Brahmamudi : కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయనున్న అప్పు.. తన నిర్ణయం సరైనదేనా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -889 లో...అప్పుని కళ్యాణ్ బయటకు తీసుకొని వెళ్తాడు. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉందని అప్పు అంటుంది. వద్దు మా అమ్మ తిడుతుందని కళ్యాణ్ అంటాడు. దాంతో అప్పు గొడవ చెయ్యడం తో ఐస్ క్రీమ్ దగ్గర కళ్యాణ్ కార్ ఆపుతాడు. పక్కనే కదా మా స్టేషన్ కి వెళ్లి అందరికి హాయ్ చెప్పేసి వస్తానని అప్పు స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ ఒకావిడ తన బిడ్డని వెతకమని ఏడుస్తుంటే కానిస్టేబుల్ తనపై కోప్పడుతాడు. ఎందుకు అలా వాళ్ళతో మాట్లాడుతున్నావని అప్పు కానిస్టేబుల్ పై కోప్పడుతుంది. ఏమైందని అడుగుతుంది. నా కూతురు సంవత్సరం నుండి కన్పించడం లేదని ఆవిడ చెప్తుంది. సంవత్సరం నుండి కనిపించడం లేదా డిపార్ట్ మెంట్ ఏం చేస్తుందని కానిస్టేబుల్ పై అప్పు కోప్పడుతుంది. దాంతో లోపలికి వెళ్లి తన హై ఆఫీసర్ ని కలిసి మాట్లాడుతుంది. తన కూతురు ఎప్పుడో చనిపోయింది.. ఆ విషయం వాళ్ళ అయన కూడా చెప్పాడు. ఇన్వెస్టిగేషన్ చేసాం అదే చెప్పాము.. అయిన ఆవిడా వినట్లేదని ఆఫీసర్ అంటాడు. అలా ఆవిడ తన కూతురు ఉందని అంటుంటే డీప్ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి కదా అని అప్పు అంటుంది. ఇక ఆ ఒక్క కేసు పట్టుకొని కూర్చుంటామా అని ఆఫీసర్ అప్పుపై కోప్పడతాడు. కాసేపటికి అప్పు వెళ్ళిపోతుంది. మరొకవైపు రాజ్, కావ్యల దగ్గరికి అపర్ణ, సుభాష్ వస్తారు. మీరు రాహుల్ విషయంలో తీసుకున్న నిర్ణయం ఎందుకో తప్పు అనిపిస్తుందని అంటారు. అదేం లేదు ఈ ఇంట్లో అప్పుకి నాకు సమానమైన గౌరవం లభిస్తుంది.. అది మా అక్కకి కూడా దక్కాలని కావ్య అంటుంది. రాహుల్ కి ఒక ఛాన్స్ ఇస్తే తనేంటో ప్రూవ్ చేసుకుంటాడని రాజ్ చెప్తాడు. మరొకవైపు అప్పు పడుకుంటుంది. కలలో స్టేషన్ లో కన్పించినా ఆవిడ తన కూతురిని పట్టుకొని ఏడుస్తున్నట్లు కల వస్తుంది. ఉల్లిక్కి పడి లేచి కళ్యాణ్ కి చెప్తుంది. ఆ కేసుని నేను ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి లేదంటే రెగ్రెట్ గా ఫీల్ అవుతానని అప్పు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప కడుపులోని బిడ్డకి జ్యోత్స్న వల్ల ముప్పు.. కార్తీక్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -526 లో.. కార్తీక్ తో శివన్నారాయణ పంతులు చెప్పిన విషయం చెప్పి టెన్షన్ పడతాడు. నువ్వేం కంగారుపడకు తాత.‌ నేను ఉన్నానని కార్తీక్ దైర్యం చెప్తాడు. ఆ తర్వాత మా మమ్మీ నన్ను కొట్టడం ఏంటని జ్యోత్స్న అనగానే నువ్వు మాట్లాడింది తప్పు అని పారిజాతం అంటుంది. దాంతో జ్యోత్స్న కోపంగా ఇప్పుడు చెప్పు అని తన పీకపై కత్తి పెట్టి మరి జ్యోత్స్న అడుగుతుంది. అయినా తప్పు నీదే అని పారిజాతం అంటుంది. అసలు ఆ దీప కడుపులో బిడ్డని బ్రతనివ్వనని జ్యోత్స్న అనగానే పారిజాతం షాక్ అవుతుంది. తప్పుగా మాట్లాడితేనే సిచువేషన్ ఇలా ఉంది.. లేకుండా చేస్తే ఇంకెలా ఉంటుందని పారిజాతం అంటుంది. నువ్వు పిల్లలని మార్చావ్ ఏమైనా అయిందా అని జ్యోత్స్న అనగానే అప్పుడు కార్తీక్ గాడు చిన్నోడు ఇప్పుడు వాడిని ఎదుర్కోవడం కష్టమని పారిజాతం అంటుంది. మరొకవైపు దీప, కార్తీక్ ల దగ్గరికి సుమిత్ర వచ్చి మీరు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు నాకు తెలుసు.. దానికి సారీ అని చెప్తుంది. జ్యోత్స్నకి కోపం కాదు ఈర్ష్య మాత్రమే ఎందుకంటే కార్తీక్ ని తను పెళ్లి చేసుకునేది కానీ నువ్వు చేసుకున్నావ్ కాబట్టి దానికి అలా అని చెప్తుంది. ఈ టైమ్ లోనే పేరెంట్స్ నీ దగ్గర ఉండాలని అనుకుంటావ్ కానీ రెండు ప్రేమలని చూపించడానికి కార్తీక్ ఉన్నాడని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత శ్రీధర్ ఫైల్ పట్టుకొని శివన్నారాయణ దగ్గరికి వస్తాడు. కంపెనీ అకౌంట్ నుండి రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు జ్యోత్స్న అకౌంట్ కి ట్రాన్స్‌ఫర్ అయ్యాయని చెప్తాడు. ఏం చేసావని జ్యోత్స్నని శివన్నారాయణ అడుగుతాడు. ల్యాండ్ తీసుకున్న అమ్మకి పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నానని జ్యోత్స్న చెప్తుంది మరి ఎందుకు ఇవ్వలేదని కార్తీక్ అడుగుతాడు. సిచువేషన్ బాలేదు కదా మళ్ళీ ఇచ్చే సిచువేషన్ రాలేదని జ్యోత్స్న అనగానే అబద్ధం అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : నగల కోసం భద్రవతి కుటుంబం గొడవ.. ప్రేమని ఇరికించిన శ్రీవల్లి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -327 లో.... శ్రీవల్లి నగలన్నీ వేసుకొని మురిసిపోతుంటే అప్పడే తిరుపతి వస్తాడు. ఎక్కడ ఇవి ప్రేమ నగలు అని గుర్తుపడతాడోనని శ్రీవల్లి కొంగు కప్పుకుంటుంది. శ్రీవల్లి నీ గురించి ఈ రోజు నువ్వు అంటే ఏంటో తెలిసిందని తిరుపతి అనగానే నగలు చూసేసాడా ఏంటని శ్రీవల్లి భయపడుతుంది. నీ పద్దతి గురించి అంటున్నానని తిరుపతి అనగానే శ్రీవల్లి రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత ఈ నగలు ఇలా చాటుగా వేసుకొని మురిసిపోవడం తప్ప ఏం చేసేది లేదని నగలన్నీ తీసి దాచేస్తుంది. ఆ తర్వాత భద్రవతి ఇంటికి మార్వాడి అతను వస్తాడు. మెరుగు పెట్టించమంటే ఇలా తీసుకొని వచ్చారని రేవతి అంటుంది. ఇవి బంగారం కాదు గిల్టీ నగలు అని మార్వాడి అనగానే అందరు షాక్ అవుతారు. ఈ నగలు ఎవరైనా తీసారా అని భద్రవతి అడుగుతుంది. తిరుపతి ఇచ్చాక అవి అలాగే తీసుకొని వచ్చి బీరువాలో పెట్టానని రేవతి అంటుంది. ఇప్పుడు అర్థం అయింది. ఈ నగలన్నీ తీసుకొని గిల్టీ నగలు ఆ రామరాజు పెట్టాడన్నమాట అని అందరు అనుకుంటారు. ఆ తర్వాత భద్రవతి కుటుంబం మొత్తం రామరాజు ఇంటికి గొడవకి వెళ్తారు. గిల్టీ నగలు పెట్టి మమ్మల్ని మోసం చేసావని సేనాపతి గొడవ పడుతాడు. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. ఏం చేస్తావో నాకు తెలియదు.. నిజమైన బంగారు నగలు నాకు తీసుకొని రావాలని  రామరాజుకి భద్రవతి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత అసలు నగలు ఏమైయ్యాయని రామరాజు ఇంట్లో వాళ్ళని అడుగుతాడు. వాటికి సంబంధించి మొత్తం ప్రేమకి తెలుసు.. ఇప్పుడు తను పోలీస్ అవ్వాలని అనుకుటుంది కదా అందుకే వాటిని అమ్మేశారేమోనని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Suman Shetty Bigg Boss 9 Telugu: కెప్టెన్సీ రేస్ నుండి సుమన్ శెట్టి అవుట్.. పోరాడి ఓడాడుగా!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. ఇక సీరియస్ గేమ్ మొదలైంది. కంటెస్టెంట్స్ మధ్య తీవ్రమైన ప్రెషర్ ఉంది. ఏ టాస్క్ లోను  ఎవరు  తగ్గడం లేదు. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ డిఫరెంట్ గా ఫ్లాన్ చేశాడు బిగ్ బాస్. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లలోని కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించి వారితో కంటెస్టెంట్స్ ని కెప్టెన్సీ టాస్క్ ఆడిస్తున్నాడు. మొదటగా ప్రియాంక జైన్ రాగా తను కల్యాణ్ తో ఆడింది. అందులో కళ్యాణ్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ట ఎంట్రీ ఇచ్చాడు. తను భరణితో ఆడి గెలిచాడు. ఇక భరణి కెప్టెన్సీ రేస్ నుండి అవుట్ అయ్యాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో దేత్తడి హారిక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దేత్తడి హారిక ఫేస్ మొత్తం కవర్ చేస్తూ చీర కొంగుని వేసుకొని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తనని గుర్తుపట్టమని దేత్తడి హారిక అనగా కాసేపటి దాకా ఎవరు గుర్తుపట్టరు. దాంతో తనే హింట్ ఇస్తుంది. సీజన్-4 కంటెస్టెంట్ అనగానే అందరు ఆలోచనలో పడగా .. ఏయ్ దేత్తడి అని ఇమ్మాన్యుయల్ అనగా.. ఎస్ ఇమ్మూ అని దేత్తడి హారిక అంటుంది. ఇక అందరి గురించి చెప్పుకొచ్చింది దేత్తడి హారిక. భరణి గారిని హగ్ చేసుకోవచ్చా అంటూ దివ్యని , తనూజని అడిగింది దేత్తడి. రీతూ దగ్గరికి రాగానే.. వచ్చిందండి వయ్యారి.. ఇప్పుడే అడుగుతున్నా అంటూ సెటైర్ వేసింది దేత్తడి. ఇక రీతు నవ్వేసింది.  కెప్టెన్సీ కంటెండర్ కోసం నీతో ఆడటానికి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నావని దేత్తడి హారికని బిగ్ బాస్ అడుగగా.. సుమన్ శెట్టి అని చెప్పింది. ఇక కాసేపటికి బిగ్ బాస్ ఇద్దరికి టవర్ టాస్క్ ఇచ్చాడు.‌ గార్డెన్ ఏరియాలో టాస్క్  సంబంధించిన అన్ని పెట్టేసి, రూల్స్ చెప్పేసి సంఛాలక్ గా ఎవరిని తీసుకుంటావని హారికని బిగ్ బాస్ అడుగగా.. తను భరణిని సంచాలకులుగా ఉంటారని అంది. ఇక టాస్క్ మొదలైంది. ఫస్ట్ ఆఫ్ వరకు సుమన్ శెట్టి బాగా ఆడాడు. ఇక ఇద్దరు టవర్ పేర్చారు. ఎప్పుడైతే సుమన్ శెట్టి టవర్ కిందపడుతుందో అప్పుడే బజర్ మోగించాడు బిగ్ బాస్ మామ. దాంతో ఈ టాస్క్ లో దేత్తడి హారిక గెలిచింది. సుమన్ శెట్టి కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకున్నాడు. అయితే ఫస్టాఫ్ వరకు సుమన్ శెట్టి గెలుస్తాడని అనుకున్నారంతా అంత బాగా ఆడాడు.. కానీ టవర్ పై ఇంకో బాల్ పెట్టగానే అది కూలిపోయింది..  ఆ బాల్ పెట్టకుండా ఉండి ఉంటే సుమన్ శెట్టి గెలిచేవాడు కెప్టెన్సీ రేస్ లో నిలిచేవాడు. సుమన్ శెట్టి పోరాడాడు కానీ జస్ట్ కొంచెంలో మిస్ అయ్యాడు. 

దివ్యకి క్షమాపణ చెప్పిన భరణి.. ఏం జరిగిందంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో అతి ఎక్కువ బాండింగ్స్ తో గేమ్ స్పాయిల్ చేసుకున్న కంటెస్టెంట్ ఎవరంటే భరణి అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ సీజన్ మధ్యలో వరకు కూడా భరణి, తనూజ, దివ్య చుట్టునే కెమెరా ఫోకస్ అయింది. భరణి రీఎంట్రీ తర్వాత వాళ్లిద్దరిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇక ఫ్యామిలీ వీక్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన సజెషన్ తో వారిలో కొంత మార్పు వచ్చింది. భరణి నామినేషన్ లో కూతురు, చెల్లికి ఇచ్చిపడేశాడు. ఇదే వైఖరి మొదటి నుండి కంటిన్యూ అయితే భరణి విన్నర్ రేస్ లో ఉండేవాడు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో దివ్య దగ్గరికి భరణి వచ్చి మాట్లాడతాడు. నువ్వు ఇలా అర్థం చేసుకుంటే.‌. నేను మాట్లాడను సైలెంట్ గా ఉండిపోతానని అంటాడు. అంటే మీరు నాతో బలవంతంగా మాట్లాడుతున్నారా ఇదే వద్దని దివ్య కోపంగా మాట్లాడుతుంది. ఇదే నీతో ప్రాబ్లమ్ టాపిక్ ని సాగదీస్తావని భరణి అంటాడు. నిన్న ప్రేరణ వచ్చినప్పుడు కూడా మధ్యలో దూరి ఎల్డెస్ట్ అని అంటున్నావ్.. ప్రతీసారి ఏజ్ టాపిక్ ఎందుకు తీస్తావని భరణి అంటాడు. నేను ఏదో జోక్ గా అన్నాను.. మీరు అది సీరియస్ గా తీసుకుంటే నేనేం చెయ్యలేను దివ్య అంటుంది. మరి నిన్న నేను.. కుంటూ కుంటూ నడుస్తుంటే నాల నడిచి ఇమిటేట్ చేస్తున్నారు కదా అది నేను జోక్ గా తీసుకున్నప్పుడు నేను అన్నవి మీరు ఎందుకు జోక్ గా తీసుకోలేక పోతున్నారు అని దివ్య కోపంగా అనేసరికి  భరణి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దివ్య, సుమన్ శెట్టి వాళ్ళతో బయట కూర్చొని మాట్లాడుతుంది. భరణి వచ్చి దివ్య సారీ నిన్న నిన్ను ఇమిటేట్ చేసినందుకు అని అంటాడు. నాతో ఎంత క్లోజ్ ఉన్నా నేను అలా మాట్లాడను.. ఎందుకు అలా చేశానంటూ చేతులు జోడించి సారీ చెప్తాడు. అంత వద్దని దివ్య అనగానే సారీ ఇలాగా చెప్తారని భరణి అంటాడు. అది చూసిన ప్రేక్షకులు ఇక వీళ్ళు మారేలా లేరనుకుంటున్నారు.

Jayam serial : గతం చెప్పి భయపెట్టాలనుకున్న వీరు.. గంగ మాస్ వార్నింగ్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -125 లో......గంగకి ఎలా ఉండాలో.. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించండి అని ప్రీతీతో రుద్ర చెప్తాడు. అలా ఏం లేదు.. గంగలా ఎవరు ఉండలేరు.. తనకి నచ్చినట్లు ఉండనివ్వు అన్నయ్య అని ప్రీతీ చెప్తుంది. మరొకవైపు గంగని పెద్దసారు పిలిచి.. ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి కోడలివి డిగ్నిపైడ్ గా ఉండాలని చెప్తాడు. ఏది పడితే అది మాట్లాడకూడదని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ఏం పని చేసినా పెద్దసారుకి చెప్తుంది. పెద్దసారు వంట ఏం చేయాలి. వాటర్ ఆన్ చెయ్యాలా..‌ ఆఫ్ చెయ్యాలా.. ఇలా ప్రతీది అడుగుతుంది. ఆ తర్వాత గంగకి వీరు ఎదురుపడుతాడు.  నా దారికి అడ్టులేండి అని గంగ అనగానే నా దారికే నువ్వు అడ్డు వస్తున్నావని కోపంగా మాట్లాడటం మొదలు పెడతాడు. ఒక అమ్మాయిని రూమ్ కి రమ్మని పిలిచాడని, వాడి కార్ నెంబర్ చూసి కంప్లైంట్ ఇచ్చావ్ కదా.. అది ఎవరో కాదు నేనే అని వీరు అనగానే గంగ షాక్ అవుతుంది. అలా నిజాలన్నీ వీరు చెప్తాడు. అయితే గంగ ఏ మాత్రం భయపడకుండా వీరుకి వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు పెద్దసారు పంతులిని పిలిపిస్తాడు. గంగ, రుద్రకి ఈ రోజు రిసెప్షన్ అని చెప్తాడు. వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టమని పెద్దసారు అనగానే.. శకుంతల షాక్ అవుతుంది. దాంతో పంతులు ముహూర్తం పెడతాడు. గంగ కాఫీ తీసుకొని వచ్చి.. శాంతి ముహూర్తం అంటే ఏంటని గంగ అడుగుతుంది. కార్యం అని పంతులు అంటాడు. అంటే ఏంటని గంగ అడుగుతుంటే పంతులు చెప్పడానికి సంకోచిస్తాడు. దాంతో అప్పుడే ప్రీతి వచ్చి గంగని పక్కకు తీసుకొని వెళ్లి ఫస్ట్ నైట్ అని చెప్పగానే గంగ సిగ్గుపడుతుంది. పెద్దసారు చెప్పడంతో గంగ, రుద్ర ఇద్దరు పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత వీరు, ఇషిక కలిసి రిసెప్షన్ లో గంగ పరువుపోయేలా ప్లాన్ చేస్తారు. తరువాయి భాగంలో గంగకి ఓవర్ మేకప్ వేసేలా ఇషిక ప్లాన్ చేస్తుంది. గంగ ఓవర్ మేకప్ తో అందరి ముందుకు వచ్చేసరికి అందరు అసహ్యించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రాహుల్ చేతిలో కొత్త కంపెనీ.. రాజ్, కావ్యల ఆశలకి చెక్ పెట్టనున్నాడా!

స్టార్ట్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -888 లో.....రాజ్ స్టార్ట్ చేయబోయే కొత్త కంపెనీ రాహుల్ కి అని తెలుసుకుంటుంది స్వప్న. మిమ్మల్ని తప్పుగా అపార్ధం చేసుకున్నానని కావ్యని స్వప్న క్షమించమని అడుగుతుంది. నాకు మరొక ఛాన్స్ ఇస్తున్నందుకు థాంక్స్ అని  రాహుల్ అంటాడు. చూసావా అనవసరంగా రాజ్, కావ్యని తప్పు పట్టావని రుద్రాణి పై ఇందిరాదేవి, అపర్ణ కోప్పడుతారు. ఈ రోజు మీ పెళ్లి రోజు అత్తయ్య అందరు హ్యాపీగా ఉండాలి.. వెళ్లి భోజనం చేద్దాం పదండి అని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్, కావ్యలని సీతారామయ్య పక్కకి పిలిచి ఎవరు చెయ్యని పని మీరు చేస్తున్నారు.. కంపెనీ వేరుగా పెట్టడం ఇప్పటివరకు చెయ్యలేదు.. దీనివల్ల ప్రాబ్లమ్ వస్తుందేమోనని సీతారామయ్య అంటాడు. నేను చూసుకుంటాను అని రాజ్, కావ్య అంటారు. మరొకవైపు ధాన్యలక్ష్మి నగలు సర్దుతుంటే రుద్రాణి వస్తుంది. తను రాగానే త్వరగా అన్ని సర్దుతుంది. ఏంటి నేను రాగానే అలా చేస్తున్నావని రుద్రాణి అడుగుతుంది. అదేం లేదు అన్ని నగలు చూసి ఇంకా లేవని అనుకుంటానని ధాన్యలక్ష్మి ఇండైరెక్ట్ గా రుద్రాణితో అంటుంది. నేను అన్ని నగలు చేసుకుంటాను.. నా కొడుకు ఒక కంపెనీకి చైర్మన్ అని రుద్రాణి అంటుంది. అది బాధ్యతలు తెలిసినప్పుడు అని ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో రుద్రాణి కోపంగా రాహుల్ దగ్గరికి వెళ్తుంది. వాళ్లు పెద్ద సంస్థలో ఉంటూ నీకు చిన్న కంపెనీ ఇచ్చారని  రాహుల్ తో రుద్రాణి అంటుంది. వాళ్ళు నాకు ఇచ్చింది కంపెనీ కాదు మమ్మీ కత్తి.. దాంతో ఎలా చేస్తానో చూడమని రాహుల్ అంటాడు. మరొకవైపు కావ్య తన కోరికల చిట్టాలో చివరిది బుల్లెట్ బండిపై రైడ్.. ఆ బుల్లెట్ బండిని తీసుకొని వచ్చి కావ్యకి రాజ్ సర్ ప్రైజ్ ఇస్తాడు. నేను నడుపుతానని కావ్య నడుపుతుంది. దాంతో రాజ్ వెనకాల కూర్చొని భయపడుతాడు. మరుసటి రోజు.. నీ కొత్త ఆఫీస్ కి నువ్వు వెళ్ళమని రాహుల్ తో సుభాష్ చెప్తాడు. పాత ఆఫీస్ కి నేను, కావ్య వెళ్తామని రాజ్ చెప్తాడు. ఇక అప్పు కూడా డ్యూటీకి వెళ్తుందని కళ్యాణ్ అనగానే డెలివరీ వరకు వద్దని ధాన్యలక్ష్మి అంటుంది. అయిన ధాన్యలక్ష్మికి తెలియకుండా అప్పుని తీసుకొని కళ్యాణ్ డ్యూటీకీ బయల్దేరతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : జ్యోత్స్నని బ్లాక్ మెయిల్ చేసిన దాస్.. శివన్నారాయణ భయం ఏంటంటే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -525 లో.....జ్యోత్స్నని దాస్ కాలుస్తాడు. దీప ఎలాగూ పేదింట్లో పెరిగింది కానీ తన బిడ్డ అలా కాదు.. ఆ పెద్దింట్లో పెరగాలి.. అలా కాదని నువ్వు అడ్డుపడితే నిజం చెప్పడానికి నేనే వస్తానని జ్యోత్స్న ని దాస్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. మరొకవైపు దీప కి టెస్ట్ లు ఎప్పుడు చేయించాలని కార్తీక్ డాక్టర్ తో మాట్లాడతాడు. అప్పుడే దీప వచ్చి ఇవన్నీ ఎందుకు బావ ఇప్పుడే అని అంటుంది. అప్పట్లో అయితే ఇవన్నీ ఏం లేవు కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిందని కార్తీక్ అంటాడు. ఇక రేపటి నుండి పనికి రాకు అని కార్తీక్ అనగానే.. వస్తాను బావ.. అక్కడ అమ్మనాన్నలని చూస్తూ ఉండొచ్చు కదా అని దీప అంటుంది. మరుసటి రోజు స్వప్నకి కాశీ డాష్ ఇవ్వగా పడిపోతుంటే కాశీ పట్టుకొని సారీ చెప్తాడు. స్వప్న సైలెంట్ గా వెళ్తుంటే.. ఏంటి మాట్లాడవు. మీ అన్నయ్య మనల్ని కలిపాడు కదా అని కాశీ అనగానే మా అన్నయ్య అంటే గౌరవం ఉందని స్వప్న గొప్పగా మాట్లాడుతుంది. దాంతో కాశీకి కోపం వచ్చి మీ అన్నయ్య చేసేది ఆఫ్ట్రాల్ డ్రైవర్ జాబ్ అని అంటాడు. అది శ్రీధర్ విని.. నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడే స్థాయి నీది అని కాశీపై శ్రీధర్ కోప్పడతాడు. నీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. అది వచ్చాక చెప్తానని శ్రీధర్ ఆఫీస్ కి వెళ్తాడు. మరొకవైపు శివన్నారాయణ హాల్లో డల్ గా కూర్చుంటాడు. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. సుమిత్ర అందరికి హారతి ఇస్తుంది. దీప నువ్వు జాగ్రత్తగా ఉండాలని దశరథ్, శివన్నారాయణ అంటారు.  దీపకి ఇదేం కొత్తేమీ కాదు.. ఆల్రెడీ పిల్లలని కనడంలో అనుభవం ఉంది అని జ్యోత్స్న తప్పుగా మాట్లాడడంతో దశరథ్ తనపై చెయ్ ఎత్తేలోపే జ్యోత్స్నని సుమిత్ర కొడుతుంది. నువ్వు దీపని కాదు మాతృత్వాన్ని అవమానిస్తున్నావని అమ్మతనం గురించి సుమిత్ర గొప్పగా చెప్తుంది. దాంతో జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. దీప ఏడుస్తూ వెళ్తుంది. కార్తీక్ కి సుమిత్ర సారీ చెప్తుంది. కార్తీక్ ని శివన్నారాయణ బయటకు తీసుకొని వస్తాడు. పంతులు అతడితో ఏం చెప్పాడో అన్నీ కార్తీక్ కి చెప్తాడు. నాకు భయంగా ఉందిరా ఎవరికి ఆపద వస్తుందోనని శివన్నారాయణ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : పెద్దకోడలు రిక్వెస్ట్ చేయడంతో భోజనం చేసిన రామరాజు.. శ్రీవల్లి దొరికిపోతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -326 లో.. సాగర్ ఎదురుతిరిగి మాట్లాడడంతో రామరాజు డల్ గా ఉంటాడు. ఏవండీ భోజనం చేద్దాం రండి అని వేదవతి పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదని రామరాజు అంటాడు. నిన్నటి నుండి ఏం తినలేదని వేదవతి రిక్వెస్ట్ చేస్తుంది. దొరికింది ఛాన్స్ అని ఇంకా ఈ నర్మద, ప్రేమ ఇద్దరిని ఇరికించాలని శ్రీవల్లి అనుకుంటుంది. పాపం మావయ్య గారిని చూస్తుంటే జాలిగా ఉంది. ప్రేమ జాబ్ చేస్తుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చొక్కా పట్టుకొని చింపారని శ్రీవల్లి గతాన్ని గుర్తుచేస్తుంది. ప్రేమ, నర్మదలపై ఇంకా కోపం కలిగేలా చేస్తాడు. ఆ తర్వాత భోజనం చెయ్యండి మావయ్య అని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. ఇంటికి పెద్ద కోడలిగా నువ్వే నన్ను అర్థం చేసుకుంటావమ్మ అని రామరాజు అంటాడు. ఆ తర్వాత  పదండి తిందామని రామరాజు అంటాడు. కాసేపటికి పూజ కోసం నర్మద రెడీ అవుతుంది. సాగర్ డల్ గా ఉంటే తనకి నచ్చజెప్పుతుంది. మరొకవైపు రేవతితో తిరుపతి మాట్లాడతాడు. అప్పుడే రామరాజు వచ్చి ఏంట్రా వాళ్ళతో మాట్లాడుతున్నావని అంటాడు. ఏంటి అండి ఎన్నటికి ఉన్నా రెండు కుటుంబాలు కలుస్తాయని వేదవతి అంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి నగలు అన్నీ వేసుకొని మురిసిపోతుంది. అప్పుడే తిరుపతి వస్తాడు. ఎక్కడ ఇవి ప్రేమ నగలు అని గుర్తుపడుతాడో అని చీర కప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Telugu Top-5 contestants : బిగ్ బాస్ సీజన్-9 లో టాప్-5 ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో  రోజురోజుకి విన్నర్ ఎవరు అవుతారా, టాప్-5 లో ఎవరుంటారనే క్యురియాసిటి అందరిలోను నెలకొంది. హౌస్ లో ప్రస్తుతం తొమ్మిది మంది ఉన్నారు. గతవారం దివ్య ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ ఇమ్మాన్యుయల్ తన పవరస్త్రాని ఉపయోగించడంతో దివ్య సేవ్ అయింది. ప్రస్తుతానికి విన్నింగ్ రేస్ లో తనూజ పుట్టస్వామి, కళ్యాణ్ పడాల ఉన్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో లేడీ బిగ్ బాస్ విన్నర్ అయితే అవ్వలేదు. ఒకవేళ బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తే ఈసారి లేడీ బిగ్ బాస్ విన్నర్ ని చూడాల్సిందే. కళ్యాణ్ పడాల విన్నర్ అవుతాడా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే అతను టాస్క్ ల పరంగా తన బెస్ట్ ఇస్తున్నాడు. మిగతా వారికంటే ఇప్పటివరకు టాప్-2 లో ఉన్నాడు. ఇక టాప్-3 ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ ఉండే అవకాశం ఉంది. మొదట్లో అందరు అతడే విన్నర్ అని అనుకున్నారు. హౌస్ లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. తను లేకుంటే ఈ సీజన్ లేదన్నట్లు అంతా ఎంటర్‌టైన్‌మెంట్ చేసాడు. ఇక టాప్-4 విషయానికి వస్తే డీమాన్ లేదా రీతూ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత టాప్-5 భరణి అని చెప్పొచ్చు. రీఎంట్రీ తర్వాత నుండి గేమ్ బాగా ఆడుతున్నాడు. ఇదే గేమ్ ఎంట్రీ నుండి ఆడితే భరణి విన్నర్ అయ్యేవాడు.. అందులో ఆశ్చర్యం లేదు. మొన్న ఫ్యామిలీ వీక్ లో వచ్చిన వాళ్ళలో చాలా మంది సుమన్ శెట్టిని టాప్ -5 కంటెస్టెంట్ అన్నారు కానీ ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ లో టాప్-6 పొజిషన్ లో ఉన్నాడు. ఇక ఈ వారం ఓటింగ్ లో దివ్య, సంజన లీస్ట్ లో ఉన్నారు.. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరూ బయటకు వెళ్లడం ఖాయం.. ఒకవేళ ఫినాలే వీక్ కి టాప్-6 అని బిగ్ బాస్ ప్లాన్ చేస్తే మాత్రం ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ అవుతుంది. సంజన, దివ్య ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు.

ప్రియాంకతో శివ్ బ్రేకప్... బంగారంతో విగ్రహం కట్టిస్తా!

హీరోస్ వెర్సెస్ హీరోయిన్స్ స్పెషల్ ఎపిసోడ్ గా నెక్స్ట్ వీక్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో రాబోతోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ షోకి అర్జున్ అంబటి, మానస్ నాగులాపల్లి, ముఖేష్ గౌడ, శివ్ కుమార్, ఆకర్ష్ బైరాముడి, నిఖిల్ మలయక్కల్, సుహాసిని, ప్రియాంక జైన్ వంటి వాళ్లంతా వచ్చారు. "మన సీరియల్ పురంలో విగ్రహం కడదామని ఫిక్స్ ఐపోయాం" అంటూ హరి చెప్పాడు. ఇక హీరోలు స్టేజి మీదకు వచ్చేసరికి శ్రీముఖి అందుకుంది. "ఎందుకు అంత గాప్ ఇచ్చావ్ అంటూ" హోస్ట్ శ్రీముఖి నిఖిల్ ని చాలా సరసంగా అడిగింది. "నీకు ఫోన్ చేశాడా" అంటూ హరిని అడిగింది. "చేసాడు..కానీ అప్పుడు బిజి వచ్చింది" అని చెప్పాడు. దాంతో శ్రీముఖితో పాటు అందరూ నవ్వేశారు. "నువ్విప్పుడు హీరో కాదు. యంచోర్ "అనేసింది. అదేంటి అని అడిగేసరికి "వాళ్ళు అక్కడ నిన్ను తీసేయాలి నువ్వు ఇక్కడికి వచ్చేయాలి" అంది. అంతే తలబాదుకున్నాడు మానస్. తర్వాత "ఏరా నాన్న ఎం చేస్తున్నావ్" అంటూ అంబటి అర్జున్ ని అడిగింది. ఎం సమాధానం చెప్పకుండా నవ్వేసాడు.  "నువ్వు ఇందాక విగ్రహాలు అని అదేదో అన్నావ్ కానీ" అని శ్రీముఖి అనేసరికి "ఒక్క నిమిషం అర్జున్ కి విగ్రహం కట్టే డబ్బులతో నేను పది అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవచ్చు" అంటూ కామెంట్ చేసాడు హరి. "సుహాసిని నీ విగ్రహం కట్టించేటప్పుడు అందులో నీ నడుము ఉండదు" అని చెప్పింది శ్రీముఖి. "చూసావా ఎంత సిమెంట్ మిగిల్చానో" అని సుహాసిని ఫన్నీగా చెప్పింది. "శివ్ విగ్రహం కడితే పక్కన ప్రియాంక విగ్రహం కూడా కట్టాలా" అని హరి అడిగేసరికి "హే వొద్దొద్దు.. నేను సోలోనే ఎప్పుడు" అన్నాడు. అంతే సీరియస్ గా చూసింది ప్రియాంక. "అతను సోలో మ్యాన్ అంట. బ్రేకప్ ఐపోయిందంట" అని శ్రీముఖి అనేసరికి "అవును తెలీదా మీకు" అంది ప్రియాంక. మరి చెప్పలేదేమిటి అంటూ అవినాష్ వెళ్లి ప్రియాంక చేయి పెట్టుకొనేసరికి "హే సిమెంట్ తో ఎందుకండీ నా ప్రియాంకను గోల్డ్ తో కట్టించాలి" అన్నాడు. అంతే ఒహ్హ్ అంటూ అందరూ అరిచేసారు.

Bharani Out of The Captaincy Task: కెప్టెన్సీ రేసు నుంచి భరణి అవుట్.. కూతురి డ్రీమ్ నెరవేరేనా!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ తర్వాత నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఇక ఆ తర్వాత హౌస్ లో కెప్టెన్సీ కోసం టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లు ఆడించడానికి హౌస్ లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ వచ్చారు. గౌతమ్ హౌస్ లోకి పంచకట్టులో మాస్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చి రాగానే అందరి ఆటతీరు చెప్పాడు. సుమన్ గారు మీరు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు.. మీరంటే చాలా ఇష్టం అని చెప్పి సుమన్ ని హగ్ చేసుకుంటాడు గౌతమ్. హౌస్ లో ఫన్ క్రియేట్ చెయ్యడానికి ఇద్దరు ఇద్దరిగా వెళ్లి అమ్మాయిలని ఫ్లర్టింగ్ చేయాలని గౌతమ్ చెప్తాడు. దాంతో మొదటగా సంజనని భరణి ఫ్లర్టింగ్ చేస్తాడు. వాళ్ళ మధ్యలోకి సుమన్ వచ్చి సంజనని ఫ్లర్ట్ చేస్తాడు. ఆ తర్వాత రీతూని కళ్యాణ్, దివ్యని ఇమ్మాన్యుయల్.. తనూజని డీమాన్ ఫ్లర్ట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత గౌతమ్ తనతో టాస్క్ ఆడడానికి భరణిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ టాస్క్ లో భరణి ఓడిపోతాడు. ఇక కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుండి తొలగిపోతాడు. దాంతో భరణి ఎమోషనల్ అవుతాడు. గౌతమ్ హౌస్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎంత కష్టమైనా ఆడుదామని అనుకున్నాను.. నా కూతురు ఫ్యామిలీ వీక్ లో వచ్చినప్పుడు.. "నాన్న నువ్వు కెప్టెన్ అవ్వాలి" అని అందంటూ భరణి డిసప్పాయింట్ అవుతాడు. హౌస్ లో ఉన్న తొమ్మిది మందిలో అందరు ఒక్కసారి కెప్టెన్ అయ్యారు. ఇమ్మాన్యుయల్ రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు. భరణి ఇంతవరకు ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు.. పైగా కెప్టెన్సీ టాస్క్ ఇదే చివరి వారం.. నెక్స్ట్ వీక్ నుండి కెప్టెన్సీ టాస్క్ ఉండదు. అందుకే భరణి అంతలా ఎమోషనల్ అవుతున్నాడు. అన్ని టాస్క్ లు అయ్యేసరికి రేస్ నుండి తొలగిపోయిన వారందరికి మళ్ళీ టాస్క్ పెట్టొచ్చు.. ఆ టాస్క్ లో గెలిచిన వారికి కెప్టెన్సీ రేస్ లో పోటీపడేందుకు ఛాన్స్ వస్తుంది కావచ్చు. అందులో భరణి ఉంటాడేమో చూడాలి మరి.

Bigg Boss 9 voting : ఫేక్ ఓటింగ్‌తో తనూజ టాప్.. డేంజర్ జోన్‌లో సుమన్ శెట్టి!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. ఇక పన్నెండవ వారం హౌస్ లో కెప్టెన్సీ కోసం టాస్క్ లు మొదలెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లలో ఉన్న కెప్టెన్ లని హౌస్ లోకి రప్పిస్తున్నాడు బిగ్ బాస్. ఎక్స్ కంటెస్టెంట్స్ వర్సెస్ సీజన్-9 కంటెస్టెంట్స్ అన్నట్టుగా ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఈ వారం రీతూ కెప్టెన్ గా ఉండటంతో తను తప్ప హౌస్ లోని వాళ్ళంతా నామినేషన్ లో ఉన్నారు. మరి వారిలో ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుంది.. జెన్యున్ ఓటింగ్.. ఫేక్ ఓటింగ్ ఎలా ఉందో ఓసారి చూసేద్దాం. ఏ అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్ చూసిన తనూజ టాప్ లో ఉంది. తనకి ముప్పై శాతం పైనే ఓటింగ్ పడుతోంది. అంటే వంద మంది ఓటింగ్ చేస్తే అందులో ముప్పై మంది తనకి ఓటింగ్ చేయగా మిగిలిన డెబ్బై మంది ఏడుగురు కంటెస్టెంట్స్ కి ఓటింగ్ చేస్తున్నారన్న మాట. తనూజకి పడే ఓటింగ్ అంతా బిగ్ బాస్ మామ దగ్గరుండి చేసుకుంటున్నాడని, ఫేక్ ఓటింగ్ క్రియేట్ చేస్తున్నారనే రూమర్ అయితే నడుస్తోంది. ఇక రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ పడాల ఉన్నాడు. అతనికి ఇరవై అయిదు శాతం ఓటింగ్ పడుతోంది. అయితే ఇందులో కూడా కొంత ఫేక్ ఓటింగ్ అనేది ఉంది.. ఎందుకంటే బిగ్ బాస్ మామ ఈ సీజన్-9 లో కళ్యాణ్ ని విన్నర్ చేయాలని, తనూజని రన్నరప్ చేయాలని చూస్తున్నాడని సోషల్ మీడియా అంతటా ప్రచారం సాగుతుంది. ఇక మూడో స్థానంలో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. అతనికి పదమూడు శాతం ఓటింగ్ పడుతోంది. సంజన గల్రానీకి ఏడు శాతం ఓటింగ్ పడుతోంది. భరణికి, డీమాన్ పవన్ కి ఆరు శాతం ఓటింగ్ పడుతోంది. సుమన్ శెట్టి, దివ్య నిఖితకి అయిదు శాతం ఓటింగ్ పడుతోంది. అంటే ఈ వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు చాలా వరకు ఉంది. ఎందుకంటే సుమన్ శెట్టికి బిగ్ బాస్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే తను గేమ్ ఆడినా ఆడకపోయినా అతను ఇప్పటివరకు హౌస్ లోనే ఉన్నాడు. ఈ లెక్కన ఈ వారం దివ్య నిఖిత ఎలిమినేషన్ ఫిక్స్ అన్నమాట. హౌస్ లో జెన్యున్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే సుమన్ శెట్టి, డీమాన్ పవన్, దివ్య నిఖిత.. మిగతా వారంతా ఎంతో కొంత కన్నింగ్ అండ్ స్ట్రాటజీలు ప్లే చేస్తూ నెట్టుకొచ్చేవాళ్ళే. నేటి ఓటింగ్ ని బట్టి చూస్తే సుమన్ శెట్టి, దివ్య నిఖిత డేంజర్ జోన్ లో ఉన్నారు.

Divya Elimination: దివ్య ఎలిమినేషన్.. అంతా సిద్ధం.. బిగ్ బాస్ సతమతం!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ ముగిసాక హౌస్ లో తొమ్మిది కంటెస్టెంట్స్ మిగిలారు. అయితే వీరిలో కెప్టెన్ రీతూ తప్ప మిగిలిన ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు. ఇక హౌస్ లో భరణి, తనూజ, దివ్య వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. గతవారం కెప్టెన్సీ రేస్ నుండి తనూజని దివ్య తప్పించడంతో తనూజ, దివ్యల మధ్య అగ్గి రాజుకుంది. అయితే తనూజ ఎప్పుడు చూసిన దివ్యని తప్పుగా అర్థం చేసుకుంటు తననే టార్గెట్ చేసి గొడవ పడతుంది. ఎందుకంటే తనూజకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేది దివ్యనే. రీతూ డీమాన్ ఓ ట్రాక్ లో వెళ్తుంటే.. సంజన అమ్మగా ఇమ్మాన్యుయల్ కొడుకుగా ఓ బాండ్ నడుస్తోంది. ఇక తనూజతో పోటీగా గేమ్స్ ఆడేది దివ్య మాత్రమే. అందుకే దివ్యని మెంటల్ గా వీక్ చేయాలని తనూజ భావించి తనని పర్సనల్ గా ఎటాక్ చేసింది. నేను భరణి సర్ తో మాట్లాడినా తప్పేనా.. ఏంటి నువ్వు అన్నట్టుగా దివ్యని రెచ్చగొట్టి, తనని నోరుజారేలా చేసి, అందరి ముందు తప్పుగా పోట్రే చేసి.. తనని ఎంత బ్యాడ్ చేయాలో అంతా బ్యాడ్ చేసింది తనూజ. ఈ సీజన్-9 విన్నర్ లేదా రన్నర్ గా తనూజని చేయాలని బిగ్ బాస్ ఆలోచిస్తున్నాడు. అందుకే తనూజకి సంబంధించిన నెగెటివ్ ఫుటేజ్ అంతా తీసేస్తున్నారు. తనూజ ఎవరితో గొడవ పెట్టుకుంటుందో వారిని బయటకు పంపించేస్తున్నాడు బిగ్ బాస్. అందులో భాగంగానే గతవారం దివ్యని పంపించెయ్యడానికి బిగ్ బాస్ స్కెచ్ వేయగా ఇమ్మాన్యుయల్ పవరస్త్ర వాడి అడ్డుకట్ట వేశాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్ మాత్రం ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఓటింగ్ అంతా బిగ్ బాస్ చేతిలోనే కాబట్టి తనూజ, కళ్యాణ్ లకి అత్యధిక ఓటింగ్ వేసి దివ్య, డీమాన్ పవన్, భరణి లాంటి వారికి తక్కువ ఓటింగ్  పడేలా చేస్తారు. సీజన్-9 లో జెన్యున్ కంటెస్టెంట్స్ అయినటువంటి భరణి, డీమాన్ పవన్ , దివ్య నిఖిత లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతోంది. ఇప్పటికే తనూజని బిగ్ బాస్ దత్తపుత్రిక అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ వారం దివ్య ఎలిమినేషన్ అయితే మాత్రం తనూజని విన్నర్ చేయడానికి బిగ్ బాస్ ఇదంతా చేస్తున్నాడని ఆడియన్స్ అందరికి అర్థమవుతుంది.

Prerana Vs Tanuja: ప్రేరణ వర్సెస్ తనూజ.. గెలుపు ఎవరిది!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. ‌ఇక కెప్టెన్సీ టాస్క్ లు జోరుగ సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎక్స్ హౌస్ మేట్స్ ని హౌస్ లోకి రప్పించి వారితో హౌస్ లోని కంటెస్టెంట్స్ చేత కెప్టెన్సీ టాస్క్ లు ఆడిస్తున్నాడు బిగ్ బాస్.  ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో‌ ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి  కెప్టెన్సీ టాస్క్ లు ఆడగా.. పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ అవ్వగా.. భరణి కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకున్నాడు. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో హౌస్ లోకి ఎక్స్ కంటెస్టెంట్ ప్రేరణ వచ్చేసింది. తను వచ్చీ రాగానే అందరికి హాయ్ చెప్పేసింది. అందరు గేమ్ బాగా ఆడుతున్నారని చెప్పింది. నేను నిజానికి చాలా బాధపడ్డాను.. ఏంటిది టూ టూ హౌసెస్ అంటున్నారు.. పక్కనే ఇంకో సెట్ కట్టారా అని అనుకున్నానని ప్రేరణ అంటుంది. హమ్మయ్య వీళ్ళని కరెక్ట్ ప్లేస్ లో పడేశారని అనుకున్నావా అంటూ ఇమ్మాన్యుయల్ పంచ్ వేయగానే హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. ప్రేరణ నువ్వు టఫ్ ప్లేయర్ నాకు నీతో ఆడాలని ఉంది అని తనూజ అనగానే తననే సెలెక్ట్ చేసుకుంది ప్రేరణ.  ఇక హౌస్ లో జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో తనూజ గెల్చినట్టుగా తాజాగా వదిలిన ప్రోమో(Bigg Boss 9 Promo) లో చూపించాడు బిగ్ బాస్‌. అయితే భరణి వర్సెస్ గౌతమ్ కృష్టతో జరిగిన టాస్క్ లో కూడా గౌతమ్ ఓడినట్టుగా ప్రోమోలో చూపించాడు బిగ్ బాస్ కానీ ఎపిసోడ్ కి వచ్చేసరికి భరణి ఓడిపోయాడు. అలాంటి ట్విస్ట్ ఏదైనా ఉంటుందా లేక తనూజ గెలిచిందా తెలియాలంటే నేటి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే.

Sanjana Refuses to Apologise: సారీ చెప్పే ప్రసక్తే లేదు.. ఇమ్మాన్యుయేల్ వెళ్ళిపోయాడు!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. హౌస్ లో ఇప్పుటి వరకు ఒక లెక్క ఇప్పటినుండి ఒక లెక్క అన్నట్లు సాగుతుంది. నామినేషన్ ప్రక్రియలో నిజంగానే చదరంగం కాదు.. ఇది రణరంగమే అన్నట్లు సాగింది. నామినేషన్ అనంతరం కూడా దాని తాలూకా గొడవలు హౌస్ లో కంటిన్యూ చేశారు. నువ్వు రోజు రాత్రి డీమాన్ తో కూర్చుంటావని సంజన అన్నమాటలకి రీతూ బాగా హర్ట్ అయింది. బాత్రూంలోకి వెళ్లి బాగా ఏడుస్తుంది తనూజ. ఏడుస్తున్నా రీతూని డీమాన్ పిలుస్తాడు. ప్లీజ్ రీతూ బయటకు రా ఏడ్వకని రిక్వెస్ట్ చేస్తాడు.. రీతూ బయటకు వచ్చాక ప్లీజ్ డీమాన్ నువ్వు వెళ్ళు.. నేను రీతూ మాట్లాడుతానని తనూజ అంటుంది. ఇక్కడ ఎవరం ఏ తప్పు చెయ్యడం లేదు.. మీరేంటో మీకు తెలిసినప్పుడు, ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవద్దని తనూజ అంటుంది. నాకు ఆ బాధ ఉండిపోయిందని రీతూ ఏడుస్తుంది. మరొకవైపు సంజన దగ్గరికి ఇమ్మాన్యుయల్ వెళ్లి.. ''నువ్వు అన్నమాట తప్పు ఇక్కడ గొడవ అంతా ఎవరు చూడరు.. ఒక్క మాటనే పట్టుకుంటారు.. ప్లీజ్ వెళ్లి సారీ చెప్పు" అని సంజనతో ఇమ్మాన్యుయేల్ అంటాడు. నేను చెప్పను.. తను నన్ను ఎన్నో అంది పతివ్రత శిరోమణి అంది.. మొదట్లో దానికి ఏమైనా సారీ చెప్పిందా.. ఇప్పుడు తనదే తప్పు.. తను ఫస్ట్ సారీ చెప్తే  నేను చెప్తానని సంజన మొండిగా అంటుంది. నీకు వాళ్ళు ఇద్దరు పక్కన కూర్చుంటే.. తమ్ముడు నీకంటే ఇక్కడ పెద్ద వాళ్ళం ఉన్నాం.. నువ్వు అలా పక్కన కూర్చుంటే ఇబ్బందిగా ఉంది అని మెల్లగా కూర్చొని చెప్పాలి కానీ ఇలా నామినేషన్ లో చెప్పే విషయం అది కాదని ఇమ్మాన్యుయేల్ అంటాడు. మరి వాళ్ళు కూడా అలాగే కూర్చొబెట్టుకొని.. అక్క నీ గేమ్ కన్పించడం లేదు.. ఇకనైనా ఆడు అని చెప్పాలి కదా.. నామినేట్ చేసి చెప్పాలా అని సంజన అనగానే ఇక తనతో వాధించి ప్రయోజనం లేదని ఇమ్మాన్యుయేల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత సంజన దగ్గరికి డీమాన్ వచ్చి.. అక్క రీతూకి సారీ చెప్పండి అని అంటాడు. నేను చెప్పను తనే నాకు సారీ చెప్పాలని సంజన అంటుంది. కాసేపటికి  భరణి, సుమన్ ఇద్దరు సంజన దగ్గరికి వచ్చి రీతూ విషయంలో మీరు మాట్లాడింది తప్పు అని అంటారు. అయినా సంజన మాత్రం మొండిగా ఉంటుంది. వీకెండ్ లో నాగార్జున చెప్పమంటేనైనా రీతూకి సంజన సారీ చెప్తుందో లేదో చూడాలి మరి. 

Jayam serial : గంగ, రుద్రల శోభనానికి ముహుర్తం పెట్టించిన పెద్దసారు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -124 లో.....పారుని శకుంతల లోపలికి తీసుకొని వస్తుంది. గంగ ఈ ఇంటి కోడలు అని నేను అనుకోవడం లేదు.. ఒక్క మావయ్య గారు మాత్రమే అనుకుంటున్నాడు.. రుద్ర అయితే దూరం దూరం ఉంటున్నాడని శకుంతల అంటుంది. ఇదంతా చూస్తుంటే తలనొప్పిగా ఉందని శకుంతల అనడం గంగ వింటుంది. అమ్మ గారికి తలనొప్పిగా ఉందట కాఫీ చేసి తీసుకొని వస్తానని కిచెన్ లోకి వెళ్లి పాలు వేడి చేస్తుంది. అప్పుడే ఇషిక వచ్చి అత్తయ్య పర్మిషన్ లేకుండా కిచెన్ లోకి ఎందుకు వచ్చావని గంగపై కోప్పడతుంది. అదే విషయం ఇషిక వెళ్లి శకుంతలకి చెప్తుంది. దాంతో శకుంతల వస్తుంది. ఎందుకు కిచెన్ లోకి అడుగుపెట్టావని గంగపై శకుంతల కోప్పడుతుంది. ఇక అప్పుడే పెద్దసారు వస్తాడు. నువ్వు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా గంగ ఈ ఇంటికి కోడలు అని పెద్దసారు అంటాడు. అప్పుడే స్టవ్ పై పాలు పొంగిపోతాయి. ఎలాగైతే ఏంటి కొత్త కోడలు చేత పాలు పొంగించావని పెద్దసారు అనగానే శకుంతల కోపంగా వెళ్ళిపోతుంది.  ఆ తర్వాత గంగ కాఫీ తీసుకొని రుద్ర దగ్గరికి వెళ్తుంది. మీరు కొంచెం తాగి నాకు కొంచెం ఇవ్వండి అని గంగ అంటుంది. నాకు అలా ఇష్టం ఉండదని రుద్ర అంటాడు. అయిన సరే గంగ వినిపించుకోకుండా లాక్కుంటుంది. ఈ పనులు పక్కన పెట్టి బాక్సింగ్ పై ఇంట్రెస్ట్ పెట్టు అని రుద్ర అంటాడు. నేను ఈ ఇంటికి కోడలిని అన్ని పనులు చెయ్యాలని గంగ అంటుంది. అయితే నా బట్టలు ఇస్త్రీ చెయ్.. కరెంటు షాక్ అయ్యేలా కాకుండా.. డ్రెస్ కాలిపోకుండా చెయ్ అని రుద్ర చెప్తాడు. దాంతో గంగ మంట పెట్టి చెంబుతో ఇస్త్రీ చెయ్యాలని ట్రై చేస్తుంది. ఇంట్లో వాళ్లంతా వింతగా చూస్తారు. ఇంటిపని మనిషి కూడా ఇంత చీఫ్ గా ఆలోచించదని శకుంతలతో పారు అంటుంది. ఇషిక, పారు శకుంతల, వీరు మాట్లాడుకుంటారు  మేమ్ ముగ్గురం నీకు సపోర్ట్ ఉన్నాం.. రుద్ర బావని నీ ప్రేమతో నీ వైపుకి తిప్పుకోమని పారుతో ఇషిక చెప్తుంది. ఆ తర్వాత ప్రీతీ, ప్రమీల, స్నేహ ముగ్గురు మాట్లాడుకుంటారు. గంగ ఎక్కడ ఉంటే అక్కడ సరదా ఉంటుంది. అన్నయ్యకి కరెక్ట్ జోడి అని నవ్వుకుంటారు. అప్పుడే రుద్ర వచ్చి.. మీరు ఆ తింగరి గంగకి ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో చెప్పొచ్చు కదా అని అంటాడు. వద్దు అన్నయ్య తనలా తనని ఉండనివ్వండి అని ప్రీతీ అంటుంది. తరువాయి భాగంలో గంగ, రుద్ర శోభనానికి పెద్దసారు ముహూర్తం పెట్టిస్తాడు. శకుంతల షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రాహుల్ కోసం కొత్త కంపెనీ పెడుతున్న రాజ్.. సారీ చెప్పిన స్వప్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -887 లో......రాజ్ దగ్గర నుండి స్వప్న ఫోన్ తీసుకుంటుంది. అది తీసుకొని వెళ్లి రాహుల్ కి ఇస్తుంది. ఫోన్ లో కొత్త కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ ఉంటుంది. అది చూసి స్వప్న షాక్ అవుతుంది. మరొకవైపు పెళ్లిరోజు సందర్బంగా అపర్ణ, సుభాష్ కేక్ కట్ చేశారు. అందరు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే స్వప్న వస్తుంది. అందరిని పిలుస్తుంది కానీ ఎవరు వినిపించుకోకపోవడంతో ఫ్లవర్ వాజ్ పడేస్తుంది‌ దాంతో అందరు ఏమైందని స్వప్నని అడుగుతారు. రాజ్ కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు.. ఎందుకు ఇలా చేస్తున్నాడు.. స్వరాజ్ కంపెనీకి సంబంధం లేకుండా ఇలా కొత్త కంపెనీ పెట్టి ఫండ్స్ మొత్తం దానికి ట్రాన్స్‌ఫర్ చేస్తూ లెక్కలు చూపించడం లేదు.. ఇలా ఎవరిని మోసం చేద్దామని అనుకుంటున్నారని రాజ్, కావ్యని స్వప్న అడుగుతుంది. అందరికి ఫోన్ లో కొత్త కంపెనీకి సంబంధించినది  స్వప్న చూపిస్తుంది. ఇందులో చెప్పడానికి ఏముంది ఒకవేళ పాత కంపెనీకి నష్టం వస్తే ఎలా అని ముందు జాగ్రత్త కొద్దీ వాళ్ళు సేఫ్టీ చూసుకుంటున్నారని రుద్రాణి అంటుంది. అప్పుడే రాజ్ ఎంట్రీ ఇస్తాడు. అవును కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను.. కానీ 'R' అంటే రాజ్ కాదు.. రాహుల్ అని రాజ్ అనగానే అందరు షాక్ అవుతారు. భలే కవర్ చేసావ్ రాజ్ అని రుద్రాణి అంటుంది. మీరు ఆపండి రుద్రాణి గారు.. మా ఆయన చెప్పేది నిజం.. నీ కొడుకు ఇప్పుడు మారడానికి ట్రై చేస్తున్నాడు.. ఒక ఛాన్స్ ఇద్దామని ఇలా చేసామని కావ్య అంటుంది. ఇప్పుడు స్వరాజ్ కంపెనీలో ఎంత పెద్ద పోస్ట్ ఇచ్చిన వీళ్ళ కింద పని చేస్తున్నాననే ఫీలింగ్ లోనే రాహుల్ ఉంటాడు. అందుకే తనకి సొంతంగా కంపెనీ ఉండి అందులో బాధ్యతలు అప్పగిస్తే వాడికే తెలుస్తుందని రాజ్ అనగానే సారీ కావ్య అని స్వప్న అంటుంది. ఆ తర్వాత రాహుల్ వాళ్లకి సారీ చెప్తాడు. తరువాయి భాగంలో  రాజ్ నాకు ఇచ్చింది కంపెనీ కాదు పెద్దకత్తిని ఎలా నరికేస్తానో చూడమని రుద్రాణితో రాహుల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీపకి పుట్టబోయే బిడ్డ ఈ అంతఃపురంలోనే పుట్టాలి జ్యోత్స్న.. దాస్ నిర్ణయం అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -524 లో..... దీప ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పగానే అందరు సంతోషపడతారు. పారిజాతం, జ్యోత్స్న మాత్రం షాక్ అవుతారు. ప్రెగ్నెంట్ అంటే ఏంటని శౌర్య అడుగుతుంది. నీకు ఆడుకోవడానికి తమ్ముడో చెల్లెలో వస్తుందని సుమిత్ర అనగానే నాకు మొన్న ఆడుకోమని బొమ్మ ఇచ్చింది.. అది చెల్లి అని పిలువు అంది.. నాకు చెల్లి వస్తుందని శౌర్య అంటుంది. అమ్మ నాకు కలలోకి వచ్చి చెప్పింది.. ఇప్పుడు నా మనవరాలిగా నా ఇంట్లో అడుగుపెట్టబోతుందని కాంచన అనగానే శివన్నారాయణ హ్యాపీగా ఫీల్ అవుతాడు. జ్యోత్స్న కోపంగా పైకి వెళ్తుంది. తన వెనకాలే పారిజాతం వెళ్తుంది. ఏంటి గ్రానీ వాళ్ళు చెప్పేది నిజమేనా అని జ్యోత్స్న అడుగుతుంది. అవును అది ప్రెగ్నెంట్ అయితే నీకేంటని పారిజాతం అంటుంది. ఈ ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని పంతులు చెప్పాడు కదా అని జ్యోత్స్న అనగానే దీప ప్రెగ్నెంట్ అయితే ఈ ఇంటి వారసురాలికి మంచి ఎలా జరుగుతుంది. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. లేదు బావ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ దీపకి అదృష్టం పట్టిందని జ్యోత్స్న అంటుంది. అప్పుడే దాస్ ఎంట్రీ ఇచ్చి.. దీప ప్రెగ్నెంట్ అని స్వీట్ పంచుతాడు. మరొకవైపు పంతులు దగ్గర దీప, కార్తీక్ ఆశీర్వాదం తీసుకుంటారు. పంతులు వెళ్తూ వెళ్తూ.. దశరథ్, సుమిత్రలతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. దాంతో పంతులు బయటకు వచ్చాక.. అలా ఎందుకు అన్నారని శివన్నారాయణ అడుగుతాడు. మీకు రాబోయే విపత్తు ఉంది.. దాని స్థాయి తగ్గడానికి హోమం చేసాను.. విపత్తు అయితే ఉందని పంతులు చెప్పగానే శివన్నారాయణ టెన్షన్ పడతాడు. మరొకవైపు దీప తల్లి కాబోతుందని కాంచన, అనసూయ చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత దాస్ ని జ్యోత్స్న కలుస్తుంది. మీరు ఎప్పుడు దీప గురించి ఇంట్లో వాళ్లకి చెప్పకూడదని దాస్ తో జ్యోత్స్న అంటుంది. దీప బిడ్డ ఈ అంతఃపురంలోనే పుట్టాలని దాస్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.