Illu illalu pillalu : మిల్ లో దొంగతనం చేసింది సింహాద్రి.. నర్మద తెలివి సూపర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -243 లో.. భాగ్యం వాళ్ళ గురించి నర్మద, ప్రేమ రామరాజుకి చెప్పబోతుంటే అప్పుడే మిల్ లో దొంగలు పడి డబ్బు పోయిందని ఫోన్ చేసి చెప్పడంతో రామరాజుతో సహా అందరు మిల్ కి వెళ్తారు. అసలు ఏమైందని సింహాద్రిని అడుగుతాడు రామరాజు. ఏమో అయ్యా లాకర్ పగులగొట్టి డబ్బు తీసుకొని వెళ్ళారని సింహాద్రి చెప్తాడు. అక్కడున్న వాళ్లందరిని సింహాద్రి ఎవరు డబ్బులు తీశారంటూ అడుగుతాడు. అక్కడ ఒక బియ్యం బస్తాపై రక్తం ఉంటుంది. అది నర్మద చూస్తుంది. మళ్ళీ సింహాద్రి చేతికి రక్తం ఉంటుంది. ఈ దొంగతనం చేసింది సింహాద్రి అని నర్మద చెప్తుంది. నేను చెయ్యలేదని సింహాద్రి అంటాడు. మరి ఎందుకు కంగారుపడుతున్నావ్ లాకర్ నుండి డబ్బు తీసుకొని ఆ బియ్యం బస్తాలో దాచావ్.. నీ చేతికి రక్తం ఉంది.. అలాగే అక్కడ సంచికి ఉంది.. ఆ సంచిలో డబ్బు ఉంటుంది చూడండి అని నర్మద అనగానే ధీరజ్, సాగర్, చందు వెళ్లి చూడగానే అందులో డబ్బు ఉంటుంది. దాంతో రామరాజు సింహాద్రిని తిడతాడు. నిన్ను ఎంత నమ్మానని కుప్పకూలిపోతాడు. వాడే దొంగతనం చేసాడని చెప్పకుండా ఉంటే బాగుండేది నర్మద.. ఏ దొంగ ఎత్తుకొని వెళ్ళాడనుకునే వాడిని.. నమ్మకం పోగొట్టుకున్నాడని రామరాజు ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతూ.. నాన్నని మోసం చేస్తున్నానని సాగర్... నేను ప్రేమని ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నానో తెలిస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో.. ఇన్ని రోజులు చెప్పకుండా మోసం చేసానని ధీరజ్ ఇద్దరు అనుకుంటారు. నాన్నకి తెలియకుండా అప్పు చేసాను ఆ విషయం నాన్నకి తెలిస్తే మోసం చేసానని అనుకుంటాడంటూ చందు బాధపడతాడు. మరొక వైపు శ్రీవల్లి తన అమ్మ దగ్గరికి వెళ్లి మన గురించి చెప్పేలోపు.. దొంగలు పడ్డారని మిల్ కి వెళ్ళారు కానీ వచ్చాక చెప్తారని శ్రీవల్లి భయపడుతుంది. తరువాయి భాగంలో నర్మద రామరాజు వాళ్లకు భాగ్యం వాళ్ళ గురించి చెప్పనందుకు నర్మదపై ప్రేమ కోపంగా ఉంటుంది. నువ్వు నాతో మాట్లాడకు అక్క అని ప్రేమ అనగానే నర్మద బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కార్తీక్, దీపల పెళ్ళికి ఏర్పాట్లు షురూ.. జ్యోత్స్న ఏం చేయనుంది!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -442 లో.. శివన్నారాయణ ఇంటికి వస్తాడు శ్రీధర్. నువ్వు వచ్చావేంటి మా ఆయన చుస్తే నువ్వు అయిపోతావని పారిజాతం అంటుంది. నేనే కాదు అత్త మా బ్యాచ్ కూడా వచ్చారని శ్రీధర్ అంటాడు. అప్పుడే కాంచన, శౌర్య అనసూయని తీసుకొని కార్తీక్ వస్తాడు. మీరందరు ఎందుకు వచ్చారని పారిజాతం అడుగుతుంది. మగ పెళ్లి వాళ్ళం కదా అందుకే వచ్చామని శ్రీధర్ అంటాడు. ఇప్పుడు అందరిని మా ఆయన చూస్తే కోప్పడుతాడని పారిజాతం అనగానే నువ్వే అందరిని పిలిచావని చెప్తాని కార్తీక్ అంటాడు. దాంతో పారిజాతం బయపడి పక్కకి దాక్కుంటుంది. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. నేను ఇల్లంతా సందడిగా ఉంటుందని ఒక్కరోజు ముందు రమ్మని చెప్పానని శివన్నారాయణ అనగానే.. అమ్మ కార్తీక్ గా నన్నే బయపెడుతావా అని పారిజాతం అనుకుంటుంది. వాళ్ళని పిలుస్తున్న విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదని దశరథ్ తో కోపంగా అంటుంది సుమిత్ర. ఆ తర్వాత కావేరికి కార్తీక్ ఫోన్ చేసి.. చిన్నమ్మ మీరు రాలేదని అడుగుతాడు. అక్కడికి నేను రాకపోవడమే బెస్ట్.. వచ్చినవాళ్ళ ముందు అక్క పరువుపోతుందని కావేరి అంటుంది. మీ ఇష్టమని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత అందరు సరదాగా మాట్లాడుకుంటుంటే పారిజాతం ఓర్వలేక గొడవ చెయ్యాలని ట్రై చేస్తుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి పారిజాతం రూమ్ లో బట్టలు ఉన్నాయ్ తీసుకొని రా అని పంపిస్తాడు. పారిజాతం బట్టలు తీసుకొని వస్తుంది. ఆ తర్వాత కుంకుమ తీసుకొని రా అని మళ్ళీ పంపిస్తాడు. పారిజాతం వెళ్తుంది. నా చేతులు మీదుగా ఈ ఇంటి ఆడపడుచుకి బట్టలు పెట్టాలని అనుకుంటున్నానని శివన్నారాయణ అనగానే కాంచన హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahammudi :యామిని వేసిన ప్లాన్ అదే.. రాజ్ కి రుద్రాణి నిజం చెప్తుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -806 లో..... రాజ్ వెళ్తుంటే యామిని పేరెంట్స్ ఆపుతారు. అప్పుడే అపర్ణ ఇందిరాదేవి ఏంట్రీ ఇస్తారు. కళావతి వస్తుందనుకుంటే ఈ ముసలి బ్యాచ్ వచ్చారేంటని రాజ్ అనుకుంటాడు. రాజ్ నువ్వంటే కావ్యకి చాలా ఇష్టం.. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకని ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు. లేదు నేను వెళ్ళాలని రాజ్ అక్కడ నుండి బయల్దేరతాడు. ఆ తర్వాత కావ్యకి యామిని ఫోన్ చేసి నీ వల్ల బావ అమెరికా వెళ్తున్నాడు. నువ్వు దూరం చేసావ్ మమ్మల్ని.. నీకు తెలియకుండా ఇప్పుడు నువ్వే మళ్ళీ మమ్మల్ని దగ్గర చేసావని కావ్యతో యామిని అంటుంది. ఆ తర్వాత రుద్రాణికి యామిని ఫోన్ చేసి ఏదో ఐడియా ఇస్తుంది. ఇప్పుడే వెళ్లి ఈ ప్లాన్ అమలుచేయు అనగానే రుద్రాణి సరే అని బయల్దేర్తుంది. ఏంటి మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావని రాహుల్ అడుగుతాడు. రాజ్ దృష్టిలో కావ్యని చెడ్డదాన్ని చెయ్యడానికి అని రుద్రాణి హడావిడిగా వెళ్తుంది. ఆ తర్వాత రాజ్ తనకి దూరంగా వెళ్తున్నాడని కావ్య దేవుడికి తన బాధని చెప్పుకుంటుంది. కావ్య తన కోసం ఎలాగైనా వస్తుందని రాజ్ అనుకుంటాడు. ఒక దగ్గర కార్ ఆపుతాడు రాజ్ . కానీ కావ్య కాకుండా రాజ్ దగ్గరికి రుద్రాణి వస్తుంది. రాజ్ నీతో మాట్లాడాలని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

దండలు మార్చుకున్న శ్రీముఖి, బాలు... బొమ్మ అదిరింది

ఆదివారం విత్ స్టార్ మా పరివారం 150 వ ఎపిసోడ్ ప్రోమో భలే ఫన్నీగా ఉంది. ఈ షోకి వచ్చిన గెస్టులను వెరైటీగా ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ మెడల్లో నిమ్మకాయల దండలు వేసి సన్మానం చేశారు అవినాష్ - హరి. "ఆవిడ వచ్చిన ఎపిసోడ్ లు 18 " అని చెప్తూ అవినాష్ ఆ పేపర్ ని చింపి పారేసాడు. "ప్రేరణ..ఇదీ ఒక పేరేనా" అన్నాడు అవినాష్. దానికి ప్రేరణ నీరసంగా చూసింది అవినాష్ వైపు. "ఇతని పేరు అవినాష్. త్వరలో ఇతను పెట్టబోతున్నాడు ఒక పెద్ద కార్ వాష్" అంటూ అవినాష్ గురించి చెప్పాడు ఇమ్మానుయేల్. "ఆవిడ మామగారు సీరియల్ లో కనిపించిన ఎపిసోడ్స్ కన్నా పరివారంలో కనిపించిన ఎపిసోడ్స్ ఎక్కువా" అంటూ సుహాసినిని ఇంట్రడ్యూస్ చేసాడు హరి. దాంతో సుహాసిని టవల్ తో మొహాన్ని దాచుకుంది. "కృతిక ఎంత అందంగా రెడీ అయ్యి ఎపిసోడ్ కి వస్తుందో ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా అంతే అందంగా ఉంటుంది" అంటూ కృతిక గురించి హరి ఇంట్రడ్యూస్ చేసేసరికి కృతికి ముఖాన్ని దాచుకుని మరీ నవ్వుకుంది. "అర్జున్ చాలా మంచివాడు. ఈరోజు పరివారంలో ఒక ఆర్టిస్ట్ తక్కువయ్యారు అని మేనేజర్ ఫోన్ చెయ్యగానే నేనున్నాను మీకు" అంటూ వస్తాడు. అని చెప్పాడు. "ఆయన చేసిన ఎపిసోడ్లు 30 ..అతని వయసు 40 " అంటూ అమరదీప్ గురించి చెప్పారు అవినాష్, హరి. "ఏది ఏమైనా తొందరలోనే మీరు మా అయ్యగారు కావాలని మనసారా కోరుకుంటూ " అంటూ బాలు గురించి ప్రత్యేకంగా చెప్పారు అవినాష్ - హరి. ఇంతలో శ్రీముఖి వచ్చి బాలు మేడలో ఒక దండ వేసింది. అలాగే బాలు కూడా శ్రీముఖి మేడలో నిమ్మకాయల దండ వేసాడు. దాంతో శ్రీముఖి సిగ్గుపడుతూ నవ్వుకుంది.

ఐదేళ్ల తర్వాత.... నాగార్జున గారికే ఎసరు పెట్టావా శ్రీముఖి...

త్వరలో వినాయక చవితి పండగ రాబోతోంది.. ఈ నేపథ్యంలో ఛానెల్స్ అన్నీ కూడా ఫెస్టివల్ థీమ్ తో షోస్ ని డిజైన్ చేశాయి. నెమ్మదిగా ప్రోమోస్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు స్టార్ మాలో "గణపతి బప్పా మోరియా" పేరుతో ఒక షో పండగ రోజున టెలికాస్ట్ కాబోతోంది. ఇక ఈ షోకి ఇద్దరు టాప్ హోస్టులు వచ్చారు. వాళ్ళే ప్రదీప్, శ్రీముఖి. ఐదేళ్ల తర్వాత ఒకే వేదికపై క్రేజి కాంబో అంటూ ఈ షోకి మాటల మాయాజాలంతో అలరించడానికి ప్రదీప్ అలాగే స్టేజి మీద తూఫాన్ సృష్టించడానికి శ్రీముఖి ఇద్దరూ ఫెస్టివ్ గెటప్ లో వచ్చేసారు. "ఈరోజు ఈ వినాయక చవితికి ఒకటే ఒకటి కోరుకున్నా ప్రదీప్" అంటూ శ్రీముఖి అంది. " ఎం కోరుకున్నావ్" అని భయపడుతూ అడిగాడు. "ఇంకా స్టార్ మాలో చాలా ఎక్కువ షోస్ చేయాలని ఆ దేవుడిని కోరుకున్నా" అంది. వెంటనే ప్రదీప్ "పొద్దున్న వచ్చే రాశి ఫలాలు షో తప్ప మిగతా అన్ని షోస్ లో నువ్వే ఉంటున్నావ్" అన్నాడు. దానికి శ్రీముఖి బాగా హర్ట్ అయ్యి బుంగమూతి పెట్టేసింది. "కుకు విత్ జాతిరత్నాలు చేసానా ఏంటి...ఇంకో నెలలో బిగ్ బాస్ వస్తోంది. అది చేస్తానా ఏంటి" అని నిష్ఠూరంగా అడిగింది. "నా యాంకరింగ్ ఎసరు పెట్టిన పర్లేదు నాగ్ సర్ కె ఎసరు పెట్టావా" అని అడిగాడు ప్రదీప్. "ఫస్ట్ టైం స్టార్ మాలో పండగ ఈవెంట్ చేస్తున్నావ్ ఎలా ఉంది" అని అడిగింది. "ఇప్పుడు హోమ్ థియేటర్ ఉంది. దాని పక్కన సెల్ ఫోన్ ఉంది. అది మోగితే వినిపిస్తుందా" అని అడిగాడు ప్రదీప్. "వినిపించదు. ఎందుకంటే హోమ్ థియేటర్ సౌండ్ లో కలిసిపోతుంది కదా" అంది శ్రీముఖి. "నా భయం కూడా అదే" అన్నాడు ప్రదీప్. దాంతో శ్రీముఖి ఓహో అంటూ నవ్వేసింది. "నేను ఫైర్ ఐతే నువ్వు వాటర్..మనిద్దరం కలిస్తే ఈ పండగ బ్లాక్ బస్టర్" అంటూ చెప్పింది శ్రీముఖి.

Jayam serial : ఇషిక, వీరు ప్లాన్ ఫ్లాప్.. ఇంట్లోకి వచ్చిన గంగ!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -33 లో.....గంగని మా ఇంటికి తీసుకొని వెళ్తాను. మాతోనే ఉంటుందని శకుంతల అంటుంది. పెద్దమ్మ మీ నిర్ణయానికి అడ్డు చెప్పను కానీ ఒకసారి ఆలోచించండి అందరు మన కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తారని రుద్ర అంటడు. దాంతో అతనికి సమాధానం శకుంతల కొంచెం కఠినంగానే చెప్తుంది. దాంతో రుద్ర సైలెంట్ గా ఉంటాడు. గంగ ని తీసుకొని అందరు బయల్దేరతారు. మరొకవైపు ఇషిక, వీరు ఇద్దరు ఒక కార్ లో వస్తారు. ఇషిక, ఇందుమతి కి ఫోన్ చేసి ఆ గంగని ఇంటికి తీసుకొని వస్తున్నారు.. అలా అయితే మన కుటుంబం పరువు ఏమవుతుంది అందరు వద్దని చెప్పండి అని ఇషిక చెప్తుంది. ఆ తర్వాత నేనున్నాను కదా బ్రో డోంట్ వర్రీ అని వీరుతో ఇషిక అంటుంది ఇదేంటి నేను ఫ్యామిలీనే నాశనం చెయ్యాలని చూస్తున్నా ఇదేమో వాళ్ళని విడగొట్టాలని చూస్తుంది పిచ్చిది అని వీరు అనుకుంటాడు. నీ ప్లాన్ నీకుంటే నా ప్లాన్ నాకుంది బ్రో.. ఇంటిని నా గుప్పిట్లో పెట్టుకోవాలని ఇషిక అనుకుంటుంది. మరొకవైపు ఇందుమతి ఇంట్లో అందరిని పిలిచి గంగని అక్క ఇంటికి తీసుకొని వస్తుందట మనం వద్దని చెప్పాలని ఇంట్లో అందరిని రెచ్చగొడుతుంది. అప్పుడే గంగని తీసుకొని శకుంతల ఇంటికి వస్తుంది. గంగని తీసుకొని రాకుంటే బాగుండు అని ఇందుమతి అంటుంది. ఇప్పుడు తీసుకొని వస్తే వచ్చిన సమస్య ఏంటని శకుంతల అంటుంది. ఇకపై గంగ ఇక్కడే ఉంటుందని శకుంతల అంటుంది. తరువాయి భాగంలో గంగ ఇక్కడే ఉంటుంది. ఎవరికైనా ప్రాబ్లమ్ అయితే చెప్పండి అందరం విడిపోదామని శకుంతల అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : రామరాజు మిల్ లో దొంగతనం.. అతని కాళ్ళపై పడ్డ భాగ్యం దంపతులు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -242 లో.....ప్రేమ నర్మద కలిసి భాగ్యం వాళ్ళ బంఢారం బయట పెట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. మేమ్ ఎంత జాగ్రత్తపడ్డాం.. అయినా మా ఇంటి అడ్రెస్ ఎలా తెలిసిందని ఆనందరావు అడుగుతాడు. మీతో సెల్ఫీ తీసుకున్నా కదా అప్పుడే లొకేషన్ షేర్ చేసుకున్నానని నర్మద అనగానే ఇద్దరు షాక్ అవుతారు. ఎంత నాటకం ఆడారు.. ఇప్పుడే మావయ్య గారికి మీ గురించి చెప్తామని ప్రేమ, నర్మద అక్కడ నుండి బయల్దేరతారు. ప్రేమ, నర్మద ఇంటికి రాగానే శ్రీవల్లి ఆడ్డుపడుతుంది. ఎంత మోసం చేశారని శ్రీవల్లితో నర్మద అనగానే మీరు చేసింది ఏంటి మోసం కదా ఇద్దరు అందరు కళ్ళు కప్పి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా అని ప్రేమ, నర్మదలని శ్రీవల్లి అంటుంది. మేమ్ చేసింది మోసం కాదు ప్రేమించుకొని పెళ్లిచేసుకున్నామని నర్మద అంటుంది. నిజం చెప్పకుండా శ్రీవల్లి ఎంతోగానే వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంది కానీ ప్రేమ, నర్మద వినిపించుకోకుండా లోపలికి వెళ్తారు. ఈ రోజు నా బండారం బయటపడిపోతుందని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత మావయ్య గారు మీకోక విషయం చెప్పాలి శ్రీవల్లి అక్క వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళని చెప్పారు కదా అని ప్రేమ, నర్మద చెప్పబోతుంటే రామరాజుకి రైస్ మిల్ లో దొంగలు పడ్డారని ఫోన్ వస్తుంది. దాంతో హడావిడిగా వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో రామరాజు దగ్గరికి భాగ్యం, ఆనందరావు వచ్చి రామరాజు కాళ్ళపై పడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : పారిజాతాన్ని గెంటేసిన శివన్నారాయణ.. ఇంటికి వచ్చిన శ్రీధర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -441 లో..... పారిజాతాన్ని బయటకు గెంటిస్తానని  పారిజాతంతో కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. పారిజాతాన్ని కార్తీక్ రెచ్చగొడతాడు. నువ్వు నన్ను తక్కువ అంచనా వేసావ్ రా.. మీ నాన్నని ఫోన్ చేసి పెళ్లికి రాకని చెప్పానని పారిజాతం తన తప్పులు అన్ని గర్వంగా చెప్తుంటే వెనకాల నుండి శివన్నారాయణ వచ్చి అన్నీ వింటాడు. ఆ తర్వాత బయటకు గెంటేస్తాడు. ఏమైంది అండి నన్ను ఎందుకు నెట్టారని పారిజాతం అడుగుతుంది. నీ మాటలు అన్ని ఇప్పటివరకు నేను విన్నానని శివన్నారాయణ అంటాడు. ఎలా విన్నారని పారిజాతం అడుగుతుంది. నేనే ఫోన్ చెసి వినిపించానని కార్తీక్ అనగానే అమ్మ దుర్మార్గుడా ఇంత మోసం చేస్తావురా అని కార్తీక్ పై కోప్పడతుంది పారిజాతం. అసలు నువ్వు వాళ్ళ నాన్నని పెళ్లి ఎందుకు వద్దన్నావ్ కారణం ఏంటని శివన్నారాయణ అడుగుతాడు దానికి పారిజాతం టెన్షన్ పడుతుంది. మా నాన్న నా పెళ్లికి వస్తున్నారని కార్తీక్ చెప్పగానే జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. ఈ పెళ్లి కచ్చితంగా జరుగుతుందని శివన్నారాయణ అందరికి చెప్తాడు. ఆ తర్వాత దాస్ ని కలుస్తుంది జ్యోత్స్న. ఏంటి నాన్న నువ్వు ఆ దీపకి నిజం చెప్పావా.. నా మీద ఒట్టేసి చెప్పమని జ్యోత్స్న అడుగుతుంది. చెప్పానని దాస్ అనగానే.. ఇక అయిపోయింది అంతా అయిపోయిందని కోపంతో ఊగిపోతుంది జ్యోత్స్న. ఏం చెప్పలేదని మళ్ళీ దాస్ చెప్పడం తో జ్యోత్స్న నార్మల్ అవుతుంది. నువ్వు ఒకవేళ నిజం చెప్తే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఉహించలేవని దాస్ కి వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. మరొకవైపు శ్రీధర్ శివన్నారాయణ ఇంటికి వస్తాడు. నువ్వెందుకు వచ్చావ్ రా అని పారిజాతం అడుగుతుంది. నేనే కాదు మా బ్యాచ్ అంతా వచ్చామని శ్రీధర్ అనగానే అనసూయ, కాంచన, శౌర్య వెనకాల వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : నువ్వు ప్రెగ్నెంటా అని అడిగిన రాజ్.. షాక్ లో కావ్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -805 లో... కావ్య బాధపడేలా ధాన్యలక్షి మాట్లాడుతుంది. కావ్య తప్పేం లేదని తెలిసి సారీ చెప్పడానికి తన దగ్గరికి వెళ్తుంది. నిజం తెలుసుకోకుండా నిన్ను అనవసరం గా బాధపెట్టాను.. నన్ను క్షమించని ధాన్యలక్ష్మి అనగానే అలా అనొద్దు చిన్న అత్తయ్య.. మీరు నాపై కోప్పడ్డేది అందరూ చూసారు కానీ మీరు అప్పుపై ప్రేమతో అలా చేశారు.. ఒక అక్కగా మీరు నా చెల్లిని హ్యాపీగా చూసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉందని కావ్య అంటుంది. ఇక నుండి నన్ను కూడా అప్పులాగే చూసుకోండి అని ధాన్యలక్ష్మి భుజంపై వాలుతుంది కావ్య. ఆ తర్వాత ఎలా కళావతి గారికి నాపై ప్రేమని ఎలా బయటపెట్టాలని రాజ్ ఆలోచిస్తుంటే అతనికి ఒక ఐడియా వస్తుంది. నేను అమెరికా వెళ్తున్నట్లు యాక్టింగ్ చేస్తాను. అప్పుడు దూరంగా  వెళ్తున్నానని బయటపడొచ్చేమోనని రాజ్ అనుకొని తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఏదో చెప్తాడు. ఆ తర్వాత యామినికి రుద్రాణి ఫోన్ చేసి.. నువ్వు రాజ్ దగ్గరికి వెళ్లి కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పమని సలహా ఇస్తుంది. రాజ్ దగ్గరికి యామిని వెళ్తుంది. తన ఫోన్ చూస్తుంది అందులో ఫ్లైట్ టికెట్ ఉంటుంది. ఏంటి బావ అమెరికా వెళ్తున్నాడా అని అనుకుంటుంది. రాజ్ రాగానే ఎందుకు బావ అమెరికా వెళ్తున్నావని అడుగుతుంది. యామినికి యాక్టింగ్ అని తెలియకూడదని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత రుద్రాణి హాల్లోకి వచ్చి రాజ్ అందరికి దూరంగా అమెరికా వెళ్తున్నాడటా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. కావ్య నువ్వే ఎలాగైనా వాడిని ఆపగలవని ఇంట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఏం చెప్పి ఆపను.. నేను ఆగమంటే తన ప్రేమని ఒప్పుకున్నట్లవుతుందని కావ్య ఎమోషనల్ అవుతుంది. తరువాయి భాగంలో రాజ్ వెళ్తుంటే రుద్రాణి ఎదరుపడి కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వచ్చి.. మీకొక విషయం చెప్పాలంటుంది. మీరు ప్రెగ్నెంటా అని రాజ్ అనగానే కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ అగ్ని పరీక్షలో బిందుమాధవికి వార్నింగ్ ఇచ్చిన మాస్క్ మ్యాన్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆగష్టు 22 నుంచి టెలికాస్ట్ కాబోతోంది. ఇక ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఎంట్రీతోనే ట్విస్ట్ మొదలయ్యింది. జడ్జెస్ గా నవదీప్, బిందు మాధవి, అఖిల్ కూర్చున్నారు. హోస్ట్ గా శ్రీముఖి వచ్చేసింది. "నా లాంటి కంటెస్టెంట్ రాలేదు, రాడు అని విని విని అలిసిపోయి సరేరా భాయ్ ఆ పని నేనే చేసి పంపిస్తా అని చెప్పి వచ్చా ఇక్కడికి" అన్నాడు అభిజిత్ . ఇక స్టేజి మీద ఒక బ్లాక్ మాస్క్ మ్యాన్ వచ్చాడు. "నీ పేరేంటి" అని నవదీప్ అడిగేసరికి "స్కిన్ నేమ్ హరీష్..సోల్ నేమ్ హృదయ్ మానవ్" అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఇక బిందు మాధవికి ఆ పేరేంటో కొత్తగా అనిపించినట్టుగా ఉంది " హృదయ్ మానవ్ అంటే ఏంటి" అని అడిగింది. "హృదయమున్న మానవుడిని" అని ఆన్సర్ ఇచ్చాడు ఆ మాస్క్ మ్యాన్. "ఎం మా అందరికీ లేవన్నా" అని నవదీప్ కౌంటర్ వేసాడు. "మీకు కావాలంటే అలాగే అనుకోవచ్చు" అన్నాడు మాస్క్ కంటెస్టెంట్. "చిన్నప్పటి నుంచి చాల కోపిష్టి మనిషిని" అని కూడా మాస్క్ కంటెస్టెంట్ చెప్పుకున్నాడు. వెంటనే శ్రీముఖి " కోపం వచ్చినప్పుడు ఎం చేస్తారు" అని అడిగింది. "కోపాన్ని నేను రివీల్ చేసేస్తా" అన్నాడు. "కొడతావా" అని బిందు మాధవి అడిగేసరికి "ఔను" అన్నాడు. "బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేది మనం ఫ్రెండ్ షిప్ చేసుకోవడానికి వెళ్తామా" అని మాస్క్ మ్యాన్ అడిగాడు. "ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోకూడదు" అని అభిజిత్ అడిగాడు. "ఫ్రెండ్ కి ట్రోఫీ ఇచ్చేస్తారా" అని మాస్క్ కంటెస్టెంట్ కౌంటర్ ఇచ్చాడు. "ఇది చాలా బాడ్" అంది బిందు మాధవి. అభిజిత్  రెడ్ స్కేల్ చూపించాడు. "మీరు నా క్యారెక్టర్ ని డిసైడ్ చేయొద్దు" అని గట్టిగానే చెప్పాడు ఆ మాస్క్ కంటెస్టెంట్. "డోంట్ జడ్జ్ మీ అంటే కుదరదు. మేము జడ్జెస్. మిమ్మల్ని జడ్జ్ చేయడానికే ఇక్కడ కూర్చున్నాం" అన్నాడు. "కొన్ని నిమిషాల్లోనే క్యారెక్టర్ చేసే వాళ్ళు ఐతే మీరు దేవుళ్ళకి ఉండాలి" అని మళ్ళీ కంటెస్టెంట్ కౌంటర్ అటాక్ ఇచ్చాడు. "నేను దేవుడిని కాదు" అని బిందు మాధవి అంది. "కాదు కాబట్టే యు ఆర్ రాంగ్" అనేశాడు. అంతే వెంటనే బిందు మాధవి లేచి వెళ్లి మేడలో "లూజర్" అనే టాగ్ వేసింది. "నువ్వేదో మాట్లాడుతున్నావ్ నాకేం అర్ధం కావట్లేదు నీ మాస్క్ తీసి మాట్లాడు" అని చెప్పింది. వెంటనే అతను మాస్క్ తీసేసాడు.

బిగ్ బాస్‌పై లేడీ బాడీ బిల్డర్ కీర్తి నాయుడు కామెంట్స్

లేడీ బాడీ బిల్డర్ కీర్తి నాయుడు బిగ్ బాస్ సీజన్ 9 గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. కామన్ మ్యాన్ కేటగిరిలో అప్లై చేసుకోవడంతో అన్నపూర్ణ స్టూడియోస్ కి ఆడిషన్స్ కి పిలిచారు అని చెప్పింది..అలాగే ఇంకొన్ని విషయాలను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. "ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 7 లో వాళ్ళే నన్ను పిలిచారు. నాకు ఒక గ్లిమ్ప్స్ లా ఉంటుంది. ఎపిసోడ్ 1 లో ఒక కుస్తీ టాస్క్ ఉంటుంది. అందులో నేనే కనిపిస్తాను. ఇక ఇప్పుడు కొత్త బిగ్ బాస్ సీజన్ 9 కి  ఆడిషన్స్ ఇచ్చాను. ఒక వీడియో పంపాను ..గ్రూప్ డిస్కషన్ కి రమ్మని మెసేజ్ పంపించారు. నేను వెళ్లాను. ఐతే అక్కడ పది పది మందికి కలిపి ఒక గ్రూప్ పెట్టారు. ఐతే వాళ్ళు చెప్పింది వేరు అక్కడ జరిగింది వేరు. "ప్రాస్టిట్యూషన్ ని లీగలైజ్ చేయొచ్చా" అని ఒక టాపిక్ ఇచ్చారు. అసలు ఈ టాపిక్ మాట్లాడుకునేది కాదు. ఆ టాపిక్ అసలు నాకు నచ్చలేదు. టాపిక్ అంటే సబ్జెక్టు కంటెంట్ ఉండాలి. కానీ అదేం లేకుండా లేచి అరవడం మాత్రమే జరిగింది చాలామంది. నాకు అది నచ్చలేదు. ఇక బిగ్ బాస్ అప్ డేట్స్ చూస్తుంటే వీళ్ళు జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు. అగ్నిపరీక్ష అని, సెలెక్షన్స్ అని అన్నీ టాస్కులు ఇచ్చేసి అంతా ఐపోయాక కూడా ఇంకా సెలెక్ట్ చేస్తున్నారు..అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు కండక్ట్ చేయడం.   నేను సెలెక్ట్ కాలేదు అంటూ ఒక మెయిల్ కూడా పంపించారు. అసలు నన్ను ఎందుకు తీసుకోలేదు అన్నదే నా ప్రశ్న. ఇక బిగ్ బాస్ 7 లో ఆ గ్లిమ్ప్స్ లో కనిపించినందుకు ఇప్పుడు నన్ను తీసుకోలేదు అనుకోవాలా ? ఐతే బిగ్ బాస్ 7 లో వాళ్ళు చెప్పిన టైమింగ్ ఒకటి అక్కడ జరిగింది ఇంకోటి. ఉదయం 10 గంటల కల్లా వచ్చేయమన్నారు. జస్ట్ 4 గంటలే ఉంటుంది అని చెప్పడంతో నేను వెళ్లాను. అలా షూటింగ్ అంతా డిలే చేస్తూ ఆ రోజు నైట్ 2 వరకు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నా రోజు మొత్తం వేస్ట్ ఐపోయింది అప్పుడు. కొంతమంది డైరెక్ట్ గా ఫ్రీగా ఎలాంటి టాస్కులు లేకుండా వచ్చేస్తున్నప్పుడు మాకెందుకు ఈ టాస్కులన్నీ ? బిగ్ బాస్ వాళ్ళు జనాలని పిచ్చోళ్లను చేస్తున్నారు" అంటూ కామెంట్ చేసింది కీర్తి.   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. We would encourage viewers' discretion before reacting to them.

జగపతి బాబుతో స్టెప్పులేసిన  శ్రీలీల!

జీ తెలుగులో రీసెంట్ గా స్టార్ట్ ఐన టాక్ షో "జయమ్ము నిశ్చయమ్మురా". ఈ షోకి ప్రతీ వారం ఒక గెస్ట్ ని తీసుకొస్తున్నారు. హోస్ట్ గా జగపతి బాబు చేస్తున్నారు. ఇక ఫస్ట్ ఎపిసోడ్ కి నాగార్జునని ఇంటర్వ్యూ చేశారు. ఆయనకు సంబందించిన ఎన్నో ఓల్డ్ పిక్స్ ని ఆయనకు కూడా తెలియనివి కూడా చూపించి ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేశారు. ఇక  నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి శ్రీలీల రాబోతోంది. దానికి సంబంధించిన మరో కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమో లాస్ట్ లో జగపతి బాబు శ్రీలీలతో కలిసి స్టెప్పులేశారు. ఈమె షోలోకి ఎంట్రీ ఇవ్వగానే "చందమామలా ఉన్నావమ్మా" అంటూ పొగిడేశారు. "అసలు నీకు ఎన్ని భాషలు వచ్చు అని అడిగారు" "మలయాళం ఒక్కటి కొంచెం నేర్చుకోవాలి" అని చెప్పింది శ్రీలీల. "ఏదీ వదలవా నువ్వు ఉన్న హీరోయిన్స్ ని కూడా లేపేసి నువ్వు దూరిపోయావ్" అని పెద్ద అభాండం వేశారు జగపతి బాబు. "నేను రాలేదు సర్" అంటూ శ్రీలీల దణ్ణం పెట్టేసింది. "ఒక పరీక్ష పెడతాను ఎంతబాగా వచ్చో చూద్దాం" అనేసరికి "మళ్ళీ మా కాలేజ్ లో వైవా పరీక్షలో ఉన్నట్టుగా ఉంది" అని చెప్పింది. "మూవీస్ లో ఫేక్ బ్లడ్ పెట్టుకుంటాం కదా అప్పుడు నర్సులు వాళ్ళు నన్ను చూసి నిజంగా రక్తం వస్తోందా అని భయపడిపోయారు" అంటూ నవ్వుతూ చెప్పింది శ్రీలీల. "ఇంకా ఎన్ని చూడాలో నీ లీలలు..ఇంకా చాలా ఉన్నాయమ్మా వెయిట్ చెయ్" అన్నారు జగపతి బాబు. కొన్ని పిక్స్ ని చూసి చాలా షాకైపోయి గట్టిగా సరిచేసి ..నా వల్ల కాదు సర్" అనేసింది. "నువ్వు మాట్లాడ్డం కూడా డాన్స్ లే చేసేస్తున్నావ్" అన్నారు జగ్గు భాయ్. తర్వాత మ్యూజిక్ అని చెప్పి లేచి మరీ "మనసా పలకవే"  డాన్స్ చేసేసింది.

కన్నడ వాళ్ళు రెండు చోట్ల సంపాదిస్తుంటే....మేము అడుక్కుతినాలా..

తమన్నా సింహాద్రి శ్రీముఖితో ఎక్కువగా అవుట్ డోర్స్ కి వెళ్లే ఒక వ్యక్తిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరికీ తెలుసు. శ్రీముఖితో వాళ్ళ అమ్మతో ఈమె ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో రకరకాల రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి తమన్నా సింహాద్రి తెలుగు సీరియల్స్ గురించి, బిగ్ బాస్ గురించి ఒక ఇంటర్వ్యూలో  కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. "తెలుగు సీరియల్స్ చూడండి, తెలుగు బిగ్ బాస్ చూడండి...తెలుగు వాళ్ళు కనిపించరు..అందరూ కన్నడ వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. అదే బాలీవుడ్ బిగ్ బాస్ చూడండి వాళ్ళ వాళ్ళే ఎక్కువగా ఉంటారు. నేను హిందీలో అనర్గళంగా మాట్లాడగలను, కంటెంట్ ఇవ్వగలను కానీ వాళ్ళు నన్ను తీసుకుంటారా తీసుకోరు. కానీ ఇక్కడ తెలుగు అమ్మాయిలను పక్కనపెట్టేసి కన్నడ వాళ్లనే ఎక్కువగా తీసుకుంటారు. మన వాళ్లకు ఎప్పుడూ పక్కింటి పుల్లకూర రుచిగా ఉంటుంది. నిజం ఏదైనా కానీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే నాకు అలవాటు. బిగ్ బాస్ వలన నేను చాలా బ్యాడ్ అయ్యాను. కాంట్రవర్షియల్ అయ్యాను, అలాగే పబ్లిక్ లో కూడా చాలా బ్యాడ్ అయ్యాను.     నేనేంటో చిరంజీవి గారు, శ్రీముఖి గుర్తించారు. నిజాయితీగా ఉన్నానన్న విషయాన్ని కొంతమందన్నా గుర్తించారు. అది హ్యాపీ నాకు. కన్నడ వాళ్ళు అక్కడ, ఇక్కడ సంపాదించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రములో పుట్టి తెలుగు ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళం మేము అడుక్కుతినాల ? శోభా శెట్టి ఇక్కడ బిగ్ బాస్ లో కన్నడ బిగ్ బాస్ లోకి వెళ్ళింది. ఎం కంటెంట్ ఇస్తున్నారు వాళ్ళు ? ఎం పగలదీస్తున్నారు వాళ్ళు ? ఆంధ్రా ప్రజలు ఎక్కుగా నాటకాలకు, అబద్ధాలకు అట్ట్రాక్ట్ ఐపోతారు. బిగ్ బాస్ లో చేసే వాళ్లంతా రియాలిటీ కాదు అంతా నటన.. ఆ పల్లవి ప్రశాంత్ ఏంటి అతను అంతా నటనే కదా...నేను కూడా ఒక ట్రాన్స్ ఫిమేల్ ని అని చెప్పి నిద్ర లేచిన దగ్గర నుంచి దండాలు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటే టాప్ 5 లో ఉండేదాన్ని." అంటూ చెప్పుకొచ్చింది తమన్నా సింహాద్రి.

Jayam serial : గంగకి శకుంతల సపోర్ట్.. రుద్ర ఏం చేయనున్నాడు!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -32 లో.... గంగని మను వెతుక్కుంటూ గుడికి వస్తాడు. గంగని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. అమ్మవారి మెడలోని తాళి తీసుకొని మను గంగ మెడలో కట్టబోతుంటే రుద్ర వచ్చి మనుని ఆపుతాడు. మనుని కొడతాడు రుద్ర. ఆ తర్వాత రౌడీలని కూడా కొడతాడు రుద్ర. అదంతా దూరం నుండి వీరు చూసి మళ్ళీ ఈ రుద్ర ఎక్కడ నుండి వచ్చాడని డిస్సపాయింట్ అవుతాడు. రౌడీలని పోలీసులకి పట్టించండి ఒక వీడిని మాత్రం నాకు అప్పగించండి అని మనుని తీసుకొని రుద్ర పెళ్లి మండపం దగ్గరికి వెళ్తాడు. గంగ కూడా వెళ్తుంది. రుద్ర సర్ లేకుంటే నా పరిస్థితి ఏమై ఉండేదోనని గంగ ఎమోషనల్ అవుతుంది. మనుని రుద్ర, పెద్దసారు కొడతారు. నువ్వు ఇదంతా ఎందుకు చేసావని అడుగుతారు. వీడు నిజం చెప్తాడా ఏంటని ఇషిక టెన్షన్ పడుతుంది. అప్పుడే వీరు పోలీసులని తీసుకొని వచ్చి మనుని అరెస్ట్ చేయమని చెప్తాడు. నువ్వు ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళు నిన్ను తర్వాత బయటకు తీసుకొని వస్తానని  మనుకి వీరు సైలెంట్ గా చెప్తాడు. ఆ తర్వాత గంగ మీ అమ్మ కనిపించడం లేదు అని గంగ ఫ్రెండ్స్ తన దగ్గరికి వచ్చి చెప్తారు. ఈ లెటర్ దొరికింది అని ఇస్తారు. ఆ లెటర్ పెద్దసారు చదువుతాడు. గంగ నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావ్.. నాతో ఉంటే మళ్ళీ మీ నాన్న ఎవరికైనా అమ్మేస్తాడు.. అందుకే నేనే నీకు దూరంగా వెళ్తున్నా నా కోసం చూడకు.. నిన్ను అమ్మగారు చేరదీస్తారు. అనుకుంటున్నా.. జాగ్రత్త అని అందులో రాసి ఉంటుంది. అది విని గంగ బాధపడుతుంది. తరువాయి భాగంలో గంగని పెద్దసారు ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఎందుకు తీసుకొని వచ్చారని ఇంట్లో వాళ్ళు అడ్డుచెప్తారు. గంగ ఇక్కడే ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే ఎవరికి వారు విడిగా ఉందామని శకుంతల అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : నర్మద, ప్రేమ సూపర్ ఎంక్వైరీ.. భాగ్యం గుట్డురట్టు కానుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -241 లో...... నగలు విషయం బయటపెట్టాలని ప్రేమ, నర్మద అనుకుంటారు. కానీ భాగ్యం వాళ్ళ ప్లాన్ ని తిప్పికొడుతుంది. గిల్టీ నగలు అన్ని ఒక కలశంలో పెడుతుంది ఆ కలశం పూజ దగ్గరికి తీసుకొని వస్తుంది. శ్రీవల్లి అందులోనే అన్ని నగలు ఉన్నాయని చెప్తుంది. నగలు అందులో నుండి తియ్యమని శ్రీవల్లితో చెప్తుంది నర్మద. అందరు నగలు అందులో నుండి తియ్యాడానికి ట్రై చేస్తారు కానీ అందులోకి ఎవరి చెయ్యి దూరదు. సాగర్, ధీరజ్, చందు ట్రై చేస్తారు వాళ్ళ వల్ల కూడా కాదు. నేను ట్రై చేస్తాను అంటూ తిరుపతి ట్రై చేస్తాడు కానీ ఆతని చెయ్యి అందులోనే ఉండిపోతుంది. ఇక ఏం చెయ్యలేక అలాగే పూజ పూర్తి చేస్తారు. ఆ తర్వాత  చాలా మంచి ప్లాన్ చేసావ్ అమ్మ అని శ్రీవల్లి భాగ్యాన్ని పొగుడుతుంది. ఇంకొకసారి వాళ్ళు నీ జోలికి రారు అని శ్రీవల్లితో భాగ్యం చెప్తుంది. ఆ తర్వాత ఆనందరావు దగ్గరికి ప్రేమ, నర్మద వస్తారు. బాబాయ్ మీతో కొన్ని సెల్ఫీ తీసుకుంటానని ప్రేమ అనగానే ఆనందరావు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే అంటాడు  బాబాయ్ నేను ఫోన్ తీసుకొని రాలేదు.. మీ ఫోన్ ఇవ్వండి అని నర్మద అంటుంది. అతను ఫోన్ ఇస్తాడు. సెల్ఫీ తీసుకుంటారు. బాబాయ్ నాకు ఈ ఫొటోస్ పంపించండి అని నర్మద అంటుంది. నువ్వు పంపించుకోమని ఆనందరావు అనగానే నర్మద అతని ఫోన్ లో లొకేషన్ ఆన్ చేసి షేర్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆనందరావు భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్లి ఇల్లు కాళీ చేస్తుంటారు. ఎప్పుడు అయిన వాళ్ళు ఇక్కడికి వస్తారని భాగ్యం అనుకుంటుంది. అప్పుడే ప్రేమ, నర్మద కలిసి భాగ్యం ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి షాక్ అవుతారు. ఇంత జాగ్రత్త పడ్డాం కదా మా అడ్రెస్ ఎలా దొరికిందని నర్మదని ఆనందరావు అడుగుతాడు. నర్మద లొకేషన్ షేర్ చేసుకుంది చూపిస్తుంది. ఇప్పుడే మీ విషయం మావయ్యకి చెప్తామని ప్రేమ, నర్మద అక్కడ నుండి బయల్దేర్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : పెళ్ళికి వస్తానన్న శ్రీధర్.. తప్పులన్ని ఒప్పుకున్న పారిజాతం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -440 లో..... శ్రీధర్ దగ్గరికి కార్తీక్ వెళ్తాడు. కాసేపు నువ్వు ఎవరో నేను ఎవరో అనుకుని మాట్లాడుకుందామని కార్తీక్ అంటాడు. సరే అనీ శ్రీధర్ అంటాడు. నా పేరు కార్తీక్.. మాది హ్యాపీ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషం గా ఉండే మా అమ్మ.. మా అమ్మని చిన్న పిల్లలా చూసుకునే నాన్న అని కార్తీక్ తన స్టోరీ చెప్తాడు. మా నాన్న సిగరెట్ కాలుస్తాడు. ఆ విషయం నాకు మాత్రమే తెలుసు. మా నాన్నతో నేనొక ఫ్రెండ్ లాగా ఉండేవాడిని అని కార్తీక్ చెప్తుంటే శ్రీధర్ సైలెంట్ గా వింటాడు. మా నాన్న అంటే మాకు ఎంత నమ్మకం ఉండేది కానీ మా నాన్న ఎవరికి తెలియకుండా పెళ్లిచేసుకున్నాడు మమ్మల్ని మోసం చేసాడు. ఆ బాధ మాకు ఎలా ఉంటుంది. పిల్లలు బాధపడితే తండ్రికి చెప్పుకుంటాడు.. తండ్రి బాధపెడితే ఆ పిల్లలు ఎవరికి చెప్పుకుంటారు. ఇప్పుడు నా పెళ్లి.. అందరు కలిసి పోయే టైమ్.. ఇప్పుడు ఆ పెళ్లికి  మా నాన్న రావడం అవసరం.. మా అమ్మ గౌరవం కాపాడడం అవసరం అని కార్తీక్ ఎమోషనల్ గా మాట్లాడుతాడు. దాంతో శ్రీధర్ ఎమోషనల్ అయి వస్తాను.. మీ అమ్మ గౌరవం కాపాడతానని శ్రీధర్ అనగానే కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పారిజాతానికి జ్యోత్స్న ఫోన్ చేసి నా గదికి రా మాట్లాడాలి అంటుంది. ఇప్పుడు బయటకు రాలేను.. ఆ కార్తీక్ గాడు నాతో ఛాలెంజ్ చేసాడు. రేపు ప్రొద్దున మీ తాతతో గెంటిస్తానని కార్తీక్ చెప్పాడంటూ పారిజాతం చెప్తుంది. ఎందుకు బావతో ఛాలెంజ్ చేసావని పారిజాతంపై జ్యోత్స్న కోప్పడుతుంది. ఆ తర్వాత పారిజాతం రాత్రంతా నిద్రపోకుండా ఉంటుంది. మరుసటి రోజు కార్తీక్, దీప రాగానే గుమ్మం దగ్గరే పారిజాతం నిల్చొని ఏమో ఛాలెంజ్ చేసావ్.. ఇంకా పది నిమిషలు టైమ్ ఉంది అంతే.. నువ్వు నాతో పెట్టుకోలేవ్ రా నా గురించి నీకు పూర్తిగా తెలియదు. అసలు జ్యోత్స్నకి శ్రీధర్ ని పెళ్లికి పిలవమని చెప్పమనే ఐడియా ఇచ్చింది నేనే అంటూ పారిజాతం తను చేసిన తప్పులన్నీ చెప్పేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahamamudi: రుద్రాణి వేసిన ప్లాన్ లో మళ్ళీ బలైన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -804 లో..... కావ్యని రాజ్ పక్కకి పిలిచి మాట్లాడతాడు. మీరు అంటే నాకు చాలా ఇష్టమని రాజ్ అనగానే.. మీకు ఎన్ని సార్లు చెప్పాలి.. మీరంటే నాకు ఇష్టం లేదని మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు ప్లీజ్ నన్ను ఇలా వదిలెయ్యండి.లేదంటే నేనే ఎక్కడికైనా దూరంగా వెళ్ళపోతానని కావ్య అనగానే.. అయ్యో మీరు ఎందుకు వెళ్లడం నేనే వెళ్ళిపోతానని రాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు అప్పు కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే కావ్య వచ్చి ఏమైందని అడుగుతుంది. వెంటనే డాక్టర్ ని పిలుస్తారు. డాక్టర్ వచ్చి అప్పుని చెక్ చేసి.. ఏం తిన్నావని అడుగుతుంది. ఇడ్లీ తిని ఆ టాబ్లెట్ వేసుకున్నానని చెప్పగానే డాక్టర్ ఆ టాబ్లెట్ చూసి ఎక్స్ పైరి డేట్ అయిపోయిందని డాక్టర్ చెప్తుంది. అదే విషయం డాక్టర్ బయటకు వచ్చి అందరికి చెప్తుంది. ప్రాబ్లమ్ ఏం లేదు అనీ డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇలా చేసావేంటి కావ్య అని కావ్యని అంటుంది రుద్రాణి. ఆ ట్యాబ్లెట్ వేసుకుంది అప్పు.. కావ్యని అంటావేంటని రుద్రాణిని అడుగుతుంది ఇందిరాదేవి. అంటే అప్పుకి ఆ ట్యాబ్లెట్ ఇచ్చింది కావ్య అని రుద్రాణి అనగానే నిజమేనా అని కావ్యని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అవునని కావ్య అనగానే నీ బుద్ది ఇప్పుడు బయటపడింది. నువ్వు ప్రెగ్నెంట్ కాలేదని కుళ్ళుగా ఉన్నావ్.. నువు ఒక గొడ్రాలివి అని కావ్యని తిడుతుంది ధాన్యలక్ష్మి. అది భరించలేక కావ్య ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకొకమాట మాట్లాడకు ధాన్యలక్ష్మి.. నీ కోడలు కంటే ముందే కావ్య ప్రెగ్నెంట్ కానీ ఆ విషయం రాజ్ కి ఎలా చెప్పాలని చెప్పలేక అలా మనసులో దాచుకుందని కనకం చెప్పగానే అందరూ షాక్ అవుతారు. కావ్యని ఎన్ని మాటలు అన్నావని ధాన్యలక్ష్మిపై ప్రకాష్ కోప్పడతాడు. అవునండి వెళ్లి సారీ చెప్పాలని ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వెళ్తుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఒకే కారులో ఆ ఇద్దరు... బాయ్ ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పిన శ్రీముఖి!

ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమో ఉదయభాను కూడా కనిపించింది. 150th ఎపిసోడ్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు. అలాగే కేక్ కూడా కోశారు. ఇక ఈ ప్రోమోలో గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడ కూడా కనిపించాడు. ఇక సుహాసిని కూడా వచ్చి జ్యూస్ తాగుతూ "శ్రీముఖి నువ్వు ఎన్ని చెక్కులు తీసుకున్నావో నేను కూడా అన్ని కూడా ఇంచుమించు అన్ని చిక్కులే తీసుకున్నాను" అని చెప్పింది. "అంటే వాళ్ళు చేసి తీసుకున్నారు నువ్వు చెయ్యకుండా తీసుకున్నావు" అంటూ ఇమ్మానుయేల్ సుహాసినికి కౌంటర్ వేసాడు. అలాగే అమూల్య గౌడ, బాలు కలిసి వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి "గుండె నిండా గుడిగంటలు" సీరియల్ లో నటిస్తున్నారు. ఇద్దరూ కలిసి వచ్చేసరికి శ్రీముఖికి మండిపోయింది. "ఆయనతో పాటు ఎందుకు కలిసొచ్చారో" అని మూతి తిప్పుతూ అడిగింది. దానికి ఇమ్ము "ఒకే కార్ లో వచ్చామ్ నీకు ఆ సంగతి తెలీదనుకుంటా" అనేసరికి శ్రీముఖి షాకైపోయింది. ఇక శ్రీముఖికి బాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఐతే గుప్పెడంత మనసు హీరో ముఖేష్ వచ్చేసరికి "నీ కళ్ళ ముందు అతనికి బ్రేకప్ చెప్పాలా" అని అడిగింది. "ఇప్పటికిప్పుడే" అని ముఖేష్ అన్నాడు. "బాలు బ్రేకప్" అంటూ శ్రీముఖి సీరియస్ గా చెప్పింది. "ఆల్రెడీ ముఖేష్ తో బ్రేకప్ చేసుకునే వచ్చారు కదా" అన్నాడు బాలు. దానికి శ్రీముఖి ఆమ్మో అంటూ నవ్వేసింది. ఇక తర్వాత బాలు "పది నిమిషాల క్రితం వరకు నాకు శ్రీముఖి అంటే ఇష్టం కానీ ఇప్పుడు బ్రేకప్ చెప్పేసారు" అన్నాడు ఫీలవుతూ. "కంగ్రాట్యులేషన్స్ అని హగ్ చేసుకుని కూడా చెప్పొచ్చు" అంటూ బాలుకి సీరియస్ గా చెప్పింది శ్రీముఖి.

వాళ్లని మాత్రమే బిగ్ బాస్ సీజన్ 9  హౌస్ లోకి పంపిస్తారు!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి రీసెంట్ గా చాలా ప్రోమోస్ రిలీజ్ అయ్యాయి. మాజీ కంటెస్టెంట్స్ అంతా వచ్చి బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి చెప్తున్నారు. ఇక రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 పార్టిసిపెంట్ అర్జున్ అంబటి న్యూ బిగ్ బాస్ అగ్నిపరీక్ష గురించి చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 9 ని కొత్తగా డిజైన్ చేశారు. ఇప్పటి వరకు ఒక్క కామనర్ కె అవకాశం ఉండేది కానీ ఇప్పుడు చాలామంది కామనర్స్ కి అవకాశం ఇచ్చారు. ఐతే వీళ్ళు డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి టెన్షన్ పడకుండా ఉండడానికి అలాగే వామప్ లా ఉండడానికి బిగ్ బాస్ లోకి వెళ్ళాక అక్కడ అలవాటు పడడానికి కానీ అగ్ని పరీక్ష అనే గోల్డెన్ కాన్సెప్ట్ తెచ్చారు. ఈ అగ్ని పరీక్షలో పాస్ ఐనవాళ్ళే రియల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు. ఎక్కువ ఫుటేజ్ లో కనిపించడం కోసం ఎక్కువగా గొడవలు పడడం వంటివి అస్సలు చేయొద్దు. ఎందుకంటే అసలు మొదటేమయ్యింది, మధ్యలో ఎం చేశారు, లాస్ట్ లో ఏమయ్యింది అనే విషయాన్నీ అందరూ మర్చిపోతారు. దాంతో మీరు దొరికి పోయే ఛాన్స్ ఉంది. సింపుల్ సూత్రం ఏంటంటే మీరు గెలవడం కోసమే ఆడండి. ఇక టాస్క్స్ అంటారా అన్నీ గెలవాలని లేదు..అందరూ అన్ని ఆడలేరు. కొన్ని గెలవచ్చు కొన్ని ఓడిపోవచ్చు...ఈ అగ్నిపరీక్ష దాటాలి అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే గేమ్స్ టాస్క్స్ ఆడడమే కాదు...మీ వ్యక్తిత్వాన్ని, కొన్ని సందర్భాల్లో ఎలా సర్వైవ్ అవుతారో తెలుసుకోవడానికి కొంతమంది జడ్జెస్ టఫ్ కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేస్తారు. వాళ్లనే బిగ్ బాస్ సీజన్ 9 న్యూస్ హౌస్ లోకి పంపిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం రెడీ అవ్వండి. మీలా మీరు ఉండండి. హౌస్ లో మీ కోసమే ఆడండి.