Prerana Vs Tanuja: ప్రేరణ వర్సెస్ తనూజ.. గెలుపు ఎవరిది!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. ‌ఇక కెప్టెన్సీ టాస్క్ లు జోరుగ సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎక్స్ హౌస్ మేట్స్ ని హౌస్ లోకి రప్పించి వారితో హౌస్ లోని కంటెస్టెంట్స్ చేత కెప్టెన్సీ టాస్క్ లు ఆడిస్తున్నాడు బిగ్ బాస్.  ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో‌ ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి  కెప్టెన్సీ టాస్క్ లు ఆడగా.. పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ అవ్వగా.. భరణి కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకున్నాడు. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో హౌస్ లోకి ఎక్స్ కంటెస్టెంట్ ప్రేరణ వచ్చేసింది. తను వచ్చీ రాగానే అందరికి హాయ్ చెప్పేసింది. అందరు గేమ్ బాగా ఆడుతున్నారని చెప్పింది. నేను నిజానికి చాలా బాధపడ్డాను.. ఏంటిది టూ టూ హౌసెస్ అంటున్నారు.. పక్కనే ఇంకో సెట్ కట్టారా అని అనుకున్నానని ప్రేరణ అంటుంది. హమ్మయ్య వీళ్ళని కరెక్ట్ ప్లేస్ లో పడేశారని అనుకున్నావా అంటూ ఇమ్మాన్యుయల్ పంచ్ వేయగానే హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. ప్రేరణ నువ్వు టఫ్ ప్లేయర్ నాకు నీతో ఆడాలని ఉంది అని తనూజ అనగానే తననే సెలెక్ట్ చేసుకుంది ప్రేరణ.  ఇక హౌస్ లో జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో తనూజ గెల్చినట్టుగా తాజాగా వదిలిన ప్రోమో(Bigg Boss 9 Promo) లో చూపించాడు బిగ్ బాస్‌. అయితే భరణి వర్సెస్ గౌతమ్ కృష్టతో జరిగిన టాస్క్ లో కూడా గౌతమ్ ఓడినట్టుగా ప్రోమోలో చూపించాడు బిగ్ బాస్ కానీ ఎపిసోడ్ కి వచ్చేసరికి భరణి ఓడిపోయాడు. అలాంటి ట్విస్ట్ ఏదైనా ఉంటుందా లేక తనూజ గెలిచిందా తెలియాలంటే నేటి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే.

Sanjana Refuses to Apologise: సారీ చెప్పే ప్రసక్తే లేదు.. ఇమ్మాన్యుయేల్ వెళ్ళిపోయాడు!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. హౌస్ లో ఇప్పుటి వరకు ఒక లెక్క ఇప్పటినుండి ఒక లెక్క అన్నట్లు సాగుతుంది. నామినేషన్ ప్రక్రియలో నిజంగానే చదరంగం కాదు.. ఇది రణరంగమే అన్నట్లు సాగింది. నామినేషన్ అనంతరం కూడా దాని తాలూకా గొడవలు హౌస్ లో కంటిన్యూ చేశారు. నువ్వు రోజు రాత్రి డీమాన్ తో కూర్చుంటావని సంజన అన్నమాటలకి రీతూ బాగా హర్ట్ అయింది. బాత్రూంలోకి వెళ్లి బాగా ఏడుస్తుంది తనూజ. ఏడుస్తున్నా రీతూని డీమాన్ పిలుస్తాడు. ప్లీజ్ రీతూ బయటకు రా ఏడ్వకని రిక్వెస్ట్ చేస్తాడు.. రీతూ బయటకు వచ్చాక ప్లీజ్ డీమాన్ నువ్వు వెళ్ళు.. నేను రీతూ మాట్లాడుతానని తనూజ అంటుంది. ఇక్కడ ఎవరం ఏ తప్పు చెయ్యడం లేదు.. మీరేంటో మీకు తెలిసినప్పుడు, ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవద్దని తనూజ అంటుంది. నాకు ఆ బాధ ఉండిపోయిందని రీతూ ఏడుస్తుంది. మరొకవైపు సంజన దగ్గరికి ఇమ్మాన్యుయల్ వెళ్లి.. ''నువ్వు అన్నమాట తప్పు ఇక్కడ గొడవ అంతా ఎవరు చూడరు.. ఒక్క మాటనే పట్టుకుంటారు.. ప్లీజ్ వెళ్లి సారీ చెప్పు" అని సంజనతో ఇమ్మాన్యుయేల్ అంటాడు. నేను చెప్పను.. తను నన్ను ఎన్నో అంది పతివ్రత శిరోమణి అంది.. మొదట్లో దానికి ఏమైనా సారీ చెప్పిందా.. ఇప్పుడు తనదే తప్పు.. తను ఫస్ట్ సారీ చెప్తే  నేను చెప్తానని సంజన మొండిగా అంటుంది. నీకు వాళ్ళు ఇద్దరు పక్కన కూర్చుంటే.. తమ్ముడు నీకంటే ఇక్కడ పెద్ద వాళ్ళం ఉన్నాం.. నువ్వు అలా పక్కన కూర్చుంటే ఇబ్బందిగా ఉంది అని మెల్లగా కూర్చొని చెప్పాలి కానీ ఇలా నామినేషన్ లో చెప్పే విషయం అది కాదని ఇమ్మాన్యుయేల్ అంటాడు. మరి వాళ్ళు కూడా అలాగే కూర్చొబెట్టుకొని.. అక్క నీ గేమ్ కన్పించడం లేదు.. ఇకనైనా ఆడు అని చెప్పాలి కదా.. నామినేట్ చేసి చెప్పాలా అని సంజన అనగానే ఇక తనతో వాధించి ప్రయోజనం లేదని ఇమ్మాన్యుయేల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత సంజన దగ్గరికి డీమాన్ వచ్చి.. అక్క రీతూకి సారీ చెప్పండి అని అంటాడు. నేను చెప్పను తనే నాకు సారీ చెప్పాలని సంజన అంటుంది. కాసేపటికి  భరణి, సుమన్ ఇద్దరు సంజన దగ్గరికి వచ్చి రీతూ విషయంలో మీరు మాట్లాడింది తప్పు అని అంటారు. అయినా సంజన మాత్రం మొండిగా ఉంటుంది. వీకెండ్ లో నాగార్జున చెప్పమంటేనైనా రీతూకి సంజన సారీ చెప్తుందో లేదో చూడాలి మరి. 

Jayam serial : గంగ, రుద్రల శోభనానికి ముహుర్తం పెట్టించిన పెద్దసారు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -124 లో.....పారుని శకుంతల లోపలికి తీసుకొని వస్తుంది. గంగ ఈ ఇంటి కోడలు అని నేను అనుకోవడం లేదు.. ఒక్క మావయ్య గారు మాత్రమే అనుకుంటున్నాడు.. రుద్ర అయితే దూరం దూరం ఉంటున్నాడని శకుంతల అంటుంది. ఇదంతా చూస్తుంటే తలనొప్పిగా ఉందని శకుంతల అనడం గంగ వింటుంది. అమ్మ గారికి తలనొప్పిగా ఉందట కాఫీ చేసి తీసుకొని వస్తానని కిచెన్ లోకి వెళ్లి పాలు వేడి చేస్తుంది. అప్పుడే ఇషిక వచ్చి అత్తయ్య పర్మిషన్ లేకుండా కిచెన్ లోకి ఎందుకు వచ్చావని గంగపై కోప్పడతుంది. అదే విషయం ఇషిక వెళ్లి శకుంతలకి చెప్తుంది. దాంతో శకుంతల వస్తుంది. ఎందుకు కిచెన్ లోకి అడుగుపెట్టావని గంగపై శకుంతల కోప్పడుతుంది. ఇక అప్పుడే పెద్దసారు వస్తాడు. నువ్వు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా గంగ ఈ ఇంటికి కోడలు అని పెద్దసారు అంటాడు. అప్పుడే స్టవ్ పై పాలు పొంగిపోతాయి. ఎలాగైతే ఏంటి కొత్త కోడలు చేత పాలు పొంగించావని పెద్దసారు అనగానే శకుంతల కోపంగా వెళ్ళిపోతుంది.  ఆ తర్వాత గంగ కాఫీ తీసుకొని రుద్ర దగ్గరికి వెళ్తుంది. మీరు కొంచెం తాగి నాకు కొంచెం ఇవ్వండి అని గంగ అంటుంది. నాకు అలా ఇష్టం ఉండదని రుద్ర అంటాడు. అయిన సరే గంగ వినిపించుకోకుండా లాక్కుంటుంది. ఈ పనులు పక్కన పెట్టి బాక్సింగ్ పై ఇంట్రెస్ట్ పెట్టు అని రుద్ర అంటాడు. నేను ఈ ఇంటికి కోడలిని అన్ని పనులు చెయ్యాలని గంగ అంటుంది. అయితే నా బట్టలు ఇస్త్రీ చెయ్.. కరెంటు షాక్ అయ్యేలా కాకుండా.. డ్రెస్ కాలిపోకుండా చెయ్ అని రుద్ర చెప్తాడు. దాంతో గంగ మంట పెట్టి చెంబుతో ఇస్త్రీ చెయ్యాలని ట్రై చేస్తుంది. ఇంట్లో వాళ్లంతా వింతగా చూస్తారు. ఇంటిపని మనిషి కూడా ఇంత చీఫ్ గా ఆలోచించదని శకుంతలతో పారు అంటుంది. ఇషిక, పారు శకుంతల, వీరు మాట్లాడుకుంటారు  మేమ్ ముగ్గురం నీకు సపోర్ట్ ఉన్నాం.. రుద్ర బావని నీ ప్రేమతో నీ వైపుకి తిప్పుకోమని పారుతో ఇషిక చెప్తుంది. ఆ తర్వాత ప్రీతీ, ప్రమీల, స్నేహ ముగ్గురు మాట్లాడుకుంటారు. గంగ ఎక్కడ ఉంటే అక్కడ సరదా ఉంటుంది. అన్నయ్యకి కరెక్ట్ జోడి అని నవ్వుకుంటారు. అప్పుడే రుద్ర వచ్చి.. మీరు ఆ తింగరి గంగకి ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో చెప్పొచ్చు కదా అని అంటాడు. వద్దు అన్నయ్య తనలా తనని ఉండనివ్వండి అని ప్రీతీ అంటుంది. తరువాయి భాగంలో గంగ, రుద్ర శోభనానికి పెద్దసారు ముహూర్తం పెట్టిస్తాడు. శకుంతల షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రాహుల్ కోసం కొత్త కంపెనీ పెడుతున్న రాజ్.. సారీ చెప్పిన స్వప్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -887 లో......రాజ్ దగ్గర నుండి స్వప్న ఫోన్ తీసుకుంటుంది. అది తీసుకొని వెళ్లి రాహుల్ కి ఇస్తుంది. ఫోన్ లో కొత్త కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ ఉంటుంది. అది చూసి స్వప్న షాక్ అవుతుంది. మరొకవైపు పెళ్లిరోజు సందర్బంగా అపర్ణ, సుభాష్ కేక్ కట్ చేశారు. అందరు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే స్వప్న వస్తుంది. అందరిని పిలుస్తుంది కానీ ఎవరు వినిపించుకోకపోవడంతో ఫ్లవర్ వాజ్ పడేస్తుంది‌ దాంతో అందరు ఏమైందని స్వప్నని అడుగుతారు. రాజ్ కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు.. ఎందుకు ఇలా చేస్తున్నాడు.. స్వరాజ్ కంపెనీకి సంబంధం లేకుండా ఇలా కొత్త కంపెనీ పెట్టి ఫండ్స్ మొత్తం దానికి ట్రాన్స్‌ఫర్ చేస్తూ లెక్కలు చూపించడం లేదు.. ఇలా ఎవరిని మోసం చేద్దామని అనుకుంటున్నారని రాజ్, కావ్యని స్వప్న అడుగుతుంది. అందరికి ఫోన్ లో కొత్త కంపెనీకి సంబంధించినది  స్వప్న చూపిస్తుంది. ఇందులో చెప్పడానికి ఏముంది ఒకవేళ పాత కంపెనీకి నష్టం వస్తే ఎలా అని ముందు జాగ్రత్త కొద్దీ వాళ్ళు సేఫ్టీ చూసుకుంటున్నారని రుద్రాణి అంటుంది. అప్పుడే రాజ్ ఎంట్రీ ఇస్తాడు. అవును కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను.. కానీ 'R' అంటే రాజ్ కాదు.. రాహుల్ అని రాజ్ అనగానే అందరు షాక్ అవుతారు. భలే కవర్ చేసావ్ రాజ్ అని రుద్రాణి అంటుంది. మీరు ఆపండి రుద్రాణి గారు.. మా ఆయన చెప్పేది నిజం.. నీ కొడుకు ఇప్పుడు మారడానికి ట్రై చేస్తున్నాడు.. ఒక ఛాన్స్ ఇద్దామని ఇలా చేసామని కావ్య అంటుంది. ఇప్పుడు స్వరాజ్ కంపెనీలో ఎంత పెద్ద పోస్ట్ ఇచ్చిన వీళ్ళ కింద పని చేస్తున్నాననే ఫీలింగ్ లోనే రాహుల్ ఉంటాడు. అందుకే తనకి సొంతంగా కంపెనీ ఉండి అందులో బాధ్యతలు అప్పగిస్తే వాడికే తెలుస్తుందని రాజ్ అనగానే సారీ కావ్య అని స్వప్న అంటుంది. ఆ తర్వాత రాహుల్ వాళ్లకి సారీ చెప్తాడు. తరువాయి భాగంలో  రాజ్ నాకు ఇచ్చింది కంపెనీ కాదు పెద్దకత్తిని ఎలా నరికేస్తానో చూడమని రుద్రాణితో రాహుల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీపకి పుట్టబోయే బిడ్డ ఈ అంతఃపురంలోనే పుట్టాలి జ్యోత్స్న.. దాస్ నిర్ణయం అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -524 లో..... దీప ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పగానే అందరు సంతోషపడతారు. పారిజాతం, జ్యోత్స్న మాత్రం షాక్ అవుతారు. ప్రెగ్నెంట్ అంటే ఏంటని శౌర్య అడుగుతుంది. నీకు ఆడుకోవడానికి తమ్ముడో చెల్లెలో వస్తుందని సుమిత్ర అనగానే నాకు మొన్న ఆడుకోమని బొమ్మ ఇచ్చింది.. అది చెల్లి అని పిలువు అంది.. నాకు చెల్లి వస్తుందని శౌర్య అంటుంది. అమ్మ నాకు కలలోకి వచ్చి చెప్పింది.. ఇప్పుడు నా మనవరాలిగా నా ఇంట్లో అడుగుపెట్టబోతుందని కాంచన అనగానే శివన్నారాయణ హ్యాపీగా ఫీల్ అవుతాడు. జ్యోత్స్న కోపంగా పైకి వెళ్తుంది. తన వెనకాలే పారిజాతం వెళ్తుంది. ఏంటి గ్రానీ వాళ్ళు చెప్పేది నిజమేనా అని జ్యోత్స్న అడుగుతుంది. అవును అది ప్రెగ్నెంట్ అయితే నీకేంటని పారిజాతం అంటుంది. ఈ ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని పంతులు చెప్పాడు కదా అని జ్యోత్స్న అనగానే దీప ప్రెగ్నెంట్ అయితే ఈ ఇంటి వారసురాలికి మంచి ఎలా జరుగుతుంది. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. లేదు బావ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ దీపకి అదృష్టం పట్టిందని జ్యోత్స్న అంటుంది. అప్పుడే దాస్ ఎంట్రీ ఇచ్చి.. దీప ప్రెగ్నెంట్ అని స్వీట్ పంచుతాడు. మరొకవైపు పంతులు దగ్గర దీప, కార్తీక్ ఆశీర్వాదం తీసుకుంటారు. పంతులు వెళ్తూ వెళ్తూ.. దశరథ్, సుమిత్రలతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. దాంతో పంతులు బయటకు వచ్చాక.. అలా ఎందుకు అన్నారని శివన్నారాయణ అడుగుతాడు. మీకు రాబోయే విపత్తు ఉంది.. దాని స్థాయి తగ్గడానికి హోమం చేసాను.. విపత్తు అయితే ఉందని పంతులు చెప్పగానే శివన్నారాయణ టెన్షన్ పడతాడు. మరొకవైపు దీప తల్లి కాబోతుందని కాంచన, అనసూయ చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత దాస్ ని జ్యోత్స్న కలుస్తుంది. మీరు ఎప్పుడు దీప గురించి ఇంట్లో వాళ్లకి చెప్పకూడదని దాస్ తో జ్యోత్స్న అంటుంది. దీప బిడ్డ ఈ అంతఃపురంలోనే పుట్టాలని దాస్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : భాగ్యం బిజినెస్ ఐడియా నచ్చి పది లక్షలు ఇచ్చిన రామరాజు.. కోడళ్ళు షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -325 లో..... వేదవతి దగ్గరికి నర్మద వస్తుంది. అత్తయ్య అంటే ఇష్టం అంటారు కానీ ఎవరు ఈ అత్తయ్య కి చెప్పారు. భర్తని గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేయిస్తుందని వేదవతి కోపంగా అంటుంది. అప్పుడే ప్రేమ వస్తుంది. వచ్చింది పోలీస్ ఆఫీసర్ అని ప్రేమపై కూడా వేదవతి కోపంగా మాట్లాడుతుంది. మరొవైపు ఇంట్లో సిచువేషన్ మొత్తం శ్రీవల్లి తన పేరెంట్స్ కి చెప్తుంది. వాళ్ళు రామరాజు దగ్గర బిజినెస్ స్టార్ట్ చేస్తామని డబ్బు తీసుకోవాలని అనుకుంటారు. భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు దగ్గరికి వస్తారు. అందరు ఏంటి డల్ గా ఉన్నారు. ఏదైనా గొడవ జరిగిందా ఏంటని భాగ్యం ఏం తెలియనట్లు అడుగుతుంది. అసలు విషయం చెప్పమ్మా అని రామరాజు తనపై చిరాకుపడతాడు. ఈ రోజుల్లో ఒక వయసు రాగానే తల్లిదండ్రులని వదిలించుకోవాలని అనుకుంటున్నారు కదా అలా వదిలేసిన తల్లిదండ్రులని మేమ్ చూసుకుంటాం.. అలా వాళ్ళ దగ్గర నుండి డబ్బు నెలనెలా తీసుకుంటాం.. ఇలా ఒక బిజినెస్ మొదలుపెడుదామనుకుంటున్నాం అన్నయ్య.. ఎవరికి ఆ పరిస్థితి వస్తుందో తెలియదు కదా.. పెళ్ళాలు వచ్చినాకనే కొందరు మారిపోతున్నారని భాగ్యం అంటుంది. ఒక పది లక్షలు ఇవ్వండి అని అంటుంది. నాకు మీ ఆలోచన నచ్చిందని పది లక్షలు ఇస్తాడు. మావయ్య గారు కొంచెం ఆలోచించండి అని ప్రేమ, నర్మద అంటారు. మీలాగా వాళ్ళు నమ్మకద్రోహం చేయడం లేదు.. చేసే పని ముందే చెప్తున్నారని రామరాజు అంటాడు. ఆ డబ్బు తీసుకొని భాగ్యం, ఆనందరావు బయటకు వచ్చి ప్లాన్ సక్సెస్ అనుకుంటారు. అప్పుడే నర్మద అటుగా వెళ్తుంటే.. పిలిచి మరీ భాగ్యం గొడవపెట్టుకుంటుంది. మరొకవైపు శ్రీవల్లి అనుకుంది జరిగిందని సంతోషపడుతుంది. ఆ తర్వాత రేవతి నగలన్నీ తీసుకొని హాల్లోకి వస్తుంది. ఈ నగలన్నీ మెరుగుపెట్టించి తీసుకొనిరా అని సేనాపతికి భద్రవతి చెప్తుంది. నగలు ఏంటి గిల్టీ నగలులాగా వెయిట్ తక్కువ ఉన్నాయని సేనాపతి అనగానే వాటి గురించి నీకేం తెలియదని భద్రవతి అంటుంది. గతంలో శ్రీవల్లి నగలు మార్చి గిల్టీ నగలు పెట్టి పంపిస్తుంది. ఆ విషయం ఇప్పుడు అందరికి తెలియనుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Sanjana Elimination: గేట్స్ ఓపెన్... సంజన ఎగ్జిట్... రాత్రిపూట డీమాన్ పవన్‌తో రీతూ చౌదరి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. ఫ్రెండ్ షిప్ కి బాండింగ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చింది. ఈ వారం ఎవరు ఊహించని విధంగా నామినేషన్ ప్రక్రియ సాగింది. రీతూ కెప్టెన్ అవ్వడంతో తనని ఎవరు నామినేట్ చెయ్యడానికి వీలు లేదు. అయితే రీతూ ఇద్దరిని నామినేట్ చేసింది. మొదటి నామినేషన్ కళ్యాణ్ ని చేయగా.. రెండో నామినేషన్ సంజనని చేసింది.  ఇక ఆ తర్వాత తన రీజన్లు చెప్పింది రీతు. సంజన గారు.. మీరు మొదటి రెండు వారాలు మాత్రమే కనిపించారు మీరు. ఇప్పటికే గేమ్ చివరి వరకు వచ్చింది కానీ మీరు కనిపించడం లేదని రీతూ అంది. దాంతో అంటే ఇన్ని వారాలు నేను నిద్రపోతూ ఉంటే ఇక్కడివరకు వచ్చానా.. నీలాగా గట్టిగా అరవడం.. బూతులు మాట్లాడడం నాకు రాదని సంజన ఫైర్ అయ్యింది. నేనేం బూతులు మాట్లాడాను.. నీలాగా నేనేం మాట్లాడలేదంటూ రీతూ .. ఏం మాట్లాడావో అందరికి తెలుసు అంటు సంజన ఇద్దరు కొట్టుకున్నంత పని చేశారు. నాకు తెలుసు.. నువ్వు రోజు ఏం చేస్తావో.. రోజు రాత్రి డీమాన్ తో కూర్చుంటావ్ అంటూనే కళ్లు మూసుకోవాల్సి వస్తుంది అని సంజన నోరుజారింది. అసలు ఏం మాట్లాడతున్నారు మీరు.. నేషనల్ టెలివిజన్ ముందు ఒక అమ్మాయి క్యారెక్టర్ పై ముద్ర వెయ్యడం కరెక్ట్ కాదని రీతూ ఏడుస్తుంది. ఇక అప్పుడే ఇమ్మాన్యుయల్ వస్తాడు. మీరు మాట్లాడింది తప్పు దాన్ని వెనక్కి తీస్కోండి అని అంటాడు. కానీ తను వెనక్కి తీసుకోనని అంటుంది. సంజన ఆ మాట అన్నందుకు హౌస్ మొత్తం సంజనకి వ్యతిరేకంగా మాట్లాడుతారు. రీతూ ఏడుస్తుంటే. నువ్వు ఏం తప్పు చేసావని ఏడుస్తున్నావ్.. ఏడిస్తే నువ్వు తప్పు చేసావని ఒప్పుకున్నట్లే అని తనూజ అంటుంది. కాసేపటికి సంజన దగ్గరికి డీమాన్ వస్తాడు. అక్క అలా మాట్లాడ్డం కరెక్ట్ కాదు.. ఇద్దరం ఫ్రెండ్స్ పక్కపక్కన కూర్చుంటే తప్పుగా మాట్లాడతారా అని డీమాన్ అంటాడు. అలా హౌస్ మొత్తం వ్యతిరేకంగా మాట్లాడినా సంజన తన వైఖరి అసలు మార్చుకోదు. గతంలో దొంగతనాలు చేసినప్పుడు.. మెడలో బోర్డు వేసి నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. సుమన్ శెట్టిని ఫెయిల్డ్ కెప్టెన్ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు సంజన విమర్శలు ఎదుర్కొంది. అప్పుడు నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. మరి ఈ సారీ వార్నింగ్ లు అంటూ ఏమీ ఉండవు.. డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇవ్వడం.. గేట్స్ ఓపెన్ అవ్వడం.. సంజన ఎగ్జిట్ అవ్వడం ఖాయమనిపిస్తోంది. అయితే సంజన చేసిన ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

Demon Pavan Worst Behaviour: రీతూపై కళ్యాణ్ ఫైర్.. పీక పట్టుకున్న డీమాన్ పవన్!

బిగ్ బాస్ సీజన్-9 లో నిన్నటి సోమవారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్ల ప్రక్రియ యమ జోరుగా సాగింది. ఎవరూ ఊహించని విధంగా డీమాన్ పవన్ , పవన్ కళ్యాణ్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఈ వారం రీతూ కెప్టెన్ అయింది. అయితే తను కెప్టెన్ అవ్వడం వెనుక డీమాన్ పవన్ సాక్రిఫైజ్ ఉందని అందరికి తెలుసు. అయితే దాని గురించి ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, రీతూ, డీమాన్ పవన్ మధ్య మాటల యుద్ధం సాగింది.  నిన్నటి నామినేషన్లో ఇమ్మాన్యుయల్ ని డీమాన్ పవన్ నామినేట్ చేశాడు. అసలు మిమ్మల్ని నామినేట్ చేయడం నాకు ఇష్టం లేదన్నా.. ఎందుకంటే మీరంటే నాకు ఇష్టం.. మీరు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది. అయినా నాకు పాయింట్లు ఉన్నాయి కాబట్టి నామినేట్ చేస్తున్నానంటూ ఇమ్మాన్యుయల్ ని నామినేట్ చేశాడు డీమాన్ పవన్. కెప్టెన్సీ టాస్క్ ముందు మీరు నాకు సపోర్ట్ చేస్తానని మాటిచ్చారు కానీ టాస్క్ లో మాట తప్పారు అని ఇమ్మాన్యుయల్ తో అన్నాడు. నేను నీకు సపోర్ట్ చేద్దామంటే అక్కడ బ్లూ టీమ్ వర్సెస్ రెడ్ టీమ్ ఆట సాగుతోంది.. నేను నీకు ఎలా సపోర్ట్ చేయగలను డీమాన్ .. అప్పటికి నేను కళ్యాణ్ తో అన్నాను.. డీమాన్ కి సపోర్ట్ చేద్దామని కానీ అతను వినలేదని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. మీరు అలా మాట తప్పడం నాకు నచ్చలేదని నామినేట్ చేసానని డీమాన్ అన్నాడు. మరి నువ్వు గివప్ ఎందుకిచ్చావంటూ కళ్యాణ్ మధ్యలో ఎంటర్ అయ్యాడు. సుమన్ అన్న, రీతూ, నువ్వు ముగ్గురే మిగిలారు కానీ నువ్వు గివప్ ఇచ్చేసి రీతూకి సపోర్ట్ చేశావని డీమాన్ తో కళ్యాణ్ అన్నాడు. దాంతో రీతూ మధ్యలోకి వచ్చి.. నీ గేమ్ నువ్వు ఆడావ్.. అతని గేమ్ అతను ఆడాడని అరిచేసింది. దాంతో కళ్యాణ్‌ ఇక చెలరేగిపోయాడు. నేను చెప్పేది అదే రీతూ.. వాడు వాడి గేమ్ ఆడట్లేదు.‌. నీకోసం ఆడాడు.. నీ కోసం వాడి కెప్టెన్సీని వదులుకున్నాడు అర్థమవుతుందా అంటూ రీతూపై కళ్యాణ్ ఫుల్ ఫైర్ అయ్యాడు. నేను డీమాన్ తో మాట్లాడుతున్నాను.. మా మధ్యలో నువ్వు వస్తే నేను వస్తానంటు రీతూ  మీదకి కళ్యాణ్ వెళ్తుంటే డీమాన్ ఆపుతాడు. అయితే ఎంత చెప్పినా వినకపోయేసరికి కళ్యాణ్ పీక పట్టుకుంటాడు. పక్కనే ఉన్న ఇమ్మాన్యుయల్ అది గమనించి.. వెంటనే డీమాన్ ని వదలు అని పక్కకి లాక్కెళతాడు. ఆయితే కళ్యాణ్ ని ఆపడానికే డీమాన్ పీక పట్టుకున్నాడు. కానీ అక్కడ వేరేలా పోట్రే అయింది. ఇక ఆ తర్వాత రీతూ వాగుతూనే ఉండటంతో కళ్యాణ్ తన కుర్చీని తన్నేసి వెళ్ళిపోయాడు. అయితే కళ్యాణ్ ఇంత అగ్రెసివ్ అవ్వడం ఇది రెండోసారి. గత వారం సుమన్ శెట్టిపై సీరియస్ అయిన కళ్యాణ్.. ఈ సారి రీతూపై ఇష్టమొచ్చినట్టు మాటలు అనేశాడు. ఇది చూసిన ఎవరికైనా ఒక్కటే అనిపిస్తుంది. వీకెండ్ లో నాగార్జున వచ్చి కళ్యాణ్ కి రెడ్ కార్డ్ ఇస్తాడని తాట తీస్తాడని ఆడియన్స్ అనుకుంటున్నారు. అయితే డీమాన్ పవన్, కళ్యాణ్ , రీతూల మధ్య జరిగిన ఈ హీటెడ్ ఆర్గుమెంట్స్ లో ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు కామెంట్ చేయండి.

చీకటి కోణంలో నటి హేమ ఇంటర్వ్యూ!

ఫామిలీ స్టార్స్ షోలో సరికొత్తగా ‘చీకటి కోణం’ అనే కాన్సెప్ట్ లో పాగల్ పవిత్ర ఇద్దరిని రోస్ట్ చేసింది. ఈ వీక్ ప్రోమోలో ఇది చూడొచ్చు. షో ప్రోమో లాస్ట్ లో "వర్ష ఇండస్ట్రీలో బాగా సెట్ ఐపోయింది కానీ ఒక లవ్ ట్రాక్ట్ వల్లనే తను సెటిల్ అయ్యిందని చెప్పేసి" అంటూ ఆపేసింది. వర్ష పవిత్ర ముఖం నవ్వుతూ చూస్తూ ఉంది కానీ ఆన్సర్ చెప్పలేదు. ఐతే మొదట్లో ఇమ్మానుయేల్ - వర్ష జోడి బుల్లితెర మీద బాగా హిట్ అయ్యింది. సుధీర్ - రష్మీ జోడిలా. ఇక వర్ష ఐతే కోడలొస్తోందని అత్తగారికి చెప్పు అంది.. అల్లుడొస్తున్నాడు అని మావగారి చెప్పు అంటూ ఇద్దరూ చాలా షోస్ లో లవ్ కాన్సెప్ట్స్ లో స్కిట్స్ కూడా చేశారు. కానీ ఫైనల్ గా ఇద్దరూ విడిపోయారు. ఇమ్మానుయేల్ అటు స్టార్ మాకి వెళ్ళిపోయాడు. అలా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వర్ష ఐతే ఇటు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ చేస్తూ మరో వైపు ఇంటర్వ్యూస్ చేస్తూ వెళ్తోంది. ఎలా ఐతే సుధీర్ - రష్మీ ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారో అన్నట్టు. ఐతే పవిత్ర నటి హేమను కూడా బాగా రోస్ట్ చేసింది. "మీకు సినిమాల్లో గ్యాప్ వచ్చిందా లేకపోతె మీరే తీసుకున్నారా" అంటూ నటి హేమాను అడిగింది పవిత్ర. "ఛిల్ల్ అవుదామని" అని ఫుల్ జోష్ తో చెప్పింది హేమ. "కాంట్రవర్సీతో మీరు రిలేషన్ షిప్ లో ఉంటారు కదా దాని గురించి అడుగుతున్నాను" అని చెప్పేసరికి హేమ ఆన్సర్ ఐతే ఇవ్వలేదు. మరి వీళ్ళు అసలు ఏమని సమాధానాలు చెప్తారో నెక్స్ట్ వీక్ షో టెలికాస్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.

Bigg Boss 9 Telugu 12th week Nominations: దివ్య వర్సెస్ భరణి.. తనూజకి ఇచ్చిపడేశాడుగా!

బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ రెండు విడతలుగా సాగింది. మొదటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా తనూజని భరణి నామినేట్ చేశాడు. తనూజ, దివ్య ఇద్దరి మధ్య ఏం జరిగినా నా గురించి గొడవ పెట్టుకుంటున్నారు. నిన్న కూడా తనకి ఇష్టం లేకున్నా బలవంతంగా మాట్లాడాలని ట్రై చేస్తున్నావని ఇండైరెక్ట్ గా నా టాపిక్ తీశారని తనూజని భరణి నామినేట్ చేస్తాడు. ఇక రెండో లెవెల్ నామినేషన్ లో భాగంగా దివ్యని భరణి నామినేట్ చేశాడు. నీకు చాలాసార్లు చెప్పాను. మీరు నాపై ఒక రకమైన ఎఫెక్షన్ చుపిస్తున్నారు కానీ మీకు ఒక విషయం గురించి ఎన్నిసార్లు చెప్పినా, ఎవరు చెప్పిన మీరు పట్టించకోవడం లేదు. మొన్న కూడా వచ్చినప్పుడు చెప్పారని భరణి అంటాడు. ఎవరు చెప్పారని దివ్య అడుగతుంది. రెస్పెక్ట్ గా మాట్లాడమని భరణి కోప్పడతాడు ఎవరు చెప్పారని నేను అడుగతున్నాను కానీ ఎవడు చెప్పాడు అనడం లేదు ప్లీజ్ భరణి గారు ఇది నేషనల్ తెలివిజన్ నన్ను బ్యాడ్ చెయ్యకండి అని దివ్య ఏడుస్తుంది. దివ్య ఫింగర్ చూపిస్తూ పాయింట్స్ చెప్తుంది. ఫింగర్ చూపించకు నీకు మాట్లాడే విధానం తెలియదని భరణి అంటాడు. మీకు అంత ఇబ్బందిగా ఉంటే ముందే చెప్పాలి కదా.. ఎవరైనా మీ నోటిని కట్టేసారా అని దివ్య అంటుంది. ఇదే నీలో నచ్చనిది.. ఏదైనా ఉంటే స్ట్రేట్ గా చెప్పమని దివ్యపై గట్టిగట్టిగా అరుస్తాడు భరణి. దాంతో ఇక మీరు నాతో మాట్లాడకండి భరణి గారు అని దివ్య చెప్తుంది. దివ్య ప్రైవేట్ నామినేషన్ లో భరణిని నామినేషన్ చేస్తుంది. ప్రతీదాంట్లో సపోర్ట్ చేస్తారనుకుంటా కానీ ఎప్పుడు డిస్సపాయింట్ చేస్తారు. మీ వల్ల నా గేమ్ పోయిందని దివ్య రీజన్ చెప్తుంది.

Wildfire Nominations : రీతూ చౌదరి తప్ప అందరూ నామినేషన్‌లోనే!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది.  ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది ఉన్నారు. ఈ వారం నామినేషన్ రెండు దశల్లో జరిగింది. మొదటి దశ ప్రైవేట్ నామినేషన్ జరిగింది. ఇందులో డీమాన్ పవన్ ని ఇమ్మాన్యుయల్ నామినేట్ చేయగా  సుమన్ ని కళ్యాణ్ నామినేట్ చేశాడు. తనూజని భరణి నామినేట్ చేశాడు. వాళ్లకు ఏదైనా గోడవ ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోండి. ప్రతీదాంట్లో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు.. ఇద్దరు మెచూర్ గా ఆలోచించడం లేదని తనూజని నామినేట్ చేశాడు. కళ్యాణ్ ని  డీమాన్ నామినేట్ చేశాడు.. భరణిని దివ్య  నామినేట్ చేసింది. సంజనని సుమన్ నామినేట్ చేయగా.. డీమాన్ ని తనూజ నామినేట్ చేసింది. సంజన, భరణి ని నామినేట్ చేసింది. అందరు తమ రీజన్స్ చెప్పి నామినేట్ చేసి మొదటి లెవెల్ నామినేషన్ ప్రక్రియని పూర్తిచేస్తారు. ఇక రెండో లెవెల్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్ అందరు ఎవరిని నామినేషన్ చెయ్యాలనుకుంటున్నారో తగిన కారణాలు చెప్పి వారి ఫోటోని మంటలో వెయ్యాలి. దివ్యని భరణి నామినేట్ చేశాడు. తనూజని సంజన నామినేట్ చేసింది. డీమాన్ ని కళ్యాణ్ చేయగా తనూజని సుమన్  నామినేషన్ చేశాడు. తనూజని దివ్య నామినేట్ చేసింది. ఇమ్మాన్యుయల్ ని డీమాన్ నామినేట్ చేశాడు. దివ్యని తనూజ నామినేట్ చేసింది. కళ్యాణ్ ని రీతూ నామినేట్ చేసింది. సంజనని రెండో నామినేషన్ గా రీతూ చేసింది. అలా కంటెస్టెంట్స్ అందరు రెండో లెవెల్ ని పూర్తి చేశారు. ఒక్క రీతూ తప్ప అందరు నామినేషన్ లో ఉన్నారు.

Jayam Serial : అత్తారింట్లో కొత్త కోడలు వేసిన ముగ్గు.. రన్నింగ్ చేయమన్న భర్త!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -123 లో......గంగకి అరిటాకు ఇచ్చి అందులో భోజనం పెట్టి ఒక మూలన తినుపోమని శకుంతల అంటుంది. ఇది నేను గౌరవంగా ఫీల్ అవుతున్నాను..  శుభకార్యాలయాల్లో ఇలాగే భోజనం పెడతారని గంగ ఒక పక్కకి వెళ్లి భోజనం చేస్తుంది. దాంతో రుద్ర, పెద్దసారు భోజనం చెయ్యకుండానే వెళ్ళిపోతారు. మరొకవైపు పారుని ఇషిక, వీరు కలుస్తారు. ఆ గంగని అత్తయ్య ఒక పనిమనిషిలాగే చూస్తుంది. నువ్వు అనుకున్నది చెయ్యడానికి ఇంకా నీకు అవకాశం ఉందని పారుతో ఇషిక అంటుంది. అవునా అని పారు హ్యాపీగా ఫీల్ అవుతుంది. గంగని శకుంతల అవమానించింది పెద్దసారు గుర్తుచేసుకొని దీనికి ఏదైనా సొల్యూషన్ ఆలోచించాలనుకుంటాడు. అప్పుడే రుద్ర వచ్చి నేను గంగని తనకి కంఫర్ట్ ఉన్న దగ్గరికి వెళ్ళమని అంటున్నా అని చెప్తాడు. నువ్వు తాళి కట్టిన భార్య ఎక్కడికి వెళ్ళదు అర్థం అయిందా అని పెద్దసారు చెప్తాడు. ఇంతకు నువ్వు అలా అంటే గంగ ఏమందని పెద్దసారు అడుగుతాడు. మీరు నా భర్త.. ఇది నా అత్తారిల్లు.. ఎక్కడికి వెళ్ళనని చెప్పింది అని రుద్ర అనగానే తను క్లారిటీగానే ఉందని పెద్దసారు అంటాడు. మరుసటిరోజు గంగ ఉదయం లేచి ముగ్గు వేస్తూ పాట పాడుతుంది. ఇంట్లో అందరు లేచి వస్తారు. ముగ్గు చాలా బాగుంది గంగ అని పెద్దసారు అంటాడు. కోడలు అంటే ఇలా ఉండాలని గంగ ని పెద్దసారు పొగుడుతాడు. అప్పుడే పారు ఎంట్రీ ఇస్తుంది. నీ ఆరోగ్యం ఎలా ఉంది ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు అని పారుతో పెద్దసారు అంటాడు. అదే అంకుల్ ఇక నుండి అలోచించి నిర్ణయం తీసుకుంటానని పారు అంటుంది. ఏంటి అందరు ఇక్కడ ఉన్నారని రుద్ర అడుగుతాడు. గంగ ముగ్గు వేసిందని పెద్దసారు చెప్తాడు.  ఈ ముగ్గు కంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే బాగుండేది కదా అని రుద్ర అంటాడు. ఈ ముగ్గుని పాడు చేస్తానని పారు వాటర్ పైప్ పగులగొడుతుంది. ముగ్గు పాడైతే నేను భోజనం చెయ్యనని గంగ అనగానే రుద్ర వెళ్లి వాటర్ రాకుండా చేస్తాడు. గంగ కూడా వెళ్తుంది. అది చూసి పారు ఇంకా కుళ్ళుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రాజ్ కడుతున్న కొత్త‌ కంపెనీ గురించి ఇంట్లో చెప్పేసిన స్వప్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -886 లో... సుభాష్ ని రాజ్ రెడీ చేసి తీసుకొని వస్తాడు. అపర్ణని కావ్య రెడీ చేసుకొని తీసుకొని వస్తుంది. మా అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎలా చూసుకుంటారని అబ్బాయి తరుపు వాళ్ళని కావ్య అడుగుతుంది. బాగా చూసుకుంటామని రాజ్ చెప్తాడు. అలాగే  అమ్మాయి తరుపు వాళ్ళు మీరు మా అబ్బాయిని  ఎలా చూసుకుంటారని రాజ్ అడుగుతాడు. బాగా చూసుకుంటామని కావ్య భారీ డైలాగ్స్ కొడుతుంది. సుభాష్, అపర్ణ ఇద్దరు దండలు మార్చుకుంటారు. అందరు ఒక్కొక్కరుగా వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు. కావ్య, రాజ్ మీరేం తీసుకొని రాలేదా అని రుద్రాణి అడుగుతుంది. ఎందుకు తీసుకొని రాలేదు తీసుకొని వచ్చామని కావ్య తను తీసుకొని వచ్చిన గిఫ్ట్ అపర్ణకి ఇస్తుంది. అపర్ణ చిన్నప్పటి ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి ఇస్తుంది. అది చూసి అపర్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సుభాష్ కోసం రాజ్ వాచ్ గిఫ్ట్ ఇస్తాడు. అది సుభాష్ చిన్నప్పటి వాచ్.. అది చూసి సుభాష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు స్వప్న ల్యాప్ టాప్ తీసుకొని వెళ్ళడానికి రాజ్ గదిలోకి వస్తుంది.‌ అప్పుడే కావ్య వచ్చి.. నువ్వేంటి అక్క ఇక్కడ అని అడుగుతుంది. ఏం లేదే స్టికర్ కోసం వచ్చానని అనగానే సరే అక్కడున్నాయి తీసుకోమని కావ్య అంటుంది. కావ్య ఉండగా ఎలా తీసుకొని వెళ్ళాలని స్వప్న అనుకుంటుంది. కావ్య బాసికల కోసం వెతుకుతుంది. కావ్య ఇక్కడ ఉన్నాయని స్వప్న ఇస్తుంది. దాంతో కావ్య అవి తీసుకొని వెళ్తుంది. స్వప్న ల్యాప్ టాప్ తీసుకొని వెళ్లి రాహుల్ కి ఇస్తుంది. ల్యాప్ టాప్ పాస్ వర్డ్ రాహుల్ కి చెప్తుంది. అందులో కొత్త కంపెనీకి సంబంధించినది ఏవి ఉండవు.. రాజ్ ఫోన్ లో ఉంటాయని ఇద్దరు అనుకుంటారు. రాజ్ దగ్గరికి వెళ్లి స్వప్న ఫోన్ అడుగుతుంది. అర్జెంట్ కాల్ మాట్లాడాలని తీసుకుంటుంది. మరొకవైపు పెళ్లి రోజు సెలెబ్రేషన్స్ లో అందరు హ్యాపీగా ఉంటారు. తరువాయి భాగంలో స్వప్న వచ్చి రాజ్ పెడుతున్న కొత్త కంపెనీ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప ప్రెగ్నెంట్.. తండ్రి కాబోతున్న కార్తీక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -523 లో..... స్వప్న, కాశీ ఇద్దరు మాట్లాడుకోవడం లేదని కార్తీక్ కి డౌట్ వస్తుంది. అసలు ఏమైందని కార్తీక్ అడుగుతాడు. కాశీ నన్ను మోసం చేశాడు అన్నయ్య అని స్వప్న చెప్తుంది. జరిగిందంతా స్వప్న చెప్తుంది. అలా అపార్ధం చేసుకోవద్దని ఇద్దరికి కార్తీక్ నచ్చజెప్పుతాడు. అప్పుడే దాస్ వస్తాడు. స్వప్న, కాశీ ని అక్కడ నుండి పంపిస్తాడు. నాకు వీళ్ళ గురించి టెన్షన్ లేదు.. దీప గురించి టెన్షన్ ఉంది.. ఇంకెన్ని రోజు లు జ్యోత్స్న టార్చర్ భరిస్తావని దాస్ అంటాడు. ఇప్పుడు నేను ముందు చేసే పని ఒకటి ఉంది.. మా అమ్మనాన్నలని కలపాలని కార్తీక్ అంటాడు. మరొకవైపు కాంచన దగ్గరికి  శ్రీధర్ వచ్చి మాట్లాడుతాడు. కాంచన బొట్టు పక్కకి వెళ్తుంది. దాంతో శ్రీధర్ బొట్టు పెడుతాడు. అప్పుడే కావేరి వస్తుంది బొట్టు పక్కకి వెళ్తే పెట్టానని శ్రీధర్ అంటాడు. నాకెందుకు చెప్తున్నారని కావేరి అంటుంది. అప్పుడే పారిజాతం ఎంట్రీ ఇచ్చి ఎన్నటికి ఉన్నా అక్క చెల్లెలు ఒక్కటే నువ్వు వేరే అని శ్రీధర్ ని ఉద్దేశ్శించి పారిజాతం అంటుంది. ఆ తర్వాత కాశీ, స్వప్నలని తీసుకొని వెళ్ళమని కావేరిని శ్రీధర్ పంపిస్తాడు. ఆ తర్వాత దీపకి సుమిత్ర జ్యూస్ తాగిస్తుంటే తను వాంథింగ్ చేసుకుంటుంది. దాంతో డాక్టర్ కి ఫోన్ చెయ్యమని శివన్నారాయణ చెప్తాడు. ఆ తర్వాత రాత్రి అమ్మ కలలోకి వచ్చిందని కాంచన చెప్తుంది. నాక్కూడా వచ్చిందని శివన్నారాయణ అంటాడు. నేను మీ మధ్యకి వస్తున్నానని చెప్పిందని కాంచన చెప్తుంది. రాబోయే సంఘటనలు ఇలా ముందే ఉహగా వస్తాయని పంతులు అంటాడు. అప్పుడే దీపని తీసుకొని సుమిత్ర, డాక్టర్ వస్తారు. కార్తీక్ తండ్రి కాబోతున్నాడు.. ఇప్పుడు దీప ప్రెగ్నెంట్ అని చెప్పగానే.. అందరు సంతోషపడుతారు.  జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : పిల్లల ఇష్టాలని తెలుసుకోండి.. కన్నతండ్రికి ఎదురుతిరిగిన కొడుకు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -324 లో..... శ్రీవల్లి అందరికి స్వీట్స్ తీసుకొని వస్తుంది. మీరు తినండి ముందు అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్తానని అంటుంది. ఏంటని రామరాజు అడుగుతాడు. సాగర్ మరిది గారికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని శ్రీవల్లి అనగానే.. అందరు షాక్ అవుతారు. సాగర్ కి గవర్నమెంట్ జాబ్ రావడం ఏంటి వాడికి జాబ్ చెయ్యాలని ఉంటే నాకు చెప్తాడు కదా అని రామరాజు అంటాడు. శ్రీవల్లి పేపర్ తీసుకొని వచ్చి రామరాజుకి ఇస్తుంది. అందులో సాగర్ పేరు ఉందని అంటుంది. అమూల్య చూసి అన్నయ్య క్వాలిఫై కాలేదు వదిన అని చెప్తుంది. జాబ్ రాలేదు కానీ ట్రై చేసాడు కదా అని శ్రీవల్లి అంటుంది. అది నిజమేనా అని  సాగర్ ని రామరాజు అడుగుతాడు. నిజమేనని సాగర్ అనగానే అందరు షాక్ అవుతారు. ఇలా జాబ్ చెయ్యాలని ఉందని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదని సాగర్ పై రామరాజు కోప్పడుతాడు. అంటే మీ మావయ్య గారి ఇంటికి ఇల్లరికం వెళ్లాలని నిర్ణయం తీసుకున్నావా అని రామరాజు ఆంటాడు. అలా అన్ని ఉహించుకోకండి.. నా భార్యలాగా నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలని ఉందని సాగర్ అంటాడు‌. ప్లీజ్ నాన్న పిల్లల ఇష్టాలను తెలుసుకోండి. మీరు మారండి అని సాగర్ అంటాడు. మీ నాన్నకి ఎదురు మాట్లాడుతావా అని సాగర్ పై వేదవతి కోప్పడుతుంది. ఆ తర్వాత సాగర్ బయట ఉండగా చందు వెళ్లి నాన్నకి ఎదురు మాట్లాడుతావా అని అడుగుతాడు. నేనేం తప్పు మాట్లాడలేదని సాగర్ అంటాడు. ఒరేయ్ చిన్నోడా చూడు వాడు ఎలా మాట్లాడుతున్నాడోనని చందు అనగానే నడిపోడు మాట్లాడిన దాంట్లో తప్పేముంది.. నాకు కరెక్ట్ అనిపించింది వాడికి నచ్చింది చెయ్యాలనుకుంటున్నాడని ధీరజ్ అంటాడు. మరొకవైపు వేదవతి దగ్గరికి నర్మద వచ్చి.. సారీ అంటుంది. నువ్వేం చెప్పకమ్మ అని నర్మదపై వేదవతి కోప్పడుతుంది. ప్రేమ వస్తుంది.. తనపై కూడా వేదవతి కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మేము కలిసినప్పుడు అక్కడ లైట్ లేదు.. ఏ ఛీఛీ!

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇది జోడీస్ స్పెషల్ గా రాబోతోంది. ఇక ఈ షోకి నిరుపమ్ - మంజుల పరిటాల, అంజలి - పవన్ తోట, అనిల్ - ఆమని గీలా జోడీస్ వచ్చారు. "మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది" అని అనిల్ ని అడిగింది సుమ. సమాధానం చెప్పలేక తడబడ్డాడు. దాంతో సుమ మళ్ళీ పంచ్ వేసింది "ఎన్నో పెళ్లి అని అడగలేదు" అని చెప్పింది. దాంతో అందరూ నవ్వేశారు. తర్వాత నిరుపమ్ - మంజుల పరిటాలను అడిగింది. "మీ ఆయన బర్త్ డే" అనగానే ఆగష్టు 17 " అని మంజుల చెప్పింది. "మీ బాబు పుట్టిన డేట్ " అని అడిగేసరికి బాబు, బాబు, మా బాబు అని నిరుపమ్ తడబడ్డాడు కానీ ఆన్సర్ చెప్పలేదు. తర్వాత అంజలి - పవన్ తోట దగ్గరకు వచ్చింది. "మీ ఆవిడని ఫస్ట్ టైం మీరు ఏ కలర్ శారీలో చూసారు" అని అడిగింది. "బ్లూ" అని చెప్పాడు పవన్ . "ఇంత టైం ఇచ్చినా కూడా తప్పు చెప్పాడు.. ఏ అమ్మాయి వచ్చింది బ్లూ కలర్ లో" అని అడిగేసింది అంజలి. "అక్కడ లైట్ బ్లూ కలర్ లో ఉంది కాబట్టి డ్రెస్ బ్లూ కలర్ లో కనిపించింది. "అసలు అక్కడ లైట్ లేదు" అని అంజలి అనేసరికి "ఏ ఛీఛీ తప్పుగా అనుకుంటారు" అంటూ పవన్ కంట్రోల్ చేసాడు. "అంటే మేము పగలు కలిశామండి" అని చెప్పింది అంజలి.

నాగార్జున సాక్షిగా భరణిపై కమెడియన్ శ్రీనివాస రెడ్డి దాడి.. కప్పుతోనే రావాలి డాడీ!

బిగ్ బాస్ సీజన్-9 ఫ్యామిలీ వీక్ నిన్నటితో ముగిసింది. నిన్నటి ఆదివారం నాటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి పిల్లలు గౌతమ్, రూపికలతో పాటు కమెడియన్ శ్రీనివాస రెడ్డి స్టేజ్ మీదకి వచ్చారు. సుమన్ శెట్టి అయితే తన పిల్లల్ని చూసుకొని తెగ మురిసిపోయాడు. ఇక భరణి గురించి శ్రీనివాస రెడ్డి చెప్పిన మాటలకి నాగార్జున సహా అందరూ తెగ నవ్వుకున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అసలేం జరిగిందో చూసేద్దాం. మీ లైఫ్‌లో ఒక టాప్ సీక్రెట్ మీరు రివీల్ చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్ వస్తారంటూ నాగార్జున అన్నాడు. దీంతో సుమన్ శెట్టి లేచి.. సర్ ఇంట్లో నైట్ షూటింగ్ అని చెప్పి ఫ్రెండ్స్‌తో పార్టీకి వెళ్తాను సర్ అంటూ సీక్రెట్ చెప్పాడు. పార్టీలకి వెళ్తావ్ అక్కడ ఏం జరుగుతుంది.. అని నాగార్జున అడుగగా.. అదే సర్ ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటామని సుమన్ శెట్టి చెప్తుంటే ఏయ్ ఏయ్ అంటూ పక్కనుంచి అందరు ఆటపట్టించారు. సుమన్ శెట్టి చెప్పిన సీక్రెట్ కి నాగార్జున తన ఫ్యామిలీ రావడానికి ఒకే చెప్పాడు. కాసేపటికి సుమన్ శెట్టి పిల్లలు గౌతమ్, రూపికతో పాటు కమెడియన్ శ్రీనివాస రెడ్డి స్టేజ్ మీదకి వచ్చారు. వీళ్లని చూడగానే ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు సుమన్. నాకా ఇది అంటూ శ్రీనివాస రెడ్డి అడిగితే పిల్లలకి అంటూ నవ్వుకున్నాడు. సుమన్ శెట్టి కూతురు రూపిక మాట్లాడుతూ.. చాలా బాగా ఆడుతున్నారు నాన్న.. గేమ్స్ అన్నీ బాగా ఆడుతున్నారు.. ట్రోఫీ తీసుకొని ఇంటికి రావాలి అంటూ చెప్పింది. ఖచ్చితంగా తల్లీ అంటూ సుమన్ మురిసిపోయాడు. తర్వాత బాక్స్‌లో నుంచి ఒక క్యారెక్టర్ ఫొటోని శ్రీనివాస రెడ్డి తీశాడు. అందులో దూకుడు సినిమాలో బ్రహ్మానందం చేసిన పద్మశ్రీ పాత్ర ఫొటో వచ్చింది. ఇది హౌస్ లోని ఏ కంటెస్టెంట్ కి ఇస్తావని అంటే  మా సుమన్‌ కి ఇస్తాను సర్ అని చెప్పాడు. కెమెరాకి కూడా కరెక్ట్‌గా ఇలాగే ఉంటాడంటూ శ్రీనివాస రెడ్డి చెప్పాడు. ఆ తర్వాత అపరిచితుడు ఫోటో రాగా దానిని తనూజకి డెడికేట్ చేశాడు. పాజిటివ్ గానే తీసుకోండి. మీరు ఒకసారి కోపం, ఒకసారి చిరాకు.. ఒకసారి ఏడుపు.. ఇలా మూడ్ మారిపోతుందని శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు. ఇక తర్వాత భరణి గురించి శ్రీనివాస రెడ్డి చెప్పిన మటలకి అందరూ తెగ నవ్వుకున్నారు. భరణి గారు రోడ్‌ సైడ్ చెరుకు బండ్లు కనబడుతుంటాయి.. అదేంటో ఆ మిషన్ ప్లేస్‌లో నువ్వే కనబడుతుంటావ్.. వాటిల్లో నుంచి నలిగి రసం బయటికి వస్తుంటుంది.. ఇక్కడేమో నీ నుంచి ఏం రాదు కానీ రెండువైపుల నుంచి రసాలేంటి నవరసాలు బయటకొస్తున్నాయంటూ శ్రీనివాస రెడ్డి చెప్పగానే పక్కనే ఉన్న నాగార్జున పడిపడి నవ్వుకున్నాడు. అటు తనూజ ఇటు దివ్య ఇద్దరి మధ్య చెరుకు గడలా భరణి నలిగిపోతున్నాడంటూ ఇండైరెక్ట్‌గా ఆయన చెప్పాడు. దీనికి భరణి కూడా బాగా నవ్వుకున్నాడు. ఇక అందరు బాగా ఆడుతున్నారని చెప్పాడు శ్రీనివాస్ రెడ్డి.‌ సుమన్ తన కొడుకు , కూతురికి బై చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయాక ఎమోషనల్ అయ్యాడు.

Divya Elimination Twist : ఈ వారం దివ్య ఎలిమినేషన్‌.. ఆడియన్స్‌కు చిరాకు వచ్చింది!

బిగ్‌బాస్ సీజన్-9 మొత్తం తనూజ చుట్టూనే తిరుగుతుంది. ఆమె ఆడినా ఓడినా ఏడ్చినా నవ్వినా అరిచినా చివరకి ఊపిరి పీల్చినా కూడా ఆమెని తప్ప మరొకరి ఫుటేజ్ ఇచ్చే సమస్యే లేదు అన్నట్లుగా షో నడుస్తుంది. అయితే చివరికి పవరాస్త్ర ఇమ్మానుయేల్ దగ్గరుంటే అది యూజ్ చేసేటప్పుడు కూడా మధ్యలో తనూజని హోస్ట్ నాగార్జున అడగటం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. మొత్తానికి అయితే ఈ వారం నో ఎలిమినేషన్ అయింది.  నిన్నటి ఎపిసోడ్ లో సండే ఫండేలో భాగంగా ఒక సెలెబ్రిటీ ఒక ఫ్యామిలీ మెంబర్ ని స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు బిగ్ బాస్. ఇక నామినేషన్ లో ఉన్నవారిని ఒక్కొక్కరిని సేవ్ చేయగా దివ్య, సంజన మిగిలారు. వారిని గార్డెన్ ఏరియాకి పిలిచాడు నాగార్జున. సంజన, దివ్య ఎలిమినేషన్ రౌండ్‌లో ఉన్నారు.. నీ దగ్గర పవరస్త్ర ఉంది.. దీనికి మూడు పవర్స్ అని బిగ్‌బాస్ నీకు చెప్పారు.. రెండు పవర్స్ ఇప్పటికే పూర్తయ్యాయి.. ఇప్పుడు నీకు మూడో పవర్ ఏంటో చెప్తున్నాను.. ఈ పవరాస్త్ర ఉపయోగించి ఈ వారం నువ్వు ఎలిమినేషన్‌ని క్యాన్సిల్ చేసేయొచ్చు.. అయితే ఈ పవరస్త్రకి ఆ పవర్ కేవలం ఈ వారం మాత్రమే ఉంటుంది.. ఒకవేళ నువ్వు దీన్ని ఉపయోగించకపోతే పవరస్త్రకి ఇచ్చిన పవర్స్ అన్నీ అయిపోయినట్లే అంటూ నాగార్జున చెప్పాడు. ఈ పవరస్త్రకి ఉన్న మూడో పవర్ వాడతావా లేదా ఆడియన్స్ నిర్ణయమే ఫైనల్ అని వదిలేస్తావా.. డెసిషన్ నీది.. అరవై సెకన్ల టైమ్ ఇస్తున్నానంటూ నాగార్జున అడిగాడు.  కాసేపు ఆలోచించి చివరికి వాడుతున్నాను సర్ అని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. పవర్ వాడుతున్నావ్ అంటే ఎలిమినేషన్‌ని క్యాన్సిల్ చేస్తున్నావని నాగార్జున మరోసారి అడిగాడు. అవును సర్ అంటే నాకు తెలుసు ఆడియన్స్ వారిద్దరిలో ఒకరు వెళ్లిపోవాలని నిర్ణయించారు.. కానీ పవర్ ఉపయోగించి వారికి ఇంకొక ఒన్ వీక్ ఛాన్స్ ఇస్తే వాళ్లని వాళ్లు ప్రూ చేసుకునే ఛాన్స్ ఉంటుందేమోనని నా అభిప్రాయం అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. అంటే ఇన్ని వారాలు వాళ్లు ప్రూ చేసుకోలేదా అంటూ నాగార్జున అడిగాడు. ప్రూ చేసుకున్నారు కాబట్టే టాప్-9 వరకూ వచ్చారు.. అని ఇమ్మూ చెప్పాడు. మరి ఇంకేం ప్రూ చేసుకోవడానికి వాళ్లకి ఇన్ని వారాల తర్వాత అవకాశం ఇస్తున్నావ్.. అంటూ నాగార్జున అడిగాడు. అంటే ఇది వాడినా వాడకపోయినా ఈ పవర్ అనేది పోతుంది సర్.. సో పవర్ ఉన్నప్పుడు వాడి ఒకరికి ఇమ్యూనిటీ ఇస్తే బెటర్ అని నా అభిప్రాయం.. ఒకవేళ అప్పటికి వాళ్లు ఇంప్రూ చేసుకోకపోతే ఆడియన్స్ మళ్లీ వాళ్ల నిర్ణయం ఎలాగూ చెప్తారంటూ ఇమ్మాన్యుయల్ క్లారిటీ ఇచ్చాడు. ఇక పవరస్త్ర వాడటంతో ఈ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్ అయింది.  ఇమ్మాన్యుయల్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయడంతో సంజన, దివ్య మీరిద్దరూ సేఫ్ లివింగ్ రూమ్‌లోకి వచ్చేయండి అని నాగార్జున చెప్పాడు. నువ్వు వాడిన పవరస్త్ర వల్ల సంజన, దివ్య ఇద్దరు హౌస్‌లోకి వచ్చేశారు.. కానీ వీళ్లలో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేటర్ అవ్వాలని నీకు తెలుసుకోవాలని ఉందా అని ఇమ్మాన్యుయల్, సంజన, దివ్యలని నాగార్జున అడుగగా.. ఎస్ అని అందరు అన్నారు. దాంతో దివ్య, సంజన ఇద్దరిని గార్డెన్ ఏరియాకి వెళ్ళమని ఎలిమినేషన్ రౌండ్ మొదలెట్టాడు నాగార్జున. ‌మీలో ఎవరి గన్ నుంచి రెడ్ కలర్ పేపర్స్ వస్తాయో వాళ్లు ఎలిమినేటర్.. గ్రీన్ వచ్చినవాళ్లు సేఫ్ అని నాగార్జున చెప్పాడు. అయితే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం సంజన సేఫ్ అయి దివ్య ఎలిమినేట్ అయింది. ఇమ్మాన్యుయల్ తన దగ్గరున్న పవరస్త్ర వాడడంతో ఈ వారం ఎలిమినేషన్ కి క్యాన్సిల్ అయి దివ్య సేవ్ అయింది. ఇక ఇద్దరిని హౌస్ లోకి రమ్మన్నాడు నాగార్జున.

Akhil Sarthak sweet warning to Demon Pavan: డీమాన్ పవన్‌కి అఖిల్ సార్థక్ స్వీట్ వార్నింగ్

బిగ్‌బాస్ సీజన్-9 లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ప్రతి హౌస్‌మేట్‌కి సంబంధించిన ఒక ఫ్యామిలీ మెంబర్, ఫ్రెండ్ స్టేజ్ మీదకి వస్తున్నారు. నిన్నటి ఆదివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి పిల్లలు, కమెడీయన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చారు. ఇక రీతూ చౌదరి కోసం ఆమె బ్రదర్, ఫ్రెండ్ అఖిల్ సార్థక్ స్టేజ్ మీదకి వచ్చారు.  రీతూ బ్రదర్ జతిన్, ఫ్రెండ్ అఖిల్‌ సార్థక్ ని చూడగానే రీతూ తెగ గెంతులేసింది. హాయ్ అఖిల్.. అంటూ రీతూ గట్టిగా నవ్వుతుంటే నవ్వకు అంటూ అఖిల్ పంచ్ వేశాడు. సర్ మీరు తన నవ్వును కాపీ కొట్టారనుకోండి.. బయటికెళ్లిన తర్వాత మీరు కూడా అలానే నవ్వుతారంటూ నాగార్జునతో సరదాగా అన్నాడు అఖిల్ సార్థక్. ఇంతలో జతిన్.. అతను డీమాన్.. అంటూ రీతూ బ్రదర్‌కి నాగార్జున పరిచయం చేశారు. హా తెలుసు సర్ అని జతిన్ అంటుంటే ఆయనకి తెలీకుండా ఉంటుందా.. అని అఖిల్ పంచ్ వేశాడు. హాయ్ జతిన్.. అని డీమాన్ చెప్తుంటే నువ్వు బయటికొచ్చాక జాగ్రత్తగా ఉండాలి డీమాన్ అంటూ అఖిల్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత బాక్స్‌లో నుంచి ఒక క్యారెక్టర్ ఫొటో తీశాడు అఖిల్. అది కాస్తా పుష్ప ఫొటో కావడంతో ఏయ్.. పుష్ప.. రీతూయే సార్ అసలు తగ్గనే తగ్గదంటూ అఖిల్ అన్నాడు. బయట చాలా నెగెటివ్ ఉండేది కానీ హౌస్ లోకి వచ్చి మొత్తం పాజిటివ్ అయిపోయావ్.. గేమ్స్ బాగా ఆడుతున్నావ్.. ఆ నవ్వుకి ఫ్యాన్స్ ఉన్నారంటూ రీతూతో అఖిల్ సార్థక్ అన్నాడు‌. ఏం అయినా మార్చుకోవాలా అని రీతూ అడుగగా.. ఏమీ లేదు.. నీ ఆట నువ్వు ఆడు.. ఇండివిడ్యువల్ గా ఆడు.. గేమ్స్ ఇంకా బాగా ఆడు అంటు అఖిల్ సార్థక్ చెప్పాడు. ఇక హౌస్ మేట్స్ అందరికి బాగా ఆడుతున్నారని చెప్పాడు అఖిల్ సార్థక్.