అరె ఛీ.. ఏంట్రా ఈ డబుల్ మీనింగ్ డైలాగులు!

డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి అంతూ పొంతూ లేకుండా పోయింది. బుల్లితెర షోస్ లో ఇలాంటి డైలాగ్స్ ఉంటేనే షోకి రేటింగ్ పెరుగుతుంది అని వాటినే ఎక్కువగా పెడుతున్నారు. ఈ వారం 'శ్రీదేవి డ్రామా కంపెనీ' టూ మచ్ డైలాగ్స్ తో ఆడవాళ్లు తల దించుకునే స్థాయికి తీసుకెళ్లారు. రీసెంట్ గా ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీలో "నా కొడుకు" టైటిల్ తో ఒక ఈవెంట్ చేశారు. ఈ ఎపిసోడ్‌కు గెస్టుగా సీనియ‌ర్ క‌మెడియ‌న్‌ కృష్ణభగవాన్ వచ్చాడు. 'ఎఫ్‌3' మూవీ కాన్సెప్ట్ ప్రకారం తప్పిపోయిన కొడుకుని తిరిగి పట్టుకునే థీమ్ అంటూ నానా హంగామా చేశారు. తర్వాత ఒక రూపాయిని పది రూపాయలు చేసే బిజినెస్ తెలివితేటలు ఉన్నాయని కృష్ణ భగవాన్ చెప్పడంతో మరో స్కిట్ వేశారు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, నాటీ నరేష్.  ఇందులో ఒక్కొక్కొరు ఒక్కో వ్యాపారం చేస్తుంటారు. ఆది మూలికల వ్యాపారం చేస్తుంటాడు, ఇమాన్యుయేల్ పీచు మీఠాయిలు అమ్ముతూ ఉంటాడు. రాంప్రసాద్ కూరగాయల బిజినెస్ చేస్తుంటాడు. వీళ్ళ బిజినెస్ ని చూసి కొనడానికి నాటీ నరేష్ వచ్చి తన పరువు తానే తీసేసుకుని అందరినీ తలదించుకునేలా చేస్తాడు. రాంప్రసాద్ కూరగాయల దగ్గరకు వచ్చి "దొండకాయను చూపించి ఏంటి ఇది ఇంతే ఉంది?" అంటూ డబుల్ మీనింగ్‌లో అంటాడు. "ఎక్కడో చూసినట్టుగా ఉంది కదా?" అని నరేష్ ని ఇంకా రెచ్చగొడతాడు రాం ప్రసాద్. వీళ్ళ డైలాగ్స్ వినలేక ఇంద్రజ సిగ్గుతో తలదించుకుంటుంది. చివరికి పంచ్ ప్రసాద్ వచ్చి అందరినీ తిడతాడు.  ఏదో చేద్దామని అనుకుని కానీ ఏమీ చేయలేక తెల్ల ముఖాలు వేసుకుని నిలబడ్డారు. నరేష్ స్పాంటేనిటీగా ఏదో చేద్దామని వచ్చి ఏది చేయలేక  ఉన్న పరువు, లేని పరువు, అప్పు చేసిన పరువు కూడా పోగొట్టుకున్నాడు. ఇలా ఈ స్కిట్ అయ్యిందనిపించారు.

జిమ్ము కట్టి చూడు.. జిమ్ము చేసి చూడు.. ఇది ప్రగతి మాట!

ప్రగతి ఆంటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ ఐపొతూ ఉంది. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె చేసే  జిమ్ వర్కౌట్స్ చూస్తే చాలు. ఏమాత్రం టైమ్ దొరికినా జిమ్ లో ప్రత్యక్షమై వ‌ర్క‌వుట్స్‌ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ జబర్దస్త్ ప్రోమో విడుదలయ్యింది. ఈ షోకి జడ్జిగా వచ్చి ప్రగతి నవ్వులు పూయించింది. ఇక ఈ ఎపిసోడ్ లో రాఘవ స్కిట్ గురించి ఒక్క మాటలో చెప్పలేం. అంత హిలేరియస్ గా ఉంది ఈ స్కిట్. రాఘవ ఈ స్కిట్ ని వెరైటీ గా పెర్ఫామ్ చేసాడు.  స్టేజి మీద ఎక్సరసైజ్లు చేస్తూ "ప్రగతి మేడం ఎప్పుడు చూసినా మీరు జిమ్ లోనే ఉంటారు. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది పాత మాట మేడం, జిమ్ము కట్టి చూడు.. జిమ్ము చేసి చూడు అనేది ప్రగతి మాట అండి" అంటాడు. ఇంతలో రాఘవ అసిస్టెంట్ వచ్చి "ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులో చేయాలి జిమ్ములు" అంటాడు రాఘవతో. "ప్రగతి మేడంని అంత మాట అంటావా?" అంటాడు రివర్స్ లో రాఘవ. "నేను ప్రగతి గారిని అనలేదు నిన్ను అన్నాను" అంటాడు అసిస్టెంట్. తర్వాత నాగి అక్కడికి వస్తాడు. "మా దగ్గర ఒక గెస్ట్ ఉన్నాడు. అతన్ని ఒక మూడు రోజులు ఎక్కడ పెట్టాలో తెలియడం లేదు" అని రాఘ‌వ అనేసరికి, "మా ఇంట్లో ఒక రూమ్ ఖాళీ ఉంది. ఐదు వేలు ఇచ్చి అందులో ఉంచు" అంటాడు నాగి. వెంటనే డబ్బులు ఇచ్చేసి ఒక శవాన్ని తీసుకొచ్చి ఆ రూమ్ లో పెడతాడు. "ఇదిగోండి గెస్ట్ వచ్చేసాడు" అనేసరికి, "ఏమిటి మందు తాగి పడిపోయాడా?" అని అడిగాడు నాగి. "కాదు పురుగుల మందు తాగి పడిపోయాడు" అని చెప్తాడు రాఘవ. "ఇదేంటి లేవడం లేదు" అని డౌట్ తో అడిగాడు నాగి. "శవం ఎలా లేస్తుంది?.. ఐనా మార్చురీలో పని చేసే నేను శవాల్ని కాక పప్పు చెక్కల్ని తెచ్చి పెడతాను ఏమిటి" అంటాడు. ఆ మాటకు షాక్ ఐపోతాడు నాగి.

 రాజ‌నందిని ఎవ‌ర‌న్న అను, షాక్ కు గురైన ఆర్య, ఆర్య‌త‌ల్లి!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొంత కాలంగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ఆద్యంత ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ బంచి రేటింగ్ తో సాగుతోంది. వెంక‌ట్ శ్రీ‌రామ్ న‌టించి నిర్మించారు. వ‌ర్ష కీల‌క పాత్ర‌లో న‌టించగా ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ‌య‌ల‌లిత‌, జ్యోతి రెడ్డి, విశ్వ‌మోహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, రాధాకృష్ణ‌, అనూషా సంతోష్ త‌దిత‌రులు న‌టించారు. రాజీనే అని బ‌లంగా న‌మ్మిన ఆర్య వ‌ర్థ‌న్ త‌న‌ని త‌న ఇంటికి ఒప్పందం ప్ర‌కారం తీసుకొస్తాడు. అయితే రాజీ చేసే ప‌నులు, మాట్లాడే తీరు ఆర్య‌కు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతూ వుంటుంది. ఆర్య బెడ్రూమ్ నుంచి చాప తీసుకుని బ‌య‌ట‌ప‌డుకోవ‌డానికి రెడీ అవుతూ వుంటుంది. ఇంత‌లో ఆర్య త‌ల్లి మాలినీదేవి ఎంట్రీ ఇస్తుంది. అది గ‌మ‌నించిన రాజీ ఈ టైమ్ లో ఇక్క‌డికి వ‌చ్చారేంటీ? అని అడుగుతుంది. రాకూడ‌ని టైమ్ లో వ‌చ్చి డిస్ట్ర‌బ్ చేశానా? అని మాలిని దేవి అంటుంది. అదే స‌మ‌యంలో రేపు హోమంలో ఇద్ద‌రు కూర్చుంటున్నారు క‌దా?  మీ ఇద్ద‌రితో పాటు పంతులు గారు పూజ‌లో రాజ‌నంద‌ని ఫొటోని కూడా పెట్టాల‌న్నారు. ఇలా చేయ‌మ‌ని మ‌రీ మ‌రీ చెప్పారంటుంది. వెంట‌నే రాజీ.. రాజ‌నంద‌ని ఎవ‌రు ? అంటుంది. ఆ మాట‌తో ఆర్య‌, ఆర్య త‌ల్లి మాలినీదేవి ఒక్క‌సారిగా షాక్ అవుతారు. ఆ త‌రువాత అదేంటి అను రాజ‌నంద‌ని నీకు తెలియ‌దా ? అని ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తుంది. ఆ మ‌ట‌లు విన్న రాజీ ఎందుకు తెలియ‌దు త‌ను మీ కూతురు క‌దా అనడంతో ఆర్య‌, ఆర్య త‌ల్లి మ‌రింత‌గా షాక్ కు గుర‌వుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

మా ఆయన నాకే కదా ఫోన్ చేసింది.. తప్పేముంది?

ఈ మధ్య బుల్లి తెర షోస్ ద్వారా చాలా మంది ప్రేమలో పడి రియల్ లైఫ్ లో మ్యారేజ్ చేసుకుని సెటిల్ ఐపోతున్నారు. అలాంటి ప్రేమ జంటలు ఎన్నో ఉన్నాయి. అలాంటి జంటల్లో ఒకరు సిద్ధు, విష్ణుప్రియ. వీళ్ళు కూడా అంతే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ ఇద్దరి పేరుతో 'సిద్ష్ను' అనే  యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇందులో ఎన్నో అప్ డేట్స్ తో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు.  ఇక సిద్ధు ఐతే చాలా చిన్నపిల్లాడిగా, పెళ్లి కాని కుర్రాడిగానే అందరికీ  కనిపిస్తూ, కవ్విస్తూ  ఉంటాడు. ఇక రీసెంట్ గా విష్ణుప్రియ ఒక వ్లాగ్ చేసింది. అందులో అమరదీప్ ఎంగేజ్మెంట్ వీడియో పోస్ట్ చేసింది. ఎంగేజ్మెంట్ కోసం ట్రైన్ లో వెళ్తూ మల్లిక, జానకి అల్లరి కూడా వీడియో తీసింది. "ప్రియాంక చూసారా ఎలా అల్లరి చేస్తుందో నిద్రపోకుండా" అంటూ చూపించింది. ఇక ఎవరి పనుల్లో వారు ఉంటే ఫోన్, లాప్ టాప్ తో బిజీ బిజీగా ఉన్నారంటూ చూపించి పరువు తీసింది. ఇక అదే టైంలో విష్ణుప్రియకు తన హస్బెండ్ సిద్ధు నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ విని ప్రియాంక ఫుల్ సెటైర్స్ వేసింది. "అర్ధరాత్రి శ్రీవారు ఫోన్ చేస్తే చూడండి ఎలా సిగ్గు పడుతుందో" అంటూ ఆ సిగ్గును కూడా చూపించింది. "ఏమండి.. మీరు ఇలా ఫోన్ చేసి మాట్లాడుతుంటే దీన్ని కూడా వ్లాగ్ లో రికార్డు చేసేస్తున్నారు" అంటూ గారంగా చెప్తూ ఉంది. "మా ఆయనకు నేనంటే ఇష్టం, నేను ఎలా ఉన్నానా అని ఫోన్ చేసాడు. జాగ్రత్తగా వెళ్తున్నానా లేదా అని తెలుసుకుంటున్నాడు, తప్పేముంది!" అంటూ వీడియోలో తెగ సిగ్గు పడిపోయింది విష్ణుప్రియ. ప్రేమంటే ఇలా ఉంటది మరి.

నవదీప్ అబద్దాలు చాలా బాగున్నాయి

సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ సింగింగ్ షోకి లవ్ మౌళి మూవీ టీమ్ నుంచి నవదీప్, భావన వచ్చి కాసేపు ఎంటర్టైన్ చేశారు. నవదీప్ ఈ మూవీ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో పాత్ర చాలా వండర్ ఫుల్ గా ఉంటుందని చెప్పాడు. ఇక  అనంత శ్రీరామ్ నవదీప్ గురించి ఒక అద్భుతమైన కంప్లిమెంట్ ని ఈ షోలో ఇచ్చేసారు. ఎవరైనా పాత్ర కోసం కష్టపడటం చూసాం కానీ ఒక పాత్ర కోసం రెండేళ్లు జుట్టు పెంచుకుని ఒక అజ్ఞాత వ్యక్తిగా ఆ పాత్ర కోసం కష్టపడిన వ్యక్తిని ఒక్క నవదీప్ నే చూసాను అని చెప్పేసరికి స్టేజి మొత్తం చప్పట్లే చప్పట్లు మారు మోగాయి. ఇక నవదీప్ అనంత శ్రీరామ్ గురించి చెప్తూ ఆయన 32 రోజులు షూటింగ్ సెట్ లో తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేసారని చెప్పుకొచ్చారు. ఆయన షూటింగ్ సెట్ లో చేసినా ఎంజాయిమెంట్ నే ఫీల్ అయ్యి పాటల రూపంలో రాసారని చెప్పారు. అంతే కాదు హీరోయిన్స్ తో కలిసి వాటర్ ఫాల్స్ లో డాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారని, ఆయన రోజూ చేసే హడావిడి అంతా ఇంతా కాదని  చెప్పేసరికి అనంత శ్రీరామ్ ఇప్పుడవన్నీ ఎందుకు చెప్పడం అంటూ సిగ్గు పడతారు. శ్రీముఖి నవదీప్ మాటలకు అనంత  శ్రీరామ్ ని ఆట పట్టిస్తుంది. బాగా చెప్పానా అనేసరికి నవదీప్ అబద్దాలు చాలు బాగున్నాయ్..అంటూ దణ్ణం పెట్టేస్తారు. అంతే  నవదీప్ నవ్వేస్తాడు.

భూష‌ణ్ కోసం తిలోత్త‌మ బ్యాచ్‌..విశాల్ ఆన్వేష‌ణ‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ఆద్యంతం ఆస‌క్తిక‌ర మలుపులు ట్విస్ట్ ల‌తో సాగుతూ విశేషంగా అల‌రిస్తోంది. ప‌విత్రా జ‌య‌రామ్‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు, విష్ణుప్రియ‌, భావ‌నారెడ్డి, శ్రీ‌స‌త్య‌, నిహారిక హ‌ర్షు త‌దిత‌రులు న‌టించారు. భూష‌ణ్ మిస్ట‌రీ త‌న‌ని వేధిస్తుండ‌టంతో అత‌ని గురించి విశాల్ తెలుసుకోవ‌డం మొద‌లు పెడ‌తాడు. ఈ క్ర‌మంలో అత‌ని అడ్ర‌స్ ల‌భిస్తుంది. ఇదే విష‌యాన్ని న‌య‌నితో చెబుతాడు. విశాల్ చెప్ప‌గాఏ ఒక్క‌సారిగా న‌య‌ని షాక్ అవుతుంది. అది గ‌మ‌నించిన విశాల్ అదేంటీ హ్యాపీగా ఫీల‌వుతావు అనుకుంటే అదేంటీ షాక్ అయిపోయావ్ అంటాడు. అంతే కాకుండా రేపు ఉద‌యాన్నే భూష‌ణ్ ని ప‌ట్టుకునే ఆప‌రేష‌న్ ని స్టార్ట్ చేస్తానంటాడు. ఈ విష‌యం తెలుసుకున్న తిలోత్త‌మ‌, క‌సి, వ‌ల్ల‌భ కంగారు ప‌డుతుంటారు. ఇదే స‌మంలో భూష‌ణ్ గ‌న‌క విశాల్ కి దొరికితే ఇదే రోజు మీ ప్రాణం పోతుందేమోన‌ని నాకు డౌట్ గా వుంద‌ని క‌సి కంగారు ప‌డుతూ వుంటుంది. అది అనుమానం కాదు నిజం అంటుంది తిలోత్త‌మ‌. మరెలా మ‌మ్మి త‌న‌ని అడ్డుకోవ‌డం అంటూ వ‌ల్ల‌భ చెబుతాడు. విశాల్ కంటే ముందే మ‌న‌మూ బ‌స్తీకి వెళ్లాలి అని తిలోత్త‌మ చెబుతుంది. అంతా మారు వేశాల్లో బ‌న్తీకి బ‌య‌లుదేర‌తారు. విశాల్ ఓ పక్క‌... తిలోత్త‌మ బ్యాచ్ మ‌రో ప‌క్క భూష‌ణ్ కోసం వేట మొద‌లు పెడ‌తారు. ఈ క్ర‌మంలో ముందు భూష‌ణ్ ఆచూకీ ఎవ‌రికి తెలిసింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

య‌ష్‌..వేద క‌ర్టెన్ లో రొమాన్స్‌..

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీనియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`.  నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా స్టార్ మాలో ప్ర‌సారం అవుతోంది. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల, ఆనంద్, వ‌ర‌ద‌రాజులు, సులోచ‌న‌, మిన్ను నైనిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. వేద‌కు, య‌ష్ కు మ‌ధ్య వున్న దూరంగా తొలగించి వారికి ద‌గ్గ‌ర‌చేయాల‌ని ఖుషీ ప్లాన్ చేస్తుంది. బాబాయ్ వ‌సంత్ తో క‌లిసి తాత‌య్య‌, నానమ్మ‌, కాంచ‌ల‌ని బ‌ట‌యికి తీసుకెళ్లాల‌ని, త‌ద్వారా య‌ష్ , వేద‌ల‌కు ప్రైవ‌సీ ల‌భిస్తుంద‌ని ప్లాన్ చేస్తుంది ఖుషీ. అనుకున్న‌ట్టుగానే అంద‌రిని వ‌సంత్ స‌హాయంతో బ‌య‌టికి తీసుకెళుతుంది. అదే స‌మ‌యంలో ఇంట్లో య‌ష్ , వేద వుండ‌గానే బ‌య‌ట తాళం వేయిస్తుంది. దీంతో ఇద్ద‌రు ఇంట్లోనే బందీ అయిపోతారు. ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య స‌ర‌దా సంభాష‌ణలు.. ఒక‌రికి గురించి ఒకరు తెలుసుకుంటారు. అదే క్ర‌మంలో ఇంట్లోకి దూరి దొంగ కార‌ణంగా మ‌రింత కామెడీ పుడుతుంది. ఇదిలా వుంటే వేద కర్టెన్ లు సర్దుతూ లాగ‌డంతో అవి మొత్తం వేద‌పై ప‌డ‌బోతుంటాయి. ఇది గ‌మ‌నించిన య‌ష్ వెంట‌నే వ‌చ్చి వేద‌ని ప‌క్క‌కు లాగేస్తాడు. ఈ క్ర‌మంలో వేద‌, య‌ష్ క‌ర్టెన్ ల‌లో చిక్కుకుని కింద‌ప‌డిపోతారు. ఇద్ద‌రికి క‌ర్టెన్ లు చుట్టేసుకుని కింద‌ప‌డివుంటారు. ఇద్ద‌రు ఒక‌రిని ఒక‌రు చూసుకుంటూ వుండ‌గా అదే స‌మంలో బ‌య‌టికి వెళ్లిన మాళిని, ర‌త్నం, కాంచ‌న ఇంటికి చేరుకుంటారు. క‌ర్టెన్ ల మ‌ధ్య‌లో చుట్టుకుని వున్న య‌ష్ , వేద‌ల‌ని చూసి షాక్ అవుతారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. మాళిని ఎలా రియాక్ట్ అయింది?...అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

శేఖర్ మాస్టర్ అంతలా మోసపోయాడా!?

శేఖర్ మాస్టర్ స్మాల్ స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. ఢీ షోకి జడ్జిగా చేసాడు. వెండి తెర మీద స్టార్ హీరోస్ కి కోరియోగ్రఫీ చేస్తూ అద్భుతమైన స్టెప్పులు వేయిస్తూ ఫుల్ బిజీ ఐపోయాడు. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే ఏ డాన్స్ ఐనా హిట్టే. అలా స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ అని తేడా లేకుండా, యూట్యూబ్ పెట్టి మూడు చేతులా సంపాదించేస్తున్నాడు. ఐతే ఎంత కష్టపడి సంపాదించినా కొన్ని సార్లు తెలిసిన వారి చేతిలోనే మోస పోతాం అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పి బాధపడ్డాడు.  కష్టపడిన సొమ్ము పొతే ఆ బాధ ఎవరూ తీర్చలేదని చెప్పుకొచ్చారు. తనకు తెలిసిన ఒక వ్యక్తి అతనికి తెలిసిన వాళ్ళను పరిచయం చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే దారిలో ఒక అద్భుతమైన  స్థలం ఉందని..దానికి మంచి రేట్ ఉందని, రాబోయే కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసరికి తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు అప్పు తెచ్చి మరీ డబ్బు మొత్తాన్ని వాళ్ళ చేతిలో పెట్టాడట శేఖర్ మాస్టర్. అదే టైంలో కరోనా, లాక్ డౌన్ వచ్చేసరికి ల్యాండ్ ని అమ్మేద్దామని వాళ్లకు చెప్పాడట శేఖర్.  ఇక వాళ్ళు కూడా ప్లేట్ ఫిరాయించేశారట. రేట్ లేదని ఇప్పుడు అమ్మొద్దని..వెయిట్ చేయమని ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ రెండేళ్లు గడిపేసి ఇప్పుడు అసలు ఫోన్ కూడా తియ్యడం లేదని జీవితంలో ఇదో పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకొచ్చాడు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న డబ్బు ..అమ్మా నాన్నలు సంపాదించింది ఏమీ లేదు..అంత కస్టపడి కూడబెట్టుకున్నది నేనే అంటూ ఎమోషన్ అయ్యాడు శేఖర్ మాస్టర్.  

హ‌గ్గు కోసం ఆది గోల‌.. పోటీకి దిగిన ర‌వికృష్ణ!

ఈటీలో ప్ర‌సారం అవుతున్న కిరాక్ డ్యాన్సింగ్ షో `ఢీ 14`. మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్ మెంట్స్ వారు స‌మ‌ర్పిస్తున్న ఈ డ్యాన్స్ షో గ‌త కొన్నేళ్లుగా టాప్ లో నిలుస్తూ టాప్ రేటింగ్ తో ట్రెండ్ అవుతూ వ‌స్తోంది. ప్ర‌దీప్ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోలో టీమ్ లీడ‌ర్లుగా హైప‌ర్ ఆది, ర‌వికృష్ణ, న‌వ్యా స్వామిలు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌డ్జెస్ గా శ్ర‌ద్దా దాస్‌, నందితా శ్వేతా, గ‌ణేష్ మాస్ట‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. డ్యాన్సింగ్ ఐకాన్ క‌ల‌ర్స్ స్పెష‌ల్ పేరుతో క‌ల‌ర్స్ థీమ్ డాన్స్ ఎపిసోడ్ ని ప్ర‌త్యేకంగా ప్లాన్ చేశారు. ఆగ‌స్టు 10న ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. ప్ర‌తీ డ్యాన్స్ జోడీ ఓ క‌ల‌ర్ థీమ్ లో డ్యాన్స్ చేయ‌డం ఆ ఎనిసోడ్ ప్ర‌త్యేక‌త.వైట్ థీమ్ లో ఓ జోడీ.. పింక్ క‌ల‌ర్ థీమ్ లో ఓ జోడీ.. డ్యాన్స్ అద‌ర‌గొట్టేశారు. ఇదే సంద‌ర్భంగా శ్ర‌ద్ధా దాస్ కు ఓ కంటెస్టెంట్ ముద్దు పెట్ట‌డంతో ఆది ఫీల‌య్యాడు. అది గ‌మ‌నించిన శ్ర‌ద్దా స్టేజ్ పైకి ఆదిని పిలిచింది. వెంట‌నే వెళ్లిపోయిన ఆది వెంట ఓ అమ్మాయి కూడా వెళ్లిపోయింది. ఏం జ‌రుగుతోంది ఇక్క‌డ అని హైప‌ర్ ఆదిని అడిగితే `ఢీ 14` తెలియ‌దా` అని పంచ్ వేశాడు. దాంతో అంతా న‌వ్వేశారు. ఆ త‌రువాత మీ మ‌ధ్య‌లో ఏం జ‌ర‌గుతోంద‌ని మ‌ళ్లీ అడిగింది. `చిన్న డీల్ జ‌రుగుతోంది అయిపోగానే పిలుస్తా `ని ఆది అనే స‌రికి మై న‌హీ జావుంగీ అని స‌ద‌రు అమ్మాయి కౌంట‌ర్ ఇచ్చింది. అయితే శ్రద్దా నేను క‌రూంగీ` అంటూ మ‌రో పంజ్ వేశాడు ఆది. ఆ త‌రువాత శ్ర‌ద్దా ద‌గ్గ‌రికి వెళ్లిపోవ‌డంతో కిస్ కాదు కానీ హ‌గ్ మాత్రం ఇస్తాన‌ని శ్ర‌ద్దా ఓపెన్ గా చెప్పేసింది.. దాంతో ఏదో ఒక‌టిరా అంటూ ఆదిముందుకు వెళ్లాడు.. అది గ‌మ‌నించిన ర‌వికృష్ణ అక్క‌డి వ‌చ్చేసి ఆదిని స్టేజ్ పై నుంచి కిందికి లాగేశాడు. దీంతో హైప‌ర్ ఆది ఈ రోజు శావాల్లేస్తాయి చెబుతున్నారు అంటూ వార్నింగ్ ఇవ్వ‌డం.. న‌వ్యాస్వామి ఎంట్రీ ఇచ్చి ఏంటిది అని ర‌వికృష్ణ‌ని అడ‌గ‌డం న‌వ్వులు పూయిస్తోంది.    

ఆ ఒక్క సీన్ తో శేఖర్ కథ మారిపోయింది!

శేఖర్ మాస్టర్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. అతని నేటివ్ ప్లేస్ విజయవాడ. ఐతే శేఖర్ మాస్టర్ కి అమ్మాయిల పిచ్చి ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేయడం ఎవరైనా అమ్మాయితో డాన్స్ చేస్తే సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రోల్ చేయడం వంటివి చూస్తూనే ఉన్నాం.  ఐతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను అలాంటివాడిని కాదు అంటూ చెప్పుకొచ్చాడు. హైపర్ ఆది స్కిట్ లో శేఖర్ మాస్టర్ ల ఒక రోల్ ఉందని అందులో అమ్మాయిలంటే పిచ్చి అన్నట్టుగా చూపించారు అని ఫీల్ అయ్యాడు. శ్రీముఖి తన బుగ్గ మీద పెట్టిన ముద్దుల విషయం గురించి అడిగేసరికి ఎందుకు తనలా ముద్దులు పెట్టిందో తెలీదని చెప్పాడు. ఆ ఒక్క సీన్ తో మొత్తం  తన మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చేశారని చెప్పారు. అమ్మాయిలంటే పిచ్చి అన్నట్టుగా చూపించడం స్టార్ట్ చేశారన్నారు.  శ్రీముఖి సడెన్గా వచ్చి ముద్దులు పెట్టేస్తే నేనేం చేయను అంటూ నవ్వాడు శేఖర్ మాస్టర్. ఢీ షోలో కనిపించే  కొన్ని కామెడీ బిట్స్ లో వచ్చే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ని జడ్జి గా ఉన్నప్పుడు కంట్రోల్ చేయలేదనే టాక్ వినిపించింది అని అడిగేసరికి. ఢీ అనేది డాన్స్ షో కాబట్టి అది మాత్రమే చూస్తాను. డాన్స్ కి డబుల్ మీనింగ్ అనేది ఏమీ ఉండదు కదా ఇక  కామెడీ స్కిట్స్ లో మసాలా అనేది లేకపోతే కామెడీ పండదు అనుకుంటారు కాబట్టి వాళ్ళు అది చేస్తారు. ఏదైనా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తే ఆఫ్ ది రికార్డు చెప్తాము కానీ ఆన్ స్క్రీన్ చెప్పం అని చెప్పుకొచ్చారు శేఖర్ మాస్టర్.  

బొమ్మలు హలీం అమ్మి చదువుకున్నాడు!

సరిగమప సింగింగ్ సూపర్ స్టార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న షో. ఇందులో ఈ వారం ముందుగా పార్వతి "కిటకిట తలుపులు" సాంగ్ పాడి ఫినాలే కి గోల్డెన్ టికెట్ అందుకుంది. తర్వాత డేనియల్ రాజు "నీ మనసే" అనే సాంగ్ పాడి స్టేజిని హుషారెత్తించాడు. డేనియల్ రాజు సాంగ్ ని ఈ షోకి వచ్చిన నవదీప్ కూడా స్టేజి ఎక్కి డేనియల్ తో కలిసి పాటందుకుని అందరినీ మెప్పించాడు. నా పాటకు ఎన్ని మార్కులు ఇస్తారంటూ కోటి గారిని కాసేపు ఆట పట్టించాడు. చాలా బాగా పడ్డావ్ అంటూ కోటి గారు మెచ్చుకుంటారు.  ఇక ఇదే స్టేజి మీదకు డేనియల్ రాజు ఫ్రెండ్ మూర్తిని స్టేజి మీదకు పిలుస్తుంది శ్రీముఖి. ఇక అతను డేనియల్ రాజు గురించి తాను లైఫ్ లో పడిన కష్టాలు గురించి చెప్పి అందరినీ కంట తడి పెట్టించాడు. డేనియల్ రాజు చాలా అంటే చాలా పేదరికం నుంచి తిండి కూడా సరిగా లేని పరిస్థితి నుంచి ఎదిగిన వ్యక్తిగా తన గురించి తెలియని ఎంతో మందికి చెప్పాడు. తాను చదువుకోవడానికి డబ్బులు కూడా లేనప్పుడు రెస్టారెంట్ లో పని చేసి వచ్చిన డబ్బులతో తాను చదువుకోవడమే కాదు తనను కూడా చదివించాడని చెప్పుకొచ్చారు మూర్తి. రంజాన్ టైంలో హలీం అమ్మడమే కాదు బొమ్మలు కూడా అమ్మి తన కోసం ఎంతో చేసాడని చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి తనకు పాటలు ఎంతో ఇష్టమని అందరిని తనంటే చాలా ఇష్టం అని చెప్పాడు.  ఇక ఒకానొక టైంలో తనకు తన చెల్లెలికి కష్టం వచ్చి రోడ్డు మీద ఉన్నప్పుడు మూర్తి మాత్రమే వచ్చి చెయ్యి ఇచ్చి ఆదుకున్నాడు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు డేనియల్. అందరి జీవితాలు పైకి కనిపించినంత అందంగా ఉండవని ఇలాంటి ఘటనలు చదివేటప్పుడు, వినేటప్పుడు అనిపిస్తుంది. ఎంతో ఇన్స్పిరేషన్ వస్తుంది.  

కళాపోషణకు ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు!

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం మస్త్ కామెడీని పండించింది. చిన్నప్పుడు చెంబు పట్టుకుని తప్పిపోయిన కొడుకును, కూతురిని వెతుక్కుంటూ కృష్ణ భగవాన్ ఈ షోకి జడ్జిగా వస్తాడు. అతని  పనోడి క్యారెక్టర్ లో బాబా భాస్కర్ నటించాడు. కొడుకుల్ని కనిపెట్టాలంటే  శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళను పిలిస్తే చాలు అంటాడు భాస్కర్. నా పిల్లలు దొరికితే నా ఆస్తి యావత్తు  ఇచ్చేస్తాను అని చెప్తాడు కృష్ణ భగవాన్ అలా చెప్పేసరికి యావత్తు అంటే బి.పి ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లా అని అడుగుతాడు. ఆ డైలాగ్ కి కృష్ణ భగవాన్ మళ్ళీ వేసావా పంచి అని అంటాడు .  అంటే ఇంతకుముందు పద్మకి వర్షకి ఆస్తి కొంత ఇచ్చేసా కదా ఇప్పుడు నా పిల్లలు వస్తే మిగతాది ఇచ్చేద్దామని అనేసరికి పద్మకి వర్షకి ఎం ఇచ్చారు అంటాడు భాస్కర్. ఆస్తిలే గాని కాస్త కళాపోషణ ఉండాలి అంటాడు భాస్కర్ తో. ఈ వయసులో కళాపోషణ ఏంటండీ నవ్వుతారు ఊరుకోండి అంటాడు. కళాపోషణకి ఎక్సపైరీ డేట్ లేదు అనేసరికి అందరూ నవ్వేస్తారు. పిల్లలు ఎలా వెళ్లిపోయారు చెప్పండి అని భాస్కర్ అడుగుతాడు.  చెంబు తీసుకుని కొడుకు వెళ్ళిపోయాడు తన చెంబు వెతుక్కుంటూ కూతురు కూడా వెళ్లిపోయిందని చెప్పేసరికి భాస్కర్ షాక్ అవుతాడు.  తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఇంద్రజని, రష్మిని పిలిపించి తన పిల్లలని వెతికే పని అప్పజెబుతాడు కృష్ణ భగవాన్. ఇలా ఈ వారం పంచ్ డైలాగ్స్ తో ఈ షో నడిచింది.  

అమ్మీ..నువ్ లేకుండా ఎలా బతకాలి నేను

మెహబూబ్ అనే పేరు బిగ్ బాస్ కి ముందు పెద్దగా తెలియకపోయినా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక చాలా ఫేమస్ అయ్యింది. షార్ట్ ఫిలిమ్స్ తో, ఆల్బం సాంగ్స్ తో మస్త్ పాపులర్ కూడా అయ్యాడు. అప్పుడప్పుడు టీవీ షోస్ లో కనిపిస్తూ యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ ఉంటాడు మెహబూబ్. రీసెంట్ గా మెహబూబ్ ఇంట్లో విషాదం నెలకొంది. మెహబూబ్ తల్లి మరణించింది. తన తల్లి సమాధి వద్ద నివాళులు అర్పిస్తూ తాను దిగిన ఫోటోని, తన తల్లితో కలిసి దిగిన  ఫొటోలని సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ పేజీలో  షేర్ చేసి చాలా బాధతో కూడిన ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు మెహబూబ్.   "అమ్మా.. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావ్‌. ఇప్పటినుంచి నేను ఎలా నిర్ణయాలు తీసుకోవాలి ? ప్రతిరోజూ నేను ఎవరితో మాట్లాడాలి ? అసలు నువ్వు లేకుండా నేను ఎలా  బతకాలో అర్థం కావడం లేదు. నా ప్రతి ప్రయాణంలో తోడు ఉన్నావు. నా ఎదుగులను చూసి నువ్వు  ఆనందించావు. ఇప్పుడు నువ్వు లేకపోతే మా జీవితాలు ఎటు వెళ్తాయో కూడా అర్థం కానీ పరిస్థితి నెలకొంది. నేను ప్రతీక్షణం నిన్ను మిస్‌ అవుతూనే ఉంటాను అమ్మీ. నాకు అసలు జీవితం అంటే ఏంటో నేర్పించావు. నువ్వు ఎక్కడున్నా నన్ను చూస్తూనే ఉంటావని నీ ఆశీర్వాదాలు అందిస్తావని  నాకు తెలుసు.  ఇకనుంచి నిన్ను మరింత గర్వపడేలా చేస్తాను. తమ్ముడిని, డాడీని బాగా చూసుకుంటానని నీకు మాటిస్తున్నాను. నా హృదయంలో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అమ్మీ. నిన్ను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాను ” అంటూ పెట్టిన  ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్స్ , మెహబూబ్ ఫ్యాన్స్, పలువురు యూట్యూబర్స్ ఆమెకు నివాళి అర్పించారు. అతను బాధపడకుండా చాలా స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.    

రెస్టారెంట్ ఓపెనింగ్ లో ఆది

హైపర్ ఆది ఏ షోలో ఉంటె ఆ షో పంచ్ డైలాగ్స్ కి పెట్టింది పేరు. ఆ షో రేటింగ్ కూడా అంతేలా పెరిగి పోతూ ఉంటుంది. బుల్లితెర మీద తిరుగులేని స్టార్ డం తో దూసుకుపోతున్నాడు. స్మాల్ స్క్రీన్ పై హైపర్ ఆది అంటే ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు.   ఆది వేసే పంచ్‌లు సెటైర్లు, ప్రాసలతో వేసే పంచ్‌లు మస్త్ పేలుతూ ఉంటాయి. అటు బుల్లితెర, ఇటు వెండితెర రెండింటిని సింగల్ హ్యాండ్ తో మ్యానేజ్ చేస్తున్నాడు. అటు వెండితెర నుంచి   ఆదికి  మెగా సపోర్ట్ కూడా ఉంటుంది. మెగా ఫ్యాన్స్ ఆదిని ప్రేమిస్తుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్  కూడా ఆది చెప్పలేనంత అభిమానం. అందుకే జనసేన కోసం ఎక్కువగా కష్టపడుతుంటాడు. ఆ అభిమానంతో జనసేన నుంచి పోటీ కూడా చేస్తానని ఛాన్స్ వస్తే అని చెప్పాడు ఆది.   ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై  ఆది రాకెట్ లా  దూసుకుపోతోన్నాడు. సుధీర్ స్టార్ మా కు వెళ్లిపోయాడు. ఐనా సుధీర్ హవా కూడా కాస్త తగ్గిందని చెప్పొచ్చు. అతని ప్లేస్ లో ఆది, రాంప్రసాద్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు.  మల్లెమాల షోలకు వచ్చినంత స్టార్ డం స్టార్ మా షోలకు ఉండదు.సుధీర్ లేకపోయేసరికి  ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఆది ఎదురులేకుండా దూసుకుపోతోన్నాడు. ఈ షోస్ లో తప్ప ఎక్కడ బయట కనిపించని ఆది ఇప్పుడు ఒక మండి ఓపెనింగ్ కి వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేసాడు.  ఇటీవల ఆది పుత్తూరు వెళ్లి అక్కడ ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసాడు ఆది. ఇంకా ఆ రెస్టారంట్ అంతా కూడా ఆది ఫాన్స్ తో నిండిపోయింది. ఆది టీమ్ తో సెల్ఫీ లు ఆ హడావిడితో ట్రాఫిక్ కూడా కాసేపు నిలిచిపోయింది. ఇలా ఆది ఇప్పుడు ఓపెనింగ్స్ కి వెళ్లడం స్టార్ట్ చేసినట్లే కనిపిస్తోంది.  

మా ఆయనకు రొమాన్స్ కి సంబంధమే లేదు అంటున్న ఖుష్భు

ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసేసింది. ఈ షోకి రైటర్ పద్మభూషణ్ మూవీ టీమ్ సుహాస్, టీనా ప్రొమోషన్ లో భాగంగా వచ్చేసారు. ఇక ఈ ఎపిసోడ్ లో మునిగినపాలెం స్కిట్ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత, ప్రవీణ్ కలిసి ఈ స్కిట్ వేశారు. ఇటీవల వస్తున్న వరదల బ్యాక్ డ్రాప్ లో ఈ స్కిట్ పెర్ఫార్మ్ చేశారు. నా ప్రేమ నీ విషయంలో హద్దు దాటినట్టు తుఫాన్ తీరం దాటింది కదా అందుకే ఈ వరదలు అంటాడు రాకేష్. సుజాత సిగ్గు పడుతూ ఉంటుంది. వర్షం పడినప్పుడే పిడుగులు ఎందుకు పడతాయ్..అని సుజాత అడిగేసరికి కొత్త జంట హగ్ చేసుకోవడానికి ప్రకృతి ఇచ్చే ఒక అవకాశం అనేసరికి ఖుష్భు తల పట్టుకుంటుంది. ఖుష్భు గారికి ఎక్కడో బాగా తగిలింది అనేసరికి  "లేదండి మా ఆయనకి  రొమాన్స్ కి ఎలాంటి సంబంధం లేదు అంటుంది " తర్వాత ఊరు మునిగిపోతూ ఉండే సరికి ప్రవీణ్ పడవేసుకుని వస్తాడు. ఎలాగైనా కాపాడాలని రాకేష్ అడిగేసరికి వెళ్లి ఆధార్ కార్డు జిరాక్స్ తెమ్మని చెప్తాడు. సుజాత, రాకేష్ ఇద్దరు కూడా నువ్వే నా ఆధార్ కార్డు అంటే నువ్వే నా ఆధార్ కార్డు అనుకుంటూ ఉంటారు. ఇంతలో మాన్ హోల్ అనే  పేరు ఎందుకొచ్చింది అని రాకేష్ అడిగేసరికి మాన్ తప్ప ఆ హోల్ లో ఎవరూ పట్టరు కాబట్టి మాన్ హోల్ అనే పేరొచ్చిందంటూ ప్రవీణ్ చెప్తాడు. ప్లీజ్ ఒక్క సారి పడవ ఆపండి నా సన్న పిన్ను చార్జర్ మర్చిపోయి వచ్చాను అంటాడు ఆ మాటకు అందరూ నవ్వేస్తారు. ఇంతలో ప్రవీణ్ పడవను పక్కన పెట్టి వరదల్లో నడుచుకుంటూ వస్తాడు. సర్ మీరు నీళ్ళల్లో ఎలా నడుస్తున్నారు అనేసరికి నాకు వీసా ఉంది నీళ్ళల్లో నేను నడగలను అంటూ పంచ్ డైలాగ్ వేస్తాడు. ఇంతలో వరదల్లో వాషింగ్ మెషిన్, టీవీ, ఫ్రిజ్ అన్ని కొట్టుకొస్తూ ఉంటాయి. దాంతో ప్రవీణ్ మీకు ఎం కావాలి వాటిని తీసుకెళ్లండి అనేసరికి రాకేష్ చెవిలోంచి పొగలొస్తుంటాయి. ఫైనల్ గా రాకేష్ ఎంటర్టైన్మెంట్ కొంచెం మిస్ అయ్యింది అనేసరికి ఓ లేశ ఓ లేశ అని పాట పడతాడు ప్రవీణ్. ఇంతలో పడవలోకి నీళ్లు వచ్చేస్తాయి. అదేంటి పడవలోకి నీళ్లు వస్తున్నాయి అనేసరికి అదేగా చెప్తున్నా హోల్ ఏసా హోల్ ఏసా అంటున్న కదా అనేసరికి అందరూ ఒక్కసారి షాక్ ఐపోతారు.

 శ్రీ‌ముఖిపై హైప‌ర్ ఆది, ఆటో రాంప్ర‌సాద్ ముద్దుల వ‌ర్షం!

శ్రీ‌ముఖి స్టేజ్ ఎక్కితే చేసే ర‌చ్చ మామూలుగా వుండ‌దు. అయితే అలాంటి త‌న‌తో హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ తోడైతే ఆ హంగామా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందే. `హాలో బ్ర‌ద‌ర్‌` పేరుతో ఓ షోని ఈ  ముగ్గురూ క‌లిసి నిర్వ‌హిస‌క్తున్నారు. ఈ షోలో శ్రీ‌ముఖి కోసం హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ చేసిన ప‌ని నెట్టింట వైర‌ల్ గా మారింది. షోలో హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ ల‌తో శ్రీ‌ముఖి ఓ గేమ్ ప్లాన్ చేసింది. సాంగ్ ప్లే చేస్తే ఆ పాట‌లో కొన్ని వ‌స్తువుల పేర్లు వ‌స్తాయి.. అవి తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టాల‌ని చెబుతుంది. దీనికి ఓకే అంటూ త‌లూపిన హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ `శంక‌ర్ దాదా జిందాబాద్‌`లో ఆక‌లేస్తే అన్నం పెడ‌తా.. అలిసొస్తే ఆయిల్ పెడ‌తా.. మూడొస్తే ముద్దులు పెడ‌తా..` అన‌డంతో వెంట‌నే శ్రీ‌ముఖిపై ముద్దుల వ‌ర్షం కురిపించ‌డానికి శ్రీ‌ముఖి వైపు ప‌రుగెత్తారు.. ఏం జ‌రుగుతోందో తెలిసేలోపే శ్రీ‌ముఖిపై ముద్దుల వ‌ర్షం కురిపించారు హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్. అయితే శ్రీ‌ముఖి బుగ్గ‌ల‌పై కాదు చేతుల‌పై హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ ముద్దులు పెట్టి షాకిచ్చారు. హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ చేసిన పనికి ఆగ్ర‌హంతో ఊగిపోయిన శ్రీ‌ముఖి వాళ్ల‌కి వెంట‌నే బుద్ధి చెప్పాల‌ని అక్క‌డే వున్న హీరో న‌వీన్ చంద్ర‌ను బావా అంటూ గ‌ట్టిగా పిలిచింది. ఆ పిలుపు విని వెంట‌నే స్టేజ్ పైకి వ‌చ్చేసిన న‌వీన్ చంద్ర బుగ్గ‌పై శ్రీ‌ముఖి ముద్దు పెట్టి షాకిచ్చింది. దీంతో న‌వీన్ చంద్ర తో పాటు హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ కూడా ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. రాఖీ పండుగ సంద‌ర్భంగా ఈటీవీలో `హ‌లో బ్ర‌ద‌ర్` పేరుతో ఓ స్పెష‌ల్ షోని ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీ‌ముఖి, హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఈ ఎపిసోడ్ రాఖీ ఫెస్టివ‌ల్ రోజు టెలికాస్ట్ కానుంది. 

బిగ్ బాస్ సీజ‌న్ 6 ఓటీటీలో కూడానా?

బుల్లితెర‌పై నెంబ‌ర్ వ‌న్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న షో బిగ్ బాస్. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని భాష‌ల్లో ప్ర‌సార‌మైన ఈ షో సూప‌ర్ హిట్ అనిపించుకుంది. మంచి క్రేజ్ ని, రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ ని ద‌క్కించుకుని హాట్ టాపిక్ గా మారింది. విమ‌ర్శ‌లతో పాటు ప్ర‌శంస‌లు ద‌క్కించుకుని వార్త‌ల్లో నిలిచింది. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సీజ‌న్ లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలీటీ షో 6వ సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. దీనికి ముందు ఓటీటీ వెర్ష‌న్ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక దారుణంగా ఫ్లాప్ అయింది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో 24 గంట‌ల పాటు ఓటీటీ వెర్ష‌న్ ని స్ట్రీమింగ్ కి పెట్టారు. ముందు మూడు నాలుగు రోజులు టెక్నిక‌ల్ అంశాల కార‌ణంగా ఓటీటీ రియాలిటీ షో నిరాశ‌ప‌రిచింది. ఆ త‌రువాత మొద‌లైనా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇదిలా వుంటే ప్ర‌స్తుతం బిగ్ బాస్ సీజ‌న్ 6 కోసం స‌న్నాహాలు మొద‌లు పెట్టారు. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న నేప‌థ్యంలో తాజాగా మేక‌ర్స్ కొత్త లోగోకు సంబంధించిన వీడియోని విడుద‌ల చేశారు. ఇదే సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌టికి వ‌చ్చింది. బుల్లితెర స్టార్ మాలో బిగ్ బాస్ సీజ‌న్ 6 ప్రసారం అవుతూనే ఓటీటీలోనూ 24 గంట‌ల వెర్ష‌న్ స్ట్రీమింగ్ కానుంద‌ట‌. అంటూ ఒకే షో రెండు చోట్ల రెండు ర‌కాలుగా ప్ర‌సారం కానుంద‌న్న‌మాట‌. టీవీలో గంట పాటు ప్ర‌సారం కానున్న ఈ షో ఓటీటీలో మాత్రం 24 గంట‌ల పాటు స్ట్రీమింగ్ కానుంద‌ని తెలిసింది. ఇందు కోసం డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ స‌న్నాహాలు చేస్తోందట‌. ఇక సీజ‌న్ 6 లో 17 నుంచి 18 మంది కంటెస్టెంట్ లు వుండే అవ‌కాశం వుంద‌ని, అంతే కాకుండా ఈ 18 మందిలో కామ‌న్ మ్యాన్ కూడా వుంటాడ‌ని ఇన్ సైడ్ టాక్‌.

ఏకాంతంగా చీక‌ట్లో.. య‌ష్‌, వేద‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టిస్తున్నారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మిన్ను నైనిక‌, ఆనంద్‌, సులోచ‌న‌, వ‌ర‌ద‌రాజులు త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు. కొంత కాలంగా స్టార్ మా లో న్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ ఆత్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. వేద‌, య‌ష్ ల మ‌ధ్య ప్రైవ‌సీ వుండాల‌ని, ఇద్ద‌రి మ‌ధ్య వున్న దూరం త‌గ్గించాల‌ని ఖుషీ ప్లాన్ చేస్తుంది. ఇంట్లో వాళ్లంద‌రికి బ‌య‌టికి వెళ‌దామ‌ని చెప్పి య‌ష్, వేద‌ల‌ని ఇంట్లో పెట్టేసి వారికి తెలియ‌కుండానే తాళం వేసి బ‌య‌టికి వెళ్లిపోతుంది. దీంతో ఒంట‌రిగా ఇంట్లో లాక్ అయిపోయిన య‌ష్ వేద ఏం చేయాలో తెలియ‌క ఆలోచిస్తూ వుంటారు. ఇదే స‌మ‌యంలో ఒక‌రి గురించి ఒక‌రు తెలుసుకుంటారు. ఒక‌రిపై ఒక‌రికున్న ప్రేమ గురించి ఒక‌రికి ఒక‌రు వ్య‌క్తం చేసుకుంటారు. ఆ త‌రువాత ఇద్ద‌రు కరెంట్ పోవ‌డంతో క్యాండిల్ లైట్ డిన్న‌ర్ చేస్తారు. ఆ త‌రువాత య‌ష్ కి నిద్ర వ‌స్తుంటుంది. ప‌వ‌ర్ లేక‌పోవ‌డంతో ఉక్క‌పోత‌తో ఇబ్బంది ప‌డుతూ వుంటాడు. అదే స‌మ‌యంలో వేద త‌న కొంగుతో విసురుతూ ప‌డుకోమంటుంది. ఇదే క్ర‌మంలో ఇద్ద‌రూ ఒక‌రి భుజంపై ఒక‌రు త‌ల పెట్టుకుని ప‌డుకుంటారు. ఇంత‌లో దొంగ ఎంట్రీ ఇస్తాడు. ఇద్ద‌రు ప‌డుకొని వుండ‌టంతో ప‌క్క‌నే కూర్చుని కామెడీ చేయ‌డం మొద‌లు పెడ‌తాడు. వెంట‌నే మెల‌కువ వ‌చ్చిన య‌ష్ వాడిని చూసి షాక్ అవుతాడు. య‌ష్ ని చూసిన దొంగ గ‌ట్టిగా అరిచేస్తాడు. ఆ అరుపులో వేద కు మెల‌కువ వ‌స్తుంది. ఆ త‌రువాత కూడా దొంగోడే దొంగ దొంగ అని అర‌వ‌డం మొద‌లు పెడ‌తాడు. దాంతో వేద అక్క‌డ‌కి నుంచి వెళ్లిపోయి వాడిని కొట్ట‌డానికి క్రికెట్ బ్యాట్ తీసుకొస్తుంది. అది చూసిన దొంగ ఏంటి సార్ మీ వైవ్ ఇంత వైలెంట్ గా వుందంటాడు. క‌ట్ చేస్తే మాళ‌విక‌, అభిమ‌న్యు.. కైలాష్ ని విడిపించేందుకు జైలుకు వెళ‌తారు. అయితే కైలాష్ క‌న్ను మాళ‌విక‌పై ప‌డుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

ముద్దులు, హగ్గుల కోసం అరుచుకున్న ఆది, రవికృష్ణ!

ఢీ 14 కలర్స్ స్పెషల్ ప్రోమో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఐతే ఈ ఎపిసోడ్ లో ముద్దుల గురించి హగ్గుల గురించి గొడవ పడతారు ఆది, రవికృష్ణ. శ్రద్ధ దాస్ ఆదిని తన సీట్ దగ్గరకు పిలుస్తుంది. ఇంతలో వెనకనే ఆది వైఫ్ గా తేజు వచ్చి ఎం జరుగుతుంది నీకు శ్రద్ధకి మధ్య అని అడుగుతుంది. ఢీ 14 జరుగుతుంది అంటాడు ఆది. మా ఇద్దరి మధ్య చిన్న డీల్ జరుగుతోంది కానీ నువ్వెళ్లు అంటాడు తేజుని. మై నై జావుంగి అంటుంది. వెంటనే శ్రద్ద వచ్చి కిస్ కాదు హగ్ ఇస్తాను అంటుంది. ఏదో వకటిరా త్వరగా ఇవ్వు , టైం లేదు అంటాడు ఆది తొందరపడుతూ.  ఈ ముద్దులు, హగ్గులు తతంగమంతా చూస్తూ రవికృష్ణ లేచొచ్చి గట్టిగా అరుస్తూ అడ్డుపడతాడు. ఆదికి కోపం వచ్చేసి మా ఇద్దరి మధ్యకి ఎవరన్నా అడ్డొస్తే ఈరోజు శవాలు లేస్తాయి అంటూ వార్నింగ్ ఇస్తాడు.  ఏ విషయంలో ఐనా గొడవ పెట్టుకోండి ఈ విషయంలో నా జోలికి రావద్దు అంటాడు రవికృష్ణతో ఆది. రవికృష్ణ వచ్చి ముందు హగ్ నాకు ఇచ్చేయండి శ్రద్ద గారు నేను ఆది కి పాస్ చేస్తా  అనేసరికి నవ్య స్వామి ఎంట్రీ ఇచ్చి హలో ఏమిటి రవి నువ్వు ఇలా తయారయ్యావ్ అంటుంది. అసలు నువ్వెలా ఉన్నావో చూసుకో ముందు అని నవ్యని తిడతాడు ఆది. వెంటనే తేజు వైపు చూసి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నీ మీదే శ్రద్ద పెడతా వన్స్ ఈ స్టేజి మీద ఉన్నానంటే శ్రద్ద దాస్ మీదే పెడతా అంటాడు ఆది. ఎవడిక్కాలి నీ బోడి శ్రద్ద అంటుంది సీరియస్ గా తేజు. అవును ఎవడిక్కాలి నాకు అవసరం లేదు పో అంటూ అరుస్తాడు తేజు మీద.