్వ్యూలో వీటికి సమాధానం చెప్పింది అనసూయ. వరుసగా మూవీ ఆఫర్స్ వస్తూండేసరికి తప్పక షో నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పింది. అలాగే తనకు ఆఫర్స్ వచ్చినప్పుడల్లా డేట్స్ అడ్జస్ట్ చేయమని ప్రతీసారి అడగలేను కదా.. చాలా గిల్టీగా అనిపిస్తోంది.  అలాగే అందరూ కూడా తన వల్ల ఇబ్బందులు పడడం తనకు అస్సలు ఇష్టం లేదని చెప్పి ఎమోషన్ అయ్యింది అనసూయ. ఈ కార్యక్రమం ఎప్పుడూ బోరింగ్ గా అనిపించలేదు కానీ కొంతకాలం నుంచి ఈ ప్లేస్ తనది కాదు అని అనిపించే సంఘటనలు జరుగుతుండేసరికి తనకు ఈ షో చేయకుండా కొంత టైం గ్యాప్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. "గ్లామర్ ఫీల్డ్ అంటేనే అంత. ఎన్నో కామెంట్స్ వస్తాయి. వాటిని భరించక తప్పదు. వెళ్లిపోయిన వాళ్ళ వెంట మిగతా వాళ్ళు వెళ్లిపోవడానికి ఎవరూ కూడా గొర్రెల మంద అసలే కాదు" అంటూ మనసులో మాట ఈ ఇంటర్వ్యూలో చెప్పింది అనసూయ.  బాడీ షేమింగ్ కి సంబంధించి ఎప్పుడూ నేను వ్యతిరేకమే. అలాంటి సీన్స్ ని నేను అస్సలు ఎంటర్టైన్ చేయను. అలాంటి టైంలో నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని చూపించరు. దీంతో ఆడియన్స్ కి తెర మీద ఏది చూపిస్తారో అదే ఆ మనిషి వ్యక్తిత్వం అని అనుకుంటారు. అలాగే న‌న్ను ఒక గొర్రెల మంద ఎటాక్ చేసింది. ఎందుకంటే న‌న్ను కూడా ఆ మందలో చేర్చడం కోసం. అని ఆమె తెలిపింది. కానీ తాను ఆ ఇష్యూస్ అన్నిటి నుంచి కూడా బయటపడినట్లు చెప్పిందామె.  "జబర్దస్త్ లో తీసుకున్న జీతానికి సరిపడా పని చేసాను. నాకు టీఆర్పీ విషయాలు కూడా తెలియవు. నేను ఎలా పెర్ఫామ్ చేయాలి అనుకున్నానో అలాగే చేసాను. ఎప్పుడూ ఎవరితో కూడా తప్పు చేశాననే మాటను అసలు అనిపించుకోలేదు." అని చెప్పింది అనసూయ.  

పెళ్లి కావాలి అంటూ సతాయిస్తున్న ఆది..తలపట్టుకున్న రాంప్రసాద్!

శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక రేంజ్ లో వెళ్తున్న షో. ఇప్పుడు ఈ షోకి సంబందించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించి ఈ స్పెషల్ ఈవెంట్ ని ఈ షోలో నిర్వహిస్తున్నారు. ఆదికి ఒక సౌందర్యలహరి కనిపించి కైపెక్కించి , నడుము మీద పెద్ద పుట్టుమచ్చ చూపించి ముఖం చూపించకుండా వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడికి రాంప్రసాద్ వస్తాడు. నాకు సౌందర్యలహరి కనిపించింది నాకు పెళ్లి కావాలి అంటూ కాసేపు హడావిడి చేస్తాడు. తర్వాత  చిరంజీవి కూతురు వచ్చి మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూద్దామని వచ్చా అంటూ ఒక స్కిట్ కూడా పెర్ఫార్మ్ చేస్తుంది.  ఆది, నిహారిక మధ్య డైలాగ్ యుద్ధం జరుగుతుంది. అందరినీ నువ్వు దా..దా అని పిలుస్తున్నావ్ నన్ను దాదా అని పిలుస్తున్నావ్ అని అంటుంది. ఆది ప్రపంచంలోకెల్లా అతి కష్టమైన పని ఎంతో తెలుసా అంటే కౌంటర్లు వేసేవాళ్ళు మీద కౌంటర్లు వేసే వాళ్ళు వస్తే దాన్ని తీసుకోవడం అంటాడు ఆది. ఇక జబర్దస్త్ కమెడియన్ అశోక్ వచ్చి కీబోర్డ్ ప్లే చేసి అందరినీ మెస్మోరిజ్ చేస్తాడు. ఇక ఇందులో ఖుషి మూవీలో నడుము శీను వేస్తారు ఆది, రాంప్రసాద్. ఇక నవ్వులే నవ్వులు. ఇలా రాబోయే వారం శ్రీదేవి డ్రామా కంపెనీ అందరినీ అలరించనుంది.  

'నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి'.. పాట పాడిన సురేఖ

సురేఖా వాణి.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల ఈమె వార్తల్లో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. కూతురికి మందు తాగిస్తూ అనే టైటిల్స్ తో కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ అవుతోంది సురేఖా వాణి. తన లైఫ్ లో తన కూతురు అంటే తనకు చాలా ఇష్టం కూడా. సురేఖ వాణి భర్త మరణించాక కూతురే లోకంగా బతుకుతోంది. ఇటీవల 'నిఖిల్‌తో నాటకాలు' యూట్యూబర్  వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేసాడు. సురేఖా వాణి మళ్ళీ పెళ్లి చేసుకోబోతోందా? అనే ప్రశ్నకు "నో" అంటూ సమాధానం ఇచ్చింది. ఐతే ఆమె కూతురు సుప్రీత మాత్రం "ఎస్" అని ఆన్సర్ చేసింది. "సింగిల్ గా ఉంటే నా బుర్ర తింటది. అందుకే ఆమెకు పెళ్లి చేసేద్దాం" అంటూ అల్ల‌రి చేసింది. మీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి? అని సుప్రీతని అడిగేసరికి "నన్ను భరించగలిగే వాడు ఐతే చాలు" అంటూ ఆన్సర్ ఇస్తుంది. ఇక సురేఖ.. "సిక్స్ ఫీట్ హైట్ ఉండాలి, అందంగా ఉండాలి, డబ్బు ఉండాలి, లైట్ గా గడ్డం కూడా ఉండాలి" అని ఆన్సర్ ఇచ్చింది. "బిగ్ బాస్ హౌస్ లోకి సురేఖ వాణి వెళ్తున్నారట" అన్న ప్రశ్నకు "నో.. ఏమో తెలీదు" అంటూ తల్లీ కూతుళ్లిద్దరూ ఆన్సర్ ఇచ్చారు. "సాధారణంగా తనకు కోపం రాదు కానీ ఒకవేళ వస్తే మాత్రం వేరే లెవెల్" అంటూ చెప్పింది సురేఖ వాణి. ఇక సురేఖ, సుప్రీతా కలిసి "నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలేరా" అంటూ సాంగ్  పాడి ఫన్ చేశారు.

లోకల్ సూపర్ మాన్ గా సాయి కిరణ్!

గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పుడు బుల్లి తెర మీద ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు. ఈ సీరియల్ లో జగతి, మహేంద్ర, రిషి సర్, వసుధారా, సాక్షి మెయిన్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఈ సీరియల్ మంచి రసపట్టులో ఉంది. రిషి సర్ వసుధారతో ఎంగేజ్మెంట్ చేసుకుంటాడా లేదా సాక్షితోనా అనేది ఫుల్ సస్పెన్స్. సీరియల్ విషయం పక్కన పెడితే ఈ టీం అందరూ కూడా సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటారు. షూటింగ్ ఫొటోస్, మేకప్ క్లిప్స్, ఎపిసోడ్ క్లిప్స్, ఖాళీ టైములో చేసే డాన్సులు , టిక్ టాక్ లు, రీల్స్ ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి.    సింగర్ సాయికిరణ్ సీరియల్లో మహేంద్ర అనే రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక సాయి కిరణ్ పెట్టే వీడియోస్ కి వేలల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. సాక్షి రోల్ లో రసజ్ఞ రీతూ అనే అమ్మాయి కీ రోల్ ప్లే చేస్తోంది. ఐతే ఇప్పుడు ఈ సాయికిరణ్, రసజ్ఞ కలిసి సరదాగా చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  రసజ్ఞ కార్లో వెళ్తుంటే పక్కనుంచి సాయికిరణ్ గాల్లో సూపర్ మాన్ లా ఎగురుతూ వచ్చి కార్ డోర్ తట్టి "దండుపాళ్య కి ఎటు పోవాలే అంటే అటు అని చెప్తుంది రసజ్ఞ..కల్లు దొరుకతద అని అడుగుతాడు..ఆ దొరుకుతది అని చెప్తుంది ..ఐతే ఓకే " అని వెళ్ళిపోతాడు. ఇక ఈ వీడియో బాక్గ్రౌండ్ సూపర్ మాన్ మ్యూజిక్ పెట్టి "ఇఫ్ సూపర్ మాన్ ఈజ్ పక్క లోకల్" అని కాప్షన్ పెట్టి ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది రసజ్ఞ. ఈ వీడియో సూపర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

ఐ హేట్ మీ అంటూ తన ఫోటోలు చింపేసుకున్న పంచ్ ప్రసాద్

శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ వారం "ఐ హేట్ యు" సెగ్మెంట్ ప్రసారం చేశారు. ఈ సెగ్మెంట్ స్టార్టింగ్ సూపర్ సీరియస్ గా చూపించేసరికి ఆడియన్స్ కూడా ఇంకేముంది కాంట్రవర్సీ ఐపోతుందని ఎదురు చూసారు. బట్ అదంతా ఫుల్ రాంగ్ అని ఫైనల్ లో అర్ధమౌతుంది. రాంప్రసాద్, పరదేశి, రష్మీ ముగ్గురు కూడా ఆది ఫోటోని చింపేసి కాల్చేస్తారు. ఇక ఏదో జరిగిపోతోంది  శ్రీదేవి డ్రామా కంపెనీ కాస్త కాంట్రవర్సీ కంపెనీ ఐపోతుందనుకున్న వాళ్ళ ఊహలన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టే ఆన్సర్స్ ఇచ్చేసరికి నవ్వుకోలేక చచ్చారు ఆడియన్స్. ఆది టిక్ టాక్ చేసే ముగ్గురు అమ్మాయిల నంబర్లు తీసుకున్నాడు కానీ ఒక్క నంబర్ కూడా తనకి ఇవ్వలేదని అందుకో ఫోటో చింపేశానని రాంప్రసాద్ చెప్పాడు. ఎపిసోడ్ ఎంట్రీలో ఆది చెప్పాడట చించే పెర్ఫార్మన్స్ లు చేయాలని అందుకే ఎపిసోడ్ లో ఉన్న ప్రతీది చించేయాలని అందుకే  ముందు ఆది అన్న ఫోటో చింపేశానని పరదేశి చెప్తాడు. ఇమ్ము వచ్చి రాంప్రసాద్ ఫోటో చింపేస్తాడు అన్ని ఫోటోలు బాగున్నాయి కానీ ఆ ఫోటో ఒక్కటి నచ్చలేదట అందుకే చింపేసినట్లు  చెప్పాడు. పూర్ణ వచ్చి రష్మీ ఫోటో చింపేస్తుంది ఎందుకంటే ఎప్పుడూ ఈ షోకి వచ్చినా రష్మీ అందం తనని బాధపెడుతూనే ఉంటుందట.  అంత అందంగా ఎందుకు ఉన్నావ్ అంటూ ఫన్నీగా అడుగుతుంది పూర్ణ. ఫైనల్ గా పంచ్ ప్రసాద్ వచ్చి భాస్కర్ ఫోటోని చింపుదామనుకున్నా కానీ నా ఫోటో నేనే చింపేసుకోవాల్సి వస్తోంది అంటూ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే సునంద తన ఫోటో తనకే చూపించి ఇమ్మానుయేల్ ఫోటో నా అని అడిగిందట..వేరేవాళ్లను అడిగితే పర్లేదు కానీ నా ఫోటోలో ఉన్న నన్నే గుర్తుపట్టకుండా ఎవరు అంటూ నన్నే అడిగేసరికి హర్టింగ్ అనిపించింది అందుకే నా ఫోటోలు నేను చింపేసుకున్న అంటూ పంచ్ ప్రసాద్ పంచ్ డైలాగ్ తో అందరినీ నవ్వించాడు. ఇక తర్వాత ఆది వచ్చి రాంప్రసాద్ ఫోటో చింపేసాడు. రాంప్రసాద్ నేను ఒక్క అమ్మాయి నంబర్ కూడా ఇవ్వలేదని ఫీల్ అయ్యాడు. కానీ అంతకుముందు రాంప్రసాద్ ఐదుగురు అమ్మాయిల నంబర్లు తీసుకున్నాడు కానీ నాకు ఒక్క నంబర్ కూడా ఇవ్వలేదంటూ ఫీల్ అయ్యాడు. ఫైనల్ గా రష్మీ ఈ సెగ్మెంట్ పై క్లారిటీ ఇచ్చేసింది. తమ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని చెప్పింది.