సుధీర్ ఈజ్ బ్యాక్!

బుల్లితెరపై సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుధీర్ కనిపిస్తే చాలు ఆ షో హిట్ అన్నట్టుగా మారిపోయింది. ఐతే ఇప్పుడు మళ్లీ ఈటీవీ, మల్లెమాల ఈవెంట్స్ లోకి  సుధీర్ తిరిగొచ్చేశాడు. ఈటీవీ 27వ వార్షికోత్సవం సందర్భంగా  మల్లెమాల నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో సుధీర్ మళ్ళీ మెరిశాడు. సుధీర్ ఎంట్రీ ఆడియన్స్ కి కికిక్కిచ్చింది. కానీ ఆదికి మాత్రం పెద్దగా నచ్చినట్టు లేదు. తన మీద ఫోకస్ అంత సుధీర్ మీదకు వెళ్లిపోతుందేమో అని భయపడి అందరూ పిచ్చ కౌంటర్లు వేసి సుధీర్ ని మాట్లాడనివ్వకుండా చేసేసారు. భలే మంచి రోజు అనే ఈ స్పెషల్ ఈవెంట్ లో సుధీర్ ఎంట్రీ ఇచ్చి ఎంటర్టైన్ చేసాడు. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఇక ఈ ఈవెంట్ లోకి సుధీర్ గ్రాండ్ ఎంట్రీ అద్దిరిపోయింది. ఇక ఆయనొస్తే మిగతా గ్యాంగ్ కూడా పిచ్చి డైలాగ్స్, స్టెప్స్ వేస్తారని తెలిసిందే కదా. వాళ్లందరినీ చూసి సుధీర్ "ఏంట్రా ఇది" అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చేసరికి "సర్ మారితే అందరూ మారతారు మరి" అంటూ ఆది కౌంటర్ వేస్తాడు. "వీళ్లందరితో నా ఎంట్రీ పెట్టారేంటి" అని సీరియస్ గా అనేసరికి "నువ్ వస్తున్నావ్ అని తెలిస్తే ఎంట్రీ కాదు.. ఈవెంట్ కూడా ఒప్పుకోనన్నాడు" అని ఇమ్ము అనేసరికి ఇంద్రజ పడీపడీ నవ్వేస్తుంది. "మిమ్మల్నందరినీ ఒక్క చోట ఉంచుతాడు ఈయన" అంటూ ప్రదీప్ కూడా జోక్ వేసేసరికి "ముందు ఆయన్ని ఒక్క చోట ఉండమనండి చాలు" అంటూ ఆది పంచ్ పిలుస్తాడు. తర్వాత ఒక అమ్మాయికి లవ్ ట్రాక్ వేసే స్కిట్ చేస్తాడు సుధీర్. అందులో అమ్మాయికి అన్నలుగా ఆది, రాంప్రసాద్, ఇమ్ము నటిస్తారు. "అన్నయ్య నేను ప్రేమించింది ఇతన్నే " అంటూ సుధీర్ ని పరిచయం చేస్తుంది వాళ్ళ అన్నలకి. "ఏం చూసి ప్రేమించావు వీడిని" అంటాడు ఆది. "అవన్నీ అప్పుడు సర్..ఇప్పుడు నేను మారిపోయానండి" అని సుధీర్ అంటాడు. "ఏది పక్క ఛానల్ కి మారిపోయావా" అంటూ కౌంటర్ వేస్తాడు ఆది. "మీ చెల్లి కోసం మీరేం చెప్పిన చేస్తా సర్ " అని సుధీర్ అనేసరికి " నా జుట్టు కాస్త మర్దన చెయ్యి.. చూసావా చివరికి నువ్వు ఏ స్టేజికి వచ్చావో " అని కౌంటర్ వేస్తాడు ఇమ్ము. ఆటో రాంప్రసాద్ కి చేతులు పడతాడు. తర్వాత "నా మోకాళ్ళు నొక్కు అని ఆది అనేసరికి సుధీర్ మోకాలి  మీద కూర్చుంటాడు ". " చూసావా కావాలని కిందకి వంగాడు ఎందుకంటే.. మనల్ని బాడ్ చేయడానికి" అంటూ ఆది కౌంటర్ వేస్తాడు.

బ్రేకింగ్ న్యూస్ హెడ్ లైన్స్ లో సుధీర్, ఇమ్ము

జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్ గురించి అందరికీ తెలుసు. ఇమ్ము, వర్ష లవ్ ట్రాక్ కి పునాది కూడా ఈ జబర్దస్త్ లోనే పడింది. సుధీర్, రష్మీ లవ్ ట్రాక్ తర్వాత వర్ష, ఇమ్ము లవ్ ట్రాక్ మస్త్ ఫేమస్ అయ్యింది. ఐతే ప్రస్తుతం ఇమ్ము పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నామంటూ ప్రభుత్వం ఒక బ్రేకింగ్ న్యూస్ ప్రకటించేసరికి షాక్ అయ్యాడు. దీనికి కారణం ఏంటంటే "నైజీరియా, వెస్ట్ ఇండీస్, కెన్యా దేశాలు ఇమ్ము కోసం పోట్లాడుకుంటున్నాయట. మా వాడంటే మా వాడు అంటూ కొట్టుకు ఛస్తున్నాయట". ఈ డైలాగ్ కి ఇమ్ము నవ్వాలో ఏడవాలో అర్ధం కాక సైలెంట్ గా ఉన్నాడు. అలాగే సుధీర్ గురించి కూడా సోషల్ మీడియాలో ఒక బ్రేకింగ్ న్యూస్ ట్రోల్ అవుతోంది. "పందుల పెంపకం వీడియోలో కూడా..వి వాంట్ సుధీర్, వి వాంట్ సుధీర్ " అంటూ కామెంట్స్ పెడుతున్నారట నెటిజన్స్. ఇలా స్పెషల్ బ్రేకింగ్ న్యూస్ బులెటిన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వారం ఇలా  సుధీర్, ఇమ్ము వార్తలకెక్కారు. ఈటీవీ 27వ వార్షికోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ ఈవెంట్ చేసింది. ఆ ఈవెంట్ పేరు "భలే మంచి రోజు"..ఈ డైలాగ్స్ ఆ ఎపిసోడ్ లోవి. ఇక ఈ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఈవెంట్ లో ఈటీవీలో రెగ్యులర్ గా న్యూస్ బులెటిన్స్ వచ్చే న్యూస్ రీడర్స్ తో ఈ బ్రేకింగ్ న్యూస్ చదివించారు. మల్లెమాల నుంచి వెళ్లిపోయిన వాళ్లంతా ఈ షోకి వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసినట్లు కనిపిస్తోంది. వాళ్ళు ఎంత ఎంటర్టైన్ చేశారు అనే విషయం తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.  ఇక ఈ వార్షికోత్సవ స్పెషల్ ఎపిసోడ్ 28 వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలు ప్రసారం కాబోతోంది.

అదిరిందయ్యా సిప్లి.. కొత్త ఇల్లు.. కొత్త కారు!

బిగ్ బాస్ కి ముందు వరకు రాహుల్ సిప్లిగంజ్ అంటే చాలా కొద్ది మందికే తెలుసు. ఇక హౌస్ కి వెళ్లి టైటిల్ గెలిచి బయటికి వచ్చాక ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నిలిచాడు. బిగ్ బాస్ కంటే ముందు ప్లే బ్యాక్ సింగర్ గా ప్రైవేట్ ఆల్బమ్స్‌ చేసేవాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ గురించి ఇప్పుడైతే  తెలియని వారంటూ ఎవరూ లేరు. అతను ఏ పాట పాడినా మంచి ఫీల్ తో పాడతాడు. అందుకే ఆడియన్స్ కి కూడా రాహుల్ అంటే చాలా ఇష్టం. ఇటీవలే కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసేసాడు రాహుల్ సిప్లిగంజ్. తన పుట్టినరోజు కూడా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా 65 లక్షల విలువైన కార్ కూడా కొనుక్కున్నాడు.   "నా తల్లిదండ్రులకు , నా  మిత్రులకు  అందరికీ ధన్యవాదాలు ! ప్రత్యేకంగా నా సోదరుడికి కృతఙ్ఞతలు ..నన్ను ఇష్టపడే వాళ్ళందరి నుంచి నా పుట్టినరోజు నాడు ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్ అందుకున్నాను" అంటూ రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. అలీ రెజా, అరియనా గ్లోరీ కూడా విషెస్ పోస్ట్ చేశారు.  బిగ్ బాస్ హౌస్ లో సొంతింటి కల గురించి చెప్పి బయటికి వచ్చాక దాన్ని నెరవేర్చుకున్నారు రాహుల్. ఇలా అన్ని శుభవార్తలు తెలిసేసరికి  ఇండస్ట్రీకి  చెందిన అభిమానులు, స్నేహితుల నుండి రాహుల్‌కు విషెస్  వెల్లువెత్తుతున్నాయి. ఇక తాను కొన్న కార్ ఫొటోస్, కొత్త ఇంటి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాకు వెంకటేశ్వర స్వామి, వినాయకుడు అంటే ఇష్టం

ఆలీతో సరదాగా షో ఇండస్ట్రీకి సంబందించిన ఫేమస్ పర్సన్స్ ని మనం ఇప్పటి వరకు చూసాం. కానీ ఇప్పుడు మొదటిసారిగా నాన్ మూవీ కేటగిరీలో ఈ షోకి వచ్చిన ఫస్ట్ గెస్ట్ పీవీ.సింధు. ఈ ఎపిసోడ్ లో సింధు ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. ఆలీ కూడా మద్యమద్యలో సరదాగా జోక్స్ వేసి నవ్వించారు. సింధుని ఆలీ ఎన్నో ప్రశ్నలు అడిగారు. అందులో ఒకటి " నువ్వు గ్రౌండ్ లోకి వెళ్ళేటప్పుడు మనసులో ఏ దేవుడిని స్మరించుకుంటూ ఎంటరవుతావు" అన్న ప్రశ్నకు "ఆల్ ఇన్ వన్ దేవుడా" అనుకుంటా అని నవ్వుతూ చెప్పింది   సింధు. అంటే "దేవుడా గెలిపించు" అనుకుంటావా అని అడిగేసరికి సింధు నవ్వుతూ " దేవుడు అన్ని గెలిపించలేడు కదా, బాగా ఆడాలి, మంచిగా ఆడాలి" అని అనుకుంటాను అని జవాబిచ్చింది. " నేనైతే షూటింగ్ కి వెళ్ళేటప్పుడు నమాజ్ చేసుకుని బయల్దేరతాను .. మరి నువ్వు గేమ్ ఆడడానికి వెళ్ళేటప్పుడు ఎవరిని ..అంటే అమ్మ, నాన్న, గురువు వీరిలో ఎవరిని ఎక్కువుగా మనసులో అనుకుంటావు..వీళ్ళెవరూ కాకపొతే నీ ఫేవరెట్ దేవుడు ఎవరు " అని ఆలీ అడిగేసరికి "ఫేవరేట్ గాడ్ అంటూ ఎవరూ లేరు..ఆడియన్స్ ని చూసేసరికి నాకు ఫుల్ జోష్ వచ్చేస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతో మంది నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు. ఐనా  కూడా నాలో ఎక్కడో ఒక చోట ప్రెషర్ అనేది ఉంటుంది..అలాంటి టైంలో వెంకటేశ్వర స్వామిని, గణేషుడిని మనసులో తలుచుకుంటాను. అప్పుడు కాస్త రిలాక్స్ గా అనిపిస్తుంది. నేను ఎక్కువగా టెంపుల్స్ కి కూడా వెళ్తుంటాను..రీసెంట్ గా లాల్ దర్వాజా బోనాల సంబరాలకు కూడా వెళ్లాను" అని తన ఫేవరేట్ గాడ్స్ గురించి, తనలో ఉన్న  దైవభక్తి గురించి ఈ షోలో చెప్పింది పూసర్ల వెంకట సింధు.

నా డాన్స్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే అంటున్న గాజువాక డిపో లేడీ కండక్టర్

అన్ని షోస్ లోకి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ స్పీడ్ మీద ఉంది. ఈ షోలో ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. బుల్లి తెర మీద ఇప్పుడు ఈ షో మిగతా షోస్ తో ఈక్వల్ గా పరిగెడుతోంది. జబర్దస్త్ లాగే ఈ షోకి కూడా జడ్జెస్ పర్మనెంట్ గా ఉండరు. ప్రతీ వారం కొత్త కొత్త జడ్జెస్ హాయ్, హాయ్ చెప్తారు..అంతలోనే బై బై చెప్పేస్తారు.  నిన్న, మొన్నటివరకూ ఈ షోకి జడ్జిగా పూర్ణ, ఇంద్రజ వచ్చి సందడి చేస్తే..ఇక ఈ వారం జడ్జిగా నటి ఆమని సందడి చేయనుంది. లేటెస్ట్ ఈ షో ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.  ఈ ప్రోమో చూస్తే చాలు మొదటి నుండి చివరి వరకు ఫుల్ జోష్ తో సాగినట్లు కనిపిస్తోంది. ఇక ఈ షోకి హైలైట్ గా నిలిచింది లేడీ కండక్టర్. ఏపిఎస్ ఆర్టీసీ  గాజువాక బస్ డిపోకి చెందిన లేడీ కండక్టర్ ఇరగదీసి చేసిన డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఆమని ఐతే ఆ డాన్స్ చూసి తనకు కూడా అలా చేయాలనిపించింది అని చెప్పేసరికి ఆ కండక్టర్ వెంటనే ఆమనితో, రష్మీతో కలిసి మళ్ళీ డాన్స్ చేసింది. వాళ్ళతో పాటు ఆది, చంటి, రాంప్రసాద్, భాస్కర్, నరేష్, ఇమ్ము అందరూ డాన్స్ చేశారు. మధ్యలో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్ కామెడీ పర్లేదనిపించింది. ఈ లేడీ కండక్టర్ డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

నరేంద్రమోడీ గారిని కలవడం నిజంగా అదృష్టం...

పీవీ.సింధు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. మొదట్లో ఎన్నో విమర్శలు తట్టుకుని అంచలంచెలుగా పైకి ఎదిగి ఈరోజున ఎంతో మంది పేరెంట్స్ కి, పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడింది. అలాంటి పీవీ.సింధుని ఆలీ తన షోకి తీసుకొచ్చి ఎన్నో విషయాలను చెప్పేలా చేశారు. "నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు నీ ఫీలింగ్ ఏమిటి ? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ? ఐస్ క్రీం కూడా తిన్నావు కదా ? అది ఏ ఫ్లేవర్ ? అంటూ ఆలీ సరదాగా కొన్ని, ఇంటరెస్టింగ్ గా కొన్ని ప్రశ్నలు అడిగేసరికి అన్ని ఫ్లేవర్స్ తెప్పించి నా ముందు పెట్టారు.. నీకు ఈ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తిను" అన్నారని చెప్పి నవ్వేసింది సింధు.  "నేను గెలిచినప్పుడల్లా మోడీ గారిని కలిసేదాన్ని , ఆయన చెప్పే ఇన్స్పైరింగ్ వర్డ్స్ వినేదాన్ని, నన్ను అభినందించినప్పుడు చాలా సంతోషించేదాన్ని. నేను ఒలింపిక్స్ లో గెలిచాక వెంటనే నాకు ఫోన్ చేసి నన్ను విష్ చేశారు. అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ . అలాగే "ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ " అంటూ నా గురించి ట్వీట్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. "నిజంగా ఈ విషయాలన్నీ చాలా గర్వంగా అనిపిస్తాయి నాకు. అలాగే ఆట గెలిచి వచ్చాక నీతో ఐస్ క్రీం తింటా అని మోడీ గారు నాకు ప్రామిస్ చేశారు. నేను ఆ విషయం మర్చిపోయారనుకున్నా.. కానీ కాదు. ఆయన గుర్తుపెట్టుకుని మరీ ఐస్ క్రీం తెప్పించారు. అలాగే ఇంకో హ్యాపీ విషయం ఏంటంటే మోడీ @ 20 బుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. అందులో నేను ఆయన గురించి ఒక చాప్టర్ రాయడం నిజంగా నాకు చాలా  గొప్పగా అనిపిస్తుంది..ఇట్స్ ఏ గ్రేట్ ఆనర్ " అంటూ చెప్పింది పీవీ.సింధు.

అనసూయను మర్చిపోని దొరబాబు..

జబర్దస్త్ షో అంటే అప్పటికీ, ఎప్పటికీ గుర్తుండేది అనసూయ, రష్మీ, నాగబాబు, రోజా, సుధీర్. వారిని వీక్ష‌కులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఇక జబర్దస్త్ కమెడియన్స్ కూడా అక్కడ యాంకర్స్ మారినా పొరపాటున వెళ్లిపోయిన వాళ్ళను గుర్తుచేసుకుని నాలుక కరుచుకుంటూ ఉంటారు. అలాంటిదే ఒకటి జబర్దస్త్ ఎపిసోడ్ లో జరిగింది. ఆది టీంలో కమెడియన్ గా చేసే దొరబాబుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తుంటాడు. రాబోయే ఎపిసోడ్ లో దొరబాబు తప్పులో కాలేశాడు. స్కిట్ లోకి వచ్చి రాగానే ఇంకా అనసూయ యాంకర్ గానే ఉన్నది అనుకున్న‌ట్లుంది దొరబాబు.  ఒక పక్క పరదేశి, రష్మీ స్టెప్పులేస్తుంటే దొరబాబు చూస్తూ ఉండిపోయాడు. పరదేశి "నువ్వేంట్రా అలా చూస్తున్నావ్?" అన్నాడు. "అనసూయ స్టెప్పులు" అంటూ గబుక్కున అనేసి, నాలుక క‌రుచుకొని, "ఛీఛీ.. రష్మీ" అంటూ కవర్ చేసుకోవడానికి తెగ ట్రై చేశాడు. కానీ  రష్మీ "ఓయ్" అంటూ వెనకబడి మరీ పరిగెత్తి కొట్టింది. గ్లామరస్ క్వీన్ అనసూయని అంత తొందరగా ఎవరూ మర్చిపోవడం సాధ్యం కాదు. ఇప్పుడు దొరబాబు అనసూయ పేరు చెప్పేసరికి రష్మీ బాగానే హర్ట్ ఐనట్టు కనిపిస్తోంది. దొరబాబు, పరదేశీ ఈ ఇద్దరూ ఆది టీంలో తప్ప ఇంకెక్కడా కనిపించరు. ఐతే కొద్దీ రోజులుగా ఆది జబర్దస్త్ షోలో కనిపించక పోయేసరికి ఈ టీం కూడా ఎక్కడా కనిపించట్లేదు. మళ్లీ ఇప్పుడు దొరబాబు, పరదేశీ కనిపిస్తున్నారు.

'నాది మొత్తం కత్తిరించేస్తారు' అంటున్న భగవాన్!

జబర్దస్త్ ప్రతీ వారం తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ షో ద్వారా పేరు సంపాదించుకున్న ఎంతో మంది సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ లుగా మారిపోయారు. ఇలాంటి జబర్దస్త్ నుంచి ఎంతో మంది వెళ్లిపోయారు. జడ్జెస్ నాగబాబు, రోజా వెళ్లిపోయిన దగ్గర నుంచి ఎంతో మంది మారుతున్నారు. వారానికి ఒకరు, రెండు వారాలకు ఒకరు అన్నట్టుగా కొత్త కొత్త వాళ్ళను తెస్తున్నారు. జడ్జెస్ ప్లేస్ లో వచ్చే వారం ఎవరు అనేది మాత్రం జబర్దస్త్ ఆడియన్స్ కి పెద్ద పజిల్ అని చెప్పొచ్చు.  కొన్ని వారాలు మనో, ఇంద్రజ, ఆమని వంటి వారు జడ్జిలుగా వచ్చారు. ఇక ఇప్పుడు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ కమెడియన్ కృష్ణభగవాన్ ను జడ్జిగా తీసుకొచ్చింది మల్లెమాల టీం. ఇంద్రజ మాత్రం ఈ షోకి పెర్మనెంట్ జడ్జిగా ఫిక్స్ ఐపోయింది. ఇకపోతే ఈ షోకి కృష్ణ భగవాన్ ఎంట్రీ అయితే అందరికీ షాకిచ్చింది. ఐతే ఈ ఎపిసోడ్ ప్రోమో చూస్తే గనక  కంటెస్టెంట్లను మించి భగవాన్ పంచులు వేసినట్టు కనిపిస్తోంది. ఇందులో వెంకీ మంకీస్ టీమ్ 'శివపుత్రుడు' మూవీలో ఒక  సీన్ స్పూఫ్ కామెడీ చేశారు. ఈ స్కిట్ అయ్యాక ఇంద్రజ ఆ టీంని చాలా ఎక్కువగా పొగిడేసరికి "ఆవిడ స్కిట్ కంటే ఎక్కువగా చెప్పారు" అంటాడు భగవాన్. "ఇంత ఇస్తే గాని అందులో ఏది బాగుందో చూసుకుని కట్ చేసి వేసుకునే వీలుండదు. ఎడిటర్స్ కి అందుకే ఇంత ఎక్స్ప్రెషన్ ఇస్తాను" అన్నట్టుగా చెప్తుంది ఇంద్రజ.. ఇక ఆమె మాటకు  "ఐతే నాది మొత్తం కట్ చేస్తారు" అంటూ కౌంటర్ వేస్తాడు. ఇక ఈ వారం కృష్ణ భగవాన్ కామెడీ ఆడియన్స్ ని  ఎంటర్టైన్ చేయనుంది.

జీ తెలుగులో త్వరలో పడమటి సంధ్యారాగం

జీ తెలుగు ఛానల్ మరో కొత్త సీరియల్ లో త్వరలో రాబోతోంది. ఈ సీరియల్ కి సంబందించిన ప్రోమో ఒకటి ఇప్పుడు రిలీజ్ అయ్యింది. పడమటి సంధ్యారాగం పేరుతో ఈ సీరియల్ టైటిల్ అలరించనుంది. ఈ పేరు వినగానే ఒకప్పటి విజయశాంతి సినిమా గుర్తురాకుండా మానదు ఆడియన్స్ కి. మల్లి సీరియల్ లో హీరోయిన్ తల్లిగా నటించిన జయశ్రీ, అలాగే గుప్పెడంతమనసు సీరియల్లో మహేంద్రగా నటించిన సాయికిరణ్ భార్యాభర్తలుగా నటించారు. అలాగే  పిన్ని 2 , కావ్యాంజలి సీరియల్ లో నటించిన ప్రీతి శర్మ ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ లో నటిస్తోంది. ఇంకా కన్నడ యాక్టర్  సుజిత్ గౌడ్ ఉప్పెన సీరియల్ తర్వాత ఈ సీరియల్ లో  నటిస్తున్నాడు. ఇంకా ఈ సీరియల్ లో కుంకుమ పువ్వు, గోరింటాకు, అత్తారింటికి దారేది సీరియల్స్ లో నటించిన సాత్విక్ చౌదరి, దేవత, ఉప్పెన వంటి ఎన్నో సీరియల్స్ లో నటించిన శ్వేత కనిపించబోతోంది. అలాగే కార్తీక దీపంలో నటించిన రజిత, కృష్ణ తేజ, ద్రాక్షారామం సరోజ ఇలా అభిమాన తారలు నటించిన ఈ సీరియల్ త్వరలో ప్రసారం కాబోతోంది. "ఒంటరిని చేసే ఒక్క జ్ఞాపకాన్ని కూడా మోయలేని ఆ మనసు వేచి ఉంది ఎవరి కోసం" టాగ్ లైన్ తో జీ తెలుగు తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసింది. ఐతే ఇది హిందీ సీరియల్ సప్నే సుహానే లడక్పన్ కె  అనే సీరియల్ కి రీమేక్ అంటూ, ప్రోమోలో చాలా డెప్త్ ఉంది ఈ సీరియల్ కోసం ఎదురుచూస్తున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సూపర్ సింగర్ జూనియర్ గ్రాండ్ ఫినాలే గెస్టులు.. నాగార్జున, బ్రహ్మానందం!

సూపర్ సింగర్ జూనియర్ గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. సుధీక్ష, బెన్ని అలియాస్ భువనేష్, తమన్, మయూఖ్, ధీరజ్ టాప్ 5 ఫైనలిస్టుల జాబితాలోకి చేరిపోయారు. ఇక ఇప్పుడు గ్రాండ్ ఫినాలే చాలా అద్భుతంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన ప్రోమో ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ వన్ అండ్ ఓన్లీ లాఫింగ్ సూపర్ స్టార్, పద్మశ్రీ  డాక్టర్ బ్రహ్మానందం వచ్చారు. కింగ్ ఆఫ్ కామెడీ అనే టైటిల్ ఆయన వెనక రోల్ అవుతూ ఉంటుంది. ఆయన సుధీర్, అనసూయతో కలిసి స్టెప్పేశారు. తర్వాత "బ్రహ్మానందం గారూ" అని గట్టిగా అరుస్తున్నట్టుగా పిలిచింది అన‌సూయ‌.. ఆ పిలుపుకు "అమ్మ బాబోయ్" అని సుధీర్ ని పట్టుకుని భయపడిపోతూ, "ఇక్కడే ఉన్నాను కదరా అలా అరుస్తుందేమిటి?" అంటూ కామెడీ చేశారు. "మీరు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది" అని సుధీర్ అనేసరికి, "అంతకంటే మీరు ఇంకేం అంటారు.. 'మీరు రావడం చాలా చాలా దారుణంగా ఉంది' అనలేరు కదా" అంటూ పంచ్ డైలాగ్ వేశారు బ్ర‌హ్మానందం. ఆ తర్వాత 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ హీరో హీరోయిన్లు సుధీర్‌బాబు, కృతి శెట్టి, సుధీర్ బాబు వచ్చారు. కృతితో త‌న‌ని తాను ప‌రిచ‌యం చేసుకున్నాడు. సుడిగాలి సుధీర్.. "నాకు మీరు తెలుసు, మీ రివ్యూస్ చదువుతుంటాను" అంది కృతి. తర్వాత సుధీర్ తో కలిసి "విజిలు విజిలు" అనే పాటకు డాన్స్ చేసింది. ఇక ఈ గ్రాండ్ ఫినాలే కి గెస్ట్ గా సొగసు తరగని సోగ్గాడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. "కింగ్ ఆఫ్ స్వాగ్" అనే టైటిల్ రోల్ అవుతూ ఉంటే, 'కింగ్' సాంగ్ ప్లే అవుతూ ఉంటే ఎంట్రీ ఇచ్చారు నాగ్‌. ఇలా రాబోయే ఎపిసోడ్ మస్త్ గ్రాండ్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

'నాకు జబర్దస్త్ వల్ల పేరు రాలేదు'.. చంటి కామెంట్స్ వైరల్!

జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. బిగ్ స్క్రీన్ మీద చేసినా రానంత పేరు జబర్దస్త్ స్టేజి వల్ల సాధ్యమయ్యింది. ఐతే దాన్ని కొంత‌మంది ఒప్పుకోక‌పోతుండ‌టం గ‌మ‌నార్హం. ఈ జబర్దస్త్ గురించి ఎన్నో రూమర్స్ బయటికి వచ్చాయి. ఇటీవల చలాకి చంటి ఈ షో గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ షో నుంచి కూడా చాలామంది వెళ్లిపోయారు. అనసూయ కూడా అక్కడ  వినిపించే బాడీ షేమింగ్ కామెంట్లు, వెకిలి చేష్టలు, డబుల్ మీనింగ్ డైలాగులు భరించలేక బయటికి వచ్చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా చంటి తనకున్న పేరు అనేది జబర్దస్త్ వల్ల రాలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘జబర్దస్త్‌’ ఆర్టిస్టులకి సినిమా అవకాశాలు రావని, సినిమాల విషయంలో ‘జబర్దస్త్’ ఆర్టిస్టులు ఎప్పుడూ మోసపోతూ ఉంటారని, స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఉన్నట్టుగా సెట్స్‌పైకి వెళ్ళాక ఉండదని అంటుంటారు నిజమేనా?’ అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు చలాకీ చంటి జవాబిచ్చాడు. ముందుగా, “నాకు ‘జబర్దస్త్’ వల్ల పేరు రాలేదు. నేను  సినిమాలు చేసి జబర్దస్త్ కి వచ్చాను. కాబట్టి నాకు సినిమాల గురించి బాగా తెలుసు. అందుకే పెద్దగా మోసపోలేదు. బహుశా మిగతా వాళ్ళకి అది తెలియదు కాబట్టి మోసపోయి ఉంటారు" అని చెప్పుకొచ్చాడు.  "జబర్దస్త్ కి వెళ్ళకముందే 20 సినిమాలు చేశాను. ఆ త‌ర్వాతే జబర్దస్త్‌కు వెళ్ళాను. స్కిట్‌ వేరు, సినిమా వేరు. ఆ తేడా నాకు బాగా తెలుసు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో నేను అర్థం చేసుకోగలుగుతాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చంటి చేసిన  కామెంట్స్  వైరల్ గా మారాయి.

ఇంతకు నా సౌందర్య లహరి ఎక్కడ అంటున్న ఆది

డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా హైపర్ ఆదిని చెప్పుకోవచ్చు. ఒక్కోసారి తన మీద తానె పంచులు వేసుకుని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. లేటెస్ట్ గా ప్రసారం ఐన శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్‌లో ఆది ఒక రేంజ్ లో రెచ్చిపోయాడు. సౌందర్య లహరి అంటూ బొడ్డు మీద పుట్టుమచ్చ అంటూ ఇలా ఓ కాన్సెప్ట్‌తో ఈ సారి ఎంటర్టైన్ చేశారు. అయితే ఇందులో భాగంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ లేడీస్ అందరినీ ఒకే సారి పిలిపించారు. అందులో తనకు కావాల్సిన సౌందర్య లహరి ఎక్కడుంది  ? ఆ నడుము మీద మచ్చ ఎక్కడుందా? అని వెతుకుంటాడు ఆది.  పవన్ కళ్యాణ్ లా ఆది చేస్తాడు. ముందు మలక్ పేట్ శైలజ ముందుకు వస్తుంది. నాకు మచ్చ ఉందేమో చూడు అని అంటుంది. నిన్నూ, నీ పుట్టు మచ్చను నేను చూడను అంటూ  పరువుతీస్తాడు.  వీళ్లను ఎందుకు పెట్టారంటూ ఆది కౌంటర్లు వేస్తాడు. మొత్తానికి నటకుమారి, శైలజ ఆదికి చుక్కలు చూపిస్తారు. తర్వాత భాస్కర్, నరేష్, శీరిష కూడా వచ్చి నడుము పుట్టు మచ్చ చూసుకోండి అంటూ చెప్తారు.  ఇక ఇందులో వకీల్ సాబ్ మూవీలో నటించిన  సూపర్ వుమెన్ బ్యూటీ కూడా వచ్చి ఎంటర్టైన్ చేసింది. నరేష్ వచ్చి కొత్తిమీర, కర్రెపాకే అంటూ కూరగాయలు అమ్ముతూ ఉంటాడు. ఇలా ఈ వారం స్కిట్ ముగిసింది.

చిరంజీవికి బుల్లి తెర స్టార్స్ విషెస్!

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎంతో మంది విషెస్ చెప్పారు. సోషల్ మీడియా మొత్తం కూడా చిరు ఫొటోస్ హల్చల్ చేశాయి. అలాగే బుల్లి తెర స్టార్స్ కూడా చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని ఆయనతో దిగిన ఫొటోస్ ని షేర్ చేసుకుని ఫుల్ కుష్ అయ్యారు. జబర్దస్త్ నటుడు గెటప్ శీను ఐతే " మెమోరీస్ విత్ మై బాస్ " అంటూ ఆయనతో ఉన్న ఫోటో షేర్ చేసాడు. "మనిషి మాత్రమే మెగాస్టార్ కాదు..మనసు కూడా మెగాస్టార్" అంటూ యాంకర్ శ్రీముఖి చిరంజీవికి ఫ్లవర్ బొకే ఇచ్చిన ఫోటో పోస్ట్ చేసింది. " ది బాస్ అఫ్ ది బాసెస్" అంటూ అలీ రెజా ఫోటో ఇన్స్టా స్టేటస్ లో పెట్టుకున్నాడు. "మీ అడుగు, మీ మాట, మీ పని మమ్మల్ని ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది" అంటూ యాంకర్ రవి పోస్ట్ చేసాడు. "హ్యాపీ బర్త్ డే చిరు సర్" అంటూ అరియనా పోస్ట్ చేసింది.  "నడక కలిసిన నవరాత్రి" అనే సాంగ్ చూసి ఒక షోలో ఫిదా ఐన చిరంజీవి వీడియో పోస్ట్ చేసాడు శ్రీరామచంద్ర. "మీరెప్పటికీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్" అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ చిరుతో దిగిన ఫోటో పెట్టి పోస్ట్ చేసుకున్నాడు. ఇక శేఖర్ మాస్టర్ కొడుకు విన్నీ ఐతే చిరు పోస్టర్స్ అంటించి ఆ పోస్టర్స్ ఎదురుగా చిరు సాంగ్స్ కి డాన్స్ చేసిన వీడియో పోస్ట్ చేసాడు. "నాకు మీరే ఇన్స్పిరేషన్" అంటూ సుడిగాలి సుధీర్ చిరు ఆశీస్సులు తీసుకుంటూ ఉన్న ఫోటో పోస్ట్ చేసాడు. ఇలా బుల్లి తెర యాంకర్స్, జబర్దస్త్ కమెడియన్స్, సింగర్స్ అందరూ కూడా చిరు కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.  

డాన్స్ ఐకాన్ ఫస్ట్ లుక్ రిలీజ్..ఈ షోతో ఆహా ఓటిటిలోకి ఓంకార్ ఎంట్రీ

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా' ఆడియన్స్ ని అలరించడానికి ఎప్పుడో ముందుంటుంది. ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలను, రియాలిటీ టాక్ షోలను అందించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా సరికొత్త డాన్స్ షోతో ప్రేక్షకుల అలరించడానికి రాబోతోంది. ‘డాన్స్’ అంటే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. ప్రతీ ఒక్కరూ ఒక డాన్సరే. ఐతే వాళ్ళల్లోంచి  ఆణిముత్యాలని వెతికి, వారి ప్రతిభను ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి  'డాన్స్ ఐకాన్' షోతో త్వరలో వచేయడానికి  సిద్దమయ్యింది.  ఐతే ఇప్పుడు ఈ షోకి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది.  ఇప్పటికే  తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షో ఆహా ఓటీటీ ద్వారా మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించడమే కాదు మంచి సక్సెస్ ను కూడా అందుకుంది.  ఇక ఇప్పుడు డాన్స్ కంటెస్టెంట్స్ తో రాబోతోంది. ఓంకార్ ఈ షోతో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ షోకి యాంకర్ గా, ప్రొడ్యూసర్ గా అన్ని తానె దగ్గరుండి చూసుకుంటున్నాడు. లేటెస్ట్ గా ఈ షో  ఫస్ట్ లుక్ పోస్టర్ ను రీసెంట్ గా ‘ఆహా’ విడుదల చేసింది.  స్టైలిష్ స్టేజి తో పాటు బుల్లితెర స్టైలిష్ యాంకర్ ఐకాన్ ఐన ఓంకార్ అద్దిరిపోయే లుక్ లో కనిపించారు. ఏ ఏజ్, ఏ స్టైల్ , నో లిమిట్ త్వరలో మన ఆహాలో అంటూ చెప్పాడు ఓంకార్.

'డ్యాన్స్ ఐకాన్' షోకి నటి రమ్యకృష్ణ

ఓంకార్ యాంకర్ గా, ప్రొడ్యూసర్ గా తీసుకురాబోతున్న  'డ్యాన్స్ ఐకాన్'  షో మీద రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఐతే ఇప్పుడు ఈ షోలోకి నటి రమ్య కృష్ణ కూడా రాబోతోందని టాక్ వినిపిస్తోంది. డాన్స్ షోస్ కి జడ్జిగా వ్యవహరించే శేఖర్ మాస్టర్ తో పాటు రమ్య కృష్ణ కూడా న్యాయనిర్ణేతలుగా ఉండబోతున్నట్టు సమాచారం అందుతోంది. రమ్యకృష్ణ బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా చేసింది. అలాగే ఫిక్షన్ సీరియల్ నాగభైరవిని కూడా అప్పట్లో  ప్రమోట్ చేసింది. ఓంకార్ డాన్స్ షోస్ లో జడ్జెస్ గా ఉండే యశ్వంత్, మోనాల్ గుజ్జర్ తో పాటు ఇప్పుడు శ్రీముఖి కూడా కనిపించబోతోంది.  ఇక ఈ షోలో 5-50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు పాల్గొంటారని మేకర్స్ ఎప్పుడో చెప్పారు. ఇక ఇప్పుడు  విజయ్ దేవరకొండ, అనన్య పాండేని స్పెషల్ గెస్ట్స్ గా తీసుకురాబోతున్నట్టు, అలాగే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్టు సమాచారం.  టీవీలో, OTTలో ఒకేసారి ప్రసారమయ్యే  మొదటి తెలుగు డ్యాన్స్ రియాలిటీ షోస్ లో ఈ డాన్స్ ఐకాన్ ఒకటి. ఐతే ఈ జడ్జెస్, స్పెషల్ గెస్ట్స్ కి సంబంధించిన ఆఫీషియల్ న్యూస్ త్వరలో రానుంది.

రాహుల్‌ సొంతింటి కల నెరవేరింది!

రాహుల్ సిప్లిగంజ్ ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో సాంగ్స్ పాడి ఫుల్ ఫేమస్ అయ్యాడు. బిగ్‌ బాస్‌ 3లో  విన్నర్‌గా నిలిచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. హౌస్ లో రాహుల్ కి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న శ్రీముఖి ఇతన్ని బాగా ఇబ్బంది పెట్టింది. బిగ్‌ బాస్‌ తర్వాత రాహుల్ కు వరుసగా మూవీస్ లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. మరో పక్క ఆల్బమ్స్‌ కూడా చేస్తూ ఫుల్‌ బిజీగా వున్నాడు రాహుల్. కృష్ణ‌వంశీ ‘రంగమార్తాండ’ మూవీలో రాహుల్ ఓ ఇంపార్టెంట్ రోల్ లో కూడా నటించాడు.  ఇక సోషల్‌ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉండే రాహుల్‌  తన పర్సనల్‌ లైఫ్‌ మూమెంట్స్ ని  కూడా షేర్ చేసుకుంటూ ఉంటాడు. తాజాగా తన అభిమానులతో ఓ గుడ్ న్యూస్ పంచుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సొంతిల్లు అనేది తన కల అంటూ రాహుల్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తన  కొత్త ఇంటి కలను సాకారం చేసుకుని, అందులో అడుగుపెట్టినట్టు చెప్పాడు. లేటెస్ట్ గా తన గృహప్రవేశానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి.. ‘మీ అందరి ఆశీస్సుల వల్లే నా సొంతింటి కల నెరవేరింది’ అంటూ ఎమోషనల్ పోస్ట్ ఒకటి టాగ్ చేసాడు. అతని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శోభన్ బాబు డార్లింగ్ ఐతే, కృష్ణ గారు అంకుల్

ఈటీవీ 27 వ వార్షికోత్సవం సందర్భంగా అలనాటి అందాల తారలతో కాష్ ప్రోగ్రాం రాబోతోంది. ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఇందులో జయసుధ, ఆమని, సంఘవి, ఖుష్బూ వంటి తారలు వచ్చి సందడి చేశారు. ఇక వీళ్లందిరతో ఆటలు ఆడిస్తుంది, బొమ్మలు గీయిస్తుంది. సంఘవి నోట్లో ఒక పండు పెట్టి టంగ్ ట్విస్టర్ చెప్పించాలని చూస్తుంది. ఈ తారలంతా తన కెరీర్స్ ఈటీవీతో ఎలా మొదలయ్యింది అనే విషయాలను చెప్పుకొచ్చారు. ఇక ఆమనితో బొమ్మలు గీయిస్తుంది సుమ. శుభలగ్నంలో జగపతిబాబుని  రోజాకు అమ్మేసే బొమ్మలు  వేయిస్తుంది.  ఐతే ఆ రోజా బొమ్మలో ముక్కు మూతి లేకుండా బొమ్మ వేస్తుంది ఆమని. తర్వాత " హోటల్ పెట్టేదేలే" అనేదాన్ని ఓపెన్ చేస్తుంది సుమ. ఆ హోటల్ లో మెనూ చదువుతుంది.  ఖుష్భు ఇడ్లీ, జయసుధ దోస, ఆమని పెసరట్టు, సంఘవి సాంబార్ ఇడ్లీ, సుమ పూరి, విజయ్ దేవరకొండ మసాలా దోశ స్పెషల్ అని చెప్తుంది. తర్వాత జయసుధకి శోభన్ బాబు ఫోటో చూపించేసరికి డార్లింగ్ అంటుంది. కృష్ణ గారి ఫోటో చూపించేసరికి అందరికంటే ఈయనతోనే చాలా తక్కువ సినిమాలు చేసాను, ఎందుకంటే ఆయన మా అంకుల్ కాబట్టి అంటుంది. ఇక జయసుధ తన సినీ కెరీర్ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా క్యాష్ టీమ్ మొత్తం కూడా ఆమెను సన్మానిస్తారు. అలాగే ఆడియన్స్ వచ్చి పూలు ఇచ్చి విషెస్ చెప్తారు.

పంచులు వేయడానికి కానీ పరోటాలు చేయడానికి వస్తారా షోకి

అన్నపూర్ణమ్మ ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి నటి. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద కూడా తన హవా కొనసాగిస్తోంది. ఇటీవల వస్తున్న అన్ని షోస్ లో కూడా అన్నపూర్ణమ్మ కనిపిస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. అలాగే జబర్దస్త్ లో స్కిట్స్ వేస్తోంది. ఇక ఇప్పుడు పెద్దమ్మగా శ్రావణ సందడి షోలో ఎంటర్టైన్ చేసేసింది. అనసూయ పెద్దమ్మ అంటూ అన్నపూర్ణమ్మను పిలిచేసరికి పెద్దమ్మ అంటే అరుంధతిని పిలిచినట్టుగా ఉంది అబ్బాయి నాకు అని అంటుంది రవితో. జేజెమ్మ అని కాదు పిలిచింది పెద్దమ్మ అని అనేసరికి సీరియస్ గా చూస్తుంది. పెద్దమ్మ అంటే మీరేనా అంటూ మూతి విరుస్తాడు రవి.  నేను గాక చందమామలోంచి పేదరాశి పెద్దమ్మ దిగొస్తుంది అనుకున్నావా ఏమిటి అంటుంది అన్నపూర్ణ. అబ్బో ఇక్కడికొచ్చి పంచులేస్తున్నారుగా అంటాడు రవి. మరి పంచ్లు వేయకపోతే పరోటాలు చేస్తారా ఏమిటి అంటూ కౌంటర్ వేస్తుంది అన్నపూర్ణమ్మ. ఇక ఆమె  కోపం తగ్గించడానికి నువ్వే రోజూ నా కలలోకి వస్తూ ఉంటావ్ అంటాడు రవి. అమ్మాయిలు గొప్పా అబ్బాయిలు గొప్పా అంటూ పోటీ పడేసరికి వాళ్ళ వాళ్ళ సమస్యలకు అన్నపూర్ణ ఆన్సర్స్ ఇస్తుంది. ఇంతలో రవి ఆడపిల్లల్ని ఎలా కంట్రోల్ లో పెట్టుకోవాలి పెద్దమ్మ అని అడిగేసరికి. కొషెన్స్ అడుగు అంతే కానీ సీక్రెట్స్ అడగకు అంటూ ఫన్ చేస్తుంది అన్నపూర్ణమ్మ.  

'ది కశ్మీర్ ఫైల్స్' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడంటే...

గత కొన్ని వారాల్లో రాధే శ్యామ్, కిన్నెరసాని, పెళ్లి సందడి, కేజిఎఫ్: చాప్టర్ 2 వంటి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ తో వినోదాన్ని పంచిన 'జీ తెలుగు', ఈ సారి 'ది కశ్మీర్ ఫైల్స్' అనే మరో పాన్-ఇండియా సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రబోర్తి, పల్లవి జోషి, పునీత్ ఇస్సర్, దర్శన్ జోషి, మ్రిణాల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఆగష్టు 28న (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. ఈ చిత్రంలోని నటీనటుల అద్భుతమైన ప్రదర్శనలు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. 1990 లలో కశ్మీరీ పండితులు ఎదుర్కొన్న పరిస్థితులను ఆధారంగా తీసుకొని నిర్మించబడిన ఈ చిత్రం కశ్మీరీ పండితుడు పుష్కర్ నాథ్ (అనుపమ్ ఖేర్) మనవడైన కృష్ణ పండిట్ (దర్శన్ కుమార్) చుట్టూ తిరుగుతుంది. కశ్మీరీ పండితుల యొక్క నిర్గమనం (ఎక్సోడస్) పై సందిగ్ధంలో ఉన్న కృష్ణ పండిట్, తన తాత యొక్క చివరి కోరికను తీర్చడానికి కశ్మీర్ కు వెళ్తాడు. అక్కడ కృష్ణ పండిట్ పుష్కర్ నాథ్ యొక్క మిత్రుల ద్వారా కశ్మీర్ నిర్గమనం గురించి మరియు తన తల్లితండ్రులు ఎలా చనిపోయారో తెలుసుకోవడంతో కథ అడ్డం తిరుగుతుంది.  కశ్మీరీ పండితుల పాత్రలలో నటీనటులు చేసిన అద్భుత ప్రదర్శనలు, మంచి బాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ అందరిని టీవీలకు కట్టిపడేస్తాయి.