Illu illalu pillalu : శ్రీవల్లి చేసిన పనికి తిరుపతికి శిక్ష.. ఒక్క ఛాన్స్ ఇచ్చారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -332 లో.... శ్రీవల్లి రిక్వెస్ట్ చెయ్యడంతో తిరుపతి నగలు తీసుకొని వచ్చి రామరాజుకి ఇస్తాడు. ఎక్కడ నుండి వచ్చాయి రా నగలు అని రామరాజు అడుగగా ఎక్కడ నుండి వస్తే ఏంటి బావ.. వచ్చాయి కదా తీసుకోండి అని తిరుపతి అనగానే అతని చెంప చెల్లుమనిపిస్తాడు రామరాజు. నిన్న అంత పెద్ద గొడవ అయిందని రామరాజు అంటాడు. ఈ నగలు నా దగ్గరున్నాయి బావ.. పుట్టింటి నగలు అంటే ప్రేమకి ఇష్టం కదా అని తన బాధపడకుండా ఉండడానికి నా దగ్గర ఉంచానని తిరుపతి అంటాడు. ఆ తర్వాత సేనాపతి వాళ్ళకి నగలు ఇవ్వడానికి తిరుపతి వెళ్తాడు. అక్కడ తిరుపతిని సేనాపతి కొడతాడు. నగలు నువ్వే దాచి ఇదంతా యాక్టింగ్ చేసావని రామరాజుని సేనాపతి తిడతాడు. అదేం లేదు.. ఈ నగలు నా దగ్గరే ఉన్నాయని తిరుపతి చెప్తాడు. ఆ తర్వాత నగలన్నీ ప్రేమకి ఇస్తుంది రేవతి. ఈ నగలన్నీ నీవి నీకే అధికారం ఉందని చెప్పి తన చేతిలో పెట్టి వెళ్తుంది. ఆ తర్వాత ఇదంతా జరగడానికి కారణం నువ్వే అని మా ఇంట్లో అడుగుపెట్టకని తిరుపతిని రామరాజు తిడుతాడు. మరొకవైపు శ్రీవల్లి దగ్గరికి ప్రేమ, నర్మద వస్తారు. నువ్వు ఇంత చేసినా ఎందుకు వదిలేసామో తెలుసా.. ఒక్క ఛాన్స్ ఇద్దామని ఇకనైనా మారకపోతే నీ గురించి అందరికి చెప్పేస్తామని వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అలాంటి కోరికలు చంపుకుని టీవీలో వచ్చాకే చూడండి

  ఈమధ్య కొన్ని సైట్స్ లో కొత్త కొత్త మూవీస్ ని పోస్ట్ చేయడం జనాలు వాటిని చూడడం మనం చూస్తూనే ఉన్నాం. ఐ-బొమ్మ అందులో టాప్. ఐతే ఇప్పుడు ఆ సైట్ నడిపే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాని మీద కామెంట్స్ చేసింది శ్రీవాణి ఒక ఇంటర్వ్యూలో. "ఐ-బొమ్మ రవి అని నువ్వు విన్నావా..దాని మీద నీ ఒపీనియన్ ఏంటి..రీసెంట్ గా అతన్ని అరెస్ట్ చేశారు " అని వర్ష అడిగేసరికి "నాకు తెలీదు. నేను ఐ-బొమ్మలో సినిమాలు చూడను. థియేటర్ కి వెళ్లి పాప్-కార్న్ తింటూ చక్కగా సినిమా చూస్తాం. నిజానికి అలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సినిమా ఎంతోమంది కష్టం కదా. వాళ్ళు ఏళ్ల తరబడి కథ ఆలోచించుకుని ఆ స్క్రిప్ట్ రాసుకుని డైరెక్టర్స్ ని వెతుక్కుని షూటింగ్ లొకేషన్స్ లో పగలనక, రాత్రనక కష్టపడి నటిస్తారు. అంత కష్టపడి చేసిన ఒక మూవీని సింపుల్ గా తీసుకెళ్లి ఒక లింక్ లో పెట్టడం అనేది తప్పు దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. అయ్యో మేము చూడలేకపోతున్నాం అనుకుంటే టీవీ అంటూ మన ఇంట్లో ఉంటుంది కదా అందులో వచ్చినప్పుడు చూడండి. అలాంటి కోరికలు చంపుకోండి. మూవీస్ ని లింక్స్ లో పెట్టడం వలన ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు నష్టపోయి ఎందుకు ఇదంతా. ఉన్నవాళ్లు ఫామిలీతో సరదాగా బయటకు వెళ్ళండి థియేటర్ కి వెళ్ళండి చూడండి. మిగతావాళ్ళు ఆ లింకులను ఎంకరేజ్ చేయకండి. మేము చూడలేకపోతున్నాం అని అనకండి టీవీలో సీరియల్స్ చూడండి ఎందుకంటే మా సీరియల్స్ టీవీలో ఫ్రీగా వస్తాయి నెలకు 200 కడితే. మా ఛానెల్స్ చూడండి. రెండు మూడు నెలలు ఆగితే ఆ సినిమాలే టీవీలో వేస్తారు. అంతే కానీ ఈ చెత్త లింక్ ని క్లిక్ చేసి సినిమాలు చూడకండి అందులో ఎంతోమంది కష్టం ఉంది కదా" అంటూ చెప్పుకొచ్చింది.  

Bigg Boss 9 Telugu TRP : బిగ్ బాస్ సీజన్-9 టీఆర్పీ గోవింద.. ఆ సీరియల్ వల్లేనా!

  బిగ్ బాస్ సీజన్-9 పన్నెండు వారాలు పూర్తయింది. పదమూడో వారం టికెట్ టు ఫినాలే టాస్క్ లు సాగుతున్నాయి. హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా వారిలో ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇక వీరిలో తనూజ టాప్ లో ఉండగా సుమన్ శెట్టి, డీమాన్ పవన్ డేంజర్ జోన్ లో ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు టీఆర్పీ గత ఎనిమిది సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ ఎక్కువగా ఉంది.  దువ్వాడ మాధురి, పచ్చళ్ళ పాప రమ్య మోక్ష రావడంతో టీఆర్పీ అమాంతం పెరిగింది. ఇక సుమన్ శెట్టి, పవన్ కళ్యాణ్ పడాల మిలటరీ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి మరింతగా ఆడియన్స్ కి దగ్గరైంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ సగటుగా 8.4 TVR ఉంటే వీకెండ్లో 13.4 TVR నమోదవుతుందట. ఇలా ఇప్పటివరకు మొత్తం సీజన్ లో 11.2 TVR వచ్చినట్టు తెలుస్తోంది. ఇది తెలుగు టెలివిజన్ చరిత్రలోనే రికార్డు. వాస్తవానికి రియాలిటీ షోలలో సాధారణంగా మధ్య సీజన్లో TRP పడిపోతుంటుంది. కానీ, ఈసారి సీజన్ 9 ఫ్యామిలీ వీక్ టర్నింగ్ పాయింట్ గా మారింది. బిగ్ బాస్ సీజన్-9 రేటింగ్ ఫ్యామిలీ వీక్ నుండి పెరుగుతూ వస్తోంది. అయితే బిగ్ బాస్ సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మొదలవుతుంది. ఇక ఈ నెల ఎనిమిది (డిసెంబర్ 8) నుండి ఈ టైమ్ స్లాట్ లో కొత్త సీరియల్ రాబోతుంది.  స్టార్ మా టీవీలో  గత కొన్ని వారాలుగా 'పొదరిల్లు' అనే సీరియల్ ప్రోమోని రిపీట్ గా కాదు.. రీ..రీపీట్ గా వేస్తున్నారు. మరి ఈ సీరియల్ ని బిగ్ బాస్ టైమ్ స్లాట్ లో వేస్తే.. బిగ్ బాస్ ని పదిగంటలకి టెలికాస్ట్ చేస్తారన్నమాట. అంటే బిగ్ బాస్ పూర్తయ్యేసరికి పదకొండు అవుతుంది. అసలే చలికాలం.. తొమ్మిదిన్నరకి మొదలవుతేనే ఇంత టీఆర్పీ వస్తుంది. అదే పదింటికి మొదలవుతే టీఆర్పీ అమాంతం పడిపోతుంది. ఇప్పటికే ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గిందని ఆడియన్స్ భావిస్తుంటే ఇలా టైమ్ స్లాట్ కూడా మారిస్తే బిగ్ బాస్ సీజన్-9 టీఆర్పీ ఢమాల్ అవుతుందనేది వాస్తవం. మరి బిబి టీమ్ ఈ విషయంలో ఏం అయినా ఆలోచిస్తారా లేక అదే టైమ్ కి పొదరిల్లు అనే సీరియల్ ని టెలికాస్ట్ చేస్తారా చూడాలి మరి.  

Bigg Boss 9 Telugu 13th week Voting : పదమూడో వారం డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. లీస్ట్ లో సుమన్ శెట్టి!

  బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకు చేరుకుంది. కంటెస్టెంట్స్ ఎవరి ఊహలకి అందకుండా తమ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. పదమూడో వారం ఇమ్మాన్యుయేల్, పవన్ కళ్యాణ్ పడాల  మినహా మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. మరి వారిలో ఎవరికి ఎంత ఓటింగ్ ఉందో ఓసారి చూసేద్దాం. ఎప్పటిలాగే ముప్పై శాతం ఓటింగ్ తో తనూజ టాప్ లో ఉంది. రీతూ చౌదరి 15.25 శాతంతో రెండో స్థానంలో ఉంది.  15.19 శాతం ఓటింగ్ తో సంజన గల్రానీ మూడో స్థానంలో ఉంది‌. 13.85 శాతం ఓటింగ్ తో భరణి నాల్గవ స్థానంలో ఉన్నాడు. ఇక డీమాన్ పవన్, సుమన్ శెట్టి ఇద్దరు 12 శాతం ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉన్నారు. అన్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడు. కానీ ఇప్పటి వరకు సుమన్ శెట్టికి బిగ్ బాస్ ఫుల్ సపోర్ట్ ఉంది. పన్నెండు వారాలు హౌస్ లో ఏ గేమ్ ఆడకపోయినా, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వకపోయినా తనని హౌస్ లో ఉంచుతూ వచ్చాడు బిగ్ బాస్. అయితే సుమన్ శెట్టి హౌస్ లో ఉండటం వల్ల స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి డీమాన్ పవన్ కి అన్యాయం జరుగుతుంది.  ప్రతీసారీ టాస్క్ లో బెస్ట్ ఇచ్చే కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుంది. ‌ఎందుకంటే హౌస్ లో ఎంత పర్ఫామెన్స్ ఇచ్చినా ఓటింగ్ లో సుమవ్ శెట్డి ఉంటే మెజారిటీ ఓటింగ్ అతడికే పడుతోంది. దాంతో మిగిలిన కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పెద్దగా పడటం లేదు. ఎవరూ ఊహించని విధంగా ఈ వారం భరణికి మెరుగైన ఓటింగ్ పడుతోంది. ఎప్పటిలాగే దత్తపుత్రిక తనూజ టాప్ లో ఉంది. నామినేషన్లో ఉన్నవారిలో మీ ఓట్ ఎవరికో కామెంట్ చేయండి.  

Bigg Boss 9 Telugu Tanuja : డీమాన్ ని రెచ్చగొట్టి‌ ఓడిపోయేలా చేసిన తనూజ.. గ్రూప్ గేమ్ ఆడారు కదా! 

బిగ్ బాస్ సీజన్-9 లో‌ పదమూడో వారం కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ ల పర్వం మొదలైంది. అయితే ఈ టాస్క్ లు కెప్టెన్సీ కోసం కాదు.. ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం.. అదే టికెట్ టూ ఫినాలే. దీనికోసం నిన్నటి నుండి హౌస్ లో టాస్క్ లు‌ మొదలయ్యాయి. ఇందులో భాగంగా మొదటి టాస్క్ లో రీతూ, ఇమ్మాన్యుయేల్, పవన్ కళ్యాణ్ పడాల పాల్గొన్నారు.‌ ఇందులో ఇమ్మాన్యుయేల్ గెలిచి తన పక్కనున్న చదరంగంలోని రెండు గడులని సొంతం చేసుకున్నాడు.  ఆ తర్వాత సంజనతో జరిగిన బాల్స్ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ గెలిచి చదరంగంలో తన పక్కనున్న సంజన గడిని సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత టాస్క్ ఆడటానికి తనూజ, డీమాన్ పవన్, భరణి వచ్చారు. వీళ్ళకి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ 'నాటు నాటు'. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న భిన్నమైన కలర్ ఫ్లవర్స్‌ని సేకరించి మట్టిలో నాటాలని బిగ్ బాస్ చెప్పాడు. అయితే నాటిన మొక్కలని ప్రత్యర్థి నుండి కాపాడుకోవాలి.. అలా చివరి వరకు ఎవరి మొక్కలు ఎక్కువగా ఉంటాయో వారే విజేత అని బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. ఇక ఈ టాస్కుకి కెప్టెన్ కళ్యాణ్ సంఛాలక్ గా ఉన్నాడు. టాస్కు మొదలుకాగానే ముగ్గురూ తమ కలర్ ఫ్లవర్స్‌ని తీసి మడ్ లో పెట్టారు. ఇక గేమ్ మొదలైంది. భరణి, తనూజ ఒక్కటైపోయి డీమాన్ ఫ్లవర్స్‌పై ఎటాక్ చేయడం మొదలెట్టారు.  అది చూసిన డీమాన్ కూడా ఇద్దరిని రెండు చేతులతో ఆపేసి గ్రౌండ్‌లో కిందపడేశాడు. ఇక డీమాన్ ఎటాక్ తట్టుకోలే తోస్తావెందుకురా ఊరికే అంటూ డీమాన్ ని రెచ్చగొట్టింది. అడ్డొస్తే ఏం చేస్తాం..‌ఇది గేమ్ అని డీమాన్ అనగా ఫిజికల్ అవ్వమనలేదు.. మొక్కలు కాపాడుకోమన్నారని తనూజ ఇంకా రెచ్చగొట్టింది. డీమాన్ ని మళ్ళీ మళ్ళీ రెచ్చగొడుతూనే ఉంది. కానీ డీమాన్ ఒక్కడు ఒకవైపు.. భరణి, తనూజ ఇద్దరు మరోవైపు అన్నట్టుగా టాస్క్ సాగింది. తనూజ ఫ్లవర్స్ ని ఒక్కసారి కూడా భరణి తీసేయ్యలేదు.‌ కానీ డీమాన్ పెట్టినవి తీసేసాడు.‌అలాగే భరణి ఫ్లవర్స్ ని తనూజ‌ తీసేయలేదు కానీ డీమాన్ పెట్టిమ ఫ్లవర్స్ ని తనూజ తీసేసింది. ఇదే కదా సపోర్ట్ గేమ్. ఇక ఈ టాస్క్ లో తనూజ గెలిచింది. టికెట్ టూ ఫినాలే రేస్ లో నిలిచింది. ‌అయితే తర్వాతి టాస్క్ లో‌ గెలిస్తేనే తనూజకి ఛాన్స్ లేదంటే అవుట్.  ఈ టాస్క్ లో‌  ఎవరిది తప్పు.. ఎవరిది కరెక్ట్.. భరణి, తనూజ ఇద్దరు కలిసి డీమాన్ ని ఓడించారా లేదా కామెంట్ చేయండి.  

Immanuel Foul Game: ఇమ్మాన్యుయేల్ ఫౌల్ గేమ్.. పాపం సంజనకి అన్యాయం!

  బిగ్ బాస్ సీజన్-9 లో మొదటి ఫైనలిస్ట్ కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటగా బుద్ధిబలం ఉన్న టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. అందులో రీతూ, పవన్ కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్ పాల్గొన్నారు. ఇమ్మాన్యుయేల్ గెలిచి చదరంగంలోని తన పక్కనున్న రెండు గడులని సొంతం చేసుకొని తన గడిని విస్తరించుకున్నాడు.  తర్వాతి టాస్క్ నువ్వు ఎవరితో ఆడాలని అనుకుంటన్నావని ఇమ్మాన్యుయేల్ ని బిగ్ బాస్ అడుగగా సంజన పేరుని చెప్పాడు ఇమ్మాన్యుయేల్. ఇక సంజన, ఇమ్మాన్యుయేల్ కి 'పంతం నీదా నాదా' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా సీసాకి ఉన్న తాడుని లాగి అవతలి వైపు ఉన్న బాక్స్ పైకి వచ్చేలా చేయాలి ఆ తర్వాత చుట్టూ ఉన్న బాల్స్‌ని తీసుకొని అవతలి వైపు ఉన్న బాక్స్‌లోకి విసరాలి. ఇలా టాస్క్ ముగిసే సమయానికి ఎవరు తమ అవతలి వైపు ఉన్న బాక్స్‌లో ఎక్కువ బాల్స్ ఉండేలా చూసుకుంటారో వారు ఈ టాస్కులో గెలుస్తారని బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ టాస్క్ మధ్యలో రోప్‌ని వదలడానికి వీల్లేదంటూ బిగ్‌బాస్ రూల్ చెప్పాడు. ఇక సంజన చివరి వరకు టఫ్ ఫైట్ ఇచ్చింది. ఒకానొక స్టేజ్ లో సంజన గెలుస్తుందేమోనని అనుకున్నారంతా కానీ తను బాల్స్ తీసుకోనే టైమ్ లో రోప్ ని వదిలేసింది. అది చూసిన సంఛాలక్ మీరు రోప్ ని వదలేశారు.. అవుట్ అని చెప్పడంతో తను తప్పుకుంది. దాంతో ఇమ్మాన్యుయేల్ ని విజేతగా ప్రకటించారు సంఛాలక్. అయితే టైమ్ ఫ్రేమ్ 31.54 దగ్గర ఇమ్మాన్యుయేల్ తన చేతిలోని రోప్ ని వదిలేసి రెండు చేతుల్తో బాల్స్ తీసుకున్నాడు.‌ ఇది సంఛాలక్ తో పాటు ఎవరు గమనించలేదు. దాంతో సంజనకి అన్యాయం జరిగింది. మరి వీకెండ్ లో నాగార్జున దీనిని బిగ్ టీవీలో చూపించి సంజనకి న్యాయం చేస్తాడా లేక లైట్ తీస్కుంటాడా చూడాలి మరి. 

Bigg Boss 9 Telugu Rithu Chowdary: రీతూ పరువు తీసిన బిగ్ బాస్.. ఇమ్మాన్యుయేల్ గెలిచేశాడు!

బిగ్‌బాస్ సీజన్-9 లో పన్నెండో వారం దివ్య ఎలిమినేషన్ అవ్వగా పదమూడో వారం 'టికెట్ టు ఫినాలే' కోసం టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. అంటే ఈ టాస్క్ లలో గెలిచిన వారు డైరెక్ట్ ఫినాలేకి చేరుకుంటారన్న మాట. నిన్నటి నుండి మొదలైన టాస్క్ లలో ఎవరు గెలిచారో.. ఎవరు ఓడారో ఓసారి చూసేద్దాం. తొలి ఫైనలిస్ట్ ఎవరో డిసైడ్ చేసేందుకు చదరంగం- రణరంగం అంటూ బిగ్‌బాస్ బుద్ధిబలం, కండబలం వాడాల్సిన టాస్కులు ఇస్తున్నాడు. ముందుగా పెట్టిన టాస్కులో కళ్యాణ్, రీతూ, ఇమ్మాన్యుయేల్  ఆడారు.  వీళ్ళ ముగ్గురికి 'కనుక్కోండి చూద్దాం' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.  ఇందులో గెలవడానికి గార్డెన్ ఏరియాలో రకరకాల మ్యాథ్స్ కొశ్చన్స్ చెల్లాచెదురుగా ఉన్నాయి. ఆ ప్రశ్నలని సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్స్‌ని బిగ్‌బాస్ చెప్తూ ఉంటాడు. అలా చెప్పిన ప్రతీ ఆన్సర్‌కి సరిపోయే కొశ్చన్‌ని కంటెస్టెంట్స్ వెతికి తీసుకొని బాక్సులో నిలబడి కెమెరాకి చూపించాల్సి ఉంటుంది. ఎవరైతే బిగ్ బాస్ చెప్పిన ఆనర్స్ కి కరెక్ట్ బోర్డ్ తీసుకెళ్తారో అలా ఎక్కువసార్లు ఎవరు కరెక్ట్ గా చెప్తారో వాళ్ళే  విజేత అని బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు.‌ ఇక ఈ టాస్కులో ఇమ్మాన్యుయేల్ గెలిచాడు.   రీతూ మ్యాథ్స్ లో వీక్ అని హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ అందరికి తెలిసిపోయింది. ట్వంటీ డివైడ్ డెడ్ బై ట్వంటీ ఎంత అంటే కూడా చెప్పలేకపోయింది రీతూ.. ఇక బిగ్ బాస్ తనని టూ టేబుల్ చెప్పమని చెప్పాడు. దాంతో తను తడబడుతూనే చెప్పింది. ఇక హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. తను బైపీసీ స్టూడెంట్ అని అందుకే తనకి లెక్కలు రావని రీతూ చెప్పుకొచ్చింది.   

Bigg Boss 9 Telugu Immanuel: టికెట్ టు ఫినాలే రేస్ నుండి సంజన అవుట్.. ఇమ్మాన్యుయేల్ టాప్!

  బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం ఆరుగురు నామినేషన్లో ఉన్నారు. కెప్టెన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ మినహా అందరు నామినేషన్లో ఉన్నారు. ఇక అందరు ఎదురుచూస్తున్న 'టికెట్ టు ఫినాలే' మొదలైంది. ఇది ఎవరికి అయితే లభిస్తుందో వారు డైరెక్ట్ ఫినాలేకి వెళ్తారు. నిన్న మొదలైన ఈ 'టికెట్ టు ఫినాలే' లో ప్రతీ ఒక్కరికి ఛాన్స్ ఇస్తూ టాస్క్ లు ఇస్తానని బిగ్ బాస్ చెప్పాడు. చదరంగం- రణరంగం అంటూ ఫిజికల్, బుద్ధిబలం ఉన్న టాస్కులు పెడుతున్నాడు బిగ్ బాస్. ముందుగా పెట్టిన టాస్కులో పవన్ కళ్యాణ్, రీతూ, ఇమ్మాన్యుయేల్ పాల్గొన్నారు. అయితే ఈ టాస్కులో ఇమ్మాన్యుయేల్ గెలిచి మొదటి అడుగు వేశాడు. తన గడితో పాటు రెండు గడులని సొంతం చేసుకున్నాడు ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత మీరు ఎవరితో పోటీ పడాలని అనుకుంటున్నారో చెప్పండి అని ఇమ్మాన్యుయేల్ ని బిగ్ బాస్ అడుగగా సంజన పేరుని చెప్పాడు. ‌  గార్డన్ ఏరియాలో ఇమ్మాన్యుయేల్, సంజన మధ్య ' పంతం నీదా నాదా' అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. సీసాకి ఉన్న తాడుని లాగి అవతలి వైపు ఉన్న బాక్స్ పైకి వచ్చేలా చేయాలి.. చుట్టూ ఉన్న బాల్స్‌ని తీసుకొని బాక్స్‌లోకి విసరాలి. ఇలా టాస్క్ ముగిసే సమయానికి ఎవరూ తమ అవతలి వైపు ఉన్న బాక్స్‌లో ఎక్కువ బాల్స్ ఉండేలా చూసుకుంటారో వారు ఈ టాస్కులో గెలుస్తారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ టాస్క్ మధ్యలో రోప్‌ని వదలడానికి వీల్లేదంటూ బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. ఇక ఇందులో చివరి వరకు సంజన టఫ్ ఫైట్ ఇచ్చింది కానీ చివర్లో తాడుని వదిలేసింది సంజన. దాంతో గేమ్ నుండి అవుట్ అయింది. ఇక తన గడిని ఇమ్మాన్యుయేల్ సొంతం చేసుకున్నాడు. టికెట్ టు ఫినాలే రేస్ నుండి సంజన అవుట్ అయింది. 

Jayam serial: పారుకి ఇచ్చిపడేసిన గంగ.. రుద్ర సూపర్ సపోర్ట్!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -130 లో..... రుద్ర ఉదయం నిద్ర లేచేసరికి గంగ ఇంకా పడుకొని ఉంటుంది. దాంతో ఇంతసేపు పడుకుంటావా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలని గంగను లేపుతాడు. మరొకవైపు తలనొప్పిగా ఉందని శకుంతల బాధపడుతుంది. వెంటనే ప్రీతీనీ కాఫీ తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది . ప్రీతి లేదని ఇందుమతి చెప్తుంది. ఇక వచ్చి రాని ఇంగ్లీష్ తో ఇందుమతి మాట్లాడుతుంటే శకుంతల తనపై కోప్పడుతుంది. మరొకవైపు గంగతో రుద్ర బాక్సింగ్ ప్రాక్టీస్ చేపిస్తుంటే అప్పుడే పారు వస్తుంది. దమ్ముంటే నువ్వు నాతో ఆడి గెలువు అంటుంది. ఇద్దరు కాసేపు బాక్సింగ్ ఆడుతారు. పారు రూల్స్ బ్రేక్ చేసి గంగని ఎటాక్ చేస్తుంది. నువ్వు కూడా గ్లౌస్ తీసి ఆడమని గంగకి రుద్ర చెప్తాడు. దాంతో గంగ గ్లౌస్ తీసి పారుకి గట్టిగా చెంపపై షాట్ ఇస్తుంది. ఏంటి ఇలా ఆడుతున్నావని పారు అనగానే తను బానే ఆడుతుంది నువ్వే రూల్స్ బ్రేక్ చేసావని రుద్ర అంటాడు. ఆ తర్వాత గంగని బావగారు సపోర్ట్ చేస్తూపోతే అది బాక్సింగ్ లో పేరు పొందితే దానికే మనం సేవ చెయ్యాలని శకుంతలతో ఇషిక అంటుంది. అప్పుడే శకుంతలకి పారు ఫోన్ చేసి గంగని నాతో పోటీపడు అన్నందుకు నన్ను రూల్స్ బ్రేక్ చేసి కొట్టింది. రుద్ర తనకి సపోర్ట్ గా ఉన్నాడు. మీకు కోడలు కావాలని ఆశపడ్డాను.. నాకు మా అన్నయ్య మంచి సంబంధం తీసుకొని వస్తాడని పారు చెప్తుంది. నువ్వేం అలా అనకు ఎప్పటికైనా నువ్వే ఈ ఇంటికి కొడలు అని శకుంతల చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : తిరుపతికి నగలు ఇచ్చేసిన శ్రీవల్లి.. రామరాజు షాక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -331 లో..... శ్రీవల్లి దాచిన నగలు స్వామి చెప్పినట్లు ఆకులుగా మారాయేమోన్న భయంతో నగలు గొయ్యి తీసి చూడమని భాగ్యం చెప్పాడంతో శ్రీవల్లి గొయ్యి తీసి నగలు చూస్తుంది. ఆకులు ఏం కాలేదు నగలు బాగున్నాయని మురిసిపోతుంది. అప్పుడే ప్రేమ, నర్మద వస్తారు. వాళ్ళని చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. అడ్డంగా దొరికిపోయావ్ ఇదంతా మా ప్లాన్ అని ప్రేమ అంటుంది. దాంతో శ్రీవల్లి టెన్షన్ పడుతూ.. అసలు ఏం జరిగిందో చెప్తుంది. నాకు నగలు లేవు గిల్టీ ఉన్నాయి.. ఎక్కడ అవి భయటపడుతాయేమోనని ప్రేమ నగల ప్లేస్ లో పెట్టి అవి పంపించాను.. అలా చెయ్యమని మా అమ్మ చెప్పిందని శ్రీవల్లి చెప్తుంది. ఇప్పుడే నీ విషయం మావయ్యకి చెప్తానని ప్రేమ, నర్మద వెళ్తుంటే వద్దని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. కాళ్ళు పట్టుకొని మరి శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. అయిన వినకపోయేసరికి చచ్చిపోతానని బ్లాక్ మెయిల్ చేస్తుంది. దాంతో ప్రేమని నర్మద ఆపుతుంది. ఆ తర్వాత తిరుపతి దగ్గరికి శ్రీవల్లి వెళ్తుంది. బాబాయ్ ఈ నగలు ఇన్ని రోజులు నా దగ్గరే ఉన్నాయి.. ప్రేమ సంతోషం కోసం నా దగ్గర దాచాను.. నువ్వు మావయ్య దగ్గరికి వెళ్లి.. నేను మర్చిపోయి నా దగ్గరే ఉంచుకున్నానని చెప్పమని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో తిరుపతి సరే అంటాడు. రామరాజు రాగానే తిరుపతి నగలు తీసుకొని వెళ్లి ఇస్తాడు. దాంతో రామరాజు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2  : ఆమె మాటతో శౌర్యని దీప వదిలేస్తుందా.. కార్తీక్ ఏం చేయనున్నాడు!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -530 లో.....జ్యోత్స్న బట్టలు పారిజాతం సర్దుతుంది. ఏంటి గ్రానీ ఎందుకు బట్టలు ప్యాక్ చేస్తున్నావని జ్యోత్స్న అడుగుతుంది. ఇప్పుడు నీ టైమ్ బాలేదు.. కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళు అని పారిజాతం అంటుంది. ఐడియా బాగుంది కానీ నా కంటే నువ్వు వెళ్తే బాగుటుందని జ్యోత్స్న అంటుంది. ఆ కార్తీక్ గాడిని మర్చిపోయి హ్యాపీగా ఉండమని పారిజాతం సలహా ఇస్తుంది కానీ జ్యోత్స్న అవేం పట్టించుకోదు. మరొకవైపు దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. దీప కోపంగా ఉందని తనని కూల్ చెయ్యడానికి ట్రై చేస్తాడు. నువ్వు సైలెంట్ గా ఉండొచ్చు కదా అమ్మ మాట్లాడేటప్పుడు అని కార్తీక్ అంటాడు. అత్తయ్య మాట్లాడే దానికి మన దగ్గర సమాధానం ఉందా.. లేదు కదా అని దీప అంటుంది. శౌర్యపై అందరు ఎందుకు కోప్పడుతున్నారని కార్తీక్ అంటాడు. మరి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే దానికెందుకని దీప అంటుంది. శౌర్యని పీల్చుకొని వస్తాను. ఇక్కడే పడుకుంటుందని కార్తీక్ అంటాడు. అది అత్తయ్య దగ్గర పడుకుంటుందని దీప అంటుంది. మరొకవైపు కాంచనపై శౌర్య కోపంగా ఉంటుంది. ఒసేయ్ నీకు రేపు రెండు లడ్డులు ఇస్తానే అని కాంచన అంటుంది. వద్దు నేను వెళ్లి అమ్మ దగ్గర పడుకుంటానని శౌర్య అంటుంది. నువ్వు పడుకోవద్దు.. వాళ్ళు భార్యభర్తలు కదా ఒక దగ్గర ఉండాలని కాంచన అంటుంది. మరి నువ్వు తాతయ్య భార్యభర్తలు కదా ఒక దగ్గర లేరు అని శౌర్య అంటుంది. నీకు ఎందుకే అని కాంచన అంటుంది. అప్పుడే కాంచనకి పారిజాతం ఫోన్ చేసి కార్తీక్ మొదటిసారి తండ్రి కాబోతున్నాడు.. ఎవరు పుట్టాలని పారిజాతం అడుగుతుంది పాప ఉంది కదా బాబు కావాలని కాంచన అంటుంది. ఆ పాప ఏమైనా కార్తీక్ సొంత కూతురా ఎవరికో పుట్టింది.. దానిపై ప్రేమ ఏంటని పారిజాతం అంటుంది. కొన్ని రోజుల్లో నీ కొడుకు తండ్రి కాబోతున్నాడు.. ఆ పుట్టేవాళ్లపై ప్రేమ ఉండాలి గానీ ఆ శౌర్యపై ఎందుకు.. వెళ్లి ఎక్కడైనా ఉంచేసి రండి అని పారిజాతం చెప్తుంది. కాంచన ఆలోచనలో పడుతుంది. మరొకవైపు శౌర్య, దీప పొట్టపై కాలు తగిలుస్తుంది. అమ్మ నొప్పిగా ఉందని దీప ఏడుస్తుంది. ఏమైందని కాంచన అంటుంది. ఏం లేదని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కేరళ వెళ్తున్న రాజ్, కావ్య..‌రాహుల్ డిజైన్స్ దొంగతనం చేస్తాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -893 లో... కావ్య, రాజ్ గుడికి వెళ్తారు. దేవుడి దగ్గర డిజైన్స్ పెట్టమని పంతులికి చెప్తారు. ఆ తర్వాత కావ్య కళ్ళు తిరిగిపడిపోతుంటే రాజ్ పట్టుకుంటాడు. నేను చెప్పాను కదా.. నువ్వు ముందే అబార్షన్ చేయించుకుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదని రాజ్  అంటాడు. అదంతా పంతులు విని, అలా అబార్షన్ చేయించుకోమ్మంటావ్ ఏంటి తప్పు అని అడుగుతాడు. బిడ్డని కంటే నా భార్య బ్రతకదు అని రాజ్ చెప్పగానే పంతులు షాక్ అవుతాడు. దీనికి పరిష్కారం ఉంది.. నా కూతురికి కూడా అలాగే అయింది. ఇప్పుడు సెట్ అయింది. మీరు కేరళ వెళ్లి అక్కడ ఆయుర్వేద వైద్యం చేయించుకోండి.. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని పంతులు చెప్పగానే రాజ్ సరే అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనం వెంటనే ఒక వారం పాటు టూర్ వెళ్తున్నామని చెప్పి వెళదామని రాజ్ అంటాడు. మనం నా ప్రాబ్లెమ్ గురించి వెళ్తున్నామని అసలు ఇంట్లో తెలయొద్దని కావ్య అంటుంది. మరొకవైపు రాజ్ క్లయంట్స్ ని రాహుల్ రప్పించుకొని తమతో డీల్ పెట్టుకోమని అడుగుతాడు. మీ డిజైన్స్ ఎలా ఉంటాయో తెలియదు రిస్క్ చెయ్యలేనని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎలాగైనా ఆ రాజ్ డిజైన్స్ కొట్టేయాలని మేనేజర్ తో రాహుల్ చెప్తాడు. ఆ తర్వాత రాజ్, కావ్య ఆఫీస్ కి వెళ్లి శృతి కి డిజైన్స్ ఇచ్చి మానిఫాక్చరింగ్ యూనిట్స్ పంపించు.. ఈ డిజైన్స్ ఎవరు చూడడానికి వీల్లేదు.. సెక్యూరిటీ టైట్ చెయ్యమని శృతికి రాజ్ చెప్తాడు. మేమ్ వారం పాటు బయటకు వెళ్తున్నాం డాడీ, బాబాయ్ వస్తారని రాజ్ చెప్తాడు. మరొక వైపు అపర్ణ, ధాన్యలక్ష్మి ఇద్దరికి వాళ్ళ భర్తలు పనులు చెప్తారు. అప్పుడే రాజ్, కావ్య ఎంట్రీ ఇచ్చి.. మీకు రేపటి నుండి ఆ బాధ ఉండదు.. మేమ్ వారం పాటు కేరళ టూర్ వెళ్తాన్నాం.. డాడీ, బాబాయ్ ఆఫీస్ కి వెళ్తారని రాజ్ చెప్తాడు. మంచి పని.. లేదంటే నా కోడళ్లకు పనులు చెప్తున్నారని ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగంలో వారం రోజుల్లో పూర్తి ఆరోగ్యంతో నువ్వు ఇంటికి రావాలని కావ్యతో రాజ్ అంటాడు. మరొకవైపు ఈ వారం రోజుల్లో కేసు ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చెయ్యాలని అప్పు అనుకుంటుంది. ఈ వారం రోజుల్లో నేను అనుకున్నది చెయ్యాలని రాహుల్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

యూట్యూబ్ లో నెలన్నరకు 30 లక్షలు తీసుకున్నా...

  శ్రీవాణి అంటే చాలు బుల్లితెర నటిగా యాంకర్ గా అందరికీ పరిచయమే..రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. "మా టీవీలో "నిన్ను కోరి", జీ తెలుగులో "లక్ష్మి రావే మా ఇంటికి" అనే సీరియల్స్ చేస్తున్నాను. ఇవే కాకుండా నాది, మావారిది, మా అమ్మాయి యూట్యూబ్ ఛానెల్స్ , మా ఇన్స్టాగ్రామ్స్ అలాగే మా అమ్మాయి ఢీ ప్రోగ్రాం, మా వారు జెమినీలో నటిస్తున్న "మా ఇంటి దేవత" సీరియల్ తో 35 యూట్యూబ్ ఛానెల్స్ ని మెయింటైన్ చేస్తున్నాం. "కరోనా టైములో పని పాట లేక యూట్యూబ్ ఛానెల్స్ పెట్టాం. యూట్యూబ్ లో ఫస్ట్ నాకు 10 వేలు వచ్చింది. తర్వాత నెలన్నరకు 30 లక్షలు తీసుకున్నా. నేను కూడా చాల ఆనందపడ్డాను. ఎన్ని డైలీ సీరియల్స్ చేస్తే ఎంత జమ చేస్తే ఇంత నాకు అవుతుంది అనుకున్నాను. వేలకువేలు ఎపిసోడ్స్ చేసాను కానీ ఇంత ఎప్పుడూ ఒక్కసారిగా చూడలేదు. అందుకే యూట్యూబ్ లో ఎంత వచ్చినా నేను సీరియల్స్ చేయడం మానలేదు. అప్పుడు యూట్యూబ్ లో వచ్చినంత అమౌంట్ ఇప్పుడు మాత్రం రావడం లేదు. కొత్త ఛానెల్స్ వచ్చాయి, కొత్త కంటెంట్ వస్తోంది వాళ్లందరికీ హ్యాట్సాఫ్. సీరియల్స్ లో వేసుకునేవి చూసి అదంతా బంగారం అని అనుకోవద్దు. ఆస్తులన్నీ లోన్స్ మీదనే ఉన్నాయి. లోన్ లేకుండా ఒక ఇల్లు ఉండాలని ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. మా మావయ్యగారిది ఒక రెండెకరాల స్థలం ఉంది. అందులో మాకు 300 గజాలు ఉంది. అలా రాజనందిని గార్డెన్స్ అని దాని పేరు ఒకటి ఉంటుంది కదా అని ఒక కొత్త ఇల్లు కడుతున్నాం." అని చెప్పింది.

న్యూస్ ఛానెల్స్ మీద ఇంటరెస్ట్ పోయింది...

  బుల్లితెర మీద శ్రీవాణి, విక్రమాదిత్య జోడి ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. వీళ్ళు సీరియల్స్ లో నటిస్తూ మరో వైపు యూట్యూబ్ ఛానెల్స్ ని రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ అమ్మాయి రాజనందిని కూడా చదువుకుంటూ ఢీ డాన్స్ షోలో కంటెస్టెంట్ గా చేస్తోంది. రీసెంట్ గా శ్రీవాణి ఒక ఇంటర్వ్యూలో కుటుంబ కలహాల గురించి చెప్పుకొచ్చింది. "నేను తమిళ్ సీరియల్ చేస్తున్నాను ఆ టైములో. మా అన్నయ్య చనిపోయినప్పుడు నేను చూసి కార్యక్రమం అయ్యేంత వరకు ఉండకుండా నేను డైలీ షూటింగ్ కాబట్టి నేను వెళ్ళిపోయాను. ఇక తర్వాత వెళ్లి పలకరించిన పాపానికి పెద్ద రాద్ధాంతం అయ్యింది. అప్పటికే అంటే 2014 లోనే మా ఇల్లు కూలిపోయింది. 2016 లో నేను బుల్డోజర్ తీసుకెళ్లి వాళ్ళ ఇల్లు కూలగొట్టి మా వదిన సామాన్లు బయట పారేసాను అని వరకట్నం వేధింపులు అంటూ మా ఫామిలీ కేసు పెట్టేసింది. నేను ఇండస్ట్రీలో ఉంటూ ప్రెస్ వాళ్ళు ఉంటారని తెలిసి నేను షోస్ చేసుకుంటూ అంత ఫ్యూలిష్ గా ఎలా బిహేవ్ చేస్తాను అని ఎలా అనుకుంటారు. ఒకటి సన్ టీవీ సీరియల్ ఒకటి జీ తమిళ్ సీరియల్ చేస్తున్నా. ఏ డేట్ లో ఎక్కడ ఉంటానో నాకే తెలీదు. అలాంటిది నేను వెళ్లి హరాస్ చేయడమేంటో తెలీదు ఆన్ స్క్రీన్ ఉన్నాను కాబట్టి నా పేరు బాగా వినిపించింది. నాకు మా వదినతో అంత ర్యాపొ లేదు. వాళ్ళ పెళ్లి అయ్యే టైంకి నాకు ఏడేళ్లు. నేను పుట్టింది పెరిగింది అంతా సిటీలోనే. కొట్టింది, మ్యాగీ స్పూన్ తో కాల్చింది, బియ్యం బస్తాలు తీసుకెళ్ళిపోయింది అంటూ రకరకాలుగా నా మీద న్యూస్ వచ్చింది. ఇలా కూడా రాస్తారా అనిపించింది. నేను తప్పు చేసినదాన్నే ఐతే మా ఫామిలీ మెంబర్స్ మా అత్తగారి వాళ్ళ ఫామిలీ మెంబర్స్ అంతా మాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు. న్యూస్ చానెల్స్ అన్నిటిలో ఈ వార్తలు చూసాక అప్పటినుంచే నాకు న్యూస్ ఛానెల్స్ మీద ఇంటరెస్ట్ పోయింది. ఇక కేసు ఇంకా కంటిన్యూ అవుతోంది.శిక్ష ఆమెకు పడుతుందా, మాకు పడుతుందా, కేసు కొట్టేస్తారా అసలు ఏమవుతుందో మళ్ళీ అప్పుడు చెప్తా. " అంటూ శ్రీవాణి చెప్పుకొచ్చింది.  

వరుణవి డైలాగ్ కి పడీ పడీ నవ్విన రోజా, అనిల్

జీ తెలుగులో సరిగమప లిటిల్ చాంప్స్ ప్రతీ వారం పిల్లల్ని పెద్దలను అలరిస్తోంది. ఇక ఈ వారం కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే సెంట్రాఫ్ అట్రాక్షన్ గా వరుణవి ప్రతీ వారం కొత్త కొత్త పాటలు ఎంటర్టైన్ చేస్తోంది. ఈ ప్రోమోలో వరుణవి స్టేజి మీదకు రాగానే "హాయ్ సుధీర్ మామ" అని పలకరించింది. "ఇదేంటి సడెన్ గా ఇంత మార్పు వచ్చింది నీలో" అని అడిగాడు సుధీర్. "పాత సినిమాలు చూడలేదా అందులో పిల్లలు ఇలాగే మంచిగా ఉంటారు" అని చెప్పింది. "పాత సినిమాలు పెద్దగా చూడలేదమ్మా" అన్నాడు సుధీర్. "అప్పట్లోనే పుట్టావ్  కదా ఐనా చూడాలేదా" అని కౌంటర్ వేసింది. దానికి ఆన్సర్ చెప్పలేదు సుధీర్. తర్వాత "పిల్లలు దేవుడు చల్లని వారే" అనే సాంగ్ పాడింది. "పిల్లలు దేవుడు చల్లని వారంటారు కదా నువ్వు కూడా దేవుడి లాంటి బిడ్డవే" అంటూ రోజా వరుణవికి కాంప్లిమెంట్ ఇచ్చింది. "రోజు రోజుకూ నీలో ఇంప్రూవ్మెంట్ ఎంత బాగుందో అసలు" అంటూ జడ్జి శైలజ మెచ్చుకున్నారు. "దొండకాయ్, బెండకాయ్ నువ్వే నా గుండెకాయ్" అంటూ శైలజ గారికి చెప్పింది వరుణవి. రోజా గారి గురించి ఏమన్నా చెప్పాలి కదా అని సుధీర్ అడిగాడు. "వీటిల్లో నాకిష్టం కాజా. జడ్జెస్ లోనే స్వీట్ మా రోజా" అని సుధీర్ తాను చెప్పిన ఈ డైలాగ్ చెప్పమన్నాడు. "జడ్జెస్ వాళ్ళ స్వీట్ మా దోశ" అంటూ లైన్ ని మర్చి చెప్పేసింది. అంతే ఆ డైలాగ్ కి అనిల్ రావిపూడి, రోజా అంతా పగలబడి నవ్వేశారు.

Bigg Boss 9 Nominations: పదమూడో వారం నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే!

  బిగ్‌బాస్ సీజన్-9 లో నిన్నటి సోమవారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్ల ప్రక్రియ యమజోరుగా సాగింది. పదమూడవ వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా హౌస్‌మేట్స్ మధ్య హీటింగ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి లిస్ట్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. కళ్యాణ్‌ కెప్టన్ కాబట్టి ఇమ్యూనిటీ ఉంది. అతను తప్ప నామినేషన్ లో ఎవరున్నారో ఓసారి చూసేద్దాం.  గ్రాండ్ ఫినాలేకి మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. పన్నెండవ వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అవ్వగా.. పదమూడవ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. ఇక నుంచి మీరు ఆడే ఆట, మాట్లాడే మాట, మిమ్మల్ని ఫైనల్‌కి చేరువకావాలా.. లేదంటే వెనుతిరగాలా అన్నది నిర్ణయించబోతున్నాయంటూ నామినేషన్స్ రూల్స్ చెప్పాడు. షుగర్ తో చేసిన సీసాను నామినేషన్ చేయాలనుకున్న కంటెస్టెంట్ తలమీద కొట్టి తగిన కారణాలు చెప్పమని బిగ్ బాస్ చెప్పాడు. ‌ఇక నామినేషన్ ప్రక్రియని ఇమ్మాన్యుయల్  స్టార్ట్ చేశాడు.  డీమాన్ పవన్, రీతూలని ఇమ్మాన్యుయల్ నామినేషన్ చేశాడు. సంజనని భరణి నామినేట్ చేశాడు. తన‌ ట్యాబ్లెట్లు దాచేసి ఫన్ క్రియేట్ చేద్దామని సంజన అనుకుందని అది తనకి నచ్చలేదని భరణి కారణం చెప్పి తనని నామినేట్ చేశాడు. ఆ తర్వాత డీమాన్ పవన్ ని భరణి నామినేట్ చేశాడు. ఇక సంజన, రీతూ ఇద్దరు ఒకరికొకరు నామినేట్ చేసుకున్నారు. ఇమ్మాన్యుయల్, తనూజ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా వారిలో డీమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి, తనూజ, సంజన, రీతూ చౌదరి ఈ వారం నామినేషన్లో ఉన్నారు. ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్ పడాల తప్ప అందరు నామినేషన్లో ఉన్నారు. 

ఎన్ని షోలు మారినా రోజా ఏజ్ మారదా...

  సరిగమప లిటిల్ చాంప్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ జోష్ గా ఫన్నీగా ఉంది. ఇక రెట్రో స్పెషల్ తో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ రాబోతోంది. రెట్రో థీమ్ ఎప్పుడూ డిఫరెంట్ గా ఉంటుంది. ఓల్డ్ సాంగ్స్ కి కొత్త కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో చిన్నారి కంటెస్టెంట్స్ అలరించారు. వర్షిణి స్టేజి మీదకు వచ్చి "నేను ఒకరిని ప్రేమించాను" అని చెప్పింది. వెంటనే సుధీర్ వచ్చి "ఎవరతను" అనేసరికి "గోపి"అని చెప్పింది. "ప్రతీ బ్లాక్ అండ్ వైట్ ఫిలింలో అదే రాధ అదే గోపి" అంటూ డైలాగ్ వేసాడు అనిల్ రావిపూడి. ఇక జడ్జెస్ కూడా ఓల్డ్ రెట్రో స్టైల్ గెటప్స్ తో అలరించారు. ,అనంత శ్రీరామ్ కూడా వచ్చి "రాధ రాధ రాధ" అనేసరికి "ఆవిడే పేరు రాధ అనే పెట్టుకుంది" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో కామెడీగా కామెంట్ చేశారు అనిల్. ఇంతలో రోజా ఎంట్రీ ఇచ్చింది. ఆమె వస్తుంటే "ఒక లైలా కోసం" అనే సాంగ్ ప్లే అయ్యింది. "అవును మేము 80s చేస్తున్నాం మీకు ఓకేనా" అని సుధీర్ అడిగాడు. "2000 లో పుట్టాను కదా కొంచెం కష్టమే" అని చెప్పింది. "ఎన్ని షోలు మారినా ఆవిడ ఏజ్ మారదా..నాన్సెన్స్  " అంటూ అనిల్ రావిపూడి సీనియర్ నటుడు నాగేశ్వరావు గారిలా కంఠం మార్చి అడిగాడు. ఇక పిల్లలు వచ్చి "బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది" అంటూ పాడేసరికి "మమ్మల్ని 70s కి తీసుకెళ్లిపోయారు" అంటూ చెప్పాడు. తర్వాత "చెంగావి రంగు చీర" అని సాంగ్ పాడేసరికి ఆడియన్స్ లో ఇద్దరు లేచి ఆ సాంగ్ సిగ్నేచర్ స్టెప్స్ వేశారు. దాంతో అనంత శ్రీరామ్ "వాళ్లకు వాళ్ళ యవ్వనం గుర్తొచ్చింది" అంటూ చెప్పాడు. తర్వాత "గోలీమార్ మార్" అనే పాట పాడారు. "ఆ రెట్రోలో ఉన్న ఎక్స్ప్రెషన్ మీ కంఠంలో కనిపించింది" అంటూ ఇద్దరు చిన్నారులకు అనంత శ్రీరామ్ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ఇక ఇదే సాంగ్ కి అనిల్, సుధీర్ అందరూ కలిసి స్టెప్పులేశారు. రెట్రో 2 . 0 అని ప్రోగ్రాం టైటిల్ ని సుధీర్ చెప్పేసరికి జడ్జి శైలజ తన రెగ్యులర్ కళ్లజోడును తీసేసి కలర్ ఫుల్ కళ్ళజోడు పెట్టి ఒక లుక్ ఇచ్చారు.

సీరియల్ లో గ్లామర్ లేదని వచ్చా..ఫ్యామిలీ లైఫ్ ఉంటే ప్రొఫెషనల్ లైఫ్ ఉండదు

  పవిత్ర ఈ మధ్య ఫ్యామిలీ స్టార్స్ కి వచ్చిన అందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం ఈ షోకి వచ్చిన స్టార్స్ ని రోస్ట్ చేసింది. రకరకాల ప్రశ్నలు అడిగి సెటైర్స్, కౌంటర్లు వేసి నవ్వించింది. ఇక ఈ షోకి వచ్చిన సమీర్ ని, సుహాసినిని కొన్ని ప్రశ్నలు వేసింది. "సమీర్ గారు మిమ్మల్ని చూస్తుంటే ఒకటి అడగాలనిపిస్తోంది" అంటూ పాగల్ పవిత్ర ఒక ప్రశ్న అడిగింది. "సారీ నేను ఆ టైపు కాదు" అంటూ సమీర్ సీరియస్ ఫేస్ తో ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. "ఐతే ఈయన్ని అడగండి" అంటూ సుధీర్ వైపు చూపించాడు సమీర్. "ఆయన వేరే టైపు" అంటూ పవిత్ర డైలాగ్ వేసింది. "మీకు రెండే రెండు అప్షన్స్ ఇస్తాను. ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి.  ఆలోచించి చేసుకోండి.  భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు" అంటూ కొంచెం కామెడీ డైలాగ్స్ వేసేసరికి సమీర్ నవ్వేసాడు. "ఫామిలీ లైఫ్ , ప్రొఫెషనల్ లైఫ్..ఈ రెండిట్లో ఒకటే సెలెక్ట్ చేసుకోండి" అండి. "ప్రొఫెషనల్ లైఫ్" అన్నాడు. "అదేంటి ఫామిలీ లైఫ్ లేకపోతె ఎలా" అని అడిగింది. "ప్రొఫెషనల్ లైఫ్ ఉంటే ఫామిలీ లైఫ్ ఉంటుంది. ఫామిలీ లైఫ్ ఉంటే ప్రొఫెషనల్ లైఫ్ ఉండదు" అని చెప్పాడు. "చాలా అందంగా ఉన్నారు కదా మీ గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారు" అని అడిగింది. "మొన్నీమధ్య ఇంట్లో దొంగలు పది గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ కొట్టేశారు" అని నవ్వుతూ చెప్పాడు. "కొట్టేశారు అంటున్నారు కాబట్టి ఒకటి నుంచి పది వరకు ఉండొచ్చు కదా" అంది. "పది వరకు వేసుకుంటే లిస్ట్ లు ఎందుకు బొక్క" అనేశాడు సమీర్. తర్వాత బుల్లితెర నటి సుహాసినిని పిలిచింది. "అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచినట్టు" అని అడిగింది. "నా కర్మ కాలక" అంది సుహాసిని. "మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు" అంది పవిత్ర. "అందుకే పిలిచారు" అని వెంటనే కౌంటర్ ఇచ్చింది. "సినిమాల్లో హీరోయిన్ గా చేసిన సుహాసిని సీరియల్ హీరోయిన్ గా ఎందుకు మిగిలిపోయింది" అని అడిగింది. "ఎందుకంటే సినిమాల్లో ఆల్రెడీ చాలా గ్లామర్ ఉంది సో సీరియల్ లో గ్లామర్ లేదు కాబట్టి ఆ గ్లామర్ సీరియల్ కి చూపిద్దామని వచ్చా" అని సుహాసిని కౌంటర్ ఇచ్చింది. "ఆ సుహాసినికి వచ్చినంత పేరు ఈ సుహాసినికి వస్తుందనుకుంటున్నారా" అని అడిగింది. "ఆ పేరు రావాలనే అనుకుని చిన్నప్పుడు మా అమ్మ ఆ పేరు నాకు పెట్టింది" అంటూ చెప్పింది.

లెజెండరీ యాక్టర్స్ ని గుర్తు చేసుకున్న శ్రీదేవి డ్రామా కంపెనీ

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. నాటి లెజెండరీ యాక్టర్స్ ని తలుచుకుంటూ ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఇక జడ్జ్ ఇంద్రజ శివగామి రోల్ లో వచ్చింది. "ఎన్నో వినోదాలను ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది, చూసింది. కానీ ఈ రోజు ఆ వినోదానికి ఒక పెద్ద పీట వేయాలి. ఇదే నా మాట నా మాటే శాసనం" అంటూ చెప్పింది.  నూకరాజు బాహుబలిగా వచ్చి "మీరు ఈ గెటప్ ఎందుకు వేశారు నన్ను ఈ గెటప్ ఎందుకు వేయించారు" అని అడిగాడు. మన ఆర్టిస్టులంతా ఈ సినిమాలలో వచ్చిన పాపులర్ గెటప్స్ వేసుకుని ఇక్కడికొచ్చి పెర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుంది" అని అడిగేసరికి అదిరిపోద్ది అని చెప్పాడు నూకరాజు. అలా డిజె టిల్లు మూవీలో రాధికా గెటప్ లో రష్మీ, చంద్రముఖి మూవీలో రజనీకాంత్ వేంకటపతి రాజు గెటప్ లో ఆటో రాంప్రసాద్, రాములమ్మగ ధరణి, వెన్నెల గెటప్ మహేశ్వరీ, కాంచన గెటప్ లో భానుశ్రీ, చంద్రముఖి గెటప్ లో ప్రిన్సి, దేవసేన గెటప్ లో ఫైమా, కోవై సరళ గెటప్ లో నటకుమారి, తెలంగాణ శకుంతల గెటప్ కొమరక్కా వచ్చారు. "నువ్వెవరు" అని రష్మీని అడిగాడు రాంప్రసాద్, రాధికా అని చెప్పేసరికి నీకు కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు అంటూ సెటైర్ వేసాడు. "ఏయ్ కాంచన నువ్వెంటి ఇలా వచ్చావ్" అనేసరికి భానుశ్రీ తెలిసిపోయిందా అంటూ కామెంట్ చేసింది. ఇలా ఈ లెజెండరీ నటీమణుల మూవీస్ లో కొన్ని బిట్స్ తీసుకుని స్పూఫ్ గా చేసి ఎంటర్టైన్ చేశారు. చివరికి సౌందర్య, శ్రీదేవి, తెలంగాణ శకుంతల, సావిత్రిని తలుచుకుంటూ ఈ ఎపిసోడ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.