విష్ణుప్రియతో మానస్ ఆటాపాటా

మానస్ నాగులపల్లి ఇప్పుడు బుల్లి తెర మీద ఫేమస్ యాక్టర్. సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా, వీడియో అయినా అభిమానులను అలరించే అవకాశాన్ని మానస్ నాగులపల్లి అస్సలు వదులుకోడు. అలాంటి మానస్ త్వరలో విష్ణుప్రియతో కలిసి అలరించబోతున్నాడు.   'జరీ జరీ' అనే జానపద వీడియో సాంగ్ లో కనిపించబోతున్నాడు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్,  జడ్జి శేఖర్ మాస్టర్  కోరియోగ్రఫీ చేశారు. ఈ  పాటకు సంబంధించి  ఇప్పటికే తన లుక్‌ను మానస్ రిలీజ్ చేసాడు. కొన్ని స్పెషల్ టీవీ షోస్ లో కీర్తి కేశవ్ భట్‌తో కలిసి మానస్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్సులు అద్భుతంగా ఉంటాయి. ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా మానస్ మాత్రం డాన్స్ చేసే అవకాశాన్ని అస్సలు వదులుకోడు. ఇక ఇప్పుడు మానస్, విష్ణుప్రియ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ పై ఆడియన్స్ లో అంచనాలు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇక మానస్ కార్తీక దీపం సీరియల్ లో నటిస్తున్నాడు. అలాగే తాను  నటించిన వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే బాలీవుడ్ లో అరంగేట్రం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు మానస్.

డాక్టర్ బాబు మ‌ళ్లీ వ‌చ్చేస్తున్నాడు.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ!

'కార్తీక దీపం' సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరను, సోషల్ మీడియాని షేకాడించేసిన సీరియల్ ఇది. ఈ సీరియల్ కి మెయిన్ పర్సన్స్ డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత. వీళ్ళు లేకపోయేసరికి సీరియల్ కి అర్థ‌మే లేకుండా పోయింది. ఇది తెల్సుకున్న డైరెక్టర్ ఇప్పుడు కొత్త కొత్త మలుపులతో సరికొత్తగా మళ్ళీ ఒక్కో పాత్రను ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు వంటలక్క మేకప్ వేసుకుని రీఎంట్రీ ఇచ్చేసింది. ఆ ప్రోమో ఇప్పుడు బుల్లితెర మీద సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. నెగటివ్ రోల్ లో ఉండే మోనిత కూడా మళ్ళీ రావడానికి సిద్ధమౌతోంది.  ఇక డాక్టర్ బాబు కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని నిరుపమ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా అనౌన్స్ చేసేశాడు. "గెట్ రెడీ ఫోక్స్.. డాక్టర్ ఆన్ డ్యూటీ" అంటూ కాప్షన్ పెట్టి తలకు కట్టు కట్టుకున్న ఫోటో ఒకటి పోస్ట్ చేసాడు. ఇక ఈ పోస్ట్ చూసిన ఫాన్స్ అంతా ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది మాత్రం ఈ సీరియల్ ఇప్పుడు ఎలాంటి ట్రాక్ లో నడవబోతోంది అనే విషయం పై చర్చోపచర్చలు చేస్తున్నారు. ఐతే గతంలో డాక్టర్ బాబు "ఇంక సీరియల్ లోకి మళ్ళీ రాను.. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళైపోయారు కదా. వాళ్లకు తండ్రిగా చేయడం ఇష్టం లేదు" అని తన యూట్యూబ్ ద్వారా తన ఫాన్స్ కి బిగ్ షాక్ ఇచ్చారు.  ఐతే ఇప్పుడు రీఎంట్రీ ఇస్తూండేసరికి కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే, కొంతమంది మాత్రం 'అప్పుడు అలా చెప్పారు, ఇపుడు మళ్ళీ ఏమిటి' అంటున్నారు. ఇక ఈ రీఎంట్రీస్ తో 'కార్తీక దీపం' సీరియల్  రేటింగ్ మళ్ళీ పెరుగుతుందా ఇంతకుముందులా ఆడియన్స్ మళ్ళీ ఈ సీరియల్ ని ఆదరిస్తారా.. వేచి చూడాలి.

వీడే నా బంగార్రాజు..అషుని దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్

ఎవరి పిచ్చి వారికి ఆనందం అనే డైలాగ్ ప్రతీ రోజు ఎవరో ఒకరి దగ్గర వింటూ ఉంటాం. ఇప్పుడు ఆ డైలాగ్ అషుకి సూపర్ గా సరిపోతుంది అనిపిస్తోంది. అషు ఇప్పుడు ఒక పెట్ ని అడాప్ట్ చేసుకుంది. రష్మీ కూడా పెట్ లవర్. ఏ మూగ జీవానికి ఏదైనా ఐతే మాత్రం వెంటనే తన ఇన్స్టా పేజీలో ఆ విషయం గురించి ఒక పోస్ట్ పెట్టేస్తుంది.  ఇప్పుడు అషు కూడా రష్మీలా ఒక డాగ్ ని అడాప్ట్ చేసుకుంది. ఇక్కడి వరకు ఓకే. ఇక ఇప్పుడు పిచ్చి పీక్స్ కి వచ్చింది అంటున్నారు నెటిజన్స్ అషు పోస్ట్ చేసిన వీడియో చూసి. తన పెట్ పేరు రాజుగాడు అని చెప్తూ దానికి మేడలో నెక్లెస్, చేతులకు గాజులు తొడిగేసి సోఫాలో కూర్చోపెట్టి ఇద్దరూ తెగ ముద్దులు పెట్టేసుకున్నారు. "మై బంగార్రాజు..మీ మనసులోని ప్రేమను మీ పెట్స్ మీద చూపించండి..అవి ఎప్పుడు మీ ప్రేమను బ్రేక్ చేయవు" అంటూ ఒక టాగ్ లైన్ పెట్టేసింది. కుక్కకి నాగార్జున పేరు పెట్టింది అషు, కుక్క ఇలా మూతి నాకుతూ ఉంది..అది బ్రష్ చేయదు..కోవిడ్ లాంటి రోగాలు ఇందుకే వస్తాయి ..అంటూ  దారుణమైన కామెంట్స్ తో నెటిజన్స్ అష్షు ని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. సోషల్ మీడియాలో అష్షు ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ తో వార్తల్లో ఉంటూనే ఉంటుంది.

సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ శృతిక!

సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ ప్రోగ్రాం ముగిసింది. 26 వారాల పాటు అందరినీ అలరించింది. ఇక ఇండస్ట్రీకి కొత్త కొత్త గాయకులు ఈ వేదిక ద్వారా పరిచయమయ్యారు. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో లెజెండరీ సింగర్ సుశీల, నితిన్, శృతిహాసన్, కృతి శెట్టి పాల్గొన్నారు. ఈ షో మొత్తం ధూమ్ ధామ్ గా సాగిపోయింది. ఫైనల్ గా ఈ షో విన్నర్ గా హైదరాబాద్ కి చెందిన 20  ఏళ్ళ శృతిక సముద్రాలను అనౌన్స్ చేశారు కోటి. ఈమెకు మొదటి నుంచి గట్టి పోటీ ఇచ్చిన సుధాన్షు రన్నరప్ గా నిలిచాడు.  విన్నర్ ఏమేం గెలుచుకుంది అంటే..క్యాష్ ప్రైజ్ ఒక లక్ష, మారుతి సుజుకి కారు, ట్రోఫీ రాగా..సుధాన్షు కి 5 లక్షల క్యాష్ ప్రైజ్ వచ్చింది. చివరిలో విన్నర్ వర్డ్స్ చూస్తే తనకు ఈ షోలో పార్టిసిపేట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. తనను మెంటార్స్ కూడా చాలా ట్రైన్ చేశారని వాళ్లందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పింది. ఈ షో ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ గ్రాండ్ ఫినాలేలో తనతో పాటు సుధాన్షు కూడా బాగా పాడాడని కాబట్టి తనతో పాటు సమాన గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సింగర్ పార్వతి కూడా ఈ షో ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇలా సరిగమప షో ఎండ్ అయ్యింది.

డాన్స్ ఇండియా డాన్స్ కంటెస్టెంట్స్ తో డాన్స్ ప్రోమో

జీ తెలుగులో డాన్స్ ఇండియా డాన్స్ స్పెషల్ డాన్స్ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. "డ్యాన్స్ లో తమ సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్న కంటెస్టెంట్స్" అనే టాగ్ లైన్ తో జీ తెలుగు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇంకా ఈ ప్రోమో సాంగ్ కూడా ఫుల్ జోష్ తో నిండిపోయింది. ఈ డాన్స్ ప్రోమో యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వెంటనే ఎన్నో వ్యూస్ ని అందుకుంది. ఈ ప్రోమోలో సినీ యాక్టర్ సంగీత, కమెడియన్ రోహిణి, డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్, హోస్ట్ అకుల్ బాలాజీ తో కలిసి డాన్స్ చేసిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ డాన్స్ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్ నేమ్స్ కూడా ఈ ప్రోమోలో చూపించారు. డేవిడ్ అండ్ డేనియల్, ప్రజ్వల్ అండ్ దక్షిత, వినోద్ అండ్ గౌసియా, సోహానా అండ్ రక్షిత్, మైఖేల్ బాబు అండ్ కుమార్, వందన అండ్ పూజ, శరత్ అండ్ ఆయుషి, చెర్రీ అండ్ భూమిక, దివ్య అండ్ జల్ప గజ్జర్, అబ్బు అండ్ అక్షద.. వీళ్లందరితో కలిసి ఒక ఇన్స్పిరేషనల్ ప్రోమో సాంగ్ షూట్ చేసి కంటెస్టెంట్ నేమ్స్ ని కూడా ఆ ప్రోమోలో ప్రెజంట్ చేసింది డాన్స్ ఇండియా డాన్స్. ఇక ఈ షో ద్వారా ఇండస్ట్రీకి మరి కొంత మంది టాలెంటెడ్, యంగ్, డైనమిక్ కొరియోగ్రాఫర్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ షో ఆగష్టు 21 న రాత్రి 9 గంటలకు స్టార్ట్ కాబోతోంది.

మా ఊరి దేవుడు వచ్చేస్తున్నాడు!

మల్లెమాల టీమ్ ప్రతీ పండగను కాష్ చేసుకోవడంలో తన మార్క్ చూపిస్తూనే ఉంటుంది. అంతే కాదు తన ఆడియన్స్ ని మెప్పిస్తూ ఉండేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తుంది కూడా. కొంతకాలం క్రితం వరకు మల్లెమాల మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా వాటిని కాదని తన దారిలో తాను పోతోంది. ప్రతీ పండగకు కొత్తగా ఆలోచిస్తూ చేసే కార్యక్రమాలు చాలా కలర్ ఫుల్ గా జోష్ ఫుల్ గా ఉంటాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా వినాయక చవితి స్పెషల్ ప్రోమో రిలీజ్ చేసింది మల్లెమాల. "మా ఊరి దేవుడు" పేరుతో చేసిన ఈ ఈవెంట్ చేశారు.  ఈ ప్రోమోలో నాగినీడు, ఖుష్బూ, అన్నపూర్ణ, జయసుధ, ప్రగతి, ప్రదీప్, రష్మీ  ఇలా ఎంతో మంది కనిపించబోతున్నారు. ఇక ఇప్పుడు ఈ ప్రోమోలో కమెడియన్స్ అంత అవుట్ డోర్ షూటింగ్ చేశారు. పిచ్చి వాళ్ళుగా నటిస్తూ ప్రాంక్స్ చేసినట్టుగా కనిపిస్తోంది. అలాగే ఆది, రాంప్రసాద్, గెటప్ శీను అందరూ దుమ్ము రేపే పెర్ఫార్మెన్సులు ఇచ్చారు. డాన్స్ లతో స్టేజిని ఇరగదీసేసారు. ఇంద్రజ డాన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇక ఈ ఈవెంట్ ప్రోమో చూస్తుంటే ఫుల్ ఎంటర్టైన్ చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇక ఈ షోని ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నట్టుగా నాగినీడుతో చెప్పేస్తుంది మల్లెమాల టీమ్. ఇలా ఈ వినాయక చవితి షో మస్త్ ఎంటర్టైన్ చేయనుంది ఆడియన్స్ని.

మొగ్గలో జోకులు.. ఏం షోరా బాబూ ఇది!

ఇటీవలి కాలంలో బుల్లితెర పై అడల్ట్ కంటెంట్ అనేది ఎక్కువైపోయింది. ఏ షో చూసినా పొట్టి బట్టలు లేదా ఎక్స్పోజింగ్ లేదా డబుల్ మీనింగ్ డైలాగ్స్. ఇలా సాగుతున్నాయి షోస్. ఆ కోవలోకి వస్తుంది 'జాతిరత్నాలు' షో. ఇందులో స్టాండప్ కామెడీ కూడా కొంచెం హద్దులు దాటుతూ ఉంటుంది ఒక్కోసారి. కొందరైతే సోషల్ మీడియాలో వాడే కొన్ని పదాలు మరీ హద్దూ పద్దూ లేకుండా వాడేస్తున్నారు.  ఇక లేటెస్ట్ గా రిలీజ్ ఐన ప్రోమోలో ఎక్కువగా కుళ్ళు జోకులే వినిపిస్తున్నాయి. 'మొగ్గలో జోక్స్' పేరుతో ఒక కమెడియన్ నానా హంగామా చేసేసాడు. అందరూ విరగబడి నవ్వేసుకున్నారు. స్కూల్, స్టూడెంట్, టీచర్ పేరుతో ఒక కామెడీ చేశారు. "ఎవర్రా ఇక్కడ వరస్ట్ ఫెలో మొగ్గలో జోకులు వేస్తోంది" అని టీచర్ అడిగారు. దీంతో శ్రీముఖి, పంచ్ ప్రసాద్ విరగపడి నవ్వారు. "ఐ లవ్ దట్ మొగ్గ" అని ఆ స్టూడెంట్ అన్నాడు. ఈ మొగ్గ పేరుతో  కామెడీ చేస్తుంటే అక్కడ ఫన్ క్రియేట్ అవుతుంది. ఇల్లాంటి అడల్డ్ కామెడీ కంటెంట్‌ను అక్కడి వాళ్లంతా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా 'హెల్తీ కంటెంట్ ఉంటే ఎక్కువ పేరు వస్తుంది. అదే ఇలాంటి పిచ్చి కామెడీ ఉంటే గనక ఎక్కువ రోజులు ఇలాంటి షోస్ నడవవు' అని మేకర్స్ తెలుసుకోవాలి.

పూర్ణ ఎక్కడుంటే అక్కడ ముద్దులే ముద్దులు!

జబర్దస్త్ షోతో రష్మీ ఎలా ఫేమస్ అయ్యిందో, ఢీ షో ద్వారా పూర్ణ కూడా అంతే పాపులారిటీని సంపాదించుకుంది. ఢీ-14 డ్యాన్సింగ్ ఐకాన్ ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ వారం విలేజ్ షో టైటిల్ తో కంటెస్టెంట్స్ డాన్స్ పెర్ఫార్మెన్సులు ఇచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ కి 'వీ ఆర్ బ్యాక్' అంటూ పూర్ణ, అఖిల్ సత్తార్, జానీ మాస్టర్ స్టేజి మీదకి వచ్చారు. పూర్ణ `ఢీ` 13 సీజన్‌లో జడ్జ్ గా వ్యవహరించింది. ఈ షో వలన తనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయని  ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. చాలా క్యూట్ గా మాట్లాడుతూ అప్పుడప్పుడు అందంగా డాన్స్ చేస్తూ తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయింది. ఐతే ఢీ 14 సీజన్ నుంచి ఆమె కనిపించడం మానేసింది. తానే వెళ్లిపోయిందా.. పక్కకు తప్పించారా అనే విషయం మాత్రం సస్పెన్స్ గా మిగిలిపోయింది. ఐతే మళ్ళీ ఇన్నాళ్లకు ఈ షోకి రీఎంట్రీ ఇచ్చేసింది పూర్ణ. గణేష్ మాస్టర్ ప్లేస్ లో జానీ మాస్టర్, నందిత శ్వేత ప్లేస్ లో పూర్ణ వచ్చేసారు. ఐతే వీళ్ళ ఎంట్రీ పెర్మనెంటా లేదా టెంపరరీనా అనే విషయం మాత్రం ఇంకా తెలీదు. ఇక ఈ ఎపిసోడ్ లో పూర్ణ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ లో ఆర్నాల్డ్ అనే పిల్లాడి డాన్స్ కి ఫిదా ఐపోయిన పూర్ణ పిలిపించి మరీ ముద్దు పెట్టించుకుంది. ఆ సీన్ తో అందరూ షాక్ ఐపోయారు. తర్వాత దిషా అనే లేడీ డాన్సర్ వచ్చి "ఆ అంటే అమలాపురం" సాంగ్ కి ఇరగదీసే డాన్స్ చేసేసింది. ఈమె డాన్స్ కి అంద‌రూ విజిల్స్ వేశారు. పూర్ణ మాత్రం ఎక్కడా తగ్గేదే లే అంటూ ఆమెని పిలిచి మరీ బుగ్గ కోరికేసింది. అది మామూలుగా బుగ్గ కొరకడం కాదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'పూర్ణ ఎక్కడుంటే అక్కడ ముద్దుల గోలే.. నాటీ పూర్ణ' అంటున్నారు.

ఆది అంత పెద్ద విలనా?

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం కొత్త కొత్తగా అలరిస్తూనే ఉంది. రాబోయే వారం మాత్రం కాస్త స్పెషల్ గా ఉండబోతోందనే విషయం రీసెంట్ గా రిలీజ్ ఐన ప్రోమో చూస్తుంటే అర్థమౌతోంది. ఈ షోలో అప్పు మీద స్కిట్స్ , గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక ఈ ఎపిసోడ్ కి తీస్ మార్ ఖాన్ మూవీ త్వరలో రీలీజ్ అవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఆ మూవీ హీరో ఆది, హీరోయిన్ పాయల్ రాజపుత్ వచ్చారు. పాయల్ ని చూసేసరికి నాటీ నరేష్ వాట్ ఆ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అంటూ కంప్లిమెంట్ ఇస్తాడు. వెంటనే పాయల్ కూడా నరేష్ ని ముద్దు పెట్టుకుంటుంది. వెంటనే ఆది లైన్ లోకి వచ్చి "సేమ్ అదే ఇచ్చేరా మనకి కూడా" అంటూ పాయల్ ని అడిగేసరికి "యు ఆర్ మై బ్రో" అంటుంది. అంతే ఆదికి ఏం మాట్లాడాలో అర్థంకాక సైలెంటైపోతాడు. ఇక ప్రోమో ఫైనల్ ని చూస్తే గనక మనం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నామా లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తున్నామా అనే సందేహం కచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ లో ఎలిమినేషన్ రౌండ్ ని ఈ షోలో ప్రవేశపెట్టారు. ఇందులో రష్మీ, ఆటో రాంప్రసాద్, పూర్ణ, బులెట్ భాస్కర్, ఆది, పంచ్ ప్రసాద్ ఈ ఆరుగురు ఫోటోలు చూపించి ఈ ఫొటోస్ లో మీకు నచ్చని వాళ్ళు ఉంటె ఆ ఫోటోని చింపేయొచ్చు లేదా కాల్చేయొచ్చు అని చెప్తుంది. ఫస్ట్ రాంప్రసాద్ వచ్చి ఆది విషయంలో నేనొకసారి హర్ట్ అయ్యాను అంటూ ఆది ఫోటోని కాల్చి చెత్తబుట్టలో వేసేస్తాడు. తర్వాత పరదేశి వచ్చి ఆది అన్న అంటే అన్నీ ఆయనే అని చెప్తారు కానీ ఒక కారణం వలన ఇలా చేయాల్సి వస్తోంది అంటూ ఫోటోను ముక్కలు ముక్కలుగా చింపి చెత్తబుట్టలో వేస్తాడు. మరో పక్క ఆది బాధపడుతూ ఉన్నట్టు చూపిస్తారు. తర్వాత రష్మీ కూడా ఆది ఫోటోని చింపేస్తుంది. తాను శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిననప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ లో "ఎప్పుడొచ్చావు రష్మీ అని అడగలేదు..ఎప్పుడు వెళ్ళిపోతున్నావ్" అని ఆది అడిగారు. ఆ విషయంలో బాధపడ్డాను అని చెప్పింది. ఇక తర్వాత ఆదిని పిలిచి మీరు ఏ ఫోటోని కాల్చుతారు అని అడిగేసరికి సీరియస్ గా స్టేజి మీదకు వస్తాడు. ఐతే ఆది ఎవరి ఫోటోని తీసాడో చూపించకుండా ప్రోమో కట్ చేశారు. ఇంతకు ఆది ఎవరిని టార్గెట్ చేసాడు ? పోనీ అందరూ తన మీద వ్యతిరేకత చూపిస్తున్నారని తన ఫోటోని తానే కాల్చుకుంటాడా ? ఏ విషయం తెలియాలంటే 14 వ తేదీన ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ చూడాల్సిందే.

దయచేసి బాడీ షేమింగ్ చేయొద్దు..ఎవరినీ బాధపెట్టొద్దు!

బిగ్ బాస్ షోని రివ్యూస్ చేస్తూ సోషల్ మీడియాలో మస్త్ పేరు సంపాదించింది చిత్తూర్ అమ్మాయి గలాటా గీతూ రాయల్. టిక్‌టాక్ వీడియోలు చేస్తూ,  ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో కనిపిస్తూ , యూట్యూబ్‌ వీడియోస్ చేస్తూ ఈ బ్యూటీ మంచి  ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఇక ఈ మధ్య జబర్దస్త్ లో కూడా అడుగు పెట్టింది. ఐతే బిగ్ బాస్ సీజన్ 6 కి ఈమెను సెలెక్ట్ చేశారనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా తన యూట్యూబ్ ఛానల్ లో బాడీ షేమింగ్ గురించి ఒక వీడియో చేసి పెట్టింది.  అందులో లైవ్ లో మాట్లాడుతూనే ఫుల్ గా ఏడ్చేసింది. ఇంట్లో వాళ్లే కాదు, బయట వాళ్ళు కూడా తన బాడీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు బస్ట్ ఎక్కువని ఆ విషయం చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉందని, ఇష్టమైన డ్రెస్స్ వేసుకోలేకపోతున్నానని, చాలామంది తన వైపు వింతగా చూస్తారని బాధ పడింది. ఒక టైంలో తనకు బ్రెస్ట్ కాన్సర్ ఇవ్వు దేవుడా అని కూడా ప్రార్దించిందని అలా అన్నా డాక్టర్స్ బ్రెస్ట్ ని రిమూవ్ చేసేస్తే తనకి ఈ బాధలు ఉండవ్ కదా అని చెప్పింది.  అందరివల్లా తన బాడీ అంటే తనకు ఎప్పుడూ ఇష్టం ఉండదని కానీ కొంతమంది స్నేహితుల మాటలు విన్నాక అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు చెప్పుకొచ్చింది. "నువ్వంటే నువ్వే కానీ నీ శరీరం కాదు" అని తన ఫ్రెండ్ చెప్పిన మాటలను తన వీడియోలో ప్రెజంట్ చేసి దయచేసి ఎప్పుడూ బాడీ షేమింగ్ చేయొద్దు ఎవరిని అంటూ ప్రాధేయపడింది. జనాలు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని అస్సలు పట్టించుకోవద్దని చెప్పింది.  ఎవరి లైఫ్‌లో వాళ్లే హీరోలని, ఎవరికి వాడే తోపు అని గీతూ చెప్పింది. శరీరం పై అయిష్టత పెంచుకున్నవాళ్లను మోటివేట్ చేయండి కానీ ఇలా  బాడీ షేమింగ్‌పై కామెంట్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేసింది.  

ఓటిటి కన్నా యూట్యూబ్ చాలా డేంజర్

ఆలీతో సరదాగా షో కొత్త కొత్త అంశాలను బయటికి తెస్తూ ఉంటుంది. ఇక రాబోయే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి అశ్వినీదత్ గెస్ట్ గా వచ్చారు. ఈ షోలో అశ్వనిదత్ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఓటిటి వ్యవస్థ కారణంగా థియేటర్లకు ఎవరూ వచ్చే అవకాశం ఉండదు కదా దీనిపై మీ అభిప్రాయం అని ఆలీ అడిగేసరికి ఓటిటి ఎంత మాత్రం ప్రమాదకరం కానీ కాదు యూట్యూబ్ ఈజ్ టూ డేంజరస్ అని చెప్పారు. ఆలీ తో సరదాగా షోకి అశ్వనీదత్ వచ్చి ఇద్దరూ కొట్టుకున్నారు అని యూట్యూబ్ లో పెడితే చాలు అన్ని పనులూ ఆపేసి మరీ ఆ న్యూస్ ని చదివేస్తారు. ఇటీవలి కాలంలో చూస్తే స్ట్రైక్ అవి ఎక్కువయ్యాయి అని అడిగేసరికి మరి థియేటర్స్ రన్ అవ్వట్లేదు కదా. ఇండస్ట్రీ మొత్తాన్ని ముగ్గురు నలుగురు తమ చేతుల్లో పెట్టుకుని అన్ని థియేటర్స్ ని బ్లాక్ చేసేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్ k సినిమా షూటింగ్ మొత్తం ఐపోయినట్టేనా అన్న ప్రశ్నకు చాలా వరకు పూర్తయ్యింది స్ట్రైక్స్ అవీ లేకపోతే షూటింగ్ పూర్తయ్యేది అన్నారు. ఇండస్ట్రీలో భారీ నిర్మాత అంటే అశ్వని దత్ పేరే చెప్తారు మరి మీరెందుకు నిరాశకు గురౌతున్నారు అన్న ప్రశ్నకు శక్తీ మూవీ తన లైఫ్ లో కోలుకోలేని దెబ్బ తీసిందని..ఆ మూవీ రిలీజ్ అయ్యాక వాళ్ళ నాన్న చనిపోవడం, రజనీకాంత్ గారు మాట వినకపోవడం, తన భార్య మాటల్ని లక్ష్య పెట్టకపోవడం అన్ని కలిసి తనని శక్తి హీనుడిని చేశాయని చెప్పుకొచ్చారు. బెస్ట్ ప్రొడ్యూసర్ స్వప్ననా, అశ్విని దత్త అని అడిగేసరికి ఈ తండ్రైనా తమ పిల్లలు తమని డామినేట్ చేస్తే చూడాలని అనుకుంటారు కదా నేను అంతే అని నవ్వేశారు అశ్వని దత్.

హ‌గ్గుల‌తో, ముద్దుల‌తో రెచ్చిపోయిన రాకేశ్‌-సుజాత‌!

జబర్దస్త్ లో ఈమధ్య లవ్ ఎపిసోడ్స్ మస్తుగా బయటపడుతున్నాయి. ఈ షోలో ప్రేమలో పడిన వాళ్ళు దూసుకుపోతూ పెళ్లిళ్ల వరకు వెళ్తూ మిగతా షోస్ కి జంటలు జంటలుగా వెళ్తున్నారు. అలాంటి లవ్ స్టోరీ ఇప్పుడు రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాతది. వీళ్ళ ప్రేమ పీక్స్ కి వెళ్ళింది. ఇటీవల వరలక్ష్మి వ్రతం సందర్భంగా సుజాత వెళ్లి రాకేష్ ఇంట్లో పూజ కూడా చేసేసింది. పెళ్లి కాకుండా ఆ ఇంట్లో పూజలేంటి అన్నవాళ్లకు మా మనసులు ఎప్పుడో కలిశాయని చెప్పకనే చెప్పేసింది. ఇక ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా 'శ్రావణ సందడి' పేరుతో ఈటీవీలో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి 7 గంటలు ప్రసారం చేయబోతున్నారు. ఈ షోకి అనసూయ, రవి హోస్టింగ్ చేశారు. అలాగే సినీ న‌టుడు నవీన్ చంద్ర కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఇంకా ఈ షోలో ఎన్నో ఈవెంట్స్ కూడా నిర్వహించనున్నారు. ఐతే ఈ షోలో సుజాత, రాకేష్ తమ నిజమైన ప్రేమను చూపించేసి ముద్దులు పెట్టేసుకునేసరికి వీళ్ళ వ్యవహారం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. "షో కోసం షో చేసే జంట కాదు, మాది జీవితాంతం కలిసి ఉండే జంట" అంటూ రాకేష్ ఈ షోలో సుజాతకు ప్రపోజ్ చేస్తాడు. ఇలా  అందరి ముందు తమ ప్రేమని బయటపెట్టేసి ముద్దులతో, హగ్గులతో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఆ సీన్స్ తో కట్ చేసిన ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. జబర్దస్త్, బిగ్‌ బాస్‌, టీవీ ఆర్టిస్టులు, సింగర్లు ఈ షోలో పాల్గొన్నారు. ఇక ఈ ప్రోమోలో అమ్మాయిలకు, అబ్బాయిలకు  మధ్య పోటీలు జరిగాయి.  ఎవరు గొప్ప అనే విషయంలో, ఒకరి మధ్య ఒకరికి పోటీ బాగా జరిగింది. అలాగే  పంచ్‌లు, సెటైర్లు వేసుకుంటూ ఆద్యంతం నవ్వులు పూయించారు. అనసూయ గ్రీన్ కలర్ శారీలో  శివగామిని గుర్తుచేసింది. ఇలా ఈ షో నెక్స్ట్ వీక్ అందరిని ఫుల్ ఎంటర్టైన్ చేయనుంది.

సంద‌డిగా పల్లవి సీమంతం వేడుక!

'పాపే మా జీవన జ్యోతి' సీరియల్ తో పల్లవి రామిశెట్టి ఫేమస్ అయ్యింది. ‘రంగుల కల’ అనే షో ద్వారా బుల్లితెర పైకి అడుగుపెట్టింది పల్లవి. ఈ షో సక్సెస్ అయ్యేసరికి మరిన్ని ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. 'భార్యామణి', 'ఆడదే ఆధారం' సీరియల్స్ తో పల్లవి మరింతగా  పాపులర్ అయ్యింది.  'భార్యామణి' సీరియల్ లో ఉత్తమ నటనకు గాను నంది అవార్డును కూడా గెలుచుకుంది పల్లవి. తర్వాత ‘మాటే మంత్రం’సీరియల్ లో వసుంధరగా తెలుగు ఆడియన్స్ ని అలరించింది. ప్రస్తుతం 'అత్తారింటికి దారేది', 'పాపే మా జీవన జ్యోతి' సీరియల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.  ఈమె సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటుంది. అందుకే పల్లవికి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ కూడా పెద్దగా తెలియవు. ఐతే ఇటీవల తన సీమంతం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్లిన వాళ్లంతా ఈ హడావుడిని షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి పల్లవి గురించి తెలిసింది. ఇక బుల్లి తెర నటులు ఈ వేడుకకు హాజరయ్యారు. తల్లి కాబోతున్న పల్లవికి నెటిజన్స్  శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. పల్లవి 2019 మే 23న దిలీప్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 

నా చివరి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ - 2 !

ఆలీతో సరదాగా షోకి ఎంతో మంది ఫేమస్ పర్సన్స్ వస్తూ ఉంటారు. అలాంటి ఇంటెలెక్ట్యువల్స్ లో అశ్వనీ దత్ ఒకరు. ఇక ఈ షోకి సంబంధించి రాబోయే వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. గౌరీశంకరుల కథ సినిమా షూటింగ్ టైంలో ఇండస్ట్రీలో ఏదో ఇన్సిడెంట్ జరిగిందట కదా ఏమిటది అని ఆలీ అడిగేసరికి సింగీతం ఒక వైపు , కేవీ రెడ్డి ఒక వైపు ఉన్నారట. ఇంతలో ఒక పాము సెట్ లోకి వచ్చిందట. సింగీతం గారు పాము అనేసరికి వదలండి బ్రదర్ వారే వస్తారు ఇక్కడికి అన్నారట సీనియర్ ఎన్టీఆర్.  ఆయన ఎవరినైనా అలా గౌరవంగా పిలుస్తారన్నారు. సీనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి మీరు ఎందుకు వెళ్ళలేదు అనేసరికి పార్టీ అభిమానిగా ఉన్నాను, ఒక మెంబర్ గా ఉన్నాను తప్ప ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని ఎప్పుడూ అనిపించలేదన్నారు. ఇంకా వైజయంతి బ్యానర్ నుంచి ఎలాంటి సినిమాలను ఎక్స్పెక్ట్  చేయొచ్చు అనేసరికి మైండ్ లో అనుకుంటున్నాను కానీ ముందుకు వెళ్లడం లేదు...అదే నా ఆఖరి చిత్రం అని నా మైండ్ లో డిక్లేర్ చేసుకున్నా అది జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2  తీద్దామని అనుకుంటున్నా అని చెప్పారు. కృష్ణుడి రూపంలో ఉండే సీనియర్ ఎన్టీఆర్ ని ఎప్పటికీ దైవంగానే భావిస్తానన్నారు అశ్వనీ దత్. అప్పట్లో ఎదురులేని మనిషి సినిమాకు 16  లక్షలు అయ్యాయని చెప్పేసరికి ఈ రోజుల్లో ఆ మొత్తాన్ని  వాళ్ళ మేకప్ మెన్స్ కి ఇస్తున్నారు కదా అంటూ ఆలీ పంచ్ వేస్తాడు. జాతిరత్నాలు సినిమా కథ విన్నారా అని అడిగేసరికి చెప్పడానికి అక్కడ కథ ఉంటేగా అన్నీ కామెడీ సీన్స్ మాత్రమే తర్వాత మూవీ రిలీజ్ అయ్యాక థియేటర్ లో చూస్తే పడీ పడీ నవ్వుకున్నా అని చెప్పారు అశ్వనీదత్ .

విశాల్ చూస్తుండ‌గానే భూష‌ణ్ పై తిలోత్త‌మ దాడి!

చందూ గౌడ‌, అషికా గోపాల్ జంట‌గా న‌టించిన సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. గ‌త కొన్ని వారాలుగా ప్రసారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ఆద్యంతం ట్విస్ట్ లు, ట‌ర్న్ ల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. ప‌విత్రా జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, ద్వారకేష్ నాయుడు, అనిల్ చౌద‌రి, ప్రియాంకా చౌద‌రి, విష్ణు ప్రియ‌, భావ‌నా రెడ్డి, శ్రీ‌స‌త్య‌, సురేష్ చంద్ర‌, జ‌య‌ల‌లిత‌, చ‌ల్లా చందు త‌దిత‌రులు న‌టించారు. సూప‌ర్ నేచుర‌ల్ డ్రామాగా రూపొందిన ఈ సీరియ‌ల్ ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో ఆక‌ట్టుకుంటోంది. గురువారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుంద‌న్న‌ది ఒక‌సారి చూద్దాం. భూష‌ణ్ ఎక్క‌డున్నాడో తెలుసుకోవాల‌ని బ‌స్తీలోకి ఎంట్రీ ఇచ్చిన విశాల్ త‌న‌ని వెతుకుతూ గ‌ల్లీ గ‌ల్లీ గాలిస్తుంటాడు. ఇదే స‌మ‌యంలో భూష‌ణ్ త‌మ‌కే క‌నిపించాల‌ని తిలోత్త‌మ‌, క‌సి, వ‌ల్ల‌భ మారు వేషాల్లో వెతుక‌డం మొద‌లు పెడ‌తారు. ఇదే స‌మ‌యంలో న‌య‌ని కూడా బ‌స్తీలోకి ప్ర‌వేశిస్తుంది. భూష‌ణ్ విశాల్ కి కానీ, తిలోత్త‌మ బ్యాచ్ కి గానీ దొరక్కూడ‌ద‌ని న‌య‌ని వెత‌క‌డం మొద‌లు పెడుతుంది. ఈ క్ర‌మంలో భూష‌ణ్ ని వెతుకుతున్నార‌ని అత‌ని భార్య‌కు తెలియ‌డంతో అక్క‌డి నుంచి పారిపోవాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. అయితే ఓ పోల్ ప‌క్క‌న కూర్చున్న భూష‌ణ్ ..తిలోత్త‌మ కంటప‌డ‌తాడు. వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలింద‌ని భావించిన తిలోత్త‌మ ప‌క్క‌నే వున్న ఐర‌న్ రాడ్ తో భూష‌ణ్ ని హ‌త్య చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. తిలోత్త‌మ ..భూష‌ణ్ పై దాడి చేస్తున్న దృశ్యాల‌ని విశాల్ క‌ళ్లారా చూస్తాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  భూష‌ణ్ ని తిలోత్త‌మ హ‌త్య చేసిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.      

శ్రీమతి శ్రీనివాస్ హీరో పై వేటు!

స్టార్ మా ఛానెల్ లో శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఇందులో ఇప్పుడు శ్రీనివాస్ గా చేస్తున్న చందన్ కుమార్ ని తప్పించి మరో కొత్త హీరోని తెర మీద ప్రవేశ పెట్టారు. శ్రీదేవి బాధగా ఉండగా శ్రీనివాస్ వచ్చి ఆమెను హగ్ చేసుకుంటాడు. అందులో అసలు శ్రీనివాస్ లేకపోయేసరికి ఆడియన్స్ అంతా నిరాశను వ్యక్తం చేసున్నారు. కొత్త హీరో బాలేదని, పాత హీరోనే కంటిన్యూ చేయాలంటూ వాళ్ళ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఐతే చందన్ కుమార్ ఇటీవల షూటింగ్ టైంలో టీంతో జరిగిన వివాదం కారణంగా ఈ హీరో మార్పు అంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై చందన్ కుమార్ కూడా ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కి వెళ్తూ వస్తూ షూటింగ్స్ చేయాలంటే టైం సరిపోవడం లేదన్నారు. ఇదే టైములో వాళ్ళ అమ్మకు ఆరోగ్యం సరిగా లేక హాస్పిటల్ లో చేర్చినట్లు చెప్పారు. హాస్పిటల్ లో ఉంటూ సరైన నిద్ర లేక షూటింగ్ టైంలో  కాస్త రెస్ట్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అదే టైంలో షూటింగ్ టీమ్ నుంచి ఒక అసిస్టెంట్ వచ్చి పిలిచేసరికి ఒక ఐదు నిమిషాలు ఆగి వస్తానని చెప్పు అంటూ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగా అలా సరదాగా తోసాను తప్ప అదేదో కావాలనో, కోపంతోనో కాదు అన్నాడు. అతనేమో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని డైరెక్టర్ వరకు వెళ్లి చెప్పేసరికి మొత్తం టీమ్ అంతా వచ్చి తన మీద దాడి చేసినట్లు చెప్పాడు. ఆ టైంలో నాకు ఎవరూ సపోర్ట్ గా కూడా లేరు. నేను ఒంటరినైపోయాను. నాకు తెలుగు భాష కూడా అంతగా రాదు.  అందుకే అసలు ఏం జరిగిందో అనే విషయాన్ని సరిగా వివరించి చెప్పలేకపోయాను అని అన్నారు. సీరియల్ మధ్యలో క్యారక్టర్ రీప్లేస్మెంట్ గురించి అడిగేసరికి తనకు కొంచెం విశ్రాంతి అవసరం అని ఇక ముందు శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ లో కనిపించను అని చెప్పారు చందన్ కుమార్ ". ఈ ఘటన తర్వాత టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ చందన్ పై జీవితకాల నిషేధం విధించింది.  

వంటలక్క వచ్చేస్తుందోచ్ ...ఆనందంలో అభిమానులు!

కార్తీక దీపం సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ ఫాన్స్ వున్నారు. ఈ సీరియల్ గురించి తెలియని వారే వుండరు. ఈ సీరియల్ కి వచ్చిన రేటింగ్ మరే సీరియల్ కి కూడా రాదు. వంటలక్క, డాక్టర్ బాబు ఈ సీరియల్ ద్వారా మస్త్ ఫేమస్ అయ్యారు. దీంతో వాళ్ళ అసలు పేర్లు కూడా మర్చిపోయారు ఆడియెన్సు.  దాదాపుగా నాలుగేళ్ల పాటు సాగిన ఈ సీరియల్ ఇపుడు పిల్లలు పెద్దవాళ్ళైపోయి వాళ్ళతో సీరియల్ ని నడిపిస్తున్నారు. దీప చనిపోయినట్టుగా చూపించి సీరియల్ నుంచి తప్పించేసరికి ఆ సీరియల్ కి వున్న రేటింగ్ అమాంతం పడిపోయింది. ఇలాంటి తరుణంలోనే కార్తీకదీపం అభిమానులు గుడ్ న్యూస్ అంటూ తెలిపింది దీప. కార్తీక దీపం సీరియల్ లో తాను రీఎంట్రీ ఇస్తున్నట్టుగా ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ స్టేటస్ లో పెట్టింది.  "వస్తున్నా మీ కోసం" అంటూ మేకప్ చేసుకుంటున్నట్టుగా ఉన్న ఒక ప్రోమోని  పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన  ఆమె అభిమానులు ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ వంటలక్క మీతో పాటు డాక్టర్ బాబును కూడా వెంట తీసుకురండి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.  

నా కామెడీ, స్టైల్ వెనక సీక్రెట్ ఇదే!

సుడిగాలి సుధీర్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇలా టీవీ షోస్ తో పాటు సుధీర్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. రాఘవేంద్రరావు "వాంటెడ్ పండుగాడ్" మూవీలో నటించాడు. శ్రీధర్ పీసాన డైరెక్షన్ లో ఈ మూవీలో సుధీర్ కి  దీపికా పిల్లి జంటగా నటిస్తోంది. ఈ మూవీ ఈ నెల 19 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో బాగా పాల్గొంటున్నారు సుధీర్ అండ్ టీమ్.  ఈ ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ కి ఒక ప్రశ్న ఎదురయ్యింది. కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ వెనక ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగేసరికి తానేమీ బై బర్త్ యాక్టర్ ని కాదు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా తాను ఎదుటి వాళ్ళ స్టయిల్ ని కాపీ కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటానని చెప్పుకొచ్చాడు.  ముఖ్యంగా బ్రహ్మానందంగారు, శ్రీనివాస్ రెడ్డి కామెడీ టైమింగ్ ను మిక్స్ చేసి తానూ  కొత్తగా ప్రెజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటానని చెప్పాడు. ఇక తన స్టైల్ లో రజినీకాంత్ గారు, డ్యాన్స్ లో చిరంజీవి గారు, రియల్ లైఫ్ బిహేవియర్ లో పవన్ కళ్యాణ్ గారు ఇలా అందరి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటున్నానని చెప్పాడు. ప్రస్తుతం సుధీర్ మాట్లాడిన ఈ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వాంటెడ్ పండుగాడ్ మూవీలో సునీల్, అనసూయ, విష్ణుప్రియ, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు.  

రవి ప్రపోజ్ చేస్తే ఏం చెప్తుంది నవ్యస్వామి!

ఢీ - 14 డ్యాన్సింగ్ ఐకాన్ కలర్స్ షో ఫుల్ ఎంటర్టైన్ చేసేసింది.  ఫస్ట్ టు రౌండ్స్ తో కిస్సి, మహాలష్మి విన్ అవుతారు. తరవాత నవస్వామి, రవికృష్ణ టీమ్ ఓడిపోయేసరికి వాళ్లకు ఒక టాస్క్  ఇస్తారు గణేష్ మాస్టర్. నవ్యస్వామి మిమిక్రీ ఆర్టిస్ట్ అని ప్రదీప్ చెప్పేసరికి బాలయ్య బాబులా డైలాగ్ చెప్పమని అడుగుతారు. "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్" అనే డైలాగ్ చెప్పి తొడ కొడుతుంది నవ్య. తర్వాత కన్నడ సూపర్ స్టార్ యష్ డైలాగ్ చెప్పమని అడిగేసరికి "వయోలెన్స్ వయోలెన్స్ " అనే డైలాగ్ చెప్పేస్తుంది నవ్య.  నవ్య డైలాగ్ డెలివరీలో ఆది మిడిల్ లో వచ్చేసరికి అతన్ని కూడా స్టేజి మీదకు పిలిచి మోహన్ బాబు డైలాగ్ చెప్పమని అంటారు. "అరిస్తే చరుస్తా" అంటూ మంచి ఫోర్స్ లో డైలాగ్ చెప్పేస్తాడు ఆది. నవ్యస్వామి వెంటనే నీ ఫ్లూటు జింక ముందు ఊదు నా ముందు కాదు అంటుంది. జింక ముందు ఊదు అంది అంటే నవ్యస్వామి గాడిదా ఏమిటి అంటాడు. ఇలా తిట్టుకుంటున్నప్పుడు  కెమెరా ముందు ఆది, నవ్య టామ్ అండ్ జెర్రీ కెమెరా వెనక మంచి ఫ్రెండ్స్ అంటాడు రవికృష్ణ.  సరే ఇప్పుడు నువ్వు మీ ఇద్దరిది ప్రేమ, పెళ్లా ఫ్రెండ్స్ ఇందులో ఏది నువ్వు వచ్చి స్టేజి మీద చెప్పు అనేసరికి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటాడు రవి . మా ఇద్దరి మధ్య ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉంది అని రవి అంటే ఫ్రెండ్షిప్ అంటే లవ్ , ఎమోషన్స్ అన్నీ ఉంటాయి అంటోంది నవ్య అని ఆది అంటాడు. నవ్య నా లైఫ్ లోకి వచ్చింది కాబట్టి తనకు థ్యాంక్స్ చెప్పాలి అంటాడు. అతని లైఫ్ లోకి వెళ్ళావా మరి ఫ్రెండ్స్ అంటారేంటి అంటాడు ఆది. ఒక వేళా ఎప్పుడైనా రవి నీకు ప్రొపోజ్ చేస్తే నువ్వేం చెప్తావ్ అని నవ్య ని అడిగేసరికి నా పర్సనల్ విషయం అంటుంది. అర్దమయ్యిందిలే మీ పర్సనల్ ఎంతో అంటూ వెళ్ళిపోతాడు.