బిగ్ బాస్-9 గ్రాండ్ లాంచ్.. ఈసారి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!

  బిగ్ బాస్ సీజన్-9 నిన్న(ఆదివారం) రాత్రి గ్రాండ్ గా స్టార్ట్ అయింది. మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ తో హౌస్ ఫుల్ అయింది. తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు సామాన్యులు(కామనర్స్) తో హౌస్ ఎంటర్‌టైన్‌మెంట్ కి అడ్డాగా మారింది. (Bigg Boss 9 Telugu)   హోస్ట్ నాగార్జున బ్లాక్ డ్రెస్ లో రెడీ అయి వచ్చేశాడు. ఇక మొదటగా హౌస్ ని పరిచయం చేశాడు. ఆ తర్వాత సెకెండ్ హౌస్ ని రివీల్ చేశాడు. జీ తెలుగులో వచ్చిన  'ముద్ద మందారం' సీరియల్ ఫేమ్ తనూజ హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'లక్స్ పాప' సాంగ్ ఫేమ్ ఫ్లోరా సైని, జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయల్, 'రాను బొంబాయ్ కి రాను' సాంగ్ ఫేమ్ రాము రాథోడ్, 'బుజ్జిగాడు' ఫేమ్ సంజనా గల్రానీ, సీరియల్ నటి రీతు చౌదరి, డాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సీరియల్ యాక్టర్ భవానీ శంకర్, కమెడియన్ సుమన్ శెట్టి ఎంట్రీ ఇచ్చారు.    ఇక కామన్ మ్యాన్ కేటగిరీలో మొదటగా కళ్యాణ్ పడాల(సోల్జర్), ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ అలియాస్ హరిత హరీష్, డీమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి ఎంట్రీ ఇచ్చారు. ఇక అందరికి టాటా బైబై చెప్పి నాగార్జున వెళ్లే టైమ్ లో యాంకర్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. తను మరో కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపించింది. అతనే మర్యాద మనీష్.. లాస్ట్ కంటెస్టెంట్ గా కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత హౌస్ కి తాళాలు వేసి నాగార్జున అందరికి బై చెప్పేసి వెళ్ళిపోయాడు. హౌస్ లో ప్రస్తుతం పదిహేను మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.   

ఊహకందని మలుపులతో బిగ్ బాస్-9 ప్రోమో.. డబుల్ హౌస్.. డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

  బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ప్రోమో వచ్చేసింది. సరికొత్తగా గత సీజన్లకు భిన్నంగా ఈ బిగ్ బాస్ హౌస్ ఉంది. దీనికి సంబంధించిన ప్రోమోలో హౌస్‌లో ఎలా ఉండబోతుందనే దానిపై ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. అలాగే హౌస్‌లోకి వెళ్లబోతున్న కంటెస్టెంట్స్‌ని రిలీల్ చేశారు. ముఖ్యంగా అగ్నిపరీక్షలో ఫైనలిస్ట్‌లుగా నిలిచిన టాప్ 13 మంది ఫైనలిస్ట్‌లను బిగ్ బాస్ స్టేజ్‌పై చూపిస్తూ వాళ్లతో మాట్లాడి టాప్ 5 కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపిస్తున్నారు నాగార్జున. (Bigg Boss 9 Telugu)   ఇది చదరంగం కాదు.. రణరంగమే అంటూ బిగ్ బాస్ సీజన్-9కి హైప్ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమోతో వచ్చేశారు. నేడు అనగా ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి జియో హాట్ స్టార్, స్టార్ మా ఛానల్‌లో బిగ్ బాస్ సీజన్-9 ఆట మొదలు కానుంది. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన రెండున్నర నిమిషాల నిడివితో ఉన్న ప్రోమోను రిలీజ్ చేశారు బిగ్ బాస్ టీమ్. ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులు.. డబుల్ హౌస్‌తో డబుల్ జోష్‌తో మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్-9.    ఆశ ఒక పక్క.. ఆశయం మరోపక్క ఈ రణరంగం చూడ్డానికి మీరు సిద్దమా అంటూ నాగార్జున బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి.. నేను దేనికైనా సిద్దమే అనేశాడు. గోడల్ని బద్దలు కొట్టి బిగ్ బాస్ సెట్‌లో ఉన్న రెండు హౌస్‌లను చూపించాడు నాగార్జున. ఇప్పుడెలా ఉంది నాగార్జున అని బిగ్ బాస్ అడుగగా.. మీ తీరూ మారింది.. ఇల్లూ మారింది అని నాగార్జున అన్నాడు‌. అయితే ఈ ప్రోమోలో ఒక మెలిక పెట్టాడు బిగ్ బాస్. ఓ కంటెస్టెంట్ తనతో పాటు తెచ్చుకున్న వస్తువుని ఇంట్లోకి తీసుకుని వెళ్తానంటే.. నో చెప్పాడు బిగ్ బాస్. కంటెస్టెంట్ అది లేకపోతే నేను హౌస్‌లోకి వెళ్లనని అనడంతో అతన్ని బిగ్ బాస్ వెనక్కి పంపించేశాడు. మరి ఆ కంటెస్టెంట్ ఎవరు.. హౌస్ లోకి వెళ్ళిందెవరో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.  

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ వీళ్ళే!

  అగ్నిపరీక్ష పేరుతో ప్రతీ సంవత్సరం ఉండే బిగ్ బాస్ సందడిని పదిహేను రోజుల ముందే తీసుకొచ్చారు. ప్రతి సీజన్‌లోనూ కంటెస్టెంట్స్‌ని గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో అనౌన్స్ చేసి హౌస్‌లోకి పంపుతారు. తొలివారంలో ఓటింగ్ స్టార్ట్ అయ్యేది. కానీ ఈసారి అగ్నిపరీక్ష పేరుతో హౌస్‌లోకి పంపించబోయే సగం మంది కంటెస్టెంట్స్ ని ముందే రెడీ చేసారు. వాళ్లకి ఓటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా పదమూడు మందిని ఫైనలిస్ట్‌లను సిద్దం చేసి.. వారిలో టాప్-5 కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపించబోతున్నారు.    అగ్నిపరీక్ష నుండి అయిదుగురు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించడం కోసం బిబి టీమ్ భిన్నమైన టాస్క్ లు ఇచ్చింది. ఈ అగ్ని పరీక్ష మొత్తంగా పదిహేను ఎపిసోడ్‌లు సాగింది. దీనికి యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా చేయగా అభిజీత్, నవదీప్, బిందుమాధవిలు జడ్జులుగా ఉన్నారు. ఈ అగ్నిపరీక్ష ముగింపుకి చేరుకోగా.. తెగింపు చూపించిన కంటెస్టెంట్స్ పదమూడు మంది మాత్రమే మిగిలారు. వీరిలో నుండి అయిదుగురు మాత్రమే కన్ఫమ్ కంటెస్టెంట్స్ గా నిలిచారు.  మాస్క్ మెన్ హరీష్ అలియాస్ హరిత హరీష్, దమ్ము శ్రీజ, ఆర్మీ పవన్ కళ్యాణ్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి అలియాస్ దివ్య నిఖిత హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ లలో కన్ఫమ్ అయ్యారు. వీళ్ళు సామాన్యుల (కామన్ మ్యాన్) కేటగిరీలో హౌస్ లోకి వెళ్ళారు.   తనుజ, భరణి, ఆషా సైనీ, సుమన్ శెట్టి, సంజనా గల్రానీ, రాము రాథోడ్, స్రష్టి వర్మ, రీతు చౌదరి.. సెలబ్రిటీ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే హౌస్ లోకి ఫస్ట్ టూ వీక్స్ ఉండటానికి ఇద్దరు ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన కంటెస్టెంట్స్ కి, సెలెబ్రిటీ కేటగిరీలో వచ్చిన కంటెస్టెంట్స్ కు సపరేట్ రూమ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే బిగ్ బాస్ సీజన్-9 టీవీ అభిమానులకి సూపర్ ఫీస్ట్ అవుతుంది.   

Jayam serial: చిన్నిని కలవడానికి వెళ్ళిన గంగ.. తనని రుద్ర చూస్తాడా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -48 లో... గంగ బయటకు వెళ్తుంటే ఎక్కడకి అని రుద్ర అడుగుతాడు. సూపర్ మార్కెట్ కి సరుకుల కోసమని గంగ చెప్తుంది. దాంతో గంగని రుద్ర తనతో పాటు కార్ లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు నేను కిండర్ గార్డెన్ కి వెళ్ళాలి.. చిన్ని వచ్చిందేమోనని గంగ అనుకుంటుంది.    సర్ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని  గంగ అడుగుతుంది. రుద్ర కోపంగా చూసేసరికి గంగ సైలెంట్ గా ఉండిపోతుంది. సూపర్ మార్కెట్ వచ్చింది దిగు.. లోపల మక్కంకి చెప్పాను.. తనే మళ్ళీ నిన్ను ఇంట్లో డ్రాప్ చేస్తాడని గంగకి రుద్ర చెప్తాడు. దాంతో గంగకి ఇక తప్పదు. ఆ తర్వాత గంగ లోపలికి వెళ్లకుండానే మక్కం సరుకులు తీసుకొని వస్తాడు. మేనేజర్ సర్ నాకొక హెల్ప్ చెయ్యాలి.. నేను అర్జెంట్ గా నా ఫ్రెండ్ ని కలవాలని అంటుంది. దానికి మక్కం సరే అనడంతో ఇద్దరు స్కూటీపై వెళ్తారు.   మరొకవైపు చిన్ని వాళ్ళ మేడమ్ వచ్చి ఆటో కోసం చూస్తుంటారు. నేను ఆటో తీసుకొని వస్తానని మేడమ్ చిన్నిని వదిలేసి వెళ్తుంది. ఆ తర్వాత గంగ చిన్ని చెప్పిన అడ్రెస్ కి మక్కంని తీసుకొని వస్తుంది. సర్ కి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని మక్కం భయపడుతుంటే.. సర్ కి ఎలా తెలుస్తుంది. మనం వచ్చిన ప్లేస్ కి సర్ ఏమైనా మనకంటే ముందే వచ్చేస్తాడా అని గంగ అటువైపు తిరుగుతుంది. రుద్ర ఎదురుగా ఉంటాడు. అతన్ని చూసి గంగ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2 : వాళ్ళిద్దరినీ కలుపుతాను.. జ్యోత్స్నకి ఛాలెంజ్ విసిరిన కార్తీక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -456 లో... కార్తీక్ మొక్కలకి నీళ్లు పడుతుంటే పారిజాతం వచ్చి.. ఇక నుండి ఈ పారిజాతం అంటే ఏంటో అందరికి తెలిసేలా చేస్తాను అంటుంది. అప్పుడే పారిజాతానికి శ్రీధర్ ఫోన్ చేస్తాడు. మీ నాన్నే చేసాడని పక్కకి వెళ్లి మాట్లాడుతుంది. సుమిత్ర చెల్లి చేసిన పనికి నా మైండ్ బ్లాంక్ అయిందని శ్రీధర్ అంటాడు. ఇప్పుడు ఇంట్లో దశరథ్, సుమిత్ర మాట్లాడుకోవడం లేదని పారిజాతం అంటుంది. ఆ దీప అందరిని విడగొడుతుందని శ్రీధర్ అంటాడు. మీరు జాగ్రత్త అత్తయ్య.. మీ కాపురం కూడా చెడగొట్టగలదని పారిజాతంతో శ్రీధర్ అంటాడు. అంత సీన్ లేదు అల్లుడు.. నేను గట్టిగా ఊపిరి బిగబెట్టానంటే అని పారిజాతం గట్టిగా ఊపిరిబిగబెట్టి కిందపడిపోతుంది.    ఆ వెంటనే డాక్టర్ ని పిలుస్తారు. డాక్టర్ పారిజాతాన్ని టెస్ట్ చేసి ఈవిడకి షుగర్, బిపి, కొలెస్ట్రాల్.. గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తాడు. లేని రోగం లేనట్టు ఉంది కదా అని కార్తీక్ అంటాడు. అసలు మీరు రోజు ఏం తింటారని పారిజాతాన్ని అడుగుతాడు. దాంతో పారిజాతం తన తిండి లిస్ట్ గురించి చెప్తుంటే.. అందరు షాక్ అవుతారు. మీరు తిండి ఇక ఆపాలి‌.. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి అని డాక్టర్ చెప్తాడు. నాకు చెప్పండి డాక్టర్ నేను దగ్గర ఉండి అన్ని చేస్తానని కార్తీక్  అంటాడు.  వాడికి వద్దు అని పారిజాతం అంటుంది. తనకి వాడే కరెక్ట్ అని శివన్నారాయణ అంటాడు. కార్తీక్ ని బయటకు తీసుకొని వెళ్లి అన్ని చెప్తాడు.    ఆ తర్వాత దీప కిచెన్ లోకి వెళ్ళి వంట చేస్తుంది. కార్తీక్ పై దీప కోపంగా ఉంటుంది. అసలు మీరు ఇంటికి వచ్చాక ఏం జరిగిందని అడిగారా.. ఎంత పెద్ద గొడవ అయిందో తెలుసా.. అమ్మ, నాన్న ఇద్దరు గొడవపడ్డారు. నా చెల్లికి సారీ చెప్పే వరకు నిన్ను క్షమించనని నాన్న అన్నాడని దీప అనగానే వాళ్ళని నేను కలుపుతానని కార్తీక్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. పెళ్లి అయిపోయి.. నిన్ను పంపించేవరకే మా అమ్మనాన్న.. మీ అమ్మనాన్న వాళ్ళని అలా పిలవాలంటే ఒక అర్హత ఉండాలి. ఇంకొకసారి అలా పిలవకని దీపతో జ్యోత్స్న అంటుంది.   ఆ తర్వాత బావ నీతో మాట్లాడాలని కార్తీక్ ని జ్యోత్స్న బయటకు తీసుకొని వెళ్తుంది. నువ్వెందుకు అత్తమామయ్యలని విడగొడుతున్నావ్. అత్తకి అలాంటి ఆలోచన రాదు.. నువ్వే ఏదైనా చేసి ఉంటావని కార్తీక్ అడుగుతాడు. నేను ఎందుకు చేస్తానని జ్యోత్స్న అంటుంది. దీపపై నీకు ఎందుకు కోపం ఉంది. నన్ను పెళ్లి చేసుకుందనా అని కార్తీక్ అడుగుతాడు. దీప నన్ను చంపాలని అనుకుంది. అలాగే మా డాడ్ ని చంపాలని అనుకుందని జ్యోత్స్న అంటుంది. నువ్వు అత్తమామయ్యలని విడగొట్టాలని చూస్తున్నావ్.. వాళ్ళని నేను కలుపుతాను.. రోజు నీకు నరకం చూపిస్తాను.. దీప కాళ్ళపై పడి ఇక వద్దు బాబోయ్ అనేలా చేస్తానని జ్యోత్స్నతో, కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. వెయిటింగ్ అని జ్యోత్స్న పొగరుగా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : ఆ వీడియో చూసి ప్రేమలో మొదలైన భయం.. ధీరజ్ కి చెప్తుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -257 లో... ప్రేమకి బొకే కొరియర్ రావడంతో శ్రీవల్లికి డౌట్ వస్తుంది. ఏంటని ప్రేమని శ్రీవల్లి అడుగుతుంది . ఏం లేదు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని ప్రేమ పంపిస్తుంది.    ఆ తర్వాత ప్రేమ బొకే ఓపెన్ చేస్తుంది. అందులో ఇంకా వన్ వీక్ అని ఉంటుంది. కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. నువ్వు ఇలా బొకేలు పంపిస్తే భయపడుతాననుకున్నావా అని ప్రేమ అనగానే.. మరేం చేస్తే భయపడుతావో తెలుసు.. ఒక వీడియో పంపిస్తున్నానని ప్రేమకి వీడియో ఒకటి కళ్యాణ్ పంపిస్తాడు.   ఆ వీడియో ప్రేమ చూసి షాక్ అవుతుంది. ఆ వీడియోలో కళ్యాణ్ తో ప్రేమ లేచిపోయినప్పుడు.. రూమ్ లోకి వెళ్ళినప్పుడు ప్రేమ, కళ్యాణ్ పక్కపక్కన కూర్చొని ఉంటారు. కళ్యాణ్ ఫోన్ చేసి ఇప్పుడు భయపడుతున్నావా.. ఆ వీడియో ఎవరికైనా చూపిస్తే ఏమనుకుంటారో తెలుసు కదా అని కళ్యాణ్ అనగానే ప్రేమకి భయం మొదలమవుతుంది.    మరొకవైపు విశ్వకి పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి అమ్మాయి వాళ్ళు వస్తారు. ఆ విషయం వేదవతికి తిరుపతి చెప్తాడు. ఆ తర్వాత ప్రేమ బాధపడుతుంటే ధీరజ్ వస్తాడు. ఏమైందని అడుగతాడు కానీ ప్రేమ సైలెంట్ గా ఉంటుంది. ఏమైందోనని ప్రేమని ధీరజ్ గుడికి తీసుకొని వెళ్తాడు. అసలు ఏమైంది.. ఎందుకు టెన్షన్ పడుతున్నావ్.. అసలు నువ్వు ఇలా ఉంటావా.. ఎప్పుడు దైర్యంగా ఉంటావ్ ఏమైంది చెప్పమని ప్రేమని ధీరజ్ మోటివేట్ చేస్తాడు కానీ ప్రేమ సైలెంట్ గా ఉంటుంది.   ఆ తర్వాత  ప్రేమ గురించి ధీరజ్ ఆలోచిస్తుంటే చందు వస్తాడు. థాంక్స్ రా డబ్బు అరేంజ్ చేసావ్ అంటాడు. ఎలా అరేంజ్ చేసావ్ రా అని అడుగుతాడు. ధీరజ్ ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. మరొకవైపు సాగర్ కి ఎగ్జామ్ ఉంటుంది. నర్మద, సాగర్ ఇద్దరు దేవుడికి మొక్కుకుంటారు. అదంతా శ్రీవల్లి చూస్తుంది. నాకు మా నాన్న ఆశీర్వాదం కూడా కావాలని సాగర్ అంటాడు. రిస్క్ వద్దు సాగర్ అని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్యని ప్రేమగా చూసుకుంటున్న రాజ్.. రుద్రాణి కపటనాటకం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -819 లో.. కుంకుమపువ్వు కలిపిన పాలు తీసుకొని వచ్చి కావ్యకి ఇస్తాడు రాజ్. ఇదేంటి ఇలా ఎర్రగా ఉన్నాయని కావ్య అడుగుతుంది. కుంకుమ పువ్వు కలిపిన పాలు.. పుట్టబోయే బిడ్డ తెల్లగా పుట్టాలని తీసుకొని వచ్చానని రాజ్ అనగానే ఆ మాటలకి కావ్య మురిసిపోతుంది. ఎంత పెద్ద మగాడు అయినా తన పిల్లల విషయానికి వచ్చేసరికి చిన్న పిల్లాడు అయిపోతాడని కావ్య అంటుంది.   మరొకవైపు రాహుల్ ఇంట్లో పని చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయని లెక్కలు వేసుకుంటుంటే.. అప్పుడే రుద్రాణి వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఈ ఇంట్లో పని చేస్తే పర్మినెంట్ పనివాడిని అయిపోతానని అంటాడు. నీకేం కర్మ రా.. నువ్వు ఈ ఆస్తులకి వారసుడివి.. నీ తర్వాత నీ కూతురు వారసురాలు. ఇంకెవరికి వారసుడు రాకుండా చేస్తానని రాహుల్ తో రుద్రాణి అంటుంది.    సీతారామయ్య రెడీ అవుతుంటే ఇందిరాదేవి వస్తుంది. మీరు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.. ఎప్పుడు ఇలాగే ఉండాలి బావ అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ప్రకాష్, సుభాష్ ఇద్దరికి ధాన్యలక్ష్మి, అపర్ణ ఇంట్లో పూజకి సంబంధించిన పనులు చెప్తుంటారు. ఆ తర్వాత కావ్య కోసం అపర్ణ నెక్లెస్ తీసుకొని వస్తుంది. అది చూసి కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే రుద్రాణి వచ్చి ఎప్పటిలాగే ఏదో ఒకటి అంటుంటే అపర్ణ కౌంటర్ ఇచ్చి పంపిస్తుంది.    ఆ తర్వాత పంతులు గారు దుగ్గిరాల ఇంటికి వస్తారు నా కోడలు ప్రెగ్నెంట్ తనకి పుట్టబోయే బిడ్డ జాతకం చెప్పండి అని ధాన్యలక్ష్మి అనగానే అప్పు చెయ్ పట్టుకొని జాతకం చెప్తాడు. పుట్టబోయే బిడ్డ జాతకం బాగుందని చెప్తాడు. అలాగే కావ్యకి పుట్టబోయే బిడ్డ జాతకం గురించి చెప్తాడు. జాతకం బాగుందని చెప్తాడు. పుట్టని వాళ్ళ గురించి ఎందుకు గానీ పుట్టిన నా మనవరాలు జాతకం గురించి చెప్పమని రుద్రాణి అడుగుతుంది. నీ పెంపకంలో పెరుగుతుంది కాబట్టి నీలాగే అవుతుందని ప్రకాష్ అంటాడు.    తరువాయి భాగంలో వినాయకుడి పూజకి రాజ్, కావ్య కలిసి రేవతి ఇంటికి రప్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అనీష్ కి తెలుగు ఇండియన్ ఐడల్ ఓపెన్ ఇన్విటేషన్...ఎప్పుడైనా వచ్చి నచ్చిన పాట పాడొచ్చు

తెలుగు ఇండియన్ ఐడల్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఒక ఇంటరెస్టింగ్ యంగ్ సింగర్ వచ్చాడు. 16 ఏళ్ళ సాయి అనీష్ కందాడ..స్కాట్ ల్యాండ్ నుంచి వచ్చి పెర్ఫార్మ్ చేసాడు. ఇక అతనితో పాటు అతని తల్లి కూడా స్టేజి మీదకు వచ్చారు. ఇక అనీష్ రాగానే థమన్ కూడా సరదాగా మాట్లాడారు. ఎక్కడినుంచి వచ్చావ్ అని అడగడంతో స్కాట్ ల్యాండ్ అన్నాడు. గ్లాస్కోనా అని థమన్ అడిగేసరికి కాదు ఎడిన్బర్గ్ అని చెప్పాడు. తర్వాత వాళ్ళ అమ్మ ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి అంటూ చెప్పారు. కార్తీక్ సర్ మీకు గుర్తుందో లేదో కానీ మీరు ఒకసారి మాంచెస్టర్ లో అనీష్ ని కలిశారు అని గుర్తు చేసింది. కార్తీక్ కూడా అవును 2022 మార్చ్ కదా అని చెప్పేసరికి అవును అన్నారు ఆవిడ. మీరు ఒక ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. నేను నిన్ను ఇండియన్ ఐడల్ లో చూస్తాను అని..మీ ఆటో గ్రాఫ్ ని ఫ్రేమ్ చేయించి తన గదిలో భద్రంగా పెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇండియన్ ఐడల్ కి వచ్చేసాడు అని చెప్పారు. దాంతో కార్తీక్ కూడా ఫుల్ హ్యాపీ అయ్యాడు. అనీష్ నేను చెప్పినట్టే చివరికి అనీష్ ఇండియన్ ఐడల్ కి వచ్చావ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రైట్ అంటూ ఎంకరేజ్ చేసాడు. ఇక అనీష్ వాళ్ళ అమ్మ తన బిడ్డ ఆటిస్టిక్ కిడ్ అని. మాటలు సరిగా రావు అని చెప్పుకొచ్చారు. కానీ సంగీతం అంటే ప్రాణం పెడతాడు. దయచేసి నన్ను అర్ధం చేసుకోండి. నాకు కొంచెం నెర్వస్ నెస్ ఉంది, టెన్షన్ కూడా ఉంది అని చెప్పారు. దాంతో థమన్ మీరు కంగారు పడొద్దు. మీరు మీ అబ్బాయి ప్యాషన్ కోసం ఇంత దూరం తీసుకొచ్చారు. మాకు మీ మీద చాల రెస్పెక్ట్ ఉంది అని భరోసా ఇచ్చారు. ఇక అనీష్ ఐతే రామా కనవేమిరా అనే సాంగ్ ని అద్భుతంగా పాడి వినిపించాడు. ఇక గీత మాధురి ఐతే ఎవరు పాడితే రాముడు వస్తాడో రాడో తెలీదు కానీ నీ పాటకు రాముడు వచ్చాడు విన్నాడు అంటూ అనీష్ పాటను మెచ్చుకుంది. ఇక కార్తీక్ ఐతే చాలా బాగా పాడావు..ఈ రాగమో తెలుసా అనేసరికి రీతి గౌళ రాగం అని చెప్పాడు అనీష్. ఆ రాగం అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పాడు కార్తీక్. ఇక అనీష్ కి ఒక బిగ్ ఆఫర్ ఇచ్చాడు. "మేమెవ్వరం కూడా ఎస్ అని నో అని కానీ చెప్పము. నువ్వు చాలా గొప్పవాడివి. అందుకే నీకోసం ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాం. నువ్వు ఇండియాలో ఎప్పటి వరకు ఉంటావో అప్పటి వరకు తెలుగు ఇండియన్ ఐడల్ షోకి నువ్వు వచ్చి నీకు ఇష్టమైన పాట పాడొచ్చు" అని చెప్పాడు. తరువాత అనీష్ కీబోర్డ్ ప్లే చేయాలి అని కోరగానే కార్తీక్ తీసుకెళ్లి కూర్చోబెట్టడంతో పాటు "ఎదుట నిలిచింది చూడు" అనే సాంగ్ ని అనీష్ తో కలిసి పాడి అతన్ని సంతోషంగా పంపించాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీజ దమ్ము..కప్పు తెస్తాను అంటూ ఇన్స్టా పోస్ట్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష పూర్తయిపోయింది. ఇక ఇందులో శ్రీజ దమ్ము హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. "భవిష్యత్తులో ఏమి జరుగుతుందో నాకు తెలియదు కానీ బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో నాకు జీవితకాల జ్ఞాపకాలను ఇచ్చింది. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి అలాగే పాజిటివ్ , నెగెటివ్‌లు కూడా ఉన్నాయి.. కానీ ఇక్కడ జరిగిన ప్రతి క్షణాన్ని నా జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఆ రోజు నాకు గ్రీన్ ఇచ్చి, ఎంతో మంది ఆశీస్సులు, ప్రేమను సంపాదించుకెనెకునేలా చేసిన నవదీప్ గారికి థాంక్యూ..ఆయనది మాస్టర్ మైండ్, ఆయనో ఎంటర్‌టైనర్, ఈ షోకి మెయిన్ రోల్ ఆయనే..శ్రీముఖి అక్కా, అసలు మీ శక్తి, మీ చురుకుదనం , మీరు మమ్మల్ని సపోర్ట్ చేసే విధానం వాహ్ అక్కా, వాహ్.. హ్యాండ్స్ డౌన్ ది బెస్ట్ హోస్ట్...ఇక బిందు మాధవి గారూ, ఆడపులి అంతే!!!! ఆమె మాట్లాడే విధానం, ఆమె ప్రోత్సహించే విధానం ..బ్యూటీ విత్ బ్రెయిన్. ఫైనల్ గా అభిజిత్ గారూ, విన్నర్ అంటే..ఆయన పరిశీలనా విధానం బాగుంది. తక్కువగా మాట్లాడడం ఏదైనా చేసి చూపించడం చేస్తారు. అతను ఎం మాట్లాడినా కన్ఫర్మ్ గా దానికి ఒక  స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతారు. అలాగే ఈరోజు వరకు నాకు సపోర్ట్ చేస్తూ  ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా థాంక్యూ సో మచ్ అందరికి...ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా...మీ శ్రీజ దమ్ము కప్ తీసుకువస్తుంది ఈసారి" అంటూ అగ్నిపరీక్షలో తన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మెసేజ్ చేసింది.

వినాయకుడిని రాజ్ చేయడంతో కావ్య హ్యాపీ.. బాధలో అప్పు! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -818 లో.....కావ్య రిపోర్ట్స్ డాక్టర్ చూసి.. మీ అక్క గర్భసంచి చిన్నగా ఉంది. తొమ్మిది నెలలు బేబీని మోయ్యలేదని డాక్టర్ చెప్పగానే అప్పు, కళ్యాణ్ షాక్ అవుతారు. ఆ బిడ్డని మోయ్యడం వల్ల తన ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ చెప్తుంది. మా అక్క మొదటిసారి తల్లి అవుతుంది.. అందరు చాలా సంతోషంగా ఉన్నారు.. ఇప్పుడు ఇలా అంటే వాళ్లేమవుతారని అప్పు అంటుంది. దీనికి పరిష్కారం అబార్షన్ కానీ ఇంకా పెద్ద డాక్టర్స్ కి ఈ ప్రాబ్లమ్ గురించి చెప్తాను.. వాళ్ళేం సలహా ఇస్తారో చూద్దామని డాక్టర్ అంటుంది. మరొకవైపు కావ్య తల్లి కాబోతుందని రాజ్ తనకి సేవలు చేస్తుంటాడు. కావ్యకి తీసుకొని వచ్చిన జ్యూస్ లు అపర్ణ, ఇందిరాదేవి తాగుతారు. ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తి వస్తారు. వినాయకుడి బొమ్మ నేనే స్వయంగా రెడీ చేస్తానని కావ్య అంటుంది. నువ్వా.. వద్దని రాజ్ అంటాడు. మరి మీరు చేస్తారా అని కావ్య అనగానే.. చేస్తానని రాజ్ అంటాడు. వినాయకుడి బొమ్మని తయారు చెయ్యడానికి అవసరం అయినవి అన్నీ కూడా కనకం, కృష్ణమూర్తి సిద్ధం చేస్తారు. రాజ్ కి కృష్ణమూర్తి హెల్ప్ చేస్తాడు. చివరగా రాజ్ బొమ్మ రెడీ చేస్తాడు. అది చూసి కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు సరదాగా ఉంటారు. అప్పుడే అప్పు, కళ్యాణ్ వస్తారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు.. ఈ విషయం తెలిస్తే ఏమవుతారోనని అప్పు అనుకుంటుంది. ఆ తర్వాత అప్పు తన అక్క పరిస్థితి గురించి దేవుడికి చెప్పుకుంటూ బాధపడుతుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి డాక్టర్ దానికి సొల్యూషన్ చెప్తానన్నారు కదా అని అప్పుతో కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కార్తీక్, దీపలపై జ్యోత్స్నకి డౌట్.. క్షమాపణ చెప్పిన దశరథ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -455 లో..... ఇన్ని గొడవలకి కారణం నువ్వేనని దీపని మెడపట్టుకొని గెంటేస్తుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్, శివన్నారాయణ వస్తారు. నా భార్య ఏ తప్పు చేసిందని కార్తీక్ అడుగుతాడు. అగ్రిమెంట్ పై నువ్వు సంతకం పెట్టావ్.. నీ భార్య కాదు.. తను ఇక్కడ ఉండడం వద్దని జ్యోత్స్న అంటుంది. కార్తీక్ ఎక్కడ ఉంటాడో.. దీప కూడా అక్కడే ఉంటుందని కార్తీక్ అంటాడు. తప్పు మీద తప్పు చేయకండి అని జ్యోత్స్నని శివన్నారాయణ మందలిస్తాడు. ఇంకొకసారి ఇలాంటి సిచువేషన్ ఇంట్లో వస్తే ఎవరిని ఇంట్లో నుండి గెంటేయ్యడం ఉండదు.. నేనే వెళ్ళిపోతానని శివన్నారాయణ అంటాడు. కార్తీక్, దీప మీరు లోపలికి వెళ్ళండి అని శివన్నారాయణ అంటాడు. నా తండ్రిని ఈ పరిస్థితికి తీసుకొని వచ్చారని జ్యోత్స్నతో దశరథ్ అంటాడు. మరోవైపు అసలు ఈ దీప ఎందుకు నువ్వు అన్ని అన్నా కూడా సైలెంట్ గా ఉంటుందని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. నాకు అదే డౌట్ అని జ్యోత్స్న అంటుంది. కొంపదీసి ఆ బస్టాండ్ లో దొరికింది ఈ దీప కాదు కదా అని పారిజాతం అనగానే వెంటనే జ్యోత్స్న టాపిక్ డైవర్ట్ చేస్తుంది. బావ, దీపలకి నిజం తెలిసిందా.. అందుకే  దీపని బావ ఇక్కడ ఉంచుతున్నాడా అని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు నా భార్య తరుపున నేను సారీ చెప్తున్నానని కార్తీక్, దీపలకి దశరథ్ సారీ చెప్తాడు. అది సుమిత్ర చూసి కోపంగా వస్తుంటే.. నేను విన్నాను మమ్మీ.. డాడ్ ఏంటి సారీ చెప్తున్నాడు. అంటే నువ్వు తప్పు చేసావన్నట్లే కదా.. అయినా నీ కంటే వాళ్లంటేనే డాడ్ కి ఇష్టమని దశరథ్ పై సుమిత్రకి కోపం కలిగేలా చేస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కళ్యాణ్ పంపిన వీడియో చూసి ప్రేమ టెన్షన్.. అది ధీరజ్ చూస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -256 లో......కలశం ఎవరు తీసుకొని వెళ్లారని రామరాజు ఆలోచనలో పడతాడు. అసలు ఏం జరుగుతుంది. దొంగ వచ్చి ఇంట్లో ఏం తీసుకొని వెళ్లకుండా కలశం తీసుకొని వెళ్లడం ఎంటని రామరాజు అంటాడు. అందరు ఆలోచిస్తుండగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని రామరాజు నిర్ణయం తీసుకుంటాడు. దాంతో ఆనందరావు, శ్రీవల్లి టెన్షన్ పడతారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అందరు వెళ్తుంటే అప్పుడే భాగ్యం వస్తుంది. భాగ్యంకి ముందే శ్రీవల్లి అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి చెప్తుంది. దాంతో భాగ్యం షాప్ కి వెళ్లి కలశం కొని శ్రీవల్లి దగ్గర కి చాటుగా వచ్చి గిల్టీ నగలు కలశంలో పెట్టి తీసుకొని వస్తుంది. కలశం నాకు దొరికింది అన్నయ్య అని భాగ్యం అనగానే అదేంటీ నీకు దొరకడం ఎంటని రామరాజు అడుగుతాడు. వస్తుంటే దారిలో పోదల్లో కనపడిందని చెప్తుంది. నాకూ ఏం అర్థం అవ్వడం లేదు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని రామరాజు అంటాడు. అవును మావయ్య అని ప్రేమ అంటుంది కానీ నర్మద ఆపుతుంది. పోలీస్ కంప్లైంట్ అంటే ప్రతీసారి స్టేషన్ కి వెళ్ళాల్సి ఉంటుందని నర్మద ఆపుతుంది. ఆ తర్వాత ప్రేమకి కొరియర్ వస్తుంది. అది శ్రీవల్లి తీసుకొని ఓపెన్ చేస్తుంది. అందులో ఒక బొకే ఉంటుంది. అది చూసి అడ్రెస్ లేదు.. ఎక్కడ నుండి వచ్చిందని ప్రేమ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. నీకు బొకే వచ్చింది కానీ అడ్రెస్ లేదని శ్రీవల్లి అనగానే ప్రేమ టెన్షన్ పడుతుంది. ఏమైంది ఏదైనా రహస్యం ఉందా అని ప్రేమని శ్రీవల్లి అడుగుతుంది. కళ్యాణ్ పంపాడని ప్రేమకి అర్ధమవుతుంది. తరువాయి భాగంలో ప్రేమకి కళ్యాణ్ ఏదో వీడియో పంపిస్తాడు. అది చూసి ప్రేమ టెన్షన్ పడుతుంది.  ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి తనని బయటకు తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

గంగ ప్రతీ పని సక్సెస్.. డిజప్పాయింట్ అయిన వీరు, ఇషిక!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -47 లో......వినాయకుడి విగ్రహం కనిపించకపోవడంతో అందరు టెన్షన్ పడతారు. విగ్రహాన్ని వెతుకుంటే ఒకటి పాత గణేష్ విగ్రహం కనిపిస్తుంది. ఇదంతా బాను గారి సంకల్పం.. ఆ రోజు నిమజ్జనం చేయకుండా వదిలేసిన ఈ విగ్రహాన్ని ఇప్పుడు మనకి కనిపించేలా చేసాడని గంగ అంటుంది. గంగ మాటలు అందరిలో ఆలోచన కలిగించేలా చేస్తాయి.. అందరు కలిసి వినాయకుడి విగ్రహం ముందుకు లాగుతారు కానీ ఎవరివల్ల కాదు.. ఒకవైపు గంగ మరొకవైపు రుద్ర తాడుతో వినాయకుడి విగ్రహం ముందుకు లాగుతారు. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. రేపు ఈ వినాయకుడి విగ్రహం నిమజ్జనం చెయ్యాలి.. దానికి దేవుడిని సిద్ధం చెయ్యాలి. అందుకు మీరు రెడీనా అని గంగ అనగానే అందరు ఫుల్ జోష్ తో రెడి అంటారు. అందరు హ్యాపీగా ఉన్నా ఇషిక, వీరు మాత్రం డిస్సపాయింట్ అవుతారు. వాళ్ళు చేసిన ప్రతీ ప్లాన్ ఇలా రివర్స్ అవుతుందన్నట్లు కోపంగా ఉంటారు. మరొకవైపు రుద్ర కాపాడిన పాప చిన్ని.. గంగకి ఫోన్ చేస్తుంది. అక్క.. నేను చిన్ని ని నువ్వు మొన్న మా సర్ ని చూస్తానన్నావ్ కదా.. రేపు కిండర్ గార్డెన్ దగ్గరికి సర్ వస్తున్నారని చెప్పగానే గంగ ఎలాగైనా సర్ ని చూడాలని ఉత్సాహంగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

హీరో నాని క్లాస్ లో నిద్రపోయేవాడు...రివీల్ చేసిన టీచర్ సుందరమ్మ

జయమ్ము నిశ్చయమ్మురా - సెలబ్రిటీ టాక్ షో బై జగపతి బాబు...ప్రతీ ఎపిసోడ్ చాలా యూనిక్ గా ఉంటోంది. అలా ఇప్పటి వరకు నాగార్జున, శ్రీలీలని ఇంటర్వ్యూ చేశారు. ఇక నాని కూడా ఈ టాక్ షోకి ఇన్వైట్ చేశారు. "నేను 5th క్లాస్ టైంలో కొత్త స్కూల్ కి వచ్చాను. నాకు ఇంగ్లీష్ రాదు. మిగతా వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాళ్ళు. తెలుగులో మాట్లాడితే ఫైన్ వేసేవాళ్ళు. ఆ టైములో నాకు సపోర్ట్ చేసిన టీచర్స్ గౌరీ , సుందరమ్మ టీచర్ . వాళ్ళు నాకు బాగా ఇష్టం. చాలామంది సార్లు పేర్లు గుర్తున్నాయి కానీ అందరూ నన్ను బాగా ఉతికారు. అందుకే ఆ పేర్లు చెప్పట్లేదు. ఇక సుందరమ్మ మేడం పరీక్షల టైములో ఇంటికి ఫోన్ చేసి చదువుతున్నానా లేదా అని కనుక్కునేవాళ్ళు..ఆమె ఒక్కరే నన్ను ఎక్కువగా నమ్మేవాళ్ళు " అని చెప్పాడు నాని. ఆ తర్వాత స్టేజి మీదకు నానికి ఎంతో ఇష్టమైన టీచర్ సుందరమ్మను తీసుకొచ్చారు. "నానిని నవీన్ బాబు అనేవాళ్ళం. స్కూల్ లో బానే ఉండేవాడు. అల్లరి చేసేవాడు కాదు కామ్ గా ఉండేవాడు. క్లాస్ లో చక్కగా నిద్రపోయేవాడు. నానికి బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. నాని నిద్రపోయినప్పుడల్లా అటెండెన్స్ తీసుకునే టైములో తన నంబర్ వచ్చేటప్పుడు లేపేవాడు. ఫిఫ్త్ బెంచ్ లో కూర్చునేవాడు. నానికి ఫాజిల్ అనే ఫ్రెండ్ ఉండేవాడు. రంజాన్ టైములో నాని ఫాజిల్ వాళ్ళ ఇంటికి వెళ్లి బాగా ఎంజాయ్ చేసేవాడు. హోమ్ వర్క్ ఇస్తే నాని చేసేవాడు కాదు. ఈ విషయాన్నీ ఫాజిల్ చెప్పేవాడు. 10th క్లాస్ లో ఒక స్కిట్ వేసాడు. డైరెక్షన్, డైలాగ్స్ అన్నీ నానీనే. హోస్ట్ ప్రదీప్, నటుడు శర్వానంద్ వీళ్ళు కూడా మా స్కూల్ వాళ్ళే." అంటూ చెప్పుకొచ్చారు. అలాగే సుందరమ్మ టీచర్ నాని క్లాస్ ఫోటో గిఫ్ట్ గా ఇచ్చారు.  

టీచర్స్ డే రోజున తన గురువులను తలుచుకున్న శేఖర్ మాష్టర్...

  టీచర్స్ డే అంటే ఆ రోజుకు ఒక స్పెషాలిటీ ఉంది. వాళ్ళను తీర్చిదిద్దిన గురువులను పూజించుకోవడమే. వాళ్ళను గుర్తు చేసుకోవడం. ప్రతీ ఒక్కరి విజయం వెనక పేరెంట్స్ తో పాటు టీచర్ కూడా ఒక కీ రోల్ పోషిస్తుంది. మరి అలాంటి టీచర్స్ డే సందర్భంగా శేఖర్ మాష్టర్ తన గురువులను గుర్తు చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళతో దిగిన పిక్స్ ని పోస్ట్ చేశారు. "నా డాన్స్ జర్నీలో నాకు ఎన్నో విషయాలను నేర్పి  నన్ను ఇన్స్పైర్ చేసిన టీచర్స్ అందరికీ   ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నా అతిపెద్ద ఇన్స్పిరేషన్ నాకు ఇష్టమైన  గురువు, ప్రభుదేవా మాష్టర్. నాకు మొదట డాన్స్ నేర్పిన విజయవాడలోని మస్తాన్ మాస్టర్ గారికి, నేను హైదరాబాద్‌ వచ్చిన  తొలినాళ్లలో డాన్స్ లో ట్రైనింగ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్ గారికి, అలాగే కొరియోగ్రఫీ రంగంలో రాజసుందరం మాస్టర్  క్రియేటివిటీ నన్నెప్పుడూ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. నా స్టార్టింగ్ డేస్ లో నన్నెప్పుడూ ప్రోత్సహించిన సుచిత్ర మాస్టర్, తరుణ్ మాస్టర్, చిన్ని ప్రకాష్ మాస్టర్, రేఖ ప్రకాష్ మేడమ్, అమ్మ రాజశేఖర్ మాస్టర్ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞుడను" అంటూ పోస్ట్ చేసాడు. ఇక శేఖర్ మాష్టర్ కి ఢీ షోతో మంచి పేరొచ్చింది. ఆయన ప్రతీ కొత్త డాన్సర్ ని కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు అలాగే వాళ్లకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాడని చెప్పుకున్న శేఖర్ మాష్టర్ ఈరోజున టాప్ యాక్టర్స్ మూవీస్ లోని సాంగ్స్ కి కోరియోగ్రఫీ చేస్తూ ఉన్నారు. ఇక శేఖర్ మాష్టర్ పోస్ట్ కి నెటిజన్స్ ఐతే రాకేష్ మాష్టర్ పేరు కూడా తలుచుకున్నారు అంటూ ఆనందం వ్యక్తం చేసారు.

Biggboss Agnipariksha :అగ్ని పరీక్ష ముగిసింది.. ఇక మిగిలింది రణరంగమే!

గత కొన్ని రోజులుగా కామనర్స్ ని బిగ్ బాస్ కి పంపించే ప్రయత్నంలో భాగంగా లక్షల అప్లికేషన్లు రాగా.. అందులో నలభై నాలుగు మంది సెలక్ట్ అయ్యారు. దాంతో వారికి అగ్నిపరీక్ష పెట్టి ఫిల్టర్ చేసిన విషయం తెలిసిందే. ఆ పదిహేను మందిలో ఇద్దరు ఎలిమినేట్ కాగా పదమూడు మంది ఉన్నారు. వారికి టాస్క్ లు పెట్టి అందులో బెస్ట్ ఇచ్చిన వారికి స్టార్, బెస్ట్ ఇవ్వనివారికి వరెస్ట్ ఇచ్చారు. కొందరికి ఎల్లో కార్డ్, రెడ్ కార్డు కూడా ఇచ్చారు. ఇక నిన్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్  జరిగింది. మహాపరీక్ష టాస్క్ లో భాగంగా మనీష్ గెలిచి స్టార్ సంపాదించుకున్నాడు. కానీ ఎవరు  బిగ్ బాస్ సీజన్-9 హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనేది సస్పెన్స్ గానే ఉంచారు బిబి టీమ్. హౌస్ లోకి ఎవరు వెళ్లినా.. వెళ్లకపోయినా మూవ్ ఆన్ అవ్వాలి.. అందరు బెస్ట్ ఇచ్చారని కంటెస్టెంట్స్ ని జడ్జెస్ మోటివేట్ చేశారు. అగ్నిపరీక్ష జర్నీ ముగియడంతో కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. అభిజిత్, నవదీప్, బిందు మాధవి మేము అంతా కూడా కామనర్స్ నుండి ఈ స్టేజికి వచ్చాము.. మాకు ఇండస్ట్రీతో ఎలాంటి కనెక్షన్ లేదు.. మా ట్యాలెంట్ వల్లనో.. ఫ్యాషన్ వల్లనో ఈ స్టేజికి వచ్చాము.. మీరు కూడా ఇలా ముందుగా సాగాలని.. సెలబ్రిటీ అవ్వాలని ఆశిస్తున్నానని కంటెస్టెంట్స్ ని ఉత్తేజపరుస్తుంది శ్రీముఖి. కామనర్స్ గా బిగ్ బాస్ సీజన్-9 లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ హౌస్ లోకి ఫోక్ డాన్సర్ ఎంట్రీ....

  బిగ్ బాస్ హౌస్ లోకి వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు అంటూ చాలా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. అలాగే రీసెంట్ గా నాగ దుర్గ పేరు కూడా బాగా పాపులర్ అయ్యింది. నాగ దుర్గ బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్తోంది అన్నారు కానీ ఇప్పుడు నాగ దుర్గా మాత్రం తన సైడ్ నుంచి నో అంది. "దారిపొంటోత్తున్నాడు" అనే డిజె సాంగ్ తో నాగదుర్గా ఎంతో ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు. అలాంటి నాగ దుర్గ "గైస్ ఈ విషయాన్నీ అంత పెద్దది చేయకండి..ఇక మిమ్మల్ని మరింత వెయిట్ చేయించాలని అనుకోవడం లేదు. నేను బిగ్ బాస్ సీజన్ 9 లో లేను. ప్రస్తుతానికి బిగ్ బాస్ కి వెళ్లే ఇంటరెస్ట్ లేదు. నేను బిగ్ బాస్ కి వెళ్లడం లేదు. రూమర్స్ ని ఎంకరేజ్ చేయకండి." అని చెప్పింది. ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో ఒక డాన్సర్, ఒక సింగర్ కచ్చితంగా వెళ్తూ ఉంటారు. ఐతే ఈ సారి ఫోక్ సింగర్ నాగ దుర్గ వెళ్తుంది అంటూ రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె వెళ్లడం అని తేల్చేసింది. నల్గొండకు చెందిన నాగదుర్గా కరోనా టైం నుంచి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. తన వెరైటీ డాన్స్ తో గెటప్స్ తో సాంగ్స్ తో మంచి పేరు తెచ్చుకుంది . తిన్నా తీరం పడుటలే అనే పల్లె పాటకు 129 మిలియన్ వ్యూస్ వచ్చాయి.  

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్-9 కన్ఫమ్ కంటెస్టెంట్స్ వీళ్ళే!

  బిగ్ బాస్ సీజన్-9 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మరి ఈ సీజన్-9 లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ ఎవరు.. కామనర్స్ ఎవరు.. సెలెబ్రిటీస్ ఎవరు.. అసలు టాస్క్ లు ఏంటి.. ఇలా ఎన్నో ప్రశ్నలతో బిగ్ బాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.  ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్-9 లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ కోసం అగ్నిపరీక్ష మొదలెట్టగా వారిలో నుండి కొంతమందిని ఫిల్టర్ చేశారు బిబి టీమ్.  మరి కామనర్స్ తో పాటు హౌస్ లోకి వెళ్ళేదెవరో ఓ సారి చూసేద్దాం..  ఇమ్మాన్యుయల్, సింగర్ శ్రీతేజ, సంజనా గల్రాని, రీతు చౌదరి, భరణి, సుమన్ శెట్టి, తనూజ, దెబ్జానీ, ఆశా షైనీ, స్రష్టి వర్మ, రాము రాథోడ్ కన్ఫమ్ కంటెస్టెంట్స్ అని తెలుస్తోంది. ఇక కామనర్స్ నుండి ఎవరు వస్తారోనని క్యూరియాసిటి అందరిలో నెలకొంది.  బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున చేయబోతున్నాడు. ఇక హౌస్ లోకి ఎంతమంది కంటెస్టెంట్స్ వెళ్తారు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయా.. ఓల్ట్ కంటెస్టెంట్స్ ఎవరైనా హౌస్ లోకి వెళ్తారా లేదా అసలు ఈ సీజన్-9 లో ఎవరు బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలు వాటన్నింటికి జవాబులు కావాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.  

Jayam serial : వినాయకుడి విగ్రహం మాయం.. వీరూనే చేసి ఉంటాడా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -46 లో.....సూపర్ మార్కెట్ ని బంద్ చేసి రుద్రని డెవలప్ కాకుండా చెయ్యాలని వీరు ప్లాన్ చేస్తాడు. కానీ రుద్ర ముందే సమస్యని పసిగట్టి పరిష్కరిస్తాడు. ఇక వినాయకుడి విగ్రహలు రావడం లేట్ అయ్యేలా వీరు చేస్తాడు. కానీ గంగ మట్టితో విగ్రహాలని రెడీ చేస్తుంది. గంగ వంక రుద్ర అలానే చూస్తుంటాడు. రుద్ర గాడిని దెబ్బ కొట్టాలంటే అన్నీ అడ్డంకులే ఈ గంగ వల్ల మొత్తం చెడిపోయింది.. రుద్రకి గంగ తోడైతే ఏం చెయ్యలేమని వీరు అనుకుంటాడు. అప్పుడే వీరు దగ్గరికి ఇషిక వస్తుంది. అనుకున్నది ఏం జరగడం లేదని ఇషికతో వీరు అంటాడు. ఆ గంగకి ఆ దేవుడి సపోర్ట్ ఉందేమో... అందుకే ఏం చెయ్యలేకపోతున్నామని ఇషిక అంటుంది. ఆ తర్వాత ఆ దేవుడినే మాయం చేస్తే అని వీరు అనగానే ఏం అంటున్నావ్ బ్రో అని ఇషిక షాక్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం ఇందుమతి హాల్లోకి వస్తుంది. వినాయకుడి విగ్రహం అక్కడ ఉండదు.. దాంతో తను షాక్ అయి అందరిని పిలుస్తుంది. ఆ విషయం ఇందుమతి చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. వినయకుడి విగ్రహం కన్పించకపోవడం ఏంటని ఇంట్లో అందరు అనుకుంటారు. అప్పుడే గంగ వస్తుంది. విషయం తెలిసి షాక్ అవుతుంది. అసలు వినాయకుడి విగ్రహం ఎవరు తీశారు.. వీరూనే తీసి ఉంటాడా.. తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.