పెళ్లి లైఫ్ లాంగ్ కమిట్మెంట్... ఇప్పుడున్న జెనెరేషన్ కి ఇది సెట్ కాదు

నిజానికి పెళ్లి ఒక పెద్ద కమిట్మెంట్. ఈ జెనెరేషన్ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఇష్టపడడమే లేదు. ఇండిపెండెంట్ గా ఉంటాం అంటూ ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు. ఈ వారం ఫ్యామిలీ స్టార్స్ లో కూడా ఈ పెళ్లి అనే టాపిక్ మీద ఈ షోకి వచ్చిన స్టార్స్ అంతా మాట్లాడారు. "అసలు పెళ్లి ఎందుకు వద్దో ఒక రీజన్ చెప్పండి" అని సుధీర్ అడిగాడు. "పెళ్లి అనేది ఒక పెద్ద కమిట్మెంట్ చాలా బాధ్యతలు ఉంటాయి. స్వేచ్ఛ ఉండదు. ఆ బాధ్యతలను నెరవేర్చడంలోనే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళడంలోనే లైఫ్ సర్వనాశనం ఐపోతుంది" అంటూ నటి హేమ చెప్పింది. ఇక బుల్లితెర నటి జ్యోతి మాట్లాడుతూ "పెళ్లి అనేది లైఫ్ లాంగ్ కమిట్మెంట్. ఇప్పుడు ఉన్న జెనెరేషన్ కి ఇది సెట్ కాదు. ప్రతీ ఒక్కరు వాళ్ళ వాళ్ళ జీవితాలతో ఇండిపెండెంట్ గా ఉండడానికి అలవాటైపోయారు. ఎవరి సెల్ఫ్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. పెళ్లి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఎంత వరకు ఇవ్వగలుగుతారు అనేది గ్యారెంటీ లేదు. అందుకే పెళ్లి వద్దు అనుకోవడమే బెటర్" అని చెప్పింది. ఇక ఆకర్ష్ బైరాముడి మాట్లాడుతూ "పెళ్లి ఎందుకు వద్దు అంటే మీ ఇంటికి మీరే వెళ్ళాలి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళలేరు" అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. ఇలా ఒక్కొక్కరు పెళ్లి ఎందుకు వద్దు అనే టాపిక్ మీద వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు.

Tanuja vs Immanuel: తనూజ మాటలకు కన్నీళ్ళు పెట్టుకున్న ఇమ్మాన్యుయల్!

బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడవ వారం నామినేషన్లో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. వారిలో డీమాన్ పవన్ వర్సెస్ సుమన్ శెట్టి నామినేషన్ నెక్స్ట్ లెవెల్ నామినేషన్ అవ్వగా భరణి వర్సెస్‌ తనూజ నామినేషన్ సెన్సిటివ్ టాపిక్ గా మారింది.  ఇక రీతూ వర్సెస్ సంజన మధ్య గత వారం జరిగిన హీటెడ్ ఆర్గుమెంట్స్ తాలుకా సెగ ఇంకా కొనసాగుతూనే ఉంది. రీతూ క్షమాపణ చెప్తుందేమోనని వెయిట్ చేశా కానీ అది నీ దగ్గర రాలేదని సంజన తన నామినేషన్ పాయింట్ చెప్పింది. ఇక ఇద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఇక తనూజని ఇమ్మాన్యుయల్ నామినేషన్ చేయగా రివేంజ్ నామినేషన్ గా ఇమ్మాన్యుయల్ ని తనూజ నామినేట్ చేద్దామని తన పాయింట్లు చెప్పింది. బిగ్ బాస్ కి రాకముందు ఇమ్మాన్యుయల్ తప్ప నాకు ఎవరు తెలియదు.. నేను ఎలా ఆడుతానో ఏమోనని భయంగా ఉందని బయట అంటే ఎందుకురా భయం నేనుబ్నా కదరా అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. ఆ ధైర్యంతోనే హౌస్ లోకి వచ్చిన నాటి నుండి నాకు ఏదనిపిస్తే అది వాడితో షేర్ చేసుకునేదాన్ని అంటు తనూజ ఏడ్చేసింది. ఒకవేళ వాడితో గొడవ జరిగితే భరణి గారితో షేర్ చేసుకునేదాన్ని అని తనూజ ఏడ్చేసింది. నాకు ఎవరితో ఇష్యూ ఉన్నా వాడితోనే షేర్ చేసుకునేదాన్ని ఎందుకంటే వాడు నా ఫ్రెండ్.. కానీ దాన్ని కూడా నామినేషన్లో పెట్టావు. నా మీద ‌నీకు కోపం ఉన్నా.. ఏం అయినా అనిపించినా నా‌ మొఖం మీద చెప్పు.. కరెక్ట్ చేసుకుంటా లేదంటే తర్వాత అయినా చెప్పు మార్చుకుంటానని తనూజ ఎమోషనల్ అయింది. ఇక ఇమ్మాన్యుయల్ తన పాయింట్లు చెప్పుకొచ్చాడు‌. నువ్వు ఎలాగైతే ఫీల్ అయ్యావో నేను అలాగే ఫీల్ అయ్యాను. నాకు నీకన్నా రీతూ ఆర్నెళ్ళు పరిచయం కానీ తనతో హౌస్ లో ఎప్పుడు క్లోజ్ గా లేను. మొదటి మూడు వారాలు తనూజని నేను ఎప్పుడు వదిలిపెట్టలేదు. నా విషయంలో నువ్వు ఎంత ట్రూ గా ఉన్నావో.. నీ విషయంలో నేను అంతే ట్రూ గా ఉన్నానని ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అయ్యాడు.  నాన్న తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని నువ్వు ఎప్పుడైతే అన్నావో..‌ అప్పుడే బాధపడ్డాను.. ఇంత సపోర్ట్ గా నిలిచినా నువ్వు ఇలా అనేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. తనూజ నువ్వు ఏమైనా అంటే దాని నుంచి నాకు బయటికి రావడానికి టైమ్ పడుతుంది తనూజ.. మనిద్దరికి గొడవలు వద్దనే చెప్పాను నేను. అప్పుడు నువ్వేమన్నావంటే.. నువ్వు నా ఫ్రెండే కాదురా అని నా మొఖం మీద చెప్పావ్.. అప్పుడే నా మనసు విరిగిపోయిందని ఇమ్మాన్యుయల్ ఏడ్చేశాడు.

Suman Shetty : నీకు దెబ్బ తగిలింది కదా హౌస్ లో నుండి వెళ్ళిపో పవన్.. ది బెస్ట్ నామినేషన్ ఇదే!

బిగ్ బాస్ సీజన్-9 లో సోమవారం నామినేషన్ల ప్రక్రియ ఫుల్ ఆసక్తికరంగా సాగింది. కానీ సుమన్ శెట్టి చేసిన నామినేషన్ నెక్స్ట్ లెవెల్ అంతే. అంతగా హౌస్ మేట్స్  ఎప్పుడు నవ్వలేదు. నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి తన మొదటి నామినేషన్ గా రీతూని చేశాడు. ఆ వివరాలు ఓసారి చూసేద్దాం.  రీతూ నువ్వు హౌస్‌లో గట్టిగట్టిగా అరుస్తావ్.. నాకు అది ఇబ్బందిగా ఉందని సుమన్ శెట్టి తన పాయింట్ చెప్పాడు.  నేను, మీరు ఒకేలా మాట్లాడం కదా అన్నా.. దానికి నేనేం చేయాలి.. మిగిలిన వాళ్లకి కూడా ఇబ్బంది అయితే వాళ్లు చెప్పుండేవాళ్లు కదా అని రీతూ అడుగుతుంది. వాళ్ళకి భయమేమో చెప్పలేదు కానీ నాకు భయం లేదు అందుకే చెప్తున్నానని సుమన్ శెట్టి అన్నాడు. ఇక ఆ తర్వాత డీమాన్ పవన్ ని నామినేట్ చేశాడు సుమన్ శెట్టి. ఇక తన కారణం చెప్పాడు. నీకు దెబ్బ తగిలింది కదా పవన్.. నువ్వు ఇంటికెళ్లిపోయి రెస్ట్ తీసుకోమని సుమన్ అనగానే డీమాన్ తో పాటు హౌస్ అంతా ఫుల్ నవ్వుకున్నారు.  నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ వి కానీ నీకు రెస్ట్ అవసరం ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని సుమన్ శెట్టి అంటాడు. అదేంటన్నా స్ట్రాంగ్ అంటే ఉండాలి కదా అని డీమాన్ అన్నాడు. నీకు హెల్త్ బాలేదు కదా వెళ్ళిపోమని సుమన్ శెట్టి అనగానే కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ అయితే పగలబడి నవ్వుకున్నారు. భరణి, తనూజ అయితే నవ్వలేక మొహం కప్పేసుకున్నారు. సుమన్ శెట్టి చేసిన ఈ నామినేషన్ తో హౌస్ అంతా ఫుల్ హ్యాపీగా నవ్వుకున్నారు. ది బెస్ట్ నామినేషన్ గా సుమన్ శెట్టి నామినేషన్ నిలిచిపోతుంది. 

Bharani : రీతూతో ఉండొద్దు డీమాన్.. నీ ఆట నువ్వు ఆడు 

  బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ మినహా అందరు నామినేషన్లో ఉన్నారు. నిన్నటి నామినేషన్ లో డీమాన్ చేసిన నామినేషన్ లో పెద్దగా వ్యాలిడ్ పాయింట్లు లేవు. కానీ భరణి చేసిన రెండు నామినేషన్లు వ్యాలిడ్ గా అనిపించాయి.  భరణి తన మొదటి నామినేషన్ గా సంజనని చేశాడు. తన ట్యాబ్లెట్స్ దాచేసి ఫ్రాంక్ చేద్దామని అనుకున్నావంటు తన నామినేషన్ రీజన్ చెప్పగా జస్ట్ సరదాగా చేశానని సంజన అంది. ఇక ఆ తర్వాత డీమాన్ పవన్ ని తన సెకెండ్ నామినేషన్ గా చేశాడు భరణి. ఇక అందులో తన రీజన్లు చెప్పాడు భరణి. నిన్ను ఏదైతే వెనక్కి లాగుతుందో దాన్ని తీసి పక్కనపెట్టు అని డీమాన్‌కి భరణి చెప్పాడు. ఎప్పుడైతే మనం మెంటల్‌గా ఫోకస్డ్‌గా ఉండలేమో.. ఫిజికల్‌గా కూడా ఉండలేమని భరణి అన్నాడు. నేను రీతూతో ఉండొద్దు అని చెప్పడం లేదు.. హౌస్ లో ప్రతీ ఒక్కరికి బాండింగ్ ఉంటుంది. దానిని నేను తప్పు పట్టడం లేదు.. దానిని తప్పు అని అనుకున్న వారిది తప్పు అంటూ భరణి అన్నాడు.  భరణి చెప్పిన నామినేషన్ రీజన్లకి డీమాన్ పవన్ కంప్లీట్ గా అర్థం చేసుకున్నాడు. ఒకే అన్న అంటూ ఆక్సెప్ట్ చేశాడు. ఇక కాసేపటికి నేను ప్రతి ఒక్కరికీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. ఈవారం టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే.. మార్క్ మై వర్డ్స్ అంటూ డీమాన్ పవన్ ఛాలెంజ్ చేశాడు. ఇక అది చూసి అందరు వీడేంట్రా బాబు అనుకున్నారు. నామినేషన్లో ఓ పక్కన కుర్చీలో కూర్చున్నాడు. గేమ్స్ పెడితే ఏం ఆడుతాడ్రా బాబు అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. 

Jayam serial : రుద్ర కాళ్ళపై పడి క్షమాపణ చెప్పిన గంగ.. పెద్దసారు మాట ఫైనల్!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -129 లో..... గంగనే ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టిందని ఇన్‌స్పెక్టర్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. నేను అలా చెయ్యలేదు.. నాకేం తెలియదని గంగ అంటుంది. మోసం చేసి పెళ్లి చేసుకున్నావా అని శకుంతల అంటుంది. నా కూతురు అలా తప్పు చేసే మనిషి కాదని లక్ష్మీ రిక్వెస్ట్ చేస్తుంది. గంగ నీ ఫోన్ ఇవ్వు అని రుద్ర తీసుకుంటాడు. అందులో గంగ, రుద్ర ఉన్న ఫోటోని చూసి షాక్ అవుతాడు. ఇలా ఎందుకు నమ్మకద్రోహం చేసావని రుద్ర అనగానే గంగ షాక్ అవుతుంది. నువ్వు సోషల్ మీడియాలో పెట్టకుంటే ఎందుకు నీ ఫోన్ లో ఉంటుందని రుద్ర అంటాడు. నాకేం తెలియదని గంగ అంటుంది. ఇలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదని శకుంతల అంటుంది. ఏది జరిగిన గంగ ఈ ఇంటికి కోడలు తనని వెళ్ళమని చెప్పే అధికారం నీకు లేదని శకుంతలతో పెద్దసారు అంటాడు. లక్ష్మీ కళ్ళు తిరిగి పడిపోతుంటే.. అమ్మ నువ్వు నా గురించి టెన్షన్ పడకని గంగ చెప్తుంది. సూర్యకి పెద్ద సారు, లక్ష్మి వాళ్ళని ఇంటి  దగ్గర దింపి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత నేనేం తప్పు చెయ్యలేదు సర్ అని గంగ చెప్తుంది. గంగ అలాంటిది కాదని ప్రీతీ, స్నేహ, ప్రమీల, వంశీ అంటారు. మా అమ్మ మీద ఒట్టు నేను ఏ తప్పు చెయ్యలేదని గంగ అనగానే ఎలాగ ఆరోగ్యం బాలేదు పోతే పోనిలే అని వేస్తున్నావా అని ఇషిక అంటుంది. ఇషిక మర్యాదగా మాట్లాడు అని గంగ తనపై కోప్పడుతుంది. కాసేపటికి రుద్ర కాళ్లపై గంగ పడి.. నేను ఏ తప్పు చెయ్యలేదు.. నా తాళి మీద ఒట్టు అని చెప్తుంది. ఒకమ్మాయి తాళి మీద ఒట్టేసి అబద్ధం చెప్పదని పెద్దసారు అంటాడు. ఈ విషయం గురించి వదిలెయ్యండి అని చెప్పి రుద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు పైడిరాజు నిద్ర లేచి గంగ రాలేదా నిన్ననే మనతో పాటు రమ్మన్నాను కదా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : నర్మద, ప్రేమ మాస్టర్ ప్లాన్.. అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -330 లో...... నర్మద, ప్రేమ కలిసి శ్రీవల్లి దగ్గరున్న నగలు బయటపెట్టడానికి ప్లాన్ చేసి ఒక స్వామిని యాక్టింగ్ చెయ్యడానికి తీసుకొని వస్తారు. అతను ఎక్కడ నగలున్నా కనిపెడతానని చెప్పి ఇంట్లో అందరి దగ్గరున్న నగలు తీసుకొని రండి అని చెప్పగానే అందరు నగలు తీసుకొని వస్తారు. ఇంకా ఏమైనా మర్చిపోతే అవి అన్నీ ఆకులు అయ్యేలా చేసానని స్వామి చెప్తాడు. దాంతో శ్రీవల్లికి టెన్షన్ మొదలవుతుంది. స్వామి వెళ్లిపోయాక శ్రీవల్లి తన అమ్మకి ఫోన్ చేసి అసలు విషయం చెప్తుంది. నేను వస్తున్నానని భాగ్యం చెప్తుంది. భాగ్యం ఆనందరావు గేట్ దగ్గరికి వస్తారు. ప్రేమ, నర్మద వాళ్ళని ఆపేస్తారు. నగలు బయటపడేవరకు బయట నుండి ఒక్క పురుగు కూడా రావొద్దని చెప్పి వాళ్ళని భయపెట్టి తిరిగి వెనక్కి పంపిస్తారు. వేదవతి దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. అత్తయ్య ఆ స్వామి అన్ని వట్టిగనే చెప్పాడు. మీరేం టెన్షన్ పడకండి అని చెప్తుంది. ఆ మాటలు విన్న ప్రేమ, నర్మద ఇద్దరు తనకి భయం పుట్టించాలనుకుంటారు. అత్తయ్య నేను ఒక రింగ్ దాచాను.. ఇదిగోండి ఆకుగా మారిందని నర్మద అనగానే వేదవతి ఇంకా భయపడుతుంది. అసలు ఆ నగలు కూడా ఆకులుగా మారాయి కావచ్చని అంటుంది. వెంటనే శ్రీవల్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. నువ్వు కూడా ఆ నగలు తీసి ఆకులుగా మారాయో చూడమని చెప్తుంది. దాంతో శ్రీవల్లి గొయ్యి తీసి నగల మూట తీసి చూస్తుంది. అందులో నగలు ఉంటాయి. అవి చూసి శ్రీవల్లి మురిసిపోతుంది. అప్పుడే ప్రేమ, నర్మద వస్తారు. వాళ్ళని చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : భర్తగా ఒప్పుకోనని చెప్పిన కాంచన.. శ్రీధర్ ఆన్ ఫైర్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -529 లో.. శ్రీధర్, కాంచనతో మాట్లాడతాడు. అప్పుడే కావేరి ఎంట్రీ ఇస్తుంది. నేను ఆఫీస్ కి వెళ్ళాను. అక్కడ లేరని కావేరి అంటుంది. నేను ఇప్పుడు దీప కోసం వచ్చాను. తనకి ఈ స్వీట్స్ తీసుకొని వచ్చానని చెప్తుంది. అప్పుడే శౌర్య వచ్చి కావేరికి హాయ్ చెప్తుంది. నాకు మాత్రమే చెప్తున్నావ్.. మీ తాతయ్యకి చెప్పవా అని కావేరి అనగానే తాతయ్య ఎప్పుడు వస్తాడుగా అని శౌర్య అంటుంది. అంటే ఆయన ఇప్పుడు సీఈఓ కదా కార్తీక్ గురించి వస్తుంటారని కాంచన కవర్ చేసినట్లు మాట్లాడుతుంది. నాకు ఒక లడ్డు ఇవ్వు అని శౌర్య అనగానే ఇది మీ అమ్మకి అని కాంచన అంటుంది. అప్పుడే కార్తీక్, దీప ఎంట్రీ ఇస్తారు. వచ్చావారా మీ నాన్న నీతో మాట్లాడాలని చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నారని కాంచన అంటుంది. నీకు దీప ప్రెగ్నెంట్ అవ్వడం ఇష్టం లేదా అని కాంచనపై శ్రీధర్ కోప్పడతాడు. ఎందుకు అంటే అలా ఉన్న కోడలిని మీ ఇంటికి పనికి పంపుతావా.. ఈ రోజు ఆ ఇంట్లో దీప పడిపోయేది.. సుమిత్ర పట్టుకుంది. కార్తీక్ తండ్రి కాబోతున్నాడంటే నేను తాతయ్య కాబోతున్నానని హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వేం చేస్తావో తెలియదు. దీప ఆ ఇంటికి వెళ్లకుండా చూడమని శ్రీధర్ చెప్పి వెళ్తాడు. కావేరి నువ్వు కూడా వెళ్ళమని కాంచన అనగానే శ్రీధర్ తో పాటు కావేరి కూడా వెళ్తుంది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ ఇంటికి దీప వెళ్ళడానికి వీల్లేదని కాంచన తెగేసి చెప్తుంది. మరొకవైపు శ్రీధర్ కి పీఏగా కాశీకి జాబ్ ఇస్తాడు. నాకు వద్దని కాశీ అంటాడు. నువ్వు ఈ జాబ్ చెయ్యకపోతే మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతానని స్వప్న బ్లాక్మెయిల్ చేస్తుంది. దాంతో కాశీ జాబ్ కి ఒప్పుకుంటాడు. స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు నేను చెప్పిందేం చేసారని కార్తీక్, దీపలని కాంచన అడుగుతుంది. అప్పుడే శౌర్య వస్తుంది. పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే ఎందుకు మధ్యలో వస్తావని శౌర్యపై కాంచన కోప్పడుతుంది. ఆ తర్వాత దీపపై కార్తీక్ కోప్పడతాడు. ఎందుకు దానిపై అరుస్తున్నావని కార్తీక్ పై కాంచన అరుస్తుంది. నాకు కోపం వస్తే నేనేం చెయ్యాలి.. అద్దంలో చూసుకుంటా.. నాకు నేను అరవాలని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్య, రాజ్ కలిసి వేసిన డిజైన్స్ ని రాహుల్ చూస్తాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -892 లో.... అందరు భోజనం చేస్తుంటే రాహుల్ వస్తాడు. రాజ్ నీ కంపెనీ నుండి మేనేజర్ వచ్చాడు.. నా కంపెనీకి తీసుకున్నాను కానీ నీకు చెప్పలేదని రాహుల్ అనగానే అలా ఎలా చెప్పలేదు.. ముందే చెప్పాలి కదా అని సుభాష్ అంటాడు. పర్లేదు డాడీ వాడికి ఇప్పుడు అనుభవం ఉన్న మేనేజర్ కావాలని రాజ్ అంటాడు. నువ్వు అలా అన్ని లైట్ తీసుకోబట్టే కంపెనీ వెనక్కి వెళ్తుందని సుభాష్ అంటాడు. ఇప్పుడు దాని గురించే కావ్య నేను కష్టపడుతున్నాము మళ్ళీ నెంబర్ వన్ కి తీసుకొని వస్తామని రాజ్ చెప్తాడు. అది సరే గాని ట్యాబ్లెట్ వేసుకుంటున్నావా అని అపర్ణ అడుగుతుంది. హా అత్తయ్య అలారం పెట్టుకొని మీ ఆయన టైమ్ కి టాబ్లెట్స్ ఇచ్చాడని కావ్య చెప్తుంది. ఆ తర్వాత రాజ్, కావ్య డిజైన్స్ వేస్తుంటే రాహుల్ వస్తాడు. ఈ టైమ్ లో ఎందుకు వచ్చావని కావ్య అడుగుతుంది. ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చానని రాహుల్ అంటాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చూడడానికి లేదు నీ ఆలోచనలు నీవి.. మా ఆలోచనలు మావి.. ఇప్పుడు ఏమీ రెవిల్ చెయ్యమని రాజ్ చెప్తాడు. దాంతో రాహుల్ బయటకి వచ్చి అవేంటో చూసి నేను తీసుకుంటానని అనుకుంటాడు. మరొకవైపు అప్పు కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా.. పాప పాధర్ వచ్చాడని, కానిస్టేబుల్ అప్పుకి చెప్తాడు. అప్పు కళ్యాణ్ తో చెప్పి ఇప్పుడు మనం స్టేషన్ కి వెళ్లాలని చెప్తుంది. మరొకవైపు రాజ్, కావ్య ఇద్దరు హాల్లోకి వస్తారు. మేం గుడికి వెళ్లి ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్తామని చెప్తారు. ఆ తర్వాత కళ్యాణ్, అప్పు బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని ధాన్యలక్ష్మీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. హాస్పిటల్ కి చెకప్ కి అని కళ్యాణ్ చెప్పి.. ఎలాగోలా అప్పుని బయటకు తీసుకొని వస్తాడు. మరొకవైపు రాజ్, కావ్య గుడికి వెళ్తారు. ఈ డిజైన్స్ దేవుడి దగ్గర పెట్టి ఇవ్వండి అని పంతులుకి కావ్య ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నాకు పండు అంటే ఇష్టం..

ఢీ 20 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో హోస్ట్ నందు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పాడు. ఇద్దరి జర్నీ ఇక్కడితో ఎండ్ కాబోతోంది అని చెప్పాడు. ఇందులో అందరూ వాళ్ళ వాళ్ళ స్టైల్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స లు ఇచ్చారు. ఇక ఢీ 10 రాజు ఒక బిడ్డను పట్టుకుని చేసిన ఒక యాక్ట్ అందరినీ కదిలించింది. "నల్లని వన్నీపాలని" అనే పాటకు లేడీ గెటప్ లో ఒక తల్లిగా నటిస్తూ డాన్స్ చేసాడు. ఊరికే ఆ టైటిల్ ఇవ్వలేదు "కింగ్ ఆఫ్ ఢీ అన్నది" అంటూ విజయ్ బిన్నీ మాస్టర్ రాజుని బాగా మెచ్చుకున్నాడు. "పేరెంట్స్ కిడ్స్ ని ఎంత ప్రేమిస్తారు అన్నది చాలాచాలా బాగా చూపించారు చిట్టి  మాస్టర్ " అంటూ చెప్పారు విజయ్ బిన్నీ మాస్టర్. ఇక విజయ్ బిన్నీ మాష్టర్ కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. వాళ్ళ ఫామిలీని ఈ స్టేజి మీదకు తీసుకొచ్చారు. వాళ్ళ అబ్బాయి వియాన్ష్ ని తీసుకొచ్చి "హ్యాపీ బర్త్ డే" సాంగ్ పాడించారు. ఆ తర్వాత విజయ్ బిన్నీ మాష్టర్ తన బిడ్డను ఎత్తుకున్నాడు. ఆ పిల్లాడు ఎమోషనల్ ఐపోయాడు. "నీకు ఢీలో ఎవరంటే ఇష్టం" అని అడిగేసరికి "పండు అంటే ఇష్టం" అని చెప్పాడు. "స్కూల్ కి వెళ్లకపోతే ఏమవుతారు" అంటే "ఫెయిల్" అని చెప్పాడు. ఇక తర్వాత హ్యాపీ బర్త్ డే అంటూ విష్ చేసి అందరూ కలిసి కేక్ కట్ చేశారు. ఇక అసలైన పండు  మాస్టర్  వచ్చేసాడు. "సిరిసిల్ల ఎళ్లినాడు..సీరాలెన్నో తెచ్చినాడు" అంటూ లేడీ గెటప్ లో చేసిన డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఇక విజయ్ బిన్నీ మాస్టర్ ఐతే పండూ అంటూ గట్టిగా అరిచి లేడీ గెటప్ ఎంత బాగున్నావో తెలుసా అన్నాడు. అంతే పండు సిగ్గుపడిపోయాడు. "వాడికి అమ్మ లేదు కదా మాస్టర్ ఢీ షోనే అమ్మల భావిస్తాడు. ఇక లాస్ట్ లో నందు "అరె వియాన్ష్ ఈ సాలా కప్పు" అనేసరికి "లాలీపాప్" అంటూ వేలు చూపించాడు. దాంతో అందరూ నవ్వేశారు.

శేఖర్ చంద్ర ఎన్నో ఢక్కామొక్కీలు తిని పైకొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ 

పాడుతా తీయగా షో ఈ వారం ఎపిసోడ్స్ మంచి హుషారుగా సాగాయి. ఇక ఈ షోకి ఎనర్జిటిక్ హోస్ట్ సుమ గెస్ట్ గా వచ్చింది. ఇందులో ఆమె తనదైన శైలిలో కామెంట్స్ తో కంటెస్టెంట్స్ ని హుషారెత్తించింది. ఐతే ఇందులో కీరవాణి కూడా కంటెస్టెంట్స్ కి చాలా సజెషన్స్ ఇచ్చారు. ఇక "హరి అనుమోలు అనే ఒక ఫేమస్ డి.ఓ.పి ఉన్నారు. ఆయన ఒక రోజు వాళ్ళ అబ్బాయి శేఖర్ చంద్రని తీసుకొచ్చి మీ వెనక తిప్పుకోండి మ్యూజిక్ అంటే ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు అన్నారు. నేను కూడా నాతో తిరిగాడు. కీ బోర్డు నేర్చుకున్నాడు. నాతో తిరిగితే పెద్దగా ఏమీ పట్టుబడదు . నువ్వొక పని చెయ్యి మద్రాస్ వెళ్ళిపో అక్కడ నీకు ఎవరు తెలియకపోయినా సరే అలాగే స్ట్రగుల్ అవ్వు. నువ్వు రోడ్ల మీద తిరుగుతావో, ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వెళ్లి ప్రాధేయపడతావో తెలీదు. నీ సొంతంగా నువ్వే చూసుకో అని చెప్పా. ఈత రాని వాడిని సముద్రంలో తోసేస్తే ఈత వచ్చేస్తుంది చూడు అలాగే నువ్వు అలా వెళ్ళిపో అన్నాను. నా మాట తూచ తప్పకుండ పాటించాడు అలా వెళ్ళిపోయాడు. తర్వాత నేను బాలు గారి థియేటర్ లో కోదండపాణి ఆడియో ల్యాబ్ లో ఒకసారి ఏదో రికార్డింగ్ చేస్తుంటే అక్కడ కనిపించాడు. అది కూడా రెండేళ్ల తర్వాత. ఎం శేఖర్ బాగున్నావా అంటే బాగున్నాను అన్నాడు. నేను ఢక్కామొక్కీలు తిని అందరినీ పరిచయం చేసుకున్నాను. మీరు చెప్పినట్టే చేసాను నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఆ తర్వాత కట్ చేస్తే మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు చాల మంచి హిట్స్ ఇచ్చాడు. సో శేఖర్ చంద్రను చూసి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే రికమండేషన్ లు కానీ ఎవరో ఏదో చేస్తారు అని ఎవరో సపోర్ట్ చేస్తారు అని అనుకోకుండా నీ శక్తిని నమ్ముకుంటూ అట్లాగ స్వయంకృషితో వెళ్ళిపోవాలి ముందుకు. ఎవరి కోసం ఆగకుండా వెళ్తే కాలం అదే మీకు సహాయం చేసి రూట్ ఏర్పాటు చేస్తుంది అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్ర ఒకరు" అంటూ చెప్పుకొచ్చారు.

Suman Shetty: సుమన్ శెట్టి వల్లే డబుల్ ఎలిమినేషన్ చేయలేదా.. బిగ్ ట్విస్ట్!

బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండో వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అన్నారు. కానీ లాస్ట్ మినిట్ లో దివ్యని సింగిల్ ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. దాని వెనుక ఉన్న అసలు కారణం సుమన్ శెట్టి.  పదకొండు వారాలుగా హౌస్ లో ఏం చేయకపోయినా.. నామినేషన్లో ఉన్నా సేవ్ అవుతూ వస్తున్న సుమన్ శెట్టిని చూసి అందరికి అర్థం అయింది ఒక్కటే.. సుమన్ శెట్టిని ఎన్ని వారాలు కాపాడాలో అన్ని వారాలు కాపాడుకుంటూ వస్తున్నాడు బిగ్ బాస్. గతవారం సంజన, సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో ఉంటే ఎలిమినేషన్ రౌండ్ ని సంజన, దివ్యల మధ్య పెట్టాడు బిగ్ బాస్. ఇక ఈ వారం సుమన్ శెట్టి లీస్ట్ ఓటింగ్ తో ఉన్నా దివ్యని ఎలిమినేషన్ చేశారు. అయితే ఇప్పుడున్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లో వీక్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే అది సంజన, సుమన్ శెట్టి అంతే. అయితే సుమన్ శెట్టికి చాలా ఓట్ బ్యాకింగ్ ఉంది. తనకు ఫాలోవర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ వార్ కూడా జరుగుతుంది. అందుకే మనం ఇప్పట్లో అతడిని పంపించొద్దని బిగ్ బాస్ ఆలోచించి అతడిని తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ అందరిని ఎలిమినేట్ చేస్తున్నాడు. సుమన్ శెట్టి వల్ల స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయినటువంటి దివ్య ఎలిమినేట్ అయింది. అంతకముందు నిఖిల్ కూడా సుమన్ శెట్టి నామినేషన్ వల్ల బయటకు వచ్చాడు. అసలు నిఖిల్ అండ్ సుమన్ శెట్టికి టాస్క్ పెడితే ఎవరు గెలుస్తారు. అలాంటి ఒక ప్లేయర్ బయటకు వచ్చాడంటే ఇది కచ్చితంగా బిగ్ బాస్ మామ జిమ్మిక్కు అంటే తనూజ, సుమన్ శెట్టి ఇద్దరిని ఎంత కాపాడాలో అంతా కాపడుతున్నాడు. పన్నెండో వారం హౌస్ లో తొమ్మిది మంది ఉన్నారు.. పదకొండో వారం ఎలిమినేషన్ జరుగలేదు.. ఫినాలేకి ఇంకా మూడు వారాలే మిగిలి ఉంది.. ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండాలి.. కానీ లీస్ట్ లో సుమన్ శెట్టి, సంజన, దివ్య ఉన్నారు. దివ్యకి ఎలాగు నెగెటివ్ ఉంది కాబట్టి తనని ఎలిమినేట్ చేద్దాం.. సుమన్ శెట్టిని బయటకు రాకుండా ఆపాలంటే డబుల్ ఎలిమినేషన్ ఉండకూడదని అలా సింగిల్ ఎలిమినేషన్ చేశాడంటూ బిగ్ బాస్ పై ఫుల్ ట్రోల్స్ వస్తున్నాయి. మరి డబుల్ ఎలిమినేషన్ జరగకుండా ఉండటానికి కారణమేంటో మీరే కామెంట్ చేయండి. 

Tanuja : దత్తపుత్రిక తనూజ ఖాతాలో దివ్య బలి.. బిగ్ బాస్ సపోర్ట్ ఆమెకేనా!

  తనూజ కన్నింగ్ బయటపడింది.. రీతూతో కలిసి గేమ్ ప్లే చేస్తున్న తనూజని అందరి ముందు ఫెయిర్ గా చూపించడానికి బిగ్ బాస్ చాలా కష్టపడుతున్నాడు. ఆమెతో గొడవపెట్టుకుంటే ఎవరైనా ఎలిమినేట్ అవ్వాల్సిందేనని మరో ఎలిమినేషన్ ద్వారా తెలిసింది.  ఇంటికొచ్చిన అతిథులకి భోజనం ఒకేలా వడ్డించాలి కానీ కొందరికి వెండి ప్లేట్ లో భోజనం పెట్టి, మరికొందరికి బంగారు ప్లేట్ లో పెడితే ఇలాగే ట్రోల్స్ చేస్తారు. దివ్య ఎలిమినేషన్ కి కారణం బిగ్ బాస్ మామ చేసిన జిమ్మిక్కు అంటు నెటిజన్లు మండిపడుతున్నారు. అందులో ఓటింగ్ రిజల్ట్స్ లో తనూజకి ముప్పై శాతం ఓటింగ్ పడటం చూసి అది అంత కన్విన్సింగ్ గా అనిపించడం లేదే అని భావిస్తున్నారు. తనూజ కన్నింగ్ ని బయటకి రానివ్వకుండా ఉండటానికి లాస్ట్ వీక్ కెప్టెన్సీ వీక్ లో దివ్యకి వెన్నిపోటు పొడిచిన వీడియోని బయటకు రానీయకుండా సంజన, రీతూల మధ్య జరిగిన ఇష్యూతో ఎపిసోడ్ కొనసాగించాడు. దాని తర్వాత కళ్యాణ్, డీమాన్ పవన్ ల ఇష్యూతో సగం ఎపిసోడ్ ని ముగించాడు బిగ్ బాస్ మామ. తనూజ పొగరుగా మాట్లాడింది.. అటిట్యూడ్ తో ఉన్నది.. కనపడకుండా చేసి.. దివ్య ఏం మాట్లాడినా దానిని నెగెటివ్ చేస్తూ చూపించాడు బిగ్ బాస్. తనూజని ఎంత పాజిటివ్ గా చూపిస్తున్నారంటే.. చివరికి షోకి వచ్చిన ఆడియన్స్ తో కూడా తనూజ ఫ్యాన్స్ అని చెప్పించాడు. రీతూతో దివ్యని కెప్టెన్సీ రేస్ నుండి తీసేసిన తనూజ గేమ్ స్ట్రాటజీని ఎక్కడ నెగెటివ్ గా పోట్రే చేయలేదు.. అదే అంతకుముందు వారం తనూజని గేమ్ నుండి తీసెయ్యాలని దివ్య చెప్పింది మాత్రం చూపించాడు బిగ్ బాస్. ఇదొక్కటి చాలు దివ్యని ఎంత నెగెటివ్ చేయాలో అంతా చేశారు.. తనూజని ఎంత పాజిటివ్ చేయాలో అంత పాజిటివ్ గా చూపించాడు. ‌అందుకే రివ్యూలు, ట్రోలర్స్ కూడా తనూజని దత్తపుత్రిక అని అంటారు. మొత్తానికి తనూజ ఖాతాలో దివ్య బలి అయింది. ఈ వారం కూడా తనూజకి ఎవరైతే నెగెటివ్ అవుతారో వాళ్ళే ఎలిమినేట్ అవుతారని ఆడియన్స్ ఫిక్స్ అవుతున్నారు.

Divya Buzz interview: నా అన్నయ్య భరణి..ఈ ఒక్క విషయంలో నా మనసు మాట వినలేదు!

బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండో వారం దివ్య ఎలిమినేట్ అయింది.‌ ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇంకా మూడు వారాల గేమ్ మిగిలి ఉంది. దివ్య ఎలిమినేషన్ వెనుక చాలా కారణాలున్నాయి. తను స్ట్రాంగ్ అయినప్పటికీ హౌస్ లో ఎవరి సపోర్ట్ లేకపోవడం.. ఆడియన్స్ తన బాండింగ్ అర్థం చేస్కోకపోవడం.. భరణి కుటుంబమే దూరం పెట్టడం.. అన్నింటికి మించి దివ్యకి ఓట్ బ్యాంకింగ్ లేకపోవడం పెద్ద మైనస్ అయి బయటకొచ్చేసింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చాక శివాజీతో బజ్  ఇంటర్వ్యూలో పాల్గొంది దివ్య.  తనూజ మీద ఇప్పుడు నీ ఒపినీయన్ ఏంటమ్మా అని అడుగగా.. తను చాలా పొసెసివ్.. ముద్దుముద్దుగా మాట్లాడుతుంది. కానీ నచ్చినవాళ్ళతోనే.. నచ్చకపోతే దూరం పెట్టేస్తుంది. భరణి, తనూజ విడిపోడానికి కారణం నువ్వేనని అంటున్నారని శివాజీ అడుగగా.. నాకేవసరం సర్ వాళ్ళని విడగొట్టడానికి, నేను వాళ్ళని విడగొట్టి ఏం సాధిస్తాను.. పోనీ నేను వచ్చానని చెప్పి విడిపోయే అంత వీక్ ఆ వాళ్ళు.. ఆయన ఏం రాస్తే మనకెందుకమ్మ.. ఆయన ఆంటిమెంట్ రాస్తాడు.. ఎత్తుకొని తిప్పుతాడు.‌ అతను పిల్లాడు కాదు..నీకేంటమ్మా ప్రాబ్లమ్ అని శివాజీ అడుగగా.. నా దగ్గరకి ఓ మనిషి వచ్చి ఈ బాధ ఉందని చెప్పారనుకోండి అని దివ్య ఏదో చెప్పబోతుంటే.. భరణి చెప్పకపోయినా మీకు బాధ తెలుస్తుంది అది కదా మా బాధ అని శివాజీ అడుగగా... దివ్య సైలెంట్ అయిపోయింది. భరణి బయటకెళ్ళి మళ్ళీ వచ్చాక నిన్ను అంత ఎంకరేజ్ చేయలేదు అబ్జర్వ్ చేశావా అని శివాజీ అడుగగా.. అవును గమనించానని దివ్య అంది. మరి అప్పుడన్న అర్థం చేసుకోవాలి కదా అమ్మ అని శివాజీ అనగానే దివ్య షాక్ అయింది. మీ మమ్మీ ఏం చెప్పిందో తెలుసా.. దివ్యని భరణి గారికి దూరంగా ఉండమని చెప్పమ్మా  అనగానే నాకు తెలియదని దివ్య అంది. అసలు భరణితో ఎందుకంతా .. నీ గేమ్ నువ్వు ఆడుకోవచ్చు కదా అని శివాజీ అడుగగా.. నా అన్నయ్య.. మళ్ళీ వెనక్కొచ్చారు.. ఆయనతో ఉండాలి.. ఆయనని బాగా చూస్కోవాలి.. అయనతో గేమ్ బాగా ఆడాలి.. ఇదే ఇంటెన్షన్ తో ఉన్నాను.. బయటకెళ్ళాక కూడా ఆయన నాతో ఎలా ఉంటారో తెలియదు కానీ నేను మాత్రం వందశాతం ఆయన బాగు కోరుకునే వ్యక్తిగానే ఉంటానని ఏడ్చేసింది దివ్య. ఈ ఒక్క విషయంలోనే నా మనసు నా బ్రెయిన్ మాట వినలేదని దివ్య అనగా నువ్వు చాలా ఎమోషనల్ అవుతున్నావమ్మ అని శివాజీ టిష్యూ ఇచ్చాడు. తను జెన్యున్ ప్లేయర్ అని ఆడియన్స్ అందరికి తెలుసు.. కా‌నీ భరణితో ఇంత అటాచ్ మెంట్ ఉందని ఈ బజ్ ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. మరి దివ్య ఆటతీరు మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Divya Remuneration: దివ్య రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  బిగ్ బాస్ సీజన్-9 లో మొదటగా ఒక కామనర్ గా అగ్నిపరీక్షలో ఎంట్రీ ఇచ్చింది దివ్య. అయితే తనయ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయింది. ఇక బిగ్ బాస్ తనని మూడో వారం అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ తో లోపలికి తీసుకొచ్చాడు. అయితే తనని హౌస్ మేట్స్ అంతా వద్దని ఓట్ చేశారు కానీ బిగ్ బాస్ తననే హౌస్ లోకి తీసుకొచ్చాడు. మూడో వారం నుండి పన్నెండో వారం వరకు దివ్య స్ట్రాంగ్ అండ్ జెన్యున్ కంటెస్టెంట్ గా ఆడియన్స్ దృష్టిలో నిలిచింది. అయితే భరణితో అన్నయ్య అనే బాండింగ్ ని కొనసాగించడమే తన గేమ్ ని స్పాయిల్ చేసింది. భరణి మధ్యలో ఎలిమినేట్ అయి లోపలికి వెళ్ళాడు. అప్పుడు దివ్య మళ్లీ తనతో బాండింగ్ కొనసాగించడం తనని వెనక్కి లాగేసింది. గతవారం ఇమ్మాన్యుయల్ పవరస్త్ర వాడటం వల్లే దివ్య హౌస్ లో ఉంది. అయితే ఈ వారం మాత్రం తను ఎలిమినేషన్ అయి బయటకు వచ్చేసింది. దివ్య వారానికి లక్ష యాభై వేల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే తను హౌస్ లో ఉన్న తొమ్మిది వారాలకు గాను పదమూడు లక్షల యాభై వేల నుండి పద్నాలుగు లక్షల వరకు రెమ్యునరేషన్ దివ్య అందుకున్నట్లు తెలుస్తోంది. 

Divya Elimination : దివ్య ఎలిమినేషన్.. ఫుల్ క్లారిటీగా ఉందిగా!

  లైఫ్ లో ఎప్పుడు ఎవరిని ఏం చేయాలని అడుగకు ఎందుకంటే నీ కంటూ ఓ క్లారిటీ ఉండాలి.. ‌ఇది జులాయి సినిమాలో డైలాగ్. ప్రస్తుతం హౌస్ లో ఉన్నవారిలో ఎవరికి క్లారిటీ లేదు కానీ దివ్యకి ఫుల్ క్లారిటీ ఉంది. అందుకే తను ఎలిమినేషన్ అవుతానని ముందే తెలుసుకుంది. ఫుల్ హ్యాపీగా ఉంది. అయితే దివ్య ఎలిమినేట్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. తనకి స్ట్రాంగ్ ఓటింగ్ లేకపోవడం.. పీఆర్ సరిగ్గా లేకపోవడం.. భరణితో తను క్లోజ్ గా ఉండటం.. తను ఎలిమినేట్ అవ్వడానికి కారణం అయ్యాయి. నిన్నటి సండే ఎపిసోడ్ లో  నాగార్జున అందరితో సరదాగా మాట్లాడాడు. ఎప్పటిలాగే హౌస్ లోని కంటెస్టెంట్స్ ని రెండు టీమ్ లు డివైడ్ చేశాడు నాగార్జున. వారితో టాస్క్ ఆడించాడు‌. ఆ తర్వాత నామినేషన్ లో ఉన్నవారిని ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు.‌ ఇక ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉండగా.. సుమన్ శెట్టి, దివ్య ఇద్దరు మాత్రం చివరి రౌండ్ వరకు మిగిలారు. వీరిద్దరి మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరిగింది. కాసేపు కంటెస్టెంట్స్ ని ఆడించి ఇక ఎలిమినేషన్ రౌండ్ కోసం ఇద్దరిని యాక్టివిటీ ఏరియాకి పిలిచాడు నాగార్జున. సుమన్, దివ్యల మందు రెండు అగ్నిపర్వతాలు ఉంచాడు బిగ్ బాస్. ఇందులో నుండి రెడ్ కలర్ వస్తే ఎలిమినేట్ , గ్రీన్ వస్తే సేఫ్ అని నాగార్జున చెప్పాడు. ఇక ఫై టూ వన్ కౌంట్ డౌన్ చేశాడు నాగార్జున. కాసేపటికి దివ్య ముందున్న అగ్నిపర్వతం నుండి రెడ్ కలర్ వచ్చింది. సుమన్ శెట్టి ముందున్న అగ్నిపర్వతం నుండి గ్రీన్ కలర్ బయటకు వచ్చింది. దాంతో దివ్య యూ ఆర్ ఎలిమినేటెడ్ అని నాగార్జున చెప్పేశాడు. ఇక సుమన్ కి హగ్ ఇచ్చి హౌస్ లోకి వెళ్ళింది దివ్య. హౌస్ మేట్స్ అందరికి బై చెప్పేసి మెయిన్ గేట్ ద్వారా   బయటకు వచ్చింది దివ్య. ఇక కాసేపటికి స్టేజ్ మీదకి వచ్చేసింది దివ్య. ఇక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయింది. 

ఫ్యామిలీ స్టార్స్ లాంటి షోస్ కి రావొచ్చని మూవీస్ కి గ్యాప్ ఇచ్చా.. నటి జ్యోతి 

  ఫ్యామిలీ స్టార్స్ లో పవిత్రతో కలిసి సందడి చేసింది. ఈ షోలో పవిత్ర జ్యోతిని కొన్ని ప్రశ్నలు అడిగింది. "పెళ్లినే జ్యోతి వద్దనుకుందా..పెళ్లి జ్యోతిని వద్దు అనుకుండా" అంటూ పవిత్ర నటి జ్యోతిని అడిగింది. దాంతో బ్యాక్ గ్రౌండ్ ఇదేం ప్రశ్న తింగరి ముఖందాన అనే కామెంట్ వినిపించింది. "ఈ కంటెంట్ డైరెక్టర్ వద్దనుకుంటున్నారు" అంటూ సుధీర్ కౌంటర్ వేసాడు. ఆన్సర్ చెప్పండి అని జ్యోతిని అడిగేసరికి "పెళ్లి నన్ను వద్దు అనుకుంటోంది. కానీ ఇక్కడ సుధీర్ ని చూసేసరికి " అంది జ్యోతి.      "అసలు నేను వెళ్లిపోవడమే మంచిదనుకుంటా.. ఇక్కడ నన్ను ఎందుకు కూర్చోబెట్టారో నాకు అర్ధం కావట్లేదు" అన్నాడు. "నీకో సామెత తెలుసా ఆకొచ్చి ముళ్ళు మీద పడినా ముల్లొచ్చి ఆకు మీద పడినా బొక్క ఎవరికీ సుధీర్ కి" అంటూ సుధీర్ మీద కామెంట్స్ చేశారు జ్యోతి, పవిత్ర. "మీరు ఇంత అందంగా ఉంటారు కదా మరి సినిమాల్లోకి కాకుండా ఇంటికే ఎందుకు పరిమితమైపోయారు" అని అడిగింది. "ఎవరు చెప్పారు ఇంటికి పరిమితమయ్యానని అంటే కొంచెం గ్యాప్ తీసుకుంటే ఇలాంటి షోస్ కి రావొచ్చని" అంది జ్యోతి. "ఒహ్హ్ ఐతే ఇక్కడ చాలా మంది గ్యాప్ తీసుకున్నారు" అంది పవిత్ర . "జ్యోతిని జనాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి" అని మళ్ళీ అడిగింది. "యు ఆర్ సో హాట్" అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి" అంది జ్యోతి.  

స్పెల్లింగ్ అంత లేవు..రూమ్ లో ఏసీ వేసుకుని వణుకుతూ ఛిల్ల్ అవుతారు..నీకెందుకు ?

  ఫ్యామిలీ స్టార్స్ షోలో ఈ వారం పాగల్ పవిత్ర కొంతమందిని రకరకాల ప్రశ్నలు అడిగి కామెడీ రోస్ట్ చేసింది. ఇక నటి హేమని పిలిచింది. ఆమె విషయంలో కాంట్రోవర్సి అనే పదాన్ని సరిగా పలకకపోయేసరికి నటుడు సమీర్ ఒక రేంజ్ లో ఆదుకున్నాడు. ఆ స్పెల్లింగ్ అంత లేవు నీకెందుకు అలాంటి పదాలు అంటూ పవిత్ర పరువు తీసేసాడు. ఇక పవిత్ర హేమని కొన్ని ప్రశ్నలు అడిగింది. "మీకు సినిమాల్లో గ్యాప్ వచ్చిందా మీరే తీసుకున్నారా.. దానికి రీజన్ ఏంటి" అని పవిత్ర హేమని అడిగింది.      "ప్రస్తుతానికి ఐతే నేనే గ్యాప్ తీసుకున్నాను. ఛిల్ల్ అవుదామని" అని హేమ చెప్పింది. "ఎలా ఛిల్ల్ అవుతారు అని పవిత్ర అడిగేసరికి అదేం ప్రశ్న రూమ్ లో ఏసీ వేసుకుని వణుకుతారు" అంటూ సుధీర్ కౌంటర్ ఇచ్చాడు. "హేమ వున్న చోట కాంట్రావర్సీ అవుతుందా ..హేమ ఉండడం వల్లే కాంట్రావర్సీ అవుతుందా అర్ధం కావట్లేదు" అని అంది. "చాల మంది బతకడం కోసం కాంట్రోవర్సి చేస్తూ ఉంటారు. నా వల్ల వాళ్ళు బతుకుతున్నారు కదా అని నేను హ్యాపీగా ఫీలవ్వుతుంటాను" అని చెప్పింది హేమ. "మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి" అని అడిగింది పవిత్ర. "ఛిల్ల్ అవుతారు మళ్ళీ" అంటూ సుధీర్ ఆన్సర్ చెప్పాడు. దానికి హేమ నవ్వేసింది.  

నా కోసం కూడా ఒకళ్ళు కామెంట్ పెడుతున్నారని హ్యాపీగా ఫీలవుతా

    ఫ్యామిలీ స్టార్స్ ఎపిసోడ్ ఈ ఆదివారం ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో చీకటి కోణం అనే ఒక కాన్సెప్ట్ ని పవిత్ర రన్ చేసింది. ఇందులో వర్షని ఇంటర్వ్యూ చేసింది పవిత్ర. "వర్ష ఇండస్ట్రీలో బాగా సెట్ ఐపోయింది. ఐతే ఒక లవ్ ట్రాక్ వల్లే సెటిల్ ఐనట్టు నాకనిపిస్తోంది తన జీవితం కూడా సెట్ ఐనట్టు అనిపిస్తోంది దీనికి ఏమంటావ్" అని పవిత్ర వర్షని అడిగింది. "మీకు అనిపిస్తే అది మీ ఒపీనియన్ . నేను దాన్ని మార్చలేను, లవ్ ట్రాక్ వల్లే నేను సెట్ అయ్యాను, లవ్ ట్రాక్  వల్లే నేను ఉన్నాను అనేది కాదు కానీ లవ్ ట్రాక్ వెళ్ళిపోయి చాలా రోజులు అయ్యింది. అప్పుడే నేను కూడా వెళ్లిపోవాల్సింది కదా కానీ ఇంకా ఇక్కడైకి గెస్ట్ లా వచ్చి ఉన్నాను అంటే అర్ధం చేసుకోవాలి" అని చెప్పింది వర్ష.      "యాక్టింగ్ రాకపోవడం వల్లే గ్లామర్ మీద మొత్తం తన ఫోకస్ మీదే ఉంది అనేది బయట నెటిజన్స్ అనుకుంటున్నారు" అని పవిత్ర అడిగింది. "నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గ్లామర్ అన్నందుకు. " అంది వర్ష. "మీకు ఎవరైనా బాడ్ కామెంట్స్ పెడితే ఎలా రియాక్ట్ అవుతారు" అని అడిగింది. "ఎలాంటి కామెంట్ పెట్టినా నా కోసం ఒకళ్ళు కామెంట్ పెట్టారు అంటూ హ్యాపీగా ఫీలవుతాను." అని చెప్పింది. వర్ష బుల్లితెర మీద ఆన్ స్క్రీన్ జోడీగా ఇమ్మానుయేల్ తో కలిసి స్టార్టింగ్ లో బాగా ఎంటర్టైన్ చేసింది.     ఐతే వీళ్ళ జోడి బాగా హిట్ అయ్యాక నెమ్మదిగా ఇద్దరూ వేరే వేరే ఛానెల్స్ లో అవకాశాలను వెతుక్కుంటూ ఈ జోడి కాస్తా విడిపోయారు. ఇమ్మానుయేల్ ఇప్పుడు స్టార్ మాకి వచ్చాడు. వచ్చిన కొద్దీ రోజులకే బిగ్ బాస్ కి వెళ్ళాడు. ఇక వర్ష ఐతే వేరే ఛానెల్ లో ఇంటర్వ్యూస్ చేస్తూ తన దారిలో తానూ వెళ్తోంది.  

ఢీ - 20 లో ఎవరు ఎలిమినేట్ ఐతే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు?

  ఢీ షో ఎలిమినేషన్స్ దగ్గర పడ్డాయి. ఐతే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇక దీని మీద రీసెంట్ ఈటీవీ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. జతిన్,  సిజ్లింగ్ సుష్మిత, కండక్టర్ ఝాన్సీ, పండు మాష్టర్, అన్షు రెడ్డి, రాజా నందిని, మణికంఠ, జానూ లిరి, అభి మాష్టర్, సంకేత, భూమిక, రాజు. వీళ్ళ లిస్ట్ ఇచ్చి "మీరే గనక ఎలిమినేట్ చేయాల్సి వస్తే ఎవరిని ఎలిమినేట్ చేస్తారో కింద కామెంట్ చేయండి.    ఎలిమినేషన్ ఫీవర్ ని ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి " అంటూ ఒక టాస్క్ ఇచ్చింది. దీంతో నెటిజన్స్ కామెంట్స్ వరద కురిపించారు. "అన్షు రెడ్డికి డాన్స్ రాదు. జానుకి ఎక్స్ప్రెషన్స్ రావు, సుస్మిత, అన్షు రెడ్డి, జానూని ఎలిమినేట్ చేస్తాను, భూమికను ఎలిమినేట్ చేస్తాను" అంటూ చెప్తున్నారు. ఎలిమినేషన్ కంటే కప్పు ఎవరు కొడతారు అనే విషయం మీద కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సంకేత్, రాజు, జతిన్ వీళ్లల్లో ఎవరైనా కప్పు కొడతారు అని కొంతమంది అంటే కాదు పండు ఈ సీజన్ కప్పు కొడతాడు అంటున్నారు.    అమ్మాయిలందరినీ ఎలిమినేట్ చేయండి అని కొందరు కామెంట్ చేస్తే ఈసారి కప్పు పల్సర్ బైక్ ఝాన్సీ సొంతం చేసుకుంటుంది అంటున్నారు. పండుకే ఈ కప్పు సొంతం కావాలి. మంచి డాన్సర్ మంచి ఎంటర్టైనర్ కూడా అంటున్నారు. ఇక పండు ఐతే రీసెంట్ గా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సీజన్ 5 లో కుకింగ్ కంటెస్టెంట్ గా వచ్చాడు. మరి ఢీ షోలో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు టైటిల్ విన్ అవుతారో చూడాలి.