ఆనవాయితీకి చెల్లు చీటీ.. సీజే ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్ దూరం

ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య దూరం రోజు రోజుకూ పెరుగుతోందనడానికి మరో తార్కానం, మంగళవారం రాజ్ భవన్ లో తెలంగాణ కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమత్రి కేసీఆర్ దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడమే. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులైన సంగతి విదితమే. ఆయన మంగళవారం అంటే జూన్ 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత గవర్నర్ తమిళి సై రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి  రాజ్ భవన్ నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆహ్వానం అందింది. అయితే ఆయన సీజే ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే విషయంలో సీఎంవో నుంచి ఎటువంటి సమాచారం లేదు. అయితే విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కోబోవడం లేదు.  ఇందుకు ఆయన తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ శాట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు.  అయితే టీశాట్ ప్రారంభం సాకు మాత్రమేనని, ఆయన ఉద్దేశపూర్వకంగానే సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కాగా గతంలో తెలంగాణ తొలి  సీజేగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారాన్ని సంప్రదాయానికి భిన్నంగా రాజ్ భవన్ లాన్స్ లో ఘనంగా నిర్వహించేందుకు చొరవ చూపిన కేసీఆర్ ఇప్పుడు రాజ్ భవన్ లో సీజేగా ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టడమే రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య పెరిగిన అగాధానికి తార్కానంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం కావాలనుకుంటే అంటే లేదా కేసీఆర్ సీజే ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలనుకుంటే టీశాట్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసుకోవడం ప్రభుత్వం చేతిలో పని.. ఒక వేళ వాయిదా వద్దనుకుంటే సమయాన్ని మార్చుకునే వీలు కూడా ఉంటుంది. అయితే కేసీఆర్ ఆ రెండూ చేయకుండా ఏకంగా సీజే ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండటానికే నిర్ణయించుకోవడాన్ని పరిశీలకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ తొలి సీజేగా రాథాకృష్ణన్ ప్రమాణ స్వీకారం సమయంలో అప్పటి గవర్నర్ తో సీఎం కేసీఆర్ కు సత్సంబంధాలు ఉండేవి, దాంతో తొలి సీజే ప్రమాణ స్వీకారోత్సవాన్ని అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో రాజ్ భవన్ లోకి అడుగు పెట్టేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడటం లేదు. అందుకే ఆనవాయితీకి భగం  కలిగినా భే పర్వా అన్నట్లుగా కేసీఆర్ సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉండేందుకే నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మహా రెబెల్స్ పై పిల్.. రాజ్ థాకరేతో షిండే ఫోన్ సంభాషణ!

ఒకే కుటుంబంలా వున్న‌వాళ్లు విడిపోకూడ‌దు. అయినా విడిపోతే వారి దారిలో వారు వుండాలి.  ఇది మామూలు ఇంటి గొడ‌వ‌ల‌యితే అలానే వుంటారు. కానీ రాజ‌కీయాల్లో అది అంత సుల‌భం కానేకాదు. అందునా మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో ఇపుడు త‌లెత్తిన సంక్షోభ స‌మ‌యంలో అస‌లుకే కుద‌ర‌దు.  థాక్రే పాల‌నా విధానం బాగోలేద‌నే షిండే బ‌య‌ట‌ప‌డి, మ‌రికొంద‌రిని త‌న‌వేపు తిప్పుకుని తిరుగుబాటు ప్ర‌క టించి నానా ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్రంలో, పార్టీలో నానా గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. ప్రభుత్వం లో ఇలా గంద‌ర‌గోళం సృష్టించి పాల‌న‌కు అడ్డుప‌డిన రెబెల్స్ మీద ఆగ్ర‌హించి జ‌స్ట్  ఏడుగురు పౌరులు ముంబై హైకోర్టులో పిల్ వేసేరు.  ఏదో అలిగి వెళ్ల‌వ‌చ్చుగాని ఇలా రాష్ట్ర‌ప‌రిస్థితులు, ప్ర‌భుత్వం న‌డ‌వ కుండా చేయ‌డం మంచిదికాద‌ని, థాక్రేతో సంప్ర‌దించి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాల‌ని  మ‌ళ్లీ అన్న ద‌మ్ముల్లా క‌లిసిపోవాల‌ని, తిరిగి వ‌చ్చి  ప్ర‌భుత్వ‌, పార్టీ  కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని కోర్టు  ద్వారా  ఆ ఏడు గురు త‌మ పిల్ లో కోరారు. ప్ర‌జ‌లు ఇంత అమాయ‌కంగానే వుంటారు. ఎక్క‌డ‌యినా.  కానీ అధికారం లో వున్నవారు, తిరుగుబాటు బావుటా ఎత్తినవారు అంత అమాయ కులు కాద‌న్న‌ది ఈస‌రికే మ‌రాఠా  వారికి తెలిసే వుండాలి. అయినా ఏదో మ‌నోళ్లు మ‌న మాట ఇన‌క‌పోతారా అన్న అభిప్రాయంతో పిల్ వేసి వుంటా ర‌నే అనుకోవాలి.  స‌మాజ సేవ‌లో త‌రించాల్సిన‌వారు ఈ విధంగా రాజ్య‌ధికారం కోసం విభేదించి ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకించి దూరంగావ‌డం, సంక్షోభం సృష్టించ‌డం స్వార్ధ‌ప్ర‌యోజ‌న‌మే అవుతుంద‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. అంతేగాక ప్ర‌స్తుతం అనేక‌మంది మంత్రులు విడిపోవ‌డంతో శివ‌సేన నాయ‌క‌త్వంలోని ఎం.వి.ఏ  ప్ర‌భు త్వం ఏ విధంగా స‌వ్యంగా పాల‌న సాగిస్తుందో, అందుకు ఎలాంటి వ్యూహాలు వున్న‌దీ స్ప‌ష్టం చేయా ల‌ని పిటిష‌న్‌లో ప్ర‌శ్నించారు.   ఏక్‌నాథ్ షిండే గ‌త వారం రోజులుగా శివ‌సేనా ప్ర‌భుత్వానికి ఎదురుతిరిగిన ఇత‌ర రెబెలియ‌న్స్‌తో గౌహ‌తీ లో వున్నారు. వీరే కాదు మ‌రో 50 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కూడా వుంద‌ని, మ‌రీ ముఖ్యంగా వారిలో 40 మంది శివ‌సేన‌వారే వారే వున్నార‌ని షిండే ధీమా వ్య‌క్తంచేశారు.  కాగా త‌న‌ను త‌న‌తో పాటు మ‌రో 15 మంది ఇత‌ర రెబెల్ లెజిస్లేట‌ర్ల‌పై అన‌ర్హ‌త వేటు వేస్తూ డిప్యూటీ స్పీక‌ర్ న‌ర‌హ‌రి జిర్వాల్ నోటీసు ఇవ్వ‌డం పై  షిండే సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. డిప్యూటీ స్పీక‌ర్ నోటీసు అనైతిక‌మ‌ని, రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని షిండే ఆరోపించారు.  బావ కొంప‌కూల్చి  ఆయ‌న త‌మ్ముడిని  బాగున్నారా అని అడిగింద‌ట వెన‌క‌టి  ఒకామె. అలానే వుంది షిండే వ్య‌వ‌హారం. ఆదివారం షిండే  ఉద్ధ‌వ్ థాక్రే స‌మీప బంధువు రాజ్ థాక్రేతో రెండుసార్లు ఫోన్ చేసి మాట్లాడార‌ని మ‌హా రాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన (ఎం ఎన్ ఎస్‌) పార్టీ నాయ‌కుడు ఒక‌రు తెలియ‌జేశారు. ప్ర‌స్తుత మ‌హారాష్ట్ర రాజ కీయ ప‌రిస్థితులు ఎలా వున్నాయి, రాజ్ ఆరోగ్యం ఎలా వుంద‌ని అడిగి తెలుసుకున్నార‌ట‌. ఎం ఎన్ ఎస్ పార్టీ అధినేత రాజ్ థాక్రే ఆదివార‌మే ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ సంగ‌తి తెలిసి షిండే  ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగిన‌ట్టు వార్త‌. శివ‌సేన నుంచి 2006లో విడిపోయిన రాజ్ ఎంఎన్ ఎస్ పేర సొంత దుకాణం పెట్టారు.  కాగా శివ‌సేన కి చెందిన 38 ఎమ్మ‌ల్యేల మ‌ద్ద‌తు త‌న‌కు వుంద‌ని అసెం బ్లీలో అస‌లు సేన గ్రూప్‌గా గెల‌వ‌డానికి వారి మ‌ద్ద‌తు స‌రిపోతుంద‌ని షిండే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. 

జగన్ రెడ్డి రక్షణకు కమల దళం కుట్రలు

ఆంధ్ర ప్రదేశ్’లో బీజేపీకి ఉన్న బలమేమిటో,బలహీనతలు ఏమిటో, అందిరికీ తెలిసిందే. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, కమల దళం రాష్ట్రంలో రాజకీయాలను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు సాగిస్తోందని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  ఉదాహణకు ఆత్మకూరు ఉప ఎన్నిక విషయాన్నే తీసుకుంటే, బీజేపీకి డిపాజిట్  రాలేదు, కానీ, గతంతో పోల్చుకుంటే, ఉప ఎన్నికల్లో కొంచే ఎక్కువ ఓట్లు అయితే వచ్చాయి. అయితే, ఆ మాత్రంగా ఓట్లు వచ్చాయంటే, అందుకు కారణం ఏమిటో అందరికీ తెలిసిందే. అదేమీ రహస్యం కాదు ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అన్నట్లుగా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేక పోవడం వలన, బీజేపీ అభ్యర్ధికి 14 శాతం ( 19 వేల చిల్లర ఓట్లు) పైగా ఓట్లు వచ్చాయి. అయితే అది బలుపు కాదు వాపు మాత్రమే. బీజేపీ నాయకులూ మురిసి  పోయేంత గొప్ప ముందడుగు అయితే అసలే కాదు.  అందుకే,  పార్టీలో కొందరు నాయకులు వాపును చూసి బలుపని సంబర పడుతున్నా పార్టీ పుట్టు పూర్వోత్తరాలు తెలిసిన సీనియర్ నాయకులు మాత్రం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏమిటో, పార్టీ బలమేమిటో, బలహీనతలు  ఏమిటో, ఎవరికి తెలిసినా తెలియక పోయినా, పార్టీ జాతీయ నాయకత్వానికి మాత్రం బాగా తెలుసునని అంటున్నారు.   నిజం, రెండు పార్టీలు వ్యవస్థ  బలంగా బలంగా స్థిర పడిన రాష్ట్రంలో, మరో పార్టీ కాలు పెట్టి నిలదొక్కుకోవడం అంత ఈజీ వ్యవహారం కాదు. అందుకే, కాంగ్రెస్, టీడీపీ బలంగా ఉన్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ బీజేపే ఒంటరి పోరాటం చేయలేక పోయింది. బీజేపే జాతీయ నాయకత్వం కూడా రాష్ట్రంపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. తెలుగు దేశం పంచన తలదాచుకుంది. అక్కడొకటి ఇక్కడ రెండు అన్నట్లుగా,  నాలుగు స్థానాలు గెలుచుకుని ఉనికిని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేస్తూ వచ్చింది.   అదే క్రమమలో రాష్ట్ర విభజన తర్వాత కూడా 2014 ఎన్నికలలోనూ తెలుగు దేశంతో పొత్తును కొనసాగించింది. ఏపీ నుంచి నాలుగు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా రెండు మంత్రి పదవులు దక్కించుకుని. అలాగే, కేంద్రంలో ప్రధాని మోడీ మంత్రి  వర్గంలో తెలుగు దేశం పార్టీ  చేరింది. అయితే, 2018లో  ఉభయ పార్టీల మధ్య ‘ప్రత్యేక హోదా’ విషయంలో పేచీ రావడంతో, పొత్తు చెడింది. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అనేది చరిత్ర. 2019 ఎన్నికల్లో కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ, రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ, అధికారం కోల్పోయింది. ఇక ఇప్పడు ప్రస్తుతానికి వస్తే, జాతీయ స్థాయిలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన బీజేపీ  పంధా మార్చింది. ఉత్తరాది, దక్షిణాది అని  లేకుండా విస్తరణ యాత్రను ప్రారంభించింది.  రెండు పార్టీల వ్యవస్థ బలంగా ఉన్న రాష్ట్రాలలో అంచెలంచెలుగా అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగానే, ఏపీ మీద కూడా కమల దళం కన్నేసింది. ఈశాన్య రాష్ట్రాలలో  సక్సెస్ అయిన ఫార్ములాను ఎపీలోనూ ఇంప్లిమెంట్’ చేసే ప్రయత్నం సాగిస్తోంది. అధికార వైసేపీతో అంటకాగుతూ, తెలుగు దేశం పార్టీ టార్గెట్’ గా రాజకీయం చేస్తోంది. నిజానికి,రాష్ట్రంలో ఒంటరిగా పోటీచేస్తే. ఆ పార్టీ పరిస్థితి ఏమిటో, 2019 ఎన్నికల్లోనే తెలిపోయింది. నోటా’కంటే తక్కువగా ఒక శాతానికి కొంచెం అటూ ఇటుగా ఓట్లు పోలయ్యాయి.   అందుకే ఇప్పుదు బీజేపీ కొత్త  ఎత్తు వేసింది, వైసీపీ కి అండగా నిలిచి తెలుగు దేశం పార్టీని మరో మారు ఓడించేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే, వైసీపే వ్యతిరేక ఓటును చెల్చేందుకు, కుటిల యత్నాలు సాగిస్తింది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యంగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పావుగా ఉపయోగించుకుంటోంది. నిజానికి పవన్ కళ్యాణ్’ వైసేపీ ప్రభుత్వ దుర్మార్గ, దుష్ట పాలన నుంచి రాష్ట్రాన్ని  రక్షించే, లక్ష్యంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీచేయాలని ప్రతిపాదించారు. అయితే, ఒకటి  తర్వాత ఒకటిగా ప్రాంతీయ పార్టీలను దిగమింగే యోచనతో ముందుకు సాగుతున్న బీజేపీ, తెలుగు దేశం, జనసేన పొత్తుకు అడ్డుపుల్లలు వేస్తోంది.మోకాలడ్డుతోంది. ఆయనలో అనవసరపు ఆశలు రేకెత్తించి, టీడీపీకు దూరం చేసే ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవంక ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగింఛి, సామాజిక సమీకరణలను తారుమారు చేసే కుట్రకు పథకం రచిస్తున్నట్లు, తెలుస్తోంది.  అయితే, ఆంధ్ర ప్రదేశ్’లో కమల దళం వ్యూహాలు ఫలిస్తాయా అంటే, అది అంత ఈజీ కాదని,, సామాన్యుల నుంచి విశ్లేషకుల వరకు అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా  ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంటున్న నేపధ్యంలో, ఒక్కసారి మోసపోయిన ప్రజలు మరొక్కసారి మోస పోయేందుకు సిద్ధంగా లేరని రాజకీయ పండితులు అంటున్నారు. అదే విధంగా రాష్ట్రానికి ఏ మేలు చేయని బీజేపీతో చేతులు కలపడం వలన. ఆపార్టీ అనుసరించే  హిందూమతోన్మాదం విధానాల వలన జనసేన కూడా మూల్యం చెల్లించవలసి వస్తుందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  నిజానికి, పొత్తులు, ఎత్తులు, రాజకీయ,సామాజిక సమీకరణలు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రజానీకం మాత్రం వైసీపీ వినాశకర విధానాలనుంచి, రాష్ట్రాన్ని రక్షించే సామర్ధ్యం ఒక చంద్రబాబుకు మాత్రమే ఉందని, వైసీపీకి టీడీపీ తప్ప మరో ప్రత్యాన్మాయం అయ్యేపని కాదని నిర్ణయానికి వచ్చారని, విశ్లేషకులు అంటున్నారు.

బిజెపీకి మిగిలింది మౌత్ టాకే!

ఎవ‌ర‌యినా పెళ్లికో, మ‌రేద‌యినా శుభ‌కార్యానికో వూళ్లో అంద‌రినీ ఆహ్వానిస్తారు. అందుకు చేయాల్సిన అన్ని ఏర్పాట్లూ చేస్తారు.  తెలిసి తెలిసి ప‌డ‌ని వారిని,  తిట్టుకునేవారిని  ఆహ్వానిస్తారా?  అస‌లు వారికి ఇంటివేపు వ‌చ్చే అవ‌కాశం కూడా ఇవ్వ‌రేమో!  ప్ర‌స్తుతం తెలంగాణ అధికార పార్టీ టిఆర్ ఎస్ ఇలాంటి ప‌నిలోనే నిమ‌గ్న‌మ‌యింది.  త‌మ పాల‌నను, త‌మ నాయ‌కుల‌ను దాదాపు ప్ర‌తీ వేదిక  మీదా తిడుతూ, రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు, కామెంట్లు చేస్తున్న బిజెపీ వారిని మాత్రం వూరికే వ‌దిలేస్తుందా? స‌రిగ్గా వారి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు నిర్వ‌హించాల్సిన స‌మ‌యానికి ఫ్లెక్సీల‌తో, బ్యాన‌ర్ల‌తో ఏమీ తోచ‌ని స్థితి క‌ల్పించింది. పాత‌ రోజుల్లో ప‌డ‌ని పార్టీవారి నాయ‌కులు, ప్ర‌చార‌క‌ర్త‌ల ఇళ్ల‌మీద పిడ‌క‌లు వేయ‌డం, బొగ్గుతో  నినాదాలు రాయ‌డం బాగా పోటా పోటీగా సాగేది. అప్ప‌ట్లో అదో యుద్ధం. ఇప్పుడు అత్యాధునికంగా ఫ్లెక్సీ ల‌తో దాదాపు యుద్ధ‌ ప్ర‌క‌ట‌నే కావిస్తున్నారు.  టిఆర్ ఎస్ పాల‌న‌లో రాష్ట్రం దారుణంగా త‌యార‌యింద‌ని, కుటుంబ పాల‌న‌లో ప్ర‌జ‌లు ముఖ్యంగా రైతాంగం నానా  అవ‌స్థ‌లూ ప‌డుతున్నార‌ని తీవ్ర‌స్థాయిలో దాడుల‌కు దిగింది తెలంగాణా బిజెపీ. అవ కాశం దొరికిన‌ చోట‌ల్లా టిఆర్ ఎస్ నాయ‌కుల మీద వ్య‌తిరేక‌త‌ను వెళ్ల‌గ‌క్కుతున్నారు, బీజేపీ నేతలు. కేంద్రం నుంచి ఎంతో స‌హాయం అందుతున్నా పైసా అంద‌లేద‌ని,  రాష్ట్రం మీద సీత క‌న్నువేశార‌ని బిజెపిని దుమ్మెత్తి పోస్తున్న టిఆర్ ఎస్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పీఠం దింపేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో  బిజెపి జాతీయ నాయ‌కుల సైతం రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ ఇక్క‌డి పాల‌నా లోపాల‌ను, ప్ర‌జ‌ల్ని కేసీఆర్ కుటుంబం మోసం చేస్తోం ద‌ని ఎడ‌ తెగ‌ని ప్ర‌చారం చేస్తున్నారు. బండి లాంటి బిజెపీ నాయ‌కుల‌కు టిఆర్ ఎస్ పై వాగ్ధాటితో దాడి చేయ‌డం త‌ప్ప వేరే ప‌నిలేద‌ని టిఆర్ ఎస్ తిడుతోంది. రాష్ట్రం నుంచీ కేంద్రం ఎంతో పొందుతూ రాష్ట్రానికి మొండిచేయి చూప‌డం కేవ‌లం అధికార కాంక్ష‌తో వ్య‌వ‌హ‌రించడమేననీ, ఈ  తీరును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని హెచ్చ‌రిస్తున్నారు. బిజెపీ, టీఆర్ ఎస్ ల మ‌ధ్య ఈ యుద్ధాన్ని త‌మ‌కు అనుకూలం చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌తోనే  ఇక్క‌డ వ‌చ్చే నెల 3, 4 తేదీల్లో  బిజెపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాన్ని నిర్వహించ త‌ల‌పెట్టారు.  అస‌లు రాష్ట్రం గురించి ప‌ట్టించుకోనివారు, త‌మ అభ్య‌ర్ధ‌న‌ల‌ను తిర‌స్క‌రిస్తున్న‌వారికి ఇక్క‌డ అంత సుఖంగా ఏద‌న్నా కార్య‌క్ర‌మం నిర్వ‌హించుకోను ఎలా వీలుంటుంది? మెట్టినింట కూతురు పడుతున్న  ఆరళ్ల‌ను విన్న త‌ల్లి వారిని ఎలా గౌర‌విస్తుంది?  బిజెపీ ఇక్క‌డ స‌మావేశాలు నిర్వ‌హించాల‌నుకోవ‌డం పెద్ద ర‌హ‌స్య మేమీ లేదు. ఇలాంటి పార్టీ స‌మావేశాలు కేవ‌లం ఇక్క‌డి అధికార పార్టీని, సీఎంను తిట్ట‌డానికి, బిజెపి చేస్తున్న సాయం వృధా చేస్తున్న‌ద‌ని భారీ ప్ర‌చారం చేసి ప్ర‌జ‌ల‌కు టిఆర్ ఎస్ ప‌ట్ల విముఖ‌త వ‌చ్చేలా చేయ‌డ‌మే క‌మ‌ల‌నాధుల ల‌క్ష్యం. అయితే ఈ స‌మావేశాల ల‌క్ష్యం ఏమాత్రం స‌ఫ‌ల‌మ‌వుతుంద‌న్న‌ది ప్ర‌జ‌ల స్పంద‌నే తెలియ‌జేస్తుంది. ప్ర‌స్తుతం స‌మావేశాల నిర్వ‌హ‌ణ గురించి భారీ ప్ర‌చారం చేసుకోవా ల‌నుకున్న పార్టీ వ‌ర్గాల‌కు  టిఆర్ ఎస్ శ్రేణులు  ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల‌కే  జానెడు స్థ‌లం ఏ గోడమీదా మిగల్చలేదు. ఆఖరికి మెట్రో స్తంభాలను కూడా తెరాస ప్రకటనలతో నింపేశాయి. తెలంగాణ‌లో టిఆర్ ఎస్‌, బిజెపీ మ‌ధ్య పోరు తీవ్రతను ఇది   స్ప‌ష్టం చేస్తోంది.  ఇపుడు మ‌రి వ్య‌తిరేక‌త‌ను త‌మ వాగ్ధాటితో ప్ర‌చారం చేసినంత‌గా బిజెపీ వ‌ర్గీయులు త‌మ స‌మావేశం గురించి ప్ర‌చారం ఎలా చేయ‌గ‌ల‌రో చూడాలి.  ఎందుకంటే  ఇక సిటీలో బీజేపీకి ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్స్ కు  తావు లేకుండా చేయడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది.  ఎల్ అండ్ టి, అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ‌లతో  టీఆర్ఎస్ వారం రోజులు ప్రి ప్లాన్డ్‌గా ఒప్పందం కుదుర్చుకుంది. ఇక 2300 లకు పైగా మెట్రో పిల్లర్లపై ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రచారం నిర్వహిస్తోంది. సిటీలోని వెయ్యి బస్టాప్‌లలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. మొత్తానికి బీజేపీ తేరుకునే లోగా టీఆర్ఎస్ పని చక్కబెట్టేసింది. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందో వేచి చూడాలి.

అగ్నిప‌థ్ అమ‌లుకు కేంద్రానికి అంత తొందరేల?

అగ్నిపథ్ పథకానికి దాని కారణాలు ఉన్నాయి, అయితే ప్రభుత్వం దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించాల్సింది. ఇందుకు హ‌డా వుడి ప‌డి అంద‌ర్నీ గంద‌ర‌గోళానికి, వ్య‌తిరేక‌త‌కు గుర‌య్యే ప‌రిస్థితులు కొని తెచ్చుకుందేమో?  కొన్ని ప‌థ‌కాలు, నియ‌మ నిబం ధ‌న‌లు బాగానే వుండ‌వ‌చ్చు. వాటిని అమ‌లు చేయ‌డంలో మంచే జ‌ర‌గ‌వ‌చ్చు కానీ దాన్ని ప్ర‌జ‌లు, నిరుద్యోగులు ముఖ్యంగా వెంట‌నే అర్ధంచేసుకుంట‌ర‌నుకోవ‌డం తొంద‌ర‌పాటు చ‌ర్యే అవుతుంది. ఆర్మీ వుద్యోగాల‌కు ప్ర‌య‌త్నించే యువ‌త‌కు ఆ మాత్రం ఆలోచ‌న వుండ‌దా అని మోదీ ప్ర‌భుత్వం హ‌ఠాత్తుగానే ఈ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. కానీ బిజెపి స‌ర్కార్ త‌ల‌చింది  దేశంలో ఆ వుద్యోగార్ధం తీవ్ర ప్ర‌య‌త్నాల్లో వున్న యువ‌త మ‌రోలా అర్ధంచేసుకుంది. ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంది. ఇది దేశ వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టించ‌డం చూస్తున్నాం. కానీ మోదీ ప్ర‌భుత్వం మాత్రం   త‌మ‌ది ముమ్మాటికి స‌ర‌యిన నిర్ణ‌య‌మే అంటోంది.  గ‌తంలో వున్న‌ టూర్ ఆఫ్ డ్యూటీని అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌గా మార్చారు, జూన్ 14న సర్వీస్ చీఫ్‌లతో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ స్కీమ్ కింద, రిక్రూట్‌మెంట్ నాలుగు సంవత్సరాల కాలానికి చేపట్తుంది, ఈ పోస్ట్‌లో అందరూ తొలగించబడతారు, దాన్నుంచీ 25 శాతం మందిని ఈసారి శాశ్వత ప్రాతి పదికన తిరిగి తీసు కోవచ్చు. ఇది రక్షణ మంత్రిత్వ శాఖలోని సైనిక వ్యవహారాల విభాగం యొక్క ఆలోచన అని కొందరు పేర్కొంటుండగా, ఇది ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా రూపొందించబడింది, ప్రణాళిక చేయబడింది మరియు ముందుకు వచ్చింది. బలగాలు, గత కొన్ని నెలలుగా, తమపై విధించిన షరతులు మరియు షరతులను ఎదుర్కోవడానికి పోరాడుతున్నాయి. అంతిమంగా, ఒక రాజీ కుదిరింది మరియు పథకం ఇప్పుడు అమలులో ఉంది. దళాలపై ఒత్తిడి పెంచడానికి, కోవిడ్-19 సాకుతో ప్రభుత్వం గత రెండేళ్లుగా రిక్రూట్‌మెంట్‌ను నిషేధించింది, అయితే సంవత్సరానికి సుమారు 60,000 మంది సిబ్బంది పదవీ విరమణలు నిరాటంకంగా కొనసాగాయి. రిక్రూట్‌మెంట్‌ను ఆపడం అనేది బలగాల ప్రమేయం లేకుండా వారి బలాన్ని తగ్గించడం, అలాగే రిక్రూట్‌మెంట్‌ను తిరిగి ప్రారంభించడానికి అగ్నిపథ్ స్కీమ్‌ను అంగీకరించేలా బ్లాక్‌మెయిల్ చేయడం కూడా ఒక పద్ధతి. చివరకు దానిని ప్రధానమంత్రి సమర్పించి ఆమోదించారని, దానిని సేవల గొంతులోకి ఎవరు నెట్టారని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశం అనేది ఒక వ్యక్తి, నాయకుడి దృష్టి కారణంగా మాత్రమే సాధ్యమయ్యే విపత్తుగా పేర్కొనబడిన ఒక కాన్సె ప్ట్‌ను విక్రయించడానికి జరిగిన సంఘటనగా కనిపించింది. సైన్యం మాత్రమే 2019-20లో 80,000 మందిని , 2018-19లో 53,000 మందిని రిక్రూట్ చేసుకుంది మరియు వీరు 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పెన్షన్ పొంద గలరు. వార్షిక తీసుకోవడం సగటులు 50,000 కంటే ఎక్కువ. 40,000-50,000 మందిని రిక్రూట్ చేయాల్సిన అగ్నివీర్‌ల సంఖ్య కేవలం నాలుగేళ్ల‌కు మాత్రమే ఉంటుంది. ఉద్యోగ ఖాళీల పెంపునా లేక తగ్గింపునా? రిక్రూట్‌మెంట్‌లో అందరికీ ప్రవేశం ఉంటుందా లేదా ప్రధానంగా ఐటీఐ అర్హత ఉన్నవారా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేట ప్పుడు గందరగోళం నెలకొంది. సర్వీస్‌లో ఉన్నప్పుడు ఫ్యాన్సీ పేర్లు లేదా విభిన్నమైన పెరుగుద‌ల‌ను ఇవ్వడం వల్ల యువత నాలుగు సంవత్సరాల ఆనందకరమైన జీవితం తర్వాత ఎదుర్కొనే అనిశ్చితిని మార్చదు. ప్రభుత్వ ఉద్దేశం, ఇటీవలి సంవత్సరాలలో, సాయుధ దళాల పెరుగుతున్న పెన్షన్ మరియు జీతాల బడ్జెట్‌ను తగ్గించడం. ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల మాదిరిగా కాకుండా, 2004 నుండి ఉద్యోగులందరూ జాతీయ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నారు మరియు కొంత భాగాన్ని వారి స్వంత పెన్షన్‌ల కోసం చెల్లిస్తున్నారు, బలగాలు ఇప్పటి వరకు కొనసాగాయి. కారణం ఏమిటంటే, సాయుధ దళాల సభ్యులు 60 సంవత్సరాల వరకు సేవలందించే వారి సహచరులతో పోలిస్తే, ఎక్కువగా 40 ఏళ్లలోపు ముందుగానే పదవీ విరమణ చేస్తారు. ఇది బలగాల యొక్క యవ్వన ప్రొఫైల్‌ను నిర్ధారించడం. ఇది భారతదేశానికి ప్రత్యేకమైనది కాదు, ప్రపంచ ప్రమాణం. వ్యక్తి తన భవిష్యత్ ఉపాధిలో సహాయం చేయడంపై ప్రభుత్వం పెద్ద వాదనలు చేసింది. 15 ఏళ్ల తర్వాత పదవీ విరమణ చేసిన వారికి సహాయం చేయడంలో ఇది ఇప్పటివరకు విఫలమైంది. తమకు కేటాయించిన కోటాలను ఒక్క మంత్రిత్వ శాఖ గానీ, రాష్ట్రం గానీ తీసుకోలేదు. గ్రహించిన సంఖ్యలపై ఏ ఏజెన్సీకి ఎవరూ జవాబుదారీగా ఉండరు. సీఏపీఎఫ్ లు, రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలు అగ్నివీర్‌లకు అనువైన మార్గాలు, అయితే హోం మంత్రిత్వ శాఖ వాటిని సీఏపీఎఫ్ లలోకి అంగీకరించడానికి నిరాక  రించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానం సూచనల ఆధారంగా కేటాయించిన కోటాలో రిక్రూట్‌మెంట్ చేస్తాయి, వీటిని సైన్యం చేయదు. వారు వారి స్వంత ప్రమాణాలను కలిగి ఉన్నారు, ఇది ఆర్మీకి భిన్నంగా ఉంటుంది. వ్యక్తి తనను తాను రక్షించు కోవలసి ఉంటుంది. ఆయుధాన్ని నిర్వహించడం, యూనిఫాం ధరించడం అంటే అతను ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో సెక్యూ రిటీ గార్డుగా ఉండగలడని సూచిస్తుంది, ఇది చాలా మంది అనుభవజ్ఞులు చేస్తున్నది. సేవ ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్ బ‌య‌ట‌ ఎటువంటి విలువను కలిగి ఉండదు. అందువల్ల, అటువంటి పథకాన్ని అమలు చేయడానికి ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఇది ఏదో తప్పిపోయినట్లు కనిపిస్తుంది. చివరగా, కొన్ని సంవత్సరాల తర్వాత, న్యాయస్థానాలు ప్రభుత్వ ఆదేశాలను తిప్పికొడుతూ, వాటిని శాశ్వతంగా విలీనం చేయా లని లేదా పూర్తి పదవీకాలాన్ని అందజేసే వారికి వచ్చే అన్ని ప్రయోజనాలను అందించాలని ఆదేశాలు జారీ చేస్తాయి. మహిళా అధికారులు మరియు షార్ట్ సర్వీస్ అధికారులతో అలా చేసింది. తరువాత ఏమిటి? ఇది గల్లంతైన మరో పథకం అవుతుందా? సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి. ఆదర్శవంతంగా, ఒక పైలట్ ప్రాజెక్ట్ ఉండాలి, అది అంచనా వేయబడి, ఆపై బోర్డు అంతటా అమలు చేయబడి ఉండవచ్చు. అయితే, బదులుగా అగ్నిపథ్ దళాల గొంతులోకి నెట్టబడింది. సాయుధ బల గాలు, అగ్నివీరులు దాని నుండి ప్రయోజనం పొందగలరా అనేది కాలమే నిర్ణయిస్తుంది.  జాతీయ భద్రతపై చేసే ఖర్చు పెట్టుబడి అని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, వారు చెప్పినట్లు ప్రభుత్వ ఖజానాకు గండికొట్ట‌డం కాదు.

ప్రపంచవ్యాప్తంగా బ‌డికి బయట 78.2 మి. పిల్ల‌లు.. యు. ఎన్‌ నివేదిక

ఒక  కొత్త నివేదిక ప్రకారం, విద్యా సహాయం అవసరమయ్యే సంక్షోభ ప్రభావిత దేశాలలో పాఠశాల వయ స్సు పిల్లల సంఖ్య 2016 లో 75 మిలియన్ల మంది వుండ‌గా,  ప్రస్తుతం 222 మిలియన్లకు పెరిగిందని ఐక్యరాజ్యసమితి జూన్ 21, 2022న ప్రచురించిన నివేదిక  పేర్కొన్న‌ది. వారిలో, 78.2 మిలియన్లు తరచుగా దీర్ఘకాలిక సంఘర్షణలు, అత్యవసర పరిస్థితుల కారణంగా పాఠశాలకు దూరంగా ఉన్నారు. సంక్షోభం బాధిత పిల్లల సంఖ్య,  విద్య అవసరం ఉన్న కౌమారదశలోని వారు అనే విశ్లేషణ ప్రకారం, బడి బయట ఉన్న పిల్లలలో 54 శాతం మంది బాలికలు, 17 శాతం మంది క్రియాత్మక ఇబ్బందులతో బాధపడుతున్న పిల్లలు,16 శాతం మంది బలవంతంగా వేరే ప్రాంతాల‌కు త‌ర‌లించ‌బ‌డిన‌వారూ వున్నారు. అత్యవసర పరిస్థితులు, దీర్ఘకాలిక సంక్షోభాలలో విద్య కోసం ఐక్య రాజ్య స‌మితి ప్ర‌పంచ‌ నిధి, సాయుధ పోరాటాలు, బలవంతంగా వేరే ప్రాంతాల‌కు త‌ర‌లింపులు, వాతావరణ ప్రేరిత విపత్తులు, దీర్ఘకాలిక సంక్షో భాల కారణంగా నాణ్యమైన విద్యను కోల్పోతున్న బాలికలు, అబ్బాయిల సంఖ్యను  ఎడ్యుకేషన్  కెనాట్ వెయిట్ (ఇసిడ‌బ్ల్యు)   ప్ర‌ధానంగా పేర్కొన్న అంశాలు ఎంతో ఆందోళనకరంగా ఉంది. సంక్షోభ పీడిత ప్రాం తాల్లో నివసిస్తున్న దాదాపు 119.6 మిలియన్ల మంది పిల్లలు పాఠశాలకు హాజరయ్యారు  కానీ గణితం లో లేదా పఠనంలో కనీస నైపుణ్యాన్ని సాధించలేకపోయారని కనుగొన్నారు. మరో 24.2 మిలియన్లు  ప్రీ-ప్రైమ రీ, ప్రైమరీ లేదా సెకండరీ స్కూల్‌లో గణితం లేదా పఠనంలో కనీస నైపుణ్యాన్ని సాధిస్తున్నారు, అయితే ఇప్పటికీ సంక్షోభాల వల్ల ప్రభావితమయ్యారు.  వీరికి మద్దతు అవసరం అని స్ప‌ష్టం చేసింది. 84 శాతం మంది పూర్తిగా బడి బయట ఉన్న పిల్లలు లేదా 65.7 మిలి యన్లు దీర్ఘకాలిక సంక్షోభాలు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తు న్నార‌ని నివేదిక  పేర్కొంది. ఈ  65.7 మిలియన్లలో మూడింట రెండొంతుల మంది ఆఫ్ఘనిస్తాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, మాలి, నైజీరియా, సోమాలియా, ద‌క్షిణ సూడాన్, సూడాన్, పాకిస్తాన్,  యెమెన్‌లలో నివసిస్తున్నారు. సబ్-సహారా ఆఫ్రికాలోని  పిల్లలు చ‌దువునేర్వ‌లేని  స్థితితో తీవ్రంగా దెబ్బతిన్నార‌ని లాభాపేక్షలేని సేవ్ ది చిల్డ్రన్ చేసిన మరొక నివేదిక తెలియ‌జేసింది.  శరణార్థుల కోసం ఏర్పాటైన‌ యు.ఎన్‌ హై కమిషనర్  ఇటీవలి నివేదిక ప్రకారం 2019-2020లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శరణార్థుల కోసం సెకండరీ స్థాయి విద్య లో స్థూల నమోదు 34 శాతంగా ఉంది. మహమ్మారికి ముందు, సంక్షోభ ప్రభావిత పిల్లలలో 9 శాతం మంది మాత్రమే గణితంలో కనీస నైపుణ్యాన్ని సాధించారు. సంక్షోభం-ప్రభావిత పిల్లలలో 15 శాతం మంది మాత్రమే ప్రారంభ తరగతుల్లో చదవడంలో కనీస నైపుణ్యాన్ని సాధించారని విశ్లేషణలో తేలింది. కోవిడ్‌- 19 మహమ్మారి, ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా పాఠశాలలు సుదీర్ఘకాలం మూసివేయడం వల్ల ప్రపంచ సంక్షోభం తీవ్ర మైందని నిపుణులు చెప్పారు.  సంక్షోభ తీవ్రత, క్రియాత్మక ఇబ్బందులతో ఉన్న పిల్లలు, వేరే ప్రాంతాల‌కు త‌ర‌లించ‌బ‌డిన కుటుంబాల‌  పిల్లలు, బడి బయట వున్న‌వారి శాతం సంబంధించి అందుబాటులో ఉన్న డేటాను ప్రభావితం చేసే కొత్త పద్దతిని తాజా అధ్యయనం ప్రతి పాదించింది. యూనిసెఫ్  బ‌హుళ సూచిక  క్లస్టర్ సర్వేలు, అంతర్జాతీయ గణితం, సైన్స్ అధ్యయన డేటా బేస్‌లో అభి వృద్ధి  కోసం అంతర్జాతీయ విద్యార్థి అంచనా వివ‌రాలు కూడా అత్యవసర పరిస్థితుల్లో బడి బయట ఉన్న పిల్లల సంఖ్యను, అలాగే నేర్చుకోని వారి సంఖ్యను అంచనా వేయడానికి ఉపయోగించాలి. అందువల్ల తక్షణ విద్యా మద్దతు అవసరమ‌ని రచయి తలు సూచించారు. ఈ పద్దతి యొక్క పరిమితి ఏమిటంటే ఇది ప్రధానంగా సంక్షోభం-ప్రభావిత వ్యక్తులుగా పరిగణించబడే వ్యక్తుల నిష్పత్తిని సరిగ్గా అంచనా వేయ డంపై ఆధారపడి ఉంటుంది. అనేక పెద్ద సంక్షోభ-ప్రభావిత దేశాలలో, మూడు నుంచి నాలుగు సంవత్స రాల వయస్సు గల పిల్లలకు, ప్రాథమిక పాఠశాలకు ముందు సంవత్స రంలో ఉన్నవారికి పాఠశాల వెలు పల రేట్ల డేటా అందుబాటులో లేదని నివేదిక పేర్కొంది.

కారు ఓవర్ లోడు..!

కారు ఓవర్ లోడైందా? కొందరిని దింపేయక, లేకపోతే వారే దిగిపోక తప్పని పరిస్థితి ఏర్పడిందా? అంటే తెలంగాణలో టీఆర్ఎస్ వలసలు చూస్తుంటే ఔననక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో అసంతృప్తుల సంఖ్య వరదలా పోటెత్తుతోంది. రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి నెలకొని ఉంది. కొందరు కారు దిగి హస్తం పంచన చేరుతుంటే.. మరి కొందరు టీఆర్ఎస్ లోనే ఉండి.. రానున్న ఎన్నికలలో తమకు ప్రత్యర్థులు అనుకున్న వారితో గొడవలు పడుతున్నారు. గ్రూపు తగాదాలను ప్రోత్సహిస్తున్నారు. పరస్పరం గొడవలు పడుతూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతున్న వారు మరి కొందరు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు పరిశీలకులు. పార్టీ అగ్రనేతల కనుసన్నలలో మెలిగిన, మెలిగే, మెలుగుతారనుకున్న వారికే తెరాసలో పార్టీ పదవులు దక్కాయి. అయినా అంతా బానే ఉందని అనుకోవడానికి లేకుండా విభేదాలు పెచ్చరిల్లుతున్నాయి. ఈ విభేదాలే తెరాస నుంచి కాంగ్రెస్ లోకి వరద గేట్లు తెరుచుకున్నట్లుగా వలసలు ప్రారంభమయ్యాయి. అధికార పార్టీ నుంచి ఈ స్థాయిలో వలసలు జరుగుతున్నాయంటే.. కచ్చితంగా తెరాసలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనుకోవలసిన పరిస్థితేనని పరిశీలకులు అంటున్నారు. ఇక ఇంత కాలం కేసీఆర్ పై ఆరోపణలు విపక్షాలకే పరిమితమయ్యాయి. కానీ కుటుంబ పాలన, విధానాలపై పార్టీ వీడుతున్న నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అనంతరం పోడు భూములకు పట్టాల విషయంలో ఆయన కేసీఆర్ సర్కార్ పై చేసిన విమర్శలు కలకలం సృష్టించాయి. పోడు భూములకు పట్టాలు నిరాకరించడం వల్లలే తాను పార్టీ వీడుతున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి రెండో సారి అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికలలో అంటే 2018 ఎన్నికలలో పోడు భూములకు పట్టాలు అన్న హామీ ఇచ్చింది. స్వయంగా కేసీఆర్ నోటి వెంటే ఈ హామీ వచ్చింది. అయితే మూడేళ్ల తరువాత గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తరువాత ఆ విషయమే పట్టించుకోకుండా గాలికి వదిలేయడంతో గిరిజనుల్లో ఆగ్రహం పెల్లుబుకుతొంది. ప్రజా ప్రతినిథులను  ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.  రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందనీ, పబ్బుల సంస్కృతికి, డ్రగ్స్ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ విజయారెడ్డి తెరాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. విజయారెడ్డి దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ తనయ కావడంతో ఆమె పార్టీ మారడం రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గం అయిన ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ పై ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు. ఇక ఏ జిల్లాకు ఆ జిల్లా గ్రూపు తగాదాల పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి. అయితే వాటిని పరిష్కరించి పార్టీని ఏకతాటిపై నడిపించేందుకు అధిష్టానం ఏ మాత్రం సమయం కేటాయించడం లేదన్న ఆరోపణలు, విమర్శలు కేడర్ నుంచే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజులలో మరిన్ని వలసలు పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు కారులో ఈ పరిస్థితి రావడానికి కేసీఆర్ వైఖరీ, ఆపరేషన్ ఆకర్ష్ పేరిట విపక్షాల నుంచి నేతలను పెద్ద ఎత్తున పార్టీలోని ఆహ్వానించడమే కారణమని వారు పేర్కొంటున్నారు. ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు వచ్చి చేరడంతో మొదటి నుంచీ పార్టీలో కొనసాగుతున్న వారికి అవకాశాలు దక్కని పరిస్థితి ఏర్పడిందని వివరిస్తున్నారు. 

ముర్ము స్వగ్రామానికి వెలుగొచ్చింది

రాజ్యంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, చిన్న తనంలో గుడ్డి దీపాల వెలుగులో చదువుకుని  అంత గొప్పవాడయ్యారు, అని మనం గొప్పగా చెప్పు కుంటాం... అలాగే ఇంకా ఎందరో  పెద్దలు , స్వాతంత్ర సమర యోధులు ఎన్నో కష్టాలు అనుభవించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. దేశ సేవలో తరించారు అలాంటి అందరూ మనకు ప్రాతః స్మరణీయులు,కానీ, దేశానికీ స్వతంరం వచ్చి, 75 ఏళ్ళు పూర్తయి, అమృత మహోత్సవ్ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న సమయంలో, ఇప్పటికీ దేశంలో విద్యుత్ సదుపాయం, కనీస వసతులు  లేని అనాధ గ్రామాలు ఉన్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అందునా, అలాంటి  అనాధ గ్రామాల్లో, అధికార ఎన్డీఏ కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్న ద్రౌపదీ ముర్ము స్వగ్రామం కూడా ఉందంటే, ఆశ్చర్యంతో పాటుగా కొంచెం చాలా అవమానం కూడా అనిపిస్తుంది. కానీ, అది నిజం.  నిజానికి, దేశంలోని ఎన్నో చీకటి గ్రామాల కథల్లానే, ఈ గ్రామం కథ కూడా ఇప్పటికీ,  ఎప్పటికీ  చీకటిలోనే ఉండి పోయేది కావచ్చు, కానీ, ద్రౌపది ముర్మును బీజేపీ / ఎన్డీఎ కూటమి రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆ గ్రామం జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. మీడియా దృష్టిని ఆకర్షించింది. అయితే, అక్కడికెళ్ళిన మీడియా ప్రతినిధులు, రాష్ట్రపతి అభ్యర్ధి స్వగ్రానికి  కరెంటు లేదని తెలిసి, కరెంట్ తాకకుండానే  షాక్ కు గురయ్యారు.  ద్రౌపదీ ముర్ము స్వగ్రామం..ఓ శివారు గ్రామం. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో రెండు శివారు గ్రామాలు కలిసిన,  ఉపర్బెడా గ్రామం. ఈ గ్రామంలో  దాదాపు 3500 జనాభా నివసిస్తున్నారు. అందులో, బాదషాహి శివారు గ్రామానికి విద్యుత్ సదుపాయం ఉంది. కానీ, కేవలం 14 కుటుంబాలు మాత్రమే ఉన్న దున్గురుషాహి  శివారు గ్రామానికి మాత్రం విష్యత్ సదుపాయం లేదు.,ఆ శివారు గ్రామం దశాబ్దాలుగా చీకటిలోనే మగ్గుతోంది. ఆ గ్రామమే ముర్మూ స్వగ్రామం.అయితే, ప్రస్తుతం ఆమె అక్కడ నివసించడం లేదు. ఆ గ్రామానికి 20కి.మీ దూరంలో ఉన్న పట్టణానికి కొన్ని దశాబ్దాల క్రితమే మకాం మార్చారు.  అయినప్పటికీ ముర్ము మేనల్లుడు బిరాంచి నారాయన్‌ తుడు ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడే నివసిస్తున్నారు. ముర్మూ కూడా పండగలు, పబ్బాలకు గ్రామానికి వచ్చి పోతూనే ఉంటారని, ఆమె మేనల్లుడు తెలిపారు. గ్రామానికి విద్యుత్ లేని విషయాన్ని ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోలేదని, బిరాంచి భార్య, ఇతర గ్రామస్తులు  వాపోయారు. ఎన్నికల సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ, ఎన్ని విజ్ఞాపన పత్రాలు అందించిన ఫలితం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పడు, రాష్ట్రపాటి అభ్యర్ధి గ్రామానికి విద్యుత్ లేదనే వార్త భగ్గుమండంతో  ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే ఆ గ్రామానికి కరెంటు వసతి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఉత్తర ఒడిశా విద్యుత్‌ పంపిణీ సంస్థ అధికారులు 24 గంటల్లోగా గ్రామం మొత్తానికి విద్యుత్‌ వసతి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, గుంతలు తవ్వే యంత్రాలతో అక్కడకు చేరుకొని యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పడుతున్న బాధలకు ఇప్పుడు మోక్షం లభించిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే, మయూర్‌భంజ్‌ జిల్లాలో ఇప్పటికీ ఓ 500 గ్రామాలకు సరైన రోడ్లు, 1350 గ్రామాలకు కరెంటు వసతే లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఈ గ్రామానికి చెందినవారు గతంలో ఎంపీలు, మంత్రులుగా పనిచేశారు. మాజీ ఎంపీలు సల్ఖాన్‌ ముర్ము, భబేంద్ర మాఝీతోపాటు కార్తిక్‌ మాఝీలు కూడా అదే గ్రామానికి చెందిన వారు కావడం కొసమెరుపు.  అయితే, తీగలాగితే డొంకంతాకదిలింది అన్నట్లు, ఈ గ్రామానికి ఇంత కాలం కరెంటు లేక  పోవదానికి, ఆ గ్రామం పట్ల వివక్ష కారణం కాదని, అటవీ భూమిలో నిర్మించిన గ్రామం  కావడం వలన సాంకేతిక అభ్యతరాలు అడ్డుగా నిలిచాయని, అధికారులు చెపుతున్నారు. అయితే, ఇంత కాలం తిష్ట వేసినఅభ్యంతరాలు ఇప్పడు ఏమయ్యాయి.. ? ఎలా తొలిగి పోయాయి? అలాంటి  ప్రశ్నలకు సమాధానలు ఉండవు. అది అంతే.

అబద్ధాలు రుజువైపోయి అభాసుపాలు..!

అబద్ధాలాడేవారికి జ్ణాపక శక్తి ఎక్కువ ఉండాలి. అందులో రాజకీయ నాయకులైతే మరీ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఏ విషయంలో ఏ అబద్దమాడారో మరచిపోతే.. వారి బండారం బయటపడి అభాసుపాలౌతారు. ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ నేతల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఆడిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయి ప్రజలలో పలుచన అవుతున్నారు. చులకన అవుతున్నారు. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన చేసిన వాగ్దానాలు, విమర్శలు అన్ని ఇప్పుడు బూమరాంగ్ అయి.. ఆయన అబద్ధాల పాలనను వెక్కిరించే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా అమరావతి విషయంలో జగన్, ఆయన మంత్రివర్గ సహచరులు వివిధ సందర్భాలలో చెప్పిన మాటలు అబద్ధాలని ఇప్పుడాయన సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతోనే తేటతెల్లమైపోతోంది. దీంతో జనంలో జగన్ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. విపక్షంలో ఉన్నప్పుడు జగన్ నిండు అసెంబ్లీలో రాజధానిగా అమరావతికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఆ తరువాత గత ఎన్నికల ప్రచారంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని నమ్మ బలికారు. ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టగానే మూడు రాజధానులంటూ అమరావతిని పక్కన పెట్టేశారు. రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నానా యాతనా పెట్టారు. చారిత్రక న్యాయపోరాటం ద్వారా వారు ప్రభుత్వంపై విజయం సాధించినా.. కోర్టు తీర్పు అమలులో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గత మూడేళ్లుగా జగన్ సర్కార్ అనుసరించిన అస్తవ్యస్త ఆర్థిక విధానాల కారణంగా రాష్ట్రం దివాళా స్థితికి చేరుకుంది. ఎక్కడా అప్పుపుట్టని పరిస్థితుల్లో మళ్లీ అమరావతే ఆదుకుంటుందని జగన్ భావిస్తున్నారు. ఈ లోగా ఈ మూడేళ్లలో జగన్ కానీ, ఆయన పార్టీ నేతలకు కానీ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ ఇన్నీ అన్నీ కావు. ఒక పథకం ప్రకారం అమరావతి అభివృద్ధిని నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ఆదాయంగా మార్చుకునేందుకు నడుం బిగించింది. గతంలో అమరావతిని స్మశానం గా అభివర్ణించిన జగన్ సర్కారే ఇప్పుడు ఆ భూములనే బంగారు బాతుగుడ్లుగా గుర్తించి వాటిని వేలం వేసి ఆదాయాన్నిసమకూర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు గ్రాఫిక్స్ అంటూ ఎకసెక్కాలాడిన భవనాలనే ఇప్పుడు లీజుకు ఇచ్చి ఆర్థిక ఊరట పొందాలని నిర్ణయించుకుంటున్నది. దీంతో వైకాపా సార్కార్, ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు అమరావతిపై గతంలో చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ అబద్ధాలని రాష్ట్రప్రజలకు తేటతెల్లమైంది. దీంతో జగన్ ప్రతిష్ట మసకబారింది. గతంలో అమరావతి భవనాలను గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేసిన జగన్ ఇప్పుడు వాటిని లీజుకు ఇవ్వడం ద్వారా మంచి ఆదాయం వస్తుందన్న సీఆర్డీయే ప్రతిపాదనకు ఆమోదించడం ద్వారా తాను నాడు గ్రాఫిక్స్ అంటూ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని ఇప్పుడు స్వయంగా అంగీకరించినట్లైంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పలు టవర్లు, భవనాలను ఇంత కాలం నిరుపయోగంగా ఉంచేసిన జగన్ సర్కార్ ఇప్పుడు వాటినే ఆదాయ వనరులుగా గుర్తించారు. ఉద్యోగుల కోసం గత సర్కార్ నిర్మించిన భవనాలను ఉద్యోగులకు కేటాయించకుండా ప్రైవేటు  సంస్థలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. భవనాల లీజు ద్వారా ఏడాదికి పదికోట్లు ఆర్జించడానికి రెడీ అయిపోయింది. అమరావతిలో తెలుగుదేశం చేపట్టినట్లు చెబుతున్న పనులన్నీ గ్రాఫిక్సేనని ప్రచారం చేసిన జగన్ సర్కార్ ఇప్పుడా ‘గ్రాఫిక్ భవనాల’నే అవసరానికి వాడుకుంటోంది. స్మశానం అంటూ నిందించిన నోటితోనే అమరావతి భూముల విక్రయానికి రెడీ అయిపోతోంది. ఇప్పుడు జనం జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం   చేయడమే కాదు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని నిర్వీర్యం చేయకుండా ఉండి ఉంటే.. అప్పుడు జరిగిన అభివృద్ధిని కొనసాగించి ఉంటే ఇప్పుడు రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండేది కాదు కదా అని నిలదీస్తున్నారు. యథా ప్రకారం జగన్ ప్రభుత్వం నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు, అధికారంలో ఉన్న మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు, విమర్శలు చేస్తే దులిపేసుకు ముందుకు పోతాం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. 

యశ్వంత్ సిన్హా నామినేషన్ 27న.. హాజరు కానున్న కేటీఆర్

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన సోమవారం ఉదయం 11.30 గంటలకు తన నామానేషన్ దాఖలు చేస్తారు. యశ్వంత్ అభ్యర్థిత్వానికి ఇప్పటికే టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి టీఆర్ ఎస్ తరఫున పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు.  ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేటీఆర్ ఆదివారం రాత్రే హస్తినకు బయలు దేరి వెళ్లారు.  కేటీఆర్ వెంట ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, వెంక‌టేశ్ నేత‌, ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు. కాగా ఎన్‌డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా  ద్రౌపది ముర్ము  ఇప్పటికే  నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి విదితమే. రాష్ట్రపతి ఎన్నిక జులై 18న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు అదే నెల 21న ఉంటుంది. కాగా రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల దాఖలుకు ఈ నెల 29 తుదిగడువు. కాగా ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో ముగియనుంది. 

జూన్ 28న ఇంటర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై సందిగ్ధత తొలగింది. మంగళవారం ఉదయం తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.  ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గత వారం రోజులుగా తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. రోజుకో తేదీని అనధికారికంగా ప్రకటించి విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రులలో అయోమయం, గందరగోళం సృష్టించిన ఇంటర్ బోర్డు ఎట్టకేలకు మంగళవారం అంటే ఈ నెల 28న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నది. ఇంటర్ ఫలితాల విషయంలో వదంతులను నమ్మవద్దని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 9లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.  ఫెయిలైన  విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ పేర్కొన్నారు. తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు మూడు వెబ్‌ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.    విద్యార్ధులు ఫలితాలు తెలుసుకునేందుకు https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresults.ts.nic.inవెబ్‌ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలియజేసింది.

కాంగ్రెస్ గూటికి బోడ జనార్ధన్.. టీఆర్ఎస్ కు వరుస షాకులు

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బోడ జనార్థన్ కాంగ్రెస్ గూటికి చేరారు. దాదాపు వంద వాహనాల్లో తన అనుచరులతో కలిసి హైదరాబాద్ గాంధీభవన్ కు చేరుకున్న ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పటికే పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. అలాగే అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మెట్ పల్లి జడ్పీటీసీ సభ్యుడు కాటిపెల్లి రాధ శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా బోడ జనార్థన్  కూడా కాంగ్రెస్ లో చేరడంతో టీఆర్ ఎస్ నుంచి వలసల వరదకు గేట్లు తెరిచినట్లైంది. కాంగ్రెస్ కండువా పుచ్చుకున్న సందర్భంగా బోడె జనార్ధన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు, ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న నేత రేవంత్ మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణలో అమరుల ఆకాంక్షల మేరకు పాలన సాగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు.  తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. బాల్క సుమన్ వందల కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. 

అమ్మా బ‌య‌లెల్లినాదే.. ర‌ష్మ‌మ్మా బయలెల్లినాదే!

ఆస్తి కోసం కొట్టుకుచ‌చ్చే అన్న‌ద‌మ్ముల మ‌ధ్య‌కు వివాదం చ‌ల్ల‌బ‌రిచేందుకు కోడళ్ల‌ను గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణిగేలా చేయ‌మ‌ని   అత్త‌గారు రంగంలోకి దింపేర‌ట. ఇంటి గుట్టు బ‌య‌ట‌కు ఇప్ప‌టికే బాగా ప్ర‌చార‌మై క‌థ‌లు, న‌వ‌ల‌ల స్థాయికి చేరుకోవ‌డంతో స్త్రీ శ‌క్తి రంగంలోకి దిగితేనే ప‌రిస్థితులు కాస్తంత అనుకూలిస్తాయ‌ని ఉద్ధ‌వ్ థాక్రే  భార్య ర‌ష్మీ థాక్రే రంగంలోకి దిగారు. ఇది క‌నీ వినీ ఎరుగ‌ని సంగ‌తి. మామూలుగా ఎన్నిక‌ల్లో భ‌ర్త‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారంలోకి దిగ‌డానికి ఇంట్లో ప‌నులు పిల్ల‌ల‌కు  చెప్పి ప్ర‌చార వేదిక‌ల‌ను, వాహ‌నాల‌ను ఎక్కి  ప్ర‌సంగించి జ‌నాన్ని ఆక‌ట్టుకోవ‌డం, త‌ద్వారా భ‌ర్త‌కు ఓటు వేయ‌మ‌ని చ‌క్కగా  కోర‌డం చాలా కాలం నుంచి వున్న‌దే. వారి ప్ర‌భావం ఏ మేర‌కు వుంటుంది అనేది వేరే విష‌యం.  కానీ వారిని కూడా వెంట తిప్పుకోవ‌డం, వారితో  పాద యాత్ర చేయ‌డం, ఇళ్ల‌కు వెళ్లి మ‌హిళ‌ల‌కు చీర‌లు, కుంకుమా ఇవ్వ‌డం  ఆన‌వాయితీగా మారింది. విన‌డానికి, చ‌ద‌వ‌డానికి వింత‌గా హాస్యంగా వుండ‌వ‌చ్చుగాని ఇది వార్డు స‌భ్యులను గెలుచుకోవ‌డానికి కూడా గొప్ప అస్త్రంలా పార్టీలు అనుస‌రిస్తున్న  రాజ‌కీయ వ్యూహం. అమ్మ‌గారు వ‌చ్చార‌ని విని చ‌క్క‌గా అర్ధంచేసుకున్న‌ట్టు న‌టించి మ‌రీ భ‌ర్త‌ల‌చేత బ‌ల‌వంతంగానైనా ఓటు వేయించ‌డం జ‌రిగింది, జ‌రుగుతోంది. దేన్న‌యినా అటునుంచి న‌రుక్కుర‌మ్మ‌న్నారు గ‌దా! స‌రిగ్గా ఇదే సూత్రాన్ని థాక్రేగారూ అనుస‌రిస్తున్నారంతే.. ఇందులో త‌ప్పేమీ లేదు. ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిందేమీ లేదు. కాబోతే ఇక్క‌డ కొత్త‌గా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిందేమిటంటే.. ర‌ష్మీ మేడ‌మ్ శివ‌సేన రెబెల్స్ ఎమ్మెల్యేల భార్య‌ల‌కు   జ్ఞాన‌బోధ  చేయ‌డానికి బ‌య‌టికి వ‌చ్చేరు. అంటే భ‌ర్త‌ల‌కు రాష్ట్ర ప‌రిస్థితులు   వివరించి చెప్పి, కోరి కోరి క‌ష్టాలు కొనితెచ్చుకోవ‌ద్ద‌ని న‌చ్చ‌జెప్పి ‘మ‌నింటికి’ తీసుకుర‌మ్మ‌ని చెప్ప‌డానికి మేడ‌మ్ కొంగు బిగించారు.  శివసేన రెబల్ ఎమ్మెల్యేలను వారి భార్యలతోనే నచ్చచెప్పించే ప్రయత్నాలను ఉద్ధవ్ థాకరే సతీమణి రష్మి థాకరే  చేపట్టారు. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో రష్మి సంప్రదింపులు సాగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. మరో వైపు ఉద్ధవ్ థాకరే సైతం గౌహతిలోని హోటల్‌లో బస చేసిన పలువురు రెబల్ ఎమ్మెల్యేలకు సందేశాలు పంపుతున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ తంత్రం ఏ మేర‌కు పారుతుంద‌నేది చూడాలి. కాబోతే  తెలుగు రాష్ట్రాల వ్య‌వహారం కాదు. వెంట‌నే ఆడోళ్లు వ‌చ్చి చెబుతుండారు మ‌నం ఇనుకోవాల అనుకోవ‌డానికి. అది మ‌రాఠా రాజ్యం. వ్య‌వ‌హారం మ‌రి వేరుగానే వుంటుంది. మ‌హిళ‌ల్ని త‌న ఇంట్లో పేరంటానికి పిలిచిన‌ట్టు పిలిచి అవీ ఇవీ మాట్లాడుకుంటూ ఏమ‌మ్మా వ‌దిన‌మ్మా కాస్తంత మీ ఆయ‌న‌కు న‌చ్చ‌జెప్పి ఏదో ఈసారికి ఇలా కానిద్దామ‌ని మ‌ళ్లీ అన్న‌గారి ద‌గ్గ‌రికి ర‌మ్మ‌ని అనొచ్చు. అలా మ‌రి ఆ వ‌దిన‌లంతా ఒకే అంటారా అన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌. ఎందుకంటే వ‌దిన‌ల కంటే అన్న‌లు శివ‌సేన నాయ‌కుడు థాక్రేకి ఆప్ష‌న్లు ఇచ్చి మ‌రీ అక్క‌డెక్క‌డో వెళ్లి కూర్చున్నారాయె‌! ఎలా కుదురుతుంది? మ‌రి ర‌ష్మీ మేడ‌మ్ ఏ ధైర్యంతో కొంగు బిగించి బ‌య‌ల్దేరారో ఏ ధ‌ర్మ‌సూత్రం బోధించి, బుజ్జగిస్తారో చూడాలి.   

మ‌ద్యంషాపు లొల్లి.. కొట్టుకున్న మ‌హిళ‌లు

మ‌హిళ‌లు గుంపులుగా క‌లిసి గుడికి వెళ‌తారు, పెళ్లీ పెరంటాల‌కీ వెళుతూంటారు.  పంపుల ద‌గ్గ‌ర గొడ‌వ‌కీ దిగుతూంటారు. దీనికి మ‌రి కాస్త ఆవేశాన్ని జోడిస్తే  మ‌ద్యం దుకాణాన్ని ఎందుకు తీశార‌ని ఏకంగా కొట్ట‌డానికే వెళ్లారు. ఇది ఢిల్లీలో ఇటీవ‌ల జ‌రిగింది. ఇటీవ‌ల మ‌ద్యం దుకాణాలు నివాస ప్రాంతాల్లో వెలిసి   స్థానికులకు ఇబ్బంది క‌రంగా మారాయి. తాగుబోతుల గోల‌తో ప్రాంతీయ మ‌హిళ‌లు, పెద్ద‌లు నానా ఇబ్బందులు పడుతూంటారు. అస‌లు ఆ దుకాణాలు,. చిన్న చిన్న బార్ల‌కు   ప‌ర్మిట్‌లు ఇచ్చిన‌వారిని చ‌చ్చేట్టు కొట్టాల‌న్న ఆగ్ర‌హం ఆయా ప్రాంతాల్లోని మ‌హిళ‌లు వ్య‌క్తం చేయ‌డంలో త‌ప్పే లేదు. ఎందుకంటే ఇబ్బందులు, క‌ష్ట న‌ష్టాలూ ఎదుర్కొనేది వారే గ‌నుక‌. ఢిల్లీలో స‌రిగ్గా ఇదే జ‌రిగింది. మహిళలు మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా అనేక ప్రాంతాలలో తరచుగా నిరసనలు చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో మద్యం దుకాణాలపై దాడులు కూడా చేస్తుంటారు. రాళ్లు రువ్వుతుంటారు. వైన్ షాపు ముందు కూర్చోని నిరసనలు కూడా తెలియజేస్తుంటారు. ఇలాంటి సందర్భా ల్లో తోపులాటలు, పరస్పర దాడులు జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం మరోసారి వార్తలలో నిలిచింది.గురువారం అర్దరాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఢిల్లీలోని ఒక వైన్‌షాప్‌ బయట  రెండు వర్గాల మహిళల  మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. మద్యం షాపుకు ఎదురుగా ఉన్న భవనం నుండి చిత్రీకరించిన వీడియోలో మహిళా బౌన్సర్లు, నలుపు రంగులో, మహిళా నిరసనకారులను తన్నడం, కొట్టడం కనిపించింది. అదే విధంగా అక్కడ అరుపులు, కేకలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘర్షణలో ఓ పోలీసు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.  ఆ ప్రాంతంలో మద్యం దుకాణం తెరవడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక మహిళలు కొందరు నిరసనకు దిగడంతో గొడవ మొదలైంది.   స్థానిక మహిళలు అక్కడికి వచ్చి మూసేయాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. వైన్ షాపులో ఉన్న మహిళా బౌన్సర్ లు, మహిళలపై దాడులు చేశారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో.. కొంత మంది స్థానిక పోలీసులు దీన్ని అడ్డుకొవడానికి ప్రయత్నించారు. దక్షిణ ఢిల్లీలోని తిగ్డి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రంజిత్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అతడిపై కూడా మహిళలు దాడిచేశారు. అతని యూనిఫాం  చిరిగిపోయిం ది. వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ కేసులో పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. క్షతగాత్రులను ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.  కానీ ఇలాంటివి ఎన్ని జ‌రిగినా ప్ర‌భుత్వాలు బొత్తిగా ప‌ట్టించుకోవ‌డం లేదు. వారికి ఆ దుకాణాల మీద వ‌చ్చే ఆదాయం ముందు  ప్ర‌జ‌ల  ప్రాణ, ఆస్తి న‌స్టాలు చిన్న‌వే!

త‌గ్గేదే లే... జూప‌ల్లి

అంతా బాగానే వుంది, పార్టీలో ఎటువంటి పొర‌పొచ్చాల్లేవు, విభేదాలు అస‌లే లేవ‌ని విర్ర‌వీగుతున్న టిఆర్ఎస్ పార్టీకి కొల్హాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో గొడ‌వ త‌ల‌ భారంగానే మారింది. అక్క‌డ కొంత‌ కాలం నుంచి జూప‌ల్లి, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి మ‌ధ్య మాట‌ల య‌ద్ధం వూహించ‌ని స్థాయికి చేరుకుంది. నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో గులాబీ నేతలిద్దరూ ఓపెన్‌ చాలెంజ్‌ చేస్తూ బహిరంగ చర్చకు సిద్దమంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆదివారం కొల్లాపూర్‌ లో టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. శనివారం రాత్రికే జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్దన్‌ కొల్లాపూర్‌ చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప‍్రమత్తమయ్యారు. చర్చలకు, ర్యాలీలకు అనుమతి లేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు. మరోవైపు.. జూపల్లి ఇంటి వద్ద ఆదివారం ఉదయం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.  కొల్లాపూర్‌లో జూపల్లి ఇంటి వద్దకు ఆయన అనుచరులు రావడంతో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ ఇంటి వద్ద పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇద్దరు నేతలను పోలీసులు గృహ‌నిర్భంధం చేశారు. కేసీఆర్ తొలి మంత్రివ‌ర్గంలో ప‌నిచేసిన జూప‌ల్లి కృష్ణ‌రావు, 2018లో కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా పోటీచేసిన బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. త‌ర్వాత బీరం టీఆర్ ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి జూప‌ల్లి, బీరం మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతున్నాయి. ఒక‌రిపై ఒక‌రు అభివృద్ధి విషయంలో సవాళ్లు విసురుకున్నారు. ఇటీవల కాలంలో ఇది మరిం తగా ముదిరింది. జూపల్లి, బీరం వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా కొల్లాపూర్ నియోజకవర్గంలో గొడవలే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభి వృద్ధిపై తనతో చర్చకు రావాలని జూపల్లి సవాల్ చేయగా.. బీరం కూడా సై అన్నారు. అంబేడ్కర్​ విగ్రహం దగ్గరకు రావాలని సవాల్ చేసుకున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగానే ఇద్దరు నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు.ఇటీవలే నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్  జూపల్లి, హర్షవర్ధన్ మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. జూపల్లి ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లా డారు. కేటీఆర్ టూర్ తర్వాత పరిస్థితి చక్కబడుతుందని కొల్లాపూర్ టీఆర్ఎస్ కార్యకర్తలు భావించారు. కాని సీన్ మరోలా మారింది. విభేదాలు మరింతగా ముదిరిపోయాయి. అంతేకాదు శనివారం జూపల్లి సంచలన కామెంట్లు చేశారు. ఎమ్మెల్యేకు తనకు మధ్య జరిగే చర్చకు కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొల్లాపూర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరే తేల్చుకుంటానని చెప్పారు. తన ఇమేజ్ డ్యామేజ్ చేస్తే చేతులు కట్టుకుని ఇంట్లో ఎలా కూర్చూంటానని జూపల్లి అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలకు ఎమ్మెల్యే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎంత దూరమైనా వెళతానని జూపల్లి కృష్ణారావు తేల్చి చెప్పారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్త‌ల‌పైనా స్పందించిన జూపల్లి అవన్ని తప్పుడు వార్తలని అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల ధ్యాసే లేదు.. జగన్ దంతా రాజకీయ ప్రయోజనం గోలే!

క‌లిసొచ్చిన కాలాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలంటారు. క‌లిసొచ్చిన కాలాన్ని కాల‌ద‌న్నుకోవ‌డం జ‌గ‌న్‌కే సాధ్య‌ప‌డింద‌ని ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు జ‌గ‌న్‌.  రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఈసారి తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. దేశంలోని విప‌క్షాల‌న్నీ క‌లిసి కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హాను ప్ర‌క‌టించాయి. బిజెపి మిత్ర‌ప‌క్షాలు   ద్రౌప‌ది ముర్మూను ఖ‌రారు చేశాయి. ఈ ప‌ర్యాయం రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఏక‌ప‌క్షం కాకుండా చూడాల‌ని గ‌ట్టిగా య‌త్నించ‌డంలో సిన్హాకు మ‌ద్ద‌తు తెలియ‌జేయ‌మ‌ని జ‌గ‌న్‌కు విప‌క్షాలకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న మ‌మ‌తా బెన‌ర్జీ లేఖ కూడా రాశారు. కానీ జ‌గ‌న్ ఏడిఏ అభ్య‌ర్ధి ముర్మూకే మ‌ద్ద‌తు తెలిపారు. నిజానికి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక విష‌యంలో వైసీపీ మ‌ద్ద‌తు ఎన్డీయేకి చాలా అవ‌స‌రం. అలాంట‌పుడు కేంద్రం నుండి రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల దృస్ట్యా ఎలాంటి హామీ తీసుకోకుండానే జ‌గ‌న్ ఓకే అనేయ‌డం దారుణ‌మ‌ని విప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కేంద్రాన్ని నిల‌దీయ‌డానికి ఇంత‌కంటే మంచి అవ‌కాశం ఇక ముందు కూడా దొర‌క‌ద‌ని హోరెత్తుతూనే వున్న విప‌క్షాల‌ది కేవ‌లం అర్ధంలేని గోలగానే జ‌గ‌న్ భావించారా?   లేక కేంద్రానికి ఈసారి సాయం చేసి ఆ త‌ర్వాత రాష్ట్రానికి రావ‌ల‌సిన‌వి అడుగుదామ‌నుకున్నారా? జ‌గ‌న్ మ‌న‌సులో ఏముందో తెలియ‌దు. కానీ అదే ధ్యాస‌లో వుంటే మాత్రం చాలా త‌ప్పిదం చేసిన‌ట్టే అవుతుంది. ఇపుడు చేతికి అందిన అవ‌కాశాన్ని చేజేతులా వ‌దులుకోవ‌డంలో స్వామి భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న చూప‌డం అర్ధ‌ర‌హిత‌మే అవుతుంది. జగన్ తీరు వల్ల రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలను సాధించుకోలేని పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేసుల భయంతోనే జగన్ ఇలా చేశారని విమర్శిస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరు ఇటీవలి కాలంలో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కేంద్రం నుండి తమకు రావలసిన హక్కులను సాధించుకుంటామంటూ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రతిపక్ష నేతలు గుర్తుచేస్తున్నారు. తీరా చూస్తే ఇప్పుడు చడీచప్పుడు లేకుండా ఎన్డీయే అభ్యర్ధి ముర్మూకు మద్దతు తెలపడం జగన్ అసమర్ధతే అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి కనీస స్థాయిలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోవడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఊసేలేదు. అటు ఎన్డీయే గానీ ఇటు విపక్షాలుగానీ కనీసం చంద్రబాబు వంక తొంగిచూడలేదు.  జగన్ మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతివ్వడం ద్వారా రాజకీయంగా జగన్ కు మంచే జ‌రిగింద నుకుంటున్నారు విశ్లేషకులు. జగన్ తన నిర్ణయంతో బీజేపీకి క్లోజ్ అవుతూనే.. ఆ పార్టీతో దోస్తీ చేయాలన్న చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లారన్న చర్చ జరుగుతోంది. ఐతే ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కంటే.. రాజకీయ ప్రయోజనాలకే వైసీపీ ప్రాధాన్యత ఇచ్చిందన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితులున్నా సద్వినియోగం చేసుకోలేదన్న విమ ర్శలు వస్తున్నాయి. మద్దతు విషయంలో ఆచితూచి వ్యవహరించి విభజన సమస్యలు పరిష్కరించుకొని ఉంటే బావుండేదని.. అలా కాకుండా ఊరుకి ముందే మద్దతు తెలిపడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందన్న భావన ప్రజల్లో ఉంది. అలాంటిది కేంద్రాన్ని నిలదీసే అవకాశం వచ్చిందినా వదిలేశారన్న మాట కూడా వినిపిస్తోంది. అంతేకాదు అవసరం తీరిన తర్వాత బీజేపీకి ఎవరైనా ఒకటేనన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

అమీ కోర్టుని న‌మ్మించిందంతే.. మార‌లేదు!

తాగుబోతులంతా జీవితంలో వారి విల‌న్ల‌ను తిట్టుకుంటూ అరుస్తూ గోల చేయ‌డం గ‌మ‌నిస్తుంటాం. కొంద‌రు ఇంట్లో గోల చేస్తారు. చాలామంది ఇంటి బ‌య‌ట‌, రోడ్డు మీద గోల చేస్తూ అంద‌రినీ ఇబ్బందిపెడుతుంటారు. లివ‌ర్‌పూల్‌లో అమీ నెవాల్ అనే 30 ఏళ్ల మ‌హిళ తాగి నానా గొడ‌వా చేస్తోంద‌ని జైల్లో పెట్టారు. ఇది జ‌రిగి మూడు నెల‌ల‌యింది. ఆమెను సెఫ్టాన్ మెజిస్ట్రీట్ కోర్టుల‌కి తీసు కువ‌చ్చారు. ఆమె ఎంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు న‌టించింది. ఏకంగా కోర్టుహాల్లో ఏడ్చేసి న‌న్ను క్ష‌మించండి. ఇక నుంచి ఒక్క చుక్క కూడా తాగ‌ను, అస‌లు తాగేవారిని కూడా తంతాను. ఎక్క‌డికి వెళ్లినా అంద‌రితో బాగా న‌డ‌చుకుంటాను అంటూ ప్రాధేయ ప‌డింది. అంతే ఆమె క‌న్నీళ్ల‌కు జ‌డ్జిగారు క‌రిగిపోయి క్ష‌మించి వదిలేశారు. ఆ ఆనందం త‌ట్టుకోలేక కోర్టు హాల్లోనే గ‌ట్టిగా అరుస్తూ చిన్న‌పిల్ల‌లా గోల చేసింది. ఆమె నిజంగానే చాలా మారిపోతుంది, ఆమె కోర్టుకు మాట ఇచ్చింద‌నే అనుకుంది కోర్టు. లాయ‌ర్లు ఎంతో సంతోషించారు. ఆమె త‌న ప్ర‌వ‌ర్త‌న మార్చుకుని మంచి మ‌హిళ అనిపించుకుంటుంద‌ని. కానీ వారి ఆశ‌లు కొద్ది క్ష‌ణాలే బ‌తికాయి. త‌ర్వాత అమీ మామూలే! అక్క‌డి నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చిన అమీ వెంట‌నే త‌న స్నేహితుల ద‌గ్గ‌రికి వెళ్లి కూటుగా మ‌ళ్లీ తాగింది. అక్క‌డా న‌వ్వుకుంది గ‌ట్టిగా. తాను కోర్టును ఏడిపించి న‌మ్మించాన‌ని! కానీ ఓ కుర్రాడు ఆ సీన్‌ని మొబైల్‌లో ఫైన్ పిక్చ‌ర్ అంటూ ఫోటో తీశాడు. నిజానికి అంత‌కుముందు కూడా ఇలాంటి కేసులోనే జైలుకి వెళ్లింది. అక్క‌డ వున్న‌న్ని రోజులూ పోలీసుల్ని బాగా తిట్టేది. నీ త‌ల ప‌గ‌ల‌గొడ‌తా, గాడిదా న‌న్ను అరెస్టు చేయ‌డ‌మేమిట్రా దొంగ‌ల్ని ప‌ట్టుకోవ‌డం రాని వెధ‌వ‌ల్లారా! అని త‌ర‌చూ నోటికి వ‌చ్చిన‌ట్టు క‌నిపించిన పోలీసుల్ని అంద‌రినీ తిట్టేది. ఆమె చాలా దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని రిహ‌బిలిటేష‌న్ సెంట‌ర్‌కీ పంపించారు.  కానీ ఆమె పోలీసుల ముందు మ‌హాన‌టిలా న‌టించి అంద‌ర్నీ బోర్లాప‌డేసింది. ఆమె మాత్రం బీరు బాటిల్ చేత్తో ప‌ట్టుకుని గ‌ట్టిగా న‌వ్వు కుంది.  ప్ర‌స్తుతం ఆమెను విడిచిపెట్టిన కోర్టు నిజానికి ఆమెను మ‌ళ్లీ పాత అల‌వాట్ల‌తో జీవితంలో పాడ‌యిపోకుండా నిబద్ధ‌త‌తో జీవించేలా ఆమెపై గ‌ట్టి నిఘా పెట్ట‌వ‌ల‌సింది అని కొంద‌రు లాయ‌ర్లు, సామాజిక కార్య‌క‌ర్త‌ల మాట‌!  

ముర్మూ ఎంట్రీతో మారిన సమీకరణలు ఇరకాటంలో విపక్షాలు

రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. అది రాష్ట్రపతి ఎన్నికే అయినా, అయినా మరో వివాదం అయినా,  రాజకీయ పార్టీలు రాజకీయం కాకుండా ఇంకేదో చేస్తాయని అనుకోవడం, అయితే, అజ్ఞానం, కాదంటే అవివేకం అవుతుందే కానీ, విజ్ఞత అనిపించుకోదు.అందుకు బీజేపే మినహాయింపు కాదు. అవును ఒకప్పుడు, బీజేపే, ఇతర పార్టీలకు భిన్నంగా, విలువలకు విలువ ఇచ్చే పార్టీగా మడికట్టుకు కూర్చున్న మాట కొంతవరకు నిజమే కావచ్చును,కానీ, ఇప్పుడు కాదు. బీజేపే అంగీకరించినా అంగీకరించక పోయినా, కాషాయ పార్టీకి ఎప్పుడు ఎక్కడ ఎలా జ్ఞానోదయం అయిందో, ఏమో గానీ, అది కుడా ‘జాతీయ రాజకీయ స్రవంతి’ లో కలిసిపోయింది. ఇప్పుడు బీజేపీ కూడా నలుగురిలో నారాయణ గుంపులో గోవింద తరహాలో, ఫక్తు రాజకీయ పార్టీగా వ్యవహరిస్తోంది.  ఇందులో ఎవరికైనా అనుమానాలు ఉంట ఉండవచ్చును కానీ, బీజేపీలో మోడీ, షాలే కాదు, పార్టీ సామాన్య కార్యకర్తకు కూడా ఎలాంటి అనుమనాలు లేదు. బీజేపీ సామాన్య కార్యకర్త కోరుకునే దివ్యభవ్య రామమందిరం నిర్మాణం జరుగుతోంది, ఆర్టికల్ 370 రద్దయింది, రేపోమాపో ఉమ్మడి పౌర స్మ్రుతి చట్టంమవుతుంది. అన్నిటినీ మించి హిందూ ఓటు బ్యాంక్ పటిష్టమవుతోంది. సో... బీజీపీ కొత్త ఆలోచనలతో, కొత్త పంధాలో పోతోంది. ఇందులో రహస్యం ఏమీ లేదు.  ఇప్పుడు నడుస్తున్న చరిత్రనే తీసుకుంటే, మహా రాష్ట్రలో సంకీర్ణ సర్కార్’ను కూల్చివేసేందుకు తెరవెనక నుంచి కమల దళం సాగిస్తున్న రాజకీయం ఒక ఉదహరణ అయితే, రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాలకు చెక్ పెట్టిన తీరు, మరో నిదర్శనం. రాష్ట్రపతి  అభ్యర్ధి ఎంపికకు సంబందించి ఉత్తర భారతం, దక్షిణ భారతం, సంప్రదాయ విలువలను పాటించడం, పాటించక పోవడం అనే విషయాలను పక్కన పెట్టి చూస్తే, ఎన్డీఎ అభ్యర్ధిగా జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం, బీజేపీ విరచిన ఆధునిక రాజకీయ విజ్ఞత (?)కు నిదర్శనం , అంటున్నారు. ఓ ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష అనుకూల మీడియా నైతిక విలువల గురించి చర్చిస్తుంటే, బీజేపీ, తన పని తాను చేసుకు పోయింది. అందుకే బెజేపీ అభ్యర్ధి ఎంపిక విపక్షాల ఐక్యత చిత్త చేసే ఎత్తుగడగానే చూడవలసి ఉంటుందని, పరిశీలకులు అంటున్నారు.  అందుకే, ఎప్పుడైతే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన నాయకురాలు, జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్మును బీజేపీ ఖరారు చేసిందో, అదే క్షణం నుంచి ప్రతిపక్ష పార్టీలలో ఆందోళన మొదలైంది. ముందు నుంచే ఎన్డీఎ అభ్యర్ధి గెలుపు ఖరారై పోయిన నేపధ్యంలో, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్ధి ఎంపిక విషయంలోనే మలలగుల్లాలు పడ్డాయి, చివరకు ఏదో విధంగా మాజీ బీజీపే నాయకుదు యశ్వంత్ సిన్హా పోటీకి నిలిపినా, బీజేపీ ద్రౌపదిని ముర్మును తెరపైకి తేవడంతో తమ ప్రజాప్రతినిధుల్లో చీలిక వచ్చే ప్రమాదం ఉందని కాంగ్రెస్, తృణమూల్ సహా  ఆన్ని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.  ముర్ము అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే ఒరిస్సా ముఖ్యమంత్రి,  బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ బేషరతు మద్దతు ప్రకటించారు. ఆదివాసీ పార్టీ, యూపీఏ భాగస్వామి జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) సైతం మూర్ముకు అనివార్యంగానే అయినా మద్దతు తెలిపింది. ద్రౌపదిలాగే ఆ పార్టీ అధినేత, సీఎం హేమంత్‌ సోరెన్‌ సంతాలీ గిరిజన తెగకు చెందినవారు. పైగా ఆమె ఆరేళ్లకుపైగా జార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేశారు. జేఎంఎం ఎమ్మెల్యేల్లో దాదాపు అందరూ ఎస్టీలే. పార్టీ ఆమెకు మద్దతివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందుతుందన్నది హేమంత్‌ భయం. అందుకే, లెక్కలు చూస్కుని జేఎంఎం ముర్మూకు మద్దతి తెలిపింది. అలాగే త్వరలో ఎన్నికలు జరిగే, ఛత్తీ్‌సగఢ్‌ జనాభాలో 30మంది ఎస్టీలే.ఉన్నారు. ఈ నేపధ్యంలో  తమ పార్టీకి  చెందిన ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ద్రౌపదికి ఓటేస్తారని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆందోళనగా ఉంది. మధ్యప్రదేశ్‌లోనూ గిరిజనులు 21శాతం వరకు ఉన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌.. ద్రౌపదికి మద్దతివ్వకపోతే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గిరిజన బెల్టులో ఆధిక్యం సాధిస్తుందని ఆందోళన చెందుతోంది. రాజస్థాన్‌లోనూ 13.5శాతం  మంది గిరిజనులు ఉన్నారు. ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లోనూ గిరిజన జనాభా 14 శాతం ఉన్నారు. ఈ అన్ని రాష్ట్రాలలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సో, గిరిజన ఎమ్మెల్యేలు పార్టీ ఆదేశాలకు విరుద్దంగా గిరిజన మహిళా ముర్మూకు ఓటు వేయడమే కాకుండా, బహిరంగంగ మద్దతు ప్రకటించడం కూడా అనివార్యం అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తమ్మీద ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో దరిదాపుగా రాజకీయ పార్టీలన్నీ గిరిజనులపై దృష్టి సారించక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   అందుకే ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా మీడియా బీజేపీకి తమలోలేని సుగుణాలు ఉన్నాయని, అదొక విభిన్న పార్టీ అనే భ్రమల్లోంచి బయటపడాలని, పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్షాలు, ప్రతిపక్షాల అనుకూల మీడియా, పాత బీజేపే నైతిక ప్రమాణాల  ఆధారంగా, ఇప్పటి పరిణామాలను విశ్లేషించడం వలన  ఎకడమిక్’గా ఓకే కానీ, రాజకీయంగా మాత్రం కంఠశోష తప్ప. ప్రయోజనం ఉండదని అంటున్నారు.  ఇలా ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష అనుకూల మీడియా బీజీపే ఎప్పుడో వదిలేసిన పాత విలువల గురించి  చర్చలు సాగిస్తుంటే, కొత్త బీజేపీ తన దారిన తాను ప్రతిపక్షాలను బుల్డొజ్ చేసుకుంటూ పోతోందని పరిశీలకు భావిస్తున్నారు. అందుకే ఇకనైనా, ప్రతిపక్ష పార్టీలు, ప్రతిక్ష అనుకూల మీడియా  బీజేపీ, ఓ విభిన్న పార్టీ’ బీజేపీ, (పార్టీ విత్ ఎ డిఫరెన్స్,)అనే భ్రమలను తొలిగించుకోవడం మంచిదని అంటున్నారు.

లక్ష మెజారిటీ రాలే.. ఆత్మకూరు ఉప పోరులో మేకపాటి విజయం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ యాదవ్‌ పై 82,888 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు మొత్తం 20 రౌండ్లుగా కొనసాగింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో గౌతమ్‌ రెడ్డి సోదరుడు విక్రమ్‌ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకం అంటూ భారతీయ జనతా పార్టీ భరత్‌ కుమార్‌ యాదవ్‌ ను పోటీలో నిలిపింది. బీఎస్పీ తరఫున ఓబులేసు, ఇండిపెండెంట్లతో కలిపి మొత్తం 14 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఓట్ల లెక్కింపు తొలి రౌండ్‌ నుంచీ మేకపాటి విక్రమ్‌ రెడ్డి తన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఒక్కో రౌండ్‌ పూర్తయ్యే సరికి విక్రమ్‌ రెడ్డి ఆధిక్యం మరింతగా పెరుగుతూనే ఉంది. పోస్టల్‌ బ్యాలెట్లతో సహా మొత్తం 20 రౌండ్లతో కలిపి మేకపాటి విక్రమ్‌ రెడ్డి భారీ విజయాన్ని సాధించారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రంరెడ్డికి మొత్తం లక్షా 2 వేల 74 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ యాదవ్‌ కు 19 వేల 332 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు 4 వేల 897 ఓట్లు తెచ్చుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో నోటా ఓట్లు కూడా భారీగా నమోదవడం విశేషం. మొత్తం 4 వేల 179 ఓట్లు నోటాకు పడ్డాయి. ఇతరులకు 6 వేల 599 ఓట్లు పోలయ్యాయి.  82 వేల 888 ఓట్ల మెజార్టీతో విక్రమ్‌ రెడ్డి విజయం సాధించడంతో వైసీపీ నేతల సంబరాలు చేసుకుంటున్నారు. అయితే.. ఆత్మకూరు ఉప ఎన్నికలో లక్ష ఓట్ల మెజార్టీ అంటూ ప్రచారం చేసిన వైసీపీ చివరికి 90 వేలకు దిగువ మెజారిటీతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.