Illu illalu pillalu : దొంగతనం ఎవరు చేశారని ఆరా తీసిన రామరాజు.. టెన్షన్ లో ఆనందరావు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -255 లో.....తిరుపతి ఉదయం నిద్రలేచేసరికి తన చేతికి ఉండాల్సిన  కలశం ఉండదు.. నా చెయ్ ఫ్రీగా ఉందని తిరుపతి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంట్లో అందరిని పిలిచి ఆ విషయం చెప్తాడు. మరి ఆ కలశంలోని నగలు ఏవని రామరాజు అడుగుతాడు. ఏమోనని తిరుపతి అనగానే రామరాజు తనపై కోప్పడతాడు. నిద్రలో నడిచే అలవాటు ఉంది కదా అతను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు.. ఆ కలశంతో పాటు నగలు కూడా ఎక్కడో పోయినట్లు ఉన్నాయని ఆనందరావు అనగానే బుద్ధి ఉండి మాట్లాడుతున్నావా.. మాట్లాడితే నమ్మేలా ఉండాలని రామరాజు అంటాడు. ఆ తర్వాత అందరు కలిసి ఆ కలశం ఎక్కడుందో వెతుకుతారు. ప్రేమకి అప్పుడే కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది.. అది చూసి ప్రేమ కాలు పట్టుకొని ముళ్ళు తీస్తాడు ధీరజ్. మరొకవైపు నర్మదని సాగర్ ఎత్తుకొని గోడకి అటువైపు కలశం ఉందేమోనని చూడమని చెప్తాడు. నర్మదని ఎత్తుకొని సాగర్ రొమాంటిక్ గా మాట్లాడుతుంటాడు. ఆ తర్వాత అందరు లోపలికి వస్తారు. నాకు ఈ దొంగతనం వెనక చాలా అనుమానాలున్నాయి. అసలు కలశంలో నగలున్నట్లు శ్రీవల్లి వాళ్ళ అమ్మనాన్నకి మన కుటుంబానికి మాత్రమే తెలుసు కదా.. దొంగ ఇంట్లో ఏది పట్టుకుపోకుండా కేవలం ఆ కలశం తీసుకొని వెళ్ళాడంటే నాకు డౌట్ గా ఉందని రామరాజు అనగానే ఆనందరావు టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : సుమిత్రపై దశరథ్ ఫైర్.. దీపని గెంటేశారుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -454 లో.... శివన్నారాయణతో కార్తీక్ బయటకు వస్తాడు. కార్ ఆపమని కార్తీక్ తో శివన్నారాయణ చెప్తాడు. కార్ దిగి జరిగిన దానికి మీ అమ్మ ఏమంటుందని శివన్నారాయణ అడుగుతాడు. నేను చెప్తే మీరు నమ్మరని కాంచనకి కార్తీక్ ఫోన్ చేస్తాడు.  జరిగింది మర్చిపోయావా అని స్పీకర్ లో పెట్టి మాట్లాడతాడు. మర్చిపోయేంత చిన్న విషయం కాదు అది.. దీని అంతటికి కారణం మా నాన్న.. ఆయన ముందు చేసిన తప్పుల వల్లే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. జ్యోత్స్న మాటలు వింటున్నాడు. నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఇంట్లో నుండి బయటపడు.. అది ఇల్లు కాదు నాగుపాము పడగే.. ఆ ఇంట్లో మా అన్నయ్యని తప్ప నేను ఎవరిని నమ్మలేనని కాంచన అంటుంటే శివన్నారాయణ బాధపడతాడు. ఆ తర్వాత శ్రీధర్ దగ్గరికి దాస్ వస్తాడు. నేను శ్రీశైలం వెళ్తున్నాను చెల్లి ముడుపు ఇస్తానంటే వచ్చానని శ్రీధర్ తో దాస్ అంటాడు. కావేరి ముడుపు తీసుకొని వచ్చి దాస్ కి ఇస్తుంది. ఎందుకు ముడుపు అని కావేరీని అడుగుతాడు శ్రీధర్. శౌర్యకి తమ్ముడు రావాలని అని కావేరి అనగానే శ్రీధర్ షాక్ అవుతాడు. ఆ కార్తీక్, దీపలకి గనుక కొడుకు పుడితే దీప ప్లేస్ పర్మినెంట్ అవుతుంది.. అలా అవ్వకూడదని శ్రీధర్ అనుకుంటాడు. మరొకవైపు కాంచన కుటుంబానికి సారీ చెప్పమని సుమిత్రతో దశరథ్ అంటాడు. మమ్మీ చెప్పదని జ్యోత్స్న అంటుంది. అయితే నా మాట కూడా విను.. నువ్వు కాంచన కుటుంబానికి సారీ చెప్పేవరకు నేను నిన్ను క్షమించలేనని.. నీతో మాట్లాడనని సుమిత్రతో దశరథ్ అంటాడు. మమ్మీ తప్పేముంది.. అంత పెద్ద శిక్ష వేస్తున్నావని జ్యోత్స్న అంటుంది. అదంతా దీప విని బాధపడుతుంది. దీనికి కారణం నువ్వే కదా అని దీపని జ్యోత్స్న లాక్కొని వెళ్లి బయటకు గెంటేస్తుంది. ఎప్పుడు నా భర్త ఇలా మాట్లాడలేదు.. నీ వల్లే ఇదంతా అని దీపపై సుమిత్ర కోప్పడుతుంది. మళ్ళీ దీపని గుమ్మం దగ్గర నుండి గెంటేయ్యబోతుంటే కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahamamudi : రేవతిని కుటుంబానికి దగ్గర చెయ్యాలనుకుంటున్న రాజ్.. రుద్రాణి కొత్త ప్లాన్! 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -817 లో.....దుగ్గిరాల కుటుంబం మొత్తం వినాయకుడి పండుగ చెయ్యాలని నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడే కనకం కృష్ణమూర్తి ఎంట్రీ ఇస్తారు. ఈ పండగకి నా కూతుళ్ళని మా ఇంటికి తీసుకొని వెళ్తానని ఇందిరాదేవిని అడుగుతుంది కనకం. అవసరం లేదు నా కోడలు నా ఇంట్లోనే ఉండాలని ధాన్యలక్ష్మి అంటుంది. నీకు ప్రేమ వచ్చినా.. కోపం వచ్చిన భరించలేమని ప్రకాష్ అంటాడు. మీ కూతుళ్ళని అక్కడికి తీసుకొని వెళ్లి పండుగ చేసుకునే బదులు.. మీరు ఇద్దరు ఇక్కడికి వస్తే అందరం కలిసి ఇక్కడే చేసుకోవచ్చు కదా అని అపర్ణ అంటుంది. ఐడియా బాగుందని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత కావ్య డల్ గా బయటకి వస్తుంది. తన వెనకాలే రాజ్ వస్తాడు. మనమందరం ఇక్కడ సంతోషంగా ఉన్నాం కానీ మీ అక్క బస్తీలో ఇబ్బంది పడుతుందని రేవతి గురించి రాజ్ కి చెప్తుంది కావ్య. మా అక్కని కలవాలని రాజ్ అంటాడు. మరొకవైపు స్వరాజ్ బట్టలు వేసుకోనని మారం చేస్తుంటాడు. అప్పుడే రాజ్, కావ్య ఇద్దరు కలిసి రేవతి ఇంటికి వస్తారు. రాజ్ కి గతం గుర్తుకొచ్చిందని రేవతి తో కావ్య చెప్తుంది. తమ్ముడు అని రాజ్ దగ్గరికి రేవతి వచ్చి ఎమోషనల్ అవుతుంది. మీరు అందరు రేపు రండి మనం ఎప్పుడు కలిసే ఉండాలని రేవతితో రాజ్ చెప్తాడు. మరొకవైపు అప్పు కళ్యాణ్ హాస్పిటల్ కి వెళ్తారు. అప్పు రిపోర్ట్స్ చూసి అంతా ఒకే అని డాక్టర్ చెప్తుంది. కానీ మీ అక్క గర్భసంచిలో ప్రాబ్లమ్ ఉంది.. తొమ్మిది నెలలు బిడ్డని మోస్తే తన ప్రాణానికే ప్రమాదమని కావ్య గురించి అప్పుకి చెప్తుంది డాక్టర్. తరువాయి భాగంలో కావ్యని ప్రేమగా చూసుకుంటాడు రాజ్. ఆ తర్వాత ఈ ఇంటికి ఎవరు వారసులు వద్దు.. నీ కూతురే ఈ ఇంటికి వారసురాలు అవ్వాలని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఒక్క అడుగు దూరంలో కామనర్స్...హౌస్ లోకి వెళ్ళెదెవరు!

నిన్న జరిగన అగ్నిపరీక్ష ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ఫుల్ జోష్ తో వచ్చారు. ఇక జడ్జెస్ ఎప్పటిలాగ కాకుండా కూల్ గా మాట్లాడతారు. ఇది లాస్ట్ ఛాన్స్.. ఇప్పటివరకు మిమ్మల్ని లైవ్ గా చుసాం.. ఇంకా రెండు రోజుల్లో టీవీలో చూస్తాం ఈ రెండు రోజులు బాగా ఆడండి అని అభిజిత్ చెప్తాడు. ఉన్న పదమూడు మందిలో ఓటింగ్ చూసి ఇక్కడ పర్ఫామెన్స్ చూసి అయిదుగురిని బిగ్ బాస్ సీజన్-9 లోకి పంపిస్తామని శ్రీముఖి చెప్తుంది. ఇది లాస్ట్ పరీక్ష మహాపరీక్ష అని శ్రీముఖి టాస్క్ అందరికి వివరిస్తుంది. మొదటగా దివ్య ప్రియని సెలక్ట్ చేసుకుంది. వాళ్ళకిద్దరికి పెట్టిన టాస్క్ లో దివ్య గెలిచి మహాపరీక్ష నుండి ప్రియ అవుట్ అవుతుంది. దివ్య టాస్క్ గెలిచింది కాబట్టి తనకి మరొక ఛాన్స్ ఉంటుంది. దాంతో శ్రేయని దివ్య సెలక్ట్ చేసుకుంటుంది. ఆ టాస్క్ లో కూడా దివ్య గెలుస్తుంది. శ్రేయ మహాపరీక్ష నుండి అవుట్ అవుతుంది. ఆ తర్వాత షకీబ్ కి ఛాన్స్ వస్తుంది. తను హరీష్ ని సెలక్ట్ చేసుకుంటాడు. అందులో హరీష్ గెలుస్తాడు. షకీబ్ ఓడిపోయి మహాపరీక్ష నుండి అవుట్ అవుతాడు. ఆ తర్వాత హరీష్ నాగని సెలక్ట్ చేసుకుంటాడు. అందులో నాగ ఓడిపోయి మహపరీక్ష టాస్క్ నుండి అవుట్ అవుతాడు. హరీష్, దివ్య చెరో రెండు టాస్క్ లు గెలుస్తారు. హరీష్ కి ఛాన్స్ రాగా అతను దివ్యని సెలక్ట్ చేసుకుంటాడు. ఇద్దరికి కలిసి టాస్క్ ని వివరిస్తుంది శ్రీముఖి. కానీ ఈ టాస్క్ ఇప్పుడు జరగదు.. ఎంత క్యూరియాసిటి ఉంది అందరిలో ఈక్వల్ ప్లేస్ లో ఉన్న వీళ్లిద్దరిలో ఎవరు గెలుస్తారో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దామని శ్రీముఖి ట్విస్ట్ ఇస్తుంది. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి.  

Jayam serial : గంగని చంపించడానికి వీరు ప్లాన్.. సైదులు ఏం చేయనున్నాడు!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -45 లో......గంగ వినాయకుడి పూజ చేస్తుంది. మరొకవైపు సూపర్ మార్కెట్ లో వినాయకచవితి ఆఫర్స్ అని రుద్ర ఆఫర్స్ పెడతాడు. ఎక్కువ కొన్నవారికి దీపం ఆయిల్ ఫ్రీ అని చెప్తాడు. ఆ తర్వాత సూపర్ మార్కెట్ లో ఒకవిడ దొంగతనం చేస్తూ మక్కంకి కన్పిస్తుంది. అతను వెంటనే రుద్రకి చెప్తాడు. అలా ఆడవాళ్ళని నువ్వు దొంగతనం చేసావని వేలెత్తి చూపించొద్దు. నేను చెప్పినట్టు చెయ్ అని రుద్ర మక్కం కి ఏదో ప్లాన్ చెప్తాడు. మక్కం కస్టమర్ లాగా సరుకులు తీసుకుంటాడు. బిల్ దగ్గరికి వస్తాడు. నువ్వు ఇప్పుడు దొంగతనం చేసావ్ కదా అని మక్కం తో రుద్ర అంటాడు. ఇలా ఎవరైనా చేస్తారా అంటూ రుద్ర ఇండైరెక్ట్ గా దొంగతనం చేసినవిడని అంటుంటే ఆవిడ తప్పు చేసానని మళ్ళీ లోపలికి వెళ్లి దొంగతనం చేసిన సరుకులు మళ్ళీ అక్కడే పెట్టేస్తుంది. ఆ తర్వాత మక్కం చెయ్ జారీ రాత్రి వీరు మనిషి చేంజ్ చేసిన కల్తీ ఆయిల్ ప్యాకెట్ కిందపడుతుంది. అది పెట్రోల్ వాసన రావడంతో రుద్రని పిలిచి చెప్తాడు మక్కం. ఇది ఎవరో కావాలనే చేసారు. సీసీటీవీ ఫుటేజ్ ఆన్ చెయ్యండి అని రుద్ర అంటాడు. అప్పుడే సీసీటీవీ ఫుటేజ్ ఎర్రర్ వస్తుంది. అప్పుడే అక్కడికి పెద్దసారు గంగ వస్తారు. మక్కం నువ్వు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ఆఫర్ గా విగ్రహం ఇవ్వాలని అనుకున్నాం కదా ఆ లోడ్ రావడానికి ఇంకా టైమ్ పడుతుందని మక్కం చెప్తాడు. దానికి ఎందుకు టెన్షన్ అని గంగ మట్టితో వినాయకుడని రెడి చేస్తుంది. తరువాయి భాగంలో వినాయకుడి నిమర్జనంలో గంగ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే తనని చంపడానికి సైదులుని వీరు పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : నగలు తీసేసుకున్న శ్రీవల్లి.. తిరుపతి హ్యాపీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -254 లో.. ప్రేమకి కళ్యాణ్ ఫోన్ చెయ్యగానే తన సంగతి చెప్తానంటూ కళ్యాణ్ చెప్పిన అడ్రెస్ కి వెళ్తుంది కానీ ఎంత వెతికినా కళ్యాణ్ కనిపించడు. కళ్యణ్ ప్రేమకి ఫోన్ చేసి ఇంత టెన్షన్ పడుతూ కూడా ఎంత బాగున్నావ్ బేబీ అని తనని చాటు నుండి చూస్తూ ఫోన్ మాట్లాడతాడు. ఎక్కడున్నావ్ రా అని ప్రేమ కోపంగా మాట్లాడుతుంది. కళ్యాణ్ గురించి ప్రేమ వీధి వీధి వెతుక్కుంటూ అర్థరాత్రి రోడ్డుపై తిరుగుతు ధీరజ్ కి ఎదరుపడుతుంది. ఇంత అర్థరాత్రి ఏం చేస్తున్నావ్ ఏదో పెద్ద ప్రాబ్లమ్ నిన్ను భయపెడుతుంది.. ఏంటది అని ధీరజ్ అడుగగా ప్రేమ సైలెంట్ గా ఉంటుంది. ప్రేమ చెప్పకపోవడంతో ప్రేమ చెంప చెల్లుమనిపిస్తాడు ధీరజ్. అది అటు గా వస్తున్న విశ్వ చూసి నా చెల్లినే కొడతావా అని ధీరజ్ తో గొడవ పడతాడు. దాంతో ప్రేమ విశ్వని కొడుతుంది. నా భర్త నన్ను కొడుతాడు.. తిడుతాడు నీకేంటి మధ్యలో అని ప్రేమ అనగానే విశ్వ బాధపడతాడు. విశ్వ ఇంటికి వచ్చి సేనాపతి, భద్రవతిలకి జరిగింది మొత్తం చెప్తాడు. ప్రేమ పూర్తిగా వాడి మాయలో పడిపోయిందని విశ్వ చెప్తాడు. ఎలాగైనా ఆ రామరాజు కుటుంబాన్ని నాశనం చెయ్యాలని భద్రవతి అనుకుంటుంది.  ఆ తర్వాత తిరుపతి పక్కన ఆనందరావు పడుకొని తన చెయ్ కి ఉన్న కలశాన్ని రంపంతో కోస్తాడు. అందులో గిల్టీ నగలని శ్రీవల్లికి ఇచ్చి ఏం తెలియనట్లు ఆనందరావు పడుకుంటాడు. మరుసటి రోజు తిరుపతి ఉదయం లేచేసరికి తన చెయ్ కి కలశం లేదని సంబరపడిపోతు ఇంట్లో అందరిని పిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2:సుమిత్ర దశరథ్ ల మధ్య చిచ్చు రాజేసిన జ్యోత్స్న!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -453 లో..... సుమిత్ర తాళి తీసి కార్తీక్ దీప పెళ్లి ఆపాలని చూసిందని కాంచన బాధపడుతుంది. సుమిత్రని కాంచన తిడుతుంటే మా అమ్మని తిట్టకని దీప అంటుంది. ఒక్కరోజు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే నిజమైన తల్లిదండ్రులు కాలేరు. ఆ పిలుపులు ఆ గుమ్మం వరకేనని కాంచన అంటుంది. ఆ తర్వాత ఎందుకు నా పరువు తీశావమ్మ అని సుమిత్రని శివన్నారాయణ అడుగుతాడు. నేను ముందు నుండే చెప్తున్నా ఆ దీపని ఎప్పటికి క్షమించలేను.. ఆ శుభకార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం నాకు ఇష్టం లేదని సుమిత్ర అంటుంది. నా చెల్లి అన్న మాటలు నిజమే మనసులో ఇంత విషం పెట్టుకున్నావా.. నా చెల్లికి నేను ఎలా ఎదురుపడాలని దశరథ్ బాధపడతాడు.ఆ తర్వాత కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. జ్యోత్స్న గురించి తెలియదు కాబట్టి సుమిత్ర అత్త తనకి సపోర్ట్ చేస్తుంది. లేదంటే అసలు క్షమించదని దీపతో కార్తీక్ అంటాడు. ఆ తర్వాత మరుసటి రోజు శివన్నారాయణ ఇంటికి దీప, కార్తీక్ వస్తారు. అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఏంటి మేమ్ పనికిరామని అనుకున్నారా అని కార్తీక్ అంటాడు. అత్త చేతిలో ఉన్న సామ్రాణి తీసుకొని నువ్వు వెయ్ దీప అని కార్తీక్ అనగానే సుమిత్ర కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సుమిత్ర దగ్గరికి దశరథ్ వెళ్తాడు. తప్పు చేసినప్పుడు అలా ఎవరికి ఎదరుపడలేవని దశరథ్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న వచ్చి ప్రతిసారీ ఏదో పెద్దనేరం చేసినట్లు మమ్మీని అంటున్నారు. నీకు మమ్మీ కంటే అత్త అంటేనే ఇష్టమని జ్యోత్స్న అనగానే దశరథ్ తనపై చెయ్ ఎత్తుతాడు. ఆగండి.. అది అన్నదాంట్లో తప్పేముంది. నాకంటే మీ చెల్లి ఎక్కువ.. నా బాధ ఎప్పుడైనా పట్టించుకున్నారా పట్టించుకుంటే ఇలా మాట్లాడారు. ఈ ఇంట్లో నాకు సపోర్ట్ గా నా కూతురు తప్ప ఎవరు లేరని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఇంకా తగ్గని యామిని ప్రతీకారం.. కావ్య కడుపులో ప్రాబ్లమ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -816 లో..... కావ్య కోసం రాజ్ కాఫీ తీసుకొని వస్తాడు. కావ్య అది తాగుతుంటే అసలు నీకు కొంచెం కూడా రొమాంటిక్ ఫీల్ లేకుండా.. కుడిది లాగా తాగుతున్నావని రాజ్ అంటాడు.  ఆ యామిని పెట్టిన ఇబ్బంది మీరు నాకు ఎక్కడ దూరం అవుతారోనని భయపడ్డాను కానీ మీరు మాములుగా అయ్యారని రాజ్ తో కావ్య అంటుంది. అసలు నేను ఆ యామిని దగ్గరికి ఎలా వెళ్ళానని రాజ్ అడుగుతాడు. దాంతో కావ్య జరిగింది మొత్తం చెప్తుంది వెంటనే రాజ్ కోపంగా అక్కడ నుండి యామిని దగ్గరికి బయల్దేర్తాడు. ఏం చేస్తాడోనని కావ్య కూడా వెనకాలే వెళ్తుంది. యామిని దగ్గరికి రాజ్ వెళ్ళగానే రాజ్ కాళ్లపై పడుతుంది యామిని. నన్ను క్షమించమని యామిని అంటుంది. నిన్ను కావ్యని విడదీసి నా సొంతం చేసుకోవాలనుకున్నానని యామిని అంటుంది. నువ్వు నా కాళ్ళపై పడ్డావ్ కాబట్టి క్షమించి వదిలేస్తున్నానని యామినిని వదిలేస్తాడు రాజ్. ఆ తర్వాత కావ్య, రాజ్ అక్కడ నుండి  బయల్దేరతారు. ఇకనైనా రాజ్ ని మర్చిపోమని వైదేహి అనగానే నాకు దక్కని సంతోషం వాళ్లకి దక్కడానికి వీల్లేదని యామిని అంటుంది. ఆ తర్వాత ఆ యామినిని ఏదైనా చేస్తారేమోనని భయపడ్డానని కావ్య అనగానే నేను నీ కోసం తనని వదిలేసాను.. ఇన్ని రోజులు నీకు దూరం అయిన ప్రేమ నీ దగ్గరండి అందిస్తానని రాజ్ అనగానే కావ్య మురిసిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో అందరు వినాయకుడి పూజ చెయ్యాలనుకుంటారు. అప్పుడే రాజ్, కావ్య వచ్చి మంచి ఆలోచన అని అంటారు. తరువాయి భాగం లో  రేవతి గురించి రాజ్ కి చెప్తుంది కావ్య. వెంటనే అక్క దగ్గరికి వెళదామని రాజ్ అంటాడు. మరొకవైపు అప్పు, కళ్యాణ్ హాస్పిటల్ కి వెళ్తారు. నీ రిపోర్ట్స్ ఒకే కానీ మీ అక్క దాంట్లో ప్రాబ్లమ్ ఉంది తను తొమ్మిది నెలలు బేబీని మోస్తే తన ప్రాణానికి ప్రమాదమని డాక్టర్ చెప్తుంది. దాంతో కళ్యాణ్, అప్పు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

bigg boss agnipareeksha : అందరితో కన్నీళ్లు పెట్టించిన ప్రసన్న ఎలిమినేషన్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష డోర్స్ క్లోజ్ కావడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఆ విషయాన్ని నవదీప్ చెప్తూ వస్తున్నాడు. ఇక ఈ రోజు ఇద్దరినీ ఏలిమినేట్ చేశారు. అందులో ఒకరు ప్రసన్న కుమార్. ఆయనకు నవదీప్ రెడ్ కార్డు ఇచ్చేసరికి అక్కడున్న వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా అతనితో జోడిగా ఉన్న విజయవాడ అడ్వకేట్ నాగా కూడా తట్టుకోలేకపోయాడు. 12 వ  ఎపిసోడ్ లో జరిగిన మినీ టాస్క్ లో నాగా డంబ్ అంటూ ట్యాగ్ ఇచ్చాడు. ఐతే తర్వాత ప్రసన్న నాగా విషయంలో కరెక్ట్ పాయింట్స్ కూడా రైజ్ చేయలేదు. ఇక 13 వ ఎపిసోడ్ లో ఇచ్చిన టాస్కుల్లో కూడా ప్రసన్న సరిగా పెర్ఫార్మ్ చేయలేకపోవడం అలాగే నాగా కూడా టాస్క్ గెలవడానికి చాల ఎఫోర్ట్స్ పెట్టిన గెలవలేకపోయాడు. ఐతే ప్రసన్నకు ఆల్రెడీ ఎల్లో కార్డు ఉండడం కూడా మైనస్ అయ్యింది. దాంతో నవదీప్ రెడ్ కార్డు ఇచ్చి ఇక షో నుంచి ఏలిమినేట్ అయ్యారంటూ చెప్పాడు. ఇది నువ్వు ఉండాల్సిన షో కాదు. బయట ఉన్నది నీ ప్రపంచం. నీ కథ ఈ ప్రపంచానికి తెలిసింది. అలాగే నీ జర్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఇక ఒక్క ఎపిసోడ్ మాత్రమే ఉంది. ఇంత వరకు వచ్చావంటే గ్రేట్ అంటూ నవదీప్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రసన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాగ కూడా కన్నీళ్లు పెట్టుకుని నేను గెలిపించడానికి చాలా ట్రై చేశా అని చెప్పాడు. కానీ ప్రసన్న కూడా నాగాకి డంబ్ అనే ట్యాగ్ ఇచ్చే ఉద్దేశం లేదని టాస్క్ కాబట్టి ఇచ్చానని చెప్పాడు. ఇద్దరం అసలు మాట్లాడుకోవడానికి కుదరలేదు లేదంటే ఆ ట్యాగ్ కూడా ఇచ్చేవాడిని కాదు అని చెప్పాడు. హరీష్ , సోల్జర్ పవన్ కుమార్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక నాగా కూడా చాలా ఓపెన్ అయ్యాడు. ఫస్ట్ డే ఆయన్ని చూసాను కానీ రెండో రోజు అతని స్టోరీ విన్నాక నిజంగా గుండె ముక్కలైపోయింది. అభిజిత్ గారు చెప్పినట్టు ఆయన రియల్ లైఫ్ హీరో అని అన్నాడు. ఇక అందరూ కలిసి అతన్ని సాగనంపారు.

అమ్మ బిగ్ బాస్ లోకి తీసుకెళ్ళళపోయాను..ఏలిమినేట్ ఐన శ్వేత  

  బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. ఇక 13 వ ఎపిసోడ్ లో శ్వేతా, ప్రసన్న కుమార్ ఏలిమినేట్ ఇపోయారు. అంటే 15 మందిలో ఇప్పుడు కేవలం 13 మంది మాత్రమే మిగిలారు. మూటలను హోల్స్ లో వేసే టాస్క్ లో హరీష్, శ్వేతా జోడి ఆడారు. కానీ ఆ టీమ్ ఓడిపోయింది. దాంతో బిందు రెడ్ కార్డు ఇచ్చింది. ఆల్రెడీ శ్వేతా దగ్గర ఒక ఎల్లో కార్డు ఉంది. ఇప్పుడు ఓడిపోవడంతో ఇక ఏలిమినేట్ చేసేసారు. "బిగ్ బాస్ కామన్ మ్యాన్ కి అవకాశం ఇస్తోంది అంటే నేను అన్నిటినీ దాటుకుని ఇక్కడి వరకు వచ్చాను. కానీ నేను చాలా ట్రై చేశాను. నేను బిగ్ బాస్ హౌస్ లోకి మా అమ్మను తీసుకెళ్లాలి అనుకున్నాను. కానీ కుదర్లేదు" అని చెప్పింది శ్వేతా. ఇక శ్రీముఖి కూడా "మూటలు ఎందుకు మీరు వేయాల్సింది కదా శ్వేతా ఎందుకు వచ్చింది" అని అడిగింది. "నేను వేస్తాను అని చెప్పాను. ఐతే శ్వేతా ఎం అన్నదంటే నేను రిస్క్ లో ఉన్నాను. ఆడి ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నా. తనకంటే నేను బాగా ఆడతాను అని చెప్పాను కానీ తానే వద్దు అంది" చెప్పాడు. "మరి మీరు వేస్తాను అని చెప్పి శ్వేతాను ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు" అంటూ నవదీప్ అడిగాడు. "నేను స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి నేను వేస్తాను అని చెప్పాను. ఐతే తాను షాట్ ఫుట్ ఆడిన పర్సన్. ఐతే ఇది లైఫ్ అండ్ డెత్ టాస్క్ నేనే ఆడతా అంది. తన లైఫ్ తనకు సంబంధించింది కాబట్టి తనకు ఇచ్చేసాను" అని చెప్పాడు. అలా శ్వేతా కూడా ఏలిమినేట్ ఐపోయింది.  

Biggboss Agnipariksha: మోస్ట్ ఎమోషనల్‌గా సాగిన అగ్నిపరీక్ష.. ఎలిమినేట్ అయింది ఆ ఇద్దరే!

అగ్నిపరీక్షని దాటుకొని బిగ్ బాస్ సీజన్-9 లోకి వెళ్ళడానికి కంటెస్టెంట్స్ కి ఇంకా రెండు రోజులే  మిగిలి ఉన్నాయి. నిన్న జరిగిన ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.  టాస్క్ లో మనీష్, దివ్య జోడి గెలిచారు. టాస్క్ జరిగే ముందే అభిజిత్ ఓ మాట చెప్పాడు. ఎవరైనా ఎల్లో కార్డున్న వారు బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తే వారి కార్డు తీసుకుంటానని, ఇదొక మంచి ఛాన్స్ అని అభిజిత్ చెప్పాడు. ఇక టాస్క్ లో మనీష్ బాగా పర్ఫామెన్స్ చేయడంతో తన దగ్గరున్న ఎల్లో కార్డు తీసుకుంటారు జడ్జెస్. ఇక దివ్యకి ఓటు అప్పీల్ ఛాన్స్ వస్తుంది. వరెస్ట్ పర్ఫామెన్స్ శ్వేతకి ఇస్తారు. ఆల్రెడీ తన దగ్గర ఇప్పటికే ఎల్లో కార్డు ఉంది కాబట్టి తనకి రెడ్ కార్డు ఇస్తారు. దాంతో తను అగ్ని పరీక్ష నుండి ఎలిమినేట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొక ట్విస్ట్ అని నవదీప్ అంటాడు. మనీష్ దగ్గర నుండి తీసుకున్న ఎల్లో కార్డు ఉంది. అది మేమ్ ఇంకొకరికి ఇవ్వాలనుకుంటున్నామని జడ్జెస్ డిసైడ్ అవుతారు. ఇంకొక ఎల్లో కార్డు ప్రసన్నకి ఇస్తారు. ఆల్రెడీ తన దగ్గర ఒక ఎల్లో కార్డు ఉంది కాబట్టి రెడ్ కార్డు ఇచ్చి ఎలిమినేట్ చేస్తారు. దాంతో కంటెస్టెంట్స్ మొత్తం ఎమోషనల్ అయ్యారు. జడ్జెస్ స్టేజ్ మీదకి వచ్చి.. నువ్వు చాలా మందికి ఆదర్శం. ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్.. నీ స్టోరీ ఏంతో ఆదర్శమనిపించింది.. నిన్ను బిగ్ బాస్ లో చూడాలని గ్రీన్ ఇచ్చి ఇక్కడ వరకు తీసుకొని వచ్చాము కానీ ఇది నీకు సరైన ప్లేస్ కాదని నవదీప్ అంటాడు. దాంతో ప్రసన్న కుమార్ ఎమోషనల్ అవుతాడు. నేను ఒక రియాలిటీ షోకి విన్నర్ అయ్యాను కానీ నువ్వు రియల్ లైఫ్ లో విన్నర్ అయ్యావని అభిజిత్ అంటాడు. ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్స్ ఎమోషనల్ అవుతారు. కాసేపటికి ప్రసన్న కుమార్ వెళ్ళిపోతాడు. ఇక నేటి నుండి బిగ్ బాస్ సీజన్-9 మొదలవ్వడానికి రెండు ఎపిసోడ్ లు మాత్రమే ఉన్నాయి. ఈ రెండింటిలో పదమూడు మంది కంటెస్టెంట్స్ నుండి ఏ అయిదుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారో చూడాలి మరి. ఈ సీజన్ లో ఎవరు కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇస్తారో తెలియాలంటే మూడు రోజులు ఆగాల్సిందే.

బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్ కష్టాల మీద ఢీ-10 రాజు వెబ్ సిరీస్.."ఒక డాన్సర్ కథ"

  ఢీ-10 రాజు అంటే డాన్సర్స్ లో తెలియని వాళ్ళు లేరు. ఢీ షో సీజన్ 10 టైటిల్ గెలిచిన తర్వాత ఆ పేరే ఇంటి పేరుగా మారిపోయింది. ఇక ఇప్పుడు ఢీ - 20 లో కూడా కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. అలాంటి రాజు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. "నేను డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో చూసుకోవడం కోసం ఒక వెబ్ సిరీస్ రాస్తున్న. త్వరలో దాన్ని డైరెక్ట్ చేస్తాను. చైత్ర మాష్టర్ "ఒక డాన్సర్ కథ" అనే టైటిల్ పెట్టి వెళ్లిపోయారు. నేను దాన్నే కంటిన్యూ చేస్తున్నా. "ఒక డాన్సర్ కథ" అనే వెబ్ సిరీస్ రాస్తున్నాం. బాగా రాయాలని ట్రై చేస్తున్నాం. బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్ గురించి ఎవరికీ తెలీదు. వాళ్ళ కష్టాల గురించి కూడా ఎవరికీ తెలీదు. బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా వచ్చిన శేఖర్ మాష్టర్ సక్సెస్ అయ్యారు. వాళ్ళ గురించి అందరికీ తెలుసు. కానీ ఓడిపోయిన వాళ్ళ గురించి ఎవరికీ తెలీదు కదా. నేను తీసేది దాని గురించే. బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్ కష్టాలు అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా చాలా దారుణంగా ఉంటాయి. అందులో ఫెయిల్యూర్స్ గురించి ఫెయిల్ ఐనవాళ్ల గురించే నా వెబ్ సిరీస్ ఉండబోతోంది. ఏడాది పాటు హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చింది. ఒక పక్కన డాన్స్ చేస్తూ మరో పక్క ఫిజియోథెరపీ తీసుకున్నా. ఒక పక్క నరకం చూస్తూ మరో పక్క హ్యాపీగా ఉండేదాన్ని. ఒక పక్కన అందరూ గుర్తుపట్టడం మొదలుపెట్టారన్న హప్పినెస్స్ ఉంటె మరో పక్కన దెబ్బలు హాస్పిటళ్లు. నాకు ఇది అలవాటైపోయింది. డాన్స్ మాత్రమే నా ఫ్యూచర్ అన్న ఫీల్ లో ఉండిపోయా. అందుకే అన్నిటినీ అలవాటు పడ్డాను." అని చెప్పుకొచ్చాడు ఢీ - 10 రాజు.

Jayam : ఇషిక, వీరుల ప్లాన్ కనిపెట్టేసిన రుద్ర.. సీసీటీవీలో ఏం ఉందంటే!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -44 లో....గంగ వినాయకుడిని ఇంటికి తీసుకొని వస్తుంది. అప్పుడే పెద్దసారుపై గుమ్మం దగ్గరున్న స్పటిక కిందపడిపోతుంటే.. రుద్ర వచ్చి పెద్దసారుని పక్కకి నెట్టుతాడు. ఇక ఇంట్లో వాళ్లంతా వినాయకుడిని గంగ తీసుకొని రావడం వల్లే ఇదంతా అని అంటారు. దాంతో అలా ఏం కాదు పెద్దసారుపై స్పటిక పడకుండా దేవుడే కాపాడాడని గంగ అంటుంది. గంగ  తన మాటలతో శకుంతలని మార్చేస్తుంది. వినాయకుడిని తీసుకొని వస్తున్న గంగకి శకుంతలే స్వయంగా హారతి ఇచ్చి ఆహ్వానిస్తుంది. మరొకవైపు వీరు దగ్గరికి ఇషిక వస్తుంది. అసలు మనం అనుకున్నది ఏది జరగట్లేదు అని ఇషిక అంటుంది. రుద్ర సూపర్ మార్కెట్ లో ఆఫర్ పెట్టాడు. దీపం ఆయిల్ ఫ్రీ అని పెట్టాడు కదా.. నా మనిషి వెళ్లి పెట్రోల్ కలిపిన ఆయిల్ తీసుకొని వెళ్లి ఒరిజినల్ దీపం ఆయిల్ ప్లేస్ లో రీప్లేస్ చేస్తాడు. దాంతో అటు సూపర్ మార్కెట్ క్లోజ్ అవుతుందని వీరు అనగానే మంచి ప్లాన్ అని ఇషిక అంటుంది. ఆ తర్వాత గంగ మరుసటిరోజు వినాయకుడికి పూజ చేస్తుంది. వినాయకుడి కథ ఇంట్లో వాళ్ళకి వివరిస్తుంది గంగ. తరువాయి భాగంలో దీపం ఆయిల్ ప్లేస్ లో వేరే ఆయిల్ పెట్టారని రుద్రకి తెలుస్తుంది. దాంతో ఈ పని ఎవరో చేశారని సీసీటీవీలో చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : తండ్రి దగ్గర డబ్బు దొంగిలించిన కొడుకు.. అర్థరాత్రి రోడ్డుపై ఆమె!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -253 లో.....ఆనందరావు ఇంటికి రాగానే ఇప్పుడు ఎందుకు వచ్చావ్ నాన్న అని శ్రీవల్లి లోపలికి తీసుకొని వెళ్తుంది. ఆ తిరుపతి చెయ్ కలశం లో నుండి బయటకు వస్తే అవి గిల్టీ నగలు అని మన బండారం బయటపడుతుంది కదా అందుకే ఒక ప్లాన్ ఆలోచించాను. ఈ ఒక్క రోజుకి నేను ఇక్కడే ఉండేలా చూడమని ఆనందరావు అంటాడు. అతను బయటకి వచ్చి ఇక నేను వెళ్తాను బావగారు అని రామరాజుతో అంటాడు. ఇప్పుడు ఎలా వెళ్తావ్.. నాన్న చీకటి అయింది వద్దని శ్రీవల్లి అంటుంది దాంతో ఆగిపోతాడు. ధీరజ్ డబ్బు సర్దుబాటు చేస్తాడో లేదో అని చందు టెన్షన్ పడతాడు. ఈ రోజు డబ్బు సర్దుబాటు కాకపోతే నా పరిస్థితి ఏంటోనని సాగర్ తో అంటుంటే ధీరజ్ వింటాడు. మరొకవైపు ప్రేమకి కళ్యాణ్ ఫోన్ చేసి.. నేను ఇక్కడే ఉన్నానంటూ ఫోన్ చేస్తాడు. ప్రేమ భయంతో బయటకు వస్తుంది. ఆ తర్వాత రామరాజుని ధీరజ్ డబ్బు అడగడానికి వస్తాడు కానీ అడుగులేకపోతాడు. ఏం చెయ్యలేక ధీరజ్ రామరాజు ఫోన్ నుండి డబ్బు పంపించుకుంటాడు. నన్ను క్షమించు నాన్న.. అన్నయ్య కోసం తప్పడం లేదని ధీరజ్ అనుకుంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ ని ప్రేమ కలిసి  వాడి సంగతి చెప్పాలని వాడు చెప్పినట్లు వెళ్తుంటుంది కానీ కళ్యాణ్ ఎక్కడ కన్పించడు. తరువాయి భాగంలో ప్రేమ అర్ధరాత్రి రోడ్డుపై కంగారుగా ధీరజ్ కి కన్పిస్తుంది. ఏమైందని ధీరజ్ అడిగితే ప్రేమ సైలెంట్ గా ఉంటుంది. దాంతో ప్రేమ చెంపచెల్లుమనిపిస్తాడు ధీరజ్. అదంతా విశ్వ చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : తాళి తీసింది సుమిత్రే.. షాక్ లో కుటుంబీకులు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -452 లో.....తాళి నువ్వే తీసావని పారిజాతంపై స్వప్న నింద వెయ్యడంతో నేను కాదని పారిజాతం అంటుంది. ఆ తాళి తీసింది ఎవరో నాకు తెలుసని పారిజాతం అంటుంది. ఎవరని దీప అడుగగా.. నీ భర్తని అడుగమని పారిజాతం అంటుంది. అందరు పారిజాతాన్ని అడుగగా సుమిత్ర అని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. మీరు అబద్ధం చెప్తున్నారు.. అలా ఎప్పుడు మా వదిన చెయ్యదని కాంచన అంటుంది. ఆ తర్వాత పారిజాతం కార్తీక్ చెయ్ పట్టుకొని కాంచన తల మీద చెయ్ పెట్టి.. ఇప్పుడు చెప్పురా నేను చెప్పింది అబద్ధమని అని పారిజాతం అనగానే కార్తీక్ సైలెంట్ గా ఉంటాడు. వాడు చెప్పడు.. ఎందుకంటే అదే నిజం కాబట్టి నేనే ఆ తాళిని తీసానని సుమిత్ర అనగానే అందరు షాక్ అవుతారు. నాకు ఈ దీప ఎప్పటికి శత్రువే అని సుమిత్ర అంటుంది. అన్నయ్య మీరు అందరు కలిసి ఈ పని చేశారని కాంచన ఎమోషనల్ అవుతుంది. నాన్న నువ్వు కూడా కదా అని కాంచన అనగానే అలా అయితే నేనే ఎందుకు మీ అమ్మ తాళి తీసుకొని వచ్చి ఇస్తానని శివన్నారాయణ అంటాడు. అది నిజమేనని కాంచన అంటుంది. ఆ తర్వాత అందరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. సుమిత్ర మాటలకు దీప ఏడుస్తుంది. ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు ఇంటికి వచ్చి మాట్లాడుకుంటారు. అదంతా నా వల్లే జరిగిందని పారిజాతం అనుకుంటుంది కానీ అన్నింటికి సూత్రదారి జ్యోత్స్న.. నేను తియ్యమంటేనే మమ్మీ ఆ తాళి తీసిందని సుమిత్రని జ్యోత్స్న ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసిన విషయం చెప్తుంది. నువ్వు బావ మమ్మీ మాటలు వినేలా చేసింది కూడా నేనేనని జ్యోత్స్న చెప్పగానే పారిజాతం షాక్ అవుతుంది. ఏం మైండ్ గేమ్ అని జ్యోత్స్నని పారిజాతం పొగుడుతుంది. ఆ తర్వాత సుమిత్ర చేసిన దానికి కాంచన బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్యని కంటికి రెప్పలా చూసుకుంటున్న రాజ్.‌ ప్రకాష్ కామెడీ అదుర్స్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -815 లో..... కావ్య, అప్పు ఇద్దరు ప్రెగ్నెంట్ కాబట్టి పైకి మెట్లు ఎక్కి వెళ్ళలేరని రాజ్, కళ్యాణ్ ప్లాన్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ ని పైన గదికి పంపించి మనం కిందకి షిఫ్ట్ అవుదామని అన్నతమ్ముళ్లు అనుకుంటారు. ఆ విషయం అందరిని పిలిచి రాజ్, కళ్యాణ్ చెప్తారు. మేమ్ వెళ్ళమని అపర్ణ మొదట చెప్పినా.. ఇక తప్పేలా లేదని సరే అంటుంది. ఆ తర్వాత రాజ్ అలా కావ్యతో ప్రేమగా ఉంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరుసటిరోజు ఉదయం అపర్ణ దగ్గరికి ధాన్యలక్ష్మి వస్తుంది. అసలు నిద్ర పట్టలేదు. కొత్త రూమ్ కదా అని అపర్ణ అంటుంది. నాక్కూడా అని ధాన్యలక్ష్మి అంటుంది. నాకు బాగా నిద్ర పట్టిందని ఇందిరాదేవి అనగానే మా బాధ మీకు వెటకారంగా ఉందా అని అపర్ణ సరదాగా అంటుంది. ఆ తర్వాత కావ్య నిద్ర లేచి నన్ను ఏ పని చెయ్యనివ్వను అన్నారు. ఇప్పటివరకు కాఫీ లేదు నేను వెళ్లి పనులు చేసుకుంటానని  కావ్య అనగానే వద్దు నేను చేసుకొని తీసుకొని వస్తానని రాజ్ కిచెన్ లోకి వెళ్తాడు. అది అందరు చూస్తారనుకొని ఒక చీర చుట్టుకొని వెళ్తాడు. మరొకవైపు కావ్యకి రెస్ట్ ఇచ్చినప్పటి నుండి ఇంట్లో కాఫీకి దిక్కులేదని అపర్ణ, ధాన్యలక్ష్మి అనుకుంటారు. సుభాష్, ప్రకాష్ లని అపర్ణ, ధాన్యలక్ష్మి కాఫీ పెట్టుకొని తీసుకొని రమ్మంటారు. ఆ తర్వాత ఇక చేసేదేమీ లేక ప్రకాష్ కిచెన్ లోకి వెళ్తాడు. అక్కడ చీర చుట్టుకొని ఉన్న రాజ్ ని వెనకాల నుండి ప్రకాష్ చూసి.. నా గర్ల్ ఫ్రెండ్ నాకు సర్ ప్రైజ్ ఇస్తానంది.. ఇలా వచ్చిందేమోనని వెనకాలా నుండి హగ్ చేసుకుంటాడు. అప్పుడే ధాన్యలక్ష్మి వస్తుంది. రాజ్ ముందుకి తిరుగుతాడు. నువ్వారా నా గర్ల్ ఫ్రెండ్ అనుకున్నానని ప్రకాష్ అనగానే ప్రకాష్ తో ధాన్యలక్ష్మి గొడవపడుతుంది. ఆ తర్వాత కావ్యకి రాజ్ కాఫీ తీసుకొని వెళ్లి ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అగ్నిపరీక్షలో ఒపీనియన్ ట్యాగ్ ఎవరికొచ్చిందంటే!

బిగ్ బాస్ సీజన్-9 మొదలవ్వడానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయడానికి జియో హాట్ స్టార్ లో అగ్నిపరీక్ష ద్వారా ఎపిసోడ్ లని రిలీజ్ చేస్తున్నారు బిబి టీమ్. ఇక ఈ అగ్నిపరీక్ష ముగియడానికి మూడు ఎపిసోడ్ లే మిగిలి ఉన్నాయి. నిన్న జరిగిన ఎపిసోడ్ లో పదిహేను మందిలో ఎవరికి ఏ ఒపీనియన్ ఉందో ట్యాగ్ ఇవ్వాలని టాస్క్ అందరు ఒకొక్క ఒపీనియన్ తమకి నచ్చని వారికి ఇస్తూ వచ్చారు.  నాగ, హరీష్ కి ప్రసన్న కుమార్ ట్యాగ్ ఇచ్చాడు కానీ వాళ్ళు మేమ్ అది కాదు అని వాదించారు. దాంతో ప్రసన్న కుమార్ సైలెంట్ అయిపోయాడు. ఇక శ్రీముఖి అతని దగ్గరికి వచ్చి ఇలా ఉండకూడదు.. ఎందుకు నువ్వు మాట్లాడలేకపోతున్నావని అతడిని అడుగుతుంది. సిచువేషన్ జరిగినప్పుడు అది కాదు.. ఇది అని చెప్పాలనిపిస్తుంది కానీ ఇలాంటి చెప్పే సిచువేషన్ లో నేను మాట్లాడలేకపోతున్నాను అంటాడు. ఆ తర్వాత పదిహేను మందిలో ఒపీనియన్ టాస్క్ ఏడుగురికి ఛాన్స్ వచ్చింది. వాళ్ళు అయిదుగురికి ఒపీనియన్ ఇచ్చారు. ఇంకా మిగిలింది కల్కి. తనకి ఒపీనియన్ ఛాన్స్ రాలేదు. ఎవరు తనకి ఒపీనియన్ చెప్పలేదు. దాంతో తనని స్టేజ్ మీదకి శ్రీముఖి పిలుస్తుంది. ఇన్ని రోజుల ప్రయాణంలో నీ మీద ఒక్కరికి కూడా ఒపీనియన్ లేకపోవడమేంటి? అంటే నువ్వు ఒక్కదానివి ఉన్నట్లు.. నిన్ను ఎవరు గుర్తించడం లేదని శ్రీముఖితో పాటు జడ్జెస్ అంటారు. ఈ ఎపిసోడ్ వరకు నువ్వు పక్కన కూర్చోవాల్సిందేనని  తనని పంపిస్తారు. ఇక ఆ తర్వాత అసలైన టాస్క్ మొదలవుతుంది. ఎవరైతే  ఒపీనియన్ ఇచ్చిన కంటెస్టెంట్, ఒపీనియన్ తీసుకున్న కంటెస్టెంట్  ఉన్నారో వారిద్దరిని కలిసి ఒక జంటగా చేసి అలా ఏడు జంటలు చేశారు.  

సందీప్ రెడ్డి వంగాకి వోడ్కా బాటిల్.... షాక్‌లో ఆర్జీవీ!

జయమ్ము నిశ్చయమ్మురా..జగపతి టాక్ షో ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కి రామ్ పండు వచ్చారు. ఆయన ఎవరో కాదు..ఆయన మాటను ఆయనే వినని ఆర్జీవీ. ఇక హోస్ట్ జగపతిబాబు ఐతే "రాంపండు" అంటూ స్టేజి మీదకు పిలిచేసారు. ఇక రావడమే శివ మూవీలో "బోటనీ పాఠముంది" సాంగ్ కి ఆర్జీవీ, జగపతి బాబు స్టెప్పులేశారు. అందరికీ రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ..నాకు మాత్రం సైతాన్ అంటూ రామ్ గోపాల్ గురించి ముద్దుగా చెప్పుకున్నారు. "ప్రేక్షకుల కోసం సినిమా ఎప్పుడు తీస్తావ్" అని అడిగారు హోస్ట్. "సి నా లైఫ్ లో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎవడు ఎం చెప్పినా ఎవడు వినడు" అని చెప్పారు ఆర్జీవీ. "నీతో పది నిమిషాలు కూర్చుంటే నేను నువ్వైపోతాను" అని జగపతిబాబు చెప్పేసరికి కిసుక్కున నవ్వారు ఆర్జీవీ. "నాకు తెలిసి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఇంకొకరు ఉన్నారు" అంటూ సందీప్ రెడ్డి వంగాని పిలిచారు. ఆయనకు వోడ్కా బాటిల్ ఇచ్చి మరీ వెల్కమ్ చేశారు జగపతి బాబు. దాంతో ఆర్జీవీ షాకయ్యారు. "ఏ నాకెందుకు ఇవ్వలేదు వోడ్కా...అంటే సందీప్ సూపర్ డైరెక్టర్ నేను కాదనా" అని సూటిగా అడిగేసారు ఆర్జీవీ. "సందీప్ ఫ్యాట్ మంటూ చెంప మీద కొట్టినట్టు మాట్లాడతాడు కదా ఫ్యాట్ ఫెల్లో ఎవడు అని అడిగాడు. ఐపోయింది ఇక 30 ఏళ్ళ నుంచి బిల్డ్ చేసిన సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక్క దెబ్బతో పోయింది" అని చెప్పుకొచ్చారు ఆర్జీవీ. "గర్ల్ ఫ్రెండ్ సంగతేంటి అది ఇంపార్టెంట్" అంటూ జగపతి బాబు అడిగేసరికి "మమ్మల్ని మేము ప్రేమించుకోవడానికే టైం లేనప్పుడు ఇంకా వేరే వాళ్ళ" అన్నారు ఆర్జీవీ. "కొన్ని సార్లు నేను మీ క్లాస్ మెట్ అయ్యుంటే ఎలా ఉండేది " అంటూ సందీప్ రెడ్డి వంగా ఆర్జీవీని ఒక కొంటె ప్రశ్న అడిగారు. "ఇద్దరిలో ఒకరు అమ్మాయి ఐతే" అంటూ ఆర్జీవీ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. " ఒక డెవిల్, ఒక యానిమల్ కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుతుంటే చాలా ముద్దుగా ఉంది" అని జగపతిబాబు కితాబిచ్చారు. ఎప్పుడూ లేనిది ఆర్జీవీ ఈ షోలో నవ్వుతూ కనిపించి ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చారు.

తోలుబొమ్మలాట.. శ్రీముఖి ఫైర్.. ఎల్లో కార్డ్స్ ఇచ్చిన నవదీప్..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష దాదాపు ముగింపు దశకు చేరుకుంది. దాంతో టాస్కులన్నీ కూడా ఫుల్ టఫ్ గా ప్లాన్ చేస్తోంది టీమ్. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ ఇక ఇందులో రెండు ఇంటర్ కనెక్షన్ టాస్కులు ఇచ్చారు. ముందుగా టాగ్స్ ఇమ్మని  చెప్పి ఎవరు ఎవరికీ టాగ్స్ ఇచ్చారో ఆ ఇద్దరినీ ఒక జోడీగా చేసి బ్లైండ్ ఫోల్డ్ టాస్క్ ఆడించారు. అంటే తోలు బొమ్మలాటను ఆడించారు. ఒక వ్యక్తి కళ్ళకు గంతలు కట్టించేసింది. టేబుల్ మీద కొన్ని గిన్నెలు, ఒక ప్లేట్ లో స్వీట్స్ పెట్టింది. వాళ్ళను ఆడించేవాళ్లను వెనక నిలబెట్టింది శ్రీముఖి. తర్వాత ఒక కార్డు చూపించి ఆ కార్డులో ఉన్న స్వీట్ ని ఆ కళ్ళకు గంతలు కట్టుకున్న వ్యక్తితో సరిగా గుర్తించేలా చేసి ఆ స్వీట్ ని గిన్నెలో వేయించి వెంటనే వచ్చి గంట గొట్టాలి. ఐతే ఇందులో షాకిబ్ తన తోలుబొమ్మ ప్రియాతో స్వీట్స్ ని అలా వేయిస్తూ ప్రాక్టీస్ చేయిస్తూనే ఉన్నాడు. అప్పటికే టాస్క్ ఐపోయింది. ఇక శ్రీముఖి ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది.  "షకీబ్ ఎందుకు ప్రాక్టీస్ చేయిస్తున్నావో చెప్తావా.. నాకు తెలియాలి ఇప్పుడు ఎందుకు ప్రాక్టీస్ చేయిస్తున్నావో...రూల్స్ అర్ధం కావట్లేదా నీకు. ఈ ఆటలు ప్రాక్టీస్ లు చేసుకుని దాని తర్వాత ఆడతారా ? " అంటూ మండిపడింది. ఇక నవదీప్ ఐతే డిస్కషన్ ఎందుకు ఈ టీమ్ అవుట్ అని చెప్పేసాడు. ఇక విన్నింగ్ జోడిగా నాగా - ప్రసన్న గెలిచారు. ఇక ఫస్ట్ టైం ప్రసన్న ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. ప్రసన్న, షాకిబ్ కి నవదీప్ ఎల్లో కార్డ్స్ ఇచ్చాడు.