Bigg Boss 9 Telugu Family Time: ఫ్యామిలీ వీక్ లో డీమాన్ పవన్ వాళ్ళ అమ్మ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ఎమోషనల్!

బిగ్ బాస్ హౌస్ లో పదకొండవ వారంలో ఫ్యామిలీ వీక్ కొనసాగుతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో తనూజ సిస్టర్ ఇంకా సుమన్ శెట్టి వైప్ వచ్చి హౌస్ లో సందడి చేశారు. ఇక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో డీమాన్ పవన్ వాళ్ళ అమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రతి ఒక్కరికి అమ్మ అంటే ఒక స్పెషల్ ఎమోషన్ ఉంటుంది. ఇక కొన్ని రోజులపాటు అమ్మకి దూరంగా కనీసం మాట కూడా లేకుండా హౌస్ లో ఉంటారు కంటెస్టెంట్స్. మరి అలాంటి సిచువేషన్ లో హౌస్ లో వాళ్ల అమ్మని ఒక్కసారిగా చూడగానే ఆ ఫీలింగ్ వర్ణనాతీతం. డీమాన్ పవన్ టాస్క్ ఆడి ఫ్యామిలీతో ఎంత టైమ్ స్పెండ్ చెయ్యాలో సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ చింటూ అంటూ హౌస్ లోకి వస్తుంది. దాంతో పవన్ ఎమోషనల్ అవుతాడు. రాగానే తనకోసం చేసుకొని తీసుకొని వచ్చిన సున్నుండ తినిపిస్తుంది. రీతూ తన దగ్గరికి వెళ్తుంది. తనకి కూడా తినిపిస్తుంది. ఇక పవన్ వాళ్ళ అమ్మ పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. పవన్ తన ఆట గురించి ఆడి తెలుసుకుంటాడు. అంత బాగుందని వాళ్ళ అమ్మ చెప్తుంది. హౌస్ లో అందరితో వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. నాకు హౌస్ లో ఎవరు సపోర్ట్ చెయ్యరు ఒక్క అమ్మాయి తప్ప అంటూ రీతూని చూపిస్తాడు డీమాన్. ఆ తర్వాత పవన్ కి ఇచ్చిన టైమ్ అయిపోతుంది. పవన్ కి బయట అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అయిందని వాళ్ళ అమ్మ చెప్పగానే పవన్ సిగ్గుపడతాడు. ఇక అమ్మ సెంటిమెంట్ సాంగ్ వెయ్యడంతో హౌస్ అంత ఎమోషనల్ అవుతారు. 

Bigg Boss 9 Telugu Family Week: హౌస్ లోకి సంజన ఫ్యామిలీ ఎంట్రీ.. ఎమోషనల్ ఎపిసోడ్!

బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండవ వారం ఫ్యామిలీ వీక్ మొదలైంది. ‌ఇందులో భాగంగా రెండో రోజు కూడా కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీస్  వచ్చారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ బాంబు వల్ల గతవారమే సంజన ఫ్యామిలీ వీక్ సాక్రిఫైస్ చేసింది. నిన్నటి నుండి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంటే సంజన ఎమోషనల్ అయింది. ప్లీజ్ బిగ్ బాస్ నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అంటూ కెమెరాకి మొరపెట్టుకోవడం తెలిసిందే అయితే బిగ్ బాస్ కరిగిపోయి మిగతా కంటెస్టెంట్స్ తమ ఫ్యామిలీ వీక్ లోని కొంత టైమ్ సంజనకి త్యాగం చేయాలని చెప్తాడు. దాంతో ఇమ్మాన్యుయల్ పది నిమిషాలు, భరణి అయిదు నిమిషాలు కళ్యాణ్ అయిదు నిమిషాలు ఇవ్వగా సంజన ఫ్యామిలీ టైమ్ ఇరవై నిమిషాలు అవుతుంది. ఇక కాసేపటికి సంజన ఫ్రీజ్ లో ఉండగా అప్పుడే తన పిల్లలు భర్త హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళని చూసి సంజన ఎమోషనల్ అవుతుంది. తన అయిదు నెలల కిడ్ ని చూసి సంజన హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొదటి నుండి నా చిన్నపాపని వదిలేసి వచ్చాననే ఎమోషన్ అయితే క్యారీ చేస్తూ వచ్చింది.

Jayam serial : రుద్ర ప్రతాప్ భార్య గంగ  ఎంట్రీ.. ‌షాకిచ్చిన‌ పారు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -118 లో......గంగని రుద్ర పెళ్లి చేసుకున్నాడని అందరికి తెలుస్తుంది. ఒక్క పెద్దసారు తప్ప అందరు షాక్ లో ఉంటారు. గంగ మీడియాతో మాట్లాడడం పెళ్లి మండపంలో అందరు చూస్తారు. మీరు రుద్ర సర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారట డైరెక్ట్ ఇక్కడేకే తీసుకొని వచ్చారట సర్ గ్రేట్ మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ఛాంపియన్ ని చేసాడని మీడియా వాళ్ళు గంగతో అంటారు. ఈ విజయం రుద్ర సర్ ది అని గంగ మీడియా వాళ్ళకి చెప్తుంది. అదంతా టీవీలో అందరు చూస్తారు. ఇప్పుడు అర్థం అయింది ఇదంతా గంగ నువ్వు ప్లాన్ ప్రకారం నన్ను ఫూల్ ని చెసారు అని రుద్రపై పారు కోప్పడుతుంది. అప్పుడే గంగ ట్రోఫీ పట్టుకొని ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ రుద్రని ట్రోఫీని నేనే గెలుచుకున్నానని చెప్పడానికి వచ్చావా అని గంగతో పారు అంటుంది. ఈ అనార్ధం జరగకుండా ఉండాలనే నిన్ను ఇంట్లో నుండి బయటకు పంపించేసాం.. అయినా జరిగిందని ఇషిక అంటుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోమని గంగతో వీరు అంటాడు. అది చెప్పడానికి మీరు ఎవరు.. నేను రుద్ర ప్రతాప్ భార్యని విజయేంద్ర ప్రతాప్ కోడలిని అని గంగ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత విన్నారా ఇదంతా వీళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు కానీ నేనే అర్ధం చేసుకోలేదు. ఇక ఇంత జరిగాక నేను ఉండను.. ఇలా జరుగుతుందని ముందే తెలుసని పారు తన దగ్గరున్న పాయిజన్ తాగుతుంది. తరువాయి భాగంలో గంగ వల్లే పారు ఆత్మహత్యాయత్నం చేసిందని పారు అన్న హరి కంప్లైంట్ ఇవ్వడం తో గంగని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రాహుల్ కి భాద్యతలు అప్పగించిన రాజ్.. రుద్రాణి ప్లాన్ సక్సెస్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -882 లో.. రాహుల్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని రాజ్ ని కావ్య రిక్వెస్ట్ చెయ్యడంతో రాజ్ సరే అంటాడు. అందరు భోజనం చేస్తుండగా రాహుల్ ని రాజ్ పిలిపించి చేతిలో ఆఫీస్ లో జాయినింగ్ లెటర్ పెడతాడు. అది చూసి మనసులో సంతోషపడుతూనే బయటకు మాత్రం ఎందుకు నాకు ఇంత పెద్ద బాధ్యత అని యాక్టింగ్ చేస్తాడు. నేను ఆఫీస్ కి ఇప్పట్లో రాను నువ్వే ఆఫీస్ చూసుకోవాలని రాజ్ చెప్తాడు. చూసావా రుద్రాణి మా రాజ్ నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నాడు. అది మంచి విషయం కాబట్టి మేం ఏం అడ్డుపడడం లేదని ధాన్యలక్ష్మి అంటుంది. రాజ్ నా కొడుకుపై నమ్మకంతో ఇదంతా చేస్తున్నాడు.. అదేదో నువ్వు చేసినట్లు అంటున్నావేంటని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్ తను చెప్పింది చేసాడని కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అనుకున్నది సాధించామంటూ రుద్రాణి, రాహుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఆఫీస్ మొత్తం నా గుప్పిట్లో పెట్టుకొని వీళ్ళని ఎలా ఆడిస్తానో చూడు మమ్మీ అని రాహుల్ అంటాడు. రాహుల్ ఆఫీస్ కి వెళ్తాడు. తనని చూసి వీడెందుకు వస్తున్నాడని శృతి అనుకుంటుంది. ఏం శృతి షాక్ అయ్యావా.. పెండింగ్ లో ఉన్న ఫైల్స్ అన్నీ పట్టుకొని క్యాబిన్ కి రా అని రాహుల్ చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏం పులిహోర కలుపుతాడోనని శృతి భయపడుతుంది. మరొకవైపు సుభాష్, అపర్ణ కోసం రాజ్, కావ్య బట్టలు ఆర్డర్ పెడతారు. ఇప్పుడెందుకని ఇంట్లో వాళ్ళు అడుగగా.. రేపు అమ్మానాన్నల పెళ్లిరోజు అని రాజ్ చెప్తాడు. మీ పెళ్లిచూపులు ఎలా జరిగాయని రాజ్ అడుగుతాడు. అసలు పెళ్లిచూపులే జరగలేదని అపర్ణ అంటుంది. తరువాయి భాగంలో సుభాష్, అపర్ణకి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : శివన్నారాయణ ఇంట్లో హోమం.. దీపకి గుడ్ న్యూస్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -519 లో.....శ్రీధర్ ఇంటికి పారిజాతం వెళ్లి వాళ్లని హోమానికి ఆహ్వానిస్తుంది. మేమ్ రాము అని శ్రీధర్ చెప్తాడు. అల్లుడు నేను అన్నమాటలన్నీ మనసులో పెట్టుకోకని పారిజాతం అంటుంది. పారిజాతం రిక్వెస్ట్ చెయ్యడంతో.. వస్తాను కానీ నా భార్య వస్తేనే వస్తానని శ్రీధర్ అంటాడు. కావేరి నువ్వు నా కూతురులాంటి దానివిరా.. అమ్మ హోమానికి అని పిలుస్తుంది. మీరు ఫోన్ చేసిన కూడా మేమ్ వచ్చేవాళ్ళం కానీ మీరు మా అయనని బాధపెట్టారని కావేరీ అంటుంది. ప్లీజ్ అవన్నీ మనసులో పెట్టుకోకండి అని పారిజాతం రిక్వెస్ట్ చెయ్యడంతో కావేరి కూడా సరే అంటుంది. స్వప్న, కాశీ మీరు కూడా రండి అని పారిజాతం చెప్తుంది. కాసేపటికి అక్కడ నుండి అందరు బయల్దేరతారు. ఇంటికి వెళ్ళాక పారిజాతాన్ని లోపలికి పంపించి జ్యోత్స్నతో కార్తీక్ మాట్లాడతాడు. అదంతా దూరం నుండి పారిజాతం వింటుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి.. రేయ్ కార్తీక్ అక్కడ ఎందుకు మాట్లాడుకుంటున్నారు. పారిజాతాన్ని మధ్యలో పెట్టి మాట్లాడుకోండి.. తను మీరు ఏం మాట్లాడుకుంటున్నారో వినపడక  ఇబ్బంది పడుతుందని శివన్నారాయణ వెటకారంగా మాట్లాడతాడు. ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకుంటారు. విపత్తు అనేది వీళ్ళ కుటుంబానికి.. మనకి కాదు మంచి అనేది ఈ ఇంటికి వారసురాలికి.. నాకు కాదు.. ఆ దీపకి అంటూ ఆగిపోతుంది. ఏంటే అసలైన వారసురాలు ఎవరో తెలుసా అని పారిజాతం అడుగుతుంది. అదేం లేదని జ్యోత్స్న కవర్ చేస్తుంది. ఇప్పుడు ఈ హోమంతో మనకేం పనిలేదని జ్యోత్స్న అంటుంది. ఆ కార్తీక్ ఇంటికి వెళ్లి కాంచనకి హోమం గురించి చెప్తాడు. ఆ తర్వాత శివన్నారాయణ నిద్రపోతుంటే కలలో తన భార్య కన్పిస్తుంది.. అలాగే కాంచనకి కూడా కన్పించి నేను వస్తున్నానని చెప్తుంది. దాంతో కాంచన ఒక్కసారిగా లేచి భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : సాగర్ ఎగ్జామ్ రిజల్ట్స్.. ప్రేమ పోలీస్ ప్రాక్టీస్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -320 లో... సేనాపతి స్టేషన్ నుండి వచ్చి ప్రేమ తో మాట్లాడుతాడు. నిన్ను ఎంతో గారాబంగా పెంచాను కానీ నువ్వు ఇలా చేస్తావ్ అనుకోలేదని సేనాపతి అంటాడు. మీరు అన్యాయంగా నర్మద అక్కని లంచం కేసులో ఇరికించారు.. అది అన్యాయం కాదా అని ప్రేమ అంటుంది. మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటని సేనాపతి ఎమోషనల్ అవుతాడు. దాంతో ప్రేమ బాధపడుతుంది. ప్రేమ డల్ గా ఉందని తనని నవ్వించడానికి ఇంట్లో వాళ్లంతా ట్రై చేస్తారు. డాన్స్ చేస్తుంటారు. అయిన ప్రేమ బాధపడుతూ ఉంటుంది. నర్మద వచ్చి ప్రేమ చెవిలో ఏదో చెప్తుంది. అది విని నవ్వుతుంది.. ఏం చెప్పావని నర్మదని వేదవతి అడుగుతుంది. అలా అందరు చెవిలో చెప్పుకొని నవ్వుకుంటారు. చివరగా తిరుపతి వరకు విషయం వచ్చేసరికి ఏంటి విషయం అని ముగ్గురు అన్నదమ్ముళ్లు అడుగుతారు. ఏం లేదు రా డాన్స్ చేసేటప్పుడు మీ ప్యాంటు జారిందని నవ్వుతున్నారని తిరుపతి చెప్పగానే అందరి ముందు పరువు పోయిందిగా అని అన్నదమ్ముళ్లు అనుకుంటారు. మరుసటిరోజు నర్మద త్వరగా నిద్ర లేచి సాగర్ ని నిద్రలేపుతుంది. ఈ రోజు నీ VRO రిజల్ట్స్ అని చెప్తుంది. వచ్చేటివి వస్తాయి కదా అని బద్ధకంగా మాట్లాడుతుంటే నర్మద పట్టుబట్టి సాగర్ ని లేపుతుంది. మరొకవైపు రన్నింగ్ ప్రాక్టీస్ కి వెళ్లాలని ప్రేమను ధీరజ్ నిద్ర లేపుతాడు. నర్మద, సాగర్ రెడీ అయి బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతారు. మరొకవైపు ప్రేమ, ధీరజ్ రన్నింగ్ కి బయల్దేర్తారు. కానీ ఇంటి ముందు ముగ్గు వేస్తూ శ్రీవల్లి ఉంటుంది. తనని చూసి లోపలే ఆగిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Telugu 12th week Voting: పన్నెండో వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళే!

బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండవ వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. ‌ఇందులో ఈసారి ఇమ్మాన్యుయల్ నామినేషన్ లో ఉన్నాడు. కెప్టెన్ అయిన కారణంగా తనూజ నామినేషన్ లో లేదు. అలాగే తనకున్న పవర్ తో రీతూని సేవ్ చేసింది తనూజ.  ఇక నామినేషన్ లో ఉన్నవారిలో కళ్యాణ్ పడాలకి అత్యధికంగా 34.44 శాతం ఓటింగ్ పడింది. ఇమ్మాన్యుయేల్ దాదాపు మూడు వారాల గ్యాప్ తర్వాత నామినేషన్స్‌లోకి వచ్చినా తనకి 23.55 శాతం ఓటింగ్ పడి రెండో స్థానంలో ఉన్నాడు. గత పదివారాల్లో మూడుసార్లు కెప్టెన్, ఇమ్మ్యూనిటీ పవర్ వల్ల సేఫ్‌గా ఉన్న ఇమ్మాన్యుయల్ ఇప్పుడు కూడా అత్యధిక ఓటింగ్ తో ఉన్నాడు. ఇక భరణి 16.61 శాతం ఓటింగ్ తో మూడో స్థానంలో ఉన్నాడు. భరణి తన ఆటని మెరుగుపరుచుకున్నాడని ఈ ఓటింగ్ బట్టి తెలుస్తోంది. కళ్యాణ్, భరణి, సుమన్ శెట్టి మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. డీమాన్ పవన్ 11.14 శాతం ఓటింగ్ తో నాలుగవ స్థానంలో ఉన్నాడు. దివ్య 7.84 శాతం ఓటింగ్ తో అయిదవ స్థానంలో ఉన్నారు. సంజన 6.41 శాతం ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఉన్న ఓటింగ్ ప్రకారం వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. కానీ శుక్రవారం అర్థరాత్రి వరకు ఓటింగ్ కొనసాగుతుంది కాబట్టి ఫలితాలు మారే ఆస్కారం ఉంది. మరోవైపు బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం ఫ్యామిలీ వీక్ కూడా మొదలైంది. ఈ వారం ఎలిమినేషన్ నిజంగా జరిగితే డేంజర్ జోన్‌లో ఉన్న దివ్య, సంజన, డీమాన్ పవన్ లో ఎవరైనా బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ డీమాన్ బయటకు వెళ్తే రీతూ - డీమాన్ ల లవ్ ట్రాక్ గండిపడాల్సిందే. మరి సంజనని ఎలిమినేట్ చేస్తారా లేక తనకి ఫేవరెటిజం చూపిస్తారా లేక దివ్యని బలిపశువుని చేస్తారా అని ఆడియన్స్ భావిస్తున్నారు.

Bigg Boss 9 Telugu Family week: తనూజతో కొంచెం జాగ్రత్తగా.. హింట్ ఇచ్చిన సుమన్ భార్య లాస్య!

బిగ్ బాస్ సీజన్-9 లో పదకొండవ వారం ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఇందులో మొదటగా తనూజ వాళ్ళ అక్క పాప, చెల్లి అనూజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాసేపటికి సుమన్ శెట్టి భార్య లాస్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. లాస్య హౌస్ లోకి రాగానే సుమన్ శెట్టి చిన్నపిల్లాడు అయిపోయాడు. ఎగిరి గంతేసి తన భార్యని హత్తుకొని బుగ్గన ముద్దులు పెడుతూ తన ప్రేమని చూపించాడు. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు.. అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది.. బాగా ఆడుతున్నానా.. నువ్వెందుకు ఇలా చిక్కిపోయావ్.. నేను లేకుండా ఎలా ఉంటున్నా అంటూ వరుసగా ప్రశ్నలు వేసి మురిసిపోయాడు సుమన్.  ఇక వెళ్లే ముందు సుమన్‌కి తన భార్య లాస్య ఒక సలహా ఇచ్చింది. సంజన గారితో కొంచెం ఇబ్బంది.. మిమ్మల్ని తొక్కలో కెప్టెన్ అన్నదానికి ఇప్పటికీ మేం డిజప్పాయింట్ అవుతున్నాం.. అలానే మీరు తనూజతో తగ్గించండి అంటూ లాస్య చెప్పింది. దీంతో బాలేదా నెగటివ్ వస్తుందా.. అని సుమన్ అడిగాడు. నెగెటివ్ కాదు తనే హైప్ ఉంటుంది.. తను ఎవరు హైప్‌లో ఉంటారో వాళ్లని మంచి చేసుకుంటుంది.. అందుకే చెప్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి.. నేను అంటున్నది మంచిగా మాట్లాడినా.. నమ్మకండి.. మీ మాటికి మీరు పని చేసుకోండి అంటూ క్లియర్‌గా చెప్పింది. ఇక ఆ తర్వాత అందరి గురించి అడిగి తెలుసుకున్నాడు సుమన్. నా ఆట ఎలా ఉంది.. హౌస్ లో ఉన్నట్టుగానే ఇక్కడ ఉంటున్నాను కదా అని అడుగగా అవును నేచురల్ గా ఉ‌న్నావని లాస్య అంది. ఇక లాస్య వెళ్లేముందు తనతో డ్యాన్స్ చేశాడు సుమన్ శెట్టి. భార్య ఇచ్చిన టిప్స్ తో సుమన్ శెట్టి తన ఆటని మెరుగుపర్చుకొని టాప్ లో ఉంటాడా లేదా అనేది చూడాలి మరి. 

నా పెళ్ళికి బిగ్ బాస్ ట్రోఫీ గిఫ్ట్ కావాలి... నువ్వు ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది‌

బిగ్ బాస్ సీజన్-9 లో పదకొండవ వారం ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరిని వరుసగా నిల్చోబెట్టి బిగ్ బాస్ మాట్లాడాడు. ‌అదే ఫ్యామిలీ వీక్ గురించి తన మాటల్లో చెప్పాడు బిగ్ బాస్.  బిగ్‌బాస్ ఇంట్లో మీ ప్రయాణం చివరి అంకానికి అతి చేరువలో ఉంది.. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ సాగిన మీ ప్రయాణం మిమ్మల్ని ఎన్నో భావోద్వేగాలకి గురి చేసింది.. పరిస్థితులు ఏమైనా కొన్ని బంధాలు మాత్రమే ఎప్పటికీ మీ తోడుని వదలవు.. అలాంటి బంధాల్ని మీ ప్రయాణం కోసం ఈ ఇంటి బయటే వదిలేసి మీ లక్ష్యం కోసం ఈ ఇంట్లో అడుగుపెట్టారు.‌ కుటుంబం మీ తోడు ఉంటే ప్రపంచాన్ని గెలిచే శక్తి వచ్చినట్లే.. ఇది ఆ శక్తిని పొందే సమయం.. కానీ ఎవరు తమ ప్రియమైన వ్యక్తులతో ఎంత సమయం గడపాలో తద్వారా ట్రోఫీ వైపు ఎంత ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తారన్నది మీ కృషిపైనే ఆధారపడి ఉంటుంది.. ఇందుకోసం మీకు నేను పెడుతున్న పోటీ చిక్కుముడి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఈ పోటీలో ఎవరు ఏ స్థానంలో నిలుస్తారో దాన్ని బట్టి బోర్డ్ మీద ఉన్న టైమ్ ఫ్రైమ్ దక్కుతుంది. అత్యధికంగా అరవై నిమిషాల సమయం ఈ బోర్డు మీద ఉంటే.. అతి తక్కువ సమయం పదిహేను నిమిషాలుగా ఉంది. మీరు మీ కుటుంబంతో గడిపే ప్రతీ నిమిషం.. వారు మీకు తెలిపే ప్రతీ విషయం మిమ్మల్ని ట్రోఫీ వైపు ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో సహాయపడుతుందన్ని విషయం మర్చిపోకండి అంటూ పోటీకి ముందు బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఇక్కడే దత్తపుత్రికకి ఫేవరెటిజం చూపించాడు బిగ్ బాస్. మీరు కెప్టెన్ అయినందున మీకు నచ్చిన బోర్డ్ ని తీసుకోవచ్చు తనూజ అని అనడంతో తను వెళ్ళి అరవై నిమిషాలు ఉన్న బోర్డ్ తీసుకుంది. ఇక ఆ తర్వాత తాళ్ళతో కూడిన గేమ్ మొదలైంది. ఇందులో డీమాన్ పవన్ కి ముప్పై నిమిషాలు, ఇమ్మాన్యుయల్ కి ఇరవై నిమిషాలు, దివ్యకి పదిహేను నిమిషాలు, భరణికి పదిహేను నిమిషాలు వచ్చాయి. అయితే కళ్యాణ్ ముందుగా వచ్చి ఇరవై నిమిషాలు ఉన్న బోర్డ్ ని పట్టుకొని సుమన్ శెట్టి రాగానే తనకి ఇచ్చేశాడు. అది చూసిన సంజన.. మీరు అలా స్వాప్ చేసుకోకూడదని వాదించింది. కానీ బిగ్ బాస్ అలా చెప్పలేదు కదా అని కళ్యాణ్ అన్నాడు. ఇక ఫైనల్ గా మీ నిర్ణయం చెప్పండి అని సంజనని బిగ్ బాస్ అడుగగా.. హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో సుమన్ గారికి ఇరవై నిమిషాలు, కళ్యాణ్ కి పదిహేను నిమిషాలు గల బోర్డ్ లు ఇచ్చింది సంజన.  ఇక ఫ్యామిలీ వీక్ లో మొదటగా తనూజ వాళ్ళ అక్క పాప, తనూజ చెల్లి అనూజ హౌస్ లోకి వచ్చారు. వారిని చూసి తనూజ ఎమోషనల్ అయింది.  ఇక అనూజ కొన్ని టిప్స్ ఇచ్చింది. ఎక్కువగా ఏడ్వకు.. చిరాకు పడకు.. నువ్వు ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది‌. నువ్వు ఒక్కరోజు ఏడిస్తే అమ్మ ఇంట్లో రెండు రోజులు ఏడుస్తుంది‌. అర్థరాత్రి పన్నెండు గంటలకి అక్క, అమ్మ కాల్ చేసి లైవ్ చూసావా అని అడుగుతున్నారు. 24/7 వాళ్లు నిన్ను లైవ్ లో చూస్తున్నారు. నా పెళ్ళి ఉందనే విషయం మర్చిపోయి నీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళని హ్యాండిల్ చేయడం నాకు కష్టంగా ఉంది. నిజంగా నా పెళ్ళి పనులు ఓ వైపు, అమ్మ, అక్కని హ్యాండిల్ చేయడం మరోవైపు అవుతుందని అనూజ అంది. ఇక ఏడ్వనని తనూజ అంది.  ఇక అనూజని పెళ్ళి కూతురు చేసింది తనూజ. ఆ తర్వాత నా పెళ్ళికి గిఫ్ట్ గా 'బిగ్ బాస్ ట్రోఫీ' తీసుకొని రా అని తనూజకి వెళ్ళేముందు  చెప్పేసింది అనూజ.

Sanjana family week: బిగ్ బాస్ సీజన్-9 లో సంజన ఫ్యామిలీ వస్తుందా!

బిగ్‌బాస్ సీజన్-9లో ఫ్యామిలీ వీక్ మొదలైపోయింది. అయితే అందరి చూపు సంజన ఫ్యామిలీ మీదే ఉంది. అసలు సంజన ఫ్యామిలీ వస్తుందా.. తన పిల్లల్ని చూసుకునే ఛాన్స్ బిగ్‌బాస్ ఇస్తారా అంటూ ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే సంజన ఫ్యామిలీ వీక్ ఉండటం కన్ఫమ్ కానీ దానికి ఇంకా కాస్త టైమ్ ఉంది.  నిన్నటి ఎపిసోడ్ లో తనూజ వాళ్ళ అక్క పాప, అనూజ వచ్చారు. అలాగే సుమన్ శెట్టి వాళ్ళ భార్య వచ్చారు. అయితే సంజనకి మాత్రం ఇప్పుడే ఫ్యామిలీని పంపించరు ఎందుకంటే సంజనని ఇంకా కొంచెం ఏడిపించి బిగ్ బాస్ సీజన్-9 టీఆర్పీ చూసుకొని,  చివరికి హౌస్‌మేట్స్ కొందరితో ఏదైనా త్యాగాలు చేయించి ఆ ఛాన్స్ ఇస్తారనుకుంట. అయిదు నెలల చిన్నబాబుని ఇంట్లో వదిలేసి సంజన బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. నిజానికి ఇది గొప్ప విషయం ఎందుకంటే ఆ సమయంలో తన బాబు దగ్గర ఉండాలని ప్రతీ తల్లి అనుకుంటుంది. అమ్మ స్పర్శని బిడ్డ ఎంతగా కోరుకుంటుందో అందరికి తెలుసు. కానీ సంజన మాత్రం బిగ్‌బాస్ హౌస్‌లోకి రావాలని నిర్ణయించుకొని తన దృష్టిలో పెద్ద త్యాగమే చేసింది.  అయితే ఇటీవల తన భర్త వీడియో మెసేజ్‌ని సంజనకి చూపించారు. ఆ సమయంలో సంజన ఇద్దరు పిల్లలు అందులో కనిపించారు. ముఖ్యంగా తన చిన్న బాబుని చూసి సంజనకి కన్నీళ్లు ఆగలేదు. తన కొడుకు అయితే అమ్మ మీద అలిగి సంజనతో సరిగా మాట్లాడలేదు. అప్పుడే సంజన చాలా ఏడ్చేసింది. పోనిలే ఫ్యామిలీ వీక్‌లో తన పిల్లల్ని, భర్తని చూసుకోవచ్చని సంజన అనుకుంది. కానీ గతవారం సండే ఎపిసోడ్ లో బిగ్ బాంబ్ పేరుతో తనకి నో ఫ్యామిలీ వీక్ అని నాగార్జున చెప్పాడు.  నిన్నటి ఎపిసోడ్ లో తనూజ వాళ్ళ అక్క పాపని చూడగానే సంజన ప్రేమతో మురిసిపోయింది. తన కూతుర్ని ఎత్తుకున్నట్లే ఫీలై దగ్గరికి తీసుకొని తనతో ఆడుకొని ముద్దు పెట్టి అల్లాడిపోయింది. అది చూసి బిగ్ బాస్ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. సంజనకి ఫ్యామిలీ వీక్ ఉంటుందా? ఉండదా మరి ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ లో గెలిచిన గంగ.. రుద్ర పెళ్ళి చేసుకున్నాడని తెలుసుకున్న కుటుంబం!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -117 లో.. గంగ మెడలో తాళి కట్టి రుద్ర తన వెంట బాక్సింగ్ పోటీ దగ్గరికి బయల్దేరతాడు. మరొకవైపు టైమ్ అవుతుంది.. అకాడమీ తరుపున ఎవరు పార్టిసిపేట్ చెయ్యకపోతే మీకు ఫైన్ ఉంటుందని ఒకతను వచ్చి రుద్ర అకాడమీ కోచ్ కి చెప్తాడు. అప్పుడే ఆ అకాడమీలో ఉన్నతను కోచ్ దగ్గరికి వచ్చి గంగని రుద్ర సర్ పెళ్లి చేసుకొని తీసుకొని ఇక్కడికి వస్తున్నాడట అని కోచ్ కి చెప్తాడు. అప్పుడే గంగని తీసుకొని రుద్ర ఎంట్రీ ఇస్తాడు. డ్రెస్ చేంజ్ చేసుకునే అంత టైమ్ లేదు వెళ్లి పార్టిసిపేట్ చెయ్ అని గంగని రుద్ర పంపిస్తాడు. గంగ ఫస్ట్ రౌండ్ లో ఓడిపోతుంది. దాంతో రుద్ర తనని మోటివేట్ చేస్తాడు. ఆ తర్వాత రుద్ర పెళ్లి మండపానికి బయల్దేరతాడు. గంగ తనని అవమానించిన వాళ్ళని గుర్తుచేసుకొని పోటీలో తనకి ఉన్న అపోజిట్ పర్సన్ ని ఓడిస్తుంది. దాంతో బాక్సింగ్ లో గంగ గెలుస్తుంది. ఇక ఆ తర్వాత అందరు వచ్చి తనని అభినందనలు చెప్తుంటారు అయితే తను మాత్రం రుద్ర సర్ ఎక్కడ అని కోచ్ ని అడుగుతుంది. సర్ పని ఉందని వెళ్ళాడని కోచ్ చెప్తాడు. మరొకవైపు రుద్ర ఎక్కడికి వెళ్ళాడని అందరు వెయిట్ చేస్తారు. అప్పుడే రుద్ర వస్తాడు. రుద్ర వచ్చావా అని పారు తనని చెయ్ పట్టుకొని తీసుకొని వెళ్లిపీటలపై కూర్చోపెట్టి తాళి కట్టమంటుంది. రుద్ర చేతిలోకి తాళిని తీసుకుంటాడు. అదే సమయంలో గంగ మెడలో తాళి కట్టిన విషయం గుర్తుచేసుకుంటాడు రుద్ర. అప్పుడే పారు వాళ్ళ అన్న హరి ఫోన్ లో ఏదో చూసి ఆపండి అంటాడు. తరువాయి భాగంలో గంగని రుద్ర పెళ్లి చేసుకున్నాడనే నిజం అందరికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రాహుల్ పై జాలి చూపిస్తున్న కావ్య.. రాజ్ ఛాన్స్ ఇస్తాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -881 లో..... రాహుల్ రౌడీలతో పోరాడి డబ్బు తీసుకొని వస్తాడు. అదంతా అబద్ధం అని ఇంట్లో వాళ్ళు అంటారు. నిజమే అని సుభాష్ చెప్తాడు. నేను ప్రాణాలకి తెగించి డబ్బు కాపాడాను కానీ ఏం లాభం టెండర్ మిస్ అయిందని రాహుల్ గిల్టీగా ఫీల్ అవుతాడు. టెండర్ మిస్ అవ్వలేదు.. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేసాను.. ఆల్రెడీ వేరే వాళ్ళతో మనీ పంపించాను బాబాయ్ టెండర్ వేసాడని రాజ్ చెప్తాడు. ఇంట్లో అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏ తర్వాత రాహుల్ దెబ్బలకి స్వప్న ఆంటిమెంట్ రాస్తుంది. రాహుల్ పై స్వప్న సింపథీ చూపిస్తుంది. మరొకవైపు రాహుల్ ని చుస్తే చాలా జాలిగా ఉంది. తను నిజంగానే మరిపోయాడని రాజ్ తో కావ్య చెప్తుంది. నేను వాడిని ఎప్పటికి నమ్మలేనని రాజ్ చెప్పగానే అలా అంటే ఎలా ఒక్క ఛాన్స్ ఇద్దామని కావ్య అంటుంది. సరే నీ కోసం ఒక్క ఛాన్స్ ఇస్తానని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాహుల్ దగ్గరికి రుద్రాణి వస్తుంది. ఏంట్రా ఈ దెబ్బలు అని అడుగుతుంది. ఇదంతా ప్లాన్ లో ఒక భాగమే.. ఇప్పుడు అందరు నన్ను నమ్మడం మొదలు పెడుతారు. నువ్వు ఇప్పుడు నేను బాధలో తిండి కూడా తినడం లేదని అందరిలో పాజిటివ్ క్రియేట్ చెయ్ అని చెప్తాడు. దానికి రుద్రాణి సరే అంటుంది. ఆ తర్వాత రాహుల్ తప్ప అందరు భోజనానికి వస్తారు. పాపం వాడికి తినాలని లేదట అని రుద్రాణి అంటుంది. ఎందుకు వాడి వల్లే ఇంత టెన్షన్ గా టెండర్ వేయాల్సి వచ్చిందని ప్రకాష్ అంటాడు. స్వప్న నువ్వు వెళ్లి రాహుల్ ని తీసుకొని రా అని రాజ్ చెప్తాడు. కాసేపటికి రాహుల్ ని తీసుకొని స్వప్న వస్తుంది. నాకు ఆకలిగా లేదని రాహుల్ యాక్టింగ్ చేస్తాడు. తరువాయి భాగంలో సుభాష్, అపర్ణ పెళ్లి రోజున వాళ్ళకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : హోమానికి శ్రీధర్ ని పిలవడానికి వెళ్ళిన జ్యోత్స్న , పారిజాతం.. అతను వస్తాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -518 లో.....జ్యోత్స్న, పారిజాతం కలిసి శ్రీధర్ రెండో పెళ్లి గురించి తప్పుగా మాట్లాడతారు. దాంతో శ్రీధర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఈ జ్యోత్స్న నోటికి అడ్డు అదుపు లేకుండాపోయిందని కార్తీక్ తో దీప అంటుంది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని కార్తీక్ అంటాడు. మరొకవైపు జ్యోత్స్న మాటలకు సుమిత్ర బాధపడుతుంది. రోజురోజుకి అలా తయారవుతుందని దశరథ్ తో అంటుంది. అప్పుడే కాఫీ తీసుకొని దీప ఎంట్రీ ఇస్తుంది. సుమిత్రని దశరథ్ రెస్ట్ తీసుకోమని చెప్తాడు. దీపని బయటకు పిలిచి.. నా కూతురు కంటే మాపై నువ్వే ఎక్కువ ప్రేమ చుపిస్తావ్.. నిన్ను నా కూతురు అని అనుకుంటా.. నువ్వు ఈ ఇంట్లో ఎవరు ఏమైనా అంటే పట్టించుకోకని దీపతో దశరథ్ చెప్తాడు. ఆ తర్వాత చాలా రోజులకి ఈ ఇంట్లో మన మాట గట్టిగా వినిపించిందని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి మిమ్మల్ని తాత రమ్మంటున్నాడని అంటాడు. అయితే ఏంటే మేం రాము అన్నట్లు పొగరుగా పారిజాతం మాట్లాడుతుంది. ఏదో మాట్లాడుతాడట అని కార్తీక్ అంటాడు. పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు శివన్నారాయణ దగ్గరికి వెళ్తారు. మీ వల్లే శ్రీధర్ హర్ట్ అయి వెళ్ళాడు.. ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్లి రేపటి హోమానికి పిలవాలని శివన్నారాయణ అంటాడు. మేమ్ వెళ్ళమని పారిజాతం అంటుంది. అయితే నీ వస్తువులు తీసుకొని ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోమని పారిజాతంతో శివన్నారాయణ అంటాడు. ఇక పారిజాతం ఏం చెయ్యలేక సరే అంటుంది. జ్యోత్స్న, పారిజాతం ఇద్దరిని తీసుకొని శ్రీధర్ ఇంటికి వెళ్తాడు కార్తీక్. శ్రీధర్ కావాలనే వాళ్ళిద్దరు ఎవరు నాకు తెలియదు కార్తీక్ నువ్వు ఒక్కడివే ఇంట్లోకి రా అని శ్రీధర్ అంటాడు. అయిన పారిజాతం, జ్యోత్స్న ఇంట్లోకి వెళ్తారు. రేపు హోమానికి రమ్మని పిలుస్తారు. రానని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : ప్రేమ పోలీస్ కావాలని నిర్ణయం తీసుకున్న ధీరజ్.. రామరాజు ఆన్ ఫైర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -319 లో.... ప్రేమ ఇదివరకు డ్యాన్స్ క్లాస్ చెప్తుంటే.. వాళ్ళ నాన్న ఆడపిల్ల కష్టంతో బ్రతుకుతున్నావని మావయ్య గారి చొక్కా చింపేశాడు మర్చిపోయారా అని శ్రీవల్లి జరిగింది గుర్తుచేస్తుంటే ఇక ప్రేమ పోలీస్ అవ్వడం వద్దని రామరాజు నిర్ణయం తీసుకుంటాడు. నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను నాన్న.. ప్రేమ ఖచ్చితంగా పోలీస్ అవుతుందని ధీరజ్ చెప్తాడు. దాంతో రామరాజు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హమ్మయ్య నేను అనుకున్నది జరిగిందని శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే తన పుట్టింటికి వెళ్లి అసలు విషయం చెప్తుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రేమ డల్ గా ఉంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. ఎందుకురా నా కోసం మీ నాన్నతో గొడవపడుతున్నావని ప్రేమ అడుగుతుంది. ఎందుకంటే నీ కల.. నెరవేర్చడం భర్తగా నా బాధ్యత అని ధీరజ్ అంటాడు. అదంతా నర్మద వింటుంది. ఒకప్పుడు నేను జాబ్  గొడవలు అవుతాయి వద్దని అన్నాడు.. ఇప్పుడు నా కోసం వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నాడని ప్రేమ అంటుంది. దాన్నే ప్రేమ అంటారని,  ధీరజ్ నిన్ను ప్రేమిస్తున్నాడని నర్మద చెప్తుంది. ఆ తర్వాత రాత్రి అందరు కబుర్లు చెప్పుకుంటూ అరుబయట కూర్చుంటారు. అప్పుడే సేనాపతి పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వస్తాడు. ప్రేమని పిలుస్తాడు. నాకు కొడుకు పుట్టినప్పటి కంటే కూతురు పుట్టిందని చాలా హ్యాపీగా ఫీల్ అయినా కానీ ఇలా తండ్రికి వెన్నుపోటు పొడుస్తావనుకోలేదని సేనాపతి ఎమోషనల్ అవుతుంటే.. ప్రేమ బాధపడుతుంది. తరువాయి భాగంలో ప్రేమ బాధపడుతుందని ఇంట్లో అందరు ప్రేమ చుట్టూ చేరి డ్యాన్స్ చేస్తూ తనని నవ్వించడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బాలయ్య డైలాగ్‌తో రెచ్చిపోయిన రోజా!

సరిగమప లిటిల్ చాంప్స్ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. సరిగమప మనది అంటూ సుధీర్ గట్టిగ అనేసరికి హలో అంటూ రోజా స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చింది. అదే గొంతు అంటూ సుధీర్ అక్కడి నుంచి పారిపోయాడు. "అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వను" అంటూ అనంత శ్రీరామ్ డైలాగ్ వేసాడు. "దేనికి నవ్వుతానో దేనికి నరుకుతానో నాకే తెలీదు" అంటూ రోజా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దాంతో సుధీర్, అనిల్ రావిపూడి వామ్మో అంటూ నవ్వారు. ఇక శ్రీనివాస రెడ్డి విజిల్ వేసాడు. ఇక భగవంత్ కేసరి పోస్టర్ చూపిస్తూ ఒక చిన్నారి బాలయ్య గెటప్ లో వచ్చి అనిల్ దా కేక్ కట్ చేద్దాం అని పిలిచాడు. అలా అనిల్ రావిపూడి పుట్టిన రోజును స్టేజి మీద అందరూ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. ఇక ఈ షోలో బాగా ఫేమస్ ఐన వరుణవిని వాళ్ళ అమ్మను స్టేజి మీదకు పిలిచారు. "ఒక బిడ్డను కనాలంటే తల్లి యుద్ధం చేయాలి. ఆ బిడ్డను పెంచాలంటే కూడా యుద్ధం చేయాలి. అలాంటి యుద్ధం మీరు రోజూ చేస్తున్నారు" అంటూ షాల్ కప్పి ఒక మొమెంటోని ఇచ్చి వాళ్ళను అనిల్ రావిపూడి సత్కరించాడు. అనిల్ రావిపూడి మాటలకు రోజా ఇంకొంతమంది ఆడియన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. వరుణవి ఈ షోలో ఒక చిచ్చర పిడుగు. పాటలు అద్భుతంగా పాడుతుంది, మాటలు కూడా అమోఘంగా మాట్లాడుతుంది. దాంతో ఈమెకు జడ్జెస్, ఆడియన్స్ ఫాన్స్ ఇపోయారు.

Bigg Boss 9 Telugu Family week: బిగ్ బాస్ హౌస్ లో పెళ్లి సందడి.. తనూజ ఎమోషనల్!

బిగ్ బాస్ సీజన్-9 తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ వీక్ రానే వచ్చింది. టైటిల్ విన్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే చాలు అని అనుకునే కంటెస్టెంట్స్ చాలామంది ఉంటారు. ఎందుకంటే తమ ఫ్యామిలీ హౌస్ లోకి రావడం వారికి ఓ మంచి జ్ఞాపకం. అందుకే తమ ఫ్యామిలీలోని ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ లో కన్పించాలనేది ప్రతీ ఒక్కరి కల. అయితే హౌస్ లో ఆ సందర్బం రానే వచ్చింది.. ఆ ఫ్యామిలీ వీక్ మొదలైంది. బిగ్ బాస్ సీజన్-9 తెలుగు పన్నెండో వారంలో ఫ్యామిలీ వీక్ మొదలైంది. తాజాగా వచ్చిన ప్రోమోలో హౌస్ కెప్టెన్ అయిన తనూజకి మొదటగా ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చారు. తనూజ సిస్టర్ తో పాటు తనూజ వాళ్ళ అక్క కూతురు వచ్చింది. మొదటగా తనూజని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు బిగ్ బాస్. అక్కడ తనూజ వాళ్ళ అక్క పాపని ఉంచి తనని బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ పాపని హౌస్ లోకి తీసుకొని వెళ్లి అందరికి పరిచయం చేసింది తనూజ. ఆ తర్వాత వాళ్ళ సిస్టర్ ని మెయిన్ గేట్ ద్వారా ఎంట్రీ ఇప్పించారు బిగ్ బాస్. తనని చూసి తనూజ ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే త్వరలో తనూజ సిస్టర్ మ్యారేజ్ ఉంది. తను ఆ పెళ్లిని మిస్ అవుతుంది కాబట్టి బిగ్ బాస్ తన చెల్లిని పెళ్లి కూతురు చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేయించాడు. తనూజ తన సిస్టర్ అనుజని పెళ్లికూతురు చేస్తుంది. ఆ తర్వాత అనుజ తన సిస్టర్ తనూజ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. తన వెడ్డింగ్ కార్డ్ ని తనూజకి చూపిస్తుంది. దాంతో తనూజ ఎమోషనల్ అవుతుంది. తనూజకి ఈ ఎపిసోడ్ మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. తనూజకి తన గేమ్ గురించి అనుజ హింట్స్ ఇచ్చిందో లేదో చూడాలి మరి.  ఈ ఫ్యామిలీ వీక్ తనూజ ఆటలో ఏదైనా మార్పు తీసుకొస్తుందో లేదో చూడాలి మరి.

రీతూ మనసు ముక్కులు చేసిన డీమాన్ పవన్.. అవన్నీ మన పర్సనల్!

ఇది ఎవరూ ఊహించనిది.. నిజమే.. బిగ్ బాస్ సీజన్-9 లో గడిచిన పది వారాల్లో ఇప్పటి వరకయ రీతూని డీమాన్ పవన్ నామినేట్ చేయలేదు. డీమాన్ ని రీతూ నామినేట్ చేయలేదు. కానీ ఫస్ట్ టైమ్ దాన్ని బ్రేక్ చేస్తూ కుండని బ్రేక్ చేసి మరీ రీతూని నామినేట్ చేశాడు డీమాన్ పవన్. తనూజగా మొదటగా రెండు నామినేషన్లు చేసుకునే టోకెన్ ని డీమాన్ పవన్ కి ఇచ్చింది. దాంతో మొదటగా 'పవన్ కళ్యాణ్ పడాల' ని నామినేట్ చేశాడు. ఆ తర్వాత సెకెండ్ నామినేషన్ రీతూ అని చెప్పాడు. దాంతో భరణి, ఇమ్మాన్యుయల్, తనూజ, కళ్యాణ్ అందరు షాక్ అయిపోయారు. వాళ్లతో పాటు రీతూ కూడా అలాగే బిగుసుకుపోయింది. అరే ఏంట్రా ఇది అని రీతూ అనేలోపే.. నా దగ్గర పాయింట్లు ఉన్నాయని డీమాన్ పవన్ అన్నాడు. నేను నీతోనే ఉన్నాను.‌. ప్రతీ గేమ్ లో నీకు సపోర్ట్ గా ఉన్నాను.. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ప్రతీదానికి నేను అలుగుతానని అంటావ్.. అసలు నేను మాట్లేది వినవు అని డీమాన్ పవన్ తన నామినేషన్ పాయింట్ చెప్పాడు. దాంతో రీతూ షాక్ అయింది. నువ్వు నాతో అరిచిన ప్రతీసారీ బయటకు ఎలా పోట్రే అవుతుందో అర్థం చేసుకో.. అంటు తన సెకెండ్ పాయింట్ పెట్టాడు డీమాన్. అవన్నీ మన పర్సనల్ అనుకున్నాను.‌‌. అందుకే మన మధ్య ఎన్ని ఉన్నా నేను నిన్ను నామినేట్ చేసి చెప్పలేదు పవన్ అంటు ఏడ్చేసింది రీతూ. ఇక రీతు ఏడుస్తుంటే డీమాన్ కంట్లో కూడా నీళ్లు తిరిగాయి. ఇక నామినేషన్ తర్వాత రీతూ గుక్కపెట్టి ఏడ్చేసింది‌ . వాష్ రూమ్ దగ్గరికి వెళ్ళి రీతూ ఏడుస్తుంటే ఓదార్చడానికి సంజన వెళ్లింది. అయితే తనని  అయిదు నిమిషాలు వదిలెయ్యమని చెప్తూ వాష్ రూమ్ లోకి వెళ్ళి గట్టిగా ఏడుస్తూ ఉంది. ‌ఇక అదే విషయం డీమాన్ పవన్ కి చెప్పి వాష్ రూమ్ దగ్గరికి తీసుకొచ్చింది సంజన. ఇక కాసేపటికి గార్డెన్ ఏరియాలో ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. నేను ఒకటి అడిగినప్పుడు నువ్వు దానికి సమాధానం చెప్పకుండా.. అరుస్తావ్.. పట్టించుకోవని డీమాన్ అనగా.. వరిలేయ్ పవన్ అంటు రీతు అంది. ఇక డీమాన్ ఏదో అంటు ఉంటే.. వదిలెయ్ పవన్ అని గట్టిగా అరిచేసింది రీతూ.. నువ్వు అరవడం వల్ల నాది తప్పు లేకపోయినా నాదే తప్పు అవుతుందని అది బయటకు వెళ్తుందని డీమాన్ అన్నాడు. తనది తప్పు లేదని తనతో మాట్లాడటానికే ట్రై చేశాను.. కానీ నువ్వు ట్రస్ట్ లేదని చాలా హర్ట్ చేశావ్. ప్రతి క్షణం నేను నీ మంచే కోరుకున్నా. నేనైతే చాలా బాధపడుతున్నానని డీమాన్ పవన్ అన్నాడు. దాంతో నాతో మాట్లాడొద్దని తల బాదుకుని గట్టిగా అరిచింది రీతు. ఎందుకు అరుస్తున్నావ్.. నాకూ అవ్వడం లేదంటూ డీమాన్ పవన్ కూడా గట్టిగా అరిచాడు. ఇలా ఇద్దరి మధ్య ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.

Gourav Gupta Remuneration: ఐదు వారాలకు గౌరవ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇందులో శనివారం నాటి ఎపిసోడ్ లో నిఖిల్ ఎలిమినేట్ అవ్వగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ కి అందరు తమ ట్యాలెంట్ చూపించడానికి వెళ్తారు కానీ గౌరవ్ మాత్రం తెలుగు నేర్చుకోవడానికి వెళ్ళినట్టుగా ఉంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన గౌరవ్.. చివరిగా ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో ఏం జరిగినా, తనకి ఏం అనిపించినా దానిని కెమెరాల దగ్గరికి వచ్చి చెప్పేస్తుంటాడు గౌరవ్. కండబలం ఉంది కానీ బుద్ది బలం లేదు అని చాలామంది చాలా సందర్భాల్లో అంటారు. అది కచ్చితంగా గౌరవ్ కి ఆప్ట్ అవుతుంది. ఎందుకంటే తనకి ఎవరు ఏంటో అర్థం కాదు.. ఎవరి స్ట్రాటజీ ఏంటో తెలియదు.. కానీ తనకి తోచింది చేస్తుంటాడు. అంతా క్రమశిక్షణగా ఉండాలి.. రూల్స్ పాటించాలంటు రూల్స్ రామానుజన్ గా మాట్లాడుతుంటాడు. అయితే  అ రూల్స్ అన్నివేళలా పనిచేయవు.. ఒక టాస్క్ ఇస్తే దానిని అర్ధ చేసుకోలేడు.. పైగా ఎవరైనా వివరిస్తే వారికి విరుద్ధంగా మాట్లాడతాడు గౌరవ్. అయితే హౌస్ లో తను ఎక్కువగా ఉంది నిఖిల్ తోనే.. అందుకేనేమో బిగ్ బాస్ మావ.. వీళ్ళిద్దరిని ఒకే వారం ఎలిమినేషన్ చేశాడు.  గౌరవ్ తెలుగులో మల్లి లాంటి టీవీ సీరియల్స్ తో పాపులర్ అయ్యాడు. గౌరవ్ కి వారానికి రెండు లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నాడు. అంటే అయిదు వారాలకి గాను గౌరవ్  పది లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. బుల్లితెర నటులు నిఖిల్, గౌరవ్ ఇద్దరూ హౌస్ లో అంతగా కష్టపడకుండానే లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్ కానీ రిజర్వ్ గా ఉంటాడు. హౌస్ లో ఏం జరిగినా స్టాండ్ తీసుకోడు అది అతని మైనస్. 

సుమన్ శెట్టికి వేలు చూపించి మాట్లాడిన కళ్యాణ్.. ఖతం టాటా బైబై!

ఏది జరగకూడదని కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకున్నారో అదే జరిగింది. బిగ్ బాస్ సీజన్-9 లో స్ట్రాంగ్ ఓట్ బ్యాకింగ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరైన ఉన్నారంటే అది సుమన్ శెట్టి.. కళ్యాణ్ పడాల తన లిమిట్స్ దాటి సుమన్ శెట్టికి వేలు చూపించి మాట్లాడు.. ఇది ఇప్పుడు ఫుల్ హాట్ టాపిక్ గా మారింది. సుమన్ శెట్టి ఫ్యాన్స్ అంతా కలిసి కళ్యాణ్ పడాల మీద నెగెటివ్ ట్రోల్స్ చేస్తారు ఇక. ఎందుకంటే ఇప్పటివరకు సుమన్ శెట్టి గేమ్స్ ఆడకపోయినా అతను నామినేషన్లోకి వచ్చాడంటే అతడే టాప్ లో ఉంటాడు. కళ్యాణ్ ఇక టాటా బైబై .. అన్నీ సర్దుకోవాల్సిందే.. అక్కడ ఉంది డీర్ కాదు డైనోసార్ అని తెలియదు పాపం ఈ అమూల్ బేబీ కళ్యాణ్ కి.. ఇక అతనికి ఓటింగ్ కూడా కష్టమే.  పదకొండవ వారం నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. భరణి, ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్, దివ్య రీతూని నామినేట్ చేయగా తనూజ తనకున్న స్పెషల్ పవర్ ఉపయోగించి రీతూని సేవ్ చేసింది. ఆయితే నామినేషన్లో దివ్య వర్సెస్ రీతూ ఒకటి ఫుల్ హైప్ అవ్వగా.. సంజన వర్సెస్ రీతూ నామినేషన్, భరణి వర్సెస్ ఇమ్మాన్యుయల్ నామినేషన్ లు హైలైట్ గా నిలిచాయి. ఇక అందరి నామినేషన్లు ముగిసాక.. చివరగా ఒకే ఒక్క నామినేషన్ మిగిలి ఉండటంతో ఆ టోకెన్ ని సుమన్ శెట్టికి ఇచ్చింది తనూజ.  సుమన్ శెట్టి వచ్చి తన పాయింట్లు చెప్పి పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేశాడు. ఆయితే ఈ నామినేషన్ లో‌ ఇద్దరి మధ్య డిస్కషన్ సాగింది. టవర్ టాస్క్‌లో వరస్ట్ సంచాలక్‌గా చేసావ్.. నేను కెప్టెన్ కాలేకపోయాను.. నువ్వు గేమ్ ముందు కరెక్ట్ గా చెప్పలేదు అని సుమన్ శెట్టి చెప్పి కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. టవర్ స్ట్రైట్‌గా ఉండాలని ముందు చెప్పలేదని సుమన్ అంటే.. మీరిద్దరు సేమ్ పెడతారని నాకెలా తెలుసు.. నాకేమైనా కల వస్తుందా అని కళ్యాణ్ వాగాడు. దాంతో సుమన్ శెట్టికి కోపం వచ్చింది. వినూ.. వినూ.. వినూ.. ఇవ్వే వద్దు అని సుమన్ శెట్టిని కళ్యాణ్ వేలు చూపించి ఫుల్ కోపంగా అన్నాడు. వేలు దించూ.. ఆ వేలు కిందికి దింపు అని సుమన్ శెట్టి అన్నాడు. వేలు నీ వైపు చూపించడం లేదని కళ్యాణ్ అనడంతో.. నా వైపు చూపించావ్ కాబట్టే చెప్తున్నాను.. సుమన్ శెట్టి ఆవేశంగా వెళ్లి కళ్యాణ్ కుండని ముక్కలు ముక్కలు చేశాడు. అతని ఆవేశం చూసి ఇమ్మాన్యుయల్, భరణితో పాటు అందరు భయపడి పక్కకి వెళ్లారు.