చిట్టి మాష్టర్ తో ఉన్న గొడవే అది.. ఢీ షోలో ఎన్నో కష్టాలు పడ్డాను!

బుల్లితెర మీద ఢీ షో ఎంతో ఫేమస్. అందులో రాజు, అభి, చిట్టి మాష్టర్ ఇలాంటి వాళ్లంతా కూడా ఆడియన్స్ కి పరిచయమే. అభి మాష్టర్ ఇప్పుడు ప్రసారమవుతున్న సీజన్ లో కంటెస్టెంట్ గా ఉన్నాడు. ఇక వీళ్ళ కష్టాల గురించి ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. "విజయవాడ నుంచి ఢీలో చేయడానికి 10 మందిమి వచ్చాము. తర్వాత ఒక్కొక్కరిగా అందరూ వెళ్లిపోయారు. చివరికి నేనొక్కడినే మిగిలాను. ఇక స్కూల్ కూడా మానేసి ఢీ షోలోనే ఉండిపోయాను. సాయి తేజ అన్న దగ్గర నుంచి చిట్టి అన్న దగ్గరకు వచ్చేసాం. ఇక ఆయన్ని మాష్టర్ ని చేయడం కోసం చాలా కష్టపడ్డాం. ఢీ జూనియర్స్ 2 నుంచి నేను నెమ్మదిగా కోరియోగ్రఫీ చేయడం స్టార్ట్ చేసాను. సాంగ్స్ ఎడిటింగ్ అవీ నేర్చుకున్నా. నేను చిట్టి అన్న, చైతన్య అన్నా కలిసాం. అలా ఢీ జోడి ఆడిషన్స్ కి సెలెక్ట్ అయ్యాము. ఢీ జోడికి సోమేష్ కంటెస్టెంట్ నేను మాస్టర్ అని ఫిక్స్ ఐపోయాం. నేను విజయవాడ వచ్చేసాను. ఐతే చిట్టి అన్న నాకు ఫోన్ చేయడం మానేసాడు. ఫైనల్ గా షూటింగ్ డేట్ రేపు అనగా ముందు రోజు ఫోన్ చేసి నువ్వింకా చిన్నపిల్లోడివే మిగతా వాళ్ళు నువ్వు ఇవన్నీ హ్యాండిల్ చేయలేవు అని చెప్పారు అన్నాడు. అప్పుడు ఆయన మీద నాకు బాగా కోపం వచ్చింది. వాళ్ళు చెప్పకపోయినా చిట్టి అన్నే చెప్పాడు అనుకున్నా. అప్పుడు కోపంతో డాన్స్ చేయడం మానేద్దామనుకున్నా. ఆ సీజన్ లో చైతన్య మాష్టర్ కి కూడా ఛాన్స్ వచ్చింది. ఐతే అతని దగ్గర అసిస్టెంట్ లేదు. అప్పుడు నన్ను తన దగ్గరకు వచ్చేయమని చెప్పాడు. అలా తర్వాత ఢీ 10 వచ్చింది. రాజు ఎంటరయ్యాడు.  అతనికి ఉన్నంత డెడికేషన్ ఇంకెవరి దగ్గరా నేను చూడలేదు. ఆ తర్వాత ఫైనల్ గా టైటిల్ కొట్టాం. ఇక వాళ్ళు చార్జెస్ కి మాత్రమే డబ్బులు ఇస్తారు. తినడానికి డబ్బులు లేవు. సెలబ్రేషన్ చేసుకోవడానికి కనీసం బిర్యానీ కూడా లేదే అనుకున్నాం. అప్పుడు 5 రూపాయలకే భోజనం అన్న చోట లైన్ లో నిలబడి భోజనం చేసాం. అప్పటికే మా చెప్పులు ఎవరో తీసుకెళ్లిపోయారు. వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు.

Bigg Boss 9 Telugu 12th week Voting: పన్నెండో వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండో వారం ఫ్యామిలీ వీక్ కొనసాగుతుంది. అయితే ఈ వారం నామినేషన్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్ పడాల, దివ్య నిఖిత, సంజన గల్రానీ, డీమాన్ పవన్, భరణి ఉన్నారు. ఇక వీరిలో ఎవరికి ఎంత ఓటింగ్ పడిందో ఓసారి చూసేద్దాం. ఇమ్మాన్యుయల్ చాలా వారాల తర్వాత నామినేషన్ లోకి వచ్చాడు. అయినప్పటికి ఓటింగ్ భారీగానే పడుతుంది. ఇక ఎప్పటిలాగే కళ్యాణ్ పడాలకి అత్యధికంగా ఓటింగ్ నమోదైంది. ముప్పై మూడు శాతం ఓటింగ్ తో కళ్యాణ్ మొదటి స్థానంలో ఉండగా, ఇరవై అయిదు శాతం ఓటింగ్ తో భరణి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఇమ్మాన్యుయల్ పద్నాలుగో శాతం ఓటింగ్ తో మూడో స్థానంలో ఉన్నాడు. డీమాన్ పవన్ కి తొమ్మిది శాతం ఓటింగ్ పడింది. సంజన గల్రానీ, దివ్య నిఖిత ఇద్దరు ఎనిమిది శాతం ఓటింగ్ తో లీస్ట్ లో ఉన్నారు.  డీమాన్ పవన్, సంజనా గల్రానీ, దివ్య నిఖిత ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేషన్ అయి బయటకు వస్తారో తెలియదు. ఎందుకంటే అన్ అఫీషియల్ ఓటింగ్ తో పాటు మిస్డ్ కాల్స్ కూడా లెక్కలోకి వస్తాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన పదకొండు వారాల ఎలిమినేషన్ ప్రాసెస్ లో అన్ అఫీషియల్ ఓటింగ్ లో ఎవరు డేంజర్ జోన్ లో ఉంటారో వారిలో నుండి ఒకరు ఎలిమినేట్ అయ్యేవారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందా లేక బిగ్ బాస్ మామ ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా చూడాలి మరి. అయితే డేంజర్ జోన్ లో ఉన్నవారిలో డీమాన్ పవన్, దివ్య నిఖిత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. డీమాన్ కి కండబలం ఉంటే దివ్య నిఖితకి బుద్ధి బలం ఉంది. కానీ సంజనకి అవేం లేవు.. అయినప్పటికి బిగ్ బాస్ తనకి ఫేవరెటిజం చూపిస్తున్నాడు. తను అసలు గేమ్స్ ఆడకపోయినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వకపోయినా.. అసలు తనేం చేయకపోయినా పన్నెండు వారాలు హౌస్ లో ఉందంటే అది బిగ్ బాస్ మామ సపోర్ట్ వల్లే. ఈ వారం కూడా సంజనా గల్రానీకి బిగ్ బాస్ ఫేవరెటిజం చూపిస్తాడా లేక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని బయటకు పంపిస్తాడా చూడాలి మరి.

Bigg Boss 9 Family Week Kalyan : కప్పుతో ఇంటికి రావాలి.. మాట తీసుకున్న కళ్యాణ్ తల్లి!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతోంది. ఒక్కో రోజు ముగ్గురు ఫ్యామిలీస్ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ లలో తనూజ వాళ్ళ అక్క పాప, చెల్లి అనూజ, భరణి వాళ్ల కూతురు, దివ్య వాళ్ళ అమ్మ వచ్చిన ఎపిసోడ్ హైలైట్ గా నిలిచాయి. అయితే నిన్నటి ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ పడాల వాళ్ల అమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  తనని చూసి కళ్యాణ్ ఎమోషనల్ అయి పరుగెత్తుకుంటూ వెళ్ళి తనని హత్తుకున్నాడు. ఇక కొడుకును సోఫా దగ్గరికి తీసుకెళ్ళి.. తిను శుభ్రంగా, బాగా సన్నగా అయిపోయావని అడిగింది. సరేనని కళ్యాణ్ అన్నాడు. బాగా తినరా పిచ్చోడా.. పిచ్చిపిచ్చి.. ఇంత మనసులో పెట్టుకున్నావా.. అంటూ కళ్యాణ్‌ తో చెప్తూ ఏడ్చేసింది. ఇక కొన్ని టిప్స్ కూడా ఇచ్చింది. ఎవరినీ నమ్మకు.. నీతో ఉన్నట్టే ఉంటారు కానీ నీవాళ్ళు కాదని చెప్పింది. కప్పు పట్టుకునే కంపల్సరీ రావాలి.. ప్రామిస్ చెయ్ అంటూ ఆమె అడగ్గానే కళ్యాణ్ ప్రమాణం చేశాడు.  నీ కోసం మన ఊరంతా ఎదురుచూస్తుంది. అప్పుడు ఎవరికి తెలియదు.. ఇప్పుడు అందరికి తెలిసిపోయిందంటూ కళ్యాణ్ తల్లి ఎమోషనల్ అయింది. ఇక కళ్యాణ్ వాళ్ళ అమ్మ వెళ్ళేముందు.. తన తల్లి చేయి పైకి ఎత్తి.. మొన్నటివరకూ లక్ష్మణ్ రావ్ కొడుకు కళ్యాణ్.. లక్ష్మి కొడుకు కళ్యాణ్ అనేవారు.. ఇప్పుడు కళ్యాణ్ మమ్మీ లక్ష్మి.. కళ్యాణ్ డాడీ లక్ష్మణ్ రావు.. నా తల్లిదండ్రుల్ని చూసి గర్వపడుతున్నానంటూ కళ్యాణ్ చెప్పాడు. ఇక బిగ్ బాస్ మామ ఎమోషనల్ సాంగ్ వేసి అందరిని ఏడ్పించేశాడు. అయితే నిన్నటి ఎపిసోడ్ కళ్యాణ్ కి ప్లస్ అవుతుందా లేదా చూడాలి.

Bigg Boss 9 Telugu Family Week: మాకు ఫైర్ భరణి కావాలి.... కమాండ్ చేసేవాళ్లతో జాగ్రత్తగా!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ సాగుతోంది. ఇందులో భాగంగా భరణి చిన్న కూతూరు హానీ ఎంట్రీ ఇచ్చింది. భరణి రీఎంట్రీ ముందు అతనికి గాయాలు అయ్యాయి.. అప్పుడే భరణి తిరిగి వస్తాడా రాడా అని  అందరు అనుకున్నారు. కానీ వచ్చాడు. అక్కడి నుండి తన ఆటస్వరూపమే మారిపోయింది. ఇక ఫ్యామిలీ వీక్ లో తన వాళ్లని చూడాలనుకున్న భరణి కల నెరవేరింది. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా హౌస్‌లోకి భరణి చిన్నకూతురు ఆర్తి అలియాస్ హానీ ఎంట్రీ ఇచ్చింది. చూడటానికి అచ్చం భరణిలానే ఉన్న ఈ అమ్మాయి తన డాడీకి మంచి సలహాలు అయితే ఇచ్చింది. ఆట గురించి హౌస్‌లో ఉన్న మనుషుల గురించి భరణికి మంచి ఇన్‌పుట్స్ ఇచ్చింది. హౌస్‌లో కూతుర్ని చూడగానే భరణి ఎమోషనల్ అయిపోయాడు. ఇక తన డాడీకి తగిలిన దెబ్బల గురించి భరణి కూతురు చాలా టెన్షన్ పడింది. ఇక తనూజని చూడగానే వెళ్లి గట్టిగా హత్తుకొని.. నీది నాన్నది బాండ్ అంటే నాకు చాలా ఇష్టం.. లవ్యూ అంటూ పలకరించింది భరణి కూతురు. మరోవైపు దివ్యకి మాత్రం ఏదో చెప్పాలంటే చెప్పాలన్నట్లు ఒక హాయ్ చెప్పింది. ఆ తర్వాత భరణితో కాసేపు మాట్లాడింది. మీరు చాలా బాగా ఆడుతున్నారు.. అయితే ఈ వీక్ మీరు కెప్టెన్ అవ్వాలి.. మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అంటూ తన కూతురు చెప్పింది.  ఇంతలో దివ్యని భరణి పిలిపించాడు. దీంతో దివ్యతో కాసేపు మాట్లాడింది హనీ. నాన్నకి బాలేనప్పుడు మీరు చాలా బాగా చూసుకున్నారు.. మీరు ఉన్నారనే కాస్త మాకు టెన్షన్ తగ్గింది.. అయితే కొంచెం ఆ కమాండింగ్ మాత్రం వద్దక్కా ప్లీజ్.. కొంచెం తగ్గించుకోండి అంటూ దివ్యకి చెప్పింది హానీ. అయ్యో రిక్వెస్ట్ వద్దు.. నిజానికి ఆయన ఫ్యామిలీ ఎవరొచ్చినా నన్ను తిడతారని నేను ముందే ఫిక్స్ అయిపోయాను.. ఎందుకంటే ఆయనపై నేను అంత ఫైర్ అయ్యాను.. అలిగానంటూ దివ్య చెప్పింది. కాసేపటి తర్వాత భరణితో మాట్లాడుతూ దివ్య విషయంలో ఇండైరెక్ట్‌గా ఒక సలహా ఇచ్చింది కూతురు. మాకు ఫైర్ భరణి కావాలి.. అగ్రెసివ్ భరణి మాకు కావాలి.. జస్ట్ కొంచెం కమాండ్ చేసేవాళ్లతో జాగ్రత్తగా ఉండాలి.. మీకు వాళ్లు కమాండ్ చేసేది ఏమైనా నచ్చకపోతే చెప్పేయండి సైలెంట్‌గా ఉండొద్దు.. మేము ఆ ఫైర్ భరణిని చూడాలి.. అంటూ దివ్య విషయంలో సలహా ఇచ్చింది. 

Bigg Boss 9 Telugu Family Week Rithu : రీతూ చౌదరికి తల్లి వార్నింగ్... భయపడ్డ డీమాన్ పవన్!

బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండవ వారం ఫ్యామిలీ వీక్ సాగుతోంది. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో రీతూ వాళ్ల అమ్మ ఎంట్రీ ఇచ్చింది. అమ్మని చూడగానే ఐ మిస్ యూ.. అంటూ రీతూ హగ్ చేసుకుంది. అయితే ఆమె మాత్రం నిన్ను కొట్టాలి.. చాలా ఉంది నీ గురించి చెప్పాల్సింది.. నువ్వు చాలా చేశావంటూ పైకి సరదాగానే అన్నట్లు అనిపించినా ఆమె ఫేస్ మాత్రం సీరియస్‌గానే ఉంది. నేను చెప్పిందేంటి నవ్వు చేసిందేంటి.. అంటూ రీతూని అడుగుతుంటే పక్కనే ఉన్న డీమాన్ కూడా కొంచెం భయపడ్డాడు. ఇదంతా చూసి అమ్మా పదా పక్కకెళ్లి మాట్లాడుదామంటూ రీతూ రిక్వెస్ట్ చేసింది. వద్దమ్మా నాకు ఒక చపాతీ కర్ర ఇవ్వరా.. అంటూ అడుగగా కళ్యాణ్ పరుగెత్తికెళ్ళి చపాతీ కర్ర తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ చపాతీ కర్రతో రీతూని కొట్టడానికి వచ్చి.. చివరికి ప్రేమగా హత్తుకుంది. ఆ తర్వాత అందరితో మాట్లాడింది రీతూ వాళ్ల అమ్మ. పైకి డీమాన్ గురించి చెప్పకపోయినా రీతూ తల్లి ఫేసులో, వాయిస్‌లో మాత్రం ఆ విషయంలో సీరియస్‌నెస్ కనిపించింది. ఇంకా ఐదు వారాలే ఉంది నువ్వు టాప్-5లో ఉండాలి.. కప్పు కొట్టాలి.. గేమ్స్ పైన దృష్టి పెట్టు.. మిగిలినవి వదిలెయ్ అంటూ రీతూకి ఆమె తల్లి సలహా ఇచ్చింది. ఇక తనూజని పిలిపించి మరీ రీతూ వాళ్ళ అమ్మ థాంక్స్ చెప్పింది. అలాగే ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, సంజనతో ప్రేమగా మాట్లాడింది. అమ్మా డీమాన్‌తో మాట్లాడు ప్లీజ్ అని రీతూ చెప్పగానే.. హాయ్ డీమాన్.. బాగా ఆడుతున్నావని అంది. మీ అమ్మ కూడా వచ్చినట్లున్నారు కదా.. చాలా బాగుంది.. మా అమ్మాయిని ప్రేమగా పలకరించారు.. థాంక్యూ అని డీమాన్ తో మాట్లాడింది. ఇదంతా చూసి డీమాన్ ఫేస్ డల్ అయిపోయింది. రీతూ తల్లి వెళ్లిపోయాక కూడా డీమాన్ డల్‌గానే కనిపించాడు.  మీ అమ్మ మన గురించి ఏమైనా అడిగిందా అని రీతూని డీమాన్ అడుగగా.. అదేం లేదని రీతూ అంది. అందరి గురించి చెప్పిందంటూ కవర్ చేసింది. చివరికి మీ మదర్ మన గురించి ఏమన్నా అన్నారేమోనని టెన్షన్ పడ్డాను.. నువ్వు ఏమైనా చెప్తే ఇక నీతో రేపటి నుంచి మాట్లాడకూడదనుకున్నానంటూ డీమాన్ అన్నాడు.

Brahmamudi : ఆఫీస్ కి వెళ్ళిన రాహుల్.. అవమానించారని స్వప్న ఫీలింగ్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -883 లో..... రాహుల్ ఆఫీస్ కి వెళ్తాడు. అప్పుడే శృతి వచ్చి కొన్ని ఫైల్స్ ఇచ్చి ఇందులో సంతకం పెట్టమని చెప్తుంది. ఫైల్ చెక్ చెయ్యాలి కదా అని రాహుల్ అనగానే అవసరం లేదు రాజ్ సర్ ఆల్రెడి చూసారు. కేవలం మీరు సంతకం పెడితే చాలని శృతి అంటుంది. అయితే కేవలం ఒక సంతకానికి మాత్రమే నేను రావాలా.. ఈ విషయం స్వప్నకి తెలిసేలా చెయ్యాలని రాహుల్ అనుకుంటాడు. స్వప్నకి ఫోన్ చేసి తిన్నావా అని రాహుల్ అడుగుతాడు. లేదు నువ్వు అని స్వప్న అడుగుతుంది. నేను బయట తినను కదా అని రాహుల్ చెప్తాడు. సరే నేను లంచ్ తీసుకొని వస్తానని స్వప్న అంటుంది. మరొకవైపు సుభాష్, అపర్ణ పెళ్లిరోజు కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. సుభాష్ యంగ్ గా రెడీ అయి పెళ్లిచూపులకి వస్తాడు. అపర్ణతో సుభాష్ మాట్లాడతాడు. ఆ తర్వాత స్వప్న బాక్స్ తీసుకొని ఆఫీస్ కి వెళ్తుంది. రాహుల్ భోజనం చేస్తాడు. అప్పుడే శృతి వచ్చి.. సర్ ఇందులో సంతకం పెట్టండి అంటుంది. ఫైల్ చెక్ చేస్తానని రాహుల్ అంటాడు అవసరం లేదు సర్ మీరు సంతకం పెట్టండి అంతే మీరు జస్ట్ టైమ్ పాస్ చేయండి అని శృతి అంటుంది. అదంతా స్వప్న చూసి శృతిపై కోప్పడుతుంది. పెత్తనం ఇచ్చినట్లే ఇచ్చి ఇలా చేస్తారా.. వాళ్ళ సంగతి చెప్తానని స్వప్న అంటుంది. స్వప్న ఇదంతా కామన్ అని రాహుల్ యాక్టింగ్ చేస్తాడు. మరొకవైపు సుభాష్ పెళ్లిచూపులకి వచ్చి అపర్ణని అలా నడవమంటాడు. తరువాయి భాగం లో కావ్య దగ్గరికి స్వప్న వచ్చి నా భర్తని ఎందుకు అవమానిస్తున్నారని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : పారు నిజస్వరూపం తెలుసుకున్న రుద్ర.. శకుంతల కనుక్కోగలదా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -119 లో.. పారు పాయిజన్ తాగుతుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. అప్పుడే పోలీసులు వస్తారు. నా చెల్లికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఆ గంగ అని హరి చెప్పగానే గంగని పోలీసులు అరెస్ట్ చేస్తారు. పారుని హరి హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత సారీ పెద్దనాన్న ఇలా జరుగుతుందనుకోలేదని పెద్దసారుతో రుద్ర అంటాడు. నువ్వేం చేసినా అలోచించి చేస్తావ్.. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది పారు గురించి కాదు గంగ గురించి.. తనని నువ్వే బయటకు తీసుకొని రావాలని పెద్దసారు అంటాడు. రుద్ర స్టేషన్ కి వెళ్తాడు. అప్పుడే లక్ష్మీ కూడా వస్తుంది. గంగకి బెయిల్ ఇవ్వండి అని రుద్ర అడుగుతాడు. బెయిల్ కంటే ఈ కేసు వెనక్కి తీసుకొమ్మని చెప్పండి అని ఇన్‌స్పెక్టర్ చెప్పగానే సరే నేను ట్రై చేస్తానని హరి దగ్గరికి  రుద్ర వస్తాడు. కేసు వెనక్కి తీసుక్కొమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ తీసుకోనని అతను తిరిగి పంపిస్తాడు. మరొకవైపు శకుంతల మనసులో ఇషిక, వీరు కలిసి రుద్ర, గంగ గురించి నెగెటివ్ క్రియేట్ చేస్తారు. కావాలనే డాక్టర్ తో మాట్లాడినట్లు వీరు యాక్టింగ్ చేస్తాడు. పారు కండిషన్ సీరియస్ అంట అని శకుంతలకి చెప్తాడు. మరొకవైపు పారు, హరి హాస్పిటల్ లో మన ప్లాన్ సక్సెస్ అని మాట్లాడుకుంటుంటే.. అప్పుడే రుద్ర ఎంట్రీ ఇచ్చి వాళ్ళ మాటలు వింటాడు. నైస్ ప్లే అని అంటాడు. గంగ దగ్గరికి వెళ్లేముందు నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నీ పగకోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నావని అర్థమైందని రుద్ర అన్నీ చెప్తుంటే పారు, హరి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: సవతి తల్లిని అవమానించిన జ్యోత్స్న.. అందరి ముందు కాళ్ళు పట్టించారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -520 లో.....శివన్నారాయణ ఇంట్లో హోమానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అప్పుడే శ్రీధర్ తన కుటుంబంతో వస్తాడు. అది చూసి వచ్చాడండి ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు అని శ్రీధర్ ని ఉదేశ్యంచి పారిజాతం అంటుంది. శివన్నారాయణ కుటుంబం మొత్తం శ్రీధర్ కుటుంబాన్ని ఆహ్వానిస్తుంది. శౌర్యాతో శివన్నారాయణ సరదాగా మాట్లాడతాడు. కావేరీని సుమిత్ర పలకరిస్తూ.. నన్ను ఇక వదిన అని పిల్వండి అని చెప్తుంది. దాంతో కావేరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది నా పరివారం.. ఇక గతం అంత మర్చిపోండి అని శివన్నారాయణ అందరితో చెప్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న అందరి కాళ్ళకి పసుపు రాయి అని సుమిత్ర చెప్తుంది. సరే మమ్మీ రాస్తాను కానీ నువ్వు చెప్పు ఈ పసుపు ఎవరికి రాస్తారని జ్యోత్స్న అడుగుతుంది. ఈ పసుపు భర్త ఉన్నవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చని సుమిత్ర అంటుంది. మరి అత్త తన భర్తతో లేదు కదా అని జ్యోత్స్న అంటుంది. నాకు తెలుసు కావాలనే ఇదంతా చేస్తున్నావని కాంచన కోప్పడుతుంది. నీతో భర్త లేడని అంటున్నాను.. ఆవిడకి నువ్వు నీ భర్తని ఇచ్చావ్ కానీ తనకి సోసైటీలో గుర్తింపు ఉండదు. తనని ఉంపుడుగత్తే అంటారని జ్యోత్స్న అనగానే స్వప్న, కావేరి బాధపడతారు. మమ్మల్ని అవమానించడానికే పిలిచారని స్వప్న, కావేరిని తీసుకొని వెళ్లిపోతుంటే.. అప్పుడే కార్తీక్ ఎదరుపడతాడు జ్యోత్స్న మాటలు చెప్తుంది. దాంతో పిన్నికి సారీ చెప్పమని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు. జ్యోత్స్న సారీ చెప్తుంది. ఇప్పుడే కావేరి వదిన కాళ్ళకి పసుపు రాయి అని సుమిత్ర అనగానే జ్యోత్స్న సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : విశ్వ బైక్ పై అమూల్య.. వేదవతి గుర్తుపట్టిందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -321 లో.....ప్రేమని తీసుకొని ధీరజ్ రన్నింగ్ కి వెళ్దామనుకుంటే అప్పుడే శ్రీవల్లి ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. తనని దాటుకొని ఎలా వెళ్ళాలని ఇద్దరు లోపలికి వెళ్తారు. మరొకవైపు నర్మద, సాగర్ గుడికి బయల్దేరతారు. శ్రీవల్లిని చూసి వాళ్ళు కూడా ఆగిపోతారు. ఆ తర్వాత ప్రేమని చీర కట్టుకోమని ధీరజ్ చెప్తాడు. ప్రేమ చీర కట్టుకుంటుంది. ఇద్దరు బయటకి వెళ్తుంటే రామరాజు చూసి ఎక్కడికి అని ఆడుగుతాడు. గుడికి నాన్న అని ధీరజ్ అంటాడు. నాకు ఏదో డౌట్ గా ఉందని శ్రీవల్లి అంటుంది. వాళ్ళు గుడికి వెళ్తున్నారు.. డౌట్ ఏం లేదని రామరాజు అంటాడు. మరొకవైపు నర్మద, సాగర్ ఇద్దరు గోడ దూకి వెళ్తుంటే.. అప్పుడే శ్రీవల్లి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతుంది. నర్మద ఏదో ఒకటి కవర్ చేస్తుంది. ఆ తర్వాత నర్మద, సాగర్ గోడదూకి గుడికి వెళ్తారు. సాగర్ VRO రిజల్ట్స్ బాగా రావాలని నర్మద మొక్కుకుంటుంది. గవర్నమెంట్ జాబ్ వస్తే మీ నాన్న నన్ను అల్లుడిగా అంగీకరిస్తాడు.. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావని సాగర్ అంటాడు. మరొకవైపు అమూల్య కాలేజీకి వెళ్తుంటే విశ్వ వచ్చి బైక్ ఎక్కు కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తానని అంటాడు. విశ్వ ఇచ్చిన గొలుసు అమూల్య మెడలో వేసుకుంటుంది. అది చూసి విశ్వ హ్యాపీగా ఫీల్ అవుతాడు. విశ్వ రిక్వెస్ట్ చేయడంతో అమూల్య తన బైక్ ఎక్కుతుంది. వాళ్ళు వెళ్తుంటే రామరాజు, వేదవతి ఎదురుపడతారు. రామరాజు వాళ్ళని చూడడు కానీ వేదవతి చూసి విశ్వ బండి అమూల్య ఎక్కడం ఏంటని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నెక్స్ట్ మూవీలో హీరోయిన్‌ని ఆర్జీవీలా రకరకాల యాంగిల్స్ లో చూపిస్తా!

సుమ అడ్డా షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల, నటుడు జీవన్, డైరెక్టర్ నాని కాసరగడ్డ వీళ్లంతా వచ్చారు. ఇక రాపిడ్ ఫైర్ రౌండ్ లో వీళ్ళను ఎన్నో ప్రశ్నలు వేసింది సుమ. "అల్లరి నరేష్ తో చేసిన మూవీస్ లో మీకు నచ్చిన సినిమా ఏది. మారేడుమిల్లి ప్రజానీకం, 12 ఏ రైల్వే కాలనీ" అని అడిగింది. "నాకు 12 ఏ రైల్వే కాలనీ అంటే ఇష్టం" అని చెప్పింది. ఇక నరేష్ ఐతే అందులో చిన్న క్యారెక్టర్ ఇందులో ఫుల్ క్యారక్టర్ చేసాను అని చెప్పాడు. "ఈ ఇద్దరు హీరోల్లో ఒకేసారి ప్రొపోజ్ చేస్తే ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు. ప్రభాస్, విజయ్ దేవరకొండ" అని అడిగింది. "ప్రభాస్" అని చెప్పింది కామాక్షి. తర్వాత డైరెక్టర్ నానిని పిలిచింది. " 12 ఏ రైల్వే కాలనీ మూవీకి ఏ ఆర్టిస్ట్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు" అని అడిగింది. "అల్లరి నరేష్" అని చెప్పాడు. కామాక్షి స్పందన తెలుసుకుందాం అంటూ కామాక్షి ఎలా ఫీలవుతున్నావ్ ఈ ఆన్సర్ మీద అని అడిగింది సుమ. నో కామెంట్స్ అని చెప్పింది.   "నెక్స్ట్ మీరు తియ్యబోయే సినిమాలో హీరోయిన్ ని ఈ విధంగా చూపించబోతున్నారు. రాధావేంద్రరావు గారిలా పళ్లతో, ఆర్జీవీలా రకరకాల యాంగిల్స్ లో" అని అడిగింది. "ఆర్జీవీలా రకరకాల యాంగిల్స్ లో" అని చెప్పాడు. వెంటనే నరేష్ "త్వరలో పెళ్లి ఉంది నాని" అంటూ కామెడీ చేసాడు. తర్వాత రైటర్ అనిల్ ని పిలిచింది. " ఏ రెండు ప్రొఫెషన్స్ కి న్యాయం చేశామని అనుకుంటున్నారు..డాక్టర్, డైరెక్టర్" అంది. ఐతే అనిల్ యాక్టర్ కావాలుకుంటున్నారన్న విషయాన్నీ అల్లరి నరేష్ చెప్పాడు. తర్వాత అల్లరి నరేష్ ని పిలిచింది సుమ. "మీరు చేసిన క్యారెక్టర్స్ లో ఏది ఇష్టం. గమ్యం మూవీలో గాలి శీను, శంభో శివ శంభో" అని అడిగింది. గాలి శీను రోల్ అని చెప్పాడు నరేష్. "మీరు చేసిన మల్టి స్టారర్ మూవీస్ లో ఏ హీరోతో కంఫర్ట్ గ అనిపించింది..రవితేజ,  మహేష్ బాబు" అని అడిగింది. "ప్రొఫెషనల్ గా ఐతే మహేష్ గారు, పర్సనల్ గా సెట్ ఐతే రవితేజ గారితో ఎంజాయ్ చేయొచ్చు" అని చెప్పాడు.

భరణిని అన్నయ్య అని పిలవడానికి అసలు కారణం చెప్పిన దివ్య తల్లి... ఫుల్ ఎనర్జీతో నిండిన హౌస్!

బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండవ వారం ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఇందులో భాగంగా మొదటగా హౌస్ లోకి డీమాన్ పవన్ వాళ్ళ అమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా సెకెండ్ సంజన ఫ్యామిలీ వచ్చారు. ఇక చివరగా దివ్య వాళ్ళ అమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దివ్య వాళ్ళ అమ్మ హౌస్ లోకి రాగానే హౌస్ అంతా పవర్ హౌస్ లా‌ మారిపోయింది. కంటెస్టెంట్స్ అంతా ఫుల్ జోష్ తో నిండిపోయారు. అందరు ఫ్యామిలీ మెంబర్స్ వస్తే ఏవైనా టిప్స్ ఇస్తారు.. ఎమోషనల్ అవుతారు కానీ దివ్య వాళ్ళ అమ్మ అయితే అందరితో సరదాగా మాట్లాడింది. ఫుల్ ఫన్ అండ్ ఎనర్జీ హౌస్ మేట్స్ కి ఇచ్చింది దివ్య వాళ్ళ అమ్మ శ్రీలక్ష్మీ. ఇక అందరిని లివింగ్ రూమ్‌లో కూర్చోబెట్టి చేతిలో కాఫీ కప్పు పట్టుకొని సరదాగా మంచి విషయాలు మాట్లాడింది. ఒక మనిషి ఎప్పుడూ తన క్యారెక్టర్ మార్చుకోలేడు.. అలా మార్చుకుంటే అది టెంపరెరీయే.. అది మార్చుకోవద్దు.. ఒరిజినల్ ఒరిజినల్‌గా అలానే ఉంచండి.. ఎవరైనా వస్తారు.. ఏదో చెప్తారు.. అవన్నీ ఆలోచిస్తే మీకు ముుందుకెళ్లాలో తెలీదు వెనక్కి రావాలో తెలీదు.. ఆ ఇన్‌పుట్స్ ఏం వద్దు అసలు.. మీరు ఎలా ఉన్నారో అలా ముందుకెళ్లిపోండి.. మీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుందంటూ అందరికి సలహా ఇచ్చింది. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు.. తను ఈ ఒత్తిడి తట్టుకోలేక చదువులో అందరూ ముందుకెళ్లిపోతున్నారు నేను వెళ్లలేకపోతున్నానని చెప్పి ఇరవై అయిదేళ్ల ఏళ్ల క్రితం తను ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నాది కూడా చిన్న వయసే.. అప్పుడే పెళ్లయిన కొత్త.. ఆ ట్రోమా నాకు అలానే ఉండిపోయింది.. ఎందుకంటే నా అన్నయ్య నాతో పాటు కలిసి తిరిగాడు.. మా అన్నయ్య ఎప్పుడు చూసినా నాకు గుర్తొస్తూనే ఉండేవాడు.. ఇప్పటికి కూడా అంతే.. అయితే నేను టీవీలో ఒక పర్సన్‌ని చూశా.. ఆ ఒక్క వ్యక్తే నాకు నిజంగా అన్నయ్యలా అనిపించాడు అతనే భరణి గారు.. నేను దివ్యకి చెప్పా.. నిజంగా చెప్పాలంటే ఒక్క అన్నయ్య ఫీలింగ్ కావాలంటే ఇతను ఒక్కడిలో ఉన్నాయి.. అంటే నాకు బ్రదర్ అయ్యే ఫీలింగ్.. ఆయన సినిమాలు, సీరియల్స్ చేస్తారని నాకు అంతగా తెలీదు.. నేను దివ్యతో చెప్పా అప్పుడు.. నువ్వు ఏమైనా మాట్లాడాలంటే నాకు బ్రదర్ ఫీలింగ్ ఉంది.. నువ్వు నా బ్రదర్‌ని మామా మామా అని పిలవలేవు కదా లోపలికెళ్లి అందుకే నువ్వు బ్రదర్ అని పిలిస్తే నేను బ్రదర్ అని పిలిచినట్లు ఫీలింగ్.. నువ్వు అట్లనే భరణి గారిని అన్నయ్య అని పిలిచి నా కోరిక తీర్చమని చెప్పానంటూ శ్రీలక్ష్మి ఎమోషనల్ అయ్యింది. అందుకే హౌస్ లో దివ్య బ్రదర్ అని ఎవరినైనా అందా.. తను భరణి గారిని బ్రదర్ అని పిలవడానికి రీజన్ అదే..నేను చెప్పిన ప్రకారమే పిలిచింది.. నేను ఏం చెప్తే అది ఫాలో అయిందంటూ దివ్య తల్లి చెప్పుకొచ్చింది. దీంతో అందరు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తర్వాత హౌస్ లోని ఒక్కొక్కరిని  ఇమిటేట్ చేసి చూపించింది శ్రీలక్ష్మి. అదంతా ఫుల్ ఫన్ గా సాగింది.

Bigg Boss 9 Telugu Family Time: ఫ్యామిలీ వీక్ లో డీమాన్ పవన్ వాళ్ళ అమ్మ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ఎమోషనల్!

బిగ్ బాస్ హౌస్ లో పదకొండవ వారంలో ఫ్యామిలీ వీక్ కొనసాగుతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో తనూజ సిస్టర్ ఇంకా సుమన్ శెట్టి వైప్ వచ్చి హౌస్ లో సందడి చేశారు. ఇక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో డీమాన్ పవన్ వాళ్ళ అమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రతి ఒక్కరికి అమ్మ అంటే ఒక స్పెషల్ ఎమోషన్ ఉంటుంది. ఇక కొన్ని రోజులపాటు అమ్మకి దూరంగా కనీసం మాట కూడా లేకుండా హౌస్ లో ఉంటారు కంటెస్టెంట్స్. మరి అలాంటి సిచువేషన్ లో హౌస్ లో వాళ్ల అమ్మని ఒక్కసారిగా చూడగానే ఆ ఫీలింగ్ వర్ణనాతీతం. డీమాన్ పవన్ టాస్క్ ఆడి ఫ్యామిలీతో ఎంత టైమ్ స్పెండ్ చెయ్యాలో సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ చింటూ అంటూ హౌస్ లోకి వస్తుంది. దాంతో పవన్ ఎమోషనల్ అవుతాడు. రాగానే తనకోసం చేసుకొని తీసుకొని వచ్చిన సున్నుండ తినిపిస్తుంది. రీతూ తన దగ్గరికి వెళ్తుంది. తనకి కూడా తినిపిస్తుంది. ఇక పవన్ వాళ్ళ అమ్మ పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. పవన్ తన ఆట గురించి ఆడి తెలుసుకుంటాడు. అంత బాగుందని వాళ్ళ అమ్మ చెప్తుంది. హౌస్ లో అందరితో వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. నాకు హౌస్ లో ఎవరు సపోర్ట్ చెయ్యరు ఒక్క అమ్మాయి తప్ప అంటూ రీతూని చూపిస్తాడు డీమాన్. ఆ తర్వాత పవన్ కి ఇచ్చిన టైమ్ అయిపోతుంది. పవన్ కి బయట అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అయిందని వాళ్ళ అమ్మ చెప్పగానే పవన్ సిగ్గుపడతాడు. ఇక అమ్మ సెంటిమెంట్ సాంగ్ వెయ్యడంతో హౌస్ అంత ఎమోషనల్ అవుతారు. 

Bigg Boss 9 Telugu Family Week: హౌస్ లోకి సంజన ఫ్యామిలీ ఎంట్రీ.. ఎమోషనల్ ఎపిసోడ్!

బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండవ వారం ఫ్యామిలీ వీక్ మొదలైంది. ‌ఇందులో భాగంగా రెండో రోజు కూడా కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీస్  వచ్చారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ బాంబు వల్ల గతవారమే సంజన ఫ్యామిలీ వీక్ సాక్రిఫైస్ చేసింది. నిన్నటి నుండి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంటే సంజన ఎమోషనల్ అయింది. ప్లీజ్ బిగ్ బాస్ నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అంటూ కెమెరాకి మొరపెట్టుకోవడం తెలిసిందే అయితే బిగ్ బాస్ కరిగిపోయి మిగతా కంటెస్టెంట్స్ తమ ఫ్యామిలీ వీక్ లోని కొంత టైమ్ సంజనకి త్యాగం చేయాలని చెప్తాడు. దాంతో ఇమ్మాన్యుయల్ పది నిమిషాలు, భరణి అయిదు నిమిషాలు కళ్యాణ్ అయిదు నిమిషాలు ఇవ్వగా సంజన ఫ్యామిలీ టైమ్ ఇరవై నిమిషాలు అవుతుంది. ఇక కాసేపటికి సంజన ఫ్రీజ్ లో ఉండగా అప్పుడే తన పిల్లలు భర్త హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళని చూసి సంజన ఎమోషనల్ అవుతుంది. తన అయిదు నెలల కిడ్ ని చూసి సంజన హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొదటి నుండి నా చిన్నపాపని వదిలేసి వచ్చాననే ఎమోషన్ అయితే క్యారీ చేస్తూ వచ్చింది.

Jayam serial : రుద్ర ప్రతాప్ భార్య గంగ  ఎంట్రీ.. ‌షాకిచ్చిన‌ పారు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -118 లో......గంగని రుద్ర పెళ్లి చేసుకున్నాడని అందరికి తెలుస్తుంది. ఒక్క పెద్దసారు తప్ప అందరు షాక్ లో ఉంటారు. గంగ మీడియాతో మాట్లాడడం పెళ్లి మండపంలో అందరు చూస్తారు. మీరు రుద్ర సర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారట డైరెక్ట్ ఇక్కడేకే తీసుకొని వచ్చారట సర్ గ్రేట్ మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ఛాంపియన్ ని చేసాడని మీడియా వాళ్ళు గంగతో అంటారు. ఈ విజయం రుద్ర సర్ ది అని గంగ మీడియా వాళ్ళకి చెప్తుంది. అదంతా టీవీలో అందరు చూస్తారు. ఇప్పుడు అర్థం అయింది ఇదంతా గంగ నువ్వు ప్లాన్ ప్రకారం నన్ను ఫూల్ ని చెసారు అని రుద్రపై పారు కోప్పడుతుంది. అప్పుడే గంగ ట్రోఫీ పట్టుకొని ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ రుద్రని ట్రోఫీని నేనే గెలుచుకున్నానని చెప్పడానికి వచ్చావా అని గంగతో పారు అంటుంది. ఈ అనార్ధం జరగకుండా ఉండాలనే నిన్ను ఇంట్లో నుండి బయటకు పంపించేసాం.. అయినా జరిగిందని ఇషిక అంటుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోమని గంగతో వీరు అంటాడు. అది చెప్పడానికి మీరు ఎవరు.. నేను రుద్ర ప్రతాప్ భార్యని విజయేంద్ర ప్రతాప్ కోడలిని అని గంగ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత విన్నారా ఇదంతా వీళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు కానీ నేనే అర్ధం చేసుకోలేదు. ఇక ఇంత జరిగాక నేను ఉండను.. ఇలా జరుగుతుందని ముందే తెలుసని పారు తన దగ్గరున్న పాయిజన్ తాగుతుంది. తరువాయి భాగంలో గంగ వల్లే పారు ఆత్మహత్యాయత్నం చేసిందని పారు అన్న హరి కంప్లైంట్ ఇవ్వడం తో గంగని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రాహుల్ కి భాద్యతలు అప్పగించిన రాజ్.. రుద్రాణి ప్లాన్ సక్సెస్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -882 లో.. రాహుల్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని రాజ్ ని కావ్య రిక్వెస్ట్ చెయ్యడంతో రాజ్ సరే అంటాడు. అందరు భోజనం చేస్తుండగా రాహుల్ ని రాజ్ పిలిపించి చేతిలో ఆఫీస్ లో జాయినింగ్ లెటర్ పెడతాడు. అది చూసి మనసులో సంతోషపడుతూనే బయటకు మాత్రం ఎందుకు నాకు ఇంత పెద్ద బాధ్యత అని యాక్టింగ్ చేస్తాడు. నేను ఆఫీస్ కి ఇప్పట్లో రాను నువ్వే ఆఫీస్ చూసుకోవాలని రాజ్ చెప్తాడు. చూసావా రుద్రాణి మా రాజ్ నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నాడు. అది మంచి విషయం కాబట్టి మేం ఏం అడ్డుపడడం లేదని ధాన్యలక్ష్మి అంటుంది. రాజ్ నా కొడుకుపై నమ్మకంతో ఇదంతా చేస్తున్నాడు.. అదేదో నువ్వు చేసినట్లు అంటున్నావేంటని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్ తను చెప్పింది చేసాడని కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అనుకున్నది సాధించామంటూ రుద్రాణి, రాహుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఆఫీస్ మొత్తం నా గుప్పిట్లో పెట్టుకొని వీళ్ళని ఎలా ఆడిస్తానో చూడు మమ్మీ అని రాహుల్ అంటాడు. రాహుల్ ఆఫీస్ కి వెళ్తాడు. తనని చూసి వీడెందుకు వస్తున్నాడని శృతి అనుకుంటుంది. ఏం శృతి షాక్ అయ్యావా.. పెండింగ్ లో ఉన్న ఫైల్స్ అన్నీ పట్టుకొని క్యాబిన్ కి రా అని రాహుల్ చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏం పులిహోర కలుపుతాడోనని శృతి భయపడుతుంది. మరొకవైపు సుభాష్, అపర్ణ కోసం రాజ్, కావ్య బట్టలు ఆర్డర్ పెడతారు. ఇప్పుడెందుకని ఇంట్లో వాళ్ళు అడుగగా.. రేపు అమ్మానాన్నల పెళ్లిరోజు అని రాజ్ చెప్తాడు. మీ పెళ్లిచూపులు ఎలా జరిగాయని రాజ్ అడుగుతాడు. అసలు పెళ్లిచూపులే జరగలేదని అపర్ణ అంటుంది. తరువాయి భాగంలో సుభాష్, అపర్ణకి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : శివన్నారాయణ ఇంట్లో హోమం.. దీపకి గుడ్ న్యూస్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -519 లో.....శ్రీధర్ ఇంటికి పారిజాతం వెళ్లి వాళ్లని హోమానికి ఆహ్వానిస్తుంది. మేమ్ రాము అని శ్రీధర్ చెప్తాడు. అల్లుడు నేను అన్నమాటలన్నీ మనసులో పెట్టుకోకని పారిజాతం అంటుంది. పారిజాతం రిక్వెస్ట్ చెయ్యడంతో.. వస్తాను కానీ నా భార్య వస్తేనే వస్తానని శ్రీధర్ అంటాడు. కావేరి నువ్వు నా కూతురులాంటి దానివిరా.. అమ్మ హోమానికి అని పిలుస్తుంది. మీరు ఫోన్ చేసిన కూడా మేమ్ వచ్చేవాళ్ళం కానీ మీరు మా అయనని బాధపెట్టారని కావేరీ అంటుంది. ప్లీజ్ అవన్నీ మనసులో పెట్టుకోకండి అని పారిజాతం రిక్వెస్ట్ చెయ్యడంతో కావేరి కూడా సరే అంటుంది. స్వప్న, కాశీ మీరు కూడా రండి అని పారిజాతం చెప్తుంది. కాసేపటికి అక్కడ నుండి అందరు బయల్దేరతారు. ఇంటికి వెళ్ళాక పారిజాతాన్ని లోపలికి పంపించి జ్యోత్స్నతో కార్తీక్ మాట్లాడతాడు. అదంతా దూరం నుండి పారిజాతం వింటుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి.. రేయ్ కార్తీక్ అక్కడ ఎందుకు మాట్లాడుకుంటున్నారు. పారిజాతాన్ని మధ్యలో పెట్టి మాట్లాడుకోండి.. తను మీరు ఏం మాట్లాడుకుంటున్నారో వినపడక  ఇబ్బంది పడుతుందని శివన్నారాయణ వెటకారంగా మాట్లాడతాడు. ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకుంటారు. విపత్తు అనేది వీళ్ళ కుటుంబానికి.. మనకి కాదు మంచి అనేది ఈ ఇంటికి వారసురాలికి.. నాకు కాదు.. ఆ దీపకి అంటూ ఆగిపోతుంది. ఏంటే అసలైన వారసురాలు ఎవరో తెలుసా అని పారిజాతం అడుగుతుంది. అదేం లేదని జ్యోత్స్న కవర్ చేస్తుంది. ఇప్పుడు ఈ హోమంతో మనకేం పనిలేదని జ్యోత్స్న అంటుంది. ఆ కార్తీక్ ఇంటికి వెళ్లి కాంచనకి హోమం గురించి చెప్తాడు. ఆ తర్వాత శివన్నారాయణ నిద్రపోతుంటే కలలో తన భార్య కన్పిస్తుంది.. అలాగే కాంచనకి కూడా కన్పించి నేను వస్తున్నానని చెప్తుంది. దాంతో కాంచన ఒక్కసారిగా లేచి భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : సాగర్ ఎగ్జామ్ రిజల్ట్స్.. ప్రేమ పోలీస్ ప్రాక్టీస్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -320 లో... సేనాపతి స్టేషన్ నుండి వచ్చి ప్రేమ తో మాట్లాడుతాడు. నిన్ను ఎంతో గారాబంగా పెంచాను కానీ నువ్వు ఇలా చేస్తావ్ అనుకోలేదని సేనాపతి అంటాడు. మీరు అన్యాయంగా నర్మద అక్కని లంచం కేసులో ఇరికించారు.. అది అన్యాయం కాదా అని ప్రేమ అంటుంది. మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటని సేనాపతి ఎమోషనల్ అవుతాడు. దాంతో ప్రేమ బాధపడుతుంది. ప్రేమ డల్ గా ఉందని తనని నవ్వించడానికి ఇంట్లో వాళ్లంతా ట్రై చేస్తారు. డాన్స్ చేస్తుంటారు. అయిన ప్రేమ బాధపడుతూ ఉంటుంది. నర్మద వచ్చి ప్రేమ చెవిలో ఏదో చెప్తుంది. అది విని నవ్వుతుంది.. ఏం చెప్పావని నర్మదని వేదవతి అడుగుతుంది. అలా అందరు చెవిలో చెప్పుకొని నవ్వుకుంటారు. చివరగా తిరుపతి వరకు విషయం వచ్చేసరికి ఏంటి విషయం అని ముగ్గురు అన్నదమ్ముళ్లు అడుగుతారు. ఏం లేదు రా డాన్స్ చేసేటప్పుడు మీ ప్యాంటు జారిందని నవ్వుతున్నారని తిరుపతి చెప్పగానే అందరి ముందు పరువు పోయిందిగా అని అన్నదమ్ముళ్లు అనుకుంటారు. మరుసటిరోజు నర్మద త్వరగా నిద్ర లేచి సాగర్ ని నిద్రలేపుతుంది. ఈ రోజు నీ VRO రిజల్ట్స్ అని చెప్తుంది. వచ్చేటివి వస్తాయి కదా అని బద్ధకంగా మాట్లాడుతుంటే నర్మద పట్టుబట్టి సాగర్ ని లేపుతుంది. మరొకవైపు రన్నింగ్ ప్రాక్టీస్ కి వెళ్లాలని ప్రేమను ధీరజ్ నిద్ర లేపుతాడు. నర్మద, సాగర్ రెడీ అయి బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతారు. మరొకవైపు ప్రేమ, ధీరజ్ రన్నింగ్ కి బయల్దేర్తారు. కానీ ఇంటి ముందు ముగ్గు వేస్తూ శ్రీవల్లి ఉంటుంది. తనని చూసి లోపలే ఆగిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Telugu 12th week Voting: పన్నెండో వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళే!

బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండవ వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. ‌ఇందులో ఈసారి ఇమ్మాన్యుయల్ నామినేషన్ లో ఉన్నాడు. కెప్టెన్ అయిన కారణంగా తనూజ నామినేషన్ లో లేదు. అలాగే తనకున్న పవర్ తో రీతూని సేవ్ చేసింది తనూజ.  ఇక నామినేషన్ లో ఉన్నవారిలో కళ్యాణ్ పడాలకి అత్యధికంగా 34.44 శాతం ఓటింగ్ పడింది. ఇమ్మాన్యుయేల్ దాదాపు మూడు వారాల గ్యాప్ తర్వాత నామినేషన్స్‌లోకి వచ్చినా తనకి 23.55 శాతం ఓటింగ్ పడి రెండో స్థానంలో ఉన్నాడు. గత పదివారాల్లో మూడుసార్లు కెప్టెన్, ఇమ్మ్యూనిటీ పవర్ వల్ల సేఫ్‌గా ఉన్న ఇమ్మాన్యుయల్ ఇప్పుడు కూడా అత్యధిక ఓటింగ్ తో ఉన్నాడు. ఇక భరణి 16.61 శాతం ఓటింగ్ తో మూడో స్థానంలో ఉన్నాడు. భరణి తన ఆటని మెరుగుపరుచుకున్నాడని ఈ ఓటింగ్ బట్టి తెలుస్తోంది. కళ్యాణ్, భరణి, సుమన్ శెట్టి మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. డీమాన్ పవన్ 11.14 శాతం ఓటింగ్ తో నాలుగవ స్థానంలో ఉన్నాడు. దివ్య 7.84 శాతం ఓటింగ్ తో అయిదవ స్థానంలో ఉన్నారు. సంజన 6.41 శాతం ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఉన్న ఓటింగ్ ప్రకారం వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. కానీ శుక్రవారం అర్థరాత్రి వరకు ఓటింగ్ కొనసాగుతుంది కాబట్టి ఫలితాలు మారే ఆస్కారం ఉంది. మరోవైపు బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం ఫ్యామిలీ వీక్ కూడా మొదలైంది. ఈ వారం ఎలిమినేషన్ నిజంగా జరిగితే డేంజర్ జోన్‌లో ఉన్న దివ్య, సంజన, డీమాన్ పవన్ లో ఎవరైనా బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ డీమాన్ బయటకు వెళ్తే రీతూ - డీమాన్ ల లవ్ ట్రాక్ గండిపడాల్సిందే. మరి సంజనని ఎలిమినేట్ చేస్తారా లేక తనకి ఫేవరెటిజం చూపిస్తారా లేక దివ్యని బలిపశువుని చేస్తారా అని ఆడియన్స్ భావిస్తున్నారు.

Bigg Boss 9 Telugu Family week: తనూజతో కొంచెం జాగ్రత్తగా.. హింట్ ఇచ్చిన సుమన్ భార్య లాస్య!

బిగ్ బాస్ సీజన్-9 లో పదకొండవ వారం ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఇందులో మొదటగా తనూజ వాళ్ళ అక్క పాప, చెల్లి అనూజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాసేపటికి సుమన్ శెట్టి భార్య లాస్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. లాస్య హౌస్ లోకి రాగానే సుమన్ శెట్టి చిన్నపిల్లాడు అయిపోయాడు. ఎగిరి గంతేసి తన భార్యని హత్తుకొని బుగ్గన ముద్దులు పెడుతూ తన ప్రేమని చూపించాడు. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు.. అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది.. బాగా ఆడుతున్నానా.. నువ్వెందుకు ఇలా చిక్కిపోయావ్.. నేను లేకుండా ఎలా ఉంటున్నా అంటూ వరుసగా ప్రశ్నలు వేసి మురిసిపోయాడు సుమన్.  ఇక వెళ్లే ముందు సుమన్‌కి తన భార్య లాస్య ఒక సలహా ఇచ్చింది. సంజన గారితో కొంచెం ఇబ్బంది.. మిమ్మల్ని తొక్కలో కెప్టెన్ అన్నదానికి ఇప్పటికీ మేం డిజప్పాయింట్ అవుతున్నాం.. అలానే మీరు తనూజతో తగ్గించండి అంటూ లాస్య చెప్పింది. దీంతో బాలేదా నెగటివ్ వస్తుందా.. అని సుమన్ అడిగాడు. నెగెటివ్ కాదు తనే హైప్ ఉంటుంది.. తను ఎవరు హైప్‌లో ఉంటారో వాళ్లని మంచి చేసుకుంటుంది.. అందుకే చెప్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి.. నేను అంటున్నది మంచిగా మాట్లాడినా.. నమ్మకండి.. మీ మాటికి మీరు పని చేసుకోండి అంటూ క్లియర్‌గా చెప్పింది. ఇక ఆ తర్వాత అందరి గురించి అడిగి తెలుసుకున్నాడు సుమన్. నా ఆట ఎలా ఉంది.. హౌస్ లో ఉన్నట్టుగానే ఇక్కడ ఉంటున్నాను కదా అని అడుగగా అవును నేచురల్ గా ఉ‌న్నావని లాస్య అంది. ఇక లాస్య వెళ్లేముందు తనతో డ్యాన్స్ చేశాడు సుమన్ శెట్టి. భార్య ఇచ్చిన టిప్స్ తో సుమన్ శెట్టి తన ఆటని మెరుగుపర్చుకొని టాప్ లో ఉంటాడా లేదా అనేది చూడాలి మరి.