Divya Velamuri: పవన్ కళ్యాణ్ టాటూలు పర్మినెంట్‌గా  వేసుకోవద్దు..

బిగ్ బాస్ సీజన్-9 లో కామన్ కేటగిరీలో వచ్చిన కంటెస్టెంట్స్ కి యమక్రేజ్ ఉంది. దానికి కారణం పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, దివ్య వేలమూరి, దమ్ము శ్రీజ, హరిత హరీష్, ప్రియా శెట్టి లాంటి వాళ్లు. వీళ్ళంతా హౌస్ లో ఉన్నన్ని రోజులు తమ సత్తా చాటారు. పన్నెండో వారం దివ్య ఎలిమినేట్ అయ్యింది. అయితే తన ఎలిమినేషన్ కార‌ణం సుమన్ శెట్టి, సంజన. ఓటింగ్ లో సుమన్ శెట్టి, సంజన లీస్ట్ లో ఉంటే దివ్యని ఎలిమినేట్ చేశారు. ఇది కంప్లీట్ గా అన్ ఫెయిర్.. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక డీమాన్ పవన్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా పోస్ట్ లు చేస్తోంది దివ్య. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ‌ వీడియోని షేర్ చేసింది దివ్య. ఓ అభిమాని పవన్ కళ్యాణ్ పడాల పేరుని చేతిపై పచ్చబొట్టు (టాటు) వేయించుకున్నాడు. అది చూసి అన్ ఫెయిర్ ఇది.. కరెక్ట్ కాదని దివ్య అంది. బిగ్ బాస్ అనేది ఒక షో.. మరో నాలుగు రోజుల్లో ముగుస్తుంది. టెంపరరీ టాటూస్, మీ సిటీలో ప్రచారం చేసుకోవడం అనేది ప్రాపర్ గా ఉంటుంది కానీ‌ ఇలా పర్మినెంట్ టాటూస్ ని బాడీపై వేయించుకోవడం కరెక్ట్ కాదు.. ఇలా చేసేదేదో మీ కన్నవాళ్ళకోసమో , మీ లైఫ్ పార్టనర్ కోసమో చేస్తే బాగుంటుంది. అంతే కానీ ఒక టీవీ షో లో వచ్చే యాక్టర్ కోసం ఇలా చేయోద్దంటూ ఓ పోస్ట్ లో రాసుకొచ్చింది దివ్య. దివ్య వేలమూరి హౌస్ లో ఉన్నన్ని రోజులు స్ట్రాటజీలు ప్లే చేస్తూ, స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచింది. అయితే తనకి హౌస్ లో ఎవరు సపోర్ట్ చేయకపోవడం పెద్ద మైనస్ అయింది. భరణిని అన్నయ్య పిలిచి అతనితో ఉండటం కొంతమందికి నచ్చలేదు. వారివల్ల దివ్య గేమ్ కూడా అంతగా ఆడలేకపోయింది. 

Immanuel BB Journey video : గూస్ బంప్స్ తెప్పించిన ఇమ్మాన్యుయేల్ జర్నీ వీడియో.. ఇది హిట్టు బొమ్మ!

బిగ్ బాస్ సీజన్-9 లో చివరి వారం సాగుతోంది. ఇమ్మాన్యుయేల్, పవన్ కళ్యాణ్ పడాల, తనూజ, డీమాన్ పవన్, సంజన ల.. ఈ అయిదుగురు  టాప్-5 కంటెస్టెంట్స్ గా ఉన్నారు. ఇక వీకెండ్ కి మరో మూడు రోజులు ఉంది.. బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలియాలంటే సండే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. హౌస్ లో ఉన్న టాప్-5 కంటెస్టెంట్స్ లో మొదటగా ఇమ్మాన్యుయేల్ జర్నీ వీడియోని ప్లే చేశాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఇమ్మాన్యుయేల్ ఇప్పటి వరకు హౌస్ లో ఆడిన గేమ్స్, మెమరీస్, ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ అమ్మతో కలిసి ఉన్న ఫోటోలని చూసుకొని మురిసిపోయాడు ఇమ్మాన్యుయేల్.  ఇక బిగ్ బాస్ తన మాటల గారడీ మొదలెట్టాడు.  బాధ, ఆశ, ఓటమి ఈ ఎమోషన్స్ నుంచి మనుషులు పారిపోవాలని చూస్తారు.. కానీ అది సాధ్యం కాదు.. అందుకే వాటి నుంచి తేరుకోవడానికి రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లడానికి మాటిమాటికి మనుషులు కోరుకునే ఎమోషన్ ఆనందం.. దాన్ని తన మన భేదం లేకుండా అందరికీ పంచేవారే ఎంటర్‌టైనర్స్.. వీరికి ప్రేక్షకుల నుంచే కాదు ఆ దేవుడి నుంచి కూడా ఎప్పుడూ ఆశీస్సులు మెండుగా లభిస్తాయి.. దాని నిదర్శనమే మీ ప్రయాణం. మీ ఆటతీరు నాకు సంతోషాన్నిచ్చింది. హౌస్ లో నీకు మమ్మీ దొరికింది. గేమ్స్ లో నీ స్నేహితులు నీపై మాటలు అన్నా.. నువ్వు పట్టువదలేదు.. నీ వాళ్ళని వదల్లేదు.. ఎంటర్ టైన్ చేశావ్.. తెలివేటలు వాడావ్.. దాదాపు మీ లెక్కలన్నీ  కరెక్ట్ అయ్యాయి.. అంత షార్ప్ గా మీ బుర్ర ఉన్నప్పుడు  అక్కడ జుట్టు ఎలా ఉంటుంది చెప్పండి అని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో ఇమ్మాన్యుయేల్ నవ్వుకున్నాడు.  గొప్ప మనిషిగా ఎదగడానికి జుట్టు అక్కర్లేదు.. ఆడంబరాలు అక్కర్లేదు.. గొప్ప చదువులు అక్కర్లేదు.. గొప్ప వ్యక్తిత్వం ఉంటే సరిపోతుంది.. ఇది మీ ప్రయాణంతో‌ నిజమైందని బిగ్ బాస్ చెప్పగా థాంక్స్ బిగ్ బాస్ అని ఇమ్మాన్యుయేల్ చెప్పాడు.  కమెడియన్ గా అడుగుపెట్టినా హీరోగా బయటకు రావాలనే మీ అమ్మ కల నెరవేరిందని బిగ్ బాస్ అన్నాడు. అది విని ఇమ్మాన్యుయేల్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇక తన జర్నీ వీడియో చూసి ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. థాంక్స్ టూ బిగ్ బాస్.. థాంక్స్ టూ అమ్మ.. థాంక్స్ టూ ఆడియన్స్ అంటూ ఇమ్మాన్యుయేల్ చెప్పుకొచ్చాడు. దిజ్ ఈజ్ ఆల్ టైమ్ ఫెవరెట్ అండ్ బెస్ట్ జర్నీ వీడియోగా నిలిచిపోయింది. ఈ జర్నీ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Podharillu: గాయత్రీ మాటకి పెద్ద రచ్చ.. ఆ అమ్మాయి ఇంట్లో చక్రి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -08 లో..... మాధవకి వచ్చిన సంబంధం వాళ్ళు ఇంటిని చూడడానికి వస్తామని చెప్తారు. దాంతో వాళ్ళు ఇంటికి ఉన్న చిన్న చిన్న రిపేర్ లు చేద్దామని అనుకుంటారు. ఆ విషయం గాయత్రి ఫ్రెండ్ గాయత్రికి చెప్తుంది. మీ బావకి సంబంధం ఖాయం అయిందట అందుకే ఇల్లు రిపేర్ అంట అని అనగానే అది చెడగొట్టలని కావాలనే వాళ్ళ అమ్మకి వినపడేలా మాట్లాడుతుంది. ఇల్లు రిపేర్ చేస్తున్నారా అది కేసులో ఉంది కదా అంటుంది తాయారు. అదే మాట వాళ్ళ అన్నయ్య కూడా వింటాడు. వెంటనే నారాయణ ఇంటి మీదకి గొడవకి వెళ్తాడు. ఇది కేసులో ఉందిని అంటాడు. నారాయణకి కోపం వస్తుంది. వాళ్ళని కొట్టబోతుంటే తన కొడుకులు ఆపుతారు. మరొకవైపు భూషణ్ కి మహా సపోర్ట్ చెయ్యలేదేని కోపంగా ఉంటాడు. నాదే తప్పు అంటావా.. నేను నీ భర్తని.. ఏం చేసిన కరెక్ట్ అనాలని భూషణ్ అనగానే ఇంకా మనకి పెళ్లి కాలేదని మహా అంటుంది. అలా భూషణ్ కి ప్రతీది వ్యతిరేకంగా మహా మాట్లాడుతుంటే భూషణ్ కి కోపం వస్తుంది. ఆ తర్వాత  మాధవకి గాయత్రి జున్ను తీసుకొని వస్తుంది. మా అమ్మ గొడవ చేసినట్లుందని అంటుంది. అయినా ఇల్లు రిపేర్ గురించి నాకే తెలియదు కానీ మీకెలా తెలుసని గాయత్రిని చక్రి అడుగుతాడు. ఆ తర్వాత నేను ఒక అమ్మాయిని చూసానని కన్నాకి చక్రి చెప్తాడు. ఆ అమ్మాయి మళ్ళీ ఎదురుపడితే బాగుండు అని చక్రి అనుకుంటాడు. అప్పుడే తన ఓనర్ ఫోన్ చేసి.. డ్రైవర్ కావాలని ఒకరు ఫోన్ చేశారు.. రేపు ప్రొద్దున వెళ్ళమని అతను చెప్తాడు. తరువాయి భాగంలో డ్రైవర్ కావాలని ఫోన్ చేసింది భూషణ్ వాళ్లే.. చక్రిని చూడగానే భూషణ్ వద్దని చెప్తాడు. ఈ అమ్మాయి ఇక్కడే ఉంది.. ఎలాగైనా నేను ఇక్కడే ఉండాలని చక్రి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: ఫుడ్ ఫెస్టివల్ కి గంగ.. రుద్ర చూసి షాక్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -144 లో.....గంగ పనికోసం అంతటా ట్రై చేస్తుంది.. అందరు నువ్వు గొప్పింటి కోడలు.. నీకు జాబ్ ఎందుకని అంటారు. మరొకవైపు నా రాజకీయ జీవితానికి ఆ రుద్ర అడ్డుపడుతున్నాడని ఇషికతో వీరు అంటాడు. అప్పుడే పారు ఎంట్రీ ఇస్తుంది. ముగ్గురు కలిసి ఫుడ్ ఫెస్టివల్ గురించి ప్లాన్ చేస్తారు. అందులో ఫుడ్ పాయిజన్ చేసి అది గంగ పైకి వచ్చేలా చెయ్యాలనుకుంటారు. ఇప్పుడు గంగ పని కోసం ట్రై చేస్తుంది. తను ఫుడ్ ఫెస్టివల్ కి వచ్చేలా ప్లాన్ చెయ్యాలని వీరు అంటాడు. మరొకవైపు గంగ గుడిలో కూర్చొని బాధపడుతుంది. అటుగా వెళ్తున్న రుద్ర తనని చూసి ఆగుతాడు. అక్కడే శ్రీను ఉంటాడు. ఏమైంది ఎందుకు గంగ ఏడుస్తుందని అడుగుతాడు. వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాలేదు కదా.. మందులకి డబ్బులు లేవు.. పని కోసం ట్రై చేస్తుంది కానీ ఎక్కడ పని దొరకడం లేదని శ్రీను చెప్తాడు. ఈ డబ్బులు తీసుకొని తనకు ఇవ్వు నేను ఇచ్చానని చెప్పకు అంటాడు. శ్రీను వెళ్లి డబ్బులు ఇస్తాడు ఇదంతా ఎక్కడివి అని గంగ అడుగుతుంది. పక్కకి చూస్తే రుద్ర కన్పిస్తాడు. ఇవి ఎవరు ఇచ్చారో నాకు తెలుసు కానీ నేను తీసుకోనని గంగ అనగానే అంత పొగరు వద్దని రుద్ర అంటాడు. ఇద్దరు కాసేపు ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వీరు ఒక ప్లాన్ చేస్తాడు. మణి తన మనుషులను గంగ ముందుకి తీసుకొని వెళ్తారు.. పని గురించి కావాలనే మాట్లాడిస్తాడు. అది విన్న గంగ.. పనికి నేను వస్తానని చెప్తుంది. అది విజయేంద్ర ప్రతాప్ గారి ఫుడ్ ఫెస్టివల్ అని వాళ్ళు చెప్పగానే నేను వస్తానని గంగ అంటుంది. గంగ పనికి వస్తానని అంటుందని వీరుకి మణి చెప్తాడు. ఆ తర్వాత లక్ష్మీ దగ్గరికి రుద్ర వస్తాడు. మీరు వస్తారని తెలుసు ప్రొద్దున పెద్ద అయ్యగారు ప్రీతి, ప్రమీల వచ్చారు కానీ గంగ రానని చెప్పిందని లక్ష్మీ చెప్పగానే రుద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: అప్పు ఇన్వెస్టిగేషన్ కి ఓకే చెప్పేసిన ప్రకాష్.. దొంగని పట్టుకున్న కావ్య!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -906 లో..... రాజ్ దగ్గరికి స్వప్న వచ్చి మాట్లాడుతుంది. నీ వల్లే ఇదంతా.. రాహుల్ లో మార్పు రాహుల్ కి కంపెనీ పెట్టించడం.. తనకి అవార్డు రావడం ఇదంతా చాలా ప్రౌడ్ గా ఉందని స్వప్న అంటుంది. చూసారా మా అక్క ఎంత సంతోషంగా ఉందో.. ఇప్పుడు రాహుల్ చీట్ చేసాడని చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందని కావ్య అనగానే రాజ్ సైలెంట్ గా ఉంటాడు. మరొకవైపు అప్పు ఇంటికి వస్తుంది. ప్రకాష్ ని చూసి ఏదో కవర్ చెయ్యాలని చూస్తుంది. అంత అవసరం లేదు నాన్నకి మొత్తం తెలిసిందని కళ్యాణ్ అంటాడు. ఇలా చెయ్యడం కరెక్ట్ కాదు.. ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసా అని ప్రకాష్ అనగానే అప్పు ఒక కేసు డీల్ చేస్తుంది. అది కంపల్సరిగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలని కళ్యాణ్ చెప్తాడు. దాంతో ప్రకాష్ కన్విన్స్ అవుతాడు. ఆ తర్వాత రాజ్, కావ్య ఇంటికి వస్తారు. జరిగింది మొత్తం అపర్ణ, ఇందిరాదేవికి చెప్తారు. అంత చీట్ చేసిన వాడి సంగతి చెప్పకుండా సైలెంట్ గా ఉంటారా అని ఇందిరాదేవి అనగానే కోపం వచ్చింది కానీ ఏం చెయ్యలేని సిచువేషన్ అని రాజ్ అంటాడు. ఒక్క నెల టైం ఇవ్వండి మన కంపెనీ మళ్ళీ ముందుకు వస్తుందని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్, కావ్య ఆఫీస్ కి వెళ్తారు.. మన డిజైన్స్ ఎలా బయటకు వెళ్లాయి.. ఎవరి మీద అయినా డౌట్ ఉంటే చెప్పండి అని కావ్య అంటుంది. ఈ డిజైన్ చాలా ఇంపార్టెంట్ వీటిని బయటికి లీక్ చెయ్యొద్దని కావాలనే  ఎంప్లాయిస్ తో కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య క్యాబిన్ కి వెళ్ళగానే.. నువ్వు ఎప్పుడు డిజైన్స్ వేసావ్ అని రాజ్ అడుగుతాడు. నాకు టీ తాగాలని ఉందని రాజ్ ని కావ్య పక్కకి తీసుకొని వెళ్తుంది. రాహుల్ మనిషి కావ్య క్యాబిన్ కి వెళ్లి డిజైన్స్ తీసుకుంటాడు. అవి డిజైన్స్ కాదు ఎవరు డిజైన్స్ లీక్ చేసారో కనిపెట్టాడని కావ్య ప్లాన్. అతని క్యాబిన్ లోకి వెళ్లగానే రాజ్, కావ్య వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: తన మాటలతో కాశీని మార్చేసిన జ్యోత్స్న.. శ్రీధర్ కి ముప్పు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -543 లో.. జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటుంటే అప్పుడే దీప వస్తుంది. నా కడుపులో బిడ్డకి ఏమైనా అయితే ఏం చేస్తానో తెలుసు కదా అని దీప వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత దీప వెళ్ళాక దీని సంగతి చెప్పాలని జ్యోత్స్న అనుకుటుంది. గ్రానీ నేను రమ్మంటున్నానని కాశీని తీసుకొని రా అని జ్యోత్స్న అనగానే కాశీ దగ్గరికి పారిజాతం వెళ్తుంది. ఒరేయ్ మీ అక్క రమ్మంటుందని తీసుకొని వెళ్తుంది. కాశీ వెళ్ళగానే నువ్వు ఇంత చదువు పెట్టుకొని పీఏగా చెయ్యడమేంటి.. మీ మావయ్య నిన్ను డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఒకసారి నీ రెజ్యుమె పంపు అని జ్యోత్స్న అనగానే కాశీ పంపిస్తాడు‌ అది చూసి ఇంత మెరిట్ స్టూడెంట్ ఇలా పని చెయ్యడమేంటి.. మీ మావయ్య నిన్ను తక్కువ పోస్ట్ లో ఉంచాడు.. దానికి నీ భార్య సపోర్ట్ కూడా ఉందని కాశీ మనసులో శ్రీధర్ గురించి నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేలా జ్యోత్స్న మాట్లాడుతుంది. మీ మావయ్య నిన్ను పర్మినెంట్ డ్రైవర్ చేసేలా ఉన్నాడని జ్యోత్స్న అంటుంది. నేను మంచి జాబ్ ఇప్పిస్తాను చేస్తావా అని జ్యోత్స్న అనగానే శ్రీధర్, స్వప్న అవమానం గా మాట్లాడిన మాటలు గుర్తుచేసుకొని చేస్తానని కాశీ అంటాడు. ప్లాన్ సక్సెస్ అని జ్యోత్స్న అనుకుటుంది. మరొకవైపు సుమిత్రకి దశరథ్ జ్యూస్ తీసుకొని వస్తాడు. తాగమని రిక్వెస్ట్ చెస్తాడు. వాళ్ళ ప్రేమని చూసి దీప మురిసిపోతుంది. ఆ తర్వాత కాశీ కార్ దగ్గర ఉండగా అప్పుడే శ్రీధర్, కార్తీక్ వస్తాడు. పైనుండి జ్యోత్స్న, పారిజాతం చూస్తారు‌ వాళ్ళకి శ్రీధర్ హాయ్ చెప్తాడు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం అవసరమా అని కార్తీక్ అనగానే నిజాలు బయట పడుతాయని తెలియదు కదా అని శ్రీధర్ అంటాడు. నిజాలు బయటకు రానివ్వనని జ్యోత్స్న అనుకుంటుంది. కాశీ కార్ తియ్ అనగానే కాశీ, జ్యోత్స్న అన్నమాటలు గుర్తుచేసుకుంటాడు. దాంతో కాశీ వంక జ్యోత్స్న జాలిగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: డూప్లికేట్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చిన శ్రీవల్లి.. ప్రేమ ఇరికించేసిందిగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -344 లో..... అమూల్య విషయం రామరాజుతో చెప్పాలని చందు అనుకుంటాడు. కానీ రామరాజు ఇంట్లో ఉండడు. తిరుపతి, రామరాజు పేపర్ తీసుకొని ఇంటికి వస్తారు. నాన్న నీతో మాట్లాడాలని అంటాడు. ఇందాక నుండి మీతో మాట్లాడాలని అంటున్నాడు.. ఏంటో చెప్పడం లేదని వేదవతి అంటుంది. ఏ విషయం రా అని రామరాజు అడుగుతాడు. అమూల్య గురించి అని చందు అనగానే నిన్న కూడా అన్నావ్.. ఏంటి అసలు అని రామరాజు అంటాడు. అదంతా శ్రీవల్లి విని పరుగున వస్తుంది. ఏం లేదు మావయ్య గారు అమూల్యని తనే కాలేజీకి డ్రాప్ చెయ్యాలని చెప్పాలనుకున్నాడు.. రోజులు బాలేవు కదా అందుకే అని శ్రీవల్లి కవర్ చేసి చందుని అక్కడ నుండి పంపిస్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి వెనక్కి తిరిగి చూసేసరికి ప్రేమ, నర్మద ఉంటారు. కొంచెం గ్యాప్ ఇవ్వండే అనుకుంటుంది. ఏం కావాలి టీ, కాఫీ అని శ్రీవల్లి అనగానే నువ్వు మావయ్యకి జాబ్ చేస్తానని మాటిచ్చావ్.. MA ఇంగ్లీష్ సర్టిఫికెట్ తీసుకొని వస్తానని చెప్పావని ప్రేమ అంటుంది. అసలు నువ్వు చదువుకున్నావా అని వాళ్ళు అనగానే అవును నాకు ఆదే డౌట్ వస్తుందని రామరాజు అంటాడు. అప్పుడే భాగ్యం, ఆనందరావు సర్టిఫికేట్ పట్టుకొని వస్తారు. అవి ప్రేమ చూస్తుంది. అవి డూప్లికేట్ సర్టిఫికెట్స్ కానీ ప్రేమ చెప్పదు. మావయ్య సర్టిఫికెట్ వచ్చింది కదా మీరు కాలేజీకీ ఫోన్ చేసి ఒక మాట చెప్పండి.. అక్కని ఇంగ్లీష్ టీచర్ గా తీసుకోమని అని ప్రేమ అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం టెన్షన్ పడుతుంది. రామరాజు ఫోన్ చేయబోతుంటే శ్రీవల్లి తుమ్మినట్లు యాక్టింగ్ చేస్తుంది. మావయ్య ఇప్పుడు వద్దని శ్రీవల్లి అంటుంది. తరువాయి భాగంలో రాత్రి నాకు ఎందుకు ముద్దు పెట్టావని ధీరజ్ తో ప్రేమ గొడవపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

demon pavan vs kalyan : ఎంటర్‌టైన్‌మెంట్ లో డీమాన్ పవన్ టాప్.‌. కానీ ఓటింగ్ లో కళ్యాణ్ తోప్!

బిగ్ బాస్ సీజన్-9 లో చివరి వారం కొనసాగుతుంది. ‌మరో నాలుగు రోజుల్లో ఈ సీజన్ ముగుస్తుంది. ‌ఇక ప్రస్తుతం టాప్-5 హౌస్ లో ఉన్నారు. ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, తనూజ, పవన్ కళ్యాణ్ పడాల, సంజన ఈ అయిదుగురు మాత్రమే మిగిలారు. బిగ్‌బాస్ సీజన్-9లో టాస్కులు అనగానే ది బెస్ట్ ఇచ్చే వారిలో మొదటి పేరు ఖచ్చితంగా డీమాన్ పవన్‌దే అయి ఉంటుంది. ఎందుంకంటే ఫిజికల్ టాస్కుల విషయంలో డీమాన్ డామినేషన్ మాములుగా ఉండదు. ఇది ఎన్నోసార్లు ఈ సీజన్‌లో ప్రూ చేశాడు. అందుకే అతను ఇప్పుడు టాప్-5 లో ఉన్నాడు. డీమాన్ తో పాటు ఇమ్మాన్యుయేల్ కూడా అంతే రేంజ్ లో ప్రతీ టాస్క్ గెలుస్తూ వచ్చాడు. మూడు సార్లు కెప్టెన్ అయ్యాడు. పవరస్త్ర గెలిచాడు. అతడికి టాప్-3 కి అర్హుడు. ఇక సంజన.. తను అసలు ఎందుకు టాప్-5 లో ఉందో ఎవరికీ అర్థం కాదు.. గేమ్స్ ఆడలేదు..పెద్దగా ఎంటర్‌టైన్‌మెంట్ లేదు.. అయిన తను ఇంకా ఉంది అంటే అది బిగ్ బాస్ వల్లనే.. అసలు లెక్క ప్రకారం సంజన సెకెండ్ వీక్ ఎలిమినేషన్ అవ్వాలి.‌ కానీ భరణి, ఇమ్మాన్యుయేల్, తనూజ, రీతూ ముగ్గురు సాక్రిఫైజ్ చేసి తనని మళ్ళీ హౌస్ లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ అయిదుగురిలో విజేత ఎవరని మీరు అనుకుంటున్నారో వారికి మీ ఓట్ వేయండి అని బిగ్ బాస్ చెప్పగా ఆడియన్స్ ఓటింగ్ చేస్తున్నారు. అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పడాల నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇక పది , ఇరవై శాతం ఓటింగ్ ఢిఫరెన్స్ తో తనూజ రెండో స్థానంలో ఉంది. ఇమ్మాన్యుయేల్ మూడో స్థానంలో ఉండగా, డీమాన్ పవన్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. సంజన లీస్ట్ లో ఉంది. తాజాగా రిలీజైన బిగ్ బాస్ ఎపిసోడ్ లలో డీమాన్ పవన్ ఎంటర్‌టైన్‌మెంట్ కా బాప్ అన్నట్టుగా పంచులు వేస్తున్నాడు. అందరిని నవ్విస్తున్నాడు. జెన్యున్ గా చెప్పాలంటే డీమాన్ పవన్ కి విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ అతను ఎక్కడో ఆగిపోయాడు. కాదు కాదు రీతూ వెనుక పడి మిగిలిపోయాడు. అందుకే టైటిల్ రేస్ లో వెనుకబడిపోయాడు. టాప్-5 లో ఎవరికి మీ ఓట్ అని భావిస్తున్నారో కామెంట్ చేయండి.  

Bigg Boss 9 Telugu Demon Pavan: ఇదే ఫైర్ ముందు నుండి ఉంటే డీమాన్ విజేత!

బిగ్ బాస్ చివరి వారం హౌస్ లో టాప్-5 వాళ్ళకి ట్రీట్ కోసం బిగ్ బాస్ కొన్ని టాస్క్ లు పెట్టాడు. ఎక్కువ టాస్క్ లు గెలిచి ప్లేయర్ అఫ్ ది డే అయిన వాళ్లకి వాళ్ళ ఇంటి నుండి మెసేజ్ వస్తుంది. అలా డీమాన్ పవన్ రెండు టాస్క్ లు గెలిచి.. రెండు స్టార్స్ పొందాడు. కాబట్టి అతనికి ప్లేయర్ అఫ్ ది డే వచ్చింది. ఫుడ్ కి సంబంధించిన రెండు ట్రీట్స్ ఇంకా తన ఫ్యామిలీ నుండి వీడియో మెసేజ్ వస్తుంది. డీమాన్ వాళ్ళ అన్నయ్య మెసేజ్ వస్తుంది. అది చూసి డీమాన్ ఎమోషనల్ అవుతాడు. నేను ఇంత దూరం వచ్చానంటే దానికి కారణం బిగ్ బాస్.. గట్టిగా అరుస్తే ఎదుటివారు బ్యాడ్ అవుతారేమో అని నేను ఏది ఎక్స్ ప్రెస్ చెయ్యలేదు చేసి ఉంటే ఇంకా బాగుండేదనుకుంటాడు. నాకు ఈ హౌస్ వదిలి పెట్టి వెళ్లాలని లేదని డిమాన్ ఒక్కడే కూర్చొని ఎమోషనల్ అవుతాడు. ఇక తర్వాత రోజు మళ్ళీ టాస్క్ లు పెట్టగా అందులో ఒక టాస్క్ నాలుగు రౌండ్స్ గా జరిగింది. మూడు రౌండ్స్ లో సంజన, డీమాన్, కళ్యాణ్ విన్ కాగా కళ్యాణ్ కి డిమాన్ కి చివరి రౌండ్ ఉంటుంది. అందులో డీమాన్ గెలిచి ఫుడ్ ట్రీట్ గెలుస్తాడు.. అలా ప్రతీ టాస్క్ లో డీమాన్ గెలుస్తాడు. తదుపరి టాస్క్ లో తనూజ గెలుస్తుంది. తనకి ఫుడ్ ట్ర్రీట్ వస్తుంది. ప్లేయర్ అఫ్ ది డే లో భాగంగా తనూజకి ఇంటి నుండి తన సిస్టర్ మ్యారేజ్ ఫోటో వస్తుంది. అందులో తనని ఫోటో షాప్ ద్వారా యాడ్ చేస్తారు. అది చూసి తనూజ ఏడుస్తుంది. ఇది హ్యాపీ మూమెంట్ అని సంజన అంటుంది. ఫ్యామిలీ నుండి మెసేజ్ వచ్చింది. ఇమ్మాన్యుయేల్ కి బిగ్ బాస్ ఫ్యామిలీ స్క్రిప్ట్ ఇవ్వగా అందరు కలిసి మంచి స్క్రిప్ట్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారు.

Podharillu: చక్రికి సపోర్ట్ గా మహా.. ఆ ఇద్దరు కలుస్తారా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -07 లో......చక్రి కార్ లో ఒకమ్మాయి ఎక్కుతుంది. మీకు పెళ్లి కాలేదా అని చక్రి అడుగుతాడు. లేదని ఆ అమ్మాయి చెప్తుంది. నా దగ్గర ఇలాంటి కార్ లు బాగా ఉన్నాయని చక్రి బిల్డప్ ఇస్తాడు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చక్రి అంటాడు. పెళ్లి అవన్నీ కాదు లివింగ్ రిలేషన్ లో ఉందామని ఆ అమ్మాయి అనగానే నాకు కావాల్సింది పద్ధతి గల అమ్మాయి నీలా కాదని తనని మధ్యలోనే దింపుతాడు. మరొకవైపు ఎలాగైనా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించాలని వాళ్ళ నాన్నని రిక్వెస్ట్ చెయ్యడానికి ప్రాక్టీస్ చేస్తుంది మహా. అప్పుడే వాళ్ళ నాన్న పిలుస్తాడు. కిందకి వెళ్లేసరికి అబ్బాయి వాళ్ళుంటారు. వీడు అప్పుడే వచ్చేసాడా అని తిట్టుకుంటుంది మహా. మీరు షాపింగ్ కి వెళ్లి రండి అని వాళ్ళని పంపిస్తాడు ప్రతాప్. మహా పక్కన అబ్బాయి భూషణ్ కూర్చొని ఉంటే వాళ్ళ వదినకి వద్దని సైగ చేస్తుంది. మా అయన పడుకుంటారు. భూషణ్ నువ్వు డ్రైవ్ చెయ్యమని హారిక చెప్పగానే.. భూషణ్ డ్రైవ్ చేస్తాడు. మరొకవైపు మాధవ అమ్మాయి వాళ్లకి నచ్చడు కానీ వాళ్ళు ఒకసారి ఇంటికి వచ్చి చూస్తారట అని మీడియేటర్ వచ్చి చెప్తాడు. మరొకవైపు చక్రి కార్, భూషణ్ వాళ్ళ కార్ రెండు డ్యాష్ ఇచ్చుకుంటాయి. తప్పు భూషణ్ ది అయిన కూడా చక్రిపై గొడవకి దిగుతాడు. దాంతో మహా వస్తుంది. తనని చూసి చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. తప్పు మీదే తనది కాదని చక్రికి మహా సపోర్ట్ చేస్తుంది. దాంతో భూషణ్ కి కోపం వస్తుంది. మనకి విలువ ఇవ్వాలంటే ఇతరులకు కూడా ఇవ్వాలని మహా చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళని ఫాలో అవ్వాలని చక్రి అనుకుంటాడు కానీ కార్ స్టార్ట్ అవ్వదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: ఫుడ్ ఫెస్టివల్ కి రుద్ర.. రానని చెప్పేసిన గంగ!

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -143 లో..... గంగని తీసుకొని రమ్మని ఇంట్లో డిస్కషన్ చేస్తుంటారు. వద్దని శకుంతల అంటుంది. తీసుకొని వస్తానని పెద్దసారు అంటాడు. ఎక్కడ డిస్కషన్ పెద్దగా అయి గంగని తీసుకొని వస్తారోనని వీరు టాపిక్ డైవర్ట్ చేస్తాడు. ఫుడ్ ఫెస్టివల్ కి మనం వెళ్ళాలి అని అంటాడు. నేను అదే అందామని అనుకుంటున్నానని రుద్ర అంటాడు. సరే నువ్వు దాని గురించి చూసుకోమని వీరుకి రుద్ర చెప్తాడు.  ఆ తర్వాత ఫుడ్ ఫెస్టివల్ కి సంబంధించినది నువ్వు చూసుకోమని రుద్రతో పెద్దసారు అంటాడు. సరే అని రుద్ర అంటాడు. అదేంటి వీరు చూసుకుంటానని అన్నాడు కదా అని శకుంతల అనగానే.. ఎవరు చూసుకుంటే ఏంటి.. కావాలంటే రుద్రకి అసిస్టెంట్ గా వీరు ఉంటాడని పెద్దసారు అంటాడు. ప్రీతీ మనం గంగ దగ్గరికి వెళ్దామని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ప్రీతీ, ప్రమీల, పెద్దసారు ముగ్గురు కలిసి గంగ దగ్గరికి వెళ్తారు. గంగని రమ్మని రిక్వెస్ట్ చేస్తారు. నేను రాను నేను ఏ తప్పు చెయ్యలేదు.. అది ఆయన నమ్మి, నన్ను తీసుకొని వెళ్ళాలని గంగ వాళ్ళని తిరిగి పంపిస్తుంది. ఆ తర్వాత గంగ తన తల్లికి వైద్యం చేయించడం కోసం డబ్బులు కోసం పని చూసుకుంటుంది. తను గతం లో చేసిన సిలిండర్ డెలివరీ చేసిన దగ్గరికి వెళ్లి పని కావాలని అడుగుతుంది. నువ్వు పెద్దింటి కోడలివి.. నువ్వు నా దగ్గర పని చేస్తే నాకు మాట వస్తుందని అతను అంటాడు. అప్పడే శ్రీను వచ్చి గంగని తీసుకొని వెళ్తాడు.  ఆ తర్వాత పెద్దసారు కోపంగా ఇంటికి వస్తాడు. ఏమైందని శకుంతల అడుగగా.. గంగ ఇంటికి రానని చెప్పిందని ప్రీతీ చెప్తుంది. ఆ తర్వాత పెద్దసారు, రుద్ర దగ్గరికి వెళ్తాడు. నువ్వు గంగని తీసుకొనిరా.. తనేం తప్పు చెయ్యలేదని పెద్దసారు కోప్పడుతాడు. నేను తీసుకొని వస్తాను కానీ నేను ఈ ఇంట్లో ఉండనని రుద్ర అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు. మన డిజైన్స్ దొంగతనం చేస్తాడా అని రాజ్ కోప్పడతాడు.‌ ఏవండి ప్లీజ్ ఆగండి.. తర్వాత మాట్లాడుకుందామని కావ్య సర్దిచెప్పుతుంది. ఈ అవార్డు రాజ్ చేతుల మీదుగా తీసుకోవాలని ఉందని రాహుల్ అంటాడు. ఇక తప్పక రాజ్ వెళ్లి అవార్డు ఇస్తాడు. మరొకవైపు అప్పు గదిలో ఉంది అనుకోని ధాన్యలక్ష్మి భోజనం తీసుకొని వస్తుంది. ప్రకాష్ బెడ్ పై పడుకొని ఉంటాడు. అది చూసి హమ్మయ్య అప్పు వచ్చింది అని కళ్యాణ్ అనుకుని అమ్మ నేను అప్పుకి భోజనం ఇస్తాను. నువ్వు వెళ్ళు అని చెప్పగానే ధాన్యలక్ష్మి వెళ్తుంది. పొట్టి ఎప్పుడు వచ్చావని అప్పు అనుకుని ప్రకాష్ తో మాట్లాడుతాడు కళ్యాణ్. ప్రకాష్ మొహం చూసి కళ్యాణ్ షాక్ అవుతాడు. మరొకవైపు ఇంత మోసం చేస్తాడా వాడి సంగతి చెప్తానని రాజ్ కోపంగా ఉంటాడు. అప్పుడే స్వప్న వచ్చి చాలా థాంక్స్ రాజ్.. నీ వల్లే రాహుల్ ఇదంతా చేసాడు ఈ గౌరవం దక్కింది అంటే దానికి కారణం నువ్వే అని స్వప్న అనగానే రాజ్ సైలెంట్ గా ఉంటాడు. తరువాయి భాగంలో డిజైన్స్ ఎవరు రాహుల్ కి చేరవేశారని రాజ్, కావ్య ఎంప్లాయిస్ ని అడుగుతారు. అది జరిగిపోయింది కానీ ఇప్పుడు ఈ డిజైన్స్ చాలా సీక్రెట్ ఎవరికీ తెలియొద్దని చెప్తారు. అది రాహుల్ మనిషి విని డిజైన్స్ తీసుకోబోతుంటే రాజ్, కావ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. మరొకవైపు కాశీ దగ్గరికి పారిజాతం, జ్యోత్స్న వస్తారు. ఒరేయ్ డ్రైవర్ వెళ్లి చాయ్ తాగి రా అని పారిజాతం అనగానే నేను డ్రైవర్ కాదని కాశీ అంటాడు. మరి ఏం అంటారు రా నువ్వు మీ మామ దగ్గర పనికి చేస్తున్నావ్.. అంత అవసరం ఏముంది రా.. ఏం డబ్బులు కావాలన్నా నన్ను అడగొచ్చు కదా అని పారిజాతం అంటుంది. జ్యోత్స్న మాట్లాడుతుంటే మీరు మాట్లాడకండి ఇక నీ బాగోతం బయటకు రానుంది ఆఫీస్ లో నువ్వు చేసే తప్పుడు లెక్కల గురించి మావయ్య ఒక్కొకటికి బయటకు తీస్తున్నాడని కాశీ అనగానే జ్యోత్స్నకి చెమటలు పడుతాయి. మరొకవైపు అసలు జ్యోత్స్న ఆ ఇంటి బిడ్డ కాదని అనిపిస్తుంది ఎందుకంటే తన సొంత కంపెనీలోనే చాలా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసింది. వాటికి లెక్కలు కూడా లేవని కార్తీక్ తో శ్రీధర్ అంటాడు. తనే వారసురాలు కదా తనకే కదా ఆస్తులన్నీ మరి చెయ్యాలసిన అవసరం ఏముంది.. తను వారసురాలు కాదని నాకు డౌట్ వస్తుందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఇప్పుడు నువ్వు లెక్కలు అన్ని చెప్పి జ్యోత్స్నని తాత ముందు నిలబెట్టగలవా అని కార్తీక్ అనగానే కొంచెం టైమ్ పడుతుందని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటారు. కాశీ మాటలు గుర్తుచేసుకొని టెన్షన్ పడుతారు. అప్పుడే దీప వస్తుంది. డోర్ కొట్టి రావాలని లేదా అని పారిజాతం అనగానే డోర్ వేసి లేదని దీప అంటుంది. అంటే నీ గురించే నువ్వు మొన్నటిలాగా పడిపోతావేమోనని పారిజాతం అనగానే నా బిడ్డ జోలికి వస్తే నేను ఏం చేస్తానో తెలుసు కదా అని దీప అనగానే గతంలో శౌర్య విషయం లో జ్యోత్స్న తప్పు చేసినప్పుడు దీప కొట్టిన విషయం గుర్తుచేసుకుంటుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : భార్యతో ప్రేమగా ఉన్న ధీరజ్.. అమూల్య విషయం చందు చెప్తాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -343 లో.. సాగర్ డ్రింక్ చేసి నర్మద  దగ్గరకు వస్తాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావని పొగుడుతాడు.. ఏంటి డ్రింక్ చేసావా అని నర్మద అడుగుతుంది. మరొకవైపు ధీరజ్ డ్రింక్ చేసి ప్రేమ గదిలోకి వెళ్తాడు. అక్కడ ప్రేమ డ్రెస్ ఉండడంతో ప్రేమ డ్రెస్ చూస్తూ మాట్లాడుతాడు. అప్పుడే ప్రేమ వస్తుంది. ప్రేమని చూస్తూ పొగుడుతాడు. నీ కళ్ళు బాగున్నాయి.. నీ పెదాలు బాగున్నాయని ధీరజ్ అంటాడు. ప్రేమ బుగ్గపై ముద్దుపెడతాడు. దాంతో ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రెండు జంటలు బాగా ఎంజాయ్ చేస్తున్నాయి.. నేను మాత్రమే ఈ బట్టలు పిండేస్తున్నానని శ్రీవల్లి అనుకుంటుంది.  మరొకవైపు విశ్వతో అమూల్య ఫోన్ మాట్లాడుతుంది. తిరుపతి తన డ్రీం లో వచ్చిన అమ్మాయితో కలలు కంటుంటాడు. చందు దగ్గరికి శ్రీవల్లి వెళ్లి రొమాంటిక్ గా తన భుజంపై చెయ్ వేస్తుంది. అమూల్య గురించి తలుచుకుంటే భయంగా ఉందని చందు అనగానే.. శ్రీవల్లి పక్కకి వచ్చి తనని తనే తిట్టుకుంటుంది. ఛీ అసలు ముద్దు లేదు.. ముచ్చట లేదని అనుకుంటుంది. మరుసటిరోజు ఉదయం చందు డల్ గా కూర్చొని ఉంటాడు. అప్పుడే విశ్వకి వినిపించేలా కాలేజీకీ వెళ్తున్నానని అమూల్య చెప్తుంది. అది చందు చూస్తాడు. లాభం లేదు ఇక నాన్నకి విషయం చెప్పాల్సిందేనని లోపలికి వెళ్లి నాన్న అని పిలుస్తాడు. వేదవతి వచ్చి ఏమైంది రా నిన్న కూడా ఏదో చెప్తానన్నావ్ ఏంటని అడుగుతుంది. ఏం లేదని చందు అంటాడు. బయటనుండి రామరాజు, తిరుపతి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Tanuja vs pawan Kalyan: తనూజ వర్సెస్ పవన్ కళ్యాణ్.. విజేత ఈ ఇద్దరిలోనే!

    బిగ్ బాస్ సీజన్-9 క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇక చివరి వారం సాగుతోంది. విజేత ఎవరో తెలియడానికి మరో అయిదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మీకు ఇష్టమైన వారికి ఓట్ చేయండి అంటు బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక ఆడియన్స్ తమకు ఇష్టమైన వారికి ఓట్ చేస్తున్నారు. ఇక రెండు రోజుల నుండి టాప్-5 కంటెస్టెంట్స్ కి భారీ ఓటింగ్ పడింది.  అందులో పవన్ కళ్యాణ్ కి మెజారిటీ ఓటింగ్ పడగా , లీస్ట్ లో సంజన ఉంది. 44.74 శాతం ఓటింగ్ తో పవన్ కళ్యాణ్ పడాల టాప్ లో ఉండగా.. 27.32 శాతం ఓటింగ్ తో తనూజ రెండో స్థానంలో ఉంది. 12.74 శాతం ఓటింగ్ తో ఇమ్మాన్యుయేల్ మూడో స్థానంలో ఉన్నాడు. 9.64 శాతం ఓటింగ్ తో డీమాన్ పవన్ నాల్గవ స్థానంలో ఉన్నాడు.  ఇక 5.56 శాతం ఓటింగ్ తో సంజన గల్రానీ లీస్ట్ లో ఉంది. అంటే టాప్-5 లో ఉన్నవారిలో అయిదో కంటెస్టెంట్ గా సంజన ఎలిమినేట్ అవుతుంది. ఇక టాప్-3 లో ఇమ్మాన్యుయేల్ చోటు దక్కించుకున్నాడు.     ఓటింగ్ పోల్స్ లో తనూజ వర్సెస్ కళ్యాణ్ ఓటింగ్ సాగుతోంది. చాలావరకు అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో డీమాన్ పవన్ మూడో స్థానంలో ఉన్నాడు.. సంజన లాస్ట్ లో ఉంది. ఇక కళ్యాణ్ కి తనూజకి మధ్య ఇరవై శాతం ఓటింగ్ తేడా ఉంది. అయితే కళ్యాణ్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. తనూజ కి ఎంత ఓటింగ్ పడినా కళ్యాణ్ ని టచ్ చేయలేదు. అయితే కళ్యాణ్ కి మిలటరీ సపోర్ట్ ఉంది. అటువైపు నుండి.. ఇటు కామన్ మ్యాన్స్ నుండి విలేజెస్ నుండి ఓటింగ్ భారీగా పడుతుంది. అయితే వీరిద్దరిలోనే విజేత అనే కన్ఫమ్ అయింది. మరి మీ ఓట్ ఎవరికో కామెంట్ చేయండి.  

Bigg Boss 9 Telugu Demon Pawan: రెండు స్టార్లు గెలుచుకున్న డీమాన్ పవన్.. టాస్క్ ల్లో అతడిని కొట్టేవారు లేరుగా!

      బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ని సక్రమంగా నడిపించాలంటే ఖచ్చితంగా కెప్టెన్ అవసరం కెప్టెన్ అయితే ఆ వారం ఇమ్మ్యూనిటీ కూడా ఉంటుంది. బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఈ సీజన్ లో గత వారమే ముగియడంతో దానికి సంబంధించిన బ్యాండ్ ని బిగ్ బాస్ స్టోర్ రూమ్ లో పెట్టమని చెప్పాడు. కంటెస్టెంట్స్ అందరు బ్యాండ్ ధరించి ఒక్క మాట కెప్టెన్ గురించి చెప్తారు. ఆ తర్వాత స్టోర్ రూమ్ లో పెడుతారు. కాసేపటికి బిగ్ బాస్ హౌస్ లో టాప్-5 వాళ్లకి ఇష్టమైన ఫుడ్ పొందేందుకు బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. ఒక టాస్క్ లో తనూజ, కళ్యాణ్ ఒక టీమ్...ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్ ఒక టీమ్ కాగా సంచాలక్ గా సంజన ఉంటుంది‌ అందులో ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్ గెలుస్తారు‌. ఇద్దరికి చెరొక స్టార్ వస్తుంది. అంతేకాకుండా వారికి ఇష్టమైన బర్గర్ కూడా వస్తుంది. అది వాళ్ళు ఇద్దరు మాత్రమే తినాలని బిగ్ బాస్ చెప్తాడు.     ఆ తర్వాత టాస్క్ లో అయిదుగురు పాల్గొన్నాలి.. సాంగ్ వస్తున్నంత సేపు డ్యాన్స్ చెయ్యాలి.. సాంగ్ ఆగగానే నేను చెప్పిన కలర్ లో నుండి ఎవరు లాస్ట్ కి వస్తారో వాళ్ళు ఆ రౌండ్ నుండి ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పగా. మొదటగా సంజన ఎలిమినేట్ అవుతుంది. ఆ తర్వాత తనూజ,  కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్  వస్తారు. ఇక లాస్ట్ వరకు ఉండి విన్ అయింది డీమాన్ పవన్. అతనికి మరొక స్టార్ వచ్చి మళ్ళీ తనకి ఇష్టమైన ఫుడ్ వస్తుంది.       ఈ సారి మనం ఇద్దరం కలిసి ఆడి వాడికి స్టార్ రాకుండా చెయ్యాలని కళ్యాణ్ తో ఇమ్మాన్యుయేల్ అనగానే.. పోనిలే అన్న పదమూడు వారాలు గెల్వలేదు కదా ఇప్పుడు గెలవనివ్వు అని కళ్యాణ్ అంటూ ఇద్దరు నవ్వుకుంటారు. ఇలా ఎక్కువ టాస్క్ లు గెలిచి ఎక్కువ స్టార్ వస్తే వాళ్ళు ప్లేయర్ అఫ్ ది వీక్ అవుతారు. దాంతో వాళ్ళకి ఫ్యామిలీ నుండి ఏదైనా మెసేజ్ వస్తుంది. ప్లేయర్ అఫ్ ది వీక్ ఎవరు అవుతారనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.  

Bigg Boss 9 Telugu Tanuja : నాకు తనూజతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది : కళ్యాణ్ పడాల!

      బిగ్ బాస్ హౌస్ లో  ఇన్నిరోజుల ప్రయాణంలో ఉన్న కంటెస్టెంట్స్ తమ మెమరీస్(జ్ఞాపకాలు) ని షేర్ చేసుకుంటున్నారు. డీమాన్ తన గురించి చెప్పాడు. నాకు బయట సిచువేషన్ బాగోలేదు నాన్నకి అప్పుడ్ ఆపరేషన్ అయింది. ఖర్చులకి అన్నయ్యని డబ్బులు అడిగేవాడిని.. స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం. నా ఖర్చుల కోసం స్కూల్ లో పీటీగా చేశాను.. మా అన్నయ్య బిగ్ బాస్ లో కామనర్స్ కి ఛాన్స్ అని చెప్పాడు. అప్లై చేశాను. ఇప్పుడు ఇక్కడ మీ ముందున్నానని డీమాన్ చెప్పాడు.     ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పడాల తన మెమరీస్ ని షేర్ చేసుకున్నాడు. బిగ్ బాస్ కష్టంగా ఉన్నా చెయ్యాలనిపించే ఇష్టం. ఇక్కడ చాలా ప్రాబ్లమ్ ఉంటుంది.‌ ఫుడ్ సరిగ్గా ఉండదు నిద్రసరిగ్గా ఉండదు అయిన మనకి ఇది కావాలి.. చేస్తాం... నేను అప్లై చేసాను ఛాన్స్ వస్తుందని అనుకోలేదు.. ఇక్కడికి వచ్చాక ఇమ్మాన్యుయేల్ అన్న దొరికాడు. ఆ తర్వాత తనూజ తన వెర్షన్ కాకుండా ఎదుటివాళ్ళ వెర్షన్ కూడా ముందే గెస్ చేసి చెప్తుంది. తనతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది. ఈ బాండింగ్ ఇలాగే ఉండాలి మోర్ దెన్ ఫ్రెండ్ అని తనూజ గురించి కళ్యాణ్ చెప్తాడు.     ఆ తర్వాత తనూజ తన మెమరీస్ షేర్ చేసుకుంటుంది. మా నాన్నకి నేను ఇలా ఇండస్ట్రీకీ రావడం ఇష్టం లేదు అయిన వచ్చాను.. నేను తెలుగు ప్రజల సపోర్ట్ తోనే ఇక్కడ ఉన్నాను. నేను అందరితో కలిసి ఉండడం నేర్చుకున్నాను.. బయటకు వెళ్లాక కూడా ఇలాగే ఉంటాను. నేను లేడీ బిగ్ బాస్ విన్నర్ అవుతానని తనూజ చెప్తుంది.   

Bigg Boss 9 Telugu Sanjana, Emmanuel: జ్ఞాపకాలు షేర్ చేసుకున్న ఇమ్మాన్యుయేల్, సంజన.. ఎమోషనల్ ఎపిసోడ్!

    ఈ సీజన్ గ్రాంఢ్ ఫినాలేకి అయిదు రోజులు మాత్రమే ఉంది. హౌస్ లో ఉన్న టాప్-5 ని వాళ్ళకి ఈ సీజన్ గురించి వాళ్ళ మూమెంట్స్ షేర్ చేసుకోమని బిగ్ బాస్ చెప్పాడు. మొదటగా ఇమ్మాన్యుయేల్ తన గురించి చెప్పాడు. నేను ఇక్కడికి రాకముందు షోస్ తో బిజీగా ఉండేవాడిని.. ఒక టీమ్ ని లీడ్ చేసాను. నాకు ఈ సీజన్ కి బిగ్ బాస్ నుండి కాల్ వచ్చింది.     ఇదంతా వదులుకొని వెళ్లాలా అసలు పరిస్థితి ఏంటని అందరి ఒపీనియన్ తీసుకున్నాను.. ఇక్కడికి వచ్చాను.. చాలా నేర్చుకున్నాను.. కామెడీ చెయ్యాలి.. అందరిని ఎంటర్టైన్ చెయ్యాలనుకున్నాను కానీ ఫస్ట్ వీక్ లోనే హరిష్ తో గొడవ అయింది. అది నేను తీసుకోలేకపోయాను బాడీ షేమింగ్ అన్నారు. నాకు నా గర్ల్ ఫ్రెండ్ చెప్పింది. ఏం కామెడీ చేసిన నీకు నీ మీద చేసుకో అందరు తీసుకోలేరని చెప్పి పంపించింది. ఫస్ట్ వీక్ గొడవ ఇక సెకండ్ వీక్ లో మా మమ్మీ దొరికింది. అప్పటి నుండి చాలా బాగుంది. మా కామెడీ టైమింగ్ ఫన్ వేలో వెళ్ళిందని ఇమ్మాన్యుయేల్ చెప్పాడు.     మనకు ఎంత డబ్బులున్నా.. మన పేరెంట్స్ దగ్గరికి సంవత్సరానికి ఒక్కసారి కాకుండా నెలకో, టూ వీక్స్ కి అలా వెళ్తూ ఉండాలని ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత సంజన చెప్తుంది. మొదట ఛాన్స్ వచ్చినప్పుడు నా పిల్లల మొహం చూసాను.. నేను ఇన్ని డేస్ ఉంటాననుకోలేదు. నా వేలో యునిక్ గా ట్రై చేసాను. అది జనాలకి ఎలా వెళ్ళిందని తెలియదు. నాకు కొడుకు దొరికాడు. ఇంత పెద్దకొడుకు ఉన్నాడని చెప్పుకోవడానికి సిగ్గుపడనని సంజన చెప్పింది. ఇమ్మాన్యుయేల్, సంజనల బాండింగ్ అంత బాగుంది.     

Podarillu: పెళ్ళి షాపింగ్ కి మహా.. గాయత్రీ, మాధవ కలుస్తారా?

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podarillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -06 లో... ఎవరైనా ఆడవాళ్లు వెంట లేకుండా పెళ్లిచూపులకి వెళ్తారా అని నారాయణ అంటాడు. ఆడవాళ్లని తీసుకొని వస్తే నువ్వు సెట్ చేసుకోవచ్చనా అని చక్రి అనగానే అలా అంటావేంట్రా మీ అమ్మ మీద ఒట్టు అలాంటిదేం లేదని నారాయణ అంటాడు. తాగనని రోజు అమ్మ ఫోటోపై ఒట్టు వేస్తున్నావ్.. మారుతున్నావా అని చక్రి అంటాడు. అన్నయ్య నిన్న ఆ అమ్మాయి చెయ్ పట్టుకున్నావ్ కదా అని మాధవని తన తమ్ముళ్లు ఆటపట్టిస్తారు.   మరొకవైపు అబ్బాయికి నువ్వు బాగా నచ్చావట అని ప్రతాప్ వచ్చి మహాకి చెప్తాడు. నాకు ఇష్టం లేదని మహా అంటుంది. మంచి సంబంధం మన కమ్యూనిటీలో ఇలాంటి సంబంధం ఎవరు తీసుకొని రాలేదని ప్రతాప్ అంటాడు. మావయ్య గారు తన ఇష్టం కూడా ఉండాలని హారిక అంటుంటే.. నీకేం తెలియదని ఆదిత్య అంటాడు. అసలు మాకంటూ కలలు ఉండవా అని మహా అంటుంది. ప్రతాప్, మహాని కన్విన్స్ చేస్తాడు.    మరొకవైపు మాధవ మార్కెట్ నుండి ఇంటికి వస్తుంటే.. గాయత్రి కలిసి మాట్లాడుతుంది. అప్పుడే తాయారు వచ్చి మాధవని తిట్టి గాయత్రిని లాక్కేలుతుంది. అదంతా కేశవ చూస్తాడు. నువ్వు ఇంకొకసారి వాడితో మాట్లాడితే మర్యాదగా ఉండదని తాయారు వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే తాయారు భర్త ఫోన్ చేస్తాడు. నువ్వు పిల్ల పెళ్లికి కావలసిన డబ్బులు సంపాదించాకే దుబాయ్ నుండి రావాలని తాయారు చెప్తుంది.   మరొకవైపు మహా దగ్గరికి ప్రతాప్ వస్తాడు. నేనంటే మీకు ఇష్టం కదా నన్ను ఎందుకు కెనడా పంపిస్తున్నారు. నన్ను అతను అర్థం చేసుకోలేదని మహా అంటుంది. రేపు పెళ్లి షాపింగ్ కి వెళ్తారు కదా అప్పుడు అర్థం చేసుకోమని ప్రతాప్ అంటాడు. నువ్వు చాలా లక్కీ మంచి ముహూర్తం కూడా సెట్ అయింది. ఇక రేపు షాపింగ్ నగలు తీసుకోవాలని మహా వాళ్ళ అమ్మ అంటుంది. దాంతో మహా టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.