Jayam serial : గంగకి భాద్యతలు అప్పగించిన పెద్దసారు.. ఇషిక జెలసీ!

      జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -135 లో...... గంగ సూపర్ మార్కెట్ కి వెళ్లి తన ఐడియాని షేర్ చేస్తుంది. దాంతో అందరు  ఇంప్రెస్ అవుతారు. పెద్దసారు ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళతో అదే చెప్తాడు. గంగని సూపర్ మార్కెట్ కి ఓనర్ ని చెయ్యాలని చెప్తాడు. కోడలిగా ఇష్టం లేదంటే బిజినెస్ అప్పగిస్తాను అంటారేంటి అని శకుంతల కోప్పడుతుంది.   ఎక్కడ తనకి బాధ్యతలు అప్పగిస్తారోనని ఇషిక జెలస్ గా ఫీల్ అవుతుంది. అయినా తనకి బాక్సింగ్ కెరీర్ ఉంది కదా మళ్ళీ ఇది ఎందుకని అంటుంది. గంగ మల్టీ ట్యాలెంటెడ్. నువ్వు ఈ ఇంటి కోడలిగా ఎలా బిజినెస్ చూసుకుంటున్నావో తను కూడా చూసుకోవాలని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ఇందుమతి తన భర్త ఏదో ఫంక్షన్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటుంటే అప్పుడే శకుంతల వచ్చి ఏమైందని అడుగుతుంది. నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుకి పెళ్లి అయింది తన కోడలిని అందరికి పరిచయం చెయ్యాలని ఫంక్షన్ ఏర్పాటు చేసిందని ఇందుమతి చెప్తుంది.     అలా కూడా చెస్తారా అని వంశీ అడుగుతాడు. చేస్తారు.. కొత్తకోడలిని అందరికి పరిచయం చేస్తారు. కోడలు మేలిముసుగులో ఉంటుంది. తన భార్యకి భర్త బాధ్యతలు అప్పగిస్తాడని ప్రమీల అంటుంది. గంగకి ఎందుకు చెయ్యాలేదు గంగకి కూడా చెయ్యాలని పెద్దసారు అంటాడు.     నాకు పారు కోడలిగా వస్తే అన్ని చేసేదాన్ని అని శకుంతల అంటుంది. ఇప్పుడు గంగకి కూడా చెయ్యాలి.. ప్రీతీ వెళ్లి గంగని రెడీ చెయ్యండి అని పెద్దసారు పంపిస్తాడు. శకుంతల కోపంగా వెళ్తుంది. అత్తయ్యకి ఇష్టం లేదని ప్రమీల అనగానే తనతో ఎలా చేయించాలో నాకు తెలుసని పెద్దసారు అంటాడు. గంగ వదినలాగే ఉండొచ్చు కదా ఇషిక.. బాధ్యతలు తీసుకున్నావ్.. నువ్వు కూడా నాతో బాగా ఉండొచ్చు కదా అని సూర్య అనగానే నాకు కంపేరిజన్ వద్దని ఇషిక అంటుంది.     అమ్మ ప్రమీల కాఫీ నాతో పాటు సూర్యకి కూడా అని పెద్దసారు అంటాడు. మరొకవైపు గంగని ప్రీతీ వాళ్ళు రెడీ చేస్తారు. నువ్వు ఇప్పుడే అన్నయ్య మొహం చూడకూడదని వాళ్ళు చెప్తారు. ఒకరికొకరు చూసుకోకుండా వంశీ, సూర్య రూమ్ బయట కాపలా ఉంటారు. అప్పుడే రుద్ర వచ్చి మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. అయితే వాళ్ళు అసలు విషయం చెప్తారు. గంగకి రుద్ర ఏం బాధ్యతలు అప్పగించాడో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.      

Rithu Chowdary Press Meet :డీమాన్ పవన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రీతూ చౌదరి! 

రీతూ ఎలిమినేషన్ అయి బయటకొచ్చాక మీడియాతో ముచ్చటించింది. హౌస్ లో డీమాన్ తో మీ లవ్ ట్రాక్ కి గల కారణాలు ఏంటని మీడియా వాళ్లు అడుగగా.. మాది ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్ బాండ్ అంతే. మన స్కూల్, కాలేజీలలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అలాగే వాడితోను ఉన్నానని రీతూ అంది. మీ ఇద్దరి మధ్య మొదలైన ఈ ప్రేమ పెళ్ళి వరకు వెళ్తుందా అని అడుగగా.. అదేం లేదు.. వాడితో నేను హౌస్ లో కంఫర్ట్ గా ఉన్నాను. మా అమ్మ హౌస్ లోకి వచ్చినప్పుడు తనతో దూరంగా ఉండు అని అలా ఏం చెప్పలేదు.. బాగా ఆడుతున్నావనే చెప్పింది. గేమ్ మీద ఫోకస్ చేయమని చెప్పిందని అంది. మరి డీమాన్ తో ఎందుకు అంత క్లోజ్ గా ఉన్నారని అడుగగా.. సపోర్ట్ లేకుండా హౌస్ లో ఎవరు ఆడలేరు.. వాడి గేమ్ వాడు ఆడాడు.. నా గేమ్ నేను ఆడాను.. కానీ కొంతమంది దీనిని ఎలవేట్ చేశారు.  మరి సంజన మీ గురించి అలా‌ మాట్లాడింది కదా.. మీరేమంటారని అడుగగా.. తను అలా మాట్లాడటం నాకు నెగెటివ్ అయిందని నేను అనుకోవడం లేదు. హౌస్ లో వంద కెమెరాలు ఉన్నాయి.. అన్నింటిలో కనపడుతుంది కదా.. నేనైతే నా లిమిట్స్ లోనే ఉన్నానని రీతూ కవర్ చేసింది. లవ్ ట్రాక్ పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండొచ్చని ఇలా చేశారా అని అడుగగా.. అదేం లేదు.. హౌస్ లోకి వెళ్ళాక ప్రతీ ఒక్కరు ఎవరో ఒకరితో కనెక్ట్ అవుతారు. నాకు డీమాన్ కనెక్ట్ అయ్యాడు. అతనితో కంఫర్ట్ ఉన్నాను‌. ఆ కంఫర్ట్ జోన్ ఫ్రెండ్ షిప్ తో చూసేవాళ్ళకే తెలుస్తుందని రీతూ అంది. డీమాన్ పవన్ టాప్-5 లో ఉంటాడా అని అడుగగా.. అవును ఉంటాడు.. నిన్నటి వరకు నేను హౌస్ లో ఉండాలనే ఆడాను. మొదటి రోజు నుండి నేను బయట ఎలాగ ఉన్నానో అలాగే ఉన్నాను.. కళ్యాణ్ తో క్లోజ్ గా ఉన్నాను.. కానీ దాన్ని ఎవరు అంతగా పట్టించుకోలేదు.. డీమాన్ తో ఉన్నదే ఎలివేట్ చేసి చెప్తున్నారు. డీమాన్ పవన్ టాప్-5 లో ఉండాలి.. అతనే విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నానని రీతూ అంది.

ఆది ఎప్పుడూ ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తూనే ఉంటాడు!

  శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ, ఆది కాంబినేషన్ లో వచ్చే పంచులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకరి మీద ఒకరు పోటాపోటీగా వేసుకుంటారు. ఆ విషయాన్నే ఇంద్రజ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది.    "శ్రీదేవి డ్రామా కంపెనీలో టామ్ అండ్ జెర్రీలా ఉంటాం నేను, ఆది. మా మీద పంచులు వేస్తే మేము తీసుకోవాలంట కానీ మేము ఒక్క పంచ్ వేసినా ఆయన తీసుకోడు. మళ్ళీ రివర్స్ లో పంచ్ వేయాల్సిందే అది ఎలా ఉంటుంది అంటే చెత్తగా ఉంటుంది. ఎంత చెత్తగా ఉంటుంది అంటే ఈయన ఇగోకి పోతున్నాడు ఈయన మీద పంచులు వేస్తే తీసుకోలేకపోతున్నాడని ఓపెన్ గా తెలిసిపోతుంది. ఎప్పుడూ అమ్మాయిల మీద పడి ఏడుస్తూనే ఉంటాడు. వాళ్లకు ముడతలు ఉన్నాయి, వయసైపోయింది, మొగుడిని కాల్చుకు తింటారు అంటూ ఉంటాడు. నేను ఒక్కటే చెప్తాను ఇది పదేళ్ల ఓల్డ్ జోక్ అంటాను.    నిజం చెప్పాలంటే ఆయన వర్క్ హాలిక్. వచ్చిన దగ్గర నుంచి వెళ్లిపోయేవరకు ఎలా పని చేయాలనేదే ఆలోచిస్తారు. ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఎలాంటి సపోర్ట్ లేకుండా టాలెంట్ తో మాత్రమే ఎదిగిన వ్యక్తుల్లో ఆది కూడా ఒకరు. ఏదైనా ఈవెంట్ వస్తే అది ఆయన చేయలేకపోతే వేరే వాళ్లకు దాన్ని ఇవ్వడం.. అలా ఒకవేళ తాను వెళ్లే ఈవెంట్ లో తనతో పాటు వీళ్ళు వస్తారు అంటూ మిగితావాళ్లను కూడా తీసుకెళ్లడం వంటివి చేస్తూ ఉంటారు. ఎవరికైనా సాయం అనగానే చిన్న చిన్న హెల్ప్స్ చేస్తూ ఉంటారు. అందుకే అందరూ గౌరవించే స్థాయిలో ఉన్నారు." అని ఆది గురించి చెప్పుకొచ్చింది ఇంద్రజ.  

సుధీర్ టాప్ స్టార్ కావాలి.. నాకు పుట్టకపోయిన నా కొడుకే...

  సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) అంటే ఇంద్రజ(Indraja)కు చెప్పలేనంత ఇష్టం. సాఫ్ట్‌వేర్ సుధీర్ మూవీలో సుధీర్ కి మదర్ రోల్ చేశారు ఇంద్రజ. అప్పటి నుంచి ఒక తల్లీకొడుకుల అలా కంటిన్యూ అవుతూ వచ్చారు. ఐతే సుధీర్ గురించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.    "అమ్మ అంటే అమ్మ. అంతే. ఆ ఒక్క మాటకు ఫిక్స్ ఐపోయి నన్ను అలాగే చూసుకుంటాడు. నాతో అంత ప్రేమగా అలాగే ఉంటాడు. సుధీర్ చేరుకోవాల్సిన ఆ ఒక్క పొజిషన్ కి ఇంకా ఎందుకు చేరుకోలేదా అన్న ఒక్క బాధ ఉంది నాకు. శ్రీదేవి డ్రామా కంపెనీ తర్వాత ఇద్దరం కలిసి వర్క్ చేయలేదు. ఐనా కానీ ఇప్పటికీ అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. ఆయన మాట తీరు, ప్రవర్తించే విధానం, రెస్పెక్ట్ అవన్నీ చూసాక నాకు పుట్టకపోయిన నా కొడుకు అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఈ బంధం దేవుడిచ్చిన బంధం." అని చెప్పారు ఇంద్రజ.    "సుధీర్ హోస్ట్ గా చేసేటప్పుడు మీరు జడ్జ్ చేసేవారు.. అమ్మ కొడుకుల బాండింగ్ చాలా బాగుండేది.. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం అని.. ఇప్పటికీ నేను సుధీర్ ని అదే విషయం అడుగుతూ ఉంటాను." అని హోస్ట్ వర్ష అనేసరికి.. "ఇప్పుడు దీనికి నేను ఆన్సర్ చెప్తే రష్మీ నా పీక కొరికేస్తుంది. ఎందుకంటే రష్మీ కూడా నాకు చాలా క్లోజ్. ఆ అమ్మాయి కూడా వర్క్ హాలిక్, చాలా ఎమోషనల్ పర్సన్. ఆ ఆమ్మాయి లాంటి మనసు ఎవరి దగ్గర చూడలేదు. సుధీర్, రష్మీతో బాండింగ్ నాకు ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ బాండింగ్ చాలా ఎక్కువ. సుధీర్ యాంకరింగ్ ఇష్టం కానీ యాంకర్ గా ఇష్టపడను. అతన్ని నేను హీరోగానే చూడాలనుకుంటాను. టాప్ స్టార్ గా నిలదొక్కుకోవాలి" అని చెప్పారు ఇంద్రజ.  

అమ్మ కనిపిస్తే సారీ చెప్తాను.. అమ్మానాన్నల చివరి రోజుల్లో ముద్దుచేయండి!

  ఇంద్రజ ఒకప్పటి యంగ్ హీరోయిన్ నుంచి ఇప్పటి జబర్దస్త్ జడ్జ్ వరకు ఆమె ప్రయాణం ప్రతీ ఒక్కరూ చూసారు. అలాంటి ఇంద్రజ వాళ్ళ అమ్మ విషయంలో అనుకున్న పని చేయలేదు అని బాధపడ్డారు. ఆ విషయాన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. (Indraja)   "వడప్పళని మురుగన్ టెంపుల్ అని ఉంది మా ఇంటికి దగ్గరలోనే. నడిస్తే పది నిమిషాలు. అమ్మ ఎన్నో సార్లు తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని అడిగింది. రెండు రోజుల్లో తీసుకెళ్తాను, మూడు రోజుల్లో తీసుకెళ్తాను అంటూ నేను వాయిదా వేసేదాన్ని. ఆమె అడిగిన టు వీక్స్ టైములో అమ్మ హెల్త్ బాగా డామేజ్ అయ్యింది.  నేను చూసినప్పటి నుంచి అమ్మకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉండేవి. అలా హాస్పిటల్ కి ఇంటికి తీసుకెళ్లి తీసుకురావడమే సరిపోయేది. ఒక రోజు తెల్లవారుజామున నాకు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. త్వరగా రమ్మని. కాసేపట్లోనే అమ్మ చనిపోయింది. మా అమ్మ ఏది అడిగినా నేను చేసి పెట్టాను. కానీ ఇది మాత్రం తీర్చలేకపోయాను.  ఇప్పటికీ అర్ధరాత్రి మెలకువ వస్తే అదే విషయం నాకు గుర్తొచ్చి చాలా గిల్టీగా ఫీలవుతూ ఉంటాను. ఆ ఫీలింగ్ అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుసు. చేయాల్సిన పని చేయలేకపోతే చేయాలని ఇప్పుడు అనుకున్నా ఆ మనిషి ఉండనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.  అమ్మ గనక మళ్ళీ నాకు కనిపిస్తే అమ్మా సారీ అని చెప్తాను. గట్టిగా అమ్మను హగ్ చేసుకోవాలనుంది. అమ్మ ఐసీయూలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరినీ లోపలి రానివ్వలేదు. తులసి తీర్థం రెండు స్పూన్ లు ఇవ్వడానికి కూడా డాక్టర్స్ ఒప్పుకోలేదు.  మీ అమ్మానాన్నలు చివరి రోజుల్లోకి వస్తే గనక వాళ్ళను ముద్దు చేయండి. కౌగిలించుకోండి, ముద్దులు పెట్టండి, మంచినీళ్లు తాగించండి, ఏమన్నా తినాలనుకుంటే తినిపించండి.. కూర్చుని రెండు మాటలైనా మాటలాడండి. ఇవన్నీ చేసి వాళ్ళను ప్రశాంతంగా పంపించండి. మన చుట్టూ భర్త, భార్య, పిల్లలు, చుట్టాలు ఉన్నా కూడా అమ్మా నాన్న లేకపోతే మనం అనాధలమే. ఒకవేళ నాకు దేవుడు కనిపిస్తే ఇది కలియుగం కదా ఇలాంటి యుగంలో కూడా మంచి మనుషులు ఉన్నారు కదా వాళ్ళను చల్లగా చూడమని కోరుకుంటాను" అని చెప్పారు ఇంద్రజ.  

Bigg Boss Telugu 9: సీజన్-9 ట్రోఫీకి అర్హులు ఎవరంటే..?

  బిగ్ బాస్ సీజన్-9 పదమూడో వారం ముగింపుకి వచ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో రీతూ, భరణిల మధ్య ఇష్యూని సాల్వ్ చేశాడు నాగార్జున. ఆ తర్వాత హౌస్ లో ఎవరు ట్రోఫీకి అర్హులు అని మీరు అనుకుంటున్నారో చెప్పమంటూ కంటెస్టెంట్స్ ని అడిగాడు నాగార్జున.   లివింగ్ రూమ్ లో ఒక ట్రోఫీ ఉంది. అది తీసుకొని వాళ్ళకే ఆ ట్రోఫీ అర్హత ఉంది.. ఎందుకు ఉందని చెప్పాలని నాగార్జున ప్రతీ ఒక్క కంటెస్టెంట్ ని చెప్పమని నాగార్జున అన్నాడు.    ఇక ఇమ్మాన్యుయేల్ వచ్చి.. ఎలాగైనా జనాలని నవ్వించాలి.. అదే నా కప్పు.. ఆ భారం నాకు ఉంది. అప్పటికప్పుడే తిట్టుకుంటాం.. అప్పటికప్పుడే గొడవలు పడతాం.. ఈ సిచువేషన్స్ అన్నీ చూసుకుంటూ కూడా ప్రతీరోజు ఎంటర్ టైన్ చేస్తున్నాను.. ఇది నాకు ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. ఆ సంకల్పంతోనే అడుగుపెట్టాను అని ఇమ్మాన్యుయేల్ చెప్పగానే హౌస్ మేట్స్ అంతా థమ్స్ అప్ పెట్టారు.    ఆ తర్వాత భరణి వచ్చి.. నా గేమ్ అంతా మార్చుకున్నాను.. నాకు ఎవరైతే స్ట్రాంగ్ అని అనుకున్నానో అతడిని కూడా ఓడించాను.. తాజాగా డీమాన్ పవన్ ని టాస్క్ లో ఓడించానని భరణి చెప్పాడు. ఇక ఆరుగురు థమ్స్ అప్ ఇవ్వగా.. రీతూ, డీమాన్ పవన్ మాత్రం థమ్స్ డౌన్ ఇచ్చారు.    మా ఇంటికి ఎవరైనా వస్తే ఎలా ఉంటానో అలాగే ఉన్నాను.. ‌నా ఇల్లు అనుకునే ఉన్నాను. ఏ గేమ్ అయినా ఏ టాస్క్ పెట్టినా నా వంద శాతం ఎఫర్ట్స్ పెట్టాను.. ఎప్పుడు కూడా అది మార్చుకోలేదని డీమాన్ పవన్ చెప్పాడు. ఇక నలుగురు థమ్స్ అప్ ఇవ్వగా ముగ్గురు థమ్స్ డౌన్ ఇచ్చారు.    ఇక ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి మాట్లాడాడు. నాకు తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు. నాకు తెలియక ఏం అయినా జరిగి ఉండొచ్చు.. కానీ‌ నేను జెన్యూన్ గా ఆడుతూ వచ్చానని కళ్యాణ్ చెప్పగానే హౌస్ మేట్స్ అంతా థమ్స్ అప్ ఇచ్చారు.    ఇక తనూజ వచ్చి చెప్పింది. గర్ల్ టైటిల్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ‌ఐ డిజర్వ్ దిజ్ అని‌ తనూజ అనగా.. అందరు థమ్స్ అప్ ఇచ్చారు.    ఇక రీతూ వచ్చి.. ప్రతీ గేమ్ లో నేను నా ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. నేను ఎలాగైనా ఫైనల్ లో ఉండాలని ఆడుతూ వచ్చాను. అందుకు ఐ ఫీల్ దట్ .. ఐ డిజర్వ్ దిజ్ అని రీతూ అంది. ఇక తనకి ముగ్గురు థమ్స్ డౌన్ ఇవ్వగా నలుగురు థమ్స్ అప్ ఇచ్చారు.    ఒక్క సింగిల్ టైమ్ కుడా ట్రూత్ లేకుండా ఏమీ మాట్లాడలేదు.. ప్రతీ సిచువేషన్.. డే వన్ నుండి ఇప్పటిదాకా అలాగే ఉన్నాను.. ‌జెన్యూన్  గా ఉన్నానని సంజన చెప్పగానే నలుగురు థమ్స్ అప్ ఇచ్చారు. ‌నలుగురు థమ్స్ డౌన్ ఇచ్చారు. సుమన్ ఎందుకు అని నాగార్జున అడుగగా.. తను నాకు థమ్స్ డౌన్ ఇచ్చింది.. అందుకే అనగానే హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు.    మరి ఈ సీజన్-9 లో ఎవరు బాగా ఆడుతున్నారు.. ఎవరు  ట్రోఫీకి డిజర్వ్ అని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.  

Bigg Boss Tanuja: అందరి ముందు తనూజని ఇరికించేసిన నాగార్జున.. భరణికి అన్యాయం!

  బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం వీకెండ్ కి వచ్చేసింది. ఇక వచ్చీరాగానే డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ తో కాసేపు ఆడుకున్న నాగార్జున.. ఆ తర్వాత భరణి, తనూజలకి క్లాస్ పీకాడు.    భరణి, రీతూ, తనూజ మధ్య జరిగిన గొడవని మొదలెట్టాడు నాగార్జున. అందులో భాగంగా ముందుగా భరణిని లేపాడు. మ్యాథ్స్ స్టూడెంట్ భరణీ.. దేన్ని ట్రై యాంగిల్ అంటారో చెప్పమని అడిగాడు.    ఆ తరువాత ట్రై యాంగిల్ కాదని వాదించిన మొట్ట మొదటి సైంటిస్ట్ తనూజా.. లేమ్మా.. ట్రై యాంగిల్ అని దేన్ని అంటారని అడిగాడు. మూడు భుజాలు ఒకే విధంగా ఉండాలని బిగ్ బాస్ చెప్పారు.. అందుకే నేను అబ్జెక్షన్ చెప్పానని తనూజ చెప్పడంతో.. ట్రై యాంగిల్ అంటే ఒకే షేప్‌లో ఉంటుందా.. ఇన్ని వారాలు ఉండేసరికి నాకు ఇలాగే వినిపించింది.. అనిపించిందని అనిపిస్తుందిలే.. పోనీ నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం.. అన్నీ సమానంగా ఉండాలని. అప్పుడు భరణి పెట్టిన వాటిలో కూడా అన్నీ సమానంగా లేవు కదా అని నాగార్జున అడుగగా.. అది సైజ్ చిన్నగా ఉంది సర్.. బట్ భుజాలన్నీ సమానంగా ఉన్నాయని తనూజ చెప్పింది.    మనం గెలువాలనుకున్న వాళ్ల పక్కన నిలబడటంలో తప్పులేదు. కానీ ఒక వాదనకి దిగినప్పుడు అన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు అది ట్రై యాంగిల్ కాదంటావ్.. భరణి ఏకంగా.. బ్లూది ట్రై యాంగిల్ కాదు.. రెక్టాంగిల్ అంటాడు. మీ డౌట్ క్లారిఫై చేస్తానని నాగార్జున వివరిస్తాడు. ట్రయాంగిల్ లో ఎడ్జ్ తేడాగా ఉంది సర్ అని భరణి అనడంతో.. ఇది చెక్కినప్పుడు అలా కొంచెం బంప్ వచ్చింది.. నువ్వు పెట్టిన ట్రై యాంగిల్‌లో కూడా ఒకదానికి బంప్ ఉంది కదా.. కాబట్టి సంజనా సంచాలక్‌గా తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నాగార్జున చెప్పాడు.   అయితే ఆ తేడాగా ఉన్న ట్రయాంగిల్ ఎందుకు పెట్టినట్టు, రీతూ ఆ రింగ్ ఎందుకు దాచినట్టు.. ఇక్కడ నిజంగా భరణికి అన్యాయం  జరిగింది. మరి ఈ ఇష్యూలో ఎవరిది కరెక్ట్ అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.  

Rithu Chowdary Elimination: రీతూ ఎలిమినేషన్.. సుమన్ శెట్టి తాకిడికి మరో కంటెస్టెంట్ బలి!

  బిగ్ బాస్ సీజన్-9 లో మరో ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది.‌ అయితే పదమూడో వారం ఎలిమినేషన్ లో ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కి అన్యాయం జరుగనుంది. ఇది ఆడియన్స్ కి బిగ్ ట్విస్ట్.. అదేంటంటే ఈ వారం లీస్ట్ లో ఉన్న సంజన, సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడం లేదు.. వీరిద్దరి కన్నా స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్ రీతూ చౌదరి(Rithu Chowdary) ఎలిమినేట్ అవబోతుంది.   కథలో ట్విస్ట్ ఎలాగో ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ట్విస్ట్ అలా ఉంది. అదేంటంటే ఈ వారం హౌస్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. వారిలో తనూజ టాప్ లో ఉంది. భరణి, డీమాన్ పవన్, రీతూలకి స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది. అయితే సోషల్ మీడియా లెక్కల ప్రకారం.. సుమన్ శెట్టి, సంజన లీస్ట్ లో ఉన్నారు. వారిద్దరికి అసలు ఓటింగ్ లేదు. కానీ వారిద్దరిని పక్కన పెట్టి రీతూని ఎలిమినేషన్ చేసిన్నట్టుగా బయట ప్రచారం సాగుతోంది.    గత వారమే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి దివ్యని ఎలిమినేషన్ చేసినప్పుడే బిగ్ బాస్ బయాస్డ్ అని ట్రోల్స్ చేశారు. ఇక ఇప్పుడు లీస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ అయినటువంటి సంజన, సుమన్ శెట్టిని ఎలిమినేషన్ చేయకుండా రీతూ చౌదరిని ఎలిమినేషన్ చేయడం అన్ ఫెయిర్ అంటున్నారు నెటిజన్లు.   హౌస్ లో పదమూడు వారాలుగా సుమన్ శెట్టి, సంజన ఆడిందేమీ లేదు.. అలాగని ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిందేమీ లేదు.. అయినా వాళ్ళు హౌస్ లో ఉంటున్నారంటే బిగ్ బాస్ సపోర్ట్ వల్లే. దీనివల్ల హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతోందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.    మరి రీతూ ఎలిమినేషన్ అనేది ఫెయిర్ ఆర్ అన్ ఫెయిర్ కామెంట్ చేయండి.  

Jayam serial: వీరూతో గంగ చేసిన శపథం.. తను జాబ్ చేస్తుందా?

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -134 లో... వీరు, గంగ మాట్లాడుకుంటారు. నీ నిజస్వరూపం తెలిసిన రోజు అమ్మగారు నిన్ను బయటకు పంపేస్తారు.. నేనే ఈ ఇంటికి పర్మినెంట్ నిన్ను ఎప్పుడు బయటకు పంపించేది తెలియదని గంగ అంటుంది. నీకు భయం అంటే ఏంటో పరిచయం చేస్తానని వీరు అంటాడు.    అప్పుడే పెద్దసారు వచ్చి ఎవరిని పరిచయం చేస్తానంటున్నావని అడుగుతాడు. అత్తయ్యకు నీపై మంచి అభిప్రాయం కలగాలంటే తనకి నచ్చినట్టు ఉండు.. అందుకు తెలిసిన వాళ్ళని పరిచయం చేస్తానని అంటున్నానని వీరు కవర్ చేస్తాడు.    ఆ తర్వాత వీరు అక్కడ నుండి వెళ్ళిపోయాక.... నువ్వు ఇంట్లో ఉంటే మీ అత్తయ్య నిన్ను చూస్తూ కోప్పడుతుంది. అందుకే నువ్వు ఇంట్లో ఉండకని పెద్దసారు అనగానే గంగ టెన్షన్ పడుతుంది. అంటే ఏదైనా జాబ్ చెయ్ అని పెద్దసారు అనగానే హమ్మయ్య అలా అంటున్నారా అని గంగ రిలాక్స్ అవుతుంది.   ఆ తర్వాత గంగ సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. అక్కడ మక్కమ్ దగ్గర కి వెళ్తుంది. గంగని చూసి అతను క్యాజువల్ గా మాట్లాడుతాడు. రుద్ర సర్ భార్య కదా అని గుర్తుతెచ్చుకొని మేడమ్ అంటాడు. నన్ను మేడమ్ అంటున్నావ్.. నాకు జాబ్ కావాలని అంటాడు. మీకు జాబ్ ఏంటీ మీరే ఓనర్ కదా అని మక్కమ్ అంటాడు.    ఆ తర్వాత గంగ సూపర్ మార్కెట్ కి సంబంధించిన ఐడియా చెప్తుంది. అందరు తనని మెచ్చుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu: శ్రీవల్లి షాక్.. పోలీస్ డ్రెస్ లో ప్రేమ! 

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -335 లో... అక్క నువ్వు చదువుకున్నావ్ కదా జాబ్ చెయ్ అని శ్రీవల్లితో ప్రేమ అంటుంది. అత్తయ్య గారికి హెల్ప్ చెయ్యాలి కదా అందుకే జాబ్ చెయ్యడం లేదని శ్రీవల్లి బిల్డప్ ఇస్తుంది. అంటే నువ్వు హెల్ప్ చెయ్యకపోతే నేను పనులు చేసుకోలేనా.. నువ్వు వెళ్ళవే రేపటి నుండి జాబ్ కి అని వేదవతి అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది.    ఇక అందరు అంత చదువు ఎందుకు వేస్ట్ చేసుకుంటావని అంటారు. మీరందరు కాదు మావయ్య గారు ఒక్కమాట చెప్తే రేపే జాబ్ కి వెళ్తానని శ్రీవల్లి అనగానే.. అయితే వెళ్ళమ్మా నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు వద్దని అంటానని రామరాజు అంటాడు. దాంతో శ్రీవల్లికి దిమ్మ తిరుగుతుంది. అక్క మావయ్య ఒప్పుకున్నాడు కదా ఇక నువ్వు నీ సర్టిఫికెట్ తెచ్చుకో జాబ్ కి అప్లై చేద్దామని ప్రేమ అంటుంది.    ఆ తర్వాత సాగర్ వర్షంలో తడుస్తూ ఆలోచిస్తుంటాడు. నర్మద వచ్చి తనని లోపలికి తీసుకొని వెళ్తుంది. ఏమైంది అంతగా ఏం ఆలోచిస్తున్నావు.. నా గురించి అని తెలుసు నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నానని నర్మద అంటుంది. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని సాగర్ బాధపడతాడు. ఆ తర్వాత శ్రీవల్లి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్లి తిడుతుంది. మీరు చెప్పిన ప్రతీ అబద్ధం ఇప్పుడు నాకూ టార్చర్ గా ఉందని అంటుంది.   మరొకవైపు ప్రేమకి ధీరజ్ పోలీస్ డ్రెస్ తీసుకొని వస్తాడు. అప్లై చేసినంత మాత్రాన జాబ్ వచ్చినట్లు కాదని ప్రేమ అనగానే నీకు ఖచ్చితంగా వస్తుందని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ మురిసిపోతుంది. ప్రేమని డ్రెస్ వేసుకొని రమ్మని అనగానే ప్రేమ వస్తుంది. యూనిఫామ్ లో ప్రేమని చూసి ధీరజ్ ఫ్లాట్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

స్వప్న మనసు మార్చేసిన రాహుల్.. రాజ్, కావ్యలకి పొంచిఉన్న ప్రమాదం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -897 లో....... అప్పు పాప కేసు గురించి ఆలోచిస్తుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి అమ్మ నుండి తప్పించుకున్నాం కదా.. మళ్ళీ దేని గురించి ఆలోచిస్తున్నావని అడుగుతాడు. రేణుక గారి గురించి ఆవిడ సిచువేషన్ ఏంటో అర్థం కావడం లేదు.. చుట్టుపక్కల అందరు పాప లేదు అంటుంటే తను మాత్రమే ఉందని అంటుందని అప్పు అంటుంది. నువ్వు ధైర్యం గల పోలీస్ ఆఫీసర్ వి.. ఒక కేసుని డీల్ చెయ్యడంలో ఎలాంటి భయాలు, టెన్షన్ లు పడొద్దు.. కేసు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటకు వస్తుందో ఆలోచించమని కళ్యాణ్ అంటాడు.   మరొకవైపు రాజ్ నిద్రలేచి రెడీ అవుతూ కావ్యని లేపుతాడు. కానీ కావ్య ఆల్రెడీ రెడీ అయి పడుకుంటుంది. ఎప్పుడు రెడీ అయ్యావని రాజ్ షాక్ అవుతాడు. మీకంటే ముందు లేచి రెడీ అయ్యాను. ఇక్కడ బాబా గుడి ఉందట వెళ్లి వద్దామని కావ్య అనగానే రాజ్ సరే అంటాడు. మరొకవైపు రాజ్ కంపెనీ నుండి డిజైన్స్ తెప్పించి ఆ డిజైన్స్ గీయమని ఎంప్లాయికి చెప్తాడు రాహుల్. ఆ తర్వాత రాజ్, కావ్య గుడికి వెళ్తారు. అక్కడికి వీళ్ళ దగ్గరకి వచ్చి చనిపోయిన అతని బ్రదర్ వాళ్ళ దగ్గరికి వచ్చి.. మా తమ్ముడు డానీయల్ నిన్న మీ కార్ దగ్గరికి వచ్చి చనిపోయాడంట కదా.. వాడు ఏదైనా మీకు ఇచ్చాడా.. ఏమైనా చెప్పాడా అని అడుగుతుంది. నీకు ఏమైనా మెంటలా.. అసలు అతను ఎవరో కూడ తెలియదని రాజ్ అతనిపై కోప్పడతాడు. అదంతా రౌడీలు చూసి రాజ్ వాళ్ళు అతనికి పెన్ డ్రైవ్ ఇస్తున్నారేమోనని అనుకుంటారు. రాజ్, కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతారు. రౌడీ లు వాళ్లని ఫాలో అవుతూ వెళ్తారు.   మరొకవైపు తనే డిజైన్స్ సొంతగా చేపిస్తున్నాడని స్వప్నని నమ్మించాలని రాహుల్ తనని ఆఫీస్ కి రప్పిస్తాడు. స్వప్న క్యారేజ్ పట్టుకొని ఆఫీస్ కి వస్తుంది. ఈ డిజైన్స్ బాలేవుని రాహుల్ యాక్టింగ్ చేస్తుంటే.. బాగున్నాయ్ కదా అని స్వప్న అంటుంది. దాంతో స్వప్న మైండ్ లో ఆ డిజైన్స్ ని తనే డిజైన్ చేసాడని రాహుల్  క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దీప కోసం కార్తీక్ ఆ పని చేయగలడా.. పాపం జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -534 లో... నా మాట అంటే ఎవరికీ విలువ లేదు కార్తీక్ వాళ్ళ నాన్న వచ్చి నన్ను ఎలా ప్రశ్నించాడు. ఆ ఇంటికి పనికి వద్దన్న వినట్లేదు స్వార్థపరురాలివి అంటూ దీప పై కాంచన కోప్పడుతుంది. ఎవరిని ఏం అనట్లేదు నా బాధ చెప్తున్న అని కాంచన లోపలికి వెళ్తుంది ఎవరికీ ఏం సమాధానం చెప్పలేక పోతున్న అని కార్తీక్ లోపలికి వెళ్తాడు ఇప్పుడు చెప్పాలిసింది నేనే అని దీప ఏడుస్తుంది.   మరొకవైపు జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని ఇంత మంచి గుడ్ న్యూస్ ఇంత లేటుగా చెప్తావ్ ఏంటి అని దశరథ్ తో శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్నని పిలుస్తాడు. సుమిత్ర నువ్వు స్వీట్ తీసుకొని రా అని చెప్తాడు. నువ్వు పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని శివన్నారాయణ అంటాడు. ఇప్పుడు మీకు మీరు చేసే పనులకి అడ్డుగా ఉన్నానని పంపించాలని చూస్తున్నారు. ఆ దీపకి అన్ని మర్యాదలు చెయ్యడం అవసరమా అని జ్యోత్స్న ఇంట్లో వాళ్ళపై కోప్పడుతుంది. అది సంస్కారం లేని వాళ్లకు తెలియదని దశరథ్ కోప్పడతాడు.   ఆ తర్వాత జ్యోత్స్న చిన్నప్పటి బొమ్మలు చూస్తుంది సుమిత్ర. అప్పుడే దశరథ్ వస్తాడు . ఆ రోజు శౌర్యకి ఇవ్వగా ఇవి ఉన్నాయని బొమ్మలు చూపిస్తుంది. అవి దీపకి పుట్టబోయే బిడ్డకి అవుతాయని దశరథ్ అనగానే.. వద్దండి ఆ రోజు శౌర్యకి ఇస్తేనే జ్యోత్స్న ఎంత గొడవ చేసింది.. అమ్మనాన్నలుగా తన దృష్టిలో నెగెటివ్ అయ్యాం.. ఒక మంచి సంబంధం చూసి త్వరగా పెళ్లి చెయ్యాలని సుమిత్ర అంటుంది. మరొకవైపు నానమ్మ దగ్గర పడుకోమని శౌర్యతో కార్తీక్ చెప్తాడు. మీరు మారిపోయారు.. జో, గ్రానీ చెప్పినట్లే చేస్తున్నారని శౌర్య అనగానే.. ఏం చెప్పిందని కార్తీక్ అంటాడు. పారిజాతం చెప్పింది మొత్తం చెప్తుంది. అలా ఏం కాదు నిన్న అమ్మ కడుపుపై కాలితో తన్నావ్ అందుకేనని కార్తీక్, శౌర్యకి సర్ది చెప్తాడు కార్తీక్. అలా ఎవరి మాటలు వినొద్దని కార్తీక్ అనగానే శౌర్య సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

  చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు. సుమ ఏమో "మరిది నిజం చెప్పు" అంది. "నాకు అంత సీన్ లేదక్కా" అన్నాడు. నీకు షోల్డర్ లో బోన్ గ్రోత్ ఆ లేదంటే ఎవరైనా విరగ్గొట్టారా" అని అడిగేసింది. "లేదు లేదు మీకు తెలీదా వాళ్ళావిడ కొడితే వెళ్లి కుట్లు వేయించుకున్నాడు తెలీదా మీకు" అంటూ మానస్ నిజం చెప్పేసాడు. అమరదీప్ ఒక చేతికి బాగ్ వేసుకుని వచ్చాడు. "నీ స్టోరీ బానే ఉంది" అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు. సరే నీ స్టోరీ చెప్పు ఇప్పుడు అంటూ అఖిల్ ని అడిగింది సుమ. "ఫైవ్ ఇయర్స్ అయ్యింది బ్రేకప్ అయ్యి నాకు..కానీ ఇంకా ఆ బాధ తగ్గట్లేదు" అన్నాడు అఖిల్. "ఏంటి ఆ రియాలిటీ షో తర్వాత బ్రేకప్పేనా " అని అడిగింది. "రియాలిటీ షోకి ముందక్కా" అని కవర్ చేసాడు అఖిల్. వెంటనే సుమ అఖిల్ దగ్గరకు వెళ్లి "అఖిల్ నీ చెయ్యి చూపించు నాకు జాతకం కూడా చెప్పడం వచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది అన్నావుగా ఆ అమ్మాయి గుజరాతి అమ్మాయే కదా..నీ జాతకం ప్రకారం నీకు నెక్స్ట్ ఇయర్ కల్లా పెళ్ళైపోతుంది " అంది. "మోస్ట్లీ అనుకుంటున్నా" అన్నాడు. ఆ అమ్మాయి కచ్చితంగా మన స్టేట్ ఐతే కాదు. ఆ అమ్మాయి మన స్టేట్ కాకపోయినా మన పండుగలన్నీ చాలా ఇష్టం.. ఆ అమ్మాయి కూడా ఇండస్ట్రీ అమ్మాయే" అని చెప్పేసరికి "మన స్టేట్ కాదు. మన పండగలు చేస్తుంది కానీ మన ఇండస్ట్రీ అన్న విషయం నేను చెప్పలేను" అన్నాడు అఖిల్.

కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకున్న తనూజ.. ఎందుకింత సపోర్ట్?

  బిగ్ బాస్ సీజన్-9 ముగింపుకి వచ్చేసింది. ఈ వారం తర్వాత మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది.‌ ఇక నిన్నటి ఎపిసోడ్  లో కళ్యాణ్ పడాల గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ సీజన్-9 గా నిలిచాడు. అయితే కళ్యాణ్ గెలవడం వెనుక తనూజ సపోర్ట్ ఉందనేది ఎవరు కాదనలేని నిజం.  నిన్నటి ఎపిసోడ్ లో కళ్యాణ్, రీతూ, ఇమ్మాన్యుయేల్ గేమ్ ఆడారు. ఇందులో తనూజ తన సపోర్ట్ ని కళ్యాణ్ కి ఇచ్చింది. అయితే గేమ్ మొదలవ్వగానే వార్నింగ్ ఇచ్చిన్నట్టుగా ఓ స్టేట్ మెంట్ ని పాస్ చేసింది తనూజ. కళ్యాణ్​ని ఎవరు టార్గెట్ చేస్తారో నేను వాళ్లని టార్గెట్ చేస్తానని తనూన చెప్పింది. అయితే అప్పుడే కళ్యాణ్​ని డీమాన్ టార్గెట్ చేయడంతో రీతూని తనూజ టార్గెట్ చేసింది. అది గమనించిన రీతూ.. వద్దు డీమాన్ అంటు చెప్పింది. కానీ భరణి మరో ఎండ్ లో రీతూని టార్గెట్ చేయడంతో తను ఆ గేమ్ లో ఓడిపోయింది. దాంతో రీతూ ఎమోషనల్ అయింది. ఇద్దరూ కలిసి టార్గెట్ చేస్తున్నారు పవన్ అంటూ రీతూ ఏడ్చింది. అయితే కళ్యాణ్ కి తనూజ సపోర్ట్ వెనకాల ఓ పెద్ద ప్లాన్ అండ్ స్ట్రాటజీ ఉంది. అదేంటంటే.. ఫ్యామిలీ వీక్ తర్వాత హౌస్ మేట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ స్టేజ్ మీదకి వచ్చి టాప్-5 ఎవరో పెట్టారు. అందులో చాలామంది తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ పేర్లు చెప్పారు. ఇక వీరిద్దరిని మంచి చేసుకుంటే తనూజకి నెగెటివ్ గా ఉన్న ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇక గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో కళ్యాణ్ ఎఫర్ట్స్ చూసిన నెటిజన్లు తనకి ఫుల్ సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. ఇక ఫైనలిస్ట్ అవ్వగానే సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ పడాల ఓ మిలటరీ మ్యాన్ కాబట్టి ఆ రకంగా కూడా తనకి ప్లస్. అందుకే తనూజ అతనికి సపోర్ట్ చేసింది. అయితే ఇమ్మాన్యుయేల్, తనూజ, కళ్యాణ్ ముగ్గురు టాప్-5 లో కన్ఫమ్. ఎందుకంటే ఇప్పుడున్న వారిలో వీళ్ళే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఇక ఆ తర్వాత భరణి ఉంటాడు. ఇక అయిదో స్థానం ఇంకా కన్ఫమ్ అవ్వాల్సి ఉంది. ఈ వారం ఎలిమినేషన్ తర్వాత ఎవరెవరు టాప్-5 లో ఉంటారో తెలుస్తుంది. సోషల్ మీడియాలో తనూజ వర్సెస్‌ పవన్ కళ్యాణ్ పడాల ఫ్యాన్ వార్ జరుగుతోంది. వీళ్ళిద్దరిలో మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ చేయండి.

Dammu Srija: నీ రోత ఆపు అక్క.. దమ్ము శ్రీజకి తనూజ ఫ్యాన్ వార్నింగ్!

  బిగ్ బాస్ సీజన్-9 లో దమ్మున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది దమ్ము శ్రీజ.. బిగ్ బాస్ హౌస్ లో ఎవరైనా గొడవ కోసం ఏదైనా పాయింట్ తో వెళ్తారు. కానీ తనూజ మాత్రం గొంతుతో వెళ్తుంది. అంటే ప్రతీసారీ గట్టి గట్టిగా అరుస్తూ మీదకి వెళ్ళిపోతుంది. అసలు ఇప్పుడు శ్రీజ గురించి ప్రస్తావన ఎందుకంటే తనని ఓ నెటిజన్ దారుణంగా తిట్టాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. శ్రీజ కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి హౌస్ లో ఫైర్ బ్రాండ్ లా నిలిచింది. ఇక సడెన్ గా తను ఎలిమినేట్ అయ్యింది. అంటే ఆడియన్స్ ఓటింగ్ కాకుండా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నిర్ణయం వల్ల బయటకు వచ్చింది. ఇక హౌస్ లో నుండి ఎలిమినేట్ అయ్యాక తనకి విపరీతమైన పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది. ఎందుకంటే తనది నిజంగా అన్ ఫెయిర్ ఎలిమినేషన్. ఇక తనని రీఎంట్రీ చేపించాలని సోషల్ మీడియాలో ఫుల్ పోస్ట్ లు చేశారు నెటిజన్లు. ఇక రీఎంట్రీ ఇస్తుందనగా తనతో పాటు భరణిని కూడా తీసుకొచ్చాడు బిగ్ బాస్ మామ. ఇక ఇద్దరిలో పోటీపెట్టి భరణిని హౌస్ లో రీఎంట్రీ కన్ఫమ్ చేసి శ్రీజని బయటకి పంపించేశారు. ఇదిలా ఉండగా ఇప్పుడు సీజన్-9 తుదిదశకు చేరుకుంది. ఇందులో పవన్ కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయేల్ టాప్-3 జాబితాలో ఉన్నారు. అయితే సీజన్-9 విన్నర్ ఎవరనే బజ్ ఎక్కువగా కళ్యాణ్, తనూజల మధ్య సాగుతోంది. తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని తిడుతూ పోస్ట్ లు చేస్తున్నారు. ‌అయితే ఇది ఏ రేంజ్ లో ఉందంటే సీజన్-9 కంటెస్టెంట్స్ నే డైరెక్ట్ గా తిట్టేంత దాకా వచ్చేసింది. అదేంటంటే దమ్ము శ్రీజ తాజాగా కొన్ని ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కి చాలా షేర్లు, కామెంట్లు, లైక్స్ వచ్చాయి. అయితే ఇందులో ఓ కామెంట్ మాత్రం ఫుల్ వైరల్  అవుతోంది. అయితే ఆ కామెంట్ కి దమ్ము శ్రీజ రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. నీ రోత ఆపు అక్క.. తనూజ సపోర్ట్ లేనిదే కళ్యాణ్ టికెట్ టూ ఫినాలే గెలవలేదు.. కెప్టెన్ కూడా కాలేదు.. తనూజ సపోర్ట్ ఉండటం వల్లే ఈ రోజు టికెట్ టూ ఫినాలే గెలిచాడు.. మైండ్ ఇట్ అని ఓ కామెంట్ చేశాడు. ఇది తనూజ అభిమాని చేసిన కామెంట్ అని తెలుస్తోంది. కాబట్టి దీనికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది దమ్ము శ్రీజ. "ఇక్కడ ఎందుకు చెప్తున్నావ్ అది.. డబ్బులు వచ్చాయా ఇక్కడ కామెంట్ పెట్టమని" అని దమ్ము శ్రీజ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఇక దీనికి ఆ నెటిజన్ ఇంకా సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ పడాలకి దమ్ము శ్రీజ సపోర్ట్ చేస్తుంది కాబట్టి తనూజ ఫ్యాన్స్ అంతా ఇలాగే రియాక్ట్ అవుతారు.  

Bigg Boss 9 Telugu Voting 13th week: డేంజర్ జోన్ లో‌ సుమన్ శెట్టి.. సంజన ఎలిమినేషన్!

  బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం వీకెండ్ కి వచ్చేసింది. ఇక ఈ వారం టికెట్ టూ ఫినాలే కోసం టాస్క్ లు జరుగగా అందులో పవన్ కళ్యాణ్ పడాల(Pawan Kalyan) గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు.‌ ఇక ఈ వారం హౌస్ లో కెప్టెన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ మినహా మిగిలిన ఆరుగురు నామినేషన్లో ఉన్నారు. ఇక వీరిలో ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం. సోమవారం మొదలైన నామినేషన్ ప్రాసెస్.. నిన్నటి శుక్రవారం అర్థరాత్రితో ముగిసింది.‌ ఇక ఇందులో ఎవరు టాప్ లో ఉన్నారో, ఎవరు లీస్ట్ లో ఉన్నారో చూద్దాం. ఇక ఓటింగ్ లైన్స్ పూర్తయ్యేసరికి  తనూజ ఈజ్ అన్ టాప్. 28.56 శాతం ఓటింగ్ తో తనూజ ప్రథమ స్థానంలో నిలిచింది. 17.32 శాతం ఓటింగ్ తో రీతూ రెండో స్థానంలో ఉండగా, 16.13 శాతం ఓటింగ్ తో భరణి మూడో స్థానంలో ఉన్నాడు. ఇక 15.39  శాతం ఓటింగ్ తో డీమాన్ పవన్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. ఇక డేంజర్ జోన్ లో సుమన్ శెట్టి, సంజన గల్రానీ ఉన్నారు. పదకొండు శాతం ఓటింగ్ తో సుమన్ శెట్టి అయిదో స్థానంలో ఉండగా.. పది శాతం ఓటింగ్ తో సంజన గల్రానీ లీస్ట్ లో ఉంది. అంటే ఈ వారం ఎలిమినేషన్ వీరిద్దరిలోనే ఉండబోతుందన్నమాట. అయితే బిగ్ బాస్ మామ ట్విస్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సంజన, సుమన్ శెట్టి ఇద్దరికి బిగ్ బాస్ సపోర్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరికి సపోర్ట్ గా ఉంటే డీమాన్ పవన్ ఎలిమినేట్ అవుతాడు. లేదంటే సంజన ఎలిమినేషన్ కన్ఫమ్. ఈ వారం హౌస్ నుండి ఎలిమినేషన్ అయ్యేది ఎవరో కామెంట్ చేయండి.

First Finalist Kalyan Padala : బిగ్ బాస్ సీజన్-9 ఫస్ట్ ఫైనలిస్ట్ పవన్ కళ్యాణ్ పడాల!

  ఇది కదా కామన్ మ్యాన్ పవర్.. పవన్ కళ్యాణ్ పడాల మరోసారి ఋజువు చేసుకున్నాడు. కథ క్లైమాక్స్ కి వచ్చే కొద్ది కళ్యాణ్ విజయం వైపు అడుగులు వేస్తున్నాడు. మొదటి నాలుగు వారాలు అసలు హౌస్ లో పెద్దగా గుర్తింపు లేదు కానీ  ఆ తర్వాత నుండి ఫుల్ ఆడుతున్నాడు. పడిలేచిన కెరటంలా పవన్ కళ్యాడ్ పడాల ముందుకెళ్తున్నాడు. రమ్య మోక్ష, దువ్వాడ మాధురి వచ్చినప్పుడు కళ్యాణ్ గురించి తక్కువగా మాట్లాడిన పట్టించుకోలేదు.. ఎప్పుడు అయితే శ్రీజ రీఎంట్రీ ఇచ్చి తనకి అన్నీ చెప్పిందో .. అప్పటి నుండి తన ఆటతీరు మారింది. నిన్నటి ఎపిసోడ్ లో అతని ఆట చూస్తే ఎవరికైనా ఇదే నిజమనిపిస్తుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు సాగిన టికెట్ టు ఫినాలే రేస్ లో కళ్యాణ్ విజయం సాధించాడు. అసలు నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేద్దాం. మొదటగా రీతూ, భరణిల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత రీతూ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ లకి ఓ టాస్క్ ఇవ్వగా అందులో కళ్యాణ్ గెలుస్తాడు. ఇక అదే గేమ్ ని రీతూ, ఇమ్మాన్యుయేల్ ఆడతారు. అందులో రీతూ గెలుస్తుంది.  ఇక ఫైనల్ రేస్ రీతూ చౌదరి, పవన్ కళ్యాణ్ పడాల మధ్య జరిగింది. ఈ టాస్కులో గోనిసంచెలు తీసి విసరడం..  టన్నెల్ నుంచి పాకడం.. ఆ తర్వాత ఓ పైప్ మీద నుంచి నడవడం.. ఇవన్నీ దాటాక ఓ టన్నెల్ కి ఉన్న లాక్ తీసి అందులో నుండి బాల్స్ తీసుకొని తమకి కేటాయించిన బుట్టలో పడేయాలి. వీటి తర్వాత తమ ఫోటో ఉన్న పేపర్స్ ని సరైన క్రమంలో జతచేయాలి. అలా ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళే విజేత.‌ ఇక ఈ టాస్క్ పవన్ కళ్యాణ్ పడాలకి చాలా ఈజీ . ఎందుకంటే అతనికి మిలటరీ ట్రైనింగ్ లో ఇవే ఉంటాయి. ఇక ఈ గేమ్ లో సూపర్ ఫాస్ట్ గా వచ్చి టాస్క్ ముగిస్తాడు కళ్యాణ్. రీతూ ఓడిపోయి టికెట్ టూ ఫినాలే నుండి తప్పుకుంటుంది. కళ్యాణ్ విజేతగా నిలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ ది సీజన్-9 (First Finalist Of the Season 9 Telugu ) అవుతాడు. ఆ తర్వాత ఆ ఫైనలిస్ట్ ట్రోఫీ పట్టుకొని గాల్లోకి చూపిస్తాడు. కాసేపటికి బిగ్ బాస్ మామ సాంగ్ వేస్తాడు. హౌస్ మేట్స్ అంతా స్టెప్పులు వేస్తారు.

Bigg Boss 9 Telugu Immanuel: టికెట్ టూ ఫినాలే రేస్ నుండి ఇమ్మాన్యుయేల్ అవుట్.. ఏడ్చేసిన కళ్యాణ్!

  బిగ్ ట్విస్ట్.. ఎస్.. ఇది నిజంగా ఎవరూ ఊహించనిది.. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో రీతూ, ఇమ్మాన్యుయేల్ మధ్య పోటీ జరుగగా రీతూ గెలిచింది ఇమ్మాన్యుయేల్ ఓడిపోయాడు దీనికి కారణం కళ్యాణ్.. అదెలా అంటే.. అదే బిగ్ బాస్ మ్యాజిక్. నిన్నటి ఎపిసోడ్ లో ఏ‌ం జరిగిందో ఓసారి చూసేద్దాం. నిన్నటి ఎపిసోడ్ లో మొదటి టాస్క్.. కట్టు నిలబెట్టు. ఇందులో రీతూ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ పోటీపడ్డారు. ఇక వీళ్ళు ఆడే గేమ్ కు బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు‌. తమకి ఇచ్చిన బ్లాక్స్‌తో ఎత్తయిన టవర్‌ని నిర్మించి.. ఇంటి సభ్యులు విసిరే బాల్స్ నుంచి తమ టవర్‌ని బ్యాట్స్ సహాయంతో కూలకుండా కాపాడుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్‌కి సంజన సంఛాలక్. ఈ టాస్క్ లో తనూజ, భరణి ఇద్దరు రీతూని టార్గెట్ చేశారు. దాంతో అమర్ దీప్ గత సీజన్ లో ఎలా ఏడ్చాడో రీతూ అలా ఏడ్చింది. ఈ గేమ్ చూసిన ప్రతీ ఒక్కరికి రీతూని చూస్తే అమర్ దీప్ గుర్తొస్తాడు. ఇక ఈ టాస్క్ లో కళ్యాణ్ గెలిచాడు. అయితే బిగ్ బాస్ ఇక్కడ ఓ మెలిక పెట్టాడు.  ఇదే గేమ్ ని రెండు, మూడు స్థానాలలో నిలిచిన ఇమ్మాన్యుయేల్, రీతూలతో ఆడించాడు. ‌ఇక ఈ గేమ్ కి పోటీదారులకి ఇద్దరి సపోర్ట్ తీసుకోమన్నాడు. ఇక రీతూకి తనూజ, డీమాన్ పవన్ ఉండగా.. ఇమ్మాన్యుయేల్ కి కళ్యాణ్, భరణి ఉన్నారు. ఇక గేమ్ మొదలైంది. రీతూ, ఇమ్మాన్యుయేల్ ఇద్దరు టవర్స్ పేర్చారు. ఇక కళ్యాణ్ ఎంత ట్రై చేసినా రీతూ టవర్ ని కూల్చలేకపోతాడు కానీ తనూజ మాత్రం ఇమ్మాన్యుయేల్ టవర్ ని ట్వంటీ పర్సెంట్ కూల్చేస్తుంది. దాంతో రీతూ కంటే ఇమ్మాన్యుయేల్ టవర్ యొక్క ఫ్లోర్స్ తక్కువగా ఉంటాయి. ఇక ఇమ్మాన్యుయేల్ ఓడిపోయి టికెట్ టూ ఫినాలే రేస్ నుండి తప్పుకుంటాడు. రీతూ నెక్స్ట్ లెవెల్ కి  వెళ్తుంది‌. ఇక తనవల్ల ఇమ్మాన్యుయేల్ ఓడిపోయాడని కళ్యాణ్ వాష్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. ఇక అప్పుడే తనూజ వెళ్ళి చూస్తుంది. ఏంటి ఏడ్చావా అని తనూజ అడిగితే లేదని కళ్యాణ్ చెప్తాడు. ఇక ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ తో కూడా సారీ చెప్తూ ఏడ్చేస్తాడు కళ్యాణ్. 

Bigg Boss 9 Telugu: భరణి ఫుల్ ఫైర్.. వెక్కి వెక్కి ఏడ్చిన రీతూ!

  బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం క్లైమాక్స్ కి చేరుకుంది.‌ అంటే వీకెండ్ వచ్చేసింది. ‌ఈ వారం హౌస్ లో నుండి ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటీ ఓ వైపు ఉంటే టాప్-5 ఉంటారా టాప్-6 ఉంటారా అనే క్యూరియాసిటీ మరోవైపు ఉంది. నిన్నటి వరకు జరిగిన టికెట్ టూ ఫినాలే ఎట్టకేలకు ముగిసింది. కెప్టెన్ కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు.‌ నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓ సారి చూసేద్దాం.  రీతూ, భరణి మధ్య గొడవ ముదిరింది. ఇప్పటి వరకు సంఛాలక్ కి గౌరవం ఇచ్చి వదులుకున్నాను.. ఇక వదులుకోను.. రీతూ పెట్టింది ట్రయాంగిల్ కాదు.. నాలుగు భుజాలున్నాయంటూ భరణి రెచ్చిపోయాడు. అయితే సంజన అప్పటికే రీతూని విన్నర్ గా డిక్లేర్ చేసింది. ఇక తన పాయింట్ తో భరణి మళ్ళీ రింగ్ వేసి తన గేమ్ పూర్తిచేశాడు.  అయితే అదే సమయంలో రీతూ ఒక రింగ్ ని తన టీ షర్ట్ లో పెట్టుకుంది. ఇది ముమ్మాటికి తప్పే. గేమ్ లో నిజాయితీ లేకుంటే తను గెలిచినా అది ఓడినట్టే. అదే విషయం చెప్తూ భరణి ఫుల్ ఫైర్ అయ్యాడు. ఇక భరణి, రీతూ మధ్యలో సంఛాలక్ సంజన నలిగిపోయింది. ఎంతలా అంటే రీతూ కంటే ముందు భరణికి తన సపోర్ట్ కానీ అక్కడ ఫస్ట్ గేమ్ ఫినిష్ చేసింది రీతూ. ఇక భరణి తన పాయింట్ మీద కాన్ఫిడెంట్ ఉన్నాడు. రీతూ ఏడుస్తూ లోపలికి వెళ్లింది. బెడ్ పై కూర్చొని ప్రతీసారీ ఇలానే చేస్తారు. నేను గెలవడం ఎవరికీ ఇష్టముండదంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. భరణి అనే వాడు ఎప్పుడు సంఛాలక్ డెసిషన్ కి ఎదురుచెప్పలేదు.. ఈరోజు ఎదురుచెప్తున్నాను అంటే నా వైపు న్యాయం ఉందంటూ సంజన మీద భరణి ఫుల్ ఫైర్ అయ్యాడు. మరి వీకెండ్ లో నాగార్జున దీనిమీద పెద్ద డిబేట్ పెట్టేలా ఉన్నాడు.