విజయ్ ఆంటోని చెప్తే చేస్తాడంతే.. నెక్స్ట్ మూవీకి ఇంకో ఐదుగురికి...

  శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి "భద్రకాళి" మూవీ టీమ్ వచ్చింది. ఇక విజయ్ ఆంటోనీ స్టేజి మీదకు రాగానే ఇంద్రజ ఆయన్ని పొగిడింది. "లాస్ట్ టైం ఆయన మార్గన్ మూవీ టైములో ఇక్కడికి రావడమే కాదు పాడడానికి ఛాన్స్ ఇస్తానని చెప్పారు. అలాగే ఒకటి కాదు రెండు సాంగ్స్ భోలే షావలీ గారికి ఇచ్చారు." అంటూ విజయ్ ఆంటోనీ చెప్పినట్టే ఆఫర్ ఇచ్చారు. దాంతో విజయ్ మళ్ళీ ఇంకో ప్రామిస్ చేశారు. "నేను మళ్ళీ చెప్తున్నా నా నెక్స్ట్ మూవీకి ఇక్కడి నుంచి ఐదుగురిని తీసుకుంటాను" అని చెప్పారు. దాంతో స్టేజి మీద ఉన్న ఆర్టిస్టులంతా ఫుల్ ఖుషి ఇపోయారు. ఇక ఫైనల్ గా మంగాదేవిగారు సత్య హరిశ్చంద్ర  నాటకం నుంచి హరిశ్చంద్ర పాత్ర పద్యాలు రాగయుక్తంగా ఆలపించారు. "మగవాళ్ళతో పోటీ పడి పాడగల సత్తా ఉన్న ఏకైక మహిళ మంగాదేవి గారు. మా నాన్న కోట నరసింహ రావు గారు కూడా మంగాదేవి గారి వాయిస్ కి చాలా పెద్ద ఫ్యాన్ మంగాదేవి గారిని స్టేజి మీదకు తీసుకురమ్మని ఆయనే చెప్పాడు. నాన్న చూడండి మంగాదేవి గారు" అంటూ ఆది వాళ్ళ నాన్న గురించి చెప్పుకొచ్చాడు. ఇక నెటిజన్స్ ఐతే మంగాదేవి గారి గురించి చాలా కామెంట్స్ చేశారు. "మంగదేవి గారు నీ గుర్తించి తీసుకోనిరావడం ఆనందంగా వుంది...హరిశ్చంద్ర పద్యం అంటే మామూలుగా ఉండదు.." అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మధ్యలో ఫోక్ సాంగ్స్ తో కొంతమంది ఆడియన్స్ ని అలరించారు. ఇక ఆది తన సిగ్నేచర్ స్టెప్ వేస్తూ డాన్స్ చేసాడు. అలాగే మూవీస్ లో పోర్షన్ సాంగ్స్ కి సంబందించిన పిక్స్ ని వేసి ఆ సాంగ్ ని గెస్ చేసే ఒక టాస్క్ పెట్టి ఆడించాడు ఆది.  

బిగ్ బాస్ లో వీళ్ల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బిగ్ బాస్ సీజన్-9లోకి పదిహేను మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో సెలబ్రిటీస్ తొమ్మిది మంది, కామనర్స్ ఆరుగురు. ఇప్పటికే హౌస్ లో వాళ్లకి వీళ్ళకి తగ్గ ఫర్ వార్ నడుస్తుంది. అయితే బిగ్ బాస్ కామనర్స్, సెలెబ్రిటీస్ కి డిఫరెంట్ రెమ్యునరేషన్ ఫిక్స్ చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం కంటెస్టెంట్స్ లో ఎక్కువ రెమ్యునరేషన్ భరణికి వస్తుంది. అతనికి వారానికి మూడు లక్షలు అని తెలుస్తోంది. ఫ్లోరా సైనికి రెండు లక్షల డెబ్భై వేలు కాగా సంజన గల్రానీకి కూడా రెండు లక్షల డెబ్భై వేలు.. సుమన్ శెట్టికి వారానికి రెండు లక్షల యాభై వేలు.. తనూజ, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయల్ కి రెండు లక్షల యాభై వేలు వారానికి.. రాము రాథోడ్ కి రెండు లక్షలు.. శ్రష్టి వర్మకి రెండు లక్షలు ఇస్తున్నట్లు సమాచారం. ఇక కామనర్స్ గా వచ్చిన ఆరుగురుకి ఒకే అమౌంట్ ఈక్వల్ గా ఇస్తున్నారు. మనిషికి డెబ్భై వేలు వారానికి అని వాళ్ళతో ముందుగానే బిగ్ బాస్ అగ్రిమెంట్ కుదర్చుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇంత తక్కువగా రెమ్యునరేషన్ ఇస్తున్నారా అంటు నెటిజన్లు షాక్ అవ్వగా.. సెలెబ్రిటీలకి ఎందుకు అంత అని ట్రోల్స్ చేస్తున్నారు. కొంతమంది సీనియర్ యాక్టర్స్ అసలు ఎందుకు వచ్చార్రా బాబు అని ప్రోమోల కింద నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ సీజన్-9 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు.. ఎందుకు కామెంట్ చేయండి.  

లెక్చరర్‌ని కొట్టిన ఢీ షో సుదర్శన్ మాష్టర్..వాళ్లంతా ఇప్పుడు మాష్టర్లు అయ్యారు!

ఢీ షోలో సుదర్శన్ మాష్టర్ అంటే ఒక క్రేజ్ ఉంది. అతను చేసే కోరియోగ్రఫీ కొత్తగా ఉంటుంది. జడ్జెస్ కూడా ఫిదా ఐపొతూ ఉంటారు. ఇక సుదర్శన్ మాష్టర్ ఒక ఇంటర్వ్యూలో క్యూట్ గ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. "కాలేజీలోనే తన లైఫ్ చేంజ్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. స్కూల్ లో బ్యాక్ బెంచర్ ని. ఎందుకంటే అమ్మాయిలంతా ముందు కూర్చునే వాళ్ళు." అని చెప్పాడు. "ఐతే అమ్మాయిలను వెనక నుంచి చూడడం ఇష్టమా" అని హోస్ట్ అడిగేసరికి "చూసాం దేవుడు కళ్ళు ఇచ్చింది ఎందుకు అందాన్ని చూడడానికే కదా. నేను బిటెక్ చేసాను. ఇంజనీరింగ్ ఇష్టం లేదు నాకు. డాక్టర్ అవ్వాలనుకున్నా. నేను పుట్టి పెరిగింది అంతా బెంగుళూరు. కాలేజ్ ఫస్ట్ డేనే బంక్ కొట్టాను. మా స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ ఒకే కాలేజ్ లో సీట్ లు వచ్చాయి. నేను అమ్మాయిలను అసలు పట్టించుకునే వాడినే కాదు. ఒక తుంటరి పని చేసాను. ఒక గ్రూప్ అంతా కలిసి లెక్చరర్ ని కొట్టారు నేను కూడా ఒక చెయ్యేసాను. మా సతీష్ సర్ కి  నేను ఫెవరేట్ పర్సన్ ని. స్కూల్ ఏజ్ నుంచే నేను డిఫెరెంట్ గా డాన్స్ చేసేవాడిని. ఐతే నేను స్టార్టింగ్ డేస్ లో ఎదుగుతున్నప్పుడు నన్ను చాలా మంది డి-గ్రేడ్ చేశారు. పేర్లు వద్దు కానీ అది వాళ్లకు తెలుసు. జీవితంలో ఒక టైం వస్తుంది అప్పటి వరకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. ఆ టైం వస్తే ఇక మీరు ఆగరు. ఇక మీరు స్టార్ ఐపోతారు." అని చెప్పుకొచ్చాడు. ఐతే షోలో ఉండే కండక్టర్ ఝాన్సీ ఇంటెలిజెంట్ అని ఆది కూల్ అని నందు బ్రదర్ అని ఇలా ఒక్కొక్కరి గురించి ఒక్క వర్డ్ లో చెప్పాడు. ఇక  చైతన్య మాష్టర్ గురించి చెప్పుకొచ్చాడు. "నాకు చైతన్య మాష్టర్ చాలా క్లోజ్ అయ్యాడు. అందరితో బాగా క్లోజ్ గా ఉండేవాడు. ఆ టైములో నాకు షోస్ లేనప్పుడు మనోడు నాకు బయట ఈవెంట్స్ ఇప్పిచ్చేవాడు. ఆ డబ్బులు నా అవసరాలు తీరుస్తాయి అనుకుంటే వాటికి నన్ను పంపించేవాడు. చాలా బెస్ట్ ఫ్రెండ్ గా ఉండేవాడు. ఏమయ్యిందో తెలీదు..ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో తెలీదు. సూసైడ్ చేసుకునే రెండు రోజులు ముందు కూడా అందరం కలిసే ఉన్నాం. మరి ఏమయ్యిందో ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో తెలీదు. అప్పులు తీసుకున్నాడు అది ఇది అని అందరూ అన్నారు అప్పట్లో కానీ మనోడు మంచి ఫ్యామిలీతో,  మంచి పొజిషన్ లో ఉన్నాడు. అప్పులు అలాంటివి ఏమీ లేవు. ఏ విషయంలో డిప్రెషన్ లోకి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. ఆ డిప్రెషన్ లోకి వెళ్ళాక ఒక నాలుగు రోజులు చాలా సిక్ అయ్యాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో వాడికే తెలుసు. ఏదైనా ఐ మిస్ యు చైతన్య అంతే నేను చెప్పేది. చైతన్యకు నాతోనే కాదు చాలామందితో మంచి బాండింగ్ ఉంది. అతని దగ్గర నుంచి వచ్చిన రాజు లాంటి చాలామంది ఉన్నారు. ఒక టీమ్ ని బిల్డ్ చేసాడు. ఆ టీమ్ నుంచి వచ్చిన వాళ్లంతా ఈరోజున మాస్టర్స్ గా ఉన్నారు. చైతన్య చాలామందికి మంచి లైఫ్ ఇచ్చాడు." అని చెప్పాడు సుదర్శన్ మాష్టర్.

సందీప్ రెడ్డి టీచర్ అంటే అది ఇన్సల్టింగ్ వర్డ్‌లా అనిపిస్తుంది!

జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో విత్ జగపతి ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం ఒక డెవిల్, ఒక యానిమల్ కాంబో ఇంటర్వ్యూ మాత్రం ఒక రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక సందీప్ రెడ్డి వంగ, రామ్ గోపాల్ వర్మ టీచర్ అనే కాన్సెప్ట్ గురించి చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. "కొత్త డైరెక్టర్ మీ ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకోకూడని క్వాలిటీ ఏంటి..." అని జగపతి అడిగారు. దానికి " ఒక డైరెక్టర్ గా నా తప్పులు ఏంటో నాకు తెలిస్తే అది చేయకూడదు అని చెప్పొచ్చు కానీ అది నాకే తెలీదు. కాబట్టి నేను చెప్పలేను.నా ఉద్దేశంలో ఏ కొత్త డైరెక్టర్ ఐనా కానీ సందీప్ నుంచి నేర్చుకోవాలి. హీవైగా విఎఫ్ఎస్ , ప్రొడక్షన్ వాల్యూస్ లేకుండా క్లోజప్స్ లో చాలా జెనెరేట్ చేయగలడు సందీప్. అది ఇండియాలో ఏ డైరెక్టర్ కూడా చేయలేడు. అందరూ 10, 15 కోట్లు పెట్టి హీరో ఎలివేషన్స్ ఇంట్రడక్షన్ సీన్స్ చేస్తారు. కానీ సందీప్ మాత్రం యానిమల్ మూవీలో రన్బీర్ కపూర్ కి క్లోజప్ పెడితే బయట నుంచి మెషిన్ గన్ తో లోపలికి  వస్తాడు. అది ఎలివేషన్ సీన్. అది థియేటర్ లో చూసాక నా లైఫ్ లో నేను నిలబడి చప్పట్లు కొట్టిన సీన్. నిజానికి ఐడియా లేనప్పుడే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఐడియా ఉంటే సందీప్ అవుతాడు." అని చెప్పారు ఆర్జీవీ. రాము మీద నీ ఒపీనియన్ ఏంటి అని జగపతి సందీప్ ని అడిగారు. "నేను రాము గారి గురించి ఇప్పటికిప్పుడు మాటల్లో చెప్పలేను కానీ 50 - 60 టైమ్స్ చూసి ఉంటా. ఆయన ఫిలిమ్స్ నుంచి ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నా. సత్య మూవీ నుంచి నేను ఎడిటింగ్ నేర్చుకున్నా. రాము గారి దగ్గర నేను పనిచేయకపోయినా ఆయన నా గురు." అని చెప్పారు సందీప్ రెడ్డి వంగ. ఇక ఆర్జీవీ ఐతే "సందీప్ లాంటి స్టూడెంట్ ఉంటే నేను టీచింగ్ మానేసేవాడిని. ఎవరు ఎవరికీ నేర్పలేరు. సత్య, శివ మూవీస్ కి సందీప్ మూవీస్ కి అసలు కనెక్షన్ లేదు. టీచర్ అనే దాన్ని గౌరవించను. డాక్టర్ సక్సెస్ ఫుల్ డాక్టర్, బిజినెస్ మాన్ సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ అవుతాడు కానీ టీచర్ సక్సెస్ ఫుల్ టీచర్ అన్న పేరెక్కడన్నా వినిపిస్తుందా... వినిపించదు.. ఎవరినన్నా టీచర్ అంటే అది ఇన్సల్టింగ్ వర్డ్ అనిపిస్తుంది. మరి నేను సందీప్ లాంటి హిట్ మూవీస్ ని నేనేందుకు తీయలేకపోతున్నా అప్పుడు నేను టీచర్ ని ఎలా అవుతాను. కాబట్టి సత్య మూవీ నా టీచర్ అని చెప్పాలి కానీ రామ్ గోపాల్ వర్మ నా టీచర్ అని కాదు చెప్పాల్సింది. గ్రేట్ ఫిలిమ్స్ ఉంటాయి గ్రేట్ ఫిలిం మేకర్స్ ఉండరు. ఫిలిం నుంచి చాలా నేర్చుకోవచ్చు ఎందుకంటే అదొక ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ కి మనిషికి సంబంధం ఉండదు. అందుకే టీచర్ అన్న మాట సుద్ద వేస్ట్ " అని చెప్పుకొచ్చారు ఆర్జీవీ.

సంజనా గల్రానీ : ఫుటేజ్ తో నాకేం పని.. నన్ను జనాలు గుర్తుపడతారు

  బిగ్ బాస్ సీజన్-9 మూడవ రోజు సెలెబ్రిటీలకి తప్పని తిండి కష్టాలు.. ఓనర్స్ పర్మిషన్ తో ఏ పండో, బిస్కెట్సో తిని పూట గడుపుతున్నారు. ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ మొదట దశగా కామనర్స్ అయిన ఓనర్స్ అందరిని డిస్కషన్ చేసుకోమన్నారు. సెలబ్రిటీస్ లో నుండి ఒకరిని నామినేట్ చెయ్యమని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఇక ఓనర్స్ అందరు డిస్కషన్ చేసుకొని సంజన పేరు చెప్తారు. మీకు ఓక పని చెప్పినప్పుడు.. నా వల్ల కాదు.. కుకింగ్ చెయ్యను.. ఓన్లీ వేడి వాటర్ పెట్టిస్తానని చెప్పారు. ఆ టాపిక్ నే నిన్న, ఇవ్వాల సాగదీసారని మనీష్ పాయింట్స్ అన్ని క్లియర్ గా చెప్తాడు. మీరు బ్యాక్ బిచ్చింగ్ చేశారని సంజనతో ప్రియ అంటుంది. ఆ వర్డ్ ఉపయోగించకు.. చాలా పెద్ద వర్డ్ అని తనమీద సంజన సీరియస్ అవుతుంది. ఆ తర్వాత సంజన ఒంటరిగా తనలో తనే మాట్లాడుకుంటుంది.. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోవద్దు వదిలెయ్యాలని అనుకుంటుంది. కాసేపటికి సంజన దగ్గరికి తనూజ వస్తుంది. అలా మొహం పైన అంత హర్టింగ్ గా ఎవరైనా మాట్లాడతారా అని ఏడుస్తుంది. ప్రియ అన్నట్లుగానే సంజన బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది. తన టీమ్ వాళ్ళతో దమ్ము శ్రీజ గురించి డిస్కషన్ చేస్తుంది. నన్ను ఫుటేజ్ కోసం చేస్తున్నానని అంటుందా.... నాకేం అవసరం.. ఆల్రెడీ నేను అందరికి తెలుసు.. ఎవరికి కావాలి ఫుటేజ్.. నేను సెలబ్రిటీ అన్నట్లు సంజన పొగరుగా మాట్లాడుతుంది. ఒక కంటెస్టెంట్ లో ఇన్ని వెరైయేషన్సా.. సంజన గల్రానీ స్మార్ట్ గేమ్ అంతా మూడు రోజుల్లోనే బయటపడింది.  

Bigg boss 9 Telugu : రీతూ చౌదరి తలకి గాయం.. తప్పంతా తనూజదేనా!

  బిగ్ బాస్ సీజన్-9 మొదలై అప్పుడే రెండు రోజులు గడిచిపోయింది. హౌస్ లో నామినేషన్లు మొదలయ్యాయి. మొదటి దశలో ఓనర్స్ అందరు కలిసి రెంటర్స్ లోని సంజనని నామినేట్ చేశారు. ఇక బిగ్ బాస్ ఆదేశానుసరం ఈ సీజన్ లో మొదటి నామినేషన్ ప్రక్రియ మొదలయింది. నామినేషన్ ప్రక్రియ లో రెంటర్స్ వాళ్లలో వల్లే నామినేట్ చేసుకోవాలి.. ఓనర్స్ ది కేవలం పర్యవేక్షణ మాత్రమే. టాస్క్ లో భాగంగా రూఫ్ లో నుండి ఎవరు ముందుగా వెళ్లి సుత్తి తీసుకుంటారో.. వాళ్ళకి నామినేట్ చేసే ఛాన్స్ వస్తుంది. ఆ సుత్తిని తర్వాత ఓనర్స్ లోని ఎవరో ఒకరికి ఇవ్వాలి. మొదటగా రీతు, తనూజ వెళ్లారు. రీతూకి రూఫ్ లో వెళ్తుండగా తనూజ అడ్డు వచ్చి తలకి గాయమవుతుంది. వెంటనే మెడికల్ రూమ్ కి తీసుకొని వెళ్తారు తలకి కట్టుకడతారు. నేను కావాలని చెయ్యలేదని రీతూకి తనూజ సారీ చెప్తుంది. తనూజ సుత్తి పట్టుకుంది కాబట్టి తను సంజన ని నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత తన చేతిలోని సుత్తిని ఓనర్స్ లో పవన్ కళ్యాణ్ కి ఇస్తుంది తనూజ. ఆ తర్వాత రాము, శ్రష్టి వెళ్తారు. సుత్తి రాము తీసుకుంటాడు. సుమన్ శెట్టిని నామినేట్ చేస్తూ సుత్తిని హరీష్ కి ఇస్తాడు. తనని నామినేట్ చేసినా కూడా సుమన్ శెట్టి సైలెంట్ గా ఉంటాడు. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో ఇద్దరు మాత్రమే నామినేషన్ లోకి వచ్చారు. మరి రేపటి ఎపిసోడ్ లో హౌస్ లో ఎంత మంది కంటెస్టెంట్స్ నామినేషన్లోకి వస్తారో చూడాలి మరి.

Jayam serial : గంగని ఇరికించిన వీరు.. రుద్రకి డౌట్!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -51 లో.....శకుంతల వినాయకుడికి మొక్కుకొని గంగకి కొబ్బరికాయ ఇచ్చి రుద్రకి ఇవ్వమని చెప్తుంది. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. గంగ కొబ్బరి కాయ తీసుకొని వచ్చి రుద్రకి ఇస్తుంది. రుద్ర కొబ్బరికాయ కొడుతాడు. ఆ తర్వాత వీరు డిస్సపాయింట్ గా ఫీల్ అవుతుంటే అప్పుడే ఇషిక వచ్చి మాట్లాడుతుంది. మెల్లగా అత్తయ్యకి రుద్ర బావపై కోపం పోతుందని వీరూతో ఇషిక చెప్తుంది. ఇక రుద్ర బావ ఒక్కడే ఈ ఆస్తులని ఏలుతాడని ఇషిక అంటుంది. మరుసటి రోజు ఉదయం.. రుద్రతో పాటు గంగ సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. రుద్ర క్యాబిన్ లోకి గంగ తనతో పాటు వెళ్తుంటే.. ఎక్కడికి నీకు ఒక చైర్ వేయమంటావా అని వెటకారం గా మాట్లాడతాడు. దాంతో గంగ కోపంగా రుద్రని తిట్టుకుంటుంది. గంగ వెనక్కి చూసేసరికి రుద్ర ఉంటాడు. గంగ భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ కి బదులు కల్తీ ఆయిల్ ని ఎవరో మార్చారని మక్కంని కంప్లైంట్ ఇవ్వమంటాడు రుద్ర. పోలీసులు ఎంక్వయిరీ కి వస్తారు. వీరు తన ప్లాన్ లో భాగంగా తన మనిషితో గంగ బ్యాగ్ లో కల్తీ ఆయిల్ ప్యాకెట్ పెట్టిస్తాడు. పోలీసులు అందరి బ్యాగ్ లు చెక్ చేస్తుంటే గంగ బ్యాగ్ లో కల్తీ ఆయిల్ పాకెట్స్ దొరుకుతాయి. ఇలా చేశావేంటి గంగ అని వీరు అంటాడు. నాకు ఇప్పుడు అర్థం అయింది.. ఇలా చేస్తారని తెలిసే గంగని తీసుకొని వచ్చారు.. ఎవరో ప్లాన్ ప్రకారం గంగని ఇరికించి మా పేరుని దెబ్బ కొట్టాలనుకున్నారు ఎస్ ఐ గారు.. ఆ అమ్మాయి అలాంటిది కాదని పోలీసులకి రుద్ర చెప్తాడు. సీసీటీవీ ఫుటేజ్ మళ్ళీ రీకలెక్ట్ చెయ్యండి అని పోలీసులకి చెప్తాడు రుద్ర. తరువాయి భాగంలో ఇందుమతి తన నగలు పోయాయని పైడిరాజుపై డౌట్ పడుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కొడుకు కోసం తండ్రి మంచివాడిలా మారతాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -458 లో..... కార్తీక్ కి శ్రీధర్ ఫోన్ చేస్తాడు. ఏంటోనని లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఏంటి సర్ బిజీ ఆ.. నువ్వు చెప్పినట్టు చేసాను కదా.. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు .. అవసరం తీరిపోయిందా అని శ్రీధర్ అంటాడు. నీ పద్దతి నచ్చడం లేదు ఎన్నోసార్లు మార్చుకోమని చెప్పాను.. వినడం లేదు.. నీకు నచ్చని వాళ్ళు ఉంటే మాటలతో సాధిస్తావ్. అందరు నిన్ను తిడుతుంటే ఏదోలా ఉంది.. నువ్వు తప్పు చేసావ్ కాబట్టి తాత నిన్ను కొట్టాడు.. ఎప్పుడైనా తాతతో మర్యాదగా మాట్లాడావా.. ఆ ఒక్క తప్పు తప్ప శ్రీధర్ మంచివాడు అని అనుకునేలా చేసావా.. నువ్వు ఎలా నేను బాగుండాలి అనుకుంటావో నిన్ను కూడా అలాగే నేను అనుకుంటానని శ్రీధర్ తో కార్తీక్ ఎమోషనల్ గా మాట్లాడతాడు. శ్రీధర్ కంటతడి పెట్టుకుంటాడు. వీలైతే ఈ కొడుకు కోసం మారు అని చెప్పి కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు. నీ కోసం మారుతానురా అని శ్రీధర్ అనుకుంటాడు. మరొకవైపు స్వప్న, కాశీ ఇద్దరు సరదాగా బయటకు వెళ్తారు. కాశీకి జాబ్ పోయిందని తన మేనేజర్ కాల్ చేసి చెప్తాడు. కాశీ బాధపడుతుంటే స్వప్న ధైర్యం చెప్తుంది.  ఆ తర్వాత రెస్టారెంట్ నుండి కొంతమంది ఎంప్లాయిస్ శివన్నారాయణ దగ్గరికి వస్తారు. రెస్టారెంట్ లాస్ లో ఉందని చెప్తారు. వెంటనే అడిటర్ ని పిలిపించి అడుగుతారు శివన్నారాయణ. నష్టాల్లో ఉందని అతను చెప్తాడు. జ్యోత్స్న సీఈఓ అయినప్పటి నుండి లాభాలు రాలేదు.. సత్యరాజ్ రెస్టారెంట్ లాస్ లో ఉన్నదాన్ని కార్తీక్ నంబర్ వన్ చేసాడు.. అది నువ్వు తీసుకొని మళ్ళీ లాస్ లోకి తెచ్చావని జ్యోత్స్నపై శివన్నారాయణ కోప్పడతాడు. నీకు ఆరు నెలలు టైమ్ ఇస్తున్న ఆ లోపు రెస్టారెంట్ లాభాలలోకి రాకపోతే కొత్త సీఈఓ వస్తాడని శివన్నారాయణ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. నమ్మకం కోల్పోతే ఇలాగే ఉంటుందని జ్యోత్స్నతో సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : భద్రవతి కొత్త ప్లాన్.. ఇక రామరాజుకి కష్టమే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -259 లో..... సాగర్ కి నర్మద అల్ ది బెస్ట్ చెప్పి ..ఎగ్జామ్ హల్ కి పంపిస్తుంది సాగర్ లోపలికి వెళ్తాడు. క్వశ్చన్ పేపర్ చూసి టెన్షన్ పడతాడు. బయట కిటికీ నుండి నర్మద చూస్తుంటుంది. బాగా రాయి అని చెప్తుంది. ఇక నీదే భారం దేవుడా అని సాగర్ దేవుడికి మొక్కుకొని ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాడు. ఎగ్జామ్ అయిపోయాక సాగర్ బయటకు వస్తాడు. ఎలా రాసావని నర్మద అడుగుతుంది. బాగానే రాసానని సాగర్ చెప్తాడు. అదంతా శ్రీవల్లి చూస్తుంది. మీరు గుట్టుగా చేస్తుంది ఇదా అని అనుకుంటుంది. అప్పుడే కళ్యాణ్ ని ప్రేమ కొట్టడానికి కర్ర పట్టుకొని పరుగెడుతుంది. శ్రీవల్లికి కళ్యాణ్ డాష్ ఇస్తాడు. కళ్యాణ్ ని శ్రీవల్లి తిడుతుంది. తన వెనకాలే ప్రేమ పరిగెత్తడం చూసి.. ప్రేమ ఏంటి వాడి వెంట పరుగెడుతుంది. అదేంటో కనుక్కోవాలని అనుకుంటుంది. సాగర్, నర్మద బయటకు వెళ్తారు. నేను ఎగ్జామ్ బాగా రాయలేదని సాగర్ డిస్సపాయింట్ అవుతాడు. ఏం పర్లేదు నెక్స్ట్ టైమ్ బాగా రాయొచ్చని నర్మద చెప్తుంది. మరొకవైపు కళ్యాణ్ వెంట ప్రేమ పరుగెత్తడం ధీరజ్ ఫ్రెండ్ చూసి తనకి కాల్ చేసి చెప్తాడు.  కాసేపటికి ప్రేమ దగ్గరికి ధీరజ్ వస్తాడు. ప్రేమకి అప్పుడే చేతికి దెబ్బ తగులుతుంది. హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. ఏమైంది ప్రేమ చెప్పమని  ధీరజ్ ఏంత రిక్వెస్ట్ చేసినా ప్రేమ సైలెంట్ గా ఉంటుంది. తరువాయి భాగంలో రామరాజు, వేదవతి ఇద్దరు తమ కూతురు అమూల్యతో బయట కూర్చొని సరదాగా మాట్లాడకుంటుంటే.. భద్రవతి చూస్తుంది. ఒరేయ్ విశ్వ మనం పడే బాధ.. వాడు కూడా పడాలంటే రామరాజు చిన్నకూతురిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో పెట్టుకోవాలి.. అప్పుడు తెలుస్తుందని విశ్వతో భద్రవతి అనగానే విశ్వ సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కోడళ్ళిద్దరి ప్రెగ్నెంట్ పోవాలని రుద్రాణి ప్లాన్.. కావ్య కనిపెడుతుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -821 లో.....రేవతిని సీతారామయ్య దగ్గరికి తీసుకొని వెళ్తారు. రేవతి ఇంటికి వచ్చిందని ఎక్కడ అపర్ణకి తెలిసిపోతుందోనని ఇందిరాదేవి టెన్షన్ పడుతుంది. అప్పు, కళ్యాణ్ స్వప్న అందరు రాజ్, కావ్య చేస్తున్న ప్లాన్ కి సపోర్ట్ గా ఉంటారు. అందరు సరదాగా మాట్లాడుకుంటుంటే.. అప్పుడే అపర్ణ వస్తుంది. వెంటనే రేవతికి ముసుగు కప్పుతారు. ఇందిరాదేవి టెన్షన్ పడుతుంటే.. ఏంటి అత్తయ్య టెన్షన్ పడుతున్నారని అపర్ణ అడుగుతుంది. మరొకవైపు స్వరాజ్ చిటికె వేసి రుద్రాణిని పిలుస్తాడు. ఏంట్రా నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను రావాలా అని రుద్రాణి అనగానే నేను ఈ ఇంటికి వారసుడిని నేను చెప్పినట్టు వినాలని స్వరాజ్ అంటాడు. దొరికావురా అని రుద్రాణి ఇంట్లో అందరిని పిలుస్తుంది. ఈ బాబూ ఈ ఇంటికి వారసుడట.. నాకు ముందు నుండి ఈ బాబుపై డౌట్ ఉంది.. నాకు తెలిసి ఈ బాబు రేవతి కొడుకే అయి ఉంటాడని రుద్రాణి అంటుంది. నాకు ఇప్పుడు వాళ్ళ అమ్మ ముసుగు తీసి చూపించాలని రుద్రాణి తియ్యబోతుంటే.. వద్దని అపర్ణ ఆపుతుంది. వాళ్ళ ఆచారాన్ని ఎందుకు అలా చేస్తావని అంటుంది. స్వరాజ్ ఎందుకు అలా వారసుడివి అన్నావని అపర్ణ అడుగుతుంది. నువ్వే కదా మొన్న ఈ ఇల్లు నీదన్నావ్.. అందుకే అన్నానని స్వరాజ్ అంటాడు. దాంతో అందరు రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత బాబుని బయటకు తీసుకొని వెళ్లి రాజ్, కావ్య మాట్లాడుతుంటే కనకం వస్తుంది. కనకం, స్వరాజ్ ఫ్రెండ్స్ అయిపోయి రుద్రాణి పని చెప్పాలనుకుంటారు. మరొకవైపు అప్పు, కావ్య ఇద్దరి ప్రెగ్నెంట్ పోవాలని తీర్థంలో ఏదో కలుపుతుంది రుద్రాణి. తరువాయి భాగంలో వినాయకుడికి పూజ చేస్తారు. పంతులు తీర్ధం అందరికి ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్‎బాస్ ‏లోకి సుహాసిని ఎంట్రీ..

బుల్లితెర మీద సుహాసిని ఒక వెలుగు వెలుగుతోంది. దేవత సీరియల్ తో ఆమె మంచి ఫేమస్ అయ్యింది. చంటిగాడు మూవీతో ఆమె సిల్వర్ స్క్రీన్ మీద కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి సుహాసిని రీసెంట్ గా తన ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఇలా జవాబిచ్చింది. "అక్కా నీ నవ్వు చాలా బాగుంటుంది ఇలా ఎలా మెయింటైన్ చేస్తావ్" అనేసరికి నవ్వుతూ ఉన్న ఒక పిక్ ని పోస్ట్ చేసింది. "మేమంతా బుల్లి సుహాసిని కోసం వెయిటింగ్ అక్కా" తొందరలోనే వస్తుంది అంటూ ఆన్సర్ ఇచ్చింది. "మీ నేటివ్ ఎక్కడ" "ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు" అని చెప్పింది. "మీ భర్తతో కలిసి ఒక సీరియల్ చేయొచ్చు కదా" అని అడిగారు. "సరే తప్పకుండా" అని చెప్పింది. "మీరు ఏమైనా మూవీస్ చేస్తున్నారా" అని అడిగారు "లేదండి ప్రస్తుతానికి మూవీస్ చెయ్యట్లేదు, సీరియల్స్ , ప్రోగ్రామ్స్ అంతే" అని చెప్పింది. "లక్ష్మి కళ్యాణం నుంచి ఇప్పటి వరకు మీ నవ్వులో ఎలాంటి మార్పు లేదు" అంటూ కితాబిచ్చారు. "హలో అక్కా మేము మిమ్మల్ని బిగ్ బాస్ సీజన్ 9 లో చూడాలని ఉంది" అని అడిగారు. "థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ " అని చెప్పింది. ఇక ఫైనల్ గా ఇలాంటి ఫాన్స్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పింది. లక్ష్మి కళ్యాణం, అడ్డా, దోస్త్ సహా దాదాపు 30 సినిమాల్లో నటించింది. అలాగే ఈమె తెలుగు, తమిళం, కన్నడ మూవీస్ లో కూడా నటించింది. జెమినీ టీవీలో అపరంజి సీరియల్ ద్వారా పరిచయమయ్యింది. ఇద్దరమ్మాయిలు సీరియల్ లో నటిస్తున్నప్పుడు సీరియల్ నటుడు ధర్మను లవ్ మ్యారేజ్ చేసుకుంది.

Bigg Boss 9 Telugu: మాస్క్ మ్యాన్  వర్సెస్ ఇమ్మాన్యుయల్

బిగ్ బాస్ సీజన్-9 చాలా గ్రాంఢ్ గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. వారిలో తొమ్మిది మంది సెలెబ్రిటీలు ఉండగా, ఆరుగురు కామనర్స్ ఉన్నారు. ఇక ఈ సీజన్ కామనర్స్ వర్సెస్ సెలెబ్రిటీస్ అని బిగ్ బాస్ ముందుగానే చెప్పారు. ఇక ప్రతీ సీజన్ లో ఎలాగో అలాగే కంటెస్టెంట్స్ ఫుడ్ కోసం తిప్పలు పడుతున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కామనర్స్ కి మాత్రమే కిచెన్ అని బిగ్ బాస్ చెప్పడంతో సెలెబ్రిటీలు ఫుడ్ లేకుండా ఇబ్బంది పడ్డారు. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ సెలెబ్రిటీల కోసం ఫుడ్ పంపించాడు. ఇకనుండి ప్రతీరోజు నేనే మీకు ఫుడ్ పంపిస్తానని సెలెబ్రిటీలతో బిగ్ బాస్ చెప్పడంతో అందరు ఫుల్ హ్యాపీ అయ్యారు. బిగ్ బాస్ కి థాంక్స్ చెప్పారు. ఇక వీరితో పాటు కామనర్స్ కి కూడా కొన్ని వెరైటీలు పంపించాడు‌ బిగ్ బాస్.‌ ఇక అప్పుడే ఇమ్మాన్యుయల్ తో కామెడీ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. గార్డెన్ లో ఎంత చెత్తుంది.. అది క్లీన్ చేయడానికి ఎంత టైమ్ పడుతుందని ఇమ్మాన్యుయల్ ని బిగ్ బాస్ అడుగగా..‌చాలా టైమ్ పడుతుందని చెప్పాడు. అయితే బిగ్ బాస్ మాత్రం ఓ మెలిక పెట్టాడు. అది క్లీన్ చేయడానికి ఎంత టైమ్ పడుతుందో‌ మీ మానిటర్(మాస్క్ మెన్ హరీష్) చెప్తాడని బిగ్ బాస్ చెప్పాడు. చెప్పండి గుండు అంకుల్ అని ఇమ్మాన్యుయల్ అనగానే కామనర్స్ తో పాటు సెలెబ్రిటీలు ఫక్కున నవ్వేసారు. అది మాస్క్ మెన్ హరీష్ విని కాస్త సీరియస్ అయ్యాడు. కాస్త చూసి చెప్పండి అని ఇమ్మాన్యుయల్ అనగా మీరు చూసి మాట్లాడండి అని హరీష్ అన్నాడు. గుండు ఏంటి అంకుల్ ఏంటి బాడీ షేమింగ్ వద్దు అని హరీష్ అనగా.. నేను అలా అనలేదు.. సారీ అంటూ ఇమ్మాన్యుయల్ అన్నాడు. అలా అయితే నేను కూడా ఏదో ఒకటి మాట్లాడేసి సారీ చెప్పనా.. హ్యూమర్ ఉండాలి కానీ ఒక లెవల్ దాటకూడదంటూ హరీష్ వాదించాడు. మీ మూడ్‌ని బట్టి మనుషులుండరని ఇమ్మూ అంటే మీ మూడ్ బట్టి మేముండాలా ఏంటి అంటూ మాటకి మాట ఇచ్చిపడేశాడు హరీష్. మా మూడ్‌ని బట్టి కూడా మిమ్మల్ని ఉండమనట్లే అని ఇమ్మాన్యుయల్ చెబుతుంటే లిమిట్.. అంటూ హరీష్ సీరియస్ అయ్యాడు. ఇలా ఇద్దరి మధ్య మాటా మాటా పెరుగుతుంటే భరణి మధ్యలో వచ్చి ఆపాడు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఇదే హైలైట్ గా నిలిచింది. హౌస్ లో ఉన్న పదిహేను మంది కంటెస్టెంట్స్ లో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి.  

Jayam serial : వీరుకి రుద్ర వార్నింగ్.. పోలిసులకి దొరికిపోయిన గంగ!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -50 లో.....గంగని చంపడానికి సైదులు వస్తాడు. కత్తిని మెడ దగ్గర పెడతాడు. అప్పుడే రుద్ర వచ్చి రౌడీని ఆపుతాడు. గంగ బయపడి శకుంతల దగ్గరికి వెళ్తుంది. రుద్రని చూసి రౌడీ పారిపోతుంటే తన వెనకాలే రుద్ర పరిగెడుతాడు. రౌడీ పారిపోతుంటే తన చెవిలో బ్లూ టూత్ కనెక్టర్ కిందపడిపోతుంది. అది రుద్ర కి దొరుకుతుంది. ఆల్రెడీ బ్లూ టూత్ ద్వారా వీరు లైన్ లో ఉంటాడు. ఒరేయ్ తప్పించుకున్నావా నువ్వు సేఫ్ ఎనా అని వీరు అంటుంటే వీడు సేఫో కాదు తెలియదు కానీ గంగ సేఫ్ అని రుద్ర అంటాడు. ఒరేయ్ నువ్వు ఎవరివో నాకు తెలియదు కానీ గంగని నువ్వు ఏం చెయ్యలేవని రుద్ర వార్నింగ్ ఇస్తుంటే వీరు నవ్వుతాడు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావో తెలుసు.. అక్కడ పాప కూడా సేఫ్ అని రుద్ర అనగానే వీరు షాక్ అవుతాడు. మరొకవైపు పాపని శంకర్ కాపాడతాడు. శంకర్ అచ్చం రుద్ర లాగే ఉండడంతో పాప శంకర్ ని చూసి రుద్ర అనుకుంటుంది. రుద్రకి శంకర్ ఫోన్ చేసి పాప సేఫ్ అని చెప్తాడు. ఆ తర్వాత పెద్దసారు శకుంతలతో రుద్ర గురించి పాజిటివ్ గా చెప్తాడు. వాడు తప్పు చేసాడంటే ఎలా నమ్ముతున్నావ్.. వాడు ఎంత బాధని అనుభవిస్తున్నాడో తెలుసా అని పెద్దసారు ఎమోషనల్ అవుతాడు. అప్పుడే రుద్ర వస్తాడు. నువ్వు ఓకే కదా గంగ అని అంటాడు. ఒకే సర్ అని గంగ అంటుంది. తరువాయి భాగంలో కల్తీ ఆయిల్ ఎవరో పెట్టారని పోలీస్ లకి మక్కం కంప్లైంట్ ఇస్తాడు. దాంతో  సూపర్ మార్కెట్ కి పోలీస్ వచ్చి చెక్ చేస్తారు. గంగ బ్యాగ్ లో ఇంకా కల్తీ ఆయిల్ పాకెట్స్ దొరుకుతాయి. ఇలా చేసావేంటి గంగ అని వీరు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : సాగర్ కి ఎగ్జామ్.. ప్రేమని చూసిన శ్రీవల్లి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -258 లో..... నర్మద, సాగర్ హాల్ టికెట్ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటారు. నేను నాన్న గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నానని సాగర్ అనగానే వద్దు సాగర్ రిస్క్ అని నర్మద అంటుంది. లేదు నర్మద తీసుకుంటానని సాగర్ అంటాడు. అదంతా శ్రీవల్లి చూస్తుంది. వీళ్ళేదో చేస్తున్నారు..అదేంటో తెలుసుకోవాలని  శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత నర్మద, సాగర్ రామరాజు దగ్గరికి వెళ్తారు. నాన్న నాకు మీ ఆశీర్వాదం కావాలని సాగర్ అంటాడు. ఎందుకు ఒక రోజు అలాగే ఆశీర్వాదం తీసుకొని వెళ్లి నర్మదని పెళ్లి చేసుకొని వచ్చావ్.. ఇప్పుడేం పని చేయబోతున్నావని తిరుపతి అడుగుతాడు. అవును ఇప్పుడు ఆశీర్వాదం ఎందుకని రామరాజు అడుగుతాడు. పక్క ఊరికి పెళ్లికి వెళ్తున్నానని కవర్ చేస్తాడు. సాగర్ ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటే.. ఇందాక సాగర్, నర్మద దేవుడి దగ్గర ఏదో కాగితం పెట్టి మొక్కుకున్నారు. అది సాగర్ జేబులో పెట్టుకోవడం నేను చూసానని శ్రీవల్లి అంటుంది. నిజమేనా ఏంటి ఆ కాగితం ఇవ్వురా అని రామరాజు అడుగుతాడు. సాగర్ హాల్ టికెట్ కాకుండా వేరే పాత బాకీ ఇచ్చే వారి నేమ్స్ ఉన్న లిస్ట్ ఇస్తాడు. అది చూసిన తిరుపతి, రామరాజు ఇదా అని అనుకుంటార. మరొకవైపు కళ్యాణ్ ని ప్రేమ కనిపెట్టాలని అనుకుంటుంది. ఎక్కడికో పరిగెత్తినట్లు వెళ్తుంది. ఇక తనని ఫాలో అవుతున్న కళ్యాణ్ కుడా ప్రేమ కోసం వెతుకుతాడు.. కళ్యాణ్ ని ప్రేమ ట్రాప్ చేసి తనని కనిపెడుతుంది. ఎందుకు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావని కొడుతుంది. మరొకవైపు విశ్వకి వచ్చిన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది. అమ్మాయి వాళ్ళు భద్రవతి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడడంతో సేనాపతి వాళ్ళని కొట్టి పంపిస్తాడు. ఇక మనం ఈ ఊళ్ళో ఉండకూడదని విశ్వ అనగానే మనమెందుకు ఉండకూడదు.. ఆ రామరాజు అంతు చూస్తానని భద్రవతి అంటుంది. మరొకవైపు సాగర్, నర్మద ఎగ్జామ్ సెంటర్ కి వస్తారు. సాగర్ కి నర్మద అల్ ది బెస్ట్ చెప్తుంది. తరువాయి భాగంలో  కళ్యాణ్ ని కొట్టాలని ప్రేమ కర్ర పట్టుకొని అతని వెంట పరిగెడుతుంది. అప్పుడే శ్రీవల్లికి కళ్యాణ్ డ్యాష్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ వెంట ప్రేమ పరిగెత్తడం శ్రీవల్లి చూస్తుంది. అలాగే అటుగా వెళ్తున్న ధీరజ్ కూడా ప్రేమని చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కార్తీక్ కి ముద్దు పెట్టిన దీప.. జ్యోత్స్న మరో ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-457 లో..... దీప దగ్గరికి పారిజాతం వచ్చి.. నువ్వంటే నాకు నచ్చదు కానీ నీ వంటలు అంటే నాకు ఇష్టమని అంటుంది. అప్పుడే అందరు భోజనం చెయ్యడానికి వస్తారు. సుమిత్ర పక్కన దశరథ్ కూర్చోబోతు వేరొకవైపు వెళ్ళిపోతాడు. దాంతో సుమిత్ర కోపంగా చూస్తుంది. వీళ్ళు మళ్ళీ గొడవపడ్డట్టున్నారని శివన్నారాయణ అనుకుంటాడు. ఆ తర్వాత దీప అందరికి భోజనం వడ్డిస్తుంది. నాకెందుకు వెయ్యట్లేదు అని పారిజాతం అడుగుతుంది. మీకు డాక్టర్ తినమని చెప్పినవి బావ ప్రిపేర్ చేస్తున్నాడని దీప అంటుంది. ఆ తర్వాత పారిజాతం కోసం ఉడికించిన దుంపలు తీసుకొని వస్తాడు కార్తీక్. అవి నేను తిననని పారిజాతం అనగానే కాకరకాయ జ్యూస్ తీసుకొని వస్తాడు. ఎప్పుడైనా నువ్వు అవే తినాలి.. అదేదో ఈ రోజు నుండి మొదలపెట్టమని జ్యోత్స్న అంటుంది. దాంతో పారిజాతం అయిష్టంగా వాటిని తింటుంది. సుమిత్ర, దశరథ్ లని ఉద్దేశ్శించి శివన్నారాయణ మాట్లాడతాడు. ఏ విషయం అయిన మర్చిపోయి ముందుకి వెళ్ళాలని చెప్పి శివన్నారాయణ వెళ్ళిపోతాడు. దశరథ్, సుమిత్ర అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఎవరు జరిగిందంతా సామాన్యంగా మర్చిపోరని కార్తీక్ తో జ్యోత్స్న అంటుంది. ఎందుకు అలా అంటుందని కార్తీక్ ని దీప అడుగుతుంది. అంటే నాతో అత్తామామయ్యలని కలపనని ఛాలెంజ్ చేసింది అందుకేనని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకుంటారు. కార్తీక్ తో ఛాలెంజ్ చేసిన విషయం జ్యోత్స్న చెప్తుంది. ఇద్దరు కలిసి మళ్ళీ దశరథ్, సుమిత్రలకి గొడవ పెట్టాలని చూస్తారు. అలా చేస్తే దీప వల్లే ఇవన్ని అని మమ్మీకి తనపై ఇంకా కోపం పెరుగుతుందని జ్యోత్స్న అంటుంది. మరొకవైపు కార్తీక్, దీప ఇంటికి వెళ్తారు. అమ్మనాన్నని కలపడానికి ఏదైనా ప్లాన్ చేసారా అని కార్తీక్ ని దీప పదే పదే అడుగుతుంది.. చెప్తానని కార్తీక్ అనగానే తన చెయ్ పై  దీప ముద్దు పెడుతుంది. నాన్న ఏంటి ఆ సౌండ్ అని శౌర్య అడుగతుంది. ఏం లేదు నువ్వు పడుకోమని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రుద్రాణి పెట్టిన చిచ్చు.... కావ్యకి శిక్ష తప్పేలా లేదు!

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి''(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -820 లో....దుగ్గిరాల ఇంట్లో వినాయకుడి పూజకి ఏర్పాట్లు చేస్తారు. రేవతి ఇంటిముందుకు వచ్చి రాజ్ కి కాల్ చేస్తుంది. దాంతో కావ్యని తీసుకొని రాజ్ బయటకు వెళ్తాడు. రేవతి ముసుగు వేసుకొని ఉంటుంది. కావ్యని ఆటపట్టింద్దామని.. తను నా క్లాస్ మేట్ అని రాజ్ చెప్పగానే మొన్నటి వరకు యామిని ఇప్పుడు తనా అని ముసుగులో ఉన్న రేవతిని తిడుతుంది కావ్య. ముసుగు తీసి చూస్తే రేవతి ఉంటుంది. తను చూసి సారీ వదిన అని కావ్య అంటుంది. దాంతో రాజ్ నవ్వుతాడు. రేవతి ఇంట్లోకి రావడానికి బయపడుతుంది కానీ  తీసుకొని వస్తారు. స్వరాజ్ లోపలికి పరిగెత్తుకొని వెళ్తాడు. అతన్ని చూసి అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్వరాజ్ వాళ్ళ అమ్మ గారు అని రేవతిని ఇంట్లో అందరికి పరిచయం చేస్తాడు రాజ్. ముసుగు ఎంటి అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. వాళ్ళ ఆచారం పిన్ని అని రాజ్ కవర్ చేస్తాడు. నేను ఎక్కడ ఇలాంటి ఆచారాలు చూడలేదు అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత పూజ మొదలవుతుంది. సీతారామయ్య దగ్గరికి రేవతిని తీసుకొని కావ్య, రాజ్ వెళ్తారు. రేవతితో సీతారామయ్య మాట్లాడుతుంటే అప్పుడే ఇందిరాదేవి వచ్చి మీరేం చేస్తున్నారు.. ఈ అమ్మాయి ఎవరు.. స్వరాజ్ వాళ్ళ అమ్మనా అని అడుగుతుంది. మీ మనవరాలు రేవతి అని కావ్య అంటుంది. రేవతిని చూసి ఇందిరాదేవి టెన్షన్ పడుతుంది. ఈ విషయం అపర్ణకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అంటుంది. అక్కని మేమ్ ఈ కుటుంబానికి దగ్గర చేస్తామని రాజ్ అనగానే మేమ్ కూడా అని అప్పు, కళ్యాణ్, స్వప్న అంటారు. తరువాయి భాగంలో ఈ స్వరాజ్ ఎవరో కాదు ఈ ఇంటికి వారసుడు రేవతి కొడుకు అని ఇంట్లో అందరి ముందు రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg Boss 9: ప్రేమించిన వాడు హింసించేవాడు.. ఫ్లోరా సైని ఎమోషనల్!

  బిగ్ బాస్ సీజన్-9 నిన్న గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే అందులోకి సెకెండ్ కంటెస్టెంట్ గా వెళ్లిన ఫ్లోరా సైని అలియాస్ ఆశా సైని గురించి తక్కువ మందికే తెలుసు. 'ప్రేమకోసం' సినిమాతో హీరోయిన్ గా తెలుగులో అరంగేట్రం చేసింది ఫ్లోరా సైని. నరసింహానాయుడు సినిమాలోని లక్స్ పాప సాంగ్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. ఆ తర్వాత 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలో చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన '143' మూవీలోనూ నటించింది. (Flora Saini)   తెలుగు సినిమా ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసిన ఈ భామ.. హీరోయిన్ అవకాశాలు రాకపోకవడంతో బాలివుడ్ కి వెళ్లింది. అక్కడ భిన్నమైన పాత్రలు చేసిన ఫ్లోరా సైని.. తమిళ, కన్నడ సినిమాలల్లో‌నూ నటించింది. తన ఇరవై ఏళ్ళ వయసులో ఒక ప్రొడ్యూసర్ తో ప్రేమలో పడినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది‌ ఫ్లోరా సైని. అయితే అతను తనని మానసికంగా, శారీరకంగా హింసించేవాడని, సినిమాలు చేయకూడదని బలవంతం చేశాడని, తన శరీరంపై గాయలతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసినట్టుగా ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. ఒక సంవత్సరం పాటు ఎవరితో కాంటాక్ట్ లేకుండా చేశాడని, ఒకరోజు తన పొట్టపై తన్నడంతో ఆ నొప్పిని భరించలేకపోయానని, కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టిందంటూ ఎమోషనల్ అయింది ఫ్లోరా సైని.   బిగ్ బాస్ సీజన్-9 లో అడుగుపెట్టిన ఫ్లోరా సైనికి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. తనకి ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్-9 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి.  

సుధీర్ తో లవ్ ట్రాక్.. రష్మి షాకింగ్ కామెంట్స్!

  శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వీక్ షో ఫుల్ ఫన్నీగా ఉంది. ఇక ఇందులో టీచర్స్ డే సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. నూకరాజు ఐతే ఇంద్రజ కాళ్ళ మీద పడి బ్లేసింగ్స్ తీసుకున్నాడు. ఇండస్ట్రీలో అమ్మ అని పిలిచిన ఆవిడ ఒక్కరే అన్నాడు. ఇంద్రజ అంటే ప్రేమ, గౌరవం ఉన్నాయని చెప్పాడు.    ఇక తర్వాత రాంప్రసాద్ వచ్చి "అరేయ్ రష్మీ నువ్వు కూడా నా కాళ్ళమీద పడు" అన్నాడు. "ఎందుకు పడాలి" అంది రష్మీ. "నీకు ఎన్ని నేర్పించాను నేను" అన్నాడు. "ఏం నేర్పించావ్ " అంది. "సుధీర్ గాడిని పరిచయం చేసి ట్రాక్ పెట్టింది నేనే" అన్నాడు రాంప్రసాద్. "ఆ కాళ్ళ మీద పడడం కాదు ఈ ఒక్క విషయం వల్ల ఈ కాళ్ళనే కాదు అన్నీ నరికేయాలి" అంది సీరియస్ గా. ఆ కామెంట్స్ తో రాంప్రసాద్ షాకయ్యాడు.    బుల్లితెర మీద సుధీర్ - రష్మీ లవ్ ట్రాక్ గురించి చెప్పక్కర్లేదు. ఒక రేంజ్ లో పాపులర్ అయ్యారు వీళ్ళు. ఆ తర్వాత సుధీర్ ఈటీవీని వదిలేసాడు. కానీ రష్మీ మాత్రం జబర్దస్త్ ని, శ్రీదేవి డ్రామా కంపెనీని మాత్రం వదల్లేదు. సుధీర్ అటు మూవీస్, షోస్ చేస్తూ ఉన్నాడు. ఇక రష్మీకి జబర్దస్త్ లో కో-హోస్ట్ గా ఇప్పుడు మానస్ చేస్తున్నాడు. రష్మీ-సుధీర్ పెళ్లి చేసుకుంటే చూడాలని చాలామంది కోరుకుంటూ ఇప్పటికీ షో ప్రోమోస్ కింద పోస్ట్ చేస్తూనే ఉంటారు.  

Jayam serial : గంగపై ఎటాక్ ప్లాన్ చేసిన వీరు.. సేవ్ చేసిన రుద్ర! 

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -49 లో... వినాయకుడి విగ్రహం నిమజ్జనానికి గంగ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వినాయకుడికి శకుంతల పూజ చేస్తుంది. గంగ వస్తుంటే భాను వచ్చాడనుకొని శకుంతల హ్యాపీగా ఫీల్ అవుతుంది.    ఇక ఇంట్లో అందరు చాలా సంతోషంగా ఉంటారు. అందరు వినాయకుడి ముందు తీన్ మార్ డాన్స్ చేస్తుంటారు. శకుంతల హ్యాపీగా ఉండడం చూసి రుద్ర సంతోషపడతాడు. ఇందుమతి డాన్స్ చేస్తుంది. వీరు ప్లాన్ లో భాగంగా తన మనిషితో రుద్రకి పాపతో రౌడీలున్న వీడియోని పంపిస్తాడు. అది చూసి రుద్ర అక్కడ నుండి బయల్దేరతాడు. రుద్ర వెళ్ళడం చూసి సైదులుకి‌ వీరు ఫోన్ చేసి గంగ దగ్గరికి రమ్మని చెప్తాడు.   ఆ తర్వాత అందరు డ్యాన్స్ చేసి అలసిపోయి పక్కకి వస్తారు. గంగ ఇంకా కొంతమంది డ్యాన్స్ చేస్తారు. అప్పుడే సైదులు కత్తి పట్టుకొని వచ్చి.. గంగ తల దగ్గర పెట్టగా.. వెనకాల నుండి రుద్ర వచ్చి ఆపుతాడు. సైదులు తప్పించుకుంటాడు. ఈ రుద్ర మళ్ళీ ఎందుకు వచ్చాడని వీరు డిజప్పాయింట్ అవుతాడు. గంగ భయపడుతూ శకుంతల దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.