Illu illalu pillalu : నర్మద, ప్రేమలపై భాగ్యం కన్నింగ్ ప్లాన్.. అది జరిగేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -239 లో.. ముగ్గురు కోడళ్ళు వరలక్ష్మి వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అన్నతమ్ముళ్లు ముగ్గురు తమ భార్యలకి చీరలు కొనుక్కొని తీసుకొని వస్తారు. నర్మదకి సాగర్ చీర ఇవ్వగానే కోపంగా మొహం తిప్పుకుంటుంది. నన్ను ప్రేమించి తప్పు చేసాను అన్నావ్ కదా అని అడుగుతుంది. సాగర్ రిక్వెస్ట్ చెయ్యడంతో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఆ చీర తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది నర్మద.   ఆ తర్వాత శ్రీవల్లికి చందు చీర తీసుకొని వస్తాడు. ఎక్కడ డబ్బు అడుగుతాడోనని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. కానీ చందు చీర ఇవ్వగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ప్రేమకి ధీరజ్ చీర తీసుకొని వచ్చి ఇస్తాడు. నువ్వు అన్నమాటలకి నేను బాధపడుతున్నానని.. అది రీప్లేస్ చెయ్యడానికి తీసుకొని వచ్చావా అని వెటకారంగా మాట్లాడుతుంది ప్రేమ.  నేనొక వస్తువుని కదా నాకు ఫీలింగ్స్ ఉంటాయా అని ప్రేమ అనగానే నేను ఒక్కసారి అన్నందుకు అదే మాటపట్టుకొని వేలాడతావని ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు.   ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం కోసం అందరు రెడీ అవుతారు. తమ భర్తలు తెచ్చిన చీరలు కట్టుకొని తోటికోడళ్ళు అందంగా ముస్తాబవుతారు. ఆ తర్వాత భాగ్యం శ్రీవల్లికి ఏదో ప్లాన్ చెప్తుంది. వాళ్ళని ఘోరంగా అవమానించాలి ఇంకొకసారి నీ జోలికి రాకుండా చెయ్యాలని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2 : పారిజాతానికి శుభవార్త చెప్పిన శ్రీధర్.. కార్తీక్ ఏం చేయనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -438 లో..... సుమిత్ర మాటలకి దీప బాధపడుతుంది. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న వచ్చి.. మళ్ళీ దీపని మాటలు అంటారు. అసలు నీ వాలకం చూస్తుంటే నువ్వే కావాలని తాళి తెంపుకున్నట్లున్నావని పారిజాతం అంటుంది. వెనక్కి తిరిగి చూసేసరికి కార్తీక్ ఉంటాడు. కార్తీక్ ని చూసి పారిజాతం భయపడి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శ్రీధర్ పెళ్లికి రానని చెప్పడంతో కార్తీక్ డల్ గా ఉంటాడు. కార్తీక్ దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. ఏంటి బావ గెలవబోయే ముందు మొహం ఇలా ఉండదు కదా అని అంటుంది. దీప వచ్చి.. మీ నాన్న దగ్గరికి వెళ్ళారు కదా బావ ఏమన్నారని అడుగుతుంది. సాయం కోసం వెళ్ళాం కదా చులకనగానే ఉంటుంది.. రానని చెప్పాడని దీపతో చెప్తాడు కార్తీక్.    ఆ తర్వాత పారిజాతం పక్కకి వచ్చి నోటిదూల ఆ కార్తీక్ గాడు ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో అనుకుంటుంది. అప్పుడే శ్రీధర్ ఫోన్ చేస్తాడు. అత్తయ్యగారు మీ గుడ్ న్యూస్ అని చెప్తాడు. ఏంటి అల్లుడు అని పారిజాతం అడుగుతుంది. కార్తీక్, కాంచన వచ్చారు పెళ్లికి రమ్మన్నారు రానని చెప్పాననీ శ్రీధర్ అనగానే పారిజాతం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫోన్ లోనే ఆనందంతో గట్టిగా అరుస్తుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. శ్రీధర్ గుడ్ న్యూస్ చెప్పాడని చెప్తుంది. నీకు ఇప్పుడు తెలిసిందా నాకు బావ మొహం చూసినప్పుడే తెలిసిందని జ్యోత్స్న అంటుంది.    ఆ తర్వాత స్వప్న బ్యాగ్ తో తన పుట్టింటికి వస్తుంది. ఏంటి ఇలా వచ్చావని కావేరి అడుగుతుంది. అన్నయ్య పెళ్లికి నాన్న రాను అన్నారంట కదా.. నా అక్క పెళ్లికి మీ నాన్న రాను అన్నాడు.. నీతో కాపురం చెయ్యను అని మా అయన నన్ను గెంటేసాడని స్వప్న అంటుంది. అయినా సరే నా నిర్ణయంలో ఏం మార్పు ఉండదని శ్రీధర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నిజంగానే అల్లుడు నిన్ను పంపించేశాడా అని కావేరి అడుగుతుంది. లేదు యాక్టింగ్ అని స్వప్న చెప్తుంది.    ఆ తర్వాత పారిజాతం హుషారుగా దీప దగ్గరికి వచ్చి వాటర్ తీసుకొని రమ్మంటుంది. దీప తీసుకొని వస్తుంది. ఆ వాటర్ కార్తీక్ తాగుతాడు. ఇందాక నా భార్యని ఏమో అంటున్నావని అడుగగా.. అన్నాను.. ఏంటి భయమా అని పారిజాతం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ట్యాబ్లెట్స్ మార్చేసిన రుద్రాణి.. కావ్యని పెళ్ళి చేసుకుంటానన్న రాజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -802 లో...... కావ్య రెడీ అయి పై నుండి కిందకి వస్తుంది. తనని చూసి రాజ్ ప్లాట్ అవుతాడు. మీరు చాలా బాగున్నారని రాజ్ అనగానే ఏంటి రాజ్ మా కావ్యకి అందరి ముందే సైట్ కొడుతున్నావని స్వప్న అంటుంది. ఆ తర్వాత రాజ్ అందరిని ఒక్కొక్కరిగా హాల్లో నుండి పంపిస్తాడు. మీరు బాగున్నారని మళ్ళీ అంటాడు. ఇందాకే చెప్పారు కదా అని కావ్య అనగానే అందరి ముందు చెప్పాను కానీ ఇప్పుడు పర్సనల్ గా చెప్తున్నానని రాజ్ అంటాడు.   ఆ తర్వాత కావ్య దగ్గరికి అప్పు వచ్చి.. నా టాబ్లెట్స్ అయిపోయాయి. నీ దగ్గరివి ఇవ్వు అక్క అని అప్పు అడుగుతుంది. ఎవరైనా వింటారు మెల్లిగా అని కావ్య అంటుంది. అప్పు ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్ళిపోగానే.. అప్పుడే కనకం వస్తుంది. నిన్ను చూస్తుంటే బాధగా ఉందని అంటుంది. అది రుద్రాణి విని ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్లి అప్పు ప్రెగ్నెంట్ అని కావ్యకి ఈర్ష్యగా ఉందంటే నమ్మలేదు కదా కావ్య మాటలు విను అని కావ్య, కనకం మాట్లాడుకునే దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అప్పు చాలా అదృష్టవంతురాలు అర్థం చేసుకునే భర్త ఉన్నాడని కనకంతో కావ్య అంటుంది. అదంతా ధాన్యలక్ష్మి వింటుంది. చూసావా అది ఈర్ష్య కదా అని ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది రుద్రాణి. ఆ తర్వాత రాజ్, స్వరాజ్ కి కళ్యాణ్ బట్టలు తీసుకొని వచ్చి ఇస్తాడు. ఆ తర్వాత అప్పు నువ్వు టిఫిన్ చెయ్ అంటుంది. ధాన్యలక్ష్మి స్వయంగా అప్పుకి టిఫిన్ పెడుతుంది.   టాబ్లెట్స్ ఎక్కడున్నాయని అప్పుని ధాన్యలక్ష్మి అడుగుతుంది. నా రూమ్ లో ఉన్నాయని అప్పు చెప్తుంది. అదంతా విన్న రుద్రాణి.. నువ్వు వెళ్లి ఆ ఒరిజినల్ టాబ్లెట్ ప్లేస్ లో ఇవి పెట్టమని రాహుల్ కి వేరే టాబ్లెట్స్ ఇస్తుంది. ధాన్యలక్ష్మి గదిలోకి వెళ్ళేలోపు రాహుల్ టాబ్లెట్స్ చేంజ్ చేసి వస్తాడు.ఆ తర్వాత రాజ్ పంచెకట్టులో పూజ దగ్గరికి వస్తాడు. ముగ్గురు అక్కచెల్లెళ్ళు కలిసి పూజకి ఏర్పాట్లు చేస్తారు. తరువాయి భాగంలో కావ్యని రాజ్ ఆశీర్వదించేలా కనకం చేస్తుంది. ఆ తర్వాత మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని కావ్యతో అంటాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

జగపతిబాబు షోలో నాగార్జున... డాష్ డాష్ అంటూ పచ్చి బూతులు

సిల్వర్ స్క్రీన్ మీద మన్మధుడు ఎవరు అంటే నాగార్జున అంటారు అలాగే ఫామిలీ స్టార్ ఎవరు అంటే జగపతిబాబు అంటారు. వీళ్లిద్దరి టర్నింగ్ పాయింట్ మూవీస్ వచ్చి శివ, మన్మధుడు, శుభలగ్నం వంటివి చాలా వున్నాయి. వీళ్లిద్దరు ఒక్క చోట కలిస్తే ఆ టాక్ షో పేరే "జయమ్ము నిశ్చయమ్మురా" . ఈ షో జీ తెలుగులో లేటెస్ట్ గా స్టార్ట్ అయ్యింది. ఇక మొదటిగా నాగార్జున ఈ షోకి గెస్ట్ గా వచ్చారు. అలాగే ఆయన అన్న వెంకట్, అక్క సుశీల కూడా వచ్చారు. ఇక హోస్ట్ జగపతి బాబు నాగార్జున దెయ్యాల గురించి మాట్లాడుకున్నారు. తాను, జగపతి బాబు వాళ్ళ అన్న రాముకి ఈ దెయ్యాలు, ఈ స్పిరిట్ గేమ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు నాగార్జున. ఒకరోజు ఓజా బోర్డు మీద దెయ్యాలని పిలిచే స్పిరిట్ గేమ్ ఆడుతున్నప్పుడు   శివాజీ గణేష్ గారు వీళ్ళు గేమ్స్ ఆడుతున్న రూమ్ లోకి వెళ్లి బాగా తిట్టారట. ఐతే అప్పటికే ఒక దెయ్యం వచ్చి అనరాని మాటలు అంది అని జగపతి బాబు క్లారిటీ ఇచ్చారు. యు డాష్ డాష్ డాష్ అని తిట్టిందని ఐతే  ఆ తిట్లు చెప్పకూడదు అని అన్నారు. అప్పుడు శివాజీ గణేశన్ గారు దెయ్యం ఉందన్న విషయాన్ని నమ్మారు అని చెప్పారు. జగపతి బాబుకు దెయ్యాలంటే చాలా భయం. సినిమాల్లో అంత పెద్ద విలన్ గా క్రూరమైన రోల్స్ చేస్తాడు కానీ దెయ్యాలంటే చాలా పిరికోడు..రాత్రయితే అన్ని లైట్స్ ఆన్ చేసుకుని ఏసీ ఆన్ చేసుకుని పడుకుంటాడు  అని చెప్పారు నాగార్జునా. అవును దెయ్యాలంటే నాకు భయం ఎందుకంటే మనుషుల్ని డీల్ చేయొచ్చు కానీ దెయ్యాన్నీ నేనెక్కడ డీల్ చేయను. ఇప్పుడంటే మనుషులే దెయ్యాలైపోయారు అది వేరే సంగతి  అని చెప్పుకొచ్చారు జగపతి బాబు.

మణిరత్నంగారి ఇంటి బయట నెల రోజులు నిలబడ్డ నాగార్జున

  గీతాంజలి మూవీ అంటే ఇష్టపడని తెలుగు ఆడియన్స్ లేరు. ఆ మూవీతో నాగార్జునకు సొంత ఇమేజ్ అనేది వచ్చింది. ఐతే ఆ మూవీ తెలుగులో రిలీజ్ కావడానికి రీజన్ నాగ్. ఆ విషయాలను జయమ్ము నిశ్చయమ్మురా షోలో జగపతి బాబుతో కలిసి షేర్ చేసుకున్నారు. "చాలా వేరియేషన్స్ తో మూవీస్ చెసావ్వు. చాలామంది ఆడియన్స్ కి అసలు కొంతకాలం నువ్వు చేసే మూవీస్ ఏంటో అర్ధమే కాలేదు. విక్రమ్, శివ, గీతాంజలి, అన్నమయ్య, హలో బ్రదర్, మనం..ఒకదానికి ఒకటి పొంతన లేని డిఫరెంట్ మూవీస్...ఏంటి ఆ విషయాలు" అని జగపతి బాబు అడిగేసరికి. "విక్రమ్ ఫస్ట్ ఫిలిం కానీ దాని గురించి నాకు అంత పెద్దగా తెలీదు. ఫస్ట్ ఫిలిం కదా నువ్వు చేస్తే బాగుంటుంది అని నాన్న గారు అన్నారు. మూవీ బాగా ఆడింది. కానీ అది కేవలం నాగేశ్వరరావు గారి అబ్బాయి చూద్దాము ఎలా చేస్తాడో అని ఆడియన్స్ చూసారు ఆడింది. అంతకు తప్పితే ఆ సినిమాలో ఏమీ లేదు. ఆ తర్వాత ఒక ఏడూ సినిమాలు చేసాను..వాళ్ళు చెప్తున్నారు ఏదో చేయమంటున్నారు. ఆ మధ్యలో కలెక్టర్ గారి అబ్బాయి వచ్చింది నాన్నతో చేసాను. తర్వాత మజ్ను మూవీ వచ్చింది దాసరి నారాయణరావు గారితో చేశాను. మజ్ను అనే మూవీ నాకు బ్రేక్ ఇచ్చింది. నాలో నటుడు ఉన్నాడు అని ఆడియన్స్ కి తెలిసింది. మాస్ అండ్ కమర్షియల్ మూవీ ఆఖరి పోరాటం నాకు బ్రేక్ ఇచ్చింది. ఆ మూవీ అంటే రాఘవేంద్ర రావు గారు శ్రీదేవి గారు మాత్రమే కనిపిస్తారు. నేను ఒక బొమ్మలా ఉన్నాను అంతే. నేను చేసేవే నాకు నచ్చట్లేదు అప్పటివరకు. అప్పుడు నేను మణిరత్నం గారి వెనక పడ్డాను. ఆయన తీసిన మౌన రాగం చూసా..ఆయన ఆలోచనలు నాకు సూట్ అవుతాయి అనిపించి చెన్నైలో ఆయన వెనక పడడం స్టార్ట్ చేశాను. ఉదయం 6 గంటలకు వాకింగ్ కి వెళ్తారు అని తెలిసి అంతకు ముందే నేను ఆయన ఇంటి బయటకు నిలబడేవాడిని. ఆయనతో కలిసి పది నిమిషాలు వాక్ చేసేవాడిని. తరువాత ఆయన టెన్నిస్ కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయేవారు. తర్వాత  ఆయన్ని కన్విన్స్ చేశా అలా గీతాంజలి మూవీ బయటకు వచ్చింది. ఐతే ఆయన తమిళ్ లో చేస్తాను అన్నారు ముందు. ఐతే మీకు ఎలాగో తమిళ్ లో మార్కెట్ ఉంది. తెలుగులో చేసి మార్కెట్ పెంచుకోండి అని ఐడియా ఇచ్చాను. అలా ఆయనకు విపరీతమైన మార్కెట్ పెరిగింది. నాకు హిట్ వచ్చింది." అని చెప్పారు నాగార్జున.  

Jayam serial : పెళ్ళికొడుకు అలాంటివాడే అని తెలిసి వెళ్ళిపోయిన గంగ!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -29 లో....గంగకి ఆ రూమ్ లో ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఏంటని చూసేసరికి అందులో లక్ష్మీ ఉంటుంది. తనని చూసిన గంగ షాక్ అవుతుంది. లక్ష్మీ కాళ్ళు చేతులకి ఉన్న తాళ్ళని విప్పేస్తుంది. ఈ పెళ్లి చేసుకోకు వాడు మంచివాడు కాదు.. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను.. వాడు దుబాయ్ లో అమ్మేస్తాడంట అని లక్ష్మీ వాడి గురించి చెప్తుంది. నువ్వు ఇక్కడ నుండి పారిపోమని లేదంటే.. నా మీద ఒట్టే అని లక్ష్మీ అంటుంది. ఏం చెయ్యలేక గంగ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు రుద్రని ఇన్‌స్పెక్టర్ స్టేషన్ కి తీసుకొని వస్తాడు. తన ఫోన్ కూడా లాక్కుంటాడు. అప్పుడే వాంటెడ్ లిస్ట్ లో గంగని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫోటో చూసి షాక్ అవుతాడు. కానిస్టేబుల్ ని పిలిచి రుద్ర వాడి గురించి అడుగగా.. వాడు పెద్ద ఫోర్ ట్వంటి అని చెప్తాడు. వెంటనే ఈ పెళ్లి ఆపాలని ఇన్‌స్పెక్టర్ ని వెళ్లి అడుగుతాడు. నేను పంపించనని అంటాడు. దాంతో కానిస్టేబుల్ పెద్దసారుకి ఫోన్ చేసి రుద్ర అరెస్ట్ గురించి చెప్తాడు. మరొకవైపు పెళ్లి కూతురు లేదని తెలుస్తుంది. వాళ్ళ అమ్మ పంపించందట అని అనుకుంటారు. నీ కూతురితో నాకు పెళ్లి జరగపోతే ఏం చేస్తానో తెలియదని పైడిరాజుకి పెళ్ళికొడుకు వార్నింగ్ ఇస్తాడు. గంగ వెళ్లిపోవడం ఏంటని శకుంతల అంటుంది. ఏదో అబ్బాయి గురించి తెలియకూడని విషయం తెల్సినట్లు ఉంది.. అందుకే వెళ్ళిందని శకుంతల కూతురు అంటుంది. పైడిరాజు పెళ్లి ఆగిపోయిందని లక్ష్మీని కొడతాడు. నీ కూతురు ఎక్కడున్నా తీసుకొని వచ్చి నీ ముందే పెళ్లి చేసుకుంటానని పెళ్ళికొడుకు అంటాడు. మరొకవైపు గంగ తప్పించుకొని వెళ్తుంది. ఆ తర్వాత పెద్దసారు రుద్రకి బెయిల్ తీసుకొని వస్తాడు. గంగ పెళ్లి ఆపాలి.. అబ్బాయి మంచివాడు కాదని చెప్తాడు. అందరూ అక్కడ నుండి పెళ్లి ఆపడానికి బయల్దేర్తారు. తరువాయి భాగం లో రుద్ర పెద్దసారు పెళ్లి దగ్గరికి వస్తారు. గంగ వెళ్ళిపోయిన విషయం తెలుస్తుంది. ఎలాగైనా గంగని కాపాడాలనుకుంటారు గంగ వీరు కంటపడుతుంది. వీరు తనని తీసుకొని అబ్బాయి దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : వరలక్ష్మీ వ్రతం నాడు భార్యకి చీరలు కొన్న భర్త.. శ్రీవల్లికి దబిడిదిబిడే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -238 లో.... అక్క వరలక్ష్మి వ్రతం చేద్దామని ఇంట్లో వాళ్ళకి చెప్పావ్.. ఎందుకు అక్క అని నర్మదని ప్రేమ అడుగుతుంది. ఎప్పుడు నగల టాపిక్ వచ్చినా కూడా వల్లి అక్క టెన్షన్ పడుతుంది. కదా రేపు వరలక్ష్మి వ్రతానికి వల్లి అక్క నగలు ఖచ్చితంగా పెట్టుకోవాలి కదా అప్పుడు నగల విషయం బయటపడుతుందని  నర్మద అంటుంది. సూపర్ ప్లాన్ అక్క అని ప్రేమ అంటుంది. వరలక్ష్మి వ్రతం రోజు ముగ్గురు కోడళ్ళు ప్రొద్దున లేచి వాళ్ళ పనులు చేసుకుంటుంటే అన్న తమ్ముళ్లు ప్లాట్ అవుతారు. చందు వచ్చి శ్రీవల్లికి ముద్దు పెడుతాడు. సాగర్ వచ్చి నర్మద నడుం గిల్లుతాడు. ప్రేమ ముగ్గు వేస్తుంటే ధీరజ్ వెళ్తాడు. లవ్ సింబల్ గిసి ఐ ధీమ అని అందులో రాస్తుంది ప్రేమ.‌ ధీమ ఎవరు అని ధీరజ్ అంటాడు. ధీరజ్ ప్రేమ అని చెప్పాలనుకుంటుంది. తర్వాత చెరిపేస్తుంది. అసలు ధీమ ఎవరని ధీరజ్ ఆలోచిస్తాడు.  ఆ తర్వాత అన్నతమ్ముళ్లు వాళ్ళ భార్యలకి చీరలు కొనడానికి షాప్ కి వెళ్తారు. ధీరజ్ నాకు ఇంకా సాలరీ రాలేదని సైలెంట్ గా ఉంటే.. ఇద్దరు కలిసి ధీరజ్ కి కొంత డబ్బు ఇస్తారు. ముగ్గురు కలిసి చీరలు కొనుక్కొని ఇంటికి వెళ్తారు. నర్మదకి సాగర్ చీర ఇస్తాడు కానీ నర్మద కోపంగా ఉంటుంది. ఆ రోజు నన్ను పెళ్లి చేసుకొని తప్పు చేసానన్నావ్  కదా అని నర్మద అంటుంటే.. సాగర్ రిక్వెస్ట్ చేస్తాడు. తరువాయి భాగం లో పూజకి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ఇంటికి పెద్ద కోడలిని కాబట్టి పీటలపై నేను మా అయన కూర్చుంటామని శ్రీవల్లి అంటుంది. దాంతో ప్రేమ, నర్మద శ్రీవల్లికి దగ్గరగా వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం గొడవ పెట్టుకుంటారోనని వేదవతి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : పెళ్ళికి రానని చెప్పిన శ్రీధర్.. దీపని తిట్టేసిన సుమిత్ర!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -437 లో.....శ్రీధర్ పేపర్ లో రాశి ఫలాలు చదువుతుంటాడు. అనుకోని అతిధి ఆగమానం తలకి మించిన భారంగా ఉంటుందని అందులో ఉంటుంది. అదేంటి ఇలా ఉంది అనుకొనే లోపే కార్తీక్, కాంచన ఎంట్రీ ఇస్తారు. రాశిఫలాలు రాసేటోడు ఎవరో గానీ జీవితాల్లోకి తొంగి చూసి మరి రాస్తున్నాడని శ్రీధర్ అంటాడు. అప్పుడే కావేరి వచ్చి.. అక్క లోపలికి రండి అని పిలుస్తుంది. నా కోసం కాదు.. వీళ్ళు నీ కోసం వచ్చి ఉంటారేమోనని శ్రీధర్ అనగానే లేదు మీ కోసం వచ్చామని కాంచన అంటుంది. ఏంటి దీప తాళిని జ్యోత్స్న తెంపిందట వాళ్ళందరు వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగారట అని శ్రీధర్ అంటాడు. దీపకి తల్లితండ్రుల స్థానంలో మా అన్నయ్య, వదిన పెళ్లి చేస్తున్నారు. కార్తీక్ కి తండ్రిగా మీరు తల్లిగా నేను ఉండాలని కాంచన అంటుంది. నేను రానని శ్రీధర్ మొహం మీదే చెప్తాడు. కాసేపటికి దీప గురించి శ్రీధర్ తప్పుగా మాట్లాడతాడు. వస్తాను కానీ పెళ్లి కూతురుగా దీప ఉంటే కాదని శ్రీధర్ చెప్తాడు. కార్తీక్ కి కోపం వస్తుంది కానీ కాంచన ఆపుతుంది. శ్రీధర్ రానని చెప్పి లోపలికి వెళ్తాడు. కార్తీక్, కాంచన ఇంటికి వెళ్తారు. వాళ్ళు వచ్చి పిలిచినందుకు అయిన ఈయన వెళ్లొచ్చు కదా అని కావేరి అంటుంది. మరొకవైపు సుమిత్ర దగ్గరికి దశరథ్ వచ్చి గుడికి వెళదామని అంటాడు. రానని సుమిత్ర అంటుంది. దాంతో దశరథ్ ఒక్కడే వెళ్తాడు. ఆ తర్వాత సుమిత్ర దగ్గరికి దీప వస్తుంది. ఏం వంట చేయాలని దీప అడుగగా.. రోజు నన్ను అడిగే చేస్తున్నావా అని సుమిత్ర కోప్పడుతుంది. అసలు కార్తీక్ తో అలా మాట్లాడిస్తుంది నువ్వే.. వెనకాల ఉండి నడిపిస్తున్నావ్.. ఎందుకంటే నేనంటే నీకు కోపం.. నీ పెళ్లి చెయ్యడం దౌర్భాగ్యం.. నిన్ను కూతురు అనుకోవడం నేను చేసిన పాపమని సుమిత్ర అంటుంటే.. దీప బాధపడుతుంది. అదంతా పారిజాతం, జ్యోత్స్న చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi:  స్వరాజ్ ని తీసుకొచ్చాడు.. కావ్యని చూసి ఇంప్రెస్ అయిన రాజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -801 లో రాజ్ ని ఇంటికి ఎలా రప్పించాలని అపర్ణ , ఇందిరాదేవి ఆలోచిస్తుంటే.. అప్పుడే రేవతి ఫోన్ చేసి స్వరాజ్ తో మాట్లాడిస్తుంది. ఆ తర్వాత అపర్ణకి ఒక ఐడియా వస్తుంది. స్వరాజ్ ని తీసుకొని ఇక్కడికి రమ్మని రాజ్ కి చెప్దామని ఇద్దరు ప్లాన్ చేస్తారు.ఆ తర్వాత యామినికి రుద్రాణి ఫోన్ చేసి.. కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తుంది. ఇద్దరు కలిసి కావ్య తనంతట తానే ప్రెగ్నెంట్ అని చెప్పేలా ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత రాజ్ కి ఇందిరాదేవి ఫోన్ చేసి రేపు స్వరాజ్ ని తీసుకొని ఇంటికి రమ్మని చెప్తుంది. కాసేపటికి రాజ్ దగ్గరికి యామిని వస్తుంది. బావ నిన్ను ఆ కళావతి ఎందుకు దూరం పెడుతుందో తెలుసా. నిన్ను పెళ్లి చేసుకుంటే అంత మంచి కుటుంబాన్ని వదిలి రావాలని ఆలోచిస్తుందని యామిని అనగానే అది కూడా కరెక్టే అని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత కావ్య కిచెన్ లో వర్క్ చేస్తుంటే.. వద్దని ఇందిరాదేవి, అపర్ణ లోపలికి పంపిస్తారు. కిచెన్ లో అప్పు ఉంటుంది. అది రుద్రాణి చూసి ధాన్యలక్ష్మికి చెప్తుంది. కడుపుతో ఉంది నీకోడలు.. తనకి రెస్టా.. కావ్యకా.. నీ కోడలికి అన్యాయం జరుగుతుందని ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది కానీ ధాన్యలక్ష్మి పట్టించుకోదు. ప్లాన్ ఫెయిల్ అయిందని రుద్రాణి అనుకుంటుంది. కాసేపటికి స్వరాజ్ ని తీసుకొని రాజ్ ఇంటికి వస్తాడు. ఏం తెలియనట్లు అపర్ణ సర్ ప్రైజ్ గా ఫీల్ అవుతుంది. అప్పుడే కావ్య రెడి అయి పైనుండి కిందకి వస్తుంటే రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నోరు అదుపులో పెట్టుకుంటే జనాలు ఆదరిస్తారు..నిఖిల్ కామెంట్

బిగ్  బాస్ లోకి వెళ్ళాలి అంటే ముందు అగ్నిపరీక్షను దాటాలి. దీని కోసం ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్స్ రన్నర్స్ అంతా వచ్చి వీడియోస్ చేస్తూ ఆడియన్స్ ని కామన్ మ్యాన్ ని మోటివేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అమరదీప్, ప్రేరణ బిగ్ బాస్ గురించి చెప్పారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. "మీరంతా నన్ను ఇష్టపడి గెలిపించారు. అందుకే నేను విన్నర్ గా నిలిచాను. ఇంతవరకు మేము బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి ప్రతీ ఒక్కరినీ ఎంటర్టైన్ చేసాం. కానీ ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా వచ్చి ప్రతీ ఒక్కరినీ అలరించబోతున్నాడు. ఈ సీజన్ చాలా ట్విస్టులు, టాస్కులు, చాలా కొత్తగా రాబోతోంది. ఇంకో విషయం ఏంటంటే నోరు అదుపులో పెట్టుకుంటే జనాలు ఆదరిస్తారు. ఏ టాస్క్ ఐనా ఏదైనా మంచిగా ఆలోచిస్తూ ఆడాలి. మీరు హౌస్ లో గేమ్ ఆడుతోంది మీకోసం మిమ్మల్ని ఇష్టపడే జనాల కోసం అని గుర్తుపెట్టుకోవాలి. వేరే వాళ్ళ కోసం ఆడడానికి వచ్చామని అనుకోవద్దు. మీ మనసులో ఎం అనిపిస్తుందో అదే చేయండి. బిగ్ బాస్ కి వెళ్లేముందు అగ్నిపరీక్ష రాబోతోంది. అందులో ఇంటర్వ్యూస్ రావొచ్చు, టాస్కులు ఆడాలని రావొచ్చు..మీ మనస్తత్వాన్ని తెలుసుకునే క్షణాలు రావొచ్చు ఇవన్నీ దాటి ఎవరు గెలుస్తారో వాళ్ళే బిగ్ బాస్ సీజన్ 9 లో ఉంటారు. " అంటూ చెప్పాడు నిఖిల్.

బిగ్ బాస్ 7 కి ట్రై చేశా...కానీ కుదర్లేదు..బ్రాండ్స్ ప్రమోషన్స్ కి వచ్చే పే ఎంతో తెలుసా ?

ఢీ షోలో కంటెస్టెంట్ గా ఉన్న అన్షు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె అటు సీరియల్స్ కూడా చేస్తూ ఉంటుంది. ఇక బిగ్ బాస్ గురించి ఒక ఇంటర్వ్యూలో  కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది.  "నేను బిగ్ బాస్ సీజన్ 7 కి ట్రై చేశా కానీ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 8 కల్లా నేను సీరియల్ కమిట్ అయ్యాను. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్. దాంతో అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అదే ఛానెల్ లోని సీరియల్ కాబట్టి ఇక ఇప్పుడు బిగ్ బాస్ అంటే కష్టం." అని చెప్పింది అన్షు రెడ్డి. "నన్నైతే ఇంతవరకు ఎవరూ అప్రోచ్ కాలేదు. ఇంటరెస్ట్ ఉంది ఎందుకంటే లైఫ్ లో దొరికే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదా అందుకే. బిగ్ బాస్ కి వెళ్లడం ఎందుకు ఇష్టం అంటే నన్ను నేను చూసుకోవచ్చు. నేనేంటో నాకు తెలీదు. నేను రోజూ అద్దం ముందు నిలబడి చూసుకోలేను కదా. ఏ సిట్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతానో కూడా నాకు తెలీదు. నేనేంటో తెలుసుకోవాలి, నేను ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటానో తెలియాలి అనే ఒక ఇంటరెస్ట్ ఉంది. అందుకే బిగ్ బాస్ కి వెళ్ళాలి అనుకుంటున్నా. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం సోషలైజ్ అవడం నేర్చుకుంటున్నాం. మంచి ఫ్రెండ్స్ ని చేసుకుంటున్నాం అని చెప్పింది శ్రీప్రియా. "ఇది వరకు ఫస్ట్ పే 70 రూపాయలు తీసుకున్నా...ఇప్పుడు రోజుకు బ్రాండ్స్ కి ప్రమోషన్స్ అలాంటివి చేసినప్పుడు 7 లక్షలు అలా వస్తాయి. ఇది వరకు యూట్యూబ్ మీద మంచి పేమెంట్ వచ్చేది. కానీ ఇప్పుడు అసలు యాక్టివ్ గా ఉండడం లేదు" అని చెప్పింది అన్షు రెడ్డి. ---------

సేవ్ ది టైగర్స్ మూవీలో సపోర్టింగ్ రోల్ లో నటనకు జోర్దార్ సుజాతకు సంతోషం అవార్డు

జబర్దస్త్ లో జోర్దార్ సుజాత - రాకింగ్ రాకేష్ జోడి చేసే స్కిట్స్ మంచి ఫన్నీగా ఉంటాయి. సుజాత ఎన్నో మూవీస్ లో కూడా సపోర్టింగ్ రోల్స్ లో నటించింది. ఆమె నటించిన సేవ్ ది టైగర్స్ మూవీలో రోల్ మాత్రం కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటుంది. ఆమె భాష, యాస అంతా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఐతే ఆమె సంతోషం అవార్డుని అందుకోబోతోంది. ఈ విషయాన్నీ రాకింగ్ రాకేష్ తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలిపాడు. "కంగ్రాట్యులేషన్స్... "సుజాతమ్మ" బెస్ట్  సపోర్టింగ్  యాక్ట్రెస్ అవార్డు అందుకుంటున్నందుకు..."సంతోషంగా" మొదలైన ఈ అవార్డుల పర్వం మరిన్ని అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ సేవ్  ది  టైగర్ " అంటూ పోస్ట్ చేసాడు. సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ , ఓటిటి మూవీస్ లో వర్క్ చేసిన ఎంతో మంది టాలెంటెడ్ పర్సన్స్ కి ఈ 24 వ సంతోషం అవార్డ్స్ ని అనౌన్స్ చేసింది. రాకేష్ - సుజాత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ షోకైనా ఈ జంట కలిసి వెళ్తుంది. మిగతా కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ కూడా ఇస్తుంది. ఇష్మార్ట్ జోడిలో వీళ్ళ పెర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పొచ్చు. అలాగే జబర్దస్త్ లో కూడా వెళ్ళు కలిసి స్కిట్స్ వేస్తూ ఉంటారు. రీసెంట్ గా వీళ్ళ ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడా పుట్టింది. ఇక రాకేష్ ఐతే కెసిఆర్ అనే ఒక మూవీని తీసాడు. ఇక ఈ సేవ్ ది టైగర్స్ మూవీ చేసేటప్పుడు సుజాత ప్రెగ్నెంట్ గానే నటించింది. ఇప్పుడు తన నటనకు అవార్డుని అందుకోబోతోంది.  

వరలక్ష్మి వ్రతం చేపించాలనుకున్న అత్త.. కావ్యకి స్వరాజ్ విషెస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -800 లో.....అప్పు తల్లి కాబోతున్నదని తెలిసి కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పు చేత ఏం పని చేయించడు.. అదంతా కావ్య చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు నా భర్త నా పక్కన లేడని బాధపడుతుంది. అదంతా అపర్ణ, ఇందిరాదేవి చూసి ధాన్ని మనం అయిన జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటారు. మరొకవైపు గతంలో కావ్య ప్రెగ్నెంట్ అని రాజ్ పొరపాటు పడిన విషయం గుర్తుచేసుకొని కావ్య బాధపడుతుంది. మరుసటిరోజు కావ్య అందరికి టీ లు ఇస్తుంటే ఇక నుండి నువ్వు కిచెన్ లోకి రాకు అని ఇందిరాదేవి, అపర్ణ చెప్తారు. ఏంటి ఈ రూల్ అప్పు ప్రెగ్నెంట్ అవుతుంది.. కావ్య కాదు ఎందుకు తనకి రెస్ట్ అని రుద్రాణి అంటుంది. ఇంతమంది ఉండగా నా కోడలు ఎందుకు పని చేయాలని అపర్ణ అంటుంది. ఆ తర్వాత వీళ్ళ కేరింగ్ చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది ఈ మధ్య కావ్య టాబ్లెట్ వేసుకుంటుంది.. అవి ఎందుకు వాడాతారో చూడాలని రుద్రాణి అనగానే రాహుల్ ఫోటో తీసుకొని వస్తాడు. ఆ టాబ్లెట్స్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు వాడతారని రుద్రాణి అనగానే.. రాహుల్ షాక్ అవుతాడు. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి.. నా కోడలు చేత వరలక్ష్మి వ్రతం చేయిస్తానంటుంది. అప్పుతో ఎందుకు ముగ్గురు కోడళ్ళతో చేయించమని అపర్ణ అంటుంది. కానీ కావ్య నా ఆశీర్వదించడానికి రాజ్ కి తెలియదు కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. నేను ఏదో చేస్తాను గానీ ముందు వెళ్లి ఏర్పాట్లు చెయ్ అని అపర్ణ అంటుంది. అప్పుడే స్వరాజ్ భోజనం చేస్తాలేడని అపర్ణకి ఫోన్ చేస్తుంది రేవతి. అపర్ణతో స్వరాజ్  మాట్లాడతాడు. తరువాయి భాగం లో స్వరాజ్ నువ్వుల  వెళ్లి ఆ అంటీకీ కంగ్రాట్స్ చెప్పు తన కడుపులో లో నీలాంటి బుజ్జి బేబీ ఉందని స్వరాజ్ కి చెప్పి పంపిస్తుంది రుద్రాణి. స్వరాజ్ వెళ్లి విషెస్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

లాస్ట్ మినిట్ లో ఫిట్టింగ్ పెట్టిన జ్యోత్స్న.. కార్తీక్ ఏం చేస్తాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -436 లో..... సుమిత్రని దీప, కార్తీక్ ల పెళ్లి జరగడానికి ఒప్పిస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత అందరు గదిలో నుండి బయటకు వస్తారు. పెళ్లికి రెండు రోజుల్లో ముహూర్తం పెడతారు. అందరు హ్యాపీగా ఉన్న టైమ్ లో.. ఇప్పుడు అసలు మొదలు అయింది ఇంకా మాట్లాడుకోవాలి కదా అని జ్యోత్స్న అంటుంది. ఇంకా ఏంటని అందరు అడుగుతారు. దీపకి అమ్మనాన్న లేరు కాబట్టి వాళ్ళ అమ్మనాన్న ప్లేస్ లో మా అమ్మ నాన్న కూర్చొని చేస్తున్నారు. అక్కడ తాంబూలం ఎవరికి ఇస్తారు కార్తీక్ అమ్మ నాన్న అయిన అత్తయ్య మావయ్య కి ఇస్తారు కదా అని జ్యోత్స్న అంటుంది. నువ్వు జరిగిన గొడవలు అన్ని తెలిసే ఇలా అడుగుతున్నావా అని కార్తీక్ కోప్పడుతాడు. అదేం లేదు వాళ్ళు లేకుంటే పెళ్లి ఎలా జరుగుతుందని జ్యోత్స్న అంటుంది. దాన్ని శివన్నారాయణ సమర్దిస్తాడు. మీరు పిలుచుకోండి అని శివన్నారాయణ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ పెళ్లి ఇష్టం లేక జ్యోత్స్న ని ఇలా ముందు పంపి ఇలా అడిగేలా చేసారని అనసూయ అంటుంది. వద్దు బావ వెళ్లి గుళ్లో పెళ్లి చేసుకుందామని దీప అనగానే తనపై కార్తీక్ కోప్పడతాడు. కాసేపటికి నేను తర్వాత వస్తాను నువ్వు వెళ్ళమని చెప్పి దీపని పంపిస్తాడు. ఆ తర్వాత దీప ఒక్కతే శివన్నారాయణ ఇంటికి వెళ్తుంది. దీపని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నగల విషయం తేల్చాలనుకున్న కోడళ్ళు.. వరలక్ష్మి వ్రతం రోజు ఫిక్స్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు:(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -237 లో.....  శ్రీవల్లి ఆడపడుచు కట్నంగా రోల్డ్ గోల్డ్ ఇచ్చిందని కామాక్షి కోపంగా ఇంటికి వస్తుంది. ఆ తర్వాత శ్రీవల్లిపై కామాక్షి కోప్పడుతుంది. భాగ్యం, శ్రీవల్లి కలిసి ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేస్తారు. ఈ నగలు మా చిన్న కూతురివి దానివి ఇందులో కలిసిపోయినవని భాగ్యం అంటుంది. ఇదేంటమ్మ చీప్ గా నేను ఎయిర్ పోర్ట్ పక్కన రెండు ఎకరాలు నీ పేరు మీద రాయిస్తానని భాగ్యం అంటుంది. దాంతో కామాక్షి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతే కాదు ఫిబ్రవరి ముప్పై తారీఖున నీకు రిజిస్ట్రేషన్ చేపిస్తానని భాగ్యం అనగానే కామాక్షి మురిసిపోతుంది. తింగరిది కనీసం ఫ్రిబ్రవరి ముప్పై ఉండదన్న విషయం కూడా తెలియదని భాగ్యం నవ్వుకుంటుంది. అదే విషయం కామాక్షి వచ్చి నా పెద్ద మరదలు ఆడపడుచు కట్నంగా ఏం ఇస్తుందో తెలుసా అని చెప్తుంది నర్మద, ప్రేమ వాళ్లకు చెప్తుంది. అదంతా విని.. ఇందులో ఏదో తేడా ఉందని ప్రేమ, నర్మద అనుకుంటారు. నగలు విషయం ఎప్పుడు వచ్చిన అక్క ఎందుకు టెన్షన్ పడుతుంది. విషయం తేల్చాలని అనుకుంటారు ఆ తర్వాత ప్రేమ, నర్మద రామరాజు దగ్గరికి వచ్చి.. రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటామని అడుగుతారు. అందుకు వేదవతి, రామరాజు సరే అంటారు. ఇందులో వాళ్ళ ప్లాన్ ఏదో ఉందని భాగ్యం, శ్రీవల్లి అనుకుంటారు. ఏ ప్లాన్ అయిన ఎదురుకొడతా అని భాగ్యం అంటుంది. మరొకవైపు రేపు నగల గురించి బయటపడుతుందని ప్రేమతో నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వాంటెడ్ లిస్ట్ లో పెళ్ళికొడుకు.. ఆ పెళ్ళి నుండి గంగ తప్పించుకుంటుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -28 లో.....గంగకి సారె ఇవ్వాలని శంకుంతల చీర, తాళిని తీసుకొని బయలుదేర్తుంది. వద్దని పెద్దసారు అంటాడు. నేను తనకి ఎలాగైన ఇవ్వాలని శకుంతల అంటుంది. వెళ్లనివ్వండి మావయ్య అవసరం అయితే నేను తోడు వెళ్తానని.. వీరు, ఇషిక ఇంకా వీరు భార్య తనతో పాటు బయల్దేరతారు. మరొకవైపు లక్ష్మి కన్పించడం లేదని గంగ ఫ్రెండ్స్ తనకి చెప్తారు. అప్పుడే పైడిరాజుని అబ్బాయి పిలిచి.. నువ్వు టెన్షన్ పడకు మీ భార్యని నేనే దాచాను.. పెళ్లి అయినాక వస్తుందని చెప్తాడు. మంచి పని చేశారని గంగ దగ్గరికి పైడిరాజు వెళ్లి.. మీ అమ్మకి కళ్ళు తిరిగినట్లు అయితే హాస్పిటల్ కి అల్లుడుగారు పంపించారు.. వస్తుంది.. నువ్వు టెన్షన్ పడకని పైడిరాజు అంటాడు. గంగ పెళ్లిపీటలపై కూర్చొని ఉంటుంది. శకుంతల సారె తీసుకొని వస్తుంది తనని చూసి గంగ హ్యాపీగా ఫిల్ అవుతుంది. చీర మార్చుకుంటానని గంగ గదిలోకి వెళ్తుంది. మరొకవైపు వీరు ప్లాన్ లో భాగంలో రుద్రని పోలీసులు అరెస్ట్ చేసేలా చేస్తాడు. ఆ తర్వాత గంగ గదిలోకి వెళ్తుంది. పొరపాటుగా శకుంతల ఇచ్చిన తాళి పక్కరూమ్ లో పడుతుంది. అది తీసుకోవడానికి గంగ ఆ రూమ్ లోకి వెళ్తుంది. లక్ష్మిని బంధించింది అదే రూమ్ లో.. ఏదో సౌండ్ వస్తుందని గంగ వాళ్ళ అమ్మకి దగ్గరగా వెళ్తుంది. తరువాయి భాగంలో పోలీస్ స్టేషన్ లో ముఠాల లిస్ట్ లో బోర్డు పై గంగని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫోటోని రుద్ర చూస్తారు. మరొక వైపు గంగ పెళ్లి దగ్గర నుండి తప్పించుకుంటుంది. ఆ విషయం తెలిసి అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వద్దురా ప్లీజ్...వాళ్లంతా డోర్స్ క్లోజ్ చేసుకునేవాళ్లు

సౌమ్య రావు..జబర్దస్త్ లో కొన్ని రోజులు యాంకర్ గా చేసింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత ఒక షోలో సౌమ్యకి తెలుగు రాదు అంటూ నూకరాజు చేసిన కామెంట్స్ కి సౌమ్య కూడా పట్టుబట్టి కొంతవరకు తెలుగు నేర్చుకుని ఇంతకుముందు కంటే చాలా బాగా మాట్లాడడం చేస్తోంది. ఇక ఇప్పుడు ఢీ షోలో మెంటర్ గా ఆదితో పాటు చేస్తోంది. ఇక ఒక ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అయ్యింది. ఆ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.  అందులో "సంకురాత్రి కోడి" అనే పాటను చాలా చక్కగా పాడి వినిపించింది. "ఒక పెద్ద హీరో ఫ్లయిట్ లో నీ నంబర్ తీసుకుని సౌమ్య నీతో మాట్లాడాలని ఉంది అని చెప్పారట" అని యాంకర్ వర్ష అడిగేసరికి సౌమ్య "వద్దురా కొడతాను. దణ్ణం పెడతాను ఆ మ్యాటర్ మాత్రం వద్దురా ప్లీజ్" అంటూ సౌమ్య నవ్వుతూ చెప్పింది. "పేదరికం అనేది చాలా బాడ్ రా. నాన్నలకు బిడ్డలను పెంచే శక్తి ఉన్నప్పుడే కనాలి. నా ఫాథర్ గురించి ఎందుకులే వదిలేయ్ ఆయన గురించి. మా అమ్మా చాలా బాధను అనుభవించింది. నీకు తెలుసా మా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే పక్కింటి వాళ్లంతా డోర్స్ క్లోజ్ చేసుకునేవాళ్లు. అమ్మాయి ఉందా. పెద్దదయ్యిందా ..చదువుకుంటోందా అని అడిగేవాళ్ళు. ఒక రోజు నైట్ 2 గంటలకు నేను నా బ్రదర్ మా అమ్మ బస్ స్టాండ్ లో పడుకున్నాం. రెండు రోజులు నేను ఫుడ్ తినలేదు. తిరుపతి వెళ్ళాక నేను దేవుడిని దర్శించుకోలేదు. ఎవరైనా ఫుడ్ ఎప్పుడు పెడతారా అనే ఎదురు చూసాను." అంటూ సౌమ్య తన జీవితంలో ఉన్న కష్టాలను చెప్పింది. ఇక ఢీ షోలో సౌమ్య మాట్లాడే తెలుగు మీద ఆది కూడా కామెంట్స్ చేస్తూ ఉంటాడు అలాగే సరిచేస్తూ ఉంటాడు.  

సినిమాల్లో హీరోయిన్ కి ఏం ఉండదు...

  బుల్లితెర మీద శ్రీప్రియ రెడ్డి -అన్షు రెడ్డి వీళ్లిద్దరి గురించి తెలియని వాళ్ళు లేరు. అన్షు రెడ్డి ఢీ షోలో కంటెస్టెంట్ గా ఉంది. ఇక ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా శ్రీప్రియ కూడా వచ్చి అన్షుతో డాన్స్ చేసింది. అలా వీళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్ షిప్ యొక్క డెప్త్ ఎంతో చూపించారు. ఇక రీసెంట్ గా వీళ్ళిద్దరూ ఒక ఇంటర్వ్యూలో సినిమా గురించి హీరోయిన్ గురించి మాట్లాడారు. సినిమాల్లోకి ఎందుకు ట్రై చేయలేదు అన్న ప్రశ్నకు " అక్కడ హీరోయిన్ కె ఎం ఉండదు అంత పెర్ఫార్మెన్స్ కి స్కోప్...మొత్తం హీరో రిలేటెడ్ ఉంటుంది." అంటూ శ్రీప్రియ రెడ్డి చెప్పింది. ఇక ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ లో నటిస్తున్న అన్షు రెడ్డి ఈ పాయింట్ కి క్లారిటీ ఇచ్చింది. "సీరియల్ కి వచ్చేసరికి హీరో హీరోయిన్, విలన్, ఫ్యామిలీ ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్న సీరియల్ లో నా రోల్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు నేను సీరియల్ ని వదిలేసి మూవీకి వెళ్తే జూనియర్ ఆర్టిస్ట్ లా ట్రీట్ చేస్తారు తప్ప పెద్దగా ఇంపార్టెన్స్ ఐతే ఇవ్వరు. ఇంత కంఫర్ట్ జోన్ ని వదులుకుని మేము మూవీస్ లోకి ఎందుకు ట్రై చేయాలి." అని చెప్పింది. "నేను కొన్ని మూవీస్ లో చేశా..అక్కడ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండదు. జస్ట్ అలా నిలబెడతారు అంతే..ఇక్కడ ఇంత కష్టపడి ఫేమ్ తెచ్చుకుని సినిమాల్లోకి వెళ్లి పోగొట్టుకోవడం ఎందుకు" అని చెప్పింది. ఇక వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు.  

యాంకర్ సౌమ్య రావుకి యాక్సిడెంట్.. ఒక పెద్ద హీరోతో ఇంటర్వ్యూ!

బుల్లితెర మీద యాంకర్ సౌమ్య రావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆదితో జోడిగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే సౌమ్య తెలుగు మీద ఆది చేసే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి సౌమ్య ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. " ఇండస్ట్రీల హార్డ్ వర్క్ ఎం పనికి రాదురా..లక్కే ఇంపార్టెంట్. ఈ ఫీల్డ్ లో ఉన్నవాళ్లందరికీ నిజంగానే టాలెంట్ ఉందా ?. కొంతమంది లక్కు వలన వస్తే , కొందరు గిమ్మిక్స్ చేసి వచ్చారు, వస్తూనే ఉన్నారు. లాస్ట్ టైం ఉదయభాను గారు ఒక మాట అన్నారు ఇక్కడ సిండికేట్ జరుగుతుంది అన్నారు. అది నూటికి నూరు శాతం ఈ ఫీల్డ్ లో ఉంది. నేను కూడా ఫేస్ చేసాను. నేను ఒక సీరియల్ చేస్తున్నప్పుడు ఒక హీరోయిన్ ఆ హీరో మధ్య ఏదో పర్సనల్ గా ఉండేది. షూటింగ్ అంతా ప్యాకప్ ఐపోయాక ఆ అబ్బాయి వచ్చి నాకు చెప్తున్నప్పుడు ఆ హీరోయిన్ కార్ ని రివర్స్ గేర్ వేసి వేసి వచ్చి నన్ను గుద్దేసింది.. నాకు అదో హారిబుల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇండస్ట్రీ నాకు ఇచ్చినదాని కన్నా నేను పోగొట్టుకున్నది ఎక్కువ. ఒక రోజు నేను ఒక పెద్ద హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాలి. ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యింది. కాలు మొత్తం బ్లడ్. అక్కడి నుంచి నేను లేచి మళ్ళీ ఇంటర్వ్యూ ప్లేస్ కి వెళ్ళిపోయాను. చాలా కష్టాలు పడ్డాను. దేవుడు కనిపిస్తే మా అమ్మకు అలాంటి రోగం లేదు అనే రిపోర్ట్ రావాలని కోరుకుంటా అప్పుడు మా అమ్మ ఇంకా బాగుండేది నాతో ఉండేది కదా అనుకుంటా. మా అమ్మకు ఎం చెప్తాను. నాకు ఆమె అన్నీ.. నాకు ఇప్పుడు జ్ఞాపకంగా మిగిలిపోయింది." అంటూ బాధపడుతూ చెప్పింది సౌమ్య.