మెట్రోషెడ్‌పై ఫడ్నవీస్ నిర్ణయానికే షిండే మొగ్గు
posted on Jul 1, 2022 @ 2:36PM
రాజకీయ నాయకులంతా ఒకే తీరుగా వ్యవహరిస్తారు. అధికారంలోకి వచ్చేవరకూ ఒకలా, సీఎం పీఠం ఎక్క గానే వెంటనే అప్పటివరకూ వున్న సీఎం కలగా పేర్కొనే పెద్ద ప్రాజెక్టుకు వంక పెడుతూంటారు. మహా రాష్ట్ర లోనూ అదే జరిగింది. నిన్న సీఎం అయిన షిండే ముంబైలో వివాదాస్పద మెట్రో కార్‌షెడ్ అంశంపై గతంలో ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికే మొగ్గు చూపారు. దీంతో థాక్రే ప్రభుత్వ నిర్ణయాలకు ఎలాంటి ప్రాధాన్యతా లేకుండా పోయింది. ఈ షెడ్డును ముంబైలోని ఆరే కాలనీలో ఏర్పాటుకు వీలు కల్పించమని కోరుతూ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయమని అడ్వకెట్ జనరల్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే ఆదేశించారు.
వాస్తవానికి 2019 లోనే ఈ మెట్రో షెడ్ గురించి ముంబై మెట్రో రైల్ కార్పోరేషన్ ఆరే కాలనీ ప్రాంతంలో చెట్లు కొట్టించేందుకు అనుమతించాలని బృహన్ ముంబై మునిసిపల్ కార్పోరేషన్ (బిఎంసి) ని కోరింది.
ఈ అంశంపై ఇప్పటికే ముంబైలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తింది. ఇది పర్యావరణానన్ని దెబ్బ తీస్తుందని పర్యావరణ వేత్తలు ఆందోళన చేపట్టారు. కానీ ముంబైలో చెట్లతో పచ్చగా నిండిన, చెప్పుకోదగ్గ ప్రాంతంగా ఆరే కాలనీ ప్రసిద్ధం. కానీ అప్పట్లో బిఎంసి అందుకు అంగీకరించడంతో ముంబైలో ఉవ్వె త్తున నిరసనలు వెల్లువెత్తాయి. కానీ మెట్రో కార్‌షెడ్ ఏర్పాటుకు ఎంచుకున్న ఆ ప్రాంతం ఎలాంటి అటవీ భూమి కాదని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అప్పట్లో అన్నారు. పచ్చటి చెట్లతో స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. కానీ ఇప్పుడీ అండర్‌గ్రౌండ్ మెట్రో రావడంతో ఆ స్వచ్ఛతకు అంతగా నష్టంవాటిల్లదనీ అన్నారు. ఆ ఏడాది తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని వదిలిన ఉద్ధవ్ థాక్రే మహా వికాస్ అఖండ పార్టీ అధికారం లోకి వచ్చింది.
కార్యకర్తల నిరసనలను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రభుత్వం మెట్రో కార్ షెడ్‌ను కంజుర్‌మార్గ్‌కు మార్చా లని నిర్ణయించింది. ఆ తర్వాత, కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం 2020లో బాంబే హైకోర్టు కు వెళ్లింది, ఈ భూమి తమ ఉప్పు శాఖకు చెందినదని పేర్కొంది. దీంతో హైకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి ప్రాజెక్టు పనులు కొలిక్కివస్తున్నాయి.
ఆరేలో షెడ్డు నిర్మించాలన్న యోచనను తాము బీజేపీ కూటమి భాగస్వాములుగా ఉన్నప్పుడు కూడా శివసేన వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్ట్‌ను మార్చడంపై బిజెపి విమర్శలపై గత ఏడాది ముఖ్యమంత్రి థాకరే స్పందిస్తూ, త్వరితగతిన చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు వృధాకు దారితీస్తాయని, నిజమైన అభివృద్ధి కాదని అన్నారు. షిండే చర్య తీసుకున్న వెంటనే, ముంబై మెట్రో పనులను తిరిగి ట్రాక్‌లోకి తీసుకువస్తామని బిజెపి నాయకుడు కిరీట్ సోమయ్య ట్వీట్ చేశారు.
ఆరే వద్ద ఉన్న మెట్రోకార్ షెడ్‌ను తిరిగి తీసుకురావాలని షిండే ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముంబై మెట్రో పనులను తిరిగి ట్రాక్ చేస్తుంది అని ఆయన ట్వీట్ చేశారు.