నూపుర్.. దేశాన్ని క్ష‌మాభిక్ష కోరుకోః సుప్రీం కోర్టు

ఒకే ఒక్క మాట దేశాన్నే కాదు, విదేశాల్లోనూ విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త కొని తెచ్చుకుంది. బ‌హుశా ఇంత‌టి వ్య‌తిరేక‌త ఎవ‌రి తిట్ల‌కీ ల‌భించ‌లేదేమో! బిజెపీ మాజీ నాయ‌కురాలు నూపుర్ శ‌ర్మ మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త గురించి చేసిన ఒక కామెంట్‌తో దేశంలో ముస్లింసోద‌రులతో పాటు అన్ని మ‌తాల‌వారూ, అన్ని వ‌ర్గాల వారూ తిట్టిపోశారు. దేశంలో చెల‌రేగిన అల్ల‌ర్లకు ఆమె ఒక్క‌తే బాధ్య‌త వ‌హించాల‌ని, త‌న‌కు క్ష‌మాభిక్ష పెట్ట‌మ‌ని  ఆమె యావ‌త్ దేశాన్ని కోరాల‌ని శుక్ర‌వారం సుప్రీం కోర్టు ఆదేశించింది.   రాజ‌కీయ నాయ‌కులు తిట్టుకోవ‌డం వేరు,  భారీ విమ‌ర్శలు చేసుకోవ‌డం వేరు, కానీ  నూపుర్ చేసిన  ఒకే ఒక్క కామెంట్ దేశ‌మంత‌టినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది, అంతే స్థాయిలో  భ‌యాందోళ‌న‌ల‌కూ  గురిచేసింది. నూపుర్  వూహించ‌ని విధంగా మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త  గురించి చేసిన కామెంట్ల వ‌ల్ల  బిజెపీ ఇర‌కాటంలోనే ప‌డింది. ఫ‌లితంగా ఆమెను ఏకంగా పార్టీ  నుంచి  తొలగించ‌కా త‌ప్ప‌లేదు. అంత‌కు మించి పెద్ద శిక్ష ప‌డా ల‌ని యావ‌త్ భార‌తావ‌నీ కోరుతోంది. ఈ ప‌రిస్థితుల్లో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు నూపుర్  ఒక టీవీ చ‌ర్చ‌లో  మ‌త ప్ర‌వ‌క్త పై చేసిన కామెంట్ వ‌ల్ల  దేశంలో మ‌త‌ప‌ర‌మైన అల్ల‌ర్లు చెల‌రేగాయ‌ని అభిప్రాయ ప‌డ్డారు. మంగ‌ళ‌వారం ఉదైపూర్‌లో క‌న్హ‌య‌లాల్ అనే టైల‌ర్ ఘోర హ‌త్య‌కు గురికావ‌డానికి కార‌కురాలు నూపుర్ గా న్యాయ‌మూర్తులు పేర్కొన్నారు. ఆ టైల‌ర్ నూపుర్ చేసిన కామెంట్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో  ఇద్ద‌రు వ్య‌క్తులు అది ఇస్లాంకు అవ‌మాన‌మేన‌ని భావించా ఆ దారుణానికి ఓడిగ‌ట్టార‌ని న్యాయ‌మూర్తులు అన్నారు.  నూపుర్ టీవీ చ‌ర్చ‌లో పాల్గ‌న‌డం గ‌మ‌నించామ‌ని, లాయ‌ర్ అయి వుండి కూడా అటువంటి కామెంట్ చేయ‌డం దుర‌దృష్ట‌క‌రం, అవ‌మాన‌క‌రంగా సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి సూర్య‌కాంత్  పేర్కొన్నారు. త‌న పై దేశంలో ప‌లుచోట్ల దాఖ‌ల‌యిన ఎఫ్ ఐ ఆర్‌ల‌ను ఢిల్లీకి ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌ని నూపుర్ కోర్టును కోరింది. అయితే ఆమెకు ప్రాణ‌హాని  వున్న కార‌ణంగా  పిటిష‌న్‌పై త‌న పేరును ప్ర‌స్తావించ‌లేదు.  స‌మాన‌త్వం,  ప‌క్ష‌పాత లేకుండా నూపుర్ శర్మ వాదనను కోర్టు కొట్టివేసింది. కానీ మీరు ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినప్పుడు, వారు వెంటనే అరెస్టు చేయబడతారు, కానీ అది మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎవరూ మిమ్మల్ని తాకడానికి ధైర్యం చేయరు అని న్యాయమూర్తులు అన్నారు.ఆమె వ్యాఖ్యలు ఆమె మొండి అహంకార స్వభావాన్ని చూపించాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆమె ఒక పార్టీకి అధికార ప్రతినిధి అయితే.. తనకు అధికారం ఉందని భావించి, దేశంలోని చట్టాన్ని గౌర వించకుండా ఏదైనా ప్రకటన చేయగలరా? అని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు ప్ర‌శ్నించారు. అస‌లు ఆమె    న్యాయ‌వాది అయి వుండి కూడా దేశ‌మంతా చూసే చ‌ర్చావేదిక‌లో తాను మాట్లాడేది తీవ్ర ప్ర‌భావం చూపు తుందని, దేశ‌మంత‌టా దాని తాలూకు ప‌రిణామం తీవ్ర‌స్థాయిలో వుంటుంద‌న్న ఆలోచ‌న‌లేకుండా కామెంట్ చేయ‌డం అస్స‌లు స‌మ‌ర్ధ‌నీయం కాద‌ని సుప్రీంకోర్టు న‌మ్మింది.

ఢిల్లీలో దోస్తీ.. ఏపీలో కుస్తీ..!

ఎవ‌రైనా ఇంట గెలిచి ర‌చ్చ‌గెల‌వ‌మంటారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్  వ్య‌వ‌హారం ఇందుకు భిన్నంగా వుంది. ఢిల్లీ నాయ‌కుల‌తో దోస్తానా ఎటువంటి ఇబ్బందిలేదు. కానీ స్వ‌ప‌క్షం వారితోనే  త‌ల భారం పెరిగింది.  ముందున్నంత స‌ఖ్యంగా ఎక్క‌డా ఎవ్వ‌రూ  లేరు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో విభేదాలు త‌లెత్తుతున్నాయి. వీటిని స‌ద్దుమ‌ణిగేలా చేయ‌డానికి  ప్ర‌త్యేకంగా స‌మ‌యం తీసుకొన‌వ‌ల‌సి వ‌స్తోంది. అయినా వైసీపీ 175 సీట్లు వ‌స్తాయ‌ని జ‌గ‌న్ చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్లీనరీపైనే ఆంధ్రా రాజకీయం ఆధారపడి ఉందంటున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రా రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందనేది రాజకీయ కురు వృద్ధులకు కూడా అంతుచిక్కడం లేదు. వైసీపీ- బీజేపీల అంతర్యం ఏమిటో, వారి భవిష్యత్ వ్యూహం ఏంటో కూడా రాజకీయ మేధావులకు సైతం అంత ఈజీగా అంతుబట్టడం లేదు.  సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప్రయాణం క‌ట్టిన‌పుడ‌ల్లా ఇక్క‌డి పార్టీ వ‌ర్గాలు రాష్ట్ర అంశాల‌ను చ‌ర్చించ‌డానికి వెళుతు న్నార‌ని భారీ ప్ర‌చారం చేస్తారు.  ఆయ‌నక ఆయ‌న  తిరిగి రాగానే ఏదో   స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన‌ట్టు  నివాసానికో, పార్టీ ఆఫీసుకో వెళ్ల‌డం  ఆన‌వాయితీగా మారింది. కానీ అక్క‌డ నాయ‌కుల్ని ప్ర‌స‌న్నం చేసుకోవ డంలో  ఆంత‌ర్యం వేర‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి అవసరమైన చోటల్లా  ప్రత్య క్షంగానే మద్దతు తెలుపుతూనే ఉన్నారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదా నికి  వచ్చినప్పుడల్లా చెయ్యెత్తి  జై కొడుతూనే  ఉన్నారు. రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతుల ఎన్నికల సమయంలో కేంద్రం నిర్ణ యించిన వ్యక్తికే తమ ఓటు అని అధికారికంగానే ప్రకటిస్తూనే వస్తున్నారు.  ఇక్క‌డ ఏపీలో మాత్రం వైసీపీ, బీజెపీల మ‌ధ్య ఏది ప‌డినా బుగ్గ‌య్యేంత క‌య్యాలు నెల‌కొన్నాయి. ఎన్ని క‌లు వ‌చ్చిన‌పుడ‌ల్లా ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల యుద్ధానికి అంతే వుండ‌దు. నోటికీ అడ్డూ ఆపూ వుండదు. అంతెందుకు ఇరు పార్టీల అధినాయ‌కుల పోక‌డ‌లు జిమ్మిక్కుల లాజిక్కు బొత్తిగా  అర్ధంగాక ఇరు పార్టీల వ‌ర్గాలూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అనేక కీలక పరిణామాల పట్ల అస్సలు స్పందించని జగన్.. మళ్ళీ పార్టీని అధికారంలోకి  తేవడానికి, మొత్తం 175 సీట్లు సాధించడానికి ఏం మాయ చేస్తారో..? అని వైసీపీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.  జ‌గ‌న్ దేశంలోని ముఖ్య‌మంత్ర‌లుంద‌రి క‌న్నా చిన్న‌ వ‌య‌సు వారు. తండ్రి వారసత్వాన్ని అంది పుచ్చుకు ని  పార్లమెంటు సభ్యుడి హోదా నుండి ఏకంగా సీఎం స్థానాన్ని అందుకున్నారు. ఆయ‌న‌కు మంత్రిగా చేసిన అనుభ‌వం లేదు. కానీ,  కేంద్రంలో బిజేపీ అగ్ర‌నేత‌లు మోడీ, అమిత్ షాతో స‌ఖ్య‌త పాటించ‌డం, విజ‌యవంతంగా కొన‌సాగించ‌డంలో  నైపుణ్యం ప్ర‌ద‌ర్శిస్తు మోడీ ద‌త్త‌పుత్రుడు అనే పేరు మాత్రం సంపా దించారు. ఏకంగా కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అలా జ‌గ‌న్‌ను ప్ర‌శంసించారంటే జ‌గ‌న్ కేంద్రంలో స్నేహ‌బంధాలు మ‌హా గ‌ట్టి ప‌డ్డాయ‌నే అనాలి.     ఢిల్లీ లో  అంత‌లా అంటకాగుతున్న వైసీపీ, బిజెపీ స్నేహం  ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బెడిసి కొట్టింద‌నే అనాలి.  బిజెపీనీ ఆమ‌డ దూరం పెట్టడమే కాకుండా, తమ పార్టీ నేతలతో తిట్టిస్తున్నారు కూడా. లీడర్ ఆదేశాలతో వైసీపీ నేతలు త‌మ నోటి దురుసు బాగా ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్న‌ది  బీజేపీ వ‌ర్గాల  గోల‌.  ఆంధ్ర‌లో పెరిగిపోతున్న ఈ వైష‌మ్యాల‌కు పెద్ద ఉదాహ‌ర‌ణే ఇటీవ‌లి ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లు.  నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఇటీవలే జరిగిన ఉప ఎన్నికలో వైసీపీనేతలు  బీజేపీకి డిపాజిట్ రాకుండా చేశారు.  ఢిల్లీలో తమ అధినాయకుడు మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో మోడీ నిర్దయించిన ద్రౌవది ముర్ముకు పూర్తి మద్దతు ప్రకటించారు. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన పలు హామీలు సాధించ కుండానే ప్రధాని నిర్ణయించిన రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఎలా ఇస్తారని ప్రశ్నించే వారికి జగన్ సమాధా నమే చెప్పరు. అలా ఎందుకు చేస్తున్నారని అడిగే ధైర్యం వైసీపీలో ఎవరికీ లేదనేది వాస్తవం అంటున్నా రు రాజకీయ పరిశీలకులు.

మాజీ సీఎంలు.. మళ్ళీ మంత్రులు!

సుమారు పక్షం రోజుల పాటు సాగిన  మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం చివరకు అలా ముగిసింది. అనుహ్యంగా శివసేన రెబెల్ లీడర్ ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్,ఉప  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్, తమ స్థాయిని తగ్గించుకుని అది కూడా గతంలో తమ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన ఏక్‌నాథ్ షిండే’ మంత్రి వర్గంలో  ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, కొంచెం విడ్డూరంగా ఉండనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అలాగే, సహజంగానే అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజకీయాల్లో సీనియర్, జూనియర్ విభజన రేఖలు ఉన్నా, వాటికీ అంతగా ప్రాధాన్యత  అయితే ఉండదు. రజకీయ అవసరాలు ఇతరత్రా సమీకరణలు పదవులకు  అర్హతలవుతాయి. నరేంద్ర మోడీ, ఉద్దవ్ ఠాక్రే వంటి కొందరు మత్రులుగానే కాదు చివరకు ఎమ్మెల్యేలుగా అనుభవం లేకుండా, నేరుగా ముఖ్యమంత్రులయ్యారు. అప్పటికే అనేక మార్లు మంత్రులుగా, పనిచేసిన అనుభవం ఉన్న వారు, ఏ అనుభవము లేని ముఖ్యమంత్రుల   మంత్రివర్గాలో మత్రులుగా పనిచేశారు.  అయితే, మంత్రులుగా ఉన్న వారు మంత్రులుగా కొనసాగడం ఒకటైతే, ముఖ్యమంత్రులుగా పనిచేసి మాజీలు మెట్టు దిగి మళ్ళీ మంత్రులుగా పనిచేయడం కొంచెం ఇబ్బదికరంగానే ఉంటుంది. అందుకే కావచ్చును, షిండేను ముఖ్యమంత్రిగా ప్రకటించిన సమయంలో, ఫడ్నవీస్, చాలా స్పష్టంగా, తాను  ప్రభుత్వంలో చేరడం లేదని లేదని ప్రకటించారు. అయితే, పార్టీ అధిష్టానం బలవంతం చేయడంతో,అయిష్టంగానే అయినా ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.  అయితే, మాజీ ముఖ్యమంత్రులు మెట్టుదిగి మంత్రులుగా అయిన సందర్భాలు చరిత్రలో లేవా అంటే లేక పోలేదు. ఎక్కడిదకానో ఎందుకు, మహారాష్ట్రలోనే, నలుగురు మాజీ ముఖ్యమంత్రులు,అనంతర కాలంలో ఇతర ముఖ్యమంత్రుల వద్ద మంత్రులుగా పనిచేసిన సందర్భాలున్నాయని, శరద పవార్ వంటి  పెద్దలు గుర్తు చేస్తున్నారు.  శంకర రావు చౌహాన్ 1975 లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆ తర్వాత 1977 లో అయన స్థానంలో వసంత దాదా పాటిల్ సీఎం అయ్యారు. శంకర రావు చౌహాన్ మాజీ  అయ్యారు. అయితే, ఆతర్వాత కొద్ది కాలానికే, పాటిల్ మంతి వర్గంలో మంత్రిగా ఉన్న శరద్  పవార్, ఆయన్ని గద్దె దించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మంత్రి వర్గంలో మాజీ ముఖ్యమంత్రి శంకర రావు చౌహాన్, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అలాగే, శివాజీ రావు పాటిల్ నిలగేన్కర్ 1985 జూన్ నుంచి 1986 మార్చి వరకు కొద్దికాలం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ  తర్వాత చాలా కాలానికి సుశీల్ కుమార్ షిండే మంత్రి వర్గంలో రెవిన్యూ మంత్రిగా పనిచేశారు. అలాగే, నారాయణ రాణే శివసేనలో ఉండగా, 1999లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే సంవత్సరం తిరక్కుండానే మాజీ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రాణే, విలసరావు దేశ్ ముఖ మంత్రివర్గంలో రెవిన్యూ మత్రిగా  పనిచేశారు. అలాగే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక చవాన్  2008 నుంచి 2010 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత సుమారు తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత,  ఉద్దవ్ ఠాక్రే (ఎంవీఎస్) మత్రివర్గంలో పీడబ్ల్యు మంత్రిగా పనిచేశారు.  ఇలా మాజీ ముఖ్యమంత్రులు మళ్ళీ మంత్రులుగా పనిచేసిన  సందర్భాలు అక్కడక్కడా ఉన్నా, ఫడ్నవీస్ కేసు కొంచెం భిన్నంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. మంత్రివర్గంలో చేరడం లేదని చెప్పిన కొద్ది గంటలకే అనివార్యంగా,  ‘యూ టర్న్’ తీసుకోవలసి రావడం కొంత ఇబ్బందికరమనే ఆయన సన్నిహితులు అంటున్నారు

కొడాలి నాని తొండాట.. బందర్, గన్నవరం నియోజకవర్గాల్లో విభేదాలకు ఆజ్యం

వైసీపీలో అంతర్గత కుమ్యులాటలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని  గన్నవరం, మచిలీపట్నం నియోజకవర్గాలలో వైసీపీ నేతల మధ్య రోజుకో కొత్త వివాదం రాజుకుంటూ.. ఇటు వైసీపీ అధిష్టానానికీ.. అటు నియోజకవర్గంలోని వైసీపీ క్యాడర్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాగా ఈ వివాదాలకు ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవులు కోల్పోయిన వారిలో పేరుకు పోయిన  అసమ్మతి, అసంతృప్తే కారణమని పార్టీ వర్గాలే బహిరంగంగా చెబుతున్నారు. ఉన్న వివాదాలు, విభేదాలూ చాలవన్నట్లు మాజీ మంత్రి కొడాలి నాని ఆ రెండు నియోజకవర్గాల్లోనూ కొత్త చిచ్చును రగిల్చారు. ముందుగా గన్నవరం  నియోజకవర్గం విషయానికి వస్తే.. అసలే  అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతున్న అధికార వైసీపీ పార్టీలో గన్నవరం రాజకీయం ఎప్పటికప్పుడు ముందు వరసలోనే  ఉంటుంది. ఏపీ పాలిటిక్స్ లో అంత్యం వివాదాస్పదమైన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరమే.   ఇప్పటికే గన్నవరంలో వల్లభనేని వంశీ, దుట్టా రామచందర్రావు, యార్లగడ్డకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. సీఎం జగన్, సజ్జలతో సహా పార్టీలోని పెద్దలంతా ఈ వివాదాన్ని క్లోజ్ చేయాలనుకున్నా ఏమాత్రం కుదరటంలేదు. సీఎం జగన్ కూడా వీరి పంచాయితీపై అసహనం వ్యక్తం చేసినా అది మాత్రం అంతకంతకు పెరుగుతునే ఉంది. అసలే వివాదాలుగా ఉన్న గన్నవరం రాజకీయానికి మాజీ మంత్రి కొడాలి నాని మరికాస్త ఆజ్యం పోశారు. దీంతో గన్నవరం రాజకీయం మరోసారి హీటెక్కింది.దుట్టా, యార్లగడ్డ వర్గాలు వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. వంశీ ఒక్కరే ఇద్దరితోనూ పోరాడుతున్నారు. ఈ క్రమంలో గన్నవరం వైసీపీ ప్లీనరీ సమావేశానికి హాజరైన మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు వర్గ పోరును మరింత పెంచేలా చేశాయి.   2024లో గన్నవరం వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఇందులో మరో మాట లేదన్నారయన.అంతేకాదు   గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశిపై పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని కొడాలి నాని అన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలతో గన్నవరం వైసీపీలో కలకలం మొదలైంది. వంశీని వ్యతిరేకిస్తున్న దుట్టా, యార్లగడ్డ వర్గాల్లో కలవరం మొదలైంది.  కొడాలి నాని వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణుల్లోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   ఇక బందర్ ప్లీనరీలోనూ కొడాలి నాని ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. బందర్ లో ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరిల మధ్య వర్గ పోరు పీక్స్ లో ఉంటే.. పేర్ని నాని ఆ స్థాయిని మరింత పెంచేలా వ్యాఖ్యలు చేశారు. బందర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంపీ బాలశౌరి తన కుమారుడు వల్లభనేని అనుదీప్ ను వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. అలాగే ఇదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పేర్ని నాని తన కుమారుడు పేర్ని కిట్టును బరిలోకి దింపాలని చూస్తున్నారు. ఇదే ఎంపీ బాలశౌరి, మాజీ మంత్రి పేర్ని నానిల మధ్య విభేదాలను ప్రధాన కారణం కాగా, ఈ విభేదాలను మరింత పెంచే విధంగా కొడాలి నాని.. బందర్ నియోజకవర్గం నుంచి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని ప్రకటించేశారు. దీంతో ఎంపీ వర్గీయులు ఒక్కసారిగా భగ్గు మన్నారు. పేర్ని కిట్టును అభ్యర్థిగా ప్రకటించడానికి కొడాలి నాని ఎవరంటూ నిలదీస్తున్నారు. అయినా గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే కొడాలి నానికి బందర్ నియోజకవర్గ గొడవ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కొడాలి నాని తీరు పార్టీలో విభేదాలను రెచ్చగొట్టేదిగా ఉందని పర్టీ శ్రేణులే వ్యాఖ్యనిస్తున్నాయి. ఇక పరిశీలకులు కూడా ఇటీవలి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవిని కోల్పోయిన ఉక్రోషంతోనే కొడాలి నాని ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలూ చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులు కూడా అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేస్తున్నారు. 

వైసీపీ వినిపిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బాకా!

అది మేమే చేశాం, ఇది మేమే చేశామ‌ని కొంద‌రు గొప్ప‌లు చెప్పుకుంటూంటారు. వారికి అదో ఆనందం. అది లేక‌పోతే క్ష‌ణం వుండ‌లేరు, అదే భ‌జ‌న ఇత‌రుల నుంచీ కూడా కోరుకుంటూంటారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పోక‌డ అదే.  గత ప్రభుత్వం తెచ్చిన కీర్తిని తన  ఖాతాలో వేసుకు నేందుకు  జ‌గ‌న్ ప్ర‌భుత్వం నానా పాట్లు పడుతోంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారుతోంది. కేంద్రం 2019 మార్చి వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్  ర్యాంకులను ప్రకటించింది. వైసీపీ నేతలు ఇది తమ ప్రభుత్వ ఘనత అంటూ  బాకా  ఊదుతున్నారు. దేశంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల అంశాలను కేంద్ర పరిశ్రమల శాఖ పర్యవేక్షిస్తోంది. దాని ఆధారంగా అన్ని రాష్ట్రాలకు ర్యాంకులిస్తోంది. ఈ ర్యాంకింగ్ ఆధారంగా పారిశ్రామిక వేత్తలు ఆయా రాష్ట్రాలకు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ. ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ పరిగణించి పారిశ్రామిక వేత్తలు ఈ ర్యాంకింగ్‌ల ద్వారా ముందుకు వస్తారని కేంద్రం భావిస్తోంది. 2014లో  ఐక్య ఆంధ్రప్రదేశ్  ఆంధ్రా, తెలంగాణాగా  విడిపోయిన తర్వాత ఆంధ్రా లో  పెద్ద ప‌రిశ్ర‌మ‌లు లేవు. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అందుకు అనుకూల వాతావ‌ర‌ణం సృష్టించ‌డానికి ఎంతో కృషి చేశారు. శ్రీసిటీ తిరుపతిలో అనేక పరిశ్రమాలతోపాటు అనంతపురంలో కియా, విశాఖలో ఐటీ వంటి పరిశ్ర మలు తీసుకువచ్చారు. ఆ కృషి ఫలితంగా  2016, 17, 18, 2019 లో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీలో బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ఫ్లాన్ 2020ని విడుదల చేశారు. ఇందులో ఏపీ మొదటి స్థానంలో ఉంది.  కరోనావల్ల రెండేళ్లపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకులు విడుదల కాలేదు. వాటినే  ఇప్పుడు కేంద్రం ప్రక టించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇదంతా తమ ప్రతిభా అని సొంత మీడియాలో భారీ ప్ర‌చా రం చేసుకోవ‌డం ప్రారంభించింది.  త‌న‌వ‌ల్ల కాని ప‌నిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం  తానే చేశాన‌ని  భ‌జంత్రీల‌తో ప్ర‌చారం చేయంచుకోవ‌డంలో అర్ధ‌మేమిటి?  నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  కొత్త పరిశ్ర మల మాట స‌రేస‌రి!  ఉన్న పరిశ్రమలే వెళ్లిపోయాయి. గతంలో వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి తెచ్చు కునేం దుకు తంటాలు పడుతున్నా అవి తిరిగి రావడంలేదు. అస‌లు రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ప‌రిస్థితులు అనుకూలించేలా వున్న‌దీ లేనిదీ ప్ర‌చారం చేసుకోవ‌డానికి పూనుకుంటేగ‌దా? ప‌క్క‌నే వున్న తెలంగాణా ఈ ప‌రంగా అద్బుతంగా త‌న పేరును అంత‌ర్జాతీయ‌వేదిక‌ల‌కు వినిపించేలా ప్ర‌చారం చేసుకుంటోంది. అందుకు ఒక అర్ధం వుంది. ఇటువంటి సమయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ర్యాంక్ ఎలా వచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తు న్నాయి. 

మెట్రోషెడ్‌పై ఫ‌డ్న‌వీస్ నిర్ణ‌యానికే షిండే మొగ్గు

రాజ‌కీయ నాయ‌కులంతా ఒకే తీరుగా వ్య‌వ‌హ‌రిస్తారు. అధికారంలోకి వ‌చ్చేవ‌ర‌కూ ఒక‌లా, సీఎం పీఠం ఎక్క గానే  వెంట‌నే అప్ప‌టివ‌ర‌కూ వున్న సీఎం క‌ల‌గా పేర్కొనే పెద్ద ప్రాజెక్టుకు వంక‌ పెడుతూంటారు.  మ‌హా రాష్ట్ర లోనూ అదే జ‌రిగింది. నిన్న సీఎం అయిన షిండే  ముంబైలో  వివాదాస్ప‌ద మెట్రో కార్‌షెడ్ అంశంపై  గ‌తంలో ఫ‌డ్న‌వీస్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికే మొగ్గు చూపారు. దీంతో   థాక్రే ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు ఎలాంటి ప్రాధాన్య‌తా లేకుండా పోయింది. ఈ షెడ్డును ముంబైలోని ఆరే కాల‌నీలో ఏర్పాటుకు వీలు క‌ల్పించ‌మ‌ని కోరుతూ  హైకోర్టు లో  పిటిష‌న్ దాఖ‌లు చేయ‌మ‌ని అడ్వ‌కెట్ జ‌న‌ర‌ల్‌ను  మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి షిండే  ఆదేశించారు.  వాస్త‌వానికి 2019 లోనే ఈ మెట్రో షెడ్ గురించి ముంబై మెట్రో రైల్ కార్పోరేష‌న్  ఆరే కాల‌నీ ప్రాంతంలో చెట్లు కొట్టించేందుకు అనుమ‌తించాల‌ని బృహ‌న్ ముంబై మునిసిప‌ల్ కార్పోరేష‌న్ (బిఎంసి) ని కోరింది.  ఈ అంశంపై ఇప్ప‌టికే ముంబైలో  పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వెల్లువెత్తింది. ఇది ప‌ర్యావ‌ర‌ణానన్ని దెబ్బ తీస్తుంద‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. కానీ ముంబైలో  చెట్ల‌తో  ప‌చ్చ‌గా నిండిన, చెప్పుకోద‌గ్గ ప్రాంతంగా ఆరే కాల‌నీ ప్ర‌సిద్ధం. కానీ  అప్ప‌ట్లో  బిఎంసి అందుకు అంగీక‌రించ‌డంతో ముంబైలో ఉవ్వె త్తున నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి.  కానీ  మెట్రో కార్‌షెడ్ ఏర్పాటుకు ఎంచుకున్న ఆ ప్రాంతం ఎలాంటి అట‌వీ భూమి కాద‌ని  ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్  అప్ప‌ట్లో అన్నారు. ప‌చ్చ‌టి చెట్ల‌తో స్వ‌చ్ఛ‌మైన గాలి ల‌భిస్తుంది. కానీ ఇప్పుడీ అండ‌ర్‌గ్రౌండ్‌ మెట్రో రావ‌డంతో ఆ స్వ‌చ్ఛ‌త‌కు  అంత‌గా న‌ష్టంవాటిల్ల‌ద‌నీ అన్నారు.  ఆ ఏడాది త‌ర్వాత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బిజెపిని వ‌దిలిన ఉద్ధ‌వ్ థాక్రే మ‌హా వికాస్ అఖండ పార్టీ అధికారం లోకి వ‌చ్చింది.         కార్యకర్తల నిరసనలను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రభుత్వం మెట్రో కార్ షెడ్‌ను కంజుర్‌మార్గ్‌కు మార్చా లని నిర్ణయించింది. ఆ తర్వాత, కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం 2020లో బాంబే హైకోర్టు కు వెళ్లింది, ఈ భూమి తమ ఉప్పు శాఖకు చెందినదని పేర్కొంది. దీంతో హైకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి ప్రాజెక్టు పనులు కొలిక్కివస్తున్నాయి. ఆరేలో షెడ్డు నిర్మించాలన్న యోచనను తాము బీజేపీ కూటమి భాగస్వాములుగా ఉన్నప్పుడు కూడా శివసేన వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్ట్‌ను మార్చడంపై బిజెపి విమర్శలపై గత ఏడాది ముఖ్యమంత్రి థాకరే స్పందిస్తూ, త్వరితగతిన చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు వృధాకు దారితీస్తాయని,  నిజమైన అభివృద్ధి కాదని అన్నారు. షిండే చర్య తీసుకున్న వెంటనే, ముంబై మెట్రో పనులను తిరిగి ట్రాక్‌లోకి తీసుకువస్తామని బిజెపి నాయకుడు కిరీట్ సోమయ్య ట్వీట్ చేశారు. ఆరే వద్ద ఉన్న మెట్రోకార్ షెడ్‌ను తిరిగి తీసుకురావాలని షిండే ఫడ్నవీస్  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముంబై మెట్రో పనులను తిరిగి ట్రాక్ చేస్తుంది అని ఆయన ట్వీట్ చేశారు.

పాకిస్థాన్ లో అంతర్జాలం బంద్..!?

పాకిస్థాన్ లో ఇంటర్నెట్ సేవలు బంద్ అయిపోనున్నాయి. ఇదేదో ఉగ్రవాద చర్యల వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్య అనుకునేరు.. లేదా ఘర్షణ ల వ్యాప్తికి యంత్రాగం తాత్కాలికంగా చేపట్టిన చర్య కూడా కాదు. ఆర్థిక ఇబ్బందుల్లో నిండా మునిగిన దేశం అతి వేగంగా శ్రీలంక సంక్షోభం స్థాయికి వెళ్లిపోతున్నది. అయితే ఇంకెన్ని రోజులలో పాకిస్థాన్ లో శ్రీలంకలోని పరిస్థితులు ఏర్పడతాయన్నది ఇతమిద్థంగా చేపలేం కానీ.. ఆ పరిస్థితి మాత్రం ఖాయమంటున్నారు పరిశీలకులు, అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు. ఇక విషయానికి వస్తే పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దానికి తోడు నిండా ముంచేస్తున్న అప్పులు. దీంతో ఆ దేశంలో కనీవినీ ఎరుగని విద్యుత్ సంక్షోభం నెలకొంది.  అందుకు కారణం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎల్ఎన్జీ కొనలేని స్థితిలో ఆ దేశం ఉండటమే. దీంతో  పాకిస్తాన్ విపరీతంగా విద్యుత్ కోత విధిస్తోంది. విద్యుత్ ఆదా కోసం ప్రభుత్వ ఉద్యోగులకు పనిగంటలను తగ్గించింది, కరాచీతో పాటు ఇతర నగరాల్లో షాపింగ్ మాల్స్, కర్మాగారాలు తెరిచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించేసింది. విద్యుత్ అవసరం లేని సమయాలలో మాత్రమే మార్కెట్లు పని చేయాలని ఆదేశాలూ జారీ చేసింది. ఇక తరువాతి వంతు అంతర్జాలానిదే అని చెబుతున్నది. విద్యుత్ కొరత కారణంగా మొబైల్ నెట్వర్క్, ఇంటర్ నెట్ సేవల నిలిపివేత ఇంకెంతో దూరంలో లేదని ఆ దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు ట్వీట్ చేసింది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇంధన దిగుమతి కోసం ఖతార్ తో సంప్రదింపులు జరుపుతోంది. ఆ సంప్రదింపులు ఎంత వరకూ ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. ఒక వేళ అవి ఫలవంతం కాకపోతే పాకిస్థానీయులు ఇంటర్నెట్ కు దూరం కావలసిందే. ఇప్పటికే ఇన్ఫ్లేషన్ రెండంకెలకు చేరుకుంది. ప్రజలు దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభం నుంచి పాక్ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.  

అయ్య‌న్న ఇంటిచుట్టూ తిర‌గ‌వ‌ద్దుః పోలీసుల‌కు కోర్టు మంద‌లింపు

ఎవ‌ర‌న్నా దేవుడి గుడిలో ప్ర‌ద‌క్షిణాలు చేస్తారు,  పోనీ ఉత్స‌వ విగ్ర‌హం చుట్టూ తిరుగుతారు.  కేసుల్లో వున్న‌వారి ఇంటిచుట్టూ పోలీసులు తిరుగుతారు. అస‌లు ఏ కేసూ లేండానే మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడి ఇంటి చుట్టూ పోలీసుల ప్ర‌ద‌క్షిణని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు నిల‌దీసింది. ఆయ‌న ఇంటికి  వెళు తూండ‌డంతో ఆయ‌న వ్య‌క్తిగ‌త స్నేచ్ఛ‌ను అడ్డుకోవ‌డానికి ఏ చ‌ట్టం అంగీక‌రించ‌ద‌ని తేల్చింది. ఒక‌వేళ ఏద‌యినా కేసు న‌మోదైన ప‌క్షంలో చ‌ట్ట‌నింబంధ‌న‌ల మేర‌కే  పోలీసులు న‌డుచుకోవాల‌ని  కోర్టు స్ప‌ష్టం చేసింది.  అంతేగాక ఆయ‌న‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ‌పోలీసు స్టేష‌న్ల‌లో న‌మోదైన కేసుల వివ‌రాల‌ను కోర్టు ముందుంచాల‌ని హోంశాఖ‌ను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్ర నాథ్‌ రాయ్‌ గురు వారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.   ఎక్క‌డ‌యినా కేసు న‌మోద‌యితే పోలీసులు సంబంధితుల‌కు ఎఫ్ ఐ ఆర్ ఇస్తారు. కానీ  త‌న‌పై న‌మోదైన కేసుల ఎఫ్ ఐఆర్ లు పోలీసులు ఇవ్వ‌డంలే దని టిడిపి నేత, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు  పేర్కొం టూ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇక‌పై త‌న వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను అడ్డుకోకుండా పోలీసుల‌ను నిలువ‌రిం చాల‌నీ, ఎఫ్ ఐ ఆర్ కాపీల‌ను ఇచ్చేలా ఆదే శించాల‌ని టిడీపి మాజీమంత్రి పాత్రుడు అభ్య‌ర్ధించారు. ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది వీవీ స‌తీష్ వాద నలు వినిపించారు.  పిటిష‌న‌ర్ ప్ర‌తిప‌క్షానికి చెందిన నాయ కుడు ఆయ‌న  జూన్ 15 న చోడ‌వ‌రం మినీ మ‌హా నాడులో ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. అప్ప‌టినుంచే ఆయ‌న నివాసం చుట్టూ పోలీసులు ప్ర‌ద‌క్షిణాలు చేస్తున్నారని స‌తీష్ అన్నారు.  న్యాయ పరంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచు కునేందుకు పిటిషనర్‌పై నమోదైన కేసుల ఎఫ్‌ఐఆర్‌లను కూడా పోలీసులు ఇవ్వడం లేదని కోర్టు దృష్టి కి తీసుకొచ్చారు.  ఇదిలా వుండ‌గా,  పిటిషనర్‌పై తాము ఎలాంటి కేసులూ నమోదు చేయ లేదని సీఐడీ తరఫు న్యాయవాది తెలిపారు. అయ్యన్నపై  శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పాడేరు, అల్లూ రు సీతారామరాజు  జిల్లా పరిధిలోని పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు కాలేదని హోంశాఖ తరఫు  ప్రభుత్వ న్యాయవాది  మహే శ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర జిల్లాలోని కేసుల వివరాలు సమర్పించేందుకు  సమయం కోరారు.    న్యాయమూర్తి స్పందిస్తూ,  కేసు నమోదు చేయకుండా పిటిషనర్‌ నివాసం చుట్టూ పోలీసులు ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఇతర కేసుల విషయంలో వారు వెళ్లి ఉంటారని ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. అయ్యన్న తరఫు న్యాయవాది స్పందిస్తూ.. పిటిషనర్‌పై నమోదైన ఇతర ఎఫ్‌ఐఆర్‌ల విష యంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, సెక్షన్‌ 41ఏ  నిబంధనలు పాటించాలని, తదుపరి చర్యలు తీసుకోవద్దని పేర్కొందని గుర్తుచేశారు.  ఆయన్ను అరెస్టు చేస్తారని ప్రముఖ ప్రసార మాధ్యమాల్లో వార్తలు ప్రసారం చేస్తున్నారని తెలిపారు.  ఆ కథనాల ఆధారంగా వ్యాజ్యాలు ఎలా వేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలను  పరిగణ నలోకి తీసుకుని.. చట్ట నిబంధనలకు విరుద్ధంగా పిటిషనర్‌ వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పోలీసులకు స్పష్టం చేశారు.

స్టాలిన్.. ఒకే ఒక్కడేనా?

యువ ముఖ్యమంత్రులు సమాజంలో రుగ్మతలను నిర్మూలించడానికి, అన్యాయాలను అరికట్టడానికి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ జనం మన్ననలు పొందడం వంటి ఘటనలు ఎక్కువగా సినిమాలలోనే చూస్తుంటాం. భరత్ అనే నేను, ఒకే ఒక్కడు ఆ కోవలోనివే. ఆ సినిమాలలో హీరో ముఖ్యమంత్రిగా అద్భుతంగా ప్రజా ప్రయోజనాల కోసం చర్యలు తీసుకుని విలన్ల కుట్రలతో కొలువు కోల్పోతే..జనం మళ్లీ సీఎంగా ఆయననే అందలం ఎక్కిస్తారు. వాస్తవంగా రాజకీయాలలో అటువంటి ఘటనలూ ఉండవూ, అలాంటి డ్రామా పండదు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి తీరు మాత్రం మిగిలిన రాజకీయ నాయకులకు ఒకింత భిన్నంగా ఉంటుంది. సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనంగా కనబడే ఆయన జనం నుంచి వచ్చే ఫిర్యాదులపై క్షణాలలో స్పందిస్తుంటారు. తన విధాన నిర్ణయాలలో విపక్షాలనూ భాగస్వాములను చేస్తుంటారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీలతో అధికారులను గాభరా పెడుతుంటారు. వారికి చెమట్లు పట్టిస్తుంటారు. తాజాగా ఒక అనాథ బాలల పాఠశాల నుంచి ఫిర్యాదు రావడంతో ఆకస్మికంగా ఆ పాఠశాలను సందర్శించారు. సీఎం స్టాలిన్ ఆ పాఠశాలకు వెళ్లే సరికి ఇంకా ఎవరూ విధులకు హాజరు కాలేదు. నిర్ణీత సమయం దాటినా ఎవరూ రాకపోయే సరికి మరో అరగంట పాటు ఆయన వారి కోసం అక్కడే ఎదురు చూశారు. పాఠశాల, హాస్టల్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. అక్కడ ఉన్న విద్యార్థులనుంచి వివరాలు సేకరించారు. టీచర్లు ఎవరూ సమయానికి రారనీ, హాస్టల్ లో సరైన వసతులు లేవనీ, చివరకు భోజనం కూడా సరిగా ఉండదన్న విద్యార్థుల సమాచారంతో ఆఘమేఘాల మీద చర్యలు తీసుకున్నారు. మొత్తం సిబ్బందిని సస్పెండ్ చేసేశారు. ఏదో సినిమాలో సన్నివేశంలా అనిపించినా... వాస్తవంగా స్టాలిన్ చేసింది అదే. ఈ చర్యతో స్టాలిన్ ప్రజల దృష్టిలో హీరో అయిపోయారు. ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరించడాన్ని కొనియాడుతున్నారు. అలాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తారని జనం అంటున్నారు. ఏది ఏమైనా తమిళరాజకీయాలలో స్టాలిన్ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనను ఆదర్శంగా తీసుకుంటే బెటర్ అని జనం అనుకుంటున్నారు.   

మహా పొలిటికల్ థ్రిల్లర్.. ఇంకా వుంది

అనుకోకుండా .. ఒక రోజు .. ఇది ఒక థ్రిల్లర్ సినిమా టైటిల్... సినిమా  అంతా అనూహ్య సంఘటనలో మలుపులు తిరుగుతూ సాగుతుంది. మహారాష్ట్ర రాజకీయాలు .. అంతకంటే  చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతూ వచ్చాయి, చివరకు అనుకోకుండా, అనూహ్యంగా, శివసేన తిరుగబాటు నేత ఏక్‌నాథ్ షిండే మహరాష్ట్ర ముఖ్యంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా ఇంకా అనూహ్యంగా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ .. అయిష్టంగానే అయినా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా ప్రభుత్వంలో చేరడం లేదని స్వయంగా ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఫడ్నవీస్ చివరి క్షణంలో,ఢిల్లీ ఆదేశాల మేరకు ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, మహా డ్రామాను మరో మలుపు తిప్పిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ విధంగా, మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే (ఎంవిఎస్) ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన శివసేన రెబెల్ లీడర్ ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటులో మొదలైన మహా రాజకీయం,అదే షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఒక ముగింపుకు వచ్చింది. అయితే ఇక్కడితో, మహా డ్రామా ముగింపుకు చేరునట్లేనా? అంటే .. లేదు.  అసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది అన్నట్లుగా పరిణామలు  వేగంగా మారుతున్నాయి సంకేతాలు స్పష్టమవుతున్నాయి.   అందరూ అనుకున్నట్లుగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, షిండే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ  స్వీకారం చేసి ఉన్నట్లయితే, నిజంగానే, కథ అక్కడితో ముగిసేది కావచ్చును, కానీ, మహా మహులు, రాజకీయ పండితులకు  కూడా అంతు చిక్కని విధంగా,   అనూహ్య మలుపు తీసుకుని బీజేపీ షిండేను ముఖ్యమంత్రిని చేయడంతో  కథ కొత్త మలుపు తీసుకుంది. అంతే కాదు, చివరి క్షణంలోనూ అనుకో కుండా .. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మహా డ్రామా మరో ట్విస్ట్ తీసుకుంది.  అయితే ఈ అనూహ్య పరిణామాలకు కారణం ఏమిటి? ఇది ఎవరి వ్యూహం? ఎందుకిల జరిగింది? అని ఆలోచిస్తే, ఒకటి కాదు, చాల కారణాలు కనిపిస్తున్నాయి, అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎవరి పాత్ర ఏమిటి అంటే, బీజేపీ జాతీయ నాయకత్వం, అంటే మోడీ, షా, జోడీ, నడ్డా ట్రియో పక్కాగా, స్క్రిప్ట్ దగ్గర పెట్టుకుని ‘స్క్రీన్ ప్లే’ ప్రకారం కథ నడిపించారు. నిజానికి, నెక్స్ట్ సీన్’లో  ఏమి జరుగుతోందో, చివరకు  ఫడ్నవీస్’ కు కూడా తెలియకుండా కథ నడిపించారు. అందుకే, మహామహులు, మహా మేథావులు అనుకున్న రాజకీయ పండితులకు కూడా ఏమి జరుగుతోంది,అనేది జరగవలసింది జరిగే వరకు అంతుచిక్కలేదు. చివరకు షిండే ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా, ఫడ్నవీస్’ కూడా వేదిక ఎక్కుతారా అనేది స్టేజి మీద కుర్చీల లెక్కను బట్టి మీడియా నిర్దారించుకుంది, అంటే ‘ఢిల్లీ ట్రియో’ ఎంత పక్కాగా కథ నడిపించారో అర్థం చేసుకోవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే, ఈ మధ్య కాలంలో ఇంతలా రక్తి కట్టిన పొలిటికల్ డ్రామా చూడలేదనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.  ఇంచుమించుగా పదిరోజులకు పైగా సాగిన మహా డ్రామాలో, బీజేపీ జాతీయ నాయకులు ఎవరూ చివరి వరకు కూడా తెర మీదకు రాలేదు, అసలు, బీజేపీ పాత్రే లేదని, షిండే తిరుగుబాటు శివసేన అంతర్గత వ్యవహారం అనే చెప్పుకుంటూ వచ్చారు. అయిన, ఎవరు నమ్మలేదనుకోండి, అది వేరే విషయం. అయితే,  ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాలనే ఆదేశం మాత్రం, బీజేపీ జాతీయ అద్యక్షు నడ్డా ఆన్ స్క్రీన్ చేశారు. వీడియో విడుదల చేశారు.  ఆ వెంటనే అమిత్ షా, మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు ఫడ్నవీస్ పార్టీ ఆదేశాలను అమలు చేశారని, ఆయన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. అంటే, నో ‘ ముఖ్యమంత్రిగా చేసిన నేను, ఉప ముఖ్యమంత్రిగా చేయడం ఏమిటి? అని అనకుండా  .. అనే అవకాశం ఫడ్నవీస్’కు లేకుండా నడ్డా, షా ఇద్దరూ ఫడ్నవీస్ ఉచ్చులో బిగించారు.  ఇరికించారు, అందుకే ఆయన అయిష్టంగానే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక తప్పలేదు.  అదలా ఉంటే, బీజేపీ జాతీయ నాయకత్వం, అనేక కోణాల్లో ఆలోచించే కథ నడిపించింది అంటున్నారు. ఇందులో ఫస్ట్ స్టెప్, మహా వికాస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చడమే  అయినా, శివసేన ఆక్రమించిన పొలిటికల్ స్పేస్’ను పూర్తిగా కబ్జా చేయడమే అంతిమ లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని అంటున్నారు. మహారాష్ట్రలో శివసేనను దెబ్బకొట్టడం ఎంత ముఖ్యమో.. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఉద్ధవ్ థాక్రే కుటుంబం సమీప భవిష్యత్తులో రాజకీయంగా మళ్లీ కోలుకోకుండా చేయాలన్నదే బీజేపీ అసలు వ్యూహంగా పరిశీలకులు భావిస్తున్నారు.అందులో భాగంగా ముందుగా త్వరలో జగనున్న బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలలో ఉద్ధవ్ సేనను తుడిచేసేందుకే, షిండేను సీఎం చేసిందని అంటున్నారు. అలాగే, ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడం ద్వారా బీజీపీ అధికార దాహంతో వరసపెట్టి ప్రభుత్వాలను కూల్చివేస్తోందని అపవాదు నుంచి తప్పుకునేందుకు కూడా, శివసేన చీలిక వర్గానికి అధికారం ఇచ్చిందని అంటున్నారు. అయితే ఇక్కడితో మహా డ్రామాకు తెర పదినట్లేనా, అంటే, లేదు .. చెప్పాల్సింది చాలా వుంది .. చూడాల్సింది మిగిలే ఉందని అంటున్నారు.

నేరం మాది కాదు ఉడుతది.. విద్యుత్ అధికారుల వినూత్న కథనం

ఆంధ్రప్రదేశ్ లో కనీవినీ ఎరుగని అద్భుతాలు జరుగుతున్నాయి. జగన్ హయాంలో ఎలుకలు, పిచ్చుకలు, తేనెటీగలు, ఆఖరికి ఉడుతలు కూడా రికార్డులు సృష్టించేస్తున్నాయి. జనం ప్రాణాలు తీయడానికి, సమాజంలో ఆశాంతిని నింపడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. చివరికి దొంగలు కూడా అధికార పార్టీ నేతలను కాపాడటానికి సాక్ష్యాలను మాయం చేయడానికి కోర్టుల్లో చోరీలు చేసి మరీ తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇలాంటి సంఘటలను కల్పించి కథలలల్లడంలో ఏపీ అధికారులు ఆరితేరిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారులు కథలల్లడంలో నభూతో.. న భవిష్యత్ అన్నంత సృజనాత్మకత కనబరుస్తున్నారు. సన్నివేశాల కల్పనలో సినీ దర్శకులను మించి పోతున్నారు. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్ వైర్లు తెగిపడి మహిళా కూలీలు మరణించడానికి కారణం ఉడుతలంటూ అధకారులు చెబుతున్నారు. గతంలో నెల్లూరు కోర్టులో దొంగలు పడి మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాల బ్యాగును మాత్రమే చోరీ చేశారని అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ దొంగలు కాకాణికి మంత్రి పదవి వచ్చిన వెంటనే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలను మాత్రమే చోరీ చేశారు. ఇంతకీ ఆ సాక్ష్యాలు ఏమిటంటే..  సోమిరెడ్డికి విదేశాల్లో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని 2017లో కాకాణి ఆరోపించారు. ఇందుకు సంబంధించి కొన్ని రుజువులను కూడా బయటపెట్టారు. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సోమిరెడ్డి.. నకిలీ పత్రాలు సృష్టించి తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొటూ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా కాకాణి బయటపెట్టినవి నకిలీ పత్రాలుగా గుర్తించి చార్జిషీటు దాఖలు చేశారు. అందులో కాకాణినిని ఏ-1 నిందితుడిగా పేర్కొన్నారు. అలాగే, ఆ పత్రాలు సృష్టించిన పసుపులేటి చిరంజీవి అలియాస్ మణిమోహన్‌ను ఎ-2గా పేర్కొన్నారు.  ఈ కేసు నెల్లూరు నాలుగో ఏడీఎం కోర్టులో విచారణ దశలో ఉండగా.. కాకాణికి మంత్రి పదవి వచ్చింది. అదే రోజు  రాత్రి కోర్టులోకి చొరబడిన దొంగలు ఆ కేసుకు సంబంధించి భద్రపరిచిన డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు.   నెల్లూరులోని నాలుగో ఏడీఎం కోర్టులో జరిగిన చోరీ అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.  అప్పుడు పోలీసులు చెప్పిన కథ ఇది. ఇనుము దొంగలు కుక్కుల మొరగడంతో భయపడి కోర్టులోని పరుగెట్టారట.. ఎలాగా వచ్చాం కదా అని పత్రాలు చోరీ చేసి తీసుకెళ్లారట.. ఇదీ కథ..  ఇలాంటి కథలు  అధికారులు బోలెడు చెప్పారు. ఇక తాజాగా అధికారులు చెప్పిన ఉడుత కథ గతంలో చెప్పిన కహానీలన్నిటినీ మించిపోయిన సృజనాత్మకత, కాల్పనికతతో నిండిపోయింది. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్ వైర్లను ఉడుతలు కొరికేయడం వల్లనే అవి తెగి రోడ్డుపై ఆటోలో వెళుతున్న కూలీలపై పడ్డాయట. ఈ ఘటనలో ఆరుగురు మహిళా కూలీలు మరణించారు. ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యమా అయ్యోరామా ఎంత మాత్రం లేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ అధికారుల ఉడుత కథ సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. హైటెన్షన్ వైర్లు తెగిపడి ఆరుగురు మహిళా కూలీలు మరణించిన సంఘటనపై సర్వత్రా విద్యుత్ శాఖపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.  ఏపీ సర్కార్ విద్యుత్ సంస్థలకు నిర్వహణ ఖర్చులకూ నిధులు కేటాయించని కారణంగానే.. నిబంధనల ప్రకారం జరగాల్సిన తనిఖీలు నిలిచిపోయాయనీ, అందువల్లే సత్యసాయి జిల్లాలో హైటెన్షన్ వైర్లు తెగిపడేంతగా బలహీనపడినా ఎవరూ గుర్తించలేదని అంటున్నారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి విద్యుత్ అధికారులు ఉడుత కథలు చెబుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం కట్టలు తెంచుకుంటుండటంతో పారిస్‌లో ఉన్న జగన్ పేరుతో హడావుడిగా ఓ ప్రకటన  విడుదల చేసి మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల నష్టపరిహారం ప్రకటించేసి చేతులు దులిపేసుకోవడానికే ప్రభుత్వం ప్రయత్నించిదే తప్ప,  విద్యుత్ అధికారుల   నిర్లక్ష్యం, నిర్లక్ష్యానికి బాధులపై చర్యల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. వాస్తవానికి ఈ సంఘటన జరగడానికి పూర్తి కారణం ప్రభుత్వమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కనీస అవసరాలకు కూడా నిధులు కేటాయించకుండా విద్యుత్ శాఖ పని తీరును పూర్తిగా నిర్వీర్యం చేశారనీ, ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని విపక్షాలు అంటున్నాయి. అధికారుల చేత ఉడుత కథలు చెప్పించి బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా జగన్ హయాంలో అధికారులు కథలు చెప్పడంలో ఆరితేరిపోయారనడానికి ఇప్పుడు ఉడుత కథ.. అంతకు ముందు కాకాణి ఫైల్స్ సంఘటనలో చోరీ కథ ఇందుకు నిదర్శనాలని అంటున్నారు.

మోడీ పర్యటనకు ముందు తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్!

తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా  జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకునేందుకు సర్వం సన్నద్ధమైన బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ చేరుకోవడానికి రెండు రోజుల ముందు బీజేపీ నుంచి వలసలు ఆ పార్టీ రాష్ట్ర నాయకలకు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా నలుగురు బీజేపీ కార్పొరేటర్లు, తాండూరు మునిసిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్ తో కలిసి గులాబి గూటికి చేరారు.  హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాశ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేశ్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాశ్ గౌడ్ లతో పాటు తాండూరు మునిసినల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజా గౌడ్ లు మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. తాండూరు కౌన్సిలర్ ఆసిఫ్ కూడా టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. వీరందరికీ మంత్రి  కేటీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, పైలెట్ రోహిత్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇటీవలే జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమై ముచ్చటించిన సంగతి తెలిసిందే. అలాంటిది మోడీ మరో రోజులో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద‌రాబాద్ కూడా రానుండగా వీరంతా బీజేపీకి గుడ్ బై చెప్పి కారెక్కడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ రాష్ట్ర నాయకులకు మాత్రం ఇదొక తేరుకోలేని ఎదురుదెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మహా సంక్షోభంలో థ్రిల్లింగ్ క్లైమాక్స్.. సీఎం షిండే.. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్!

మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో సినిమాల‌కు మించి ట్విస్ట్‌లు జ‌రుగుతున్నాయి. తాజాగా మ‌రో కొత్త ట్విస్ట్ తెర‌మీద‌కి వ‌చ్చింది. మహా రాష్ట్రలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అస్థిరతకు మొత్తానికి తెరపడింది. మహారాష్ట్ర గవర్నర్ సమక్షంలో నూతన ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శంభాజీ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఇకపై మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, బీజేపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం పాలన సాగించనుంది. 1980లో శివసేన మాజీ అధ్యక్షుడు ఆనంద్ డిగే ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏక్‌నాథ్ షిండే ఎంట్రీ ఇచ్చారు. శివసేనలో చేరి కార్పొరేటర్‌గా గెలిచారు. మాస్ లీడర్‌గా మంచి ఆదరణ సంపాదించుకున్న డిగే అడుగుజాడల్లో నడిచి ఏక్‌నాథ్ షిండే బలమైన నేతగా ఎదిగారు. 2004, 2009, 2014, 2019లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొప్రి-పచ్‌పఖాడి నియోజకవర్గం నుంచి షిండే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫడ్నవీస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏక్‌నాథ్ షిండేతో పాటు 15మంది రెబెల్ ఎమ్మెల్యేల‌కు గ‌త‌వారం డిప్యూటీ స్పీక‌ర్ న‌ర‌హ‌రి జిర్వాల్ అన ర్హ‌త నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.  ఉద్ధ‌వ్ థాక్రే నాయ‌క‌త్వంలోని  మ‌హా వికాస్ అఘాడీ (ఎం వి ఎ) ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాది దేవ ద‌త్ కామ‌త్ కోర్టులో వాద‌న‌లు వినిపించారు. అప‌రిష్కృతంగా వున్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేవ‌ర‌కూ ఎలాంటి బ‌ల‌ప‌రీక్ష‌లు వుండ‌వ‌ని అన్నారు. కానీ అలాంటి ఆదేశా లు జారీచేయ‌డంవ‌ల్ల అన‌వ‌స‌ర సందిగ్ధ‌త చోటుచేసుకుంటుంద‌ని సుప్రీం కోర్టు పేర్కొ న్న‌ది.  ఏదైనా చట్ట విరుద్ధంగా జరిగితే, మీరు ఎప్పుడైనా ఈ కోర్టును సంప్ర‌దించ‌వచ్చు" అని పేర్కొన్న‌ది. అయితే ఇరువ‌ర్గాలు సుదీర్ఘ పోరాటానికే సిద్ధ‌ప‌డ్డాయి. క‌నుక ఈ వారంలో స‌భ‌లో బ‌లాన్ని నిరూపించుకో వాల‌ని ప్రభుత్వాన్ని మహారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోష్యారి  కోరారు.  అందుకు  షిండే అందుకు సిద్ధ‌ప‌డ్డారు. ముఖ్య‌మంత్రి  ఉద్ధ‌వ్‌కు వ్య‌తిరేకంగా  తిరుగుబాటు ప్ర‌క‌టించిన రెబెల్స్ నేత షిండే త‌మ‌కు సుమారు 50 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు వుంద‌ని, అందులో సుమారు 40 మంది శివ‌సేన‌వారే వున్నార‌న్నారు.  కాగా, షిండే వ‌ర్గంతో క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటు అంశాన్ని బిజెపీ నాయ‌కులు చాలామంది ముంబైలో  దేవేం ద‌ర్ ఫ‌డ్న‌వీస్ నివాసంలో చ‌ర్చించార‌ని  స‌మాచారం. షిండే తో  క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటుకు మాకు ఎలాంటి అభ్యంత‌ర‌మూ లేద‌ని పార్టీ నాయ‌కుడు సుధీర్ ముంగంతివా అన్నారు.   సుప్రీంకోర్టు నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌గానే ఎన్‌సిపి సీనియ‌ర్ నాయ‌కులు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రేతో స‌మావేశ‌మ‌య్యారు. అయితే సభలో బలపరీక్షకు ముందే ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేసేశారు. మరో వైపు శివసేన రెబల్స్ మద్దతుతో బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంతా భావించారు. అయితే చివరి క్షణంలో బీజేపీ వ్యూహం మార్చుకుని షిండే నాయకత్వంలోని రెబల్స కు మద్దతుగా నిలిచింది. తొలుత శివసేన రెబల్స్ నేతృత్వంలోని ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పిన బీజేపీ ఆ తరువాత కొద్ది సేపటికే మనసు మార్చుకుని ప్రభుత్వంలో భాగస్వామిగా చేరింది. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు బీజేపీ అధిష్ఠానం ఆయనను ఒప్పించినట్లు చెబుతున్నారు. 

అ ఇద్దరి మధ్యనే పోటీ.. ప్రతిపక్షాలకు పరీక్ష!

రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం  115 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి.అయితే,, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు. నిజానికి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపు ఎవరిదో ముందుగానే తెలిసి పోయింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో ఏంటో ఇంతో  అనుమానం ఉన్నా, బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ  గిరిజన మహిళ  ద్రౌపది ముర్మును టం అభ్యర్ధిగా ప్రకటించడంతోనే, అధికార కూటమి అభ్యర్ధి గెలుపు విషయంలో ఉన్న కొద్దిపాటి అనుమనాలు కూడా తొలిగి పోయాయి. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాకు దేశ రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉన్నా, ప్రతిపక్ష పార్టీల మధ్య సయోద్యాత లేక పోవడం ఆయనకు, శాపంగా మారిందని, ఆయనను సమర్ధిస్తున్న పార్టీలు, నాయకులే మధ్యలోనే కాడి వదిలేశారు.  ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి ఎంపికే ఓ ప్రహసనంగా సాగింది. చివరకు సిన్హా పేరు ఖరారైనా,  ప్రతిపక్ష పార్టీలలో గట్టిగా అయన వెంట నడిచే పార్టీలు ఏవీ, అంటే, ఏవీ కనిపించడం లేదు. మరోవంక  ఆయన నామినేషన్ విషయంలోనూ పొరపొచ్చాలు బయటకొచ్చాయి.ప్రతిపక్ష  పార్టీల ఉమ్మడి అభ్యర్ధి ఎంపికకు సంబంధించి తొలి అడుగు వేసిన మమతా బెనర్జీ, ఆ తర్వాత ఎందుకో వెనకడుగు వేశారు. నిజానికి యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికయ్యే వరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో, ఆపార్టీ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. అయినా, సిన్హా నామినేషన్ కార్యక్రమానికి ఆమె డుమ్మా కొట్టారు. అసలు, ఆయన్ని రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిన, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి కూడా మమతా దీదీ హాజరు కాలేదు.  అదలా ఉంటే, సిన్హా నామినేషన్ వరకు, కాంగ్రెస్ ఉన్న కూటమితో కలిసేది లేదని, మొత్తం ప్రక్రియకు దూరంగా ఉన్న, తెరాస ఆ తర్వాత  యశ్వత్ సిన్హాకు ఓపెన్ గా మద్దతు ప్రకటించడమే కాకుండా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షడు కేటీఆర్ మందీ మార్బలంతో నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చెట్టాపట్టాలేసుకు తిరిగారు. ఇప్పడు తెలంగాణలో అదొక రాజకీయ దుమారంగా మారింది. అదలా ఉంటే ఇప్పడు యశ్వత్ సిన్హా  ప్రచార యాత్రలో భాగంగా జులై 2 న హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా తెరాస ఆయన తరపున  ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ హాజరు అవుతుందా? లేదా అన్నది రాజకీయ మీమాంసగా మారింది. ఇప్పటికే, కాంగ్రెస్, తెరాస జట్టు కట్టారని  బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది. ఇప్పడు, ఆ బురద కడుక్కోవడంలో  రేవంత్ రెడ్డి సతమత మవుతున్నారు. అదలా ఉంటే, ఇప్పటికే బీజేడీ, జేఎంఎం, బీఎస్పీ ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపతి ముర్ముకు మద్దతు ప్రకటించాయి. ఇప్పడు తాజాగా, జేడీఎస్ కూడా ముర్ముకు మద్దతు ప్రకటించింది. పార్టీ నేత, కర్ణాటక మాజే ముఖ్యమంత్రి కుమార స్వామి ఈ మేరకు ప్రకటన చేశారు. ముర్ము జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడకు ఫోన్ చేసి మద్దతు కోరిన నేపధ్యంలో, ఆమెకు మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని  చెప్పారు. ఈ పరిణామాలు అన్నింటినీ గమనిస్తే, ప్రతిపక్షాల ఐక్యత ఎండమావిగానే ఉందని, ప్రతిపక్షాల ఐక్యతకు వేదికగా అవుతుంది ఆనుకున రాష్ట్రపతి ఎన్నిక రాజకీయం, ప్రతిపక్షాల అనైక్యతకు అద్దం పడుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.  అదలా ఉంటే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం  115 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి.అయితే,, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు.దాఖలైన నామినేషన్ పత్రాలలో  28 నామినేషన్లను వివిధ సాంకేతిక కారణాల వల్ల ప్రాథమిక దశలోనే తిరస్కరించారు. 72 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 87 నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి గురువారం పరిశీలించారు. అందులో నిబంధనల ప్రకారం దాఖలు చేయని 79 నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. రాష్ట్రపతి ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి నామినేషన్‌ను 50 మంది ఓటర్లు ప్రతిపాదించడం, మరో 50 మంది బలపరచడం తప్పనిసరి. ఇంతమంది మద్దతు కూడగట్టడం సామాన్య అభ్యర్థులకు సాధ్యం కాదు కాబట్టి చివరికి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా మాత్రమే బరిలో మిగిలారు.  జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జులై 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం.. ఓటింగ్ నిర్వహిస్తారు. 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.

చీమ‌లా.. మ‌జాకా!

చీమ‌లు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌న‌ప‌డ‌తాయి. ఒక్క‌టిగానో,  గ్రూప్‌గానూ. ఏద‌యినా తిండి ప‌దార్ధం ద‌గ్గ‌రికి మాత్రం అనేక చీమ‌లు పోటీప‌డ‌వు, ఒక వ‌రుస‌గా వెళ్లి దాని మీద ప‌డి తింటాయి. అవి ఏ బెల్లం ముక్కనో లాక్కెళ్లం చూస్తూంటాం. ఏకంగా బాగా బ‌రువ‌యిన వ‌స్తువును లాక్కెళిపోవ‌డం విన్నారా?  ఏకంగా ఓ పెద్ద బంగారు గొలుసునే లాక్కెళ్లిపోయాయి. ఏదో ప‌చ్చ‌గా క‌దులుతోంద‌ని  నందా అనే వ్య‌క్తి  ప‌రిశీల‌న‌గా చూస్తే ఈ సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది.  చీమ‌లు శ్ర‌మ‌జీవ‌నానికి గొప్ప ఉదాహ‌ర‌ణ‌. వాటి  మ‌ధ్య  ఐక్య‌త ప‌టిష్ట‌మైన‌ది.  చాలా దూరం నుంచి ఏద‌న్నా తిండి ప‌దార్ధం తెచ్చుకోవాలంటే అనేక చీమ‌లు క‌లిసిక‌ట్టుగా వెళ్లి తెచ్చుకుంటాయి.  అయితే ఈ బంగారు గొలుసు విష‌యంలో చీమ‌ల్ని దొంగ‌లుగా చిత్రీక‌రించ‌లేం. బ‌హుశా ఆ గొలుసుకి  చ‌క్కెర లాంటి ఏ తీపి ప‌దార్ధమో ప‌ట్టి వుండ‌వ‌చ్చు.  కొండ‌ల ప్రాంతంలో  ఎవ‌రు పారేసుకున్నారో ఏమో మ‌రి. వారి తినే ప‌దార్ధ‌మేదో దానికి అంటిందేమో.. అటుగా వ‌చ్చిన చీమ‌లు ఆ గొలుసును ప‌ట్టి లాక్కెళ్లాయి. అయితే ఇది ఎక్క‌డ జ‌రిగింద‌నేది తెలియ‌లేదు.  ఇది చూసిన అట‌వీశాఖాధికారి సుశాంత్ నందా  వీడియో తీసేరు.  వేలమంది చూసి ఆశ్చ‌ర్య‌పోయారు.  ఒక‌రిద్ద‌రు చీమ‌ల‌కూ దొంగ‌త‌నం అంట‌గ‌ట్టారు. మ‌రికొంద‌రు  ఏదో నెల్లాళ్ల‌పాటు తినే వ‌స్తువ‌నుకుని పాపం క‌ష్ట‌ప‌డి లాక్కెళుతున్నాయోమోన‌ని, గొప్ప టీమ్ వ‌ర్క్‌కి వుదాహ‌ర‌ణా అనీ అన్నారు. ఇంకొంద‌రు  చీమ‌ల రాణికి సైనికులు గొప్ప బ‌హుమ తిగా తీసికెళుతున్నాయోమోన‌నీ అన్నారు. ఎవ‌రేమ‌న్నా, చీమ లకు మ‌న‌లా బంగారం పిచ్చి వుండ‌దుగా! 

టీచ‌ర్‌ని గొర్రె అన్నారు.. ఆమె ఆనందంగా ఏడిచింది!

మ‌న‌లో తొంభై శాతం మందికి విద్యార్ధి ద‌శ‌లో మాథ్స్ టీచ‌ర్ అంటే భ‌యం. క్లాసులో అప్ప‌టిదాకా కాస్తంత స‌ర‌దాగా వున్నపుడు మాథ్స్ టీచ‌ర్ రావ‌డంతో భ‌యం త‌ర‌గ‌తి గ‌దంతా ఆవ‌హిస్తుంది. భ‌యంతో కూడిన గౌర‌వం ప్ర‌ద‌ర్శించ‌డం ప‌రిపాటి. టీచ‌ర్ లెక్క త‌ప్పుచేస్తే తిట్ట‌డం లేదా  కొట్ట‌డం  చాలా స‌హ‌జం. విద్యా ర్ధులు పెద్ద అవ‌మానంగా తీసుకోవ‌డ‌మూ అంతే స‌హ‌జం.  కానీ  ఒక  వూళ్లో 8వ త‌ర‌గ‌తి విద్యార్ధులు టీచ‌ర్ ని  గొర్రె అన్నారు. ఆమెకి వాళ్లు  త‌న‌ని అలా పిల‌వ‌డంలో అస‌లు అర్ధం చాలా రోజుల త‌ర్వాత  తెలిసి ఎంతో ఆనందించింది.  ఇంత‌లా అభిమానించారా అని క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌యింది. త‌న విద్యార్దులు త‌న‌ను గొర్రె అని పిలిచారు. ఆ పిల‌వ‌డంలో అంత‌రార్ధం ఏమిటో తెలీక టీచ‌ర్  చాలా బాధప‌డింది. ఆ మాట‌కు అర్ధ‌మేమిటి, పిల్ల‌లు త‌న‌ను అలా ఎందుకు పిలిచి వుంటారో ఎవ‌రైనా చెప్ప గ‌ల‌రా అని ఏకంగా సోష‌ల్ మీడియా రెడిట్ లో  ఈమ‌ధ్య‌నే  పోస్ట్ చేసింది. అది చ‌దివిన చాలామంది ఆమెను బాధ‌ప‌డ న‌వ‌స‌రం లేద‌ని అన్నారు. కార‌ణం టీచ‌ర్‌ని పిల్ల‌లు  ప్రేమ‌గానే  అలా స‌ర‌దాగా పిలిచా ర‌ని అర్ధంచేసు కోమని  నెటిజ‌న్లు  వివ‌ర‌ణ ఇచ్చారు.  కొంద‌రు విద్యార్ధ‌ల‌కూ మాథ్స్‌ టీచ‌ర్లంటే  గౌర‌వం వుంటుంది. వాళ్లూ స‌ర‌దాగా వారిలో వారు అలా నిక్‌నేమ్‌తో  పిలుచుకుంటూంటారు. బ‌హుశా ఈ టీచ‌ర్ అది వినే వుంటారు. పాపం ఎంతో బాధ‌ప‌డీ వుంటారు.  గౌర‌వం వ్య‌క్తం  చేయ‌డంలో పిల్ల‌ల ప‌ద్ధ‌తి వేరుగా వుంటుంద‌నేది  ఆమె కాస్తంత  ఆల‌స్యంగానే తెలుసు కున్నారు.  త‌న‌ను గొర్రె అని పిల‌వ‌డంలో వారికి త‌న ప‌ట్ల ఎంతో అభిమానం, గౌర‌వం వుంద‌ని అందుకే అలా పిలిచేవార‌ని నెటిజ‌న్ల వివ‌ర‌ణ‌తో ఆమె ఎంతో పొంగిపోయింది. ఈసారి తిట్టుకోలేదు. భ‌డ‌వ‌ల్లారా ఇన్నాళ్లూ ఇంత ప్రేమాభిమానాల‌ను దాచుకున్నార్రా అని ఆనందంతో క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌య్యారు ఆ టీచ‌ర్‌. టీచ‌ర్ల‌కు విద్యార్ధుల నుంచి డ‌బ్బులు అక్క‌ర్లేదు. మంచి విద్యార్ధులు, మంచి వ్య‌క్తులుగా స‌మా జంలో నిల‌వ‌డ‌మే కోరుకుంటారు. ఇంతటి  అభిమానమే ఆశిస్తారు.   

ఎంఐఎం ఎమ్మెల్యేల చేరికతో బీహార్‌లో మ‌ళ్లీ పుంజుకున్న ఆర్‌జేడి

బీహార్‌లో తేజ‌స్వ‌నీ యాద‌వ్  నాయకత్వంలోని  ఆర్‌జెడి మ‌ళ్లీ  అసెంబ్లీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.  నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్జేడీ గూటికి చేరడంతో ఇది సాధ్యమైంది.  ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ సభ్యుల సంఖ్య 80కి చేరింది. అంటేజెడియుతో  క‌లిసి అధికారంలో వున్న బిజెపికి ఉన్న సభ్యుల సంఖ్య కంటే  ఆర్జేడీకి ముగ్గురు ముగ్గురు ఎక్కువ కావ‌డంతో ఆర్‌జెడి మ‌రోసారి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. కాగా 243మంది స‌భ్యుల బీహార్ అసెంబ్లీ లో .జేడీయూ ఎమ్మెల్యేలు 45 మంది వున్నారు.   2020 బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆర్‌జెడి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది.  అయితే  బీజేపీ, జేడీయూ కూటమి కంటే తక్కువ మంది సభ్యులు ఉండటంతో మెజారిటీకి దూరమై విపక్షంగా మిగిలిపోయింది. నితీష్ కుమార్ బిజెపితో కలిసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు, అయితే  అధికార కూటమిలో బీజేపీదే పై చేయిగా నిలవడంతో నితీష్ కుమార్ ఒకింత ఒత్తిడికి లోనవుతూ వచ్చారు. పలు సందర్భాలలో ఆయన కేంద్ర నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకించారు. కులగణన వంటి ప్రధాన సమస్యలపై సీఎం నితీష్ కుమార్ విపక్ష నేత తేజస్వి స్టాండ్ నే తీసుకున్నారు. ఇది జేడీయూ, ఆర్జేడీలు మళ్లీ దగ్గరౌతున్నాయన్న ఊహాగానాలకు తెరతీసింది. అయితే బీజేపీ, జేడీయూ పొత్తు విచ్ఛిన్నం కాకుండా సాగుతూనే వచ్చింది. తాజాగా ఎంఐఎం నుంచి నలుగురు సభ్యులు ఆర్జేడీ గూటికి చేరారు. వారి చేరికను ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ లౌకిక శక్తుల బలోపేతంగా అభివర్ణించడమే కాకుండా ఆ నలుగురినీ తన కారులోనే అసెంబ్లీకి తీసుకు వెళ్లారు. కాగా వీరి చేరికతో ఆర్జేడీ బలం పెరగగా ఎంఐఎం బలం ఐదు నుంచి ఒకటికి పడిపోయింది.   ఆర్‌జెడి గ‌త ఎన్నిక‌ల్లో 75 స్థానాలు గెలుచుకుని ఒంటరిగా విజ‌యం సాధించిన పెద్ద పార్టీగా నిలిచింది.  త‌ర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ఒక స్థానం గెలిచింది. లౌకిక‌శ‌క్తుల‌న్నీ ఏక‌మై ప‌టిష్ట‌ప‌డాల‌ని, బీహార్‌లో బీజెపి ఒంట‌రిగా పోటీచేసి గెలిచే స‌త్తా లేద‌ని తేజ‌స్వీయాద‌వ్ అన్నారు.  పరోక్షంగా ఆయన బీజేపీకి దూరం కావాలని జేడీయూకి సూచించారు.  సైద్ధాంతిక సారూప్యత లేని జేడీయూతో జత కట్టి అధికారంలో భాగస్వామిగా కొనసాగడం ద్వారా బీజేపీ నైతికతకు తిలోదకాలిచ్చేసిందని తేజస్వి విమర్శించారు.

హైదరాబాద్ లో మోడీ రోజు కో చోట బస ఎందుకంటే?

బీజేపీ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ హైదరాబాద్ లో రెండు రోజులు బస చేయనున్న సంగతి తెలసిందే. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మోడీ రెండు రోజులూ  నోవాటెల్ లోనే బస చేయాల్సి ఉంది.  అయితే ఇప్పుడు అది మారింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు తొలి రోజు ఆయన నోవాటెల్ లో బస చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జూన్ 3న ఆయన బస రాజ్ భవన్ కు మారనుంది. మూడో తేదీన సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు మోడీ రాజ్ భవన్ నుంచే నేరుగా చేరుకుంటారు. సభ తరువాత ఆయన తిరిగి రాజ్ భవన్ కు చేరుకుంటారు. ఆ రోజు అక్కడే బస చేసి మరుసటి రోజు అంటే జూలై 4న ఏపీ బయలు దేరి వెళతారు.  భద్రతకు సంబంధించి ఇబ్బందుల కారణంగానే ముందుగా నిర్ణయించిన విధంగా కాకుండా మోడీ బసను 3వ తేదీన రాజ్ భవన్ కు మార్చినట్లు చెబుతున్నారు.   తొలి రోజు అంటే జూలై 2న నోవాటెల్ లోనే కార్యవర్గ సమావేశాలు జరుగుతుండటం వల్ల మోడీ ఆ రోజు అక్కడే బస చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జూలై3 పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. నోవాటెల్ నుంచి రోడ్డు మార్గాన పరేడ్ గ్రౌండ్స్ కు వెళ్లడం వల్ల ట్రాఫిక్ సమా పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆయన బసను రాజ్ బవన్ కు మార్చారు. రాజ్ భవన్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ కు దూరం తక్కువ కావడంతో పెద్ద గా ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు.  అదీ టీఆర్ఎస్ బీజేపీ ఫ్లెక్సీ వార్, టీఆర్ఎస్, బీజేపీ నేతల  పరస్పర విమర్శలతో రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. ఈ నేపథ్యంలో రోడ్డు మార్గంలో మోడీ ఎక్కువ దూరం లేదా ఎక్కువ సేపు ప్రయాణించాల్సిన పరిస్థితి లేకుండా ఉంటే మంచిదని భద్రతాధికారులు సూచించడంతో ఆయన బసను రాజ్ భవన్ కు మార్చినట్లు చెబుతున్నారు. రోడ్డు మార్గంలో ప్రయాణించే సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రోడ్ రోకో వంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందన్న సమాచారం కూడా మోడీ బసను నోవాటెల్ నుంచి రాజ్ భవన్ కు మార్చడానికి కారణమని చెబుతున్నారు. మోడీ మినహా మిగిలిన బీజేపీ అగ్రనేతలంతా రెండు రోజులూ నోవాటెల్ లోనే బస చేస్తారు. 3వ తేదీ సాయంత్రం బహిరంగ సభ అనంతరం మోడీ రాజ్ భవన్ కు చేరుకుని అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయమే ఆయన అక్కడ నుంచి నేరుగా ఏపీ పర్యటనకు వెళతారు

శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో రోడ్డు ప్ర‌మాదంః మృతుల కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా

శ్రీ స‌త్య‌సాయి జిల్లా ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తాడిమర్రి మండ‌లం గుడ్డంప‌ల్లి గ్రామానికి చెందిన  వ్య‌వ సాయ కూలీలు ఆటోలో వెళుతూంటారు. కానీ గురువారం వారు వెళుతోన్న ఆటో  చిల్ల‌కొండ‌య్య‌ప‌ల్లి  స‌మీ పంలో  హైటెన్ష‌న్ వైర్లు త‌గిలి ఆటోలోవున్న అయిదుగురు మ‌ర‌ణించారు. మరో ముగ్గురి పరిస్థితి  విష మంగా ఉంది. వారిని వెంటనే  అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోపై ఉన్న ఇనుప మంచా నికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ  ప్ర‌మాదం లో డ్రైవ‌ర్‌తో పాటు ఎనిమిది మంది  గాయ‌ప‌డ్డారు. కాగా ఈ ప్ర‌మాదంలో  మృతులంతా గుడ్డంప‌ల్లికి చెందిన వారుగా గుర్తించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద హైటెన్షన్ విద్యుత్‌ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. ఆటో ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామ న్నారు. పారిస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటన వివరాలు అధికారులు తెలియజేశారు  ఈ సంఘ‌ట‌న ప‌ట్ల టిడిపి  అధినేత చంద్ర‌బాబు నాయుడు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. కూలీప‌నుల‌కు వెళుతున్న‌వారు  ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోవ‌డం క‌ల‌చివేసింద‌ని ఆయ‌న అన్నారు. ఈ సంఘ‌ట‌న‌కు బాధ్యు లపై క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, బాధిత కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని టీడీపీ అధినేత  ప్ర‌భుత్వా న్ని డిమాండ్ చేశారు.