Illu illalu pillalu : ప్రేమ పోలీస్ కావాలని నిర్ణయం తీసుకున్న ధీరజ్.. రామరాజు ఆన్ ఫైర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -319 లో.... ప్రేమ ఇదివరకు డ్యాన్స్ క్లాస్ చెప్తుంటే.. వాళ్ళ నాన్న ఆడపిల్ల కష్టంతో బ్రతుకుతున్నావని మావయ్య గారి చొక్కా చింపేశాడు మర్చిపోయారా అని శ్రీవల్లి జరిగింది గుర్తుచేస్తుంటే ఇక ప్రేమ పోలీస్ అవ్వడం వద్దని రామరాజు నిర్ణయం తీసుకుంటాడు. నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను నాన్న.. ప్రేమ ఖచ్చితంగా పోలీస్ అవుతుందని ధీరజ్ చెప్తాడు. దాంతో రామరాజు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హమ్మయ్య నేను అనుకున్నది జరిగిందని శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే తన పుట్టింటికి వెళ్లి అసలు విషయం చెప్తుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రేమ డల్ గా ఉంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. ఎందుకురా నా కోసం మీ నాన్నతో గొడవపడుతున్నావని ప్రేమ అడుగుతుంది. ఎందుకంటే నీ కల.. నెరవేర్చడం భర్తగా నా బాధ్యత అని ధీరజ్ అంటాడు. అదంతా నర్మద వింటుంది. ఒకప్పుడు నేను జాబ్  గొడవలు అవుతాయి వద్దని అన్నాడు.. ఇప్పుడు నా కోసం వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నాడని ప్రేమ అంటుంది. దాన్నే ప్రేమ అంటారని,  ధీరజ్ నిన్ను ప్రేమిస్తున్నాడని నర్మద చెప్తుంది. ఆ తర్వాత రాత్రి అందరు కబుర్లు చెప్పుకుంటూ అరుబయట కూర్చుంటారు. అప్పుడే సేనాపతి పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వస్తాడు. ప్రేమని పిలుస్తాడు. నాకు కొడుకు పుట్టినప్పటి కంటే కూతురు పుట్టిందని చాలా హ్యాపీగా ఫీల్ అయినా కానీ ఇలా తండ్రికి వెన్నుపోటు పొడుస్తావనుకోలేదని సేనాపతి ఎమోషనల్ అవుతుంటే.. ప్రేమ బాధపడుతుంది. తరువాయి భాగంలో ప్రేమ బాధపడుతుందని ఇంట్లో అందరు ప్రేమ చుట్టూ చేరి డ్యాన్స్ చేస్తూ తనని నవ్వించడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బాలయ్య డైలాగ్‌తో రెచ్చిపోయిన రోజా!

సరిగమప లిటిల్ చాంప్స్ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. సరిగమప మనది అంటూ సుధీర్ గట్టిగ అనేసరికి హలో అంటూ రోజా స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చింది. అదే గొంతు అంటూ సుధీర్ అక్కడి నుంచి పారిపోయాడు. "అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వను" అంటూ అనంత శ్రీరామ్ డైలాగ్ వేసాడు. "దేనికి నవ్వుతానో దేనికి నరుకుతానో నాకే తెలీదు" అంటూ రోజా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దాంతో సుధీర్, అనిల్ రావిపూడి వామ్మో అంటూ నవ్వారు. ఇక శ్రీనివాస రెడ్డి విజిల్ వేసాడు. ఇక భగవంత్ కేసరి పోస్టర్ చూపిస్తూ ఒక చిన్నారి బాలయ్య గెటప్ లో వచ్చి అనిల్ దా కేక్ కట్ చేద్దాం అని పిలిచాడు. అలా అనిల్ రావిపూడి పుట్టిన రోజును స్టేజి మీద అందరూ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. ఇక ఈ షోలో బాగా ఫేమస్ ఐన వరుణవిని వాళ్ళ అమ్మను స్టేజి మీదకు పిలిచారు. "ఒక బిడ్డను కనాలంటే తల్లి యుద్ధం చేయాలి. ఆ బిడ్డను పెంచాలంటే కూడా యుద్ధం చేయాలి. అలాంటి యుద్ధం మీరు రోజూ చేస్తున్నారు" అంటూ షాల్ కప్పి ఒక మొమెంటోని ఇచ్చి వాళ్ళను అనిల్ రావిపూడి సత్కరించాడు. అనిల్ రావిపూడి మాటలకు రోజా ఇంకొంతమంది ఆడియన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. వరుణవి ఈ షోలో ఒక చిచ్చర పిడుగు. పాటలు అద్భుతంగా పాడుతుంది, మాటలు కూడా అమోఘంగా మాట్లాడుతుంది. దాంతో ఈమెకు జడ్జెస్, ఆడియన్స్ ఫాన్స్ ఇపోయారు.

Bigg Boss 9 Telugu Family week: బిగ్ బాస్ హౌస్ లో పెళ్లి సందడి.. తనూజ ఎమోషనల్!

బిగ్ బాస్ సీజన్-9 తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ వీక్ రానే వచ్చింది. టైటిల్ విన్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే చాలు అని అనుకునే కంటెస్టెంట్స్ చాలామంది ఉంటారు. ఎందుకంటే తమ ఫ్యామిలీ హౌస్ లోకి రావడం వారికి ఓ మంచి జ్ఞాపకం. అందుకే తమ ఫ్యామిలీలోని ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ లో కన్పించాలనేది ప్రతీ ఒక్కరి కల. అయితే హౌస్ లో ఆ సందర్బం రానే వచ్చింది.. ఆ ఫ్యామిలీ వీక్ మొదలైంది. బిగ్ బాస్ సీజన్-9 తెలుగు పన్నెండో వారంలో ఫ్యామిలీ వీక్ మొదలైంది. తాజాగా వచ్చిన ప్రోమోలో హౌస్ కెప్టెన్ అయిన తనూజకి మొదటగా ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చారు. తనూజ సిస్టర్ తో పాటు తనూజ వాళ్ళ అక్క కూతురు వచ్చింది. మొదటగా తనూజని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు బిగ్ బాస్. అక్కడ తనూజ వాళ్ళ అక్క పాపని ఉంచి తనని బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ పాపని హౌస్ లోకి తీసుకొని వెళ్లి అందరికి పరిచయం చేసింది తనూజ. ఆ తర్వాత వాళ్ళ సిస్టర్ ని మెయిన్ గేట్ ద్వారా ఎంట్రీ ఇప్పించారు బిగ్ బాస్. తనని చూసి తనూజ ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే త్వరలో తనూజ సిస్టర్ మ్యారేజ్ ఉంది. తను ఆ పెళ్లిని మిస్ అవుతుంది కాబట్టి బిగ్ బాస్ తన చెల్లిని పెళ్లి కూతురు చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేయించాడు. తనూజ తన సిస్టర్ అనుజని పెళ్లికూతురు చేస్తుంది. ఆ తర్వాత అనుజ తన సిస్టర్ తనూజ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. తన వెడ్డింగ్ కార్డ్ ని తనూజకి చూపిస్తుంది. దాంతో తనూజ ఎమోషనల్ అవుతుంది. తనూజకి ఈ ఎపిసోడ్ మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. తనూజకి తన గేమ్ గురించి అనుజ హింట్స్ ఇచ్చిందో లేదో చూడాలి మరి.  ఈ ఫ్యామిలీ వీక్ తనూజ ఆటలో ఏదైనా మార్పు తీసుకొస్తుందో లేదో చూడాలి మరి.

రీతూ మనసు ముక్కులు చేసిన డీమాన్ పవన్.. అవన్నీ మన పర్సనల్!

ఇది ఎవరూ ఊహించనిది.. నిజమే.. బిగ్ బాస్ సీజన్-9 లో గడిచిన పది వారాల్లో ఇప్పటి వరకయ రీతూని డీమాన్ పవన్ నామినేట్ చేయలేదు. డీమాన్ ని రీతూ నామినేట్ చేయలేదు. కానీ ఫస్ట్ టైమ్ దాన్ని బ్రేక్ చేస్తూ కుండని బ్రేక్ చేసి మరీ రీతూని నామినేట్ చేశాడు డీమాన్ పవన్. తనూజగా మొదటగా రెండు నామినేషన్లు చేసుకునే టోకెన్ ని డీమాన్ పవన్ కి ఇచ్చింది. దాంతో మొదటగా 'పవన్ కళ్యాణ్ పడాల' ని నామినేట్ చేశాడు. ఆ తర్వాత సెకెండ్ నామినేషన్ రీతూ అని చెప్పాడు. దాంతో భరణి, ఇమ్మాన్యుయల్, తనూజ, కళ్యాణ్ అందరు షాక్ అయిపోయారు. వాళ్లతో పాటు రీతూ కూడా అలాగే బిగుసుకుపోయింది. అరే ఏంట్రా ఇది అని రీతూ అనేలోపే.. నా దగ్గర పాయింట్లు ఉన్నాయని డీమాన్ పవన్ అన్నాడు. నేను నీతోనే ఉన్నాను.‌. ప్రతీ గేమ్ లో నీకు సపోర్ట్ గా ఉన్నాను.. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ప్రతీదానికి నేను అలుగుతానని అంటావ్.. అసలు నేను మాట్లేది వినవు అని డీమాన్ పవన్ తన నామినేషన్ పాయింట్ చెప్పాడు. దాంతో రీతూ షాక్ అయింది. నువ్వు నాతో అరిచిన ప్రతీసారీ బయటకు ఎలా పోట్రే అవుతుందో అర్థం చేసుకో.. అంటు తన సెకెండ్ పాయింట్ పెట్టాడు డీమాన్. అవన్నీ మన పర్సనల్ అనుకున్నాను.‌‌. అందుకే మన మధ్య ఎన్ని ఉన్నా నేను నిన్ను నామినేట్ చేసి చెప్పలేదు పవన్ అంటు ఏడ్చేసింది రీతూ. ఇక రీతు ఏడుస్తుంటే డీమాన్ కంట్లో కూడా నీళ్లు తిరిగాయి. ఇక నామినేషన్ తర్వాత రీతూ గుక్కపెట్టి ఏడ్చేసింది‌ . వాష్ రూమ్ దగ్గరికి వెళ్ళి రీతూ ఏడుస్తుంటే ఓదార్చడానికి సంజన వెళ్లింది. అయితే తనని  అయిదు నిమిషాలు వదిలెయ్యమని చెప్తూ వాష్ రూమ్ లోకి వెళ్ళి గట్టిగా ఏడుస్తూ ఉంది. ‌ఇక అదే విషయం డీమాన్ పవన్ కి చెప్పి వాష్ రూమ్ దగ్గరికి తీసుకొచ్చింది సంజన. ఇక కాసేపటికి గార్డెన్ ఏరియాలో ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. నేను ఒకటి అడిగినప్పుడు నువ్వు దానికి సమాధానం చెప్పకుండా.. అరుస్తావ్.. పట్టించుకోవని డీమాన్ అనగా.. వరిలేయ్ పవన్ అంటు రీతు అంది. ఇక డీమాన్ ఏదో అంటు ఉంటే.. వదిలెయ్ పవన్ అని గట్టిగా అరిచేసింది రీతూ.. నువ్వు అరవడం వల్ల నాది తప్పు లేకపోయినా నాదే తప్పు అవుతుందని అది బయటకు వెళ్తుందని డీమాన్ అన్నాడు. తనది తప్పు లేదని తనతో మాట్లాడటానికే ట్రై చేశాను.. కానీ నువ్వు ట్రస్ట్ లేదని చాలా హర్ట్ చేశావ్. ప్రతి క్షణం నేను నీ మంచే కోరుకున్నా. నేనైతే చాలా బాధపడుతున్నానని డీమాన్ పవన్ అన్నాడు. దాంతో నాతో మాట్లాడొద్దని తల బాదుకుని గట్టిగా అరిచింది రీతు. ఎందుకు అరుస్తున్నావ్.. నాకూ అవ్వడం లేదంటూ డీమాన్ పవన్ కూడా గట్టిగా అరిచాడు. ఇలా ఇద్దరి మధ్య ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.

Gourav Gupta Remuneration: ఐదు వారాలకు గౌరవ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇందులో శనివారం నాటి ఎపిసోడ్ లో నిఖిల్ ఎలిమినేట్ అవ్వగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ కి అందరు తమ ట్యాలెంట్ చూపించడానికి వెళ్తారు కానీ గౌరవ్ మాత్రం తెలుగు నేర్చుకోవడానికి వెళ్ళినట్టుగా ఉంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన గౌరవ్.. చివరిగా ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో ఏం జరిగినా, తనకి ఏం అనిపించినా దానిని కెమెరాల దగ్గరికి వచ్చి చెప్పేస్తుంటాడు గౌరవ్. కండబలం ఉంది కానీ బుద్ది బలం లేదు అని చాలామంది చాలా సందర్భాల్లో అంటారు. అది కచ్చితంగా గౌరవ్ కి ఆప్ట్ అవుతుంది. ఎందుకంటే తనకి ఎవరు ఏంటో అర్థం కాదు.. ఎవరి స్ట్రాటజీ ఏంటో తెలియదు.. కానీ తనకి తోచింది చేస్తుంటాడు. అంతా క్రమశిక్షణగా ఉండాలి.. రూల్స్ పాటించాలంటు రూల్స్ రామానుజన్ గా మాట్లాడుతుంటాడు. అయితే  అ రూల్స్ అన్నివేళలా పనిచేయవు.. ఒక టాస్క్ ఇస్తే దానిని అర్ధ చేసుకోలేడు.. పైగా ఎవరైనా వివరిస్తే వారికి విరుద్ధంగా మాట్లాడతాడు గౌరవ్. అయితే హౌస్ లో తను ఎక్కువగా ఉంది నిఖిల్ తోనే.. అందుకేనేమో బిగ్ బాస్ మావ.. వీళ్ళిద్దరిని ఒకే వారం ఎలిమినేషన్ చేశాడు.  గౌరవ్ తెలుగులో మల్లి లాంటి టీవీ సీరియల్స్ తో పాపులర్ అయ్యాడు. గౌరవ్ కి వారానికి రెండు లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నాడు. అంటే అయిదు వారాలకి గాను గౌరవ్  పది లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. బుల్లితెర నటులు నిఖిల్, గౌరవ్ ఇద్దరూ హౌస్ లో అంతగా కష్టపడకుండానే లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్ కానీ రిజర్వ్ గా ఉంటాడు. హౌస్ లో ఏం జరిగినా స్టాండ్ తీసుకోడు అది అతని మైనస్. 

సుమన్ శెట్టికి వేలు చూపించి మాట్లాడిన కళ్యాణ్.. ఖతం టాటా బైబై!

ఏది జరగకూడదని కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకున్నారో అదే జరిగింది. బిగ్ బాస్ సీజన్-9 లో స్ట్రాంగ్ ఓట్ బ్యాకింగ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరైన ఉన్నారంటే అది సుమన్ శెట్టి.. కళ్యాణ్ పడాల తన లిమిట్స్ దాటి సుమన్ శెట్టికి వేలు చూపించి మాట్లాడు.. ఇది ఇప్పుడు ఫుల్ హాట్ టాపిక్ గా మారింది. సుమన్ శెట్టి ఫ్యాన్స్ అంతా కలిసి కళ్యాణ్ పడాల మీద నెగెటివ్ ట్రోల్స్ చేస్తారు ఇక. ఎందుకంటే ఇప్పటివరకు సుమన్ శెట్టి గేమ్స్ ఆడకపోయినా అతను నామినేషన్లోకి వచ్చాడంటే అతడే టాప్ లో ఉంటాడు. కళ్యాణ్ ఇక టాటా బైబై .. అన్నీ సర్దుకోవాల్సిందే.. అక్కడ ఉంది డీర్ కాదు డైనోసార్ అని తెలియదు పాపం ఈ అమూల్ బేబీ కళ్యాణ్ కి.. ఇక అతనికి ఓటింగ్ కూడా కష్టమే.  పదకొండవ వారం నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. భరణి, ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్, దివ్య రీతూని నామినేట్ చేయగా తనూజ తనకున్న స్పెషల్ పవర్ ఉపయోగించి రీతూని సేవ్ చేసింది. ఆయితే నామినేషన్లో దివ్య వర్సెస్ రీతూ ఒకటి ఫుల్ హైప్ అవ్వగా.. సంజన వర్సెస్ రీతూ నామినేషన్, భరణి వర్సెస్ ఇమ్మాన్యుయల్ నామినేషన్ లు హైలైట్ గా నిలిచాయి. ఇక అందరి నామినేషన్లు ముగిసాక.. చివరగా ఒకే ఒక్క నామినేషన్ మిగిలి ఉండటంతో ఆ టోకెన్ ని సుమన్ శెట్టికి ఇచ్చింది తనూజ.  సుమన్ శెట్టి వచ్చి తన పాయింట్లు చెప్పి పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేశాడు. ఆయితే ఈ నామినేషన్ లో‌ ఇద్దరి మధ్య డిస్కషన్ సాగింది. టవర్ టాస్క్‌లో వరస్ట్ సంచాలక్‌గా చేసావ్.. నేను కెప్టెన్ కాలేకపోయాను.. నువ్వు గేమ్ ముందు కరెక్ట్ గా చెప్పలేదు అని సుమన్ శెట్టి చెప్పి కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. టవర్ స్ట్రైట్‌గా ఉండాలని ముందు చెప్పలేదని సుమన్ అంటే.. మీరిద్దరు సేమ్ పెడతారని నాకెలా తెలుసు.. నాకేమైనా కల వస్తుందా అని కళ్యాణ్ వాగాడు. దాంతో సుమన్ శెట్టికి కోపం వచ్చింది. వినూ.. వినూ.. వినూ.. ఇవ్వే వద్దు అని సుమన్ శెట్టిని కళ్యాణ్ వేలు చూపించి ఫుల్ కోపంగా అన్నాడు. వేలు దించూ.. ఆ వేలు కిందికి దింపు అని సుమన్ శెట్టి అన్నాడు. వేలు నీ వైపు చూపించడం లేదని కళ్యాణ్ అనడంతో.. నా వైపు చూపించావ్ కాబట్టే చెప్తున్నాను.. సుమన్ శెట్టి ఆవేశంగా వెళ్లి కళ్యాణ్ కుండని ముక్కలు ముక్కలు చేశాడు. అతని ఆవేశం చూసి ఇమ్మాన్యుయల్, భరణితో పాటు అందరు భయపడి పక్కకి వెళ్లారు.

Bigg Boss 9 Nominations 11th Week: చెత్త రీజన్ తో దివ్యని నామినేట్ చేసిన రీతూ!

బిగ్ బాస్ సీజన్-9 లో పదకొండవ వారం నామినేషన్ల ప్రక్రియ యమజోరుగా సాగింది. ఇందులో భాగంగా ఇమ్మాన్యుయల్ వర్సెస్ భరణి నామినేషన్ హైలైట్ కాగా రీతూ వర్సెస్ దివ్య నామినేషన్ హౌస్ లో హీట్ ని పెంచేసింది.  భరణి, ఇమ్మాన్యుయల్ , డీమాన్ పవన్ ముగ్గురు రీతూని నామినేట్ చేస్తే తను మాత్రం సంజన, దివ్యలని నామినేట్ చేసింది. అయితే వారిని నామినేట్ చేసి రీతూ చెప్పిన రీజన్లు మాత్రం మరీ చెత్తగా ఉన్నాయి. నువ్వు రాజు, రాణి టాస్క్ లో నన్ను తక్కువ చేసి నిన్ను నువ్వు ఎక్కువ చేసుకొని మాట్లాడావంటూ రీజన్ చెప్పింది రీతూ. అయిబాబోయ్ నీకు అది అర్థం కాదు.. అక్కడ మ్యాటర్ ఏంటంటే.. కళ్యాణ్ కి ఛాన్స్ వచ్చింది. తను ఏం అన్నాడంటే ఇద్దరు ఈక్వల్ గా గేమ్స్ ఆడారు అని డైలామాలో ఉన్నాడు. అయితే దానికి నేను వివరణ ఇచ్చాను.. నేను నీకంటే ఎందుకో బెటర్ అని వివరించే అంతే అని వ్యాలిడ్ రీజన్ ఇచ్చింది‌ దివ్య. అయితే రీతూ మాత్రం అది వదిలేసి.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడి దివ్యని రెచ్చగొట్టింది.  ఆ తర్వాత రీతూని దివ్య నామినేట్ చేసింది. ‌ఇది నా నామినేషన్ నేను చెప్పినప్పుడు నువ్వు వినాలి అని దివ్య అంది‌. ఏ అలాగని ఇక్కడేమైనా రూల్ ఉందా అని రీతూ అనగా.. హా.. నా నామినేషన్.. ఇది నా రూల్ అని దివ్య అంది. నువ్వు చెప్పేది విను ఫస్ట్..ఆ తర్వాత డిఫెండ్ చేసుకో అని దివ్య అంది. ఇక రీతూ వాగుతూనే ఉంది. నువ్వు నన్ను తొక్కి తొక్కి తొక్కి ఎంతసేపు తొక్కుతావని రీతూ జుట్టు పీక్కుంది. దాంతో దివ్య కోపంగా వచ్చి.. రీతూ చౌదరి కుండని గట్టిగా ఒకేసారి కొట్టి ముక్కలు ముక్కలు చేసింది. అది చూసి హౌస్‌లోని మిగతా వాళ్లంతా షాక్ అయిపోయారు. ముఖ్యంగా భరణి అయితే ఏంట్రా బాబు ఈ ఫైర్ అన్నట్టుగా చూశాడు. అయితే ఇందులో దివ్య పాయింట్లు చెప్పిన రీజన్లు అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి కానీ రీతూ చెప్పినవేమీ వ్యాలిడ్ గా లేవు. వీరిద్దరి నామినేషన్ లో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

రీతూ, భరణిలని నామినేట్ చేసిన ఇమ్మాన్యుయేల్!

బిగ్ బాస్ సీజన్-9 లో పదోవారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇందులో నిఖిల్, గౌరవ్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఇక పదకొండవ వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇందులో హౌస్ లోని కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం. ప్రతీ సీజన్ లో లాగే ఈ సీజన్ లో కూడా కుండపగులగొట్టే నామినేషన్ ఇచ్చాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ కి టైమ్ లిమిట్ ఉంటుంది. బజర్ నుండి బజర్ వరకు నామినేషన్ అండ్ ఢిఫెండ్ ఉన్నాలని బిగ్ బాస్ చెప్పాడు.ఇక కెప్టెన్ గా ఉన్న తనూజకి కొన్ని టోకెన్లు ఇచ్చాడు బిగ్ బాస్. అందులో ఇద్దరిని నామినేట్ చేయడానికి 'రెండు' అని ఉన్న టోకెన్ ని ఇమ్మాన్యుయల్ కి ఇచ్చింది తనూజ. రీతూని ఇమ్మాన్యుయల్ నామినేషన్ చేశాడు. తన గేమ్ తక్కువ అనిపించిందని ఇమ్మాన్యుయల్ రీజన్ చెప్పాడు. నేనెక్కడో ఆడలేదో చూపించు అంటు రీతూ డిఫెండ్ చేసుకుంది.‌ ఇద్దరి మధ్య వాదన జరిగింది.  ఆ తర్వాత భరణిని ఇమ్మాన్యుయల్ నామినేషన్ చేశాడు. నీ హెల్త్ బాలేదు..‌కానీ గౌరవ్, నువ్వు ఉన్నప్పుడు.. అంత కాన్ఫిడెంట్ గా గేమ్ ఆడలేదని నాకు అనిపించింది అందుకే నామినేట్ చేస్తున్నానని ఇమ్మాన్యుయల్ అన్నాడు. నా ఆరోగ్యం బాలేకపోయినా నేను గేమ్ ఆడానని భరణి అన్నాడు. నీ ఆరోగ్య రిత్యా ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నావ్ అన్న.. పార్టిసిపేట్ చేశారు కానీ మీ వల్లే ఆ టాస్క్ ఓడిపోయారని ఇమ్మాన్యుయల్ అనగా.. గౌరవ్ నా కన్నా ఫిట్ గా ఉన్నాడు. కానీ నా వల్ల బ్యాక్ స్టెప్ తీసుకోలేదు.. ప్రతీ టాస్క్ వంద శాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడానని భరణి అంటాడు. మీ గేమ్ లో కాన్ఫిడెన్స్ తగ్గిందని ఇమ్మాన్యుయల్ అన్నాడు.  ఆ తర్వాత కళ్యాణ్ ని డీమాన్ పవన్ నామినేషన్ చేశాడు. బ్యాక్ స్టాపింగ్ చేశావ్.. నా గురించి నువ్వు స్టాండ్ తీసుకోలేదని రీజన్ చెప్పి కళ్యాణ్ ని డీమాన్ నామినేట్ చేశాడు.

Jayam serial : గంగని పెళ్ళి చేసుకున్న రుద్ర.. బాక్సింగ్ పోటీకి వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -116 లో.... గంగని బాక్సింగ్ పోటీకి తీసుకొని వెళ్ళడానికి రుద్ర పెళ్లి మండపం దగ్గరికి వెళ్తాడు. గంగ మెడలో మణి తాళి కట్టబోతుంటే.. రుద్ర అడ్డుపడుతాడు. గంగకి ఈ బాక్సింగ్ చాలా ముఖ్యం తనని తీసుకొని వెళ్లనివ్వండి అని రుద్ర వాళ్ళ పేరెంట్స్ తో చెప్తాడు. వద్దు నా కూతురి తీసుకొని వెళ్లాడానికి నువ్వు ఎవరు? నీకేం అధికారం ఉందని రుద్రని పైడిరాజు అడుగుతాడు. నీ వల్లే నా కూతురికి ఈ పరిస్థితి వచ్చిందని అంటాడు. ఇప్పుడు రెండోసారి పెళ్లి ఆగిపోతే నా కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారని రుద్రతో గంగ వాళ్ళ అమ్మ లక్ష్మి చెప్తూ ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు రుద్ర ఇంకా పెళ్లి పీటలపైకి రాలేదని శకుంతల ఆడుగుతుంది. వస్తున్నాడు అయిదు నిమిషాలు అని ప్రీతి చెప్తుంది. రుద్రకి శకుంతల ఫోన్ చేస్తుంది.. పక్కనే ఉన్న ప్రీతి దగ్గర ఫోన్ ఉంటుంది. రుద్ర ఫోన్ నీ దగ్గర ఉందేంటని శకుంతల అడుగుతుంది. ఇందాక నువ్వు చేసావ్ కదా నేనే లిఫ్ట్ చేశాను కదా నా దగ్గర ఉందని ప్రీతి కవర్ చేస్తుంది. నాకేదో డౌట్ గా ఉందని పారు వాళ్ళ అన్న హరికి డౌట్ వస్తుంది వెంటనే రుద్ర గదిలోకి వెళ్లి చూస్తాడు. అక్కడ రుద్ర ఉండడు. దాంతో హరి అందరికి వచ్చి రుద్ర లేడని చెప్తాడు.  అందరు షాక్ అవుతారు. మరొకవైపు పైడిరాజు, లక్ష్మీ మాటలు రుద్ర వింటాడు. గంగ మెడలో రౌడీ తాళి కట్టబోతుంటే రుద్ర వచ్చి ఆపి గంగ మెడలో రుద్ర తాళి కడుతాడు. ఏం అధికారంతో తీసుకుపోతున్నావని అడిగావ్ కదా గంగ ఇప్పుడు నా భార్య అని రుద్ర అంటాడు. లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ నేను పోటీకి వెళ్తున్నాను నన్ను ఆశీర్వాదించమని లక్ష్మీ దగ్గర గంగ ఆశీర్వాదం తీసుకుంటుంది. గంగ చెయ్ పట్టుకొని రుద్ర తన వెంట తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రాహుల్ ప్లాన్ సక్సెస్.. కావ్య మరో ఛాన్స్ ఇస్తుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -880 లో.....రాహుల్ తీసుకొని వచ్చిన చీర కట్టుకొని స్వప్న వస్తుంటే నాసిరకం చీర కట్టుకున్నావేంటని ధాన్యాలక్ష్మి అడుగుతుంది. ఇది రాహుల్ ప్రేమతో తీసుకొని వచ్చాడని స్వప్న చెప్తుంది. బాలేదని ధాన్యలక్ష్మి చెప్తుంది. నాకూ నచ్చిందని స్వప్న చెప్తుంది. అప్పుడే రాహుల్ వస్తాడు. రేయ్ రాహుల్ ఈ ఇరవై లక్షల చెక్ తీసుకొని డబ్బు డ్రా చేసి టెండర్ ఆఫీస్ కి వెళ్ళు అని రాజ్ చెప్తాడు. ఇంట్లో అందరు రాహుల్ ని నమ్మి అంత డబ్బు ఇవ్వడం దేనికి అని అంటారు. రాహుల్ కి ఒక్క ఛాన్స్ ఇద్దామని కళావతి చెప్పిందని రాజ్ అంటాడు. ఆ తర్వాత నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద బాధ్యత ఇస్తున్నావ్ థాంక్స్ అని రాహుల్ అంటాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి  స్వప్న వచ్చి థాంక్స్ కావ్య నేను రాహుల్ కి ఒక్క ఛాన్స్ ఇప్పించాలనుకున్న కానీ మీరు రాహుల్ ని నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చారని స్వప్న అంటుంది. మనలో మనకి ఎందుకు అక్క ఇవన్నీ అని కావ్య అంటుంది. ఆ తర్వాత రాహుల్ డబ్బు డ్రా చేసుకొని వెళ్తుంటే కొందరు రౌడీలు రాహుల్ వెంటపడి డబ్బు తీసుకుంటారు. మరొకవైపు రాహుల్ ఇంకా టెండర్ ఆఫీస్ కి రాలేదని రాజ్ కి ప్రకాష్ ఫోన్ చేసి చెప్తాడు. ఇంకేముంది అంత డబ్బు చూసి తీసుకొని పారిపోయాడని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రాహుల్ దెబ్బలతో డబ్బు పట్టుకొని ఎంట్రీ ఇస్తాడు. సారీ రాజ్ నేను డబ్బు టైమ్ కి టెండర్ ఆఫీస్ కి తీసుకొని వెళ్ళలేకపోయానని అంటాడు. రౌడీలు డబ్బు పట్టుకొని పారిపోతుంటే వాళ్ళని పట్టుకొని డబ్బు తీసుకొని వచ్చానని రాహుల్ చెప్తాడు. అంతా అబద్ధం అని ధాన్యలక్ష్మి అంటుంది. అది నిజమే అంటూ సుభాష్ ఎంట్రీ ఇస్తాడు. రౌడీలు డబ్బు తీసుకొని వెళ్తుంటే రాహుల్ వాళ్ళ దగ్గర నుండి డబ్బు తీసుకున్నాడు. అదంతా నేను చూసానని సుభాష్ చెప్తాడు. తరువాయి భాగంలో ఆ రౌడీలు మన వాళ్లే ఇదంతా ప్లాన్ అని రుద్రాణికి రాహుల్ చెప్తాడు. రాహుల్ కి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని రాజ్ కి కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీకి జాబ్ లేదనే నిజం తెలుసుకున్న స్వప్న.. శివన్నారాయణ ఇంట్లో హోమం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -517 లో.... కాశీ ఆఫీస్ కి హడావిడిగా రెడీ అవుతాడు. కాశీ వెళ్తుంటే.. నీతో పాటు నేను కూడా వస్తాను.. నాకు మీ ఆఫీస్ పక్కన చిన్న పని ఉందని స్వప్న అంటుంది. వద్దని కాశీ అంటాడు. నాకు చాలా స్ట్రెస్ ఉంది.. వెళ్ళాలని లేదని కాశీ అంటాడు. జాబ్ చేసే వాళ్ళకి కదా స్ట్రెస్ నీకు ఎందుకని స్వప్న అనగానే కాశీ షాక్ అవుతాడు. నాకు తెలుసు నువ్వు జాబ్ చెయ్యట్లేదు.. ఇప్పుడు నిజం చెప్పమని తన తలపై చెయ్ పెట్టుకొని స్వప్న అడుగుతుంది. దాంతో కాశీ తనకి జాబ్ లేదన్న నిజం చెప్తాడు. స్వప్న ఏడుస్తూ నన్ను మోసం చేసావంటూ లోపలికి వెళ్తుంది. మరొకవైపు శివన్నారాయణ  పంతులిని పిలిపించి ఇంట్లో వాళ్ళ జాతకాలు చూపిస్తాడు. అవి చూసి మీ అందరికి దోషాలు ఉన్నాయి. ఒక మంచి విషయం ఏంటంటే.. ఈ ఇంటి వారసురాలకి మంచి జరగబోతుందని పంతులు చెప్తాడు. మీకున్న దోషం పోవాలంటే హోమం చెయ్యాలి. రేపు చేద్దాం.. అన్ని ఏర్పాట్లు చేసుకోండి ఈ కుటుంబంతో సంబంధం ఉన్న అందరూ ఈ హోమానికి రావాలని పంతులు చెప్తాడు. మరోవైపు స్వప్న ఏడుస్తుంటే.. కాశీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ తను వినిపించుకోదు. అప్పుడే కావేరి వస్తుంది. తనకి కూడా జరిగింది చెప్తుంది. దాంతో అల్లుడు నన్ను మోసం చేసాడని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత శివన్నారాయణ చెప్పిన కొద్దీ కార్తీక్ హోమానికి పిలవాల్సిన వాళ్ళ లిస్ట్ రాస్తాడు. అప్పుడే శ్రీధర్ వస్తాడు. శ్రీధర్ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా రాయి అని శ్రీధర్, కావేరి, స్వప్న, కాశీ, దాస్ పేర్లు చెప్తాడు. దాంతో ఆ కావేరి, స్వప్న ఎందుకు అని పారిజాతం, జ్యోత్స్న అడ్డుచెప్తారు. వాళ్ళు వస్తే ఈ కుటుంబం పరువు ఏం కావాలని పారిజాతం వద్దని చెప్తుంది. మేము రాము లెండి మావయ్య అని శ్రీధర్ బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. జ్యోత్స్న, పారిజాతం లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : గొలుసు తీసుకున్న అమూల్య.. రామరాజు ఆన్ ఫైర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -318 లో......అమూల్య కాలేజీకి వెళ్తుంటే విశ్వ వస్తాడు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమూల్య.. నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి అయినా సిద్ధం అని విశ్వ అంటాడు. మన కుటుంబాలు కలవాలని మాత్రమే ఇదంతా చేస్తున్నాను.. నా ప్రేమకి గుర్తుగా ఈ గొలుసు తీసుకోమని విశ్వ ఇస్తాడు. అమూల్య దాన్ని తీసుకొని విసిరేస్తుంది. నువ్వు విసిరేయోచ్చు కానీ నీక్కూడా నాపై ప్రేమ ఉందని చెప్పి విశ్వ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. విశ్వ వెళ్లినట్టే వెళ్ళి అక్కడే దాక్కొని చాటు నుండి అమూల్యని చూస్తాడు. అమూల్య ఆ గొలుసుని తీసుకుంటుంది. మరొకవైపు రామరాజు ఒకతని దగ్గరికి డబ్బు ఇవ్వడానికి వెళ్తాడు. అతను ఎవరో కాదు ధీరజ్ కార్ ఎక్కి బ్యాగ్ మర్చిపోయిన అతను. రామరాజు అతన్ని బాబాయ్ అంటూ ప్రేమగా మాట్లాడతాడు. నీ పిల్లలు ఎలా ఉన్నారని అతను అడుగుతాడు. అందరు బానే ఉన్నారు.. ఒక చిన్నోడే బాధ్యతగా ఉండడం లేదని రామరాజు చెప్తాడు. అవునా ఇందాక ఒకతని కార్ లో వచ్చాను.. ఆ అబ్బాయి తన భార్య కోసం చాలా కష్టపడుతున్నాడని అతని గురించి గొప్పగా చెప్తాడు. అతను ఎవరో కాదు ధీరజ్.. అదే సమయంలో ధీరజ్ అతని దగ్గరికి వచ్చి బ్యాగ్ ఇస్తాడు. రామరాజు ని చూసి షాక్ అవుతాడు. ఇంతవరకు చెప్పింది ఈ అబ్బాయి గురించేనని అతను ధీరజ్ ని చూపిస్తూ అంటాడు. ఇందులో ఇంత డబ్బు ఉంది నిజాయితీగా తీసుకొని వచ్చాడు. వీళ్ళ నాన్న పెద్ద హిట్లర్ అంట.. బొమ్మరిల్లు ఫాదర్ అంట.. ఆయన ఈ ఏజ్ లో కూడా తనకి నచ్చినట్టు ఉండమంటాడంట అని అతను చెప్తాడు. ఈ అబ్బాయి తన భార్యని పోలీస్ చెయ్యడానికి చాలా కష్టపడుతున్నాడని అతను చెప్పగానే రామరాజు షాక్ అవుతాడు. అబ్బా ఇరికించాడుగా అని ధీరజ్ అనుకుంటాడు. ఆ తర్వాత రామరాజు ఇంటికి వచ్చి.. మీ నిర్ణయం మీరే తీసుకుంటారా అని ధీరజ్ పై కోప్పడతాడు. అందులో తప్పేముందని నర్మద, వేదవతి సపోర్ట్ చేస్తారు. అప్పడే శ్రీవల్లి ఎంట్రీ ఇచ్చి ప్రేమ జాబ్ చేస్తే ఇదివరకే మావయ్య గారి షర్ట్ ని వాళ్ళ పుట్టింటోళ్లు చింపారు కదా.. మరి ఇప్పుడు చేస్తే మరొకసారి గొడవ అవుతుందని శ్రీవల్లి అంటుంది. తరువాయి భాగంలో ప్రేమ పోలీస్ అవ్వడానికి వీలు లేదని రామరాజు అనగానే క్షమించండి నాన్న నేను నిర్ణయం తీసుకున్నానని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

sridevi drama company: రంగస్థలం మహేష్ సినిమాల్లోకి రాకపోయి ఉంటే గేదెలు కాసుకునేవాడు

. శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama company)నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ని సింగల్ పేరెంట్ స్పెషల్ గా డిజైన్ చేశారు. ఇక ఇందులో నటీనటులు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొచ్చి పాదాభిషేకం చేశారు. ఇక రంగస్థలం మహేష్(Ragasthalam Mahesh)వాళ్ళ అమ్మను తీసుకొచ్చి చిరు సత్కారం చేసి తల్లి గురించి చెప్పాడు. "ప్రపంచంలో మనం ఎవరి మీద కోప్పడ్డా వాళ్లంతా మనకు శత్రువులైపోతారు ఒక్క అమ్మ తప్ప. మనం కూడా ఎందుకు అమ్మ మీద కోప్పడతాం అంటే అమ్మ పెద్ద రియాక్ట్ అవ్వదు కాబట్టి అమాయకురాలు కాబట్టి." అని చెప్పాడు. "మీ కొడుకు గురించి రెండు మాటల్లో చెప్పండి..లేకపోతె తిట్టాలనుకుంటే తిట్టేయండి" అంటూ రష్మీ(Rashmi)అడిగింది. "నా కొడుకును ఎప్పుడూ తిట్టానండి. నా కొడుకు కస్టపడి పైకొచ్చాడండి. ఎప్పుడూ ఏమననండి." అని చెప్పింది.   తర్వాత పంచ్ ప్రసాద్(Punch Prasad)వచ్చి "సాధారణంగా నేను బాధపడను. మా అమ్మ విషయంలో నాకెందుకో తెలీకుండా ఫీలైపోతూ ఉంటాను. మా అమ్మ" అంటూ ఏమీ చెప్పలేక ఏడ్చేశాడు. ఇక ఈ షో ప్రోమో స్టార్టింగ్ లో మహేష్ వాళ్ళతో పంచ్ డైలాగ్స్ వేయించాడు రాంప్రసాద్. "అమ్మ ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీ..ఆమె రష్మీ. బ్యూటిఫుల్ యాంకర్" అని ఇంట్రడక్షన్ చెప్పాడు. రష్మీ ఆమెకు హలో అని చెప్పింది. వెంటనే రాంప్రసాద్ "రష్మీ గారు తెలుసా ఎలా తెలుసు మీకు" అని అడిగాడు. "ఇద్దరం కలిసి చదువుకున్నాం" అని ఫన్నీ ఆన్సర్ చెప్పేసరికి రష్మీ ముఖం మాడిపోయింది. "ఒకవేళ మహేష్ సినిమాలోకి రాకపోతే ఎం చేసేవాడు" అని రాంప్రసాద్ అడిగాడు. "గేదెలు కాసుకునేవాడు" అని చెప్పేసరికి మహేష్ కూడా నవ్వాడు.   

Bigg Boss 9 Telugu Buzz Nikhil Gourav : బజ్ ఇంటర్వ్యూలో నిఖిల్, గౌరవ్.. శివాజీ నవ్వుకున్నాడుగా!

  బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం నిఖిల్(Niklhil),గౌరవ్(Gourav)ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ అయ్యారు. అయితే వీరిద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చినవాళ్ళే. అయితే వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కానీ తెలుగు మాట్లాడటంలో తడబాటు వీరి ఎలిమినేషన్ కి ఒక కారణం. నిఖిల్ శనివారం నాటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవ్వగా గౌరవ్ ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యాడు. అయితే వీరిద్దరు కలిసి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి వచ్చారు. ఆహా వీళ్ళిద్దరిని చూస్తుంటే గుండమ్మ కథలో ఎన్టీఆర్, ఏయన్నార్‌ లా ఉన్నారని శివాజీ అనగా.. నిఖిల్, గౌరవ్ ఒకరినికొకరు చూసుకొని షాక్ అయ్యారు. ఇక ప్రతీది హౌస్ లోని కెమెరాలకి చెప్పుకునేవాడు గౌరవ్. ఇక శివాజీ తన పర్ స్పెక్టివ్ చెప్పాడు.    అదేంటి నిఖిల్ హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడావ్ అని శివాజీ అడుగగా.. ‌అదేంటి సర్ అని నిఖిల్ అన్నాడు. అదే మాకు ఫస్ట్ వీక్ కనపడ్డావ్.. మళ్ళీ ఇప్పుడు కనపడ్డావని శివాజీ అన్నాడు. దాంతో నిఖిల్ నవ్వుకున్నాడు. లేదు నేను ప్రతీ టాస్క్ ఆడానని నిఖిల్ అన్నాడు. అదేంటి మాకు కనపడలేదని శివాజీ అన్నాడు.    గౌరవ్ నువ్వు ఆర్టిస్ట్ వి కదా మరి హౌస్ లో నటించలేదేంటని శివాజీ అడుగగా.. అదేం లేదు సర్ అని గౌరవ్ అన్నాడు. ఓరి బాబు ఏంట్రా ఇది.. మీది గల్తీ ఉందని ఉస్ కో బోలో.. అని నిఖిల్ కి తెలుగులో చెప్పమని గౌరవ్ తో శివాజీ(Sivaji)అన్నాడు. దాంతో గౌరవ్ తడబడ్డాడు. బిగ్ బాస్ హౌస్ లో నిలబడాలంటే ఆడియన్స్ ని గెలుచుకోవాలని శివాజీ చెప్పాడు.   

Bigg boss 9: నాగచైతన్య కోసం నేను రెడీ అంటూ రీతూ బోల్డ్ కామెంట్స్!

  బిగ్ బాస్ సీజన్-9 ఇప్పటికే పది వారాలు కంప్లీట్ చేసుకుంది. ‌ఇక పదో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అందులో శనివారం నాటి ఎపిసోడ్ లో నిఖిల్ ఎలిమినేట్ అవ్వగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున తన కొడుకు నాగ చైతన్య(Nagachaitanya)ని తీసుకొచ్చాడు. దాంతో హౌస్ అంతా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక హౌస్ మేట్స్ తో పాటు రీతూ చౌదరి కూడా ఆనందం ఆపులోకపోయింది. దాంతో తను మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం. నాగ చైతన్య స్టేజ్ మీదకి రాగానే నాగార్జున సర్ ప్రైజ్ ఫీల్ అయ్యాడు. ఇక నాగ చైతన్య తన గురించి చెప్పుకొచ్చాడు. నాకు యాక్టింగ్తో పాటు రేసింగ్ అంటే బాగా ఇష్టమని మీకు తెలుసు. నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఓ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యింది. అందులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమికి నేనే ఓనర్ ని‌‌ నేను అంటూ నాగచైతన్య చెప్పడంతో నాగార్జున హ్యాపీగా ఫీల్ అయ్యాడు.  నాకు తెలియకుండా ఎప్పుడు చేశావని అడగ్గా.. చేశానులే అని అన్నాడు చైతూ. ఇక తర్వాత హౌస్ మేట్స్ అందరికీ పరిచయం చేశారు. అందరు ఒకటి చెప్తే రీతూ మాత్రం ఒక్క ఆకు ఎక్కువే చదివింది. మీరంటే నాకు పిచ్చి అని చెప్పింది. దాంతో హౌస్ అంతా షాక్‌.  అదేంటమ్మా నేనంటే ఇష్టమని అన్నావుగా అని  నాగార్జున అనడంతో.. ఎప్పటికీ మీరు మీరే సర్ అని చెప్పింది. చైతూలో నీకు బాగా నచ్చిన విషయం ఏంటో చెప్పమని నాగార్జున అడుగగా.. చైతూ సర్ కాళ్లు ఉంటాయ్ సర్.. ఎంత తెల్లగా ఉంటాయో.. శిల్పాన్ని చెక్కినట్లుగా ఉంటారని రీతూ చెప్పడంతో.. ఆ శిల్పాన్ని చెక్కింది నేనే అంటూ నాగార్జున చెప్పాడు. నువ్వు ఇప్పుడు బయటకు వస్తే చైతూ నిన్ను బైక్ మీద తీసుకుని వెళ్తాడని నాగార్జున(Nagarjuna)అన్నాడు.  రీతూ వెంటనే వచ్చేస్తానని అంది. ఆయన కోసం ఎలిమినేట్ అయి ఇంట్లోంచి బయటకు వచ్చేయడానికి సైతం ఓకే అని చెప్పేసింది. నువ్వు గెలిచిన తర్వాత కూడా నిన్ను బైక్ మీద తీసుకెళ్తా అని నాగ చైతన్య అనడంతో రీతూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. నాగ చైతన్య గురించి రీతూ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారాయి. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది.. మరీ ఇంత పొగడాలా‌‌.. ఎంత స్క్రిప్ట్ అయితే మాత్రం ఇంతలా దిగజారాలా అంటు రీతూపై నెటిజన్లు ట్రోల్ చేస్తారు.  

వైరల్ వంటలక్క...త్వరలో

ఈటీవీలో అభిరుచి ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నేళ్ల క్రితం వరకు ప్రతీ ఇంట్లోనూ అభిరుచి ప్రోగ్రాం కనిపించేది. ఐతే సోషల్ మీడియా కాలం బాగా పెరిగాకా చాలా కార్యక్రమాలు అటకెక్కిపోయాయి..ఇక ఇప్పుడు ఈటీవీ అభిరుచి ప్రేక్షకుల కోసం కొత్త షో ఒకటి త్వరలో రాబోతోంది. అదే "వైరల్ వంటలక్క". ఇక ధరణి ప్రియా ఈ షోని నిర్వహిచబోతోంది. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో వస్తున్న మాటలు, డైలాగ్స్, రీల్స్ లో వచ్చే కామెడీ బిట్స్ అన్నిటినీ కలిపి ఇక్కడే చూడొచ్చు. ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. "సరికొత్త వైరల్ అయ్యే వంటలతో మీముందుకొస్తోంది మీ వైరల్ వంటలక్క" అని చెప్పింది. ఇక వంటగదిలోకి రాగానే "నాకో గరిటెత్తిర్రా..స్పూన్ లు, గరిటెలు అనే పోపు డబ్బా ఒకటి ఉంటుంది దాన్ని ఇక్కడ పెట్టారా. అంటే అందరికీ కోపమొస్తుంది..హర్ట్ ఐపోతారు..తగలబెట్టండి అమర్ గారు తగలబెట్టండి.. నేను వంట చేస్తే మాములుగా ఉండదు..తిన్న వెంటనే అంటారు ఎవురమ్మా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు...వైరల్ వంటలక్కా..వైరల్ వంటలవుతాయి...మాటలు మంటలవుతాయి. వెరైటీగా నేను చేసే వెజ్ వంటలు చూసి అంటారు వాట్ ఏ విజన్..ఇక నాన్ వెజ్ వంటకాలు ఎలా ఉంటాయంటే రెండు లివర్ లు ఎక్స్ట్రా...మా ఆయన బిజినెస్ ట్రిప్ మీద బ్యాంకాక్ వెళ్ళాడు వదినా రావడానికి ఇంకో వారం పట్టుదట...ఫామిలీ ఫామిలీ అని ఒకటే అల్లాడిపోతాడొదినా...ఏంటి అలా చూస్తున్నారు కింది స్థాయి వాళ్లకు అర్ధం కానీ మినిమం డిగ్రీ చదివుండాలి. వైరల్ అయ్యే వంటలతో పాటు ఫామిలీ టాపిక్స్ నుంచి ఫారెన్ టారీఫ్స్ వరకు మాట్లాడుతుంది మీ వైరల్ వంటలక్క...అవునా నిజమా" అంటూ చెప్పుకొచ్చింది ధరణి ప్రియా.

Gourav Gupta Elimination: గౌరవ్ ఎలిమినేషన్.. బయటకు రావడానికి కారణాలివే!

బిగ్ బాస్ సీజన్-9 లో మోస్ట్ కాంప్లెక్స్ థింగ్ ఏంటంటే అది గౌరవ్ తో తెలుగులో ఓ పది నిమిషాలు మాట్లాడటమే.. ప్రతీసారీ ఇతనికి ఇంగ్లీష్ టూ తెలుగు ట్రాన్స్ లేషన్ కావాల్సి వచ్చేది. అయితే పదో వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని నాగార్జున బిగ్ బాంబ్ పేల్చాడు.  నిన్నటి సండే ఎపిసోడ్ లో మొదటగా తనూజ, ఇమ్మాన్యుయల్ మధ్య జరిగిన గొడవని చూశాడు నాగార్జున. ఆ తర్వాత వారిద్దరిని టీమ్ లీడర్స్ గా చేసి గేమ్ ఆడించాడు నాగార్జున. ఆ తర్వాత నాగ చైతన్య స్టేజ్ మీదకి వచ్చి తను హైదరాబాద్ కార్ రేసింగ్ కి ఓనర్ ని అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత స్పాన్సర్ టాస్క్ ఆడించాడు నాగార్జున. ఇక ఎపిసోడ్ చివరిలో డేంజర్ జోన్‌లో ఉన్న దివ్య-గౌరవ్ ఇద్దరిని ఎలిమినేషన్ రౌండ్ ఆడించాడు. ఇందులో దివ్య సేఫ్ అయి గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే తనూజ దగ్గరున్న సేవింగ్ పవర్ ఈ వారంతో ఎక్స్‌పెయిర్ అవుతుంది. దీంతో అది ఉపయోగిస్తావా అంటూ నాగార్జున అడిగాడు. ఒకవేళ ఉపయోగిస్తే ఓట్ల ద్వారా సేవ్ అయిన దివ్య ఎలిమినేట్ అయి గౌరవ్ సేఫ్ అవుతాడని నాగార్జున చెప్పాడు. కానీ తనూజ ఆలోచించి ఆడియన్స్ ఓటింగ్‌కి గౌరవం ఇస్తున్నాను సర్.‌ గోల్డెన్ పవర్ వాడటం లేదని చెప్పింది. దీంతో గౌరవ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. ఆ తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన గౌరవ్ కి తన జర్నీ వీడియో చూపించాడు నాగార్జున. ఇక హౌస్ లో ఎవరు ఎలాంటివారో చెప్పమన్నాడు నాగార్జున. గౌరవ్ ఒక్కొక్కరి గురించి చెప్పాక తనని పంపించేశాడు.  రమ్య, మాధురి, సాయి, అయేషా, గౌరవ్ , నిఖిల్ మొత్తం ఆరుగురిని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి పంపగా నిఖిల్, గౌరవ్ మినహా మిగతావాళ్ళంతా ఎలిమినేట్ అయ్యారు.  నిఖిల్ శనివారం నాటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ కాగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో గౌరవ్  ఎలిమినేట్ అయ్యాడు. దీంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అంతా ఎలిమినేషన్ అయ్యారు. హౌస్ లో ప్రస్తుతం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.

నన్ను బ్యాడ్ చేయకు.. పాయింట్ ఉంటే నామినేషన్ చేస్కో..

బిగ్ బాస్ సీజన్-9 లో తనూజ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే బిగ్ బాస్ దత్తపుత్రిక అని అందరికి తెలుసు. అందుకే హౌస్ లో ఎంతమంది ఉన్నా తన గురించి పాజిటివ్ గా మాత్రమే కంటెంట్ బయటకు వస్తుంది. అంతలా తనని ఎంకరేజ్ చేస్తున్నారు బిగ్ బాస్. అయితే నిన్నటి ఎపిసోడ్ లో తనూజ, ఇమ్మాన్యుయల్ మధ్య గొడవ జరిగింది. ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమ్ అనేది ఒక్కొక్క చోట పనికొస్తది కానీ అన్ని చోట్లా కాదు. ప్రతిసారీ నువ్వు అదే చేస్తున్నావ్. ఎందుకంటే నాకు నీకు బాండింగ్ అని కాదు ఒక ఫ్రెండ్‌షిప్ అని కాదు. ఒక హౌస్‌మేట్స్‌గా కూడా మన మధ్య ఏం లేదు. మరి నేను నీకు బలహీనత ఎలా అవుతానంటూ తనూజ అడిగింది. నువ్వు ఏమైనా అంటే పర్సనల్‌గా నేను ఫీలవుతాను.. నా వీక్‌నెస్ అది అని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. ఇంతలో పక్కనే ఉన్న రీతూ మధ్యలో మాట్లాడింది. వాడు నాకు ఆల్‌మోస్ట్ టూ థ్రీ టైమ్స్ చెప్పాడు ఏంటంటే రీతూ మనద్దిరం ఫ్రెండ్స్ బయట చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాకపోతే నాకంటే వాడికి నువ్వే ఎక్కువరా అని తనూజతో రీతూ చెప్పింది. ఎక్కువ తక్కువ కాదు రీతూ.. వాడు ప్రతి గేమ్‌లో నిజాయితీగా, హృదయపూర్వకంగా సపోర్ట్ చేసి వాడు గెలవాలని చూస్తుంది నేను.. ఆ థ్రీ వీక్స్ తర్వాత మేము మాములుగా కూర్చొని మాట్లాడుకున్నదే లేదు.. నేను వచ్చి కూర్చుంటే నువ్వు లేచి వెళ్లిపోతున్నావ్.. లేదంటే నువ్వు వచ్చి కూర్చుంటే నాకు ఏదో వర్క్ వచ్చి నేను వెళ్లిపోతున్నానంటూ తనూజ చెప్పింది. నీకు అది లేదేమో కానీ నాకు ఆ బాండ్ ఉంది తనూజ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు.  నాకు ఎక్కడా కనిపించలేదు ఇమ్మూ అంటూ తనూజ అడుగగా.. కనిపించడం అంటే నీ పక్కన వచ్చి కూర్చొని మాట్లాడేది కాదని ఇమ్మాన్యుయల్ అన్నాడు. మరి ఏ విషయంలో ఉంది చెప్పు అని తనూజ అడుగగా.. అన్ని విషయాల్లోనూ కనెక్ట్‌ అయ్యే ఉన్నానని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. ఏది ఒక్క విషయం చెప్పు అంటూ తనూజ అంది. దీంతో సరే నేను ఏ విషయంలోనూ లేనులే తనూజ.. నేను కనెక్ట్ అవ్వలేదంటూ ఇమ్మాన్యుయల్ అన్నాడు. ఇప్పుడు నాకు తెలుసుకోవాలనుంది చెప్పు అని మళ్లీ తనూజ అడిగేసరికి లేదులే నేను కట్ అయిపోయానంటూ ఇమ్మాన్యుయల్ అనేశాడు. మళ్లీ ఇక్కడ సేఫ్ మాటలా అంటూ తనూజ అనగా.. సరే అవును నేను సేఫ్‌యే.. అంటూ ఇమ్మాన్యుయల్ అన్నాడు. తనూజ వెళ్లగానే రీతూతో ఇమ్మాన్యుయల్ మాట్లాడాడు. ఇక మళ్ళీ ఇమ్మాన్యుయల్ దగ్గరికి వచ్చింది తనూజ‌. నువ్వు ప్రతీచోట నా పేరు తీసుకొని నన్ను బ్యాడ్ చేయకు ఇమ్మాన్యుయల్.. నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా.. అడుక్కుంటున్నా.. ఏదో నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నట్లు.. ఏదో నువ్వు నా మీద ప్రేమ చూపిస్తున్నట్లు చేయకు.. నీ గేమ్ నువ్వు ఆడేటప్పుడు నీ గేమ్ నువ్వు ఆడు.. ప్లీజ్ నా పేరు నువ్వు తీసుకోకంటూ తనూజ అంది. నేను బ్యాడ్ చేయడం లేదని ఇమ్మాన్యుయల్ చెప్తుంటే వద్దు ప్లీజ్ నా పేరు తీయకంటూ తనూజ అంది. సారీ తనూజ.. నీ పేరు తీసుకురాను అని ఇమ్మాన్యుయల్ అనగా.. పాయింట్ ఉంటే నామినేషన్ చేస్కోమని తనూజ చెప్పేసి వెళ్ళిపోయింది. అయితే ఇందులో అసలేం లేదు.. తనూజ కంటెంట్ కోసమే ఇది చేసిందని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

ప్రభాస్‌కి డేట్ ఇస్తాను.... డ్రగ్స్ లేకుండా చేస్తాను!

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న జ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాప్ హీరోస్ నటించిన ఎన్నో మూవీస్ లో సైడ్ రోల్స్ లో, వాంప్ రోల్స్ లో నటించింది. అలాగే బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా కూడా వెళ్ళింది. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చింది. "ఇప్పుడు నేను హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నాను. అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది." అని చెప్పింది. "నేను వన్ డే సిఎం ఐతే డ్రగ్స్ ని పర్మనెంట్ గా, కంప్లీట్ గా లేకుండా చేస్తాను. నా ఫ్రెండ్స్ డ్రగ్స్ బారిన పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నా మనసుకు చాలా దగ్గరి వాళ్ళు. డ్రగ్స్ కి ఎడిక్ట్ ఐపోయి వాళ్ళేం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియని పొజిషన్ లో ఉండేవాళ్ళు. అందుకే డ్రగ్స్ లేకుండా చేస్తా" అని చెప్పింది. తర్వాత "ఇన్నాళ్లు ఉన్నారు కదా ఇండస్ట్రీ మీకు ఎం నేర్పించింది" అని అడిగింది హోస్ట్. "సహనంతో ఉండాలని నేర్పింది. ఒక వేళా నేను ఆర్టిస్ట్ ని కాకపోయి ఉంటే పైలెట్ ని అయ్యుండేదాన్ని." అని చెప్పింది. ఫైనల్ గా "ఒకటే రోజు, ఒకటే టైం, ఒకటే డేట్ లో విజయ్ దేవరకొండ, ప్రభాస్ తో చేయాలి అంటే డేట్ ఎవరికీ ఇస్తారు" అని అడిగేసరికి "ప్రభాస్ కి డేట్ ఇస్తాను. విజయ్ దేవరకొండతో కిస్, క్రష్ మాత్రమే కదా చెప్పాను వర్క్ చేస్తాను అని చెప్పలేదు కదా. అప్పుడు ఇద్దరితో కలిసి పని చేసినట్టు ఉంటుంది" అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది నటి జ్యోతి. ఇక రీసెంట్ గా ఈమె తన కొడుకుతో కలిసి కొత్త ఇంటి గృహప్రవేశం చేసింది. ఆ వీడియోస్ ని పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.