Illu illalu pillalu : రామరాజు నుండి తప్పించుకున్న ప్రేమ.. శ్రీవల్లిపై చందు కోపం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -262 లో.. కళ్యాణ్ వెంట ప్రేమ కర్ర పట్టుకొని పరిగెడుతున్నది పేపర్ లో వస్తుంది. ఆ పేపర్ తీసుకొని వచ్చి శ్రీవల్లి రామరాజుకి చూపిస్తుంది. ఏంటి ఇది అని రామరాజు అడుగుతాడు. వాడు దొంగ మావయ్య.. చేతిలో బ్యాగ్ పట్టుకొని పారిపోతుంటే పట్టుకున్నానని ప్రేమ కవర్ చేస్తుంది. అలాంటి విషయలు ఇంటికి వచ్చి మావయ్య గారితో చెప్పాలి కదా అని శ్రీవల్లి అంటుంది. అది చిన్న విషయం కదా అని చెప్పలేదని ప్రేమ అంటుంది. ఏంటి శ్రీవల్లి.. నువ్వు ప్రతీ చిన్న విషయానికి ఇలా రాద్దాంతం చేస్తావని శ్రీవల్లిని వేదవతి అంటుంది. ఏంటి చిన్న విషయం బుజ్జమ్మ.. ఒకవేళ ప్రేమకి ఏదైనా అయితే ఏంటి పరిస్థితి.. ప్రతీచిన్న విషయం కూడా చెప్పాలని ప్రేమతో రామరాజు అంటాడు. ఆ తర్వాత ధీరజ్ దగ్గరికి శ్రీవల్లి వెళ్లి  ప్రేమకి ఈ బొకే వచ్చింది.. అప్పటి నుండి టెన్షన్ పడుతుందని చెప్తుంది. దానిపై వన్ వీక్ అని ఉంది.. అది చూసి ధీరజ్ ఆలోచనలో పడతాడు  వెంటనే రూమ్ కి వెళ్లి ఆ రోజు వచ్చిన కొరియర్ పై కూడా అడ్రెస్ లేదు.. ఆ కొరియర్ లో ఏముందో కనుక్కోవాలని కొరియర్ కోసం వెతుకుతాడు. అప్పుడే ప్రేమ వస్తుంది. ఎందుకు అలా వెతుకుతున్నావని ప్రేమ అడుగుతుంది. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావో ఆ కొరియర్ చూస్తే తెలుస్తుంది కదా అందుకే అని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత చందు దగ్గరికి శ్రీవల్లి వెళ్లి మాట్లాడుతుంది. నువ్వు నాతో మాట్లాడకు.. మీ వాళ్ళు చేసింది నేను మర్చిపోలేనని శ్రీవల్లిని చందు దూరం పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : మనసు మార్చుకున్న శ్రీధర్.. జ్యోత్స్నకి ఇచ్చిపడేసిన దీప!

   స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -461 లో......కాశీ పోలీస్ స్టేషన్ లో స్వప్న ఉన్నాడని ఏడుస్తుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. ఎందుకు మమ్మల్ని ఇలా లోపల ఉంచి లాక్ వేసి వెళ్లారని శ్రీధర్ పై కావేరి కోప్పడుతుంది. ఆయనకు మనసు ఉంటేనే కదా మమ్మీ అని స్వప్న కూడా శ్రీధర్ ని తిడుతుంది. అప్పుడే కాశీ, దాస్ ఇంట్లో కి వస్తారు. కాశీని చూసి స్వప్న సంతోషపడుతూ నిన్ను మావయ్య బయటకు తీసుకోని వచ్చాడా.. చాలా థాంక్స్ మావయ్య మిమ్మల్ని చూసి కొంతమంది బుద్ది తెచ్చుకోవాలని స్వప్న అంటుంది. నేను తీసుకొని రాలేదని దాస్ అనగానే మరి అన్నయ్య తీసుకొని వచ్చాడా అనీ స్వప్న అడుగుతుంది. లేదు శ్రీధర్ బావ తీసుకొని వచ్చాడని దాస్ అనగానే స్వప్న, కావేరి షాక్ అవుతారు. బావ వాళ్ళతో మాట్లాడి డబ్బు ఇచ్చి కేసు వెనక్కి తీసుకునేలా చేసాడు. ఇలాంటి అప్పుడే ప్రేమలు బయటపడుతాయి. ఇదంతా నీ కోసం చేశాడని స్వప్నతో దాస్ అంటాడు. ఇక వెళ్తామని కాశీ అనగానే జాబ్ పోయింది.. రెంట్ ఎలా కడుతావ్ ఇక్కడే ఉండండి అని శ్రీధర్ అంటాడు. మరొకవైపు శివన్నారాయణ ఇంటికి దీప, కార్తీక్ శౌర్య వెళ్తారు. శౌర్యకి దశరథ్ చాక్లెట్ ఇస్తాడు. అది తీసుకొని సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. అవి మీ తాత ఇచ్చాడా  అని అడుగుతుంది నీకెలా తెలుసని శౌర్య అడుగుతుంది. అవి అంటే ఆయనకి ఇష్టమని సుమిత్ర చెప్తుంది. అదంతా దీప వింటుంది. ఏంటి దీప ఇక్కడున్నావని సుమిత్ర దగ్గరికి తీసుకొని వెళ్తుంది జ్యోత్స్న. తనతో ఏదో విధంగా దీపని తిట్టించాలని జ్యోత్స్న చూస్తుంది. కానీ సుమిత్ర దీపని వెళ్ళమని చెప్పి అనవసరం అయిన విషయం పక్కన పెట్టి తాతయ్య నీకు ఇచ్చిన టైంమ్ కొద్దీ రోజులే ఉందని జ్యోత్స్నపై సుమిత్ర కోప్పడుతుంది.  ఆ తర్వాత జ్యోత్స్న బయటకు రాగానే దీప తనని చూసి సుమిత్రమ్మ బాగా ఇచ్చినట్లుందని అంటుంది. నేనొకటి ఇవ్వాలని జ్యోత్స్న తెంపిన తాళిని దీప తన చేతిలో పెడుతుంది. ఇది నీదే కదా కార్తీక్ బాబు.. నీ మెడలో కట్టాలని తీసుకొని వచ్చవ్ కానీ నా మెడలో పడింది.. చాలా సార్లు దీని గురించి గొడవ అయింది మనకి అని దీప అనగానే జ్యోత్స్నకి కోపం వస్తుంది. ఆ తర్వాత దీప వెళ్ళిపోయాక కార్తీక్ వచ్చి.. నా భార్య నీకేదో ఇస్తానంది ఇచ్చిందా అని వెటకారంగా అడుగుతాడు. దాంతో జ్యోత్స్నకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg boss 9 Telugu: నోరుజారిన మాస్క్ మ్యాన్ హరీష్.. ఇమ్మాన్యుయల్, భరణి ఆడవాళ్ళంట!

  బిగ్ బాస్ సీజన్-9 మొదలైన నాలుగు రోజులైంది. కానీ ఒక్కో ఎపిసోడ్ ఒక్కో లెవెల్ గా సాగుతుంది. మాస్క్ మ్యాన్ హరీష్ నోరుకి అడ్డుఅదుపు లేకుండా పోతుంది. తాజాగా రిలీజైన ప్రోమోలో మాస్క్ మ్యాన్ హరీష్ నోరు జారాడు. బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఇందులో సంజనాకి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. తను సెలెక్ట్ చేసుకున్న కంటెస్టెంట్స్ గేమ్ ఆడారు. ఇక ఈ టాస్క్ కి మనీష్ సంఛాలక్ గా ఉన్నాడు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఇమ్మాన్యుయల్ కి మనీష్ కి మధ్య పెద్ద గొడవ జరిగింది. ‌ఇక నేటి ప్రోమోలో ప్రియ, పవన్ కళ్యాణ్ టాస్క్ నుండి అవుట్ అయ్యాక.. అన్ ఫెయిర్ గేమ్ అంటూ మాట్లాడారు. ఇక ఇమ్మాన్యుయల్ అయితే తనని హరీష్ బాడీ షేమింగ్ చేసాడంటూ భరణితో చెప్పుకున్నాడు. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ , దమ్ము శ్రీజ ఇద్దరు మాట్లాడుకున్నారు. తనూజ, ఇమ్మాన్యుయల్, భరణి .. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలనుకొని గేమ్ ఆడాననుకున్నాను.. ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేశానని నాకు ఇప్పుడు అర్థమైందంటూ మాస్క్ మ్యాన్ హరీష్ అన్నాడు. ఇక ఇది చూసిన నెటిజన్లు హరీష్ పై మండిపడుతున్నారు.  శనివారం నీకు ఉంటదిరా గుండోడా అని ఒకరు కామెంట్ చేయగా, కామనర్స్ మరీ ఓవరాక్షన్ చేస్తున్నాడని ఒకరు కామెంట్ చేశారు. నాగ్ సర్ చేతిలో శనివారం గుండోడికి గట్టిగానే ఉంటదని మరొకరు కామెంట్ చేశారు. ఇలా సంఛాలక్ మనీష్ ని, మాస్క్ మ్యాన్ హరీష్ ని తిడుతూ చాలా కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. బిగ్ బాస్ సీజన్-9 తెలుగు(Bigg Boss 9 Telugu) లో ఓ సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చి ఇంత నోరుజారి మాట్లాడటం ఇదే ఫస్ట్. వీకెండ్ లో నాగార్జున ఏం అంటాడో చూడాలి మరి.   

సంజనకి బిగ్ బాస్ సపోర్ట్.. ఇమ్మాన్యుయల్ కి అన్యాయం చేసిన మనీష్!

  బిగ్ బాస్ సీజన్-9 తెలుగు మొదలై నాలుగు రోజులు పూర్తయింది. ఈ సీజన్ లో నిన్నటి వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో అందరు సరదాగా మాట్లాడుకున్నారు. నామినేషన్ లో అందరు సంజనని టార్గెట్ చేసినట్టుగా అనిపించడంతో తను ఏడ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సంజనని కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు బిగ్ బాస్. మిమ్మల్ని అందరు కార్నర్ చేసినట్లు అనిపిస్తుందా అని అడుగుతాడు. అవును బిగ్ బాస్ చాలా బాధగా ఉంది. ఎవరు బాధపడిన నేను వెళ్లి వాళ్ళని ఓదారుస్తాను కానీ అందరు నన్ను కార్నర్ చేసారని సంజన చెప్తుంది. నిన్ను అందరు కార్నర్ చేసినా నువ్వు ధైర్యంగా ఉన్నావ్.. అందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను అందుకే నీకు స్పెషల్ పవర్ ఇస్తున్నానని బిగ్ బాస్ చెప్పాడు. కెప్టెన్సీ టాస్క్ కి ఉన్నవాళ్లలో ఒక అయిదుగురిని ఎంపిక చేసుకోమని బిగ్ బాస్ చెప్తాడు. ఓనర్స్ నుండి ఇద్దరు రెంటర్స్ నుండి ముగ్గురిని సెలక్ట్ చేస్తుంది సంజనా. డీమాన్ పవన్, హరీష్, ఇమ్మాన్యుయల్, శ్రష్టి వర్మ, ఇంకా నేను అని సంజన చెప్తుంది. నాకు నా ఫ్యామిలీ గురించి టెన్షన్ గా ఉంది వాళ్ళు బాగున్నారా అని ఆడుగగా బాగున్నారని బిగ్ బాస్ చెప్తాడు. ఆ తర్వాత బయటకు వెళ్లి ఈ విషయం అందరికి చెప్పమని బిగ్ బాస్ చెప్తాడు. సంజన బయటకు వచ్చి తను సెలక్ట్ చేసిన వాళ్ళ పేర్లని చెప్తుంది. మమ్మల్ని ఎందుకు సెలక్ట్ చెయ్యలేదని శ్రీజ, రీతూ చౌదరి కలిసి సంజనాని క్వశ్చన్ చేస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ మిగతా కంటెస్టెంట్స్ కి సెలక్ట్ అయిన వాళ్ళు ఎంత మంది వాళ్ళకి మద్దతు పలికితే వాళ్ళు ప్రస్తుతం ఉన్న అయిదుగురి కంటెండర్స్ కి జోడిగా ఉంటారని బిగ్ బాస్ చెప్తాడు.   అలా సంజనకి శ్రీజ, హరీష్ కి పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ కి భరణి, డీమాన్ పవన్ కి ప్రియ,  శ్రష్టికి రాము జోడిగా ఎంపిక అవుతారు. ఆ తర్వాత రెంటర్స్ మరొకవైపు ఓనర్స్ కెప్టెన్ ఎన్నిక గురించి మాట్లాడుకుంటారు. రెంటర్స్ లో సంజన తప్ప మనం ఎవరైనా కెప్టెన్ కావాలని భరణి రెంటర్స్ వాళ్ళకి చెప్తాడు. టాస్క్ మొదలవుతుంది. టాస్క్ ఆడేది కంటెండర్స్ కాదు.. వాళ్ళ జోడీలు ఆడాలి. టాస్క్ మొదలై మొదట రౌండ్ కి ఇమ్మాన్యుయల్ జోడి అయిన భరణి ఎలిమినేట్ అవుతాడు. టాస్క్ కి సంచాలకుడిగా మనీష్ వ్యవహరిస్తాడు.

Bigg Boss 9 Telugu: ఓటింగ్ లో సుమన్ శెట్టి టాప్.. లాస్ట్ లో శ్రష్టి వర్మ, ఫ్లోరా సైనీ!

బిగ్ బాస్ సీజన్-9 మొదలై అప్పుడే నాలుగు రోజులు పూర్తయింది. హౌస్ లో పదిహేను మంది కంటెస్టెంట్స్ ఉండగా దాదాపు అందరి నిజస్వరూపాలు బయటకొచ్చాయి. మొన్నటి ఎపిసోడ్ లో సంజన చేసిన గుడ్డు దొంగతనం వల్ల ఓనర్స్ అండ్ రెంటర్స్ మధ్య పెద్ద గొడవ జరిగింది. దాంతో అందరు తనని టార్గెట్ చేసి నామినేట్ చేశారు.  ఇక హౌస్ లో‌ పదిహేను మంది కంటెస్టెంట్స్ ఉంటే వారిలో తొమ్మిది మంది నామినేషన్ లో ఉన్నారు. రాము రాథోడ్, డీమాన్ పవన్, ఫ్లోరా సైనీ, తనూజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్, శ్రష్టి వర్మ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ నామినేషన్ లో ఉన్నారు. బుధవారం నుంచి ఓటింగ్ లైన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ ఓటింగ్‌లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. 7/G బృందావన కాలనీ, జయం వంటి సినిమాలతో పాటు దాదాపు మూడొందల పైగా చిత్రాలలో కమెడియన్‌గా పనిచేసిన సుమన్ శెట్టి టాప్‌లోకి వచ్చేశాడు. ఇరవై నాలుగు శాతం ఓట్లతో సుమన్ శెట్టి అత్యధికంగా ఓట్లని పొందాడు . రేస్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నా వాళ్లందర్నీ వెనక్కి నెట్టి సుమన్ శెట్టి టాప్‌లోకి వచ్చేశాడు. ఆ తరువాత ఇరవై శాతం ఓట్లతో సీరియల్ నటి తనూజ గౌడ ఉంది. ఇక కమెడియన్ ఇమ్మాన్యుయల్ పదిహేను శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంటే.. డీమన్ పవన్ పదకొండు శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ వారం గొడవలకు కారణమైన సంజనా గల్రానీ ఎనుమిది శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉండగా రాము రాథోడ్‌‌కి కూడా ఎనిమది శాతం ఓట్లే పడ్డాయి.  రీతూ చౌదరి‌కి కేవలం ఆరు శాతం ఓట్లు పడ్డాయి. ఇక ఫ్లోరా సైనీ, శ్రష్టి వర్మలు రెండు శాతం ఓట్లతో చివరి స్థానంలో ఉన్నారు. ఈ అన్ అఫీషియల్ ఓటింగ్‌ని బట్టి చూస్తే.. ఫ్లోరా సైనీ, శ్రష్టి వర్మ ఈ ఇద్దరిలో ఒకరు తొలివారంలో బిగ్ బాస్ హౌస్‌ను వీడొచ్చు. మన అంచనా ప్రకారం.. శ్రష్టి వర్మ ఈవారం సేఫ్ అయ్యి ఫ్లోరా సైనీ ఎలిమినేట్ కావడానికే ఎక్కువ అవకాశం ఉంది. శ్రష్టి వర్మ హౌస్‌లో ఉంటే కంటెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్లోరా సైనీ అలియాస్ ఆశా సైనీ ఈవారం కాకపోతే వచ్చేవారం అయినా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లాల్సిందే. అలా పంపిచడానికే సీనియర్, సీరియల్ ఆర్టిస్ట్‌లను తీసుకొస్తుంటారు.  

గంగపై నింద వేసిన ఇషిక.. పాప మిస్ అవుతుందా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -53 లో..... మక్కం ని తీసుకొని గంగ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. ఇన్‌స్పెక్టర్ కి గతంలో ఒకమ్మాయికి ఇలా జరిగింది.. ఒకతను ఆమ్మాయిని గెస్ట్ హౌస్ కి తీసుకొని వెళ్ళాలనుకున్నాడు నేను అడ్డుకున్నాను.. అతన్ని చూడలేదు. కానీ ఆ కార్ నెంబర్ గుర్తు ఉందని గంగ చెప్తుంది. ఇందాక ఆ కార్ నంబర్ గల కార్ కనిపించింది కానీ నేను వెళ్ళేలోపే వెళ్ళిపోయిందని గంగ చెప్తుంది. అంటే నువ్వు ఇందాక స్పీడ్ గా వచ్చింది అందుకా అని మక్కా అంటాడు. ఎందుకు గంగ ఇవ్వన్నీ.. నువ్వే ప్రాబ్లమ్స్ లో ఉండి రుద్ర సర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నావ్ అ మక్కం అనగానే అలా అనుకోవద్దు మనిషికి మనిషే సాయం.. నన్ను రుద్ర సర్ అలా అనుకోబట్టే కాపాడారు కదా అని గంగ అంటుంది. గంగ చెప్పిన నంబర్ ఇన్‌స్పెక్టర్ నోట్ చేసుకొని మేమ్ కనుక్కుంటామని అంటాడు. ఆ తర్వాత గంగ మక్కంని తీసుకొని బయటకు వస్తుంది. అప్పుడే చిన్ని వాల్ల వార్డెన్ ఫోన్ చేసి మీరు వస్తానన్నారు కదా ఇక రాకండి విసిటింగ్ హౌర్స్ అయిపోయాయి మళ్ళీ సర్ కోప్పడుతారని చెప్పగానే అయ్యో పాపని కలవలేదు.. మిస్ అవుతుంది. ఈ రోజు కూడా పాప చెప్పిన అతన్ని చూడలేదని అనుకుంటుంది. ఆ తర్వాత ఇందుమతి దగ్గరికి‌ ఇషిక వెళ్లి ఆంటి మీ నెక్లెస్ కావాలి ఇస్తారా అని అడుగుతుంది ఇస్తానని వెళ్లి లాకర్ లో చూసేసరికి నెక్లెస్ ఉండదు.. నా నెక్లెస్ పోయిందని ఇషిక చెప్తుంది.  ఇంట్లో అందరిని పిలిచి విషయం చెప్తుంది ఈ దొంగతనం ఈ గంగ వాళ్ళ నాన్న పైడిరాజు చేసి ఉంటాడని ఇందుమతి అంటాడు. నేను ఏం తియ్యలేదని పైడిరాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu :శ్రీవల్లి పెట్టిన చిచ్చు.. ప్రేమ తప్పించుకుంటుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -261 లో... నర్మద దగ్గరికి శ్రీవల్లి వెళ్లి.. సాగర్ ఏం ఎగ్జామ్ రాసాడా అని అడుగుతుంది. అంటే మా ఫ్రెండ్ మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్ దగ్గర చూసిందట అని శ్రీవల్లి అనగానే నర్మద షాక్ అవుతుంది. అదేం లేదు మేమ్ పెళ్లికి వెళ్ళామని నర్మద స్ట్రాంగ్ గా చెప్తుంది. వెళ్తే పెళ్లిలో దిగిన ఫొటోస్ చూపించమని శ్రీవల్లి అడుగుతుంది. నువ్వు అడుగుతావని తెలియక దిగలేదని నర్మద కోపంగా సమాధానం చెప్తుంది. ఆ తర్వాత ప్రేమ దగ్గరికి శ్రీవల్లి వెళ్లి నువ్వు ఒక అబ్బాయి వెంట పరుగెత్తడం చూసానని అంటుంది. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావోనని శ్రీవల్లిపై ప్రేమ కోప్పడుతుంది. ఆ తర్వాత ప్రేమ కళ్యాణ్ తరుముతున్న ఫోటో పేపర్ లో వస్తుంది. అది శ్రీవల్లి కంట పడుతుంది. వెంటనే ఈ విషయం మావయ్య గారికి చెప్పాలని అనుకుంటుంది. మరొకవైపు అమూల్య కాలేజీకి వెళ్తుంటే విశ్వ చూసి నవ్వుతాడు. అమూల్య చెప్పు చూపిస్తుంది. అదంతా భద్రవతి చూస్తుంది. అది అంత ఈజీగా ట్రాప్ లో పడేటట్టు లేదని విశ్వ అనగానే ఆ ఇంట్లో ఒకరి సపోర్ట్ కావాలి. అప్పుడు ఈజీ అవుతుందని భద్రవతి అంటుంది. అప్పుడే శ్రీవల్లి వాళ్ళకి బయట కన్పిస్తుంది. ఆ శ్రీవల్లి తన అమ్మ గ్రిప్ లో ఉంటుంది‌. వాళ్ళ అమ్మ మనం చెప్పినట్టు వినేలా చెయ్యాలని భద్రవతి అంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి పేపర్ తీసుకొని వెళ్లి రామరాజుకి చూపిస్తుంది. అది రామరాజు చూసి షాక్ అవుతుంది. ఆ అబ్బాయి ఎవరు ప్రేమ అని రామరాజు అడుగుతాడు. తరువాయి భాగంలో ప్రేమకి వచ్చిన బొకేని శ్రీవల్లి తీసుకుంటుంది. అది తీసుకొచ్చి  ధీరజ్ కి ఇస్తుంది. అసలు ఆ కొరియర్ లో ఏముంది.. ప్రేమ ఎందుకు టెన్షన్ పడుతుందని కొరియర్ ఓపెన్ చెయ్యాలని అనుకుంటాడు ధీరజ్. అప్పుడే ప్రేమ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : శౌర్య బర్త్ డే.. దశరథ్ పై శివన్నారాయణ సీరియస్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -460 లో....బావకి తన ప్రాణధాత గురించి తెలియడమేంటి.. అసలు నాకేం అర్థం అవడం లేదని జ్యోత్స్న అనుకుంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని టెన్షన్ పడుతుంటే అప్పుడే దాస్ ఫోన్ చేసి.. నీ తమ్ముడు ఎవరికో ఆక్సిడెంట్ చేసాడు.. పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు.. నువ్వే కాపాడాలని రిక్వెస్ట్ చేస్తాడు. సరే నాన్న అని జ్యోత్స్న అంటుంది. అప్పుడు పెళ్లి అపురా అంటే చివరి నిమిషంలో ఆ కాశీ గాడు హ్యాండ్ ఇచ్చాడు.. ఇప్పుడు కూడా అంతే నేను హెల్ప్ చేస్తానని చెప్పి చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తానని జ్యోత్స్న అనుకుంటుంది. అప్పుడే పారిజాతం వస్తుంది. గ్రానీ మనల్ని మోసం చేసిన వాళ్ళని మోసం చెయ్యడం కరెక్టే కదా అని అడుగుతుంది. కరెక్టే అని పారిజాతం అంటుంది. నీ మనవడికి ఇలా జరిగిందని చెప్తే గుండెపట్టుకుంటావ్ కానీ చెప్పనని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు శౌర్య బర్త్ డే.. అందరు బర్త్ డే అని మర్చిపోయినట్లు యాక్టింగ్ చేస్తారు. శౌర్య గుర్తు చెయ్యగానే అందరు విష్ చేసి మాకు ముందే తెలుసని అంటారు. ఆ తర్వాత దశరథ్ పొరపాటుగా సుమిత్ర అని అంటాడు. మళ్ళీ ఆగిపోతాడు. మీరు కావాలని పిలిచారని సుమిత్ర అంటుంది. సారీ అని దశరథ్ అనగానే నన్ను క్షమించండి నేను ఇలా ఉండలేను.. నాతో మాట్లాడండి అని సుమిత్ర రిక్వెస్ట్ చేస్తుంది. అది నేను కాదు నా చెల్లి చేయ్యాలని దశరథ్ అంటాడు. శివన్నారాయణ అదంతా విని దశరథ్ పై కోప్పడతాడు. ఆడపిల్ల బాధపడితే ఈ ఇంటికి అరిష్టం అలాంటిది కాంచన బాధకి కారణమయ్యావని దశరథ్ అంటాడు. మరొకవైపు అమ్మ.. నేను ఈ రోజు మీతో వస్తానని శౌర్య అంటుంది. కానీ నువ్వు నీ బర్త్ డే అని ఎవరికి చెప్పొద్దూ.. అలా అయితేనే రా అని దీప అనగానే శౌర్య సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రేవతి‌ ముసుగుపోయింది.. రుద్రాణి ప్లాన్ సక్సెస్!

  స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -823 లో....కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి రొమాంటిక్ గా మాట్లాడుతుంటే.. అప్పుడే ఇందిరాదేవి వస్తుంది. దాంతో రాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మీరు ఇలా సంతోషంగా ఉంటే నాకు సంతోషంగా ఉందని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత కావ్య చిన్నపిల్లల వీడియోస్ చూస్తూ నవ్వుకుంటుంది. అమ్మమ్మ గారు ఈ పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో అని ఇందిరాదేవితో కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య ఫోన్ కి డాక్టర్ ఫోన్ చేస్తుంది కానీ అప్పు లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. నేను అప్పుని డాక్టర్ చెప్పండి అని అనగానే కావ్య గారు బేబీని మోయ్యాలేరు.. అబార్షన్ కంపల్సరి అని డాక్టర్ అంటుంది. దాంతో అప్పు షాక్ అవుతుంది. ఈ విషయం అక్కకి నేను తర్వాత చెప్తానని డాక్టర్ తో అప్పు అంటుంది. ఎవరు అప్పు ఫోన్ చేసింది అని కావ్య అడుగగా కస్టమర్ కేర్ అని అప్పు అంటుంది.. మరొక వైపు జగదీష్ తో రేవతి ఫోన్ మాట్లాడుతుంది. మా అమ్మ నాన్న బాబుని బాగా చూసుకుంటున్నారని మాట్లాడుతుంటే రుద్రాణి వింటుంది. అమ్మ రేవతి.. ఇలా ప్లాన్ చేసావా నీ సంగతి చెప్తానని రుద్రాణి అనుకుంటుంది. ఆ తర్వాత రేవతిని ఎలాగైనా బయటపెట్టాలని కావ్య నెక్లెస్ తీసుకొని వెళ్లి రేవతి బ్యాగ్ లో వేస్తుంది. ఆ తర్వాత నేను తీసుకొని వచ్చిన నెక్లెస్ వేసుకోలేదేంటి.. కావ్య వెళ్ళు.. తీసుకొని రా అని అపర్ణ అంటుంది. తరువాయి భాగంలో రుద్రాణి ప్లాన్ చేసి రేవతి తనతో డాన్స్ చేసేలా చేసి ముసుగుపోయేలా చేస్తుంది. అందరు రేవతిని చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సెలబ్రిటీస్ కన్నా వీళ్ళే బిగ్ బాస్ లో ఉంటే బాగుండేదనిపిస్తోంది..

  బిగ్ బాస్ అగ్నిపరీక్షను కామన్ మ్యాన్ ని హౌస్ లోకి పంపించడానికి ఏమంటా నిర్వహించారో కానీ ఈ 15 మంది కూడా జనాల్లో ఒక ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేశారు. ఐతే 15 మందిలో ప్రియా, శ్రీజ, పవన్ కళ్యాణ్, డీమన్ పవన్ , హరీష్, మనీష్ వెళ్లి అక్కడ గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. సెలబ్రిటీస్ కంటే కూడా వీళ్ళే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఈ ఆరుగురు కూడా స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో ఎం ఆడతార్రా బాబు అనిపించుకున్నారు కానీ లాస్ట్ కి వచ్చేసరికి అందరిలో ఒక ఇంటరెస్ట్ ని క్రియేట్ చేశారు. అలాగే అలాగే ఈ ఆరుగురితో పాటు ఎలిమినేట్ ఐన నాగప్రశాంత్, కల్కి, షాకిబ్, డాలియా, అనూష ఈ ఐదుగురు కూడా చాలా పోటాపోటీగా అగ్నిపరీక్షలో టాస్కులు ఆడారు. ఐతే ఇప్పుడు వీళ్లంతా ఒక జట్టుగా అయ్యి ఫొటోస్ తీసుకుని వాటిని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది కల్కి. "మన లైఫ్ లో మనకు అనుకోని ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు. నేను మిమ్మల్ని మిస్ చేసుకొని గైస్" అంటూ కల్కి టాగ్ పెట్టుకుంది. ఇక నెటిజన్స్ ఐతే వీళ్ళ పిక్స్ ని చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. "నాకెందుకో సెలబ్రిటీల కన్నా వీళ్లే హౌస్ లో ఉంటే బాగుండు అనిపిస్తుంది...బిగ్  బాస్ వలన మీరు ఫ్రెండ్స్ అయ్యారు. హౌస్  లోకి వెళ్తే కొట్టుకునే వాళ్ళు. థ్యాంక్ గాడ్  బయట  ఉండి ఫ్రెండ్స్ అయ్యారు. మీరేం బాధపడకండి ఒక్క టీవీ షో మిమ్మల్ని డిసైడ్ చేయలేదు. బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళు ఉంటే బాగుంది. మీరు బిగ్ బాస్ లో ప్లేస్ సంపాదించుకోలేదేమో కానీ ప్రజల మనస్సులో స్తానం సంపాదించుకున్నారు. వైల్డ్ కార్డు లో ఎవరైనా రావొచ్చు అని నా ఫీలింగ్. మీరంతా మాకు కూడా అలవాటై పోయారండి." అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే బిగ్ బాస్ లో సెలబ్రిటీస్ మాత్రం పెద్దగా గేమ్ ఆడుతున్నట్టు కనిపించడం లేదు. ఐతే రాబోయే రోజుల్లో బిగ్ బాస్ అనుకున్నంత రేటింగ్ ని సంపాదించలేకపోతే మాత్రం ఈ ఎలిమినేట్ ఐన పర్సన్స్ నుంచి ఎవరైనా హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ తీసుకుంటారు అనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది.

మొదటి వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళే!

  బిగ్ బాస్ మొదటి వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది . ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో భరణి, ఇమ్మాన్యుయల్ ఇద్దరు ఉండగా భరణి సుత్తిని ముందుగా పట్టుకున్నాడు. దాంతో తను సంజనని నామినేట్ చేసి సుత్తిని శ్రీజకి ఇస్తాడు కానీ శ్రీజ సంజనని కాకుండా తనూజని నామినేట్ చేస్తుంది. నువ్వేం చేసిన యాక్టింగ్ చేసినట్లనిపిస్తుందని తనూజతో శ్రీజ అంటుంది. అలా తనూజ గురించి ఓనర్స్ అందరు ఒక్కొక్కరుగా పాయింట్స్ చెప్తారు. ఎవరైన అన్నం పెడుతుంటే అన్నపూర్ణలాగా ఉండాలి.. ఏదో చేస్తేస్తున్న ఇష్టం ఉంటే తినండి అన్నట్లు ఉంటుంది నీ బిహేవియర్ అని హరీష్ అనగానే తనూజ హర్ట్ అవుతుంది. మీ బాడీ లాంగ్వేజ్ బాలేదంటు మాస్క్ మెన్ హరీష్ అన్నాడు. ఒక అమ్మాయి బిహేవియర్ పై అలా అనడం కరెక్ట్ కాదని తనూజ పక్కకి వచ్చి ఏడుస్తుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి, ఫ్లోరా సైని వంతు రాగ సుమన్ శెట్టి సుత్తి తీసుకుంటాడు. తను మొదటగా సంజనని నామినేట్ చేస్తాడు. సుత్తి తీసుకొని ప్రియకి ఇస్తాడు. ప్రియ రాముని నామినేట్ చేస్తుంది. రెంటర్స్ లో భరణిని మాత్రమే ఎవరు నామినెటే చెయ్యలేదు. దాంతో బిగ్ బాస్ అతనికి ఒక పవర్ ఇస్తాడు. ఓనర్స్ లో సుత్తి తీసుకొని వాళ్ళు ఇద్దరున్నారు. ఒకరు మనీష్ ఇంకొకరు డీమాన్ పవన్ వారిలో ఒకరిని డైరెక్ట్ నామినేషన్ లోకి తీసుకోనే వచ్చే ఛాన్స్ భరణికి వచ్చింది. డీమాన్ పవన్ ని భరణి డైరెక్ట్ నామినేట్ చేస్తాడు. దీంతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇక మొత్తం నామినేషన్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సంజన, ఫ్లోరా సెని, సుమన్ శెట్టి, రాము రాథోడ్, తనూజ, రీతూ చౌదరి, శ్రష్టి, ఇమ్మాన్యుయల్, ఓనర్స్ లో డీమాన్ పవన్ ఉన్నాడు. మరి వీరిలో మీ ఓట్ ఎవరికి.. ఎవరిని హౌస్ నుండి బయటకి పంపించాలనుకుంటున్నారు కామెంట్ చేయండి.   

రైతుబిడ్డలా నటిస్తున్న మాస్క్ మ్యాన్ హరీష్.. కంటెంట్ కోసమేగా అంటూ నెటిజన్లు ట్రోల్స్!

  బిగ్ బాస్ సీజన్-9 మొదలై నాలుగు రోజులు పూర్తి కాగా నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఎవరేంటనేది బయటపడింది. కామనర్స్ వర్సెస్ సెలెబ్రిటీస్ గా ఈ సీజన్ ఆసక్తిగా సాగుతుంది. పల్లవి ప్రశాంత్ అనగానే సీజన్-7లో రైతుబిడ్డ అంటు అతడి జర్నీనే గుర్తొస్తుంది. అతని ఫాలోయింగ్ అప్పుడు సంచలనం అయింది. నీ దగ్గర కంటెంట్ ఉంటే హోస్ట్ నాగార్జునే కాదు బిగ్‌బాస్ కూడా ఏం చేయలేడనేది వాస్తవం. ఈ విషయన్ని సీజన్-7లో అందరికి తెలిసేలా చేశాడు శివాజీ. ఆట ఆడకుండా పక్కన కూర్చున్నా.. బిగ్‌బాసా బొక్కా అని బూతులు తిట్టినా.. ఏం చేసినా కూడా శివాజీని బయటికి పంపించే ధైర్యం మాత్రం ఎవరు చేయలేకపోయారు. ఎందుకంటే ఆ సీజన్‌లో బిగ్‌బాస్‌ రేటింగ్‌కి ప్రధాన కారణం శివాజీ. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్-9లో అదే పని చేస్తున్నాడు మాస్క్‌మ్యాన్ హరీష్. మాస్క్ మ్యాన్ హరీష్ అనగానే అందరు ఎవడ్రా వీడు అనుకున్నారు. అగ్నిపరీక్షలో హరీష్ మాటలకి జడ్జెస్ స్టన్ అయ్యారు. పెళ్లాంపై చేయి ఎత్తావా.. నువ్వు ఒక లూజర్.." అంటూ అగ్నిపరీక్ష మొదటి ఎపిసోడ్‌లోనే మాస్క్‌మ్యాన్ హరీష్‌ని ఏకిపారేసింది బింధు మాధవి. కానీ తన అభిప్రాయాన్ని మార్చుకొని తిరిగి అదే నోటితో హరీష్ పేరు ప్రకటించి హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా పంపించింది బింధు. నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద విజయం. అయితే హరీష్ జర్నీ ఇక్కడితో ముగిసిపోలేదు ఇప్పుడే మొదలైంది. బిగ్‌బాస్ షోకి నేను ఒక భక్తుడ్ని అంటూ చాలాసార్లు చెప్పాడు హరీష్. ఇప్పటివరకూ జరిగిన ప్రతి సీజన్‌ని చాలా సార్లు చూశానని.. కూడా చెప్పాడు. ఆ ఏముందిలే అంతా ఊరికే చెబుతున్నాడని కొంతమంది అనుకొని ఉండొచ్చు కానీ బిగ్‌బాస్ సీజన్-9 మొదటి ఎపిసోడ్ నుండి ఇప్పటి వరకు ప్రతీ దాంట్లో ఆడియన్స్‌కి మాత్రం ఒక్క విషయం అర్థమైంది. కామనర్ల నుంచి కప్పు కోసం గట్టిగా నిలబడే కంటెస్టెంట్ మాస్క్‌మ్యాన్ హరీష్ అన్నది తొలి ఎపిసోడ్‌తోనే తేల్చేశాడు. హౌస్‌లో అసలు ఏం జరుగుతుందో తెలియని.. తెల్లముఖాలని ఒక ఆట ఆడుకుంటున్నాడు హరీష్. ఇక తనకి కాంపిటేషన్ అని అనుకున్నవాళ్లని ముందే సైలెంట్ చేసేలా పక్కాగా పనిలోకి దిగిపోయాడు.  నిన్న జరిగిన ఎపిసోడ్ లో భరణితో గొడవకి దిగడం.. రెంటర్స్ ఆకలి అని వచ్చినప్పుడు సాయం చేసినట్టు నటించడం.. వాళ్లు అడగకపోయిన వెళ్లి ఏదో ఒకటి చేయడం.. ఇలా సింపథీ గేమ్ ప్లే చేస్తున్నాడు మాస్క్ మ్యాన్ హరీష్.. ఫస్ట్ మాస్క్ పెట్టుకొని‌ వచ్చినప్పుడే గెస్ చేయాల్సిందిరా నువ్వు మాస్క్ పెట్టుకొని గేమ్ ప్లే చేస్తున్నావంటూ హరీష్ పై నెట్టింట తెగ ట్రోల్స్ వస్తున్నాయి.  

Bigg boss 9 Telugu : ఒక్క గుడ్డు తెచ్చిన తంటా..సంజన యాక్టింగ్ మాములుగా లేదుగా!

  బిగ్ బాస్ సీజన్-9 మొదటి వారం నామినేషన్ ప్రక్రియ పూర్తి అయింది. నామినేషన్ అనంతరం హౌస్ మొత్తాన్ని అతలాకుతలం చేసిన ఏకైక కంటెస్టెంట్ సంజన. ఇన్ని సీజన్ లో ఇలాంటి కంటెస్టెంట్స్ ని ఎవరు చూసి ఉండరనేంతగా తన యాక్టింగ్ పర్ఫామెన్స్  ఉంది. ఓనర్స్ ని అడగకుండా రెంటర్స్ ఎవరు ఏది తీసుకోకూడదు.. అలాగే వాళ్ళ పర్మిషన్ లేకుండా కనీసం ఇంట్లోకి వెళ్లొద్దు..  ఇలా కొన్ని బిగ్ బాస్ రూల్స్ ఉన్నాయి.. కానీ సంజన రూల్స్ బ్రేక్ చేసింది. ఫస్ట్ ఓనర్స్ ని సంజన కప్ కాఫీ అడిగింది. వాళ్ళు ఇవ్వమని చెప్పారు.. ఇలా ఇస్తే అందరు అడుగుతారు ఇవ్వమని మనీష్, ప్రియ అంటారు. ఆ తర్వాత ప్రియ గుడ్లు లెక్కపెడుతుంది. అందులో ఒకటి మిస్ అవుతుంది. ఎవరు తిన్నారని రెంటర్స్ ని ప్రియ అడుగుతుంది. ఎవరిని అడిగినా మేమ్ తినలేదని అంటారు.  నేను తిన్నానని రాముతో సంజన చెప్తుంది. కాసేపు చూసి నేను తినలేదని చెప్తానని రీతూతో సంజన అంటుంది. అసలు మిమ్మల్ని హౌస్ లోకి రమ్మని చెప్పడం తప్పైందని మనీష్, ప్రియా రెంటర్స్ పై కోప్పడుతారు. నీ ఒక్కదాని వల్ల మాకు అందరికి శిక్ష అని భరణితో పాటు మిగతా వాళ్ళు సంజనపై అరుస్తారు. సంజన మాత్రం ఏం పట్టనట్టు కూల్ గా కూర్చొని ఉంటుంది. తనే తింది అని ఓనర్స్ తో చెప్తాడు రాము. నువ్వు తినడం ఎవరు చూసారని ప్రియ వాళ్ళు సంజనని అడుగగా.. తనూజ, భరణి, శ్రష్టి చూసారని సంజన చెప్తుంది. అంటే ఇప్పటివరకు అడిగాం.. ఎవరు తిన్నారని ఎవరు చెప్పాలేదని రెంటర్స్ పై ఓనర్స్ కోప్పడతారు. మధ్యలో ఈ టాపిక్ గురించి హరీష్, భరణికి మధ్య పెద్ద గొడవ అవుతుంది. ఆ తర్వాత సంజనపై రీతూ చౌదరి కోప్పడుతుంది. చివరికి సంజన ఏడుస్తూ అందరి నోళ్లు మూతపడేలా చేసింది. ఇలా సంజన తన నటన అనుభవాన్ని ఇక్కడ చూపిస్తూ కంటెస్టెంట్స్ అందరికి చుక్కలు చూపించింది.

Jayam serial : పోలీసులు వీరుని పట్టుకుంటారా..గంగ కష్టం ఫలించేనా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -52 లో.....గంగ ఏ తప్పు చెయ్యలేదు.. అసలు ఇదంతా చేస్తున్న వాడి టార్గెట్ ఎవరని కనిపెట్టడానికి ఇదంతా చేసాను.. మీరు సీసీటీవీ ఫుటేజ్ మళ్ళీ రికలెక్ట్ చెయ్యాండి అని చెప్పి పోలీసులని పంపిస్తాడు రుద్ర.... అక్కడ వీరు మనిషి రుద్రకి డిఫరెంట్ గా కన్పిస్తాడు. ఎవరు నువ్వు అని రుద్ర అడుగగా నేనే పెట్టించాను బావ.. వాళ్ళ నాన్న మావయ్య గారికి తెలిసట అని వీరు కవర్ చేస్తాడు. ఆ తర్వాత రుద్ర, పెద్దసారు ఇంకా గంగ కలిసి పైడిరాజుతో మాట్లాడతారు. ఇది గాని నీ వెనకాలున్నవాళ్లు చెయ్యడం లేదు కదా అని  పైడిరాజుని అడుగుతాడు రుద్ర. నాకేం తెలియదని పైడిరాజు అంటాడు. ఆ తర్వాత రుద్రకి గంగ థాంక్స్ చెప్పాలని ట్రై చేస్తుంది. ఏదో ఒకరకంగా థాంక్స్ చెప్పాడానికి ప్లాన్ చేస్తుంది. అది ఫెయిల్ అయి రుద్ర వచ్చి గంగ పై కోప్పడతాడు. ఆ తర్వాత గంగ, మక్కం స్కూటీ పై వెళ్తుంటే.. అప్పుడే గతంలో ఒకమ్మాయిని ఏడిపించి కార్ లో పోయినప్పటి వ్యక్తి ఉన్న కార్ కనిపిస్తుంది. ఆ కార్ నెంబర్ గుర్తు పట్టి ఫాలో అవుతుంది. అది వీరుది కానీ వీరు డైవర్ట్ అయి వెళ్ళిపోతాడు. గంగ పోలీస్ స్టేషన్ కి వెళ్లి రెండు నెలల క్రితం ఒకతను అమ్మాయిని ఏడిపిస్తు కన్పించాడు. ఒకతను కార్ లో ఉన్నాడు.. తన బాస్ తో గెస్ట్ హౌస్ కి తీసుకొని వెళ్ళాలని.. ఆ కార్ లో ఉన్నతని మనిషి వచ్చి అమ్మాయిని ఇబ్బంది పెట్టారని ఎస్ఐకి గంగ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : అమూల్యని ట్రాప్ చేయమని చెప్పిన భద్రవతి.. ప్రేమ దొరికిపోయిందిగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -260 లో..... రామరాజు, వేదవతిల చిన్నకూతురు అమూల్య ముగ్గురు కలిసి ఆరుబయట కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటారు. అదంతా భద్రవతి చూసి నా కుటుంబానికి సంతోషం లేకుండా చేసి నువ్వు సంతోషంగా ఉంటావా అని భద్రవతి బాధపడుతుంది. అప్పుడే విశ్వ వస్తాడు. వాళ్ళని మనం ఏం చెయ్యలేము అత్త అంటాడు. నువ్వు ఆ రామరాజు చిన్నకూతురు అమూల్యని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లిచేసుకో... సంసారం చెయ్యడానికి కాదు.. తనని బాధపెట్టడానికి ఆ ధీరజ్ గాడు ప్రేమని ఎలా ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు.. మనం అనుభవిస్తున్న బాధని వాళ్ళు అనుభవించాలని భద్రవతి అనగానే విశ్వ సరే అంటాడు. ఆ తర్వాత  నర్మద, ప్రేమల విషయం రామరాజుకి చెప్పాలనుకుంటుంది శ్రీవల్లి కానీ సాక్ష్యం సంపాదించాక చెప్పాలని ఆగిపోతుంది. ఆ తర్వాత ప్రేమ డల్ గా ఉంటే వేదవతి, నర్మద వచ్చి తను నవ్వేల ఏదో ఒకటి చేస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు నర్మదకి సాగర్ ముద్దు పెడుతుంటే శ్రీవల్లి వచ్చి నర్మద నీతో మాట్లాడాలని అంటుంది. సాగర్ వెళ్ళిపోతాడు. సాగర్ ఎగ్జామ్ రాసాడు కదా అని శ్రీవల్లి అనగానే నర్మద షాక్ అవుతుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ వెంట ప్రేమ కర్ర పట్టుకొని పరిగెత్తుతున్న ఫోటో పేపర్ లో వస్తుంది. అది రామరాజుకి చూపిస్తుంది శ్రీవల్లి. ఏంటి ఇది అని ప్రేమని  రామరాజు అడుగుతాడు. ప్రేమ వంక ధీరజ్ చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దీపలా మాట్లాడిన సుమిత్ర.. ప్రాణధాతని కార్తీక్ చూపిస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -459 లో.. జ్యోత్స్నకి కొద్ది రోజులు టైమ్ ఇస్తాడు శివన్నారాయణ. ఈ లోపు రెస్టారెంట్ లాభాల్లోకి రాకపోతే సీఈఓని మార్చేస్తానని చెప్తాడు. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. నమ్మకం అనేది ఒకసారి పోతే ఇలాగే ఉంటుంది.. తర్వాత నమ్మకం కోసం ప్రయత్నం చేస్తే అది కలగదని జ్యోత్స్నతో సుమిత్ర చెప్తుంది. ఇదేంటే మమ్మీ అసలు దీపలాగా మాట్లాడుతుందని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు కిచెన్ లో ఉండి సుమిత్ర మాటలు వింటుంది దీప. అప్పడే దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. సుమిత్ర అత్త మాటలు విన్నావా.. అచ్చం నీలాగే మాట్లాడిందని కార్తీక్ అంటాడు. అవును కానీ అవి నాక్కూడా వర్తిస్తాయి. ఒకసారి నమ్మకం పోతే తిరిగి సంపాదించలేమని దీప అంటుంది. నిన్ను మీ అమ్మని కలుపుతానన్నాను కదా అని కార్తీక్ అంటాడు. ముందు మా అమ్మానాన్నని కలుపమని దీప అంటుంది. ఎప్పుడు అదేనా కొంచెం కాఫీ ఇవ్వమని కార్తీక్ అంటాడు. దాంతో  కార్తీక్ పై దీప చిర్రుబుర్రలాడుతుంది. మరొకవైపు కాశీ యాక్సిడెంట్ చేశాడని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. నా భర్తని కాపాడండి అని శ్రీధర్ ని స్వప్న రిక్వెస్ట్ చేస్తుంది. మీరు చెయ్యరని కార్తీక్ కి ఫోన్ చేస్తుంటే తన ఫోన్ లాక్కొని స్వప్న, కావేరిలని లోపల ఉంచి శ్రీధర్ డోర్ పెడతాడు. ఆ తర్వాత జ్యోత్స్నతో సుమిత్ర మాట్లాడుతుంది. నీకు ఒకసారి నచ్చితే ఎంతకైనా తెగిస్తావు.. చిన్నప్పుడు కలువ పువ్వు కోసం కార్తీక్ ని కోనేటిలో నెట్టావ్.. ఒక పాప వచ్చి కాపాడిందని పారిజాతంతో సుమిత్ర చెప్తుంటే అప్పుడే కార్తీక్ కూడా  వస్తాడు. ఆ ప్రాణధాత లాకెట్ ఇంకా నా దగ్గర ఉందని కార్తీక్ చూపిస్తాడు. ఆ ప్రాణాధాత కన్పించింది మా వీధిలోనే ఉంటుంది అని కార్తీక్ అనగానే.. నేను తనని కలవాలని సుమిత్ర అంటుంది. ఆ అమ్మాయి వీళ్ళ వీధేనట.. అక్కడ వరకు వెళ్లి కాంచనని కలవకుంటే దశరథ్ తో మళ్ళీ లొల్లి అని పారిజాతం అంటుంది. ఇంకెప్పుడైన వెళదామని సుమిత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది. బావ కళ్ళలో ఏదో కాన్ఫిడెన్స్ కన్పిస్తుందని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రుద్రాణి ప్లాన్ కి స్వరాజ్ బ్రేక్.. రేవతిపై ఆ నింద పడనుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -822 లో.....రుద్రాణి తీర్థంలో ఏదో మందు కలుపుతుంది. అది అప్పు కావ్య తాగితే వాళ్ళ ప్రెగ్నెంట్ పోతుందని ప్లాన్ చేస్తుంది. రుద్రాణి అది కలిపి వెనక్కి తిరుగుతుంది. అక్కడ స్వరాజ్, కనకం ఉంటారు. వాళ్ళు చూసారేమోనని భయపడుతుంది.. కానీ వాళ్ళు చూడరు. నాకు జ్యూస్ తీసుకొని రమ్మన్నాను కదా ఇంకా తీసుకొని రావడం లేదేంటని రుద్రాణిని స్వరాజ్ అడుగుతాడు. నువ్వు ఇప్పుడు జ్యూస్ తీసుకొని రాకపోతే మా ఫ్రెండ్ కి చెప్తానని బెదిరిస్తాడు. దాంతో రుద్రాణి సరే అంటుంది. ఆ తర్వాత వినాయకుడి పూజ జరుగుతుంది. తీర్థం పంతులు అందరికి ఇస్తాడు. కావ్యకి ఇవ్వబోతుంటే అప్పుడే స్వరాజ్ తీర్థానికి తాకుతాడు.. అది కిందపోతుంది. దాంతో స్వరాజ్ పై రుద్రాణి కోప్పడుతుంది. వేరొకరి ఇంటికి వచ్చినప్పుడు.. పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని రేవతిపై కోప్పడుతుంది. బాబు ఏదో చూడకుండా చేసాడు. ఆ మాత్రం దానికే అంతలా అరవాలా అని రుద్రాణిపై అపర్ణ కోప్పడుతుంది. నువ్వు ఇప్పుడు స్వరాజ్ వాళ్ళ అమ్మకి సారీ చెప్పాలని అపర్ణ అనగానే రుద్రాణి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కావ్య కిచెన్ లో ఉండగా.. రాజ్ వెనకాల నుండి వచ్చి ముద్దుపెడతాడు. ఏంటి ఇలా వచ్చారని కావ్య అడుగుతుంది. బెడ్ రూమ్ లో కొంచెం బ్యాలెన్స్ ఉండే కదా అని రాజ్ రొమాంటిక్ గా మాట్లాడతాడు. అప్పుడే ఇందిరాదేవి రావడంతో ఏదో కవర్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో స్వరాజ్ వాళ్ళు ఎవరో కనిపెట్టాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. రేవతి బ్యాగ్ లో నగలు రుద్రాణి వేస్తుంది. అత్తయ్య నెక్లెస్ లేదని అపర్ణ దగ్గరికి కావ్య వస్తుంది. ఈ ఇంటికి కొత్తగా వచ్చిన వాళ్ళ పని అయి ఉంటుందని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మధు అర్జెంటుగా మీ ఆవిడని కట్ చెయ్.. అమ్మో వీడు వైల్డ్ ఆర్టిస్ట్

ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి సూపర్ స్టార్స్ రి-యూనియన్ నిర్వహించారు. ఈ షోకి అలనాటి సీనియర్ సీరియల్ యాక్టర్స్ వచ్చారు. రాజ్ కుమార్, సునయన, సీనియర్ ఆర్టిస్ట్ మధుసూదన రావు-రుతురాగాలు శృతి, కౌశిక్, ఇంద్రనీల్ - మేఘన, సీనియర్ నటుడు ప్రదీప్, ప్రీతి నిగమ్ వంటి వాళ్లంతా వచ్చారు. శ్రీముఖి వీళ్లందరితో మంచి ఫన్ చేసింది. అలనాటి తారలతో అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం అంటూ చెప్పింది శ్రీముఖి. "ప్రదీప్ గారు ఇక్కడ ఉన్న లేడీస్ లో ఫేవరేట్ ఒక్కరినే మాత్రమే సెలెక్ట్ చేసుకోమంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు" అని అడిగాడు. "శ్రీముఖినే" అని చెప్పాడు ప్రదీప్. ఇక శృతి వాళ్ళాయన మధుసూదన్ రావును పట్టుకుని "మధు ఈవిడ నీకు బాగా లైన్ వేస్తోంది..నాకు నచ్చట్లేదు. ఈవిడను ట్రాక్ లోంచి కట్ చెయ్ " అంటూ మధు వాళ్ళావిడ శృతిని చూపిస్తూ అడిగింది. "దా దా" అంటూ మధు శ్రీముఖి చేతిని పట్టుకుని వెళ్ళబోయాడు. దానికి శ్రీముఖి ఆ అని నోరెళ్లబెట్టింది. వెంటనే సునయన వచ్చి శృతిని పట్టుకుని "ఇదేదో అపశ్రుతిలా ఉంది" అంటూ చెప్పేసరికి శృతి అవాక్కయ్యింది. ఇక రాజ్ కుమార్ ని చూసి "మిమ్మల్ని చూసిన ప్రతీ సారి ముద్దుగా ఒక్కటే పిలవాలనుకుంటున్నాను. రాజా" అని పిలిచేసరికి రాజ్ కుమార్ కూడా సిగ్గుపడిపోయాడు. "రాజా రాజాధిరాజా" అనే సాంగ్ కి డాన్స్ చేసాడు. ఇక సునయనని పిలిచి "అబ్బాయిల్లో ఒక్కళ్లను సెలెక్ట్ చేసుకోమంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు" అని అడిగింది శ్రీముఖి. "కౌశిక్ నా ఫస్ట్ హీరో కాబట్టి..అమ్మో వీడు వైల్డ్ ఆర్టిస్ట్" అని కౌంటర్ వేసేసరికి కౌశిక్ షాకైపోయాడు.

ఆది - రాంప్రసాద్ గేస్... షాక్‌లో వర్ష

  జబర్దస్త్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో నాటీ నరేష్ చేసిన కామెంట్ వింటే వామ్మో అనిపిస్తుంది. వర్ష చిలకాకుపచ్చ చీరతో, నరేష్ కూడా లుంగీ కట్టుకుని స్టేజి మీదకు భార్యాభర్తల్లా వచ్చి "రారా ఉల్లాస వీరుడా" అనే సాంగ్ కి డాన్స్ చేశారు. "ఆది - రాంప్రసాద్ లాగా మీరు రొమాంటిక్ గైలా ఉండండి" అంటూ వర్షా ముద్దుగా చెప్పింది. దాంతో నరేష్ వెంటనే " వాళ్ళు గైస్ కాదు గేస్" అన్నాడు అనేసరికి వర్ష నోరెళ్లబెట్టింది. ఇక రాకెట్ రాఘవ, సీనియర్ నటి అన్నపూర్ణ కలిసి స్కిట్ వేశారు. "కరెంట్ పోయింది అని ఎవరు కంప్లైంట్ ఇచ్చారు" అంటూ ఒక కరెంట్ ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి వచ్చి "కరెంట్ ఉంది కదండీ" అన్నాడు. వెంటనే అన్నపూర్ణమ్మ "ఇంట్లో కరెంట్ ఉందయ్యా మా అల్లుడిలోనే కరెంట్ పోయింది " అని చెప్పింది. ఆ మాటకు రాఘవ పరువు మొత్తం పోయినట్టైంది. ఇక ఫైనల్ గా రాకింగ్ రాకేష్ - సుజాత జోడి స్కిట్  వేశారు. "పెళ్ళికి ముందు 24 గంటలు టాకింగ్..పెళ్లయ్యాక 4 గంటలే టాకింగ్. మిగతా 20 గంటలు ఎక్కడ టాకింగ్" అంటూ ఈ జంట మధ్య వచ్చిన గొడవను సాల్వ్ చేయడానికి వచ్చిన పెద్దమనుషులు మనో, ఖుష్బూని అడిగింది సుజాత. ఇక ఈ స్కిట్ ఎలా ఉంది అంటూ రష్మీ ఆడియన్స్ ని అడిగింది. దాంతో అందరూ సూపర్ అంటూ చెప్పారు. "ఇంట్లో పెళ్ళాం ప్రేమ ఇవ్వకపోతే బయటకు వెళ్లి కొనుక్కోవాలా. మీరు ఏమంటారు" అని రష్మీ అడిగింది. దాంతో ఆడియన్స్ లో ఒకతను లేచి "ఈ ప్రశ్నకు మౌనమే సమాధానం" అని చెప్పాడు.