jayam serial: రుద్ర, గంగల రిసెప్షన్ లో పోలీసులు.. ఇదంతా చేసింది వీరూనేనా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -128 లో.....గంగకి చీర కట్టి రుద్ర తీసుకొని వస్తాడు. తనని చూసి అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత రుద్ర, గంగ దంపతులు పెద్దసారు శకుంతల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. పైడిరాజు, లక్ష్మి దగ్గరికి ఇద్దరు దంపతులు ఆశీర్వాదం తీసుకుంటారు. లక్ష్మీ వాళ్ళకి బట్టలు తీసుకొని వస్తుంది. అవి వాళ్ళ స్థాయికి తగవని ఇవ్వకుండా ఆగిపోతుంది. మీరేదో తీసుకొని వచ్చారు.. ఇవ్వండీ అని రుద్ర అంటాడు.  మీరు అభిమానంతో ఏది ఇచ్చిన పర్వాలేదని రుద్ర అనగానే లక్ష్మీ ఇద్దరికి బట్టలు పెడుతుంది. నేను మా అమ్మ పెట్టిన చీర కట్టుకొని వస్తానని గంగ అనగానే వద్దని శకుంతల అంటుంది. వెళ్లి కట్టుకొని రా అని పెద్దసారు అంటాడు. దాంతో గంగ చీర మార్చుకోవడానికి వెళ్తుంది. తను గదిలోకి వెళ్లడంతో ఇషిక, పారు కలిసి మస్కిటో కాయిన్స్ పెట్టి మొత్తం పొగ వచ్చేలా చేస్తారు‌‌. దాంతో గంగ స్పృహ తప్పిపడిపోతుంది. బయటనుండి ఇషిక, పారు డోర్ లాక్ వేస్తారు. గంగ ఇంకా రాలేదని స్నేహ  పైకి వచ్చి చూస్తుంది. గంగ లేకపోవడంతో అందరు కంగారు పడుతారు. రుద్ర డోర్ గట్టిగ నెట్టి గంగ దగ్గరికి వెళ్తాడు. కింద పడిపోయి ఉన్న గంగని చూసి బెడ్ పై పడుకోబెడతాడు. అప్పుడే అందరూ వస్తారు. కాసేపటికి గంగ స్పృహలోకి వస్తుంది.  ఏం జరిగిందో చెప్తుంది.. ఎవరో బయట డోర్ పెట్టారని గంగ చెప్పగానే ఎవరు ఎందుకు పెడుతారు.. అంతా యాక్టింగ్ అని శకుంతల అంటుంది. ఆ తర్వాత రిసెప్షన్ జరుగుతుంది. అందరు గిఫ్ట్స్ ఇస్తుంటారు. అప్పుడే పోలీసులు వస్తారు. మీ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎవరో తెలుసుకోమని కంప్లైంట్ ఇచ్చారు కదా తెలిసిందని వాళ్ళు అంటారు. ఎవరు ఇచ్చారని పెద్దసారు అడుగుతాడు. నేనే ఇచ్చానని వీరు అంటాడు. ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ గంగ అని ఇన్‌స్పెక్టర్ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : స్వామిజీని తీసుకొచ్చిన నర్మద.. నగలు ఎక్కడున్నాయో శ్రీవల్లి చెప్తుందా!

    స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -329 లో.....ఇప్పుడు ఈ నగల విషయం బయట పడితే నన్ను ఇంట్లో నుండి గెంటేస్తారని శ్రీవల్లి భయపడుతుంది. మరొకవైపు ఆనందరావు తీసుకొని వెళ్లిన డబ్బుతో పాటు రెట్టింపు డబ్బు తీసుకొని వస్తాడని భాగ్యం ఎదురు చూస్తుంది. ఆనందరావు వచ్చి వాడు నన్ను మోసం చేసాడని చెప్పగానే భాగ్యం షాక్ అవుతుంది. ఆనందరావుని భాగ్యం కొడుతుంది. అప్పుడే శ్రీవల్లి ఫోన్ చేసి నగల విషయం చెప్తుంది.   నువ్వేం కంగారుపడకు నగలన్నీ ఒక గొయ్యి తీసి అందులో పెట్టు ఎవరికి తెలియదని భాగ్యం ఐడియా ఇవ్వడంతో శ్రీవల్లి సరే అంటుంది. మరొకవైపు నగలు తీసింది.. ఆ శ్రీవల్లినే.. వెళ్లి తన రూమ్ లో వెతకాలని నర్మద, ప్రేమ అనుకుంటారు‌. వాళ్ళు వచ్చేలోపు శ్రీవల్లి నగలు తీసుకొని బయటకు వచ్చి.. గొయ్యి తవ్వి అందులో పెడుతుంది. ఈ వల్లి అక్క గదిలో నగలు లేవు.. నాకు తనని ఎలా బయటకు రప్పించాలో తెలుసని నర్మద అనుకుంటుంది.   ఆ తర్వాత నర్మద, ప్రేమ కలిసి ఇంటికి ఒకతన్ని తీసుకొని వస్తారు. అతను స్వామిలాగా గెటప్ వేసుకొని వస్తాడు. ఇంట్లోకి వస్తోంటే ఎవరితను అని వేదవతి అడుగుతుంది. నగలు కనిపెట్టాడనికి వచ్చాడని నర్మద చెప్తుంది. అప్పుడే శ్రీవల్లి వచ్చి ఎవరు ఇతను అని అడుగుతుంది. నగలు ఎక్కడున్నా ఎవరు తీసిన కనిపెడుతాడని ప్రేమ చెప్పగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్.. దీపకి సపోర్ట్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 1'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -528 లో.....జ్యోత్స్న కాలు అడ్డు పెట్టడంతో దీప పడిపోతుంటే.. సుమిత్ర పట్టుకుంటుంది. అయ్యో జాగ్రత్త దీప అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న పైకి వెళ్తుంది. రక్తసంబంధం అంటే ఇదేనేమోనని జ్యోత్స్న అనుకుంటుంది. ఒకసారి మా అమ్మని దీప కాపాడింది. ఈసారి దీపని మా అమ్మ కాపాడింది. ఇప్పుడు తన మనవరాలిని కాపాడుకుందని జ్యోత్స్న కోపంగా ఉంటుంది.     అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. మనసులో హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లున్నావని అడుగుతాడు. ఎందుకని జ్యోత్స్న అడుగుతుంది. ఇందాక నా భార్య ఎవరైనా కాలు పెడితే పడిపోబోయిందా లేక నార్మల్ గానే పడిపోబోయిందా అని కార్తీక్ అనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. నాకేం తెలుసని జ్యోత్స్న అంటుంది. ఒకవేళ ఇంటెన్షన్ గా నా బిడ్డకి ఏదైనా చెయ్యాలని చూస్తే ఊరుకోనని కార్తీక్ ఇండైరెక్ట్ గా జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు. మరొకవైపు కాంచన దగ్గరికి శ్రీధర్ వస్తాడు.   నీతో రెండు విషయాలు తెల్చుకోవాలని వచ్చానని అంటాడు. అందరు నన్ను క్షమించారు.. మరి నువ్వు ఎందుకు క్షమించడం లేదని శ్రీధర్ అడుగుతాడు. ఎప్పటికి క్షమించను మిమ్మల్ని భర్తగా ఒప్పుకోనని కాంచన అంటుంది. ఇక వెళ్లిపోండి అని కాంచన అంటుంది. ఇంకొక విషయం అడగాలి. అది అందరు ఉన్నప్పుడు అడుగుతాను.. వాళ్ళు రానివ్వు అని శ్రీధర్ అంటాడు.   మరొకవైపు ఆ కాలు అడ్డు పెట్టింది జ్యోత్స్న అని మాట్లాడుకుంటారు. చిన్నగా వార్నింగ్ అయితే ఇచ్చానులే అని కార్తీక్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. దీప నువ్వు నార్మల్ గానే పడ్డావా లేక ఎవరైనా ఏదైనా చేసారా అని శివన్నారాయణ అడుగుతాడు. అదేం లేదు నార్మల్ గానే పడబోయానని దీప చెప్తుంది. మరొకవైపు మీరు ఇక వెళ్ళండి వాళ్ళు వచ్చేవరకు లేట్ అవుతుందని శ్రీధర్ ని కాంచన వెళ్ళమంటుంది. అప్పుడే కావేరి ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: రాహుల్ కన్నింగ్.. కావ్యకి రాజ్ ఆయుర్వేద చికిత్స చేపిస్తాడా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -891 లో....అప్పు, కళ్యాణ్ బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. గుడికి అని అప్పు చెప్తుంది. కళ్యాణ్ దగ్గరున్న బ్యాగ్ చూసి అదేంటని అడుగుతుంది. దాంతో ఇద్దరు కలిసి ఏదో ఒకటి కవర్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు రాజ్, కావ్య ఆఫీస్ కి వెళ్తారు. మేనేజర్ ఎక్కడ అని శృతిని రాజ్ అడుగుతాడు. అయన రిజైన్ చేసి రాహుల్ సర్ కంపెనీకి వెళ్ళిపోయాడని శృతి చెప్పగానే రాజ్, కావ్య షాక్ అవుతారు. ఒకసారి ఫోన్ చెయ్యండి అని కావ్య అనగానే వద్దులే.. ఇప్పుడు వాడి కంపెనీకి ఎక్స్పీరియన్స్ ఉన్న మేనేజర్ కావాలని రాజ్ అంటాడు.    మరొకవైపు రాహుల్ దగ్గరికి మేనేజర్ వస్తాడు. స్వరాజ్ కంపెనీకి ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళందరు మన కంపెనీకి రప్పించు అని రాహుల్ చెప్తాడు. దానికి అతను సరే అంటాడు. మరొకవైపు అప్పు డ్యూటీలో జాయిన్ అయ్యి చిన్న పాప కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. తనకన్నా పై ఆఫీసర్ ఎదురుపడి డ్యూటీలో జాయిన్ అయ్యావా అని అడుగుతాడు. మీరు అన్నారు కదా సర్.. నువ్వు ఖాళీగా ఉంటే కేసు ఇన్వెస్టిగేషన్ చెయ్యమన్నారు కదా అందుకే అని అప్పు అనగానే నేనేదో సరదాగా అన్నానని ఆఫీసర్ అంటాడు. నేను సీరియస్ గా తీసుకున్నా సర్ అని అప్పు అంటుంది.     ఆ తర్వాత రాజ్, కావ్య పాత ఫైల్స్ అన్నీ చెక్ చేస్తారు. ఆ తర్వాత అప్పు పాప వాళ్ళింటికి వెళ్లి అసలు ఏమైందో మొత్తం కనుక్కుంటుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. రాహుల్ వస్తాడు. రాజ్ మేనేజర్ గురించి అడగకముందే నేనే చెప్పాలని అనుకుంటాడు. మేనేజర్ నా కంపెనీకి వస్తానంటే నేను తీసుకున్నానని రాహుల్ చెప్తాడు. తరువాయి భాగంలో కావ్య కళ్ళు తిరిగిపడిపోతుంది. అక్కడ ఒక స్వామి చూసి ఇలాంటి సమస్యలకి ఒక దగ్గర ఆయుర్వేదంతో నయం చేస్తారని వాళ్లకు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg Boss 9 Telugu: దివ్యని తీయడానికి తనూజ స్కెచ్.. రీతూని వాడుకుందిగా!

  బిగ్ బాస్ సీజన్-9 లో గత వారం ఫ్యామిలీ వీక్ జరిగింది. ఈ వారం కెప్టెన్సీ కోసం టాస్క్ లు జరిగాయి. ఇక ఈ సీజన్ లో చివరి కెప్టెన్ కాబట్టి గేమ్ మరింత రసవత్తరంగా సాగింది. కంటెండర్స్ ఆరుగురికి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బజర్ మోగగా భరణి వెళ్లి డ్రాగన్ పట్టుకుంటాడు. అది డీమాన్ కి ఇస్తాడు. దాంతో ఇమ్మాన్యుయల్ ని అతను కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగిస్తాడు. ఇద్దరికి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. నామినేట్ చేసేటప్పుడు అన్న ఏడుపొస్తుంది మిమ్మల్ని చెయ్యాలంటే అన్నావ్.. అదంతా వద్దు ఇప్పుడు ఏకంగా కెప్టెన్సీ టాస్క్ నుండి తీసేస్తున్నావని ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అవుతాడు.   ఇక ఆ తర్వాత డ్రాగన్ ఎవరికి ఇస్తే ఎవరిని ఎవరు తొలగిస్తారో కంటెండర్ గా లేనివాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. బజర్ మోగగానే తనూజ వెళ్లి డ్రాగన్ పట్టుకుంటుంది.. అది తీసుకొని రీతూకి ఇస్తుంది. దాంతో దివ్యని రీతూ తొలగిస్తుంది. నాకు నువ్వు స్ట్రాంగ్ అనిపిస్తున్నావ్.. నువ్వు ఉంటే నేను కెప్టెన్ కాలేనని రీతూ రీజన్ చెప్తుంది. నాకు భయపడుతున్నావా అని అందుకే తీసేస్తున్నావ్ అని దివ్య అంటుంది. మిగతా వాళ్ళు టఫ్ అనిపించడం లేదా అని దివ్య లాజిక్ మాట్లాడుతుంది. వాళ్ళు స్ట్రాంగ్.. వాళ్ళతో ఆడి గెలవాలని నిన్ను తీసేసానని రీతు అంటుంది. నాకు భయపడి అని దివ్య అంటుంది. అవును నీకు భయపడి, నువ్వు తోప్ అని రీతు అంటుంది. అవును నేను తోపు.. పెద్ద బాడీ ఉంది.. పొగరు ఉందని దివ్య అంటుంది.    తనూజ నీకు ముందే నన్ను తీసేస్తుందని తెలిసే రీతూకి ఇచ్చావా అని తనూజని దివ్య అడుగుతుంది. నువ్వు కళ్యాణ్ కి ఇవ్వొచ్చు కదా అని తనూజతో దివ్య అంటుంది. కళ్యాణ్ కి అప్పుడు టఫ్ అవుతుందని తనూజ అంటుంది. అలా ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరుగుతాయి. ఆ తర్వాత బజర్ మోగగానే సంజన డ్రాగన్ పట్టుకుంటుంది. కళ్యాణ్ నీకు ఇస్తే ఎవరిని తీసేస్తావని సంజన అడుగుతుంది. కళ్యాణ్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. డీమాన్ తో డిస్కషన్ చేస్తాడు. మీ అమ్మ రెండోసారి నువ్వు కెప్టెన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుందో లేదో తెలియదు కానీ నేను నువ్వు కాకుంటే మాత్రం హర్ట్ అవుతాను.. నువ్వు కంపల్సరీ కెప్టెన్ అవ్వాలని కళ్యాణ్ తో తనూజ చెప్తుంది. ఆ తర్వాత సంజన, కళ్యాణ్ కి డ్రాగన్ ఇస్తుంది. కళ్యాణ్, రీతూని తొలగిస్తాడు. నేను డీమాన్ తో పోటీ పడాలనుకుంటున్నానని కళ్యాణ్ రీజన్ చెప్తాడు.  

తేజ సజ్జ అంటే నాకు క్రష్.. ఈ అమ్మాయిలంతా ఇంతే!

ఢీ షోలో ప్రెజెంట్ దుమ్ము రేపుతున్న భూమికను ఇంటర్వ్యూ చేసాడు మరో టాప్ డాన్సర్ పండు. అది కూడా రొటీన్ కి భిన్నంగా.  "ఢీలో నీకు ఎవరంటే ఇష్టం" "విజయ్ బిన్నీ మాష్టర్" "ఆయనంటే నాకు కూడా ఇష్టమే ఆయన కాకుండా ఇంకెవరంటే ఇష్టం" అంటూ పండు మెలికలు తిరుగుతూ అడిగాడు. వెంటనే భూమిక హోస్ట్ నందు గారంటే ఇష్టం అని చెప్పింది. "యాహ్..వెల్కమ్ బ్యాక్ అంటుంటాడు హైట్ ఉంటాడు. ఈ మధ్యన ఒక సినిమా కూడా వచ్చింది. వీళ్ళు కాకుండా నీకు స్పెషల్ గా పర్సనల్ గా ఎవరంటే ఇష్టం" అని మళ్ళీ అడిగాడు. ఇంకా పర్సనల్ గా వెళ్తే ఆది గారు. ఓహ్ హైపర్ ఆది..సరే ఇంకా ఇంకా ఇంకా బాగా పర్సనల్ గా ఎవరంటే ఇష్టం." అని మళ్ళీ మళ్ళీ అడిగాడు. "ఇంకా ఇంకా ఎవరిష్టం అంటే రాజు" అని చెప్పింది. "ఇంత అందగాడిని ఎదురుగా పెట్టుకుని ఇన్ని సార్లు అడుగుతుంటే నా పేరు కాకుండా రాజు పేరు చెప్తోంది. ఈ అమ్మాయిలంతా ఇంతే ఎంత అందంగా ఉంటె అంత టెక్కు ఎక్కువగా ఉంటుందన్నమాట." అన్నాడు. ఇక తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాడు. "మీ ఊరు ఎక్కడ" అని అడిగాడు. "కర్ణాకటకలోని మండ్య" అని చెప్పింది. "నువ్వు చాలా అందంగా ఉంటావ్ కదా. నీకు ఏమన్నా ప్రొపోజల్స్ వచ్చాయా..ఒక స్పెషల్ ప్రొపోజల్ అంటూ ఏమైనా ఉన్నదా" అని అడిగాడు. "చాలా వచ్చాయి. అలాంటి ప్రొపోజల్స్ ఏమీ రాలేదు. అందుకే ఇంకా సింగల్ నేను" అంది. "అంత స్పెషల్ ప్రొపోజల్ నేను చేస్తే ఒప్పుకుంటావా" అని అడిగాడు పండు "అస్సలు ఒప్పుకోను" అని చెప్పింది. "హీరో క్రష్ ఎవరైనా ఉన్నారా" అన్నాడు. "మహేష్ బాబు గారు అలాగే తేజ సజ్జ గారు" అని చెప్పింది. "ఢీలోకి ఎలా వచ్చావ్" అని అడిగాడు. ఆడిషన్స్ ఇచ్చాను ప్రభు దేవా మాష్టర్ తరపున వచ్చాను" అని చెప్పింది. ఢీ - 20 ఫైనల్స్ కి ఎవరు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నావు అన్నాడు. నేను ఫైనల్స్ కి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా నాకు పోటీగా రాజు కానీ సంకేత కానీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా అని చెప్పింది. "నన్ను చూస్తున్నావ్ కదా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నా కదా" అన్నాడు. "అలా ఇప్పుడు అనిపించట్లేదు..సారీ పండు" అంటూ పరువు తీసేసింది.

Bigg Boss 9 Telugu: సంజనని కెప్టెన్సీ రేస్ నుండి తీసేసిన రీతూ.. పొడిచేసిందిగా!

  బిగ్ బాస్ హౌస్ లో ఈ వీక్ మొత్తం ఎక్స్ కంటెస్టంట్స్ ని లోపలికి పంపించి టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. టాస్క్ లో గెలిచిన కంటెస్టెంట్సే కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. అందులో భాగంగా కెప్టెన్సీ రేస్ లో లేని ముగ్గురు అయిన భరణి, తనూజ, సుమన్, ముగ్గురు బజర్ మోగినప్పుడు ముందు వెళ్లి డ్రాగన్ పట్టుకొని మీకు ఎవరైతే కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి డ్రాగన్ ఇవ్వాలి. వాళ్ళు కెప్టెన్ అవద్దనుకున్న వాళ్ళకి గుచ్చుతారని బిగ్ బాస్ చెప్పాడు.   మొదట బజర్ మోగినప్పడు సుమన్ వెళ్లి డ్రాగన్ పట్టుకొని రీతూ కి ఇస్తాడు. తను సంజనని కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగిస్తుంది. మీరు కెప్టెన్ కాకపోతేనే ఇలా మాటలు వదిలేస్తున్నారు.. ఇప్పుడు కెప్టెన్ అయితే ఇంకెలా మాట్లాడతారో అని రీతూ రీజన్ చెప్తుంది. నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది.. మీరు రోజు చేసే పనే కదా చెప్పాను. ప్రొద్దున లేస్తావ్.. గొడవ పడుతావ్.. అలుగుతావు.. దూరం వెళ్తారు.. మళ్ళీ ఇద్దరు ప్యాచప్ అవుతారు. ఇంతకు మించి నువ్వు ఏం చేస్తున్నావ్ చెప్పమని సంజన అడుగతుంది.    Also Read: బిగ్ బాస్-9 చివరి కెప్టెన్ ఎవరంటే..?   నీ కోసం సాక్రిఫైజ్ చేసాను.. మా నాన్న షర్ట్ వదిలేసి మరి అని రీతూ అంటుంది. నువ్వు షర్ట్ తీసుకోవడం వల్లే నా చీరలు అన్నిపోయాయని సంజన అంటుంది. అది కాదు నేను షర్ట్ ఇవ్వడం వల్లే నీకు చీరలు వచ్చాయి గుర్తు పెట్టుకోమని రీతూ అంటుంది. అసలు నా హెయిర్ కట్ చేసి సాక్రి ఫైజ్ చేసాను.. ఎందుకు చేసానా అని ఇప్పుడు అనిపిస్తుందని రీతూ అంటుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవలో ఇమ్మాన్యుయల్ టాపిక్ వస్తుంది. దాంతో తను ఇన్వాల్వ్ అవుతాడు. కాసేపు రీతూ, ఇమ్మాన్యుయల్ మధ్య గొడవ జరుగుతుంది.  

Bigg Boss 9 Last Captain: ఇద్దరు పవన్ ల మధ్య టఫ్ ఫైట్.. బిగ్ బాస్-9 చివరి కెప్టెన్ ఎవరంటే..?

  బిగ్ బాస్ సీజన్-9 ఈ వారం మొదటి రోజు నుండి చివరి కెప్టెన్ ఎవరు అవుతారోనని అందరిలో ఎక్సైట్ మెంట్ ఉంది. చివరగా  కెప్టెన్సీ రేస్ లో డీమాన్ పవన్, పవన్ కళ్యాణ్ ఉంటారు. బిగ్ బాస్ వాళ్ళకి చివరి కెప్టెన్ అవ్వడానికి ఒక టాస్క్ ఇస్తాడు. గుంతలుగా ఉన్న రోడ్డుని ఇచ్చిన వస్తువులతో సరి చెయ్యాలి. ఎవరు ముందు వేస్తారో వాళ్ళే ఈ  టాస్క్ విన్ అయి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ చెప్తాడు. సంచాలకులుగా ఎవరిని సెలక్ట్ చేసుకుంటారని బిగ్ బాస్ డీమాన్, కళ్యాణ్ ని అడుగుతాడు. నన్ను సెలెక్ట్ చేసుకోండి అని దివ్య అంటున్నా పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ తనూజని సెలెక్ట్ చేసుకున్నారు.   టాస్క్ మొదలవుతుంది. ఇద్దరు బాగా ఆడుతారు. టాస్క్ ఎండింగ్ టైమ్ లో డీమాన్ కి నడుంనొప్పి రావడంతో గేమ్ లో ముందుకు పోలేకపోతాడు. అయినా లాస్ట్ వరకు ఆడతాడు.. కానీ కళ్యాణ్ ఈ టాస్క్ లో విన్ అవుతాడు. డీమాన్ ఆడలేకపోయినందుకు ఎమోషనల్ అవుతాడు. డీమాన్ గెలవలేదని కళ్యాణ్ ఏడుస్తాడు. కళ్యాణ్, డీమాన్ ఇద్దరు ఎమోషనల్ అవుతారు.   Also Read: డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్.. ఈ వారం దివ్య, సంజన అవుట్!   డీమాన్ ని డాక్టర్ రూమ్ కి రమ్మని బిగ్ బాస్ పిలుస్తాడు. ఆ తర్వాత నేను చాలా ట్రై చేసాను కానీ కాలేదని రీతూతో చెప్తూ డీమాన్ ఎమోషనల్ అవుతాడు. బిగ్ బాస్ ఆదేశానుసరం రీతూ తన కెప్టెన్సీ బ్యాండ్ ని కళ్యాణ్ కి పెడుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ తన స్టైల్ లో సెల్యూట్ చేస్తాడు.   

Jayam serial : రిసెప్షన్ లో గంగకి అవమానం.. రుద్ర సూపర్ సపోర్ట్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -127 లో......రుద్ర గంగ పెళ్లి విషయం ఎవరికీ తెలియదు అని పెద్దసారు రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తాడు. రిసెప్షన్ కి పారు వస్తుంది తనని ఎవరు పిలిచారని శకుంతలని పెద్దసారు అడుగుతాడు. నేనే పిలిచానని శకుంతల అంటుంది. అలా ఎందుకు పిలిచావ్ అమ్మ అందరు ఏమనుకుంటారు.. తనతో పెళ్లి ఆగిపోయిందని ప్రీతీ అంటుంది. అనుకునే వాళ్ళు ఎలాగైనా అనుకుంటారని శకుంతల అంటుంది. ఆ తర్వాత రుద్ర రెడీ అయి కిందకి వస్తాడు. ఆ తర్వాత రిసెప్షన్ కి పైడిరాజు, లక్ష్మీ వస్తుంటే సెక్యూరిటీ ఆపుతారు. దాంతో పెద్దసారు వెళ్లి వాళ్ళు మా వియ్యంకులు అని చెప్పి లోపలికి తీసుకొని వస్తాడు. పెళ్లి కూతురు వాళ్ళు బస్తీ వాళ్ళా అని వచ్చినవాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత రుద్ర వాళ్ళని కూర్చోమని చెప్తాడు. రుద్ర నువ్వు డౌన్ టు ఎర్త్ అని తెలుసు కానీ మరి ఇంత డౌన్ అయి పెళ్లి చేసుకుంటావ్ అనుకోలేదని పారు అంటుంది. ఆ తర్వాత గంగ ఓవర్ మేకప్ తో ఎంట్రీ ఇస్తుంది. అలా లేకి దానిలాగ తయారు అయ్యింది ఏంటి.. గొప్పింటి కోడలు అయ్యాను అని పొగరని వచ్చినా వాళ్ళు అనుకుంటారు. ఏంటి ఇలా రెడీ అయ్యావని ప్రీతీ అడుగుతుంది. ఆవిడా రెడీ చేసిందని గంగ అంటుంది. స్నేహ బ్యూటీషియన్ దగ్గరికి వెళ్తుంది కానీ తను ఉండదు.. అదంతా ఇషిక ప్లాన్ అందరు గంగని చూసి నవ్వుకుంటారు. దాంతో గంగని రుద్ర తీసుకొని పైకి వెళ్తాడు. వెళ్లి చీర కట్టుకొని రా అంటాడు. గంగ చీర చుట్టుకొని వస్తుంది. నాకు కట్టుకోవడం రాదని చెప్పడంతో గంగకి రుద్ర చీర కడుతాడు. అందంగా రెడీ చేసి తీసుకొని వస్తాడు. దాంతో పారు, ఇషిక షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : ఆ పాపని అప్పు కనిపెడుతుందా.. రాహుల్ కొత్త కంపెనీలో మార్పులు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -890 లో.....అందరు భోజనం చేస్తారు. రాహుల్ నువ్వు కొత్త ఆఫీస్ కి వెళ్ళు.. రాజ్ నువ్వు నీ ఆఫీస్ కి వెళ్ళమని సుభాష్ చెప్తాడు. ఇద్దరు సరే అంటారు. నాతో పాటు కావ్య కూడా వస్తుందట అని రాజ్ అనగానే వద్దని అపర్ణ అంటుంది. తనకి ఆఫీస్ కి వస్తే మైండ్ షార్ప్ ఉంటుందట అని రాజ్ అనగానే ఇక తప్పక ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. నేను నా వర్క్ చేస్తాను.. ఇక అప్పు కూడా డ్యూటీ కి వెళ్తుందని కళ్యాణ్ అనగానే డెలివరీ వరకు నో డ్యూటీ అని చెప్పాను కదా అని ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. ఆ తర్వాత కళ్యాణ్, అప్పు బయటకు వచ్చి ఇప్పుడు ఎలా ఆ పాపకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎలా చెయ్యాలని అప్పు అంటుంది అప్పుడే కావ్య, రాజ్ వస్తారు. వాళ్ళకి విషయం చెప్తారు. ఒకావిడకి న్యాయం చేయాలి అనుకుంటున్నావు చెయ్ అని రాజ్ సలహా ఇస్తాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. ఇప్పుడు మీరు అప్పుకి ఎందుకు అలాంటి సలహా ఇచ్చారని కావ్య కోప్పడుతుంది. ఎందుకు నీకు టెన్షన్ అని రాజ్ కూల్ గా చెప్తాడు. చిన్నత్తయ్య గురించి మీకు తెలుసు కదా.. తనని కాదని ఏదైనా చేస్తే శత్రువులాగా చూస్తుందని కావ్య అనగానే.. అప్పు అన్నదాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే ఒక తల్లికి న్యాయం చేస్తుందని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్, కావ్య ఆఫీస్ కి వెళ్తుంటే.. అపర్ణ అన్ని జాగ్రత్తలు చెప్తుంది. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ బయటకు వెళ్తుంటే మీరెక్కడికి అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. గుడికి అని అప్పు చెప్తుంది. అయితే ఆ బ్యాగ్ ఏంటి అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. దాంతో కళ్యాణ్ టెన్షన్ పడుతాడు. ఆ బ్యాగ్ లో అప్పు యూనిఫామ్ ఉంటుంది. తరువాయి భాగంలో స్వరాజ్ కంపెనీ నుండి మేనేజర్ ని రాహుల్ తన కంపెనీకి తీసుకుంటాడు. ఆ విషయం రాజ్, కావ్యలకి తెలుస్తుంది. మరొకవైపు స్వరాజ్ గ్రూప్ లో పెట్టుబడి పెట్టేవాళ్ళని మొత్తం ఈ కంపెనీకి షిఫ్ట్ చెయ్యమని మేనేజర్ తో రాహుల్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Double Elimination: డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్.. ఈ వారం దివ్య, సంజన అవుట్!

  బిగ్ బాస్ సీజన్-9 ముగింపుకి వచ్చేసింది. పన్నెండో వారం కెప్టెన్సీ టాస్క్ ఫైనల్ డీమాన్ పవన్ మరియు పవన్ కళ్యాణ్ పడాల మధ్య జరుగగా.. పవన్ కళ్యాణ్ గెలిచి చివరి ఇంటి కెప్టెన్ అయ్యాడు.   ఇక నామినేషన్లో కెప్టెన్ రీతూ తప్ప అందరు నామినేషన్లో ఉన్నారు. ‌సోమవారం అర్థరాత్రి నుండి శుక్రవారం అర్థరాత్రి వరకు జరిగిన ఓటింగ్ లో ఎవరికి ఎంత ఓటింగ్ పడిందో ఓసారి చూసేద్దాం. సోషల్ మీడియా చెబుతున్న లెక్కల ప్రకారం, పవన్ కళ్యాణ్ పడాల 32.66 శాతం ఓటింగ్ తో మొదటి స్థానంలో ఉన్నాడు. 26.99 శాతం ఓటింగ్ తో తనూజ రెండో స్థానంలో ఉంది. 9.14 శాతం ఓటింగ్ తో ఇమ్మాన్యుయల్ మూడో స్థానంలో ఉన్నాడు. 6.56 శాతం ఓటింగ్ తో డీమాన్ పవన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 6.44 శాతం ఓటింగ్ తో భరణి ఐదో స్థానంలో ఉన్నాడు. 6.39  శాతం ఓటింగ్ తో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక సంజనా గల్రానీ, దివ్య నిఖిత డేంజర్ జోన్ లో ఉన్నారు.   Also Read: ప్రభాస్, అనుష్క పెళ్ళి.. వైరల్ గా మారిన వీడియో!   సంజనా గల్రానీ , దివ్య నిఖిత ఇద్దరిలో దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే గతవారం కూడా తనే ఎలిమినేట్ అయ్యేది కానీ పవరస్త్ర వాడటం వల్ల తను సేవ్ అయ్యింది. ఈ వారం తనకే తక్కువగా ఓటింగ్ పడింది. ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే సంజనా గల్రానీ, దివ్య నిఖిత ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే దివ్య కన్ఫమ్ ఎలిమినేట్ అవుతుంది.  

Karthika Deepam2 : జ్యోత్స్న పేరు మీద ఆస్తులు.. దీపకి తప్పిన గండం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -527 లో.. నేను రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు పెట్టి ల్యాండ్ తీసుకున్నాను.. అది అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను కానీ సిచువేషన్ అప్పుడు ఇలా లేదుగా అని జ్యోత్స్న అంటుంది. అది పచ్చి అబద్ధం అని కార్తీక్ అంటాడు. మళ్ళీ కవర్ చేస్తూ అలా అని పారు అనుకోవచ్చు కానీ అది నేను నమ్ముతున్నానని కార్తీక్ అంటాడు. మా మమ్మీ పేరున ఏది లేదు.. అందుకే ఇది తీసుకున్నానని జ్యోత్స్న అంటుంది. చూసారా జ్యోత్స్న వాళ్ళ అమ్మ గురించి ఎలా ఆలోచిస్తుందోనని పారిజాతం అంటుంది. అదంతా వదిలెయ్యండి కానీ అలా కంపెనీ డబ్బు తియ్యడం కరెక్ట్ కాదని అలా ఇచ్చిన మేనేజర్ పై కంప్లైంట్ ఇవ్వాలని శివన్నారాయణ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. అదంతా కాదు మావయ్య ఆ ల్యాండ్ ని కంపెనీ ల్యాండ్ గా చూపిద్దామని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఇక అందరం భోజనం చేద్దాం పదండి అని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. నిజంగానే తీసుకున్నావా ల్యాండ్ అని పారిజాతం అడుగుతుంది. అదేం లేదు నాకు కొన్ని ఆస్తులు ఉండాలి కదా అని అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నానని జ్యోత్స్న అంటుంది. అప్పుడే దీప, కార్తీక్ వస్తారు మీరెందుకు వచ్చారని పారిజాతం అంటుంది. భోజనానికి పిల్వడానికి అని దీప అంటుంది. మరొక వైపు శ్రీధర్ వాళ్ళు భోజనం చేస్తుంటారు. వీళ్ళకి అసలు సిగ్గు లేదని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. భోజనం చేసాక శ్రీధర్ వెళ్లిపోతూ.. బావ నాకొక హెల్ప్ చెయ్యాలి. మీ చెల్లిని నన్ను నువ్వు కలపాలని దశరథ్ తో అంటాడు. అది పారిజాతం వింటుంది. కొంచెం అయినా సిగ్గుండాలి అల్లుడు అని పారిజాతం అంటుంది. అందరు అప్పుడే వస్తారు. మా నాన్న ఏం చేసాడని ఆలా అంటున్నావని కార్తీక్ అంటాడు. ఇద్దరు పెళ్ళాలు కావాలంట అని పారిజాతం అంటుంది. దాంతో పారిజాతంపై శివన్నారాయణ కోప్పడతాడు. నువ్వు కావేరీని వదిలేయ్.. అప్పుడు నేనే దగ్గర ఉండి కలుపుతానని పారిజాతం అంటుంది. ఇక ఆ తర్వాత కాంచనని నేనే బ్రతిమిలాడుకుంటానని శ్రీధర్ వెళ్ళిపోతాడు. దీప గ్లాస్ తీసుకొని వెళ్తుంటే జ్యోత్స్న కాలు అడ్డుపెడుతుంది. దాంతో దీప పడిపోతుంటే సుమిత్ర పట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : మోసపోయిన ఆనందరావు.. నగలు శ్రీవల్లి దగ్గరే ఉన్నాయన్న ప్రేమ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -328 లో.. నగలు ప్రేమనే తీసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తను పోలీస్ అవ్వాలని అనుకుంటుంది కదా.. ఆ ఖర్చులకి వాళ్ళు ఉపయోగించి ఉంటారని శ్రీవల్లి అంటుంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అక్క.. నా నగలు నేను తీసుకోవడం ఏంటని ప్రేమ తనపై కోప్పడుతుంది. ఆ తర్వాత మీరు ఆపండి.. వల్లి మాటలు పక్కన పెట్టండి.. ఆ నగలు మీ దగ్గర ఉన్నాయా అని ప్రేమ, ధీరజ్ లని రామరాజు అడుగుతాడు.  మాకు తెలియదని వాళ్లు చెప్తారు. ఇప్పుడు ఈ నగల బాధ్యత మీదే.. ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు కానీ నగలన్నీ తీసుకొని రావాలని రామరాజు వాళ్ళకి చెప్తాడు. ఆ తర్వాత ఈ నగల వాళ్ళ ప్రశాంతత అనేది లేదు.. ఎందుకంటే మొదటి నుండి దీని గురించే గొడవ అని ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు. అసలు నువ్వు వెళ్ళిన చోటుకి నేను వచ్చి ఉండకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదని ధీరజ్ అంటాడు. ఎన్నిసార్లు అంటావ్ రా అని ప్రేమ బాధపడుతుంది. ఇప్పుడు మనకి ఎక్కువ టైమ్ లేదు.. ముందు నగలు వెతకాలని ప్రేమ అంటుంది. మరొకవైపు ఆనందరావు, భాగ్యం ని ఒప్పించి ఒక దగ్గర డబ్బు ఇస్తాడు. సాయంత్రానికి రెట్టింపు ఇస్తానని చెప్పి మోసం చేస్తాడు. దాంతో భాగ్యం ఎక్కడ తిడుతుందోనని ఆనందరావు భయపడుతాడు. మరొకవైపు అసలు నగలు ఎలా మాయమైయ్యాయని నర్మద, ప్రేమ ఆలోచిస్తారు. ఈ నగలు ఖచ్చితంగా వల్లి అక్క తీసింది అక్క.. ఎందుకు అంటే తిరుపతి బాబాయ్ నగలు తీసుకొని వెళ్లి వచ్చేవరకు టెన్షన్ పడుతూ గేట్ దగ్గరే ఉంది. వచ్చాక వాళ్ళు నగలు ఓపెన్ చేసి చూసారా అని అడిగిందని ప్రేమ అనగానే అయితే వెళ్లి తన రూమ్ లో చెక్ చేద్దామని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Yawar Misbehaved with Tanuja: బిగ్ బాస్ హౌస్‌లో తనూజతో మిస్ బిహేవ్ చేసిన యావర్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడం, వారితో హౌస్ లోని కంటెస్టెంట్స్ ని టాస్క్ లు ఆడుతుంటే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో సోహెల్, యావర్ ఎంట్రీ ఇచ్చారు. సీజన్-4 కంటెస్టెంట్ సోహెల్, సీజన్-7 కంటెస్టెంట్ యావర్. అయితే ఆ సీజన్ లో రతికరోజ్ తో యావర్ లవ్ ట్రాక్ నడపాలని చూశాడు కానీ అప్పటికే తను కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ తో లవ్ లో ఉండటంతో సైలైంట్ అయిపోయాడు.  ఇక నిన్నటి ఎపిసోడ్ లో యావర్ హౌస్ లోకి వచ్చీ రాగానే అందరిని నవ్వుతూ పలకరించాడు. హౌస్‌లో ఎవరూ చేయలేని పనిని యావర్ చేశాడు. అదేంటంటే తనూజతో పులిహోర. మామూలుగా కాదు.. తను చేసిన పనికి తనూజ అయితే ఇబ్బంది పడింది. హౌస్ లోకి రాగానే తనూజ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు. తను లేడని చెప్పడంతో మనోడు చెలరేగిపోయాడు. మోకాళ్ళ మీద కూర్చొని మరీ ప్రపోజ్ చేయడంతో తనూజకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఆ తర్వాత తనని ఎత్తుకొని గిరగిరా తిప్పేశాడు. తనూజని యావర్ ఎత్తుకొని తిప్పుతున్నప్పుడు తను అన్ కంఫర్టెబుల్ గా ఫీల్ అయింది. అదంతా చూస్తూ కళ్యాణ్ మొహం మాడిపోయింది.ఇక ఆ తర్వాత ఎక్కువ స్ట్రెస్ తీసుకోకురా మొత్తం ఊడిపోతుందని ఇమ్మాన్యుయల్ తో యావర్ అనగా.. స్ట్రెస్ గురించి నువ్వు చెప్తున్నావా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. ఇక ఆ తర్వాత ఇమ్మాన్యుయల్, యావర్  మధ్య కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరిగింది. ఇందులో యావర్ పై ఇమ్మాన్యుయల్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో నిలిచాడు. 

Nagarjuna Warns Sanjana: నాగార్జున మాట లెక్కచెయ్యని సంజన.. ఈ వీకెండ్ వార్నింగ్ తప్పేలా లేదుగా!

బిగ్ బాస్ సీజన్-9 లో సంజన కంటెంట్ క్రియేటర్ గా ముద్ర వేసుకుంది. హౌస్ లో ఇప్పటివరకు చేయని విధంగా దొంగగా ముద్ర తెచ్చుకున్న కంటెస్టెంట్ సంజన అనడంలో ఆశ్చర్యం లేదు. మొదటి వీక్ నే హౌస్ లో గుడ్లు దొంగతనం చేసి హౌస్ ఫోకస్ మొత్తం తనపై తిప్పుకుంది సంజన. చూసే ఆడియన్స్ కి సైతం గేమ్ చేంజర్ సంజన అనిపించింది. కానీ అలా ప్రతీసారీ దొంగతనాలు చేస్తూ ఉండడంతో హౌస్ మేట్స్ కి చిరాకు వచ్చింది. నాగార్జున మొదట్లో కామెడీగా తీసుకున్నా ఆ తర్వాత దొంగతనాలు చెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చాడు. వినకపోయేసరికి  దొంగలున్నారు జాగ్రత్త అని రాసి ఉన్న బోర్డ్ సంజన మెడలో వేశారు. నువ్వు జోక్ అనుకుంటున్నది అన్నివేళలా అందరికి జోక్ కాకపోవచ్చని నాగార్జున ఒక వీకెండ్ లో చెప్పాడు. ఫ్యామిలీ వీక్ లో ఇంకా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు మీరు దొంగతనం చేసినప్పుడు చాలా ఫన్ గా ఉండేదని చెప్పడంతో మళ్ళీ హౌస్ లో దొంగతనం మొదలుపెట్టింది సంజన. నిన్నటి ఎపిసోడ్ లో భరణికి సంబంధించిన టాబ్లెట్స్ అన్నీ దాచేసింది.. ఎవరు తీశారని కెప్టెన్ అయిన రీతూ అందరిని అడుగుతుంది. ఎవరిని అడిగినా ఎవరు తియ్యలేదని అంటారు. సంజన గారు మీరు తీసేటప్పుడు తనూజ చూసిందంట ప్లీజ్ ఇవ్వండి అని రీతూ అనగానే నాకు తెలియదని సంజన అంటుంది. ఇక రాత్రి కాగానే భరణి దగ్గరికి సంజన వెళ్ళి మాట్లాడుతుంది. నేనే తీసాను టాబ్లెట్స్.. మీతో మాట్లాడాలని అని సంజన అనగానే.. రేపు మాట్లాడుదామని భరణి అంటాడు. మరుసటిరోజు భరణి దగ్గరికి సంజన వచ్చి.. నేను ఏదో ఫన్ క్రియేట్ చేయాలని చేసాను కానీ ఇమ్మాన్యుయల్, దివ్య మొత్తం స్పాయిల్ చేశారని సంజన అంటుంది. దివ్య వచ్చి ఏడ్చింది టాబ్లెట్స్ ఇవ్వండి అని అందుకే ఇచ్చేసానని సంజన చెప్తుంది. ఈ వీకెండ్ లో నాగార్జున సంజన విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.

Bigg Boss 9 Telugu: కెప్టెన్సీ కంటెండర్స్ గా రీతూ, సంజన.. ‌సోహెల్ ని ఓడించారుగా!

బిగ్ బాస్ సీజన్-9 లో గత వారం ఫ్యామిలీ వీక్ సాగగా.. ఈ వారం కెప్టెన్సీ కోసం టాస్క్ లని భిన్నంగా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. సీజన్-4 లో సోహెల్ అంటే తెలియని వాళ్ళుండరు.. పాతిలక్షల సూట్ కేస్ తీసుకొనివచ్చిన తొలి కంటెస్టెంట్ గా సోహెల్ రికార్డు సృష్టించారు.  డీజే టిల్లు సాంగ్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోహెల్ ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ తో సరదాగా ఉన్నాడు.  ఏంటి మీకు ఆరు వారాలా దాకా చికెన్ పెట్టలేదంట.. నాన్ వెజ్ లేకుండా ఎలా ఉన్నారూ.. నాకు అర్థం కాదూ.. నేనైతే దూకి వెళ్లిపోయేవాడ్ని.. బిగ్ బాస్ మాట్లాడు బిగ్ బాస్.. మాట్లాడూ.. నా ఇజ్జత్ పోతుందని సొహెల్ అన్నాడు. అయినా బిగ్ బాస్ మాట్లాడలేదు.. కాసేపటికి సొహెల్ ఎలా ఉన్నావంటూ బిగ్ బాస్ అడుగగా.‌. హా సూపర్ బిగ్ బాస్ అని సోహెల్ అన్నాడు. సోహెల్ అంటే కథ వేరుంటందని అని అనగా.. అయితే రెండు పాల ప్యాకెట్లు, కాఫీ పౌడర్, రెండు కేజీల చికెన్ పంపించమని రీతూ, ఇమ్మాన్యుయల్ అడుగుతారు. ఇక కెమెరాల ముందుకి వెళ్ళి సోహెల్ రిక్వెస్ట్ చేశాడు. ఇది నా ఇజ్జత్‌కే సవాల్.. మీకు దండం పెడతాను.. వీళ్లకి రెండు పాల ప్యాకెట్లు.. చికెన్.. కాఫీ పౌడర్ పంపించండి అని మెల్లిగా రిక్వెస్ట్ చేశాడు. వాడి బాడీ లాంగ్వేజ్ ఒకటీ.. అడిగేది మరొకటి అని భరణి అన్నాడు. ఇక కాసేపటికి బిగ్ బాస్ చికెన్, కాఫీ పొడి, పాలప్యాకెట్ల బొమ్మల్ని పంపించాడు. అవి చూసి అందరు నవ్వుకున్నారు కాసేపటికి కాఫీ పౌడర్, పాల ప్యాకెట్లు, చికెన్ నిజంగానే బిగ్ బాస్ పంపించాడు. ఇక కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో నిల్చునేందుకు సోహెల్ తో సంజన, రీతు పోటీ పడ్డారు. ఇందులో సోహెల్ ఓడిపోయాడు. సంజన, రీతూ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. మరి వీరిలో ఎవరు ఇంటి కెప్టెన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu Shobha shetty : హౌస్ లోకి శోభాశెట్టి.. కెప్టెన్సీ రేస్‌లో నిలిచిన కంటెస్టెంట్స్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడంతో ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది. హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా ఎక్స్ కంటెస్టెంట్స్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దానితో పాటు కెప్టెన్సీ కోసం టాస్క్ లతో ప్రతీ ఎపిసోడ్ ఫుల్ ప్యాక్ అవుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సోహెల్ రాగా అతడితో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చింది. ఇక సోహెల్ తో రీతూ, సంజన పోటీపడి గెలిచి కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. ఇప్పటివరకు భరణి, తనూజ, సుమన్ శెట్టి కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకోగా కళ్యాణ్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయల్, రీతూ, సంజన కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. అయితే యావర్ వర్సెస్ ఇమ్మాన్యుయల్ జరిగిన టాస్క్ హోరాహోరీగా సాగింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సోహెల్ తో రీతూ చౌదరి, సంజన పోటీపడ్డారు. సోహెల్ ఓడిపోవడంతో రీతూ , సంజన కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు‌. ఇక తర్వాత శోభా శెట్టి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాసేపు ఇమ్మాన్యుయల్ తో మాట్లాడింది. ఇక ఆ తర్వాత దివ్యతో కెప్టెన్సీ రేస్ లో పాల్గొంది శోభాశెట్టి. ఇందులో దివ్య ఈజీగా గెలిచింది.  ఇక ఇప్పటివరకు జరిగిన అన్ని టాస్క్ లలో అందరు కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. ఇక వీరిలో సుమన్ శెట్టి, భరణి, తనూజ కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకోగా.. దివ్య, సంజన, రీతూ, ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్, కళ్యాణ్ మొత్తం ఆరుగురు కెప్టెన్సీ రేస్ లో నిలిచారు. మరి వీరిలో కెప్టెన్ అయ్యేదెవరు. 

Telugu Tv Serials TRP: టీఆర్పీలో కార్తీక దీపం-2 నెంబర్ వన్.. రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు!

తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కి అత్యధిక టీఅర్పీలు వస్తుంటాయి. రూరల్ అండ్ అర్బన్ లో ఎక్కడ చూసిన ఈ సీరియల్స్ సత్తా చాటుతున్నాయి. మరి ఈ వారం దేనికి అత్యధిక టీఆర్పీ వచ్చిందో ఓసారి చూసేద్దాం.  రూరల్ , అర్బన్ లో 16.16 టీఆర్పీ తో కార్తీక దీపం-2 నెంబర్ వన్ స్థానంలో ఉంది.  15.15 టీఆర్పీతో ఇల్లు ఇల్లాలు పిల్లలు రెండో స్థానంలో ఉండగా, 13.84 టీఆర్పీ తో ఇంటింటి రామాయణం నాల్గవ స్థానంలో ఉంది. ఇక గుండె నిండా గుడిగంటలు 13. 16 తో అయిదో స్థానంలో ఉంది. ఇక మద్యాహ్నం ప్రసారమయ్యే సీరియల్స్ లో బ్రహ్మముడి టాప్ లో ఉంది. మధ్యాహ్నం టైమ్ స్లాట్ సీరియల్స్ లో అత్యధికంగా 6.10 టీఆర్పీ తో బ్రహ్మముడి నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత 5.71 టీఆర్పీతో నిన్ను కోరి ఉంది. పలుకే బంగారమాయే సీరియల్ కి 5.38 టీఆర్పీ వస్తోంది.  ఇక ఈ వారం ఓవరాల్ గా సీరియల్స్ అన్నింటిలో కార్తీక దీపం-2 సీరియల్ సూపర్ సీరియల్ గా నిలిచింది. ఎందుకంటే కార్తీక దీపం-2 లో.. తాజా ఎపిసోడ్ లలో అన్నీ పాజిటివ్ అంశాలే జరిగాయి. దీప ప్రెగ్నెంట్ కావడం.. శివన్నారాయణ ఫ్యామిలీ దీపని అక్కున చేర్చుకోవడం.. కొత్త ఎండీగా శ్రీధర్ ఎన్నికవ్వడం.. ఇవన్నీ ఈ సీరియల్ కి ప్రధాన బలంగా నిలిచాయి. అయితే ఇవన్నీ చూసి చాలామంది ఈ సీరియల్ త్వరలో ముగుస్తుందని అంటున్నారు కానీ ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఎందుకంటే దీప ప్రెగ్నెంట్ అనే విషయాన్ని జ్యోత్స్న తీసుకోలేకపోతుంది. మరోవైపు దాస్ జ్యోత్స్నని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దానితో పాటుగా శివన్నారాయణకి స్వామి రానున్న ఆపద గురించి చెప్పాడు. అంటే ఇంటివారసులు దీప అనే విషయం శివన్నారాయణ, సుమిత్ర, దశరథ్ లకి తెలుస్తుందేమో.. దాంతో దీపని చంపడానికి జ్యోత్స్న  ఏం అయినా ప్లాన్ చేస్తుందేమో.‌. ఈ రకంగా సాగితే ఇంకో రెండు సంవత్సరాల దాకా కార్తీక దీపం-2 సీరియల్ కి డోకా లేదు. ఆ తర్వాత ఇల్లు ఇల్లాలు.. ముగ్గురు కోడల్లు.. ఎదురింట్లోనే శత్రువులు ఉండటం రామరాజు సీరియల్ కి హైప్ ఇస్తోంది. ఇక ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో కోడలు, కొడుకు ఇచ్చే ట్విస్ట్ లతో ఇంటి పెద్ద రామరాజుకి దిమ్మతిరిగి బొమ్మ కనపడుతుంది. అయితే ఎప్పుడైనా కంటెంట్ లేకుంటే రామరాజు, వేదవతిల మధ్య రొమాంటిక్ యాంగిల్ ని కూడా చూపిస్తున్నాడు దర్శకుడు. అందుకే ఈ సీరియల్ కి క్రేజ్ పెరుగుతుంది. స్టార్ మా సీరియల్స్ లో మీ ఫెవరెట్ సీరియల్ ఏంటో కామెంట్ చేయండి.

Jayam serial : గంగ రిసెప్షన్ కి లక్ష్మీ వస్తుందా.. బ్యూటిషియన్ ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -126 లో....పెద్దసారు బయటకు వెళ్తాడు. అటుగా వెళ్తున్న లక్ష్మి, పెద్దసారుని చూసి తన దగ్గరికి వస్తుంది.  ఎవరికి చెప్పకుండా రుద్ర బాబు గంగని పెళ్లి చేసుకున్నాడని మీరు కోపంగా ఉన్నారా అని అడుగుతుంది. అదేం లేదు రేపు గంగ, రుద్రకి రిసెప్షన్ చేస్తున్నాం.. మీరు తప్పకుండా రండి అని చెప్తాడు. మరొకవైపు గంగ రిసెప్షన్ అన్న సంగతి మర్చిపోయి మంచిగా పడుకుంటుంది. అప్పుడే ప్రీతి, స్నేహ, ప్రమీల వచ్చి నిద్ర లేపుతారు. ఈ రోజు నీ రిసెప్షన్ మర్చిపోయావా అని అంటారు. అప్పుడే శకుంతల వస్తుంటే.. గమనించి ఇంకా గంగ రెడి అవలేదని తిడుతుందని తనకి గంగ కనిపించకుండా కవర్ చేస్తారు. ఆ గంగ వల్ల ఇంటి పరువు పోకూడదు మంచిగా రెడీ చేసి తీసుకొని రండి అని శకుంతల కోపంగా చెప్పి వెళ్తుంది. దాంతో స్నేహ బ్యూటీషియన్ ని రప్పిస్తుంది. మరొకవైపు రుద్ర రెడీ అవుతుంటే ఇషిక, వీరు వస్తారు. సారీ బావ నువ్వు గంగని పెళ్లి చేసుకుంటే ఆపొజిట్ చేసానని ఏదో ప్లాన్ ప్రకారం మాట్లాడతాడు. ఆ టాపిక్ వద్దని రుద్ర చిరాకుపడుతాడు. మరోవైపు లక్ష్మీ రిసెప్షన్ కి వెళ్లడానికి రెడీ అవుతుంది. అప్పుడే పైడిరాజు వస్తాడు. తనని చూసి.‌ సారీ అండి నేను వేరే వాళ్ళ ఇంటికి వచ్చానని అంటాడు. నేనే అని లక్ష్మీ అంటుంది. రుద్ర, గంగలకి రిసెప్షన్ చేస్తున్నారట మనం ఖచ్చితంగా వెళదామని రిక్వెస్ట్ చేస్తుంది. మరొకవైపు గంగని రెడీ చెయ్యడానికి ఏ చీర సెట్ అవ్వదు. ఆ తర్వాత బ్యూటిషియన్ ఇషిక దగ్గరికి వచ్చి పెళ్లి కూతురు ఎక్కడ అని అడుగుగా.. అక్కడా ఉందని ఇషిక చెప్తుంది. తను గంగ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత అందరు గెస్ట్ లు వచ్చారు. ఇంకా గంగ, రుద్ర రాలేదని పెద్దసారు అంటాడు‌. అప్పుడే రుద్ర, గంగ ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.