అతని పాటకు సిగ్గుపడి దాక్కున్న రష్మీ!
బుల్లితెర మీద యాంకర్ రష్మీ గాలి బాగా వీస్తోంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్ని షోల్లోనూ కనిపిస్తూ క్వీన్ ఆఫ్ షోస్ అన్నట్టుగా అలరిస్తోంది. ప్రస్తుతానికి రష్మీ మూడు షోలను బ్యాలెన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో రష్మీ ఈమధ్య పంచులు కూడా బాగా పిలుస్తోంది. ఇక ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో జానపద పాటలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయనున్నాయి.
ఈ షోకి పల్సర్ బైక్ జానపద పాటతో పాపులర్ ఐన జానపద గాయకుడు ఎల్లింటి రమణను తీసుకొచ్చారు. "పోటిదాయె కాదమ్మో, గట్టిదాయమ్మో, పావుసేరు ముక్కుపుడక ఎక్కువాయమ్మో" అంటూ మంచి జోష్ తో ఒక పాట పాడాడు. ఇక ఇందులో కాకినాడ, శ్రీకాకుళం, మధురవాడ ప్రాంతాలను కలుపుతూ పాట పడేసరికి రష్మీ తెగ సిగ్గుపడిపోయింది.
ఆ పాట వచ్చినంత సేపు వెళ్లి ఒక సోఫా వెనక దాక్కుంది రష్మీ. ఈ జానపద పాటను "అమోఘం, అద్భుతం" అంటూ తాగుబోతు రమేష్ కితాబిచ్చాడు. తర్వాత మనుషుల పెళ్లి ఎంత గ్రాండ్ గా చేస్తారో వర్షాల కోసం బులెట్ భాస్కర్, ఆది, రాంప్రసాద్, రాఘవ అందరూ కలిసి పెళ్లి పెద్దలుగా కప్పల పెళ్లి చేస్తారు. ఇక ఈ స్కిట్ లో స్కెటింగ్ షూస్ వేసుకుని టీం మొత్తం స్టేజి మీద జారి పడుతూ ఒకరి మీద ఒకరు పడుతూ ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు ఈ పవర్ ప్యాక్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.