జంబల్ హార్ట్ రాజా, భలే తమ్ముడు... సుమతో ఆడుకున్న బ్రహ్మానందం

ఈటీవీ 30 ఇయర్స్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఇందులో అతిరథమహారధులందరూ పార్టిసిపేట్ చేశారు. ఇక యాంకర్ గా సుమ అద్భుతంగా చేసింది. ఐతే ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా బ్రహ్మానందం, అలీ జోడి వచ్చారు. ఇక సుమ కూడా వాళ్ళను ఆట పట్టించింది. "ఆలీ గారు బ్రహ్మానందం గారి జీవిత చరిత్రను ఈటీవీలో ఒక సీరియల్ రూపంలో ప్రసారం చేయాలి అనుకుంటే దానికి ఏ పేరు పెడితే బాగుంటుంది" అంటూ సుమ అడిగింది. "జంబల్ హార్ట్ రాజా" అని పేరు పెడితే బాగుంటుంది అంటూ ఆలీ చెప్పేసరికి బ్రహ్మానందం ఒక రేంజ్ లో లుక్ ఇచ్చారు. ఇక సుమ ఐతే పడీపడీ నవ్వింది. "ఇది ఓకే అంటారా" అని బ్రహ్మానందాన్ని అడిగింది సుమ. " నా తమ్ముడు ఏది చెప్తే అదే" అన్నారు. "జంబల్ హార్ట్ రాజా" అర్ధం తెలీదు కానీ ఓకే సౌండింగ్ బానే ఉంది అన్నారు. "అలాగే ఆలీ గారు లైఫ్ హిస్టరీని ఈటీవీలో ఒక సీరియల్ రూపంలో ప్రసారం చేయాలి అనుకుంటే దానికి ఏ పేరు పెడితే బాగుంటుంది" అంటూ సుమ బ్రహ్మానందాన్ని అడిగింది. "భలే తమ్ముడు" అని చెప్పారు. "చాల ఎమోషనల్ టచ్ ఇచ్చారు" అని సుమా అనేసరికి "ఊరుకో ఊరుకో నువ్వు అనవసరంగా కళ్ళ నీళ్లు పెట్టుకోవద్దు. ఏదో అన్నాను ఐపోయింది అంతే బాధపడకురా సుమా నువ్వూరుకో" అంటూ చెప్పేసరికి సుమ పగలబడి నవ్వేసింది. "30 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఏదన్నా మార్చుకోవాలనుకుంటున్నారా  " అని సుమ అడిగేసరికి "ఎం ఎందుకు వెళ్ళాలి పనీ పాటా లేదా..ఏమన్నా పనుంటే చెప్పండి వెళ్తాం ..పని లేకపోతే ఎందుకు వెళ్ళాలి..ఐనా 30 సంవత్సరాల వెనక్కి వెళ్తే నేను ఎం మార్చుకోవాలనుకోవడం లేదు." అని చెప్పేసారు బ్రహ్మానందం.

రాకేష్ భార్యకు నేనే వండిపెట్టాను... ధనరాజ్ కాళ్ళు కడిగిన సుజాత

  జబర్దస్త్ ఎప్పటిలాగే ఈ వారం కూడా ఆడియన్స్ ని నవ్వించింది. ఇక ఇందులో రాకింగ్ రాకేష్ స్కిట్ ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసింది. రాకేష్ కొంత స్థలం కొనడం అందులో ఆయన గురువు ధనరాజ్ వాళ్లకు వీళ్లకు అంటూ మొత్తం స్వాహా చేయించేస్తాడు. చివరికి సుజాత తిట్లు ఫుల్ గ నవ్వించింది. తర్వాత రాకేష్ ధనరాజ్ కాళ్ళు కడిగాడు. "ఏ బంధం లేకుండా ఒక్క గురుశిష్యుల బంధం మాత్రమే ఇక్కడి వరకు నిలబడింది అంటే జబర్దస్త్ వల్లనే. ఈరోజున నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన గైడెన్స్ ఇస్తూ తండ్రిలా, గురువులా ఈ స్తానం వరకు తీసుకొచ్చారు. 12 ఏళ్ళ జర్నీని చూసాక ఆ కార్యక్రమంలో నేను లేను అనే బాధ ఉంది. అందులో నేను చేయలేనిది ఇప్పుడు చేయాలనుకుంటున్న" అని చెప్పి రాకేష్, సుజాత ఇద్దరూ కలిసి ధనరాజ్ కాళ్ళు కడిగారు. "రాకేష్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంతవరకు వచ్చాడు. రాకింగ్ రాకేష్ అంటే ఇప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ ఫొటోస్ దిగుతున్నారంటే చాల సంతోషంగా ఉంది. ఒక బిడ్డను కన్నప్పుడు తల్లి ఎంత ఆనందపడుతుందో నేను అంత కంటే ఎక్కువగా  ఆనందపడుతున్నాను. దేవుడిచ్చిన మరదలు. నాకు ఇద్దరు కొడుకులు. రాకేష్ నాకు మూడో కొడుకు..నాకు దేవుడిచ్చిన మరదలు ఒక రోజు నాతో అంది కడుపుతో ఉన్నప్పుడు నేను తినాలనుకున్నవి తినలేకపోయాను ఆ కోరికలు అలాగే ఉండిపోయాయి అంటే ఒకరోజు ఇంటికి పిలిచి తాను ఏమేమి తినాలనుకున్నదో అవన్నీ నేను ఒక్కడినే వండిపెట్టి భోజనం పెట్టాను. నా ఇల్లు రాకేష్ ఇల్లు అంటూ ఏమీ లేదు. ఆస్తి పంపకాలప్పుడు మాత్రమే వర్తించదు అంతే" అంటూ ధనరాజ్ చెప్పుకొచ్చాడు.

Illu illalu pillalu : గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటానని మాటిచ్చిన సాగర్.. శ్రీవల్లి ప్లాన్ ఏంటంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -249 లో..... సాగర్, నర్మద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నర్మదకి వెక్కిళ్లు వస్తుంటే.. ఎవరో నిన్ను గుర్తుచేసుకుంటున్నారు.. మీ వాళ్ళు అయి ఉంటారని సాగర్ అంటాడు. వాళ్లకు నేను గుర్తు రానని నర్మద బాధగా అంటుంటే అప్పుడే నర్మదకి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. మా అమ్మ ఎప్పుడు ఫోన్ చెయ్యలేదు.. ఇప్పుడు చేస్తుందేంటని నర్మద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మీ నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది అమ్మ అని తను చెప్పగానే నర్మద షాక్ అవుతుంది. నర్మద, సాగర్ ఇద్దరు వెంటనే హాస్పిటల్ కి వెళ్తారు. నర్మదపై వాళ్ళ నాన్న ఇంకా కోపంగా ఉంటాడు. అందరిలో మిల్ లో మూటలు మోస్తాడు. మీ అల్లుడు అంటే నా పరువు పోతుందని అతను అనగానే నేను ఏం చేస్తే నన్ను మీరు అల్లుడుగా ఒప్పుకుంటారని సాగర్ అడుగుతాడు. నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తే ఒప్పుకుంటానని అతను అనగానే అయితే త్వరలోనే గవర్నమెంట్ జాబ్ సాధిస్తానని నర్మద వాళ్ళ నాన్నకి మాటిస్తాడు సాగర్. దాంతో వాళ్ళ అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు నర్మద, ప్రేమ నన్ను ఎంత బాధపెట్టారు.. ఎలాగైనా వాళ్ళ అంతు చూడాలని శ్రీవల్లి అనుకుంటుంది. సాగర్ రాత్రి చదువుతున్నాడు కనిపెట్టాలి.. మరి ప్రేమ సంగతి అనుకుంటూ.. నిన్న ఏవో ఫోటోస్ దాచింది కదా అవేంటో కనుక్కోవాలని శ్రీవల్లి అనుకుంటుంది. మరొకవైపు ప్రేమతో కళ్యాణ్ ఉన్నా ఫొటోస్ పంపించడంతో.. వాడు మళ్ళీ ఎందుకు నా జీవితంలోకి వచ్చాడని ప్రేమ అనుకుంటుంది. ఆ తర్వాత ఎలాగైనా ఆ ప్రేమని నేను దక్కించుకోవాలని కళ్యాణ్ అనుకుంటాడు. ప్రేమ దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. అత్తయ్య నిన్ను రమ్మంటుందని పిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : ఒక్కటైన కార్తీక్, దీప.. జ్యోత్స్నకి దిష్టి తీసిన సుమిత్ర!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -448 లో..... దీప, కార్తీక్ ల పెళ్లి అయి దీపకి దశరథ్  అప్పగింతలు జరుపుతుంటే.. దీప ఎమోషనల్ అవుతుంది.అదంతా చూసి సుమిత్ర లోపలికి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కుబేర్ ఫోటోకి అనసూయ దీపం పెడుతుంది. నువ్వు కన్నతండ్రి కాకపోయినా దీపకి నువ్వు అంటే చాలా ఇష్టం అని అంటుంది. అప్పుడే స్వప్న, కాశీ ఎంట్రీ ఇస్తారు. అన్నయ్య వదిన ఎక్కడ అని అనసూయని అడుగుతారు. అప్పుడే శౌర్య వస్తుంది. నువ్వు మగ పిల్లాడివి అయితే నీకోసం ఒక కూతురిని కనేదాన్ని అని స్వప్న సరదాగా మాట్లాడుతుంది. దీపని కార్తీక్ పిలిచి ఇద్దరి చేత స్వప్న కేక్ కట్ చేయిస్తుంది. దాంతో ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు.మరొకవైపు శ్రీధర్ ని చూసి.. అక్కవాళ్ళ దగ్గరే ఉండకపోయారా ఇల్లు సందడిగా ఉంటుందని కావేరి అంటుంది. దానికి శ్రీధర్ వెటకారంగా మాట్లాడతాడు. ఆ తర్వాత పెళ్లిచీరని చూస్తూ దీప హ్యాపీగా ఫీల్ అవుతుంటే..అప్పుడే కార్తీక్ వస్తాడు. పెళ్లి టైమ్ కి తాళి తీసింది జ్యోత్స్ననే అని దీప అంటుంది. లేదు అత్తయ్య తీశారని కార్తీక్ మనసులో అనుకుంటాడు చివరికి అయితే తాత మా అమ్మమ్మ తాళి తీసుకొని వచ్చాడు కదా.. పెళ్లి అయింది కదా అని కార్తీక్ అంటాడు. నన్ను దీవించండి అని కార్తీక్ కాళ్ళు మొక్కుతుంది దీప. కార్తీక్ దీవిస్తుంటే.. బాగా దీవించావ్ బావ అని కార్తీక్ చెంపపై ముద్దుపెడుతుంది దీప. దాంతో కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు జ్యోత్స్నకి దిష్టి తీస్తుంది సుమిత్ర. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : నిజం చెప్పేసిన అపర్ణ.. కావ్య, రాజ్ ఒక్కటయ్యేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -812 లో.. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో చెప్పండి అని కావ్యని రాజ్ అడుగుతాడు. నిజం ఎలాంటిది అయినా కూడా నేను మీకు తోడుగా ఉంటానని కావ్యతో రాజ్ అనగానే అప్పుడే యామిని ఎంట్రీ ఇస్తుంది. ఆవిడ ఎందుకు నిజం చెప్తుంది బావ.. చెప్పదు ఎవరితోనో కడుపు తెచ్చుకున్నా కూడా మంచి మనసుతోని నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావ్.. అయిన వాళ్ళు చెప్పరని యామిని అంటుంది. ఏం అన్నావే అని అపర్ణ యామిని చెంపచెల్లుమనిపిస్తుంది. అసలు నా కోడలు గురించి ఎలా తప్పుగా మాట్లాడుతున్నావని యామినిపై కోప్పడుతుంది అపర్ణ. తనపై కోప్పడడం కాదమ్మ.. ఇప్పుడు నేను అడుగుతున్నా చెప్పండి తన కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు నిజంగానే తాను ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుందా అని రాజ్ అనగానే రాజ్ చెంపచెల్లుమానిపిస్తుంది అపర్ణ. ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు దాని భర్తవి.. నువ్వే తన కడుపులో బిడ్డకి తండ్రివి అని అపర్ణ అంటుంది. అపర్ణ అన్ని నిజాలు చెప్పగానే రాజ్ కళ్ళు తిరిగిపడిపోతాడు. వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత రాజ్ ని ఆ పరిస్థితిలో చూసి అపర్ణ బాధపడుతుంది. పిచ్చిదాన్ని అలా మాట్లాడి ఉండకుండాల్సింది అని బాధపడుతుంది. తరువాయి భాగం లో రాజ్ స్పృహలోకి వచ్చి కళావతి గారు బానే ఉన్నారు కదా అని అడుగుతాడు. రాజ్ చెయ్ ని కావ్య పట్టుకొని.. ఇక ఎప్పటికి ఈ చెయ్ వదలనని కావ్య చెప్తుంది. అదంతా యామిని చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

లైఫ్ లో బిగ్ బాస్ పేరు ఎత్తనివ్వకుండా చేయడమే ఉద్దేశమా ?

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి సెలబ్రిటీస్ తో పాటు ఈసారి చాల ఎక్కువ సంఖ్యలో కామనర్స్ ని కూడా తీసుకోవడం విశేషం. ఇక వాళ్లకు రకరకాల టాస్కులైతే ఇచ్చి వాళ్ళను సెలెక్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ అగ్నిపరీక్ష టీమ్. ఐతే రీసెంట్ గా శ్రీజ అనే కామన్ కంటెస్టెంట్ ని నవదీప్ ఊపుకుంటా ఊరు నుంచి వచ్చేసి అంటూ ఒక డైలాగ్ వేసి మరీ అవమానించడం ఆడియన్స్ అంతా చూసారు. ఇక దీని మీద ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ కూడా రియాక్ట్ అయ్యాడు. "బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎలా ఉంది ? నచ్చుతుందా..దాని గురించి ఏదన్నా చెప్తే కొంతమంది హ్యాపీగా ఫీలవుతారు. కొంతమంది బాడ్ గా ఫీలవుతారు. కొంచెం సేపు బిగ్ బాస్ అగ్నిపరీక్షను పక్కన పెట్టి కామనర్స్ గా లోపలి వెళ్లిన వాళ్ళను చూస్తుంటే వాళ్ళను చిన్న చూపు చూస్తున్నట్టుగా ఉందన్న విషయం తెలుస్తోంది. నిజానికి శ్రీజాని నవదీప్ గారు అలా అనకుండా ఉండాలని అనిపిస్తోంది. అది నాకు కొంచెం బాధగా అనిపించింది. మరి మీకేమనిపించిందో నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళేదో కష్టపడి జీవితంలో ఏదో సాధిద్దామని ఈ పొజిషన్ కి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళను కామనర్స్ గా ట్రీట్ చేస్తూ చులకనగా మాట్లాడుతున్నారు. కామనర్స్ కూడా జడ్జెస్ మార్క్స్ ఇస్తున్నారన్న విషయాన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళు రిప్లై ఇచ్చేదానికి అన్ని మూసుకుని కూర్చోవాలి. వాళ్ళు కామనర్స్ కి ఆ మాత్రమన్నా గౌరవిస్తున్నారు ఎందుకంటే జనాలు వాళ్ళను జడ్జ్ చేస్తున్నారు కాబట్టి. జడ్జెస్ కూడా ఒకప్పుడు కామనర్స్ గా వచ్చి సెలబ్రిటీస్ ఐనవాళ్ళే అన్న విషయాన్నీ మర్చిపోకూడదు. కామనర్స్ ని మనుషుల్లానే ట్రీట్ చేసి వాళ్లకు కూడా మర్యాద ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ షేవింగులు చేయించడాలు, సెల్ ఫోన్ లు పగలగొట్టించడాలు, ఇవన్నీ చూస్తుంటే కామనర్స్ ని ఇక లైఫ్ లో ఎప్పుడూ బిగ్ బాస్ పేరు ఎత్తనివ్వకుండా కొంచెం వికృతమైన చర్యలు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. మీకేమనిపిస్తోంది" అంటూ మాజీ బిగ్ బాస్ విన్నర్ కౌశల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి శ్రష్టి వర్మ.. ఆట మామూలుగా ఉండదు!

  బిగ్ బాస్ తెలుగు సీజన్-9 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. ఇప్పుడు లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ పేరు తెరపైకి వచ్చింది. (Shrasti Verma)   ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన శ్రష్టి వర్మ అందరికీ సుపరిచితమే. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో.. మీడియాలో ఆమె పేరు మారుమోగిపోయింది. ఈ కేసులో జానీ మాస్టర్ కొద్దిరోజులు జైలు జీవితం కూడా గడిపాడు. (Bigg Boss 9 Telugu)   జానీ మాస్టర్ కేసుతో శ్రష్టి వర్మ పేరు చాలారోజులు మీడియా, సోషల్ మీడియాలో నానింది. ఆ సమయంలో ఆమె ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇటీవల కొన్ని సాంగ్స్ కి కొరియోగ్రఫీ కూడా చేసింది. సినిమాల్లోనూ నటిగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనుందన్న వార్త ఆసక్తికరంగా మారింది.   శ్రష్టి వర్మ ఇంటర్వ్యూలను గమనిస్తే.. ఆమె ఒక ఫైటర్ అని, స్ట్రాంగ్ లేడీ అని అర్థమవుతోంది. బిగ్ బాస్ హౌస్ అంటేనే వివాదాలు, గొడవలకు పెట్టింది పేరు. మరి బిగ్ బాస్ హౌస్ లో శ్రష్టి వర్మ ఎలా ఆడబోతుంది? తనలోని అసలుసిసలైన ఫైటర్ ని చూపించబోతుందా? అనేది కొద్దిరోజుల్లో తేలిపోనుంది.  

క్రిష్ నెక్స్ట్ మూవీలో కేతమ్మకు అవకాశం

  బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేస్తోంది. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఇచ్చిన ప్రతీ టాస్కులని ఆది గోల్డెన్ సీట్ ని సొంతం చేసుకుని హౌస్ లోకి వెళ్ళడానికి పోటీ పడుతున్నారు. ఇక మరో ఎపిసోడ్ లో ఈ షోకి స్పెషల్ జడ్జ్ గా క్రిష్ జాగర్లమూడి వచ్చారు. అలాగే ఆయన తీసిన "ఘాటీ" మూవీ ట్రైలర్ ని కూడా ఇందులో ప్లే చేసి చూపించారు. ఇక ఈ మూవీ గురించి క్రిష్ మాట్లాడారు. నిజానికి సీతమ్మ తల్లి అగ్ని పరీక్షను దాటుకుని బయటకు వచ్చారు పునీతలా. కానీ ఈ మూవీ ఏంటంటే సీతమ్మ తల్లి లంకా దహనం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ కాన్సెప్ట్ అని చెప్పారు. ఇక తర్వాత కంటెస్టెంట్స్ కి టాస్కులు ఇచ్చారు. నాగా, ఊర్మిళ  చేతికి షాక్ బ్యాండ్ కట్టి పేపర్ మీద స్క్వేర్  డిజైన్స్ వేయించారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష అని రాయించారు. అందులో ఊర్మిళని సెలెక్ట్ చేశారు  క్రిష్. తర్వాత కేతమ్మ వచ్చి తన జీవితాన్ని ఒక పాట రూపంలో పాడి వినిపించింది. దానికి క్రిష్ ఫిదా ఇపోయారు. ఇక వచ్చి ఆమెతో ఇలా అన్నారు. "నీకు ఇష్టం ఉంటె నా నెక్స్ట్ మూవీలో ఒక చిన్న పాత్ర చేద్దువుగాని" అన్నారు. ఇక శ్రీముఖి ఐతే కేతమ్మ నీకు అర్దమయ్యిందా సినిమాలో నటించబోతున్నావ్ అంటూ చాలా గొప్పగా చెప్పింది. కేతమ్మ హుషారైతే మాములుగా లేదు. క్రిష్ చేతులు పట్టుకుని తన ఆనందాన్ని పంచుకుంది.

Illu illalu pillalu : ప్రేమ, ధీరజ్ ల లవ్.. ఆనందరావుని చూసిన తిరుపతి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -246 లో.... ప్రేమ వర్షంలో తడుస్తుంటే నర్మద వచ్చి లోపలికి రమ్మంటుంది. నువ్వు నాతో మాట్లాడకు అక్క అని ప్రేమ అనగానే నర్మద షాక్ అవుతుంది. నేను ఆ వల్లి వాళ్ళ నిజస్వరూపం బయటపెట్టాలనుకుంటే ఇలా చేసావని నర్మదని కోప్పడుతుంది ప్రేమ. నర్మద బాధపడుతూ లోపలికి వెళ్తుంది. ప్రేమ వర్షంలో తడిసి లోపలికి వస్తుంది. ప్రేమని చూసి ధీరజ్ తల తుడుచుకోమని టవల్ ఇస్తాడు. ప్రేమ సైలెంట్ గా ఉండడంతో ధీరజ్ ప్రేమ తల తూడుస్తాడు. జలుబు అవుతుందేమోనని వేడి నీళ్లు తీసుకొని వచ్చి ఆవిరి పట్టిస్తాడు ధీరజ్. అదంతా చూసి నేను ఎవరిని అని అడుగుతాడు. ప్రేమ అని ధీరజ్ అనగానే.‌ అలా కాదు నాపై ఇంత కేర్ చూపిస్తున్నావు.. పైగా వరలక్ష్మి వ్రతం రోజు నాకు చీర కొనుక్కొని వచ్చావని ప్రేమ అంటుంది కానీ ధీరజ్ మాత్రం సైలెంట్ గా బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నర్మద గదిలోకి వెళ్లగానే సాగర్ చిర్రుబుర్రులాడుతాడు. నా గురించి పట్టించుకోవా.. ఎప్పుడు ఫ్యామిలీ అంటావ్.. ముద్దు లేదు ముచ్చట లేదు అని సాగర్ అంటుంటే నర్మద మాత్రం చీర మార్చుకోవడానికి చీర సెట్ చేస్తుంటుంది.. నేను కడుతాను చీర అని నర్మద దగ్గరికి వస్తాడు సాగర్. మరుసటి రోజు ఆనందరావు ఇడ్లీ అమ్ముతుంటే తిరుపతి చూస్తాడు. నువ్వేంటి అన్నయ్య ఇడ్లీ అమ్ముతున్నావని అడుగుతాడు. మా ఆస్తులన్నీ పోయాయి కదా అందుకే అని అతను అంటాడు. సరే కానీ ఇడ్లీ తిను అని ఆనందరావు ఇవ్వగా.. నా చేతు కలశంలో ఉంది కదా.. నువ్వే తినిపించమని తిరుపతి అనగానే అతను తినిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కార్తీక్, దీపల పెళ్ళి ఆపడానికి జ్యోత్స్న మరో ప్లాన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -445 లో..... కార్తీక్, దీపల పెళ్లి ఆపాలని శ్రీధర్, పారిజాతం, జ్యోత్స్న ఒకటవుతారు. ఎలా ఆపాలని ప్లాన్ ల మీద ప్లాన్ లు వేస్తుంటారు. శ్రీధర్, పారిజాతం ఇద్దరు ఐడియా చెప్తే జ్యోత్స్న వద్దని చెప్పి తానొక ఐడియా ఇస్తుంది. శౌర్యని కాసేపు కిడ్నాప్ చేస్తే పెళ్లి ఆగిపోతుంది. ఆ తర్వాత వదిలిపెడదామని జ్యోత్స్న అనగానే దానికి ఇద్దరు సరే అంటారు. ఆ తర్వాత పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగి కార్తీక్, దీప పెళ్లిపీటలపై కూర్చుంటారు. దీప డల్ గా ఉండడంతో ఎందుకు అలా ఉన్నావని కార్తీక్ అడుగుతాడు. నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండాలి. ఇక్కడ ఉన్నవాళ్లు మన రక్తసంబంధీకులు అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత శౌర్యా ఎక్కడ అని కాంచన అనగానే అనసూయ వెళ్లి చూస్తుంది. ఎక్కడ కన్పించకపోవడంతో అందరు షాక్ అవుతారు. దీప, కార్తీక్ పెళ్లి పీటలపై లేచి శౌర్య కోసం చూస్తారు. అక్కడ ఒకమ్మాయి శౌర్యని చూసిందని.. శౌర్యని ఎవరో కార్ లో తీసుకొని వెళ్లారని చెప్తుంది. దీప, కార్తీక్ బయటకు వెళ్ళబోతుంటే శౌర్య వస్తుంది. ఎక్కడకి వెళ్ళావని అడుగుతారు. ముద్దుల తాత నన్ను షాపింగ్ కి తీసుకొని వెళ్ళాడని శౌర్యా చెప్తుంది. వెనకాలే శివన్నారాయణ వచ్చి అందరికి బట్టలు తీసుకున్నాం.. దానికి తీసుకోలేదని వెళ్ళానని శివన్నారాయణ అనగానే అందరు కూల్ అవుతారు. అప్పుడే ఒకావిడ తన పాపపై కోప్పడుతుంది. ఎక్కడకి వెళ్ళావే అని అడుగుతుంటే.. ఎవరో గదిలో పెట్టి డోర్ వేసారని చెప్తుంది. ఎవరో నిన్ను చూసుకోకుండా వేశారులే అమ్మ అని శివన్నారాయణ అంటాడు. అదేంటి నేను అద్దాలు మార్చడం వల్ల పిల్లనే మార్చేసానా అని శ్రీధర్ అనుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ కి దీప, సుమిత్ర, దశరథ్ లు బట్టలు పెడుతారు. వాళ్ళు మార్చుకోవడానికి వెళ్తారు. ఆ లోపు జ్యోత్స్న మరొక ప్లాన్ తో రెడీగా ఉంటుంది. పాలల్లో మత్తు మందు కలుపుతుంది. అది శ్రీధర్ చూస్తాడు. ఇవి తాగి దీప మంచిగా పడుకుంటుంది మావయ్య అని శ్రీధర్ కి చెప్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahamamudi : రాజ్ ని చూసి కావ్య ఎమోషనల్.. నిజం చెప్పేసిన అపర్ణ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -809 లో..... కావ్య రిజెక్ట్ చేసిందని తాగుడుకి బానిస అవుతాడు రాజ్. తాగి రోడ్డుపై పడి ఉంటే రాజ్ ని కావ్య చూస్తుంది. రాజ్ ని ఆ సిచువేషన్ లో చూస్తూ కావ్య ఏడుస్తుంది. డ్రైవర్ సాయంతో రాజ్ ని కార్ లోకి ఎక్కించుకొని యామిని ఇంటికి తీసుకొని వెళ్తుంది కావ్య. రాజ్ ని కావ్య తీసుకొని రావడం చూసి యామిని షాక్ అవుతుంది. రాజ్ ని తీసుకొని వెళ్లి బెడ్ పై పడుకోబెడుతుంది. కావ్య బయటకు వచ్చి మౌనంగా వెళ్తుంటే.. ఏంటి కళావతి రాజ్ ని ఈ సిచువేషన్ లో చూడలేకపోతున్నావా అని కావ్య బాధపడేలా యామిని మాట్లాడుతుంది. యామిని మాటలకి సమాధానం చెప్పి కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కావ్య ఇంటికి వెళ్లి అపర్ణ, ఇందిరాదేవీలకి జరిగిందంతా చెప్తుంది. వాళ్ళు బాధపడుతారు. వెంటనే రాజ్ దగ్గరికి బయల్దేర్తారు.వాళ్ళు వెళ్లేసరికి రాజ్ తాగి మెట్లపై తలకిందులుగా పడుకొని ఉంటాడు. రాజ్ ని ఆ సిచువేషన్ లో చూసి వాళ్ళు బాధపడుతారు. వాళ్ళని రాజ్ చూసి అబ్బో ఇద్దరు పెద్ద రాయుడులు వచ్చారు.. ఇప్పుడు నీతి వాక్యాలు చెప్పడానికి అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో కావ్యనే తన భార్య అని రాజ్ కి చెప్తుంది అపర్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ అంటే ఇష్టం అందుకే ఇది వేసుకున్న

  బిగ్ బాస్ అగ్నిపరీక్షలో హోల్డ్ లో ఉన్న కామనర్స్ కి డేర్ ఆర్ డై లెవెల్ 1 లో టాస్కులు ఇస్తోంది శ్రీముఖి. ఇప్పుడు ఊర్మిళ వెర్సెస్ శ్రీజ మధ్య ఒక టాస్క్ పెట్టింది. "బిగ్ బాస్ సీజన్ 3 లో ఒకానొక టాస్క్ లో నేను ఈ బిగ్ బాస్ టాటూ వేయించుకున్నాను..కాబట్టి మీరు నుదిటి మీద ఐ యామ్ ఏ లూజర్" అని టాటూ వేయించుకోవాలి అని చెప్పింది శ్రీముఖి. దాంతో ఊర్మిళ వెంటనే "నేను వెళ్లి కూర్చుంటున్నాను. ఎందుకంటే నేను లూజర్ ని కాదు కాబట్టి" అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక శ్రీజ మాత్రం తాను వెనకడుగు వేయను అని టాటూ వేయించుకుంటాను  అని చెప్పింది. "అంటే నుదుటి మీద జీవితాంతం కనిపించేలా ఐ యాం ఏ లూజర్ అని వేయించుకుంటావా" అని శ్రీముఖి అడిగింది. హా వేయించుకుంటాను..ఎక్కడైనా పర్లేదు నాకు  అని శ్రీజ అనేసరికి ఇచ్చి పడేసింది అంటూ నవదీప్ అన్నాడు. ఇక శ్రీముఖి నీ పేరులోనే దమ్ము ఉంది అనుకున్నా కానీ నీలో కూడా చాల దమ్ముంది అంటూ  అసలు విషయం చెప్పింది. టాటూ నుదిటి మీద కాదు లూజర్ అని కూడా కాదు. చేతి మీద వేయించుకోవాలి అని చెప్పింది. ఇక స్టేజి మీదకు టాటూ వేసేవాళ్లను కూడా శ్రీముఖి పిలిచింది. ఇక శ్రీముఖి మళ్ళీ ట్విస్ట్ పెట్టింది. 'నువ్వు ఈ టాటూ వేయించేసుకున్నాక అసలు ఈ అగ్నిపరీక్ష నుంచి నువ్వు హౌస్ లోకి వెళ్లకపోతే" అని అడిగింది. "హా పర్లేదు. ఒక మెమరీగా ఉంటుంది నాకు..బిగ్ బాస్ కోసం నేను ఇంతదూరం వచ్చాను. ఎవరికీ రాని అవకాశం నాకు వచ్చింది కదా పెర్మనెంట్ గా. హ్యాపీగా వేయించుకుంటా " అని చెప్పింది శ్రీజ. టాటూ వేయించుకున్నా శ్రీముఖి చెయ్యెత్తి ఆ టాటూ చూపించింది. దాంతో శ్రీజ నాగార్జున గారు కూడా ఇలాగే చెయ్యెత్తి ట్రోఫీ ఇస్తారా ఫైనల్ గా అని అడిగింది. దాంతో అందరూ అబ్బా అన్నారు. ఇక అభిజిత్ ఐతే శ్రీజ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది అని ఫిజికల్ స్ట్రెంత్ చాలా ఉందంటూ చెప్పాడు. ఇక బిందు మాధవి ఐతే శ్రీజ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే బిగ్ బాస్ 8 సీజన్స్ లో శ్రీముఖి, గీత మాధురికి మాత్రమే వేశారు. ఇద్దరూ ఫైనల్స్ వరకు వెళ్లారు. నీకు కూడా చాల ఫ్యూచర్ ఉంటుంది అని అనిపిస్తోందని చెప్పింది.

వసపిట్ట శ్రీజకు చుక్కలు చూపిస్తున్న నవదీప్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష చాలా హాట్ హాట్ గా జరుగుతోంది. కామనర్స్ ని 15 మందిని ఈ న్యూ బిగ్ బాస్ సీజన్ లో ఇంట్లోకి పంపించడానికి రెడీ అయ్యింది టీమ్. ఐతే ఇప్పటివరకు ఒక ఆరుగురిని స్టార్టింగ్ లోనే జడ్జెస్ సెలెక్ట్ చేశారు. అందులో శ్రీజ అనే వసపిట్ట కూడా ఉంది. డబ్బా రేకుల రాణి అంటూ తన గురించి తానె చెప్పుకుంది కూడా. ఐతే హోల్డ్ లో ఉన్న కంటెస్టెంట్స్ నుంచి ఇంకా కొంతమందిని సెలెక్ట్ చేయడానికి డేర్ ఆర్ డై లెవెల్ 1 లో కొన్ని టాస్కులు ఇచ్చి ఆడించారు హోస్ట్ అండ్ జడ్జెస్. అందులో హోల్డ్ లో ఉంచిన కల్కి అనే అమ్మాయికి షకీబ్ అనే అబ్బాయి మధ్య శ్రీముఖి ఒక ఇంటరెస్టింగ్ టాస్క్ ని పెట్టింది. ఈ డేర్ చేయాలంటే ఒకరు స్టూడియో నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేసరికి షాకిబ్ వెళ్ళిపోయాడు. అప్పుడు కల్కికి టాస్క్ చెప్పింది. తెల్సిన ఫ్రెండ్ ఎవరికైనా ఫోన్ చేసి ఎంతైనా అమౌంట్ ని తన అకౌంట్ లో వేయించుకోమని చెప్పింది. అలా కల్కి తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి 90 వేలు వేయించుకుంది. ఇక షాకిబ్ ని పిలిచి అదే టాస్క్ ఇచ్చారు. అతని సైడ్ నుంచి మొదట 10 వేలు వచ్చాయి. ఐతే అంత తక్కువ కాదు ఒక మ్యాగ్జిమమ్ అమౌంట్ అని మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చి వేయించుకోమని ఛాన్స్ ఇచ్చారు. అలా సెకండ్ ఛాన్స్ లో 50 వేలు షకీబ్ అకౌంట్ లో వేయించుకున్నాడు. ఐతే షకీబ్ అకౌంట్ లో 60 వేలు కల్కి 90 వేలు . ఐతే ఇది అన్ ఫేర్ అంటూ షాకిబ్ చెప్పాడు. తర్వాత గెలిచిన ఆరుగురి నుంచి ఇది అన్ ఫేర్ అనిపిస్తుందా అంటూ శ్రీముఖి అడిగింది. శ్రీజ చెయ్యెత్తి అన్ ఫేర్ అని చెప్పింది. తర్వాత షకీబ్ ని నవదీప్ అడిగాడు. కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పాడు. ఇక శ్రీజను నవదీప్ అడిగాడు ఎలా అన్ ఫేర్ అని. కల్కికి టాస్క్ గురించి క్లియర్ గా ఎక్ష్ప్లైన్ చేసారు షాకిబ్ కి చెప్పలేదు అంది శ్రీజ. ఎవరిదీ తప్పు...అతను కన్ఫ్యూజ్ అయ్యాడనే సెకండ్ చాన్సు ఇచ్చారు. సో అతను ఒక అమౌంట్ ని అడిగాడు. ఐతే ఇక్కడ నేను నీకు ఇస్తున్న సలహా ఏంటంటే అతిగా ఆలోచించకు. బిగ్ బాస్ వందల ఎపిసోడ్స్ వందల లాంగ్వేజస్ లో చేశారు. ఒకే నా నువ్వు ఊపుకుంటా ఒక ఊరు నుంచి వచ్చి యాక్చ్యువల్లి ఇది అన్ ఫేర్ అని చెప్పడానికి నీకంత సీన్ లేదు. ఇంకోసారి ఇలాంటివి చేయకు. నేనైతే సరదాగా చెప్పి పంపిస్తా కానీ తర్వాత అది నీకే చాల డేమేజ్ అవుతుంది ఇక ఐపోయింది. వెళ్లి కూర్చో అని శ్రీజకు నవదీప్ గట్టిగానే క్లాస్ ఇచ్చాడు నవదీప్.

అరగుండుతో హృదయమానవ్... సాఫ్ట్ గా ఉన్నాడని తొక్కేద్దామని చూస్తున్నారా!

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఆరుగురు కామన్ పీపుల్ గెలిచారు. హోల్డ్ 16 మంది ఉన్నారు. వాళ్లకు  సెకండ్ రౌండ్ సెలెక్షన్స్ నిర్వహించారు. వీళ్ళ కోసం డేర్ ఆర్ డై లెవెల్ 1 పేరుతో వీళ్లకు టాస్కులు ఇచ్చారు హోస్ట్ అండ్ జడ్జెస్. ముందు ఫస్ట్ టాస్క్ ఇచ్చాడు జడ్జ్ నవదీప్. స్ట్రాంగ్ భావాలున్న వ్యక్తి అని సంభోదిస్తూ హరీష్ ని స్టేజి మీదకు పిలిచాడు. ఐతే అతనికి పోటీగా శ్రీతేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. "ఓహో అతను సాఫ్ట్ గా ఉన్నాడని తొక్కేద్దామని చూస్తున్నారా" అన్నాడు ..దాంతో హరీష్ "కాదు గ్రూప్ డిస్కషన్ ఐపోయాక కూడా అతని లిమిట్ దాటి పర్సనల్ అయ్యాడు.  కొంచెం మాట్లాడదామని" అని చెప్పాడు సీరియస్ గా. "మీ పర్సనల్ రీజన్స్ ని మా మీద రుద్దకండి..ఇంకొకళ్ళను సెలెక్ట్ చేసుకోండి" అన్నాడు నవదీప్. తర్వాత శ్రీజను సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ నవదీప్ మాత్రం తనకు హరీష్ అషన్స్ నచ్చక సాయి కృష్ణని పిలిచాడు. ఫస్ట్ టాస్క్ ని బాగా హైప్ చేశారు. ఇక్కడ ఓడిపోతే ఇక డైరెక్ట్ గా ఇంటికి వెళ్లిపోవడమే అని చెప్పారు జడ్జెస్.ఇక హరీష్ అలియాస్ హృదయమానవ్ - సాయి కృష్ణ మధ్య పెట్టిన టాస్క్ సగం జుట్టు తీసేసుకోవాలని చెప్పాడు నవదీప్. ఇక ఆ ట్రిమ్మర్ ని ఇద్దరి మధ్య పెట్టాడు. వెంటనే హృదయ మానవ వచ్చి ఆ ట్రిమ్మర్ ని లాక్కుని సగం జుట్టు తీసేసుకుని అరగుండుతో టాస్క్ విన్ అయ్యాడు. "మరి మీ ఆవిడ ఈ అరగుండు చూసి ఎందుకు ఇదంతా మీకు" అని అడిగింది. "ఈ జుట్టు ఉన్న సగభాగం నా వైఫ్ ..ఈ అరగుండు నేను. నా భార్య నాలో సగం" అని చెప్పాడు. దాంతో జడ్జెస్ ఫిదా ఇపోయారు.

మగ నవదీప్ కి ప్రపోజ్ చేసిన ఆడ నవదీప్...

  బిగ్ బాస్ అగ్నిపరీక్ష మూడో రోజు సెలెక్షన్స్ లో ఆడ నవదీప్ ఒక రేంజ్ లో మగ నవదీప్ ని పడేసింది. నిజంగా ఈ సీన్ ని ఆడియన్స్ మస్త్ ఎంజాయ్ చేశారు. శ్వేతా హైదరాబాద్ నుంచి వచ్చింది. ఉండేది యూకే. చేసింది మాస్టర్స్.  ఈమె చాలా ఇంటరెస్టింగ్ కాండిడేట్ అని జడ్జెస్ కూడా ఫీలయ్యారు. ఇక జింజర్ షాట్స్ కొడుతూ తన ఇంట్రడక్షన్ ఇచ్చింది. అలాగే ఫింగర్స్ మీద ఒక కాలు పైకి లేపి పుషప్స్ కూడా చేసింది. మోడలింగ్ చేస్తూ ఉంటుంది..అలాగే బిజినెస్ చేస్తూ ఉంటుందని చెప్పింది. ఇక తన తల్లి ఒక కాన్సర్ పేషెంట్ అని, ఐతే తనతో టైం స్పెండ్ చేయాలి కానీ.. బిగ్ బాస్ హౌస్ లో కామనర్స్ కి మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందో రాదో అని తెలిసి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఉండడం కోసం వచ్చినట్లు చెప్పింది.    "శ్వేతా రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి మనది" అని బిందు మాధవి అడిగేసరికి "నేను ఆడ నవదీప్ ని" అని చెప్పింది. అంతే ఇక జడ్జ్ నవదీప్ బాగా కనెక్ట్ ఐపోయాడు. ఇంతవరకు ఎవరూ ఇలా చెప్పింది లేదు. ఫస్ట్ టైం ఒక ఆడ నవదీప్ ఒక మగ నవదీప్ ని ప్రపోజ్ చేయబోతోంది అంటూ శ్రీముఖి చెప్పింది. శ్వేతా రెడ్ రోజ్ తీసుకుని "నేను గౌతమ్ ఎస్.ఎస్.సి. చూసాను అక్కడ బాగా నచ్చారు. కానీ తర్వాత మళ్ళీ ఇంటరెస్ట్ పోయింది. మళ్ళీ చందమామ టైములో బాగా నచ్చారు. తర్వాత ఐస్ క్రీం మూవీలో మళ్ళీ ఇంటరెస్ట్ పోయింది. నాకు మీ ఫిలిమ్స్ తప్ప మీ ప్రపంచం తెలీదు. మిమ్మల్ని ప్రేమించాలి అంటే మీ ఫిలిం ప్రపంచాన్ని ప్రేమించాలి. అందుకే అలా చెప్తున్నా ఏమీ అనుకోకండి. ఓకే నవదీప్ లేట్ ఐతే అయ్యింది. కానీ లేటెస్ట్ గా స్టార్ట్ చేద్దాం. డోంట్ వర్రీ ప్రతీ ఒక్కళ్లకు ఒక రోజు వస్తుంది. నీకు ఒక రోజా వచ్చింది" అంటూ శ్వేతా తెగ సిగ్గుపడిపోయింది. "ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలీదు కానీ ప్రస్తుతానికి ఈ రోజాతో సర్దుకుంటున్న" అన్నాడు నవదీప్. ఇక ముగ్గురు జడ్జెస్ కలిసి గ్రీన్ ఇచ్చేసారు.  

Jayam serial : ఇంట్లో నుండి వెళ్ళిపోయిన గంగ.. ఆ కేసు నుండి రుద్ర తప్పించుకుంటాడా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-36 లో... గంగ సడెన్ గా నిద్రలేచి ఇషిక అన్నమాటలు గుర్తు చేసుకొని ఇంట్లో ఉండొద్దని నిర్ణయం తీసుకుంటుంది. పెద్దసారు ఇంకా శకుంతల దగ్గరికి వెళ్లి వాళ్ళ కాళ్ళు మొక్కి బయటకు వస్తుంది. అదంతా ఇషిక, వీరు చూసి మన ప్లాన్ సక్సెస్ అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే నా మనిషికి ఫోన్ చేసి గంగని కిడ్నాప్ చేయమంటానని వీరు అంటుంటే.. ఇప్పుడు ఎందుకు? అది ఎటు వెళ్లినా తిరిగి తన బస్తీకే కదా వెళ్ళేది అని ఇషిక అంటుంది.   ఆ తర్వాత గంగ వెళ్తుంటే రుద్ర ఉంటాడు. తనని చూసి ఆగిపోతుంది. నిన్ను ఎంతో ఇష్టపడే మా పెద్దమ్మ పెద్దనాన్నని మోసం చేసి వెళ్తున్నావా.. మీ అమ్మ గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో.. నేను మా పెద్దమ్మ గురించి అంతే ఆలోచిస్తాను. మీ అమ్మని వెతికి తీసుకొస్తాను.. నన్ను నమ్ము నాపై నమ్మకం లేకపోతే నువ్వు వెళ్ళు అని గంగకి చెప్పి రుద్ర లోపలికి వెళ్ళిపోతాడు.    ఆ తర్వాత పైడిరాజు దగ్గరికి వీరుమనిషి వచ్చి మా బాస్ దగ్గర డబ్బు తీసుకున్నావ్ కదా.. తిరిగి తీసుకొని రమ్మన్నాడని అతను చెప్పగానే నా దగ్గర అంత డబ్బు ఎక్కడిదని పైడిరాజు అంటాడు.   మరుసటిరోజు గంగ కోసం చూస్తుంది శకుంతల కానీ ఎక్కడ కన్పించదు.. ఇల్లు వదిలి వెళ్లిందేమోనని ఇషిక అంటుంది. నా మాట లెక్కచెయ్యకుండా వెళ్ళిపోయిందన్న మాట అని రుద్ర అనుకుంటాడు. అప్పుడే పైడిరాజు ఇంటిముందుకి వచ్చి నా కూతురు ని నాతో పంపించండని గొడవ చేస్తాడు.    తరువాయి భాగంలో లాయర్ పెద్దసారు దగ్గరికి వచ్చి.. రుద్ర సర్ ది ఫైనల్ హియరింగ్ ఉందని చెప్తాడు. ఒకవేళ రుద్ర తప్పు చేశాడని తెలిస్తే ఎలా అని పెద్దసారు అడుగుతాడు. పది నుండి పన్నెండు సంవత్సరాల శిక్ష అని లాయర్ అంటాడు. శకుంతల గారు కేసు వాపస్ తీసుకుంటే ఇదంతా ఏం ఉండదని లాయర్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : శ్రీవల్లి తప్పించుకుంది.. ప్రేమ, ధీరజ్ ల మధ్య మొదలైన అనుబంధం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -245 లో... భాగ్యం, ఆనందరావు చందు దగ్గరికి వెళ్లి మీరు మంచి మనసుతో మాకు పది లక్షలు ఇచ్చారు కానీ అవి ఇప్పుడు ఇచ్చే సిచువేషన్ లో మేం లేము బాబు.. దయచేసి ఏమనుకోకండి అని భాగ్యం అనగానే చందు షాక్ అవుతాడు. ఆ డబ్బు నేనెలా కట్టాలని టెన్షన్ పడతాడు.    ఆ తర్వాత తిరుపతి తన చెయ్యి కలశంలో ఇరుక్కుపోయిందని రామరాజు దగ్గరికి వచ్చి ఏం చెయ్యాలని అడుగుతాడు. అప్పుడే ధీరజ్, సాగర్ ఒకరు రంపం, ఒకరు పెద్దకత్తెర తీసుకొని వస్తారు. దాన్ని చూసి తిరుపతి భయపడి పారిపోతాడు.ఆ తర్వాత చందు దగ్గరికి శ్రీవల్లి వెళ్తుంది. మీ వాళ్ళు ఇలా చేస్తారని అసలు అనుకోలేదని చందు అనగానే.. వాళ్ళకి ఇలా జరుగుతుందని తెలియదు కదా బావ అని శ్రీవల్లి చందు భుజంపై తల వాలుస్తుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోమని చందు అనగానే శ్రీవల్లి బాధగా బయటకు వస్తుంది. హమ్మయ్య మా అమ్మ తెలివితో ఈ ప్రాబ్లమ్ నుండి బయటపడ్డాం కానీ ఇంటి పెత్తనం కూడా వస్తే బాగుండు అని శ్రీవల్లి అనుకుంటుంది.    శ్రీవల్లి ఏదో బాధపడుతుందని వేదవతి తన దగ్గరికి వచ్చి.. డబ్బు చూసి నిన్ను కోడలు చేసుకోలేదు.. నీ గుణం నచ్చి చేసుకున్నాం.. ఆస్తులు పోతే నిన్ను ఇక్కడ ఎవరు తక్కువ చూడరని శ్రీవల్లితో వేదవతి అంటుంది. అదంతా నర్మద విని.. చూసావా అత్తయ్య గారు ఎంత మంచివారు.. అలాంటి వాళ్ళని మోసం చెయ్యడానికి సిగ్గుండాలి.. ఇంకొకసారి ఇలా చేస్తే ఊరుకోనని శ్రీవల్లికి నర్మద వార్నింగ్ ఇస్తుంది.    ఆ తర్వాత ప్రేమ వర్షంలో కూర్చొని ఉంటుంది. లోపలికి రా ప్రేమ అని నర్మద అంటుంది. నేను రానని ప్రేమ చెప్తుంది. నా చెల్లికి నాపై కోపం వచ్చిందా అని నర్మద అంటుంది. ఆ వల్లి ఎంత టార్చర్ పెట్టింది. వాళ్ళ గురించి నిజం చెప్పొద్దన్నావ్.. నువ్వు నాతో మాట్లాడకు అని ప్రేమ అనగానే నర్మద బాధపడుతుంది.    తరువాయి భాగంలో ప్రేమకి జలుబు చేస్తుంది. దాంతో ధీరజ్ ఆవిరి పట్టిస్తాడు. నన్ను నువ్వు ఏం అనుకుంటున్నావు.. ఎలా అర్థం చేసుకోవాలని ధీరజ్ ని ప్రేమ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: పెళ్ళి ఆపడానికి జ్యోత్స్న అండ్ కో ప్లానింగ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -444 లో... కార్తీక్ ని పెళ్లి కొడుకుగా కాంచన రెడీ చేస్తుంది. దీపని సుమిత్ర రెడీ చేస్తుంది. దీపపై ఉన్న కోపాన్ని మళ్ళీ సుమిత్రకి గుర్తుచేస్తుంది జ్యోత్స్న. దాంతో దీపని అసహ్యించుకుంటుంది సుమిత్ర. దీపకి పూలు పెట్టు మమ్మీ అని సుమిత్రకి పూలు ఇస్తుంది జ్యోత్స్న. కానీ సుమిత్ర పూలు తీసి కిందపడేస్తుంది. దాంతో దీప బాధపడుతుంది. నీ తల్లి నిన్ను నా చావు కోసం కన్నట్లుంది అని సుమిత్ర అనగానే మా అమ్మని అలా అనకండి అని దీప ఏడుస్తుంది.   అప్పుడే దశరథ్ వస్తాడు. దీప కి దిష్టి తగిలేలా ఉంది.. దిష్టి తియ్ సుమిత్ర అని దశరథ్ అంటాడు. దీప బాధపడుతూ దశరథ్ ని హగ్ చేసుకొని నాన్న అంటూ ఏడుస్తుంది. ఏంటి అమ్మ.. మీ నాన్న గుర్తువచ్చాడా చనిపోయిన వాళ్ళు ఎక్కడో ఉండరు అమ్మ.. మన చుట్టూ తిరుగుతారు అమ్మ అని దీపతో దశరథ్ అంటాడు.    ఆ తర్వాత నాన్న నువ్వు చాలా బాగున్నావని కార్తీక్ తో శౌర్య అంటుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. శ్రీధర్ ఇంటి ముందు ఇస్తున్న బిల్డప్ గురించి కాంచనకి చెప్తుంది శౌర్య. దాంతో కార్తీక్, కాంచన ఇద్దరు కలిసి శ్రీధర్ పై కోప్పడతారు. దీప దగ్గరికి అనసూయ వెళ్తుంది. సుమిత్ర గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని అనసూయ అనగానే.. సుమిత్ర కాళ్ళు దీప మొక్కబోతుంటే కాళ్ళని తాకనివ్వదు.   ఆ తర్వాత శ్రీధర్, పారిజాతం, జ్యోత్స్న ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. పెళ్లిని ఎలా ఆపాలని డిస్కషన్ చేసుకుంటారు. తాళి బొట్టు కన్పించకుండా చేద్దామని శ్రీధర్ అంటాడు. అది పాతకాలం ఐడియా అని పారిజాతం అంటుంది. పాలల్లో మత్తు మందు కలుపుదామని పారిజాతం అంటుంది.. అది పాత ఐడియానే అని శ్రీధర్ అంటాడు. పెళ్లి టైమ్ కి శౌర్యని కిడ్నాప్ చెయ్యాలని జ్యోత్స్న అనగానే సూపర్ ఐడియా అని ఇద్దరు జ్యోత్స్నని మెచ్చుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్య బిడ్డకి తండ్రి రాజ్ అని చెప్పాలనుకున్న అపర్ణ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -808 లో... కావ్యతో రాజ్ ఉన్న సంఘటనలు గుర్తుచేసుకుంటాడు. అలాగే కావ్య కూడా రాజ్ తో ఉన్న జ్ఞాపకాలు గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతుంది.    మరొకవైపు రాహుల్, రుద్రాణి ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను ఇన్ని రోజులు రాజ్ ని ఈ ఇంటికి దూరం చెయ్యాలని ట్రై చేసాను కానీ వాడంతట వాడే ఈ ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాడు.. ఇక ఎప్పటికీ రాడు అని రాహుల్ తో రుద్రాణి చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది.   ఆ తర్వాత కావ్య దగ్గరికి అపర్ణ, ఇందిరాదేవి భోజనం తీసుకొని వస్తారు. కావ్య ఏడుస్తూ వాళ్ళకి తన బాధని చెప్తుంది. ఆ తర్వాత వైదేహి వాళ్ళు భోజనం చేస్తూ రాజ్ ని పిలుస్తారు. నాకు ఆకలిగా లేదని రాజ్ చెప్తాడు. రాజ్ ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే యామిని వెళ్లి.. నీ బాధ ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అని రాజ్ కి మందు బాటిల్ ఇస్తుంది. రాజ్ బాధపడుతూ యామినిపై పడిపోయి ఎమోషనల్ అవుతుంటే యామిని హ్యాపీగా ఫీల్ అవుతుంది.   ఆ తర్వాత రాజ్ డ్రింక్ చేస్తాడు. తాగి రోడ్డుకి అడ్డంగా పడుకుంటాడు. అప్పుడే కళావతి 'ఎవరు రోడ్డుకి అడ్డుగా' అని కార్ దిగి వచ్చి చూసేసరికి రాజ్ ఉంటాడు. రాజ్ ని అలా చూసి కావ్య షాక్ అవుతుంది. వెంటనే డ్రైవర్ సాయంతో కార్ లోకి ఎక్కిస్తుంది.    తరువాయి భాగంలో రాజ్ ని ఆ ఇంటి నుండి తీసుకొని రావాలి.. కావ్య కడుపులో బిడ్డకి తండ్రి నువ్వేరా అని చెప్తానని అపర్ణ నిర్ణయం తీసుకుంటుంది. అది విని కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.