కేసీఆర్ తోనూ ఢీ అంటే ఢీ.. కవిత మాటల అర్ధం అదేనా?
Publish Date:Jan 2, 2026
తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని ఖతమేనా? ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు కవిత ఇదే విషయాన్ని ఒకింత నర్మగర్బంగా చెప్పారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆరంభం సందర్భంగా సభకు వచ్చి ఓ ఐదారు నిముషాలు సభలో కూర్చున్న బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు కల్వకుంట్ల కేసీఆర్.. ఆ తరువాత సభ నుంచి బయటకు వెళ్లి పోయారు.
అయితే.. ఆ రోజు సభలో ఏ విషయంపైనా చర్చ జరిగే అవకాశం లేనందున ఆయన సభనుంచి వెళ్లిపోయారనీ, కొత్త సంవత్సరం రెండో తేదీ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ సర్కార్ ను అడుగడుగునా ఇరుకున పెట్టి తన విశ్వ రూపాన్ని చూపిస్తారనీ బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు గట్టిగా చెప్పారు. అదే నమ్మారు. అయితే కేసీఆర్ మాత్రం సభలో పార్టీ గొంతు గళంగా వినిపించేందుకు ఉప నాయకులను నియమించడంతో.. ఆయన ఈ శీతాకాల సమావేశాలలో ఇక సభలో కనిపించరని పరిశీలకులు ఆ రోజే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు.
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవిష్యత్ పై తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సభకు కేసీఆర్ డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఇక ఖతమే అని అన్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 2) శాసనమండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో చిట్ చాట్ చేసిన ఆమె.. తన తండ్రి కేసీఆర్ కే సవాల్ విసిరారు. ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. తప్పు చేయకుంటే కేసీఆర్ సభకు రావాలని సవాల్ విసిరారు. అధినాయకుడు అసెంబ్లీకి రాకుండా.. పిల్ల కాకులకు సభాసమయాన్ని వదలడం సరికాదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కు ప్యాకేజీలు, అమ్ముకోవడం తప్ప ఏం తెలియదని ఎద్దేవా చేశారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య బాండ్ ఉందని ఆరోపించిన ఆమె హరీష్ సీఎం చాంబర్ లో అరగంట సేపు ముచ్చటించడం నిజం కాదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించిన ఆమె.. రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా అసెంబ్లీ చాలా ప్రమాదకరమన్నారు.
కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ పై నేరుగా అటాక్ చేయడం ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ తో తాను మాట్లాడి నాలుగు నెలలు పైనే అయ్యిందన్నారు. కేటీఆర్, హరీష్ లకు పార్టీని వదిలేయడంపై ఆమె ఈ సందర్భంగా కేసీఆర్ ను తప్పుపట్టారు. ఇలా మాట్లాడడం ద్వారా ఆమె తాను కేసీఆర్ తో డీ అంటే ఢీ అనడానికి రెడీ అన్న సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత తన శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. శుక్రవారం (జనవరి 2) కూడా ఆమె శాసనమండలి స్పీకర్ ను తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు.
సొంత ఇంటి పంచాయతీ పరిష్కరించలేక చేతులెత్తేశారు.. కేసీఆర్ పై రఘునందన్ విమర్శలు
Publish Date:Jan 2, 2026
బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులు
Publish Date:Jan 1, 2026
కొత్త సంవత్సరంలో కవిత వార్ కొత్త పుంతలేనా?
Publish Date:Dec 31, 2025
మెగా ఫ్యాన్స్ వర్సెస్ నాగబాబు.. జనసైనికులు ఎటువైపు?
Publish Date:Dec 31, 2025
దొంగే దొంగా దొంగా అని అరచినట్లుగా జగన్ తీరు!
Publish Date:Jan 2, 2026
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో ఇప్పటికే వైసీపీ నాయకులు పలువురు పీకలోతు ఇరుక్కున్నారు. కొందరు అరెస్టయ్యారు కూడా. మరి కొందరు విచారణలను ఎదుర్కొంటున్నారు. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ వెనుక ఉన్నది వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపంపై పిటిషన్ దాఖలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలి. కానీ తాజాగా తెలంగాణలో పిటిషన్ దాఖలైంది. ఔను తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ పిటిషన్ దాఖలు కావడం వినడానికి ఆశ్చర్యకంగా ఉన్నావాస్తవం.
నిజానికి కమిషన్ల కక్కుర్తితో తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగనే వెనకుండి తెలంగాణ హైకోర్టులో ఇలా ఎదురు పిటిషన్ వేయించడమేంటన్న విస్మయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. జగన్ హయాంలో తిరుమల కేంద్రంలో సర్వ అనర్ధాలూ జరిగాయన్న విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక పరకామణి చోరీ వ్యవహారంలో ఫిర్యాదు దారుడైన ఏవీఎస్వో సతీష్ హత్య జగన్ హయాంలో తిరుమలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, తిరుమల పవిత్రతను దెబ్బతీసే చర్యలూ యథేచ్ఛగా జరిగాయనడానికి నిదర్శనంగా చెబుతున్నారు పరిశీలకులు. ఆయన హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలే.. కనీసం విపక్ష హోదా లేకుండా వైసీపీ ఘోర పరాజయం కావడానికి కారణమని శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. జగన్ హయాంలో తిరుమల కేంద్రంగా జరిగిన అక్రమాల సంగతి కాసేపు పక్కన పెట్టి.. తెలంగాణ హైకోర్టులో తిరుమల ప్రసాదాల నాణ్యతపై దాఖలైన పిటిషన్ లోని అంశాలను గమనిస్తే..
ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారికి నైవేద్య సంతర్పణ జరగడం లేదన్నది ఈ పిటిషన్‌లోని ప్రధానాంశం. పిటిషన్ తరఫు సుశీలారాం అనే న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో టీటీడీ ఆమోదించిన తీర్మానాలను ఈ బోర్డు తుంగలో తొక్కిందన్నది మరో ప్రధాన ఆరోపణ. అయితే ఈ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొయినుద్దీన్ తో కూడిన ధర్మాసనం విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకెళ్లారా? అని ప్రశ్నించింది. దీనిపై తాము మౌఖికంగా టీటీడీ బోర్డుకు విన్నవించినట్టు చెప్పారు పిటిషనర్ కే. శివకుమార్. భక్తుల విశ్వాసాలను పరిగణలోకి తీసుకుని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవల్సిందిగా కోరారు పిటిషనర్. అయితే ఈ పిటిషన్ పట్ల కోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు పటిషన్ విచారణార్హతపై తన నిర్ణయం వాయిదా వేసింది.
వైవీ సుబ్బారెడ్డి, భూమన వంటి అన్యమతస్థులను టీటీడీ బోర్డు చైర్మన్లుగా నియమించిన జగన్.. అలాగే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం, శాలువాల కుంభకోణం, శ్రీవాణి టికెట్లకు లెక్కలు చూపక పోవడం, పరకమాణి చోరీ, స్విమ్స్ ఆస్పత్రుల్లోని మెడికల్ షాపుల నుంచి నెలకు రూ. 40 లక్షల మేర వసూలు చేయడం ఇలా ఎన్నోఅవకతవకలు జగన్ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలు కావడంపై సర్వత్రా విస్మయం, ఆగ్రహం వ్యక్తమౌతోంది. అన్నదానంలో నాసిరకం సరుకులు, క్యూలైన్లలో భక్తులకు ఇవ్వాల్సిన సాంబార్ రైస్, పెరుగన్నం, పాలు వంటివి ఇవ్వకుండా ఆపడం.. వంటి పలు సంఘటనలు జరిగింది జగన్ హయాంలోనే కదా అని భక్తులు కూడా అంటున్నారు.
కొండ మీదే కాదు కొండ కింద గోవిందరాజుల స్వామి వారి ఆలయ గోపుర బంగారు తాపడంలోనూ తమ చోర బుద్ధి చాటింది జగన్ అండ్ కో. ఈ మొత్తం గోపుర తాపడంలో 69 కోట్ల విలువైన బంగారం కొట్టేసినట్టు తేలింది. ఇదే గోపురంపై ఉన్న ముప్పై రెండు విగ్రహాల విధ్వంసానికి కూడా కారకులవడం మరో అపచారం.. ఇక వరాహ స్వామి వారి గోపురం బంగారు తాపడంలో లిక్విడ్ రూపంలోనూ బంగారం కొట్టేయడం వంటి ఎన్నో కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి.
బ్రిటిషర్ల హయాంలో కూడా తిరుమల వేంకటేశ్వరుడి విషయంలో ఇలా అపచారాలు జరగలేదని పండితులు అంటున్నారు. అయితే జగన్ హయాంలో మాత్రం తిరుమల పవిత్రతను మంటగలిపేలా అపచారాలు జరిగాయని అంటున్నారు. ఆ అరాచకాలన్నీ ఒక్కటొక్కటిగా ఇప్పుడు బయట పడుతుం డటంతో.. హిందూ ఓటు బ్యాంకు దూరమైపోతోందన్న భయంతోనే జగన్ తిరుమల పవిత్రత విషయంలో ఎక్కడ లేని అక్కరా కనబరుస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. తన హయాంలో చేయాల్సిందంతా, చేయగలిగినంతా చేసి ఇప్పుడు తగుదునమ్మా అంటూ శ్రీవారికి ఆగమశాస్త్రం ప్రకా రం నైవైద్య నివేదిన జరగడం లేదంటూ కోర్టును ఆశ్రయించడం వెనుక ఉన్నది కేవలం రాజకీయమే కానీ, శ్రీవారిపై భక్తితో కాదని అంటున్నారు.
వైసీపీ వారికి అప్పనంగా వైకుంఠ ద్వార దర్శనాలు!?
Publish Date:Dec 30, 2025
140 ఏళ్ల ప్రస్థానం.. కాంగ్రెస్ లో జోషెదీ.. కార్యకర్తల్లో ఉత్సాహమెక్కడ?
Publish Date:Dec 29, 2025
చట్టంతో గేమ్స్.. జగన్ కు అబ్బిన అనువంశిక విద్య!
Publish Date:Dec 26, 2025
క్రిస్మస్ వేడుకలకూ జనసమీకరణేనా జగన్?
Publish Date:Dec 26, 2025
మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Publish Date:Aug 28, 2025
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు.
కేంద్రం, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. . రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్ భగవత్.. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్ఎస్ఎస్ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.
నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.
రాహుల్ టార్గెట్ గా అరవింద్ విమర్శల వర్షం.. మర్మమేంటంటే?
Publish Date:Aug 28, 2025
కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్ఫ్యూజన్
Publish Date:Jul 25, 2025
సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!
Publish Date:Apr 19, 2025
కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?
Publish Date:Apr 8, 2025
కొత్త ఏడాదిలో జీవితాన్ని మార్చే 5 మ్యాజిక్ టిప్స్ ఇవి..!
Publish Date:Dec 31, 2025
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు. అయితే కష్టం లేదా సమస్య వచ్చినప్పుడు వాటిని భరించాలని, ఓర్పుతో వాటిని అధిగమించాని తెలిసిన మనుషులు ఆరోగ్యం దగ్గర మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే నేటికాలంలో ఆరోగ్యం విషయంలో సర్దుబాటు చేసుకునే వారు ఎక్కువ. అలాగే జీవితం అంటే ఎప్పుడూ ఇంతే అని నిరాశలో బ్రతికేవారు కూడా ఎక్కువే. ప్రతి సారి ఇలాంటివి మామూలే అనుకోకుండా కనీసం కొత్త ఏడాదిలో అయినా ఆరోగ్యం, జీవితం గురించి కాస్త శ్రద్ద పెట్టడం వల్ల మెరుగవ్వచ్చు. 5 టిప్స్ ఫాలో అవ్వడం వల్ల జీవితమే మారిపోతుంది. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
ఆరోగ్యంగా ఉంటేనే అన్ని విషయాల్లో పర్పెక్ట్ గా ఉండగలం..
పైన పేర్కొన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే చురుకుగా ఉండటం సాధ్యమవుతుంది. ఆరోగ్యంగా ఉండటం వల్ల శక్తి, సమయం, డబ్బు ఆదా అవుతాయి. అంతేకాదు ఇతరులకు సహాయం చేయవచ్చు. తాము ఆరోగ్యంగా, పాజిటివ్ గా ఉండటమే కాకుండా చుట్టూ ఉన్న వారిని కూడా అటు వైపు ఇన్ప్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది.
బరువు మాత్రమే కాదు..
చాలా మంది ఆరోగ్యం గురించి తీసుకునే నిర్ణయాలలో ఈ ఏడాది బరువు తగ్గాలి.. లాంటివి ఉంటాయి. అయితే బాగా ఆరోగ్యంగా ఉండటం అంటే బరువు తగ్గడం, పొట్ట తగ్గించుకోవడం మాత్రమే కాదు. తెలివితేటలను, మనస్సును నిరంతరం మెరుగుపరచుకుంటూ ఉండాలి. జిమ్‌లో కండరాలు పెంచడానికి వ్యాయామం చేయడమే కాదు.. నలుగురికి సహాయపడటం, మానవత్వంతో ఉండటం వంటి గుణాలు కూడా ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఎన్నో రెట్లు మెరుగుపరుస్తాయి.
నిద్ర ముఖ్యం..
కార్పొరేట్ ఉద్యోగాలు, యంత్రాల్లా పని చేసే మనుషులు, ఎలక్ట్రానిక్ వస్తువుల్లా సాగే శరీరాలు.. ఇది మాత్రమే కాకుండా గాడ్జెట్లు నాణ్యమైన నిద్ర అంటే ఏంటో తెలియకుండా మనుషులను మార్చేశాయి. అందుకే ఈ నూతన సంవత్సరంలో నిద్ర విషయంలో రాజీ పడకూడదని ఎవరికి వారు ఒక నిబంధన పెట్టుకోవాలి. శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుకోవడానికి, ఎలాంటి జబ్బులు శరీరానికి కలగకుండా ఉండటానికి ప్రతి రాత్రి సమయానికి నిద్రపోవాలి. ఇది నిద్ర కణాలను పునరుజ్జీవింపజేస్తుంది, మరుసటి రోజు లేవగానే ఎనర్జీగా ఉండేందుకు, మానసిక, శారీరక ఒత్తిడి తగ్గేందుకు సహాయపడుతుంది.
శ్వాస- ప్రాణ శక్తి..
ప్రతిరోజూ కొంత సమయం శ్వాసపై శ్రద్ధ వహించాలి. కాలానుగుణ పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి చేస్తే శరీరంలో మంచి ఎనర్జీ, ప్రాణ శక్తి మెరుగవుతాయి. రోజువారీ అలసట అధిగమించడానికి ప్రకృతిలో సమయం గడపాలి. సూర్యకాంతిలో గడపడం, స్వచ్ఛమైన గాలి ఉన్న చోట నడవడం. నేలపై చెప్పులు లేకుండా నడవడం, వంటివి చేయాలి. ప్రకృతిని గౌరవిస్తే అది ప్రేమను, శక్తిని, ఆరోగ్యాన్ని తిరిగిస్తుంది.
ప్రతిభ- సామర్థ్యం..
ప్రతి వ్యక్తి తమలో ఉన్న ప్రతిభను, సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే అంత గొప్ప ఫలితాలు పొందగలుగుతారు. ఏదో బ్రతికేస్తున్నాం అనుకోకుండా జీవితాన్ని మరింత అందంగా ఎలా మార్చుకోవాలో, అవకాశాలను ఎలా సృష్టించుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి. ఇది జీవితంలో అబివృద్దికి దారి తీస్తుంది.
- రూపశ్రీ
నార్సిసిస్టులు.. వీళ్లను గుర్తించడానికి ఇవే సరైన మార్గాలు..!
Publish Date:Dec 30, 2025
ఎంతో సంతోషంగా ఉన్న భార్యాభర్తల బంధాన్ని కూడా నాశనం చేసే విషయాలు ఇవి..!
Publish Date:Dec 29, 2025
మనసులోని మాటను దైర్యంగా బయటకు చెప్పలేకపోతున్నారా... ఈ నిజం తెలుసుకోండి..!
Publish Date:Dec 27, 2025
ఈ రూల్స్ ఫాలో అయితే న్యూ ఇయర్ లో పిల్లల సక్సెస్ పక్కా..!
Publish Date:Dec 26, 2025
ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగితే మ్యాజిక్కే!
Publish Date:Dec 30, 2025
భారతీయుల వంటింట్లో బోలెడు దినుసులు ఉంటాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు మెరుగ్గా ఉంటాయి. అటు మౌత్ ఫ్రెషనర్ గా, ఇటు వంటల్లో రుచిని పెంచడానికి ఉపయోగించే దినుసుల్లో సోంపు అగ్ర స్థానంలో ఉంటుంది. సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? సోంపు నీరు ఎలా తయారు చేసుకుని తాగాలి? ఇవన్నీ తెలుసుకుంటే సోంపుతో కలిగే బెనిఫిట్స్ ను అందరూ పొందవచ్చు.
సోంపు నీటి ప్రాధాన్యత..
సోంపు నీటిని శక్తివంతమైన, ఆరోగ్యకరమైన పానీయంగా ఉపయోగిస్తున్నారు. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తరచుగా సోంపును మౌత్ ఫ్రెషనర్‌గా మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ సోంపు దీని కంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనేక వ్యాధులను నయం చేయడంలో శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది.
సోంపు నీరు ఎలా తయారు చేయాలి?
సోంపును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇది కడుపు సంబంధిత వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
సోంపు నీరు ప్రయోజనాలు..
ఉదయం ఖాళీ కడుపుతో సోంపు నీటిని తాగితే, శరీరంలో అనేక సానుకూల మార్పులు కలుగుతాయి. సోంపు నీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది.
సోంపు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు సంబంద వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇది యాసిడ్ కారణంగా ఏర్పడే ఎసిడిటీ, యాసిడ్ రిప్లక్స్ వంటి ఉదర సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కడుపు చికాకును తగ్గిస్తుంది, కడుపును మంటను తగ్గించి కడుపును శాంతపరుస్తుంది.
ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కుంటున్న అతి ఆకలి సమస్యకు సోంపు చెక్ పెడుతుందట. కడుపు నిండినప్పటికీ పదే పదే ఆహారం తినాలని అనిపించడం, ఆకలి వేయడం వంటి లక్షణాలు ఆరోగ్యానికి హానికరం. సోంపు నీరు తాగడం వల్ల అనవసరంగా అతిగా ఆకలి వేయడం అనే సమస్య తగ్గుతుంది.
ప్రతి రోజూ ఉదయాన్నే సొంపు నీరు తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. ఇది కడుపుకు సంబంధించిన అనేక వ్యాధులు, సమస్యలను తగ్గిస్తుంది.
సోంపు నీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే సోంపులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
సొంపు నీరు మహిళలకు ఋతుస్రావ సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. పాలిచ్చే స్త్రీలలో పాలు పెరగడానికి కూడా సహాయపడుతుంది.
-రూప
శీతాకాలంలో ఉసిరికాయతో ఈ కాంబినేషన్లు ట్రై చేయండి.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..!
Publish Date:Dec 29, 2025
వాల్నట్స్ తింటే ఈ వ్యాధులు అన్నీ మాయం..!
Publish Date:Dec 27, 2025
గ్యాస్ సమస్యను పెంచే స్నాక్స్.. సాయంత్రం 6గంటల తర్వాత వీటిని అస్సలు తినకూడదు..!
Publish Date:Dec 26, 2025
రోజూ బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తింటున్నారా?.. అయితే ఈ నిజం తెలుసుకోండి!
Publish Date:Dec 25, 2025