ఇది కదరా ‘మన ఊరి రంగస్థలం’ అంటే
వినాయక చవితి పండగకు బుల్లి తెర మీద షోస్ మీద షోస్ అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ప్రోమోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నాయి. ఇప్పుడు జీ తెలుగులో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని "మన ఊరి రంగస్థలం" అనే స్పెషల్ ఈవెంట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. ఈ షో ప్రోమో చూస్తే చాలు ఎంత ఫన్ ఉండబోతోంది అనేది తెలిసిపోతుంది.
"నాకిష్టమైన దేవుడు గణపతి...ఈ ఈవెంట్ తో పోతుంది మీ మతి" అంటూ లంగాఓణిలో క్లాస్ గా కనిపిస్తూనే మాస్ డైలాగ్ చెప్పి ఎంటర్టైన్ చేసింది రాములమ్మ శ్రీముఖి. ఇక ఈ షోలో హేమ, మనో, గీతామాధురి, లేడీ గెటప్ లో చమ్మక్ చంద్ర, త్రినయని హీరో చందు గౌడ, కొరియోగ్రాఫర్ యశ్వంత్, భాను, రోహిణి, సింగర్ యశస్వి, ఇటీవల సరిగమప సూపర్ సింగర్ టైటిల్ గెలుచుకున్న శృతిక, హీరో సుధీర్ , డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ వంటి వాళ్లంతా వచ్చి డాన్సులతో, సాంగ్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ జీ తెలుగులో సెప్టెంబర్ 4 ఆదివారం నాడు ప్రసారం కాబోతోంది.