Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...షబీనా పెళ్లికూతురాయెనే!
posted on: Aug 18, 2022 10:40AM

'జబర్దస్త్'లో ఈ మధ్య లేడీ కమెడియన్స్ సందడి అంతా ఇంతా కాదు. అలాంటి కమెడియన్స్ లో షబీనా ఒకరు. ఒక వైపు సీరియల్స్ లో, మరో వైపు 'జబర్దస్త్'లో నటిస్తూ పేరు తెచ్చుకుంది. కెవ్వు కార్తీక్ టీంలో మెంబర్‌గా షబీనా కిట్స్ చేస్తుంటుంది. ఇప్పుడు షబీనా ఒక ఇంటిది కాబోతోంది. ఈ నేపథ్యంలో తను ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి అందరికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం షబీనా ఎంగేజ్‌మెంట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె మున్నా అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోంది.
తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేయడమే కాదు తనకు కాబోయే భర్తను కూడా షబీనా ట్యాగ్ చేసింది. కొన్ని సీరియల్స్‌లో కూడా ఆమె మంచి పాత్రలు పోషించింది. 'కస్తూరి' సీరియల్‌లో గ్లామర్ పాత్రలో కనిపించింది. తరువాత 'గృహలక్ష్మీ' సీరియల్‌లోనూ కొన్ని రోజులు స్పెషల్ కారెక్టర్ వేసింది. అలా బుల్లితెరపై షబీనాకు మంచి ఇమేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్స్ కి మంచి వినోదం పంచుతూ ఉంటుంది.






