ఇమ్మూ కాదంటే ఊపిరి ఆగిపోతుంద‌న్న వ‌ర్ష‌!

ఖ‌త‌ర్నాక్ కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్`. ఈ షోలో ప్రేమ జంట‌ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ గ‌త కొంత కాలంగా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఢీ డ్యాన్స్ షోతో పాటు జ‌బర్ద‌స్త్ కామెడీ షోలోనూ సుడిగాలి సుధీర్, రష్మీ గౌత‌మ్ ల జోడీ ఏ స్థాయిలో పాపుల‌ర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయిలో మ‌రి కొన్ని జంట‌లు వార్త‌ల్లో నిలుస్తున్నాయి. అందులో ఇమ్మానుయేల్‌, వ‌ర్ష‌ల జంట ముందు వ‌రుస‌లో నిలుస్తోంది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య గ‌త కొంత కాలంగా ల‌వ్ ట్రాక్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. వీరి ప్రేమాయ‌ణం కామెడీనా?  లేక సీరియ‌స్ గానే వీరు ప్రేమ‌లో వున్నారా? అని చాలా రోజులుగా అంద‌రిలో అనుమానం వుంది. అయితే తాజాగా ఈ విష‌యంలో ఎలాంటి అనుమానం అవ‌స‌రం లేద‌ని వ‌ర్ష క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. గ‌తంలో కొన్ని వారాల పాటు జ‌బ‌ర్ద‌స్త్ కు దూరంగా వుంటూ వ‌చ్చిన వ‌ర్ష మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇమ్మానుయేల్ కు దూరంగా వుంటూ వ‌చ్చింది. దీంతో వీరి ల‌వ్ ట్రాక్ బెడిసి కొట్టిందా? అంటూ నెట్టింట ట్రోల్స్ వినిపించాయి. అయితే వాటికి చెక్ పెడుతూ వ‌ర్ష తాజా ఎపిసోడ్ లో క్లారిటీ ఇచ్చింది. ఇద్ద‌రి మ‌ధ్య వున్న ప్రేమ‌ని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది. ఇమ్మానుయేల్ లేక‌పోతే తాను బ‌త‌క లేన‌ని చెప్పేసి షాకిచ్చింది.   తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు. కెవ్వు కార్తీక్ మ్యాన్ హోల్ లో ప‌డిపోవ‌డం.. న‌వ్వులు పూయిస్తోంది. య‌మ ధ‌ర్మ‌రాజు గెట‌ప్ లో గెట‌ప్ శ్రీ‌ను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మ‌ళ్లీ తిరిగొచ్చిన గెట‌ప్ శ్రీ‌ను ..ఆటో రాంప్ర‌సాద్ తో క‌లిసి జ‌బ‌ర్ద‌స్త్ ను మ‌ళ్లీ గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే `య‌మ‌లోకం` స్కిట్ ని ప్ర‌ద‌ర్శించారు. ఈ స్కిట్ లోనే వ‌ర్ష ఎమోష‌న‌ల్ అవుతూ ఇమ్మానుయేల్ లేక‌పోతే, త‌ను కాదంటే నా ఊపిరి ఆగిపోతుంది అంటూ షాకిచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. 

నూకరాజుని, ప్రవీణ్ ని బాదేసిన సుమ

క్యాష్ దొరికినంత దోచుకో ఎపిసోడ్ గురించి అందులో వచ్చే కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత వారం ఎపిసోడ్ కి జబర్దస్త్ ఫామిలీ మెంబెర్స్ వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఈ షోలో వీసా ఇంటర్వూస్ చేస్తుంటుంది సుమ. అందరు  జంటలు జంటలుగా రావాలని చెప్తుంది. వీసా కోసం భాను, కెవ్వు కార్తీక్ వస్తారు. అమెరికా ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు అని అడిగేసరికి "ఒకేషన్" కి వెళ్ళాలి అంటాడు. "ఒకేషన్" ఆర్ "అకేషన్" అనే అడిగినప్పుడు  సరిగ్గా  సమాధానం చెప్పకపోయేసరికి వీసా రిజెక్ట్ చేస్తుంది సుమ. ఇంతలో నూకరాజు ఆసియా వచ్చి మై ఫ్లైట్ ఈస్ మిస్సింగ్ అనేసరికి సుమ " వీసా రిజెక్టెడ్ " అని చెప్పి పంపేస్తుంది. ఏమి అర్థం కాక "ఆంటీ ఫస్ట్ యూ చెక్" అని నూకరాజు సుమని అంటాడు.. ఆంటీ అంటావా నన్ను అని వాటర్ బాటిల్ మీదకు విసిరేసి "నీ ఓవర్ యాక్షన్ ఎక్కడైనా కానీ నా దగ్గర కాదు" అంటుంది. ఇంతలో షబీనా, పరదేశి వచ్చేసి "కెన్ యూ ప్రొవైడ్ అజ్ వీసా" అని అడుగుతారు.. సుమ సీరియస్ ఐపోయి. "నేను ఇంకా మిమ్మల్ని పిలవలేదు లోపలి  ఎందుకొచ్చారు అసలు గెటౌట్ ఆఫ్ మై ఆఫీస్ అంటూ" దేవి నాగవల్లి డైలాగ్ ని రిపీట్ చేస్తుంది సుమ. తర్వాత ఫైమా, ప్రవీణ్ వచ్చి తల మీద వెంట్రుకలు పెట్టించుకోవడానికి అమెరికా పోతున్నాం అనేసరికి అసలు విషయం చెప్పు అంటుంది ఫైమా..ఆగే ..నేను చెప్తున్నాగా అంటూ ఫైమని కొడతాడు ప్రవీణ్ "నువ్వు ఆడపిల్లను కొడతావా యూ స్టుపిడ్ అంటూ ప్రవీణ్ ని  పిచ్చ కొట్టుడు కొడుతోంది సుమ" ఇక నూకరాజు వచ్చి "యూ ఆర్ ది ఛాంపియన్ ఇన్ థిస్ wwf ఛాంపియన్ షిప్ " అంటాడు. ఆ డైలాగ్ కి నూకరాజు మీద వాటర్ బాటిల్ విసిరి ఫన్ చేస్తుంది సుమ.

నీలో పౌరుషం లేదా ప్రవీణ్.. పరువు తీసిన సుమ!

క్యాష్ షోలో గత వారం జబర్దస్త్ ఫామిలీ నుంచి నాలుగు జంటలు వచ్చి కామెడీని పంచి వెళ్లాయి. ఈ షోలో నలుగురు అమ్మాయిలకు సుమ పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటుంది. షబీనా వచ్చిన "అమ్మ నాకు త్వరగా పెళ్లి చేసేయి" అంటుంది సుమతో. "నీకోసం మంచి వరుడిని కూడా చూసా" అంటుంది సుమ. "మహేష్ బాబా, పవన్ కళ్యాణా?" అని షబీనా అడిగేసరికి "వాళ్లిద్దరూ కాదు వాళ్ళ పెదనాన్న" అంటూ పరదేశిని చూపిస్తుంది. "నీకు టాలెంట్ ఉన్నట్టయితే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలంటే "దాయి దాయి దామ్మా" సాంగ్ స్టెప్ వేసి చూపించాలి" అంటూ టెస్ట్ పెడుతుంది. ఇక ఏదో రకంగా ఆ స్టెప్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేసేస్తాడు. తర్వాత ఆసియా కోసం నూకరాజుని పెళ్లికొడుకుగా పిలుస్తుంది సుమ. ఇంతలో ఆసియాని నూకరాజు తిడతాడు.  "ఏంటి నా ముందే మా అమ్మాయిని తిడుతున్నావ్?" అని సీరియస్ అవుతుంది సుమ. "ఆ అమ్మాయిని పిలుస్తా, నిన్ను పిలుస్తా, ఆ అమ్మాయికి ముద్దు పెడతా.. నీకు.." అంటూ సుమ వైపు వేలు చూపించేసరికి ఒక్కసారి షాక్ ఐపోతుంది. వెంటనే సారీ చెప్తాడు నూకరాజు. ఇక  సుమ కూడా "మూసుకుని వెళ్ళు సంబంధం లేదు, గాడిద గుడ్డు లేదు" అంటుంది. తర్వాత "నా కోసం ఎలాంటి అబ్బాయిని తెస్తున్నావ్ అమ్మ"  అని ఫైమా అడిగేసరికి "ఒకడున్నాడే వస్తున్నాడు" అంటుంది.  జూనియర్ ఎన్టీఆర్ లా ప్రవీణ్ వచ్చి సుమని మంచినీళ్లు ఇమ్మంటాడు. కుండతో నీళ్లు దోసిట్లో పోస్తే తాగి "క్యాష్ నీళ్లు తాగేసరికి నా కళ్ళల్లో పౌరుషం చూడమ్మా" అంటాడు. "ఐతే నీలో పౌరుషం లేదా?" అంటూ కౌంటర్ డైలాగ్ వేస్తుంది సుమ. తర్వాత ప్రవీణ్ ని గుర్తుపట్టి "ఫైమా కోసం వచ్చింది నువ్వేనా. మంచి పని చేసావ్ మూడు జాకెట్లు తొడుక్కుని వచ్చావ్. లేదంటే వచ్చే ఈదురు గాలులకు ఎప్పుడో ఎగిరిపోయేవాడివి" అనేసరికి అందరూ నవ్వేస్తారు. ఫైనల్ గా భాను కోసం కార్తిక్ ని పిలుస్తుంది. కానీ "నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ వున్నాడు" అనేసరికి సుమ "ముందే చెప్పాలి కదా. సంబంధం చూసాక ఈ బిల్డప్ ఎందుకు?" అంటూ ఫైర్ అవుతుంది. ఇలా పెళ్లి సంబంధాలు చూసే పెద్దమనిషిగా మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది సుమ.

ప్రగతి ఆంటీకి మార్కులు వేసిన దొరబాబు

ప్ర‌గ‌తి  ఈ మధ్య కాలంలో దుమ్ము రేపుతోంది.  ఒక‌ప్పుడు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించిన ప్ర‌గ‌తి ఆంటీ  ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. తెలుగులోనే కాదు.. సౌత్ భాషలు అన్నింటిలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది ప్రామిసింగ్ ఆర్టిస్ట్ అనే పేరు తెచ్చుకుంది. ఇక  అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన  ‘ఎఫ్ 3’ లో ప్రగతి తన నటనతో అందరినీ నవ్వించేసి మరికొన్ని మూవీస్ ని గ్రిప్ లో పెట్టేసుకుంది. తర్వాత చిరంజీవి హీరోగా రాబోతున్న ‘భోళా శంకర్’మూవీలో కనిపించబోతోంది ప్రగతి. ఆమెకు  హెల్త్ కాన్షియస్నెస్ చాలా ఎక్కువ. ఆమె ఎక్కువ టైం జిమ్ లోనే ఉంటారు.   ముఖ్యంగా ఆమె వర్క్ అవుట్ వీడియోలు చూస్తే మైండ్ బ్లాంక్ ఐపోవాల్సిందే.  ఇన్స్టా లో ఐతే రచ్చ రచ్చే. ట్రెండీ వేర్స్ లో  తనకు నచ్చిన రీల్స్ ని చేసేస్తుంది. అటు బిగ్ స్క్రీన్ మీదనే కాదు  బుల్లితెర‌పైన తెగ సంద‌డి చేసేస్తోంది ప్రగతి ఆంటీ.  శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిసిన ప్ర‌గ‌తి ఇప్పుడ జ‌బ‌ర్ధ‌స్త్ షోలోను కనిపించి ఎంటర్టైన్ చేసింది.  సూర్యవంశం మూవీ పేరడీని  కమెడియన్ నూకరాజు, దొరబాబు కలిసి చేస్తారు. ఈ స్కిట్ ఫుల్ గా న‌వ్వులు పూయిస్తుంది. ఈ స్కిట్ లో దొరబాబు పెద్ద వెంకటేష్ పాత్రలో నటిస్తాడు. "నేను నా పెద్ద కొడుకుని పోలీస్ చేశా.. రెండో కొడుకుని లాయర్ ని చేశా.. ఎందుకో తెలుసా" అని దొరబాబు అడుగుతాడు. దీనికి నూకరాజు బదులిస్తూ.. "నాకు తెలుసు మీరు ఎక్కడైనా దొరికేస్తారు" అంటూ దొరబాబు గతంలో ఒక కేసు విషయంలో పట్టుబడిన విషయం గుర్తొచ్చేలా సెటైర్ వేసేసరికి దొరబాబు తలదించుకుంటాడు ప్రగతి, ఇంద్రజ నవ్వు ఆపుకోలేకపోతారు. ప్రగతి గారికి నేను మార్కులు ఇద్దామనుకుంటున్న అని దొరబాబు కొన్ని నంబర్స్ చెప్పేసరికి ఇంద్రజ మీ ఫోన్ నెంబర్ మాకొద్దండి బాబు అంటూ ఫన్ చేస్తుంది. పరదేశిని దొరబాబు పిలిచాడన్న విషయం తెలిసేసరికి పరదేశి కొంచెం ఓవర్ ఆక్షన్ చేస్తాడు. సూర్యవంశం కామెడీ తప్ప అన్ని సినిమాల కామెడీ చేస్తున్నావ్ గా అంటూ నూకరాజు కామెడీ డైలాగ్ వేస్తాడు.  పరదేశి చిన్న వెంకటేష్ అంటే అడ్జస్ట్ చేసుకున్న కానీ దొరబాబు పెద్ద వెంకటేష్ ఏంట్రా బాబు అంటూ నూకరాజు ఏడుస్తూ చెప్పే కామెడీ టైమింగ్ కి అందరూ పడీ పడీ నవ్వుతారు. ఇలా ఈ వారం జబర్దస్త్ మంచి కామెడీని అందించనుంది.

'చెయ్యి చూశావా రఫ్‌గా ఉంది.. రఫ్ఫాడించేస్తా'.. సుధీర్‌కు చిత్ర వార్నింగ్‌

సూపర్ సింగర్ జూనియర్స్ షో రేటింగ్స్ లో దూసుకుపోతూ పాటలంటే ఇష్టపడే అభిమానుల్ని మస్త్ గా అలరిస్తోంది. ఇక రాబోయే వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో అనసూయ, సుధీర్ హోస్టింగ్ కి ఫాన్స్ పెరిగిపోతూ ఉన్నారు. ఈ షోలో సుధీర్ వస్తూనే అనసూయతో కలిసి డాన్స్ చేసేసి తనలో తానె నవ్వేసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. "ఎందుకు నవ్వుతున్నావ్?" అని అనసూయ అడిగేసరికి "బెస్ట్ సింగర్ అవార్డు తీసుకున్నట్టు కలొచ్చింది" అంటాడు. సుధీర్ అవార్డు తీసుకోవడం మంచిదే కానీ ఆ అవార్డు ఇచ్చిన వాళ్ళే దురదృష్టవంతులు అంటుంది అనసూయ. ఆ దేవుడి దయ వల్ల ఆ అవార్డు ఇచ్చింది మీరే అని కౌంటర్ వేసేసరికి అనసూయ నవ్వేస్తుంది. ఈ ఎపిసోడ్ సూపర్ సింగర్స్ సెలెబ్రేషన్స్ విత్ సూపర్ సింగర్ స్టార్స్ గా మంచి మంచి పాటల ధమాకాని అందించబోతోంది. తర్వాత ప్లేబాక్ సింగర్స్ వచ్చి జూనియర్స్ తో కలిసి పాటలు పాడతారు. తర్వాత సుధీర్ ఒక కామెడీ బిట్ ని పండిస్తాడు.   హేమచంద్రకి సుధీర్ ఫోన్ చేసి హలో ఇక్కడో సమస్య వచ్చిందని అనేసరికి రిప్లై ఇవ్వకుండా "హలో హలో" అంటూ హేమచంద్ర ఆట పట్టిస్తూ ఉంటాడు. తర్వాత అనసూయ "కాల్ కలవకపోతే మెసేజ్ పెట్టు" అనేసరికి "లొకేషన్ పంపిస్తున్న రా మావా" అని టైపు చేసేలోపు హేమచంద్ర స్టేజి మీదకు వచ్చేస్తాడు. అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ ఐపోయి "లొకేషన్ ఇంకా పెట్టలేదుగా మావ అప్పుడే ఎలా వచ్చావ్?" అని సుధీర్ అడిగేసరికి "ఐతే లొకేషన్ పెట్టు వెనక్కి వెళ్లి మళ్ళీ వస్తాను" అని వెళ్ళిపోతాడు హేమచంద్ర. ఇక హేమచంద్రను ఆట పట్టించిన సుధీర్ కి చిత్ర వార్నింగ్ ఇస్తారు. "చెయ్యి చూసావా రఫ్ గా ఉంది రఫ్ఫాడించేస్తా" అంటారు. ఆ తర్వాత హేమచంద్రని చూసి "నమస్కారం గురువుగారు" అని దణ్ణం పెట్టేసరికి హేమచంద్ర "అమ్మ బాబోయ్" అని పారిపోతాడు. ఫైనల్ గా చిత్రతో కలిసి హేమచంద్ర "లలిత ప్రియకమలం విరిసినది" అంటూ అద్భుతంగా పాడి అందరినీ మైమరిపిస్తాడు.  

అనుకుంటాం కానీ అవి ఎప్పటికీ మనవి కావు.. అనసూయ ఎమోషనల్ పోస్ట్!

యాంకర్ అనసూయ ఇటీవల జబర్దస్త్ షో నుంచి తప్పుకుంది. స్టార్ మాలో సూపర్ సింగర్ జూనియర్స్ షోకి హోస్ట్ గా సుధీర్ తో కలిసి చేస్తోంది. జబర్దస్త్ యాంకర్ గా మంచి ఆఫర్స్ ని తెచ్చుకుంది అనసూయ. అటు మూవీస్ లో నటిస్తూ ఇటు స్మాల్ స్క్రీన్ మీద కూడా తన హవా కొనసాగిస్తోంది. ఐతే అనసూయ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. " కొన్నిసార్లు మీకు అలవాటైన ప్రదేశం.. మీకు చెందిన స్థలం మాత్రం కాదు.." అంటూ పోస్ట్ చేసి కొన్ని ఫొటోస్ షేర్ చేసింది.  ఇక నెటిజన్స్ కూడా అనసూయ కామెంట్ ని ఫుల్ ట్రోల్ చేసేస్తున్నారు. ఏ ప్లేసెస్ మనవి కావు టాయిలెట్సా అంటూ కామెంట్ చేశారు. ఇంకా కొంతమంది నెటిజన్స్ మాత్రం లవ్ యు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ రంగమ్మత్త మాత్రం కాస్త ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తున్నా మంచి మంచి ఆఫర్స్ ని దక్కించుకుంటూ మంచి రెమ్యూనరేషన్స్ తెచ్చుకుంటూ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.  

హనీమూన్ గురించి చెప్పిన మంగళవారం రమేష్!

జబర్దస్త్ షో కొన్నేళ్ల క్రితం వరకు చాలా బాగుంది అనిపించింది. కానీ డబుల్ మీనింగ్ డోస్ మాత్రం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ఈ షో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఆగస్టు 11న ప్రసారం కావాల్సిన జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో తాగుబోతు రమేష్ కామెడీ కొంచెం హద్దులు దాటినట్టు కనిపిస్తోంది. స్కిట్ లో భాగంగా రమేష్ తన భార్యతో హనీమూన్ కి వెళుతున్నట్లు  చెబుతాడు. అందుకే "హ్యాపీ మూడ్" అని స్టేటస్ లో కూడా పెట్టుకుంటాడు. అయితే నా కల నెరవేరినట్లే మీరు నిజంగానే హ్యాపీ మూడ్ లో ఉన్నారా అండి అని భార్య రోల్ లో చేసిన కమెడియన్ అడిగేసరికి . హ్యాపీ మూడ్ చూశావు కానీ..  పక్కనే మంగళవారం అనే హ్యాష్ ట్యాగ్ పెట్టాను చూడలేదా అని అడుగుతాడు. ఆ డైలాగ్ కి స్పందించిన జడ్జి ఇంద్రజ "ఇకపై నీ పేరు తాగుబోతు రమేష్ కాదు మంగళవారం రమేష్" అని కౌంటర్ వేసింది. ఈ డైలాగ్ కి అక్కడున్న వాళ్ళందరూ నవ్వేస్తారు.  తర్వాత హనీమూన్ అంటే ఏమిటి అంటూ రమేష్ ని వాళ్ళ ఆవిడ అడుగుతుంది..? గోవాలో బీచ్ ఒడ్డున పొట్టి నిక్కర్లు వేసుకుని అక్కడ మూన్ , ఇక్కడ చేతిలో హనీ ..మూన్ ని చూస్తూ హనీ నాకుతూ అంటాడు. ఇంతోటి దానికి గోవా వరకు వెళ్ళాలా అంటూ రమేష్ ని వాళ్ళ ఆవిడ కొడుతుంది. ఈ స్కిట్ లో డబుల్ మీనింగ్ డైలాగ్ అర్థమైపోతుంది.  ఒకానొక సమయంలో జబర్దస్త్ బూతు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయేసరికి ఆడియన్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఫామిలీ మొత్తం  కలిసి చూసే ఇలాంటి కామెడీ షోస్ లో కూడా బూతు కామెడీ ఏమిటి అనే వాదన తెరపైకి వచ్చింది. ఇలాంటి విమర్శలు వస్తూండేసరికి టీం లీడర్స్ తమ రూట్ మార్చారు. జబర్దస్త్ లో బూతు కామెడీ తగ్గించారు క్లీన్ కామెడీ శాతం పెంచారు. దీంతో  ఆడియన్స్ నుంచి మళ్ళీ  ఎంతో  ఆదరణ పెరిగింది. కాని ఇప్పుడు మళ్ళీ అదే తరహా కామెడీ కనిపిస్తుండేసరికి ఆడియన్స్ నుంచి వ్యతిరేకత అనేది మొదలయ్యింది.  

అవన్నీ నమ్మొద్దు.. అతడే నావాడు!

ఫేమస్ యాక్టర్ పూర్ణ గురించి అందరికీ తెలిసిందే. ఎంతో  టాలెంట్ ఉన్నా స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. కానీ నటిగా మాత్రం మంచి మార్కులే వేయించుకుంది. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ లు చేస్తోంది.  బుల్లి తెరపై `ఢీ`, `జబర్దస్త్` తదితర షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల నటి పూర్ణకు పెళ్లి కూడా కుదిరింది. ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుని ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యూఏఈకి చెందిన బిజినెస్ పర్సన్ షానిద్‌ అసిఫ్‌ అలీని పూర్ణ పెళ్లి చేసుకోబోతోంది. పూర్ణకి కాబోయే వరుడు జేబీఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు సీఈఓ, ఫౌండర్‌. జమా అల్ మెహరి అనే సంస్థని స్థాపించాడు. కొత్త ఆఫీస్ లు స్టార్ట్ చేయడానికి కావాల్సిన  సర్వీసులను వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు.  అంతే కాకుండా సెలబ్రిటీలకు యూఏఈ వీసాలను కూడా ఏర్పాటు చేస్తుంటాడు అసిఫ్ అలీ. వీసా ప్రాసెసింగ్‌ అలాగే ఫ్లైట్‌ టికెటింగ్‌ వంటి పలు సర్వీసులను కూడా షానిద్‌ కంపెనీ చూస్తూ ఉంటుంది. కాజల్‌, ప్రియమణి, ప్రణీత, ఆండ్రియా, లక్ష్మీ, విజయ్‌ సేతుపతి, శ్వేతా మీనన్‌, నాజర్‌, అజారుద్దీన్‌ వంటి స్టార్లకు యూఎఈ వీసాలను కూడా ఏర్పాటు చేశారు. పూర్ణ ఎంగేజ్మెంట్ అయ్యాక తన పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని ఒక టాలీవుడ్ డైరెక్టర్ తో ప్రేమ వ్యవహారమే కారణమంటూ ఒక న్యూస్ వైరల్ అవుతూ వచ్చింది.  ఐతే పూర్ణ ఈ న్యూస్ ఫేక్ అంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పకుండా ఒక ఫోటోతో తన మీద వస్తున్న ఆరోపణలు అన్ని అబద్ధం అని తెల్చిపారేసింది. లేటెస్ట్ గా ఈ వార్తలపై పూర్ణ ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చింది. షానిద్‌ అసిఫ్‌ అలీతో క్లోజ్ గా ఉన్న ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసి ‘ఫర్ ఎవర్ మైన్’ అంటూ కాప్షన్ పెట్టి పోస్ట్ చేసింది. ఈ ఒక్క కామెంట్ తో వైరల్ అవుతున్న న్యూస్ అంతా ఫేక్ అని చెప్పకనే చెప్పేసింది పూర్ణ. పూర్ణ హజ్బెండ్ కి యూఏఈ ముస్లిం మత పెద్దలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. పూర్ణ కుటుంబంతో ఎప్పటినుంచో పరిచయం ఉంది. అలా పూర్ణతో తనకి  ఫ్రెండ్‌షిప్ ఏర్పడి తర్వాత అది ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ ఎవరు?

సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ ఎపిసోడ్ ఫైనల్స్ కి చేరుకుంది. ఈ షో ఎంతోమందికి మంచి వేదికను అందించింది. ఈ షో ద్వారా పార్వతి అనే అమ్మాయి తన ఊరుకు బస్సు వేయించుకుంది కూడా. ఐతే ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఇక ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మస్త్ కలర్ ఫుల్ గా చేశారు మేకర్స్. ఈ షోకి శృతి హాసన్ గెస్ట్ గా వచ్చి ఎంటర్టైన్ చేయబోతోంది. ఇక ఈ ఎపిసోడ్ కి వెటరన్ సింగర్ పి.సుశీలమ్మను సగౌరవంగా సన్మానించడానికి ఒక అందమైన వేదికను కూడా సిద్దమయ్యింది. దక్షిణ భారత దేశంలో ఎంతో గొప్ప గాయనీమణుల్లో సుశీలమ్మ ఒకరు. 1960ల నుంచి ఆరు భారతీయ భాషల్లో  17,600 పాటల పాడి ఆడియన్స్ మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే  పద్మభూషణ్ అవార్డు గ్రహీత సుశీలమ్మ. ఈమె  5 జాతీయ అవార్డులను, ఇంకా ఎన్నో రాష్ట్ర అవార్డులను కూడా అందుకున్నారు. అలాగే ఆమె పేరు  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండిట్లో పేరు నమోదు చేసుకుంది.  ఇక ఈ గ్రాండ్ ఫినాలేలో సుశీలమ్మను కలిసే ఆ ఆనంద క్షణాల కోసం ఫైనలిస్టులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే కోటి, రఘు కుంచె, యాక్టర్స్ నితిన్, కృతి శెట్టి, నిహారిక కొణిదెల ఈ ఎపిసోడ్ లో కనిపించి అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గ్రాండ్ ఫినాలే ఆగస్టు 14 ఆదివారం నాడు ప్రసారం కానుంది. సరిగమప సీజన్ 14 ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. దీనిని శ్రీముఖి హోస్ట్ గా చేస్తుండగా  న్యాయనిర్ణేతలుగా కోటి, ఎస్పీ శైలజ, అనంత శ్రీరామ్, స్మిత ఉన్నారు. అలాగే ఈ షోలో గీతా మాధురి, సాకేత్, అరుణ్, రేవంత్ అనే నలుగురు మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు.   ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఈ సీజన్‌కు న్యాయనిర్ణేతగా వచ్చారు. స్మిత ఈ సింగింగ్ షోతో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు యశస్వి కొండేపూడి, రేణు కుమార్ సరిగమప సింగింగ్ సూపర్ స్టార్స్ గా నిలిచి మంచి అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సీజన్ సింగింగ్ సూపర్ స్టార్ ఎవరు అనే విషయంపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది.

ఎమోషన్స్ తో ప్రోమో ..? క్లిక్ అయ్యేనా ?

బిగ్ బాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పేరు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు 5  సీజన్స్ పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు సీజన్ 6 స్టార్ట్ కాబోతోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. లాస్ట్ సీజన్  లాగే ఓటిటిలో 24 అవర్స్ ఎంటర్టైన్ చేయడం కోసం  బిగ్ బాస్ సీజన్ 6  ప్రసారం చేయడానికి రంగం సిద్దమయ్యింది. బిగ్ బాస్  సీజన్ 6   కి సంబంధించి అప్ డేట్స్ జనాల్లో మంచి హైప్ తీసుకొస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇప్పుడు  సీజన్ 6 ప్రోమో బిగ్ బాస్ ప్రోమో బయటికి రిలీజ్ చేసేసారు. 55 సెకెన్ల పాటు ఉన్న ఈ వీడియోలో జనం బిగ్ బాస్ కోసం ఎంత ఆతృతగా ఉన్నారో చెప్పడానికి ప్రయత్నించారు.   బుల్లితెర మీద భారీగా  పాపులర్ ఐన షో గా పేరుతెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ 6 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. కూతురుకు పెళ్లి చేసి అప్పగింతలు ఇవ్వాల్సిన టైంలో పేరెంట్స్  ఫీలింగ్స్  చూపించి ఆ తర్వాత సీన్ లో కూతురు అప్పగింతల కార్యక్రమం కంటే ముందుగానే ఆ పేరెంట్స్ బిగ్ బాస్ షో చూడడానికి వెళ్ళిపోతారు. కూతురు ఆనందం కంటే బిగ్ బాస్ ముఖ్యం  అన్నట్లుగా ప్రోమోలో చూపించారు మేకర్స్. కూతురు చేతులు పట్టుకుని బాధపడుతున్న ఆ పేరెంట్స్  బిగ్ బాస్ వస్తున్నట్లుగా ఒక  మొబైల్ అలెర్ట్  వచ్చేసరికి  కూతురిని అక్కడే వదిలేసి వెళ్లి టీవీ ముందు కూర్చుండిపోతారు.  తర్వాత అప్పగింతలు కార్యక్రమానికి నాగార్జున ఎంట్రీ ఇచ్చి అప్పగింతలు అయ్యేవరకు ఆగలేకపోయారంటే అక్కడ ఆట మొదలైనట్టే అని చెప్పడం ఆడియన్స్ కి పెద్ద నచ్చలేదు. ఎమోషన్స్ తో ప్రోమో చేశారు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే లైఫ్ లో ఏ మొమెంట్ ఐనాసరే  బిగ్ బాస్ తర్వాతే అని నాగ్ చెప్పడం అంత బాలేదంటున్నారు  జనం. దీనెమ్మా జీవితం కన్నవాళ్ళకు  కూతురు కంటే బిగ్ బాస్ ఎక్కువా ????... ఏమన్నా లాజిక్కా.. అంటూ పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు.. ఏదేమైనా బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమోపై జనం పెద్దగా ఇంటరెస్ట్ చూపించలేదనేది నిజం.  

భూష‌ణ్ ఫైన‌ల్ గా ఎవ‌రికి చిక్కాడు?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియల్ `త్రిన‌య‌ని`. జ‌ర‌గ‌బోయేది ముందే ప‌సిగ‌ట్టే వ‌ర‌మున్న ఓ యువ‌తి చుట్టూ అల్లుకున్న క‌థ ఇది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా సీరియ‌ల్ ని రూపొందించారు. అషికా గోపాల్‌, చందూ గౌడ జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో పవిత్రా లోకేష్‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు, విష్ణు ప్రియ‌, భావ‌నా రెడ్డి, శ్రీ‌స‌త్య‌, నిహారిక హ‌ర్షు త‌దిత‌రులు న‌టించారు. సురేష్ చంద్ర‌, ప్రియాంకా చౌద‌రి, చ‌ల్లా చందు త‌దిత‌రులు న‌టించారు. భూష‌ణ్ ని ప‌ట్టుకొని త‌న త‌ల్లి హ‌త్య వెన‌కున్న మిస్ట‌రీని ఛేదించాల‌ని విశాల్ రంగంలోకి దిగుతాడు. వెంట‌నే బ‌స్తీకి వెళ్లి భూష‌ణ్ ఆచూకీ గురించి వెత‌క‌డం మొద‌లు పెడ‌తాడు. ఈ విష‌యం తెలిసిన తిలోత్త‌మ బ్యాచ్ వ‌ల్ల‌భ‌, క‌సి భ‌యాందోళ‌న‌కు గుర‌వుతుంటారు. ఒక వేళ భూష‌ణ్ గ‌న‌క విశాల్ కి దొరికితే తిలోత్త‌మ చావు గ్యారంటీ అంటుంది. దీంతో తిలోత్త‌మ ఓ ప్లాన్ వేస్తుంది. మారు వేషాల్లో బ‌రం కూడా బ‌స్తీకి వెళ్లి భూష‌ణ్ ని వెతుకుదాం అంటుంది. తిలోత్త‌మ అన్న‌ట్టుగానే తిలోత్త‌మ, వ‌ల్ల‌భ‌, క‌సి మారు వేషాల్లో బ‌స్తీలో భూష‌ణ్ ని వెద‌క‌డం మొద‌లు పెడ‌తారు. ఈ క్ర‌మంలో క‌సి ..విశాల్ కు ఎదురుప‌డుతుంది. కానీ విశాల్ క‌సినిగుర్తు ప‌ట్ట‌లేక‌పోతాడు. త‌న‌నే అడ్ర‌స్ అడిగికి ముందుకు వెళ‌తాడు. ఇదే క్ర‌మంలో పోలీసులు, న‌య‌ని కూడా భూష‌ణ్ గురించి వెత‌క‌డం మొద‌లు పెడ‌తారు. ఈ క్ర‌మంలో క‌సి త‌న‌కు ఎదురుప‌డిన భూష‌ణ్ భార్య‌నే భూష‌ణ్ గురించి అడుగుతుంది. దీంతో విష‌యం అర్థం కావ‌డంతో త‌మ గురించి ఎవ‌రో వెతుకుతున్నార‌ని, భూష‌ణ్ ని అల‌ర్ట్ చేస్తుంది. ఇంత‌కీ భూష‌ణ్ ఎవ‌రికి దొరికాడు? ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

శోభ‌తో పెళ్లికి రెడీ అంటూ షాకిచ్చిన నిరుప‌మ్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ తో సాగి టాప్ 1 సీరియ‌ల్ గా రికార్డు సాధించింది. అయితే వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు పాత్ర‌ల‌ని ఎండ్ చేయ‌డంతో అప్ప‌టి నుంచి త‌న పూర్వ వైభ‌వాన్ని సొంతం చేసుకోవాల‌ని ఆప‌సోపాలు ప‌డుతూ సాగుతోంది. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ విశేషాలు ఏంటో ఒక‌సారి తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభంలోనే సౌంద‌ర్య‌.. హిమ‌కు గోరింటాకు పెడుతూ వుంటుంది. ఎంత సౌంద‌ర్య మాట్లాడుతున్నా హిమ మాత్రం సైలెంట్ గా చూస్తూ వుంటుంది. క‌ట్ చేస్తే.. సౌంద‌ర్య‌, హిమ‌ల ద‌గ్గ‌రికి ఆనంద‌రావు వ‌స్తాడు. హిమ‌కు మాత్ర‌మే గోరింటాకు పెడితే శౌర్య ఫీల‌వుతుంది క‌దా? అంటాడు. దీంతో స‌రే దాన్ని కూడా పిలువు అంటుంది సౌంద‌ర్య‌.. అయితే శౌర్య ఇంట్లో లేద‌ని, బ‌య‌టికి వెళ్లిందంటాడు ఆనందరావు. ఇంత‌లో హిమ ఏడుస్తూ వుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని సౌంద‌ర్య అడిగితే.. నా మ‌న‌సులో ఏముందో తెలియ‌దా? అని అంటుంది. దీంతో ఆగ్ర‌హించిన సౌంద‌ర్య నీ వ‌య‌సుకి మించిన ఆలోచ‌న‌లు మానుకో అని గ‌ట్టిగా వార్నింగ్ ఇస్తుంది. క‌ట్ చేస్తే... శోభ‌కు స్వ‌ప్న అన్నం తినిపిస్తూ వుంటుంది. ఇంత‌లో అక్క‌డికి చేరుకున్న శౌర్య ప్ర‌పంచంలో మీలాంటి అత్తా కోడ‌ళ్లు వుండ‌రు అంటూ వెటాకారంగా అంటుంది. ఇంద‌లో అక్క‌డికి స‌త్యం వ‌స్తాడు. విష‌యం తెలిసి స‌త్యం అక్క‌డి నుంచి జారుకుంటాడు. ఇక స్వ‌ప్న చేతిలో వున్న ప్లేట్ తీసుకుని శోభ నోట్లో అన్నం, స్వీట్లూ బ‌ల‌వంతంగా కుక్కేస్తుంది శౌర్య‌.. ఇల్లు అల‌క గానే పండ‌గ కాదు అంటూ ఇద్ద‌రికి వార్నింగ్ ఇస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? నిరుప‌మ్ ..శోభ‌తో పెళ్లికి ఎందుకు సై అన్నాడు అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే  

శ్రీముఖి ఏమిటి ఇలా మారిపోయింది?

శ్రీముఖి ఎప్పుడు ఎక్కడ ఉంటె అక్కడ అల్లరే  అల్లరి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో  కొత్త కొత్త యాప్స్ , ఫిల్టర్లు ఇంట్రడ్యూస్ అవుతుండేసరికి  కామన్ మాన్ నుంచి టాప్ మోస్ట్ సెలెబ్స్ వరకు ఆ ఫిల్టర్స్ ని  యూస్ చేస్తూ రకరకాలుగా అల్లరి చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు . ఇప్పుడు అలాంటి అల్లరి ఫిల్టర్స్ తో శ్రీముఖి, శృతి హాసన్ సందడి చేశారు. ఈ ఫిల్టర్స్ ఎలా ఉంటాయి అంటే రకరకాల యానిమేషన్స్తో మన హావభావాల్ని ముఖ కవళికల్ని మార్చేస్తూ ఉంటాయి. పళ్ళు ఎత్తుగా ఉండేలా, తలకు రిబ్బన్లు కట్టుకున్నట్టుగా, చిన్నపిల్లలా మాటల్లా, కళ్ళజోళ్ళతో, పెద్ద పెద్ద కళ్ళు, వాచిన పెదాలు, గుండుతో , గడ్డంతో ఇలా రకరకాల ఫిల్టర్స్ ఆండ్రోయిడ్స్ లో వచ్చేసరికి అందరూ వాటిని ట్రై చేస్తూ స్టేటస్ లో పెట్టుకుని మురిసిపోతున్నారు. శ్రీముఖి, శృతిహాసన్ కూడా అలాంటి ఒక అల్లరి ఫిల్టర్ ని తీసుకుని వాళ్ళ ఫేసెస్ ని మార్చేసుకుని చిన్నపిల్లల్లా ఒక ఈవెంట్ లో సందడి చేయడం నవ్వు తెప్పిస్తోంది. ఇక ఆ ఫన్నీ  వీడియోని శ్రీముఖి తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. " చూడండి ఇక్కడ ఎవరు ఉన్నారో, శృతిహాసన్..తన సెల్ లో ఉన్న ఫిల్టర్స్ తో ఇలా మార్చేశారు. మనకు కూడా ఇవంటే ఇష్టం కదా" అనే టాగ్ లైన్ పెట్టేసింది. ఇంకా ఈ ఫిల్టర్ అల్లరి వీడియోని చూసి నెటిజన్స్ కూడా ఇల్లాంటివి యూజ్ చేసి పాపులర్ అవడం ఫన్ చేయడం నీ తర్వాతే ఎవరన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

త‌ల్లి కాబోతున్న కాంచ‌న‌..వేద‌పై ఫైర్‌ అయిన మాలిని!

నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించిన సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. బుల్లితెర రొమాంటిక్ ఎంట‌ర్ లైన‌ర్ ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. బెంగ‌ళూరు ప‌ద్మ‌. సులోచ‌న‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల, ఆనంద్‌, వ‌ర‌ద‌రాజులు, మిన్ను నైనిక త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. మాలిని, కాంచ‌న‌, ర‌త్నం బ‌య‌టికి నుంచి ఇంటికి వ‌చ్చే స‌రికి వేద‌, య‌ష్ క‌ర్టెంన్ ల మ‌ధ్య చిక్కుకుని కింద‌ప‌డిపోయి ఒక‌రి ముఖం ఒక‌రు చూసుకుంటూ వుంటారు. ఈ క్ర‌మంలో య‌ష్ చేతిక గాయం అవుతుంది. అది గ‌మ‌నించిన మాలిని .. వేద‌పై మండిప‌డుతుంది. అయితే య‌ష్ మాత్రం హ్యాపీగా ఫీల‌వుతూ వుంటాడు. వేద త‌న చేతికి క‌ట్టుక‌డుడూ య‌ష్ ని తిట్టేస్తుంది. దీంతో నీ కోసంలోనే నాకు ఆనందం వుంద‌ని అంటాడు య‌ష్‌. అయితే వేద భుజానికి కూడా దెబ్బ‌త‌గ‌ల‌డంతో ఏమైంద‌ని య‌ష్ అడుగుతాడు. కానీ వేద మాత్రం చెప్ప‌దు. భుజంపై గాయం అయింద‌ని తెలుసుకున్న య‌ష్ .. వేద భుజానికి మందు రాస్తాడు.  ఇదిలా వుంటే కాంచ‌న కైలాష్ ని క‌ల‌వడానికి వెళుతుంది. త‌ను గ‌ర్భ‌వ‌తిని అని చెబుతుంది. మీకు ఏమైనా అయితే మ‌న బిడ్డ అన్యాయం అయిపోతుంది అంటుంది. వెంట‌నే కైలాష్ ఏంటీ బిడ్డా? అంటాడు. ఆ విషయం చెప్ప‌డానికే ఇక్క‌డికి వ‌చ్చానంటుంది. క‌ట్ చేస్తే.. కాంచ‌న ఇంటికి వెళ్ల‌గానే అంతా న‌వ్వుల్లో మునిగిపోయి వుంటారు. త‌న‌ని చూసి ఏంటీ కాంచ‌న ఎక్క‌డికి వెళ్లి వ‌స్తున్నావ్ అని ర‌త్నం అడుగుతాడు. అయితే నేనేమైనా చిన్న‌పిల్ల‌నా? అంటూ స‌మాధానం చెబుతుంది కాంచ‌న‌. అయితే స‌రే ర‌త్నం మ‌ళ్లీ అడుగుతాడు. దాంతో మా ఆయ‌న‌ని క‌ల‌వ‌డానికి వెళ్లానని చెబుతుంది. ఇదిలా వుంటే మాళ‌విక స్వీట్ బాక్స్ ప‌ట్టుకుని య‌ష్ ఇంటికి వెళుతుంది. మ‌ళ్లీ ఏం గొడ‌వ చేయ‌డానికి వ‌చ్చావ‌ని మాలిని అడుగుతుంది. మాళివిక అన్న‌మాట‌ల‌తో య‌ష్ ఇంట్లో కొత్త ర‌గ‌త మొద‌ల‌వుతుంది.

అష్షు "నెక్స్ట్ జనరేషన్ సన్నీలియోన్" అంటున్న నెటిజన్స్

అష్షు రెడ్డి ఈ పేరు అందరికీ తెలిసిందే. రాహుల్ సిప్లిగంజ్ పేరు కూడా అందరికీ తెలిసింది. బిగ్ బాస్ హౌస్ లో అష్షు రెడ్డి, పునర్నవి, రాహుల్ వీళ్ళ మధ్య ప్రేమ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా మంచి ఫేమస్ కూడా అయ్యింది. రాహుల్ యూట్యూబ్  సింగర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి బిగ్ బాస్ షో - 3 తో  మస్త్ ఫేమస్  అయ్యాడు. ఫైనల్ లో రాహుల్ సిప్లిగంజ్ గ్లామరస్ యాంకర్ శ్రీముఖితో పోటీపడి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. పునర్నవి  హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక అష్షు రాహుల్ తో రిలేషన్ షిప్ కంటిన్యూ చేసింది. బయట కూడా వీళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రాహుల్, అష్షు కలిసి దిగిన ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ట్యాగ్ తో పాటు రెడ్ హార్ట్ ఎమోజిని కూడా పెట్టేసాడు. ఐతే అష్షు కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సీక్రెట్ ప్లేసెస్ లో వేయించుకున్న టాటూస్ చూపిస్తూ, బాత్ టబ్ లో స్నానం చేస్తూ, బీచ్ లో పొట్టి డ్రెస్సుల్లో అల్లరి చేస్తూ మొత్తానికి హాట్ పీస్ అనిపించుకునేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు రాహుల్, అష్షు ఫ్రెండ్షిప్ డే పిక్ కి ఒక నెటిజన్ " నెక్స్ట్ జనరేషన్ సన్నీ లియోన్" అంటూ ఒక హాట్ కామెంట్ పోస్ట్ చేసాడు. ఇంకా కొంత మంది నెటిజన్స్ మాత్రం మీ రిలేషన్ ని ఫ్రెండ్షిప్ అంటారా అంటూ వీళ్ళను బాగా తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇస్త్రీపెట్టెతో బుగ్గ కాల్చుకున్న సింగర్

శ్రీరామచంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి శ్రీరామచంద్ర ఇస్త్రీపెట్టెతో తన బుగ్గను కాల్చుకుని బాధపడుతున్నాడు. ఫ్రెండ్షిప్ డే రోజు శ్రీరామచంద్ర ఒక డ్రెస్ ని  ఇస్త్రీ చేసుకుంటూ ఉన్నాడు. సరిగా అదే  టైంలో సడెన్గా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసేసరికి అలవాటులో పొరపాటున సెల్ అనుకుని ఇస్త్రీపెట్టెను చెవి దగ్గర పెట్టేసుకుని తర్వాత  గొల్లుమన్నాడు.. ఆ పెయిన్ తట్టుకోలేక బుగ్గ మీద ఐస్ ప్యాక్ పెట్టుకుని ఉపశమనం పొందుతూ ఆండ్రాయిడ్ ని తిట్టుకుంటూ ఉంటాడు. శ్రీరామచంద్ర ఇదంతా ఒక వన్ మినిట్ ఎక్స్ప్రెషన్ స్కిట్ ని వీడియోగా చేసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసాడు. "రాంగ్ టైంలో  ఫోన్ చేసే ఫ్రెండ్స్ అందరి కోసం..హ్యాపీ ఫ్రెండ్షిప్ డే  " అంటూ టాగ్ లైన్ పెట్టేసాడు. ఇక ఈ వీడియో చూసిన యాని మాస్టర్ ప్రపంచంలోకెల్లా బిజీ పర్సన్..నాకు ఈ వీడియో చాలా నవ్వు తెప్పించిందంటూ కామెంట్ చేసింది. ఇంకొంతమంది ఐతే శ్రీరామచంద్ర ఎక్స్ప్రెషన్స్ సూపర్ అన్నారు..ట్రెండ్ ని ఫాలో కావు ట్రెండ్ ని సెట్ చేస్తావ్, ఇన్ని అమేజింగ్ ఐడియాస్ ఎలా వస్తాయో మీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సింగర్ గా శ్రీరామచంద్ర ఎన్నో హిట్స్ సాంగ్స్ పాడారు. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేశారు. అలాగే 'ఆహా'లో ఇటీవల  టెలికాస్ట్ ఐనా ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ షోకి  యాంకర్ గా కూడా చేసి సోషల్ మీడియాలో కూడా రీల్స్ చేస్తూ తన ఫాన్స్ ని అలరిస్తూ ఉంటాడు శ్రీరామచంద్ర.

నిఖిల్ ని చెట్టుకు కట్టేసి కొట్టి కళ్ళల్లో కారం పెట్టారు!

ఆలీతో సరదాగా షో ప్రతీ వారం సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఇక ఈ వారం కార్తికేయ హీరో నిఖిల్, డైరెక్టర్ చందు మొండేటి వచ్చారు. ఈ షోలో ఎన్నో ఇంటరెస్టింగ్ టాపిక్స్ కూడా చెప్పేసారు. నిఖిల్ తన చిన్నప్ప్పుడు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ని చెప్పి అందరినీ నవ్వించాడు. షోలే సినిమా అంటే చిన్నప్పుడు నిఖిల్ కి చాలా ఇష్టం అట. షోలే సినిమా చూస్తూనే అన్నం తినేవాడట. ఐతే ఒక రోజు వాళ్ళ అమ్మ టీవీ పెట్టక పోయేసరికి ఆరోజు అన్నం తినడం మానేసాడట.  ఐతే వాళ్ళ అమ్మ అన్నం తింటుంటే టీవీ ఎందుకు పెట్టరు అనే కోపంతో వాళ్ళ అమ్మ ప్లేట్ లో ఉన్న మటన్ పీస్ విసిరి టీవీ పగలకొడదామని అనుకుని విసిరేసరికి వాళ్ళ తాత క్యాచ్ పట్టుకున్నాడట దాంతో  టీవీ పగిలిపోకుండా మిగిలిపోయింది. కానీ  తాను చేసిన పనికి వాళ్ళ అమ్మా, పిన్ని తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి కంట్లో కారం పెట్టేశారంట.  ఇదంతా విన్న చందు మొండేటి కూడా తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా అంతే అని చెప్పుకొచ్చాడు. చీపురు, చేట, చెప్పులు, బెల్ట్ తీసి బాధేసిందట ఒక రోజు. ఇలా చిన్నప్పుడు వాళ్ళ వాళ్ళ అమ్మల చేతుల్లో తిన్న తిట్ల గురించి, కొట్టించుకున్న సంగతులు చెప్పి చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. షోలే అనేసరికి ఆలీ కూడా తన లైఫ్ లో ఇన్సిడెంట్ చెప్పుకొచ్చారు. షోలే మూవీ పెట్టి మ్యూట్ చేస్తే ప్రతి ఒక్కరి డైలాగ్ టకటకా చెప్పేస్తానని చెప్పుకొచ్చారు. షోలే ఫీవర్ ఏ తరాన్నైనా అలా చుట్టేస్తూనే ఉంటుంది.  

రష్మీని పొగిడేసిన లైలా

సుడిగాలి సుధీర్ తర్వాత ఇప్పుడు బుల్లితెర మీద ఎక్కువగా వినిపిస్తున్న పేరు రష్మీ గౌతమ్. ఇప్పుడు షోస్ తో ఫుల్ బిజీ ఐపోయింది రష్మీ. కొన్నేళ్లుగా ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా చేస్తోంది. ఐతే ఇటీవల అనసూయ జబర్దస్త్ షో నుంచి తప్పుకునేసరికి అనసూయ ప్లేస్ లో రష్మీని యాంకర్ తీసుకొచ్చింది మల్లెమాల టీమ్. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ తో వారానికి మూడు రోజులు ఎంటర్టైన్ చేస్తోంది రష్మీ. ఇదే టైంలో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ షో చేయడం సంతోషమే నాకు కానీ నా ప్లేస్ లో కొత్త యాంకర్ వచ్చి ఎంటర్టైన్ చేసేవరకు ప్లీజ్ నన్ను కాస్త భరించండి అనేసరికి లైలా మంచి కామెంట్ ని పోస్ట్ చేశారు. "నువ్వు రాక్ స్టార్ వి..నువ్ ఏ షో చేసిన దానికి ప్రాణం పోస్తావు. యూ విల్ రాక్ ది షో" అనే కామెంట్ పెట్టేసరికి థ్యాంక్యూ అంటూ రిప్లై ఇచ్చింది రష్మీ. లైలా గతంలో జబర్దస్త్ షోకి జడ్జిగా కొద్ది రోజులు వచ్చి సందడి చేశారు. అలా రష్మీకి, లైలాకి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. రష్మీ గతంలో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. కానీ అక్కడ రాని పేరు బుల్లితెర పై బాగా వచ్చింది.

రష్మీ.. ఇంత కిక్కిస్తుందని తెలీదు అన్న సుధాకర్!?

రష్మీ పేరుకు తగ్గట్టే గ్లామర్ గా ఉంటుంది. ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ ని హ్యాండిల్ చేస్తోంది. ఎప్పుడూ సరదాగా ఉండే రష్మీ సునామి సుధాకర్ మీద మండిపడి ఘాటుగా ఒక కామెంట్ కూడా చేసేసింది. ఇప్పుడు ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. ఇందులో సునామి సుధాకర్ సునామీ సుధాకర్ రష్మీ అందాన్ని పొగుడుదామనుకుని ట్రై చేస్తాడు.. అది విస్కీనా ? రమ్మా ?.. చూడగానే మత్తు వచ్చేస్తోంది అని అంటాడు. దానికి సుధాకర్ పక్కనే ఉన్న కమెడియన్ దగ్గరగా చూడు ఆ కిక్కు దిగిపోద్ది అంటూ రష్మీ వైపు సుధాకర్ ని నెట్టేస్తాడు.  సుధాకర్ వేసిన పంచ్ కి  రష్మీ చాలా ఫీల్ అవుతుంది.  ఇప్పుడు మీకు దింపుతాను  అంటూ డబుల్ మీనింగ్ కౌంటర్ వేస్తుంది. ఇంతకుముందు స్కిట్స్ లో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్  కూడా  రష్మీపై ఎన్నో రకాల పంచ్లు వేసేవారు. రష్మీ వాటిని అంత సీరియస్ గా తీసుకునేది కాదు. కానీ ఇప్పుడు  సుధాకర్ టీం మెంబర్ వేసిన చిన్న పంచ్ కి మాత్రం  ఆమె ఫుల్ సీరియస్ ఐపోయింది. ఈ విషయాలు ఇలా జరుగుతుంటే  జబర్దస్త్ నుంచి  సింగర్ మనో కూడా తప్పుకున్నట్లే తెలుస్తోంది.. ఎందుకంటే ప్రతీ వారం ఒక కొత్త జడ్జి పలకరిస్తుంటే "ఈ వారం జడ్జి గా ఎవరు వస్తారో" అని ఎదురుచూడాల్సి వస్తోంది అంటున్నారు ఆడియన్స్. ఇక లేటెస్ట్  ఎపిసోడ్ జడ్జిగా ప్రగతి ఆంటీ వచ్చి ఎంటర్టైన్ చేశారు.  ఇంద్రజ మాత్రం ప్రస్తుతానికి  ప్రతి ఎపిసోడ్ లో కనిపిస్తున్నారు.  అనసూయ ప్లేస్ లో కొత్త యాంకర్ అని అనుకున్న అందరికీ కూడా మళ్ళీ రష్మినేనా అనే ఫీలింగ్ ఇంతే ఉంది. ఐతే ప్రస్తుతానికి షో ఆగకుండా రష్మీ తో కంటిన్యూ చేయిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కొత్త యాంకర్ వస్తే రష్మిని రీప్లేస్ చేసే అవకాశం కూడా లేకపోలేదు.