Karthika Deepam2 : ఇరుక్కున్న పారిజాతం.. జ్యోత్స్న ప్లాన్ అదేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -451 లో......దీప, కార్తీక్ ఇద్దరు సత్యనారాయణ వ్రతం చేస్తుంటారు. ఒక సుమిత్ర తప్ప అందరు పూజకి వస్తారు. పారిజాతం అందిరితో తను మారిపోయినట్లు మాట్లాడుతుంది. అది చూసి దాస్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా అమ్మ మారిపోయింది. నువ్వు ఎప్పుడు మారుతావోనని జ్యోత్స్నతో అంటాడు దాస్. అయిన నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా అని దాస్ తో అంటుంది జ్యోత్స్న.   నువ్వు పెళ్లికి రావద్దన్నావ్ పూజకి కాదు.. నన్ను కార్తీక్ పిలిచాడని దాస్ అంటాడు. నువ్వు నిజం తెలియనంత వరకే ఇవన్నీ అనుభవిస్తుంటావ్.. ఎప్పుడు నిజం తెలుస్తుందో తెలియదు.. ఆ లోపు సంతోషంగా ఉండు అని జ్యోత్స్నకి దాస్ వార్నింగ్ ఇస్తాడు. ఒకసారి నిజం తెలిసిందంటే నన్ను మీరు తట్టుకోలేరని జ్యోత్స్న అనుకుంటుంది. పూజ జరుగుతుంది.. అమ్మాయి తల్లిదండ్రులు బట్టలు పెట్టాలని పూజరి అంటాడు. నా భార్య రాలేదు నేను పెడతానని దశరథ్ పెడుతుంటే సుమిత్ర వచ్చి తన చెయ్ కూడా పెడుతుంది. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.ఆ తర్వాత పూజ పూర్తవుతుంది. అందరికి వాయినం ఇచ్చి దీప పంపిస్తుంది. తాతయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని కార్తీక్, దీపలతో కాంచన అనగానే.. స్వప్న అక్షింతలు తీసుకోవడానికి పారిజాతం గారు జరగండి అని అంటుంది. ఏంటే నువ్వు ఏంటే నీ స్థాయి ఏంటి నన్ను పక్కకి జరగమంటున్నావని పారిజాతం గొడవ మొదలుపెడుతుంది. స్థాయి గురించి మాట్లాడుతున్నావ్.. ఎవరి స్థాయి ఏంటో తెలుసు.. పెళ్లిలో తాళి తీసావని స్వప్న అంటుంది. నేను తియ్యడం ఏంటని పారిజాతం అంటుంది. ఆ తాళి ఎవరు తీసారో నాకు తెలుసని పారిజాతం అంటుంది. దాంతో సుమిత్ర టెన్షన్ పడుతుంది. ఇప్పుడు పారు అత్తయ్య పేరు చెప్తుందా అని కార్తీక్ టెన్షన్ పడతాడు. శివన్నారాయణ దశరథ్ అందరు పారిజాతాన్ని ఎవరు తాళి తీశారని అడుగుతారు. ఎవరు తాళి తీశారు చెప్పండి అని పారిజాతాన్ని దీప అడుగుతుంది. నన్ను అడుగుతావేంటి మీ అయన కార్తీక్ ని అడుగమని పారిజాతం అనగానే ఆయనకు తెలుసా అని దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : భార్యపై ప్రేమతో అలా చేసిన భర్త.. బ్రహ్మముడి ఇదేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -814 లో.... కావ్య దగ్గరికి రాజ్ వెళ్తాడు. నువ్వు అనుకున్నది సాధించావ్ కళావతి. నన్ను నీ ప్రేమలో పడేసావని కావ్యపై ఉన్న ప్రేమని చెప్తాడు రాజ్. నీ ప్రేమ ఎప్పటికి నాకు కావాలి.. అలా కావాలంటే ఇప్పుడేం చేయాలి.. నీ కాళ్ళు పట్టుకోనా అని రాజ్ అనగానే అయ్యో వద్దండీ అని రాజ్ ని కావ్య హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కావ్య పైకి వెళ్తుంటే రాజ్ వెళ్లకని అడ్డుపడతాడు. ఎందుకు నన్ను వద్దంటున్నారని కావ్య అడుగుతుంది. అంటే నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా నువ్వు మెట్లు ఎక్కకూడదని రాజ్ అంటాడు. అయితే ఏం చేస్తారు. నేను రోజుకి ఎన్నిసార్లు పైకి కిందకి వెళ్తానో తెలుసా అని కావ్య అంటుంది. అలా వద్దని చెప్తున్నానని కావ్యని ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు రాజ్. అదంతా అప్పు, కళ్యాణ్ చూస్తారు. నన్ను కూడా ఎత్తుకొని తీసుకొని వెళ్ళండి అని అప్పు అనగానే కళ్యాణ్ ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత రోజు ఇలా ఎత్తుకొని తీసుకొని వెళ్ళడం కష్టం దీనికి పరిష్కారం ఆలోచించాలని రాజ్, కళ్యాణ్ అనుకొని ఇద్దరి పేరెంట్స్ ని పిలిచి బ్యాగ్ లతో సహా హాల్లో నిల్చోపెడతారు. మీరు ఇక నుండి పైకి వెళ్ళాలి.. మేమ్ కింద ఉంటామని రాజ్ కళ్యాణ్ అంటారు. సడెన్ గా ఏంటిది ఇదంతా కావ్య ప్లాన్ అయి ఉంటుందని అపర్ణ అంటుంది. నేను పంతులిని అడిగాను.. వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నారు కదా వాళ్ళు కింద ఉండాలి.. పెద్దవాళ్ళు పైన ఉండాలని చెప్పారని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో మనం ఇన్ని బాధలు పడడానికి కారణం ఆ యామిని అని రాజ్ కి కావ్త చెప్పగానే రాజ్ కోపంగా యామిని దగ్గరికి వెళ్తాడు. రాజ్ యామినిపై కోప్పడుతుంటే.. నన్ను క్షమించు రాజ్ అని రాజ్ కాళ్లపై పడుతుంది యామిని. మా యాక్సిడెంట్ కి కారణం నువ్వేనని తెలిస్తే మాత్రం నిన్ను నీ ఫ్యామిలీని ఏం చేస్తానో తెలియదని రాజ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శ్రీనివాస్ తో గొంతు కలిపిన కార్తీక్...డాక్టర్స్ కి చూపిస్తాం అంటూ ప్రామిస్ చేసిన థమన్

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 4 లాంచింగ్ ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ వచ్చి జడ్జెస్ ని ఇంప్రెస్స్ చేసేలా పడుతూ వెళ్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో వైజాగ్ నుంచి వచ్చిన 26 ఏళ్ళ శ్రీనివాస్ సాంగ్ కి ఫిదా ఇపోయారు జడ్జెస్ ముగ్గురు. శ్రీనివాస్ పుట్టిన దగ్గర నుంచే తనకు కళ్ళు కనిపించవు అని చెప్పాడు. ఇక థమన్ "ఏ సాంగ్ పాడుతున్నావ్" అని అడిగేసరికి..."ఒక మారు" అనే సాంగ్ పడుతున్నా అని చెప్పాడు. "ఓహ్ అది కార్తీక్ సాంగ్ కదా కార్తీక్ అంటే ఇష్టమా" అని అడిగాడు. "అవును అలాగే మీరు నా ఫెవరేట్ మ్యూజిక్ డైరెక్టర్" అని చెప్పాడు. "ఏ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇష్టం" అని కార్తీక్ అడిగాడు. "వయోలిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇష్టం భాగమతి మూవీ కూడా ఇంకా ఇష్టం, నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ ని" అని చెప్పాడు. "వీళ్లందరినీ మీరు ఎలా ఊహించుకుంటారు " అని గీత మాధురి అడిగింది. డైలాగ్స్ వింటూ యాక్షన్ లో ఊహించుకుంటాను అని చెప్పాడు. ఇక థమన్ డీటెయిల్స్ తెలుసుకున్నాడు. సౌండ్ ప్రకారం ఊహించుకుని నీ సొంత ప్రపంచంలో ఉండడం గొప్ప విషయం కంటి చూపు విషయంలో డాక్టర్స్ ఎం చెప్పారో తెలుసుకుని...తామిద్దరం కలిసి తెలిసిన ఐ డాక్టర్స్ కి చూపిస్తామని చెపారు.. శ్రీనివాస్ సిస్టర్ కి నంబర్ ఇచ్చి తనను కాంటాక్ట్ చేయమన్నారు థమన్, కార్తీక్. మంచి టాలెంట్ ఉంది కదా కళ్ళుంటే ఇంకా బాగా పాడతారు కదా అందుకే మేము నిన్ను డాక్టర్స్ కి చూపిస్తాం అని చెప్పాడు థమన్. ఇక ఈ సాంగ్ కార్తిక్ పాడిన తర్వాత శ్రీనివాస్ గొంతులోనే బాగుంది అంటూ థమన్ కితాబిచ్చాడు. ఇక కార్తిక్ ఐతే శ్రీనివాస్ కి హెడ్ ఫోన్స్ ని గిఫ్ట్ గా ఇచ్చి "ఒక మారు" సాంగ్ ని అతనితో కలిసి పాడాడు. ఇక ముగ్గురు జడ్జెస్ శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి గోల్డెన్ టికెట్ ఇచ్చారు.  

ఢీ డాన్సర్స్ అన్షు - రాజు...హగ్గులు,రోజాలు

  ఇంతకుముందు వరకు జబర్దస్త్ లోనే ట్రెండింగ్ కపుల్స్ కనిపించేవాళ్ళు...వాళ్లనే నెటిజన్స్ కూడా ఆరాధిస్తూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఢీ షోలో కూడా ఆ ట్రెండ్ కనిపిస్తోంది. కొంతమంది కపుల్ కంటెస్టెంట్స్ మాత్రం ఫుల్ ట్రెండ్ అవుతున్నారు. ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో ఆడియన్స్ ని కట్టి పడేస్తున్నారు. వాళ్ళే అన్షు - రాజు, ఆనాల సుస్మిత - పండు, విజయ బిన్నీ మాష్టర్ - రెజీనా అలాగే భూమిక - అభి మాస్టర్ ఇలా. నెక్స్ట్ వీక్ ఢీ షో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతోందన్న విషయం ప్రోమో చూస్తే తెలుస్తుంది. ఇందులో కాండిల్ లైట్ కపుల్స్ గా వీళ్ళు ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇక అన్షు - రాజు ఐతే నిజంగానే ప్రేమలో ఉన్నట్టు ఈ షో ద్వారా లవ్ ని ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు. "నీ కోసం రెక్కల గుర్రాన్ని తేలేకపోవచ్చు కానీ రెక్కలు ముక్కలు చేసుకుని మిమ్మల్ని ఒక రాణిలా చూసుకుంటాను" అంటూ అన్షుకి ప్రామిస్ చేసాడు రాజు. ఇక జడ్జ్ రెజినా ఐతే "అన్షు నువ్వు కూడా ప్రేమను ఫీలవుతున్నావా" అని అడిగేసరికి సిగ్గుతో తలదించుకుంది. ఇక సంకేత - శార్వరి ఇద్దరూ కలిసి ఒక ఒక ప్రేమ పాటకు డాన్స్ చేసి అందరినీ ఫిదా చేసేసారు. రాజు ఐతే బాయ్స్ మూవీలోంచి 16 ప్రాయంలో అనే సాంగ్ కి డాన్స్ చేసాడు. ఇక అన్షు ఐతే దేవుడికి దణ్ణం పెట్టుకుని "నాకు కూడా నువ్వంటే కొంచెం ఐ లవ్ యు " అని చెప్పింది. రాజు రెడ్ ఇచ్చాడు. అన్షు హగ్ చేసుకుంది. ఇక హోస్ట్ నందు ఐతే అరేయ్ వదినమ్మరా అనేసరికి అన్షు దణ్ణం పెట్టేసింది.  

బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీతేజ

బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో సింగర్ శ్రీతేజను చూసాం. ఐతే ఇప్పుడు శ్రీతేజ టాప్ 5 లో లేడు. ఐతే బిగ్ బాస్ హౌస్ కి వెళ్తాడా లేదా అనే డౌట్ అందరిలో ఉంది. ఇక ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి స్టేటస్ లో పోస్ట్ చేసాడు. "మీకు బిగ్ బాస్ సెట్ అవదు తేజ" అని చెప్పేసరికి.."బిగ్ బాస్ లో ఒక్కొక్కరిని ఒక్కో రోజు చూసి మన డెసిషన్ మార్చుకుంటాం. మీ డెసిషన్ కూడా మారొచ్చేమో" అన్నాడు. ఇక ఇంకొంతమంది అడిగిన ప్రశ్నలకు వరసగా ఎం చెప్పాడంటే "బిగ్ బాస్ లో ఉంటాం..ఉంటాం..వైల్డ్ కార్డు ఎంట్రీనా కాదా అనే విషయాలు చెప్పేస్తారు మరి ..బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేద్దాం భయ్యా..అన్నీ అప్పుడే చెప్పకూడదు.  మీ సపోర్ట్ ఉంటే బిగ్ బాస్ హౌస్ లో కచ్చితంగా ఉంటాను. ఒక ఎపిసోడ్ లో షోకి డైరెక్టర్ క్రిష్ వచ్చినప్పుడు అయన ముందు పెర్ఫర్మ్ చేయడం మర్చిపోలేను. కొంతమంది నన్ను కాంపిటీటర్ గా అనుకున్నారు. కానీ జ్యూరీ మాత్రం నేను బెస్ట్ అని చెప్పారు. కానీ ఆ విషయం టెలికాస్ట్ చేయలేదు. నా ఫెవరెట్ సింగర్ శ్రేయ గోషాల్ గారితో కొలాబరేట్ అయ్యి పాడాలని ఉంది. నన్ను నేను బిగ్ బాస్ హౌస్ లో చూసుకోవాలని ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు. శ్రీతేజ గాయకుడిగా చాలా పాపులర్. తెలుగు సింగర్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సింగింగ్ సెక్షన్ నుంచి బిగ్ బాస్ టీమ్ ప్రతీ సీజన్ కి ఒకళ్ళను తీసుకుంటూ వస్తోంది. ఇక ఈసారి శ్రీతేజను తీసుకునే అవకాశం కనిపిస్తోంది.  

Bigg Boss 9 Telugu: బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన శ్రేయ.. ఓట్ అప్పీల్ కి అవకాశం!

  బిగ్ బాస్ సీజన్-9 లోకి  పర్ఫెక్ట్ కంటెస్టెంట్స్ ని  పంపించడానికి అగ్నిపరీక్ష వేదిక అయింది. ఈ అగ్నిపరీక్షలో పదిహేను మంది కంటెస్టెంట్స్ రాగా వారిలో నుండి అయిదుగురు మాత్రమే హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. ప్రస్తుతం అగ్నిపరీక్ష టాస్క్ లలో కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ బట్టి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం వస్తుంది. వాళ్ళని హౌస్ లోకి పంపించే బాధ్యతలు మాత్రం ప్రేక్షకులదే అని బిగ్ బాస్ ఫైనల్ చేశారు. అయితే ఇప్పటికే హాట్ స్టార్ లో ఓటింగ్ నడుస్తుంది. నేటి ఎపిసోడ్ హాట్ స్టార్ లో టెలికాస్ట్ అయింది. ఇందులో అంచనా థీమ్ ని జడ్జెస్ తీసుకున్నారు. ఎంత బరువు ఉంటుందని అంచనా వెయ్యడం.. అలా జడ్జెస్ చెప్పిన దానికి దగ్గరగా బరువు కరెక్ట్ గెస్ చేసిన వారు లీడర్.. ఈ టాస్క్ లో అయిదుగురు లీడర్స్ అయ్యారు. టీమ్ కి ముగ్గురు.. ఇక లాస్ట్ టాస్క్ బ్లాక్ బెలూన్ కింద పడకుండా రాడ్ ని తీస్తూ ఉండాలి. ఇలా  లెవెల్స్ ఉంటాయి. చివరి వరకు శ్రేయ టీమ్ ఇందులో ఉంటుంది. శ్రేయకి టీమ్ బెస్ట్ పర్పామెన్స్ ఇవ్వగా వారికి  ఓటు అప్పీల్ ఛాన్స్ వచ్చింది. శ్రేయ ఓట్ అప్పీల్ ఛాన్స్ ని దాలియాకి ఇచ్చింది. వరెస్ట్ పర్ఫామెన్స్ గా శ్వేతకి నవదీప్ ఎల్లో కార్డు ఇచ్చాడు. తను బ్లాక్ బెలూన్ పడేయ్యంతో వారి టీమ్ లో మిగతా ఇద్దరికి ఆడే ఛాన్స్ మిస్ అయిందని కారణం చెప్పి ఎల్లో కార్డు ఇచ్చాడు నవదీప్. ఇక బెస్ట్ పర్ఫామెన్స్ గా శ్రేయకి స్టార్ వచ్చింది. దాంతో తను ఇది మా అమ్మకి అంకితం చేస్తున్నానని  చెప్తూ ఎమోషనల్ అయింది. నేను ఒక్కసారి కూడా లీడర్ కాలేదు.. నేను చిన్నపిల్లని అని తొక్కేస్తున్నారని శ్రేయ లీడర్ అయినప్పుడు చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. శ్రేయ గెలవడంతో తనని శ్రీముఖి, బిందుమాధవి ఎత్తుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు.  

Bigg Boss 9 Telugu : శ్రీముఖికి ఎల్లో కార్డ్.. ఓట్ అప్పీల్ సాధించిన ప్రియ!

  బిగ్ బాస్ సీజన్-9 ప్రారంభానికి ముందే పీక్స్ కి వెళ్తుంది. అగ్నిపరీక్షలో ఒక్కో ఎపిసోడ్ ఒక్కో లెవెల్ లో సాగుతుంది. తాజాగా జడ్జెస్ కోపంగా ఉన్నారని కంటెస్టెంట్స్ తో ప్రామిస్ చేయించింది శ్రీముఖి. ఇక జడ్జెస్ కోపంగానే స్టేజ్ మీదకి ఈ ఒక్క ఛాన్స్ ఇస్తామన్నట్లు కోపంగా మాట్లాడి వాళ్ళ సీట్లలోకి వెళ్తారు. ఇక పదిహేను మంది ముగ్గురుగా అయిదు టీమ్ లు అయ్యారు. టీమ్ కి ఒక లీడర్ ఇక నిన్న జరిగిన టాస్క్.. రియల్ ఆర్ ఫేక్. ఈ కాన్సెప్ట్ లో కొన్ని వస్తువులు కంటెస్టెంట్స్ ముందు పెట్టారు. అలాగే మనుషులని నిల్చోబెట్టారు. రెండు కేక్ లని పెట్టి ఏది రియల్ ఏది ఫేక్ అని కనుక్కోమన్నారు. అయితే అక్కడున్నవారిని ఒక్కో క్వశ్చన్ అడుగగా టీమ్ కి ఒకరు వచ్చి తమ సమాధానం పేపర్ పై రాసారు. అందరు రియల్ కేక్ ని ఫేక్ అని ఫేక్ కేక్ ని రియల్ అని పెట్టారు. ఇక తర్వాత ఆ కాన్సెప్ట్ లో రియల్ జుట్టు, ఫేక్ జుట్టు ఎవరిది అని అడుగగా అందరు రాంగ్ చెప్పారు. ఇలా ప్రతీ ప్రశ్నకి అందరు రాంగ్ చెప్పారు. కొన్ని క్వశ్చన్స్ కి కొన్ని టీమ్ లు కరెక్ట గా  చెప్పారు. అసలు మీరు క్వశ్చన్స్ ని అర్థం చేసుకోవడం లేదా మేము సరిగా చెప్పాడం లేదా అని నవదీప్, అభిజిత్ కంటెస్టెంట్స్ పై కోప్పడ్డాడు. ఏది రియల్ ఏది ఫేక్ అన్నప్పుడు కొంచెం ఆలోచించాలి కదా అని కంటెస్టెంట్స్ పై జడ్జులు ఫుల్ క్లాస్ తీసుకున్నారు. ఎల్లో కార్డు ఎవరికి ఇస్తారని శ్రీముఖి అడుగగా నీకు ఇస్తాను. వాళ్ళు ఇప్పుడు బాగా ఆడుతారని తీసుకొని వచ్చావ్ ఏమైందని శ్రీముఖిపై నవదీప్ కోప్పడతాడు. అసలు క్వశ్చన్ నే వినకుండా ఆన్సర్ చేసిన దాలియా కి ఎల్లో కార్డ్ ఇచ్చాడు నవదీప్. ఇక స్టార్  ఇవ్వలేదు.. గుడ్డిలో మెల్లి బెస్ట్ కాబట్టి ప్రియకి ఇస్తున్నామని జడ్జెస్ డిసైడ్ అయి ప్రియకి ఇస్తారు. ప్రియ అగ్నిపరీక్షలో ఓట్ అప్పీల్ ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ఓటు అప్పీల్ చేసుకుంది. తర్వాత జరగబోయే ఎపిసోడ్ లో అయిన కంటెస్టెంట్స్ జడ్జెస్ ని ఇంప్రెస్ చేస్తారో లేదో చూడాలి‌ మరి.

Bigg Boss 9 Telugu Navadeep: షో నుండి లేచి వెళ్ళిపోయిన నవదీప్.. ఎపిసోడ్ మాములుగా లేదుగా!

  బిగ్ బాస్ సీజన్‌-9 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఇందులోకి వెళ్ళాలంటే బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో సెలక్ట్ అవ్వాల్సిందే. అయితే ఇందులో నుండి కేవలం హౌస్ లోకి అయిదుగురు ఎంట్రీ ఇస్తారు. ప్రస్తుతం అగ్నిపరీక్షలో పదిహేను మంది ఉన్నారు. జడ్జులుగా అభిజిత్, బిందు మాధవి, నవదీప్ ఉన్నారు. హౌస్ లో పెట్టే టాస్క్ లే అగ్నిపరీక్షకి పెడుతున్నారు. ఆ పదిహేను మంది జడ్జులకి చుక్కలు చూపిస్తున్నారు. టాస్క్ లో ఎవరు పర్ఫెక్ట్ లేరు.. ఇంకా టాస్క్ చెప్పేది వినడం లేదు. అగ్నిపరీక్షలో ఎన్ని మెలికలు పెడుతున్నారు. అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ అవి అర్థం చేసుకోలేక తల పట్టుకుంటున్నారు. నవదీప్ దగ్గర నాలుగు ఎల్లో కార్డ్స్ ఉన్నాయ్.. కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ ని బట్టి అవి ఇస్తున్నాడు.. ఇక పర్ఫామెన్స్ బాగుంటే స్టార్ ఇస్తూ అభినందినస్తున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ ఎవరు కూడా తమకిచ్చిన టాస్క్ ని సీరియస్ గా తీసుకోవడం లేదని నవదీప్ వాళ్లపై కోప్పడ్డాడు. హౌస్ లో ఎలా ఉంటుందో మిమ్మల్ని ట్రైన్ చేసి పంపిద్దామనుకుంటే.. మీరేం అసలు పట్టనట్లే ఉన్నారు.. ఈ మాత్రానికే ఈ షో సెటప్ ఎందుకు.. నేను వెళ్తున్నానని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మిగతా ఇద్దరు కూడా అలానే వెళ్ళిపోతారు. కాసేపటికి శ్రీముఖి కూడా వెళ్ళిపోతుంది. మరొక ఎపిసోడ్ లో శ్రీముఖి వచ్చి.. నేను ఫస్ట్ టైమ్ నా కెరీర్ లో షోలో బై చెప్పకుండా వెళ్ళిపోయాను.. కేవలం మీ వల్లే అంత చిరాకు తెప్పిస్తున్నారు. ఇప్పుడు మీ పర్ఫామెన్స్ కి జడ్జులు రావడానికి సిద్ధంగా లేరు అని శ్రీముఖి కంటెస్టెంట్స్ కి చెప్తుంది. జడ్జెస్ రావాలంటే మీరు నాకు ముందు ప్రామిస్ చెయ్యాలి.. టాస్క్ లు బాగా ఆడి మంచిగా పర్ఫామెన్స్ ఇస్తానని శ్రీముఖి అనగానే కంటెస్టెంట్స్ ప్రామిస్ చేస్తారు.  

నవదీప్ కామెంట్స్ తో బాధపడ్డాను.. శ్రీజ సంచలన వ్యాఖ్యలు!

  శ్రీజ దమ్మును నవదీప్ "ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చి" అన్న కామెంట్స్ బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఎంతలా వైరల్ అయ్యాయో అందరికీ తెలుసు. ఐతే ఇప్పుడు ఆ కామెంట్స్ మీద నవదీప్ గురించి ఒక ఇంటర్వ్యూలో శ్రీజ కొంత క్లారిటీ ఐతే ఇచ్చింది. (Bigg Boss Agnipariksha)   "బిగ్ బాస్ అగ్నిపరీక్షలో జరుగుతున్నదని అంతా ఆర్గానిక్ గానే చూపిస్తున్నారు. అగ్ని పరీక్ష షో మొత్తాన్ని నడిపించేది నవదీప్ గారే. ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ నన్ను ఎందుకు అలా అన్నారో నాకు తెలీదు. షాకిబ్ కి కల్కికి టాస్క్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అన్న విషయం నాకు అర్ధమయ్యింది. శ్రీముఖి గారు అన్ ఫెయిర్ గా ఉందా అని అడిగినప్పుడు నేను చెయ్యెత్తాను ముందు. ఎక్కడైనా ఏదైనా అన్ ఫెయిర్ గా ఉంది అంటే నేను ముందు స్టాండ్ తీసుకుంటాను. అలాంటిది నా కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు నేను సైలెంట్ గా ఎందుకు ఉంటాను. అందుకే అన్ ఫెయిర్ ఎందుకు అనిపించిందో చెప్పాను. నేను దగ్గరనుంచి నవదీప్ గారిని అన్ని ఎపిసోడ్స్ నుంచి చూస్తున్న కదా ఆయన చాలా స్వీట్. మరి ఆ టైంలో ఎందుకు అన్నారో తెలీదు. కానీ నేను కూడా చాలా ఫీలయ్యా ఆయన మాటలకు. నేను తగ్గలేదు. ఎందుకు మరి పిలిపించారు ఊరు నుంచి అని నేను కూడా అడిగాను. ఐతే ఆ టైములో ఎందుకు ఇదంతా అని ఇంకా ఈ విషయాన్నీ అక్కడితో వదిలేసాను. ఐతే షాకిబ్ కి టాస్క్ గురించి క్లియర్ గా చెప్పలేదు కల్కికి చెప్పినట్టుగా. అదే నేను చెపుదాం అనుకున్నా కానీ టైం ఇవ్వలేదు. అందులోనూ నేను మాట్లాడుతున్నా కానీ షాకిబ్ కూడా స్టాండ్ తీసుకోలేదు అందుకే నేను ఇంకా వదిలేసా" అని చెప్పింది శ్రీజ.  

Illu illalu pillalu : శ్రీవల్లిపై చందు సీరియస్.. ఆ విషయం చెప్పకుండా ఆగిపోయిన ప్రేమ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -251 లో... నర్మద బాధపడుతుంటే సాగర్ వస్తాడు. మీ నాన్న గురించి ఆలోచించకు ఆయన బాగుంటాడని సాగర్ అంటాడు. నేను ఆలోచించేది మా నాన్న గురించి మాత్రమే కాదు.. నువ్వు ఆయనకు ఇచ్చిన మాట గురించి.. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటానని మాటిచ్చావ్ కానీ నువ్వు ఒక మాటపై ఉండవు.. మొన్న నన్ను ప్రేమ విషయంలో తప్పుగా అర్ధం చేసుకొని నేను గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వనంటూ బుక్స్ విసిరేసావని నర్మద చెప్తుంది.    నా కోసం మీ వాళ్లందరిని వదులుకొని వచ్చావ్.. ఆ మాత్రం చెయ్యలేనా అని సాగర్ అనగానే నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారని శ్రీవల్లి వినే ప్రయత్నం చేస్తుంది కానీ తనకి ఏం అర్ధం కాదు. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారో కనిపెట్టాలని శ్రీవల్లి అనుకుంటుంది.    మరొకవైపు చందు దగ్గరికి శ్రీవల్లి వస్తుంది. భోజనం చేద్దాం రండి బావ అని పిలుస్తుంది. నేను చెయ్యనంటూ చందు కోప్పడుతాడు. ఎంత మోసం చేసారు.. ఇప్పుడు పది లక్షలు ఎలా కట్టాలని శ్రీవల్లిపై కోప్పడతాడు చందు.    మరోవైపు కళ్యాణ్ బ్లాక్ మెయిల్ చేస్తున్న దాని గురించి ప్రేమ ఆలోచిస్తుంటుంది. ధీరజ్ హెల్ప్ చేస్తాడు కదా ఆ విషయమే మర్చిపోయానని అతని దగ్గరికి వెళ్తుంది ప్రేమ. ఆలోపే విశ్వ, ధీరజ్ గొడవ పడతారు. నా చెల్లిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావని విశ్వ అనగానే.. తనపై కోప్పడి పంపిస్తాడు. అప్పుడే ప్రేమ వస్తుంది. నీతో మాట్లాడాలని ధీరజ్ తో ప్రేమ అంటుంది. వాడు చూసావా ఎలా అంటున్నాడో.. నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నానం.. అసలు నిన్ను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాను.. నీ ప్రాబ్లమ్ నువ్వు చూసుకునే దానివి.. ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని ధీరజ్ అనగానే ప్రేమ అసలు విషయం చెప్పకుండా ఆగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: శ్రీధర్ కి అవమానం.. జ్యోత్స్న ప్లాన్ అదే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -450 లో... దీప తాళి వంక జ్యోత్స్న కోపంగా చూస్తుంది. శివన్నారాయణ ఆ తాళి ఇచ్చిన సిచువేషన్ ని జ్యోత్స్న గుర్తుచేసుకుంటుంది. ఏంటి జ్యోత్స్న అలా చూస్తున్నావని దీప అడుగుతుంది. అదృష్టవంతురాలు అంటే నువ్వేనని జ్యోత్స్న అంటుంది. నా దృష్టిలో నువ్వే అదృష్టవంతురాలివి.. అమ్మ, నాన్న ఉన్నారని జ్యోత్స్నతో దీప అంటుంది. నీది అయిన వస్తువులు నేను దక్కించుకోవడమే నా లక్ష్యం అని జ్యోత్స్న అనుకుంటుంది.    ఆ తర్వాత శ్రీధర్ దగ్గరికి స్వప్న వచ్చి జ్యూస్ ఇస్తుంది. శ్రీధర్ ఎప్పటిలాగే స్వప్నతో ఏదో ఒకటి అని గొడవ పెట్టుకోవాలని ట్రై చేస్తాడు. అప్పుడే శివన్నారాయణ, దశరథ్ పూజ దగ్గరికి వస్తారు. వదిన ఎక్కడ అని కాంచన అడుగుతుంది.. రాలేదని దశరథ్ సమాధానం చెప్తాడు. దాస్ ని శివన్నారాయణ పిలిచి పక్కన కూర్చోమని అంటాడు. దాంతో శ్రీధర్ ఫీల్ అవుతాడు. అల్లుడికి మర్యాద ఇవ్వడం లేదు కానీ వాడిని పక్కన కూర్చొబెట్టుకుంటున్నాడని శ్రీధర్ అనుకుంటాడు.    అమ్మకి దీపపై ఎంత కోపం ఉందో మరొకసారి బయటపెట్టే ప్రయత్నం చేస్తానని జ్యోత్స్న అనుకుని కాంచన దగ్గరికి వెళ్తుంది. అత్తా.. నువ్వు అమ్మకి ఫోన్ చేసి రమ్మను అని జ్యోత్స్న అనగానే.. మాట్లాడేది అయితే వచ్చేది కదా అని కాంచన అంటుంది. అలా అయితే వాయిస్ మెసేజ్ పెట్టు అని జ్యోత్స్న చెప్పగానే సుమిత్రతో ఉన్న అనుబంధం గురించి కాంచన చెప్తూ ఎమోషనల్ అవుతూ వాయిస్ మెసేజ్ పంపుతుంది. అది సుమిత్ర విని బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఇంటికి వచ్చేసిన రాజ్.. కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసి...

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -813లో... యామిని ఇంటికి వస్తుంది. 'ఆ రాజ్, కావ్య ఒక్కటవుతారు.. నాకు బావ కావాలి' అంటూ ఇంట్లో వస్తువులన్నీ యామిని విసిరేస్తుంటే వాళ్ళ నాన్న తనపై కోప్పడతాడు.    మరొకవైపు రాజ్ కి గతం గుర్తుకొస్తుంది. డాక్టర్ మళ్ళీ ఇంజక్షన్ ఇవ్వడంతో స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి.. తనకి గతం గుర్తుకొచ్చింది.. మళ్ళీ మీరేం స్ట్రెస్ చెయ్యకూడదని చెప్తాడు. తనకి యాక్సిడెంట్ వరకే గుర్తుంది. ఆ తర్వాత గతం మర్చిపోయింది ఏం గుర్తు లేదని డాక్టర్ చెప్తాడు. దానికి ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.    రాజ్ స్పృహలోకి వచ్చేసరికి కావ్య ఎదురుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావ్ కళ్ళు తెరిచేసరికి నా ముందే ఉండాలి కదా అని రాజ్ అనగానే మీ చెయ్యి ఎప్పటికీ వదలనని రాజ్ చెయ్ పట్టుకుంటుంది కావ్య. ఆ తర్వాత రాజ్ ఇంటికి తిరిగి వస్తున్నాడని సీతారామయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాజ్ వాళ్ళు రాగానే దిష్టి తియ్యమంటాడు సీతారామయ్య.   రాజ్ ఇంట్లోకి రాగానే కావ్య ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. ఎందుకు కళావతి అలా వెళ్తుంది అని రాజ్ అడుగగా అపర్ణ జరిగింది మొత్తం చెప్తుంది. తను ప్రెగ్నెంట్.. ఆ విషయం నీకు ఎలా చెప్పాలో తనకి అర్ధం కాక నరకం అనుభవించిందని రాజ్ కి అపర్ణ చెప్తుంది. అది విని కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి మాట్లాడతాడు.    తరువాయి భాగంలో కావ్య ప్రెగ్నెంట్ అని తనని మెట్లు కూడా ఎక్కనివ్వకుండా ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Jayam serial : వినాయకుని పూజకి సిద్ధమైన గంగ.. రుద్ర, శకుంతల కలుస్తారా!

జీ తెలుగులో  ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -41 లో.. ఇంట్లో వినాయకుడి పూజ చేయించి శకుంతలకి రుద్రపై ఉన్న కోపాన్ని పోగొట్టాలనుకుంటుంది గంగ. అదంతా ఈజీ కాదని ఇషిక, వీరు అంటారు. మనం ప్రయత్నం చేస్తేనే కదా అవుతుందో లేదో తెలిసేదని గంగ అంటుంది. తను వెళ్ళిపోయాక ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. ఈ గంగ చాలా ఎక్స్ ట్రా చేస్తుంది.. రుద్ర, శకుంతల అత్తయ్యని కలపాలని ట్రై చేస్తుంది.. అలా జరగకుండా చెయ్యాలని వీరు, ఇషిక అనుకుంటారు. మరొకవైపు రుద్ర సూపర్ మార్కెట్ లో వినాయక చవితికి ఆఫర్స్ పెట్టండి అని వాటికి సంబంధించిన వివరాలు చెప్తుంటాడు. అదంతా వీరు మనిషి విని వీరుకి ఫోన్ చేసి చెప్తాడు. ఈ రుద్ర గాడు ఏం ఇన్వాల్వ్ అవట్లేదంటూనే ఇలా డెవలప్ చేస్తున్నాడేంటని వీరు అనుకుంటాడు. ఆ తర్వాత పెద్దసారుని తీసుకొని గంగ గుడికి వస్తుంది. నువ్వు ఇంట్లో వినాయకుడికి పూజ చెయ్యడం గొడవకి దారి తీస్తుందనిపిస్తుంది.. భాను వినాయకుడి పూజ చేసేవాడు.. ఎవరు చేసిన శకుంతల ఆక్సెప్ట్ చెయ్యదని పెద్దసారు అంటాడు. మీకు నాపై నమ్మకం కలగాలంటే ఏం చెయ్యాలని గంగ అడుగుతుంది. ఉన్నట్టుండి ఇక్కడ రుద్ర కనిపించాలని పెద్దసారు అంటాడు. అప్పుడే గంగకి వాళ్ళ అమ్మ కన్పిస్తుంది. దగ్గరికి వెళ్లేసరికి ఉండదు. ఆ తర్వాత రుద్ర గుడిలో కనిపిస్తాడు. రుద్ర గుడిలో కన్పించాడు కాబట్టి నువ్వు పూజ చెయ్యడానికి ఒప్పుకుంటున్నానని గంగతో పెద్దసారు అంటాడు. తరువాయి భాగంలో గంగ వాళ్ళ అమ్మ లక్ష్మీతో పెద్దసారు మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : శ్రీవల్లి ఆ కొరియర్ చూసిందా.. డబ్బు కోసం ధీరజ్ ప్రయత్నం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -250 లో.....ప్రేమకి వచ్చిన కొరియర్ లో ఏమున్నాయని చూడడానికి ప్రేమ గదికి వస్తుంది శ్రీవల్లి. ప్రేమ నిన్ను అత్తయ్య పిలుస్తుందని ప్రేమని బయటకు పంపించి లోపల అంతా వెతుకుతుంది కానీ కొరియర్ ఎక్కడ కన్పించదు.. వేదవతి దగ్గరికి ప్రేమ వెళ్లి పిలిచారటా అని అడుగుతుంది. లేదని వేదవతి చెప్పగానే ప్రేమ తన గదికి తిరిగివెళ్తుంది. ఆ తర్వాత ప్రేమ తన గదికి రాగానే శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. వెంటనే తనకి దొరికిన కొరియర్ పక్కన పడేస్తుంది. ప్రేమ వెళ్ళిపోయాక ప్రేమ ఆ కొరియర్ చూసి అక్క ఏమైనా ఈ కొరియర్ చూసిందా అని అనుకుంటుంది. ఆ తర్వాత నర్మదని సాగర్ దింపి మిల్ కి వెళ్తాడు. నర్మద బయట ఉండి ఏడుస్తుంటే వేదవతి చూసి ఏమైందని అడుగుతుంది. మా నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్పగానే అక్కడే ఉన్న రామరాజు విని.. అయ్యో వెళ్లి చూసొద్దాం పదా బుజ్జమ్మ అని వేదవతితో రామరాజు అంటాడు. వద్దు మావయ్య ఇంకా మా నాన్నకి కోపం పోలేదని నర్మద అంటుంది. కనీసం వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడమని రామరాజు ఫోన్ ఇవ్వగానే నర్మద వాళ్ళ అమ్మకి వేదవతి ఫోన్ చేసి మాట్లాడుతుంది. మరొకవైపు చందు దగ్గరికి సేట్  వచ్చి డబ్బు ఇవ్వమని గొడవ చేస్తాడు. చందు అది ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తుంటే.. ఎదురుగా వ్యాన్ వస్తుంది. వెంటనే ధీరజ్ వచ్చి పక్కకి లాగుతాడు. ఆ తర్వాత సాగర్ కి ఫోన్ చేసి రమ్మంటాడు ధీరజ్. ఏమైంది నీకు ఎందుకిలా ఉన్నావని ఇద్దరు చందుని అడుగుతారు. నాకు ఒక లక్ష కావాలని చందు అనగానే నా వల్ల కాదని సాగర్ అంటాడు. నేను ఏర్పాటు చేస్తానని ధీరజ్ అంటాడు. ఇక డబ్బు కోసం ధీరజ్ ట్రై చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : ఎమోషనల్ అయిన శ్రీధర్.. వ్రతానికి సుమిత్ర రానుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -449 లో.. జ్యోత్స్నకి దిష్టి తీస్తుంది సుమిత్ర. దీప, కార్తీక్ పెళ్లి జరిగింది.. ఇక ఆ దోషం పోయినట్లే అని శివన్నారాయణ అంటాడు. దీప తాళి తెంపి జ్యోత్స్న మంచి పని చేసింది. ఆ అనాధకి దశరథ్, సుమిత్ర తల్లి దండ్రుల స్థానంలో ఉండి పెళ్లి చేసే అదృష్టం వచ్చింది. ఇక రేపు వ్రతానికి వెళ్లి అది దగ్గర ఉండి జరిపించి వస్తే మన బాధ్యత పూర్తి అవుతుందని పారిజాతం అనగానే ఈ మధ్య మంచిగ ఆలోచిస్తున్నావని శివన్నారాయణ అంటాడు. దాంతో పారిజాతం మురిసిపోతుంది. సుమిత్ర నువ్వు కూడా వస్తావ్ కదా అని పారిజాతం అనగానే నేను టైడ్ అయ్యనని కోపంగా లోపలికి వెళ్తుంది. మరొకవైపు శ్రీధర్ కి కార్తీక్ ఫోన్ చేస్తాడు. ఈ టైమ్ కి చేసావ్ ఏంటని శ్రీధర్ అడుగుతాడు. నీకు థాంక్స్ చెప్పాడనికి చేశానని కార్తీక్ అంటాడు. భోజనం చేసావా అని శ్రీధర్ ని కార్తీక్ అడుగగానే శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు. చేసాను నువ్వు చేసావా అని శ్రీధర్ ప్రేమగా మాట్లాడతాడు. ఎక్కువ డ్రింక్ చెయ్యకు అని కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు. చాలా రోజులకి తన కొడుకు ప్రేమగా మాట్లాడాడని శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత సత్యనారాయణ వ్రతానికి అనసూయ కాంచన ఏర్పాట్లు చేస్తుంటారు. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న వస్తారు. మీకు హెల్ప్ చెయ్యడానికి మేము వచ్చాము.. వెనకలా వాళ్ళు పూజ టైమ్ కి వస్తారని పారిజాతం అనగానే.. అందరు ఆశ్చర్యంగా చూస్తారు. పెళ్లి అయిన ఇల్లు ఇలా ఉంటుందా అని శౌర్యాతో పాటు పారిజాతం, జ్యోత్స్న డ్యాన్స్ చేస్తుంటారు. పారిజాతం, జ్యోత్స్న అలా బెహేవ్ చేస్తుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. మరొకవైపు శివన్నారాయణ, దశరథ్ రెడీ అయి సుమిత్రని పిలుస్తారు. నేను రానని సుమిత్ర చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : మళ్ళీ స్పృహ కోల్పోయిన రాజ్.. గతం గుర్తొస్తుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -813 లో..... అపర్ణ నిజం చెప్పడంతో రాజ్ కళ్ళు తిరిగి పడిపోతాడు. వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. అనవసరంగా నేనే నిజం చెప్పాను. అందుకే ఇలా జరిగిందని అపర్ణ బాధపడుతుంది. అప్పుడే యామిని వచ్చి ఏం యాక్టింగ్ చేస్తున్నారు.. ఒకరిని మించి మరొకరు అని అంటుంది. మీ కంటే నేనే బెస్ట్.. రాజ్ ని కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్న.. మీ వల్లే తనకి ఈ సిచువేషన్ వచ్చిందని యామిని అంటుంటే.. కావ్య తన చెంపచెల్లుమనిపిస్తుంది. ఏంటి ఎక్స్ ట్రా మాట్లాడుతున్నావ్.. నీ గురించి ఇక్కడ అందరికి తెలుసు.. నా భర్త నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావు.. నీది ఒక బ్రతుకేనా అని కావ్య కోప్పడుతుంది. దాంతో యామినిని రుద్రాణి పక్కకు తీసుకొని వెళ్తుంది. దాని సంగతి చెప్తాను నన్నే కొడుతుందా అని యామిని అంటుంది. నిజం చెప్పాలంటే నీకు వాళ్ళని అనడానికి ఏం రైట్ ఉంది.. కావ్య భర్త రాజ్.. సర్వహక్కులు తనకే ఉంటాయని యామినితో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్ స్పృహలోకి వస్తాడు. కళావతికి ఇప్పుడు బాగుందా.. మేం వెళ్తుంటే మాకు ఆక్సిడెంట్ అయింది కదా అని రాజ్ అంటాడు వెంటనే అందరు డాక్టర్ ని పిలుస్తాడు. ఏదో ఇంజక్షన్ వెయ్యగానే మళ్ళీ రాజ్ స్పృహ కోల్పోతాడు. తరువాయి భాగంలో రాజ్ ని అపర్ణ వాళ్ళు ఇంటికి తీసుకొని వస్తారు. పాపం కావ్య నీకు గతం గుర్తుచెయ్యలేక తన కడుపులో బిడ్డకి తండ్రి నువ్వే అని చెప్పలేక నరకం అనుభవించిందని అపర్ణ చెప్పగానే కావ్య దగ్గరికి రాజ్ వెళ్తాడు. దాంతో కావ్య హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

జంబల్ హార్ట్ రాజా, భలే తమ్ముడు... సుమతో ఆడుకున్న బ్రహ్మానందం

ఈటీవీ 30 ఇయర్స్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఇందులో అతిరథమహారధులందరూ పార్టిసిపేట్ చేశారు. ఇక యాంకర్ గా సుమ అద్భుతంగా చేసింది. ఐతే ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా బ్రహ్మానందం, అలీ జోడి వచ్చారు. ఇక సుమ కూడా వాళ్ళను ఆట పట్టించింది. "ఆలీ గారు బ్రహ్మానందం గారి జీవిత చరిత్రను ఈటీవీలో ఒక సీరియల్ రూపంలో ప్రసారం చేయాలి అనుకుంటే దానికి ఏ పేరు పెడితే బాగుంటుంది" అంటూ సుమ అడిగింది. "జంబల్ హార్ట్ రాజా" అని పేరు పెడితే బాగుంటుంది అంటూ ఆలీ చెప్పేసరికి బ్రహ్మానందం ఒక రేంజ్ లో లుక్ ఇచ్చారు. ఇక సుమ ఐతే పడీపడీ నవ్వింది. "ఇది ఓకే అంటారా" అని బ్రహ్మానందాన్ని అడిగింది సుమ. " నా తమ్ముడు ఏది చెప్తే అదే" అన్నారు. "జంబల్ హార్ట్ రాజా" అర్ధం తెలీదు కానీ ఓకే సౌండింగ్ బానే ఉంది అన్నారు. "అలాగే ఆలీ గారు లైఫ్ హిస్టరీని ఈటీవీలో ఒక సీరియల్ రూపంలో ప్రసారం చేయాలి అనుకుంటే దానికి ఏ పేరు పెడితే బాగుంటుంది" అంటూ సుమ బ్రహ్మానందాన్ని అడిగింది. "భలే తమ్ముడు" అని చెప్పారు. "చాల ఎమోషనల్ టచ్ ఇచ్చారు" అని సుమా అనేసరికి "ఊరుకో ఊరుకో నువ్వు అనవసరంగా కళ్ళ నీళ్లు పెట్టుకోవద్దు. ఏదో అన్నాను ఐపోయింది అంతే బాధపడకురా సుమా నువ్వూరుకో" అంటూ చెప్పేసరికి సుమ పగలబడి నవ్వేసింది. "30 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఏదన్నా మార్చుకోవాలనుకుంటున్నారా  " అని సుమ అడిగేసరికి "ఎం ఎందుకు వెళ్ళాలి పనీ పాటా లేదా..ఏమన్నా పనుంటే చెప్పండి వెళ్తాం ..పని లేకపోతే ఎందుకు వెళ్ళాలి..ఐనా 30 సంవత్సరాల వెనక్కి వెళ్తే నేను ఎం మార్చుకోవాలనుకోవడం లేదు." అని చెప్పేసారు బ్రహ్మానందం.

రాకేష్ భార్యకు నేనే వండిపెట్టాను... ధనరాజ్ కాళ్ళు కడిగిన సుజాత

  జబర్దస్త్ ఎప్పటిలాగే ఈ వారం కూడా ఆడియన్స్ ని నవ్వించింది. ఇక ఇందులో రాకింగ్ రాకేష్ స్కిట్ ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసింది. రాకేష్ కొంత స్థలం కొనడం అందులో ఆయన గురువు ధనరాజ్ వాళ్లకు వీళ్లకు అంటూ మొత్తం స్వాహా చేయించేస్తాడు. చివరికి సుజాత తిట్లు ఫుల్ గ నవ్వించింది. తర్వాత రాకేష్ ధనరాజ్ కాళ్ళు కడిగాడు. "ఏ బంధం లేకుండా ఒక్క గురుశిష్యుల బంధం మాత్రమే ఇక్కడి వరకు నిలబడింది అంటే జబర్దస్త్ వల్లనే. ఈరోజున నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన గైడెన్స్ ఇస్తూ తండ్రిలా, గురువులా ఈ స్తానం వరకు తీసుకొచ్చారు. 12 ఏళ్ళ జర్నీని చూసాక ఆ కార్యక్రమంలో నేను లేను అనే బాధ ఉంది. అందులో నేను చేయలేనిది ఇప్పుడు చేయాలనుకుంటున్న" అని చెప్పి రాకేష్, సుజాత ఇద్దరూ కలిసి ధనరాజ్ కాళ్ళు కడిగారు. "రాకేష్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంతవరకు వచ్చాడు. రాకింగ్ రాకేష్ అంటే ఇప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ ఫొటోస్ దిగుతున్నారంటే చాల సంతోషంగా ఉంది. ఒక బిడ్డను కన్నప్పుడు తల్లి ఎంత ఆనందపడుతుందో నేను అంత కంటే ఎక్కువగా  ఆనందపడుతున్నాను. దేవుడిచ్చిన మరదలు. నాకు ఇద్దరు కొడుకులు. రాకేష్ నాకు మూడో కొడుకు..నాకు దేవుడిచ్చిన మరదలు ఒక రోజు నాతో అంది కడుపుతో ఉన్నప్పుడు నేను తినాలనుకున్నవి తినలేకపోయాను ఆ కోరికలు అలాగే ఉండిపోయాయి అంటే ఒకరోజు ఇంటికి పిలిచి తాను ఏమేమి తినాలనుకున్నదో అవన్నీ నేను ఒక్కడినే వండిపెట్టి భోజనం పెట్టాను. నా ఇల్లు రాకేష్ ఇల్లు అంటూ ఏమీ లేదు. ఆస్తి పంపకాలప్పుడు మాత్రమే వర్తించదు అంతే" అంటూ ధనరాజ్ చెప్పుకొచ్చాడు.

Illu illalu pillalu : గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటానని మాటిచ్చిన సాగర్.. శ్రీవల్లి ప్లాన్ ఏంటంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -249 లో..... సాగర్, నర్మద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నర్మదకి వెక్కిళ్లు వస్తుంటే.. ఎవరో నిన్ను గుర్తుచేసుకుంటున్నారు.. మీ వాళ్ళు అయి ఉంటారని సాగర్ అంటాడు. వాళ్లకు నేను గుర్తు రానని నర్మద బాధగా అంటుంటే అప్పుడే నర్మదకి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. మా అమ్మ ఎప్పుడు ఫోన్ చెయ్యలేదు.. ఇప్పుడు చేస్తుందేంటని నర్మద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మీ నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది అమ్మ అని తను చెప్పగానే నర్మద షాక్ అవుతుంది. నర్మద, సాగర్ ఇద్దరు వెంటనే హాస్పిటల్ కి వెళ్తారు. నర్మదపై వాళ్ళ నాన్న ఇంకా కోపంగా ఉంటాడు. అందరిలో మిల్ లో మూటలు మోస్తాడు. మీ అల్లుడు అంటే నా పరువు పోతుందని అతను అనగానే నేను ఏం చేస్తే నన్ను మీరు అల్లుడుగా ఒప్పుకుంటారని సాగర్ అడుగుతాడు. నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తే ఒప్పుకుంటానని అతను అనగానే అయితే త్వరలోనే గవర్నమెంట్ జాబ్ సాధిస్తానని నర్మద వాళ్ళ నాన్నకి మాటిస్తాడు సాగర్. దాంతో వాళ్ళ అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు నర్మద, ప్రేమ నన్ను ఎంత బాధపెట్టారు.. ఎలాగైనా వాళ్ళ అంతు చూడాలని శ్రీవల్లి అనుకుంటుంది. సాగర్ రాత్రి చదువుతున్నాడు కనిపెట్టాలి.. మరి ప్రేమ సంగతి అనుకుంటూ.. నిన్న ఏవో ఫోటోస్ దాచింది కదా అవేంటో కనుక్కోవాలని శ్రీవల్లి అనుకుంటుంది. మరొకవైపు ప్రేమతో కళ్యాణ్ ఉన్నా ఫొటోస్ పంపించడంతో.. వాడు మళ్ళీ ఎందుకు నా జీవితంలోకి వచ్చాడని ప్రేమ అనుకుంటుంది. ఆ తర్వాత ఎలాగైనా ఆ ప్రేమని నేను దక్కించుకోవాలని కళ్యాణ్ అనుకుంటాడు. ప్రేమ దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. అత్తయ్య నిన్ను రమ్మంటుందని పిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.