దారి త‌ప్పుతున్న ఆర్య‌వ‌ర్ధ‌న్‌!

  'బొమ్మ‌రిల్లు' సినిమాలో సిద్ధార్ధ్‌కి బ్ర‌ద‌ర్‌గా న‌టించి ఆక‌ట్టుకున్న శ్రీ‌రామ్ బుల్లితెర‌పై ప్ర‌స్తుతం బిజీగా మారిపోయారు. ప్ర‌స్తుతం శ్రీ‌రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ ‌నిర్మిస్తున్న సీరియ‌ల్ 'ప్రేమ ఎంత మ‌ధురం'. ఏజ్ బార్‌ అయిన యువ‌కుడు ఆర్య‌వ‌ర్ధ‌న్‌కీ... త‌న కంటే చాలా చిన్న‌దైన అనురాధ‌కీ మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌గా ఈ సీరియ‌ల్‌ని డిజైన్ చేశారు. గ‌త కొన్ని వారాలుగా ఈ సీరియ‌ల్ విజ‌య‌వంతంగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతోంది. ఆర్య‌వ‌ర్థ‌న్‌ని ప్రేమిస్తున్న అనురాధ త‌న తండ్రి సుబ్బు కార‌ణంగా అత‌నికి దూరంగా వుండ‌టానికి అంగీక‌రిస్తుంది. ఆర్య వ‌ర్ధ‌న్ ఆఫీసు నుంచి బ‌య‌టికి వ‌చ్చిన అనురాధ కొత్త ఉద్యోగం వెతుక్కుంటుంది. ఈ క్ర‌మంలో అనురాధ‌ని ఆర్య‌వ‌ర్ధ‌న్ నుంచి దూరం చేసిన మీరా కావాల‌నే ఆఫీసుకి రాకుండా ఆర్య‌వ‌ర్ధ‌న్‌నే త‌న ఇంటికి వ‌చ్చేలా చేస్తుంది. మీరా కోసం వ‌చ్చిన ఆర్య‌వ‌ర్ధ‌న్ ఆమె ఇంట్లో ఏం చూశాడు? అనురాధ‌ను ప్రేమించే ఆర్య వ‌ర్థ‌న్ అనూహ్యంగా మారిపోయి మీరాకు అండ‌గా వుంటాన‌ని ఎందుకు మాటిచ్చాడు? తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఆర్య వ‌ర్ధ‌న్ దారి తప్పుతున్నాడా? అన్న‌ది నేడు ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. బుల్లెతెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న 'ప్రేమ ఎంత మ‌ధురం' సీరియ‌ల్ జీ తెలుగులో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలుస్తోంది. 

రియ‌ల్ క‌పుల్స్‌తో పెట్టుకుంటే ప‌గిలిపోద్ది!

  స్టార్ మా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్ క్రేజీ షోల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. బిగ్‌బాస్ సీజ‌న్ 4తో మ‌రింత పాపులారితో పాటు టీఆర్పీని సొంతం చేసుకుని లీడింగ్ ఛాన‌ల్ గా మారిన స్టార్ మా తాజాగా '100% ల‌వ్‌' షోతో మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందించ‌బోతోంది. రియ‌ల్ క‌పుల్స్ వ‌ర్సెస్ రీల్ ‌క‌పుల్స్‌తో ఈ షోని ప్రారంబించారు. యాంక‌ర్ ర‌వి, వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ ఈ షోకు వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నెల 21 నుంచి ఈ షో సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌సారం కాబోతోంది. ఆరు రియ‌ల్ జంట‌లు.. ఆరు రీల్ జంట‌లు ఈ షోలో పాల్గొంటున్నారు. కార్తీక దీపంతో పాపుల‌ర్ అయిన నిరుపమ్‌ త‌న భార్య మంజుల‌‌తో క‌లిసి ఈ షోలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆట‌ల్ని భార్య‌తో క‌లిసి ఆడిన నిరుప‌మ్ "రియ‌ల్ క‌పుల్‌తో పెట్టుకుంటే ప‌గిలిపోద్ది" అంటూ రీల్ జంట‌ల‌ని ఉద్దేశించి అన్న మాట‌లు వైర‌ల్‌గా మారాయి. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. ఇందులో ఆరు రీల్ జంట‌లుగా సీరియ‌ల్ జోడీలు పాల్గొన‌గా.. ఆరు రియ‌ల్ లైఫ్‌లో భార్యాభ‌ర్త‌లైన జంట‌లు పాల్గొన్నాయి. వీరంతా క‌లిసి పోటాపోటీగా ఆడిన ఆట‌లు.. చేసిన అల్ల‌రి వీక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేసేదిగా వుంది. 

గోవాలో అవినాష్-అరియానా బైక్ రైడింగ్‌!

  జ‌బ‌ర్ద‌స్త్ మాజీ కంటెస్టెంట్‌, బిగ్‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఇటీవ‌ల గోవా ట్రిప్‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే. అరియానా గ్లోరీతో క‌లిసి అవినాష్ అక్క‌డ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ జంట‌తో పాటు శ్రీ‌ముఖి, విష్ణు ప్రియ‌, శ్రీ‌ముఖి త‌మ్ముడు సుప్రీత్‌, ఆర్జే చైతూ కూడా వెళ్లారు. అక్క‌డి బీచ్ స‌మీపంలో వున్న‌ గోవా కోలా రిసార్ట్‌లో సంద‌డి చేశారు. పోర్ట్ ఏరియాకు బైకుల‌పై వెళ్లిన ఈ జంట‌లు ఎక్క‌డి నుంచి బీచ్ వ్యూని చూసి ఎంజాయ్ చేశారు. అరియానాతో క‌లిసి అవినాష్ బైక్ రైడింగ్ వెళ్లాడు. మ‌ధ్య‌లో ఆపి అరియానా బైక్ రైడ్ చేసిన దృశ్యాల‌కు సంబంధించిన వీడియో నెట్టింట సంద‌డి చేస్తోంది. అవినాష్ వెన‌కాల కూర్చుని అరియానా రైడ్ చేస్తున్న దృశ్యాల‌ని షూట్ చేశాడు. ఆ త‌రువాత ఫోర్ట్ ఏరియాలో వున్న మ‌ర్రి చెట్టు ఊడ‌ల్ని ప‌ట్టుకుని కోతిలా ఊగుతూ ముక్కు అవినాష్ కోతి కొమ్మ‌చ్చి ఆడిన దృశ్యాలు ఆక‌ట్టుకుంటున్నాయి. గోవా ట్రిప్‌కి సంబంధించిన వీడియోని అవినాష్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పోస్ట్ చేశాడు. అది నెట్టింట సంద‌డి చేస్తోంది. 

బిగ్ బాస్ డ‌బ్బుతో సొహేల్ క‌ల నిజ‌మాయెగా!

  బుల్లితెర‌పై మొద‌ట చిన్న పాత్ర‌ల్లో న‌టించి, 'కృష్ణ‌వేణి' లాంటి సీరియ‌ల్‌లో హీరోగా రాణించిన‌ ఇస్మార్ట్ స‌య్య‌ద్ సొహేల్ బిగ్‌బాస్ త‌రువాత క‌థ వేరేగానే వుంది. సీజ‌న్ 4లో టాప్ 5లో నిలిచిని సోహైల్ త‌న‌దైన మేన‌రిజ‌మ్స్‌తో... ఆక‌ట్టుకునే డైలాగ్‌ల‌తో ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి దృష్టిలోప‌డిన సొహేల్‌ చిరు నుంచి బంప‌ర్ ఆఫ‌ర్‌తో పాటు ఆయ‌న భార్య స్వ‌యంగా చేసిన బిర్యానీని కూడా ద‌క్కించుకుని వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. త‌ను చేసే సినిమాలో చిన్న గెస్ట్ పాత్ర అయినా తాను చేస్తాన‌ని మెగాస్టార్ చిరంజీవి.. ఇస్మార్ట్ సొహేల్‌‌కు బిగ్‌బాస్ ఫైన‌ల్ స్టేజ్ సాక్షిగా మాటివ్వ‌డంతో అత‌ని ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అంత‌కు ముందు సింగ‌రేణి ముద్దు బిడ్డ అంటూ షోలో హ‌ల్‌చ‌ల్ చేసిన సొహేల్‌ టాప్ 3కి వ‌చ్చేసరికి తెలివిగా ప్ర‌వ‌ర్తించి 25 ల‌క్ష‌ల క్యాష్‌తో ఇంటిదారి ప‌ట్ట‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంది. బిగ్‌బాస్ హౌస్‌‌లోనే కాదు, హౌస్‌ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక కూడా సొహేల్‌ క‌థ వేరేగానే వుంది. హీరోగా ఓ సినిమాని ప్ర‌క‌టించిన సోహైల్ తాజాగా ఎంజీ హెక్ట‌ర్ కారుని సొంతం చేసుకున్నాడు. తండ్రి, త‌మ్ముడితో క‌లిసి షోరూమ్‌కి వెళ్లిన సొహేల్‌ ఎంజీ హెక్ట‌ర్ కారుని కొనుగోలు చేశాడు. దీని విలువ దాదాపు రూ. 30 లక్ష‌లు అని తెలిసింది. ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు సొహేల్‌.  "ఫైన‌ల్లీ.. కొత్త కారు కొనాల‌నే ఒక క‌ల నిజ‌మైంది. దీన్ని సాధ్యం చేసిన బిగ్ బాస్‌కు, ఎప్పుడూ నాకు ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిన మా నాన్న‌కు థాంక్స్‌. హ‌లో ఎంజీ." అని వాటికి క్యాప్ష‌న్ రాసుకొచ్చాడు. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. 

పెళ్లిరోజు భర్త‌కు ‌లాస్య ఇచ్చిన గిఫ్ట్ ఇదే!

  బిగ్‌బాస్ సీజ‌న్ 4లోకి వెళ్లాక లాస్య లైఫ్ స్టైలే మారిపోయింది. యాంక‌ర్‌గా ర‌వితో కెరీర్ ప్రారంభించిన లాస్య ఆ త‌రువాత అత‌నితో విడిపోయి టీవీ షోల‌కు దూర‌మైన విష‌యం తెలిపిందే. మ‌ళ్లీ బిగ్‌బాస్ సీజ‌న్ 4 త‌రువాత మ‌ళ్లీ ర‌వితో క‌లిసి ప్రోగ్రామ్‌లు చేస్తూ య‌మ బిజీగా మారిపోయింది. త‌న‌కంటే చిన్న‌వాడైన మంజునాథ్‌ని వివాహం చేసుకున్న లాస్యకు ఓ బాబు కూడా వున్నాడు. అన్యోన్య దాంప‌త్య జీవితాన్ని లీడ్ చేస్తున్న లాస్య త‌న పెళ్లిరోజు సంద‌ర్భంగా భ‌ర్త మంజునాథ్‌ని స‌ర్ప్రైజ్ చేసింది. పెళ్లి రోజు కానుక‌గా త‌న భ‌ర్త‌కు కారుని గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మ‌హీంద్రా 500ఎక్స్ యూవీని బహుమ‌తిగా ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను యూట్యూబ్‌లోనూ షేర్ చేసింది. ఈ నెల 15న లాస్య పెళ్లి రోజు కావ‌డంతో జూబ్లీహిల్స్ పెద్ద‌మ్మ త‌ల్లి టెంపుల్‌లో భ‌ర్త‌తో క‌లిసి వెళ్లి కొత్త కారుకి ప్ర‌త్యేక పూజ‌లు చేయించి మురిపిసోయింది లాస్య‌. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి.

వంట‌ల‌క్క‌కు పోటీగా పాట‌ల‌క్క!

  స్టార్ మా చాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న 'కార్తీక దీపం' సీరియ‌ల్‌లో వ‌చ్చే వంట‌ల‌క్క ఎంత ఫేమ‌స్సో అంద‌రికి తెలిసిందే. ఈ పాత్ర‌లో న‌టించిన ప్రేమి విశ్వ‌నాథ్‌ స్టార్ సెల‌బ్రిటీగా మారిపోయింది. త్వ‌ర‌లో సినిమాల్లోనూ క‌నిపించ‌బోతోంది. ఈ సీరియ‌ల్ ప్రేమికి సినిమాల్లో న‌టించే అవ‌కాశాన్ని తెచ్చి పెట్టింది.. అంత‌లా పాపుల‌ర్ అయిన వంట‌ల‌‌క్క‌కు పోటీగా పాట‌ల‌క్క రాబోతోంది. జీ తెలుగు కోసం ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు 'కృష్ణ తుల‌సి' పేరుతో ఓ సీరియ‌ల్‌ని ప్రారంభిస్తున్నారు. వంట‌ల‌క్క త‌ర‌హాలోనే న‌లుపు రంగుతో డీ గ్లామ‌ర్ పాత్ర‌లో వుండే శ్యామ క‌థ‌ని బుల్లితెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ఇందులో శ్యామ పాట‌ల‌క్క‌గా క‌నిపించ‌బోతోంది. ఇచ్చిన మాట కోసం తన గొంతుని స‌వ‌తి త‌ల్లి కూతురికి అరువిచ్చి స‌వ‌తి త‌ల్లి చేతుల్లో అవ‌మానాలు ప‌డే పాత్ర‌లో శ్యామ క‌నిపించ‌బోతోంది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సీరియ‌ల్ ప్రోమో చూసిన వారంతా వంటల‌క్క త‌ర‌హాలోనే శ్యామ కూడా పాట‌ల‌క్క‌గా పాపుల‌ర్ కావ‌డం గ్యారెంటీ అని కామెంట్స్‌ చేస్తున్నారు. "వంట‌ల‌క్క‌.. చెల్లి పాట‌ల‌క్క" అంటూ మీమ్స్ ని వైర‌ల్ చేస్తున్నారు. ఈ నెల 22 నుంచి పాట‌ల‌క్క సీరియ‌ల్ 'కృష్ణ తుల‌సి' జీ తెలుగులో సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది. 

"మీరొక మంచి అబ్బాయిని నాకిచ్చారు".. ఇమ్మానియేల్ త‌ల్లితో వ‌ర్ష‌!

  బుల్లితెర‌పై కొత్త జంట సంద‌డి చేస్తోంది. అదే వ‌ర్ష‌-ఇమ్మా‌నియేల్ జంట‌. ఈ టీ‌వీలో వాలెంటైన్స్‌డే సంద‌ర్భంగా 'రెండు గంట‌ల్లో ప్రేమించ‌డం ఎలా?' అనే పేరుతో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో యాంక‌ర్ వ‌ర్షకు రెడ్ క‌ల‌ర్ ల‌వ్ సింబ‌ల్ వున్న బెలూన్‌ని అందించి ఇమ్మానియేల్ ల‌వ్ ప్ర‌పోజ్ చేసిన విజువ‌ల్స్ ఇటీవ‌ల నెట్టింట సంద‌డి చేశాయి.   అదే ఎపిసోడ్‌లో ఇమ్మానియేల్ త‌ల్లిని వ‌ర్ష ఆప్యాయంగా కౌగిలించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కార్య‌క్ర‌మంలో ఇమ్మానియేల్ పేరెంట్స్‌ని స్టేజ్ పైకి ఆహ్వానించారు. త‌న త‌ల్లిదండ్రులు స్టేజ్‌పైకి రావ‌డంతో ఇమ్మానియేల్ క‌న్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి లోన‌య్యాడు. త‌న ఎదుగుద‌ల‌కు త‌న కుటుంబం ఎంతో చేసింద‌ని, అన్న‌య్య త‌న జీవితాన్ని త్యాగం చేసి త‌న‌నింత వాడిని చేశాడ‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ఇమ్మానియేల్‌ని చూసిన వ‌ర్ష కూడా ఎమోష‌న‌ల్ అయ్యింది. స్టేజి మీద‌కు వ‌చ్చి అత‌ని త‌ల్లిని ఆలింగ‌నం చేసుకుంది. త‌న తండ్రి ఇటీవ‌లే చ‌నిపోయాడ‌ని, ఆ స‌మ‌యంలో ఇమ్మానియేల్ త‌న‌కు అండ‌గా నిలిచాడ‌ని క‌న్నీళ్లు పెట్టుకుంది వ‌ర్ష‌. "మీరొక మంచి అబ్బాయిని నాకిచ్చారు." అని ఇమ్మానియేల్ త‌ల్లితో అనడంతో అంద‌రూ చ‌ప్ప‌ట్లు కొడుతూ కేక‌లు వేశారు. "ఇమ్మానియేల్ వ‌ల్ల నీకే ప్రాబ్ల‌మ్ రాదు." అని ఆమె కూడా హామీ ఇవ్వ‌డంతో వ‌ర్ష సిగ్గుల మొగ్గ అయ్యింది. ఎనిమిదేళ్ల జ‌బ‌ర్ద‌స్త్‌లో ఇలాంటి జోక్ ఎవ‌రూ వేయ‌లేద‌ని ఆది న‌వ్వించాడు. త‌మ అమ్మానాన్న‌ల‌ది ల‌వ్ మ్యారేజ్ అని రివీల్ చేశాడు ఇమ్మానియేల్‌.

ఈ టీవీన‌టి ఎంగేజ్‌మెంట్ ఇన్విటేష‌న్‌ ఇంత విల‌క్ష‌ణ‌మా!

  బుల్లితెర న‌టులు సినిమా స్టార్‌ల‌కు ఏమాత్రం తీసిపోవ‌డం లేదు. ఆ రేంజ్‌లో హంగామా చేస్తున్నారు. ఓ సీరియ‌ల్ హిట్ట‌యితే స్టార్స్‌కి మించిన పాపులారిటీ బుల్లితెర తార‌ల‌కు సొంతమ‌వుతోంది. దీంతో వారు ఏది చేసినా క్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోతోంది. ఇదిలా వుంటే బుల్లితెర న‌టి ఎంగేజ్‌మెంట్ ఇన్విటేష‌న్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న పాపుల‌ర్ సీరియ‌ల్ 'నిన్నే పెళ్లాడ‌తా'. ఈ ధారావాహికలో హీరోయిన్‌గా న‌టించిన మ‌ధుబాల మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది‌. ఇదే సీరియ‌ల్‌కి రైట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌జా ప్ర‌భాక‌ర్‌తో గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో వుంది. ఇరు కుటుంబాల వారు వీరి ప్రేమ పెళ్లికి సై అన‌డంతో ఈ నెల 17న వీరి ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌బోతోంది. మైసూర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్‌కు అన్ని ఏర్పాట్లూ జ‌రుగుతున్నాయి. ఇదిలా వుంటే వీరి ఎంగేజ్‌మెంట్ ఇన్విటేష‌న్‌ ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌జా ప్ర‌భాక‌ర్ స్వ‌త‌హాగా రైట‌ర్ కావ‌డంతో త‌న స్టైల్‌ని నిశ్చితార్ధ ఆహ్వాన‌లేఖ‌లోనూ వాడాడు. అచ్చ‌మైన తెలంగాణ యాస‌లో తీర్చి దిద్దిన ఈ ఆహ్వాన‌లేఖ‌ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు ప్ర‌జా ప్ర‌భాక‌ర్. అది ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

స‌ర్‌ప్రైజ్ చేసిన రామ్‌.. క‌న్నీరు పెట్టుకున్న సునీత‌!

  అవును. ఇది స్టార్ మా చాన‌ల్‌లో ప్రారంభం కానున్న '100% ల‌వ్ షో'లో చోటు చేసుకుంది. ఈ చాన‌ల్ ఇటీవ‌ల ప్రారంభించిన బిగ్ బాస్ ఉత్స‌వం, కామెడీ స్టార్స్ షోల‌కు మంచి టీఆర్పీ ల‌భిస్తోంది. తాజాగా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని డ‌బుల్ చేయ‌డంలో భాగంగా '100% ల‌వ్'` పేరుతో మ‌రో వినూత్న‌మైన షోని ప్రారంభించ‌బోతోంది. 6 రియ‌ల్ క‌పుల్స్, 6 రీల్ క‌పుల్స్ ఈ షోలో ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతున్నారు. ఈ నెల 21 సాయంత్రం 6 గంట‌ల‌కి ఈ షో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. '100% ల‌వ్' మూవీ తీసిన లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ఈ ప్రారంభ షోలో సంద‌డి చేయ‌బోతున్నారు. అలాగే న్యూ క‌పుల్ సింగ‌ర్ సునీత‌, రామ్ వీర‌ప‌నేని కూడా ఈ షోలో పాల్గొంటున్నారు. తాజాగా విడుద‌ల చేసిన ప్రోమో స్టార్ మా అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ పేజ్‌లో సంద‌డి చేస్తోంది. మొద‌ట ఒంట‌రిగా ఈ షోకి వ‌చ్చిన సునీత మైక్ ప‌ట్టుకొని మాట్లాడుతూ, "రామ్ ఐ రియ‌ల్లీ రియ‌ల్లీ ల‌వ్ యూ" అని చెప్ప‌గానే, వెనుక నుంచి వ‌చ్చి ఆమె వీపు త‌ట్టారు రామ్‌. షాక్‌తో "ఆ.." అని వెన‌క్కి తిరిగి చూసి, రామ్ క‌నిపించేస‌రికి ఒక్క‌సారిగా స‌ర్‌ప్రైజ్ అయ్యారు సునీత‌. ఆ త‌ర్వాత రామ్‌ను హ‌త్తుకున్నారు.  డైరెక్ట‌ర్  సుకుమార్ బెత్తం ప‌ట్టుకుని వ‌చ్చి మాట్లాడుతూ, "ఒక‌ళ్లు ప్రేమిస్తారు, ఇంకొక‌ళ్లు స్పందిస్తారు" అన‌గానే, ఎమోష‌న‌ల్ అయిన సునీత క‌ళ్ల‌ల్లోంచి నీటి బొట్లు ఆమె చెంప‌ల మీదుగా జారాయి. ఈ ఎపిసోడ్‌లో ఏం జ‌రుగుతుందో 21వ తేదీ మ‌నం చూడ‌బోతున్నాం. యాంక‌ర్ ర‌వి, వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ ఈ షోకు వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ముమైత్‌ని ఏడిపించిన ఓంకార్‌!

  జీ తెలుగులో 'డ్యాన్స్ బేబీ డ్యాన్స్' షోతో సంచ‌ల‌నం సృష్టించారు ఓంకార్‌. మ‌ళ్లీ అదే త‌ర‌హా షోని మ‌రో లెవెల్లో ప్ర‌జెంట్ చేస్తూ డ్యాన్స్‌కి నెక్స్ట్ లెవెల్ 'డ్యాన్స్ ప్ల‌స్‌' అంటూ తాజాగా ఓంకార్ స్టార్ మాలో కొత్త డ్యాన్స్ షోని ర‌న్ చేస్తున్నారు. దీనికి జ‌డ్జెస్‌గా బాబా భాస్క‌ర్‌, ర‌ఘు మాస్ట‌ర్‌, య‌ష్, ముమైత్‌ఖాన్‌, యానీ మాస్ట‌ర్‌, మోనాల్ గ‌జ్జ‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌త కొన్ని వారాలుగా ఈ షో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. డ్యాన్స్‌కి నెక్ట్స్ లెవెల్ అన్న‌ట్టుగానే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్‌లు త‌మ డ్యాన్స్‌తో అద‌ర‌గొడుతున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌కు గ‌ట్టి పోటీనిస్తున్నారు. ప్ర‌తీ శ‌నివారం, ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు ఈ షో ప్ర‌సారం అవుతోంది. ఓంకార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే సంకేత్ అనే కంటెస్టెంట్ విష‌యంలో య‌ష్ మాస్ట‌ర్‌తో జ‌రిగిన వాగ్వివాదం కార‌ణంగా ముమైత్‌ఖాన్ ఉద్వేగానికి లోనైంది. య‌ష్ మాస్ట‌ర్ వాద‌న‌ని ఓంకార్ స‌మ‌ర్థించ‌డంతో షో నుంచి ముమైత్‌ఖాన్ ఏడ్చుకుంటూ లేచి వెళ్లిపోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం స్టార్ మా లో సంద‌డి చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఆమె తిరిగి వెన‌క్కి వ‌చ్చిందా, ఏం జ‌రిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడాలి.

'బిగ్ బాస్ ఉత్స‌వం'లో సీమంతం.. హ‌రితేజ భావోద్వేగం!

  బుల్లితెర యాంక‌ర్‌, న‌టి హ‌రితేజ భావోద్వేగానికి లోన‌య్యారు. న‌టిగా 'అఆ', 'ప్ర‌తిరోజు పండ‌గే' వంటి చిత్రాలతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న హ‌రితేజ బిగ్‌బాస్ సీజ‌న్ 3తో మ‌రింత‌గా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇటీవ‌ల ప్రెగ్నెంట్ అయిన ఆమెకు బిగ్‌బాస్ సీజ‌న్ 3 కంటెస్టెంట్స్ ప్ర‌త్యేకంగా సీమంతం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. వివ‌రాల్లోకి వెళితే.. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ రీ యూనియ‌న్ అంటూ 'బిగ్‌బాస్ ఉత్స‌వం' పేరుతో స్టార్ మా ప్ర‌త్యేకంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌తో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ప్లాన్ చేసి ప్ర‌సారం చేస్తోంది. ముందుగా బిగ్‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్‌ల‌తో ఈ షోని ప్రారంభించిన స్టార్ మా దానికి కొన‌సాగింపుగా 'బిగ్‌బాస్ ఉత్స‌వం 2' అంటూ ఇటీవ‌ల మ‌రో ఎపిసోడ్ ని ప్ర‌సారం చేసింది. ఇందులో బిగ్‌బాస్ సీజ‌న్ 3కి సంబంధించిన కంటెస్టెంట్‌లు పాల్గొన్నారు. ఆడిపాడి హంగామా చేశారు. అయితే ఇదే షోలో హ‌రితేజ కూడా పాల్గొంది. ఆమె గ‌ర్భ‌వ‌తి కావ‌డంతో ఇదే స్టేజ్‌పై బిగ్‌బాస్ సీజ‌న్ 3కి సంబంధించిన కంటెస్టెంట్‌లు హ‌రితేజ‌కు సీమంతం చేయ‌డం ఆక‌ట్టుకుంది. త‌ను ఊహించ‌ని స్థాయిలో త‌న‌కు సీమంతం జ‌ర‌గ‌డంతో ఒక్క‌సారిగా హ‌రితేజ భావోద్వేగానికి లోన‌యింది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఈ ఆదివారం ప్ర‌సార‌మైంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ఆక‌ట్టుకుంటోంది.

అరియానా గ‌య్యాళి వ‌దిన అయిన వేళ‌..!

  బిగ్‌బాస్ సీజ‌న్ 4లో ముక్కు అవినాష్‌, అరియానా జోడీకి మంచి మార్కులు ప‌డిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రూ క‌లిసి స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న 'కామెడీ స్టార్స్‌' షోలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకు శేఖ‌ర్ మాస్టర్, శ్రీ‌దేవి జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ షోలో లో గ‌య్యాళి వ‌దిన‌గా అరియానా ఓ రేంజ్‌లో ర‌చ్చ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో సంద‌డి చేస్తోంది. అవినాష్ ఈ షోలో ఓ టీమ్ లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటే, చ‌మ్మ‌క్ చంద్ర మ‌రో టీమ్ లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ షో కోసం ముక్కు అవినాష్‌, అరియానా క‌లిసి స్కిట్ చేశారు. ఇందులో ముక్కు అవినాష్ భ‌ర్త‌గా, అరియానా భార్య‌గా న‌టించారు. భ‌ర్త హోదాలో కాఫీ అడిగితే అరియానా ఏకంగా ముఖంపైనే కొట్టేసింది. ఇక ముక్కు అవినాష్ త‌మ్ముడిపై వీర లెవెల్లో వీరంగం ఆడింది. అవినాష్ త‌మ్ముడు అమ్మా అని పిల‌వ‌డంతో వీరంగం వేసిన అరియానా అత‌న్ని ఓ ఆట ఆడేసుకుంది. జుట్టుప‌ట్టుకుని ర‌చ్చ చేసింది. తినే తింగ‌డి అవినాష్ ముక్కుకే పోతోందా అని చిందులేసింది.. అంత‌టితో ఆగ‌క అవినాష్ త‌మ్ముడి జుట్టుప‌ట్టుకుని తిండి మొత్తం దీనికే పోతోందారా అంటూ చిందులు తొక్కింది. గ‌య్యాళి వ‌దిన‌గా అరియానా వీరంగం వేసిన 'కామెడీ స్టార్స్' ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం కాబోతోంది. 

'జ‌బ‌ర్ద‌స్త్‌'ను బీట్ చేసిన‌ 'కామెడీ స్టార్స్‌'!

  ఈటీవీ ఛాన‌ల్‌లో మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్రారంభ‌మైన 'జ‌బ‌ర్ద‌స్త్‌' కామెడీ షోని ఏ కార్య‌క్ర‌మం బీట్ చేయ‌లేక‌పోయింది. జ‌నాల్లో కామెడీ షో అంటే 'జ‌బ‌ర్ద‌స్త్‌' అనేంత‌గా పాపులారిటీని ఈ షో ద‌క్కించుకుంది. దీంతో నిర్వాహ‌కుల‌తో పాటు వీక్ష‌కులూ ఈ షోని కొట్టేది మ‌రోటి లేద‌ని, రాద‌ని ఫిక్స‌యిపోయారు. ఈ షోని బీట్ చేయాల‌ని చాలా మంది చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేసి ఫ్లాప‌య్యారు. కానీ తాజాగా ఈ షోని స్టార్ మాలో కొత్త‌గా ప్రారంభ‌మైన 'కామెడీ స్టార్స్‌' షో బీట్ చేసి దిమ్మ‌దిరిగే షాకిచ్చింది. వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ వ్యాఖ్యాత‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్‌, శ్రీ‌దేవి న్యాయ‌నిర్ణేత‌లుగా ప్రారంభ‌మైన ఈ షో హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ముక్కు అవినాష్‌, అరియానా, చ‌మ్మ‌క్ చంద్ర అండ్ టీమ్ పాల్గొంటున్న ఈ షో గ‌త వారం 9 రేటింగ్ పాయింట్లని సాధించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇదే స‌మ‌యంలో జ‌బ‌ర్ద‌స్త్‌కు కేవ‌లం 7 శాతం మాత్ర‌మే రేటింగ్ రావ‌డం గ‌మ‌నార్హం. 'కామెడీ స్టార్స్‌' షో  ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30కు స్టార్ మాలో ప్ర‌సారం అవుతోంది.

ట్రాన్స్‌ప‌రెంట్ డ్రెస్సులో విష్ణుప్రియ రెచ్చిపోయింది!

బుల్లితెర‌పై రాణించాలంటే గ్లామ‌ర్‌తో పాటు మంచి మాట‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట‌క‌ట్టుకోవాలి. అదే స‌మ‌యంలో త‌మ వైపు చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేయాలి. క‌ళ్లార్పితే ఇంత‌టి అందం ఎక్క‌డ మిస్స‌యిపోతామా అనే ఫీలింగ్‌ని స‌గ‌టు వీక్ష‌కుడిలో క‌లిగించాలి. అప్పుడే బుల్లితెర‌పై యాంక‌ర్స్ ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా ఇట్టే హిట్ట‌యిపోద్ది. ఇదే సూత్రాన్ని బాగా వంట‌బ‌ట్టించుకుంటున్నారు బుల్లితెర అందాల భామ‌లు శ్రీ‌ముఖి, విష్ణు ప్రియ‌. ఇటీవ‌ల పేప‌ర్ త‌ర‌హా డ్రెస్‌లో హొయ‌లు పోతూ శ్రీ‌ముఖి ర‌చ్చ చేస్తే అంత‌కు ముందు రోజు విష్ణు ప్రియ ష‌ర్ట్ బ‌టన్స్ విప్పేసి కావాల్సినంత వ‌య్యారాల్ని ఒల‌క‌బోసింది. అదీచాలద‌నుకుందేమో తాజాగా విష్ణు ప్రియ ట్రాన్స్‌ప‌రెంట్ డ్రెస్‌లో యెద అందాల్ని ప‌రుస్తూ ఫొటోల‌కు పోజులిచ్చేసింది. ఆ ఫొటోల‌ని అభిమానుల కోసం ఇన్ స్టాలో పంచుకుంది. ఇంకేముందీ ఇన్ స్టా విష్ణు ప్రియ అందాల తాకిడిని త‌ట్టుకోలేక హీటెక్కిపోతోంది. ట్రాన్స్ ప‌రెంట్ డ్రెస్‌లో యెద అందాల విందు చేస్తున్న విష్ణు ప్రియ ఫొటోలు ప్ర‌స్తుతం ఇన్ స్టాలో వైర‌ల్ అవుతున్నాయి. విష్ణు ప్రియ ఇంత‌లా రెచ్చిపోయి అందాల విందు చేయ‌డానికి కార‌ణం సినిమాలే అని.. సినిమా అవ‌కాశాల కోస‌మే విష్ణు ప్రియ ఈ స్థాయిలో అందాల విందు చేస్తోంద‌ని టీవీ ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు.   

ముమైత్‌కు వ‌చ్చిన లెట‌ర్‌.. అర‌బిక్‌లో చ‌దివిన అవినాష్‌‌!

  బుల్లితెర‌పై మ‌ళ్లీ ఓంకార్ హంగామా మొద‌లైంది. గ‌తంలో 'డ్యాన్ బేబీ డ్యాన్స్' అంటూ డ్యాన్స్ జూనియ‌ర్స్‌.. డ్రామా జూనియ‌ర్స్ .. సిక్స్త్ సెన్స్, ఇస్మార్ట్ జోడీ, వంటి విభిన్న‌మైన షోల‌తో పాపుల‌ర్ అయిన ఓంకార్ మ‌ళ్లీ త‌న స‌త్తాని స్టార్ మాలో చాటుకుంటున్నారు. కొత్త‌గా డ్యాన్స్‌కి నెక్స్ట్ లెవెల్ 'డ్యాన్స్ ప్ల‌స్' అంటూ స‌రికొత్త డ్యాన్స్ షోని మొద‌లుపెట్టారు. ఈ షో విజ‌య‌వంతంగా దూసుకుపోతోంది. యానీ మాస్ట‌ర్‌, ర‌ఘు మాస్ట‌ర్‌, బాబా భాస్క‌ర్‌, ముమైత్ ‌ఖాన్‌, మోనాల్ గ‌జ్జ‌ర్‌, య‌ష్ మాస్ట‌ర్ ఈ షోకి జ‌డ్జెస్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా ఓంకార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌త కొన్ని వారాలుగా ఈ షో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఈ షో శ‌నివారం, ఆదివారాలు ప్ర‌సారం అవుతోంది. ఈ శ‌నివారం షోలో ముక్కు అవినాష్ పోస్ట్‌మ్యాన్‌గా వ‌చ్చి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. ల‌క్ష‌లు ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి షో చేస్తూ బాబా భాస్క‌ర్‌కి ఒక్క ప్యాంట్ కూడా కొనివ్వ‌లేదు, అందుకే లుంగీ క‌ట్టుకొని షోకు వ‌స్తున్నారు .. అంటూ అవినాష్ న‌వ్వులు పూయించాడు. ఇక అర‌బ్ కంట్రీ నుంచి ముమైత్‌ఖాన్‌కి లెట‌ర్ వ‌చ్చిందంటూ అర‌బిక్ భాష‌లో ఆ లెట‌ర్‌ను అవినాష్ చ‌దివిన తీరు అంద‌ర్నీ తెగ న‌వ్వించింది. ముమైత్ అయితే ప‌డీ ప‌డీ న‌వ్వేసింది. అలా త‌న పోస్ట్‌మ్యాన్ క్యారెక్ట‌ర్‌తో న‌వ్వులు విరబూయించాడు. అత‌డి కామెడీని ముమైత్ బాగా ఎంజాయ్ చేసింది. 

కార్తీక్‌ చేతికి ప్రూఫ్స్‌.. దీప లైన్ క్లియ‌ర్‌!

  'కార్తీక దీపం' సీరియ‌ల్ ఈ శ‌నివారం స‌రికొత్త మ‌లుపు తిర‌గ‌బోతోంది. శౌర్య‌తో క‌లిసి వంట‌గ‌దిలో కింద కూర్చుని కార్తీక్ అన్నం తిన‌డం చూసిన సౌంద‌ర్య‌, ఆనంద‌రావు ఫ్యామిలీ ఒక్క‌సారిగా అవాక్క‌వుతారు. ఎంత‌లో ఎంత మార్పు అనుకుంటారు. కార్తీక్ తింటూ ఇంట్లో వాళ్ల‌పై సెటైర్లు వేస్తున్న తీరుకు ఆశ్చ‌ర్య‌పోయిన ఇంటివారు ఆ తంతుని సైలెంట్‌గా చూస్తుండిపోతారు. క‌ట్ చేస్తే కార్తీక్‌ని అన‌వ‌స‌రంగా మాట‌ల‌న్నాన‌ని మోనిత ఫీల‌వుతూ వుంటుంది. ఎలాగైనా అత‌‌న‌ని త‌న ద‌గ్గ‌రికి తెచ్చుకోవాల‌ని, ఆలోచిస్తూ వుంటుంది. "నేను చెప్పిందంతా కార్తీక్ విని సైలెంట్‌గా వెళ్లాడంటే నేను చెప్పింది క‌రెక్టే అని ఆలోచిస్తున్నాడ‌నే క‌దా అర్థం. సో త‌ను న‌న్ను అపార్థం చేసుకునే అవ‌కాశం లేన‌ట్టే. కాక‌పోతే కార్తీక్ త‌న ద‌గ్గ‌ర శౌర్య వుంద‌ని చెప్పాడు. దానివ‌న్నీ దీప బుద్దులే.. సందు చూసుకుని కార్తీక్ మ‌న‌సుని మార్చి త‌న‌తో పాటు దీప ద‌గ్గ‌రికి తీసుకెళ్లినా తీసుకెళుతుంది. అంత చావు తెలివితేట‌లున్నాయి దానికి. వీలైనంత త్వ‌ర‌గా శౌర్య‌ని పంపించేయాలి." అని మోనిత త‌న‌లో తానే మాట్లాడుకుంటుంది. క‌ట్ చేస్తే కార్తీక్ కోర్టు విష‌యం గురించి మాట్లాడుతుంటాడు. "కోర్టు ఇద్ద‌రినీ ఇస్తానంటే ఇద్ద‌రినీ తీసుకుందాం" అంటాడు. "వాళ్లిద్ద‌రినీ తీసుకుంటే నేనేందుకు?" అంటూ పి‌చ్చిపట్టిన దానిలా న‌వ్వుతుంది మోనిత‌.. ఇంకోవైపు.. "ఏంటే ఇది.. కోర్టు నోటీసు చ‌‌దివావా?.. ఇంత నిబ్బ‌రంగా వున్నావేంటే?" అంటుంది సౌంద‌ర్య దీప‌ని. "నిబ్బ‌రంగా ఎందుకు లేను శుబ్బ‌రంగా ఇద్ద‌రం కోర్టుకు వెళ‌దాం" అంటుంది దీప‌. "జ‌రిగేవ‌న్నీ చూస్తూ పిచ్చిప‌ట్టి మాట్లాడుతున్నావే" అంటుంది సౌంద‌ర్య‌.. ఇదే స‌మ‌యంలో కార్తీక్ చేతికి అస‌లు ప్రూఫ్స్ వ‌చ్చి చేర‌తాయి.. దీంతో దీప లైన్ క్లియ‌ర్ అవుతుంది.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో ఈ రోజు ఎపిసోడ్‌లో పూర్తిగా చూడాలంటే స్టార్ మాలో 'కార్తీక దీపం' చూడాల్సిందే. 

పేప‌ర్ డ్రెస్‌లో శ్రీ‌ముఖి ఫ్యాష‌న్‌‌ షో!

బుల్లితెర యాంక‌ర్స్ ఒక‌రిని మించి ఒక‌రు అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు పోటీప‌డుతున్న‌ట్టుగాన్నారు. ఇటీవ‌ల వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ హాట్ హాట్ డ్రెస్సుల్లో అందాల విందుకు పోటీప‌డితే .. `పోరా పోవే` ఫేమ్ బుల్లితెర యాంక‌ర‌మ్మ విష్ణు ప్రియ కూడా ష‌ర్ట్ బ‌ట‌న్స్ విప్పేసి షార్ట్ నిక్క‌ర్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి కాక‌పుట్టించింది.విష్ణు ప్రియ హాట్ ఫొటోషూట్‌కి సంబంధించిన ఫొటోలు ఇప్ప‌టికీ నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. ఇక ఇటీవ‌ల గోవా బీచ్‌లో చిట్టిపొట్టి గౌనులో వాట‌ర్ బేబీగా మారిన శ్రీ‌ముఖి త‌డిసిన అందాల‌ని ఆర‌బోస్తూ గోవా తీరంలో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. తాజాగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. పేప‌ర్ గౌను వేసుకుని థై షో చేస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. ఫోల్డింగ్ ఐర‌న్ చైర్‌పై కూర్చుని అందాల విందు చేస్తూ ఫొటోల‌కు పోజులిచ్చిన స్టిల్స్ ప్ర‌స్తుతం ఇన్ స్టాలో సంద‌డి చేస్తున్నాయి.   అన్న‌ట్టు ఈ ప్రేమికుల రోజున గ్రేట్ న్యూస్‌ని చెప్ప‌బోతోంద‌ట‌. ఆ వార్త‌ని ప్ర‌క‌టించ‌డానికి చాలా ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నాన‌ని త‌న ఫొటోషూట్ ఫొటోల‌తో పాటు షేర్ చేసింది. ఆ వార్త ఏంటీ? ఎవ‌రినైనా ప్రేమించిందా? ప‌్రేమికుల రోజునే గ్రేట్ న్యూస్‌ని వినిపిస్తాన‌ని ఎందుకు అంటోంద‌న్న‌ది అర్థం కావ‌డం లేద‌ని శ్రీ‌ముఖి ఫ్యాన్స్ త‌ల‌బాదుకుంటున్నారు.  

ముద్దుల్తో శ్యామ‌ల‌ని ముంచెత్తాడు!

బుల్లితెర‌పై యాంక‌ర్‌గా రాణిస్తోంది శ్యామ‌ల‌. కొన్ని చిత్రాల్లో న‌టిగా కూడా రాణించిన శ్యామ‌ల ప్ర‌స్తుతం సినిమా కార్య‌క్ర‌మాల‌తో పాటు ప‌లు టీవీ షోల‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అంతే కాకుండా సొంతంగా ఇటీవ‌ల ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌ని కూడా ప్రారంభించింది. దీని పేరే వెరైటీగా ప్లాన్ చేసింది. శ్యామ‌ల త‌న యూట్యూబ్ ఛాన‌ల్ పేరుని 'ఏం చెప్పారు శ్యామ‌ల‌గారు' అని పెట్టేసింది. టీవీ న‌టుడితో ప్రేమ‌లోప‌డిన శ్యామ‌ల అత‌న్నే వివాహం చేసుకుంది. ఇటీవ‌లే త‌న వైవాహిక జీవిత ప‌ద‌వ వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా శ్యామ‌ల పంచుకున్న ఓ వీడియో ఇప్ప‌డు నెట్టింట సంద‌డి చేస్తోంది. ప‌ద‌వ వివాహ వేడుక‌ని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్న శ్యామ‌ల ఇందు కోసం ప్ర‌త్యేకంగా ఓ వీడియోను అభిమానుల కోసం పంచుకోవాల‌ని ప్ర‌య‌త్నించింది. ఈ వీడియోలో శ్యామ‌ల భ‌ర్త న‌ర‌సింహ ఆమెపై ముద్దుల వ‌ర్షం కురిపించాడు. వీడియో షూట్ మొద‌లైంద‌ని తెలిసినా శ్యామ‌లని ఆప‌కుండా ముద్దుల్లో ముంచేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. బిగ్‌బాస్ సీజ‌న్ 2లోనూ సంద‌డి చేసిన శ్యామ‌ల ప్ర‌స్తుతం మ‌రింత పాపులారిటీని ద‌క్కించుకుని య‌మ బిజీగా మార‌డం విశేషం.

కోర్టు నోటీసులు.. సౌంద‌ర్య టెన్ష‌న్‌‌.. దీప ఆనందం!

  'కార్తీక దీపం'లో ఇంత కాలంగా సాగుతున్నఎపిసోడ్‌ల‌లో కంట‌నీరు పెట్టిన వంటల‌క్క తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో న‌వ్వుతూ చ‌లాకీగా క‌నిపిస్తోంది. వంటల‌క్క న‌వ్వు వెన‌కున్న ధైర్య‌మేంటీ?  మోనిత అస‌లు గుట్టు దీప చేతికి చిక్కిందా? అని స‌గ‌టు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే గురువారం ఎపిసోడ్‌లో డాక్ట‌ర్ బాబుకు దీప‌ మ‌రో ట్విస్ట్ ఇవ్వ‌బోతోంది. కార్తిక్‌తో విడాకుల‌కు అప్లై చేసిన దీప ఆ కేసుని హిమ కేసుతో లింక్ పెట్టేసి మోనిత అస‌లు రంగు బ‌ట్ట‌బ‌య‌లు చేసే మ‌హ‌త్త‌ర ప్లాన్ కు శ్రీ‌కారం చుట్టింది. ఇదే విష‌యం ఈ రోజు రివీల్ ‌కాబోతోంది. స‌రోజ తెచ్చిన విడాకుల నోటీసులు అందుకున్న దీప అంతులేని సంతోషంతో "జీవితంలో విడాకులు అడ‌క్కుండా చేయ‌డానికి నాకు దొరికిన‌ అవ‌కాశం" అంటుంది. క‌ట్ చేస్తే కోర్టు నోటీసులు సౌంద‌ర్య చేతికి అందించి న‌వ్వుతూ నిల‌బ‌డుతుంది దీప‌. విడాకుల నోటీసులు చూసి సౌంద‌ర్య టెన్ష‌న్ ప‌డుతుంటే దీప మాత్రం ఆనందంతో న‌వ్వుతుండ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. "ఏంటీ? ఏం జ‌రుగుతోంది?" అని కంగారుగా అడిగిన సౌంద‌ర్య‌కు దీప ధైర్యం చెబుతుంది. "కొండంత అండ‌గా నిల‌బ‌డే మీరే ఇలా బెదిరిపోతే ఎలా?" అంటుంది దీప. అయినా సౌంద‌ర్య‌లో భ‌యం వీడ‌దు. ఇంత‌కీ దీప ధైర్యం ఏంటీ?  దాని వెన‌కున్న అస‌లు సీక్రెట్ ఏంట‌న్న‌ది తెలియాలంటే 'కార్తీక‌ దీపం' గురువారం ఎపిసోడ్ చూడాల్సిందే.