వైసీపీ వినిపిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బాకా!
posted on Jul 1, 2022 @ 2:38PM
అది మేమే చేశాం, ఇది మేమే చేశామని కొందరు గొప్పలు చెప్పుకుంటూంటారు. వారికి అదో ఆనందం. అది లేకపోతే క్షణం వుండలేరు, అదే భజన ఇతరుల నుంచీ కూడా కోరుకుంటూంటారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పోకడ అదే. గత ప్రభుత్వం తెచ్చిన కీర్తిని తన ఖాతాలో వేసుకు నేందుకు జగన్ ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారుతోంది.
కేంద్రం 2019 మార్చి వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకులను ప్రకటించింది. వైసీపీ నేతలు ఇది తమ ప్రభుత్వ ఘనత అంటూ బాకా ఊదుతున్నారు. దేశంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల అంశాలను కేంద్ర పరిశ్రమల శాఖ పర్యవేక్షిస్తోంది. దాని ఆధారంగా అన్ని రాష్ట్రాలకు ర్యాంకులిస్తోంది. ఈ ర్యాంకింగ్ ఆధారంగా పారిశ్రామిక వేత్తలు ఆయా రాష్ట్రాలకు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ. ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ పరిగణించి పారిశ్రామిక వేత్తలు ఈ ర్యాంకింగ్‌ల ద్వారా ముందుకు వస్తారని కేంద్రం భావిస్తోంది.
2014లో ఐక్య ఆంధ్రప్రదేశ్ ఆంధ్రా, తెలంగాణాగా విడిపోయిన తర్వాత ఆంధ్రా లో పెద్ద పరిశ్రమలు లేవు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అందుకు అనుకూల వాతావరణం సృష్టించడానికి ఎంతో కృషి చేశారు. శ్రీసిటీ తిరుపతిలో అనేక పరిశ్రమాలతోపాటు అనంతపురంలో కియా, విశాఖలో ఐటీ వంటి పరిశ్ర మలు తీసుకువచ్చారు. ఆ కృషి ఫలితంగా 2016, 17, 18, 2019 లో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీలో బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ఫ్లాన్ 2020ని విడుదల చేశారు. ఇందులో ఏపీ మొదటి స్థానంలో ఉంది.
కరోనావల్ల రెండేళ్లపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకులు విడుదల కాలేదు. వాటినే ఇప్పుడు కేంద్రం ప్రక టించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇదంతా తమ ప్రతిభా అని సొంత మీడియాలో భారీ ప్రచా రం చేసుకోవడం ప్రారంభించింది. తనవల్ల కాని పనిని జగన్ ప్రభుత్వం తానే చేశానని భజంత్రీలతో ప్రచారం చేయంచుకోవడంలో అర్ధమేమిటి? నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్ర మల మాట సరేసరి! ఉన్న పరిశ్రమలే వెళ్లిపోయాయి. గతంలో వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి తెచ్చు కునేం దుకు తంటాలు పడుతున్నా అవి తిరిగి రావడంలేదు. అసలు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పరిస్థితులు అనుకూలించేలా వున్నదీ లేనిదీ ప్రచారం చేసుకోవడానికి పూనుకుంటేగదా? పక్కనే వున్న తెలంగాణా ఈ పరంగా అద్బుతంగా తన పేరును అంతర్జాతీయవేదికలకు వినిపించేలా ప్రచారం చేసుకుంటోంది. అందుకు ఒక అర్ధం వుంది. ఇటువంటి సమయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ర్యాంక్ ఎలా వచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తు న్నాయి.