బిగ్ బాస్ లో నేనే విన్నర్...

బిగ్ బాస్ అగ్ని పరీక్షలో డబ్బా రేకుల రాణి అలియాస్ శ్రీజ ఐతే బీభత్సం సృష్టించింది. విశాఖపట్నం నుంచి శ్రీజ వచ్చింది. అసలు మాములు వాగుడు కాదు. బాబోయ్  రావడమే స్టేజి మీద అరుస్తూ అందరినీ షాకయ్యేలా చేసింది. దమ్ము చూపిస్తా దుమ్ము రేపుతా అని అదేపనిగా వసపిట్టలా వాగుతూనే ఉంది. జడ్జెస్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. "మీకంటే బాగా ఎంటర్టైన్ చేయగలను...మీకు కంటెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి అవన్నీ నేను చేయగలను...బిగ్ బాస్ కి నన్ను ఎందుకు పంపాలో నేనే చెప్పేస్తున్నా..అభిజిత్ గారు అంతా మైండ్ లో స్ట్రాటజీస్ అవీ వేసి ఆడవాళ్లు...ఫిజికల్ గేమ్స్ ఎప్పుడూ ఆడలేదు. కానీ నేను ఫిజికల్ గా కూడా ఆడతాను .. స్మార్ట్ గా కూడా ఆడగలను..ఇక ఆడపులి గారి పేరును కూడా నేను త్వరలో సొంతం చేసేసుకుంటాను...బిగ్ బాస్ ఈ సీజన్ లో నేను విన్నర్ ఐపోతాను" అంటూ గ్యాప్ లేకుండా చెప్పేసింది. ఇక శ్రీముఖిని కూడా మాట్లాడనివ్వలేదు. "ఆల్రెడీ యాంకరింగ్ పొజిషన్ తీసేసుకున్నా నెక్స్ట్ యాంకర్ ని నేనే"అని శ్రీజ అనేసరికి రెడ్ ఇచ్చేసాడు. "మీలా కామ్ గా ఉండడం నా వల్ల కాదండి. నన్ను చూసి భయపడుతున్నారు అందుకే రెడ్ ఇచ్చారు" అని చెప్పింది. "నువ్వేం చేస్తావ్" అని నవదీప్ అడిగేసరికి తానొక సాఫ్ట్వేర్ డెవలపర్ అంటూ చెప్పింది. "ట్రోఫీ కావాలా, డబ్బులు కావాలా" అని శ్రీముఖి అడిగేసరికి రెండు కావాలి అని చెప్పింది. "నీ వాయిస్ ఇరిటేటింగ్ గా ఉందని ఎవరైనా చెప్పారా అని బిందు అడిగేసరికి అరే అందరూ డబ్బా రేకుల రాణి" అంటుంటారు అంది. "బిగ్ బాస్ కి ఎందుకు పంపాలి నిన్ను" అని నవదీప్ అడిగేసరికి "ఎందుకు పంపకూడదు ...మీకు టిఆర్పి కావాలి, మీకు కంటెంట్ కావాలి, షో మంచిగా కావాలి..నేనే టిఆర్పిని పెంచగలను ..గొడవలు పడతా ఎంటర్టైన్మెంట్ ఇస్తా" అని చెప్పింది. "ఈ పిల్ల అరుస్తోంది అని టీవీ బంద్ చేస్తారు" అని శ్రీముఖి అనేసరికి "అలా అనుకుంటే నువ్వున్నా సీజన్ టైంలోనే బంద్ చేసేవాళ్ళక్కా" అని శ్రీముఖికి కౌంటర్లు వేసింది. "నువ్వు మాట్లాడుతుంటే ఎప్పుడు ఆపేస్తుందా అనిపించేలా ఉంది కానీ ఇంటరెస్టింగ్ గా లేదు" అంటూ బిందు కూడా రెడ్ ఇచ్చింది. "బిగ్ బాస్ లో నా లాంటి వాళ్ళు కూడా ఉండాలి" అంది..."పీపుల్ వాంట్స్ థట్ అతి..అసలేమవుతుందో నాకు చూడాలని ఉంది" అని నవ్వుకుంటూ గ్రీన్ ఇచ్చాడు నవదీప్ .  

ప్లే బ్యాక్ సింగర్ శ్రీతేజకు శ్రీముఖి సలహా

  బిగ్ బాస్ అగ్నిపరీక్షకు సింగర్ శ్రీతేజ రాజమండ్రి నుంచి వచ్చాడు. ఇక శ్రీముఖి ఐతే రాజమండ్రి యాసలో మాట్లాడొచ్చు కదా అనేసరికి ఆ యాస ఉంటే అదే వచ్చేస్తుంది అని చెప్పాడు. ఎం చేస్తుంటారు, ఏదన్న మూవీస్ లో పాడావా అని అభిజిత్, బిందు మాధవి అడిగారు. తానొక ప్లే బ్యాక్ సింగర్ అని చాలా మూవీస్ లో పాడానని ఐతే తన పేరు ఎండ్ టైటిల్ కార్డ్స్ లో ఉంది కానీ మెయిన్ టైటిల్ కార్డ్స్ లో లేదు అని చెప్పాడు. ఇక అతని సింగింగ్ టాలెంట్ చూద్దాం అని శ్రీముఖి అనేసరికి నాగార్జున నటించిన గీతాంజలి మూవీలోని ఒక సాంగ్ పాడాడు. ఇక బిగ్ బాస్ ఎందుకు అన్న శ్రీముఖి ప్రశ్నకు "నేనేమి అనుకుంటున్నాను అంటే ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు వచ్చినా గట్టిగా మాట్లాడేవాళ్ళు వచ్చినా ముందు నేను వాళ్ళను కామ్ చేయగలను   మంచిగా మాట్లాడగలను. నేను అంత గట్టిగట్టిగా మాట్లాడలేదు. నేను చాలా నెమ్మదిగా మాట్లాడేవాడిని." అని చెప్పాడు. ఇక జడ్జ్మెంట్ విషయానికి వస్తే "ఇలాంటి ప్లాట్ఫార్మ్స్ మీకు చాలా వున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి పంపడానికి ఇంకా డిఫరెంట్ గా నాకేమీ కనిపించలేదు..ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి రండి " అంటూ నవదీప్, బిందు మాధవి కలిసి రెడ్ ఇచ్చారు. "మీ స్కిల్స్ వైజ్ సిట్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయగలరు అనేదే మీరు ప్రూవ్ చేసుకోవాలి అదొక్కటే మైండ్ లో పెట్టుకుని మీకు గ్రీన్ ఇస్తున్నా" అన్నాడు అభిజిత్. ఇక శ్రీతేజని పంపించేసేటప్పుడు కొంచెం ఏవన్నా వయలెంట్ సినిమాలు చూడు అంటూ శ్రీముఖి సలహా ఇచ్చింది.  

హగ్ చేసుకుని..ముద్దు పెట్టుకోవాలనుకుంది..!

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక తణుకు నుంచి పవన్ అనే కుర్రాడు వచ్చాడు. రాగానే క్యూట్ గా ఉన్నావ్ అంటూ పొగుడుతూ బుగ్గ గిల్లింది. తానూ ఒక డెమోన్ పవన్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. తానొక స్పోర్ట్స్ పర్సన్ , అలాగే మోడెలర్ అని యూనివర్సిటీ లెవెల్ లో టైటిల్ కూడా గెలుచుకున్నట్టు చెప్పాడు. యాక్టింగ్ మీద ఇంటరెస్ట్ తో హైదరాబాద్ వచ్చానని బిగ్ బాస్ కి వెళ్లి గెలిచి తన కోరికలన్నీ నెరవేర్చుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. డెమోనిక్ ఎంపరర్ అనే నవల లో హీరో వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతాడని తానూ అందుకే అలా పేరు పెట్టుకున్నానని చెప్పాడు. ఇక తన స్కిల్స్ చూపిస్తాన్నాయి చెప్పి కాళ్ళు పైకి లేపి చేతుల మీదనే బాలన్స్ చేస్తూ స్టేజి మొత్తం తిరిగాడు. ఫిసికల్ గా ఫిట్ గా ఉంటా, గేమ్స్ టాస్క్స్ ఆడగలను అని చెప్పడానికి ఇవన్నీ చేసి చూపించా అన్నాడు. "ఎవరినైనా ఇష్టపడ్డావా" అని శ్రీముఖి అడిగితె "ఆ అమ్మాయికి చెప్పావా లేదా" అని బిందు మాధవి అడిగింది. "జెన్యూన్ గా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. నేను ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదు. ఏ ఫామిలీ ఐనా కూడా పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని అని అడిగితె నువ్వేం చేస్తున్నావ్ అని అంటారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది" అని చెప్పాడు. "మనల్ని మోసం చేసిన వాళ్ళను ఎం చేయాలి" అని నవదీప్ అడిగాడు. "మోసం చేసిన వాళ్ళను మళ్ళీ మన లైఫ్ లోకి రానివ్వకూడదు" అని చెప్పాడు. "నేను యానిమేషన్ వీడియోస్ చూస్తూ జిమ్నాస్టిక్స్ లో ట్రైనింగ్ అయ్యాను. అలాగే స్ప్రింటర్ గా ట్రైనింగ్ తీసుకున్నా..." అని చెప్పాడు. అలాగే అభిజిత్ అడిగేసరికి లెవెల్ 2  సూపర్ సేన పోజ్ పెట్టి అందరినీ ఎంటర్టైన్ చేసాడు. ఇక రెండు లారీ టైర్స్ వీపు మీద పెట్టుకుని పుషప్స్ చేసాడు. ఒక డార్కెస్ట్ సీక్రెట్ చెప్పి నేను గ్రీన్ ఇచ్చేస్తాను అని బిందు మాధవి చెప్పేసరికి "నన్ను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పిలిచారు. ఆమె నాతో చాలా చెయ్యాలని చూసింది. ఎం చేయలేదు కానీ హగ్ చేసుకోవాలని, కిస్ చేయాలనీ చూసింది. కొంచెం ఎంజాయ్ చేశా కొంచెం చేయలేదు" అని చెప్పాడు. అలా ముగ్గురు గ్రీన్ ఇచ్చేసారు.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష... నవదీప్‌ను టార్గెట్ చేసిన కౌశల్ మండా!

బిగ్ బాస్ హిస్టరీలో కౌశల్ మందా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్. ఐతే ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జెస్ మీద ఒక వీడియోలో చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. "బిగ్ బాస్ అగ్నిపరీక్ష స్టార్ట్ అయ్యింది. అభిజిత్ బిగ్ బాస్ 4 విన్నర్, బిందు మాధవి ఓటిటి విన్నర్, ఇక నవదీప్ గారు బిగ్ బాస్ 1 లో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళను కాకుండా ఆ సీజన్ విన్నర్ శివబాలాజీ గారిని తీసుకొచ్చి ఆయనకు ఒక గౌరవం ఇచ్చినట్టు ఉండేది. ఇక మన విషయానికి వస్తే అది ఒక కాంట్రోవర్షియల్ సీజన్ కాబట్టి ఇష్టం లేని ఒక టీమ్ కి ఇష్టం లేని ఒక కంటెస్టెంట్ ని గెలిపించాల్సి వచ్చింది కాబట్టి గెలిపించారు అది కూడా కేవలం ఆడియన్స్ ప్రోద్బలం వల్లే. ఆడియన్స్ అనే వాళ్ళు లేకపోతే గెలవాలని ఎంత కసితో ఆడినా గెలిచే వాళ్ళం కాదు.   ఓట్ల విషయంలో కూడా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కాబట్టి ఇక గెలిపించక తప్పలేదు. ఇష్టం లేకుండా నన్ను గెలిపించారు కాబట్టి ఆ తర్వాత నన్ను చాలా దూరం పెట్టారు...అందుకే బిగ్ బాస్ ఏ సీజన్స్ కి పిలవకుండా దగ్గరకు రానివ్వకుండా ..ఐ డోంట్ కేర్ . న్యాయంగా ఆడాను , మీ అందరి ప్రేమతో గెలిచాను. బిగ్ బాస్ చరిత్రలో ఎవరికీ దక్కనంత గౌరవం నాకు దక్కింది. అందుకే నా సీజన్ హోస్ట్ కూడా నా చెయ్యి ఎత్తి పట్టుకునే ఆనవాయితీని పక్కన పెట్టి మానిటర్ లో చూపించి గెలిపించారు. అది నా సీజన్ లో నాకు తప్పా ప్రపంచంలో ఎవరికీ అలా జరగలేదు. అన్ని మనకే అవుతుంటాయి. ఐతే ఇప్పుడు నవదీప్ గారి బదులు శివ బాలాజీ గారిని పెట్టి ఉంటే బాగుండేది. ఇక అంతా వాళ్ళ ఇష్టం కదా. బెస్ట్ కామనర్ కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్లాలని కోరుకుంటున్నా" అంటూ చెప్పాడు.

అమరదీప్‌ని వాడేసుకున్న ఆరియానా.. సోహైల్ అంటే భయం!

బుల్లితెర మీద ఆర్జీవీ ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయ్యి బిగ్ బాస్ షోకి వెళ్లి ఇంకా ఫేమస్ ఐన ఆరియానా గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. అలాంటి ఆరియానా ఒక చిట్ చాట్ షోలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది. "ఆరియానా అనేది రీల్ నేమ్..అర్చన అనేది రియల్ నేమ్. కాలేజ్ డేస్ లో నా క్రష్ నాగ సౌర్య. ప్రస్తుతానికి ట్రెండ్ మారుతున్నట్టు క్రష్ కూడా మారుతూనే ఉంటుంది. పార్టనర్ ఇన్ క్రైమ్ లో టైంని బట్టి చాలా మంది ఉంటారు. లిమిటెడ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నా అందరూ క్రైమ్ చేసేవాళ్ళే ఉంటారు. కానీ ఇప్పుడు అమరదీప్ చౌదరి అండ్ రోల్ రైడా...అమరదీప్ మూవీలో ఐతే నేను స్పెషల్ సాంగ్ చేస్తాను. అమర్ నాకు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్ కాబట్టి నా మైండ్ సెట్ ఏంటి అనేది బాగా తెలుసు. ఒకవేళ బాగా చేయకపోయినా ఎక్ష్ప్లైన్ చేసి మరీ చేసేలా చేస్తాడు. కానీ సోహైల్ మూవీ స్పెషల్ సాంగ్ సరిగా చేయకపోతే కోప్పడతాడేమో అని భయం. నేను ట్రోల్ల్స్ ని పట్టించుకోను. పట్టించుకుంటే బాధపడతాను కాబట్టి. బాధపడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఇగ్నోర్ చేస్తా. ఆర్జీవీ ఇంటర్వ్యూ ... ఎవరీ అమ్మాయి అని తెలుసుకోవడానికి ఉపయోగపడింది. ఐతే బిగ్ బాస్ ద్వారా జనాలకు నేను ఏంటి నా ఐడెంటిటీ ఏంటి అనేది తెలిసింది. అమరదీప్ సాంగ్ కుకు కుమారి సాంగ్ కి రీల్ చేద్దామని వెళ్లి చేసాను. ఐతే ఆ సాంగ్ ఇంకా వైరల్ కావాలని అనుకున్నాం దాంతో ఫైనల్ గా రా అమర్ నిన్ను ఎత్తుకుంటా అని చెప్పి ఎత్తుకున్నా ..అలా ఎత్తుకున్న తర్వాత నాకు రెండు రోజులు బ్యాక్ పెయిన్ వచ్చింది. నేను మూవీస్ లో చేస్తున్నా.   రీసెంట్ గా ఆ ఒక్కటి అడక్కు అనే మూవీలో చిన్న రోల్ చేసాను. ఇంకా కొన్ని మూవీస్ లో నటించా ఐతే ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని వెయిట్ చేస్తున్నా. నాకు మూవీస్ బాగా కనిపించాలని ఉంది. ఎక్కువశాతం వెజ్ అప్పుడప్పుడు నాన్ - వెజ్. నాకు గ్రీనరీ అంటే ఇష్టం. ట్రెక్కింగ్ కి మౌంటైన్స్ కి వెళ్తుంటా. గ్రీనరీ అంటే ఇష్టం కాబట్టి ఒక పల్లెటూళ్ళో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను. నేను పల్లెటూరిలో పెరగలేదు. బిగ్ బాస్ తర్వాత సంబంధం లేని ఊరిలో ఇల్లు కట్టుకున్న. ఆ ఇంటి కలర్ కూడా గ్రీన్ గా ఉంటుంది. చుట్టూ పొలాలు ఉంటాయి. వీకెండ్స్ లో అక్కడ వంట చేసుకుని పొలాల్లో తిరుగుతూ స్పెండ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా సిల్వర్ స్క్రీన్ అంటే ఇష్టం. టాలీవుడ్ అంటే ఇష్టం..బాలీవుడ్ ఎప్పుడూ ఇంటరెస్టింగ్ ఉంటుంది. కానీ టాలీవుడ్ లో ప్లాన్ చేస్తున్నా కాబట్టి ప్లీజ్ దేవుడా టాలీవుడ్ లో ఐనా బాలీవుడ్ ఐనా లైఫ్ లో మంచి జరిగేలా చూడు స్వామీ. షోస్, మూవీస్ అంటే ఇష్టం లేదు అని కాదు..ప్రెజెంట్ వెబ్ సిరీస్ అంటే ఇష్టం ఉంది." అంటూ చెప్పుకొచ్చింది.

డ్యాన్సర్ రాజుకు మనసులో మాట చెప్పిన అన్షు!

ఢీ షో లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక ఇందులో డ్యాన్సర్ రాజు టవల్ డాన్స్ మాములుగా లేదు. ఇక మెయిన్ పాయింట్ ఏంటంటే అన్షు రెడ్డి - రాజు మధ్య సంథింగ్ సంథింగ్ అనే విషయం కూడా బయటపడింది. "మేల్ కంటెస్టెంట్స్ అంతా ఒక రోజు వచ్చి నీకు ప్రొపోజ్ చేస్తే నువ్వు ఎవరికీ ఓకే చెప్తావ్" అని ఆది అడిగేసరికి "రాజు అనుకుంటున్నా" అంటూ అన్షు చెప్పింది. ఇక రాజు సిగ్గు పడుతూ "నాకు ఇష్టమైన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి..పద్దతిగా ఉంటారు, బాగుంటారు " అన్నాడు. "లాస్ట్ ఎపిసోడ్ అప్పుడు దిష్టి తీయించుకోండి చాలా బాగున్నారని" అంటూ రాజు చెప్పిన మాటలను చెప్పేసింది. "అంటే అందరూ చెప్పారు..వాళ్ళు కూడా చెప్తే బాగుంటుంది అని అనుకుంటున్నా" అంటూ రాజు చెప్పేసరికి నందు గట్టిగా అరిచాడు. అన్షు పడీపడీ నవ్వేసింది. ఇక రాజు అండ్ టీమ్ చేసిన టవల్ డాన్స్ కి జడ్జెస్ ఫుల్ ఫిదా ఇపోయారు అలాగే "నా హార్ట్ ఇవ్వాళ రాజుకే కాదు చిట్టి మాష్టర్ కి కూడా" అంటూ ఒక రెడ్ హార్ట్ బెలూన్ ఇచ్చింది. "అన్షు నా సాంగ్ ఎలా అనిపించింది" అంటూ ఆమె దగ్గరకు వెళ్లి అడిగాడు. "నాకొక డౌట్ వచ్చింది. పండుకు అక్కడ ఏదో చేశారు కదా" అనేసరికి "అది యాక్ట్ ఇది హార్ట్" అంటూ చెప్పాడు. తర్వాత రెడ్ హార్ట్ బెలూన్ ఇచ్చాడు.

కంటెస్టెంట్ కి కంటి చూపు తెప్పిస్తామన్న థమన్

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఆగష్టు 29 న లాంచ్ కాబోతోంది. ఇక ఈ షోకి జడ్జెస్ గా ఎప్పటిలాగే థమన్, కార్తీక్, గీతా మాధురి వచ్చారు. ఇక హోస్ట్ గా శ్రీరామచంద్ర వచ్చేసాడు. ఇక సమీరా భరద్వాజ్ ఐతే ముసుగు కప్పుకుని శ్రీరామచంద్ర చుట్టూ తిరుగుతూ "కైసే హో జీ" అంటూ హిందీలో అడిగింది. "మై టీక్ హూ జి" అని చెప్పాడు శ్రీరామచంద్ర. తర్వాత ముసుగు తీసి లకలకలకలక అంటూ భయపెట్టేసింది. "ఏంటి సమీరా నువ్వేమిటి ఇక్కడ" అన్నాడు. "మూడు సీజన్లుగా నువ్వొక్కడివే అల్లాడిపోతున్నావ్ గ ఇక్కడ ఈ సీజన్ లో ఇద్దరం కలిసి అల్లాడిద్దాం" అని చెప్పింది. ఇక అద్భుతమైన కంటెస్టెంట్స్ వచ్చారు. ఇక థమన్, కార్తీక్ కలిసి చాలా ప్రామిస్ లు చేశారు కంటెస్టెంట్స్ కి. పవన్ కళ్యాణ్ సాంగ్ పాడిన ఒక కంటెస్టెంట్ కి థమన్ మాటిచ్చాడు. త్వరలో కలిసి మనం పని చేద్దాం అన్నాడు. ఇక ఒక కంటెస్టెంట్ ఐతే ఫ్లూట్ పట్టుకుని వచ్చి పాడిన సాంగ్ కి మంచి మ్యాటర్ ఉంది అంటూ గీత మాధురి కాంప్లిమెంట్ ఇచ్చేసింది. ఇక కార్తీక్ సాంగ్ పాడుతుంటే ఆ కంటెస్టెంట్ దానికి ఫ్లూట్ తో మ్యూజిక్ ని అందించాడు. తర్వాత ఒక దివ్యాంగుడు వచ్చారు. ఆయనకు కళ్ళు కనిపించవు. ఇక అతను పాడిన పాటకు జడ్జెస్ ముగ్గురు ఫుల్ ఫిదా ఇపోయారు. థమన్ ఐతే "ఎలా మీకు కంటి చూపు లేదు అనేసరికి చిన్నప్పటి నుంచి లేదు సర్ చూపు" అన్నాడు. "నేను కార్తీక్ కలిసి నీకు కంటి చూపు వచ్చేలా చేస్తాం" అని ప్రామిస్ చేసాడు.  

Jayam serial: ఇంట్లో నుండి వెళ్ళిపోయిన గంగ.. పైడిరాజు గొడవ!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -35 లో......శకుంతల గంగకి టిఫిన్ తీసుకొని వస్తుంది. శకుంతల తనతో ప్రేమగా మాట్లాడుతుంటే మా అమ్మ కూడా ఇలాగే మాట్లాడేది అని లక్ష్మి మాటలని గంగ గుర్తు చేసుకుంటుంది. గంగకి శకుంతల టిఫిన్ తినిపిస్తుంది. అదంతా పెద్దసారు చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు లక్ష్మి ఒక దగ్గర కళ్ళుతిరిగి కిందపడిపోతుంది. ఒక ఆయుర్వేద వైద్యడు చూసి లక్ష్మీ స్పృహలోకి వచ్చాక తనతో మాట్లాడతాడు. నాకు ఎవరు లేరు.. ఈ పని అయిన చేస్తూ జీవనం సాగిస్తానని లక్ష్మి చెప్పగానే అయితే గుడిలో పని చేయుటకి ఇంకా వంట చేయుటకు కావాలని పూజారి చెప్పారు.. ఆ పనులు చేస్తావా అని అతను అనగానే చేస్తానని లక్ష్మీ అంటుంది. మరొకవైపు రుద్ర దగ్గరికి గంగ వచ్చి థాంక్స్ చెప్తుంది. నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతానని చెప్తుంది. ఉండాలని రుద్ర చెప్తాడు. ఆ మాటలు అన్నీ ఇషిక, వీరు వింటారు. ఎలాగైనా గంగని ఇంట్లో నుండి పంపించాలని ఆ ఇద్దరు అనుకుంటారు. గంగ దగ్గరికి వెళ్లి.. నువ్వుంటే ఈ ఫ్యామిలీ ముక్కలవుతుందని ఇద్దరు కలిసి బెదిరిస్తారు. ఇండైరెక్ట్ గా గంగని ఇంట్లో నుండి వెళ్ళమని చెప్తారు. ఆ తర్వాత పైడిరాజు ఇంటి దగ్గరికి కి వెళ్తాడు. అప్పుడే గంగ ఫ్రెండ్ వచ్చి పెద్దమ్మ ఎక్కడికో వెళ్లిపోయింది. గంగని ఆ పెద్దింటి వాళ్ళు తీసుకొని వెళ్ళారని చెప్తాడు. ఇప్పుడు నన్ను ఎవరు పోషిస్తారని పైడిరాజు అనుకుంటాడు. ఆ తర్వాత నిద్ర నుండి గంగ సడెన్ గా లేచి నా వల్ల కుటుంబం విడిపోకూడదు.. నేనే వెళ్ళిపోతానంటూ ఇంట్లో నుండి బయల్దేర్తుంది. తరువాయి భాగంలో అందరు లేచేసరికి గంగ ఇంట్లో కన్పించదు. అప్పుడే పైడిరాజు.. పెద్దసారు ఇంటి ముందుకి వచ్చి నా కూతురుని నాతో పంపించండి అని గొడవ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : భాగ్యం యాక్టింగ్...డబ్బు గురించి చందు టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -244 లో.....శ్రీవల్లి భాగ్యం దగ్గరికి వెళ్లి మన బంఢారం ఆ ప్రేమ, నర్మద కచ్చితంగా బయటపెడుతారు. మీరే ఏదో ఒకటి చెయ్యండి అని శ్రీవల్లి తన పేరెంట్స్ కి చెప్తూ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత రామరాజు ఇంటికి వచ్చి సింహాద్రి చేసిన నమ్మకద్రోహం గురించి తలుచుకుంటు బాధపడతాడు. ఒకవేళ నా ఇంట్లో వాళ్ళే అలా నమ్మకంద్రోహం చేస్తే నా గుండె అక్కడే ఆగిపోయేదేమోనని రామరాజు అంటుంటే అందరు షాక్ అవుతారు. ఇందాక ప్రేమ నువ్వు ఏదో వల్లి వాళ్ళ గురించి చెప్తున్నావ్.. ఏంటని రామరాజు అడుగుతాడు. ప్రేమ చెప్పబోతుంటే అప్పుడే భాగ్యం, ఆనందరావు ఇద్దరు వస్తారు. బావగారు అంటూ వచ్చి తన కాళ్ళపై పడిపోతారు. ఏమైందని రామరాజు అడుగుతాడు. ఫైనాన్స్ ఇచ్చి మోసపోయాం.. మా ఆస్తులు.. డబ్బు అంతా పోయిందని భాగ్యం యాక్టింగ్ చేస్తుంది. ఒక్క రోజులో ఎలా పోతాయని తిరుపతి అడుగుతాడు. మా డబ్బు ఆస్తులు పోయి వారమవుతుంది. ఈ విషయం తెలిస్తే మా అమ్మాయికి వాల్యూ ఉండదని చెప్పలేదని భాగ్యం అంటుంది. ఇందాక వీళ్ళ గురించి ఏదో చెప్పబోతున్నవ్ ఏంటి ప్రేమ అని రామరాజు అడుగుతాడు. ప్రేమ చెప్పబోతుంటే ప్రేమని నర్మద పక్కకు తీసుకొని వెళ్లి.. ఇందాక సింహాద్రి మోసం చేస్తే ఎలా బాధపడ్డారు మావయ్య .. మళ్ళీ ఈ మోసం తెలిస్తే తట్టుకోలేడు వద్దని ఆపుతుంది. ఏం లేదు మావయ్య అని నర్మద కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఆస్తులు లేవని మిమ్మల్ని చులకనగా చూసే మెంటాలిటి కాదు లోపలికి రండి అని వాళ్ళని రామరాజు లోపలికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత మమ్మల్ని క్షమించండి అల్లుడు గారు.. మీ డబ్బు ఇవ్వనందుకు అని చందు కాళ్లపై భాగ్యం, ఆనందరావు పడి యాక్టింగ్ చేస్తుంటారు. చందుకి ఆ డబ్బు గురించి టెన్షన్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: పెళ్లిని ఆపడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్న ముగ్గురు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -443 లో.... పారిజాతాన్ని పంపించి చీరాబొట్టు తీసుకొని రమ్మంటాడు శివన్నారాయణ. అవి తీసుకొని వచ్చిన పారిజాతం.. శివన్నారాయణకి ఇస్తుంది. ఎప్పుడు నా ఇంట్లో శుభకార్యం జరిగిన ఒక చీరకొంటుంది. అలాంటిది ఈ ఇంట్లోనే శుభాకార్యం జరుగుతుంది.. అందుకే చీర తీసుకున్నానని శివన్నారాయణ పారిజాతంచే బొట్టు పెట్టించి కాంచనకి చీర ఇవ్వబోతుంటే.. ఎలా తీసుకొవాలి డ్రైవర్ తల్లికి ఇస్తున్నారా లేక ఇంటిఆడబిడ్డకి ఇస్తున్నారా అమ్మ ఆశీర్వాదం అనుకుంటానని కాంచన ఎమోషనల్ అవుతుంది. మీ అమ్మ ఆశీర్వాదం అనుకోమని శివన్నారాయణ అనగానే కాంచన సంతోషంగా తీసుకుంటుంది. ఆ తర్వాత ఈ పెళ్లి ఎలా ఆపాలని పారిజాతం, జ్యోత్స్న డిస్కషన్ చేసుకుంటుంటే అప్పుడే శ్రీధర్ వస్తాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తాడు. నువ్వు ఒప్పుకోవడం వల్లే కదా పెళ్లి ఇక్కడ వరకు వచ్చిందని శ్రీధర్ పై పారిజాతం కోప్పడుతుంది. కొన్ని ఎమోషన్స్ కి లొంగి రావాల్సి వచ్చిందని శ్రీధర్ అంటాడు. ముగ్గురికి పెళ్లి ఇష్టం లేదు కాబట్టి ముగ్గురం కలిసి ఎలా ఈ పెళ్లి ఆపాలో ట్రై చేద్దామని శ్రీధర్ అంటాడు. దానికి వాళ్ళు సరే అంటారు. మరుసటి రోజు పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. దశరథ్ బంధువులని ఆహ్వానిస్తుంటాడు. శివన్నారాయణ శౌర్యతో ఆడుకుంటాడు. కార్తీక్ ని కాంచన రెడీ చేస్తుంది. దీపని సుమిత్ర రెడీ చేస్తుంది. దీపపై‌ సుమిత్ర కోప్పడుతుంటే.. నువ్వు దీప చేసిన ఏ పనులు గుర్తుచేసుకోకు మమ్మీ అంటూనే అన్నీ గుర్తుచేసి దీపపై సుమిత్రకి కోపం వచ్చేలా చేస్తుంది జ్యోత్స్న. పువ్వులు దీపకి పెట్టు మమ్మీ అని సుమిత్రకి జ్యోత్స్న పువ్వులు ఇస్తుంది కానీ ఆ పువ్వులు సుమిత్ర కిందపడేస్తుంది. దాంతో దీప బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఎవరని...అడిగిన భర్త!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -807 లో.....రాజ్ కి నిజం చెప్పి కావ్యని తన దృష్టిలో బ్యాడ్ చెయ్యడానికి రుద్రాణి అనుకుంటుంది. రాజ్ దగ్గరికి రుద్రాణి వచ్చి.. నువ్వు అమెరికా వెళ్లొద్దని చెప్తుంది కావ్య.. నిన్ను వద్దనడానికి కారణం కావ్య ఇప్పుడు ప్రెగ్నెంట్ అని రుద్రాణి చెప్తుంది. అది విని రాజ్ షాక్ అవుతాడు. అప్పుడే కావ్య వస్తుంది. మీకోక విషయం చెప్పాలని  రాజ్ తో కావ్య అనగానే మీరు ప్రెగ్నెంటా అని రాజ్ అడుగుతాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. రుద్రాణి వంక చూస్తుంది. రాజ్ ని ఎలా ఆపాలో తెలియక నిజం చెప్పేసానని రుద్రాణి అంటుంది. నువ్వు ప్రెగ్నెంటా అని కావ్యని రాజ్ అడుగుతాడు. దానికి సమాధానంగా కావ్య అవునని చెప్తుంది. మీరంతా ఫ్రాంక్ చేస్తున్నారు కదా అని రాజ్ నవ్వుకుంటాడు. నిజమే చెప్తున్నాను నమ్మండి అని కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి దగ్గరికి రాజ్ వచ్చి అడుగుతాడు. వాళ్ళు కూడ నిజమే అని చెప్తారు. ఎందుకు నన్ను ఇంత మోసం చేశారు.. ఇన్ని రోజులు తన వెంటపడుతుంటే ఎందుకు ఎంకరేజ్ చేసారని రాజ్ వాళ్లపై కోప్పడతాడు. అసలు కావ్య ప్రెగ్నెంట్ కి ఎవరు కారణం అని రాజ్ వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు మౌనంగా ఉంటారు. నాకు తన మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉందని రాజ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాజ్ డల్ గా ఉండడం తో యామిని పేరెంట్స్ వెళ్లి యామినిని పెళ్లి చేసుకోమని అంటారు. లేదు నేను చేసుకోను.. కావ్య నన్ను మోసం చేసింది కానీ తప్పు చెయ్యలేదని నమ్ముతున్నానని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో కావ్య దగ్గరికి రాజ్ వచ్చి అసలు నీ కడుపుకి కారణం ఎవరు అంటూ తప్పుగా మాట్లాడుతుంటే.. రాజ్ చెంప చెల్లుమనిపిస్తుంది అపర్ణ. ఆ కడుపుకి కారణం నువ్వేరా నువ్వు తన భర్తవి.. నా కొడుకువి అని అపర్ణ చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నీతోనే నా నెక్స్ట్ బైక్ ట్రిప్... నిన్ను ప్రపంచానికి చూపిస్తాను!

బిగ్ బాస్ అగ్నిపరీక్షకు హైదరాబాద్ నుంచి ప్రసన్న కుమార్ అనే ఒక ఫిజికల్లీ ఛాలెంజెడ్ వ్యక్తి వచ్చారు. ఐఐఎం పని చేశారు అలాగే వీడియోగ్రాఫర్ గా, వీడియో ఎడిటర్ గా వర్క్ చేసినట్లు చెప్పారు. అలాగే ట్రావెలర్, బైక్ రైడర్, మోటార్ సైకిల్ రైడర్, 21 కిలోమీటర్స్ బ్లేడ్ మారథాన్ రన్నర్ అని చెప్పారు. బ్లేడ్ మారథాన్ అంటే అని నవదీప్ అడిగాడు. నిజానికి నేను ఫిజికల్లీ ఛాలెంజెడ్ అంటూ ఒక కాలిని చూపిస్తూ తన కథను చెప్పుకొచ్చారు. "ఒక వారంలో నేను న్యూజిలాండ్ కి వెళ్లిపోవాల్సి ఉంది. ఆ టైములో నేను నా ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్ చేసుకుని డిన్నర్ చేసి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యింది." అని చెప్పారు. "ఐనా కానీ అది ఎక్కడా మిమ్మల్ని ఆపినట్టుగా లేదుగా" అన్నాడు నవదీప్. "లేదుసార్.. నాకు యాక్సిడెంట్ అయ్యాక మాత్రమే ఇవన్నీ నేను సాధించగలిగాను. నా లైఫ్ చాలా నార్మల్ గా ఉండేది. నేను జావెలిన్ త్రో స్టేట్ ప్లేయర్ ని కూడా. హార్స్ రైడింగ్ కూడా చేస్తాను" అని చెప్పారు. దాంతో శ్రీముఖి ఒక్క మనిషిలో ఇన్ని టాలెంట్సా అంది. జడ్జెస్ కూడా ఫుల్ ఇంప్రెస్ ఇపోయారు. "నేను పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాక కోమాలో ఉన్నట్టుగా ఉండేవాడిని. బాబాయ్ ఉన్నాడు ఆయనే నన్ను మోటివేట్ చేసాడు. 65 కేజీలు ఉండాల్సిన వాడిని 40 కేజీలకు వచ్చేసాను. ఎందుకు జిమ్ కి వెళ్లి నిన్ను నువ్వు చేంజ్ చేసుకోకూడదు అన్నాడు. మా తాత నాకు అన్నీ చూసుకునేవాడు. ఈ వయసులో ఆయన్ని నేను చూసుకోవాలి కానీ నన్ను ఆయన చూసుకుంటున్నారు. నా పెళ్లి బిడ్డ ఉంటే నేను నా జీవితంలో సక్సెస్ అయ్యి ఉండాలి అనుకున్నా. మీ డాడీ ఇది అని నన్ను పాయింట్ అవుట్ చేయకూడదు అనుకున్న. ప్రోస్తెటిక్ లెగ్ పెట్టాక నాకు పెద్దగా తేడా ఏమీ అనిపించలేదు. వాళ్ళను చూసి నవ్వుతూనే ఉన్న. మారథాన్ కి వెళ్తానంటే మా నాన్న వద్దన్నారు. డాక్టర్ ఆయన్ని కన్విన్స్ చేశారు. అలా నేను ఆ రోజు నుంచి ఇంకా ఎక్కడా ఆగలేదు" అని చెప్పాడు. "మీరు ఏ జిమ్ కి వెళ్తారండి చెప్పండి. నేను మిమ్మల్ని చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతాను" అంటూ అభిజిత్ అడిగాడు. "మీ ఇద్దరి ట్రావెలింగ్ వీడియోస్ చూసినప్పుడు ఏదో ఒకరోజు మీతో కలిసి ట్రావెల్ చేద్దాం" అనుకునేవాడిని అని చెప్పాడు. దాంతో వెంటనే నవదీప్ "బ్రో నా నెక్స్ట్ బైక్ ట్రిప్ లో నువ్వు నాతో వస్తున్నావ్..నీ కథను ప్రపంచానికి చూపించకపోతే మాకు నిద్ర ఉండదు..నిన్ను హౌస్ లో చూడాలని ఉంది" అని చెప్పాడు. ఇక ముగ్గురు జడ్జెస్ గ్రీన్ ఇచ్చేసారు.

ఢీ డ్యాన్స్ పండు నాన్నకు హార్ట్ స్ట్రోక్... ఎవ్వరికీ చెప్పొదన్న ప్రదీప్!

ఇటుక మీద ఇటుక పెట్టి అనే సాంగ్ ఎంత ట్రెండ్ అయ్యిందో అందరికీ తెలుసు. ఢీ షో పండు ఈ సాంగ్ కి అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్ చేసాక చిన్నా పెద్దా చాలా మంది ఈ సాంగ్ ని చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ సాంగ్ ని బాగా వైరల్ చేశారు. అలాంటి పండు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి వచ్చాడు. "ఇటుక మీద ఇతుకు పెట్టి ఎన్ని ఇల్లులు కట్టారు ఇప్పటి వరకు" అని వర్ష అడిగేసరికి. ఇటుకులు పెట్టడమే సరిపోతోంది..ఇల్లు కట్టలేదు" అన్నాడు. వెంటనే వర్ష "బాబు ఇల్లు కట్టే టైపు కాదు.. ఇంట్లో దూరే రకం" అనేసరికి 'పిలిచి మరీ బాడ్ చేస్తున్నారు" అన్నాడు. "కొత్తగా బ్యాడ్ చేయాలా ఏంటి" అంది వర్ష నవ్వుతూ. "నేను కప్పు తీసుకునేవరకు ఏమీ అనను..కప్పు తీసుకున్నాక ఒక్కొక్కళ్ళను కప్పుతో కొడతాను" అన్నాడు పండు. "ఎనిమిదేళ్ల నుంచి నేను ఢీ చేస్తున్నా. ఈ సారి కప్పు నమదే...కొంతమంది డాన్స్ వేయట్లేదు అంటారు. ఏ జడ్జ్మెంట్ తో డాన్స్ లేదు అంటారో తెలీదు." అన్నాడు. ప్రదీప్ తో చేశారు కదా మీ ర్యాపొ ఎలా ఉంది అని వర్ష అడిగింది. "మా నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రదీప్ అన్న నాకు హెల్ప్ చేసాడు. ఆయనే ఈ విషయాలు ఎక్కడా చెప్పనివ్వరు." అన్నాడు. "లవ్ చేస్తున్నానని చెప్పి రిలేషన్స్ మెయింటెయిన్ చేయడం మీద అభిప్రాయం" అనేసరికి "నీకు అమ్మాయిలతో టైం స్పెండ్ చేయాలి అనే మైండ్ సెట్ లో ఉన్నప్పుడు నువ్వు లవ్ అని చెప్పుకోవడం వేస్ట్. నిజంగా ఎవరైనా మోసం చేస్తే ఖర్మ అని ఉంటుంది కదా అది వస్తుంది" అన్నాడు. "డబ్బుకు, మనుషులుకా.. ఎవరికీ విలువ ఇస్తావ్" అంది వర్ష. "ఈరోజుల్లో డబ్బులు లేకపోతే ఎవరూ విలువ ఇవ్వరు." అన్నాడు. "అసలు మీ సంపాదన ఎంత..ఇంత చేస్తున్నావ్ మరి " అంది. "నేను చేస్తోంది నా ఫామిలీ గురించి.  నాకు ఇంతవరకు సొంత ఇల్లే లేదు" అన్నాడు పండు. "స్నేహితులు పొడిచే వెన్నుపోటు చాలా బాధ కలిగిస్తుంది..నీ లైఫ్ లో ఎప్పుడైనా అలాంటిది జరిగిందా " అంది వర్ష. "ఒకప్పుడు నేను ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేశా. కొన్ని ప్రాబ్లమ్స్ వలన దూరమయ్యాను. అందుకే నేను ఎక్కువగా ఫ్రెండ్స్ ని చేసుకోను. నా చేతి మీద పచ్చబొట్టు ఉందిగా హరి అని అతనే" అన్నాడు పండు.

నవదీప్ పెళ్లి చూపులు.. ఆ అమ్మాయి ఎవరంటే!

బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒక ఇంటరెస్టింగ్ రాయలసీమ లేడీ కంటెస్టెంట్ ప్రియా కర్నూల్ నుంచి వచ్చింది. ఇక శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. "వీకెండ్ వస్తుంది. నాగార్జున గారు వస్తారు. నువ్వు ట్రాన్సఫార్మ్ ఐపోవాలి ఎం చేస్తావో చూస్తా" అంది. "వన్ మినిట్ మాత్రమే టైం" అంది బిందు మాధవి. ఇక ప్రియా మేకప్ చేసుకుంటూ ఉండగా "నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా" అని అడిగింది శ్రీముఖి. "లేదండి సంబంధాలు చూస్తున్నారండి.   నేను సింగల్ గా ఉన్నా కదా ఈ సిట్యువేషన్ లో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి మరి" అంది ప్రియా. "నీ ప్రాబ్లమ్ ఏంటి అబ్బాయిలు ఎందుకు నచ్చట్లేదు" అని నవదీప్ అడిగాడు. 'ఒకళ్ళు పొడుగ్గా ఒకళ్ళు పొట్టిగా ఉంటారు" అంది. "అబ్బాయిలంటే ఎలా ఉండాలి నీ దృష్టిలో" అని అభిజిత్ అడిగాడు. "రెస్పెక్ట్ ఇవ్వాలి, కేరింగ్ చూపించాలి" అంది. "ఐతే నీకు నవదీప్ ఒకే నా" అని శ్రీముఖి అడిగేసరికి "నేను పెళ్లి సంబంధం మాట్లాడానికి వచ్చాను" అంటూ ప్రియా దగ్గరకు వెళ్లి "నీకు ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టం" అని అడిగాడు. "హ్యాండ్సమ్ గా ఉండాలి ..ఉన్నారు. నాకంటే హైట్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే రీల్స్ చేస్తున్నా." అని చెప్పింది. "మీరు ఒకసారి కోల్డ్ డిప్ చేయండి నేను షూట్ చేస్తాను" అన్నాడు. వెంటనే గిన్నెలో ఉన్న ఐస్ క్యూబ్స్ లో ముఖాన్ని పెట్టింది ప్రియా. "తల ఐస్ క్యూబ్స్ లో ముంచేటప్పుడు మా అబ్బాయి నవదీప్ లో ఉన్న క్వాలిటీస్ చెప్తూ ముంచు" అంది. "బాగున్నారు..బాగా మాట్లాడుతున్నారు.. రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇప్పటికైతే " అంటూ తలను డిప్ చేసింది.  ఇంకో క్వాలిటీ చెప్పు అని శ్రీముఖి అడిగింది.  "నేను మీ గురించి చెప్పొచ్చా మా అత్తగారు చాలా బాగున్నారు ..ఇద్దరం కలిసి రీల్స్ చేద్దాం..అత్తాకోడళ్ల రీల్స్ ట్రెండింగ్ అండి ఇప్పుడు " అంటూ శ్రీముఖిని అత్తగారిని చేసేసింది. దాంతో శ్రీముఖి షాకయ్యింది. "అరేయ్ అబ్బాయి నవదీప్ నాకు కోడలు పిల్ల నచ్చేసింది" అంటూ ప్రియా చేతిలో నవదీప్ చేతిని పెట్టేసింది. "చక్కగా ఉంది..టాస్క్ ఇస్తే తప్పించుకునే చలాకి పిల్లలా ఉంది" అంటూ గ్రీన్ ఇచ్చాడు. "మీలో ఒక కోణం చూసాం మరి ఇంకో కోణం మేము చూడలేకపోయాం " అంటూ అభిజిత్ రెడ్ ఇచ్చాడు. "ఒక వెర్షన్ చూపించావ్..మంచి మాట్లాడుతున్నావ్, ఇంటరెస్టింగ్ పర్సనాలిటీ, క్యూట్ గా ఉన్నావ్, ఎంటర్టైన్ చేస్తున్నావ్" అంటూ బిందు మాధవి గ్రీన్ ఇచ్చింది. "మీరు హోల్డ్ లో ఉన్నారు" అంటూ శ్రీముఖి ఆమెకు చెప్పింది.

బిగ్ బాస్ అగ్ని పరీక్ష... భార్య మీద చెయ్యెత్తిన ప్రతీ ఒక్కడూ లూజరే

బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒక టఫ్ కంటెస్టెంట్ కి జడ్జెస్ కి మధ్య గట్టిగానే వార్ జరిగింది. బిందు  మాధవి మాస్క్ మ్యాన్ హరీష్ కి క్లాస్ ఇచ్చింది. హరీష్ అభిజిత్ కి క్లాస్ ఇచ్చాడు. నవదీప్ హరీష్ కి కౌంటర్లు ఇచ్చాడు. "బిగ్ బాస్ 8 సీజన్స్ లో కరెక్ట్ విన్నర్ ఎవరు అని మీరు అనుకుంటున్నారు" అని శ్రీముఖి హరీష్ ని అడిగింది. "విజె సన్నీ..మంచి ఎంటర్టైనర్" అని చెప్పాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాకా నేను ఉండలేను అంటే బయటకు రావడానికి కూడా ఉండదు అని చెప్పింది శ్రీముఖి. "సమస్యే లేదు. 2017 - 2018 లో నేను నా లైఫ్ ఐపోయింది అనుకున్నా. నాకు యాక్సిడెంట్ అయ్యింది. చేతికి, కాలికి బాగా ఫ్రాక్చర్ అయ్యింది. నాకు సర్జెరీ అవుతున్నప్పుడు కూడా డాక్టర్ ని ఒకటి అడిగా. నేను పరిగెత్తగలనా అని. ఇప్పుడు మరి పరిగెత్తగలరా అని శ్రీముఖి అడిగింది. దాంతో హరీష్ స్టేజి చుట్టూ పరిగెత్తాడు. లూజర్ అనే బోర్డుని తీసేయొచ్చు అని శ్రీముఖి చెప్పేసరికి...భార్య మీద చెయ్యెత్తిన ప్రతీ ఒక్కడూ లూజర్ ఈ బోర్డుని మెడలోని ఉంచుకుంటా అన్నాడు. నీ భార్య నిన్ను ప్రతీ రోజూ ఎలా భరిస్తోందో అంది బిందు మాధవి. ఆమె నన్ను చాలా ప్రేమిస్తుంది అన్నాడు. ఇక శ్రీముఖి బిగ్ బాస్ అనేది సత్తా ఉన్న అసామాన్యుడిని అని ప్రూవ్ చేయడానికి అని చెప్పేంతలో.."అంటే "బిగ్ బాస్ హౌస్ లోకి మనం ఫ్రెండ్ షిప్ చేసుకోవడానికి వెళ్తామా" అని అడిగాడు హరీష్. "ఫ్రెండ్స్ చేసుకుంటే తప్పేముంది" అన్నాడు అభిజిత్. "ఫ్రెండ్స్ కి ట్రోఫీ ఇచ్చేస్తారా..ఫ్రెండ్ షిప్ ఆఫ్టర్ బిగ్ బాస్ అన్నదే నేను నమ్ముతా " అంటూ అభిజిత్ కి హరీష్ క్లాస్ ఇచ్చాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఉండలేవు.. కేతమ్మకు షాక్ ఇచ్చిన నవదీప్

బిగ్ బాస్ అగ్నిపరీక్షకు మంచి కంటెంట్ ఇచ్చే కామన్ మ్యాన్ చాలా మంది ఎంట్రీ ఇస్తున్నారు. ఇక నల్గొండ నుంచి కేతమ్మ వచ్చింది. మేము గౌడంగలం..నేను కల్లు, ముంజెలు అమ్మాను. అనేసరికి మా కోసం కల్లు తెచ్చావా అని శ్రీముఖి అడిగింది. అమ్మ లేదు నాన్న లేడు. నేను పుట్టిన రెండు నెలలకు అమ్మ చచ్చిపోయింది. తాత, అమ్మమ్మ సాదారు నన్ను. గంతకు తగ్గ బొంత అన్నారు ఒక దిక్కు లేని వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. నన్ను బెజవాడకు తీసుకుపోయాడు. పెద్ద పాప కడుపులో పడ్డాక అప్పుల బాధ. నాట్లు వేయడానికి వెళ్ళా...పిల్లకు పాలు ఇచ్చాక నాకు తాగడానికి గంజి కూడా ఉండేది కాదు. నేను పడని కష్టం లేదు. హైదరాబాద్ వచ్చాము. వాచ్ మ్యాన్ ఉద్యోగం చేశా. ఆ దేవుడి దయతో ఒక 200 గజాలు కొనుక్కున్న. నా భర్తకు పక్షవాతం వచ్చింది..కానీ బిగ్ బాస్ నుంచి మంచి అవకాశం వచ్చింది" అంది. "బిగ్ బాస్ హౌస్ లో ఉండలేవు కేతమ్మ..నువ్వు భోళా మనిషివి.." అన్నాడు నవదీప్..ఆమెకు రెడ్ సిగ్నల్ ఇచ్చాడు. బిందు మాధవి కూడా రెడ్ ఇచ్చింది. "మా సీజన్ లో గంగవ్వ అనే పెద్దావిడ వచ్చారు. ఆమెకు బిగ్ బాస్ హౌస్ సరిపడక బయటకు వచ్చేసారు" అని అభిజిత్ చెప్పాడు. "కానీ  నేను ఎంత చేయాలో అంత చేయగలను" అని చెప్పింది కేతమ్మ. దాంతో అభిజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతానికి నిన్ను హోల్డ్ లో పెడుతున్నాం అని చెప్పింది శ్రీముఖి.

బిగ్ బాస్ అగ్ని పరీక్ష... అభిజిత్ ఫోటోని కాల్చేసిన దివ్య

బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొదలైపోయింది. ఇందులో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉన్నారు. మొదటిగా బెజవాడ నుంచి దివ్య ఎంట్రీ ఇచ్చిది. డాక్టర్ చదువుతోంది. ఒక్కో జడ్జ్ ఒక్కో ప్రశ్న అడిగారు. " ఇక్కడ నలుగురు బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో ఒకరు బెస్ట్ ఎవరు వరస్ట్ ఎవరో చెప్పాలి" అని అభిజిత్ అడిగాడు. వెంటనే దివ్య... "నేను బిగ్ బాస్ సీజన్ 1 లో నవదీప్ అంటే నాకు ఇష్టం. నవ్వించడం ఒక ఆర్ట్. స్పాంటేనియస్ గా నవ్వించడం ఎవరూ చేయలేని పని ఇక వరస్ట్ అంటే అభిజిత్" అని చెప్పింది దివ్య. దానికి అభిజిత్ ఫీల్ కాకుండా అది నీ అభిప్రాయం అని అన్నాడు. తర్వాత శ్రీముఖి ఒక టాస్క్ ఇస్తున్నాను..అభిజిత్ అంటే ఇష్టం లేదు అన్నావ్ కాబట్టి ఎలా నామినేట్ చేస్తావో చెప్పు అంది శ్రీముఖి. "బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ అభిజిత్ . చూడడానికి బాగుంటారు. టాస్కులు అన్ని ఆడాలి. సోఫాలో కూర్చుని మైండ్ గేమ్స్ ఆడేసి గెలిచేసాను అంటే ఒప్పుకోను నిజానికి ఆయన ఫోకస్ అంతా గేమ్ మీద కంటే మిగతా కంటెస్టెంట్స్ మీదనే ఉందని నాకు అనిపించింది. గేమ్ ని రెస్పెక్ట్ చేయనివాళ్లను నేను నామినేట్ చేస్తా" అని చెప్పి అభిజిత్ ఫోటోని కాల్చేసింది. "సారీ కానీ థ్యాంక్యూ అని ఏమన్నా చెప్తావా"అని శ్రీముఖి అడిగేసరికి "నామినేషన్స్ లో సారీ కానీ థ్యాంక్యూ కానీ ఏమీ ఉండవు కదా" అంది దివ్య. తర్వాత అభిజిత్ ని దివ్య ముందు నిలబెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి "నాకు నీ గేమ్ నచ్చలేదు అని చెప్పు" అంది శ్రీముఖి. "ఒక్క గేమ్ కూడా నాకు నచ్చలేదు. ఒక్క ఫిజికల్ టాస్క్ లో కూడా మీరు గెలిచినట్టు కనిపించలేదు. అలా అని ఫిజికల్ టాస్క్స్ మాత్రమే బిగ్ బాస్ కాదు." అని చెప్పింది. "ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 కామనర్స్ గెలుస్తారు సెలబ్రిటీస్ గెలుస్తారా" అని శ్రీముఖి అడిగింది. "సెలబ్రిటీ కంటే కామన్ వాళ్లకు బెటర్ ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే సెలబ్రిటీస్ కి ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు ఓపెనప్ కాలేరు.  కానీ కామన్ పీపుల్ కి ఆ భయం ఉండదు." అని చెప్పింది దివ్య. ఇక అభిజిత్ జనాలు మీ మాటను కూడా అంగీకరిస్తారేమో చూద్దాం అని వెళ్లి కూర్చున్నాడు.

ఫేమస్ అవ్వడం కోసం అందరి బతుకుల్ని బస్టాండ్ చేసిన యాంకర్ శివ

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఎంటర్టైన్మెంట్ యాంకర్స్ వచ్చారు. వాళ్ళే యాంకర్స్ వింధ్య విశాఖ, శివ, ఆర్జే చైతు, సౌమ్య, ప్రశాంతి, గీతా భగత్. "మేమంతా ఏ స్ట్రీమ్ లో ఉన్నా కూడా మార్గదర్శి ఎవరంటే మా సుమ కనకాల" అంటూ స్టేజి మీదకు రాగానే చైతు సుమని మాటలతో పడేసాడు. ఇక శివ ఐతే సుమ కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టుకున్నాడు. " దేవుడు దీవించండి.  నేను నీకెప్పుడు ఏమీ నేర్పించలేదు. నీకైతే ఏమీ నేర్పించలేను" అని భయపడిపోయింది సుమ. తర్వాత యాంకర్ ఆడిషన్స్ జరిగింది. ఇక  శివ ఇంకో కమెడియన్ కలిసి బైక్ మీద వెళ్తూ కింద పడిపోయారు. వాళ్ళను యాంకర్ వింధ్య విశాఖ ఇంటర్వ్యూ చేసింది. "మేము లైవ్ కవరేజ్ చేస్తున్నాం. ఇంత బ్లడ్ ఎలా పాజిబుల్ అండి. ఎం తాగుతారు రోజు పొద్దున్న మీరు" అండి. "ఏమీ తాగడం కాదు కానీ మిమ్మల్ని చూసి పడ్డాను నిజానికి" అని చెప్పాడు శివ. "పడితే బ్లడ్ ఏ కలర్ లో ఉంటుంది. రెడ్, బ్లాక్, ఎల్లో, ఓరేంజ్ మీరంతా ఓట్లు చేస్తూ ఉండండి" అని చెప్పింది. "నొప్పి ఎలా ఉందండి. అబ్బా, అబ్బ" అన్నట్టుగా ఉందా అని అడిగింది. "మిమ్మల్ని చూడగానే అబ్బ అనిపించింది" అన్నాడు. ఇక ఫైనల్ గా రాపిడ్ ఫైర్ రౌండ్ వచ్చింది. "పెళ్లి తర్వాత యాంకర్ వృత్తికి సౌమ్య దూరంగా ఉండడానికి గల కారణం ..ఏ. భర్త ఒప్పుకోకపోవడం వలన బి. యాంకరింగ్ మీద ఇంటరెస్ట్ తగ్గడం వలన" అని అడిగింది సుమ. భర్త వద్దనడం వలన అంటే బెటర్ అని ఆన్సర్ ఇచ్చింది. తర్వాత ఆర్జే చైతు వచ్చాడు "వీరిద్దరిలో నేను అనవసరంగా స్నేహం చేసాను అని అనిపించే వ్యక్తి ఎవరు..అవినాష్  లేదా శ్రీముఖి" అని అడిగింది. "ఒకళ్ళు నిన్ను నోటితో, ఇంకొకళ్ళు ముక్కుతో చంపేస్తారు" అంది సుమ. దాంతో చైతు ఆమ్మో అంటూ నవ్వేసాడు. తర్వాత శివ వంతు వచ్చింది.."శివ ఇంటర్వ్యూస్ లో కాంట్రావర్సీ చేసేది కేవలం డబ్బులు కోసం, ఫేమస్ అవ్వడం కోసం." అని అడిగింది సుమ. "డబ్బులు కోసం" అని శివ చెప్పేసరికి. "ఫేమస్ అవ్వడం కోసం అందరి బతుకుల్ని బస్టాండ్ చేసిన శివ" అంటూ ఆర్జే చైతు చెప్పాడు.

Jayam serial : ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకున్న గంగ.. శకుంతల ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -34 లో.....గంగని తీసుకొని శకుంతల ఇంటికి వస్తుంది. వద్దని ఇంట్లో వాళ్ళు అంటారు. ఇప్పుడు గంగ ఉంటే నష్టం ఏముందని శకుంతల అంటుంది. మీకు నా నిర్ణయం ఇబ్బంది పెడితే చెప్పండి విడిగా ఉందామని శకుంతల అనగానే అందరూ షాక్ అవుతారు. గంగని తీసుకొని నేనే వెళ్ళిపోతానని శకుంతల చెప్తుంది. పెద్దమ్మ ఇంకొకసారి ఆ మాట అనకండి ఇన్నిరోజులు ఈ కుటుంబం మీ నిశ్శబ్దం చూసింది.. ఇప్పుడు మీరు లేకుండా ఈ ఇల్లు ఉండదు.. మీ నిర్ణయానికి ఎవరు అడ్డు చెప్పరని రుద్ర అంటాడు. ఆ తర్వాత శకుంతల కోడలు, కూతురు గంగని తీసుకొని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లిన తర్వాత గంగ ఏడుస్తుంటే వాళ్ళు ఓదారుస్తారు. ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తుంటే గంగ వస్తుంది. గంగని చూసి కావాలనే ఇషిక తను బాధపడేలా మాట్లాడుతుంది. అందరూ ఫోన్ చేసి ఆ గంగని ఎందుకు మీ ఇంట్లో ఉంచుకున్నారని అడుగుతున్నారని అంటుంది. ఆ మాటలు గంగ విని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత శకుంతల వచ్చి గంగకి టిఫిన్ తీసుకొని వెళ్తుంది. శకుంతల వెళ్లేసరికి గంగ ఏడుస్తుంది. తనని పైన కూర్చొబెట్టుకొని దైర్యం చెప్తుంది. మా అమ్మ కూడా ఇలాగే చెప్పేదని వాళ్ళ అమ్మ ఏమందో శకుంతలకి చెప్తుంది గంగ. తరువాయి భాగంలో ఇషిక, వీరు కలిసి గంగ తో మాట్లాడతారు. తను ఇంట్లో నుండి వెళ్లిపోయేలా మాట్లాడతారు. శకుంతల కాళ్ళు మొక్కి గంగ ఇంట్లో నుండి వెళ్లిపోవాలని ట్రై చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.