నా ప్రేమ‌ను చాప‌లా ప‌రిస్తే.. పవిత్రను ఎత్తుకున్న నవీన్ చంద్ర!

సండే వచ్చిందంటే చాలు కొత్త కొత్త షోస్ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉన్నాయి. అలానే శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ సందడి ఎపిసోడ్ బాగా అలరించింది. ఈ షోకి యాక్ట‌ర్‌ నవీన్ చంద్ర గెస్ట్ గా స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు. అత‌డిని చూసి జబర్దస్త్ కమెడియన్ పవిత్ర లేచి "ఐ ఫెల్ట్ సిగ్గు బావ" అనేసరికి నవీన్ కూడా సిగ్గు పడిపోయాడు. ఆ తర్వాత బావా నాకోసం ఒక డైలాగ్ చెప్పవా అనేసరికి, వెంటనే నవీన్ చంద్ర "షి ఈజ్ బ్యూటిఫుల్" అంటూ పవిత్రను రెండు చేతుల్లో ఎత్తుకున్నాడు.  తర్వాత "ఒక హీరోయిన్ కి ఒక హీరో డైలాగ్ ఎలా చెప్తాడు, నేను మీ హీరోయిన్ అనుకుని చెప్పండి" అంది పవిత్ర. తర్వాత "నా ప్రేమను చాపలా పరిస్తే" అంటూ 'అందాల రాక్షసి' మూవీ డైలాగ్ చెప్పాడు నవీన్. వెంటనే నూకరాజు వచ్చి "లేడీస్ అడగగానే డైలాగ్ చెప్పేశారు, మా మగాళ్ల  కోసం ఒక డైలాగ్ చెప్పండి" అన్నాడు. వెంటనే "వీడు మా నాన్నను చంపాడు" అనే డైలాగ్ మాంఛి సీరియస్ గా చెప్పేసరికి నూకరాజు ఒక్కసారిగా షాక్ ఐపోయి నోరెళ్లబెట్టేశాడు. డైలాగ్ చెప్పేసాక నవీన్ నవ్వేశాడు. అప్పుడు నూకరాజు షాక్ లోంచి బయటికొచ్చాడు. "నూకరాజుకి డైపర్ ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే.." అని ఫన్ చేసాడు రవి. తర్వాత నవీన్ చంద్ర, సిరి హన్మంత్ కలిసి డాన్స్ చేశారు.

బాహుబలి పాటను ఇలా మార్చేశావేంటి నూకరాజు

శ్రావణ సందడి ఎపిసోడ్ ని ఆడియన్స్ మస్త్ ఎంజాయ్ చేశారు. ఈ మధ్య కాలంలో హోస్ట్ తో పాటు సైడ్ క్యారెక్టర్స్ గా చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ కూడా జాయిన్ అవుతూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో నూకరాజు కూడా అలాగే కాసేపు ఫన్ చేసాడు. పాట పాడతారా అని నూకరాజుని అడుగుతాడు రవి. పాట పాడతారా ఏమిటి మనలో స్వరాలూ, సంగీత నరాలు కూడా ఉన్నాయి తెలుసా అని అంటాడు. నరాలంటే గుర్తొచ్చింది చిన్నప్పుడు మా మావయ్య అనేవాడు నకరాలు చేస్తే నరాలు తీస్తా అని అంటుంది అనసూయ ...వెంటనే నూకరాజు  తీసుకోండి కానీ మాకు ఏదో ఒకటి ఇవ్వండి అంటాడు.  నేను సాంగ్ సింగుతాను అంటూ పెళ్లయ్యాక మగాళ్లు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అదేంటో పాటలో చెప్తాను వినండి అంటాడు. "బలి బలి బలి రా బలి, పెళ్ళైతే మగాడు బలి, సామాన్లు నువ్వే కడగాలి, బట్టలుతకాలి, కాలు నొక్కాలి, మన శాలరీ వాళ్లకు ఇవ్వాలి..ఏసా ..తాళ్హేసా" అంటూ నూకరాజు మంచి ప్యారెడీ పాట పాడి అందరినీ ఎంటర్టైన్ చేసాడు. నూకరాజు జబర్దస్త్ షో ద్వారా చాల త్వరగానే పేరు తెచ్చుకున్నాడు. కామెడీ స్కిట్స్ తో పాటు ఆసియా తో ప్రేమ పురాణం వీడియోలతో కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

మనవళ్లకు టీకాలు వేయించాల్సిన వయసులో టాటూలు అవసరమా?

వినాయక చవితి సందర్భంగా జబర్దస్త్, ఢీ 14 టీం మెంబర్స్ అంతా కలసి మన వూరి దేవుడు అనే  స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు.ఇందులో హైపర్ ఆది, ఇమ్మాన్యూల్, వర్ష, ఇంద్రజ, ఖుష్బూ, ప్రగతితో పాటు మూవీ యాక్టర్స్ కృష్ణ భగవాన్, నాగినీడు కూడా పార్టిసిపేట్ చేసేసారు. ఇక ఇప్పుడు తాజాగా విడుదలైన ఈ ఈవెంట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గణేష్ ఉత్సవాల్లో భాగంగా జబర్దస్త్ టీం మెంబర్స్ అంతా కలిసి  బురదలో కబడ్డీ ఆడతారు. నాటీ నరేష్. ఇమ్ము ముఖం మీద బురద కొట్టడం భలే ఫన్నీగా ఉంది. ఇక  నటి ప్రగతి ఆకుపచ్చని లంగా ఓణీలో రాను రానంటూనే చిన్నదో అనే పాటకు  చేసిన డాన్స్ పెర్ఫామెన్స్ అదిరిపోయింది. ఇంద్రజ కూడా సూపర్ అంటూ కామెంట్ చేస్తుంది.  ప్రగతి, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, ఇంద్రజ కలిసి సరదాగా ఓ స్కిట్ ప్లే చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేసారు.  ఈ స్కిట్ లో హైపర్ ఆది ప్రగతి మనవడిగా నటించి ఫుల్ ఫన్ క్రియేట్ చేసాడు.   ప్రగతి స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి కండలు చూపిస్తూ ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని ఆది  "నాయనమ్మా మనవళ్లకు టీకాలు వేయించాల్సిన వయసులో ఈ టాటూలు ఏంటి చూసుకోవాలి కదా" అని సెటైర్ వేస్తాడు. ప్రగతి కూడా ఈ డైలాగ్ కి కాస్త ఫీల్ ఐనట్టే కనిపించింది. పిల్లల్ని పెంచాల్సిన వయసులో కండలు పెంచుతోంది అని చెప్పడంతో స్టేజి మీద నవ్వులు విరిశాయి. తర్వాత  అవుట్ డోర్ లో హైపర్ ఆది, ఇమ్మాన్యూల్, వర్ష చేసిన స్టంట్స్ తో ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించారు.  వర్ష ప్రేమ కోసం ఇమ్మాన్యూల్ తన చేతులపై కార్లు ఎక్కించుకుంటాడు. ప్రేమ కోసం నువ్వు కూడా కార్లు ఎక్కించుకో అని వర్షని కూడా బలవంత పెట్టేసరికి వర్ష కూడా చేతులపై కార్లు ఎఎక్కించుకుంటుంది. దీంతో ఇండోర్ లో ఉన్నవాళ్లు ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత వర్ష, ఇమ్ము, ఆది  ట్యూబ్ లైట్స్ తో అద్దిరిపోయే స్టంట్ చేశారు. ట్యూబ్ లైట్స్ ని బాడీ మీదా  పగలగొట్టుకోవాలి అని ఆది చెప్పేసరికి ఇది రిస్క్ , వద్దు అని వర్ష చెప్తుంది. చాలా ఈజీ అంటూ ఒక ట్యూబ్ లైట్ ని ఇమ్ము  వీపుపై పగలగొడతాడు. అంతే ఒక్కసారిగా ఇమ్ము అరుస్తూ కింద పడిపోతాడు. దీనితో మా ఇమ్మూనే కొడతావా అంటూ  ఆది వీపు పగలగొడుతుంది వర్ష . వెంటనే ఆది కూడా వర్ష వీపుపై ట్యూబ్ లైట్ పగలగొడతాడు. అంతే వర్ష ఏడుస్తూ కిందపడిపోతుంది. ఇలా ఈ ఈవెంట్ లో ఎన్నో ఎలిమెంట్స్ మనల్ని అలరించడానికి ఈ నెల 31 న ఉదయం 9 గంటలకు ప్రసారం కాబోతోంది.

రిమోట్ అంత లేవు నువ్వేం ప్రమోట్ చేస్తావ్ నరేష్ మీద నిహారిక ఫైర్

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం అలరించి వెళ్ళిపోయింది. ఇందులో నిహారిక వచ్చి ఆదితో పోటాపోటీగా పంచులు పేల్చి స్టేజిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. హలో వరల్డ్ వెబ్ సిరీస్ ప్రొమోషన్స్ కోసం ఆ టీమ్ మొత్తం వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ ప్రొమోషన్స్ ని భలే వెరైటీగా ఒక స్కిట్ రూపంలో చేశారు ఆది, నిహారిక. అందరికి హాయ్ చెప్పండి అంటాడు ఆది. హలో వరల్డ్ అని అరుస్తుంది. దాంతో ఆది ఎవరైనా హలో చెప్తారు మీరేంటి హలో వరల్డ్ అంటున్నారంటాడు. నా సిరీస్ ని ప్రోమోట్ చేసుకోవద్దా అంటూ కౌంటర్ ఇస్తుంది. బాకీలు ఇవ్వాల్సిన సుబ్బారావు, వెంకట్రావు ఎప్పుడు ఇస్తాను అన్నారు అని ఆది అడిగేసరికి అందరూ శుక్రవారం ఇస్తారట అని చెప్తుంది నీహా. అదేంటి శుక్రవారం అనేసరికి. మరి శుక్రవారం కదా సిరీస్ రిలీజ్ అయ్యింది అంటుంది. మరి నాగేశ్వరావు డబ్బులిచ్చాడా అంటుంది నీహా.. వాడు ఆదివారం మధ్యాహ్నం 1  గంటకు ఇస్తానన్నాడు అనేసరికి అదేం టైం అని అడుగుతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తూ ఇస్తాడట అని ఫన్ చేస్తాడు.  మధ్యలో ఆటో రాంప్రసాద్ వచ్చి హిట్ డబ్బా నిహారికకు ఇచ్చి మీ సిరీస్ హిట్ కావాలని గిఫ్ట్ అని చెప్తాడు. నా సిరీస్ కంటే మీ షోకి ఈ హిట్ అవసరం అని తిరిగి ఇచ్చేస్తుంది. ఇంతలో ఇమ్ము వచ్చి వర్ష, ఇమ్ము లవ్ ట్రాక్ చూసారా అంటూ నిహారికకు అడిగేసరికి ఖాళీగా ఉన్న రైల్వే ట్రాక్ ని ఐనా చూస్తా కానీ మీ లవ్ ట్రాక్ చూడను అంటుంది. వర్ష మూతి ముడుచుకుంటుంది. నన్ను హీరోని చేయమని బాబు గారికి చెప్పండి అనేసరికి హీరో అంటే నీ బాబే ఒప్పుకోడు, ఇంక నా బాబు ఎలా ఒప్పుకుంటాడు అనేసరికి ఇమ్ము హర్ట్ అయ్యి సారీ చెప్పేస్తాడు. ఇంతలో నాటీ నరేష్ వచ్చి మీ సిరీస్ ని నేను ప్రమోట్ చేస్తా అంటాడు నిహాతో. రిమోట్ అంత లేవు నా సిరీస్ ని ఎం ప్రమోట్ చేస్తావ్ అంటుంది. టీవీ ఆన్ అవ్వాలంటే రిమోట్ ఉండాల్సిందే అంటాడు నరేష్. ఇలా వీళ్ళ స్కిట్ అందర్నీ ఎంటర్టైన్ చేసింది.

పది రూపాయలతో సుధీర్‌ని బకరాని చేసిన అనసూయ!

సుడిగాలి సుధీర్ ఎలాంటి షోనైనా ఇట్టే ఈజీగా హోస్ట్ చేసేస్తాడు. మొనాటనీ ఉండదు. సుధీర్ ఏ షోలో ఉంటే ఆ షో హైలైట్ అవుతుంది. సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సుధీర్ 'ఢీ' చేసినా, 'శ్రీదేవి డ్రామా కంపెనీ' చేసినా అవి సూపర్ హిట్‌గా నిలిచాయి. అలా సుధీర్ బుల్లితెరపై తిరుగులేని స్టార్‌గా నిలిచాడు. ఇక ఇప్పుడు సుధీర్ స్టార్ మాలో సింగింగ్ షోకి హోస్టింగ్ చేస్తున్నాడు. ఐతే సుధీర్ కి మాత్రం ఆ షో పెద్దగా ప్లస్ అవలేదని తెలుస్తోంది.  సుధీర్ మీద ఆ షోలో విపరీతమైన పంచులు పేలుతున్నా సరే సుధీర్ మాత్రం ఏం తెలియనట్టే నవ్వేసి ఊరుకుంటున్నాడు. లేటెస్ట్ గా హేమచంద్ర, అనసూయ, మనో.. ఇలా అందరూ కలిసి సుధీర్ మీద కౌంటర్లు వేశారు. ఈ షోలో హరిప్రియకు, సుధీర్‌కు మధ్య ఒక ట్రాక్ క్రియేట్ చేయడానికి తెగ ట్రై చేస్తూ ఉంటారు. హరిప్రియ మాత్రం సుధీర్‌ను 'అన్నయ్యా' అని పిలుస్తోంది. ఆమెను ఇంప్రెస్ చేయాలంటే హేమచంద్రతో పాట పాడించి ప్రపోజ్ చేయాలంటూ సుధీర్‌కు ఒక  టాస్క్ ఇచ్చింది అనసూయ. ఇక సుధీర్ ప్రపోజ్ చేసేందుకు రెడీగా ఉంటాడు. ఐతే హేమచంద్ర, మనో పిచ్చి పాటలన్నీ పాడేసి  చెడగొడుతూ ఉంటారు. అలా హరిప్రియ ముందు బకరా ఐపోతాడు సుధీర్‌. లాస్ట్ అండ్ ఫైనల్ లో సుధీర్ చేతిలో అనసూయ పది రూపాయలు పెట్టి "దారి ఖర్చులకు ఉంచు" అని చెప్తుంది. ఐతే తాను బిల్డ్ చేసుకున్న కెరీర్ ని ఇలా పిచ్చి పిచ్చి స్కిట్స్, కామెడీస్ తో సుధీర్‌ చెడగొట్టుకుంటున్నాడని అత‌ని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.

వాట్సాప్ అనేది ఒకటుందనే విషయం రాజమౌళి గారి ద్వారానే తెలిసింది

జబర్దస్త్ షో ద్వారా అదిరే అభి ఫుల్ ఫేమస్ అయ్యాడు. డిఫరెంట్ స్కిట్స్ తో బుల్లి తెర మీద మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా అభి తన లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయ్యాక కొన్ని మూవీస్ లో కూడా చేసాడు. అలాగే బాహుబలి 2 కి అసిసెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసినట్టు చెప్పుకొచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంతో కష్టపడ్డానని అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని అలాగే ఈ అవకాశం వల్లి మేడం ద్వారా వచ్చిందని చెప్పుకొచ్చాడు. అలాగే ఒక పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే, మరో వైపు జబర్దస్త్ కి టైం కేటాయించుకుంటూ సాఫ్ట్ వెర్ జాబ్ కూడా చేసినట్లు చెప్పాడు. ఉదయం 6  నుంచి సాయంత్రం 6  వరకు షూటింగ్, 6 నుంచి 11 వరకు సాఫ్ట్ వెర్ జాబ్, షూటింగ్ లేని టైంలో జబర్దస్త్ షూటింగ్, ఈ మధ్యలో రాజమౌళి టీమ్ తో ఒక గంట వాలీబాల్ ఆడేవాడినని చెప్పుకొచ్చాడు. ఒక రోజు రాజమౌళి గారికి ఒక వాయిస్ కావాల్సి వచ్చి తనకు ఫోన్ చేసినప్పుడు ఆ టైంలో గోవాకి వెళ్తున్నట్లు చెప్పడంతో ..ఒక వాయిస్ రికార్డు చేసి వాట్సాప్ లో పంపు అన్నారట. వాట్సాప్ అంటే ఏమిటి అని అడిగేసరికి ఇది తెలీదా సరే నువ్ దిగాక వాయిస్ రికార్డు చేసి మెయిల్ చెయ్ అన్నారట. అలా 2012 లో వాట్సాప్ అనేది ఒకటి ఉందనే విషయం ఆయన ద్వారానే నాకు తెలిసింది అని చెప్పాడు అదిరే అభి. టెక్నాలజీ పరంగా రాజమౌళి చాలా ముందుంటారని చెప్పాడు.

ప్రభాస్, నేను మంచి ఫ్రెండ్స్!

'అలీతో సరదాగా' షోకి  ఈసారి  బాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు రాబోతోంది. ఈ షోకి ఎంతో మంది ప్రముఖులు వచ్చి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. ఇక ఇప్పుడు పీవీ సింధు వంతు వచ్చేసింది. ఆలీతో సరదాగా లేటెస్ట్ షో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో పీవీ సింధు ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. 'టాలీవుడ్ లో నీకు ఎవరంటే ఇష్టం' అన్న ప్రశ్నకు 'బాహుబలి ప్రభాస్' అని చెప్తుంది. 'సేమ్ హైట్ అనా' అనేసరికి 'ఇద్దరం మంచి ఫ్రెండ్స్' అని చెప్తుంది. 'ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కడికి వెళ్లలేకపోతున్నా అని బాధపడుతూ ఉంటావా?' అనేసరికి 'బాధ పడను ఎందుకంటే నేను వాళ్ళ కంటే ఎక్కువ ప్లేసెస్ కి తిరుగుతూ ఉంటాను' అని చెప్పింది. 'ఫ్యూచర్ లో సింధుని స్క్రీన్ మీద హీరోయిన్ గా చూడొచ్చా' అన్న ప్రశ్నకు 'ఏమో నా బయోపిక్ ఉండచ్చేమో ఎవరికి తెల్సు'.. 'మరి బయోపిక్ లో ఫాదర్ వేషం మీ నాన్నగారేనా' అని అడిగేసరికి 'అన్నీ సీక్రెట్స్ ఇప్పుడే చెప్పేస్తే ఎలా' అంటుంది.  'ఎందుకంటే నేను ఆ బయోపిక్ లో హీరోగా చేద్దామని అనుకుంటున్నా' అని అలీ అంటాడు. ఆ మాటకు సింధు పడీ పడీ నవ్వేస్తుంది. 'ఇప్పటివరకు ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి?' అని ఆలీ అడిగేసరికి 'అవి ఇంటికి వచ్చేవి కాబట్టి ఆ లవ్ లెటర్స్ ని అందరం కలిసి కూర్చుని చదివేవాళ్ళం' అని చెప్పింది. 'మరి పెళ్లి ఎప్పుడు' అనేసరికి 'నాకు నచ్చాలి కదా' అంటుంది సింధు. 'నేను నీకు మంచి సంబంధం చూస్తాను, అబ్బాయిలు రెడీగా ఉండండి' అని నవ్వుతాడు ఆలీ. 'ఏ మూవీ అంటే ఇష్టం' అని అడిగేసరికి 'సూపర్ మూవీ' అని చెప్తుంది. అందులో ఆలీ వేసిన డ్రెస్ మీద మంచి హ్యూమరస్ కామెంట్స్ చేసేసరికి 'నీ పెళ్ళికి నేను ఆ డ్రెస్ వేసుకొస్తాను' అంటూ మంచి ఫన్ క్రియేట్ చేస్తాడు.

పార్వతి పరమేశ్వరులుగా డాక్టర్ బాబు, వంటలక్క

స్మాల్ స్క్రీన్ పై కార్తీక దీపం క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. డాక్టర్ బాబు, వంటలక్క వీళ్ళిద్దరూ  ఈ సీరియల్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. ఇప్పుడు కార్తీక దీపం యాక్టర్స్ ని పెట్టి ఈవెంట్స్ చేయించాలని డిసైడ్ ఐనట్టుంది స్టార్ మా. అందుకే ఈ సారి వినాయక చవితి స్పెషల్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయడానికి రెడీ అయ్యింది. ఈ ఈవెంట్‌లో డాక్టర్ బాబు శివుడిలా.. వంటలక్క  పార్వతీ దేవిలా నటించింది. వినాయకుడి చరిత్రను ఆడియన్స్ కి చెప్పడానికి ఈ ఈవెంట్ నిర్వహించారు. మాతో పండగే పండగ టైటిల్ తో ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రోమో చూస్తేనే అదిరిపోయింది. గూస్ బంప్స్ వచ్చేసాయి. ప్రోగ్రాం కోసం వెయిటింగ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.   ఇందులో  శివుడి గెటప్‌లో నిరుపమ్ పరిటాల అద్భుతంగా అనిపిస్తే.. పార్వతీ దేవిగా ప్రేమీ విశ్వనాథ్.. నిజంగా దివి నుండి భువికి ఆ దేవతే దిగి వచ్చిందా అన్నట్టుగా  మెస్మరైజ్ చేసేసింది. మరి ఈ ఈవెంట్ ఎప్పుడు, ఎన్ని గంటలకు, ఈ గణనాథుడి చరితంతో పాటు  ఇంకా ఏ ఏ కార్యక్రమాలున్నాయి, ఎవరెవరు పాల్గొనబోతోన్నారనే విషయాలను మాత్రం ఇంకా  రివీల్ చేయలేదు. ఇటు వైపు  ఈటీవీ కూడా వినాయకచవితి స్పెషల్ ఈవెంట్‌ తో రెడీ అయ్యింది. కానీ ఎన్ని స్పెషల్ ఈవెంట్స్ వచ్చినా  డాక్టర్ బాబు, వంటలక్క ముందు ఏదీ నిలబడలేదు అనేది వాస్తవం.

సుజాత కోసం రాకేష్ చేసిన పని తెలుసా?

రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత వీళ్లిద్దరి గురించి బుల్లితెర ఆడియన్స్ కి బాగా తెలుసు. జబర్దస్త్ లో పుట్టిన ప్రేమలో వీళ్లది కూడా ఒక జంట. ఇక ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ రాకేష్ సుజాత కోసం ఎవరూ చేయని పని చేసాడు. కమలహాసన్ నటించిన భామనే సత్యభామని సినిమాలో భార్య కోసం అమ్మాయి గెటప్ వేసిన కమలహాసన్ లా ఇక్కడ ఒక స్కిట్ లో సుజాత కోసం అమ్మాయి గెటప్ వేస్తాడు రాకింగ్ రాకేష్. సుజాతను రాకేష్ హింసిస్తున్నాడని సుజాతని వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకొచ్చేస్తుంది.కానీ రాకేష్ మాత్రం సుజాతని కలవాలి చూడాలి అంటూ అమ్మాయి గెటప్ వేసుకుని ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ అత్తగారి ఇంట్లో ముగ్గులు వేయడం, కాళ్ళు పట్టడం ఇంటి పనులన్నీ చేయడం చేస్తాడు. అదే టైంకి పటాస్ ప్రవీణ్ సుజాత తమ్ముడిగా  ఇంటికి వస్తాడు. ప్రవీణ్ వేసే డైలాగ్స్ కి ఇంద్రజ పడీ పడీ నవ్వుతుంది. రాకేష్ ముగ్గు వేసేటప్పుడు ప్రవీణ్ వచ్చి హే నన్ను ముగ్గులోకి దించడానికి ముగ్గు వేస్తున్నావా..నేను నిన్ను   పెళ్లి చేసుకుంటా అంటూ రాకేష్ వెంటపడేసరికి నేను పనిమినిషినండి అంటాడు. మన మనుషులు దూరమైనప్పుడే పని మనుషులు దగ్గరౌతారు అంటాడు ప్రవీణ్. అమ్మ నాకు త్వరగా పెళ్లి చెయ్యి ..హార్మోన్స్ హార్మోనియం వాయిస్తున్నాయి అంటూ వెరైటీ డైలాగ్స్ తో ప్రవీణ్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు.

సింగర్ పార్వతి గురించి ఈ విషయం తెలుసా

సరిగమప సింగింగ్ షో రెండు రాష్ట్రాల ప్రజలని అలరించిన అద్భుతమైన షో. ఈ షోకి సంబంధించి సింగింగ్ సూపర్ స్టార్ అవార్డు ని సొంతం చేసుకుంది శృతిక సముద్రాల. ఇక గ్రాండ్ ఫినాలే వరకు చాలా మంది కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో డేనియల్, పార్వతి కూడా ఉన్నారు. పార్వతి గురించి గూగుల్ లో టైపు చేస్తే ఊరుకి బస్సు వేయించిన అమ్మాయి అని కనిపిస్తుంది. ఎంతో కష్టపడి పైకొచ్చిన అమ్మాయి పార్వతి. కోటి గారికి పార్వతి అంటే ఎంతో అభిమానం కూడా. ఇక ఇలాంటి సింగర్ పార్వతి గురించి డేనియల్ ఇంటరెస్టింగ్ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పార్వతి పైకి ఏమీ తెలియని అమాయకురాలిలా కనిపిస్తుంది కానీ మస్త్ పంచులు వేస్తది, పాటలు బాగా పాడతాది, కామెడీ కూడా చేస్తుంది. ఇవి కాకుండా ఒక ఇంటరెస్టింగ్ విషయం చెప్తానంటూ డేనియల్ ఇలా చెప్పుకొచ్చాడు. భూమి తల్లకిందులైనా, తుపానొచ్చినా ఏమొచ్చినా కూడా రాత్రి 9  గంటల లోపు భోజనం చేసేసి నిద్ర పోవడం అలవాటు..ఉదయాన్నే 4 .30 కల్లా నిద్ర లేవడం అలవాటు. ఇక ఉదయాన్ని పాటలు ప్రాక్టీస్ చేస్తూ మమ్మల్ని టార్చర్  పెట్టేదని చెప్పుకొచ్చాడు డేనియల్. నిద్రపట్టకపోయేసరికి 7  గంటల నుంచి ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పాడట డేనియల్. అలా రెండో రోజు నుంచి ప్రాక్టీస్ టైమింగ్స్ మార్చుకుందని చెప్పాడు. పార్వతి అచ్చ తెలుగు అమ్మాయిలా కరెక్ట్ టైమింగ్స్ ఫాలో అవుతుంది అని చెప్పాడు. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు త్వరగా నిద్రపోయి త్వరగా లేవాలని అది మాత్రం కచ్చితంగా ఫాలో అవుతుంది పార్వతి అంటూ ఆమెను అభినందించారు.

నా రూటే సెపరేటు అంటున్న శ్రావణ భార్గవి!

శ్రావణ భార్గవి పేరు అందరికీ పరిచయమే. బాలకృష్ణ నటించిన 'సింహా' మూవీలో "సింహమంటి చిన్నోడే" సాంగ్ పాడి తన కెరీర్ ని స్టార్ట్ చేసింది భార్గవి. తర్వాత మహేష్ బాబు 'ఖలేజా', అల్లు అర్జున్ 'బద్రీనాథ్', రామ్ 'కందిరీగ' నాగార్జున 'రాజన్న', జూనియర్ ఎన్టీఆర్ 'దమ్ము', శేఖ‌ర్ క‌మ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', నాని 'ఎంసీఏ', ప్ర‌భాస్‌ 'రెబల్' మూవీస్ లో హిట్ సాంగ్స్ పాడి తనని తానూ ప్రూవ్ చేసేసుకుంది. 2018 లో వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో ఓ పాట పాడింది శ్రావణ భార్గవి. ఇక  ఆ తర్వాత ఆమె మూవీస్ లో సాంగ్స్ ఏమీ పాడలేదు. డబ్బింగ్ విషయానికి వస్తే  ‘గబ్బర్ సింగ్’ లో శ్రుతి హాసన్ కు, ‘ఈగ’ లో సమంతకి వాయిస్ ఇచ్చింది.  ఇక ఇటీవలి కాలంలో  శ్రావణ భార్గవి ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది.  తన భర్తతో విడాకులు విషయం అంటూ కొద్ది రోజులు, తర్వాత అన్నమ్మయ్య రచించిన ‘ఒకపరికొకపరి వయ్యారమై…’ కీర్తనను శృంగారభరితంగా మార్చి వీడియో చేసిందంటూ అపవాదులు ఆమె చుట్టూ తిరిగాయి. అన్నమయ్య కుటుంబ సభ్యులు రంగంలోకి దిగి ఆమెని  తిరుపతిలో అడుగుపెట్టనివ్వం అంటూ హెచ్చరించారు కూడా. ఈ విషయం మీద శ్రావణభార్గవి కూడా తన వెర్షన్ లో జవాబు ఇచ్చేసింది.   ఈ వార్తలతో ఇటీవలి కాలంలో శ్రావణ భార్గవి క్రేజ్ చాలా పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక మూవీ సాంగ్ తో దుమ్ము రేపడానికి నాలుగేళ్ల తర్వాత బయటికొచ్చింది శ్రావణ భార్గవి. విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ మూవీలో ‘ఆఫత్’ అనే అద్భుతమైన సాంగ్ పాడి అందరినీ కట్టిపడేసింది తన గాత్రంతో. ఇక ఈ సాంగ్ యూట్యూబ్ లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. సినిమాగా రాబోతున్న 'కార్తీక దీపం'!

'కార్తీక దీపం' సీరియల్ బుల్లితెర మీద ఎంత సూపర్ డూపర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఈ  సీరియల్‌లో నటించిన దీప అంటే చాలు లేడీ ఫాన్స్ అంతా ఫిదా అయిపోతారు. ఆ పాత్ర‌ను పోషించింది ప్రేమీ విశ్వ‌నాథ్‌. స్వ‌త‌హాగా మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగు భాష నేర్చుకుని, భావం అర్థంచేసుకుని కార్తీక దీపంలో చక్కగా నటించింది. 2017లో ఈ సీరియల్ స్టార్ట్ అయ్యింది. అది మొదలు 2021 వరకు  ఈ సీరియల్‌ రేటింగ్స్ లో టాప్ మోస్ట్ గా నిలబడింది.  ఈ మధ్య కాలంలో ఎన్ని సీరియల్స్ వచ్చినా వంటలక్క సీరియల్ ని  బీట్ చేయలేకపోయాయి. తరవాత సీరియల్ నుంచి వంటలక్కను, డాక్టర్ బాబుని తప్పించేసరికి ఒక్కసారిగా రేటింగ్ పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆపేసిన క్యారెక్టర్స్ ని ప్రవేశపెట్టారు. దాదాపు ఐదేళ్లుగా బుల్లితెర మీద అన్ని సీరియల్స్ లోకి తిరుగులేని రారాణిగా నిలిచిన 'కార్తీకదీపం' ఇప్పుడు వెండితెరపైకి వచ్చేందుకు సిద్దమయ్యింది. ఇప్పుడు ఈ సీరియల్ క్రేజ్ ని కాష్ చేసుకోవడం కోసం మేకర్స్ రెడీ అవుతున్నారట. అదే 'కార్తీక దీపం' మూవీగా రాబోతోందనే విషయం ఇండస్ట్రీలో, ఆడియన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సీరియల్ లో కొన్ని ఇంటరెస్టింగ్ సీన్స్ ని మూవీ రూపంలో తీసి ఫేమస్ ఓటిటి ప్లాట్ఫారంలో ప్రసారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఐతే ఈ వార్తలు నిజమేనా? లేదా కార్తిక్, దీపతో కలిసి మూవీ ఏమన్నా తీయబోతున్నారా? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

'ఒకే ఒక్క ఛాన్స్' అంటూ ఏడ్చిన‌ రోహిణి!

బుల్లితెర మీద ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోస్ కొత్త కామెడీ వస్తూనే వుంది. ఆడియన్స్ కూడా చక్కగా రిసీవ్ చేస్తుకుంటూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఒక కొత్త షో అనేది ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన ప్రోమో ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆ షోకి సంబంధించి మరో ఫన్నీ ప్రోమో వచ్చేసింది. డాన్స్ ఇండియా డాన్స్ షో ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కమెడియన్ రోహిణి హోస్ట్ అకుల్ బాలాజీతో చేసిన కామెడీ చాలా బాగుంది. ఈ షోకి గెస్ట్ గా సంగీత వచ్చింది. ఐతే సంగీత నటించిన 'ఖడ్గం' మూవీలోని "ఒకే ఒక్క ఛాన్స్" అంటూ సినిమాల్లో నటించటానికి అందరినీ అడిగే ఒక సన్నివేశం ఎవర్ గ్రీన్ ఎప్పటికీ. ఇప్పుడు సంగీత ప్లేస్ లో రోహిణి అలాంటి గెటప్ వేసుకుని స్టేజి మీదకు వచ్చి హోస్ట్ అకుల్ బాలాజీని ఆట పట్టించింది. "సినిమా హీరోయిన్ ని చేస్తానని ఊర్లో నన్ను వదిలేసి వచ్చేసావ్. ఇప్పుడేమో నీ ఐడీ మార్చుకుని డిఐడి (డాన్స్ ఇండియా డాన్స్) చేస్తావా?" అంటూ ఏడ్చేసింది. బాలాజీకి ఏం మాట్లాడాలో అర్థం కాక నీళ్లు నమిలాడు. అక్కడి నుంచి డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ దగ్గరకు వచ్చి "ఒక్క ఛాన్స్ " అని అడిగింది రోహిణి. ఆ డైలాగ్ కి ఒక వికారమైన ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చేసరికి రోహిణి అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సంగీత తన డైలాగ్ తానే చెప్పింది. "నువ్వు ఇలాంటి ఎక్స్ప్రెషన్ తో అడిగితె నేను ఛాన్స్ ఇస్తామా" అంటూ బాబా భాస్కర్ అనేసరికి సంగీత నవ్వేసింది.

పండు అబ్బాయి కాదు.. అమ్మాయి!

'వావ్.. మంచి కిక్కిచ్చే గేమ్ షో' మస్త్ ఫన్ తో, కామెడీతో దూసుకుపోతోంది. తాజాగా రాబోయే వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి రాకెట్ రాఘవ, కమెడియన్ రోహిణి, టిక్ టాక్ స్టార్ భాను, డాన్సర్ పండు వచ్చి ఎంటర్టైన్ చేశారు. 'టిక్ టాక్ లో నీకెవరు ఇన్స్పిరేషన్ భాను?' అని సాయికుమార్ అడిగేసరికి తన వీడియోస్ అన్ని కూడా వాళ్ళ అమ్మ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారని చెప్పుకొచ్చింది భాను. పండు వచ్చి 'నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను, లైక్స్ కొట్టి' అనేసరికి 'నువ్ కొట్టే లైటింగ్ కాదు రా' అంటూ రోహిణి పండుని ఆట పట్టిస్తుంది. 'జబర్దస్త్ లో ఏం జరుగుతోంది రాఘవ' అని అడిగేసరికి 'అంతా ఫైన్' అని చెప్తాడు రాఘవ.  'మీ అబ్బాయి నీ కన్నా సూపర్ గా, స్పీడ్ గా  చేస్తున్నాడ'ని అనేసరికి అవునని సమాధానమిస్తాడు. "ఢీ షోలో పండు చేసిన "నాది నక్కిలీసు గొలుసు" సాంగ్ కి చేసిన అమ్మాయి గెటప్ తో చేసిన డాన్స్  సోషల్ మీడియాలో 100 మిలియన్ మార్క్ దాటేసింది మరి  నీ ఫీలింగ్ ఏమిటి?" అని సాయికుమార్ అడిగేసరికి "లేడీ గెటప్ వలన అన్ని వ్యూస్ వచ్చాయి" అని చెప్తాడు. బేసిక్ గా "పండు అబ్బాయి కానీ అతను అమ్మాయి" అని రోహిణి వేసిన డైలాగ్ కి పండు షాక్ ఐపోతాడు. మళ్ళీ రోహిణి మాట మార్చేసి "అమ్మాయిలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు" అంటుంది. తర్వాత రాఘవతో మస్త్ కామెడీ చేస్తుంది. అటు ఇటు తిప్పుతూ ఒక్క తోపు తోసేస్తుంది రోహిణి. ఇలా ఈ రాబోయే వారం షో ఎంటర్టైన్ చేయబోతోంది.

ఆ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్‌ని మూవీలోకి తీసుకోలేదు!

'ఆలీతో సరదాగా' షో ఆడియన్స్ కి తెలియని ఎన్నో విషయాలను చెప్తుంది. ఇక ఇప్పుడు ఈ షోకి వచ్చిన సీనియ‌ర్ నిర్మాత‌ అశ్వని దత్ కూడా ఎన్నో విషయాలను పంచుకున్నారు. 'మహానటి' మూవీ గురించి అందులో ఎవరూ నటించని సీనియర్ ఎన్టీఆర్ రోల్ గురించి అశ్వనీదత్ ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో  2018లో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మహానటి' మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహానటి సావిత్రి పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసింది అలాగే జెమిని గణేశన్ పాత్రలో మలయాళ యాక్టర్ దుల్కర్ సల్మార్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగచైతన్య, మధురవాణి పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత, విజయ్ ఆంటోనీ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు.  ఇక ఈ మూవీలో  సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో మాత్రం ఎవరూ నటించలేదు. మరి ఆయన పాత్రలో జూనియర్ ఎన్టీయార్ నటిస్తే బాగుంటుందని అప్పుడు ఆడియన్స్ అనుకున్నారు. ఐతే మరి జూనియర్ ఎన్టీఆర్ ని నటింపచేద్దామనుకునే టైంకి బాలయ్య బాబు ఎన్టీఆర్ బయోపిక్ మూవీని ప్రకటించారు. ఇక ఇలాంటి టైంలో జూనియర్ ఎన్టీఆర్ ని పెడితే బాగోదని భావించి డైరెక్టర్ తో చెప్తే ఆర్కైవ్స్ ఫుటేజ్ షాట్ తో చేసేద్దాం అని చెప్పారు. అందుకే 'మహానటి'లో ఎక్కువగా నాగేశ్వరావు పాత్ర ఫోకస్ అయ్యింది అని చెప్పారు. లేదంటే జూనియర్ ఎన్టీఆర్ తప్పనిసరి తాత రోల్ లో నటించేవారని ఆయ‌న వెల్ల‌డించారు.

న‌న్ను హేట్ చేసేవాళ్లకు ఐ లవ్ యు చెప్తా!

జబర్దస్త్ నుంచి ఎంతో మంది స్టార్ కమెడియన్స్ గా ఎదిగారు. అలాంటి వాళ్ళల్లో చలాకి చంటి ఒకరు. చంటి ఎన్నో మూవీస్ లో నటిస్తూ జబర్దస్త్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఐతే ఈ ఫీల్డ్ లో ఎన్నో ప్లస్ లు, మైనస్ లు ఉంటాయి. అందరికి అందరూ నచ్చరు. మరి ఇలాంటి టైంలో 'మీ హేటర్స్ కి అంటే మిమ్మల్ని ఇష్టపడని వాళ్లకు మీరేం సమాధానం చెప్తారు.. వాళ్ళ అయిష్టతను మీరెలా రిసీవ్ చేసుకుంటారు?' అనే విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చాడు చంటి. 'న‌న్ను ఇష్టపడని వాళ్ళకు, హేట్ చేసేవాళ్లకు ఐ లవ్ యు చెప్తా. వాళ్ళు హేట్ చేస్తేనే కదా నేను ఇంకా ముందుకు పరిగెత్తాలని తెలిసేది. ప్రేమగా ఉంటూ గోతులు తియ్యడం వేరు, ద్వేషిస్తూ మనల్ని ఇంకా పైకి వెళ్లేలా చేయడం వేరు కదా' అని చెప్పాడు చంటి.  'జబర్దస్త్ కమెడియన్స్ కి సినిమా అవకాశాలు రావు అనే టాక్ నిజమేనా?' అన్న ప్రశ్నకు 'అలాంటిది ఏమీ లేదు. కానీ ఏదైనా మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు ఇటు జబర్దస్త్ కూడా అదే టైంకి చేయాల్సి వచ్చినప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేసుకునే వీలు ఉండదు.. కాబట్టి చాలామంది మూవీ ఆఫర్స్ ని వదిలేసుకుంటూ ఉంటారు' అని చెప్పుకొచ్చాడు చంటి. 'జబర్దస్త్ షో గురించి చాలా మంది వచ్చి చాలా రకాలుగా చెప్పి వెళ్లారు.. కొందరు పాజిటివ్‌గా, కొందరు నెగటివ్ గా చెప్పారు? మరి మీరేం అనుకుంటున్నారు?' అనే ప్రశ్నకు 'ఎవరి ఉద్దేశాలు వాళ్ళు చెప్పారు. చిన్నవాళ్ళనైనా, పెద్దవాళ్ళనైనా విమర్శించేంత స్థాయి, అర్హత నాకు లేదు. అంతకంటే ముందు నాకు ఎవరి గురించి చెప్పేంత టైం కూడా లేదు' అని తేల్చి చెప్పేసాడు చలాకి చంటి. 'చంటి బుర్ర బాగా వాడతారు. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఇలానే  బుర్ర బాగా వాడండి' అని యాంకర్ చెప్పేసరికి చంటి నవ్వేస్తాడు.

వెన్న కాదు వెనిలా ఐస్ క్రీం ఇచ్చి మోసం చేసింది మా అమ్మ

కృష్ణాష్టమి అంటే కృష్ణుడి పుట్టినరోజు. ఇక ఈ రోజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని పండగల్లోకి కృష్ణాష్టమి అంటే ఆ సంబరాలు వేరే లెవెల్ అన్న మాట. స్కూల్స్ లో పిల్లలకు కృష్ణుడి వేషాలు వేయించి కోలాటాలు ఆడిస్తారు. ఇక కాలనీల్లో, వీధుల్లో, మెయిన్ సెంటర్స్ లో ఉట్టి కొట్టే పోటీలు పెట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఐతే అమ్మలు కృష్ణుడి పాదాలు వేసి నడిపించి చిన్ని కృష్ణుడే స్వయంగా ఇంటికి వచ్చినట్టు భావించి ఆనంద పడుతూ ఉంటారు. ఇక ఇలాంటి సంబరాలు బోల్డు. ఐతే యాంకర్ సుమ ఈ కృష్ణాష్టమి సందర్భంగా స్పెషల్ గా ఒక వీడియో ప్లాన్ చేసి తన యూట్యూబ్ ఛానల్ లో " యువర్ లిటిల్ కృష్ణాస్" పేరుతో పోస్ట్ చేసింది. చాలా మంది తమ పిల్లలకు కృష్ణుడి వేషాలు వేసి ఆ వీడియోస్ ని సుమకి పంపిస్తే ఆ వీడియోస్ లో ఉన్న చిన్ని కృష్ణుల ఎక్స్ప్రెషన్స్ కి తగ్గట్టు తానె డైలాగ్స్ చెప్తూ ఫుల్ ఎంటర్టైన్ చేసింది.  ఇందులో ఒక చిన్ని కృష్ణుడు తన కాలు మీద కాలేసుకునేసరికి పుష్ప డైలాగ్ చెప్పి సుమ అందర్నీ నవ్వించేసింది. అలాగే చాలామంది అమ్మలు ఈ వీడియోలో వెన్న కాకుండా దాని బదులు దూది పెట్టేసరికి ఇదంతా మోసం అంటూ ఏడుపు మొహం పెట్టి నవ్వించింది. అలాగే ఒక కృష్ణుడికి వాళ్ళ అమ్మ వెన్న బదులు వెనిలా ఐస్క్రీమ్ ఇచ్చి మోసం చేసిందని చెప్తుంది. జాబ్ చేయడానికి సైకిల్ ఎక్కి కృష్ణుడు వెళ్తున్నాడని, ఇంకో కృష్ణుడు ఇంట్లో సైకిల్ తో తిరుగుతుంటే బండికి జిపిఎస్ పెట్టుకోలేదా అంటూ ఫన్ చేస్తుంది. స్లో మోషన్ లో నడిచే కృష్ణుడు, నేచర్ కృష్ణుడు, ఫ్లూట్ తో క్రికెట్ ఆడే కృష్ణుడు, వాకింగ్ కృష్ణ ఇలా ఆ చిన్ని కృష్ణులకు వెరైటీ పేర్లు పెట్టి మరీ నవ్వు తెప్పించింది సుమ.

ఆమె చూపులు ఎవ్వరినైనా చంపేస్తాయి!

అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లామరస్ యాంకర్ గా ఎంతో పేరు ఉంది. అలాగే మూవీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అనసూయ వీడియో ఒకటి ఫుల్ వైరల్ అవుతోంది. శ్రావణ సందడి స్పెషల్ షోలో భాగంగా చిలకపచ్చ చీర కట్టుకుని హోస్ట్ చేసిన ఆ వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.  ఐతే ఒక డై హార్డ్ ఫ్యాన్ చిన్నపిల్లాడి వీడియో పెట్టి అనసూయని చూస్తూ వెళ్లి కింద పడినట్టు పోస్ట్ చేసింది. ఎత్తైన ప్లేస్ నుంచి ఓ చిన్న పిల్లాడు సైకిల్‌ తొక్కుతూ వస్తుంటాడు. అదే టైంకి అనసూయ కళ్ళెగరేస్తూ చిన్న నవ్వు నవ్వేసరికి ఆ  పిల్లాడి  మైండ్‌ బ్లాంక్ ఐపోతుంది. అంతలోనే సైకిల్‌ బోల్తా కొట్టి పిల్లాడు కింద పడిపోతాడు. అనసూయ అందానికి ఎవ్వరైనా సరే  ఫిదా కావాల్సిందే అనే కోణంలో కొంత మంది అభిమానులు ఈ విధంగా వీడియోను డిజైన్‌ చేశారు. ఆ వీడియోను అనసూయ తన  ఇన్‌స్టా స్టోరీస్‌ స్టేటస్ లో షేర్ చేసింది. బాడీ షేమింగ్‌ కామెంట్లు, ట్రోల్స్, రెమ్యూనరేషన్‌ వంటి కారణాలతో లేటెస్ట్ గా ఈ బ్యూటీ `జబర్దస్త్` నుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ తో నటించిన మూవీ 'వాంటెడ్ పండుగాడ్'లో నటించింది.

బిగ్ బాస్ కి మోహన భోగరాజు?

బిగ్ బాస్ సీజన్ 6 కి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక ఈ సీజన్ కి సంబంధించి హౌస్ లోకి వెళ్లే వాళ్ళ లిస్ట్ ఇది..కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా సింగర్ మోహన భోగరాజు పేరు బాగా వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో తప్పనిసరిగా సింగర్ కంటెస్టెంట్స్, జర్నలిస్ట్ కంటెస్టెంట్స్ తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటారు. " బుల్లెట్ బండెక్కి వచ్చేత్తావా" అనే  పాట ద్వారా ఎంతో ఫేమస్ ఐన  సింగర్ మోహన భోగరాజు హౌస్ లో  కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ ఐతే ఇండస్ట్రీలో నడుస్తోంది. కాకపొతే ఈమె డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తుందా లేదంటే వైల్డ్ కార్డు ద్వారా వస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 ఎమోషనల్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఈ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ  ఆదిరెడ్డి, గీతా రాయల్, ఉదయభాను, శ్రీహాన్, సుదీప, టాలీవుడ్ హీరో సుమంత్ అశ్విన్, బుల్లితెర నటుడు అమర్ దీప్ వంటి కొందరి పేర్లు వినపడుతున్నాయి. అలాగే సామాన్యుడికి కూడా ఈ షోలో అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్ మేకర్స్. ఇక ఈ షో  వచ్చే నెల 4 వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు అనౌన్స్ చేశారు. హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారు అనే అంశంపై ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి. మరి ఎవరి ఎంట్రీ ఏమిటి ఎలా అని తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.