వాళ్ళు పత్తి ఏరేవాళ్ళా ? ఆర్టిస్టులా?

బుల్లితెర మీద రెమ్యూనరేషన్ గురించి ప్రొడక్షన్ ఫుడ్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒక షోలో తక్కువిస్తున్నారంటూ ఇంకో షోకి వెళ్లిపోవడం.. ఫుడ్ బాలేదని ఇంటర్వ్యూల్లో చెప్పడం తెలిసిన విషయమే. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల జాతరలో రెమ్యూనరేషన్ గొడవ మళ్ళీ మొదలయ్యింది. ఆది ఈ రెమ్యూనరేషన్స్ మీద కౌంటర్ లు వేస్తాడు. ఈ ఎపిసోడ్ లో మధుప్రియ ఫామిలీ, కనకవ్వ వచ్చేసారు. కనకవ్వతో ఆది, నాటి నరేష్ ఫన్ చేస్తారు. ఆ తరువాత ఆది కనకవ్వ ఇట్రా అని పిలిచి  వీళ్లెవరో తెలుసుగా వర్ష, భాను ..వీళ్ళను ఎక్కడైనా చూసావా ? అని అడుగుతాడు. "ఆ చూసాను పత్తి ఏరడానికి మా ఊరికొచ్చినప్పుడు చూసా" అనేసరికి వాళ్ళ మొహాలు మాడిపోతాయి. "వాళ్ళు పత్తి ఏరేవాళ్ళు కాదు ఆర్టిస్టులు అంటాడు. వర్షకు 2 వేలు ఇస్తే చాలు..భానుకు 200 లు ఇచ్చి రెండు పూటలా భోజనం పెడితే చాలు" అని వాళ్ళ పరువు తీసేతాడు ఆది. భాను వెంటనే రియాక్ట్ అయ్యి ఆదిని పక్కకు తోసేస్తుంది. వెంటనే వర్ష మేమొచ్చాకే పండగ అందం వచ్చింది తెలుసా అంటుంది..కనకవ్వ వర్ష తెలుసుగా నీకు అంటాడు. కామెడీ చేస్తదా  అని అడుగుద్ది కనకవ్వ. కామెడీ చేయదు. మధ్యమధ్యలో విసిగిస్తూ ఉంటది అని అంటాడు. "ఏదైమైనా సరే స్టేజి చాలా నిండుగా ఉంది" అంటుంది హరిత. "స్టేజి నిండుగా ఉండాలంటే ఎవరో అక్కర్లేదు మీరు, నవీన ఇద్దరు ఉంటె చాలు" అంటూ పంచ్ వేస్తాడు ఆది.

యాంకర్ ఉంటారు కానీ యాంకరింగ్ ఉండదు

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం లాగే ఈవారం ఎపిసోడ్ బోనాల జాతర కూడా మస్త్ ఎంటర్టైన్ చేసేసింది. ఇక ఈ ఎపిసోడ్ లో మధుప్రియ తన  ఫామిలీ మొత్తాన్ని తీసుకొస్తుంది. ఇక రష్మీ వచ్చి తన టీమ్ మొత్తాన్ని స్టేజి మీద పిలిచి ఈరోజు మనమంతా మధుప్రియ ఆహ్వానం మేరకు వాళ్ళ ఊరికి వచ్చాము. వాళ్ళ ఫామిలీ మొత్తాన్ని ఎంటర్టైన్ చేయాలి మనమే అని అంటుంది. ఇంతలో ఆది వచ్చి మధుప్రియ ఇంతకు మీ ఊరి స్పెషలిటీ ఏమిటి అని అడుగుతాడు ." వానలు పడకుండా పంటలు పండుతాయి, గేదలు లేకుండా పాలొస్తాయి..  మరి మీ స్పెషలిటీ ఏమిటి అని అడుగుతుంది" మా స్పెషలిటీ కూడా అంతే యాంకర్ ఉంటారు కానీ యాంకరింగ్ ఉండదు, కమెడియన్స్ ఉంటారు కానీ కామెడీ ఉండదు" అని అంటాడు. రష్మీ ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నావ్ కదా మరి నీ స్పెషాలిటీ   ఏమిటి అని అడుగుతాడు.." ఇంత బాగా రెడీ ఐ వచ్చాగా అంటుంది రష్మీ ..ఇది కాదు "అప్పుడొక సాంగ్ పాడావ్ కదా ఆ సాంగ్ మళ్ళీ పాడొచ్చుగా అనేసరికి "ఎందుకో ఏకాంత వేళ ..ఊడితి ఊడితి" అంటుంది ఎం ఊడింది అంటాడు ఆది. వద్దులే నువ్వు పాడొద్దులే తల్లి పొరపాటున "ఏ శివరంజని రాగం ఇచ్చామనుకో దాన్ని ఎదో ఒకటి చేసేస్తావ్" అంటాడు. ఇక ఆది వీళ్ళ టీమ్ లో బాలయ్య, పవన్ డూప్స్ ఉంటారు. అలా ఆది ట్రేండింగ్ పంచులతో ఆడియెన్సు ని ఎంటర్టైన్ చేసాడు.

నిఖిల్‌ విగ్గు ఇచ్చాడు.. ఆమె రగ్గు ఇస్తుంది!

ఇటీవల ప్రసారమైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల జాతర' ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసిందని చెప్పొచ్చు. ఇందులో మొత్తం ఆది, రాంప్రసాద్ మాత్రమే ఎక్కువగా కనిపించారు. ఆది వేసే పంచులకు కడుపుబ్బా నవ్వుకోక తప్పదు. సుధీర్ ప్లేస్ ని కొంతవరకు ఆది రీప్లేస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇపుడు ఏ షో చూసినా ఆది, రాంప్రసాద్ మాత్రమే కనిపిస్తున్నారు. ఆది, రాంప్రసాద్, ఇమ్మానుయేల్, పంచ్ ప్రసాద్, భాస్కర్ కలిసి స్కిట్ చేశారు. వైకుంఠపాళి ఆడుతూ పాడుతూ  వేసే పంచులకు పొట్ట చెక్కలైపోవాల్సిందే అన్నట్టుగా పెర్ఫార్మ్ చేశారు.  సుయోధనుడిగా రాంప్రసాద్ నటించగా, దుశ్శాసనుడిగా ఇమ్మానుయేల్ అభిన‌యించాడు. అందరూ కలిసి వైకుంఠపాళి ఆడారు. చివరిగా ఇమ్మానుయేల్ దుశ్శాసనుడి రూపంలో వచ్చి ద్రౌపది ఐన శాంతి స్వరూప్ ని చెరబట్టి చీర బ‌దులు అతని విగ్గుని లాగేశాడు. శాంతి స్వరూప్ "హే కృష్ణా" అనే డైలాగ్ బదులు "హే నిఖిల్" అని అరుస్తూ ఏడ్చేడు.  వెంటనే సెట్ కి వచ్చిన 'కార్తికేయ '2 టీం నుంచి నిఖిల్ వెళ్లి శాంతిస్వరూప్ కి విగ్గు పెట్టాడు. అలా నిఖిల్ విగ్గు పెడుతుంటాడు, ఇమ్ము తీసేస్తుంటాడు. రాంప్రసాద్ నిఖిల్ కి విగ్గులు ఇస్తూ ఉంటాడు. ఇక ఫైనల్ గా విగ్గు లాగి లాగి అలుపొచ్చి ఇమ్ము అదే విగ్గు తన నెత్తిన పెట్టుకుని కూర్చుండిపోయాడు. ఇక ఆది లైన్ లోకి వచ్చి "మీరు శాంతికి విగ్గు ఇచ్చారు కదా తర్వాత త‌ను మీకు రగ్గు ఇస్తది" అన్నాడు నిఖిల్ తో. అలా ఆ స్కిట్ ఎండ్ అవుతుంది.

ఈ వయసులో గడ్డివామి చాటు రొమాన్స్ ఏంటి!?

ఇటీవల ఏ షో చూసినా కమెడియన్స్ వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ ని కూడా పనిలో పనిగా ఆడియన్స్ కి పరిచయం చేసేస్తున్నారు. బులెట్ భాస్కర్ కూడా వాళ్ళ నాన్నను అలాగే పరిచయం చేశాడు. ఇక ఇదే అదనుగా భాస్కర్ వాళ్ళ నాన్న కూడా దూసుకుపోతున్నాడు. ఇప్పుడు భాస్కర్ కంటే వాళ్ళ నాన్నే ఫామ్‌లో ఉన్నాడు. ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసేస్తున్నాడు. ఇటీవల ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల జాతర స్పెషల్ లో భాస్కర్ వాళ్ల నాన్న అక్రమ సంబంధాల విషయంలో కౌంటర్ లు వేశాడు.  శాంతి స్వరూప్ తో కలిసి గడ్డి వామి చాటు రొమాన్స్ చేయడాన్ని చూసిన భాస్కర్ "నాన్నా.. ఏమిటి ఇక్కడో అమ్మ, ఇంట్లో ఒక అమ్మ.. ఏంటి నాన్న ఇది".. అంటాడు. వెంటనే తడుముకోకుండా ఆయ‌న‌, "నువ్వు నలుగురిని మైంటైన్ చేస్తున్నావ్" అంటూ భాస్కర్ పరువు తీసేశాడు. ఐతే ప్రతీ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో భాస్కర్ వాళ్ళ నాన్నతోనే స్కిట్ వేయిస్తున్నాడు. ఇదే స్కిట్ లో ఆదికి జోడీగా వర్ష, రాంప్రసాద్ కి జోడీగా ఫైమా, నాటీ నరేష్ కి జోడీగా జోర్దార్ సుజాత చేశారు.  ఇదే స్కిట్ లో బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్న గురించి తెలిసిపోయేసరికి ఆయ‌న‌ బూతులు మాట్లాడేశాడు. ఇంద్రజ షాక్ ఐపోయింది. హైపర్ ఆది వెంటనే భాస్కర్ వాళ్ళ నాన్న నోరు మూసేస్తాడు. ఇక దీన్ని మొత్తాన్ని కవర్ చేయడానికన్నట్టు రాంప్రసాద్, ఫైమా డాన్స్ చేస్తూ వస్తారు. ఏదైమైనా భాస్కర్ వాళ్ళ నాన్న అప్పుడప్పుడు స్కిట్స్ లో అదుపు తప్పి మాట్లాడ్డం చూస్తూనే ఉన్నాం.

గాజులు చేతులకు వేసుకోవాలి.. చెవులకు పెట్టుకోకూడదు!

అనసూయ స్మాల్ స్క్రీన్ పై ఫుల్ ఫేమస్ యాంకర్. అంతేకాదు ఆమె ఆల్‌రౌండర్ కూడా. ఈమె చేసే క్యారెక్టర్స్ చూస్తే ఈమె స్పెషాలిటీ ఏమిటో అర్థమైపోతుంది. ఐతే అనసూయ ఇటీవల జబర్దస్ షోకి బై బై చెప్పేసింది. కాగా లేటెస్ట్‌గా కొన్ని మూమెంట్స్ ని బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది అనసూయ. పొట్టి నిక్కర్ వేసుకుని బీచ్ మొత్తాన్ని చుట్టేస్తోంది. అనసూయ ఎక్కడ ఉంటే అక్కడ అందం ఉంటుంది అన్నట్టుగా ఇప్పుడు బీచ్ కి వెళ్లి తన అందాన్ని సముద్రానికి కాస్త అంటించిందా లేదా సముద్రం అందాన్ని తానే కొంచెం పూసుకుందా అన్నట్టు ఉంది. సముద్రం అందంగా ప్రవహిస్తుంటే అనసూయ చలాకీగా అల్లరి చేస్తోంది. "నన్ను చూసేసరికి సముద్రం ఎగసెగసి పడుతోంది. సముద్రం నన్ను మిస్సయిందేమో అనిపిస్తోంది" అన్నట్టుగా కాప్షన్ పెట్టి బీచ్ ఫొటోస్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అందరూ సూపర్ అని కామెంట్ చేస్తుంటే ఒక నెటిజన్ మాత్రం "నైస్ చెడ్డి .. కొత్తదా" అంటూ ఒక సెటైరికల్ కామెంట్ చేసాడు.  అనసూయ పెట్టుకున్న  చెవి పోగులు గాజుల్లా ఉండేసరికి మరో నెటిజన్ ఐతే "గాజులు చేతులకు వేసుకోవాలి కానీ చెవులకు పెట్టుకోకూడదు" అంటూ కామెంట్ చేసాడు. ఇక రంగమ్మత్త మాత్రం ఎప్పుడూ ఎవరి కామెంట్స్ కి రెస్పాండ్ అవదు. తన పని తాను చేసుకు పోతుంది. సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది అనసూయ. రోల్ నచ్చి బోల్డ్ గా ఉంది అనుకుంటే తప్పనిసరిగా చేసేస్తుంది. సినిమా ఆఫర్స్ తో పాటు స్టార్ మాలో తనకు నచ్చిన ఆఫర్ వచ్చేసరికి అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.

ముద్దు కూడా ముగ్గురికి ఇవ్వాలా!?

ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ప్రోమో చూస్తుంటే గెటప్ శీను మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ కంటే కూడా ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ కే కాస్త రేటింగ్ ఎక్కువగా వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఈనెల‌ 5న ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి 'రైటర్ పద్మభూషణ్' మూవీ నుంచి యాక్టర్ సుహాస్, యాక్ట్రెస్ టీనా శిల్పరాజ్ గెస్టులుగా వచ్చేసారు.  కాసేపు వీళ్ళిద్దరూ తమ మూవీలోంచి కొన్ని డైలాగ్స్ చెప్పాక కెవ్వు కార్తీక్ తన స్కిట్ తో ఎంట్రీ ఇచ్చాడు. 'స్టాలిన్' మూవీలో చిరంజీవిలా కెవ్వు కార్తిక్ పెర్ఫార్మ్ చేశాడు. హీరోయిన్ గా వర్ష ఎంటర్టైన్ చేసేస్తుంది. "నీకోసం ఒకటి చెప్పాలని వచ్చాను, ఒకటి ఇవ్వాలని వచ్చాను" అని వర్ష అనేసరికి కార్తిక్ ఏమో "నో.. నో.. నువ్వు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ముందు ముగ్గురికి ఇవ్వు. తర్వాత ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి ఇవ్వమని చెప్పు" అన్నాడు. వర్ష తల పట్టుకుంది.  కెవ్వు కార్తిక్  చెప్పిన డైలాగ్ కి ఇంద్రజ మధ్యలో వచ్చి "అంటే ముద్దు కూడా ముగ్గురికి ఇవ్వాలా" అంటుంది. అంతే ఊహించని పరిణామానికి షాక్ అయ్యాడు కార్తీక్. తర్వాత గెటప్ శీను, రాంప్రసాద్ పోలీస్ ఆఫీసర్ గా, కానిస్టేబుల్స్ గా వచ్చి  స్కిట్ వేశారు. ఆ స్కిట్ లో అన్నపూర్ణమ్మ ఖైదీగా వచ్చింది. గెటప్ శీను వచ్చి సంతకం పెట్టమంటే "నేను పెట్టాను" అంటూ ముఖంలోకి చూడకుండా షర్ట్ కేసి చూస్తూ మాట్లాడుతుంది.  "ఏంటి అక్కడ చూసి మాట్లాడుతున్నావ్" అన్నాడు శీను. "నేను అక్కడే చూస్తాను నీ ముఖం చూస్తాను.. చెంబుచ్చుకుని వెళ్లే ముఖం నువ్వూనూ".. అని అన్న‌పూర్ణ‌మ్మ అనేసరికి శీను ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్స్ మాములుగా ఉండవు. "అన్నపూర్ణమ్మ కంటే పెర్ఫామెన్స్ నేను చాలా తక్కువగా చేస్తున్నట్టు అనిపిస్తోంది" అని శీను అనేసరికి అందరూ నవ్వేస్తారు. ఇలా ఈ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ అందరినీ ఎంటర్టైన్ చేయబోతోంది.

మోర్ రెమ్యూన‌రేష‌న్‌.. ఫుల్ ఫ్రీడమ్.. అందుకే షోని వీడిన అనసూయ!

జబర్దస్త్ నుంచి హోస్ట్ అనసూయ వెళ్ళిపోయింది. ఆమె ప్లేస్ లో కొత్త యాంకర్ కూడా రాబోతోంది. దీనికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. అనసూయ స్టార్ మాలో జాయిన్ ఐన కారణంగా జబర్దస్త్ నుంచి తప్పుకున్నట్లు అధికారికంగా చెప్పింది. ఐతే ఇప్పుడు అనసూయ షో నుంచి వెళ్లిపోవడానికి తక్కువ పారితోషికం వల్లనే  షోని వీడిందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే జబర్దస్త్ ఒక్క రోజు షోకి 3 లక్షల పారితోషికం వచ్చేది. స్టార్ మాలో ఇప్పుడు చేస్తున్నందుకు 5 లక్షలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.  ఇక స్టార్ మాలో చేసే షోస్ కి డేట్ల విషయంలో అనసూయకి ఫుల్ ఫ్రీడమ్ ఉందట. ఆమె ఇష్టమైన సమయంలో వచ్చి షో చేసుకుని వెళ్లే అవకాశాన్ని కల్పించింది. ఇన్ని అవకాశాలు ఉండేసరికి అనసూయ జబర్దస్త్ ని వీడిందనే మరో టాక్ కూడా హల్చల్ చేస్తోంది. మొత్తానికి జబర్దస్త్ నుంచి కేవలం పారితోషికం కోసమే అనసూయ మారింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  గతంలో తాను మూవీస్ లో నటించాలని అనుకుంది కాబట్టి జబర్దస్త్ ని వీడుతున్నట్లుగా ప్రకటించింది అనసూయ. ఐతే ఇప్పుడు అనసూయ అభిమానులు మాత్రం ఈ విషయమై చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ కి రెండు స్తంభాలైన అనసూయ, సుడిగాలి సుధీర్ వెళ్లిపోయారు. అనసూయ ఇక కనిపించదు కాబట్టి లేటెస్ట్ జబర్దస్త్ కి ఎవరు వస్తారు, రేటింగ్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.

హలో బ్రదర్ అంటున్న శ్రీముఖి

శ్రావణ మాసం మొదలయ్యింది అంటే చాలు  ఎటు చూసినా పండగలు, పెళ్లిళ్లే సందడి చేస్తూ లేని హుషారును తెప్పిస్తాయి. ఇక ఈ శ్రావణమాసంలో వచ్చే  రాఖీ పండగ కూడా అంతే ఆనందాన్ని అందిస్తుంది. అన్నలకు చెల్లెళ్ళు, తమ్ముళ్లకు అక్కలు రాఖీలు కట్టుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ పండగ ఒక స్పెషల్ అని కూడా చెప్పొచ్చు. ఇక ఇప్పుడు బుల్లితెర మీద ఎటు చూసిన సీజనల్ ఈవెంట్స్ బాగా ఎంటర్టైన్ చేసేస్తున్నాయి.  ఇదే నేపథ్యంలో  ఇప్పుడు మల్లెమాల వాళ్ళు కూడా అటు జీ తెలుగు షోస్, ఇటు స్టార్ మా షోస్ తో సమానంగా ముందుకెళ్లేందుకు భారీగానే సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రక్షా బంధన్ ని పురస్కరించుకుని "హలో బ్రదర్ "అనే షోని ప్లాన్ చేసింది.  ప్రతీ సంవత్సరం అన్నయ్యలు చెల్లెళ్లకు సర్ప్రైజ్ లు ఇవ్వడం చూసాం కానీ మొదటి సారి చెల్లెళ్ళు అన్నయ్యలకు సర్ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటదో చూద్దామా అంటుంది శ్రీముఖి. ఇక వెనక స్టేజి మీద శ్రీముఖి నవీన్ చంద్రకి కుంకుమ పెట్టి రాఖీ కడుతుంది, రోల్ రైడా, భానుశ్రీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ అందరూ కలిసి వాళ్ళ వాళ్లకు రాఖీలు కడతారు, కట్టించుకుంటారు.  ఇలా రాబోయే ఎపిసోడ్ అంత ఫన్ అండ్ మస్తీతో ప్లాన్ చేసింది మల్లెమాల. ఇక ఈ షో ఈటీవీలో ఆగష్టు 7 న ఆదివారం రాత్రి 7 గంటలు ప్రసారం కాబోతోంది.

'జబర్దస్త్'కి మనో కూడా హ్యాండ్ ఇచ్చినట్టే?

జబర్దస్త్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు టాప్ రేటింగ్ సంపాదించుకున్న ఈ షో ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ స్టేజి మీద నుంచి కమెడియన్స్, యాంకర్స్, జడ్జెస్ ఒక్కొక్కరిగా వెళ్లిపోతున్నారు. ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నప్పుడల్లా వచ్చే వారం నుంచి అసలు జబర్దస్త్ ఉంటుందా.. ఉండదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆడియన్స్ నుంచి. ఇక ఇప్పుడు జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.  ఇందులో ఊహించని విషయం ఏమిటి అంటే జడ్జిగా వ్యవహరిస్తున్న మనో గారు మాత్రం కనిపించలేదు. రాబోయే ఎపిసోడ్ లో మనో గారి ప్లేస్ లో న‌టి సంగీత కనిపించబోతోంది. చలాకి చంటి, సునామి సుధాకర్ స్కిట్ లో మనో గారిపై ఒక సెటైర్ కూడా పేలింది. "ఈ వారం మనో గారు లేరేమిటి?" అని చంటిని అడుగుతాడు సుధాక‌ర్‌. "సంగీతం తెలిసిన మనో గారే ఆ స్టేజి మీద ఉంటే ఈ స్టేజి కళకళలాడిపోయేది. అలాంటిది సంగీతనే తీసుకొచ్చి స్టేజి మీద కూర్చోబెట్టారు. ఇంతకంటే ఏం కావాలి" అంటాడు చంటి.  ఇదంతా చూసేసరికి సింగర్, జడ్జి మనో కూడా ఈ షోని వదిలేసి వెళ్ళిపోతున్నారేమో అనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. కొంతకాలం క్రితం వరకు అన్ని ఎపిసోడ్స్ లో మనో కనిపించేవారు కానీ ఇప్పుడు మాత్రం అప్పుడప్పుడే కనిపిస్తున్నారు. ఇవన్నీ చూసాక సింగర్ మనో కూడా ఈ షోకి దూరమైపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. జడ్జెస్ ఇలా ఒక్కొక్కరిగా వెళ్లిపోతుంటే కొత్త జడ్జెస్ ని వెతికి తీసుకురావడం మల్లెమాలకు పెద్ద ప్రహసనంగా మారిపోయింది.

నటుడు చంద‌న్‌పై దాడి చేసిన సీరియ‌ల్ యూనిట్‌

తెలుగు బుల్లితెరపై 'శ్రీమతి శ్రీనివాస్' సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న బుల్లితెర నటుడు చందన్ పై దాడి జరిగింది. కన్నడ ఇండస్ట్రీలో చందన్ కుమార్ కి మంచి పేరు ఉంది. ఐతే చందన్ కుమార్ ఎపిసోడ్ షూటింగ్ టైంలో టీంలో ఒక సభ్యుడితో తప్పుగా ప్రవర్తించాడనే నెపంతో యూనిట్ మొత్తం చందన్ మీద తిరగబడింది. అతని చెంపపై కొట్టి తిట్టేసరికి చందన్ ఆ వ్యక్తికి సారీ చెప్పక తప్పలేదు. లేటెస్ట్ ఎపిసోడ్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా యూనిట్ అతడిపై దాడికి దిగారు. "నువ్వేమైనా మెగాస్టార్ అనుకుంటున్నావా?" అంటూ దుర్భాషలాడారు. జరిగిన విషయానికి  చందన్ సారీ కూడా చెప్పాడు.  ఐతే ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి చందన్ మీడియాకి వివరణ ఇచ్చాడు. వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగోని కారణంగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయిస్తున్నట్లు చెప్పాడు. ఐతే వాళ్ళ అమ్మ దగ్గర ఉండాల్సి రావడంతో  సరిగా నిద్ర లేక బాగా అలసటగా ఉండేసరికి "ఒక ఐదు నిమిషాల రెస్ట్ తీసుకుని తర్వాత షూటింగ్ కి వస్తానని డైరెక్టర్ గారికి చెప్పమని అసిస్టెంట్ డైరెక్టర్ కు చెప్పు" అంటూ  ఒక కుర్రాడికి విషయం చెప్పి పంపాడట. అసలు తాను చెప్పిన విషయం ఎలా పెడర్థానికి దారి తీసిందో తెలీదు కానీ యూనిట్ మొత్తం వచ్చి అతని మీద దాడికి దిగారట. "ఇదంతా నేను మనసులో పెట్టుకోను. నా పని నేను చేసుకుపోతాను" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏమో అనుకున్నాం కానీ..సుమ మామూల్ది కాదు

సుమ కనకాల..ఈమె పేరులోనే ఒక బోల్డ్ నెస్ ఉంటుంది..ఒక అల్లరి పిల్ల ఉంటుంది..ఫుల్ టాలెంట్ ఉంటుంది. అందుకే ఏ హీరోయిన్ కి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ సుమకి ఉంటుంది. సుమ యాంకర్ మాత్రమే కాదు. యాక్టర్, సింగర్ కూడా. ఎలాంటి షోకైనా సుమ హోస్ట్ గా చేయాల్సిందే. సుమ డేట్స్ అవైలబిలిటీ చూసుకునే పెద్ద పెద్ద హీరోస్ కూడా తమ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే సుమ మల్టీ టాస్కింగ్ కాబట్టి. సుమ సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఆక్టివ్ గా ఉంటుంది. రకరకాల వీడియోస్ చేస్తూ నెటిజన్స్ తో టచ్ లోనే ఉంటుంది. ఒక్కోసారి తాను పెంచుకునే పెట్స్ కి  బిస్కట్స్ వేస్తూ, వాటికి  ట్రైనింగ్ ఇస్తున్నట్టు, అలాగే తన స్టాఫ్ కి డాన్స్ నేర్పిస్తూ, ఒక్కోసారి తానే స్టెప్స్ వేస్తూ చేసే వీడియోస్ కి ఫుల్ కామెంట్స్ వస్తుంటాయి.  ఇక ఇప్పుడు సుమ వీణ వాయిస్తున్న ఫోటో ఒకటి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఇందులో సుమ అద్భుతంగా వీణ వాయించింది. "దాదాపు 20 ఏళ్ల తర్వాత వీణ వాయించాను.. మన మెదడు ఎంతో బలమైనది..ఎప్పటి జ్ఞాపకాలనైనా మోస్తూ, గుర్తు చేస్తూ ఉంటుంది. నా వీణా గురువు రమాదేవి గారిని మళ్ళీ గుర్తుచేసుకున్నాను" అంటూ కాప్షన్ పెట్టింది. సుమ చిన్నప్పుడే వీణ నేర్చుకుంది. ఇక నెటిజన్స్ ఐతే సుమ వీణ వాయించిన వీడియోకి సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఐతే వీణ నేర్చుకున్న సుమ అప్పుడప్పుడు గొంతు కూడా సవరించుకుని బేస్ వాయిస్ లో పాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఒక ఈవెంట్ లో ఇలా అనుకోకుండా పాట పాడిన సుమతో థమన్ విన్నర్ మూవీలో "సుయ సుయ సుయ అనసూయ" అనే పాటను సుమతో పాడించేసారు. అలా సుమ ఆదిత్య ఆడియోలో పేరు నమోదు చేసుకుంది. ఇలా సుమ అంటే ఆల్ రౌండర్ అని నిరూపించుకుంది.

'దేశోద్ధారకులారా.. ఇది నా జీవితం!'.. కౌంటర్ వేసిన ప్రగతి

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూవీస్ లో యాక్ట్ చేస్తుంది. టైమింగ్ ఉన్న కామెడీతో జనాలను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద కూడా మెరుస్తోంది. ప్రగతి జిమ్ వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతూ ఉంటాయి. ఈమె చేసే వర్కౌట్స్ కి నెటిజన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఉంటారు. ఎప్పుడూ  ఫిట్ గా ఉండడానికి ట్రై చేస్తూ తన  హెల్త్ ని కాపాడుకుంటది అనే టాక్ ఉంది.  ఐతే ఇటీవల ప్రగతి ఒక వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇందులో చిన్నపిల్లలా డ్రెస్ చేసుకుని 'సఖి' సినిమా సాంగ్ కి డాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియోకి కొంతమంది పాజిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఉంటే కొందరు నెగటివ్ గా మాట్లాడారు. ఇలాంటి కామెంట్స్ వస్తాయని ముందే ఊహించిన ప్రగతి "ఓ దేశోద్ధారకులారా.. నేను యంగ్ గా కనిపించడానికి ట్రై చేయడం లేదు.. నా జీవితాన్ని నేను జీవిస్తున్నా" అంటూ కాప్షన్ పెట్టేసింది. "యంగ్ గా కనిపించడంలో తప్పులేదు, మీరు నేటి తరం ఆటీల కోసం ఒక ట్రెండ్ సెట్ చేశారు, బ్యూటిఫుల్" అంటూ కొందరు కామెంట్స్ చేశారు. "బతకాలి అంటే ఇలాంటి దుస్తులు వేసుకుని డాన్స్ చేయాలని చాలా మందికి తెలియదు. వాళ్లకు ఈ వీడియో చూపిస్తాను" అంటూ కూడా కొందరు కామెంట్స్ చేశారు. ఎవరేమనుకున్నా సోషల్ మీడియాలో ఎవరూ ఎక్కడా తగ్గట్లేదు. మా లైఫ్ మా ఇష్టం అంటున్నారు.  ఇక ప్రగతి.. బుల్లితెర మీద, వెండితెర మీద నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఇటీవల 'ఎఫ్ 3' మూవీలో నటించి కామెడీ చేసి ఆడియన్స్ ని అలరించింది. అలాగే 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ'లో కూడా మెరిసింది. ఇలా అవకాశాలని అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తన లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తోంది ప్రగతి.

ఆర్పీ మీద కౌంటర్ ఎటాక్ తో జాతిరత్నాలు!

జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయినా కిర్రాక్ ఆర్పీ చాలా రోజుల తర్వాత ఆ మల్లెమాల సంస్థ గురించి అక్కడి ప్రొడక్షన్ ఫుడ్ గురించి చేసిన కామెంట్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. కొంతమంది ఆర్పీ కామెంట్స్ ని సపోర్ట్ చేస్తే ఇంకొంతమంది మాత్రం ఆర్పీ కి కౌంటర్ ఎటాక్స్ కూడా ఇచ్చారు. ఇలా ఈ కాంట్రవర్సీ ఎలా గోలా కాస్త సద్దుమణిగినట్లు కనిపించింది. ఐతే ఇప్పుడు ఇదే థీమ్ తో జాతిరత్నాలు షోలో ఒక స్పూఫ్ చేశారు. ఈ స్పూఫ్ లో పంచ్ ప్రసాద్, నూకరాజు, ఇమ్మానుయేల్, శ్రీముఖి పార్టిసిపేట్ చేశారు. ఈ నలుగురు రౌండ్ టేబుల్ లా కూర్చుని డిబేట్ కార్యక్రమం నడిపిస్తారు.  "మీకు ఆరోగ్యం బాగోనప్పుడు మీరు ఏదైతే సంస్థలో పని చేస్తున్నారో ఆ సంస్థ మీకు నిజంగానే అన్యాయం చేసిందా అంటూ ఇమ్మానుయేల్ ప్రసాద్ ని అడుగుతాడు" మీకనే కాదు అందరికీ ఈ విషయం గురించి  చెప్పాలి అంటూ ప్రసాద్ తన ఎక్స్పీరియన్స్ ని చెప్పబోతాడు . ఐతే అతను మాట్లాడిన మాటల్ని కట్ చేసేస్తారు. తర్వాత నూకరాజు వచ్చి "మీరు చేసే సంస్థలో ఫుడ్ బాగోదని టాక్ నడుస్తోంది..దీని గురించి మీరేం చెప్తారు అని ప్రసాద్ ని అడుగుతాడు. ఇలా ఈ డిబేట్ చాలా ఘాటుగా జరిగినట్టు ప్రోమో చూస్తే అర్థమైపోతుంది. ఆర్పీ మీద ఎలాంటి కౌంటర్లు వేశారు ? అనే విషయం తెలియాలంటే ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది. ఐతే మల్లెమాల ఇలా ఆర్పీకి మళ్ళీ గట్టిగా  కౌంటర్లు ఇవ్వడానికి స్కిట్స్ వేయిస్తోందనే విషయం అర్థమౌతోంది. మరి ఆర్పీ ఈ స్కిట్ చూసి ఎలా రియాక్ట్ అవుతాడో ? అసలు రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి.  

బులెట్ భాస్కర్ మాటలకు రష్మీ చెవిలోంచి పొగలు!

సుధీర్ రష్మిని విడిచి వెళ్ళిపోయినా రష్మీకి మాత్రం ప్రతి మాటల తూటాలను ఎదుర్కోక తప్పడం లేదు. నిన్న మొన్నటి వరకు సుధీర్, రష్మీ స్మాల్ స్క్రీన్ పెయిర్ గా మంచి లవ్ జోడిగా వీళ్ళను ఆదరించి అభిమానించే ఆడియన్స్ చాలామంది పెరిగిపోయారు. ఐతే తర్వాత అనుకోని కొన్ని కారణాల వలన ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఎవరి దారి వాళ్ళు చూసుకున్న కూడా స్కిట్స్ లో మాత్రం వీళ్ళ ఇద్దరి టాపిక్ లేకుండా మాత్రం ఆ స్కిట్ కి మంచి హైప్ రాదనుకుని వాళ్ళ రిలేషన్ ని కాష్ చేసుకోవడం కూడా మొదలు పెట్టారు. ఐతే ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ లో మళ్ళీ సుధీర్, రష్మీ టాపిక్ రైజ్ అయ్యింది. బులెట్ భాస్కర్ స్కిట్ లో వర్ష అరుంధతి మూవీలో జేజెమ్మ క్యారక్టర్ వేస్తుంది.  అలా తన రాజ్యంలోకి జేజెమ్మ నడుస్తూ వచ్చి రష్మీ వైపు చూస్తూ "ఆవిడెవరు" అని భాస్కర్ ని అడుగుతుంది. "ఆవిడ రేష్మి మహారాణి" అంటాడు భాస్కర్. మరి ఆవిడేంటి దిక్కులు చూస్తుందేంటి అని అడుగుతుంది వర్ష. "దిక్కులు కాదమ్మా ..తన మహారాజు యుద్ధం చేసి రాజ్యాన్ని గెలుచుకు వస్తానని పక్క రాజ్యానికి వెళ్ళాడు ". అని భాస్కర్ అనేసరికి రష్మీ చెవిలోంచి పొగలొస్తాయి ఆ డైలాగ్ కి మూతి తిప్పుకుంటుంది. "రాజ్యంలో ఖజానాలు ఎలా ఉన్నాయి" అని అడుగుతుంది వర్ష. "మీ ప్లాస్టిక్ సర్జరీలకే మొత్తం ఖర్చయిపోయిందమ్మా " అంటూ భాస్కర్ చెప్పేసరికి వర్ష నవ్వుకుంటుంది. ఇలా ఈ వారంలో స్కిట్స్ అన్నీ అలరించబోతున్నాయి.

వెదర్ కో- ఆపరేట్ చేస్తుంది అందుకే కైట్ ఎగురుతుంది

నవ్య స్వామి, రవికృష్ణ ఏ షోలో చూసినా వీళ్ళిద్దరే కనిపిస్తూ ఉంటారు. వీళ్లిద్దరి జంట బుల్లి తెర మీద మస్త్ ఫేమస్. "నా పేరు మీనాక్షి" సీరియల్ తో నవ్య స్వామి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటుంది. ఈ స్మాల్ స్క్రీన్ బ్యూటీ కన్నడ సీరియల్స్ ద్వారా బుల్లి తెరకు పరిచయమైన నవ్య తమిళ్ లో, తెలుగులో సీరియల్స్ చేస్తూ అభిమానుల్ని పెంచుకుంటోంది. స్టార్ మాలో ప్రసారమైన "ఆమె కథ" సీరియల్ లో రవికృష్ణ , నవ్యస్వామి కలిసి నటించారు. అప్పటి వరకు వాళ్ళ ప్రేమ కొంతవరకే ప్రపంచానికి తెలుసు కానీ ఈ సీరియల్ తర్వాత వీళ్ళ ప్రేమ ఇంకా ఇంకా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఢీ 14 డాన్స్ షోకి ఇద్దరూ కలిసి టీమ్ లీడర్లుగా పని చేస్తున్నారు. ఐతే ఇప్పుడు ఢీ 14 షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ప్రదీప్ వేసే జోకులకు అడ్డుఅదుపు ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ లేటెస్ట్ ఎపిసోడ్ లో నవ్యస్వామికి ఒక టిపికల్ క్వశ్చన్ వేస్తాడు ప్రదీప్. "సంక్రాంతి రోజు కైట్ ఎందుకు ఎగరేస్తారు" అని అడుగుతాడు. "అప్పుడు వెదర్ కొంచెం కో- ఆపరేట్ చేస్తుంది కాబట్టి కిట్స్ ఎగరేస్తారు" అంటుంది నవ్యస్వామి. అదేంటి  పతంగికి వెదర్ కో-ఆపరేట్ చేస్తుందా అంటూ నవ్వుతాడు ప్రదీప్ . మేమైతే ఇంట్లోనే పతంగులు ఎగరేసుకుంటూ ఉంటాం అంటూ ఫన్ చేస్తాడు. ఫైనల్ గా అందరూ హోలీ కలర్స్ చల్లుకుని ఢీ స్టేజిని రంగులమయం చేసేస్తారు.

లై డిటెక్టర్ పరీక్షలో పాసైన ఫైమా.. ప్రవీణ్ మీద ప్రేమను ఇలా చెప్పేసింది

ఇప్పుడు బుల్లి తెర మీద ప్రవీణ్ ఫైమా లవ్ స్టోరీ సెన్సేషన్ సృష్టిస్తోంది. వీళ్ళ ప్రేమ పటాస్ షో నుంచి స్టార్ట్ అయ్యింది. తర్వాత్తర్వాత ఇద్దరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఏ చిన్న సందర్భం దొరికినా ప్రవీణ్ ఫైమా మీద తన ప్రేమను ప్రదర్శిస్తూనే ఉన్నాడు. కానీ ఫైమా మాత్రం ఎప్పుడూ నోరు తెరిచి ప్రవీణ్ ఐ లవ్ యూ అనే మాత్రం  చెప్పలేదు. ప్రవీణ్ అంటే ఇష్టం ఉందో లేదో కూడా ఎప్పుడూ  ఆడియన్స్ ముందు మాత్రం ఫైమా ఓపెన్ కాలేదు. ఐతే ఇప్పుడు తాజాగా క్యాష్ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోకి నాలుగు జంటలు వచ్చి సందడి చేశాయి. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో వీళ్లంతా  ఫుల్ మస్తీ చేయబోతున్నారు. ఈ షోలో నూకరాజు, ఆసియా ప్రేమకు పరీక్షా పెట్టింది. తర్వాత సుమ ప్రవీణ్, ఫైమా జంటకు లై డిటెక్టర్ పరీక్షలు పెట్టింది. నీకు బెస్ట్ కమెడియన్ అవార్డు కావాలా ? ప్రవీణ్ కావాలా ? అని ఫైమని అడుగుతుంది సుమ. "నాకు అవార్డు వద్దు, ప్రవీణ్ కావాలి" అంటుంది ఫైమా. ఫైమా ఆన్సర్ రాంగ్ అన్నట్టుగా ఆ లై డిటెక్టర్ మూడుసార్లు కుయ్యో మొర్రో అని అరుస్తూ ఉంటుంది. నువ్ ఎన్నిసార్లయినా అరుచుకో నాకు ప్రవీణే కావాలి అంటుంది ఫైమా. అలా క్యాష్ లో ప్రవీణ్ మీద ఉన్న తన ప్రేమను ఇన్నాళ్లకు ఈ షో ద్వారా బయటపెట్టింది. ఇలా ఈ షోకి వచ్చే వారం రేటింగ్ పెంచుకునే పనిలో పడింది సుమ. ఇప్పుడు ఈ షో ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నూకరాజు, ఆసియా పెళ్లి జరిపించేసిన సుమ!

క్యాష్ షో ఎప్పుడూ సూపర్ గా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటీనటులు వస్తూ ఉంటారు. ఐతే ఇప్పుడు క్యాష్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇప్పటి వరకు అలా హాయిగా నవ్వులతో సాగిపోయే ఈ షో ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి పెళ్లిళ్లు చేసే స్టేజిలా మారిపోయింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి బుల్లితెర షోస్ లో నటించే కమెడియన్ పెయిర్స్ ని తీసుకొచ్చింది సుమ. కార్తిక్‌-ష‌బీనా, నూకరాజు-ఆసియా, ప్రవీణ్-ఫైమా, పరదేశి-భాను.. ఇలా నాలుగు జంటలను తీసుకొచ్చింది. ఐతే ఆసియా-నూకరాజు, ఫైమా-ప్రవీణ్ ఈ రెండు జంటలు నిజమైన ప్రేమ జంటలన్న విషయం సోషల్ మీడియా మొత్తానికి తెలుసు. నూకరాజు ప్రేమ నిజమైనదా, కాదా? అని టెస్ట్ చేయడానికి సుమ ఒక టాస్క్ ఇచ్చింది. "నీది నిజమైన ప్రేమైతే ఈ కర్పూరాన్ని చేతిలో పెట్టుకుని వెలిగించుకో" అంటూ వెలిగించింది. అది చూసి ఆసియా బాగా ఏడుస్తూ కర్పూరాన్ని పడేయమని నూకరాజుతో చెప్పింది. సుమ చేసిన ఆ పనికి అక్కడి వాళ్లంతా షాక్ ఐపోయారు. ఇలా చేతిలో కర్పూరాన్ని వెలిగించుకుని సాహసం పూర్తయ్యాక "మా అందరి సాక్షిగా ఆసియాకి తాళి కట్టు" అంటూ ఒక చైన్ నూకరాజు చేతికి ఇచ్చింది సుమ‌.  వెంటనే నూకరాజు కూడా ఏమీ ఆలోచించకుండా ఇదే అవకాశం అనుకున్నాడేమో వెంటనే క్యాష్ షో వేదికపై ఆసియా మేడలో కట్టేశాడు. నూకరాజు అలా చేసేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ ఐపోయారు. నూకరాజు పెళ్లితో ఇప్పుడు క్యాష్ స్టేజి మీద పెళ్లిళ్లు కూడా జరిగిపోతున్నాయి. సుమ కూడా ఆ పరిణామానికి అవాక్కయి అలా చూస్తుండిపోయింది.

పడవలో ముద్దులతో రెచ్చిపోయిన‌ జ్యోతక్క!

తెలంగాణ యాసలో వార్తలు చదివే శివజ్యోతి అలియాస్ జ్యోతక్క అంటే మస్త్ ఫేమస్. ఐతే జ్యోతక్క గురించి చెప్పాలంటే బిగ్ బాస్ కి ముందు, బిగ్ బాస్  తర్వాత అని చెప్పాలి. బిగ్ బాస్ కి ముందు జ్యోతక్క అంటే ఎక్కువ‌మందికి తెలీదు. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక సెలబ్రిటీ ఐపోయింది. జ్యోతక్కతో పాటు ఆమె భర్త గంగూలీ కూడా బుల్లి తెర మీద ఫుల్ ఫేమస్ అయ్యాడు. శివజ్యోతి అనేది అసలు పేరు. సావిత్రి అనేది ఆమె  స్క్రీన్ పేరు.  సెలబ్రిటీ ఐపోయాక ఆ పాత శివజ్యోతిలో చాలా మార్పు వచ్చింది. డ్రెస్సింగ్ స్టైల్ మారింది. మస్త్ వీడియోస్ చేస్తూ, టీవీ షోస్ లో ఫుల్ మస్త్ చేస్తూ ఒక రేంజ్ లో వెలిగిపోతోంది. దీపం ఉండగానే ఇల్లు, కారు, స్టేటస్ అన్నిటిని చక్కబెట్టుకుంది జ్యోతక్క. యాసలో పెద్ద మార్పు రాలేదు కానీ వేష భాషల్లో మాత్రం చాలా మార్పు వచ్చేసింది. పొట్టిగా ఉండే మోడరన్ డ్రెస్సుల్లో తెగ హల్చల్ చేసేస్తోంది.   భార్యాభర్తలిద్దరూ కలిసి వాళ్ళ యూట్యూబ్ చాన‌ల్‌లో వీడియోస్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్ లో, జోష్ యాప్ లో రీల్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు జోష్ లో 'మై లవ్' అనే కాప్షన్ పెట్టి పడవలో వెళ్తూ జ్యోతక్క, గంగూలీ ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటున్న రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప‌ల్ల‌కిలో జ‌బ‌ర్ద‌స్త్ కొత్త యాంక‌ర్ కు గ్రాండ్‌ వెల్క‌మ్‌!

ఖ‌త‌ర్నాక్ కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. గ‌త కొంత కాలంగా కంటెస్టెంట్ లు, టీమ్ లీడ‌ర్ల స్కిట్ ల‌తో న‌వ్వులు పూయిస్తోంది. తాజాగా ఈ షో నుంచి యాంక‌ర్ అనసూయ త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. జూలై నెల‌లో చివ‌రి ఎపిసోడ్ తో జ‌బ‌ర్దస్త్ జ‌ర్నీకి వీడుకోలు ప‌లికింది అన‌సూయ‌. త‌న‌తో పాటు మనో కూడా ఈ షో నుంచి త‌ప్పుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. గ‌త కొన్ని వారాలుగా స్టార్ మా లో ప్ర‌సారం అవుతున్న స్టార్ సింగ‌ర్ జూనియ‌ర్ లో కనిపిస్తున్నారు. దీంతో ఆయ‌న స్థానంలో కొత్త‌గా హీరోయిన్ సంగీత ఎంట్రీ ఇచ్చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇక ఈ షో నుంచి అన‌సూయ కూడా వెళ్లిపోవ‌డంతో ఆ స్థాయిలో గ్లామ‌ర్ ని ఒలికించేది ఎవ‌రు? .. త‌న స్థానంలో కొత్త యాంక‌ర్ గా మ‌ల్లెమాల టీమ్ ఎవ‌రిని దించ‌బోతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా ఆగ‌స్టు 4న గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు. ఇందులో కొత్తగా జ‌బ‌ర్ద‌స్త్ లోకి ఎంట్రీ ఇచ్చే యాంక‌ర్ ని టీమ్ మెంబ‌ర్స్ అంతా తీన్మార్ డాన్సులు చేస్తూ  ప‌ల్ల‌కీలో ఊరేగింపుగా తీసుకురావ‌డం క‌నిపిస్తోంది. అయితే ప‌ల్ల‌కిలో భారీ బ‌ల్డ‌ప్ తో వ‌స్తున్న యాంక‌ర్ ర‌ష్మీనే అని కొంత మంది అంటుంటే కాదు యాంక‌ర్ మంజుషా అని మ‌రి కొంత మంది అంటున్నారు. అయితే ఫైన‌ల్ గా మాత్రం ఈ షోలోకి ఎంట్రీ ఇస్తోంది మంజుష‌నే అని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ తాజా ఎపిసోడ్ లో `కార్తికేయ 2` టీమ్ సంద‌డి చేసింది. ఆగ‌స్టు 5న విడుద‌ల కానున్న ఈ మూవీకి చందూ మొండేటి ద‌ర్శ‌కుడు. శ్రీ‌నివాస‌రెడ్డి స‌పోర్టింగ్ పాత్ర‌లో న‌టించాడు. నిఖిల్ తో క‌లిసి ఈ ఇద్ద‌రు కూడా జ‌బ‌ర్ద‌స్త్ లో సంద‌డి చేయ‌డం విశేషం.